8, డిసెంబర్ 2021, బుధవారం

శ్రీరమణీయం* *-(249)*_

 _*శ్రీరమణీయం* *-(249)*_

🕉🌞🌎🌙🌟🚩


_*"ఆలోచనలను అదుపుచేసుకునే మార్గం ఏమిటి ?"*_


_*మనం ఏర్పరుచుకున్న జ్ఞాపకాలే మనకు ఆలోచనలుగా వస్తాయి. ఒక విషయం జ్ఞాపకంగా మారేంతగా మమైకత చెందకుండా జాగ్రత్త పడాలి. అంతేగాని ఆ జ్ఞాపకాలు ఆలోచనగా వచ్చినప్పుడు బాధ పడితే ప్రయోజనం ఏముంది ? పూజలో కూర్చున్నప్పుడు మనకి ఇతర ఆలోచనలు వస్తున్నాయని చికాకు పడతాం. విత్తనాలు నాటేప్పుడే తాలు గింజలు ఏరివేస్తే మొలిచేవన్నీ మంచి మొక్కలే అవుతాయి. అలాగే మన బాహ్యవృత్తుల్ని నియంత్రించుకుంటే తప్ప ప్రవృత్తులను నియంత్రించలేము. లేదంటే ఆలోచనలను అదుపులో ఉంచుకోవటం కష్టం అవుతుంది !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_

_*'పని స్ఫురించని మనసే ధ్యానం !'*- 


🕉🌞🌎🌙🌟🚩

శ్రీమదాంధ్ర భాగవతం - 26*

 *శ్రీమదాంధ్ర భాగవతం - 26*


*బ్రహ్మోత్పత్తి–స్వాయంభువ మనువు*


విదురుడు కురుసభలో ఉండగా ఒకానొక సందర్భంలో ఆయన అవమానించ బడ్డాడు. విదురుడు అక్కడ నుండి బయలుదేరి ఉద్ధవుడి దగ్గరకు వెళ్ళి ఉద్ధవుడిని ‘కృష్ణ భగవానుడు ఎక్కడ ఉన్నాడు?’ అని అడిగాడు. ఉద్ధవుడు “కృష్ణ భగవానుడు నిర్యాణం చెందాడు. యాదవులు అందరూ వెళ్ళిపోయారు’ అని చెప్పాడు. ఈ సందర్భములో పరీక్షిత్తు ‘ఉద్ధవుడు కూడా యాదవుడే కదా – అతను ఎందుకు ఉండిపోయాడు?’ అని శుకుని అడిగాడు. కృష్ణుడికి ఏ జ్ఞానం ఉన్నదో అదే ఉద్ధవుడికి ఉన్నది. కృష్ణుడు తన తరువాత లోకమునకు జ్ఞానం చెప్పడం కోసం ఉద్ధవుడిని భూమిమీద ఉంచేశాడు. ఉద్ధవుడు శ్రీమన్నారాయణుని ఆదేశమును అనుసరించి బదరికాశ్రమమునకు  వెళ్ళిపోతున్న ఉద్ధవుడిని విదురుడు కలుసుకుని ‘నీవు శ్రీమన్నారాయణుడి దగ్గర తెలుసుకున్న భాగవత జ్ఞానమును నాకు చెప్పవలసింది’ అని అడిగాడు. ఉద్ధవుడు ‘అది నాదగ్గరే కాదు. జ్ఞానమును మైత్రేయునికి కూడా చెప్పాడు. మైత్రేయుడు హరిద్వార్ లో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి వినవలసింది’ అని సలహా చెప్పాడు. విదురుడు గంగ భూమి మీద పడిన చోటయిన హరిద్వార్ వెళ్ళి, భాగవత జ్ఞానమును విన్నాడు. శ్రీమహావిష్ణువు నాభికమలములో నుండి చతుర్ముఖ బ్రహ్మ గారు పుట్టారు అప్పటికి సృష్టి లేదు. లోకములన్నీ నీటితో నిండి పోయి ఉన్నాయి. నీటితో నిండిపోయి వున్న లోకములందు తాను ఏమి సృష్టి చేయాలో ఆయనకేమీ అర్థం కాలేదు. ‘నేనన్న వాడని ఒకడిని వచ్చాను కదా –  నన్ను కన్నవాడు ఒకడు ఉండాలి కదా!’ అని చుట్టూ చూశాడు. చుట్టూ నీళ్ళు తప్ప ఏమీ లేవు కంగారుపడ్డాడు.

ఏమిటి సృష్టి చేస్తాను? ఎలా సృష్టి చేస్తాను? అని ఆలోచిస్తున్నాడు.  ఆయనకు పైనుంచి ‘తపతప’ అనే ఒక మాట వినపడింది. ఆయన తపించాడు. ధ్యానమగ్నుడై ఈమాట ఎవరి నుండి వెలువడిందో ఆయన దర్శనము అపేక్షించాడు. అలా తపించగా తపించగా శ్రీమన్నారాయణ దర్శనం అయింది. ఆయన ‘నీవు ఇలా సృష్టి చెయ్యి’ అని బ్రహ్మగారికి వేదములను ఇచ్చి ఆదేశం ఇచ్చాడు.   చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేయడం ప్రారంభం చేశాడు.

ఆయన అలా సృష్టి చేయడం ప్రారంభం చేయడంలో ఒక గమ్మత్తయిన ప్రక్రియ జరిగింది. బ్రహ్మము నుండి సృష్టి వెలువడింది. ఆయన మొట్టమొదట సనక, సనందన, సనత్కుమారులను సృష్టించాడు. ఆ నలుగురుని సృష్టించి మీరు సృష్టిని వృద్ధి చేయండి. బిడ్డలను కనండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు ‘మేము ప్రవృత్తి మార్గములో వెళ్ళము. ఆ మార్గము మాకు అక్కరలేదు. మేము సృష్టి చేయము. మేము శ్రీహరి పాదములు చేరిపోతాము’ అన్నారు. వారు ఎప్పుడూ అయిదేళ్ళ వయసులో, చిన్నపిల్లల్లా బట్టలు విప్పుకుని, ఎప్పుడూ ధ్యానం చేస్తూ శ్రీహరి వైపు వెళ్ళిపోయారు. బ్రహ్మగారికి కోపం వచ్చింది. కోపంతో తన భ్రుకుటి ముడి వేశాడు. అందులోంచి నీలలోహితుడనే పేరుగల రుద్రుడు పుట్టాడు. వాడు కింద పడి ఏడవడం మొదలు పెట్టాడు. బ్రహ్మగారు వానిని ఏడవకు అన్నారు.  ఆ రుద్రుడు ‘నేను ఎక్కడ ఉండాలి? ఏమి చేయాలి?’ అని అడిగాడు.

ఇక్కడ ఒక విషయము గమనించాలి. అక్కడ అప్పుడు సృష్టి,  సంకల్పం నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం  ఉన్న సృష్టి మిధున సృష్టి అనగా స్త్రీ పురుష మైధునం చేతనే సృష్టి జరుగుతూ ఉంది. అప్పుడు జరిగిన సృష్టి కేవలము ఈశ్వర సంకల్పము చేత మాత్రమే జరిగిన సృష్టి.

  చతుర్ముఖ బ్రహ్మగారు ‘నువ్వు పుడుతూనే వచ్చావు  కాబట్టి నిన్ను రుద్రుడంటారు అని చెప్పి రుద్రుడికి ఎనిమిది రూపములను, ఎనమండుగురు భార్యలను ఇచ్చి నీవు అలా ఉండి సృష్టి చెయ్యి’ అని చెప్పారు. ఆయన కొన్ని గణములను సృష్టించాడు. ఆ గణములు అక్కడ వున్న వాళ్ళను తినివేయడం మొదలుపెట్టాయి. బ్రహ్మగారు రుద్రుడిని పిలిచి ‘ఇక నీవేమీ సృష్టి చేయవద్దు. కేవలం తపస్సు చేసుకుంటూ ఉండవలసింది’ అని చెపితే ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు.

మళ్ళీ బ్రహ్మగారు ఆలోచిస్తూ కూర్చున్నారు. అలా ఆలోచిస్తుంటే ఆయన శరీరభాగముల నుండి రకరకముల మహర్షులు బయటకు వచ్చారు. బ్రహ్మగారి ఒడిలోంచి నారదమహర్షి బయటకు వచ్చారు. వీపు నుంచి ‘అధర్మము’ వచ్చింది. అధర్మములోంచి ‘మృత్యువు’ వచ్చింది. ముందుభాగం నుంచి ‘ధర్మం’ వచ్చింది.  బ్రహ్మగారు ‘ఇలా నేను సంకల్ప వికల్పములు చేస్తే ఎంత సృష్టి చేస్తాను’ అనుకున్నారు. ఒక్కొక్కసారి సృష్టి చేసే వారియందు కూడా మోహము కలుగుతుంది. బ్రహ్మ ఒక స్త్రీని సృష్టించాడు. సృష్టించి ఆ స్త్రీ యందు మోహమును పొందాడు. ఋషులు ‘మీరు సృష్టించిన స్త్రీ యందు మీకు మోహమేమిటి' అని ప్రశ్నించారు. ఆయన ‘ఇది సృష్టికి ఉండే లక్షణము. ఏ శరీరముతో అలా మోహమును పొందానో ఆ శరీరమును వదిలిపెట్టేస్తున్నాను’ అని శరీరమును వదిలిపెట్టేశాడు. ఆ శరీరము పొగమంచు అయింది. మనకు రోజూ కళ్ళకు అడ్డముగా వచ్చే పొగమంచు అదే!

 బ్రహ్మగారు మైథున సృష్టి చెయ్యాలని అనుకొని తన శరీరములో నుంచి  రెండింటిని సృష్టించాడు. ఒకటి స్త్రీ, ఇంకొకటి పురుషుడు. అలా సృష్టించి ‘వీళ్ళయందు వ్యామోహమును ఏర్పాటు చేస్తాను. ధర్మబద్ధమైన ప్రజా సృష్టి జరుగుతుంది’ అన్నారు. మొట్టమొదట సృష్టించిన వాళ్ళలో మొట్టమొదట పుట్టిన వాడు స్వాయంభువ మనువు ఆయన భార్య పేరు శతరూప. 

 బ్రహ్మగారు ‘కొడుకు తండ్రిని సంతోషపెట్టాలి. నీవు సృష్టి చెయ్యి’ అన్నారు. అనగా స్వాయంభువ మనువు అయిదుగురు బిడ్డలను కని  వచ్చి తండ్రికి తాను అయిదుగురు బిడ్డలను కన్నట్లు చెప్పాడు. వాళ్ళు ఎవరు అని అడిగారు బ్రహ్మగారు. ఆయన తన బిడ్డల పేర్లు చెప్పాడు. ఒకాయన పేరు ప్రియవ్రతుడు, రెండవకుమారుని పేరు ఉత్తానపాదుడు. ఒక కుమార్తె పేరు అకూతి. మరొక కుమార్తె పేరు ప్రసూతి. మూడవకుమార్తె పేరు దేవహూతి.

 ఇప్పుడు ఏమి చెయ్యను?” అని తండ్రిని అడిగాడు.  బ్రహ్మగారు ‘శ్రీహరిని సంకీర్తన చేస్తూ, యజ్ఞయాగాది క్రతువులను చేస్తూ సమస్తప్రాణులను రక్షిస్తూ పరిపాలన చేయవలసినది అని చెప్పాడు. ఆయన ‘నాన్నగారూ అలా పరిపాలించడానికి భూమి ఎక్కడ ఉన్నది? అని అడిగాడు. మీరు సృష్టి తామర తంపరగా ఎలా పెంచాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఈ భూమి ప్రళయం వల్ల  వచ్చిన సముద్ర జలముల లో పడిపోయి రసాతలానికి వెళ్ళిపోయింది. పాతాళ లోకంలో ఉన్న ఆ భూమిని పైకి తీసుకుని వస్తే ప్రాణులు  భూమి మీదకు చేరుతాయి.  ఇంకా సృష్టి జరిగి ఇంకా ప్రాణులు వచ్చి దీనిని పరిపాలించడానికి ఆనుకూల్యం ఏర్పడుతుంది. ఆ భూగోళమును పైకెత్తండి’ అన్నాడు. బ్రహ్మగారు ఆ భూమిని ఎలా పైకెత్తడం! అని ఆలోచించాడు. ఆయన సంకల్పం చేయగానే వెనుక నుండి చేయిస్తున్న వాడు ఒకాయన ఇన్నిగా వస్తున్న వాడు ఆయన బ్రహ్మగారి ముక్కులోంచి ఊడి క్రిందపడ్డాడు. నాసికా రంధ్రం నుంచి చిన్న వరాహమూర్తి ఒకటి క్రింద పడింది.

ఆ వరాహము దంష్ట్రలతో పెద్ద కొండంత అయిపోవడం మొదలుపెట్టింది. అది  అడుగులు తీసి అడుగులు వేయడం మొదలు పెట్టింది. అక్కడ వున్న ఋషులు అందరూ దానికేసి ఆశ్చర్యముగా చూస్తున్నారు. వాళ్లకి అర్థం అయింది. స్వామి సంకల్పమును అనుసరించి భూగోళమును పైకి ఎత్తడానికి ఎవరు మొట్టమొదటి నుండి చివరి వరకు ఉంటున్నటువంటి ఈశ్వరుడు వచ్చాడు అనుకున్నారు. అనగా మొదటి అవతారం వచ్చినది.

ఇది యజ్ఞవరాముగా వచ్చి అడుగులు తీసి అడుగులు వేస్తూ సముద్రంలోకి దూకింది. అది భూమికోసం మూపుపెట్టి వెతుకుతోంది. అలా వెతకడములో దాని ముఖం నిండా నీళ్ళు అంటుకు పోయాయి. అది తన ముఖమును పైకి తెచ్చి విదిలించింది. ఋషులందరూ ఋగ్యజుస్సామ వేదములతో స్తోత్రం చేస్తూ, ఆ నీళ్ళు మీద పడేటట్లు నిలబడ్డారు. ఈ కంటికి గోచరమవని వాడు రక్షించడం కోసమని  ఒక విచిత్రమయిన మూర్తిగా వచ్చి నీటితో తడిసిన దేములో ఉన్న నీటిని చిమ్ముతున్నాడు. దీనిని విన్నప్పుడు విదురుడు ఒక విచిత్రమైన ప్రశ్న వేశాడు. దానికి జవాబుగా ‘యజ్ఞవరాహం వచ్చినపుడు ఆయన ఎంత గొప్ప మూర్తియో అంత గొప్ప రాక్షసుడు ఒకడు నీళ్ళలోంచి వచ్చాడు. వచ్చి యజ్ఞవరాహమూర్తి మీద కలియబడ్డాడు. అక్కడ వున్న వాళ్ళందరూ యజ్ఞవరాహమూర్తిని స్తోత్రం చేస్తున్నారు. ఆయన ఆ రాక్షసుడిని చంపి అవతల పారేశాడు’ అని చెప్పాడు .

‘ఆ వచ్చిన వాడెవడు? ఎందుకు వచ్చాడు? అందరూ నమస్కరిస్తుంటే వాడొక్కడు యుద్ధం చేయడం ఏమిటి? అందుకు సంబంధించిన కథను చెప్పవలసినది’ అని పరీక్షిత్తు అడిగితే శుకుడు చెప్పడం ప్రారంభించాడు.

ఇంకావుంది.


సాంఖ్యాయనాచంట.

కార్తిక మహాత్మ్యమందలి త్రింశోధ్యాయము-

 ఓం నమో మాత్రే నమః


_*కార్తీక పురాణం - 30 వ అధ్యాయము*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*చివరి అధ్యాయం*


*కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి*



☘☘☘☘☘☘☘☘☘



నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాదిమహామునుల కందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను , విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి , వేయినోళ్లకొనియాడిరి. శౌనకాది మునులకు ఇంకను సంశయములు తీరనందున , సూతునిగాంచి , *"ఓ ముని తిలకమా ! కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై , అత్యాచారపరులై జీవించుచు  సంసారసాగరము తరింపలేకున్నారు. అటువంటివారు సులభముగా ఆచరించు తరణోపాయమేదైనా కలదా ? ధర్మములన్నింటిలో మోక్షసాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది ? దేవతలందరిలోనూ ముక్తినొసంగు ఉత్తమదైవమెవరు ? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపు మాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి ? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతోనున్నాము. కావున దీనిని వివరించి తెలియజేయు"* మని కోరిరి.


అంత సూతుడా ప్రశ్న నాలకించి *"ఓ మునులారా ! మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసారసాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్షసాధనము కాగలవు. కార్తీకవ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటె ఘనమైనదని శ్రీహరి వివరించియున్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతియేకాదు , సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యముకాదు. అయినను సూక్షముగా వివరించెదను.


కార్తీకమాసమందు ఆచరించవలసిన పద్ధతులను జెప్పుచున్నాను. శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీకమాసమున సూర్యభగవానుడు తులారాశి యందున్నప్పుడు శ్రీహరి ప్రీతికొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగ నదీస్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచమైనా దీపదానం చేయవలయును. ఈ నెలరోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమునగాని , శివాలయమునగాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతి దినము సాయంకాలము పురాణపఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశియందున్న నెలరోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తివుండికూడా ఆచరించకగాని , లేక , ఆచరించువారలను ఎగతాళి చేసినగాని , వారికి ధనసహాయము చేయువారికి అడ్డుపడిన వారును మందు అనేక కష్టముల పాలగుటయేగాక వారి జన్మాంతర మందు నరకములో యమకింకరుల చేత నానా హింసలపాలుకాగలరు. అంతియేగాక అట్టివారు నూరుజన్మలవరకు ఛండాలాది హీన జన్మలెత్తుదురు.


కార్తీక మాసములో కావేరి నదిలోగాని , గంగా నదిలోగాని , అఖండ గౌతమినదిలోగాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించిననూ ఇహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక , జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు.


సంవత్సరములోవచ్చు అన్ని మాసములకన్నా కార్తీకమాసము ఉత్తమోత్తమమైనది అధికఫలదాయకమైనది. హరి హరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీకమాస వ్రతము వలన జన్మజన్మలనుండి వారలకున్న సకలపాపములు హరించి , మరుజన్మలేక , వైకుంఠమందుగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతమాచరించవలెననెది కోరిక పుట్టి దుష్టులకు , దుర్మార్గులకు , పాపాత్ములకు కార్తీకమాసమన్న కార్తీక వ్రతమన్నా అసహ్యము కలుగును.


కాన , ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారు కార్తీకశుద్ద పౌర్ణమినాడు అయినను తమశక్తి కొలదీ వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి , జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెలరోజులు చేసిన ఫలముతో సమానఫలము కలుగును. ఈ మాసములో ధనము , ధాన్యము , బంగారము , గృహము , కన్యాదానములు చేసినచో ఎప్పటికినీ తరగని పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను , బీదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరినామస్మరణ చేయుచు , పురాణములు వింటూ , పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకంబును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్థప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి త్రింశోధ్యాయము- ముప్పదవ(ఆఖరి రోజు) పారాయణము సమాప్తము.*

ఆసక్తికరమైన అంశం*

 💥💥 *ఆసక్తికరమైన అంశం* 💥💥

కరోనా వ్యాధి చికిత్స ఇచ్చే వార్డులో చికిత్స పొందుతున్న ఒక టీచర్ ఏమీ తోచక చదువుదామని ఒక పుస్తకం తీసుకోనే సమయానికి ఆమె ఫోన్ మ్రోగింది. ఆ ఫోన్ కాల్ ఒక తెలియని నంబర్ నుండి వచ్చింది. సాధారణంగా అలాంటి నంబర్ల ఫోన్ కాల్ ఆవిడ తీయదు, ఆసుపత్రిలో ఒంటరిగాఉంది, చేయడానికి వేరే పని లేనందున  ఆ ఫోన్ కాల్ ని తీసుకుంది. 


“ గుడ్ మార్నింగ్ మేడమ్, నేను సత్యేంద్ర గోపాలకృష్ణ, దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాను. సీమా కనకాంబరన్ గారితోనే మాట్లాడుతున్నానా?”, అని ఒక మగ గొంతుక తననుతాను పరిచయం చేసుకుంది.  

ఆ టీచర్ ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని కుతూహలంతో,“అవును నేనే మాట్లాడుతున్నాను” అని సమాధానం చెప్పింది. 

కొంత సమయం తర్వాత  అతను, “మాడమ్ కొన్ని సంవత్సరాల క్రితం మీరు నా పదో క్లాస్  టీచర్“ అని చెప్పాడు. 

టీచర్ అతడిని గుర్తించలేకపోయింది.“ప్రస్తుతం కోవిద్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాను. అంత ముఖ్యమైన విషయం కాకపోతే మనం తర్వాత మాట్లాడుకోవచ్చా?”అని అంది. 

దానికి బదులుగా సత్యేంద్ర, “1995 బ్యాచ్ లో మొదటి ర్యాంకర్ ఐన సుబ్బు ద్వారా మీకు ఆరోగ్యం బాగులేదని తెలిసింది“ అని చెప్పాడు.

 “ నాకు సుబ్బు బాగా తెలుసు నేను అతడిని గుర్తుపట్టాను కాని నిన్ను గుర్తుపట్టలేకపోతున్నాను” అని టీచర్ చెప్పింది. 


సత్యేంద్ర “ మీకు ఎప్పుడూ తలనొప్పి తెప్పించి, పొడుగ్గా, నల్లగా వుండి, ఆఖరి బెంచీలో కూర్చునే ఒక పిల్లవాడు బహుశా గుర్తుండివుంటాడు. ఆపిల్లవాడ్ని నేనే ” , అని చెప్పాడు.  


ఆ టీచరకి ఒక్కసారిగా గుర్తుకొచ్చి “ ఓ ! ఆ వెనక బెంచీ పిల్లలా“, అని అడిగింది. 


ఆ సంభాషణ ఆసక్తిగా మారడం వల్ల ఆవిడ పుస్తకాన్ని బల్ల మీద ఒక ప్రక్కగా పెట్టి  దిండుని తల వెనుకగా సర్దుకొని  తనకి తాను సుఖంగా కూర్చొని అప్పుడు అతడిని “ఇప్పుడు ఇంత అకస్మాత్తు గా నేను నీకు ఎందుకు జ్ఞాపకం వచ్చాను”, అని అడిగింది.

  

సత్యేంద్ర “ మీరు ఆసుపత్రిలో వున్నారని తెలిసినప్పుడు మా 1995 క్లాసు పిల్లలందరితో ఒక కాన్ఫరెన్సు కాల్ ఏర్పాటుచేద్దామని నాకు ఆలోచన వచ్చింది” అని చెప్పాడు.


“ తోటి విద్యార్ధులు ఏడుగురిని నేను ఈరోజు లైన్ లోకి తేగలిగాను. ఇప్పుడు వాళ్ళందరూ మన సంభాషణ వింటున్నారు. మేమందరం మీరు తొందరగా కొలుకోవాలని ప్రార్ధిస్తున్నామని మీకు తెలపడానికి ఫోన్ చేసాం“, అని అతను చెప్పగానే ఆ టీచర్ కి మాటలు తడబడ్డాయి. 


కొంత సమయం తరువాత ఆవిడ “ఇప్పుడు చెప్పు, నువ్వు ఎక్కడ వున్నావు?” అని అడిగింది. 


“ నేను ప్రస్తుతం దుబాయిలో ఉన్నాను. నేను స్వంతంగా లాజిస్టిక్ వ్యాపారం చేస్తున్నాను. మొదట్లో నేను ఉద్యోగం వెతుక్కోవడానికి ఇక్కడకు వచ్చాను. చివరికి ఒక విజయవంతమైన వ్యాపారవేత్తను అయ్యాను. ప్రస్తుతం నా సంస్థలో 2000 మంది ఉన్నారు“, అని సత్యేంద్ర చెప్పాడు. 


మేము పదో తరగతిలో వున్నప్పుడు మీరంటే  మా వెనక బెంచీ విద్యార్ధులకు క్రమశిక్షణ విషయంలో చాలా భయం వేసేది. కానీ అదేసమయంలో మీరు ఎంతో ఔదార్యంతో మాకు మద్దతు ఇచ్చి, గొడవ చేసి, అల్లరిచేసే వెనక బెంచీ విద్యార్ధులమైన మాలో విశ్వాసాన్ని పెంచారు. నేను వారి నాయకుడిగా వుండేవాడిని”, అని అతడు చెప్పాడు.


మీ చేతిలో అందరికన్నా నాకే ఎక్కువ శిక్షలు పడ్డాయి, మీరు నన్ను తరుచూ క్లాస్ బయట, కొన్ని సార్లు క్లాస్ లో బెంచీ మీద నిలబెట్టేవారు. ఆ అనుభవాలన్నీ నా తరువాతి జీవితంలో ఎంతో ఉపయోగపడ్డాయి. 


“బెంచీ మీద నిలబెట్టినప్పుడు నాకు క్లాస్ అంతా ఒకేసారి కనిపించేది, నేను నేర్చుకున్న ఈ పాఠాలు నేను నా జీవితంలోనే కాదు నా వ్యాపారం లో కూడా ఉపయోగపడుతున్నాయి. ఈ రొజు నేను ఉన్న ఈ స్థితి అంతా మీ వల్లనే సాధ్యపడింది”, అని చెప్పాడు. 

 

టీచర్ కి ఇప్పుడు మాట్లాడడం చాలా ఇబ్బందిగా అనిపించింది. సత్యేంద్ర తన కధను చెప్తూనే వున్నాడు, ఆ టీచర్ కొన్ని దశాబ్దాలకి ముందు, 1995 సంవత్సరానికి వెనక్కివెళ్లి తన జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంది. 1995 లో క్లాస్ ...


 “ అవును, ఆ పొడుగ్గా నల్లగా వుండే కుర్రవాడు, క్లాస్ కి ఎప్పుడు ఆలస్యంగా వచ్చి విసిగించడంలో దిట్ట. క్లాసులను మానేసి సినిమాలకు వెళ్ళేవాడు. తరచూ టీచర్ విధించిన శిక్షలు, వేసిన జరిమానాలను  తగ్గించమని కోరడానికి వాళ్ళ గదికి వచ్చే పిల్లవాడు ఇతనే. టీచర్లందరికీ ఓ పీడకలగా ఉన్నా  పిల్లలందరికి మాత్రం చాలా ప్రియమైనవాడు ఇతనేనని గుర్తించింది.


అవును, అతడినితో అందరూ స్నేహంగా ఉండేవారు. అతడు ఇప్పుడు దుబాయిలో ఎలా వున్నాడు?” అని ఆ టీచర్ అనుకుంటోంది. 


ఆవిడ ఆలోచనలకు అంతరాయం కలిగింది 

“ హలో ! మీరు వింటున్నారా ?” అని సత్యేంద్ర అడిగాడు.  


 టీచర్ స్పృహలోకి తిరిగి వచ్చి “ ఆ.. ఆ.. వింటున్నాను “ అని సమాధానం చెప్పింది.


ఆవిడ సంభాషణ కొనసాగిస్తూ “ సత్యేంద్ర! స్కూలు వదలి వెళ్ళిన తరువాత నీ గురించి ఏమీ తెలియలేదు. నువ్వు నాకు కాల్ చేయడం, అది కూడా నీ మిత్రులతో కాన్ఫరెన్స్ కాల్ చేయడం చాలా ఆశ్చర్యంగాను, సంతోషంగాను వుంది. అందరూ మీ గురించి చెప్పండి", అని అడిగింది.


ఆ గ్రూప్ కాల్ లో వున్న మిగతా ఆరుగురిలో ముగ్గురు మూడు ఖండాలలో ఇంజనీర్ లని,  ఒకడు ఢిల్లీ లో డాక్టర్, ఒకడు షిల్లాంగ్ లో పురోహితుడు, చివరిగా క్లాస్ లో మొదటి స్థానం లో వుండే సుబ్బు, “మేడమ్, నేను ఒక చార్టెడ్ అకౌన్టెంట్. సత్యేంద్ర కంపెనీ లో CFO ని” అని చెప్పారు.

ఆవిడ తాను విన్న మాటలను నమ్మలేకపోతోంది ఎంతో ఆశ్చర్యంగా, “నిజంగానే నా!”అని అంది. 

సుబ్బు ఆ మాటలను ధృడపరిచాడు, “నేను సత్యేంద్రతో  కలవక ముందు KPMG లో పనిచేసేవాడిని. సత్యేంద్రతో కలిసిన తరువాత వృత్తిపరంగా నాకు చాలా తృప్తి గా వుంది. అలాగే నా కుటుంబజీవితం కూడా బావుంది ”, అని చెప్పాడు. 


అందరూ వాళ్ళ కధలు పూర్తిచేసేటప్పటికి 40 నిమిషాలు గడిచాయి. సత్యేంద్ర  అంత ఎక్కువ సేపు మాట్లాడినందుకు క్షమించమని అడిగాడు, వాళ్ళ ప్రియమైన  టీచర్ త్వరగా కొలుకోవాలని కోరుకుంటూ  తాను ఇండియా  వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తానని  వాగ్దానం చేశాడు . 


కోవిద్ ఐసొలేషన్ వార్డులో ఒంటరిగా వున్న టీచర్ కళ్ళు కన్నీళ్లతో నిండాయి. ఆవిడ హృదయం సంతోషంతో పొంగిపోయింది, కన్నీళ్ళు ఆవిడ బుగ్గల మీదకు జారాయి. 

విద్యార్ధులకు క్రమశిక్షణ నేర్పినందుకు, వాళ్ళ మీద ఔదర్యాన్ని ప్రదర్శించినందుకు తనని జ్ఞాపకముంచుకున్నారని తెలుసుకోవడం ఆవిడకి ఆనందంలో ముంచెత్తే  అనుభవం.


అదేవిధంగా వాళ్ళందరూ సంతోషంగా వున్నారని ఆనందంగా జీవిస్తున్నారని తెలుసుకున్న ఆవిడ,  తరగతిలో తెలివైన వాళ్ళే కాదు తరగతిలో బాగా విసుగుపుట్టించే విద్యార్ధులు కూడా జీవితపు పాఠాలను నేర్చుకొని ప్రస్తుతం ఉత్తమంగా రాణిస్తున్నారని చాలా కృతజ్ఞతానుభూతి చెందింది. 


“ సిలబస్ లో లేనివి, తరగతిలో చెప్పని పాఠాలను జీవితంలో ఉపయోగించిన ఒక కుర్రవాడు ఇక్కడ వున్నాడు” అని ఆవిడ తనలో తాను అనుకుంది. 


అతడు అనుభవించిన శిక్షలు అతడ్ని పరిశీలకుడిగా ఒక విశాలమైన  దృష్టిని పెంపొందించుకోవాడానికి అవకాశం ఇచ్చాయి. క్లాసులను వదిలేసి పారిపోతూ దొరికిపోయినప్పుడు, చాలా చిన్నవయసులోనే కష్టాలను తగ్గించుకొని, వాటిని దాటడం నేర్చుకున్నాడు. 


అతడు తనకు విధించిన శిక్షను, పరిహారాన్ని తగ్గించమని ఆడగడానికి భోజనసమయంలో ఉపాధ్యాయుల గదికి వచ్చినప్పుడు చర్చించే కళను నేర్చుకున్నాడు. స్కూలులో వున్నప్పుడు అతను ఏర్పరచుకొన్న సంబంధాలు ఇప్పటికీ  బలంగా ఉన్నాయి.


లెక్కల్లో పోగొట్టుకున్న మార్కులను అతను నిజజీవితం కోసం భద్రపరుచుకున్నాడు. నూటికి నూరు మార్కులు తెచ్చుకున్న సుబ్బు  సత్యేంద్ర పోగొట్టుకున్న ఆ అంకెలతోనే పనిచేయడం ఆశ్చర్యకరమైన విషయం.


ఆవిడ ఆలోచిస్తూనే వుంది. కరోనా మహమ్మారి వలన రెండు సంవత్సరాలుగా మూసి వేసిన స్కూళ్ళు  పిల్లల స్వభావాలను మలచుకునే అవకాశం ఇవ్వకుండా బాగా నష్టాన్ని కలిగిస్తున్నాయి. 

ఇంట్లో కూర్చొని డిజిటల్ పద్దతిలో నేర్చుకోవడం కూడా గొప్ప నష్టాన్ని కలిగిస్తోంది. వాళ్ళు విద్యకు సంభందించినంత వరకు బాగా విజ్ఞానాన్ని పొంది వుండవచ్చు కానీ దానిని వాళ్ళు తమ జీవితంలో ఎలా ఆచరణలో పెట్టగలరు ?


సమాజం నిజమైన అభివృద్దిని పొందడానికి, తరగతి గదులకే పరిమితమై పుస్తకాల ద్వారా పొందేది మాత్రమే విద్య కాదు అని ప్రపంచానికి తెలియజేయడానికి సత్యేంద్ర, సుబ్బు వంటి వ్యక్తుల అవసరం చాలా ఉంది. 


(ఈ కధ వాస్తవ జీవితపు సంఘటన మీద ఆధారపడినది )


 గ్రంధాలు, పుస్తకాల నుండి పొందే జ్ఞానం జీవితపు సమస్యలను పరిష్కరించదు. అవి కేవలం పునాదిగా పనికొస్తాయి.🙏🙏🙏🙏🙏

Fb సేకరణ. 🙏

గర్భిణి స్త్రీ పాటించవలసిన నియమాలు -

 గర్భిణి స్త్రీ పాటించవలసిన నియమాలు - 


 * ఎల్లప్పుడూ మితిమీరి ఆహారాన్ని భుజించకుడదు. సులభంగా జీర్ణం అయ్యే ఆహార పదార్దాలు మాత్రమే తినాలి .


 * తినాలి అనిపించినప్పుడు వీధిలోని పదార్దాలు భుజించ కూడదు. ఇంట్లో చేయించుకొని తినాలి .


 * కొంతైనా శారీరక శ్రమ చేయాలి.


 * ప్రసవించెంత వరకు సామాన్యంగా ఇతరుల ఇళ్ళకు వెళ్ళకూడదు. ముఖ్యంగా చావులు, ఘర్షణలు , గొడవలు జరిగిన ప్రదేశాలకు వెళ్ళకూడదు .


 * గర్భిణులు బలవంతమైన అతి కష్టమైన పనులు అసలు చేయకూడదు. ఎత్తు ప్రదేశాలు ఎక్కడం , వేగంగా దిగడం చేయకుడదు . 


 * కారం, చేదు, ఉప్పు ఎక్కువ ఉన్న పదార్దాలు గర్భిణి లు తినకూడదు . 


 * పగలు నిద్రించడం, రాత్రి మేలుకోవడం , అతిగా టీవీ చూడటం, సినిమాలు చూడటం చేయకూడదు 


 * మనసుకి ఆందోళన కలిగించే విషయాలు వినకుడదు .


 * నూలు బట్టలు వదులు గా ఉన్నవి ధరించాలి.


 * మనసులో ఈర్ష్య, ద్వేషం , అసూయ లాంటి రజో,తమో గుణాలు కి గురి కాకూడదు . అలా గురి అవ్వడం వలన లోపల బిడ్డ మీద ప్రభావం పడుతుంది. పుట్టే వారు కూడా అవే లక్షణాలతో పుడతారు.


 * గర్భిణి స్త్రీలు చన్నీటి స్నానం చేయకూడదు .


 * ఆరోవ మాసం నుంచి సంభోగంలో పాల్గొనకుడదు . సంభోగం నుంచి ఆలోచనలు రాకూడదు.


 * సంభోగం లో పాల్గొనడం వలన గర్భ స్రావాలు , 8 మాసాలకే ప్రసవాలు , మృత శిశువులు పుట్టడం ఒక్కోసారి తల్లి ప్రాణానికి కూడా ప్రమాదం వాటిల్లడం జరుగుతుంది.


 * గర్భిణి స్త్రీ ఎట్టి పరిస్థితుల్లోను కొబ్బరి బొండాలు తాగకూడదు. అలా తాగడం వలన అప్పుడే నెల తప్పినా , మూడు లేకా నాలుగు మాసాల గర్భవతిగా ఉన్నా లేత కొబ్బరి బొండాల నీళ్లు తాగడం వలన గర్భ స్రావాలు జరుగుతాయి.


 * నువ్వులతో చేసిన కజ్జికాయలు, నువ్వుల నూనెతో వండిన పిండి వంటలు, నువ్వుల నూనెతో తయారయిన ఉరగాయ పచ్చళ్ళు తినడం వలన కూడా గర్భ విచ్చిత్తి జరుగుతుంది.


 * పాతకాలపు ఇళ్ళలో మొదటి సారిగా సమర్త ఆడిన ఆడపిల్లలకు నువ్వులు , బెల్లం కలిపి " చిమ్మిరి " తయారు చేస్తారు ఆ చిమ్మిరి ముద్ధలని పొరపాటుగా గర్భవతులు గనక సేవిస్తే వెంటనే గర్బం విచ్చిత్తి జరుగుతుంది.


 * రెండు, మూడు నెలలు గర్బవతులు గా ఉన్నప్పుడు అతిగా వేడిచేసే ఆవపిండి, ఆవకాయ , ఎక్కువుగా ఉప్పు , కాకరకాయ , కర్బూజా పండు , ఇంగువ, శోంటి , పిప్పిళ్ళు , మిరియాలు, నువ్వులు , బ్రాంది , విస్కీ, రమ్ , ఎక్కువ ఎండు కారం , లవంగాలు, కర్పూరం , వస, వెల్లుల్లి, సునాముఖి మొదలయిన పదార్దాలు ఎక్కువుగా వాడటం వలన కూడా గర్భ విచ్చిన్నం జరుగును.



          అనువంశిక ఆయుర్వేద వైద్యం 


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


                  9885030034