ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
13, జూన్ 2025, శుక్రవారం
డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు
-------------*****----------
బహుభాషా చక్రవర్తి డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు జీవిత చరిత్ర.
-----***------***------
తాను రచించిన కావ్యాన్నే తానే పాఠ్యపుస్తకంగా చదివి పరీక్ష రాసిన అరుదైన కవి సరస్వతీపుత్ర పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు. పదునాలుగు భాషలలో పాండిత్య శోభతో ఒక్క గొంతుకై అబ్బురపరచిన బహుభాషా చక్రవర్తి ఆయన. తెలుగు ప్రబంధాలలోని ప్రబంధ నాయికలకు సాహిత్య చరిత్రలో సముచిత సమయోచిత స్థానం పదిలపరచిన సాహిత్య విమర్శకుడాయన. ప్రాచీన సాహిత్యంతోపాటు ఆధునిక సాహిత్యం సమదృష్టితో అధ్యయనం చేసిన సాహిత్యజీవి ఆచార్యులు. పద్యం గద్యం ఇరుకారుల సేద్యంగా శతాధిక గ్రంథాలు రచించిన శక్తత గల రచయిత ఆయన. గొప్ప వక్త. సమర్థుడైన విమర్శకుడు. శక్తత గల అనువాదకుడు. ఛాందసభావాలు గిట్టనివాడు. సంప్రదాయం మరువనివాడు. ఆధునికాన్ని అభిమానించేవాడు.
పుట్టపర్తి నారాయణాచార్యులు 1914, మార్చి 28, న అనంతపురం జిల్లా అనంతపురం మండలంలోని చియ్యేడు గ్రామంలో జన్మించారు. అతను తండ్రి శ్రీనివాసాచార్యులు, తల్లి లక్ష్మిదేవి (ķóndamma) గొప్ప సంస్కృత ఆంధ్ర పండితులు. అసలు వారి ఇంటి పేరు తిరుమల వారు. శ్రీకృష్ణదేవరాయల రాజగురువు తిరుమల తాతాచార్యుల వంశం వారిది. తాతాచార్యులు గొప్ప శాస్త్ర పండితుడు. అతను గురించి కొందరు అల్పబుద్ధుల వల్ల హాస్యకథలు పుట్టాయి. ఆ తర్వాత వారి వంశీయులు చిత్రావతీ తీరంలో పుట్టపర్తిలో ఉండడం వల్ల ఇంటిపేరు పుట్టపర్తి అయింది.
తండ్రి ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. వాళ్లది విద్వత్వంశం. ఆచార్యులు గారు పుట్టిన కొన్ని రోజులకే తల్లి మరణించింది. తండ్రికి ఉద్యోగ ఒత్తిడి. పైగా భార్య మరణించిన దు:ఖంలో ఉన్నారు. అటువంటి స్థితిలో ఆచార్యులు గారు దేనికీ పనికిరాని పరిస్థితిలో ఉండగా, ఆ కుటుంబ సన్నిహితుడొకడు ఆచార్యులుగారిని తన వెంట పెనుగొండకు తీసుకొని వెళ్లి పిట్ దొరసానికి పరిచయం చేసాడు. ఆమె పెనుగొండ సబ్ కలెక్టర్ గారి భార్య. ఆమె గొప్ప ఆంగ్ల విద్వాంసురాలు. ఆమె నారాయణాచార్యుల గారిని ఆంగ్లభాషలో గొప్ప ప్రవీణునిగా చేసింది. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు ఈయనకు స్వయానా మేనమామ. శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు బాల్యంలోనే భారత, భాగవతాది గ్రంధాలను అభ్యసించటంతో పాటుగా సంగీత, నాట్య శాస్త్రాలలో కూడా శిక్షణ తీసుకున్నారు. అలా ఆయన సంగీత, సాహిత్య, నాట్య శాస్త్రాలతో సమలన్క్రుతు లయ్యారు. సుప్రసిద్ధ నర్తకి రంజకం మహాలక్షుమ్మ గారి వద్ద వీరు సంగీత, నృత్యాలను అభ్యసించారు. ఇవే కాకుండా నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించారు. రంగస్థలంపై నాట్యప్రదర్శనలిచ్చారు. ఎన్నో ప్రదేశాలను తిరిగారు. చివరకు కడపలో స్థిరపడ్డారు. అక్కడే చాలాకాలం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి తన ఇంటిని సాహితీ మాగాణంగా మార్చుకున్నారు.
నారాయణాచార్యులు చిన్న వయసులోనే భారతం, భాగవతం, పురాణాలతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నారు. అతను తిరుపతి సంస్కృత కళాశాలలో సంస్కృతం నేర్చుకున్నారు. కపిలస్థానం కృష్ణమాచార్యులు, డి.టి. తాతాచార్యులు లాంటి గొప్ప సంస్కృత పండితుల వద్ద వ్యాకరణం, ఛందస్సు, తదితరాలు నేర్చుకున్నారు. పెనుగొండలో రంజకం మహాలక్ష్మమ్మ దగ్గర భరత నాట్యం నేర్చుకున్నారు. సంగీతం, సాహిత్యం, నాట్యం అతనులో త్రివేణీ సంగమంలా మిళితమయ్యయి. చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేయడమే గాక సన్నివేశాల మధ్య తెర లేచేలోపు నాట్యం చేసే వారు. పెనుగొండలో పిట్ దొరసాని వద్ద ఆంగ్లసాహిత్యం నేర్చుకున్నారు.
ప్రొద్దుటూరు వీరి అత్తగారి ఊరు. మొదట అతను పనిచేసింది అనంతపురంలో. అప్పటికింకా స్వాతంత్ర్యం రాలేదు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ మీనన్ కి సమయం దొరికితే చాలు, ఆంగ్లేయుల్ని తనివితీరా పొగడడం, గాంధీ వంటి వారిని తిట్టడం పరిపాటిగా ఉండేది. అది సహించలేని పుట్టపర్తి అతనుతో వాగ్యుద్ధానికి సిద్ధపడడమే గాక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కొన్నాళ్ళు తిరువాన్కూర్ లోనూ, కొన్నాళ్ళు ఢిల్లీ లోనూ, ప్రొద్దుటూరు లోనూ పనిచేసి చివరకు కడపలో స్థిరపడ్డారు. కడపలో శ్రీ రామకృష్ణా ఉన్నత పాఠశాలలో అతను ఉపాధ్యాయుడుగా పనిచేశారు. సాహితీ సృష్టి అంతా కడపలోనే జరిగింది.
అతను బహుభాషావేత్త, అనేక భాషల్లో పండితులు. తుళు, ఫ్రెంచి, పర్షియన్ లాంటి 14 భాషలు నేర్చుకున్నారు. అతనుకి పాలీ (బౌద్ధ, జైన సాహిత్యాలు) భాషలో మంచి ప్రావీణ్యం ఉండేది. వారి కుమార్తె పుట్టపర్తి నాగపద్మిని ఇచ్చిన సమాచారంప్రకారం అతను చేసిన అనువాదాలు - అవధీ భాషనుండి తులసీదాస్ రామయణం, బ్రజ్ భాషనుండి సూరదాస్, రసఖాన్ మొదలైన వారి రచనలు, పాత అవధీ, బ్రజ్ భోజ్ పురీ భాషల మిశ్రమంనుండి కబీర్ దోహాల హింది. పుట్టపర్తి ఆనేక ప్రసిద్ధ తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ కావ్యాలను తెలుగులోనికి అనువదించారు.
హృషీకేశ్ లో అతను పాండిత్యాన్ని పరీక్షించిన శివానంద సరస్వతి అతనుకు "సరస్వతీపుత్ర" బిరుదునిచ్చారు. అతనుకు లెక్కలేనన్ని సత్కారాలు జరిగినా, ఎన్ని బిరుదులు వచ్చినా ఈ ఒక్క బిరుదునే గొప్ప గౌరవంగా భావించి అతను ఉంచుకున్నారు.
తండ్రి ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. వాళ్లది విద్వత్వంశం. ఆచార్యులు గారు పుట్టిన కొన్ని రోజులకే తల్లి మరణించింది. తండ్రికి ఉద్యోగ ఒత్తిడి. పైగా భార్య మరణించిన దు:ఖంలో ఉన్నారు. అటువంటి స్థితిలో ఆచార్యులు గారు దేనికీ పనికిరాని పరిస్థితిలో ఉండగా, ఆ కుటుంబ సన్నిహితుడొకడు ఆచార్యులుగారిని తన వెంట పెనుగొండకు తీసుకొని వెళ్లి పిట్ దొరసానికి పరిచయం చేసాడు. ఆమె పెనుగొండ సబ్ కలెక్టర్ గారి భార్య. ఆమె గొప్ప ఆంగ్ల విద్వాంసురాలు. ఆమె నారాయణాచార్యుల గారిని ఆంగ్లభాషలో గొప్ప ప్రవీణునిగా చేసింది. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు ఈయనకు స్వయానా మేనమామ. శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు బాల్యంలోనే భారత, భాగవతాది గ్రంధాలను అభ్యసించటంతో పాటుగా సంగీత, నాట్య శాస్త్రాలలో కూడా శిక్షణ తీసుకున్నారు. అలా ఆయన సంగీత, సాహిత్య, నాట్య శాస్త్రాలతో సమలన్క్రుతు లయ్యారు. సుప్రసిద్ధ నర్తకి రంజకం మహాలక్షుమ్మ గారి వద్ద వీరు సంగీత, నృత్యాలను అభ్యసించారు. ఇవే కాకుండా నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించారు. రంగస్థలంపై నాట్యప్రదర్శనలిచ్చారు. ఎన్నో ప్రదేశాలను తిరిగారు. చివరకు కడపలో స్థిరపడ్డారు. అక్కడే చాలాకాలం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి తన ఇంటిని సాహితీ మాగాణంగా మార్చుకున్నారు.
'సరస్వతీ పుత్ర' శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు - టీవీయస్. శాస్త్రి
ఒక మనిషి ఒక భాషలో పరిపూర్ణుడు కావటానికే ఒక జీవితకాలం సరిపోదు. అలాంటిది ఒక వ్యక్తి 15 భాషలను నేర్చుకోవటమే కాకుండా వాటన్నిటిలో పాండిత్యాన్ని పొందటం చాలా అరుదైన, అసాధ్యమైన విషయం. అట్టి అసాధ్యమైన విషయాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి, మహామనీషి, బహుభాషాకోవిదుడు, 'సరస్వతీ పుత్రుడు' శ్రీ పుట్టపర్తి నారాయణా చార్యుల గారిని గురించి నాకు తెలిసిన, నేను సేకరించిన విషయాలను మీకు సగర్వంగా తెలియచేయటానికి సంతోషిస్తున్నాను అని టీవీయస్ శాస్త్రి గారన్నారు.. ఆయనకు ఛాందస భావాలు గిట్టవు. దైవంతో పాటు మానవుడు కూడా కావాలనే మానవతావాది ఆయన. నూట యాభై గ్రంథాలు రచించినా, నిత్య విద్యార్థిలాగే ప్రవర్తించే నిగర్వి ఆయన.
"లీవ్స్ ఇన్ ది విండ్", దుర్యోధనుడి కథ ఆధారంగా వ్రాసిన "ది హీరో" ఆంగ్లంలో అతను స్వంత రచనలు. అతను ఆంగ్లంలో మరిన్ని రచనలు చేసి ఉండేవారే. అతనుకు ఆంగ్లం నేర్పిన వి.జే. పిట్ అనే దొరసాని అప్పటి పెనుగొండ సబ్ కలెక్టర్ భార్య. ఆమె కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో బ్రౌనింగ్ పై రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొందింది. అప్పట్లోనే ఇతను వ్రాసిన లీవ్స్ ఇన్ ది విండ్ కావ్యం చూసి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ పెద్ద కితాబు ఇచ్చారు.
అయితే పిట్ దొరసాని మాత్రం "ఇంగ్లీషులో వ్రాయడానికి అనేక మంది ఇండియన్స్ ప్రయత్నించి ఫెయిలైనారు. మీరెంత కష్టపడినా మిమ్మల్ని క్లాసికల్ రైటర్స్ ఎవరూ గౌరవించరు. అందుకే బాగా చదువుకో. కానీ ఇంగ్లీషులో వ్రాసే చాపల్యం పెంచుకోవద్దు." అని చెప్పింది. దాంతో అతను చాలా రోజులు ఆ ప్రయత్నమే చేయలేదు. అయితే ఆ తర్వాత చాలా కాలానికి భాగవతాన్ని And ఇంగ్లీషులోకి అనువదించడంతో బాటు ది హీరో నాటకాన్ని వ్రాశారు. కథంతా స్వీయ కల్పితమే.
సాధనా సంపత్తి.. పుట్టపర్తి సాహితీ సుధ
సాహిత్యాకాశంలో పుట్టపర్తి ధ్రువతారగా ఎలా నిలిచారో సాధనాపరంగానూ వారిస్థాయి అంతే ఎత్తులో ఉంది..కేవలం యే ఆధ్యాత్మిక అనుభూతి కలగలేదని సంసారాన్ని విడచి సాధువులను వెతుక్కుంటూ హిమాలయాల దారి పట్టి అక్కడ స్వామి శివానంద సరస్వతిని భగవత్సంకల్పితంగా కలిసి వారిచే సరస్వతీ పుత్రా అనిపించుకుని నడిచేదైవం కంచి పరమాచార్యులు చంద్రశేఖరులచే అమితంగా ప్రేమింపబడి నీ అంత్యకాలంలో కృష్ణ దర్శనమౌతుంది అని వారిచే ఆశీర్వాదమందిన పుణ్య చరితులు పుట్టపర్తి. నా గత జన్మ యేమిటి ఈ జన్మలో నా స్థితి యేమి కృష్ణ సాక్షాత్కారం అవుతుందా..ఇదే ప్రశ్న పుట్టపర్తి తోటే పుట్టి పెరిగి పుట్టపర్తిని నడిపించి చివరికి తనలోనే కలిపేసుకుంది.. ఈ వివరాలు భవిష్యత్తులో పుట్టపర్తిపై పరిశోధన చేసేవారికీ,ఆరాధించేవారికీ, ఎంతో మార్గదర్శకంగా ఉంటాయి ఎవ్వరి జేవితం లోనూ కనిపించని వైవిధ్యాలు పుట్టపర్తిలో ఉన్నాయి జ్యోతిష్య పండితులు పుట్టపర్తి పాండిత్యానికీ 'సంగీత నాట్య సాహిత్య ఇవే కాక మరెన్నో కళలలో అభినివేశానికీ ముఖ్యంగా వారి జీవన సూత్రమైన సాధనమయ ప్రపంచంలోని రహస్యాలను కనుగొనడానికి శ్రీవారి జాతకం బయల్పరచటం జరిగింది
అతను చరిత్రను ఎంత లోతుగా అధ్యయనం చేశాడంటే చరిత్రకారులకు అతని పట్ల గొప్ప గౌరవముండేది. ఒకసారి అతనికి కమ్యూనిస్టులు సన్మానం చేసినప్పుడు ఆంధ్రుల చరిత్రలో గాఢమైన అభినివేశమున్న మల్లంపల్లి సోమశేఖరశర్మ "అతను్ను కవిగా కంటే చారిత్రకునిగా గౌరవిస్తానని" సందేశం పంపాడు. తర్వాత పుట్టపర్తి చారిత్రకులను ఇరుకున పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకసారి అనంతపురం కళాశాలలో చరిత్ర అధ్యాపకుణ్ణి ఒకరిని ఒక శాసనం గురించి ప్రస్తావిస్తూ "సంపెట నరపాల సార్వభౌముడు వచ్చి సింహాద్రి జయశిల జేర్చునాడు అని ఉంది కదా వీడెవడు ఈ సంపెట నరపాల గాడు?" అని అడిగి, అతను దిగ్భ్రాంతుడై నిలబడి పోతే, తనే సమాధానం చెప్పాడు~: "కృష్ణదేవరాయలేనయ్యా, వాళ్ళ వంశం తుళు వంశం, ఇంటివాళ్ళు సంపెట వాళ్ళూ" అని.
పుట్టపర్తి వారు
కేవలం పన్నెండేళ్ళ వయసులోనే విజయనగర రాజుల రెండవ రాజధాని ఐన పెనుగొండ దీనావస్థను చూసి హృదయం ద్రవించేలా "పెనుగొండ లక్ష్మి" అనే గేయ కావ్యం రాశాడు. చిత్రంగా తర్వాత అతను విద్వాన్ పరీక్షలు వ్రాసేటప్పుడు తాను చిన్నతనంలో వ్రాసిన ఈ కావ్యాన్నే చదివి పరీక్ష వ్రాయవలసి రావడం ఒక కమనీయ ఘట్టం. చమత్కారమేమిటంటే ఆ పరీక్షలో అతను ఉత్తీర్ణుడు కాలేక పోయాడు. దానికి కారణం "పెనుగొండ లక్ష్మి" కావ్యం నుంచి వచ్చిన ఒక రెండు మార్కుల ప్రశ్నను ముందుగా మొదలు పెట్టి ఆ ఒక్క సమాధానమే 40 పేజీలు వ్రాస్తూఉండిపోవడంతో సమయం అయిపోవడం. ఆ ప్రశ్నకు "పూర్తి" మార్కులు (అంటే 2 మార్కులు) వచ్చినా ఆ మార్కులతో అతను పాస్ కాలేకపోయారు. అతను బడికి వెళ్ళే రోజుల్లోనే షాజీ, సాక్షాత్కారము అనే కావ్యాలు వ్రాశారు.
తాను కేరళ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు విశ్వనాథ సత్యనారాయణ నవల ఏకవీరను మలయాళం లోనికి అనువదించాడు. పండితులు ఒకరి పాండిత్యాన్ని మరొకరు మెచ్చరని అంటారు. కాని పుట్టపర్తివారి విషయంలో మాత్రం దీనికి విరుద్దం. ఒక సారి విజయవాడలో పుట్టపర్తి తన "శివతాండవం" గానం చేసినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ ఆనంద పరవశుడై అతనును భుజాలపైన కూర్చోబెట్టుకుని ఎగిరాడు. ఇంకొక సారి వైజాగ్ యూనివర్సిటీలో ప్రాకృత భాషల గురించి మాట్లాడుతున్నప్పుడు ఉపన్యాసం ఐపోయాక ప్రాకృత భాషలలో పాండిత్యం గల పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి సభికులలో నుంచి వచ్చి పుట్టపర్తికి సాష్టాంగనమస్కారం చేశారు.
ఏమానందముభూమీతలమున
శివతాండవమటశివలాస్యంబట
తెలుగులో అతను వ్రాసిన "శివతాండవం" అతనుకు ఎనలేని కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది. దీనిని అనేకమంది పండితులు ఆధునిక మహా కావ్యంగా అభివర్ణిస్తారు. ఇది ఆరు భాగాలుగా ఉంది. దేశవ్యాప్తంగా అతను ఎక్కడికి వెళ్ళినా అందరూ శివతాండవం గానం చేయమనే వారు. తెలుగు అర్థం కాని వారు సైతం ఆ మాత్రాచ్ఛందస్సు లోని శబ్దసౌందర్యానికి పరవశులయ్యేవారు. అతను గాత్ర మాధుర్యం ఎటువంటిదంటే శివతాండవాన్ని అతను స్వయంగా గానం చేయగా విన్న వాళ్ళు "ఆ శివుడు ఆడితే చూడాలి-ఆచార్యులవారు పాడితే వినాలి" అని భావించేవారు.
మచ్చుకు :
“ కైలాసశిఖర మల గడగి ఫక్కున నవ్వ
నీలిమాకాశంబు నిటలంబుపై నిల్వ
నందికేశ్వర మృదంగ ధ్వానములు బొదల
తుందిలా కూపార తోయపూరము దెరల
చదలెల్ల కనువిచ్చి సంభ్రమత దిలకింప
నదులెల్ల మదిబొంగి నాట్యములు వెలయింప
వన కన్యకలు సుమాభరణములు ధరియింప
వసుధ యెల్లను జీవవంతంబై బులకింప
ఆడెనమ్మా శివుడు ! పాడెనమ్మా భవుడు!"
అతను 140 పైగా గ్రంథాలు రచించారు. అందులో నవలలు, నాటకాలు, కావ్యాలు, సాహిత్య విమర్శనము, చారిత్రక రచనలు మొదలైనవి ఉన్నాయి. ఇటీవల అతను రచనల్లో కొన్ని "వ్యాసవల్మీకం", మహాభారత విమర్శనము (2 భాగాలు), ప్రాకృత వ్యాసమంజరి, స్వర్ణగేయార్చనం (సతీమణి కనకమ్మతో కలిసి రచించిన భక్తి గీతమాల) మొదలైనవి ప్రచురితమయ్యయి.
అతను వ్రాసిన అనేక కృతుల్లో కొన్ని దిగువ ఇవ్వబడినవి.
తెలుగులో స్వతంత్ర రచనలు *సవరించు
*పద్యకావ్యాలు సవరించు
*పెనుగొండ లక్ష్మి
*షాజీ
*సాక్షాత్కారము
*గాంధీజీ మహాప్రస్థానము,
*శ్రీనివాస ప్రబంధం
*సిపాయి పితూరీ
*బాష్పతర్పణము
*పాద్యము
*ప్రబోధము
*అస్త సామ్రాజ్యము
*సుధాకళశము
*తెనుగుతల్లి
*వేదనాశతకము
చాటువులు
గేయకావ్యాలు సవరించు
*అగ్నివీణ
*శివతాండవము
*పురోగమనము
*మేఘదూతము
*జనప్రియ రామాయణము
*ద్విపద కావ్యము సవరించు
*పండరీ భాగవతమ్ (ఓరియంటల్ లిటరరీ అవార్డ్)
వచన కావ్యాలు సవరించు
*ప్రబంధ నాయికలు
*వ్యాస సౌరభము
*రాయలనాటి రసికతా *జీవనము
*రామకృష్ణుని రచనా వైఖరి
*విజయాంధ్రులు
*భాగవతోపన్యాసాలు
*విజయతోరణము
*సమర్థ రామదాసు
*తెనుగు తీరులు
*ఆంధ్రమహాకవులు
*విప్లవ యోగీశ్వరుడు
*శ్రీసాయిలీలామృతము
*సరోజినీదేవి
*నవ్యాంధ్ర వైతాళికులు
*ఆంధ్రుల చరిత్ర
*కర్మయోగులు
*రాయల నీతికథలు (5 భాగాలు) మొదలైనవి.
నవలలు సవరించు
*అభయప్రదానం
*ప్రతీకారము
*హరిదాసి
*ఆంగ్లంలో స్వతంత్ర రచనలు సవరించు
*Leaves in the Wind
*Vain Glorions
*The Hero
మలయాళంలో స్వతంత్ర రచనలు *సవరించు
*మలయాళ నిఘంటువు
సంస్కృతంలో స్వతంత్ర రచనలు సవరించు
*త్యాగరాజ స్వామి సుప్రభాతం.
*మార్కాపురం చెన్నకేశవ సుప్రభాతం.
*శివకర్ణామృతము
*అగస్త్యేశ్వర సుప్రభాతం
*మల్లికార్జున సుప్రభాతం
అనువాదాలు సవరించు
హిందీ నుండి
* కబీరు వచనావళి,*విరహ సుఖము, *గాడీవాలా (నవల)
మరాఠీ నుండి:
*భగవాన్ బుద్ధ, *స్వర్ణపత్రములు, *భక్తాంచేగాథా, ఉషఃకాల్ (నవల)
మలయాళం నుండి:
*శ్మశానదీపం, *కొందియిల్‌క్కురు సిలైక్కు (నవల), *మిలట్రీవాడలో జీవితచక్రం, *దక్షిణ భారత కథాగుచ్ఛం, *తీరనిబాకీ (నాటిక),*సెట్రక్కాడు కథలు
మలయాళం లోకి:
*ఏకవీర
ఇంగ్లీషు నుండి:
*మెఱుపులు - తలపులు, *అరవిందులు
ఇంగ్లిషు లోకి:
*భాగవతం
భారత ప్రభుత్వం అతనుకు పద్మశ్రీ పురస్కారాన్నిచ్చింది. ఆయితే అతను నిజానికి జ్ఞానపీఠ అవార్డు పొందడానికి అన్నివిధాలా అర్హులనీ, అతనుకు ఆ అవార్డు రాకపోవడం తెలుగువారి దురదృష్టమనీ పలువురు పండితులు భావిస్తారు. గుర్రం జాషువా "పుట్టపర్తి నారాయణాచార్యుల కంటే గొప్పవాడెవ్వడు?" అని ప్రశ్నించాడు. దేశంలోని అన్ని ప్రాంతాలలో, హైదరాబాదు, చెన్నై, కలకత్తా లాంటి అన్ని నగరాలలో అతను సత్కారాలు పొందారు. శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు అతనుకు డి.లిట్. ప్రదానం చేశాయి.
పుట్టపర్తి నారాయణాచార్యులు (మార్చి 28, 1914 - సెప్టెంబర్ 1, 1990) తెలుగు పదాలతో ‘‘శివతాండవం’’ ఆడించిన కవి . ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానం ఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం అతనుది. అతను పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది. ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే శివతాండవ కావ్యం యొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు పుట్టపర్తి నారాయణాచార్యులు. నారాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతున్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో అతను సాధించిన లయాత్మక సౌందర్యం అనితరసాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణిస్తారు.
ఒకసారి అనంతపురంలో జరిగిన ఒక సభలో వారు మాట్లాడుతూ, "నేను 14 భాషలలో పండితుడను. నన్ను మించిన పండితుడు మరెవ్వరులేరు. నాకు అహంకారముంది. అందులో న్యాయముంది." అని సగర్వంగా ప్రకటించుకున్న దైర్యశాలి! ఈ సరస్వతీపుత్రుని నందమూరి తారకరాముడు మనసారా సత్కరించి ఆనందభరితుడయ్యాడు. ప్రతిభకు తగిన గుర్తింపు లభించని ఈ సరస్వతీ పుత్రుడు 01-09-1990, శనివారం, ఏకాదశి నాడు తెలవారుతుండగా భాగవత సారాన్ని వివరిస్తూ మృత్యువు కౌగిట్లోకి జారిపోతూ చెప్పిన మాటలివి, "భక్తుడు, భగవంతుడు ఒకటేరా!" అంతే, 'శ్రీనివాసా!' అంటూ గుండె పట్టుకొని ఒక పక్కకు ఒరిగిపోయారు. శివైక్యం చెందారు. అంతకు మునుపే నిర్వాణషట్కాన్ని తెప్పించుకొని చదివారు.
పెదవి మాత్రమే
*చదివే సమయంలో పెదవి మాత్రమే తగిలే పద్యం*
భూమీ భామాంబు భవా
వామాపా వైభవ భువి భావావాపా
వేమమ్మోముము భూభవ
భీమ భవాభావ భావ విభువామావిభా
*చదివే సమయంలో పెదవులు తగలనిది*
శ్రీశా సతత యశః కవి
తాశా ధాత్రీశ ఖండితాశా నిస్సం
కాశా నిరతారాధిత
కీశేశా హృష్ణ గగనకేశా యీశా
*ఒక అక్షరం పెదవికి తగలనిది తరువాతి అక్షరం తగిలేది*
*అంటే పెదవి తగలనిది, తగిలేది*
దేవా శ్రీమాధవ శివ
దా వేగాభిజ్ఞ మురభిదా మాధామా
జ్యావగ వంద్యా వాసవ
సేవితపద పగవిరామ శివ జపనామా
*కేవలం నాలుక కదిలేది*
సారసనేత్రా శ్రీధర
రారా నన్నేల నిందు రాక్షసనాశా
నారద సన్నుత చరణా
సారతరానందచిత్త సజ్జనరక్షా
*నాలుక కదలని (తగలని) పద్యాలు*
కాయముగేహము వమ్మగు
మాయకు మోహింపబోకు మక్కువగ మహో
పాయం బూహింపుము వే
బాయగ పాపంబు మంకుభావమవేగా
భోగిపభుగ్వాహ మహా
భాగా విభవైకభోగ బావుకభావా
మేఘోపమాంగభూపా
బాగుగమముగావువేగ బాపాభావా
*నాలుక కదిలీ కదలని పద్యం*
ఓ తాపస పరిపాలా
పాతక సంహారా వీర భాసాహేశా
భూతపతిమిత్ర హరి ముర
ఘాతా కాలాంబుదవిధ గాత్రవరాహ్వా
🙏 *పద్య భాషాభిమానులకు జోహార్లు*.
*తెలుగు కవులకు, పద్య రచయితలకు జోహార్లు*
🙏
*అందుకే అన్నారు దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృషదేవరాయలు అన్నారు. *
🌹సేకరణ 🌹
శ్రీమద్భగవద్గీత
శ్రీమద్భగవద్గీత: ఏడవ అధ్యాయం
విజ్ఞానయోగం: శ్రీ భగవానువాచ
త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్ (13)
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా
మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే (14)
ఈ మూడుగుణాల ప్రభావంవల్ల ప్రపంచమంతా భ్రమచెంది, వాటికంటే విలక్షణుడిగా, వినాశం లేనివాడిగా నన్ను గ్రహించలేక పోతున్నది. త్రిగుణస్వరూపమైన ఈ నా దైవమాయను దాటడం సామాన్యులకు సాధ్యపడదు. అయితే నన్నే ఆశ్రయించినవాళ్ళు దానిని అతిక్రమిస్తారు.
తక్కువ, ఎక్కువ తేడా తెలియకుండానే
నాన్తరజ్ఞాః శ్రియో జాతు
ప్రియైరాసాం న భూయతే |
ఆసక్తాస్తాస్వమీ మూఢాః
వామశీలా హి జన్తవః ||
తక్కువ, ఎక్కువ తేడా తెలియకుండానే సంపద అందరికీ పంచబడుతుంది. ఎవరూ ఎక్కువ కాలం సంపదను ప్రేమించలేరు. అయితే, మూర్ఖులు సంపదను సంపాదించడానికి ఆసక్తి చూపుతారు. ఎందుకంటే, ప్రజల స్వభావం వక్రంగా ఉంటుంది కనుక.
శ్రీ దేవి - వ్యాదేశ్వర్ ఆలయం
🕉 మన గుడి : నెం 1141
⚜ మహారాష్ట్ర : గుహాగర్
⚜ శ్రీ దేవి - వ్యాదేశ్వర్ ఆలయం
💠 కొంకణ్ అనేది ప్రకృతి యొక్క అపారమైన అందాలతో నిండిన ప్రాంతం. నిరంతరం ప్రవహించే నదులు, పర్వతాల గుహల నుండి ప్రవహించే నీటి బుగ్గలు, పచ్చని దట్టమైన అడవులు, ఔషధ మూలికలు, స్వచ్ఛమైన వీచే గాలులు మరియు ఊగుతున్న పచ్చని చెట్లు - ఈ ప్రకృతి సౌందర్యం అంతా కొంకణ్ కు దేవుడు ఇచ్చిన వరం .
💠 శ్రీరామావతారం మరియు శ్రీకృష్ణావతారం తరువాత, విష్ణువు తన కల్కి వ్యక్తీకరణతో వస్తాడు.
ఈ యుగంలో, చెడు ఆలోచనలు ప్రబలంగా ఉండాల్సి ఉంటుంది కాబట్టి, దేవతలు తమ అదృశ్య రూపాల్లోనే ఉంటారు. తదనుగుణంగా శివుడు వ్యాద శివలింగంలో అదృశ్య రూపంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు.
అదే శివలింగం ఈ ప్రసిద్ధ వ్యాదేశ్వర్ మహాదేవ్
💠 శ్రీ దేవ్ వ్యాదేశ్వర్ ఆలయం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని గుహగర్ పట్టణంలో ఉన్న శివుడికి అంకితం చేయబడిన ఆలయం.
ఈ దేవతను కొంకణ్ ప్రాంతానికి చెందిన అనేక చిత్పావన్ కుటుంబాల కులదేవత (వంశ-దేవత)గా పరిగణిస్తారు.
💠 ఈ పట్టణంలో రెండు ప్రసిద్ధ హిందూ దేవాలయాలు ఉన్నాయి. గుహగర్ ఆలయంలో దుర్గా దేవి ఆలయం మరియు వ్యాదేశ్వర్ ఆలయం ఉన్నాయి.
💠 ప్రధాన ఆలయ సముదాయంలో నాలుగు అనుబంధ ఆలయాలు ఉన్నాయి.
అందువలన దీనిని పంచదేవతల ఆలయంగా మారుస్తుంది - పంచాయతన.
💠 శివుడు పరశురాముడికి దర్శనం ఇచ్చిన ప్రదేశంలో ఈ ఆలయం నిర్మించబడిందని నమ్ముతారు.
శివలింగాన్ని వ్యాద ముని ప్రతిష్టించినందున ఇక్కడ శివుడిని వ్యాదేశ్వర్ అని పిలుస్తారు.
💠 ఈ ఆలయంలో సూర్యుడు, గణేశుడు, పార్వతి మరియు విష్ణువు మరియు లక్ష్మిలకు అంకితం చేయబడిన అనుబంధ ఆలయాలు కూడా ఉన్నాయి.
ఆలయ సముదాయంలో నంది, గరుడ మరియు మారుతి విగ్రహాలు కూడా ఉన్నాయి.
💠 ఇక్కడి ఆలయ నిర్మాణ శైలిని 'పంచాయతన' అని పిలుస్తారు. పంచాయతన ఆలయంలో నాలుగు మూలల్లో నాలుగు ఉప మందిరాలు మరియు వేదిక మధ్యలో ప్రధాన మందిరం ఉన్నాయి, ఇది స్థావరాన్ని ఏర్పరుస్తుంది.
ఇక్కడ, శివుడు శ్రీ వ్యాదేశ్వర్, కేంద్ర మందిరం, సూర్యుడు, గణేశుడు, అంబ లేదా అంబిక (శివుని భార్య) మరియు విష్ణువు అతని భార్య లక్ష్మితో వరుసగా ఆగ్నేయం, నైరుతి, వాయువ్య మరియు ఈశాన్య ఉప మందిరాలుగా ఉన్నారు. నంది (శివుని వాహనం) ప్రధాన మందిరం ముందు కూర్చుని ఉంది.
🔆 *పురాణం*
💠 పరశురాముడు తన బాణాన్ని సముద్రంలోకి ప్రయోగించి, సముద్ర దేవుడిని తన బాణం దిగే వరకు నీటిని వెనక్కి తీసుకోమని ఆజ్ఞాపించి కొంకణ భూమిని సృష్టించాడు.
ఈ కొత్త భూమి సప్త-కొంకణ అని పిలువబడింది, దీని అర్థం "భూమి ముక్క", "భూమి మూల" లేదా "మూల ముక్క", ఇది సంస్కృత పదాల నుండి వచ్చింది: కోణ (कोण, మూల) + కణ (कण, ముక్క).
💠 శ్రీ పరశురాముడు కొత్తగా సృష్టించబడిన భూమిలో స్థిరపడటానికి మరియు నివాసి వంశాలను రక్షించడానికి 60 మంది ఋషులను కూడా అభ్యర్థించాడు.
శివుని భక్తుడు కావడంతో, ఆయన శివుడిని ప్రతిరోజూ కలవమని అభ్యర్థించాడు.
💠 వ్యాది మహర్షి గుహగర్‌లోని ఈ ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్టించాడు. ఆ విధంగా శివుని చిహ్నం మరియు ఆలయానికి శ్రీ వ్యాది ప్రభువు (వ్యాది ప్రభువు) అని పేరు పెట్టారు. శివుడు ఇక్కడ అదృశ్య రూపంలో ఉన్నాడని నమ్ముతారు.
💠 శ్రీ వ్యాదేశ్వర దేవత కాలక్రమేణా అదృశ్యమై, ప్రస్తుత ఆలయ నిర్మాణం నిర్మించబడిన సాకురాన్ రాజు కాలంలో తిరిగి కనుగొనబడింది.
💠 ఈ ఆలయాలను వరుసగా తల్కేశ్వర్, బాల్కేశ్వర్ (వాలుకేశ్వర్) మరియు ఉదాలేశ్వర్ (ఉద్దాలకేశ్వర్) అని పిలుస్తారు.
ఈ 3 శివ పిండిలను శ్రీ వ్యాదేశ్వర్ అవతారాలుగా భావిస్తారు.
ఈ ప్రదేశాలు గుహగర్ కు చాలా దగ్గరగా ఉండటం వలన, శ్రీ వ్యాదేశ్వర్ భక్తులు కూడా ఈ మూడు ఆలయాలను సందర్శిస్తారు.
💠 గుహగర్ పట్టణం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని చిప్లున్ నుం.డి 44 కి.మీ దూరంలో ఉంది.
రచన
©️ Santosh Kumar
18-13-గీతా మకరందము
18-13-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారిక - కర్మలు నెరవేరుటకుగల ఐదు కారణములను వచించుచున్నారు -
పఞ్చైతాని మహాబాహో!
కారణాని నిబోధ మే |
సాఙ్ఖ్యే కృతాన్తే ప్రోక్తాని
సిద్ధయే సర్వకర్మణామ్ ||
తాత్పర్యము:- గొప్ప బాహువులుకల ఓ అర్జునా! సమస్త కర్మలు నెరవేరుటకు కర్మకాండయొక్క అంతమును దెలుపు సాంఖ్యశాస్త్రమునందు చెప్పబడిన ఈ ఐదు కారణములను నావలన తెలిసికొనుము.
వ్యాఖ్య:- కృత + అన్తే = కృతాన్తే, సాంఖ్యే - అనగా కర్మకాండయొక్క అంతమును బోధించు వేదాంతశాస్త్రమందు - అని అర్థము. వేదాంతమున ఆత్మ స్వరూపమును నిర్ణయించునపుడు అది ప్రకృతికి పరమై, అతీతమైయుండునది యనియు, సమస్తకర్మలు ప్రకృతిచేతనే జరుగుచుండుననియు, ఆత్మ సాక్షిగ, నిష్క్రియముగ నుండుననియు అట తెలియజేయబడును. కనుకనే సమస్తకర్మలు అంతమగు వేదాంత శాస్త్రమున అని యిట చెప్పబడినది. మఱియు "సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే” అని చెప్పబడినందువలన కర్మలన్నియు జ్ఞానమందు లయించిపోయి, పరిసమాప్తమగుచున్నవి. ఏలయనిన, చైతన్య (ప్రజ్ఞారూప) ఆత్మస్థితియందు శరీర, ఇంద్రియ, మనస్సంకల్పాదులుండవు కావున అచట కర్మ రహితమగును. కర్మను దాటిపోయినస్థితి అది. కనుకనే ఇచట జ్ఞానమునకు, వేదాంతశాస్త్రమునకు కర్మయొక్క అంతము (కృతాంతము) అని చెప్పబడినది.
ప్రశ్న:- ఏ కర్మ అయినను జరుగవలెననిన ఎన్ని కారణములుండవలెను?
ఉత్తరము :- ఐదు.
ప్రశ్న:- వానినిగూర్చి ఎచట తెలుపబడినది?
ఉత్తరము:- కర్మయొక్క అంతమగు జ్ఞానమును బోధించు సాంఖ్య (వేదాంత) శాస్త్రమున తెలుపబడినది.
తిరుమల సర్వస్వం -269*
*తిరుమల సర్వస్వం -269*
*శ్రీవారి మొక్కుబడులు-1*
*శ్రీవారి మ్రొక్కుబడులు*
ఆపదమ్రొక్కుల వాడికి భక్తులు చెల్లించుకునే విలక్షణమైన మ్రొక్కులు, ముడుపులు ఎన్నో, ఎన్నెన్నో! ఒక్కో ముడుపుకు ఒక్కో ప్రత్యేకత.. ఒక్కో మొక్కుకు ఒక్కో పరమార్థం..
కోరిన కోర్కె నెరవేరిన తరువాత మ్రొక్కులు తీర్చుకునే వారు కొందరైతే, ముందే మ్రొక్కు తీర్చుకుని కోర్కెల చిట్టా విప్పేవారు మరికొందరు..
సంతానప్రాప్తి, శారీరక స్వస్థత, ఉన్నతవిద్య, పరీక్షల్లో ఉత్తీర్ణత, ఉద్యోగప్రాప్తి, వివాహం, పదోన్నతి, విదేశీయానం, వ్యాపారాభివృద్ధి, లాటరీ, ఎన్నికల్లో విజయం, మంత్రిపదవి, ఐశ్వర్యప్రాప్తి, పాడిపంటలు లాంటి వ్యక్తిగతమైన కోర్కెలే కాకుండా; దుర్భిక్ష నివారణ, సకాల వర్షాలు, క్రిమిసంహారం, ఉపగ్రహాల విజయవంతం, ప్రపంచశాంతి, దౌత్యవిజయం, అంతర్జాతీయ క్రీడాపోటీల్లో గెలుపు వంటి సామాజిక పరమైన కోర్కెలకు కూడా అంతే లేదు.
*ఆ కలియుగ కల్పతరువును కోరుకోవాల్సిన అగత్యం లేనేలేదు. మన హితం మనకంటే ఎక్కువగా స్వామివారికే తెలుసు. భక్తులు కోరుకున్నా, కోరుకోక పోయినా; వారికి ఎప్పుడు, ఏది అవసరమో, వారి వారి కర్మఫలాన్ని బట్టి వారు దేనికర్హులో గుర్తెరిగి అన్నీ సకాలంలో సిద్ధింప జేస్తాడు. మనం చేయవలసిందల్లా శ్రీవారిపై అపారమైన భక్తిశ్రద్ధలతో, మన కర్తవ్యాన్ని, వృత్తి ఉద్యోగధర్మాన్ని ప్రతిఫలాపేక్ష లేకుండా, గెలుపు ఓటములు కృష్ణార్పణమేనని భావిస్తూ, చిత్తశుద్ధితో నిర్వర్తించడమే.*
కానీ మానవ సహజమైన ఆరాటంతో, మనం స్వామివారిని నిరంతరంగా ఏవేవో కోర్కెలు కోరుతూనే ఉంటాం.
తలనీలాల సమర్పణ నుంచి నిలువు దోపిడి, అంగప్రదక్షిణం, తులాభారం, జోలె పట్టడం, శనివార వ్రతం, తిరుమలకు నడిచి రావడం, మెట్లను మోకాళ్ళతో ఎక్కడం వరకూ; భక్తులు సమర్పించుకునే ఎన్నో మొక్కుబళ్ళలో ముఖ్యమైన వాటిని ఈనాటి ప్రకరణంలో తెలుసుకుందాం.
*నిలువు దోపిడి*
అనుకున్న కోరిక నెరవేరితే వెంకన్న కొండకొచ్చి నిలువుదోపిడి సమర్పించుకునే సాంప్రదాయం తరతరాల నుండి ఉంది. 'నిలువుదోపిడి' అంటే మ్రొక్కుకున్న సమయంలో మన వంటి మీదున్న ఆభరణాలన్నింటినీ, తాళిబొట్టుతో సహా కోర్కె తీరిన తరువాత స్వామివారికి సమర్పించు కోవడమన్నమాట. శరీరం మీదున్న ఆభరణాలనే కాదు; మన దేహాన్ని, మనసును ఎల్లవేళలా అంటిపెట్టుకుని ఉండే అహంకారాన్ని, స్వార్థపూరిత భావనలను, అరిషడ్వార్గాలను సైతం భగవదార్పణ చేయాలి. అదే నిజమైన నిలువుదోపిడి.
సృష్టి సమస్తం దేవదేవుని సొత్తే అయినప్పుడు మనవిగా భ్రమ పడుతూ, మనం అనుభవిస్తున్న సిరిసంపదలు, భోగభాగ్యాలు మన సొంతం ఎలా అవుతాయి? ఈ ధర్మసూక్ష్మాన్ని ఆకళింపు చేసుకుని, వాటినన్నింటిని త్రికరణశుద్ధిగా స్వామివారి కర్పించడమే నిలువుదోపిడి.
శ్రీవారికి అత్యంత ఆప్తులైన హాథీరాం బావాజీ, తరిగొండ వెంగమాంబ, అన్నమాచార్యుడు, తిరుమలనంబి, అనంతాళ్వార్ అందరూ తమ సర్వస్వాన్ని స్వామి చరణాలకు 'నిలువుదోపిడి' గా అర్పించి తరించినవారే. స్వామివారికి సమర్పించు కోవడం ద్వారా కోల్పోయిన దాని కంటే కొన్ని వందల, వేల రెట్ల లబ్ధిని పొందుతామని భక్తుల విశ్వాసం. అయితే, స్వామివారు మనకు ప్రసాదించేది భౌతికమైన సాధన సంపత్తులే కానక్కర లేదు. ఆరోగ్యవంతమైన శరీరం, సంస్కారవంతులైన సంతానం, ఒత్తిడి లేని సంసారం మొదలగు వాటి నుండి పరమపద ప్రాప్తి వరకూ, ఏదైనా కావచ్చు.
'నేను', 'నాది' అనే మోహాపేక్షను త్యజించడమే 'నిలువుదోపిడి' మొక్కుబడి లోని పరమార్థం.
*అంగప్రదక్షిణం*
కోరిన కోర్కెలు తీరినవారు, తాము ముందుగా మ్రొక్కుకున్నట్లు స్వామిపుష్కరిణిలో పవిత్ర స్నానమాచరించి విమానప్రదక్షిణ మార్గంలో, తడిచిన వస్త్రాలతో పొర్లుదండాలు పెట్టడమే 'అంగప్రదక్షిణం'. ఇంతకు మునుపు వెండివాకిలికి ఎదురుగా నున్న రంగనాథుని కుడ్యప్రతిమ వద్ద మొదలై, విమానప్రదక్షిణ మార్గంలో సవ్యదిశగా సాగి, తిరిగి అదే ప్రాంతంలో పూర్తయ్యే అంగప్రదక్షిణం; ప్రస్తుతం భక్తుల రద్దీ, స్థలాభావం వల్ల బంగారుబావి వద్ద మొదలై, హుండీ వద్ద, అర్జవృత్తాకారంలో ముగుస్తోంది.
సాష్టాంగప్రమాణ మాచరించేటప్పుడు ఎలాగైతే శరీరం లోని అష్టాంగాలు భూతలాన్ని తాకుతాయో అంగప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఈ అష్టాంగాలు అలానే నేలను తాకాలి. సహజంగా ఏ అవయావల వల్లైతే పొరబాట్లు జరుగుతాయో; దేవదేవుని సమక్షంలో ఆ అవయవాలను నేలకు తాకించి, మన అహాన్ని స్వామివారికి సమర్పిస్తూ నీవే శరణమంటూ స్వామివారి చెంత చేరుతాం.
అంగప్రదక్షిణానికి సంబంధించిన విధి విధానాలను, నియమ నిబంధనలను ఇంతకు మునుపే, వేరొక ప్రకరణంలో తెలుసుకున్నాం.
*తులాభారం*
శ్రీవేంకటేశ్వరుని కృపాకటాక్షాలను సంపూర్ణంగా పొందాలంటే తప్పనిసరిగా చేయవలసింది తనను తాను సంపూర్ణంగా శ్రీవారికి సమర్పించుకోవడం. సమకాలీన ప్రపంచంలో అలా చేయడానికి అనేక పరిమితులు, ఇబ్బందులు ఉంటాయి కనుక తన శరీర పరిమాణానికి సమంగా ఉండే ద్రవ్యరాశి నేదైనా స్వామివారికి సమర్పించు కోవడమే 'తులాభారం'. ఆత్మసమర్పణా ప్రస్థానానికి తొలిమెట్టే ఈ 'తులాభారం'.
2 మ్రొక్కు తీరిన వెంటనే, ముందుగా అనుకున్న ద్రవ్యంతో స్వామివారి సన్నిధి లోనున్న త్రాసులో తూగి; ఆ ద్రవ్యాన్ని స్వామివారికి సమర్పిస్తారు. అలా సమర్పింపబడే ద్రవ్యం కలకండ, బెల్లం, ధాన్యం, పప్పుదినుసులు వంటి తినే పదార్థాల నుండి నాణాలు, కరెన్సీ నోట్లు, వెండి అచ్చులు, బంగారు నాణేల వరకూ ఏదైనా కావచ్చు. శ్రీవారి భక్తులైన రాజాధిరాజులందరూ స్వర్ణాభరణాల తోనూ, రతనాల రాశుల తోనూ తులాభారం తూగి స్వామి కృపకు పాత్రులైన వారే..
ఎందరెందరో చక్రవర్తులను తూచిన ఈ తరాజును ప్రస్తుతం సంపంగి ప్రదక్షిణమార్గం లోనున్న తిరుమలరాయ మంటపంలో చూడవచ్చు.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
