22, అక్టోబర్ 2020, గురువారం

వృక్షం


 

మనస్సు, బుద్ధి

 *🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*


🌷 message of the day 🌷


    *_🌴ఎవరి మనస్సు, బుద్ధి, అంత:కరణము వాసనలతో కూడి మలినమై ఉంటాయో, అతడు చేసే కర్మలు కూడా మలినంగానే ఉంటాయి. 'నేను వేరు నీవు వేరు ' అనే  భేదభావము ఉన్నంత వరకు ప్రేమ, కరుణ, దయ, జాలి, వీటికి చోటు ఉండదు. ఇవి లేనపుడు దుర్మార్గము మనసులో తిష్ట వేస్తుంది. పైకి తియ్యగా మాట్లాడుతున్నా లోపల విషం చిమ్ముతుంటారు. వారి కర్మలు కూడా విషపూరితంగానే ఉంటాయి.  తనలో ఉన్న ఆత్మ అందరిలోనూ ఉంది, అందరూ ఆత్మస్వరూపులే, అందరూ సమానమే, భేదభావము అనేది మన మనసులోనే ఉంది అన్న భావన కలిగినంత వరకు మానవుడికి జ్ఞానం కలుగదు. దానికి తోడు ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సత్యనిష్ట, అవసరము. ఇవి లేకపోవడము చేతనే  కర్మలు మానవుని బంధిస్తున్నాయి. మరుజన్మకు కారణం అవుతున్నాయి. పునర్జన్మ రహితులమగుటకు అంత:కరణంను పరిశుద్ధం చేసుకోవాలి. సత్కర్మాచరణకు పూనుకోవాలి. ఇవి దైవీ సంపద గలవారి లక్షణాలు. పరిపూర్ణమైన మనశ్శాంతి  దైవీ గుణాలను కలిగియున్నవారికే సాధ్యం..🌴_*

in the year 1998 .

 It was in the year 1998 .

BJP was single largest party and NDA was the strongest alliance   in Loksabha. Vajpayee was elected as  the PM. Confidence motion was put before the house. Congress and CPM had joined hands to vote against NDA government.

Leaders of both parties were sitting together and attacking BJP NDA . Whenever Congress leader spoke, the  CPM leaders were thumping the desks and vice-versa. Whenever a leader from NDA was attacking Congress, leaders from CPM were counter  attacking fiercely. All 'secular' forces were united to dethrone the Vajpayee government.

Veteran leader George Fernandez was defending the government. He said " Speaker sir, I want to inform you what a strong organisation has to say something on Congress party". He took out a book while speaking so and started reading.

"Congress party is the fountainhead of corruption...(big shouting from congress benches)...The British left and the Congress party replaced them. Over the past 50 years, Congress has established  new records in corruption. (again big shouting from congress )

Congress ministers have often been found embroiled in several scams, including Mundra scam, Churhat Lottery scam, Bofors scam, Sukhram scam, Harshad Mehta scam, JMM Bribery scam and Hawala, that took place during its regime. Congress has corrupted and misused every institution of the Indian democracy."

At this point, both Congress and CPM got charged up and said  "Speaker sir! Please ask the honourable member to name the source,we can't allow him to read from any unnamed document. Please restrain him."

George Fernandez said "Please don't get impatient. I'll definitely name the source. But first let me complete what it says. It says, "The Congress party's record on Secularism too has been chequered. At various times in history, Congressi goondas took active part in riots and killed people. 3000 Sikhs were butchered by them on streets of Delhi and prime minister Rajiv Gandhi watched it silently."

Big shouting and noise again from benches of Congress and CPM.

George Fernandez, "Just give me two minutes...and then I'll reveal the source"

He continued to read from book "Speaker sir, it says, "No country in history has ever progressed with bad governance and excessive corruption as partners. None! The Congress suffers from this twin ailment since decades. Its survival is detrimental to the progress of India. Therefore, in the interest of this nation, it's important that Congress party is wiped out from this land for ever."

Big shouting and noise again from benches of Congress and CPM.

 "Speaker sir! It cannot go on like this. We will not allow him to speak any further if he doesn't give the source he is quoting from."

"Ok, Ok" said George , "There is more to read. But since our friends from Congress and CPM are so desperate to know the source, let me tell you what I am reading from...

...I'm reading from the Manifesto of CPI(M) issued just before this Lok Sabha elections."

Pin drop silence in the house. Leaders from Congress and CPM were staring at eachother..

George : "What happened, why silent ? You were  shouting  , we want to know the source, we want to know the source.  Once you heard the name of the source, your voices were mute. Shame  on your selves ! Definitely you should be ashamed ...

My friends from the Left! Either you don't read your own manifesto or you don't mean a word of it. In either case, you should be ashamed of yourselves. In the name of secularism, you have joined hands with Congress that has broken all records in corruption. I urge you to introspect to determine your future course of action. And if you do not mend your ways, your party will become history, sooner rather than later."

Hats off to  George Fernandez..( by Raju Nanda)

దేముడిని ఏ భాషలో పూజించాలి.

దేముడిని ఏ భాషలో పూజించాలి. 

మనలో చాలామందికి మనం (హిందువులము) దేవతార్చన కేవలం సంస్కృత మంత్రాలతోటే ఎందుకు పూజించాలి? నేను తెలుగులో పూజిస్తే దేముడు అంగీకరించడ  అనే సందేహం కలిగి వున్నారు. నిజానికి ఇది ఆలోచించదగిన విషయం. ఎందుకంటె దేముడు అందరికి దేముడే మరి అటువంటప్పుడు దేముడిని సంస్కృతంలోనే ఎందుకు పూజించాలి.  

ముందుగా మనం పూజ అంటే ఏమిటో తెలుసుకుందాము. మనం దేవాలయాలలో చేసే పూజా విధానాన్ని షోడశోపచార పూజ అని అంటారు. షోడశ ఉపచారాలు అంటే ఏమిటి. 

మన ఇంటికి ఎవరైనా అతిధి వస్తే మనం ఎలాగైతే ఆ అతిథికి మర్యాదలు చేస్తామో ఆలా మనం దేముడిని విగ్రహ రూపంలో చూసుకొని ఒక అతిధిగా భావించి చేసే సేవలే ఈ షోడశ ఉపచారాలు.. ఉపచారము అంటే సేవ అని అర్ధం. మనం మన ఇంటికి వచ్చిన అతిధిని ఆప్యాయతతో ఆహ్వానించి వారికి కాళ్ళు కడుగుకోవటానికి నీళ్లు ఇచ్చి, తరువాత ముఖం కడుక్కోవటానికి నీళ్లు ఇచ్చి, తరువాత త్రాగటానికి నీళ్లు ఇచ్చి, ఆ పిమ్మట స్నానం చేయటానికి ఏర్పాటు చేసి, వారిని వింజామరతో ( Fan or A.C) విసిరి,వారికి నూతన వస్త్రం సమర్పించి ఇలా ( పూర్వకాలంలో చేసేవారు అనుకోండి) అతిధిని మనం ఎలాగ మర్యాదలు చేస్తామో అలానే విగ్రహంలో వున్న భగవంతుడిని తలుచుకొని ఉపచారాలు చేస్తామన్నమాట. 

షోడశ ఉపచారాలు అంటే 16 రకాల ఉపచారాలు అని అర్ధం. ఉదా : స్వాగతించటం, కూర్చోటానికి ఆసనము, పాదాలకు పాద్యం, ముఖానికి సుద్ద ఆచమనం అంటే నీళ్లు. ఇలా ఉంటాయి అన్నమాట. 

విగ్రహానికి ఉపచారాలు చేస్తే మనకు ఏమిటి లాభం. ఈ ప్రశ్న ప్రతి సగటు వ్యక్తికీ కలుగుతుంది. 

విగ్రహాన్ని మనం రకరకాల రంగుల పూలతో అలంకరిస్తాము, తరువాత ఆ విగ్రహాన్ని భక్తితో షోడశ ఉపచారాలు చేసి పూజిస్తాము. 

పూజలో మనము ఏమ చేస్తాము ఇది చాలా ముఖ్యమైనది. 

ముందుగా మనం విగ్రహం ముందర కూర్చుంటాము. మన ద్రుష్టి పూర్తిగా ఆ దేముడి విగ్రహం మీదే ఉంచుతాము. చెవులు బ్రాహ్మడు చదివే మంత్రాలను వినతాము. చేతులతో పూలు, అక్షింతలు, నీళ్లు సమర్పిస్తాము. మనస్సు ఆ పరమాత్మా మీద వుందుతాము. అప్పుడు నీ పంచేంద్రియాలు పూర్తిగా నిమగ్నమై వున్నాయి. అంటే నీకు హృదయంలో పూర్తిగా భగవంతుడే నిండి వున్నాడు. 

మనస్సు కోతిలాంటిది. దానికి కొంచం సమయం ఇస్తే చాలు అది పరి పరి విధాలుగా చెలిస్తూ ఉంటుంది. ఇప్పుడు నీ మనస్సు పూర్తిగా ఒక స్థిరమైన విషయం మీద మాత్రమే కేంద్రేకరించి వున్నది. అదే దేముడి పూజ. కాబట్టి నీ మనస్సు స్థిరత్వాన్ని పొందుతుంది. అంతే కాకుండా నిశ్చలత్వం కలిగి ఉంటుంది. దానినే యోగం అని అంటారు. యోగం అంటే కలయిక అనగా జీవుడు ఇప్పుడు పరమాత్మతో కలిసి వున్నాడు అని అర్ధం. ఆ స్థితిలో వున్నా మనిషి కేంద్రేయ నాడీ వ్యవస్ఠ (central nervous system will be activated) ఉత్తేజితము అవుతుంది అన్నది శాస్త్ర విహితం. యెప్పుడైతే కేంద్రీయ నాడీ వ్యవస్థ ఉత్తేజితము అవుతుందో అప్పుడు మీరు ఇచ్చే సూచనలు (suggestions ) కార్య రూపం దరిస్తాయి అంటే మీరు ఏ కోరికలు సిద్దించాలని ఆ పూజ చేస్తున్నారో ఆ కోరికలు తీరుతాయి. 

భగవంతుడు అనేది ఒక భావన అటువంటప్పుడు దేముడికి ఈ భాషా వచ్చు, ఆ భాషా రాదు అనే ప్రశ్నయే ఉండదు. అయితే తెలుగులో మనం పూజించకూడదా అంటే చక్కగా పూజించ వచ్చు. కానీ మీరు చేసే క్రియలు మాత్రం ఏదా తధంగా చేయాలి. అప్పుడు తాప్పకుండా పూజ ఫలిస్తుంది. 

కానీ మన మహర్షులు వారి జ్ఞాన నేత్రంతో ఈ చరా చర సృష్టికి కారణం ఎవరు ఆ కారకుడిని (కర్తను) తెలుసుకునే ప్రయత్నం చేసి మనకు ఒక విధానం ఏర్పాటు చేశారు. అది మన తెలుగు భాషా పుట్టాక ముందే జారిగింది. కాబట్టి మనం ఆ క్రమంలో వారు నిర్ధారించిన విధానాన్నే పాటించాలి. అప్పుడే మనకు వారు నిర్ధారించిన ఫలితాలు మనం పొందగలము. 

నేను చిన్నప్పటినుండి సంస్కృతం నేర్చుకోలేదు. మరి యెట్లా అని సందేహం కలగ వచ్చు. ఇప్పటికి కూడా మించి పోయెంది ఏమి లేదు త్రికరణ శుద్ధిగా మన దేవతల ఆరాధనను తెలుసుకొని ఆచరించ వచ్చు తద్వారా సత్పలితాలను పొందవచ్చు. 

మన పురాణ ఇతిహాసాల్లో అనాగరికులు సంసార హీనులు అడవులలో చేరించే మనుషులను కూడా పరమ శివుడి అనుగ్రహాన్ని పొందినట్లు తెలుస్తున్నది అంతే కాదు  మనుషులే కాక ఇతర జంతువులూ కూడా అంటే ఏనుగు, పాము, సాలె పురుగు కూడా ఈశ్వరుని అనుగ్రహం పొందినట్లు తెలుస్తుంది. దీనిని బట్టి మనకు తెలిసేది ఏమంటే దేముడికి కావలసింది భాష కాదు భక్తి అని, భక్తి కలిగిన పూజకు ఏ విధానము అవసరము లేదు కేవలము త్రికరణ శుద్ధి ఉంటే చాలు. కానీ మనం మనుష్యులం అందునా విద్యా వంతులము కాబట్టి మనం మన పూర్వ మేధావులైన మహర్షులు సూచించిన పద్దతి పాటించటమే బహుదా శ్రేయస్కరము. 

మనం ఎప్పటికి తల్లి ఋణం, ఋషి ఋణం తీర్చుకోలేము. 

ఓం తత్సత్. 

పుణ్యా పుణ్య ఫలం ప్రదాయిని


 

P






 

పుష్ప‌క విమానంలో

 పుష్ప‌క విమానంలో గోవర్ధన కృష్ణుడు రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌ 


           శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన బుధ‌‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు  శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో రుక్మిణి స‌త్య‌భామ స‌మేత గోవర్ధనగిరి దారుడైన శ్రీకృష్ణుని అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్పస్వామివారు  ‌పుష్ప‌క విమానంలో అభ‌య‌మిచ్చారు.


           పుష్ప‌క విమానం మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం సంద‌ర్భంగా నిర్వ‌హించే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో నిర్వ‌హిస్తారు. వాహనసేవల్లో అలసిపోయే స్వామి, అమ్మ‌వార్లు సేద తీరడానికి పుష్ప‌క విమానంలో వేంచేపు చేస్తారు. 


           ఈ ప్రత్యేకమైన విమానం కొబ్బరి చెట్ల ఆకులతో తయారు చేశారు. ఇది 15 అడుగుల ఎత్తు, 14 అడుగుల వెడల్పు 750 కేజిల బ‌రువు ఉంటుంది. ఇందులో 150 కేజిల మల్లి,  క‌న‌కాంబ‌రం, మొల్ల‌లు, వృక్షి, చామంతి, లిల్లి, తామరపూలు, రోజాలు తదితర 9 రకాల సాంప్రదాయ పుష్పలు ఉప‌యోగించారు. 


           శ్రీ‌వారి పుష్ప‌క విమానాన్ని మూడు ద‌శ‌ల‌లో ఏర్పాటు చేశారు. విమానంకు ఇరువైపులా శ్రీ ఆంజ‌నేయ‌స్వామి, శ్రీ గ‌రుడ‌ళ్వార్‌ న‌మ‌స్క‌రిస్తున్నట్లుగా, మొద‌టి ద‌శ‌లో అష్టలక్ష్ములు, రెండ‌వ ద‌శ‌లో ఏనుగులు, చిల‌క‌లు, మూడ‌వ ద‌శ‌లో నాగ ప‌డ‌గ‌ల ప్ర‌తిమ‌ల‌తో రూపొందించారు. 


          తమిళనాడులోని సేలంకు చెందిన 20 మంది, టిటిడి గార్డెన్ విభాగంకు చెందిన 10 మంది వారం రోజుల ‌పాటు శ్ర‌మించి ఈ అద్భుతమైన విమానంను సిద్ధం చేశార‌ని టిటిడి గార్డెన్ విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్‌ శ్రీ శ్రీ‌నివాసులు తెలిపారు. తమిళనాడు చెన్నైకు చెందిన దాత శ్రీ రాంప్ర‌సాద్ బ‌ట్టు‌ శ్రీవారి పుష్ప‌క విమానాన్ని ఆకర్షణీయంగా రూపొందించేందుకు సహాకారాన్ని అందించారు.

M





 

ఆమెలేని అతడు*

 👴👵👴👵👴👵👴👵👴



         *ఆమెలేని అతడు*


         *ఇది వాస్తవం.. భార్య విహీనులైన చాలా మంది భర్త లు చరమాన్కంలో పలు బాధలు పడినవారు చాలా మంది ఉన్నారు..వారికి రోజులు గడవడం కష్టం..........*


*ఆమె లేని అతడు.. వట్టి మోడు!*                                                                                                                                                                                                                  *భార్య మీద జోకులేస్తారు. కోపమొస్తే అరుస్తారు. అలుగుతారు. తిడతారు. కొందరు ప్రబుద్ధులైతే పురుషాహంకారంతో కొడతారు కూడా! అన్నింటినీ భరించే భార్యను ‘టేకిట్‌ ఫర్‌ గ్రాంటెడ్‌’గా తీసుకుంటారు!! ఆమె శాశ్వతంగా దూరమైతే మాత్రం.. తట్టుకొని బతికేంత మానసిక బలం పురుషులకు ఉండదు! ‘ఆమె’ లేని మగాడి జీవితం.. మోడువారిన చెట్టుతో సమానం!! అడగకుండానే అన్నీ అమర్చిపెట్టినన్నాళ్లూ ఆమె విలువ తెలుసుకోలేని మగానుభావులు.. ఆమె వెళ్లిపోయిననాడు, మనసులో మాటను చెప్పుకొనే తోడు లేక.. అందరితో కలవలేక.. మనసులోనే కుమిలిపోయి శారీరకంగా క్షీణించిపో..తా..రు!!*

                                                                                                                                                                                      *'‘నేను ముందు పోతే పసుపు, కుంకాలు మిగిలిపోతాయేమో గానీ ఆ జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు. పైనున్న భగవంతుడికి తెలుసు. ఒరే.. పచ్చటి చెట్టుకింద కూర్చుని చెబుతున్నా. ‘దేవుడా ఈ మనిషిని తీసుకెళ్లు. ఆ తర్వాత నా సంగతి చూడు’ అని రోజూ దణ్నం పెట్టుకునేదాన్ని. ‘మొగుడి చావు కోరుకునే వెర్రిముండలుంటారా?’ అనుకోకు. వుంటారు. నాకు మీ మావయ్యంటే చచ్చేంత ఇష్టంరా. ఆయన మాట చెల్లకపోయినా కోరిక తీరకపోయినా నా ప్రాణం కొట్టుకుపోయేది. చీకటంటే భయం. ఉరిమితే భయం. మెరుపంటే భయం. నే వెన్నంటి ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు? అర్ధరాత్రిపూట ఆకలేస్తోందని లేచి కూర్చుంటే ఆవిరికుడుములూ కందట్లూ పొంగరాలూ ఎవరు చేసి పెడతారు?’’...ప్రముఖ రచయిత శ్రీరమణ రాసిన ‘మిథునం’లో భర్త మరణం గురించి బుచ్చిలక్ష్మి పాత్ర ఆవేదన ఇది!*

                                                  *నటుడు రంగనాథ్‌ గుర్తున్నారా? భార్యతో అపూర్వమైన అనుబంధం ఆయనది. మేడ మీద నుంచి పడటంతో నడుం విరిగి ఆవిడ మంచాన పడితే.. పద్నాలుగేళ్లపాటు ఆమెకు సేవలు చేశారాయన! తాను ఎంతగానో ప్రేమించిన భార్య శాశ్వతంగా దూరమవడాన్ని తట్టుకోలేక కుంగుబాటుకు గురై 2015లో ఉరి వేసుకుని చనిపోయారు.*

                                                                                                                                                 *ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు సైతం.. భార్య భాగ్యవతి మరణాన్ని తట్టుకోలేక ఆమె వెళ్లిపోయిన ఏడాదిన్నరలోపే తుదిశ్వాస విడిచారు.*

                                                                                                                                                                                                                       *దాంపత్యం అంటే.:-*


*రెండు మనసుల కలయిక. మరణం ఆ బంధాన్ని వేరు చేస్తే.. ఓ భాగస్వామి దూరమైతే.. మిగిలి ఉన్నవారి మనసు కకావికలమవుతుంది. స్ర్తీ, పురుషులెవరికైనా ఆ బాధ ఒకటే. కానీ శేషజీవితాన్ని గడపడంలో మాత్రం తేడాలు కనపడతాయి. భర్త దూరమైనా భార్య తట్టుకుని జీవించగలదు. కానీ.. పురుషులు కుటుంబసభ్యులతో కలిసిపోలేరు. మానసికంగా ఒంటరులైపోతారు. ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి.*                                                                                                                                                                                  


*కావాల్సింది సహకారం.. వ్యాపకం:-*

*కొన్ని కుటుంబాలను పరిశీలిస్తే భార్య గతించి ఏళ్లు గడిచినా ఉత్సాహంగా ఉన్నవారు ఉన్నారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తే.. ‘నా వయసు 90 ఏళ్లు. నా భార్య ఎన్నో ఏళ్ల క్రితమే మరణించింది. కొడుకు, కూతురు రమ్మన్నారు. కానీ, వెళ్లాలని అనిపించలేదు. అందుకే మా వూరిలో ఉన్న ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నా. ఆధ్యాత్మిక సేవలోనే గడుపుతున్నాను. ఇప్పుడు ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉండటంతో అమ్మాయి ఇంటికి వచ్చేశా. ఆ భగవంతుడి పిలుపుకోసం ఎదురుచూస్తున్నాను’ అంటూ ఓ పెద్దాయన చెప్పుకొచ్చారు. ‘నా వయసు 92 ఏళ్లు. భార్య పాతికేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుంచి నా కోడలు నన్ను కన్న తండ్రిలా సాకుతోంది. సాయంత్రంపూట గుడికి వెళ్లి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇస్తాను. ఖాళీగా ఉండకుండా పుస్తకాలు చదవుతుంటాను, రాస్తుంటాను’ అని చెప్పుకొచ్చారు రఘురామ్‌ అనే మరో వృద్ధుడు.*

                            *అధ్యయనంలోనూ అదే తేలింది:-* 

*దాదాపు ఆరేళ్లక్రితం.. అంటే 2012లో రోచెస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేశారు. అందులో ఒక ఆసక్తికరమైన అంశం వెల్లడైంది. అదేంటంటే.. భర్తను కోల్పోయిన మహిళలతో పోలిస్తే, భార్యను కోల్పోయిన పురుషులు త్వరగా చనిపోయే అవకాశం 30 శాతం ఎక్కువని! భర్త చనిపోతే బాధ ఉంటుందిగానీ.. దాన్ని తట్టుకోగలిగే మానసిక స్థైర్యం మహిళలకు ఎక్కువగా ఉంటుందని ఆ అధ్యయనంలో తేలింది. సాధారణంగా భార్యాభర్తల్లో పురుషులు వయసులో పెద్దవారై ఉంటారు కాబట్టి, వారు తమ కన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి మహిళలు సిద్ధమై ఉంటారట. తన కన్నా చిన్నదైన భార్య చనిపోతుందనే సన్నద్ధత పురుషుల్లో ఉండదట. భార్య చనిపోతే భర్త కుంగుబాటుకు గురవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమని వారు విశ్లేషించారు.*

                                                                                                  *ఇలా చేస్తే కొంత బెటర్‌:-*


1.చిన్నపిల్లలతో ఎక్కువ సమయం గడపటానికి ప్రయత్నించటం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చు. వారి ఆటపాటలు.. చిలిపి చేష్టలు వయసు మళ్లిన వారికి ఆనందాన్ని కలిగించటమే కాదు.. తమ చిన్న తనం నాటి సంఘటనలను జ్ఞప్తికి తెచ్చి మరింత హుషారుగా మార్చేస్తాయి. 

2. వయసు పెరుగుతున్న కొద్దీ తమకంటూ ఒక ప్రపంచం ఉండాలి. ఎందుకంటే ఓ వయసు వచ్చిన తరువాత బయట సంబంధాలు తగ్గిపోతాయి. కుటుంబంలో కూడా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. ఆఖరికి మనవళ్లు మనవరాళ్లు కూడా వారి ప్రపంచంలో వారుంటున్నారు. అందుకే తమ దైన ప్రపంచం సృష్టించుకోవాలి. అది తమ అభిరుచులకు తగినట్లుగా ఉండాలి. ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టమైన హాబీ ఉండి ఉంటుంది. ఉద్యోగ బాధ్యతలు, ఇతర కారణాల వల్ల ఆ హాబీని మూలన పడేసి ఉండొచ్చు. దాన్ని పైకి తీస్తే కాలక్షేపం అవుతుంది. 

3. లాఫింగ్‌ క్లబ్‌ లాంటి వాటిలో చేరటం లేదా సమాజసేవా కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల ఫలితం ఉంటుంది. 

4. స్నేహితులు, బంధువులతో తరచూ మాట్లాడటానికి ప్రయత్నించాలి. కొత్త స్నేహాలకు చేయిచాచాలి. ఇలాంటి వాటివల్ల కాస్తంత ఉపశమనం కలిగి బాధ నుంచి తేరుకునే శక్తి వస్తుంది.        

                                                                                                                                                                  *ఆధారపడడమే కారణం:-* 

*సాధారణంగా భార్య అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది. భార్య తన మీద ఆధారపడి ఉందని.. తాను తప్ప ఆమెకు దిక్కులేదని చాలామంది పురుషులు అనుకుంటారు. కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది. చాలామంది పురుషులు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతారు. భార్యను కోల్పోయినప్పుడు ఆ లోటు వారికి బాగా తెలుస్తుంది. వారి జీవితం గందరగోళంలో పడిపోతుంది. భార్య దగ్గర ఉన్న స్వతంత్రం కొడుకు, కోడళ్ల వద్ద ఉండదు. దానికి తోడు వయోభారం. ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అన్నీ కలిసి కుంగుబాటుకు దారితీస్తాయి. నాణేనికి మరోవైపు చూస్తే.. భాగస్వామి దూరమైనప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. భర్తకు దూరమైన తరువాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవడం, కొన్ని బరువు బాధ్యతలు తగ్గించుకోవడం కారణంగా ఆరోగ్యంగా పూర్తి జీవితాన్ని గడపగలుగుతారని విశాఖ జీజీహెచ్‌ మానసిక వైద్యులు మురళీ కృష్ణ విశ్లేషించారు.*

                                                                *మహిళలే స్వతంత్రులు:-*


*స్త్రీ చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బతుకుతుంది. తండ్రికి బాగోలేకపోయినా, భర్తకు జ్వరం వచ్చినా, పిల్లలకు జలుబు చేసినా తనే సేవ చేస్తుంది. అదే తనకు ఏదైనా అయితే ఎవరి కోసం ఎదురుచూడదు. తనకు తానే మందులు వేసుకుంటుంది. ఓపిక లేకపోయినా లేచి పనులు చేసుకోవడానికి యత్నిస్తుంది. ఆ మనోబలమే... భర్త లేకపోయినా ధైర్యంగా బతకడానికి ఉపయోగపడుతుంది.- ప్రొఫెసర్‌ రాజు, ఏయూ, సైకాలజీ*

                                                                                                                                                                                                                              *భావోద్వేగ బలం ఆమెదే:-*


*పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే, స్ర్తీ భావోద్వేగాలపరంగా బలంగా ఉంటుంది. సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే, భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే.. ఇంట్లో ఆమే రిమోట్‌ కంట్రోల్‌. ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు. ఎంతటి భావోద్వేగాన్నయినా భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా బతుకుతుంది. అందుకే భర్త తనువు చాలించినా పిల్లల కోసం తను కష్టపడుతుంది.*


*ఉన్నంతవరకూ ఒకరికి ఒకరుగా అన్యోన్యంగా బ్రతుకుదాం. దేవుడు చేసిన ఏర్పాటును గౌరవిద్దాం. అందరూ చివరి మజిలీ జంటగా కలిసే చేయాలని కోరుకుంటూ.....*


👴👵👴👵👴👵👴👵👴

మలబద్ధకం గురించి వివరణ

 మలబద్ధకం గురించి వివరణ  - నివారణా యోగాలు . 


   మలబద్దకం అనేది సమస్తరోగాలకు మొదటి మెట్టు . మలం గాని ఆమం ( సరిగ్గా జీర్ణం కాని పదార్ధం ) వాతం వలన శుష్కించి ఉండలుగా గట్టి మలమార్గము నుండి సునాయాసంగా బైటకు వెడలకున్న యెడల ఆ వ్యాధిని మలబద్దకం అంటారు. ఆయుర్వేదం నందు ఈ వ్యాదికి            "ఆనాహము" అని పిలుస్తారు . 


           మలబద్దకం సమస్య వలన నడుము , వీపు నందు పట్టుకొని ఉండటం , కడుపునొప్పి , ఆయాసము , వాంతి వంటి లక్షణాలు వస్తాయి. దప్పిక , జలుబు , శిరస్సు నందు మంట , రొమ్ము పట్టినట్లు ఉండటం , తేన్పులు పైకి రాకుండా ఉండటం వంటి లక్షణాలు కొందరిలో కనపడతాయి. మలబద్దకం సమస్య పెరుగుతున్న కొలది మనిషి వాతరోగాలు వస్తాయి. 


         ఇప్పుడు మీకు మలబద్దకం నివారణాయోగాలు వివరిస్తాను . 


  నివారణాయోగాలు  - 


 * రాచ ఉశిరికాయ తినుచున్న సుఖవిరేచనం అగును. 


 *  కాకరకాయ కూరను తరచుగా తీసుకొనుచున్న సుఖవిరేచనం అగును. 


 *  ఎండిన ఎర్రరేగుపళ్ళు తినుచుండవలెను . 


 *  చింతపండు చారు అద్బుతముగా పనిచేయును . అతిగా తీసుకున్న విరేచనాలు కలుగచేయును . 


 *  బాగా పండిన అరటిపండు తినుచుండవలెను . 


 *  నాగజెముడు , బొంతజెముడు , ఆకుజెముడు రసము 10 చుక్కలు తీసుకొనుచున్న సుఖవిరేచనం అగును. శరీర బలమును అనుసరించి 5 నుంచి 10 చుక్కలు తీసికొనవలెను . 


 *  విరేచనం ఇబ్బందిగా ఉన్నప్పుడు 4 చెంచాల ఆముదం కొంచం వేడిచేసి లోపలికి తీసికొనవలెను . ఆముదం తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నచో ఒక కప్పు గొరువెచ్చని పాలలో ఆముదం కలిపి తీసికొనవలెను . 


 *  రోజూ నిద్రపోయే ముందు రాత్రి సమయములో రెండు గ్లాసుల నీరు తాగుచున్న ఉదయం సుఖవిరేచనం అగును. ఇలా తాగడం మొదలుపెట్టిన మొదటి రోజు నుంచే అవ్వొచ్చు లేదా రోజూ తాగుచున్న 4 రోజుల తరవాతి నుంచి వరస క్రమంలోకి వచ్చి సాఫీగా జరుగుతుంది. 


 *  సునాముఖి చూర్ణం చెంచాడు తీసుకొనుచున్న సుఖవిరేచనం అగును. 


       మలబద్దకం సమస్య అనేది మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది.  ప్రస్తుత కాలంలో జంక్ పుడ్ తీసుకోవడం ఎక్కువ అయ్యింది . ఇది అత్యంత ప్రమాదకరమైన ఆహారం . వీలైనంత వరకు అటువంటి వాటి దూరంగా ఉండవలెను . ఋతువు మారినప్పుడల్లా కడుపును శుభ్రం చేసుకొనుటకు విరేచనం కలిగించే ఔషధాలు తీసుకొనుట అత్యంత ప్రధానం అయింది. 


           చాలా మంది ఉదయాన్నే విరేచనముకు వెళ్ళి తమకు సుఖవిరేచనం అవుతుంది . అనే అపోహలో ఉంటారు. రోజుకి రెండుసార్లు విరేచనమునకు వెళ్ళినప్పుడే ఆరోగ్యకరమైన మనిషిగా భావించవలెను .  మనం తీసుకునే ఆహారం కూడా మలబద్దకం సమస్య రాకుండా ప్రధానపాత్ర పోషిస్తుంది.  ముఖ్యముగా నీరుని తీసుకోవడం , లేత ముల్లంగి , మునగ ఆకులు , మునగకాయ  , కాకరకాయ , పొన్నగంటి కూర , ద్రాక్ష , వెల్లుల్లి , ఆవుపాలు , ఆముదము , ఉలవకట్టు , పాతబియ్యం , నెయ్యి , వెన్న తరచుగా ఆహారం నందు తీసుకోవాలి. పీచుపదార్ధాలు అధికముగా తీసికొనవలెను . పళ్లరసాలు కంటే పళ్లు తినటం మంచిది .  


        శరీరము నుండి వ్యర్థపదార్థాలు ఎప్పటికప్పుడు బయటకి వెళ్లినప్పుడే శరీరం నందు టాక్సిన్స్ పోగుపడవు . శరీరం ఆరోగ్యకరంగా ఉండును.  


   గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100  రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

Al