30, ఏప్రిల్ 2025, బుధవారం

అక్షయ తృతీయ

 


శ్రీభారత్ వీక్షకులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు 🌹 అక్షయ తృతీయ అంటే ఏమిటి? ఆ రోజున బంగారం కొనాలా? కొంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి? అసలు అక్షయ తృతీయ నాడు ఏం చేస్తే సత్ఫలితాలు కలుగుతాయి? వంటి ఆసక్తి కరమైన ఎన్నో అంశాలకు వివరణ ఇచ్చారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

ధాతు పౌష్టిక లేహ్యము

 ధాతు పౌష్టిక లేహ్యము గురించి సంపూర్ణ వివరణ -


         ఈ లేహ్యము ప్రాచీనమైన ఒక మూలికల సమూహము మరియు భస్మాలను కలిపి తయారుచేయడం జరుగును . ఈ లేహ్యము నందు సుమారు 36 రకాల మూలికలు మరియు స్వర్ణభస్మం , రజతభస్మం , ముత్యభస్మం , శతపుటి అభ్రకం మొదలైన భస్మాలను కూర్చి స్వచ్ఛమైన తేనెతో కలిపి ఈ లేహ్యం తయారగును . ఇందులో కలిపే మూలికలను ఒక్కొక్కటి శుద్ది చేయుచూ ఉపయోగించవలెను . 


  ఈ లేహ్యం ఉపయోగించటం వలన ప్రయోజనాలు - 


 *  శరీరము నందలి మేహ సంబంధ దోషాలు నివారణ అగును . 


 *  నీరసం , నిస్సత్తువ తగ్గును . 


 *  శరీరము నందు కండరాలు బలహీనపడి ఉన్నవారు మరియు శరీరము బక్కచిక్కి ఉన్నవారికి ఈ లేహ్యం వాడుచున్న కండరాలు బలంగా తయరగును . కండరాలు వృద్ధిచెందును . 


 *  గుండె సంబంధ దోషాలు , గుండెల్లో దడ , గుండె మంట నివారణ అగును . 


 *  నోటివెంట రక్తము పడుట తగ్గును . 


 *  శరీరము నందు రక్తము వృద్ది అగును . 


 *  రక్తము శుద్దిచేసి రక్తము నందలి టాక్సిన్స్ నిర్వీర్యం చేయును . 


 *  థైరాయిడ్ గ్రంథి మీద పనిచేయును . గ్రంథి పనితీరు మెరుగుపరచును . 


 *  మెదడు నందలి న్యూరాన్లకు మంచిశక్తిని ఇచ్చి బుద్ధిబలమును , జ్ఞాపకశక్తిని పెంచును . 


 *  ఎముకలు బలపడును . మరింత గట్టిగా తయారగును . శరీరము నందలి క్యాల్షియం లోపములు తగ్గును. 


 *  ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నవారు , ఆయసముతో ఇబ్బందిపడువారికి ఇది అత్యంత పుష్టిని కలుగచేయును . 


 *  కాలేయమునకు బలమును ఇచ్చును. 


 *  ఆడవారిలో గర్భసంబంధ దోషములను నివారించును . 


 *  వయస్సు పెరుగుతున్న కొలది వచ్చు బలహీనత మరియు ఎముకల సులువుగా విరిగిపోవడానికి కారణం అయిన క్యాల్షియం లోపాన్ని పోగొట్టును . 


 *  గర్భాశయాన్ని , అండాశయాలు శుద్దిచేయును . 


 *  నరాల సంబంధ దోషాలను నివారించును . 


 *  కాళ్ళు పట్టుకుపోవడం , కండరాల నొప్పులు నివారించును . 


 *  చర్మాన్ని కాంతివంతముగా ఉంచును . 


• చిన్న పిల్లలలో అద్భుతమైన జ్ఞాపకాలు శక్తి, శరీర పుష్టి, రోగనిరోధక శక్తి పెంపోందించును. 


•. మగవారిలో మరియు ఆడవారిలో కలుగు హార్మోన్ సంబంధ సమస్యలకు ఇది అత్యద్భుతముగా పనిచేయును. 


•. నాడీ సంబంధ దోషాలు నివృత్తి అగును. శరీరము నందు వ్యాపించి ఉన్న 72 వేల నాడులు శుద్ధి అగును. 


•. జ్ఞానేంద్రియల శక్తి పెరుగును. 


•. మగవారిలో వీర్యశక్తి పెరుగును. వీర్యకణాల ఉత్పత్తి, శక్తి పెరుగును. 


•. సంసార సంబంధ బలహీనత తగ్గును. 


°. కీల్లానొప్పుల మీద కూడా ప్రభావాన్ని చూపించును.  


పైన చెప్పినవే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచును . ఈ మధ్యకాలంలో కరోనా వచ్చి తగ్గినవారిలో తీవ్రమైన బలహీనత ఏర్పడుచున్నది. అటువంటి సమస్యతో ఇబ్బందిపడేవారు ఈ లేహ్యాన్ని వాడటం మూలన త్వరగా శరీరబలాన్ని పొందవచ్చు. మాములుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా దీన్ని వాడుట మూలాన శరీరం నందలి రోగనిరోధక శక్తి పెరుగును రోగాలపాలు కాకుండా ఉంటారు . 


      ఈ లేహ్యంను చిన్నవారు మొదలుకొని స్త్రీపురుషులు మరియు వయస్సు మీదపడిన పెద్దవారు సహా అందరూ వాడవచ్చు . ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు . 


ముఖ్య గమనిక - 


      కరోనా వచ్చి తగ్గి శరీర బలహీనతతో ఇబ్బంది పడువారు ఈ లేహ్యాన్ని వాడుట వలన అత్యంత త్వరగా బలాన్ని పొందగలరు. 


           ఈ లేహ్యం కావల్సినవారు డైరెక్టుగా కాల్ చేయగలరు . 

   సంప్రదించవలసిన నంబర్       9885030034 . 


               కాళహస్తి వేంకటేశ్వరరావు 


           అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                      9885030034

మహా వాక్యాలు

 🙏మహా వాక్యాలు🙏

ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేద మహావాక్యము

అహంబ్రహ్మస్మి యజుర్వేద మహావాక్యము

తత్త్వమసి సామవేద మహావాక్యము

అయమాత్మాబ్రహ్మ అథర్వణ మహావాక్యము


ప్రజ్ఞానం బ్రహ్మ


ఋగ్వేద మహావాక్యముగా ప్రజ్ఞానం బ్రహ్మ ప్రసిద్ధికెక్కినది.అతి ప్రాచీనమైన ఋగ్వేదములో సృష్టిమూలమును తెలియజేస్తూ ఈ బ్రహ్మాండము పరబ్రహ్మము నుండి జనించినదని, ఈ చరాచర సృష్టికి శుద్ధ చైతన్యము బ్రహ్మమేనని తీర్మానించినది. బ్రహ్మమే సర్వజ్ఞతను కలిగియున్నది. ఎనుబది నాలుగు లక్షల జీవరాశులను నడిపించే చైతన్యము బ్రహ్మము. ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు తన పరిధిలోని గ్రహములను తన చుట్టూ భ్రమింపచేసుకొనే శక్తియే ఈ శుద్ధ చైతన్యము. ఆద్యంతములు కానరాని ఈ అనంత సూర్య మండలములను వ్యక్తావ్యక్తమైన ఈ ఆకాశములో పయనింపచేసే శక్తి కూడా ఈ బ్రహ్మయొక్కశుద్ధ చైతన్యమేనని వివరించినది. సృష్టికి ముందు తరువాత ఉండేది ఆత్మ ఒక్కటేనని తెలియజేసింది.


అహంబ్రహ్మాస్మి


యజుర్వేద మహావాక్యము ‘అహంబ్రహ్మాస్మి’.

అనగా నేనే పరబ్రహ్మమని జీవుడు భావించడం. అనేక జన్మలలో జీవుడు పరిభ్రమిస్తున్నాడు. కాని అన్ని జన్మలలోను స్వరూపము ఆత్మగా వెలుగొందుతున్నది. తనకు లభించిన దేహమనే ఉపాధిలో జ్ఞానమును ప్రోది చేసుకొని ‘నేనే ఆత్మస్వరూపుడను’ అనే సత్యాన్ని దర్శించి ముక్తిని పొందుతాడని ఈ యజుర్వేద మహావాక్యము విశదపరచింది. ఉత్కృష్టమైన మానవ జన్మలో ఆత్మశోధన ధర్మాచరణతోనే సాధించగలమని తెలియజేసింది. ధర్మబద్ధమైన కోరికలతో జీవించి తాను తరించి సమస్త ప్రకృతిని తరింపజేయాలని నొక్కి చెప్పింది.



తత్త్వమసి


సామవేద మహావాక్యము ‘తత్త్వమసి’.

చరాచరమంతా వ్యాపించియున్న శుద్ధచైతన్యము ఎక్కడో లేదు, నీలోనే వుండి, నీవైయున్నదని నిర్వచించడం చాలా ఆశ్చార్యాన్ని, తృప్తిని కలిగిస్తుంది. శంకర భగవత్పాదులు చాటి చెప్పిన అద్వైతము ఈ మహావాక్యమునుండే ఆవిర్భవించినది అని భావించడం మనం వినియున్నాము. ‘ఏక మేవ అద్వితీయం’, ఉన్నది ఒక్కటే! అదే పరబ్రహ్మము. అది నీలోన, అంతటా వ్యాపించి ఉన్నదనే ఒక గొప్ప సత్యాన్ని అద్వైతము ఆవిష్కరించినది. ఆత్మ పరమాణు ప్రమాణమైనది. అటువంటి పరమాణువునుండే ఈ బ్రహ్మాండము ఆవిర్భవించినది. కావున ఈ బ్రహ్మాండములో భాగమైన నీవే ఆత్మవు అని వర్ణించింది.



అయమాత్మాబ్రహ్మ


నాల్గవ వేదమైన అథర్వణ మహావాక్యము ‘అయమాత్మాబ్రహ్మ’.

ఈ వాక్యము కూడా ఆత్మయే బ్రహ్మమని తెలియజేస్తోంది. జీవాత్మ పరమాత్మలు ఒక్కటేనని విచారించింది. ఈ వేదములోనే ప్రణవ సంకేతమైన ఓంకార శబ్దమును మానవాళికి అందించినది. లౌకిక వస్తు సమదాయములన్నీ వివిధ నామములతో సూచించబడినట్లే అనంత విశ్వమును ఓంకారమనే శబ్ద సంకేతముతో సూచించినది. 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

వాఙ్మయ వికాసము

 🙏తెలుగు భాషావిర్భావము-వాఙ్మయ వికాసము🙏 రెండవ భాగము

               

ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనకకు మనము తెలుసుకోవచ్చు, కానీ తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6 వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శకం ఎ.డి.కి చెందినది. శాసనాలలో మనకు లభించిన తొలితెలుగు పదం 'నాగబు'. చక్కటి తెలుగు భాషా చరిత్రను (సాహిత్యమును) మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినదిగా గమనించ వచ్చు.

 13వ శతాబ్దంలో అథర్వణ ఆచార్య తెలుగు వ్యాకరణాన్ని త్రిలింగ శబ్దానుశాసనము (లేదా త్రిలింగ వ్యాకరణం) అని పిలిచారు. 17వ శతాబ్దానికి చెందిన అప్పకవి త్రిలింగ నుండి తెలుగు ఉద్భవించిందని స్పష్టంగా రాశాడు. అప్పకవి పూర్వీకులకు అటువంటి వ్యుత్పత్తి గురించి తెలియదు కాబట్టి ఇది "విచిత్రమైన భావన" అని పండితుడు చార్లెస్ పి. బ్రౌన్ వ్యాఖ్యానించాడు. 



మరొక కథనం ప్రకారం తెనుగు అనేది ద్రావిడ పదం *తెన్ (దక్షిణం) నుండి "దక్షిణం/దక్షిణ దిశలో నివసించిన ప్రజలు (సంస్కృతం, ప్రాకృతం మాట్లాడే ప్రజలకు సంబంధించి) నుండి ఉద్భవించింది. 

అమరావతిలోని నాగబు అనే పదము విక్రమేంద్రవర్మ చిక్కుళ్ళ సంస్కృత శాసనంలోని "విజయరాజ్య సంవత్సరంబుళ్" మనకు కనిపిస్తున్న మొదటి తెలుగు పదాలు. నాగార్జునకొండ వ్రాతలలో కూడా తెలుగు పదాలు కనిపిస్తాయి. ఇవన్నీ ప్రాకృత శాసనాలు లేదా సంస్కృత శాసనాలు. కనుక తెనుగు అప్పటికి జనసామాన్యంలో ధారాళమైన భాషగా ఉన్నదనడానికి ఆధారాలు లేవు. ఆరవ శతాబ్ది తరువాత బ్రాహ్మీలిపినే కొద్ది మార్పులతో తెలుగువారు, కన్నడంవారు వాడుకొన్నారు. అందుచేత దీనిని "తెలుగు-కన్నడ లిపి" అని పరిశోధకులు అంటారు.


6,7 శతాబ్దాలలో పల్లవ చాళుక్య సంఘర్షణల నేపథ్యంలో రాయలసీమ ప్రాంతం రాజకీయంగా చైతన్యవంతమయ్యింది. ఈ దశలో రేనాటి చోడులు సప్తసహస్ర గ్రామ సమన్వితమైన రేనాడు (కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలు) పాలించారు. తెలుగు భాష పరిణామంలో ఇది ఒక ముఖ్యఘట్టం. వారి శాసనాలు చాలావరకు తెలుగులో ఉన్నాయి. వాటిలో ధనంజయుని కలమళ్ళ శాసనం (కడప జిల్లా కమలాపురం తాలూకాలో ఉంది ) మనకు లభిస్తున్న మొదటి పూర్తి తెలుగు శాసనంగా చరిత్రకారులు భావిస్తున్నారు. అంతకుముందు శాసనాలలో చెదురు మదురుగా తెలుగు పదాలున్నాయి గాని సంపూర్ణమైన వాక్యాలు లేవు.


ఆ తరువాత జయసింహవల్లభుని విప్పర్ల శాసనము 641 సంవత్సరానికి చెందినది. 7,8, శతాబ్దులలోని శాసనాలలో ప్రాకృత భాషా సంపర్కము, అరువాతి కాలంలో సంస్కృత భాషా ప్రభావం అధికంగా కానవస్తాయి. 848 నాటి పండరంగుని అద్దంకి శాసనములో ఒక తరువోజ పద్యమూ, తరువాత కొంత వచనమూ ఉన్నాయి. 934 నాటి యుద్ధమల్లుని బెజనాడ శాసనములో ఐదు సీసము (పద్యం) పద్యాలున్నాయి. వేయి ప్రాంతమునాటిదని చెప్పబడుతున్న విరియాల కామసాని గూడూరు శాసనములో మూడు చంపకమాలలు, రెండు ఉత్పల మాలలు వ్రాయబడ్డాయి.వీటి ఆధారాల కారణంగా నన్నయకు ముందే పద్య సాహిత్యం ఉండి ఉండాలని నిశ్చయంగా తెలుస్తున్నది. కాని లిఖిత గ్రంథాలు మాత్రం ఇంతవరకు ఏవీ లభించలేదు.

తెలుగు బాష కొల్లలుగా క్రొత్త పదాలను తనలో కలుపుకుంది.తెలుగు బాష కోటి కిటికీల గాలి మేడవంటిది . అన్నీ వైపుల నుండి వీచే గాలులను ఆహ్వానించి, ఆతిధ్యమిచ్చి గౌరవించింది. తెలుగుకి గల హృదయ వైశాల్యము అనన్యము. తెలుగు,సంస్కృత పదాలు క్షీరనీర న్యాయంలో కలిసిపోతాయి. అదే తెలుగు బాష విశిష్టత.

                          సశేషం 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

పరశురామజయంతి

 🔯 *రేపు పరశురామజయంతి* 🔯


*అగ్రతశ్చతురో వేదాః పృష్ఠతస్సశరం ధనుః౹*

*ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రం శాపాదపి శరాదపి॥*


‘ఇది భగవాన్‌ పరశురాముడి వ్యక్తిత్వానికి అద్దం పట్టే శ్లోకం.

పరశురాముడి ముందు భాగాన-అంటే ముఖంలో నాలుగు వేదాలు, వెనుక వైపున అంటే వీపు మీద బాణాలూ, విల్లూ. 

ఇదే బ్రాహ్మణత్వం! ఇదే క్షాత్రం! శాపాలు పెట్టడంలోనూ, శరాలను సంధించడంలోనూ! విడమరిచి చెప్పుకోవాలంటే... పరశురాముడిలో వేద విజ్ఞానం ఉంది. శపించే శక్తీ ఉంది. అది బ్రాహ్మణ లక్షణం. ఆయన వెనక వైపున విల్లూ, బాణాలున్నాయి. శరసంధానం చేసి తునుమాడే శక్తీ ఉంది. అది క్షత్రియ లక్షణం. 

అంటే పరశురాముడిలో బ్రాహ్మణత్వమూ, క్షత్రియత్వమూ పెనవేసుకుని ఉన్నాయన్నమాట! 

వేదవిజ్ఞానఖని అయిన బ్రాహ్మణుడిలాగా ఆయన శపించి, తపింపజేయగలడు. ధనుర్విద్యానిపుణుడైన క్షత్రియుడిలాగా శరపరంపర చేత పరలోకానికి పంపనూగలడు. భగవాన్‌ పరశురాముడిలో ఈ రెండు లక్షణాలూ మహా తీక్షణమైనవే. ద్విముఖమైన ఈ విశిష్ఠతతో బాటు ఆయనలో మరెన్నో విశిష్ఠతులున్నాయి.


పరశురాముడు శ్రీరామచంద్రుడి కన్నా ముందు జన్మించాడు. 

రామావతార సమయంలో ఉన్నాడు. రామావతారం ముగిసిన తర్వాత కూడా ఉన్నాడు. శ్రీకృష్ణావతార కాలంలో కూడా ఆయన ఉన్నాడు. 

అంటే రామాయణ కాలమైన త్రేతాయుగంలోనూ, భారత భాగవతాల కాలమైన ద్వాపర యుగంలోనూ పరశురాముడు సజీవంగా ఉన్నాడు. ఆయనకు రామయణంతోనూ మహాభారతంలోనూ ప్రత్యక్ష సంబంధంఉంది. పరశురాముడు శ్రీమహావిష్ణువు యొక్క ఆరవ అవతారం. ఆయన భృగువంశంలో అవతరించాడు. అందుకే ఆయనకు భార్గవరాముడు అనే నామధేయం కూడా ఉంది. భృగు వంశానికి మూల పురుషుడు. బ్రహ్మ మానస పుత్రులలో ఒకడైన భృగువు. భృగు మహర్షి భార్య పులోమ. ఆమె హిరణ్యకశ్యపుడి కూతురు. పులోమా భృగుమహర్షి దంపతుల కుమారుడు చ్యవనుడు. చ్యవనుడికి ఇద్దరు భార్యలు. సుకన్య ప్రథమ పత్ని. ద్వితీయ పత్ని ఆరుషి. ఔర్వుడు చ్యవనుడి పుత్రుడు. తల్లి ఆరుషి. తల్లి యొక్క ఊరువు(తొడ) నుండీ జన్మించిన కారణంగా చ్యవన పుత్రుడికి ఔర్వుడు అనే సార్థక నామధేయం లభించింది. ఔర్వునికి ఒక కుమారుడు కలిగాడు. ఆయన పేరు ‘రుచీకుడు’.రుచీకుడు విశ్వామిత్ర మహర్షి అక్కగారైన సత్యవతిని వివాహం చేసుకున్నాడు. సత్యవతీ రుచీక దంపతులకు జన్మించిన వాడే జమదగ్ని. జమదగ్ని భార్య రేణుక. జమదగ్నీ రేణుకల పుత్రుడే పరశురాముడు.

రామాయణం

 🌹🌷🏹🪔🚩🪔🏹🌷🌹

*🪷బుధవారం 30 ఏప్రిల్ 2025🪷*


            *రామాయణం*


ఒకసారి చదివినంత మాత్రాన 

మన సమస్త పాపాలని తీసేస్తుంది...



    *వాల్మీకి రామాయణం*

           *24వ భాగం*

                    

ఈ చైత్ర మాసంలో పుష్యమి నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉన్నప్పుడు రాముడికి పట్టాభిషేకం చేస్తానని ప్రకటించాడు.


తరువాత సుమంత్రుడిని పిలిచి రాముడిని తీసుకురమ్మన్నాడు, వశిష్ఠుడిని పిలిచి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చెయ్యమన్నాడు.


అప్పుడు వశిష్ఠుడు అక్కడున్న వాళ్ళని పిలిచి...”మీరు రత్నాలని సిద్ధం చెయ్యండి, అలాగే తెల్లటి వస్త్రాలని, పేలాలని, చతురంగ బలాలని, ఒక మంచి ఏనుగుని, తెల్లటి గొడుగుని, చామరాన్ని, నూరు కుంభాలని, బంగారు కొమ్ములున్న ఎద్దుని, పూర్తిగా ఉన్నటువంటి పులి చర్మాన్ని సిద్ధం చేసి, వీటన్నిటిని దశరథ మహారాజుగారి అగ్ని గృహంలో పెట్టండి. ద్వారాలన్నీ తోరణాలతో అలంకారం చెయ్యండి, గంధం కలిపిన నీళ్ళతో గడపలని కడగండి, ధూపం వెయ్యండి, పాలు పెరుగుతో కలిపి ఉన్న అన్నాన్ని బ్రాహ్మణులకి పెట్టండి, ప్రతి ఇంటి మీద పతాకాలు ఎగురవెయ్యండి, నాటకాలు వేసేవాళ్ళని, పాటలు పాడేవాళ్ళని సిద్ధంచెయ్యండి, అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయించండి, అభిషేకాలు చేయించండి, పొడవైన కత్తులు పెట్టుకున్న వీరుల్ని సిద్ధం చెయ్యండి” అని అన్నాడు.


సుమంత్రుడు రామచంద్రమూర్తిని ఆ సభకి తీసుకువచ్చాడు. 

అప్పుడు రాముడు ‘నేను రామవర్మని వచ్చాను’ అని చెప్పి చెవులు పట్టుకుని తన శిరస్సు దశరథుడి పాదాలకి తగిలేటట్టు నమస్కారం చేశాడు. 


రాముడికి ఉన్న గుణములని చూసిన దశరథుడికి అద్దంలో తనని తాను చుసుకున్నట్టు ఉంది.


అప్పుడు దశరథుడు...”రామా! నా యొక్క శీలమును తెలుసుకున్న, గొప్ప ధర్మము కలిగిన, నిరంతరమూ నన్ను అనువర్తించేది అయిన నా పెద్ద భార్య కౌసల్య కుమారుడివి కనుక, అలాగే నీకు గొప్ప గుణములు ఉన్నాయి కనుక నీకు పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను. నీకు తెలియనివి కావు ఈ విషయాలు, అయినా ఒకసారి విను...‘నువ్వు రాజువయ్యాక రెండు వ్యసనాలు వస్తాయి, అవి మనల్ని నాశనం చేస్తాయి, కావున వాటిని దగ్గరకు రానీకుండా చూసుకో, ఆ రెండు వ్యసనాలే కామము మరియు క్రోధము.(కామము వలన నిష్కారణంగా వేటాడాలన్న బుద్ధి పుడుతుంది, జూదమాడదామన్న బుద్ధి పుడుతుంది, పగటి పూట నిద్రపోవాలన్న అలవాటు వస్తుంది, పరదూషణములను వేరొకరి దగ్గర కూర్చుని వినాలనిపిస్తుంది, పగటి పూట అని చూడకుండా స్త్రీతో సంభోగిద్దామనిపిస్తుంది, మద్యం తాగాలనిపిస్తుంది, పగటి పూట నృత్యము చూడాలనిపిస్తుంది, గీతములను విందామనిపిస్తుంది. అలాగే క్రోధము వలన చాడీలు చెప్పాలనిపిస్తుంది, సత్పురుషులని నిర్బంధించాలనిపిస్తుంది, కపటముగా వేరొకరిని చంపాలనిపిస్తుంది, ఇతరులు వృద్ధిలోకి వస్తే ఓర్వలేనితనం వస్తుంది, ఇతరులలోని గుణాలని దోషాలుగా చెప్పాలనిపిస్తుంది, ఇతరుల ధనాన్ని అపహరించాలని పిస్తుంది,అవతలివారి మనస్సు బాధ పడేటట్టు మాట్లాడాలని పిస్తుంది, చేతిలో ఒక ఆయుధం పట్టుకొని అవతలవాడిని నిష్కారణంగా శిక్షించాలనిపిస్తుంది.) 

రామా నీకు పుష్యమి నక్షత్రంలో పట్టాభిషేకం చేస్తాను, కావున ఈ రోజుకి వెళ్ళి ఉపవాసం చెయ్యి!”అన్నాడు దశరథుడు.


అందరూ వెళ్ళిపోయాక దశరథుడు కూడా వెళ్ళిపోయాడు.


అంతఃపురానికి వెళ్ళాక దశరథుడు సుమంత్రుడిని పిలిచి… “రాముడిని మళ్ళీ తీసుకుర”మ్మన్నాడు.


రాముడు వచ్చాక దశరథుడు ఇలా అన్నాడు… “నేను జీవితంలో అనుభవించని సుఖం లేదు, ఈ శరీరానికి వృద్ధాప్యం వచ్చింది, ఎన్నో యజ్ఞాలు చేశాను, పితృ ఋణం, దేవతా ఋణం, ఋషి ఋణం ఇలా అన్ని ఋణాలు తీర్చుకున్నాను, నేను చెయ్యవలసిన పని ఏదన్నా ఉంటే అది నీ పట్టాభిషేకమే, ‘మీరు ఎందుకింత తొందర పడుతున్నారు’ అని అడుగుతావేమో.నాకు పీడకలలు వస్తున్నాయి, ఉల్కలు పడుతున్నాయి, ఈ శరీరం పడిపోతుందని నేను బెంగపడడంలేదు, ప్రజలు దిక్కులేనివారు కాకూడదు, అందుకని నీకు తొందరగా పట్టాభిషేకం చేసేస్తాను. నీకు పట్టాభిషేకం చెయ్యాలని ఒక ఆలోచన వచ్చింది, ఈ ఆలోచన మారిపోకముందే చేసెయ్యనీ. భరతుడు చాల మంచివాడు, ఇప్పుడు తన మేనమామ అయిన యుధాజిత్ దగ్గర ఉన్నాడు, భరతుడు రాక ముందే నీకు పట్టాభిషేకం చేసేస్తాను. ఒక మంచి పని మొదలుపెట్టగానే విఘ్నాలు వస్తాయి,నీ స్నేహితులందరినీ అప్రమత్తంగా ఉండమను, సీతమ్మతో కలిసి దేవతలని ప్రార్ధించి,దర్భల(గడ్డి) మీద పడుకో!” అని చెప్పి పంపించాడు.


దశరథుడు సుమిత్రని చేసుకున్నా పిల్లలు పుట్టలేదు కాబట్టి, యవ్వనంలో ఉన్న, సౌందర్యరాశి, అన్ని విద్యలు తెలిసిన కైకేయని వివాహం చేసుకున్నాడు.


ఆ సమయంలో కైకేయ రాజు, నా కూతురికి - నీకు పిల్లలు పుడితే వాళ్ళకే పట్టాభిషేకం చెయ్యాలని అడిగాడు.


దశరథుడు అప్పుడు మాట ఇచ్చాడు.


అందుకని ఇప్పుడు కైకేయ రాజుని పిలవకుండానే రాముడికి తొందరగా పట్టాభిషేకం చెయ్యాలనుకుంటున్నాడు.


రాముడు అంతఃపురానికి వెళ్ళి తన తల్లి అయిన కౌసల్యా దేవితో తన పట్టాభిషేకం గురించి చెప్పగా, ఆవిడ చాలా సంతోషపడింది, సీతమ్మ, లక్ష్మణుడు ఎంతో ఆనందపడ్డారు. తన మిత్రులకి కూడా చెప్పాడు. తరువాత రాముడు దేవతలకి హవిస్సులు ఇచ్చి, మిగిలిన హవిస్సుని తిన్నాడు (ఉపవాసం అంటె, కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి, కన్ను పడిపోనంత సాత్విక ఆహారం, శరీరం నిలబడడానికి కావలసినంత తిని, ఆ ఓపికతో భగవతారాధన చెయ్యడం ఉపవాసం, అన్నం తినడం మానెయ్యడం ఉపవాసం కాదు).


అయోధ్యా నగరమంతా చాలా సంతోషంగా ఉన్నది.


*రేపు...25వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

మిత్రులు

 👌 _*సుభాషితము*_ 👌

⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️


_*పృచ్ఛకో మార్గదర్శీ చ*_

_*ధైర్యశాలీ విదూషకః!*_

_*విశ్వాసీతి సుహృద్భేదాః*_

_*నరస్యావశ్యకా ఇహ!!*_


ప్రశ్నించేవాడు, సన్మార్గం చూపువాడు, ధైర్యం కలవాడు, నవ్వుతూ నవ్వించేవాడు, నమ్మకస్తుడు అను ఈ అయిదు రకాలైన మిత్రులు ఈ లోకంలో మానవుడికి ఉండాలి.


⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️