22, అక్టోబర్ 2020, గురువారం

ధార్మికగీత - 47*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                     *ధార్మికగీత - 47*

                              *****

    *శ్లో:- న చోర హార్యం, న చ రాజ హార్యం ౹*

           *న భ్రాతృ భాజ్యం, న చ భార కారీ ౹*

           *వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం ౹*

            *విద్యా ధనం సర్వ ధన ప్రధానం ౹౹*

                             *****

*భా:- విద్య అందరికి ఆభరణము. విద్య కురూపుని కూడ సురూపునిగా చేయగల సమర్ధత కలది. జీవితాంతం మనకు చెక్కుచెదరని ధనం విద్యాధనం ఒక్కటే. అట్టి విద్యాధనం దొంగలు దోచుకొనేది కాదు. ప్రభుత్వం పన్ను రూపేణ కట్టించుకొనేది కాదు. స్థిరచరా స్తుల వలె అన్నదమ్ములచే పంచుకొనబడేది కాదు. సుదూరప్రాంతాలకు ప్రయాణం చేసేటప్పుడు  లగేజీ వలె బరువుగా తోచేది కాదు.  ఖర్చు చేసే కొద్దీ అంతకు అంతగా పెరిగే  అమూల్యధనం విద్యాధనం. ఎంతమందికి  పంచితే  అంతగా వృద్దిఅవుతుంది. పరిణితి చెందుతుంది. "ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు" అని నానుడి. మిగతా ధనంలా యే మాత్రం  తరిగేది కాదు. పిల్లలకు మనం ఆస్తిపాస్తులను కాదు ఇవ్వవలసింది. చదువు చెప్పించాలి. అదే వారికి సదా నిధి.  సన్నిధి.  పెన్నిధి. ఈ విద్య అనే మూలధనంతో  మిగిలిన సకల ధనాలను  తెలివితేటలతో సమకూర్చుకోవచ్చును.అందుకే  విద్యాధనం సర్వ ధనప్రధానముగా  రాణిస్తోంది."విద్వాన్ సర్వత్ర పూజ్యతే" ; "విద్యకు సాటి ధనంబు లేదిలన్"  అని నాటికి, నేటికి నిరూపింపబడుచున్నది.*

                              *****

                  *

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: