24, నవంబర్ 2020, మంగళవారం

రక్తం వృద్ది చెందుటకు

 శరీరం నందు రక్తం వృద్ది చెందుటకు సులభయోగాలు  - 


 *  ఉల్లిపాయ , ఉసిరికాయలను సమభాగాలుగా నూరి రసము తీసి ఆ రసము సేవించిన శరీరం నందు రక్తం వృద్ది చెందును. 


 *  టమాటో రసం నందు తేనే కలిపి త్రాగిన రక్తశుద్ధి జరుగును మరియు రక్తం వృద్ది చెందును 


 *  ప్రతిరోజు పడుకునే ముందు వేడిపాలు పావుసేరు తాగుతున్న రక్తంవృద్ది అగును . 


 *  పటికబెల్లం , లొహాభస్మం , పిప్పిల్లు వీటిని సమపాళ్లలో తీసుకుని పొడిచేసి పూటకు పావుతులము పొడిని నేతిలో కలుపుకుని తినుచున్న రక్తం వృద్ది అగును.


 నేను ప్రయోగించిన సిద్ధయోగం  - 


        ఒక స్పూన్ గోధుమ గడ్డి చూర్ణాన్ని ఒక గ్లాస్ తియ్యటి దానిమ్మ రసము నందు గాని ఆపిల్ రసము నందు గాని కలిపి ఉదయం మరియు రాత్రి ఆహారానికి గంట ముందు ఇచ్చినచో 40 రోజులలో శరీరము నందు రక్తం బాగా వృద్ధి అగును. ఈ యోగాన్ని నేను చాలామంది రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఇచ్చాను. చాలా అద్భుతంగా పనిచేసింది. 


                ఇది నా అనుభవ యోగం 


   గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

రియల్ స్టోరీ.

 #రియల్ స్టోరీ...


(హృదయాన్ని హత్తుకుంటుంది)


* మహారాష్ట్ర బుల్ఢానా జిల్లాలో.. ఒక చిన్న కుగ్రామం. 65 ఏళ్ల లతమ్మ (లతా భగవాన్ ఖరే) తన భర్త, ముగ్గురు ఆడపిల్లలతో జీవనం సాగిస్తుంది.


* ఆ దంపతులు ముగ్గురి ఆడపిల్లకి పెళ్లిళ్లు చేశారు. ఆ పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు మిగిలాయి. కాయ కష్టం చేసి ఋణ విముక్తులు కావటానికి వారిరువు శ్రమిస్తున్నారు. ఇలాంటి కష్టకాలంలో భర్త అనారోగ్యం పాలయ్యాడు.


*  స్థానికంగా అందుబాటులో ఉన్న మెడికల్ ప్రాక్టిషనర్ ఏదో ఇన్ఫెక్షన్ సోకిందని పట్టణంలోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నాడు. లతమ్మ నెత్తిన పిడుగు పడ్డట్టు అయ్యింది. పెద్దాసుపత్రి అంటే డబ్బులు కావాలి. చేతిలో చిల్లిగవ్వ లేని స్థితి. లతమ్మకి ఏమి చెయ్యాలో పాలుపోలేదు. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి భర్తను తీసుకువెళ్లింది. రెండు రోజులు అక్కడే ఉంచింది. భర్త నడవలేని స్థితికి వచ్చాడు. ప్రభుత్వ అసుపత్రిలో సరైన సదుపాయాలు లేవు. రోగ నిర్ధారణకి కీలకమయిన పరీక్షలు చేయాల్సి వచ్చింది. బారామతి లోని 'టెర్మినల్ హాస్పిటల్' కి వెళ్ళి కీలకమయిన టెస్ట్లు చేయించడం అత్యవసరం అని చెప్పారు.


* లతమ్మకి దుఖం ఒక్కటే మిగిలింది. తన దౌర్భాగ్యానికి బాధ పడింది. భర్త పరిస్థితి పూట., పూటకి దిగజారి పోతూవుంది. తన భర్త తన చేతుల్లో చనిపోవటం.. అనే ఆలోచన ఆమెని కుదిపేసింది. నిస్సాహాయంగా రోదించింది.. మౌనంగా ఉండటానికి కానీ, మొహమాట పడటానికి కానీ.. ఇది సమయం కాదని ఆమె గ్రహించింది. వెంటనే చుట్టు పక్కల వారిని, బంధు మిత్రులని కొంగు చాచి సాయం అడిగింది. మనసున్న మారాజులు అందించిన కొద్దిపాటి సాయంతో భర్తని బారామతి హాస్పిటల్ కి తీసుకెళ్లింది.


* అక్కడి డాక్టర్లు అతన్ని చెక్ అప్ కి రిఫర్ చేశారు. 

వరండాలో ఆమె దీనంగా కూర్చుని ఉంది. తన ఇంటి దీపాన్ని ఆర్పవద్దని.. కనబడని దేవుళ్లందరికి మొక్కుతూ ఉంది. కానీ తలచినది జరిగితే విధి గొప్పతనం ఏముంది? ఆ టెస్ట్ లు చాల్లేదు. MRI చేయించాలి. మరి కొన్ని ఖరీదైన పరీక్షలు చేయిస్తే కానీ.. జబ్బు నిర్ధారణ చెయ్యలేమని తేల్చి చెప్పేశారు. లతమ్మ ఏడుపు ఆపుకోలేకపోయింది. తన మాంగల్యం తన కళ్ల ముందే దూరం అవుతుందని ఏడ్చింది. చేతిలో పైసా లేదు. ఇంకా ఖరీదైన పరీక్షలు అంటూ.. రోధిస్తుంది. ఆమె కన్నీళ్లు..  ఆమె మాట వినడం లేదు. బోరున ఏడువ సాగింది.

ఆ రాత్రి ఆసుపత్రి వరండాలో పడుకుండిపోయారు.


 భర్త ఆకలిగా ఉందన్నాడు. ఆమె ఆసుపత్రి బయటకి వచ్చి..  రెండు సమోసాలు తీసుకొచ్చి.. భర్తకి ఇచ్చింది. నేను తిన్నాను.. నువ్వు తినేయ్ అంది. సమోసా చుట్టిన కాగితం పారవేస్తూ.. మరాఠీలో పెద్ద అక్షరాలతో ఉన్న ప్రకటన చూసింది. . “బారామతి మారథాన్ గెలవండి. 3000 వేలు నగదు పొందండి. అనే ప్రకటన చదివింది. ఆమె మనసులో అనేక ఆలోచనలు.. రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచనలతో సతమతమయ్యింది. ఒక నిర్ణయానికి వచ్చింది.


* 19-12-2013న బారామతి మారథాన్  మొదలవబోతూ ఉంది. పోటీదారులందరూ స్పొర్ట్స్ బట్టలు, బూట్లు కట్టుకుని సిద్దంగా ఉన్నారు. 

9 గజాల నేత చీర కట్టుకుని.. కాళ్ళకి కనీసం చెప్పులు కూడా లేకుండా.. తడి కళ్లతో నిలబడ్డ 65 ఏళ్ల లతమ్మ పోటీలో పోల్గొనటానికి అనుమతి అడిగింది. అందరూ ఆమెని పిచ్చి దానిలా చూశారు . ఆమెని పోటీకి అంగీకరించలేదు. కానీ.. ఆమె పట్టు విడవలేదు. వాళ్ళతో వాదించింది. ప్రాదేయపడింది. బ్రతిమాలింది. 


చివరికి బరిలో దిగింది. పోటీ మొదలయ్యింది. లతమ్మ చీర నుండి కాళ్ళు బయటకి లాగింది.. ఉడుములా పరిగెత్త సాగింది. ఆమెకి తన వయసుగాని.. కాళ్ళకి గుచ్చుకుంటున్న రాళ్ళు కానీ.. ఎర్రటి ఎండ కానీ.. తెలియలేదు. తనకు తెలిసిందల్లా.. గెలవాలి మూడు వేలు తీసుకోవాలి భర్తకి టెస్టులు చేయించాలి.. సరైన వైద్యం చేయించాలి. తన భర్త బతకాలి.. తనకి జీవితాంతం తోడు ఉండాలి.. అదే లక్షం.. అదే వేగం.. అదే పరుగు.. అదే విజయం. బారామతి మారథాన్ ఒక చరిత్ర .. బారామతి ప్రజలకి ఒక గొప్ప అదృష్టం. 

ప్రజలు చప్పట్లు మధ్య ఆమె మారథాన్ నెగ్గింది.


* నిర్వాహకులు ఆమె కన్నీటి గాధ విని చలించిపోయారు. సీనియర్ సిటిజన్ విభాగంలో ప్రైజ్ మనీ ని రూ.5 వేలుగా చేసి అందించారు. ఆ డబ్బుతో ఆమె ఆసుపత్రికి పరిగెట్టింది.


* ఆమె ప్రేమ ఊరికేపోలేదు. ఆమె లక్ష్యం ముందు సమస్య చిన్న బోయింది. భర్తకి మెరుగైన వైద్యం అందింది. అన్నీ పత్రికలు, ఛానల్స్  లతమ్మ గురించి గొప్పగా వ్రాసాయి.. చూపించాయి. దేశం నలుమూల నుండి ప్రశంశలు వెల్లువెత్తాయి. నెల తిరిగే సరికి ఆమె జీవితం మారిపోయింది. 


ఎవరో తెలియని వ్యక్తుల నుండి ఆమె బాంకు ఖాతాకి 1,75,000 పైగా పొగయ్యాయి. ఆ కుటుంబం అన్నీ విధాలా గట్టెక్కింది. అసాధ్యాన్ని పట్టుదలతో సుసాద్యం చేసిన 'లతా భగవాన్ ఖరే' ఎందరికో ఆదర్శమయ్యింది.......💐💐

One question

 

అమ్మవారు

                          
























 

స్వామి

 

Health mantra

 

నేనే చేస్తున్నాను

 నేనే చేస్తున్నాను


ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుంటూనే ఉంటాయి. కానీ నీవు నిరంతరం అవి నేనే చేస్తున్నాను అనే భ్రాంతిలో ఉంటావు. కడుపుకు ఆకలి వేస్తుంది. కానీ నీవు నాకు ఆకలి వేస్తోంది అని అంటావు. ప్రతి ఇంద్రియానికి మనల్ని మనం జోడించుకుంటాము. ఈ జోడింపుని విడదీయాలి. విడదీయాలి అంటే, నిరంతరం ఎటువంటి పనుల వెనుక నీవు, "నేను" అని అంటూ ఉంటావో, దాని వెనుక దానికి సంబంధించిన ఏ ఇంద్రియం పనిచేస్తూ ఉంటుందో, దాని ఎరుక కలిగి ఉండాలి. తిరిగి తిరిగి కాళ్ళు అలసిపోయాయి ఆనాలి. ఈ మాట అనుభవం పొందిన తరువాతే తెలుస్తుంది. నేను అలసిపోయాను అని అనడం కన్నా, కాళ్ళు అలసిపోయాయి అని అనడం యొక్క ప్రభావం చిత్తం మీద వేరేగా ఉంటుంది. ఇంద్రియాల నుండి కొంచెం దూరంగా ఎలా ఉండాలో నేర్చుకోవాలి. మనం కర్త కాదని తెలుసుకోవాలి.




మనం చేసే అన్ని కర్మలు పరమాత్మకి సమర్పించాలి అనుకుంటాము. కానీ విజయాలు "నేను"కి సమర్పించి, ఓటములు పరమాత్మకి సమర్పిస్తాము. మనం సమర్పణలో కూడా ఎంపిక ప్రదర్శిస్తాము.




కర్మ నిర్మించబడాలి అంటే మమత్వం కావాలి. "నేను" అనేది అహం ఐతే, "నాది" అనేది మమత్వం. "నాది" లేకుండా "నేను" ఉండడం కష్టం. మమత్వం పోతే కర్మ ఆగిపోయి, ఊర్ద్వయాత్ర ప్రారంభమౌతుంది. కానీ మమత్వం చాలా దట్టమైనది. ధనంలో, పదవిలో, ఆఖరికి త్యాగంలో, జ్ఞానంలో కూడా మమత్వం ఉంటుంది. ఎవరు పరమాత్మకి తమ గతం, భవిష్యత్తు సమర్పించుకోగలరో, వారే వర్తమానం లో జీవించగలరు.

గోవు

 

చిట్క

 

old is

 

Success

 

poetry

 

రెక్కలు తడిసిపోతే పక్షులు ఎగరలేవు

  రెక్కలు తడిసిపోతే పక్షులు ఎగరలేవు.

అయినప్పటికీ వర్షం రాకూడదని పక్షులు కోరుకోవడం లేదు.


జీవితం అంటే పోరాటం.

పోరాడితేనే విజయం దరి చేరుతుంది.


ఆరోగ్యమే ఆస్తి. ఆనందమే ఐశ్వర్యం.

అప్పులేనివాడే అధిక సంపన్నుడు.


ప్రయత్నిస్తే గెలుస్తామో, ఓడతామో తెలియదు. 

కానీ, గెలవాలంటే ఖచ్చితంగా ప్రయత్నించాలి.. 

ఇదే జీవితం... ఇదే నిజం...


రాసిన ప్రతి అక్షరం అద్భుతం కాకపోవచ్చు... 

కానీ, ప్రతి అద్భుతాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసినది మాత్రం అక్షరమే.


ఒకరి మనసు గాయపరచడానికి ఒక నిమిషం చాలు, కానీ గాయపడిన మనసును గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు.


అందుకే ఒకమాట అనేముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మాట్లాడాలి.

*Who is your Fallback?*

 *Who is your Fallback?* 

People help you the way they know to help you. To help you to come out of stress, one friend will ask you to drink and another will ask you to meditate. 


To overcome hurt, one friend will ask you to take revenge and get even, and another will ask you to forgive and get ahead with your life. ‘Who is your fallback’ makes all the difference. 


Duryodhana’s predicament, in his own words, was, “I know what is right but I am not able to indulge in it. I know what is wrong but I am not able to avoid it.” He needed a fallback. His fallback was his uncle Shakuni, and resultantly, Duryodhana moved from bad to worse. 


Arjuna’s predicament was different. He was allowing his personal emotions to dominate his sense of duty, and hence wanted to escape from the responsibilities he had towards upholding righteousness. He needed a fallback. His fallback was Krishna, and resultantly, Arjuna was restored to his greatness. 


Humans we are, 

At some point or the other, we all need a fallback. ‘Who is your fallback’ makes all the difference.


 *Choose Well*


 *HAPPY SUNDAY*

*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏

 *  పద్యం: 1917 (౧౯౧౭)*


*10.1-903-*


*శా. ఉద్యత్సంపద నమ్మి నందతన యోద్యోగంబునన్ వెఱ్ఱులై*

*మద్యాగంబు విసర్జనీయ మని రీ మర్త్యుల్ వడిన్ మీరు మీ*

*విద్యుద్వల్లులఁ గప్పి గర్జనములన్ వేధించి గోవుల్ జనుల్*

*సద్యోమృత్యువుఁ బొంద ఱాల్ గురియుఁడీ; శౌర్యం బవార్యంబుగన్.* 🌺



*_భావము: ఇంద్రుడు ఆ సంవర్తక మేఘములతో ఇలా అంటున్నాడు: "కూడబెట్టిన సంపదను నమ్ముకుని, నందుని కొడుకైన కృష్ణుని ప్రోత్సాహంతో ఈ మతిభ్రమించిన మానవులు నా అనుగ్రహము కొరకు యాగము చెయ్యనక్కరలేదని నిర్ణయించారు. మీరు త్వరగా వెళ్లి మీయొక్క మెరుపులతో, ఉరుములతో వీరిని, గోవులను వేధించి, మీ అపరిమితమైన పరాక్రమము ప్రదర్శించి రాళ్ళ వాన కురిపించి తక్షణమే మరణించేటట్లు చెయ్యండి"._* 🙏



*_Meaning: Indra told Samvartaka clouds: "These shortsighted cowherds, believing in their accumulated wealth and having been provoked by Krishna, decided not to perform yajna to seek my blessings. I order you to go there, torture them with frightening lightnings and thunder and show your brute power with showers of hailstorm and kill them instantly._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454).*

What made you happiest in life?"*

  In a telephone interview, the radio announcer asked his guest, a millionaire, *"What made you happiest in life?"*

The millionaire said:

I have gone through four stages of happiness in life and finally I understood the meaning of true happiness. The first stage was to accumulate wealth and means. But at this stage I did not get the happiness I wanted. Then came the second stage of collecting valuables and items. But I realized that the effect of this thing is also temporary and the lustre of valuable things does not last long.

Then came the third stage of getting big projects. Like buying a football team, buying a tourist resort, etc. But even here I did not get the happiness I had imagined. The fourth time a friend of mine asked me to buy a wheelchair for some disabled children.

At a friend's request, I immediately bought a wheelchair. But the friend insisted that I go with him and hand over the wheelchairs to the children. I got ready and went with it. There I give these chairs to these children with my own hands. I saw the strange glow of happiness on the faces of these children. I saw them all sitting on chairs, moving around and having fun. It was as if they had arrived at a picnic spot.

But I felt real joy when I started to leave and one of the kids grabbed my leg. I gently tried to free my legs but the child stared at my face and held my legs tightly.

I bent down and asked the child: Do you need anything else?

The answer that this child gave me not only made me happy but also changed my life completely. This child said: *"I want to remember your face so that when I meet you in heaven, I will be able to recognize you and thank you once again"*

విజయం గొప్పది కాదు...*

  🌻🌻🌻🌻🌻🌻🌻


🌹 *శుభోదయం* 🌹


*విజయం గొప్పది కాదు...*


*సాదించినవారు గొప్ప.*


*బాధ పడటం గొప్ప కాదు...*


*బాధను తట్టుకునేవారు గొప్ప.*


*భాందవ్యాలు గొప్ప కాదు...*


*వాటిని నిలబెట్టుకునేవారు గొప్ప.*

🌻🌻🌻🌻🌻🌻🌻

Ram Mandir Bell

  Ram Mandir Bell is ready... Single Cast piece, easily the largest, 6’ X 5’, weighing 2,100 Kgs made of, *"Ashtadhatu"* a combination of 8 Metals:

Gold,

Silver,

Copper,

Zinc,

Lead,

Tin,

Iron,

&

Mercury.. 


The Bell is going to Shri Ram Temple in Ayodhya from Ramakrishna Nadar Vessels Shop in Eral, near Tuticorin,Tamil Nadu..


Listen to its Mangal Naada.. .. *This Bell can be heard up to 15 Kms.*

పరిశుభ్రత పరిరక్షణ

 

మంచి సంగీతం

 

s

 

పూజ చేస్తే జీవితం అద్భుతంగా మారుతుంది?

  ఏ రోజు ఏం పూజ చేస్తే జీవితం అద్భుతంగా మారుతుంది?

నిత్యం దేవారాధ‌న శుభ‌క‌రం. అయితే ఏ రోజు ఏ పూజ చేయాలో చాలా మందికి తెలియ‌దు. నిజానికి ఏ రోజు ఏ పూజ చేస్తే సంపూర్ణ ఫ‌లాన్ని , అభిష్ట‌సిద్ధిని పొంద‌గ‌ల‌గుతారో  తెలుసుకుందాం. 

ఆదివారం చేయాల్సిన పూజలు

ఆదివారం ఆదిత్యుడిని, ఇతర దేవతలను, వేద పండితులను పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్ర వ్యాధులు, శిరోరోగం, కుష్ఠువ్యాధి తగ్గుతాయి. ఆదిత్యుడిని పూజించి పేద‌ల‌కు అన్న‌దానం చేస్తే శుభ‌క‌రం. ఇలా ఒక రోజు నుంచి ఒక మాసం, ఒక సంవత్సరం లేక 3 సంవత్సరాల పాటు రోగ తీవ్రతనను బట్టి పూజ చేయాలి. దీనివల్ల సూర్యానుగ్రహప్రాప్తి కలుగుతుంది.

సోమవారం చేయాల్సిన పూజలు 

సంపద కోరుకోనేవారు సోమవారం లక్ష్మీదేవిని ఆరాధించాలి. అదే విధంగా ప‌ర‌మ‌శివుడిని అభిషేకించి ఆరాధ‌న చేయ‌లి. ఆ రోజున పూజ తర్వాత నెయ్యితో వండిన ప‌దార్థాల‌ను అతిథుల‌కు, బంధువుల‌కు పెట్టి, తాము కూడా స్వీక‌రించాలి.

మంగళవారం చేయాల్సిన పూజలు

ఆరోగ్య సమస్యలు తగ్గేందుకు మంగళవారం కాళీ దేవతను పూజించాలి. శ‌త్రువుల నుంచి న‌ర‌దృష్టి నుంచి విముక్తిపొందుట‌కు శ్రీ‌సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామిని ఆరాధించి ఆరోజు మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో అన్న‌దానం చేయాలి.

బుధవారం చేయాల్సిన పూజలు

మంచి ఆలోచ‌న‌తో కార్య‌సిద్ధిపొందుట‌కు విద్యార్థుల‌కు మేధాశ‌క్తి పెరిగి ప‌రీక్ష‌ల‌యందు విజ‌యాన్ని సాధించుట‌కుగాను బుధవారం రోజున క‌లియుగం దైవం శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌స్వామిని మ‌రియు జ్ఞాన స‌ర‌స్వ‌తిని ఆర్చించి ఆరాధించి పెరగ‌న్నంను నివేదించాలి. ఈ పూజ, నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు, భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యంతో పాటు మంచి ఆలోచ‌న శ‌క్తి పెరిగి అన్నింట విజ‌యం సాధించ‌గ‌ల‌రు. 

గురువారం చేయాల్సిన పూజలు

ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టదైవంతో పాటు శివునికి అర్చ‌న అభిషేకం చేసి పాలు-నెయ్యితో చేసిన పాయ‌సంతో పాటు ఇత‌ర  పదార్థాలను నివేదించాలి. వస్త్రాలను దేవ‌త‌ల‌కు స‌మ‌ర్పిస్తే కూడా శుభకరం.

శుక్రవారం చేయాల్సిన పూజలు

శుక్రవారం రోజు ల‌క్ష్మి ప్రాప్తికై శ్రీ‌ల‌లితాంబ, అష్ట‌ల‌క్ష్ముల‌తో పాటు ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించాలి. ఈ రోజు పూజానంతరం ముత్తైదువుల‌కు తాంబూలంతో పాటు ఫ‌లాలు స‌మ‌ర్పించి తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. స్త్రీల తృప్తి కోసం మంచి మంచి వస్త్రాలను బహూకరించడం మంచిది.

శనివారం చేయాల్సిన పూజలు

శనివారం రుద్రాది దేవతలతో పాటు విష్ణు, శ‌ని, ఆంజ‌నేయ‌స్వామిస్వామి వారి ఆరాధన మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇచ్చి నువ్వులు కలిపిన అన్నంతో అన్న‌దానం చేస్తే, పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. అదేవిధంగా శని దోష నివార‌ణ క‌లిగి శుభం చేకూరుతుంది.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

ఆత్మలు ఇతర శరీరాలలోకి ప్రవేశించ

  డాక్టర్ సింగ్* : 


జంతువుల నుండి ఆత్మలు ఇతర శరీరాలలోకి ప్రవేశించ

డానికి, మానవుల నుండి ఆత్మలు ఇతర శరీరాలలోకి ప్రవేశించడానికి

*గల భేదం ఏమిటి?*

*శ్రీల ప్రభుపాదులు :*

1. జంతువులలోని ఆత్మలు ఉన్నత దశ వైపుకు మాత్రమే

పయనించ గలవు. కాని మానవులలోని జీవాత్మలు ఉన్నత స్థితికైనా, నీచ

స్థితికైనా ప్రయాణించగలవు.


2. జీవులకు వారి ఇచ్ఛానుసారమే తగిన శరీరం

ఇవ్వబడుతుంది. క్రింది తరగతి జంతువులకు ఒక్క కోరికే ఉంటుంది.



3.మానవులకు వేలకొలది, లక్షలకొలది కోర్కెలు ఉంటాయి. వారు మానవ

వాంఛలను, పశువాంఛలను కూడా కలిగి ఉంటారు. 


4.ప్రకృతి నియమాను

సారంగా జంతువులలోని జీవాత్మ పై పై తరగతులకు అంటే మానవ స్థితికి చేరుకుంటుంది. 


5.మానవ జన్మను పొందిన తరువాత కృష్ణచైతన్యాన్ని

పొందుటకు ప్రయత్నించకపోతే మరుసటి జన్మలో కుక్కలుగా గాని పిల్లులుగా

గాని జన్మించి వెనుకకు పోతారు,


*1973మే 13,శ్రీల ప్రభుపధ* 

ఒక అద్భుతమైన కథ

  ఒక అద్భుతమైన  కథ


రాత్రి 11 గంటలకు.  తాళం వేసిఉన్న ఇనుప ద్వారం  బయట నుండి ఒక పిలుపు.  ఎవరా అని వచ్చి చూశాను.  గుమ్మం ముందు ఒక పెద్దాయన ఉన్నారు.  చాలా దూరం వచ్చినట్లుగా నలిగిపోయిన  బట్టలు చేతిలో చిన్న సంచి తో నిలబడి  ఉన్నారు.  అయన తన చేతిలోని చిన్న కాగితం లోకి చూస్తూ "ఆనంద్, నెంబర్ 8, యోగానంద వీధి ఇదే కదూ!" అని అడిగారు.  "అవును నేనే ఆనంద్.  ఇదే చిరునామా.  మీరూ ..." అని అడిగాను.  అయన చిన్నగా వణుకుతూ తడారి పోయిన తన పెదవులను నాలుక తో  తడుపుకుంటూ "బాబూ!  నేను మీ నాన్నగారి మిత్రుడిని.  మీ ఊరినుండే వస్తున్నాను.  నాన్నగారు మీకు ఈ ఉత్తరం ఇచ్చి మీ సాయం తీసుకోమన్నారు" ఉత్తరాన్ని చేతిలో పెట్టారు.  


అయన ఆ ఉత్తరం ఇవ్వగానే "నాన్నగారా?" అంటూ ఆ ఉత్తరాన్ని తీసుకొని ఆత్రంగా చదివాను.  అందులో "ప్రియమైన ఆనంద్!  నీకు నా ఆశీర్వాదములు.  ఈ ఉత్తరం తీసుకుని వచ్చిన వ్యక్తి నా స్నేహితుడు.  పేరు రామయ్య.  చాలా కష్టజీవి.  కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ఒక ఆక్సిడెంట్  లో చనిపోయాడు.  నష్టపరిహారం  కోసం తిరుగుతున్నాడు.  అది వస్తే అయనకు, ఆయన భార్యకు రోజు గడవడానికి కాస్త తోడవుతుంది.  ఆక్సిడెంట్ జరిగిన తరువాత పోలీస్ వారి విచారణలు, ట్రావెల్స్ వారు ఇస్తామని అన్న నష్టపరిహారపు పేపర్లు అన్ని సేకరించి  నీకు పంపాను.  డబ్బులు Head Office  లో తీసుకోమన్నారు.  ఆయనకు హైదరాబాద్  కొత్త.  ఏమి తెలియదు.  నువ్వు ఆయనకు సహాయం చేస్తావని నమ్ముతున్నాను.  ఆరోగ్యం జాగ్రత్త.  కుదిరినప్పుడు ఒక్కసారి ఊరికి రావాల్సిందిగా కోరుతూ

మీ నాన్న" అని ఉంది.  


నన్నే చూస్తూ నిలబడి ఉన్నారు రామయ్యగారు.  ఒక్క నిమిషం అలోచించి ఆయనను లోనికి ఆహ్వానించాను.  మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చి "ఏమైనా తిన్నారా" అని అడిగాను.  "లేదు బాబూ.  ప్రయాణం ఆలస్యం కావడంతో నాతో పాటు తెచ్చుకున్న రెండు పళ్ళు మాత్రం తిన్నాన"ని  చెప్పారు.


నాలుగు దోశలు వేసుకొచ్చి అందులో కొద్దిగా ఊరగాయ వేసి ఆయన చేతిలో పెట్టాను.  "మీరు తింటూ ఉండండి" అని చెప్పి, ఆ గది బయటకు వచ్చి కొన్ని ఫోన్ లు చేసుకొని తిరిగి ఆయన దగ్గరకు వచ్చాను.  నేను వచ్చి చూసే సరికి ఆయన దోశలు ఆరగించి, చేతిలో ఏవో పేపర్లు పట్టుకుని కూర్చున్నారు.  నన్ను చూసి ఆ పేపర్ లు నా చేతిలో పెట్టారు.  అందులో ఆక్సిడెంట్ లో చనిపోయిన వారి అబ్బాయి ఫోటో కూడా ఉంది.  కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు.  సుమారు 22 సంవత్సరాల వయసు ఉంటుంది.  నా కళ్ళలో నీళ్లు తిరిగాయి.  


"ఇతడు నా ఒక్కగానొక్క కొడుకు.  అంతకు ముందు పుట్టినవారు చిన్నతనం లోనే అనేక కారణాల వలన చనిపోయారు.  ఇతడు మాత్రమే మాకు మిగిలాడు.  పేరు మహేష్.  కష్టపడి చదివించాను.  బాగా చదువుకుని  ఉద్యోగం సంపాదించుకున్నాడు.  మమ్మల్ని చూసుకుంటానని, కష్టాలన్నీ తీరపోతాయని చెప్పి ఉద్యోగంలో చేరాడు.  ఆ రోజు రోడ్ దాటుతుండగా ఆక్సిడెంట్ జరిగింది.  అక్కడికక్కడే చనిపోయాడు.  నష్టపరిహారం తీసుకోవడం ఇష్టం లేక బిడ్డ పైన వచ్చిన పైకం వద్దనుకున్నాము.  కానీ రోజు రోజుకీ నాలో శక్తి తగ్గిపోతోంది.  నా భార్య ఆరోగ్యం బాగా  లేదు.  మీ నాన్నగారి బలవంతం మీద ఇప్పుడు వచ్చాను.  నా కొడుకు సహాయం చేస్తారని చెప్పి ఈ ఉత్తరం ఇచ్చి పంపారు మీ నాన్నగారు" అని ముగించారాయన.  


"సరే పొద్దు పోయింది, పడుకోండి" అని చెప్పి నేను కూడా నిదురపోయాడు  


పొద్దున లేచి స్నానాదికాలు ముగించుకుని, కాఫీ తాగి ఇద్దరం బయల్దేరాము.  దారిలో టిఫిన్ ముగించుకుని ఆయన తీసుకొచ్చిన పేపర్ల లోని అడ్రెస్ ప్రకారాం ఆ ఆఫీస్ కు చేరుకున్నాము.  "ఆనంద్!  ఇక నేను చూసుకుంటాను.  నువ్వు ఆఫీస్ వెళ్ళు బాబు" అన్నారాయన.  "పర్లేదండి.  నేను లీవ్ పెట్టాను" అన్నాను.  దగ్గరుండి ఆ నష్టపరిహారం ఇప్పించాను.  చాలా థాంక్స్ బాబూ!  నేను ఊరికి బయల్దేరుతాను.  మా ఆవిడ ఒక్కతే  ఉంటుంది ఇంట్లో" అని చెప్పి తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యారు రామయ్య గారు.  "రండి, నేను మిమ్మల్ని బస్సు ఎక్కించి వెళ్తా" అని చెప్పి, టిక్కెట్ తీసి ఇచ్చి, ఇప్పుడే వస్తానని వెళ్లి దారిలో తినడానికి పళ్ళు అవి తెచ్చి రామయ్య చేతిలో పెట్టాను.  


ఆయన సంతోషంగా "ఆనంద్ బాబూ!  నాకోసం సెలవు పెట్టుకొని, చాలా సాయం చేశావు.  ఊరు వెళ్ళగానే మీ నాన్నకు అన్ని విషయాలు చెప్పాలి.  కృతజ్ఞతలు తెలియచేయాలి అన్నాడు.  


అప్పుడు నేను నవ్వుతూ రామయ్య గారి చేతులు పట్టుకుని "నేను మీ స్నేహితుడి కొడుకు ఆనంద్ ని కాదండీ.  నా పేరు అరవింద్.  మీరు వెళ్లవలసిన చిరునామా మారి నా దగ్గరకు వచ్చారు.  ఆ చిరునామ ఇంటికి వెళ్లాలంటే అంత రాత్రిపూట 10 km ప్రయాణం చేయాలి.  మీరేమో  అలసిపోయి ఉన్నారు.  అందుకే నేను నిజం చెప్పలేదు.  మీరు తెచ్చిన లెటర్ లో ఫోన్ నెంబర్ ఉండడంతో వారికి ఫోన్ చేశాను.  ఆ ఆనంద్ ఏదో పని మీద వేరే ఊరు వెళ్లారట.  ఆ మిత్రుడికి విషయం చెప్పాను.  అయన చాల బాధ పడ్డారు, నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పడంతో కాస్త కుదుట పడ్డారు.  మీకు జరిగిన నష్టం నేను తీర్చలేనిది.   కానీ ఏదో నాకు చేతనైన సహాయం చెయ్యాలనిపించింది.  నాకు ఆ తృప్తి చాలండి" అన్నాను.  బస్సు కదలడం తో ఒక్కసారి రామయ్యగారు తన కన్నీటితో నా చేతులను తడిపేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.  "నువ్వు బాగుండాలి బాబు" అని ఆశీర్వదించారు.  ఆ మాటే చాలనుకున్నాను నేను.  పదిహేను సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు.  ఇప్పుడు ఈ రామయ్య గారిని చూస్తూ ఉంటే ఆయన ముఖం లో మా నాన్నగారు కనిపించారు.  


ఆకాశంలోకి చూశాను.  అక్కడే ఎక్కడో ఉండి ఉంటారు మానాన్న.  "నాన్నా!  నా అభివృద్ధి  చూడడానికి ఈ రూపంలో వచ్చావా నువ్వు!  ఒక ఉత్తరం తీసుకువచ్చి నాకు చూపి నేను సాయం చేస్తానో లేదో అని పరీక్షించావా?  మీ వంటి ఉత్తమమైన తండ్రికి కొడుకుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను నాన్నా!  మీకు సంతోషమేనా నాన్నా!" అంటూ ఆనంద బాష్పాలు రాల్చాను.  


"సాయం చెయ్యడానికి మనసు ఉంటే చాలు.  మిగిలినవన్నీ

 దానికి తోడుగా నిలబడతాయి"

ఈ కథ చదవగానే నాకు కళ్లల్లో నీళ్లు వచ్చాయి 


ఈ కథ మీ కూడా నచ్చితే మీ స్నేహితులకు షేర్ చేయండి 

ఇట్లు 

మీ ప్రియమైన స్నేహితుడు.       

K.V.R.K.MOHAN 

అవసరం లో ఉన్నవారికి సాయ పడదాం 🤝🤝🤝

🌷🌷🌷శుభరాత్రి🌷🌷🌷

achievements of opening partners Modi and Shah.

  Unknown achievements of opening partners  Modi and Shah. 


A few days ago, Modi inaugurated the statue of Swami Vivekananda in the JNU campus. This was vandalized by the tukde tukde gang during the anti-CAA protests.


This inauguration was highly symbolic. During the heat of the protests, the Center did nothing, in spite of heavy pressure from us.


But after the protests were over and the media spotlight moved on, the Center closed in. They went after every single mastermind who were behind it. They untangled the whole web, the money trails, the political connections, the student unions, etc. The key people were arrested, the funding was stopped. Where are the foot soldiers today? Where is, for example, Shehla Rashid? She was jumping around like a baboon in heat during the protests... now that entire gang must be begging on some street like a bunch of orphans.


After reaching this stage, the statue was inaugurated. No protests. To us, it is a symbol of closure, that the chemotherapy treatment in one of the organs of the body of India has been successful.


The treatment is ongoing in many other organs now.


But there are many more. Remember how hurt we all were during the Sabrimala protests? The gold scam has given the Centre the opportunity and now they are going after the Commie govt with all guns blazing.


Remember D J Halli? No? Forgotten already? No worries, the Center hasn't forgotten it. Just today, the Congress politician who had instigated the riots was arrested. In fact, there has been 53 arrests in this case till now.


Remember SSR? The entire drugs underworld in Mumbai is now getting dismantled. I'm sure its political connections will also get exposed in due course of time. Why do you think Arnab was arrested?


And there are so many more of such examples of the BJP working silently to destroy the cancer eating away at our nation. The foreign-funded conversion mafia of TN and Andhra, the baby stealing charities, the terror networks in Kashmir, WB, and Kerala, the black-money economy, and so many more.


And one glorious day, either Modi or Yogi will declare India a Hindu Rashtra and there won't be any organized protests… because there won't be any organizers left. And among the common people, no one will mind, because no one will be left to do any mindless fear-mongering.


Those of you who blame Modi for "not doing anything", think of the big picture and the long term goals.


And ask yourself this - how much more can we expect of one man?

🚩 _*కార్తీకపురాణం*_🚩

  🚩 _*కార్తీకపురాణం*_🚩 

🚩 _*5 వ అధ్యాయము*_🚩


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*వనభోజన మహిమ*


☘☘☘☘☘☘☘☘


ఓ జనక మహారాజా! కార్తీక మాసములో స్నాన దాన పూజానంతరమున శివాలయమున నందు గాని విష్ణాలయము నందు గాని శ్రీ మద్భగవద్గీతా పారాయణము   తప్పక చేయవలయును అట్లు చేసినవారి సర్వ పాపములును నివృతి యగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు 

వెళ్ళుదురు. భగవద్గీత  కొంత వరకు పఠించిన  వారికీ విష్ణు లోకం ప్రాప్తించును కడ కందలి శ్లోకము లో నొక్క పదమైననూ కంటస్థ మొనరించిన యెడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరి కాయలతో నిండి వున్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యదోచితంగా  పూజించి , విష్ణుమూర్తిని ధ్యానించి ,  ఉసిరి చెట్టు నీడన  భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించ వలయును.

వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం  చేయవలయును. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజ రూపము కలిగెను - యని  వశిష్టుల వారు  చెప్పిరి. అది విని జనక రాజు *'ముని వర్యా ! ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మమేల కలిగెను ? దానికి గల  కారణమేమి యని'* ప్రశ్నించగా వశిష్టుల వారు ఈ విధంబుగా చెప్పనారంబించిరి.


*కిరాత మూషికములు మోక్షము నొందుట*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


రాజా ! కావేరి తీర మందొక చిన్ని గ్రామమున దేవశర్మ యను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. వారి పేరు శివశర్మ . చిన్న తనము నుండి భయ భక్తులు లేక అతి గారాబముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై  మెలగుచుండెను. అతని దురచారములును చూచి ఒకనాడతని  తండ్రి కుమారుని పిలిచి *'బిడ్డా ! నీ దురాచారములు అంతులేకుండా వున్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొను చున్నారు. నన్ను నిలదీసి  అడుగు చున్నారు. నీవల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేక పోవుచున్నాను. కాన , నువ్వు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి , శివ కేశవులను స్మరించి , సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన యెడల , నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును. కాన , నీవు అటులచేయు'* మని భోదించెను. అంతట కుమారుడు *'తండ్రీ ! స్నానము చేయుట వంటి మురికి పోవుటకు మాత్రమే కానీ వేరు కాదు ! స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా ! దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి ? వాటిని యింటిలోనే పెట్టుట మంచిది కదా ?'* అని వ్యతిరేకర్ధములతో పెడసరంగా సమాదాన మిచ్చెను. కుమారుని సమాధానము 

విని , తండ్రీ *' ఓరి నీచుడా ! కార్తీక మాస ఫలము నంత చులకనగా చుస్తునావు కాన , నీవు అడవిలో రవి చెట్టు తొర్ర యందు ఏలుక రూపములో బ్రతికేదవుగాక '* అని కుమారుని శపించెను. ఆ శాపంతో కుమారుడగు శివశర్మ కు జ్ఞానోదయమై బయపడి తండ్రీ పాదములపై బడి *' తండ్రీ  క్షమింపుము. అజ్ఞానందకారంతో కరములో బడి దైవమునూ , దైవకార్యములనూ  యెంతో చులకన చేసి వాటి ప్రభాములను గ్రహింపలేకపోతిని. ఇప్పుడు నాకు  పశ్చాత్తాపము కలిగినది. ఆనక శాపవిమోచనమోప్పుడు  ఏవిదముగా కలుగునో దానికి తగు తరుణోపాయ వివరింపు'* మని ప్రాదేయ పడెను. అంతట తండ్రీ *' బిడ్డా ! నా శాపమును అనుభవించుచు మూషికమువై  ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొందుదువు '*  అని కుమారుని వూరడించెను. వెంటనే శివశర్మ  ఏలుక రూపము పొంది అడవికి పోయి , ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలమును తినుచు జీవించుచుండెను.

ఆ అడవి కావేరి నది తీరమునకు సమీపమున నుండుటచే స్నానర్ధమై నదికి వెళ్ళు వారు అక్కడ నున్న ఆ పెద్ద వట వృక్షము నీడన కొంత సేపు విశ్రమించి , లోకబి రామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళు చుండెడి వారు. ఇట్లు కొంత కాలమైన తరువాత కార్తీక మాసములో ఓక రోజున మహర్షి యను విశ్వా మిత్రులవారు శిష్యాసమేతముగా  కావేరి నదిలో స్నానర్ధమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము వున్న ఆ వట వృక్షం క్రిందనకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి. ఈ లోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము విరి దగ్గరనున్న పూజద్రవ్యములలో నేదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బైటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను. 


అంతలో ఓక కిరాతకుడు విరి జాడ తెలుసుకొని *'విరు బాటసరులై వుందురు. విరి వద్ద నున్న ధనమపహరించ వచ్చు' ననెడు దుర్భుద్ది తో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునిశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపొయినది. వారికీ నమస్కరించి ' మహానుభావులారా ! తమరు ఎవరు ? ఎందుండి వచ్చితిరి ? మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది ? గణ , వివరింపుడు '* అని ప్రదేయపడెను. అంత విశ్వా మిత్రుల వారు ' ఓయి కిరాతక ! మేము కావేరి నది స్నానర్దామై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నాన మాచరించి కార్తీక పురాణమును పఠింన్చుచున్నాము. నీవును యిచట కూర్చుని సావదానుడవై ఆలకింపుము' అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్దగా ఆలకించు చుండగా తన వెనుకటి జన్మ వృత్తంత మంతయు జ్ఞాపకమునకు వచ్చి , పురాణ శ్రవణ నంతరము  వారికీ ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి యుండి పురాణ మంతయు వినుచుండిన యెలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణా రూపము నొంది *' ముని వర్య ! ధన్యోస్మి  తమ దయ వల్ల నేను కూడా యీ మూషిక రూపము నుండి విముక్తుడ నైతినని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను. కనుక జనకా ! ఇహములో సిరి సంపదలు , పర లోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి , యితరులకు వినిపించావలెను.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత  వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి*

*ఐదవ అధ్యయము - ఐదవ రోజు పారాయణము సమాప్తం.*


🚩🕉️🕉️🌹🌹🕉️🕉️🚩

  🚩 _*6 వ అధ్యాయము*_🚩


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


 *దీపదానవిధి - మహాత్మ్యం*

*లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట*


🕉️☘️☘☘☘☘☘🕉️


ఓ రాజశ్రేష్ఠుడా ! ఏ మానవుడు కార్తీకమాసము నెల రోజులూ పరమేశ్వరుని , శ్రీ మహావిష్ణువును , పంచామృత స్నానంచేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో , అట్టివానికి అశ్వమేథయాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే యే మానవుడు కార్తీకమాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట యెటులనగా పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరచి , వత్తులు చేయవలెను. వరిపిండితో గాని , గోధుమపిండితోగాని ప్రమిద వలె చేసి వత్తులు వేసి , ఆవునెయ్యి వేసి , దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షణ కూడా యివ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీకమాస మందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి  నిండుగాపోసి వెనుక చేసిన ప్రకారముగా గోదుమపిందితో ప్రమిదను చేసి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి యీ నెల రోజులూ దానము చేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానముచేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానమిచ్చిన యెడల సకలైశ్వర్యములు కలుగటయేగాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు యిట్లు పటింపవలెను.


*సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సుఖవహం |*

*దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ ||*


అని స్తోత్రంచేసి దీపదానం చేయవలెను. దీని అర్ధమేమనగా , *"అన్ని విధముల జ్ఞానం కలుగచేయునదియు , సకల సంపదలు నిచ్చునదియునగు యీ దీపదానము చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక !"* యని అర్ధము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేనియెడల పది మంది బ్రాహ్మణులకైననూ భోజనమిడి దక్షణ తాంబూలముల నివ్వవలెను. ఈ విధంగా పురుషులుగాని , స్త్రీలుగాని యే ఒక్కరు చేసిననూ సిరి సంపదలు , విద్యాభివృద్ధి , ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు .  దీనిని గురించి ఒక యితిహాసం గలదు. దానిని వివరించెద నాలకింపుమని వశిష్ఠుడు జనకునితో యిట్లు చెప్పసాగెను.


*లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


పూర్వ కాలమున ద్రవిడ దేశమునందొక గ్రామమున నొక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొద్ది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని , ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుచే ఆమె యితరుల యిండ్లలో దాసి పని చేయుచు , అక్కడనే భుజించుచు , ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులిచ్చిన యెడల ఆ వస్తువులను యితరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగయిన సొమ్మును వడ్డీలకు యిచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు , దొంగలు దొంగిలించి కూడ తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని యితరులకు యెక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను.


ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల యిండ్లలో దాసీపనులు చేస్తూ , తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి ? ఆమె ఒక్కదినము కూడా ఉపవాసము గాని , దేవుని మనసార ధ్యానించుటగాని చేసి యెరుగదు. పైగా వ్రతములు చేసేవారిని , తీర్ధయాత్రలకు వెళ్ళేవారిని జూచి అవహేళన చేసి , యే ఒక్క భిక్షగానికిని పిడికెడు బియ్యము పెట్టక , తాను తినక ధనమును కూడబెట్టుచుండెడిది.


అటుల కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగానాయకులను సేవించుటకు బయలుదేరి , మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి , ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామములోని మంచిచెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని అమెకడకు వెళ్లి *"అమ్మా ! నా హితవచనము లాలకింపుము. నీకు కోపము వచ్చినాసరే నేను చెప్పుచున్న మాటలను అలకింపుము. మన శరీరములు శాశ్వతముకావు. నీటి బుడగలవంటివి. ఏక్షణములో మృత్యువు మనలను తీసుకొనిపోవునో యెవరూ చెప్పలేరు. పంచభూతములు , సప్తధాతువులతో నిర్మించబడిన యీ శరీరములోని ప్రాణము - జీవము పోగానే చర్మము , మాంసము కుళ్లి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి యీ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లీ ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి , దగ్గరకు వెళ్లి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా యీ తనువు శాశ్వతమని నమ్మి , అంధకారములో బడి నశించుచున్నాడు. కాన , నా మాట లాలకించి నీవు తినక , ఇతరులకు పెట్టక , అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైన పేదలకు దానధర్మములు చేసి , పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి , వ్రతాదికములు చేసి మోక్షము నొందుము. నీ పాపపరిహరార్ధముగా, వచ్చే కార్తీకమాసమంతయు ప్రాతఃకాలమున నదీ స్నానమాచరించి , దానధర్మముల జేసి , బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగల"* వని ఉపదేశమిచ్చెను.


ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటినుండి దానధర్మములు చేయుచు కార్తీకమాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము నొందెను. కావున *కార్తీకమాసవ్రతములో* అంత మహత్మ్యమున్నది.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఆరవ అధ్యాయము - ఆరవ రోజు పారాయణము సమాప్తము.*


🚩🕉️🕉️🌹🌹🕉️🕉️🚩

🚩 _*7 వ అధ్యాయము*_🚩


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*శివకేశవార్చనా విధులు*


🕉️☘☘☘☘☘☘🕉️


ఓ జనక రాజేంద్రా ! కల్మషఘ్నమైన కార్తీక మహాత్మ్యంలో పుష్పార్చనా - దీప విధానాలను చెబుతాను విను.


*పుష్పార్చనా ఫలదాన దీపవిధి - విశేషములు:*


ఈ కార్తీక మాసములో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించటం వలన  కమలాసనియైన లక్ష్మిదేవి ఆ భక్తుల యిండ్ల స్ధిరనివాస మేర్పరచుకుంటుంది. తులసీ దళాలతోగాని , జాజిపువ్వులతోగాని , మారేడు దళాలతో గాని పూజించేవారు తిరిగి యీ  భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీకములో భక్తియుతులైన పండ్లను దానము చేస్తారో వారి పాపాలు  సూర్యోదయానికి చీకట్లవలె చెదిరిపోతాయి. ఉసిరిచెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తేరిజూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. కార్తీకములో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీదళాలతో పూజిస్తారో , వారికి మించిన ధన్యులెవరూ  ఉండరనడం అతిశయోక్తి కాదు.


బ్రాహ్మణ సమేతులై , ఉసిరిచెట్టు వున్న తోటలో - వనభోజనమును చేసేవారి మహాపాతకాలు సైతము మట్టిగలసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరిచెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువువలె ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసములో  విష్ణ్వాలయములో మామిడాకుల తోరణం కడతారో , వాళ్లు పరమపదాన్ని పొందుతారు. పువ్వులతోగాని , అరటి స్తంభాలతో గాని మండపము కట్టినవాళ్లు వైకుంఠములో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండప్రణామమును చేసిన వాళ్లు అశ్వమేథ పుణ్యవంతులవుతారు. విష్ణువున కెదురుగా జప , హోమ దేవతార్చనలు చేసే వాళ్లు పితరులతో సహా వైకుంఠానికి వెళ్లి సుఖిస్తారు. స్నానము చేసి తడిబట్టలతోనున్న వానికి పొడిబట్టని దానము చేసిన వాడు పదివేల అశ్వమేథాల ఫలాన్ని పొందుతాడు. ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి -  పుష్పము  పరాగమువలె యెగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసెపూలతో హరిపూజను చేసిన వారికి పదివేల యజ్ఞాల ఫలితము ప్రాప్తిస్తుంది.


కార్తీకమాసమందు యే స్త్రీ అయితే బృందావనాన గోమయంతో అలికి , పంచరంగులతోనూ , శంఖ - పద్మ - స్వస్తికాదిరంగ వల్లులను తీరుస్తుందో ఆమె విష్ణువుకు ప్రియురాలవుతుంది. విష్ణు సన్నిధిలో నందా దీపాన్ని ఆర్పించడం వలన కలిగే పుణ్యాన్ని వేయినోళ్ల అదిశేషుడైనా పొగడలేడు. ఈ కార్తీకమాసములో శివుని జిల్లేడుపూలతో పూజించినవాడు దీర్ఘయువై , అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. విష్ణ్వాలయములో మండపాన్ని అలంకరించినవారు హరి మందిరములో చిరస్థాయిగా వుంటారు. హరిని మల్లెపువ్వులతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమై పోతాయి. తులసీ గంధముతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వసంచిత పాపాలన్నీ నాశనమై పోతాయి. భక్తియుక్తులై  అన్నదానమును చేసే వారి పాపాలు గాలికి మంచుతునకలలా యెగిరిపోతాయి.  ప్రత్యేకించి కార్తీక మాసములో నువ్వుల దానము , మహానదీ స్నానము , బ్రహ్మపత్ర భోజనము ,  అన్నదానము ఈ నాలుగూ ఆచరించడం ధర్మముగా చెప్పబడుతూ వుంది. స్నాన దానాదులను నాచరింపనివారూ , లోభియై యధాశక్తిగా చేయని వారు నూరు జన్మలు కుక్కగా పుట్టి , తదుపరి నూరుపుట్టుకలూ శునకయోనిని జన్మిస్తారు.


కార్తీకమాసములో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలాన్ని భేదించుకుని స్వర్గానికి వెడతారు. పద్మాలతో పూజించినవారు చిరకాలము సూర్యమండలములోనే నివసిస్తారు. ఓ  జనక మహారాజా ! కార్తీక మాసములో యెవరైతే అవిసె పువ్వుల మాలికలతో  శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గధిపతులవుతారు. మాల్యములు - తులసీదళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక్క సూక్ష్మాన్ని చెబుతాను విను , అశక్తులయిన వాళ్లు.



      *శ్లో || కార్తీకే భానువారేతు స్నానకర్మ సమాచరేత్ !*

        *మాసస్నానేన యత్సుణ్యం తత్పుణ్యం లభతేనృప !!*

    *శ్లో|| ఆద్యేంతియే తిథౌ మధ్యమే చ దినే యః స్నానమాచరేత్ !*

         *మాస స్నాన ఫలం తేన లభ్యతే నాత్ర సంశయః !!*


కార్తీకమాసంలో ఆదివారం  నాడు లేదా శుక్ల పాడ్యమి నాడు గాని , పూర్ణమనాడు గాని , అమావ్యానాడు గాని సంకల్పరహితముగా ప్రాతఃస్నాన మాచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానము చేసిన పుణ్యం లభిస్తుంది. *'ఆ పాటి శక్తి కూడా లేని వాళ్లు  కార్తీకమాసము నెల రోజులూ ఈ సంపూర్ణ  కార్తీక మహాపురాణాన్ని చదివినా , వినినా కూడా  స్నానఫలాన్ని పొందుతారు. ఇది కేవలం ఆశక్తులకే సుమా ! మహీశా ! కార్తీకమాసములో యితరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవారి పాపాలు నశించిపోతాయి. కార్తీకమాసము విష్ణుపూజార్ధమై యితరులకు సహకరించేవారు స్వర్గాన్ని పొందుతారు. తాము స్వయంగా సంకల్ప పూర్వకముగా విష్ణువును పూజించేవాళ్ళు అవ్యయ పదాన్ని పొందుతారు. కార్తీకమాసము సాయంకాలాలలో దేవాలయాలలో శివ - విష్ణుస్తోత్రాలను పఠించేవారు - కొంతకాలము స్వర్గలోకములో వుండి - అనంతరము ధ్రువలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతీ ! కార్తీక మాసములో యెవరైతే హరిహరులను స్మరించకుండా వుంటారో వాళ్లు ఏడుజన్మలపాటు నక్కలుగా పుడతారనడంలో ఏమీ సందేహము లేదు.*


*' నమ శివాభ్యం నవ యౌ వనాభ్యాం పరస్ప రాశ్లి ష్ట వపుర్ధ రాభ్యాం*

*నాగేంద్ర కన్యా వృష కేత నాభ్యం నమో నమ శంకర పార్వతీ భ్యాం''*


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి*

*సప్తమధ్యాము - సప్తమ దిన పారాయణము సమాప్తం.*


🚩🕉️🕉️🙏🙏🕉️🕉️🚩

🚩 *_8 వ అధ్యాయము_*🚩


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*శ్రీ హరి నామస్మరణా ధన్యోపాయం*

*ఆజా మీళుని కథ*



🕉️☘☘☘☘☘☘🕉️


వశిష్టుడు చెప్పిన దంతా విని ' మహానుభావా ! తమరు చెప్పిన ధర్మములన్నింటిని శ్రద్దగా వింటిని. అందు ధర్మము బహు సుక్ష్మ మనియు , పుణ్యం సులభంగా కలుగు ననియూ , అది - నదీస్నానము , దీపదానము , ఫలదానము , అన్నదానము , వస్త్ర దానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప దర్మములచేతనే మోక్షము లబించుచుండగా  వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీవంటి మునిశ్రేష్టులె చెప్పు చుందురు గదా ! మరి తమరు యిది సూక్ష్మములో  మోక్షముగా కనబరచినందుకు నాకు అమితాశ్చర్యము  కలుగుచున్నది. దుర్మార్గులు  కొందరు సదాచారములను పటింపక , వర్ణ సంకరులై రౌరవాది నరక హేతువులగు 

మహా పాపములు చేయువారు యింత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్ధించు చున్నాను'యని కోరెను.


అంతట వశిష్టుల వారు చిరునవ్వు నవ్వి .  జనక మహారాజా ! నీవు వేసిన ప్రశ్న సహేతుక మైనదే , నేను వేద వేదంగములను కూడా పటీంచితిని. వానిలో కూడా సుక్ష్మ మార్గాలున్నవి. అవి యేమనగా సాత్విక , రాజస , తామసములు అని ధర్మము మూడు రకములు సాత్విక , మనగా దేశ కాల పాత్రలు మూడును సమకూడిన సమయమును సత్త్వమను గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరర్పితము కావించి , మనో వాక్కాయ కర్మలచె నొనర్చిన ధర్మము అ ధర్మమందు యెంతటా ఆధిక్యత కలదు.  సాత్త్విక ధర్మము సమస్త పాపములను నాశన మొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్రమున కలియు తావునందు స్వాతికర్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి ధగ ధగ మెరిసి , ముత్యమగు విధానముగా సాత్త్వికత వహించి , సాత్త్విక ధర్మ మాచరించుచూ గంగ , యమునా , గోదావరి , కృష్ణ నదుల పుష్కరాలు మొదలుగు పుణ్య కాలముల యందు దేవాలయముల యందు - వేదములు పటించి , సదచారుడై , కుటింబీకుడైన బ్రాహ్మణునకు యెంత స్వల్ప దానము చేసిననూ , లేక ఆ నదీ తీరమందున్న  దేవాలయం లో జపతపాదు లోనరించినను విశేష ఫలమును పొందగలరు.

రాజస ధర్మ మనగా - ఫలాపేక్ష  కలిగి శాస్త్రోక్త  విధులను విడిచి చేసిన దర్మం. ఆ ధర్మం పునర్జన్మ  హేతువై కష్ట సుఖాలు కలిగించున దగును.

తామస ధర్మమనగా - శాస్త్రోక్త  విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికా చరణార్ధం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలము నీయదు.

దేశకాల పాత్రము సమ కూడినపుడు తెలిసి గాని తెలియకగాని యే స్వల్ప ధర్మం చేసిననూ గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీ మన్నా నారాయుణుని నామము , తెలిసి గాని , తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక యితిహాసము కలదు.


*🌹ఆజా మీళుని కథ🌹*


పూర్వ కాలమందు కన్యా కుబ్జ మను నగరమున నాల్గు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్య వ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమ వతియను భార్య కలదు. ఆ దంపతులన్యోన్య ప్రేమ కలిగి అ పూర్వ దంపతులని పేరు బడసిరి. వారికి చాలాకాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించెను. వారాబాలుని అతి గారాబముగా పెంచుచు , అజా మీళుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు దిన దిన ప్రవర్ధ మానుడగుచు అతి గారాబము వలన పెద్దలను కూడ నిర్లక్షముగా చూచుచు , దుష్ట సావసములు చేయుచు , విద్య నభ్య సింపక , బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించు చుండెను. ఈ విధముగా కొంత కాలమునకు యవ్వనము రాగా కమంధుడై , మంచి చెడ్డలు మరిచి , యజ్ఞో పవితము త్రెంచి , మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీ ని వలచి , నిరంతరము నామెతోనే కామా క్రీడలలో తేలియాడుచూ , యింటికి రాకుండా , తల్లిదండ్రులను మరిచి , ఆమె ఇంటనే భుజించు చుండెను. అతి గారాబము యెట్లు పరిణమించినదో వింటివా రాజా ! తమ బిడ్డలపై యెంత అనురాగామున్ననూ పైకి తెలియ పర్చక చిన్ననాటి నుంచీ అదుపు ఆజ్ఞలతో నుంచకపోయిన యెడల యీ విధంగానే జురుగును. కావున ఆజామీళుడు కుల భ్రష్టుడు కాగా , వాని బంధువులు తనని విడిచి పెట్టిరి. అందుకు ఆజామీళుడు రెచ్చిపోయి వేటవలన పక్షులను , జంతువులను చంపుతూ కిరాత వృత్తి లో జీవించు చుండెను. ఒక రోజున ఆ యిద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తెనేపట్టుకై చెట్టేక్కి తేనెపట్టు తియబోగా కొమ్మ విరిగి క్రింద పడి చనిపోయెను. ఆజామీళుడు ఆ స్త్రీ పైబడి కొంత సేపు యేడ్చి , తరువాత ఆ అడవి యందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ యెరుకుల దానికి అంతకు ముందే ఒక కుమార్తె వుండెను. కొంత కాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామంధ కారాముచె కన్ను మిన్ను గానక ఆజా మీళుడు ఆ బాలికను కూడ చేపట్టి ఆమెతో కూడ కామ క్రీడలలో తేలియాడు చుండెను. వారికి యిద్దరు కొడుకులు కూడ కలిగిరి. ఇద్దరూ పురిటి లోనె చచ్చిరి. మరుల ఆమె గర్భము దరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి *'నారాయణ'* అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైన నూ ఆ బాలుని విడువక , యెక్కడకు వెళ్ళినా వెంట బెట్టుకుని వెళ్ళుచూ , *' నారాయణా - నారాయణా'* అని ప్రేమతో సాకు చుండిరి. కాని *' నారాయణ'* యని స్మరించిన యెడల తన పాపములు నశించి , మోక్షము పొంద వచ్చునని మాత్రమతనికి తెలియకుండెను. ఇట్లు కొంత కాలము జరిగిన తర్వాత అజా మీళునకు శరీర పటుత్వము తగ్గి రోగ గ్రస్తుడై 

మంచము పట్టి చావునకు సిద్ద పడి యుండెను. ఒకనాడు భయంకరాకారములతో , పాశాది ఆయుధములతో యమ భటులు ప్రత్యక్ష మైరి. వారిని చూచి అజా మీళునకు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక *' నారాయణా ' నారాయణా'* యనుచునే ప్రాణములు విడిచెను. అజా మీళుని నోట *' నారాయణా'* యను శబ్దము వినబడగానే యమ భటులు గడ గడ వణక సాగిరి. అదే వేళకు దివ్య మంగళ కారులు శంఖ చక్ర గదా ధరులూయగూ *శ్రీ మన్నారాయణుని* దూతలు విమానములో నచ్చటికి వచ్చి *' ఓ యమ భటులారా ! వీడు మావాడు మేము వీనిని వైకుంటమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి'* యని చెప్పి , అజా మీళుని విమాన మెక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు *' అయ్యా ! మీ రెవ్వరు ? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చటికి వచ్చితిమి గాన , వానిని మాకు వదలుడని కొరగా విష్ణు దూతలు యిట్లు చెప్పదొడంగిరి.



*ఇట్లు స్కాంద పురాణాంర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి*

*ఎనిమిదో అధ్యయము- ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము.*

🚩🌹🌷🕉️🕉️🌷🌹🚩

_*9 వ అధ్యాయము*_🚩


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*విష్ణు పార్షద , యమ దూతల వివాదము*


🕉️☘☘☘☘☘☘🕉️


*'ఓ యమ దూత లారా ! మేము విష్ణు దూతలము వైకుంటము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమ ధర్మరాజు యెటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ములను పంపెను'యని ప్రశ్నిచిరి. అందుకు జవాబుగా యమదూతలు ' విష్ణు దూత లారా ! మానవుడు చేయు పాపపున్యడులను సూర్యుడు , చంద్రుడు , భూదేవి , ఆకాశము , ధనంజయాది వాయువులు , రాత్రింబవళ్లు  సంధ్య కలం సాక్షులుగా వుండి ప్రతి దినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించు చుందురు. మా ప్రభువుల వారీ కార్య కలాపములను చిత్ర గుప్తునిచే చూపించి ఆ మనిజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులెటువంటి వారో వినుడు.

వేదోక్త సదాచారములు విడిచి వేద శాస్త్రములు నిందించు వారును , గోహత్య , బ్రహ్మ హత్యాది మహాపపములు చేసినవారు , పర స్త్రీ లను కామించిన వారును , పరాన్న భుక్కులు , తల్లిదండ్రులను - గురువులను - బంధువులను - కుల వృతిని తిట్టి హింసించు వారున్నూ , జీవ హింస చేయు వారున్నూ దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పిడించు వారును , జారత్వం చొరత్వంచే భ్రష్టులగు వారును , యితరుల ఆస్తిని స్వాహా చేయు వారును , చేసిన మేలు మరచిన కృతఘ్నులును , పెండిండ్లు శుభ కార్యములు జరగనివ్వక అడ్డుతగిలే వారునూ పాపాత్ములు. 


వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి యాజ్ఞ. అది అటులుండగా ఈ అజా

మీళుడు బ్రాహ్మణుడై పుట్టి దురచారములకు లోనై కుల భ్రష్టుడై జీవ హింసలు చేసి , కామాంధుడై వావివరసలు లేక , సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణు లోకమునకు యెట్లు తీసుకొని పోవుదురు ? ' అని యడగగా విష్ణు దూతలు ' ఓ యమ కింకరులారా ! మీరెంత యవివేకులు ? మీకు ధర్మ సుక్ష్మములు తెలియవు. ధర్మ సుక్ష్మములు లేట్టివో చెప్పెదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును , జపదాన ధర్మములు చేయువారును - అన్నదానము , కన్యాదానము , గోదానము , సాలగ్రామ దానము చేయువారును , అనాధ ప్రేత సంస్కాములు చేయువారును , తులసి వనము పెంచువారును , తటాకములు త్రవించువారును , శివ కేశవులను పూజించు వారును సదా హరి నామ స్మరణ చేయువారును మరణ కాలమందు *' నారాయణా'* యని శ్రీ హరిణి గాని , *' శివ '* అని శివుని గాని స్మరించు వారును , తెలిసిగాని తెలుయక గాని మరే రూపమున గాని హరి నామస్మరణ చెవిన బడిన వారును పుణ్యాత్ములు ! కాబట్టి అజా మీళుడు ఎంత పాపత్ముడైనాను మరణకాలమున *"నారాయణా"* అని పలికిరి.

అజా మీళుడు విష్ణు దూతల సంభాషణ లాలకించి ఆశ్చర్యమొంది *" ఓ విష్ణు దూతలారా ! పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీ మన్నారాయణ పుజగాని వ్రతములు గాని , ధర్మములుగాని చేసి యెరుగను. నవ మాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణ మిల్లలేదు. వర్ణాశ్రమములు విడిచి కుల భ్రష్టుడనై , నీచకుల కాంతలతో సంసారము చేసితిని. నా కుమారుని యందున్న ప్రేమచో *"నారాయణా"* యని నంత మాత్రమున నన్ను ఘోర నరక భాదలనుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా ! నేనెంత అదృష్టవంతుడను ! నా పూర్వ జన్మ సుకృతము , నా తల్లి తండ్రుల పుణ్య ఫలమే నన్ను రక్షించినది. " అని పలుకుచు సంతోషముగా విమాన మెక్కి వైకుంఠమున కేగెను. కావున ఓ జనక చక్రవర్తీ ! తెలిసిగాని , తెలియక గాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలేక్కి భాద , కలిగించునో , అటులనే శ్రీ హరినామం స్మరించిన యెడల సకల పాపములును నశించి మోక్షము నోన్దేదరు. ఇది ముమ్మాటికినీ నిజము.



*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి*

*నవమద్యయము- తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము.*

🚩 _*10 వ అధ్యాయము*_🚩


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*అజామీళుని పూర్వ జన్మ వృత్తాంతము*


🕉️☘☘☘☘☘☘🕉️


జనకుడు వశిష్టుల వారిని గాంచి *" ముని శ్రేష్ఠ ! యీ అజా మీళుడు యెవడు ? వాడి పూర్వ జన్మ మెటువంటిది ? పూర్వ జన్మంబున నెట్టి పాపములు చేసియుండెను ? ఇప్పడీ విష్ణు దూతలు వైకుంటమునకు తీసుకొనిపోయిన తరువాత నేమి జరిగెను ? వివరించ వలసినది "* గా ప్రార్ధించెను. అంత నా మునిశ్రేష్టుడు జనక మహారాజును గాంచి యిట్లు పలికెను.

జనకా ! అజా మీళుని విష్ణు దూతలు వైకంఠమునకు తీసుకొనిపోయిన తరువాత యమ కింకరులు తమ ప్రభువగు యమ ధర్మరాజు కడ కేగి , *" ప్రభూ ! తమ అజ్ఞ ప్రకారము అజా మీళుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణు దూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీళుని విమాన మెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. మేము చేయునది లేక చాల విచారించుచూ యిచటకు వచ్చినారము'* అని భయ కంపితులై విన్నవించు కొనిరి.

*"జా రా ! ఎంత పని జరిగెను ? ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి యుండలేదే ? దీనికి బలమైన కారణము ఏదైనా వుండి యుండవచ్చును"* అని యముడు తన దివ్య దృష్టితో అజా మీళుని పూర్వ జన్మ వృత్తాంతము తెలుసుకొని *" ఓహొ ! అది యా సంగతి ! తన అవ సాన కాలమున " నారాయణ" అని వైకంఠవాసుని స్మరణ జేసి యుండెను. అందులకు గాను విష్ణు దూతలు వచ్చి వానిని తీసుకొని పోయిరి. తెలిసి గాని , తెలియక గాని మృత్యువు సమయమున హరి నామస్మరణ మెవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. గనుక , అజా మీళునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా !"* అని అనుకొనెను.

అజా మీళుడు పూర్వ జన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడుగా నుండెను. అతడు అపురూపమైన అందంచేతను , సిరి సంపదల చేతను , బలము చేతను గర్విష్టి యై శివారాధన చేయక , శివాలయము యొక్క ధనము నపహరించుచు , శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములను బెట్టక , దుష్ట సహవసములను మరిగి విచ్చలవిడిగా తిరుగు చుండెడి వాడు. ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరుని కెదురుగా పాదములుంచి పరుండెడి వాడు. ఇతని కొక బిద బ్రాహ్మణ స్త్రీ తో రహస్య సంబంద ముండెడిది. ఆమె కూడా అందమైనదగుటచే చేయునది లేక ఆమె భర్త చూచియు చూడ నటుల నుండి భిక్షాటనకై వురూరా తిరుగుచూ ఏదో వేళకు యింటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు. ఒకనాడు పొరుగూరికి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిని బెట్టుకొని వచ్చి అలిసిపోయి *" నాకు యీ రోజున ఆకలి మిక్కుటముగా నున్నది త్వరగా వంట చేసి పెట్టుము",* అని భార్యతో ననెను. అందులకామె చిదరించుకోనుచు , నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా యీయక , అతని 

వంక కన్నెత్తి యైననూ చూడక విటునిపై మనస్సు గలదియై మగని తూలనాడుట వలన భర్తకు కోపం వచ్చి పక్కనున్న కఱ్ఱతో బదెను. అంత ఆమె భర్త చెతి నుండి కఱ్ఱ లాగు కొని భర్తను రెండితలు కొట్టి బైటకు త్రోసి తలుపులు మూసివేసెను. అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక యింటి ముఖము పట్ట రాదని తలపోసి దేశాటనకు వెడలిపోయెను. భర్త యింటి నుండి వెడలి పోయెను కదా యని సంతోషించి , ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగు పై కూర్చుండి యుండగా ఒక చాకలి వాడు ఆ దారిని పోవుచుండెను. అతనిని పిలిచి *" ఓయీ ! నీవి రాత్రి నాతో రతి క్రీడ సలుపుటకు రమ్మని కొరెను. అంత నా చాకలి *" తల్లి ! నీవు బ్రాహ్మణ పడతివి. నేను నిచాకులస్తుడును , చాకలి వాడిని మిరీ విధముగ పిలుచుట యుక్తము గాదు. నేనేట్టి పాపపు పని చేయజాలను"* అని బుద్ది చెప్పి వెడలి పోయెను. ఆమె ఆ చాకలి వాణి అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చటనుండి బయలుదేరి ఆ గ్రామ శివర్చకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరి పరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి వుదయమున యింటికి వచ్చి *" అయ్యో ! నే నెంతటి పాపమునకు ఒడి గట్టితిని ? అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను యింటి నుండి వెడలగొట్టి క్షణికమయిననకామవాంఛకు లోనయి మహాపరాధము చేసితిని"* అని పాశ్చాత్తాపమొంది , ఒక కూలి వానిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తకు వెదికి తీసుకు రావలసినదిగ పంపెను. కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త యింటికి రాగా పాదముల పై బడి తన తప్పులను క్షమించమని ప్రార్ధించెను. అప్పటి నుండి మంచి నడవడిక నవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను. కొంత కాలమునకు శివర్చకునకు నేదియో వ్యాధి సంక్రమించి దిన దినము క్షీణించుచు మరణించెను. అతడు రౌర వాది నరక కుపముల బడి నానా బాధలు పొంది మరల నానా జన్మ మెత్తి సత్య వ్రాతుడను బ్రాహ్మణో త్తమునకు కుమారుడై కార్తీక మాసమున నది స్నానము చేసి దేవత దర్శనము చేసి యుండుట వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజా మీళుడై పుట్టెను. ఎప్పటికి తన అవసాన కాలమున *'నారాయణా'* అని శ్రీ హరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగ గ్రస్తురాలై చనిపోయెను. అనేక యమ యాతనలన నుభవించి ఒక మల వాని యింట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మ రాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను. మాల వాడు శిశువును తీసుకొనిపోయి అడవి యందు వదిలిపెట్టేను. అంతలో నొక విప్రుడు ఆ దారిన పోవుచు పిల్ల యేడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన యింట దాసికిచ్చి పోషించెను. ఆ బాలికనే అజామీళుడు ప్రేమించెను. వారి పూర్వ జన్మ వృత్తాంత మిదియే. నిర్మల మైన మనస్సుతో శ్రీ హరిని ధ్యానించుట , దాన ధర్మములు , శ్రీ హరి కథలను ఆలకించుట , కార్తిక మాస స్నాన ప్రభావముల వలన నెటువంటి వారైననూ మోక్ష మొందగలరు. గాన కార్తిక మాసము నందు వ్రతములు , పురాణ శ్రవణములు చేసిన వారలిహపర సుఖములు పొంద గలరు.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి*

*దశమా ధ్యాయము- పదవ రోజు పారాయణము సమాప్తము.*


🚩🌹🌷🕉️🕉️🌷🌹🚩

కార్తీక పౌర్ణమి

 కార్తీక పౌర్ణమి... 29-11-2020 ఆదివారం రోజు ననా ? లేక? 30-11-2020 సోమవారం రోజా అని చాలా మంది తెలియక అడుగుతున్న ప్రశ్న🌹*





శ్లో.ఉదయస్థా తిథిర్యాహి

నభవేద్దిన మధ్యగా!

సా ఖండా న ప్రధానాస్యాత్ 

వ్రతారంభే సమాపనే!!


సూర్యోదయము మొదలు మధ్యాహ్నకాలము వరకునున్న తిథి, నక్షత్రంబులను ఆఖండంబులనియు - ఇవి వ్రతారంభ, ఉద్యాపనములకు యోగ్యమైనవి..... 


సమాధానం:- శాస్త్ర ప్రకారం

కార్తీక పౌర్ణమి నాడు  స్నానం చేసి అనంతరం ఉపవాసానికి సంకల్పం చేసి  సాయంత్రం విశేషించి (365 వొత్తుల) దీపారాధనలు చేయాలి.... 

అలా చేయాలంటే  ఆదివారం సాయంత్రం దీపారాధనలు చేసేవేళలో పౌర్ణమి ఉన్నా...

ఉదయం వేళ సంకల్పానికి పౌర్ణమి లేదు కనుక ఉపవాసానికి ఆదివారం పనికి రాదు.... 

ఉపవాసం లేకుండా సాయంత్రం విశేష దీపారాధనలు, పూజలు ఫలాన్ని ఇవ్వవు.... 

*స్నానాలకి, దానాలకి, ఉపవాసానికి, సాయంత్రం (365 వొత్తుల) దీపారాధనలకి సోమవారం నాడే చేయవలెననేది సశాస్త్రీయమైన నిర్ణయం...*



*దేవాలయాలలో జ్వాలాతోరణం ఇత్యాదులు ఆదివారం 29/11 / 2020...*


రాత్రికి పౌర్ణమి చేయవలసినవారు తె29/11/2020ది ఆదివారం చేయవలెను.


ఉదయం చేయవలసినవారు తే30/11/2020ది సోమవారం చేయవలెను


*గురువు గారు సశాస్త్రీయమైన నిర్ణయం తెలిపారు .*


కృత్తికా నక్షత్ర సహిత పౌర్ణమి ఘడియలు ఆదివారం రాత్రి ఉన్నాయ్ .

సోమవారం పూర్తిగా రోహిణీ నక్షత్రం .

పూర్ణిమ నాడుకృత్తికా నక్షత్రముంటుందనే మాసనామం కార్తికమంటారు .

ఆదివారం సెలవు కావున భక్తులకు సౌకర్యంగా ఉంటుందని భావన ఉండవచ్చు .

అందుకే కార్తిక దీపం ,జ్వాలా తోరణాలు ... ఆదివారం చేస్తుండవచ్చు .

ఈమధ్య వివాహాలు , ఫంక్షన్లు...కూడా శని ,ఆదివారాలలో కావాలంటున్నారు .

శాస్త్రదృశ్యం , గురుర్వాక్యం ,ఆత్మనిశ్చయం అంటారు .

కానివ్వండి .

దీనికి వివాదం ,కురుక్షేత్ర యద్ధం ఎందుకు ?  !

అన్నట్లు మరిచాను . 

కార్తిక బహుళ అమావాస్య కురుక్షేత్రయుద్ధ ప్రారంభం. 

గీతాజయంతి ఆరోజువై అన్నారు . మార్గశిర శుద్ధ ఏకాదశి చేస్తారందరున్నూ .

తప్పు అన్నారు .

భీష్ములవారు అంపశయ్యాగతులైన తర్వాత అంతవరకు యుద్ధంలో విజయం కౌరవులదే అని మిన్నకున్న ధృతరాష్ట్రులవారు సంజయున్ని పిలిచి 

..మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ..

అని ప్రశ్నించడంతో భగవద్గీత ప్రపంచానికి వెల్లడి అయింది .కావున మార్గశీర్ష శుక్ల ఏకాదశి గీతాజయంతి సెలబ్రేషన్స్ అన్న వివరణతో ఆ చర్చ సమసి పోయింది .

కృష్ణ పరమాత్మ అన్నీ చెప్పి 

' యథేచ్ఛసి తథా కురు ' అన్నారు .

విజయుడు ' కరిష్యే వచనం తవ '  అన్నాడు .

అలాగే శాస్త్రోక్తరీతి చెప్పబడింది . ఆవల ఎవరి మనోధర్మం/సౌకర్యం వారిది .


*దేశ కాల దేహ ధర్మ  వైపరీత్య శంకయా ప్రమాణేన...*

గురుర్వాక్యం సమకాలీనం .

అనుసరణీయం .


అదే విధి గా ఆచరిస్తున్నపుడు విశ్వాసం కూడుకుంటుంది . కార్యసిద్ధి కూడా .


సందేహాత్మా వినశ్యతి ..


నిర్ణయం ముందు చర్చ .

నిర్ణయమైపోయిన తర్వాత తర్కం కూడదు.🙏

వ్యంగ్యాత్మక సీసపద్యం.

  కరోనావ్యాధి  కేవలం మానవులకు తప్ప మరే జీవికి లేదని తెలియజేస్తూ ఒక వ్యంగ్యాత్మక సీసపద్యం. 


సీ!! కాకికక్కర లేదు గద! ఐసొలేషను 

                            కోతికి లేదయ్య  కొవిడు బాధ 

    లేదు గద! కరోన లేదయ్య కుక్కకు 

                            మదపుటేనుగునకు  మాస్కు లేదు 

   మరి చీమకేది సామాజిక దూరమ్ము 

                             టాంకు చేపకు శానిటైజరేది 

   పాము జాతికి యేది హోము క్వారంటైను 

                              నక్కలకేదయ్య లాక్కుడౌను 

   కోడికి లేదయ్య కోవిడు పాజిటివ్

                               గొర్రెకు గ్లౌజేది వెర్రివాడ! 

   పిట్టకు లేదయ్యె చట్టమొక్కటియైన 

                                ఏ జీవికిని లేదు యింత దిగులు 


తే!! జీవులన్నియు తమతమ జీవితమును 

      ధర్మమార్గాన ప్రకృతిన దనరుచుండ

      మనిషి యొక్కడె మితిమీరి మసలుకొనుచు 

      ఇట్టి దుర్భర దుస్థితి నేడ్చుచుండె.

🌸🙏🙏🙏🌸

ఇది ఎవరో పెద్దవారు వ్రాసినది పంచుకోవటమైనది... 🙏

హిందువులు బౌద్దులు ఏమైపోయారు

 ఇండోనేషియా 100 శాతం ఉండే హిందువులు బౌద్దులు ఏమైపోయారు


 16 వ శతాబ్దం వరకు, ఇండోనేషియా 100% హిందూ-బౌద్ధమతం ఉండేవి నేడు #హిందువులు మరియు #బౌద్ధులు 1% కూడా లేరు. ముస్లింలు 88% ఉన్నారు.


  ఇంత తీవ్రమైన మార్పుకు దారితీసింది ఏమిటి? బాలి ద్వీపంలో కొంతమంది ప్రజల మాత్రం హిందు మతం ఆచరిస్తున్నారు, ఇండోనేషియాలో హిందూ మతం అంతరించిపోయింది.


 ఈ చిత్రంలో చూపిన మసీదును మీనారా కుడస్ మసీదు అంటారు. 1549 లో నిర్మించి ఇప్పటికి ఇండోనేషియాలో మనుగడలో ఉన్న మొట్టమొదటి మసీదు. ఇది సునన్ కుడుస్ అని పిలువబడే సూఫీ ముస్లిం (సాధువు) యొక్క దర్గా. ఇండోనేషియాలో సూఫీ ఇస్లాం ఎలా వ్యాపించిందనే దాని గురించి దర్గా మనకు చాలా చెబుతుంది. #హిందూ దేవాలయాన్ని కూల్చివేసి దీనిని నిర్మించారు. ఆలయ అవశేషాలు ఇప్పటికీ స్పష్టంగా చూడవచ్చు.


 ఒక ఆసక్తికరమైన కథ ఉంది. మసీదులకు మార్గం కల్పించడానికి దేవాలయాలు ధ్వంసం చేయబడినప్పుడు, హిందువులు మసీదులలోకి ప్రవేశించలేదు. సునన్ కుడుస్ మసీదు లోపల ఒక ఆవును కట్టి, ఖురాన్ యొక్క సూరా అల్ బకారా (ఆవు) నినాదాలు చేయడం ప్రారంభించాడు. హిందువులను ఆకర్షించడానికి, అతను ఆవులను వధించడాన్ని నిషేధించాడు. ఈ నియమాన్ని ఈ రోజు వరకు కుడుస్ అనుసరిస్తున్నారు. ఇండోనేషియా యొక్క ప్రారంభ సూఫీలు ​​అనుసరించిన మత మార్పిడి నమూనా ఇది.  


దేవాలయాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నప్పుడు, మతమార్పిడి యొక్క సున్నితమైన మత పరివర్తన కోసం వారు ఆవును పూజించడం వంటి కొన్ని సాంస్కృతిక అంశాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.


మతం మార్చడం వారి లక్ష్యం అందుకు అనేక మార్గాలు అనుసరిస్తారు అవసరం బట్టి


 పైనా చెప్పబడిన విషయంకి మూలాలు:


 1) సునన్ కుడస్: క్రాస్ కల్చరల్ దావాపై వారసత్వం

 2) ఓరియంటల్ సిరామిక్ సొసైటీ యొక్క మార్పు (పేజీ 42)


F..ట్రూఇండాలజీ

రామాయణమ్ 132

  రామాయణమ్ 132


వెళ్లి వెళ్లి ఖరుడి దగ్గర ఆకాశంనుండి రాలిన పిడుగులా పడ్డది.శరీరమంతా రక్తపు ముద్ద అయి పట్టరాని బాధతో రోదిస్తున్న సోదరిని చూసి విషయం ఏమిటి అని అడిగాడు !

.

నిన్ను ఇలా చేసినవాడు ఎవడు? 

విషపు కోరలుగల త్రాచుపామును విలాసంగా చేతివ్రేలి కొనతో పోడిచేవాడెవ్వడు?

.

అప్పుడు శూర్పణఖ కన్నీళ్లు కారుస్తూ , వారిరువురూ రామలక్ష్మణులనేడివారు. 

దశరధ మహారాజు పుత్రులు.

చాలా అందముగా ,ఇంద్రియనిగ్రహముతో మునివేష ధారులై ఉన్నారు.

.

వారుదేవతలో ,మనుష్యులోనేనుచెప్పజాలను.

వారిరువురి మధ్య సకలాలంకార భూషితయై సన్నని నడుము కలిగి ఉన్న అందమైన ఒక స్త్రీ ఉన్నది దానివలననే వారిరువురూ నన్ను ఈ విధంగా చేశారు.

.

వారిని నీవు వధించగా నురుగుతో నిండిన కొత్త రక్తాన్ని త్రాగాలని అనుకుంటున్నాను. 

ఇది నిన్ను నేనడిగే మొదటి కోరిక!

.

వెంటనే ఖరుడు మహాబలవంతులైన పధ్నాలుగుమంది యమసమానులైన రాక్షసులను పిలిచి సీతారామలక్ష్మణులను చంపివేయమని ఆజ్ఞాపించాడు.

.

వారిని వెంటపెట్టుకొని శూర్పణఖ రాముడున్నచోటికి తీసుకుపోయింది.

.

వారిని చూశాడు రామచంద్రుడు !

 లక్ష్మణా నీవు సీతను రక్షిస్తూ ఉండు నేను వీళ్ళ సంగతిచూస్తాను అని లేచాడు.

.

రాక్షసులను చూసి , మిమ్ములను చంపమని ఋషుల ఆజ్ఞ ! మీకు ప్రాణాల మీద ఆశ ఉంటె తిరిగి వెళ్ళండి లేదా అక్కడే నిలవండి అని పలికాడు రామచంద్రుడు.

.

ఆ రాక్షసులప్పుడు రాముని చూసి ,

ఒంటరివాడవు !

నీవు మమ్ములనేమిచేయగలవు? మా ప్రభువైన ఖరునకు కోపము తెప్పించి బ్రతుకగలను అనే అనుకుంటున్నావా !అని అంటూనే వారు పద్నాలుగు శూలాలను ఒకే సమయంలో మహా వేగంగా విసిరారు.,వారు విసిరిన మరుక్షణమే అన్నే బాణాలు రాముని ధనుస్సునుండి వేగంగా దూసుకుంటూ వచ్చి ఆ శూలాలను మార్గమధ్యములోనే ఖండించి వేశాయి.

 అర క్షణము కూడా ఆలస్యము చేయలేదు రాముడు! పదునైన మరొక పద్నాలుగు బాణాలు తీసుకొని ప్రయోగించాడు ,అవి వారి గుండెలను చీల్చుకుంటూ బయటకు వెళ్లి ఉరుము వంటి శబ్దము చేస్తూ భూమిలో ప్రవేశించాయి.

.

. ఒక్కసారిగా రక్తము చిప్పిల్లి ప్రవహించగా వారి శరీరాలు తడిసి ఎర్రనై మొదలు నరికిన చెట్ల వలె నేలమీద దబ్బున పడ్డాయి.

.

ఒక్కసారి గా మహాభయంకరంగా అరుచుకుంటూ మరల ఖరుడి వద్దకు వెళ్ళింది శూర్పణఖ!

.

జానకిరామారావు వూటుకూరు

.

రామాయణమ్ 133

  రామాయణమ్ 133

.......

ఇప్పుడేకదా నీవెంట మహావీరులైన రాక్షసులను పంపాను ఇంతలోనే ఏమయ్యిందే నీకు మళ్ళా ఏడుస్తున్నావు అని కోపంతో అన్నాడు ఖరుడు .లేలే నీకేమీ భయములేదు నేనున్నాను నీకు అధైర్యము వద్దు ఏమిజరిగిందో చెప్పు అన్నాడు.

.

అవును ఇంతక్రితమే నీవు నాతొ పద్నాలుగు మంది మహాశూరులను పంపావు కానీ వారందరినీ క్షణకాలంలో చంపివేశాడా మానవుడు. ఆతని యుద్ధరీతి చూస్తే నాకేదో భయంగా ఉన్నది .ఏమో ఎటునుండి ఏ ప్రమాదము రానున్నదో అని భీతికలుగుతున్నది.

.

నేను విషాదమనే  మొసలి 

భయము అనే తరంగాలు కలిగిన 

దుఃఖము అనే సముద్రములో మునిగి ఉన్నాను

నన్నెందుకు రక్షింపవు నీవు?

నీకు రాక్షసులయందు జాలి ఉన్నట్లయితే

 ఆ రాక్షస కంటకుడిని ఎదిరించు.

.

నీకు శక్తీ ,తేజస్సు ఉంటే ఆ రాముడిని చంపేసి నా కోపము చల్లార్చు.లేనిపక్షములో నేనిప్పుడే నీ ముందే ప్రాణాలు విడుస్తాను.

.

నీకు ఆపని చేతకాకపోతే ఇక్కడనుండి పారిపో అని రెచ్చగొడుతూ  పొట్ట బాదుకుంటూ బావురుమని ఏడ్చింది.

.

అప్పుడు ఖరుడు రోషముతో ,శూర్పణఖా ఇదిగో ఇప్పుడే చెపుతున్నాను ఈ గండ్ర గొడ్డలితోనే వాడి తల నరుకుతాను.

 అప్పుడు వాడి కంఠం నుండి పొంగుతూ బయటకు వచ్చే వెచ్చని నెత్తురు ఆనందముగా త్రాగుదువుగాని.

.

తన సేనాని అయిన దూషణుని వైపు తిరిగి నీవు వెంటనే పద్నాలుగువేలమంది మహావీరులు,శత్రు భయంకరులు అయిన సైనికులను సిద్ధం చేయి  అని ఆజ్ఞాపించాడు.

.

వీరులైన రాక్షసులు వెంటరాగా రాముడి మీదికి యుద్ధానికి బయలుదేరాడు ఖరుడు.

.

వాడు బయలుదేరగానే ఆ సైన్యము మీద అమంగళకరమైన రక్తము వర్షించింది. 

ఒక పెద్ద రాబందు వచ్చి వాడి ధ్వజాన్ని ఆక్రమించి రధము మీద కూర్చున్నది..

ఖరుడి ఎడమ భుజము అదిరింది.అయినా ఇవి ఏవీ లెక్క చేయక రణ ఉత్సాహము ఉప్పొంగుతుండగా ముందుకు కదిలాడు వాడు 

.

జానకిరామారావు వూటుకూరు.

రామాయణమ్ 134

  రామాయణమ్ 134

,,,,,,,,,,,,,,,,,,,

రాముడు కూడా ఖరుడు చూసిన ఉత్పాతాలే చూశాడు.ఈ ఉత్పాతాలు సకల భూత వినాశనాన్ని సూచిస్తున్నాయి చూశావాలక్ష్మణా అని అన్నాడు.

.

 పక్షులకూతలు ఒక్కసారి విన్నావా ! మనకు ఎదో అపాయము దగ్గరలోనే రాబోతున్నదనిపిస్తున్నది.

.

ఎదో గొప్ప యుద్ధమే జరుగబోతున్నట్లు అదిరే నా భుజము చెపుతున్నది. 

.

అయినా శకునాలు అన్నీ మనకు జయాన్నీ ఎదుటివాడికి అపజయాన్నీ చెపుతున్నాయి.

.

అదుగో! దూరంగా ఎదో ధ్వని వినపడుతున్నది .

.

అది రాక్షసులు దండుగా బయలుదేరి వస్తున్నట్లుగా అనిపిస్తున్నది.

.

అది వారుచేసే కోలాహలమే ! 

భేరీల భయంకరమైన శబ్దము వినపడుతున్నది.

.

నీవు వెంటనే నీ వదినగారిని సమీపములోని కొండగుహలోనికి తీసుకెళ్ళి రక్షణగా ఉండు. నేను రాక్షసుల సంగతి చూస్తాను, అని అన్నాడు రాముడు.

.

లక్ష్మణుడు సీతమ్మను భద్రముగా తీసుకొని వెళ్ళిన తరువాత రాముడు కవచము తొడుక్కొన్నాడు.

.

తన ధనుస్సు చేతిలోనికి తీసుకొన్నాడు .

.

 ఒక్కసారిధనుష్టంకారం చేశాడు .

.

ఆ శబ్దము వేయిపిడుగులు ఒక శ్రేణిలో అనగా ఒక వరుసలో పడినప్పుడు ఏ విధమైన ధ్వని వస్తుందో ఆ విధమైన ధ్వనిని తలపించింది. 

.

ఆ ధ్వని తరంగాలు గాలిలో వ్యాపించి  అవి విన్న వారి హృదయాలలో గొప్పభయాన్ని పుట్టించాయి.

.

సకల ఋషిగణాలు ,దేవతలు,సిద్ధులు,గంధర్వులు అందరూ అక్కడ వచ్చి చేరారు , జరుగబోయే ఘోర యుద్ధాన్ని వీక్షించడానికి.

.

దుర్నిరీక్ష్యమైన తేజస్సుతో ధనుస్సు ఎత్తిపట్టి నిలిచిన రాముడు  చూడటానికి భయము కొల్పుతున్నాడు.

.

ఆయన ఆకృతిలో 

ఒక ఉగ్రత్వము ,                                

ఒక తేజస్సు !                                    

ఈ రెండూ కలగలసి ప్రళయకాల రుద్రుడి లాగా కనపడుతున్నాడు

.

రూపమప్రతిమం తస్య రామస్యాక్లిష్ట కర్మణః

బభూవ రూపం క్రుద్ధస్య రుద్రస్యేవ మహాత్మనః 

.

క్రుద్ధుడైన రుద్రుడిలాగా ఉన్నాడట రామభద్రుడు ,

ఏ పనినైనా అత్యంత సులువుగా చేయగల రామచంద్రుడు.

.

ఇంతలో నలుమూలలనుడి కలకలం చెలరేగింది.

.

 నాలుగువైపులనుండీ ముంచెత్తే వరదలాగా సైనికులు నలువైపులనుండీ కమ్ముకుంటూ మండలాకారంగా  దూరమునుండే చుట్టుముట్టుకుంటూ వస్తున్నారు..

.

వారిని చూడగానే ఆయన చేతిలోని ధనుస్సు రుద్రుడి చేతిలోని పినాకములాగా భాసిల్లింది. 

.

ఒక అడుగు ముందుకు వేసాడు ధనుస్సును గట్టిగా పట్టుకున్నాడు!

.

 అప్పుడాయన

.

రుద్రుడైనాడు

వీరభద్రుడైనాడు

ప్రళయకాల ప్రభంజనమైనాడు.

.

వూటుకూరు జానకిరామారావు

శ్రీ సత్యనారాయణ వ్రత మహాత్మ్యము

  శ్రీ సత్యనారాయణ వ్రత మహాత్మ్యము


సాధువంతట సతితోడ సంప్రదించి

సత్యదేవునివ్రతమును సన్నుతించి  

"సంతు గల్గిన వ్రతమును సల్పెదంచు "

మదిని సంకల్ప మొందెను మాట పలికి     63

 

కొంత కాలంబు గడువగ కూర్మి తోడ 

సత్యనారాయణస్వామి సత్యమునను 

సాధు హృదయంబు యత్యంత సంతసిల్ల

పత్ని గర్భంబు దాల్చియు పరవసించె       64


దినదిన గర్భము వర్ధిల

కనిపించెడి సతిని గాంచి కడుమోదమునన్ 

మనమున స్వామిని దలచుచు 

చనకుండగ యింటనుండె సంతతి కొఱకున్   65



అంత పదిమాసములు నిండె యింతి కపుడు  

కాంత నెమ్మోము వెల్గెను శాంతముగను 

కాంత కంతట కల్గె శ్రీకాంతు దయన

కాంతులను చిందు బాలిక కళల తోడ          66


సుత బుట్టిన వెనువెంటనె 

వ్రత విషయము దెల్పె భార్య వణిజుని కంతన్ 

యతి లోభి యైన యాతడు 

"వ్రత ఖర్చులు యిప్పుడేల వద్దని" పలికెన్    67


"అమ్మాయి పెండ్లి వేళలొ 

సమ్మతితో బంధువర్గ సందడి యెదుటన్ 

కమ్మగ చేయగ వ్రతమును 

యమ్మాయికి  శుభము గలుగు" నని శెట్టనియెన్ 68


ఈ లీలను వ్రతమాపుట 

మేలగునే గృహము కనుచు మించిన వ్యధతోన్ 

లీలావతి కడు కుందియు 

గోలేలని మదిని దలచి గొణుగుచు నుండెన్    69


కాలగమనంబునందున గడచె యేండ్లు 

సుత కళావతి పెరిగెను సుందరముగ 

యంత సాధువు మదియందు సంతసిల్లి 

వరుని వెదుకంగ మొదలిడె వణిజు లందు    70


దుహిత కొఱకును వరుజూడ దూత నొకని 

వివిధ ప్రాంతంబులకు బంపె వేడ్కతోడ 

అతడు కాంచనపురమను నగరి కరగి 

వణిజకులజాతయోగ్యుడౌ వరుని దెచ్చె      71


అధిక సంపన్నుడౌ యా సాధు వంతట 

            సకలబంధువులను స్వాగతించె 

నతి సుందరాంగిఔ సుత కళావతికిని 

             ప్రియతమ వరునితో పెండ్లి జేసె 

యాహూతు లేనట్టి యఖిల బంధువులకు 

             ఘనముగా కాన్కలు కట్టబెట్టె 

యందఱు మెచ్చంగ యత్యంత విభవాన 

            యల్లుని యాప్తుల నాదరించె  

పెండ్లి సందడి యందున పెఱిగి యహము 

తాను గతమందు చేయగ దలచి నట్టి 

సత్యనారాయణస్వామి సద్వ్రతంబు 

మఱచె నాతడు  యప్పుడు మంద మతిన   72


గతమున తా మాటాడియు 

వ్రత విషయము మఱచినట్టి వణిజుని పైనన్ 

యతికోపమొంది శ్రీహరి 

వెతలను కల్పించ దలచె విజ్ఞతగలుగన్     73


                                     సశేషము …

*తీర్ధయాత్ర సంబంధ 55 పుస్తకాలు(PDF)

 *తీర్ధయాత్ర సంబంధ 55  పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------


55 పుస్తకాలు ఒకేచోట!   https://www.freegurukul.org/blog/teerdhayatra-pdf


               (OR)


పంచధామ్ యాత్రా గైడ్ www.freegurukul.org/g/TeerdhaYatra-1


తిరుమల తిరుపతి క్షేత్రం-మహాత్యం www.freegurukul.org/g/TeerdhaYatra-2


దేవాలయములు - తత్వవేత్తలు www.freegurukul.org/g/TeerdhaYatra-3


ద్వాదశ జ్యోతిర్లింగములు www.freegurukul.org/g/TeerdhaYatra-4


కాశీ మహాత్యం www.freegurukul.org/g/TeerdhaYatra-5


శ్రీరంగ మహత్యము www.freegurukul.org/g/TeerdhaYatra-6


భారతదేశ యాత్రా దర్శిని www.freegurukul.org/g/TeerdhaYatra-7


తెలుగులో యాత్రాచరిత్రలు www.freegurukul.org/g/TeerdhaYatra-8


ఆంధ్రప్రదేశ్లో దర్శనీయ స్థలాలు www.freegurukul.org/g/TeerdhaYatra-9


కనక దుర్గాక్షేత్ర మహాత్మ్యము www.freegurukul.org/g/TeerdhaYatra-10


గోదావరీ పుష్కరమహాత్యం www.freegurukul.org/g/TeerdhaYatra-11


సంపూర్ణ భారతదేశ యాత్రా మార్గ దర్శిని www.freegurukul.org/g/TeerdhaYatra-12


కేసరగిరి క్షేత్ర మహిమ www.freegurukul.org/g/TeerdhaYatra-13


తిరుమల తిరుపతి యాత్ర www.freegurukul.org/g/TeerdhaYatra-14


దక్షిణ భారత దేవాలయములు www.freegurukul.org/g/TeerdhaYatra-15


బాలానంద కాశీ రామేశ్వర మజిలీల కథలు www.freegurukul.org/g/TeerdhaYatra-16


భద్రాద్రి సీతారాముల కళ్యాణము www.freegurukul.org/g/TeerdhaYatra-17


కాంచీక్షేత్ర సుప్రసిద్ధ దేవాలయములు www.freegurukul.org/g/TeerdhaYatra-18


అమృత సోపానము - తిరుమల కాలినడక దివ్యచరిత్ర www.freegurukul.org/g/TeerdhaYatra-19


వేంకటాచలమహత్యము www.freegurukul.org/g/TeerdhaYatra-20


మహానంది స్థలపురాణము www.freegurukul.org/g/TeerdhaYatra-21


దత్తాత్రేయ పవిత్ర క్షేత్రములు www.freegurukul.org/g/TeerdhaYatra-22


ఉత్తర భారత యాత్రా దర్శిని www.freegurukul.org/g/TeerdhaYatra-23


బాలానంద శ్రీకాళహస్తి మహత్యం www.freegurukul.org/g/TeerdhaYatra-24


కృష్ణా పుష్కరం www.freegurukul.org/g/TeerdhaYatra-25


నవనారసింహ క్షేత్రం-అహోబిలం www.freegurukul.org/g/TeerdhaYatra-26


వేంకటాచల మహాత్మ్యం www.freegurukul.org/g/TeerdhaYatra-27


భద్రాచల క్షేత్ర మహిమ www.freegurukul.org/g/TeerdhaYatra-28


బాలానంద శ్రీశైలక్షేత్ర మహాత్యం www.freegurukul.org/g/TeerdhaYatra-29


శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం www.freegurukul.org/g/TeerdhaYatra-30


తిరుమల యాత్ర www.freegurukul.org/g/TeerdhaYatra-31


కైలాస దర్శనము - బ్రహ్మ మానస సరోవర యాత్ర www.freegurukul.org/g/TeerdhaYatra-32


తిరుపతి పరిసర క్షేత్రాలు www.freegurukul.org/g/TeerdhaYatra-33


సోమేశ్వర క్షేత్ర మహాత్యం www.freegurukul.org/g/TeerdhaYatra-34


సేతు రామేశ్వర మహత్యము www.freegurukul.org/g/TeerdhaYatra-35


శ్రీనివాస మంగాపురం మరియు మన ఆలయముల చరిత్ర www.freegurukul.org/g/TeerdhaYatra-36


త్రిస్థలీ సేతువు-1 www.freegurukul.org/g/TeerdhaYatra-37


మన పవిత్ర వారసత్వము www.freegurukul.org/g/TeerdhaYatra-38


వేంకటాచలమహత్యము-3 www.freegurukul.org/g/TeerdhaYatra-39


సుందర భారత యాత్ర-1 www.freegurukul.org/g/TeerdhaYatra-40


కూచిమంచి తిమ్మకవి సింహాచల మహత్యము www.freegurukul.org/g/TeerdhaYatra-41


ఏడు కొండలు www.freegurukul.org/g/TeerdhaYatra-42


ఘటికాచల మహత్యము www.freegurukul.org/g/TeerdhaYatra-43


వేంకటేశ్వర వైభవము www.freegurukul.org/g/TeerdhaYatra-44


భద్రాచల క్షేత్ర చరిత్రము www.freegurukul.org/g/TeerdhaYatra-45


మత్రికూటాచల మహాత్యము-కోటప్పకొండ స్థల పురాణము www.freegurukul.org/g/TeerdhaYatra-46


శ్రీ కృష్ణాలహరి-కృష్ణ పుష్కరం www.freegurukul.org/g/TeerdhaYatra-47


మా బదరీ, కేదార్ యాత్ర www.freegurukul.org/g/TeerdhaYatra-48


మోపూరు కాలభైరవుడు www.freegurukul.org/g/TeerdhaYatra-49


సుందర భారత యాత్ర-2 www.freegurukul.org/g/TeerdhaYatra-50


వేంకటాచల మహత్యము www.freegurukul.org/g/TeerdhaYatra-51


దివ్యదేశ వైభవ ప్రకాశిక www.freegurukul.org/g/TeerdhaYatra-52


శ్రీనివాస వైభవం www.freegurukul.org/g/TeerdhaYatra-53


వామన పురాణాంతర్గత వేంకటాచల మహాత్యం www.freegurukul.org/g/TeerdhaYatra-54


శ్రీరంగ మహత్యం www.freegurukul.org/g/TeerdhaYatra-55


తీర్ధయాత్రలు గురించి తెలుసుకోవడానికి  కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


మరింత సమాచారం కోసం:

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్

Website: www.freegurukul.org

Android App: FreeGurukul 

iOS App: Gurukul Education  

Helpline: 9042020123

*To Join In WhatsApp Group*: To get this type of Spiritual, Inspirational, PersonalityDevelopment messages daily, join in group by this link  www.freegurukul.org/join 

ధార్మికగీత - 45*

 *ధార్మికగీత - 45*  

                                                                                    శ్లో:    పరోపకారాయ ఫలంతి  వృక్షా:౹*

             *పరోపకారాయ వహంతి నద్యః ౹*

             *పరోపకారాయ దుహంతి గావః ౹*

             *పరోపకారార్థ మిదం శరీరమ్ ౹౹*

                          


జగతి పరోపకారముకు 

          చక్కని పండ్లను నిచ్చు వృక్షముల్ 

జగతి పరోపకారముకు

          చల్లగ పారుచునుండు నద్యముల్

జగతి పరోపకారముకు

          సత్త్వపు క్షీరము నిచ్చు ధేనువుల్

జగతి పరోపకారముకె

          సంతతముండగ నొప్పు మేనిలన్ **

పోరాడాలని

  డేగ(ఈగిల్ )తో పోరాడాలని

ధైర్యం చేసే ఏకైక పక్షి కాకి
డేగ వెనుకభాగంలో కూర్చుని మెడను మీద పొడుస్తుంది కాకి
అయినా డేగ స్పందించదు
కాకితో పోరాడదు. 
ఎందుకంటే కాకికోసం సమయం లేదా శక్తిని వృథా చేయదు! 
డేగ  కేవలం తన రెక్కలను తెరిచి, ఆకాశంలో ఇంకా పైకి ఎదగడం ప్రారంభిస్తుంది. 

డేగ పైపైకి ఎగిరి ఎదిగిన కొద్దీ కాకికి ఊపిరి పీల్చుకోవడం కష్టతరమౌతుంది ఆపై ప్రాణవాయు లేకపోవడం వల్ల కాకి   క్రింద పడిపోతుంది. 

కాకులతో మీ సమయాన్ని వృథా చేయకండి. 
వాటిని మీ ఎత్తులకు తీసుకెళ్లండి వాటి శక్తియుక్తులు వాటికి అవగతమై అవే దారినిస్తాయి అనేది నీతి.🙏
COPIED FROM  SRI  Ramu siricilla 

కర్తవ్యం ఏమిటి?*

  *మనిషి కర్తవ్యం ఏమిటి?* 

🕉️🌞🌎🏵️🌼🚩


 *పంచభూతాలతో కూడిన భగవంతుడి విశ్వసృష్టి మహాద్భుతం. లక్షల జీవరాశులు, ఉద్యానవనాలు, నదులు, కొండలు, కోనలు, తేనెలూరే మధురఫలాలు, సువాసనలు వెదజల్లే* *రంగురంగుల విరులు... ఇవన్నీ సృష్టించిన ఆ పైవాడి సృజన శక్తిని వర్ణించడం అసాధ్యం. జలపాతాలతో కూడిన రమణీయ ప్రకృతికి ప్రాణం పోసిన పరమాత్మ* *ఆదిమధ్యాంత రహితుడు.* 

 *లక్షల జీవరాసుల్ని సృష్టించిన దైవం కేవలం మనిషికే కొన్ని ప్రత్యేకతలు ప్రసాదించాడు. ఆలోచించగల శక్తియుక్తులను, బుద్ధిబలాన్ని అనుగ్రహించాడు. ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ ఆనందించగల మనసును కానుకగా ఇచ్చాడు. మాట ద్వారా భావాల్ని వ్యక్తపరచగల అవకాశం కల్పించాడు.* *తాను బతుకుతూ తనచుట్టూ ఉన్న ఇతర జీవరాసులను రక్షించగల శక్తినిచ్చాడు.* 

 *మనిషి నిరంతరం ఆలోచనల్లో మునిగి తేలుతుంటాడు.* *వివేకవంతుడి ఆలోచన సమాజక్షేమాన్ని కాంక్షిస్తుంది.* 

 *విజ్ఞాని ఆలోచన మానవాళి అభ్యున్నతికి బాటలు పరుస్తుంది.  శాస్త్రజ్ఞుడి ఆలోచన నూతన ఆవిష్కరణలకు తెరతీస్తుంది.* ఒక *రచయిత ఆలోచన గ్రంథంగా రూపొంది పాఠకులకు జీవనమార్గం చూపిస్తుంది. ఆలోచనలు అనంతం. మనిషికి బుద్ధిబలం దైవం ప్రసాదించిన అపూర్వవరం. తన బుద్ధిబలంతో మానవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోగలడు. మనిషి మేధకు పరిమితి లేదు. అపారమైన జ్ఞాపకశక్తి మనిషి సొంతం. మనిషి మెదడు అంతులేని సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోగలదు.* 

 *విద్యావంతుడైన మేధావి శాస్త్రాలను కాచి వడబోసి ప్రకృతిని తనకు అనుకూలంగా మలచుకుని  ఎదురులేదని నిరూపించుకుంటున్నాడు.* *తనకు తగిన ఆహారం సమకూర్చుకుని సకల సౌఖ్యాలతో విరాజిల్లగలగడం మనిషి నేర్పరితనం.* 

 *మానవ జీవితం సుఖ దుఃఖ సమ్మిళితం. సుఖంగా ఉన్నప్పుడు ఆనంద తరంగాల్లో ఓలలాడే మనిషి దుఃఖం కలిగినప్పుడు బాధను వ్యక్తపరుస్తాడు. మనిషి తోటి మనిషిని ప్రేమిస్తాడు. ఈ స్పందనలకు మూలం మనసు. ఒంటరిగా ఉన్నప్పుడు మనిషికి తోడు మనసే.* 

 *మాటే మనిషి శక్తి. మాటే మనిషి భుక్తి. మనిషిని రక్షించేది శిక్షించేది మాటే. మిత్రులను కలిపేది మాట. శత్రుత్వం పెంచేది మాట.* 

 *మనిషి తన ఆలోచనల్లో పరిణతి సాధించాలి. మంచి ఆలోచన మనిషి అభ్యున్నతికి తోడ్పడితే చెడు ఆలోచనలు పతనానికి దారి చూపుతాయి.* *వికృతమైన ఆలోచనలు రాక్షసుడిగా మారుస్తాయి. ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుంటే చిక్కులు తప్పవు. నిదానమే ప్రధానంగా ఆలోచనలు సాగాలి.సమస్యలకు పరిష్కారం యోచించగలిగినప్పుడే విజయం లభిస్తుంది.*  

 *పరమాత్మ ప్రసాదించిన* *బుద్ధిబలంతో మనిషి సమాజ శ్రేయస్సుకు నడుంకట్టాలి.* *సహజీవులకు సహకారిగా మనగలగాలి* . *ప్రేమతత్వాన్ని పెంపొందించుకుంటూ* *ఈశ్వరుడికి ప్రీతిపాత్రుడు కాగలగాలి. సంభాషణల్ని మధురంగా పలకాలి.* *మానవత్వం మాటల్లో ప్రతిఫలించాలి. వ్యర్థ ప్రసంగాలతో కాలం వృథా చేసుకోకుండా మాట కల్పించిన పరమాత్మను నోరారా కీర్తించాలి.* 

 *నిస్వార్థంగా భగవంతుణ్ని సేవిస్తూ నీతిమంతమైన జీవితం గడపడమే మనిషి కర్తవ్యం కావాలి. భగవంతుడు నిర్దేశించిన ధర్మపథంలో జీవించడమే జన్మనిచ్చిన దైవానికి కృతజ్ఞత తెలపడం. అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వభూతదయ, సత్యం, క్షమ, శాంతి వంటి ఉత్తమ గుణాలతో రాణిస్తూ పరమాత్ముణ్ని సేవిస్తూ కర్తవ్య పరాయణుడై మనుగడ సాగించడం మానవధర్మం.* 


ఈనాడు అంతర్యామి

- ఇంద్రగంటి నరసింహమూర్తి


🕉️🌞🌎🏵️🌼🚩