1, డిసెంబర్ 2025, సోమవారం

అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా

  🌹అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా

అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా।

ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా। 


అళికము అంటే నుదురు.


అమ్మ నుదురు అష్టమి చంద్రుడిలా ఉన్నదట.

నెలలో రెండు పక్షాలు. శుక్లపక్షం, కృష్ణపక్షం అని. ఒక్కొక్క పక్షానికి పదిహేను తిథులు. వాటిని మనం వరుసగా వ్రాస్తే ఇలా ఉంటాయి.

శుక్లపక్షంలో

పాడ్యమి విదియ తదియ చవితి పంచమి షష్టి సప్తమి

అష్టమి

నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి.

అలాగే కృష్ణపక్షంలో

పాడ్యమి విదియ తదియ చవితి పంచమి షష్టి సప్తమి

అష్టమి

నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య

రెండుపక్షాల్లోనూ కూడా అష్టమి మధ్యన వస్తుంది. అటు ఏడు తిధులు, ఇటు ఏడు తిధులు.

కళాతు శోడశో భాగః అని నిర్వచనం ప్రకారం కళ అంటే పదహారవ వంతు.

మరి తిథులు పదిహేనే కదా అనవచ్చును మీరు.

పౌర్ణమి చంద్రుణ్ణి షోడశకళా ప్రపూర్ణుడు అంటారు. అంటే నిండా పదహారు కళలూ ఉన్నవాడు అని. పౌర్ణమి నుండి ఒక్కొక్క తిథినాడూ ఒక్కొక్క కళ తగ్గుతుంది. అమావాస్య నాటికి ఒక్క కళ మిగులు తుంది. లేకపోతే కళలన్నీ నశించటం అంటే చంద్రుడే లేక పోవటం కదా! అందుకని అమావాస్యకు సున్నా కాదు ఒక్క కళ అన్నమాట. ఆనాటి నుండి ప్రతి తిథికి ఒక్కొక్క్ కళ చొప్పున పెరిగి మరలా పౌర్ణమి నాటికి పదహారుకళలూ పూర్తిగా సంతరించుకుంటాడు చంద్రుడు.

ఈ కళలకు విడివిడిగా పేర్లూ ఉన్నాయి. వాటికి అధిష్ఠాన దేవతలూ ఉన్నారు!


ఈ కళాదేవతలకు నిత్యలు అని పేరు. ఈ షోడశ నిత్యల నామధేయాలూ చూదాం.


కామేశ్వరి

భగమాలిని

నిత్యక్లిన్న

భేరుండ

వహ్నివాసిని

మహావజ్రేశ్వరి

శివదూతి

త్వరిత

కులసుందరి

నిత్య

నీలపతాక

విజయ

సర్వమంగళ

జ్వాలామాలిని

చిత్ర

శుక్లపక్షంలో పాడ్యమి నుండి ఆరోహణ క్రమంలో కామేశ్వరి నుండి చిత్రవరకూ నిత్యలు అధిష్ఠాన దేవతలు.

కృష్ణపక్షంలో పాడ్యమి నుండి అవరోహణ క్రమంలో చిత్ర నుండి కామేశ్వరి వరకూ నిత్యలు అధిష్ఠాన దేవతలు.

రెండు పక్షాల్లోనూ కూడా అష్టమి నాటి నిత్యాదేవత పేరు త్వరిత.

పదహారు కళలూ అని చెప్పి నిత్యాదేవతలను పదిహేను మందినే చెప్పారేం అని మీరు ప్రశ్న వేయవచ్చును. పదహారవది ఐన కళ పేరు మహానిత్య. ఇది సర్వకాలమూ ఉండే కళ. ప్రత్యేకంగా అధిష్ఠాన దేవతను చెప్పలేదు.

అమ్మవారి నుదురు అష్టమి చంద్రుడిని పోలి ఉంది అని చెప్పారు కదా. ఇందులో విశేషం ఏమన్నా ఉందా అని అలోచిద్దాం.

వికాసదశ ఐన శుక్లపక్షంలోనూ క్షీణదశ ఐన కృష్ణపక్షంలోనూ కూడా అష్టమి చంద్రుడు ఒక్కలాగే ఉంటాడు. అధిష్ఠాత్రి త్వరితా నిత్య. 

సంతోషమూ వ్యసనమూ వలన బేధం లేని లలాటం అమ్మది అని అర్థం. ఏవిధమైన పరిణామబేధమూ లేనిది అన్నమాట.

అమ్మ ముఖం పూర్ణచంద్ర బింబం.

అమ్మ లలాటం అర్థం చంద్రబింబం.

తిథులలో ప్రతి పగటికీ రాత్రికీ కూడా విడివిడిగా సంకేత నామాలున్నాయి. శుక్లపక్షం అష్టమి రాత్రికి పేరు ఆప్యాయ. అంటే శ్రీదేవీ అమ్మవారి లలాటం ఆప్యాయత కురిపించేదిగా ఉన్నదని భావం.

ఇక్కడ ఒక సమయమత రహస్యం ఉంది. అమ్మముఖం పూర్ణచంద్ర బింబం. శరీరాంతర్గత పూర్ణచంద్రస్థానం సహస్రారం. అక్కడ సాధకుడికి అమృతసిధ్ధి.

అమ్మవారి లలాటం పైన అంతర్దృష్టి నిలిపి ధ్యానం చేస్తే అష్టమీ చంద్రదర్శనం. అంటే సగం దూరం అతిక్రమించి వచ్చేయటమే యోగంలో అన్నమాట.

ఇది సులభోపాయం. ఇదే రహస్యం

సామాన్యులకు ఐనా సరే అమ్మ ముఖదర్శనమే త్వరితఫలదాయక మని గ్రహించాలి. సమస్త కామితములూ అమ్మ ముఖాన్ని మానసికంగా ధ్యానంలో దర్శించితే చాలు అవి వెంటనే ఫలిస్తాయని ఆశీః పూర్వకమైన సందేశం.

🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

మహనీయులమాట

  🙏సర్వేజనాఃసుఖినోభవంతు: 🙏


        🌻*శుభోదయం*🌹


🌺 *మహనీయులమాట* 🌺


ఎవ్వరినీ ఏరకంగానూ బాధ పెట్ట కూడదు. మాటలతో కానీ చేతలతో కానీ యే కన్నీటి ఉసురు అయినా వెన్నంటి వెంటాడుతుంది. జన్మ జన్మలవరకు చిరునవ్వుతో అందరినీ దగ్గరకు తీసుకుందాం. మనం వెళ్లిపోయినా వారి హృదయం లో స్థానాన్ని సంపాదించు కుందాం.


🌹 *నేటిమంచిమాట* 🌹


ఎవరి మంచితనం వారికి శ్రీ రామరక్ష,ఎవరి చెడుతనం వారికి వారు సృష్టించుకుంటున్న శిక్ష.ఆ భగవత్ శిక్ష నుంచి తప్పించుకోవడం ఎవ్వరి తరం కాదు.ఎప్పుడో ఒకప్పుడు ఆ శిక్ష అనుభవించి తీరాల్సిందే.


🥀🥀🥀🥀🥀🥀🥀🥀



🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        ☘️పంచాంగం☘️

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ ... 01 - 12 - 2025,

వారం ... ఇందువాసరే ( సోమవారం )

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,

దక్షిణాయనం,

హేమంత ఋతువు,

మార్గశిర మాసం,

శుక్ల పక్షం,


తిథి : *ఏకాదశి* మ2.18 వరకు,

నక్షత్రం : *రేవతి* రా7.49 వరకు

యోగం : *వ్యతీపాత్* రా10.29 వరకు,

కరణం : *భద్ర* మ2.18 వరకు

                 తదుపరి *బవ* రా1.17 వరకు,


వర్జ్యం : *ఉ8.24 - 9.56*

దుర్ముహూర్తము : *మ12.10 - 12.54*

                              మరల *మ2.23 - 3.07*

అమృతకాలం : *సా5.32 - 7.03*

రాహుకాలం : *ఉ7.30 - 9.00*

యమగండం : *ఉ10.30 - 12.00*

సూర్యరాశి : *వృశ్చికం* 

చంద్రరాశి : *మీనం*

సూర్యోదయం : 6.16,

సూర్యాస్తమయం : 5.20,


               *_నేటి విశేషం_*

*మార్గశుద్ధ ఏకాదశి / మోక్షద ఏకాదశి - గీతాజయంతి*

ఈ ఏకాదశిని ‘మోక్షద’ ఏకాదశి అని పిలుస్తారు,

ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేయడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు,

ఇదే రోజున కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతను బోధించాడన్నది విశ్వాసం.

అందువల్ల ఇది గీతాజయంతి కూడా జరుపుకుంటారు.

 ‘మోక్షద’ ఏకాదశి గురించి కృష్ణుడు పాండవులకు వివరించిన కథ బ్రహ్మాండ పురాణంలో ఉంది...

 వైఖానసుడు అన్నరాజు తన తండ్రి ‘నరమం’లో బాధలను పొందుతున్నట్లు కల గంటాడు. రుషి మునుల సలహాలపై వైఖానసుడు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు సంపూర్ణ ఉపవాసం చేశాడు. 

ఈ వ్రతఫలంగా వైఖానసుని తండ్రికి నరకబాధ తొలగిపోయి మోక్షప్రాప్తి కలిగిందట.


ఈరోజున ఉపవాసం, విష్ణు ఆరాధన – విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. 

విష్ణు ప్రీతికరమైన ఏకాదశులలో ఇది అత్యంత ప్రధానమైనది. 

దీనిని మహిమాన్వితమైన ఏకాదశిగా పురాణాలు వర్ణించాయి.


ఏకాదశి ముందు రోజు ఏకభుక్తం చేసి ఏకాదశి నాడు శక్తి కొలది ఉపవసించాలి. 

ఆ రోజు షోడశోపచారాలతో నారాయణుని అర్చించాలి, ద్వాదశినాడు తిరిగి పూజించి అన్నాదికాలు నివేదించి పారణచేయాలి.


ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహమపరేహని!

భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత!! అని మంత్రము

ఉచ్చరించి పుష్పాంజలిని దేవునికి సమర్పించాలి.


            *_☘️శుభమస్తు☘️_*

🙏 సమస్త లోకాః సుఖినోభవంతు 🙏

సుభాషితమ్

  🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝 *గీతా సుగీతా కర్తవ్యా కిం అన్యైః శాస్త్ర విస్తరైః* 

        *యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్ వినిర్గతా* 


తా𝕝𝕝 *భగవద్గీత అనునది శ్రీ కృష్ణ భగవానుని ముఖకమలము నుండి వెలువడినది కావున, మానవులు ఈ ఒక్క దానిని పఠించి, శ్రవణ, మనన, స్మరణముల ద్వారా సాధన చేసిన చాలును. ఈ యుగమందు మానవులు లౌకిక ప్రయోజనార్ధులై ఉండుట వలన వేదవాఙ్మయమును పఠింపలేరు. వారికి గీతాగ్రంథ పారాయణమే ముక్తినొసగును*.


 ✍️💐🌹🌸🙏

సంపూర్ణ మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*షష్టాశ్వాసం ప్రధమ భాగం*



*577 వ రోజు*


*పరిక్షార్ధం సులభ వాదన పొడిగించడం*


సులభ " మహారాజా ! నీకు నువ్వు జ్ఞానివి అనుకుంటున్నావు. అది ఒక మానసికరుగ్మత కనుక నీ బంధువులకు చెప్పి వైద్యం చేయించు. లేకున్న నాకిలా నీతులు చెప్పవు. ఇవన్నీ విన్న తరువాత కూడా నీవు నేను ఎందుకు ముక్తుడను కాను అని అడిగిన నేను చెప్పే సమాధానము విను. రాజువైన నీవు సదా ధర్మార్ధ కామాల గురించి ఆలోచిస్తూ రాజ్య తంత్రముల గురించి ఆలోచిస్తూ ఉంటావు. మేలుకొనమని, స్నానాదులు చెయ్యమని, భోజనం చెయ్యమని సేవకులు చెప్పిన కాని వినవు. నీ చుట్టూ ఉన్న మంత్రులు, సామంతులు, సుందరీ మణులు నీ మెప్పును ఆశిస్తూ నీ పనులను నిన్ను చేసుకోనివ్వరు. నీకు ఏ పని చెయ్యడానికి స్వతంత్రం ఉండదు నీకు నచ్చిన భోజనం కూడా నీ అంతట నిన్ను తిననివ్వరు. నీవు అర్హత అనర్హత తెలుసుకుని దానం చెయ్యాలి. కనుక ధనం ఎలా కూడబెట్టాలో ఆలోచన చేస్తూ ఉండాలి. నీ పక్కనే ఉంటూ గోతులు తవ్వే వారిని సదా ఒక కంట కనిపెట్టే ఉండాలి. కనుక రాజా ! రాజులకు సుఖాలు తక్కువ దుఃఖాలు తక్కువ. అలాంటి రాజులు ముక్తి మార్గంలో ఎలా ప్రయణించగలరు. కనుక నువ్వు ముక్తి మార్గంలో పయనిస్తున్నానని చెప్పడం అబద్ధం. రాజా ! పంఛశిఖ మహర్షి వద్ద ఉపదేశం పొందిన నీవు నేను నీ దగ్గరకు రాగానే అసహ్యించుకున్నావు. ఇదేనా ద్వందమును వదిలి ముక్తి మార్గంలో ప్రవర్తించే యోగులు ఆచరించే విధానం. మోక్షాసక్తుడు ద్వందమును వదలాలి, దేనియందు ఆపేక్ష లేక నిర్వికారంగా, చెలించని మనసుతో ఉండాలి. యతులు జనావాసాలను వదిలి అరణ్యవాసం చేయాలి. నీవు ముక్తుడవని పొరపాటు పడి నిర్వికారుడవని అనుకుని నీ మనస్సులో ప్రవేశించాను. నేను నిన్ను నా అవయములతో ముట్టుకోలేదు అయినా నీవు నన్ను చూసి భయపడి దూషించావు. అలా ఎందుకు చేసావు ? రాజా ఈ సభలోని పెద్దలు వింటూ ఉండగా నీవిలా మాట్లాడడం న్యాయమా ! ఎదుటి వారిని ఇలా కించపరచడం ధర్మమా ! అత్యంత గోప్యమైన స్త్రీ పురుష సంబంధాల గురించి బహిరంగంగా మాట్లాడటం మీ కీర్తికి, గొప్పతనానికి హాని కదా ! ఇది ధూర్తలక్షణం కాదా ! మహారాజువైన నీకు ఇలాంటి నికృష్టులకు కూడా తగని మాటలు తగునా ! తామరాకు మీద నీటి బొట్టులా జీవిస్తున్న నా వంటి యోగిని గురించి తెలుసుకోలేని నువ్వు పంఛశిఖమహర్షి శిస్యుడని చెప్పుకోవడం అబద్ధం కాదా ! రాజా ! నీవు గృహస్థ ధర్మానికి, మోక్షమార్గానికి కూడా దూరం అయ్యి రెండింటికి చెడిన రేవడివి అయ్యావు. అన్ని తెలుసును అనుకుని భ్రమలో పడి బ్రతుకుతూ ఉన్నావు. ముక్తులు ముక్తులు కలవడం సాధారణం. ఆకాశంలో ఆకాశం కలిసినట్లు శూన్యంలో శూన్యం కలిసినట్లు ముక్తి మార్గంలో ఉన్న వారిని చూసినప్పుడు ముక్తిమార్గులు కలిసి పోతారు. యోగినిని అయిన నన్ను నీవు చూసినప్పుడు చలించావు కనుక నీవు ముక్తి మార్గమున చరించడం అబద్ధము. మనము ముక్తులము కాదని అనుకున్నా మన కలయిక అధర్మం కాదు. నేను ప్రశస్తమైన చరిత్ర కలిగిన ప్రధన మహారాజు వంశ సంజాతని. నేను క్షత్రియ కాంతను. నా పేరు సులభ. నా పూర్వీకులు శతశృంగ పర్వతముల మీద ఎన్నో యజ్ఞ యాగములు చేసారు. సాక్షాత్తు దేవేంద్రుడే వారి వద్దకు వచ్చి పరమార్ధము గురించి సద్గోష్ఠి చేసేవాడు. నాకు వివాహం చేసుకోదగ్గ పురుషుడు లభించక మోక్షమార్గంలో పయనిస్తున్నాను. నాను క్షత్రియ వనితను కనుక మన కలయిక అధర్మం కాదు. ఇక దాపరికం ఎందుకు నేను నిన్ను పరీక్షించ వచ్చాను. కాని నీవు ముక్తి మార్గంలో పయనించడం లేదని తెలుసుకున్నాను " అని అనర్గళంగా చెప్పిన సులభ జనకుడి ముఖం చూసి నవ్వుతూ " జనక మహారాజా ! నీవు ముక్తి మార్గంలో పయనిస్తున్నావా లేదా అని పరీక్షించడం అగ్ని వేడిగా ఉంటుందా చల్లగా ఉంటుందా అని పరీక్షించడం వంటిది. నేను కేవలం అజ్ఞానంతో ఇలా ప్రవర్తించానని అనుకో ! జనకమహారాజా ! నీ మాటలలో ఇసుమంతైనా అసత్యం, దోషము లేదు. మునులతో కూడా కీర్తింపతగిన నీకు మోక్షము కరతలామలకం. నేను రాగానే మీరు నన్ను ఎంతో గౌరవించారు. అందుకని మీతో ఇలా మాట్లాడితే ఎలా ఉంటుందో అని హాస్యముకు ఇలామాట్లాడాను. నేను చెప్పినవన్నీ అబద్ధములు నేను నిన్ను పరీక్షించడానికి వచ్చానన్నది మాత్రమే నిజం. సౌజన్య మూర్తులైన మీరంతా నన్ను మన్నించండి " అన్నది సులభ. ఆ మాటలకు జనకుడు మంత్రులు ఇతర సభికులు తేకగా ఊపిరి తీసుకున్నారు. సులభ వాఖ్చాతుర్యానికి అభినందించారు. ఆరోజుకు సులభ అక్కడే ఉండి మరునాటికి తన దోవన తాను పోయింది " అని చెప్పిన భీష్ముడు " ధర్మనందనా ! జనక సులభల సంవాదనతో నీ సందేహం తీరింది కదా ! " అని అడిగాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీ ఖోలే కే హనుమాన్ జీ ఆలయం

  🕉 మన గుడి : నెం 1312


⚜  రాజస్థాన్ : జైపూర్ 


⚜  శ్రీ ఖోలే కే హనుమాన్ జీ ఆలయం



💠 రాజస్థాన్‌లోని జైపూర్‌లో హనుమంతుడికి అంకితం చేయబడిన అత్యంత గౌరవనీయమైన మరియు ప్రసిద్ధ ఆలయాలలో ఖోలే కే హనుమాన్ జీ ఒకటి. 


💠 ఆరావళి కొండల ఒడిలో ఉన్న ఈ ఆలయం లోతైన మత, సాంస్కృతిక మరియు చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. 

నహర్‌గఢ్ అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఇది ప్రతిరోజూ వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది మరియు ముఖ్యంగా మంగళవారాలు మరియు శనివారాల్లో భారీ సంఖ్యలో జనసంద్రాన్ని చూస్తుంది, ఇవి హనుమాన్ ఆరాధనకు శుభప్రదమైనవిగా భావిస్తారు.


⚜ చారిత్రక నేపథ్యం


💠 ఖోలే కే హనుమాన్ జీ ఆలయం 1960ల మధ్యకాలం నాటిది. 

దీనిని హనుమంతుని భక్తుడైన పండిట్ రాధే లాల్ చౌబే జీ స్థాపించారు. 


💠 స్థానిక ఇతిహాసాలు మరియు కథనాల ప్రకారం, 60వ దశకంలో, నగరవాసులు పర్వతాలు మరియు నగరంలోని తూర్పు కొండల గుహలో ప్రవహించే వర్షపు కాలువ మధ్య ఉన్న నిర్జన ప్రదేశంలో అడవి జంతువుల భయం కారణంగా ఇక్కడికి రాలేకపోయారు. 


💠 అప్పుడు ఒక ధైర్యవంతుడైన 

పండిట్ రాధే లాల్ చౌబే జీ అనే 

బ్రాహ్మణుడు ఈ నిర్జన ప్రదేశానికి వచ్చి పర్వతంపై పడి ఉన్న హనుమాన్ జీ యొక్క భారీ విగ్రహాన్ని కనుగొన్నాడు. 

ఈ నిర్జన అడవిలో దేవుడిని చూసిన బ్రాహ్మణుడు ఇక్కడ మారుతి నందన్ శ్రీ హనుమాన్ జీని సేవించడం మరియు పూజించడం ప్రారంభించాడు మరియు అతను మరణించే వరకు ఆ స్థలాన్ని వదిలి వెళ్ళలేదు.


💠 ఈ ప్రదేశం నిర్జనంగా ఉన్నప్పుడు, పర్వతాల గుహ నుండి వర్షపు నీరు గుహ రూపంలో ఇక్కడ ప్రవహించేది. అందుకే ఈ ఆలయానికి ఖోలే కే హనుమంజీ అని పేరు పెట్టారు.


💠 "ఖోలే కే హనుమాన్ జీ"* అనే పేరు హిందీ పదం "ఖోలే" నుండి వచ్చింది, దీని అర్థం ఒక లోయ లేదా గుహ. 

హనుమంతుడి అసలు విగ్రహం అటువంటి వాతావరణంలో కనుగొనబడింది - సహజ శిలలు మరియు ఏకాంత పచ్చదనం మధ్య, ఆలయానికి దాని పేరు మరియు ఆధ్యాత్మిక ప్రత్యేకత రెండింటినీ ఇచ్చింది.


💠 ఆలయం ప్రారంభంలో ఒక చిన్న మందిరం, స్థానిక భక్తులు మరియు ఆలయ ట్రస్ట్ ప్రయత్నాల కారణంగా సంవత్సరాలుగా గణనీయంగా అభివృద్ధి చెందింది. 

నేడు, ఇది వీటిని కలిగి ఉంది:

* హనుమంతుడి భారీ విగ్రహం.

* భక్తులకు వసతి కల్పించడానికి విశాలమైన ప్రాంగణాలు మరియు మందిరాలు.

*బోజనాలయం (ఉచిత భోజన సేవ), విశ్రాంతి స్థలాలు మరియు గోశాల (గోశాల) వంటి సౌకర్యాలు.


💠 ఈ ఆలయం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక అభ్యాసం మరియు సమాజ సేవకు కేంద్రంగా కూడా ఉంది.


💠 ఇది పురాతన కోట శైలిలో నిర్మించిన కొత్త భవనం, మూడు అంతస్తులు ఉన్నాయి. 

ముందు ఆలయం ఒక పెద్ద బహిరంగ చతురస్రం ఉంది. తలుపుకు కుడి వైపున, పండిట్ రాధే లాల్ చౌబే పాలరాయి సమాధి ఉంది .


💠 ఈ మూడు అంతస్తుల ఆలయంలో, హనుమంతుడితో పాటు, రాముడు , కృష్ణుడు , గణేశుడు , గాయత్రి మరియు వాల్మీకి ప్రత్యేక మరియు గొప్ప ఆలయాలు ఉన్నాయి . 

ఈ ఆలయం చుట్టూ గోడలు మరియు గాజుపై చేసిన చిత్రాలు ఆకర్షణీయంగా ఉన్నాయి.


💠 ఖోలే కే హనుమాన్ జీని సంకట మోచన్*గా భావిస్తారు - అడ్డంకులు మరియు ఇబ్బందులను తొలగించేవాడు. 


💠 జైపూర్ మరియు సమీప ప్రాంతాల నుండి ప్రజలు ఆశీర్వాదం కోసం, ముఖ్యంగా ఆరోగ్యం, బలం మరియు చెడు ప్రభావాల నుండి రక్షణ కోసం ఇక్కడికి వస్తారు. 


💠 హనుమాన్ జయంతి వంటి పండుగల సమయంలో ఈ ఆలయం ప్రధాన పాత్ర పోషిస్తుంది, అక్కడ గొప్ప వేడుకలు, ఊరేగింపులు మరియు *భజన* కార్యక్రమాలు నిర్వహించబడతాయి.


💠 ఆలయ ప్రాంగణంలోని అనేక వంటశాలలలో వండుకునే దాల్-బాటి చుర్మా మరియు స్వామణి ప్రసాదాలు ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందాయి. 

ఈ ప్రసాదాలను ఎవరూ మిస్ చేయకూడదు.


💠 భక్తులు సమర్పించిన ముడి ప్రసాదాలతో సావమణి ప్రసాదం తయారు చేస్తారు, తరువాత దానిని ఆలయ వంటశాలలలో వండుతారు.  ఒక సావమణి నైవేద్యం అంటే దాదాపు 46-51 కిలోగ్రాముల ముడి ఆహారం మరియు తీపి పదార్థాలను నైవేద్యంలా సమర్పించవచ్చు. 

ఎవరైనా సావమణిని ఆతిథ్యం ఇచ్చి ప్రజలకు తినిపించవచ్చు. 

ఇది స్థానికులు అనుసరించే చాలా సాధారణమైన మరియు ప్రసిద్ధమైన ఆచారం.


💠 జైపూర్‌లోని వివిధ ప్రాంతాల నుండి రోడ్డు ద్వారా ఈ ఆలయాన్ని సులభంగా చేరుకోవచ్చు మరియు నగర కేంద్రం నుండి 8-10 కి.మీ దూరంలో ఉంటుంది. 

భక్తులు తరచుగా భక్తి చర్యగా కొండపైకి నడవడానికి ఇష్టపడతారు.


రచన

©️ Santosh Kumar

శ్రీమద్భగవద్గీత

  శ్రీమద్భగవద్గీత: పదునేడవ అధ్యాయము

శ్రద్ధాత్రయ విభాగయోగము:శ్రీ భగవానువాచ


యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః 

దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్ (21)


అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే 

అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్ (22)


ప్రత్యుపకారం పొందాలనే వుద్దేశంతోకాని, ప్రతిఫలాన్ని ఆశించికాని, మనసులో బాధపడుతూకాని చేసేదానం రాజసం. అనువుకానిచోట అకాలంలో అపాత్రుడికి అగౌరవంగా, అవమానకరంగా యిచ్చేదానం తామసం.


కృష్ణం వందే జగద్గురుమ్..🙏

గీతా జయంతి

  *గీతా జయంతి మరియు మోక్షదా ఏకాదశి శుభాకాంక్షలు*


*గీకారం త్యాగరూపం స్యాత్ తకారమ్ తత్వబోధకమ్*

*గీతా వాక్య మిదమ్ తత్వం జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:*

*సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః|*

*పార్థోవత్సః సుధీర్భోక్తాదుగ్ధం - గీతామృతమ్మహత్||*


మార్గశిర శుద్ధ ఏకాదశి "గీతాజయంతి". ఈ ఏకాదశిని "మోక్షద" ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశినాడు ఉపవాసం చేయడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుంది. ఇదే రోజున కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునునికి “భగవద్గీత” ను బోధించాడన్నది విశ్వాసం. అందువల్ల ఈ ఏకాదశి "గీతాజయంతి" అని కూడా వ్యవహారిస్తారు.


శ్లో𝕝𝕝 సర్వోపనిషదో గావో

దోగ్ధా గోపాలనందనఃl

పార్థో వత్సః సుధీర్భోక్తా

దుగ్ధం గీతామృతం మహత్ ||


తా𝕝𝕝 సర్వోపనిషత్తుల సారమైన గోవు భగవద్గీత కాగా, గోపాలుడైన భగవానుడు ఆ క్షీరమును పితుకువాడు. 


అనగా ఆ సారమును మనకు అందిచువాడు. ఆ భగవద్గీతా సారమును పొందు అర్జునుడు గోవత్సము (దూడ) కాగా, పండితులు, భక్తులు, పరమ భాగవతులు,ఆ భగవద్గీతా క్షీరమును పానము చేయువారుగ నున్నారు.


సకల జ్ఞానస్వరూపాలైన ఉపనిషత్తులను గోవులుగానూ, అర్జునుణ్ణి దూడగానూ చేసి శ్రీకృష్ణుడు పితికిన ఆవుపాల సారమే భగవద్గీత. 


పుట్టుక నుంచి మరణం వరకూ జీవితంలో ప్రతి మలుపులోనూ ఉపయోగపడుతుంది భగవద్గీత. భగవద్గీతలో సమాధానం లేని ప్రశ్న ఉండదు.


కురుక్షేత్ర సంగ్రామంలో తన సోదరులని, బంధువులని, గురువులని, స్నేహితులని చూసి, హృదయం ద్రవించి...కేవలం రాజ్యం కోసం వారిని వధించాలా అని బాధపడి అస్త్రాలు వదిలేసిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన జ్ఞాన బోధ భగవద్గీత.


మహాభారతంలో భీష్మ పర్వంలో ఉన్న 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు మొత్తం భగవద్గీత 18 అధ్యాయాలు. ఒక్కో అధ్యాయాన్ని ఒక్కో యోగం అంటారు. 6 యోగాలని కలిపి ఒక షట్కం అని..1 నుంచి 6 అధ్యాయాలను కర్మ షట్కమని, 7 నుంచి 12 వరకు భక్తి షట్కం అని, 13 నుంచి 18 వరకు జ్ఞాన షట్కం అని అంటారు.


మహా భారతంలో భగవద్గీత ఓ భాగమైననప్పటికీ దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్నో పురాణేతిహాసాలు చదవాల్సిన అవసరం లేకుండా కేవలం భగవద్గీత చదివితే చాలు ..జీవితానికి అర్థం, పరమార్థం అర్థమవుతుంది.


కురుక్షేత్ర సంగ్రామానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం ఎందుకు చేశాడో రెండో అధ్యాయంలోనే స్పష్టంగా ఉంటుంది. ‘క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప’ క్షుద్రమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని వీడమని శ్రీ కృష్ణుడు అర్జునుడిని హెచ్చరించాడు. ఈ హృదయమే అన్ని ఆలోచనలకూ, రాగద్వేషాలకు కేంద్రం. భావోద్వేగాలు, ఆశాపాశాలు, మాయామోహాలు అడుగు ముందుకు పడకుండా ఆపేస్తాయి. అందుకే హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టమని చెప్పిన తర్వాతే భగవద్గీత బోధ ప్రారంభించాడు కృష్ణ పరమాత్ముడు.


త్యాగాన్నీ, తత్వజ్ఞానాన్నీ బోధించేదే గీత. అది భగవంతుని ముఖతః వెలువడింది కాబట్టి భగవద్గీత అయింది.


భగవద్గీతలో 18 అధ్యాయాలున్నట్లే

మోక్ష పధానికి 18 మెట్లు, వాటికి 18 పేర్లున్నాయి. 


అవి…

1. గీత 2. గంగ 3. గాయత్రి 4. సీత 5. సత్య 6.సరస్వతి 7. బ్రహ్మవిద్య 8, బ్రహ్మవల్లి 9. త్రిసంధ్య 10. ముక్తిగేహిని 11. అర్థమాత్ర 12 చిదానంద 13. భవఘ్ని 14. భ్రాంతినాశిని 15. వేదత్రయి 16. పర 17. అనంత 18. తత్త్వార్థ జ్ఞాన మంజరి.


ఎవరైతే మోక్షస్థానాన్ని లక్ష్యంగా చేసుకున్నవారు ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కి పరబ్రహ్మాన్ని పొందుతారు.


ఎవరైతే సంసార సాగరాన్ని దాటాలనుకుంటున్నారో, అటువంటివారు గీత అనే ఈ నావనెక్కి సులువుగా ఆవలి ఒడ్డుకు చేరుకుంటారు.


శ్లో𝕝𝕝 భారతామృత సర్వస్వం

విష్ణువక్త్రాద్వినిస్సృతం

గీతా గంగోదకం పీత్వా 

పునర్జన్మ న విద్యతే ||


తా𝕝𝕝 గంగాజలమును సేవించిన వాడే పునర్జన్మ నుంచి ముక్తిని పొందుచుండగా భారతమునందు ప్రవచించబడిన గీతామృతమును గురించి చెప్పనేల? గంగానది విష్ణుపాదముల నుండి, భగవద్గీత విష్ణు భగవానుని నోటి నుండి వెలువడినవి. అందువలన ఈ రెండూ ప్రతి మానవునకు పవిత్రములే.


గీతా మాహాత్మ్యాన్ని శివుడు పార్వతికీ, విష్ణువు లక్ష్మీదేవికీ, బ్రహ్మ సరస్వతికి చెప్పారు. త్రిమూర్తులే సతులకు గీతా మాహాత్మ్యాన్ని చెప్పుకున్నారంటే సామాన్యులమైన మనమెంత? కనుక భగవత్ప్రసాదమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి. చదవలేనివారు వినాలి.


గీతలో నిత్యజీవితంలో మానవుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి.


నిష్కామ కర్మ, స్థితప్రజ్ఞత, స్వధర్మాచరణ, కర్తవ్య పాలన—

స్థూలంగా భగవానుడు కురుక్షేత్రం లో అర్జునునకు "భగవద్గీత" గా బోధించినది ఇదే. ప్రతి మానవుడు ఆచరించవలసిన ఉత్తమ సూత్రాలు ఇవి.


కష్టములకు కృంగిపోక, సుఖములు బడయునపుడు పొంగిపోక, నేను చేయు కర్మలకు నేను నిమ్మిత్త మాత్రుడను, సర్వం భగవదర్పణం అని భావించాలి. దీనివల్ల చిత్తశాంతి లభిస్తుంది. ఇదే స్థితప్రజ్ఞత అంటే.


గుణరహితమైనను స్వధర్మమునే ఆచరించవలెను. పరధర్మమును ఆశ్రయించ రాదు అని భగవద్గీత చెప్తుంది.


సమాజంలో ఎవరికి నిర్దేశించిన కర్మలు వారు నిష్టతో చెయాలి. ధర్మ మార్గంలో చిత్తశుధ్ధితో చేసే కర్మలు ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తాయి. నిర్వర్తించే కర్మల యొక్క ఫలితాలను ఆశించకుండా, కేవలం నిమిత్తమాత్రుడనని తలిచి చేసే కర్మలు చిత్తశాంతిని కలిగిస్తాయి. ఫలితం ఆశించనప్పుడు ఆశాభంగం కలిగే అవకాశమే ఉండదు. ఇదే నిష్కామ కర్మ అంటే. దీనివల్ల వ్యక్తులు, సమాజం, పూర్తిస్థాయిలో కర్తవ్యాన్ని సక్రమంగా నెరవేర్చగలుగుతారు.


శ్లో𝕝𝕝 మలినే మోచనం పుంసాం

జలస్నానం దినే దినేl

సకృద్ గీతామృతస్నానం

సంసారమలనాశనమ్ || 


తా𝕝𝕝 ప్రతిదినము చేసే స్నానము వలన దేహముపైని మురికిని శుభ్రపరచుకోవచ్చును. 

కానీ పవిత్రమైన భగవద్గీత అనెడి గంగాజలమున స్నానము చేసినవాడు సంసారమాలిన్యము నుండి సంపూర్ణంగా ముక్తి నొందుచున్నాడు. అని గీతామహాత్మ్యము తెలిపినది.


స్నానం చెయ్యడం వల్ల శరీరం పైన ఉండే మాలిన్యం ఏ విధంగా తొలగిపోతుందో గీత అనే పవిత్ర గంగాజలంలో స్నానం చెయ్యడం వల్ల సంసారమనే మాలిన్యం తొలగిపోతుంది.


విజ్ఞులు, బుధజనులు పెద్దలు ఏది చేస్తే అందరూ దానినే పాటిస్తారు. అందుకే మానవుడు ఎప్పుడూ ఆదర్శప్రాయమైన సత్కర్మలనే ఆచరించాలి.


ఇవన్నీ పాటిస్తే జీవితం సుఖమయం అవుతుంది. జీవితం ఆదర్శప్రాయం అవుతుంది. ఒడిదుడుకులు లెకుండా ప్రశాంతమైన జీవన గమనం సాధ్యం అవుతుంది. అరిషడ్వర్గాలను జయించే శక్తి లభిస్తుంది. అరిషడ్వర్గాలను జయిస్తే, చక్కని జీవన విధానం సొంతం అవుతుంది. భగవానుడు తన భక్తుల నుండి ఆశించినది ఇదే.


శ్లో𝕝𝕝 గీతా సుగీతా కర్తవ్యా

కిం అన్యైః శాస్త్ర విస్తరైఃl

యా స్వయం పద్మనాభస్య

ముఖపద్మాద్ వినిర్గతాll


తా𝕝𝕝 భగవద్గీత అనునది శ్రీ కృష్ణ భగవానుని ముఖకమలము నుండి వెలువడినది కావున, మానవులు ఈ ఒక్కదానిని పఠించి, శ్రవణ, మనన, స్మరణముల ద్వారా సాధన చేసిన చాలును. ఈ యుగమందు మానవులు లౌకిక ప్రయోజనార్ధులై ఉండుట వలన వేదవాజ్ఞ్మయమును పఠింపలేరు. వారికి గీతగ్రంథ పారాయణమే ముక్తినొసగును.


"గీతా” శ్రవణ పఠనాలు జరిగేచోట నేను సర్వదా వసింపగలను” అని భగవానుడు అర్జునుడితో చెప్పినదాన్ని బట్టి గీతను చదివేచోట, వినేచోట భగవంతుని సహాయం శీఘ్రంగా లభిస్తుంది.


ఇటువంటి అద్భుతమైన మహాత్మ్యం కలది "శ్రీ మద్భగవద్గీత". ఈ గీతా జయంతి నాడు శ్రీ కృష్ణ భగవానుని స్మరించి గీతా పఠనం చేద్దాం.


కృష్ణం వందే జగద్గురుమ్...🙏

వజ్రాన్ని ఎలా

  కళ్ళు లేని గ్రుడ్డి వాడు ధగ ధగ మెరుస్తున్న వజ్రాన్ని ఎలా చూస్తున్నాడు?

చేతికి వేళ్ళు లేని వాడు ఆ వజ్రపుటుంగరాన్ని ఎలా ధరిస్తున్నాడు. 

మెడ (neck) భాగము లేని వాడు మాలలను ఎలా ధరిస్తున్నాడు. 

నాలుక లేనివాడు ఆ మణిని ఎలా ప్రశంసించుకున్నాడు.  


ఇది సాధ్యమా?


*అంధో మణిమ విందత్ |

తమనంగులి రావయత్ |

అగ్రీవః ప్రత్యముంచత్ |

తమజిహ్వా అశశ్చత |* (అరుణ ప్రశ్న 1–11[52])


అవును ఇది ఆ పరమాత్మ కే సాధ్యం. 


ఆ పరమాత్మ 


*అజాయమానో బహుధా విజాయతే*

పుట్టుకే లేని ఆ పరమాత్మ అనేక జన్మలను ఎత్తెను.


*సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షస్సహస్ర పాద్*

సర్వ ప్రాణుల శిరస్సులు, కళ్ళు, కాళ్ళు తన దేహమునందు అంతర్భూతము లగుటచే విశ్వరూపుడగుచున్నాడు. 



*విశ్వతశ్చక్షు రుత విశ్వతో ముఖో 

విశ్వతో హస్త ఉత విశ్వతస్పాత్*


సర్వవ్యాపక బ్రహ్మస్వరూపాన్ని, అంటే అన్ని దిక్కులలో కళ్లుగా, ముఖాలుగా, చేతులుగా, పాదాలుగా ఉన్న పరమాత్మను సూచిస్తున్నాయి. పరమాత్మ సర్వ వ్యాపి. 


అదే విధంగా అశరీరుడయిన ఆ పరమాత్మ సర్వ ప్రాణుల కళ్ళ ద్వారా తనకు కళ్ళు లేకపోయినా (అంధుడయినా) చూడగలుగుతున్నాడు. పరమాత్మకు శరీర అవయములు లేకపోయినా సర్వ ప్రాణుల శరీర అవయవముల ద్వారా ఉంగరములు, మాలలు మొదలయైన ఆభరణములను ధరిస్తున్నాడు. ఆ పరమాత్మకు నోరు లేకపోయినా సర్వ ప్రాణుల నోటి ద్వారా మాట్లాడుతున్నాడు.


అచేతా యశ్చ చేతనః 

సతం మణిమ విందత్

సోనంగులి రావయత్

సోగ్రీవః ప్రత్యముంచత్

సో జిహ్వో అశశ్చత (అరుణం 1–11[53])


సః – ఆ పరమాత్మ (తనకు కళ్ళు లేకపోయినా) సర్వ ప్రాణుల కళ్ళ ద్వారా మణిని చూచెను. ఆ పరమాత్మ (తనకు అవయవాలు లేకపోయినా) సర్వ ప్రాణుల శరీర అవయవాల ద్వారా ఆభరణాలు ధరించెను. ఆ పరమాత్మకు వాక్కు లేకపోయినా సర్వ మానవుల నోటి ద్వారా మాట్లాడుతూ ఉంటాడు.

ఏకశ్లోకీ భగవద్గీత*

  *ఏకశ్లోకీ భగవద్గీత*


*యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః !*

*తత్ర శ్రీర్విజయో భూతిః ధృవానీతిర్మమ !!*


*ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద, ఐశ్వర్యము, విజయము, ధృఢమైన నీతి ఉంటాయి.*


*గీతాంజలి*


*గీతా కల్పతరుం భజే భగవతా కృష్ణన సంరోపితం* 

*వేదవ్యాస వివర్ధితం శ్రుతిశిరోబీజం ప్రబోధాంకురమ్*

*నానాశాస్త్ర రహస్య శాఖ మరతి క్షాంతి ప్రవాలాంకితం* 

*కృష్ణాంఘ్రిద్వయ భక్తి పుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినామ్.*


*“గీత యను కల్పవృక్షమును నేను సేవించుచున్నాను. అయ్యది భగవంతుడగు శ్రీకృష్ణపరమాత్మచే నాటబడినది. వేదవ్యాస మహర్షిచే పెంచబడినది. ఉపనిషత్తులే దాని విత్తనము. ఆత్మప్రబోధము దాని అంకురము. వివిధ శాస్త్రముల యొక్క రహస్యములు దాని కొమ్మలు. వైరాగ్యము, సహనము మున్నగు సద్గుణములు దాని చిగురుటాకులు. శ్రీకృష్ణపరమాత్మ యొక్క పాదపద్మముల యెడల భక్తి దాని పుష్పసుగంధము. మఱియు అది జ్ఞానులకు మోక్షదాయకమైనది.”*


*కృష్ణం వందే జగద్గురుమ్‌*🙏🏻🙏🏻🙏🏻

చీనా పంచదార , పంచదార -

 చీనా పంచదార , పంచదార - 

 

 * ఇది చలువ చేయును . రుచిని పుట్టించును .

 

  * వీర్య వృద్ది, బలము కలగచేయును. 

 

  * మూర్చ, సర్వ ప్రమేహములు , దాహము ,జ్వరము, వాంతి , క్షయకు , ఎక్కిల్లకు పనిచేయును. .

 * మూత్రము నందు సుద్ధవలె పడు వ్యాధిని రూపుమాపును .

 

  * ఉన్మాదము, కామెర్లు, అతిగా దాహము వేయుట, తల తిప్పుతూ సృహ తప్పడం వీటికి బాగుగా పనిచేయును . 

  

* పాండు రోగమునకు మంచి మందుగా పనిచేయును .

 

* నరుకులు, దెబ్బలు మాన్పును.

 

* గొంతుకను, గుండెలు ( రొమ్ములు ) లొని రోగములు కు పనిచేయును .

   

* ఉపిరితిత్తులకు మేలు చేయును . 

   

* దీనిని ఇతర మందులతో అనుపానముగా ఇచ్చినచో వేగముగా దేహమంత వ్యాప్తి చెందును. ప్రాణమును కాపాడును.

  

 * కడుపులో వాతమును వెదలించును .

 

 * మంచి రక్తమును బుట్టిన్చును.


  * నరములకు, కార్జము ( లివర్ ) కు సత్తువ చేయును 

 

  * ముసలితనమును వేగముగా రాకుండా ఆపును. 

 

  * కడుపునొప్పిని తగ్గించును.


  * 20 దినములు ( సుమారు 6 తులముల ఎత్తు ) మోతాదుగా ఇచ్చిన రక్తమును శుద్ధి చెయును. 

   

* దేహము నందు గట్టిపడిన దుష్ట పదార్ధ కూటమి ని కరిగించును. నీరు చెయును.


  * శరీరం కుళ్ళుని ఆపును.

        

  చీనా పంచదార తెల్లగా , పిండివలె ఉండును. తెల్ల పంచదార ఇసుక వలె తెల్లగా శుబ్రముగా ఉండును. చక్కీ పంచదార ఇసుక వలె ఉండును. కాని కొంచం ఎర్రగా ఉండును. 

     

ఈ మూడింటి గుణం ఇంచుమించు ఒకేలా ఉండును గాని మొదటి దాని కంటే తక్కిన రెండు ఒకదాని కంటే ఒకటి తక్కువ చలువ , అదిక వేడి గలవి . పరగడుపున పొద్దున్నే పంచదార ఒట్టిగా తినినను, అధికముగా తినినను , ఆకలి మంధగించును. అజీర్ణం చెయును.

 

దీనికి విరుగుళ్ళు - 


బాదం పప్పు, పచ్చిపాలు, పులుపు పదార్దములు 

 

ఒట్టి పంచదార తిని నీళ్లు త్రాగరాదు. అలా త్రాగిన జలుబు, వాతము, శ్లేష్మము చెయును, జ్వరము తెచ్చును.

   


ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .  



 

 గమనిక -

      


         నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

          

          నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

              

       ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 

         

                  కాళహస్తి వేంకటేశ్వరరావు .

              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

                          9885030034

రోగములు - ఏకమూలికా ప్రయోగాలు .



 రోగములు - ఏకమూలికా ప్రయోగాలు . 

     

      ఆయుర్వేద వైద్యము నందు ఒక రోగమునకు ఎన్నో రకాల వైద్యయోగాలు ఉంటాయి . కొన్నిసార్లు అనేక రకాల మూలికలను ఒక మొతాదులో కలిపి ఆయా రోగాలకు ఔషధాలను తయారుచేయడం జరుగును . కాని కొన్ని ప్రత్యేకమైన మూలికలు ఉంటాయి . అవి ఒక్క మూలికా ఉన్నను చాలు రామబాణం వలే ఆ రోగము మీద ప్రయోగించి ఆ రోగాన్ని నయం చేయవచ్చు . 

     

      ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ ఏకమూలికా యోగాలు నేను అనేక పురాతన గ్రంథ పఠనం మరియు నా పరిశోధనలో తెలుసుకొనినవి మీకు దాచుకోకుండా అందచేస్తున్నాను . 

 

 ఏకమూలికా ప్రయోగాలు - 


 * తుంగముస్తలు , పర్పాటకం - జ్వరం నందు శ్రేష్టం . 

 * నీటియందు సన్నని ఇసుక , పెంకులు వేసి కాచి వడబోసి చలార్చి ఇచ్చిన జలం అతిదాహం నివారించును . 

 * పేలాలు ఛర్ధిరోగము ( వాంతుల ) యందు శ్రేష్టం . 

 * శిలజిత్ మూత్రసంభంధ రోగముల యందు శ్రేష్టం . 

 * ఉసిరి , పసుపు ప్రమేహము నందు శ్రేష్టం . 

 * లోహచూర్ణం పాండురోగము నందు శ్రేష్టం . 

 * కరక్కాయ వాత, కఫ రోగముల యందు శ్రేష్టం . 

 * పిప్పలి ప్లీహ ( Spleen ) రోగము నందు శ్రేష్టం . 

 * లక్క ఎముకల సంధానము ( అతుక్కొనుట ) నందు శ్రేష్టం . 

 * దిరిసెన విషము నందు శ్రేష్టం . 

 * గుగ్గిలము మేడీ ఆమ్రయమయిన వాయవు నందు శ్రేష్టం . 

 * అడ్డసరం రక్తపిత్తము నందు శ్రేష్టం . 

 * కోడిశెపాల అతిసారం నందు శ్రేష్టం . 

 * నల్లజీడి మొలల రోగము నందు శ్రేష్టం . 

 * స్వర్ణభస్మం పెట్టుడు మందు నివారణకు శ్రేష్టం . 

 * రసాంజనము శరీర అధికబరువు నివారణలో శ్రేష్టం . 

 * వాయువిడంగములు క్రిమిరోగము నందు శ్రేష్టం . 

 * మద్యము , మేకపాలు , మేక మాంసం క్షయరోగము నందు శ్రేష్టం . 

 * త్రిఫల నేత్రరోగముల యందు శ్రేష్టం . 

 * తిప్పతీగ వాతరక్తం నందు శ్రేష్టం . 

 * మజ్జిగ గ్రహణి రోగము నందు శ్రేష్టం . 

 * ఖదిర కుష్ఠు నందు శ్రేష్టం . 

 * గోమూత్ర శిలజిత్ అనేక రోగముల యందు శ్రేష్టం . 

 * పురాణ ఘృతం ( పాత నెయ్యి ) ఉన్మాదము నందు శ్రేష్టం . 

 * మద్యము శోకము నందు శ్రేష్టం . 

 * బ్రాహ్మి అపస్మారము నందు ప్రశస్తము . 

 * పాలు నిద్రానాశనము నందు శ్రేష్టం . 

 * రసాలము ( పెరుగు నుండి తయారు చేయబడును ) ప్రతిశ్యాయము నందు శ్రేష్టం . 

 * మాంసము కార్శ్యము ( Liver ) నందు శ్రేష్టం . 

 * వెల్లుల్లి వాతము నందు శ్రేష్టము . 

 * స్వేదకర్మ స్తంబము ( బిగదీసుకొని పోయిన అవయవాలు ) నందు శ్రేష్టం . 

 * బూరుగ బంక నశ్యము రూపమున చేతులు , భుజములు , భుజశిరస్సు శూల యందు శ్రేష్టం . 

 * వెన్న , పంచదార ఆర్ధిత వాతము నందు శ్రేష్టం . 

 * ఒంటె మూత్రము , ఒంటె పాలు ఉదరరోగము నందు శ్రేష్టం . 

 * నస్యము శిరోగములకు ప్రశస్తం . 

 * రక్తమొక్షము నూతనముగా వచ్చిన విద్రది ( కురుపు ) నందు శ్రేష్టం . 

 * నస్యము , ఔషధద్రవ్యమును పుక్కిలించుట ముఖరోగముల యందు శ్రేష్టం . 

 * నస్యము ( ఔషధ చూర్ణము ముక్కు ద్వారా లోపలికి పీల్చుట , అంజనం ( ఔషధద్రవ్యమును కాటుకలా కంటికి పెట్టటం ) , తర్పణం ( శుభ్రపరచుట ) నేత్రరోగముల యందు శ్రేష్టం . 

 * పాలు , నెయ్యి వృద్దాప్యము ఆపుట యందు శ్రేష్టం . 

 * చల్లనినీరు , చల్లనిగాలి , నీడ మూర్చ యందు ప్రశస్తము . 

 * మద్యము , స్నానము శ్రమ యందు శ్రేష్టం . 

 * పల్లేరు మూత్రకృచ్చము నందు ప్రశస్తం . 

 * వాకుడు కాసరోగము నందు శ్రేష్టం . 

 * పుష్కరమూలము పార్శ్వశూల ( ఒకవైపు వచ్చు తలనొప్పికి ) శ్రేష్టం . 

 * ఉసిరిక రసాయనముల యందు శ్రేష్టం . 

 * త్రిఫల , గుగ్గిలం వ్రణముల యందు శ్రేష్టం . 

 * వస్తి ప్రయోగము వాతరోగముల యందు ప్రశస్తం . 

 * విరేచనము పిత్తరోగముల యందు ప్రశస్తం . 

 * వమనము శ్లేష్మరోగముల యందు ప్రశస్తం . 

 * తేనె కఫరోగముల యందు ప్రశస్తం . 

 * నెయ్యి పిత్తరోగముల యందు ప్రశస్తం . 

 * తైలము వాతరోగముల యందు ప్రశస్తం . 

       పైన చెప్పిన వాటిలో కొన్ని దేశ కాల , బలములను అనుసరించి కలపడం కాని తీయటం కాని వైద్యుని విచక్షణ పైన ఆధారపడి ఉండును. 

 


  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

 

గమనిక -

      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

            

           కాళహస్తి వేంకటేశ్వరరావు .

              

     అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

                       

                   9885030034

గీతా మకరందమ్

 గీతా మకరందమ్ 

ఓం శ్రీ మాత్రేనమః

1-12-25


గీతా శాస్త్రము విశ్వశాంతి పథమౌ కీర్తి ప్రధానమ్ముగా

గీతాచార్యుని వాక్కు ధర్మయుతమై గీర్వాణికిన్మోదమై

చేతో మోదము నంది సద్గతుల సౌశీల్యార్థ శ్రేయస్కర

ఖ్యాతిం గూర్చుచు నుండు ధర్మ హితమై కర్మ ప్రధానార్థమై


గీతా తత్త్వము విశ్వమార్గ గమన క్షేమంపు మూలమ్ము సం

ప్రీతిన్ గూర్చుచు నుండు నధ్యయన సంవేద్యంపు సంస్కారముల్

చేతమ్మందున నిల్వ చేతలవి సౌశీల్య ప్రధానమ్ములై

ఖ్యాతింగూర్చును జన్మసార్థకముగా కల్మిన్ ప్రసాదించుచున్


శ్రీ కృష్ణుండు జగద్గురుండు జనులన్ శిష్ట ప్రధానమ్ములౌ

ధీకృత్యమ్ముల సారముం దెలియ నుద్దీపించె ధర్మంపుదౌ

ఆకారమ్మును గాంచ గల్గుటకు నయ్యైరీతులన్ కర్మలున్

సాకల్యమ్ముగ నందజేయు ఫలముల్ స్వాంతమ్ము గాంచం గనన్


గీతాపఠనము జనులకు

గీతామృత ధారలరసి క్షేమమ్మొందన్

చేతములందున ధర్మపు

చాతుర్యము గల్గ జేయు సంపత్కరమై


ప్రణుత గీతయే చక్కని పాడి యావు

పార్థుడను వత్స నాశించి వాసుదేవు

డరసి పితుకగ భక్తుల కమృత ధార

 లొరసి వెలసెను ఉపనిషద్వర సువిద్య


మిత్రులందరికీ గీతా జయంతి సందర్భంగా 

శుభాకాంక్షలూ నమస్సు లతో 


మీ 

డా.రఘుపతి శాస్త్రుల

గీతాజయన్తీ

 *_𝕝𝕝ॐ𝕝𝕝 01/12/2025 -* *మార్గశిర శుద్ధ ఏకాదశీ -* *గీతాజయన్తీ 𝕝𝕝卐𝕝𝕝_*

*≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈*


*_గీతాజయంతి_*

*━❀꧁🔆꧂❀━*


మార్గశిర శుద్ధ ఏకాదశి "గీతాజయంతి". ఈ ఏకాదశిని "మోక్షద" ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశినాడు ఉపవాసం చేయడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుంది.

ఇదే రోజున కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునునికి “భగవద్గీత” ను బోధించాడన్నది విశ్వాసం. అందువల్ల ఈ ఏకాదశి "గీతాజయంతి" అని కూడా వ్యవహారిస్తారు.


శ్లో𝕝𝕝 సర్వోపనిషదో గావో

దోగ్ధా గోపాలనందనఃl

పార్థో వత్సః సుధీర్భోక్తా

దుగ్ధం గీతామృతం మహత్ ||


తా𝕝𝕝 సర్వోపనిషత్తుల సారమైన గోవు భగవద్గీత కాగా, గోపాలుడైన భగవానుడు ఆ క్షీరమును పితుకువాడు. 

అనగా ఆ సారమును మనకు అందిచువాడు. ఆ భగవద్గీతా సారమును పొందు అర్జునుడు గోవత్సము (దూడ) కాగా, పండితులు, భక్తులు, పరమ భాగవతులు,ఆ భగవద్గీతా క్షీరమును పానము చేయువారుగ నున్నారు.


సకల జ్ఞానస్వరూపాలైన ఉపనిషత్తులను గోవులుగానూ, అర్జునుణ్ణి దూడగానూ చేసి శ్రీకృష్ణుడు పితికిన ఆవుపాల సారమే భగవద్గీత. 


శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన ఈ గీతాజ్ఞానమంతా 18 అధ్యాయాలుగా, పరమపదానికి సోపాన మార్గంగా విరాజిల్లుతోంది. 

శ్రీకృష్ణపరమాత్మ గీతాబోధన చేయగా తొలుత విన్నవారు అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, అర్జునుని రథ ధ్వజంపై ఉన్న ఆంజనేయుడు.


సాక్షాత్తూ విష్ణుదేవుడంతటి వాడితో పోల్చదగిన వ్యాస మహాముని అనుగ్రహం వల్ల గీతాబోధనను సంజయుడు ప్రత్యక్షంగా వినగలిగారు. అలా భగవంతుని ద్వారా విన్నది విన్నట్లుగా సంజయుడు, లోకానికి అందించాడు. త్యాగాన్నీ, తత్వజ్ఞానాన్నీ బోధించేదే గీత. అది భగవంతుని ముఖతః వెలువడింది కాబట్టి భగవద్గీత అయింది.


భగవద్గీతలో 18 అధ్యాయాలున్నట్లే

18 పేర్లున్నాయి. 


అవి…


1. గీత 2. గంగ 3. గాయత్రి 4. సీత 5. సత్య 6.సరస్వతి 7. బ్రహ్మవిద్య 8, బ్రహ్మవల్లి 9. త్రిసంధ్య 10. ముక్తిగేహిని 11. అర్థమాత్ర 12 చిదానంద 13. భవఘ్ని 14. భ్రాంతినాశిని 15. వేదత్రయి 16. పర 17. అనంత 18. తత్త్వార్థ జ్ఞాన మంజరి.


ఎవరైతే

మోక్షస్థానాన్ని లక్ష్యంగా చేసుకున్నవారు ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కి పరబ్రహ్మాన్ని పొందుతారు.


ఎవరైతే 

సంసార సాగరాన్ని దాటాలనుకుంటున్నారో, అటువంటివారు గీత అనే ఈ నావనెక్కి సులువుగా ఆవలి ఒడ్డుకు చేరుకుంటారు.


శ్లో𝕝𝕝 భారతామృత సర్వస్వం

విష్ణువక్త్రాద్వినిస్సృతం

గీతా గంగోదకం పీత్వా 

పునర్జన్మ న విద్యతే ||


తా𝕝𝕝 గంగాజలమును సేవించిన వాడే పునర్జన్మ నుంచి ముక్తిని పొందుచుండగా భారతమునందు ప్రవచించబడిన గీతామృతమును గురించి చెప్పనేల? 

గంగానది విష్ణుపాదముల నుండి, భగవద్గీత విష్ణు భగవానుని నోటి నుండి వెలువడినవి.

అందువలన ఈ రెండూ ప్రతి మానవునకు పవిత్రములే.


గీతా మాహాత్మ్యాన్ని శివుడు పార్వతికీ, విష్ణువు లక్ష్మీదేవికీ, బ్రహ్మ సరస్వతికి చెప్పారు. త్రిమూర్తులే సతులకు గీతా మాహాత్మ్యాన్ని చెప్పుకున్నారంటే సామాన్యులమైన మనమెంత? కనుక భగవత్ప్రసాదమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి. చదవలేనివారు వినాలి.


గీతలో నిత్యజీవితంలో మానవుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి.


నిష్కామ కర్మ, స్థితప్రజ్ఞత, స్వధర్మాచరణ, కర్తవ్య పాలన—

స్థూలంగా భగవానుడు కురుక్షేత్రం లో అర్జునునకు "భగవద్గీత" గా బోధించినది ఇదే. ప్రతి మానవుడు ఆచరించవలసిన ఉత్తమ సూత్రాలు ఇవి.


కష్టములకు కృంగిపోక, సుఖములు బడయునపుడు పొంగిపోక, నేను చేయు కర్మలకు నేను నిమ్మిత్త మాత్రుడను, సర్వం భగవదర్పణం అని భావించాలి. దీనివల్ల చిత్తశాంతి లభిస్తుంది. ఇదే స్థితప్రజ్ఞత అంటే.


గుణరహితమైనను స్వధర్మమునే ఆచరించవలెను.


పరధర్మమును ఆశ్రయించరాదు.


అని భగవద్గీత చెప్తుంది.


సమాజంలో ఎవరికి నిర్దేశించిన కర్మలు వారు నిష్టతో చెయాలి. ధర్మ మార్గంలో చిత్తశుధ్ధితో చేసే కర్మలు ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తాయి. నిర్వర్తించే కర్మల యొక్క ఫలితాలను ఆశించకుండా, కేవలం నిమిత్తమాత్రుడనని తలిచి చేసే కర్మలు చిత్తశాంతిని కలిగిస్తాయి. ఫలితం ఆశించనప్పుడు ఆశాభంగం కలిగే అవకాశమే ఉండదు. ఇదే నిష్కామ కర్మ అంటే. దీనివల్ల వ్యక్తులు, సమాజం, పూర్తిస్థాయిలో కర్తవ్యాన్ని సక్రమంగా నెరవేర్చగలుగుతారు.


శ్లో𝕝𝕝 మలినే మోచనం పుంసాం

జలస్నానం దినే దినేl

సకృద్ గీతామృతస్నానం

సంసారమలనాశనమ్ || 


తా𝕝𝕝 ప్రతిదినము చేసే స్నానము వలన దేహముపైని మురికిని శుభ్రపరచుకోవచ్చును. 

కానీ పవిత్రమైన భగవద్గీత అనెడి గంగాజలమున స్నానము చేసినవాడు సంసారమాలిన్యము నుండి సంపూర్ణంగా ముక్తి నొందుచున్నాడు. అని గీతామహాత్మ్యము తెలిపినది.


స్నానం చెయ్యడం వల్ల శరీరంపైన ఉండే మాలిన్యం ఏ విధంగా తొలగిపోతుందో గీత అనే పవిత్ర గంగాజలంలో స్నానం చెయ్యడం వల్ల సంసారమనే మాలిన్యం తొలగిపోతుంది.విజ్ఞులు, బుధజనులు పెద్దలు ఏది చేస్తే అందరూ దానినే పాటిస్తారు. అందుకే మానవుడు ఎప్పుడూ ఆదర్శప్రాయమైన సత్కర్మలనే ఆచరించాలి.

ఇవన్నీ పాటిస్తే జీవితం సుఖమయం అవుతుంది. జీవితం ఆదర్శప్రాయం అవుతుంది. ఒడిదుడుకులు లెకుండా ప్రశాంతమైన జీవన గమనం సాధ్యం అవుతుంది. అరిషడ్వర్గాలను జయించే శక్తి లభిస్తుంది. అరిషడ్వర్గాలను జయిస్తే, చక్కని జీవన విధానం సొంతం అవుతుంది. భగవానుడు తన భక్తుల నుండి ఆశించినది ఇదే.


శ్లో𝕝𝕝 గీతా సుగీతా కర్తవ్యా

కిం అన్యైః శాస్త్ర విస్తరైఃl

యా స్వయం పద్మనాభస్య

ముఖపద్మాద్ వినిర్గతాll


తా𝕝𝕝 భగవద్గీత అనునది శ్రీ కృష్ణ భగవానుని ముఖకమలము నుండి వెలువడినది కావున, మానవులు ఈ ఒక్కదానిని పఠించి, శ్రవణ, మనన, స్మరణముల ద్వారా సాధన చేసిన చాలును. ఈ యుగమందు మానవులు లౌకిక ప్రయోజనార్ధులై ఉండుట వలన వేదవాజ్ఞ్మయమును పఠింపలేరు. వారికి గీతగ్రంథ పారాయణమే ముక్తినొసగును.


"గీతా” శ్రవణ పఠనాలు జరిగేచోట నేను సర్వదా వసింపగలను” అని భగవానుడు అర్జునుడితో చెప్పినదాన్ని బట్టి గీతను చదివేచోట, వినేచోట భగవంతుని సహాయం శీఘ్రంగా లభిస్తుంది.


ఇటువంటి అద్భుతమైన మహాత్మ్యం కలది

"శ్రీ మద్భగవద్గీత". ఈ గీతా జయంతి నాడు శ్రీ కృష్ణ భగవానుని స్మరించి గీతా పఠనం చేద్దాం.*

 

*_గీతా జయంతి శుభాకాంక్షలు._*


*_𝕝𝕝ॐ𝕝𝕝 కృష్ణం వందే జగద్గురుమ్ 𝕝𝕝卐𝕝𝕝_*


*_𝕝𝕝 లోకాస్సమస్తాః సుఖినో భవన్తు 𝕝𝕝_*


🚩 *_శుభమస్తు_* 🚩