29, జులై 2025, మంగళవారం

పరమాచార్య వైభవమ్…

 ప్రతిరోజూ…

శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…

114a;307e2.    నడిచే దేవుడు…

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌼P0282.పరమాచార్య పావన గాధలు…


*పరమాచార్య స్వామి*– 

                 *ఉప్పు వ్యాపారి*

                    ➖➖➖✍️

```

అనుకోకుండా నాకు ఒక పెద్ద దుఃఖం, భరింపరాని శోకం కలిగింది. నాలుగు నెలల దాకా మహాస్వామి వారిని దర్శించుకోవడానికి కూడా వెళ్ళలేదు. మహాస్వామి వారు నాకోసం కబురు పంపారు. ఇద్దరు లేదా ముగ్గురు పెద్ద అధికారులు వచ్చి నన్ను వారి వద్దకు తీసుకుని వెళ్ళారు. 


అప్పుడు రాత్రి పది గంటలు.... 

కటిక చీకటి.... కేవలం ఒక మట్టి ప్రమిద మాత్రమే వెలుగుతోంది. 


“...నిపుణౌ”, మహాస్వామి వారు మెల్లిగా చెప్పారు, “చెప్పు”. 


“తవ హి చరణావేవ నిపుణౌ... సౌందర్యలహరి లోని నాలుగవ శ్లోకం

త్వదన్యః పాణిభ్యాం...”


పరమాచార్య స్వామి వారు చిన్నగా అన్నారు, “అందరికీ ఆ అమ్మే ఆశ్రయం. ఎవరెవరికి ఏమి ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆమెకి తెలుసు.”


అంతా నిశ్శబ్ధం.... “సాంబమూర్తి నీకు సంత అంటే ఏంటో తెలుసా?”


“తెలుసు పెరియవ. చాలామంది వర్తకులు సరుకులు తెచ్చి అమ్ముతూ ఉంటారు. వారంలో ఒక రోజు ప్రతి గ్రామంలో సంత జరుగుతుంది. వారు ఈరోజు ఇక్కడ రేపు అక్కడ అని ప్రయాణిస్తూంటారు.”


“నీవు ఉప్పు వ్యాపారి గురించి ఎప్పుడైనా విన్నావా?”


“అవును. వారు సంతలో ఉప్పు అమ్ముకుని జీవిస్తూ ఉంటారు. వారికి అదే జీవనాధారం.”


“అవును. అటువంటి ఒక ఉప్పు వ్యాపారి కామాక్షి అమ్మకి పరమ భక్తుడు. ఒకసారి అతను ఒక ఊరిలో సంత ముగించుకుని మరొక ఊరికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక అడవి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది దొంగలు ఇతన్ని చూసారు. గాడిద పైన ఉప్పు మూటలు తీసుకువెళ్తున్న అతన్ని చూసి “రేయ్ రేపు సంతలో ఇతను ఈ ఉప్పునంతా అమ్మి డబ్బులతో మళ్ళా ఇదే మార్గంలో వెళ్తాడు. అప్పుడు మనం ఇతని ధనాన్ని దొంగిలించాలి.” వారు ఒక పథకం వేసారు. 


“ఇంకా, వాళ్ళు పేల్చే మందుగుండు సామాగ్రి గురించి నీకు తెలుసా?”


“దేవాలయాలలో ఉత్సవాల సమయంలో పేలుడు పదార్థాలతో మందుగుండు సామాగ్రి తయారుచేస్తారు. గొట్టాలలో గట్టిగా కుక్కి ఒక వత్తి పెడతారు. ఆ వత్తి చివరకు అగ్ని తగిలితే అది చిన్నగా వెళ్ళి మందుగుండును తాకి పెద్దగా శబ్దము చేస్తూ పేలుతుంది.”


“అవును. ఆ దొంగల పథకము కూడా అదే. ఒక మందుగుండు పేలిస్తే 

ఆ గాడిద కంగారులో అటు ఇటు పరిగెడుతుంది. ఆ ఉప్పు వ్యాపారి భయతో అరుస్తూ గగ్గోలు పెడతాడు. అప్పుడు అతని దట్టీ నుండి డబ్బు తస్కరించవచ్చు.”


“ఆ రోజు సంతలో ఉప్పు వ్యాపారి తన దగ్గర ఉన్న ఉప్పును అమ్మడానికి కుప్పలుగా పోసాడు. కాని ఆరోజు బాగా వర్షం పడి ఉప్పు మొత్తం కరిగిపోయింది. అతనికి ఆరోజు వ్యాపారం లో నష్టము, మనస్సుకు కష్టము కలిగింది. బుద్దికి తోచినట్టుగా మనస్సుకు వచ్చినట్టుగా కామాక్షిని తిట్టడం మొదలుపెట్టాడు. అతని కోపం ఏంటంటే డబ్బులేకుండా ఇంటికి వెళ్ళాలి అని. ఇంటికి వెనుతిరిగి నడక మొదలుపెట్టాడు. అడవి మార్గంలోకి ప్రవేశించగానే దొంగలు అతన్ని చూసి మందుగుండు పేల్చడానికి సిద్ధపడ్డారు. వత్తి గుండా మంట లోపలికి వెళ్ళి మందుగుండు సామాగ్రిని చేరింది కాని పేలలేదు. వారు దానికి కారణం వెతకగా ఆ మందుగుండు బాగా తడిసిపోయింది పొద్దున్న పడిన వర్షానికి. వాళ్ళు ఉప్పు వ్యాపారితో ఇలా అన్నారు. “దేవుడు నిన్ను కాపాడాడు. నీకోసమే ఈరోజు వర్షం పడినట్టుంది. పో ఇంటికి పోయి దేవున్ని ప్రార్థించు”


ఆ ఉప్పు వ్యాపారి నిశ్చేష్టుడయ్యాడు. “అమ్మ నాకు ద్రోహం చేసింది అనుకున్నాను. కాని అది తప్పు. ఆమె నన్ను కాపాడింది. అమ్మా కామాక్షి నన్ను క్షమించు. నాకు ఎప్పుడు ఎక్కడ ఏమి ఇవ్వాలో నీకు బాగా తెలుసు. నా అజ్ఞానాన్ని మన్నించు తల్లీ. వర్షం రాకపోయి ఉంటే నేను ఉప్పు మొత్తం అమ్మి డబ్బుతో వస్తుండేవాడిని. డబ్బు తీసుకోవడంతో పాటు ఈ దొంగలు నన్ను కొట్టేవారు. నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు.”


కావున మనకి ఏమి లభించినా అది అమ్మ అనుగ్రహమే. మిగిలినది దేనికోసమూ ఆశించకుండా పరులకు మంచి చెయ్యడమే. 


మహాస్వామి వారు చిన్న గొంతుకతో, తీరికగా చెప్పిన ఈ దీర్ఘ ఉపన్యాసం ముగిసే సరికి రాత్రి 2:30 అయ్యింది.


అప్పుడు నేను “నా తల పైన ఉన్న వెయ్యి టన్నుల బరువు తీసేసినట్టు అయ్యింది” అని అన్నాను. 


పరమాచార్య స్వామి వారు సంతతో మొదలుపెట్టి కామాక్షి అమ్మతో ముగించారు. అది నా మనస్థితి కోసం చెప్పబడినా ఇది అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే అందరూ ఇటువంటి స్థితిలో ఉన్నవారమే కదా! 


తరువాత మహాస్వామి వారు “క్రమం తప్పకుండా ప్రతిరోజూ రామాయణం చదువు. నీ మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది.” అని అన్నారు.


ఈనాటికీ నాకు రామాయణ పారాయణ - మనస్సుకు ప్రశాంతత ఒకేసారి వస్తుంది. ✍️```

*--- బ్రహ్మశ్రీ రామకృష్ణ దీక్షితర్,* శ్రీమఠం విద్వాన్. మహాపెరియావళ్ దరిశన అనుభవంగళ్-1

*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*

*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*

```

#KanchiParamacharyaVaibhavam # “కంచిపరమాచార్యవైభవం”🙏

.     సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

            🌷🙏🌷


🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.

శ్రీమద్భాగవత కథలు*```

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🍁మంగళవారం 29 జూలై 2025🍁*

                       1️⃣5️⃣

                   *ప్రతిరోజూ*

*మహాకవి బమ్మెర పోతనామాత్య*


          *శ్రీమద్భాగవత కథలు*```


(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```

``

*వేదాలు వేయి సార్లు చదివినా లభ్యం కాని ముక్తి, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది..!*``



*పరీక్షిత్తుకు ముక్తి మార్గాన్ని*                  

    *తెలియచేసిన శుకుడు*               

```

ప్రాయోపవేశం చేసి, శ్రీహరి కథలను వినాలనీ, తనకు హరిమీద భక్తి కలగాలనీ, తద్వారా ముక్తి పొందాలనీ ఆసక్తితో ఉన్న పరీక్షిత్తు దగ్గరకు వచ్చిన అవధూతమూర్తి, వేదవ్యాస మహర్షి కొడుకు, శుక మహర్షిని,``` 'కాలం చెల్లిపోతున్నవారు భగత్పాప్తిని పొందాలంటే ఉపాయం ఏమిటి? వారి కర్తవ్యాకర్తవ్యాలు ఏమిటి'``` అని ప్రశ్నించిన పరీక్షిత్తుకు సమాధానం చెప్తాడు శుకుడు వివరంగా...

``` 

*'ముక్తిని కోరుకునేవాడు విష్ణువును గురించే ఆలకించాలి. ఆరాధించాలి. స్తుతించాలి. తలచాలి. సర్వం ఈశ్వరమయంగా భావించినప్పుడే మోక్షం కలుగుతుంది. సాంఖ్య యోగం వల్ల స్వధర్మాచరణ ద్వారా జీవులందరూ తమ ఆయువు తీరేదాకా విష్ణువును ధ్యానించగలుగుతారు. నా తండ్రి వ్యాస భగవానుడు ద్వాపరయుగంలో భాగవతాన్ని అధ్యయనం చేయించాడు. భాగవతం మోక్షమార్గాన్ని ప్రతిపాదించే శాస్త్రం. భాగవతంలోని భగవంతుడి అవతార లీలలు నా మనస్సును ఆకట్టుకున్నాయి. ఆ ఆనందమే నన్ను చదివించేలా చేసింది. నీకు ఆ భాగవత తత్త్వాన్ని తెలియచేస్తాను శ్రద్ధతో విను. భాగవతాన్ని వినడం వల్ల నీకు భగవంతుడి మీద ప్రేమ కలిగి, విష్ణువును సేవించాలనే బుద్ధి పుడుతుంది. రెప్పపాటు కాలం హరినామ స్మరణ చేసినా చాలు, ముక్తి కలుగుతుంది'*``` అని ఖట్వాంగ మహారాజు వృత్తాంతాన్ని చెప్పాడు శుక మహర్షి పరీక్షిత్తుకు.

```

*“పూర్వం ఖట్వాంగుడు అనే రాజు ఏడు దీవులకు ఏలిక. ఒకనాడు రాక్షసుల చేతిలో ఓడిపోయిన ఇంద్రుడు, సహాయం చేయమని ఖట్వాంగుడి దగ్గరకు వచ్చి అడిగాడు. వెంటనే ఖట్వాంగుడు భూలోకం నుండి స్వర్గలోకం వెళ్ళి రాక్షసులను అంతం చేశాడు. దేవతలు ఆనందించి, ఆయన్ను వరం కోరుకొమ్మని అడగ్గా, తనెంత కాలం బతుకుతానో చెప్పమని కోరాడు. ముహూర్త కాలం అంటే, రెండు గడియలు మాత్రమే అని చెప్పారు దేవతలు. రాజు క్షణాల మీద భూలోకానికి తిరిగి వచ్చాడు. అన్నిటినీ తక్షణమే త్యజించి విరాగి అయ్యాడు. వెంటనే గోవింద నామాన్ని ధ్యానించాడు. స్థిర చిత్తంతో రెండు గడియల్లోనే ముక్తి పొందాడు.”*


ఈ కథ చెప్పి, పరీక్షిత్తుకు ఏడు రోజులు దాటిన తరువాత కానీ ఆయువు తీరదు కాబట్టి, అంతవరకు విష్ణు ధ్యానం చేస్తే, మోక్షపథం పొందే వీలుంది అని అన్నాడు శుకుడు. భగవంతుడిని ధ్యానం చేసే విధానం వివరంగా చెప్పాడు శుకుడు…


*ఓంకారాన్ని స్మరిస్తూ యోగనిష్ఠతో ప్రాణవాయువును స్వాధీనంలోకి తెచ్చుకోవడం, మనస్సు అనే పగ్గాన్ని చేజారనీయకుండా గట్టిగా పట్టి ఉంచడం. భక్తే లక్షణంగా కల యోగాన్ని ఆశ్రయించడం, తద్వారా విష్ణు పథాన్ని చేరుకోవడం గురించి చెప్పాడు. ధారణ అంటే ఏమిటి, ఎలాంటి సాధనతో అది నిలబడుతుంది, దాని స్వరూపం ఎలా ఉంటుంది. అది జీవుల మానసిక మాలిన్యాన్ని ఎలా రూపుమాపగలుగుతుంది అనే విషయాలను పరీక్షిత్తు ప్రశ్నలకు జవాబుగా వివరించాడు శుకుడు.*


'పండితుడైన వాడు ప్రాణవాయువులను బిగబట్టి శ్వాసను జయించాలి. సర్వమయుడైన విరాట్పురుషుడి విగ్రహంతో మోక్షగామి (ముముక్షువు) తన మనస్సును సంధానించాలి. బుద్ధిమంతుడు వాసుదేవుడిని సేవించాలి. విష్ణువును స్మరించని వాడు మత్తులో ఉన్నవాడితో సమానం. పరమేశ్వరుడిని మనస్సులో ధారణతో నిలుపుకోవాలి. ఆయన ప్రతి అవయవాన్నీ ఒక్కటొక్కటిగా అనుక్షణమూ ధ్యానించాలి. పరిపూర్ణమైన నిశ్చలబుద్ధి కుదిరేదాకా ఆ భగవత్ చింతనాసక్తి తోనే ఉండాలి. శరీరాన్ని విడిచి పెట్టే సమయంలో ఇంద్రియ సాంగత్యాన్ని వదలిపెట్టాలి. ఇలా బ్రహ్మలోకానికి పోవాలనుకున్న యోగి ఆకాశమార్గంలో పోతుంటాడు. పోయి, పోయి విష్ణువు స్థానమైన శింశుమార చక్రం చేరుకుంటాడు. విష్ణు లోకానికి వెళ్లినవాళ్లు విష్ణు పదాన్ని పొంది ప్రకాశిస్తుంటారు'.```


ఇలా చెప్పిన శుకుడు పరీక్షిత్తుకు భక్తి మార్గమే ముఖ్యమని అంటాడు. 'జగన్నాథుడైన శ్రీహరి సర్వ ప్రాణుల్లో ఆత్మరూపంలో ఉంటాడు. నిత్యం నమస్కరించతగినవాడు, ఎల్లకాలం భక్తుల పట్ల వాత్సల్యం కలవాడు, ఆత్మరూపి, ఇలాంటి శ్రీమహావిష్ణువు కథాసుధను సంతృప్తిగా ఆస్వాదించే భక్తులు పుణ్యాత్ములు. 

ఆ లక్ష్మీనాయకుడి కథలు అమృతోపమానాలు. అవి విన్నవారికి వీనుల విందుగా ఉంటుంది. విష్ణు గాథలు, కీర్తనలు వింటూ కాలాన్ని వెళ్ళబుచ్చేవాడి ఆయువు గట్టిది. హరినామ సంకీర్తనలు వినని చెవులు కొండలలో గుహల లాంటివి' అని చెప్పాడు శుక మహర్షి.


చనిపోవడం అనే భయం ఏమాత్రం లేకుండా, ధర్మార్థ కామాలను మూడింటినీ మానుకుని, ఆ పురుషోత్తముడి మీదనే మనస్సును నిలుపుకుని, అంత్యకాలం గడపాలనే అభిప్రాయానికి వచ్చాడు. పరీక్షిత్తు.


                *(సశేషం)*

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*


        *రచన:శ్రీ వనం* 

 *జ్వాలా నరసింహారావు* *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷``


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

మంగళవారం🍁* *🌹29 జూలై 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

     *🍁మంగళవారం🍁*

   *🌹29 జూలై 2025🌹*  

     *దృగ్గణిత పంచాంగం*  

                

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షఋతౌః* 

*శ్రావణమాసం - శుక్లపక్షం*


*తిథి  : పంచమి* రా 12.46 వరకు ఉపరి *షష్ఠి*

*వారం    : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం   : ఉత్తర* రా 07.27 వరకు ఉపరి *హస్త*

*యోగం : శివ* రా 03.05 వరకు ఉపరి *సిద్ధ*

*కరణం  : బవ* మ 12.00 *బాలువ* రా 12.46 ఉపరి *కౌలువ*


*సాధారణ శుభ సమయాలు:*

*మ 12.00 - 01.00 సా 04.00 - 06.00*           

అమృత కాలం  : *ప 11.42 - 01.25*

అభిజిత్ కాలం  : *ప 11.48 - 12.40*

*వర్జ్యం      : రా 04.42 - 06.28 తె*

*దుర్ముహూర్తం  : ఉ 08.22 - 09.13 రా 11.07 - 11.52*

*రాహు కాలం   : మ 03.27 - 05.04*

గుళికకాళం       : *మ 12.14 - 01.50*

యమగండం     : *ఉ 09.00 - 10.37*

సూర్యరాశి : *కర్కాటకం*  

చంద్రరాశి : *కన్య*

సూర్యోదయం :*ఉ 05.55*

సూర్యాస్తమయం :*సా 06.51*

*ప్రయాణశూల   : ఉత్తరం దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.47 - 08.22*

సంగవ కాలం         :     *08.22 - 10.56*

మధ్యాహ్న కాలం    :     *10.56 - 01.31*

అపరాహ్న కాలం    : *మ 01.31 - 04.06*


*ఆబ్ధికం తిధి         : శ్రావణ శుద్ధ పంచమి*

సాయంకాలం        :*సా 04.06 - 06.40*

ప్రదోష కాలం         :  *సా 06.40 - 08.54*

రాత్రి కాలం           :*రా 08.54 - 11.52*

నిశీధి కాలం          :*రా 11.52 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.19 - 05.03*

****************************

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🚩శ్రీ ఆంజనేయ స్తోత్రం🚩*


*మహాబలాయ వీరాయ* 

*చిరంజీవిన ఉద్ధృతే*

*హారిణే వజ్రదేహాయ* 

*చోల్లంఘిత మహాబ్దయే!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹