22, ఏప్రిల్ 2025, మంగళవారం

*ఆన్ లైన్ వ్యామోహం

 *ఆన్ లైన్ వ్యామోహం కమ్మేస్తుంది...*



నేడు ప్రపంచీకరణ కాస్త 

పరాయితనాన్ని కట్టబెడుతుంది 

రెండూ కలిసి మెలిసి జీవిస్తూ 

మార్కెట్లో మనిషిని నమ్మకానికి పెట్టాయి...


ఆన్ లైన్ వ్యామోహం కమ్మేస్తుంది 

అనవసరపు వస్తువు ఇంట్లో చేరుతుంది 

తాహతుకు మించి దర్శనమిస్తూ 

మనిషిని దరిద్రునిగా మారుస్తుంది..


తనువంతా  చుట్టుకున్న ఈ ముళ్ళకంప 

మనిషి రెక్కలను నరుక్కుంటూ 

మనిషిని జీవచ్ఛవంగా మార్చుకుంటూ 

సమాజంలో నగ్నంగా నిలబెట్టాయి...


వస్తువు దగ్గరికి మనం వెళ్లడం లేదు 

మన కంటి చూపుల్ని ప్రసరించం

అందమైన ఫోటోలకు ఆకర్షితులై 

బేరంలేని వ్యాపారంలో మునిగిపోయాం...


అవసరం కోసం కొనడం మానేశాం

ఆధిపత్యం కోసం వస్తువులను కొంటున్నాం 

మనల్ని మనం అమ్ముకుంటూ 

గొప్ప జీవితాన్ని కొంటున్నారు....


అప్పు చేయడమే నేడు గౌరవంగా 

బ్యాంకి లావాదేవీల్లో చిలుకగా 

రుణభారాన్ని మోసుకుంటూ తిరుగుతూ 

అదేదో గొప్పతనం అని అనుకుంటున్నాం...


పొగొట్టుకున్నది వెతుక్కోవడంలోనే 

పచ్చని బతుకు తెల్లారిపోతుంది 

ఆశల సముద్రంలో చిక్కుకొని 

జీవిత ఒడ్డుకు చేరలేక సగంలోనే ముగుస్తుంది..


కొప్పుల ప్రసాద్ 

నంద్యాల 

9885066235

కామెంట్‌లు లేవు: