22, అక్టోబర్ 2020, గురువారం

మనస్సు, బుద్ధి

 *🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*


🌷 message of the day 🌷


    *_🌴ఎవరి మనస్సు, బుద్ధి, అంత:కరణము వాసనలతో కూడి మలినమై ఉంటాయో, అతడు చేసే కర్మలు కూడా మలినంగానే ఉంటాయి. 'నేను వేరు నీవు వేరు ' అనే  భేదభావము ఉన్నంత వరకు ప్రేమ, కరుణ, దయ, జాలి, వీటికి చోటు ఉండదు. ఇవి లేనపుడు దుర్మార్గము మనసులో తిష్ట వేస్తుంది. పైకి తియ్యగా మాట్లాడుతున్నా లోపల విషం చిమ్ముతుంటారు. వారి కర్మలు కూడా విషపూరితంగానే ఉంటాయి.  తనలో ఉన్న ఆత్మ అందరిలోనూ ఉంది, అందరూ ఆత్మస్వరూపులే, అందరూ సమానమే, భేదభావము అనేది మన మనసులోనే ఉంది అన్న భావన కలిగినంత వరకు మానవుడికి జ్ఞానం కలుగదు. దానికి తోడు ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సత్యనిష్ట, అవసరము. ఇవి లేకపోవడము చేతనే  కర్మలు మానవుని బంధిస్తున్నాయి. మరుజన్మకు కారణం అవుతున్నాయి. పునర్జన్మ రహితులమగుటకు అంత:కరణంను పరిశుద్ధం చేసుకోవాలి. సత్కర్మాచరణకు పూనుకోవాలి. ఇవి దైవీ సంపద గలవారి లక్షణాలు. పరిపూర్ణమైన మనశ్శాంతి  దైవీ గుణాలను కలిగియున్నవారికే సాధ్యం..🌴_*

కామెంట్‌లు లేవు: