ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
22, ఏప్రిల్ 2025, మంగళవారం
వందే గోమాతరమ్*
*వందే గోమాతరమ్*
*2087*
*కం*
మానవ జీవిత మంతయు
మానితముగ గోవులుండు మహిలో నెపుడున్.
దానములో శ్రేష్ఠంబై
పానక సుధలొసగు గోవు పావని సుజనా.
*భావం*:-- ఓ సుజనా!భూలోకంలో మానవ జీవితమంతా గొప్ప గౌరవప్రదంగా గోవులు ఎల్లప్పుడూ ఉండును. దానంలో అత్యుత్తమ స్థాయి గోదానము. త్రాగడానికి అమృతము నిచ్చే గోవు ఎంతో పవిత్రమైనది.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
తరువులు పూచికాయలగు దక్కుసుమంబులు
శు భో ద యం 🙏
"తరువులు పూచికాయలగు దక్కుసుమంబులు పూజగాభవ
చ్చరణము సోకిదాసులకు సారములో ధనధాన్యరాశులై
కరిభట ఘోటకాంబర నికాయములై విరజా సము
త్తరణ మొనర్చుజిత్రమిది దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 102 ॥"
ఉన్నప్పుడు విలువెరుగక
*2086*
*కం*
ఉన్నప్పుడు విలువెరుగక
మన్నునబడిపోయినంత మన్ననలెరుగన్
ఖిన్నము మాత్రమె మిగులును
చిన్నగ ననపించు నిజము చిత్రము సుజనా.
*భావం*:-- ఓ సుజనా! ఉన్నంతకాలం విలువలు ఎరుగక చనిపోయిన తరువాత వారి ఔన్నత్యం తెలుసుకోవడం వలన వేదన మాత్రమే మిగులుతుంది. చిన్న విషయం గా కనిపించే ఈ నిజం చాలా చిత్రమైనది.
*సందేశం*:-- సాధారణంగా తల్లిదండ్రులు ఉన్నంతవరకూ వారి విలువలు తెలియవు. వారు గతించిన తరువాత ఎంత బాధపడిననూ వేదన మాత్రమే మిగులుతుంది. ఇదే చిన్న గా కనబడే పెద్ద విషయం అని అప్పటి వరకూ బోధపడదు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
రామాయణం
🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹
*🍁మంగళవారం 22 ఏప్రిల్ 2025🍁*
*రామాయణం*
ఒకసారి చదివినంత మాత్రాన
మన సమస్త పాపాలని తీసేస్తుంది...
*వాల్మీకి రామాయణం*
*16వ భాగం*
పశ్చిమ దిక్కున విశ్వామిత్రుడు మహోగ్రమైన తపస్సు చెయ్యడం మొదలుపెట్టాడు.
అదే కాలంలో అయోధ్య నగరాన్ని అంబరీషుడనే రాజు పరిపాలన చేస్తుండేవాడు. ఆయన అశ్వమేథ యాగం చేసి వదిలిపెట్టిన గుర్రాన్ని ఇంద్రుడు తీసుకెళ్ళిపోయాడు.
“అశ్వం దొరకకపోతే తనకి మంచి జరగదు” అని మహర్షులు చెప్పారు. “కాని అశ్వానికి బదులుగా ఒక మనుష్యుడిని తీసుకువస్తే యాగాన్ని పూర్తిచెయ్యచ్చు”అన్నారు. అది కూడా న్యాయంగా తీసుకురావాలన్నారు.
ఒక మనిషిని తీసుకురావడం కోసం అంబరీషుడు బయలుదేరగా ఒక చోట, భృగుతుంగమనే ఒక పర్వత శిఖరం మీద, ఋచీకుడనే ఒక ఋషి భార్య, పిల్లలతో కూర్చుని ఉన్నాడు.
అప్పుడు ఆ అంబరీషుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన యాగాశ్వం అపహరణకి గురైనందుకుగాను నాకు ఒక యాగపశువు కావాలి, మీకు ఉన్న పిల్లలలో ఒకడిని ఇచ్చి నన్ను అనుగ్రహించండి” అన్నాడు.
అప్పుడా ఋచీకుడు ఇలా అన్నాడు… “పెద్దకొడుకు ధర్మసంతానం(పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని పెద్ద కొడుకుగా ఇస్తారు) కావున నేను వాడిని ఇవ్వలేను, శాస్త్రం ప్రకారం చిట్టచివరి వాడిని ఇస్తే ఐశ్వర్యం పోతుందన్నారు. అప్పుడు మధ్య కొడుకైన శునఃశేపుడు అంబరీషుడితో వస్తానన్నాడు.
రాజు బతికుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బతకాలంటే యాగం పూర్తవ్వాలి, యాగం పూర్తి చెయ్యడానికి తన కొడుకుని పంపాడు ఆ ఋచీకుడు.
అంబరీషుడు ఆయనకి లక్ష గోవుల్ని దానంగా ఇచ్చాడు. శునఃశేపుడిని తీసుకెళుతున్న అంబరీషుడు కొంతదూరం ప్రయాణించాక విశ్రాంతి తీసుకుందామని ఒక చోట ఆగాడు. అప్పుడు అక్కడకి దగ్గరలో ఉన్న విశ్వామిత్రుడి ఆశ్రమాన్ని శునఃశేపుడు చూశాడు.
వెంటనే ఆశ్రమంలోకి వెళ్ళి విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడి ఇలా అన్నాడు “నేను నీ అక్కయ్య కొడుకుని, మీరు నాకు మేనమామ అవుతారు. పెద్దవాడిని నాన్నగారు ఇవ్వనన్నారు, ఆఖరివాడిని మా అమ్మ ఇవ్వననింది, మధ్యలో పుట్టినందుకు నన్ను యజ్ఞపశువుగా ఇచ్చేసారు. నాకు దీర్ఘకాలం బ్రతికి తపస్సు చేసి స్వర్గలోకం పొందాలని ఉంది. కాబట్టి మీరు నన్ను రక్షించాలి” అని అన్నాడు.
అప్పుడు విశ్వామిత్రుడు… “సరే!” అని తన కొడుకులని పిలిచి, “తండ్రి మాట విని పాటించేవాడు కదా కొడుకంటే, మీలో ఎవరన్నా ఈ శునఃశేపుడి స్థానంలో యాగపశువుగా వెళ్ళండి” అన్నాడు.```
*కథం ఆత్మ సుతాన్ హిత్వా త్రాయసే అన్య సుతం విభో |*
*అకార్యం ఇవ పశ్యామః శ్వ మాంసం ఇవ భోజనే ||*```
“నీ కొడుకుని నువ్వు యాగపశువుగా పంపిస్తావా, ఇంకొకడి కొడుకుని రక్షిస్తావా, మీరు చెప్పిన ధర్మం కుక్క మాంసం తిన్నట్టు ఉంది” అని విశ్వామిత్రుడి కొడుకులన్నారు.
ఆగ్రహించిన విశ్వామిత్రుడు....```
*శ్వ మాంస భోజినః సర్వే వాసిష్ఠా ఇవ జాతిషు |*
*పూర్ణం వర్ష సహస్రం తు పృథివ్యాం అనువత్స్యథ ||*```
“మీరు కూడా వశిష్ఠుడి కుమారుల జాతిలో పుట్టి వెయ్యి సంవత్సరాలు వాళ్ళలాగ కుక్క మాంసం తింటూ బతకండ”ని శపించాడు.
అప్పుడాయన శునఃశేపుడితో.... “నువ్వు బెంగపెట్టుకోమాకు, నిన్ను తీసుకెళ్ళి యూప స్తంభానికి కడతారు. ఇప్పుడు నేను నీకు రెండు మంత్రాలని చెప్తాను, నిన్ను అలా యూప స్తంభానికి కట్టినప్పుడు నువ్వు ఆ రెండు మంత్రాలని జపించు, అలా జపించడం వల్ల ఇంద్రుడు సంతోషించి, నిన్ను బలి ఇవ్వకముందే వచ్చి, ‘నేను ఈ యాగానికి ప్రీతి చెందాను’ అని యాగ ఫలితం ఇస్తాడ”ని చెప్పి ఆ రెండు మంత్రాలని ఉపదేశం చేసి పంపించాడు.
తరవాత శునఃశేపుడిని యూప స్తంభానికి కట్టారు, అప్పుడాయన విశ్వామిత్రుడు చెప్పిన మంత్రాలని జపించగా ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి, “నేను ఈ యాగానికి సంతోషించాను, మీరు యాగపశువుని బలి ఇవ్వకుండానే మీకు కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తున్నాను” అన్నాడు.
అందరూ సంతోషించారు. కోపంలో తన కొడుకులని శపించానని విశ్వామిత్రుడు బాధ పడ్డాడు. ఈ సారి ఎవరితో మాట్లాడకుండా తపస్సు చేస్తానని మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చెయ్యడం ప్రారంభించాడు.
అలా కొంతకాలం అయ్యాక విశ్వామిత్రుడు స్నానం చేద్దామని పుష్కర క్షేత్రానికి వెళ్ళగా మేనక కూడా అక్కడే స్నానం చేస్తూ కనిపించింది. మేఘాల మధ్య మెరుపు వస్తే ఎలా ఉంటుందో మేనక కూడా అలా ఉంది. ఆ మేనక సౌందర్యాన్ని చూసిన విశ్వామిత్రుడు ముగ్ధుడైనాడు.
“మేనక! నేను నీయందు కందర్ప వశుడనయ్యాను(అంటె మన్మధ ఆవేశం కలిగింది), అందుకని నువ్వు నా ఆశ్రమానికి వచ్చి నా కోరిక తీర్చు” అన్నాడు.
మేనక “సరే” అనంది. అలా మేనకతో క్రీడిస్తూ క్రీడిస్తూ పదేళ్ళు గడిచిపోయాయి.```
*సర్వం సురాణాం కర్మ ఏతత్ తపో అపహరణం మహత్ |*
*అహో రాత్రా అపదేశేన గతాః సంవత్సరా దశ ||*```
పది సంవత్సరాల తరువాత విశ్వామిత్రుడికి అసలు తను ఎందుకు రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడో గుర్తొచ్చింది. ‘ఈ మేనకతో ఏదో, ఒక రోజు లేకపోతే రెండు రోజులు అనుకున్నాను, కాని ఇలా పది సంవత్సరాలు గడిచిపోతాయి అనుకోలేదు. నా మనస్సుని దేవతలు వక్రీకరించడానికి ఈ మేనకని పంపారు’ అనుకొని కోపంగా మేనక వైపు చూశాడు, కాని ఇంతలోనే శాంతించి, ఇందులో నీ తప్పేముంది అని మేనకని వెళ్ళిపోమన్నాడు.
ఈ సారి ఇంకా జాగ్రత్తగా తపస్సు చెయ్యాలని ఉత్తర దిక్కుకి వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాడు.
*రేపు... 17వ భాగం*
*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*
*🙏జై జై శ్రీ రామ్.!🙏*
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏
22, ఏప్రిల్, 2025🌹* *దృగ్గణిత పంచాంగం*
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🍁మంగళవారం🍁*
*🌹22, ఏప్రిల్, 2025🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - వసంత ఋతౌః*
*చైత్ర మాసం - కృష్ణపక్షం*
*తిథి : నవమి* సా 06.12 వరకు ఉపరి *దశమి*
*వారం : మంగళవారం* ( భౌమవాసరే )
*నక్షత్రం : శ్రవణం* మ 12.44 వరకు ఉపరి *ధనిష్ఠ*
*యోగం : శుభ* రా 09.18 వరకు ఉపరి *శుక్ల*
*కరణం : తైతుల* ఉ 06.41 *గరజి* సా 06.12 ఉపరి *వణజి*
*సాధారణ శుభ సమయాలు:*
*- ఈరోజు లేవు -*
అమృత కాలం : *రా 01.59 - 03.33*
అభిజిత్ కాలం : *ప 11.41 - 12.31*
*వర్జ్యం : సా 04.38 - 06.11*
*దుర్ముహూర్తం : ఉ 08.19 - 09.09 రా 10.57 - 11.43*
*రాహు కాలం : మ 03.15 - 04.50*
గుళికకాళం : *మ 12.06 - 01.41*
యమగండం : *ఉ 08.57 - 10.31*
సూర్యరాశి : *మేషం*
చంద్రరాశి : *మకరం/కుంభం*
సూర్యోదయం :*ఉ 05.48*
సూర్యాస్తమయం :*సా 06.24*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 05.49 - 08.19*
సంగవకాలం :*08.19 - 10.50*
మధ్యాహ్న కాలం : *10.50 - 01.22*
అపరాహ్న కాలం : *మ 01.22 - 03.53*
*ఆబ్ధికం తిధి : చైత్ర బహుళ నవమి*
సాయంకాలం : *సా 03.53 - 06.24*
ప్రదోష కాలం : *సా 06.24 - 08.41*
రాత్రి కాలం : *రా 08.41 - 11.43*
నిశీధి కాలం :*రా 11.43 - 12.28*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.16 - 05.02*
--------------------------------------------------
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను సంరక్షించండి_* 🐄
*🚩IIజై పవన పుత్ర హనుమాన్II🚩*
*ఆంజనేయ విభవే కరుణా కరాయ॥*
*పాప త్రయోప శమనాయ భవౌషధాయ॥*
*తృష్ణాది వృశ్చిక జలాగ్ని పిశాచ రోగ ॥*
*క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే!!*
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
కఫం హరించుటకు
కంఠం మరియు రొమ్ములలో ఏర్పడిన కఫం హరించుటకు రహస్య యోగం -
ఆవాలు ,పచ్చిపసుపు , ఇప్పపూలు ఈ వస్తువులు సమానంగా తీసుకుని కలిపి కొంచెం నీళ్లతో మర్దించి రొమ్ము పైన , కంఠం పైన పట్టు వేయచుండిన గొంతు మరియు రొమ్ముల (చెస్ట్ )లో ఏర్పడిన కఫం కరిగి బయటకి వెడలును .
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
. ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
. కాళహస్తి వేంకటేశ్వరరావు
. అనువంశిక ఆయుర్వేద వైద్యులు
. 9885030034
ఆస్తులు ఇద్దాం!!?
ఆస్తులు ఇద్దాం!!?
డా ప్రతాప్ కౌటిళ్యా 👏 సునీతా ప్రతాప్.
భావితరాలకు భారీ యంత్రాలు
ఆస్తులు అంతస్తులు ఇస్తున్నాం!!
కానీ
ప్రాణవాయువునిద్దాం!
మంచినీటిని ఇద్దాం!!
మంచి మట్టిని ఇద్దాం!!?
భూములు కొందాం
ఇళ్లను నిర్మిద్దాం కాదు
చెట్లను పెంచుదాం!!
భూములు కొందాం
పరిశ్రమలు కాదు
చెరువులు నిర్మిద్దాం!!
భూములు కొందాం
పంటలు పండిద్దాం!
భూములు కొందాం
మట్టిని రక్షిద్దాం!!
ఊరికి ఒకరం -
అడవి -చెరువు -మట్టిని- సృష్టిద్దాం
దానం చేద్దాం !!
భావితరాలను ధనవంతులను చేద్దాం!!
తరతరాలకు తరగని ఆస్తులను
ఇద్దాం
మంచి గాలినిద్దాం!
మంచి నీటిని ఇద్దాం!!
మంచి మట్టినిద్దాం!!
మన అమ్మ భూగోళాన్ని రక్షిద్దాం!!?
నటి రేణు దేశాయ్ మాట స్ఫూర్తితో
డా ప్రతాప్ కౌటిళ్యా 👏 సునీతా ప్రతాప్.
అవయవాలు ఎప్పుడు చెడిపోతాయో తెలుసా
మన అవయవాలు ఎప్పుడు చెడిపోతాయో తెలుసా
కళ్ళు - చీకట్లో మొబైల్ ఎక్కువగా చూడటం
A
చెవులు - హెడ్ ఫోన్స్ ఎక్కువ శబ్దంతో వినడం
మెదడు - తగినంత నిద్ర లేకపోవడం, ఒత్తిడి
+
గుండె - ఆహారంలో ఎక్కువ ఉప్పు తినటం -
కాలేయం - ఫాస్ట్ ఫుడ్స్, మద్యం తీసుకోవటం
ఊపిరితిత్తులు - పొగ త్రాగటం
కడుపు - ఎక్కువసేపు ఆకలితో ఉండటం
కిడ్నీలు - నీళ్లు తగినంత తాగకపోవడం
9.3K
1
జీర్ణాశయం - ఎక్కువ తీపి పదార్థాలు తినటం
పేగులు - ఎక్కువ కారం, మసాలాలు తినటం
ఎముకలు - కాఫీ, టీలు ఎక్కవగా తాగటం
Dislik
సమస్యకు నా పూరణ.
[ *కోకిలొక్కటి కావు కావని గొంతు విప్పె నుగాదికిన్*
ఈ సమస్యకు నా పూరణ.
లోకమంతయు వెల్గులీనదె రూఢిగా నవకమ్ముగన్
మాకు నిచ్చును వత్సరంబని మంచి గోరుచు పల్కగా
కోకిలొక్కటి - కావు కావని గొంతు విప్పె నుగాదికిన్
చీకటుల్ కొలువుండె నాకని చిత్తమున్ చెడి కాకమున్.
అల్వాల లక్ష్మణ మూర్తి.
*సున్నకుc బుట్టినట్టి యరసున్న గనంబడదేమి చోద్యమో*
ఈ సమస్యకు నా పూరణ.
సున్నయె తండ్రికిన్ చదువు శూన్యమె జీవనకార్యమందునన్
మన్నికయైన దొక్కపని మాటకు మాత్రము గుర్తులేదయో
ఎన్నడు వాని పుత్రునిని నెక్కడనైనను చూడకుంటిమే
సున్నకుc బుట్టినట్టి యరసున్న గనంబడదేమి చోద్యమో.
అల్వాల లక్ష్మణ మూర్తి.
*ఆన్ లైన్ వ్యామోహం
*ఆన్ లైన్ వ్యామోహం కమ్మేస్తుంది...*
నేడు ప్రపంచీకరణ కాస్త
పరాయితనాన్ని కట్టబెడుతుంది
రెండూ కలిసి మెలిసి జీవిస్తూ
మార్కెట్లో మనిషిని నమ్మకానికి పెట్టాయి...
ఆన్ లైన్ వ్యామోహం కమ్మేస్తుంది
అనవసరపు వస్తువు ఇంట్లో చేరుతుంది
తాహతుకు మించి దర్శనమిస్తూ
మనిషిని దరిద్రునిగా మారుస్తుంది..
తనువంతా చుట్టుకున్న ఈ ముళ్ళకంప
మనిషి రెక్కలను నరుక్కుంటూ
మనిషిని జీవచ్ఛవంగా మార్చుకుంటూ
సమాజంలో నగ్నంగా నిలబెట్టాయి...
వస్తువు దగ్గరికి మనం వెళ్లడం లేదు
మన కంటి చూపుల్ని ప్రసరించం
అందమైన ఫోటోలకు ఆకర్షితులై
బేరంలేని వ్యాపారంలో మునిగిపోయాం...
అవసరం కోసం కొనడం మానేశాం
ఆధిపత్యం కోసం వస్తువులను కొంటున్నాం
మనల్ని మనం అమ్ముకుంటూ
గొప్ప జీవితాన్ని కొంటున్నారు....
అప్పు చేయడమే నేడు గౌరవంగా
బ్యాంకి లావాదేవీల్లో చిలుకగా
రుణభారాన్ని మోసుకుంటూ తిరుగుతూ
అదేదో గొప్పతనం అని అనుకుంటున్నాం...
పొగొట్టుకున్నది వెతుక్కోవడంలోనే
పచ్చని బతుకు తెల్లారిపోతుంది
ఆశల సముద్రంలో చిక్కుకొని
జీవిత ఒడ్డుకు చేరలేక సగంలోనే ముగుస్తుంది..
కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235
పృథ్వి విలాపం ""
సందర్భం :ఏప్రియల్..22... ధరిత్రి దినోత్సవం
శీర్షిక :
"" పృథ్వి విలాపం ""
పంచభూతాలైన నీరు, నిప్పు, నింగి, గాలి, మట్టిలను
తన స్వార్ధపు పెనుభూతానికి తాకట్టుపెట్టి
పంచభూతాలనూ కలుషితం చేస్తున్నాడు
ప్రకృతిని వికృతిగా మార్చి
పుడమితల్లికి గర్భశోకాన్ని మిగుల్చుతున్నాడీ మానవుడు!
కన్నతల్లి కడ వరకే మోసేది
పుడమితల్లి కట్టే కాలే వరకూ మోస్తుంది
కట్టెను కాల్చేందుకు ఉపకరిస్తుంది!
అధిక ఆహరోత్పత్తి కై.
రసాయనిక ఎరువులను అధికంగా వాడుతూ
కన్పించే ప్రతి జాగా లో అపార్టుమెంట్లను నిర్మిస్తూ
పృథ్విమాత గుండెల్లో గునపాల్ని గుచ్చుతూ
హరితవర్ణాన్ని అదృశ్యపరుస్తూ
జీవరాసుల మనుగడను ప్రశ్నర్ధకం చేస్తూ
కూర్చున్న కొమ్మను నరుక్కుంటూ
తన వేలితో తన కంటినే పొడుచుకుంటూ
ఉన్న చూపును కోల్పోతున్నాడు
ముందుచూపు అసలే లేక
దూరాలోచన చేయక
దురాలోచనలతో వడి వడి గా
అడుగులేస్తూ
నడిచే దారిని ముళ్లమయం చేస్కుంటున్నాడు
కన్నీటి వరదను ప్రవహింప చేస్తున్నాడు!
జీవితాంతం కాపు కాసే పుడమితల్లిని
కన్నతల్లి కన్నా మిన్నగా కాపాడుకుందాం
అడగకున్నా అన్నీ ఇచ్చే ఆమనిని. అక్కున చేర్చుకుందాం!
............................................రచన : డాక్టర్.
ఆళ్ల నాగేశ్వరరావు( కమల శ్రీ)
శివానందలహరి – శ్లోకం – 91 *
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*శ్రీ ఆదిశంకరాచార్య విరచితం*
*శివానందలహరి – శ్లోకం – 91 *
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*ఆద్యాఽవిద్యా హృద్గతా నిర్గతాసీ-*
*ద్విద్యా హృద్యా హృద్గతా త్వత్ప్రసాదాత్ ।*
*సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం*
*భావే ముక్తేర్భాజనం రాజమౌళే ॥ 91 ॥*
చంద్రశేఖరా! నీ అనుగ్రహము వలన అనాదిగా నా హృదయమందున్న అజ్ఞానము నాశనమాయెను. హృద్యమైన (అందమైన, మనోహరమైన) జ్ఞానము హృదయమున ఉన్నది. అనుదినమూ శ్రీకరమూ, మోక్షప్రదమూ అగు నీ పాదపద్మములను నేను మనస్సున ధ్యానించుచున్నాను.
శంకరులు త్రికరశుద్ధిగా శివుని సేవించమంటూ, మనస్సుద్వారా చేయవలసిన శివపాదపద్మ ధ్యానము ఉపదేశిస్తున్నారు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
శ్రీ ధర్మశాస్త సేవాసమితి 🐆 విజయవాడ 🏹 7799797799
అందమైన పూల మొక్కలు
🙏🕉️శ్రీమాత్రే నమఃశుభోదయం 🕉️🙏 🔥 *నేడు నీవు అందమైన పూల మొక్కలు నాటి వాటి నుండి భవిష్యత్తులో మధుర ఫలాలను ఆసించడం ఎంత తప్పో..విలువైన సమయాన్ని ఖాళీగా కూర్చుని కాలయాపన చేస్తూ పగటి కలలు కంటే రేపు నీవు బంగారు భవిష్యత్తుని ఆశించడం ప్రయోజనం శున్యం అందుకే చేసే పనిని పట్టుదలతో చేసి అనుకున్నది సాధించు* 🔥జీవితమనేది ఒక పెద్ద గ్రంథం.. అందులో కొన్ని పుటలు చాలా అందం గాను, సంతోషం గాను, కొన్ని పుటలు బాధ గాను, కొని అశాంతి గాను ఉండవచ్చు.. కానీ తరువాత పేజీలో ఏముందో అని భయపడి పేజీ తిప్పడం మానేస్తే మిగిలేది శున్యం..*మన జీవితానికి ఒక ఉద్దేశం మరియు ఒక లక్ష్యం ఉంటే కానీ ఆది జీవితం అనిపించుకోదు*..ఆశించినంత చేయలేక పోవడం, చేయలేనంత ఆశించడం రెండు తప్పే.. మొదటిది నీలోని అసమర్థతను బయట పెడితే.. రెండవది నీలోని భయాన్ని బయట పెడుతుంది🔥జీవితం చాలా చిన్నది.. కాలం చాలా వేగమైనది.. రీప్లే మరియు రివైండ్ కు తావులేదు..జీవితంలో బాగుపడాలనుకుంటే ఆ వ్యక్తి అతినిద్ర, సోమరితనం, భయం, కోపం, పనిలో అలసత్వం అనే ఐదు దుర్గణాలను వదులుకోవాలి..ధనం దుబరా చేసే వారికంటే, కాలాన్ని వృధా చేసే వారే ఎక్కువ నష్టపోతారు🔥 *జీవితం కేవలం జీవించడానికే కాదు..మంచిగా బాగా జీవించడానికి.. జీవితంలో శక్తివంతమైన ఆయుధాలు సమయం, సహనం మరియు ధైర్యం.. వాటిని సక్రమముగా వినుయోగించుకుంటే గెలుపు నీ సొంతం*🔥🔥మీ *అల్లంరాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్& జనరల్ ఏజన్సీస్ D . N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంకు ఎదురుగా రాజమహేంద్రవరం వైద్య సలహాలు ఉచితం మందులు అయి పోయిన వారు లేదా లేదా కొత్తవారికి రాలేని వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 94408935930.0883.2479577.9182075510* 🙏🙏🙏
శ్రీమద్భగవద్గీత
శ్రీమద్భగవద్గీత: నాల్గవ అధ్యాయం
జ్ఞానయోగం: శ్రీ భగవానువాచ
శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే(33)
తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః (34)
అర్జునా... ద్రవ్యం వల్ల సాధించబడే యజ్ఞం కంటే జ్ఞానయజ్ఞం శ్రేష్ఠం. సమస్తకర్మలూ జ్ఞనంలోనే పరిసమాప్తం కావడం దీనికి కారణం. తత్వవేత్తలైన జ్ఞానులు అలాంటి జ్ఞానం నీకు ఉపదేశిస్తారు. వారి వద్దకు వెళ్ళినప్పుడు వినయవిధేయతలతో నమస్కరించి, సమయం సందర్భం చూసి ప్రశ్నించి, సేవలు చేసి తెలుసుకో.
సుభాషితమ్
💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
*కం* 𝕝𝕝 *పాలింపుము శేముషి ని*
*న్మూలింపుము కర్మబంధముల సమదృష్టిన్*
*జాలింపుము సంసారముఁ*
*గీలింపుము హృదయ మందుఁ గేశవభక్తిన్."*
*భావము:- మంచి మనస్సుతో మరొకసారి ఆలోచించు; కర్మ బంధాలను త్రెంచివెయ్యి; భేదభావం లేకుండా చక్కని సమదృష్టి అలవరచుకో; నిరంతంరం మనసంతా మాధవునిపై లగ్నం చెయ్యుము.”*
✍️🌹🌸💐🙏
⚜ శ్రీ చౌసత్ యోగిని ఆలయం
🕉 మన గుడి : నెం 1088
⚜ మధ్యప్రదేశ్ : భేదాఘాట్
⚜ శ్రీ చౌసత్ యోగిని ఆలయం
💠 ప్రస్తుతం భారతదేశంలో 4 చౌసత్ యోగిని దేవాలయాలు ఉన్నాయి, వాటిలో రెండు ఒరిస్సాలోని హీరాపూర్ మరియు రాణిపూర్ వద్ద ఉన్నాయి మరియు మిగిలిన రెండు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి.
💠 మధ్యప్రదేశ్ యోగిని దేవాలయాలు - ఒకటి ఖజురహోలో మరియు మరొకటి జబల్పూర్‌లోని భేదాఘాట్‌లో ఉన్నాయి.
💠 భేదాఘాట్‌లోని 64 యోగిని దేవాలయాలు ఈ నాలుగింటిలో అతిపెద్దవిగా పరిగణించబడతాయి. ఖజురహో యోగిని దేవాలయాలు ప్రధాన పశ్చిమ దేవాలయాల సమూహం మరియు తూర్పు దేవాలయాల సమూహంలో భాగం కావు. ఇది విడిగా ఉంది కాబట్టి వాటిని సందర్శించడానికి ప్రత్యేక సందర్శన అవసరం.
💠 భేదాఘాట్‌లోని చౌసత్ యోగిని ఆలయం ఒక ప్రసిద్ధ వారసత్వ పర్యాటక ఆకర్షణ. భేదాఘాట్‌లో చూడవలసిన మూడు ముఖ్యమైన ప్రదేశాలలో, ఇది వాటిలో ఒకటి.
💠 చౌసత్ యోగిని ఆలయం దాని గొప్ప సాంస్కృతిక నేపథ్యాన్ని కనుగొనవచ్చు.
"యోగిని" అంటే అధికారికంగా యోగా సాధన చేసే స్త్రీ లేదా హిందూ మతం మరియు బౌద్ధమతం రెండింటిలోనూ ఆధునిక జ్ఞానోదయం పొందిన మహిళా ఆధ్యాత్మిక గురువులకు ఉపయోగించే పదం.
💠 ప్రత్యామ్నాయంగా, "యోగిని" పార్వతి దేవి యొక్క పవిత్ర స్త్రీ శక్తిగా కూడా పరిగణించబడుతుంది. భారతదేశంలోని యోగిని దేవాలయాలలో ఎనిమిది మాతృకలు లేదా అరవై నాలుగు యోగినిలుగా వారిని గౌరవిస్తారు.
కొన్ని ప్రదేశాలలో, యోగినిలను రహస్య ఆరాధన అనుచరులుగా పరిగణిస్తారు. చాలా శక్తివంతంగా పరిగణించబడే యోగినిలను తరచుగా విధ్వంసం కలిగించగల మంత్రగత్తెలుగా పరిగణిస్తారు. అందువల్ల వాటిని చర్చించేటప్పుడు ఒక రహస్యం మరియు విస్మయం ఉంటుంది. పర్యాటకులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు.
💠 చౌసత్ యోగిని ఆలయం
భారతదేశంలోని పురాతన వారసత్వ ప్రదేశాలలో ఒకటైన చౌసత్ యోగిని ఆలయం జబల్పూర్ లోని ఒక కొండపై ఉంది. ఈ ఆలయం 10వ శతాబ్దంలో కల్చురి రాజవంశం పాలనలో నిర్మించబడింది మరియు ప్రధానంగా స్థానిక గ్రానైట్ తో నిర్మించబడింది. తరువాత మొఘల్ దండయాత్రలు ఈ అందమైన విగ్రహాలను ధ్వంసం చేసి వికృతీకరించారు
💠 ఈ ఆలయం దుర్గాదేవితో పాటు 64 మంది యోగినిలు లేదా శక్తుల నివాసం, దేవత యొక్క వివిధ రూపాలుగా పరిగణించబడుతుంది.
ఆలయం పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ, ఇది జబల్పూర్‌ను పాలించిన పురాతన రాజవంశాల గురించి గొప్పగా మాట్లాడుతుంది.
💠 మహమ్మద్ గౌరీ భారత ఖండంలోని దేవాలయాలను నాశనం చేస్తున్నప్పుడు, అతను దాదాపు 11వ శతాబ్దంలో జబల్పూర్‌కు కూడా చేరుకున్నాడు.
అతను తన మత విశ్వాసం మరియు డబ్బు కారణంగా ఈ ఆలయాన్ని నాశనం చేస్తున్నాడు.
అతను అన్ని యోగిని విగ్రహాలను ధ్వంసం చేశాడు, కానీ అతను నంది ఎద్దుపై కూర్చున్న శంకర్ మరియు పార్వతి కేంద్ర ఆలయానికి వెళ్ళినప్పుడు తేనెటీగల దాడి కారణంగా నాశనం చేయలేకపోయాడు. అప్పుడు అతను దేవుని శక్తిని గ్రహించి ఇక్కడి నుండి వెళ్ళిపోయాడు.
💠 శివుడు మరియు పార్వతి యొక్క ప్రధాన విగ్రహం 2000+ సంవత్సరాల నుండి పూజించబడుతున్నట్లు నమోదు చేయబడింది
💠 ఈ ఆలయంలో శివుడు మరియు పార్వతి నందీశ్వరునిపై కూర్చుని ఉన్న రాతి విగ్రహం ఉంది.
ఇటువంటి చిత్రం మిగతా భారతదేశంలో చాలా అరుదుగా కనిపిస్తుంది.
💠 శివుని ఆలయంలో చాలా వరకు, మనం ఒంటరిగా శివుడిని కనుగొనవచ్చు.
ఇటువంటి చిత్రం మిగతా భారతదేశంలో చాలా అరుదుగా కనిపిస్తుంది.
💠 ఈ ప్రదేశం 100 సంవత్సరాల క్రితం వరకు తాంత్రిక పద్ధతులకు చాలా చురుకుగా ఉండేది. కానీ ఇప్పుడు అది నిషేధించబడింది.
💠 మన పాత పార్లమెంట్ భవనం డిజైన్ ఈ గుండ్రపు గుండ్రని ఆకారంపై ఆధారపడి ఉంటుందని నమ్ముతారు.. నిజానికి ఇవి రెండు ఒకేలా ఉంటుంది.
💠 ఆలయ ప్రాంగణం 84 చదరపు స్తంభాలను కలిగి ఉంటుంది మరియు 81 గదుల అమరిక మరియు 3 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి, రెండు పశ్చిమాన మరియు ఒకటి ఆగ్నేయంలో ఉన్నాయి.
💠 ఈ ఆలయంలో 64 యోగిని విగ్రహాలు కాదు, 81 ఉన్నాయని చెబుతారు. యోగిని విగ్రహాలు ఆలయం చుట్టుపక్కల ఉన్న గదులలో ఉన్నాయి.
కొన్ని విగ్రహాలు పూర్తిగా వికృతంగా మారడంతో ఈ విగ్రహాలన్నీ కాల వినాశనాన్ని భరించాయి మరియు మరికొన్నింటిలో, విగ్రహాలలో ఎక్కువ భాగం కనిపించలేదు.
💠 ఆలయం మధ్యలో గౌరీ శంకర్ ఆలయం ఉంది. గౌరీ-శంకర్ ఆలయం దాదాపు రెండు శతాబ్దాల తరువాత నిర్మించబడింది; బహుశా 1155లో రాణి అల్హనాదేవి (ఒక శిలాఫలకంపై ఒక శాసనం కనుగొనబడింది) నిర్మించబడింది.
💠 ఈ ఆలయానికి జబల్పూర్ నగరం నుండి 25 కిలోమీటర్ల దూరం
రచన
©️ Santosh Kumar
16-23-గీతా మకరందము
16-23-గీతా మకరందము
దైవాసురసంపద్విభాగయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారిక - ఈ ప్రకారముగ (శాస్త్రాదేశము ననుసరించి) వర్తింపక తన యిష్టము వచ్చినట్లు ప్రవర్తించినచో మనుజుడు ఉన్నతిని పొందలేడని వచించుచున్నారు –
యశ్శాస్త్రవిధిముత్సృజ్య
వర్తతే కామకారతః |
న స సిద్ధిమవాప్నోతి
న సుఖం న పరాం గతిమ్ ||
తాత్పర్యము:- ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచిపెట్టి తనయిష్టమువచ్చినట్లు ప్రవర్తించునో, అట్టివాడు పురుషార్థసిద్ధినిగాని, సుఖమునుగాని, ఉత్తమగతియగు మోక్షమునుగాని పొందనేరడు.
వ్యాఖ్య:- వారివారి యిష్టమువచ్చినట్లు ఆచరించుటయనునది (స్వేచ్ఛాప్రవర్తన) ఈ శ్లోకమున ఖండింపబడినది. ఒక్కొక్కరు వారివారికి తోచిన పద్ధతిననుసరించుచు అదియే సరియైనదని వాదించుట పొరపాటు. ఒకరుచేయు అనుష్ఠానము సరియైనదా కాదా యని పరీక్షించుటకు శాస్త్రప్రమాణము ఆవశ్యకమై యున్నది. వారివారి యనుభవములు శాస్త్ర ప్రమాణము ననుసరించియున్నవా? యని పరీక్షించుకొనుచుం డవలెను. అద్దానికి తన యనుభవము సరిపోయినచో అపుడు తనది సరియైనమార్గమని, సిద్ధాంతమని నిర్ణయించుకొనవచ్చును. శాస్త్రవాక్యములు అనుభవజ్ఞులగు మహర్షులయొక్క నిర్ణయములు గనుకను, భగవదాశయములే గనుకను, వానినెవరును ఉల్లంఘింపరాదు. కనుకనే వాని నుల్లంఘించి వర్తించువారు మోక్షమును బడయలేరని, సుఖమును పొందజాలరని శ్రీకృష్ణమూర్తి ఇచట ఆనతిచ్చుచున్నారు. కాబట్టి విజ్ఞులెల్లరు శాస్త్రాదేశము ననుసరించియే ప్రవర్తించవలెను. దీనినిబట్టి సుఖమునుగాని, మోక్షమునుగాని వాంఛించువాడు శాస్త్రోక్తవిధిప్రకారము చక్కగ అనుష్ఠానమును శీలించవలెనని తెలియుచున్నది.
ప్రశ్న:- మనుజుడు తన యనుష్ఠానమునందు ఏ ప్రకారము ప్రవర్తింపవలయును?
ఉత్తరము:- శాస్త్రవిధి ననుసరించి ప్రవర్తింపవలెను.
ప్రశ్న:- అట్లు కాక తన ఇష్టము వచ్చిన ట్లాచరించినచో?
ఉత్తరము:- అత్తఱి యాతడు పురుషార్థసిద్ధినిగాని, సుఖమునుగాని, మోక్షమునుగాని, బడయజాలడు.
ప్రశ్న:- సుఖమును బడయుటకుగాని, మోక్షమునొందుటకుగాని ఉపాయమేమి?
ఉత్తరము: -శాస్త్రాదేశము ననుసరించి చక్కగ ననుష్ఠించుటయే.
ప్రశ్న:- ప్రపంచములో గల పదవులన్నిటిలోను ఉత్కృష్టమైనదేది?
ఉత్తరము: - మోక్షము (పరాంగతిమ్).
తిరుమల సర్వస్వం 216-*
*తిరుమల సర్వస్వం 216-*
*శ్రీవెంకటేశ్వర వస్తుప్రదర్శనశాల (మ్యూజియం)-1*
వందల ఏళ్ళ నుండి శ్రీవారి భక్తులైన ఎందరో చక్రవర్తులు, మహారాజులు, జమీందార్లు మున్నగువారు శ్రీవెంకటేశ్వరునికి బంగారు ఆభరణాలు, వజ్రవైఢూర్యాలు, వెండిపాత్రలు, గృహాలంకరణ సామాగ్రి, రత్నఖచితమైన ఆయుధాలు, ఇలాంటివెన్నో భక్తిపూర్వకంగా సమర్పించుకున్నారు. శ్రీవారి పట్ల వారికున్న అచంచల భక్తి, వారి రాచరికపు వైభవం, ఆనాటి కళాకారుల సృజనాత్మకత, ఈ మూడింటి మేళవింపైన ఈ వస్తువిశేషాలన్నీ ఆయా కాలాలలో ఉన్న రాజకీయ, సామాజిక, సాంస్కతిక, ఆర్ధిక, ఆధ్యాత్మిక స్థితిగతులకు నిలువుటద్దాలు. పల్లవులు, చోశసామ్రాట్టులు, విజయనగర రాజులు, మట్లకుమారులు, ఇలా ఎందరెందరో శ్రీవారికి సమర్పించుకున్న కానుకలను ఎప్పటికప్పుడు ఆలయ కోశాధికారి నమోదు చేసుకుని, ఆ వస్తువులన్నింటికీ గుర్తింపు సంఖ్యనిచ్చి, వాటిపై దాతల వివరాలను చెక్కించి, కానుకలు మరీ విలువైనవైతే వాటి వివరాలను ఆలయం కుడ్యాలపై శిలాఫలకాల రూపంలో మలచి; వాటి విలువ-పరిమాణాన్ని బట్టి, వేర్వేరు ప్రదేశాల్లో కట్టుదిట్టమైన రక్షణా ఏర్పాట్లతో భద్రపరిచేవారు. అవన్నీ క్రమంగా ఈనాటి శ్రీవేంకటేశ్వర పురావస్తుప్రదర్శనశాల (మ్యూజియం) కు భద్రంగా, అంచెలంచెలుగా చేరుకున్నాయి.
*ఎప్పుడు? ఎక్కడ?? ఎలా???*
1939వ సంవత్సరంలో ప్రాచ్యసాహిత్యం మరియు కళలపై పరిశోధన, అధ్యయనం జరపటం కోసం; తి.తి.దే. ఆధ్వర్యంలో, తిరుపతి-చంద్రగిరి రహదారిలో ప్రాచ్యకళాశాల ప్రారంభించబడింది. ఆ కళాశాల ఆవరణలోనే ఉన్న ఒక హాలులో, కళాశాల సిబ్బంది స్వచ్ఛంద సహకారంతో చిన్నపాటి మ్యూజియం ఏర్పాటు చేయబడింది. ఈ వస్తుసంపదనంతా తిరుమల నుంచి తరలించి, ఆ మ్యూజియంలో భద్రపరిచారు. ప్రాచ్యకళాశాలలో పనిచేసిన ఎందరో మహామహులు కూడా ప్రాచీన కళాఖండాలను సేకరించేందుకు, వాటి చరిత్రను శోధించి ఇతివృత్తాల వారిగా అమర్చేందుకు ఎంతగానో తోడ్పడ్డారు. వారిలో ముఖ్యులు, దేవాలయ పురాతత్వ శాస్త్రవేత్తగా సేవలందించిన - సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి గారు, వేటూరి ప్రభాకరశాస్త్రి గారు, మున్నగువారు.
అయితే, ఆ మ్యూజియం తిరుమల-తిరుపతి పట్టణాలకు దూరంగా ఉండటం, అప్పట్లో ప్రజారవాణా సౌకర్యాలు లేకపోవడం వంటి కారణాల వల్ల సందర్శకుల సంఖ్య అంతంతమాత్రం గానే ఉండేది. అలా ఆ మ్యూజియం అరకొర ప్రేక్షకులతోనే కొన్ని దశాబ్దాల కాలం నడచిన తరువాత, ఆ అమూల్యమైన చారిత్రక సంపదను జనబాహుళ్యంలోకి తీసుకురావడం కోసం 1980వ సంవత్సరంలో అప్పటి కార్యనిర్వహణాధికారి గారి చొరవ మరియు ప్రముఖ చరిత్రకారుడు జయచంద్ర గారి సహకారంతో ఆ వస్తుసంపదనంతా ఆలయానికి ఎదురుగా ఉన్న 'వెయ్యికాళ్ళ మండపం' లోకి మార్చి, దానికి *'శ్రీవేంకటేశ్వర వస్తుసంగ్రహాలయం'* గా నామకరణం చేశారు. ఆ మండపంలో దక్షిణదిక్కున వస్తువులన్నింటిని అందంగా అమర్చి, తగిన సిబ్బందిని నియమించారు. దాంతో సందర్శకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. మరో ప్రక్క తిరుమలలో అప్పుడు చేపడుతున్న పాలనా సంస్కరణలలో భాగంగా; అప్పటివరకు ఆదరణకు నోచుకోకుండా కొండపై ఎక్కడెక్కడో పడి ఉన్న కళాఖండాలన్నింటినీ ఒక్కచోటకు జేర్చే ప్రక్రియ కూడా వేగవంతమవ్వడం వల్ల, ప్రదర్శించబడే వస్తువుల సంఖ్య దాదాపుగా రెండింతలయ్యింది. ఈ రెండు కారణాల వల్లా విపరీతమైన స్థలాభావం ఏర్పడింది. వేలాదిగా తరలి వస్తున్న భక్తుల ఉత్సాహాన్ని, కళాఖండాలను అర్థవంతంగా అమర్చడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని; ఆలయానికి సమీపంలో ఒక పెద్ద భవనాన్ని నిర్మించి, దానిలో ఈ కళాకృతులన్నింటిని ప్రదర్శించాలని అప్పటి తి.తి.దే. పాలకవర్గం నిర్ణయించింది.
*సర్వాంగసుందరంగా రూపుదిద్దుకున్న నూతన వస్తుప్రదర్శనశాల భవనం*
ఈ నేపథ్యంలో అన్ని హంగులతో కూడుకున్న లక్షా ఇరవై ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, వైకుంఠం-2 క్యూ సముదాయానికి ఎదురుగా, శిలాతోరణానికి వెళ్ళే దారిలో, గొప్ప రాజప్రాసాదం లాంటి భవనాన్ని నిర్మించారు. అప్పటివరకూ వెయ్యికాళ్ళమంటపంలో ప్రదర్శించబడుతున్న వస్తుసామగ్రినంతా ఈ భవనంలోకి తరలించి, విభాగాల వారిగా అమర్చి, ప్రతివస్తువు వద్ద దాని చరిత్రను వివరంగా మరియు ఆసక్తికరంగా సూచించి, సుశిక్షితులైన సిబ్బందిని నియమించారు. 1997వ సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించ బడడంతో, ఈ సంగ్రహాలయానికి ఎంతో ప్రాచుర్యం వచ్చింది. దానికి తోడు భక్తులందరికీ తగిన వసతులతో పాటుగా, ఉచితప్రవేశం కూడా కల్పించడంతో ప్రేక్షకుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగి; రోజువారి సందర్శకుల సంఖ్యలో భారతదేశంలోనే ప్రథమస్థానాన్ని సంపాదించుకుంది. కాలక్రమంలో ఎప్పటికప్పుడు సంగ్రహాలయానికీ, అందులో ప్రదర్శింపబడుతున్న వస్తుసంపదకు కొత్త సొబగులు చేకూర్చడం వల్ల; ఈ మ్యూజియం తిరుమల చరిత్రనే కాకుండా, దక్షిణాది పాలకులందరూ శ్రీవారి భక్తులే కావడం వల్ల, దాదాపు రెండు వేల సంవత్సరాల యావత్ దక్షిణభారత చరిత్రను ప్రతిబింబించే గొప్ప వారసత్వ భాండాగారంగా రూపు దిద్దుకుని, తిరుమల సిగలో కలికితురాయిలా భాసిస్తోంది.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
మహాభారతము
*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*
*354 వ రోజు*
*కురు పాండవ యోధుల సమరం*
అప్పటికి సూర్యోదయం అయింది. ఇరు పక్షముల వారు కొంతసేపు యుద్ధము ఆపి కాలకృత్యములు తీర్చుకుని కొంత విశ్రాంతి తీసుకుని మరలా యుద్ధము చేయుటకు ఉపక్రమించారు. సుయోధనుడు నకులుడిని, దుశ్శాసనుడు సహదేవుడిని, ద్రోణుడు అర్జునుడిని, భీముడు కర్ణుడిని ఎదుర్కొని పోరాడుతున్నారు. సహదేవుడి సారథిని దుశ్శాసనుడు చంపాడు. సహదేవుడు తానే రథము తోలుకుంటూ దుశ్శాసనుడి హయములను గాయపరిచాడు. ఆ దెబ్బకు దుశ్శాసనుడి హయములు దుశ్శాసనుడిని రథముతో సహా ఎటో లాక్కెళ్ళాయి. భీముడు కర్ణుడు పదునైన బాణములతో ఒకరిని ఒకరు ఎదుర్కొన్నారు. తరువాత గదాయుద్ధము చేసారు. తిరిగి కర్ణుడు తన విల్లు తీసుకుని భయంకరమైన బాణములతో భీముని రథమును విరిచాడు. భీముడు సహదేవుడి రథము మీదకు దూకాడు. ద్రోణుడు అర్జునుడు ఒకరి మీద ఒకరు బాణ ప్రయోగం చేసుకుంటున్నారు. ఒకరు ప్రయోగించిన అస్త్రముకు వేరొకరు ప్రత్యస్త్రము ప్రయోగించుకుంటున్నారు. ఎవరు ఎప్పుడు ఏ అస్త్రము ప్రయోగించారో తెలియక చూసే వారు ఆశ్చర్యపోతున్నారు. ఈ విధంగా గురుశిష్యులు ఘోరయుద్ధము సాగిస్తున్నారు. ఆకాశం నుండి వీరి యుద్ధం చూస్తున్న దేవతలకు పరమేశ్వరుడు రెండు రూపాలుగా విడి పోయి ఒకరితో ఒకరు తలపడి వినోదిస్తున్నాడా ! అన్నట్లు ఉంది. ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి నియమ నిష్టలతో మంత్రజపం చేసాడు. దేవతలు భయంతో వణికి పోయారు. దిక్కులు కంపించాయి. సముద్రాలు పొంగాయి. అది ఏమీ లక్ష్యపెట్టని ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అర్జునుడు బెదరక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి దానిని ఉపసంహరించాడు. రెండు బ్రహ్మాస్త్రాలు ఒకదానిని ఒకటి ఢీకొని నిర్వీర్యం అయిపోయాయి. ఒకరితో ఒకరు యుద్ధము సేసి ప్రయోజనము కవిపించక అర్జునుడు కౌరవ సేనల వైపు ద్రోణుడు పాంచాల సేనల వైపు వెళ్ళి పోయారు. అప్పుడు దుశ్శాసనుడు ధృష్టద్యుమ్నుడిని ఎదుర్కొని అతడి అస్త్రధాటికి తట్టుకొన లేక పారి పోయాడు. నకుల సహదేవులు వెంట రాగా ధృష్టద్యుమ్నుడు ద్రోణుడి వైపు వెళ్ళాడు. సుయోధనుడు సాత్యకి ఎదురుపడ్డారు. వారిరువురు చిన్ననాటి స్నేహితులు. కొంతసేపు విరోధము మరచి రథములు పక్కపక్కన నిలిపి చిన్న నాటి చిలిపి పనులు ఆనాటి కబుర్లు బాల్యం గుర్తు తెచ్చుకుని పొంగిపోయారు. ఒకరితో ఒకరు యుద్ధం చేయవలసిన పరిస్థితి తీసుకు వచ్చిన క్షత్రియ ధర్మం గురించి తలచుకుని బాధపడి తప్పదు కనుక కొంతసేపు యుద్ధము చేద్దాము అనుకుని యుద్ధము చేయసాగారు. మిత్రత్వము మరచి శత్రువుల వలె యుద్ధము చేయసాగారు. సాత్యకి సుయోధనుడి విల్లు విరిచి అతడి శరీరాన్ని తూట్లు పొడిచాడు. సుయోధనుడు అలసి పోయి యుద్ధరంగం నుండి తొలగి పోయి కొంతసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి వచ్చి సాత్యకిని ఎదుర్కొన్నాడు. సుయోధనుడికి సాయంగా కర్ణుడు సాత్యకిని ఎదుర్కొన్నాడు. అది చూసి భీముడు కర్ణుడితో పోరు సాగించాడు. కర్ణుడు భీముని సారథిని మూర్ఛిల్లజేసి భీముని విల్లు విరిచాడు. భీముడు తన గద గిరగిరా తిప్పి కర్ణుడి రథము మీద విసిరాడు. ఆ గద పోయి కర్ణుడి సారథి తల పగుల గొట్టి కర్ణుడి రథాన్ని ముక్కలు చేసింది. కర్ణుడు మరొక రథము ఎక్కి యుద్ధము చేయసాగాడు.
*ద్రోణుడి మరణం*
ధర్మరాజు మత్స్య పాంచాలసేనలు వెంటరాగ ద్రోణుడి మీదకు యుద్ధానికి సన్నద్ధం అయ్యాడు. అప్పటికి రెండు ఝాముల పొద్దు ఎక్కింది. నకుల సహదేవులు భీముడు అర్జునుడిని చూసి " అర్జునా ! ఇక్కడ ద్రోణుడు మన సేనలను అంతమొందిస్తున్నాడు. నీవు అతడికి సాయంగా ఉన్న కౌరవ సేనలను తరుముతుండు. అప్పుడు ద్రోణుడు ఒంటరిగా చిక్కుతాడు. పాంచాల సేన అతడిని అంతమొందిస్తుంది " అని అరుస్తూ ద్రోణుడిని ఎదుర్కొన్నారు. ద్రోణుడు తనకు అడ్డం వచ్చిన సైనికులను హతమారుస్తూ వేలాది సైనికులను చంపుతున్నాడు. ధర్మరాజు భీముడు నకుల సహదేవులు నిస్సహాయంగా చూస్తూ " ద్రోణుడు ఈ రోజు చెలరేగి పోతున్నాడు. ఇలా వదిలేస్తే ఈ రోజు పాండవసేనలను అంతమొందించి మనలను కూడా అంతమొందించి సుయోధనుడికి పట్టం కట్టేలా ఉన్నాడు. ఇతడిని నిలువరించడం మన తరం కాదు. నిలువరించ తగిన అర్జునుడు గురువును చంపుట పాపమని ఉపేక్షిస్తున్నాడు " అనుకున్నారు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కోనసీమలోన కొలువై న దైవాలు
*శ్రీ మన్మహాగ్ని చయన ఛాందసాహ్వానమ్*.
*1*
*ఆ.వె.*
కోనసీమలోన కొలువై న దైవాలు
దేవయజనమునకు తావులొసగ
చయన యాగమునకు సన్నధ్ధులౌ జని
సేవలొనరుభాగ్య భావనమున.
*2*
*కం*
శ్రీ మన్మహాగ్ని చయనము
భూమండలశుధ్ధమొనరు భూతికరంబౌ.
సామాన్యజనులు సహితము
నీ మహిమాన్విత క్రతువుకు నెగబడు చుండెన్.
*3*
*సీసము*
దేశసౌభాగ్యము దేవయజ్ఞఫలము
ప్రకృతి పులకరించు ప్రాభవమ్ము
దువ్వూరి వారింటి ధూర్జటిగ ప్రకాశ
సోమయాజులు జేయు సోమదీక్ష
ముక్కోటి దేవుళ్ళ మ్రొక్కులు తీర్చేటి
చయనయాగమునకు సాయమొనర
వంశమెల్లవెలుగు పావన మార్గమ్ము
అరుగుదెంచెనిచటయని మరువ తగదు.
*తే.గీ.*
లోక కల్యాణ మొనరించ రోచనమున
యాగ సన్నద్ధమై యుండ యజ్వగణము
ప్రకృతి పులకించి చల్లార పరవశమున
భక్తులందరు పనిజేయు శక్తి తోడ.
*4*
*ఉత్పలమాల*
భూసుర జీవనంబున విభూషిత మౌ యజనంబులందునన్
భాసితమౌ మహాగ్నిసుర భాసుర చైనము జేయనెంచగన్
వాసిగ దేవులెల్లరు ప్రవాసము జేసెడి ఈ పురంబునన్
వాసము జేయనెంచు భువి భారత భక్తులకుత్సవంబగున్.
*5*
*మత్తేభవిక్రీడితమ్*
భువిలో పాపము పెచ్చరిల్లిజని భావోద్రేక చింతన్బడన్
అవనీ పాలకు లెల్లరున్కలిసి స్వాహాదేవి సైతంబుగన్
పవమానాదిగణంబులన్పిలిచి సంభారంబులన్గూర్చగన్
భువిదేవాగ్రులు యజ్ఞముల్సలుపు సంపూర్ణాశ్రయాత్మన్ మదిన్.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
పండగ పూట పాత మొగుడేనా?
*పండగ పూట పాత మొగుడేనా?*
ఈ సామెత తప్పు...
పండగ పూట పాత మొగుడేనా.. అనే సామెత...! ఎప్పటి నుంచో మనం విటున్నాం కదా... ఈ మాటకున్న అర్థం మీరు ఎప్పుడైనా ఆలోచించారా...? అసలు ఇంతకూ ఈ సామెత కరెక్టేనా...? ఈ సామెత మన హిందూ స్త్రీ యొక్క గుణనమును తప్పుగా తెలిపే విధంగా అర్థాన్ని తెలపటం జరుగుతున్నది.
మన హిందూ సంప్రదాయానికి విరుద్ధమైన అర్థం ఇచ్చే విధంగా అంటే......”పండగ పూట కొత్త మొగుడు కావాలి” అన్న అర్థం వచ్చేలా వుంది. ఆడవారిని కించపరిచేలా ఈ సామెత వుండడం బాధాకరం.
నిజంగా ఈ సామెత ఇలానే వుందా అని..... అనుమానం రావడంతో... దీని ఆంతర్యం కోసం చిన్న పరిశోధన ప్రయత్నం చేశాను.. అప్పుడు నాకు దొరికింది అసలైన సామెత... ఇది నిజమైన తెలుగు సాంప్రదాయ సామెత.... అదే ఈ సామెత. !!
పండగ పూట పాత మడుగేనా...
మరొకసారి చదవండి,
ఈ పురాతన సామెత ఇప్పుడు వెలుగు చూడడం చాలా సంతోషించదగిన విషయం. ఈ పాత సామెత అర్థం ఏమిటో మనం ఒక్క సారి చూద్దాం...!మడుగు అంటే వస్త్రం అని అర్థం.. 'పండుగ రోజు కొత్త బట్టలు కట్టుకోవడం మన ఆనవాయితీ.. ఆ అర్థంలో పుట్టిన సామెత ఇది... పండగ పూట పాత బట్టలు కాదు.. కొత్త బట్టలు కట్టుకోవాలి' అని.... అప్పటి ప్రజల స్థితిగతులు (ఆర్థిక పరిస్థితులు) సరిగాలేని రోజులలో ఈ సామెత పుట్టుకు రావడం జరిగింది....!!
ఇకపై ఈ సామెతకు తప్పుడు ప్రచారం మనం చేయకూడదు…… ఈ సామెతను సరైన రీతిలోనే పలుకుదాం.. పలికిద్దాం... మన హిందూ స్త్రీ గుణాన్ని కించపరిచే సామెతను మరిచిపోదాం... పండగ పూట పాత మడుగేనా అన్న పాత సామెతనే ఇక నుంచి అందరం పలుకుదాం... మన తెలుగును మనం పరిరక్షంచు కొందాం...
తెలుగువారిగా మనం ఈ పోస్ట్ ని ప్రతి ఒక్కరికీ షేర్ చేద్దాం. ఇది మన బాధ్యత. ధన్యవాదాలు.
లోకాః సమస్తాః సుఖినోభవంతు
✍🏻🚩 *సర్వే జనాః సుఖినోభవంతు* 🚩
ఆరంభింపరు
*ఆరంభింపరు నీచ మానవులు*
ప్రారభ్యతేన ఖలు విఘ్నభయేన నీచైః
ప్రారభ్య విఘ్ననిహతా విరమంతిమధ్యాః ।
విఘ్నైః పునఃపునరపి ప్రతిహన్యమానాః
ప్రారబ్ధముత్తమ జనాన పరిత్యజంతి ॥
- భర్తృహరి సుభాషితాలు
ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచున్ ధ్రుత్యున్నతోత్సాహులై
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్
* బతృహరి సుభాషితాలను తెలుగుజేసిన ఏనుగు లక్ష్మణ కవి.
అని మనం తరచూ ఓ తెలుగు పద్యాన్ని వింటుంటాము కదా! దానికి సంస్కృత మూలమే పైన కనిపించే పద్యం.
దారిలో ఏమన్నా ఆటంకాలు ఎదురవుతాయేమోనన్న భయంతో అధములు అసలు పనినే మొదలుపెట్టరట.
ఇక మధ్యములు పనిని మొదలుపెట్టినా... మధ్యలో ఏవన్నా అడ్డంకులు ఎదురైన వెంటనే పనిని వదిలిపెట్టేస్తారు.
ఇక ధీరులున్నారే! వారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే... మొదలుపెట్టిన కార్యాన్ని అంతకంతకూ రెట్టింపు ఉత్సాహంతో పూర్తిచేసి తీరతారు.

