14, జూన్ 2021, సోమవారం

దొరికేది "టూత్ పిక్" లే

 నిన్న నేనొక పెళ్ళి ఫంక్షన్ కి అటెండ్ అయ్యా...

దాదాపు 50 మంది అతిథులు కుర్చీల్లో ఆశీనులయ్యారు. నేను ముందు వరుసలో కూర్చున్నా. ఆకలిగా అనిపించింది


           కాసేపయ్యాక ఒకామె ట్రేలో స్నాక్స్ తెచ్చి వెనుక వరుస నుండి అతిథులకు అందించడం ప్రారంభించింది. ముందుకి కూర్చున్న నా వరకు వచ్చేసరికి స్నాక్స్ అయిపోయాయి. చిరాగ్గా అనిపించింది. తిన్నగా లేచివెళ్లి వెనుక వరుసలో కూర్చున్నా


             ఈలోగా మరొక ఆమె కూల్ డ్రింక్స్ తెచ్చి ముందు వరుస నుండి పంపకం మొదలెట్టింది.

అనుమానించినట్టే వెనక్కు వచ్చేలోపు అవికూడా అయిపోయాయి


               కోపం పట్టలేక వెళ్లిపోదాం అని లేచి నిల్చున్నా. సరిగ్గా అదే టైమ్ కి ముగ్గురు  మహిళలు ట్రే లలో ఘుమ ఘుమలాడే వంటకాలను తీసుకువచ్చారు. స్మార్ట్ గా ఆలోచించి ఈసారి మధ్య వరుసలో కూర్చున్నా


                 ఒకామె ముందునుండి, మరొకామే వెనుక నుండి అందించడం మొదలెట్టారు. థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు టెన్షన్ గా అనిపించింది. ఊహించరాని విధంగా మధ్య వరుస వచ్చేసరికి సమాప్తం


                అందరూ తింటుంటే ఏం చేయాలో తోచక అయోమయంగా తలదించి కోపంగా నా చేతులవైపు చూసుకుంటున్నా


              సరిగ్గా అదేసమయంలో మూడవ మహిళ నా వద్దకు వచ్చి. తన చేతిలో ఉన్న బౌల్ ని చూపించి తీసుకోమన్నట్టు సైగ చేసింది. ఆతృతగా బౌల్ లో చెయ్యిపెట్టి బయటకు తీసా. అదేంటో తెలుసా???


             టూత్ పిక్. పళ్ళసందుల్లో ఇరుక్కున్న ఆహారాన్ని తీసే కర్రపుల్లలు. ఛి ఛీ ఎదవ జన్మ.....


నీతి:

జీవితంలో మీ పొజిషన్ ని తరచుగా మార్చడానికి ప్రయత్నించొద్దు


దేవుడు మీరు ఎక్కడుంటే మంచిదో అక్కడే ఉంచుతాడు


కాదూ, కూడదు అని తొందరపడితే దొరికేది "టూత్ పిక్" లే


🙈🙈🙈😀😀😀😀😀😀😀😀😜😜😜😜😜

మహాభారతంలో కధ

 మహాభారతంలో ఒక కధ ఉంది... కకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు.  అతనికి రేవతి అనే అందమైన కూతురు ఉండేది.  అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయ్యింది. అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట పెట్టుకుని బ్రహ్మ లోకానికి వెళ్తాడు. అయితే ఆ సమయానికి బ్రహ్మ లోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండడం వల్ల కొద్దిసేపు వేచి ఉన్నాడు.


ఆ సంగీత కార్యక్రమం ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్లి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో గాని పక్క రాజ్యంలో గానీ ఉంటే చెప్పమని ప్రార్ధిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిది అయ్యింది అన్నాడు. అదేంటి అని అడిగాడు రాజు. నీకు తెలియదా భూమిపై సమయానికి, బ్రహ్మ లోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని. నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమి పై 27 చతుర్యుగాలు గడిచి పోయాయి. ఇప్పుడు అక్కడ నీవారు గానీ, నీ రాజ్యం గానీ లేదు అన్నాడు.


దిగ్భ్రాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకుని ఇప్పుడు తాను ఏం చేయాలో సెలవియ్యమన్నాడు. అప్పుడు బ్రహ్మ.. ఇప్పుడు భూమిపై 28 వ చతుర్యుగము నడుస్తుంది. అక్కడ మహా విష్ణు అవతారం అయిన శ్రీ కృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి. కాబట్టి అతనికిచ్చి నీ కూతుర్ని వివాహం చెయ్యి అన్నాడు బ్రహ్మ...


ఇప్పుడు ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్రం గురించి మాట్లాడదాం...


ఆ చిత్రం పేరు "Interstellar" ఈ చిత్రం 2014 లో వచ్చింది. ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ చిత్రం లో కథానాయకుడు గతంలో నాసాలో పైలట్ గా చేసి ప్రస్తుతం తన ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతనికి ఒక కూతురు, కొడుకు ఉంటారు.

కూతురంటే అతనికి ప్రాణం. 


ఒకరోజు అతని కూతురు తన గదిలో ఉన్న పుస్తకాల అర నుండి తరచూ పుస్తకాలు వాటంతట అవే పడడం గమనించి ఆ గదిలో దెయ్యం ఉందని తండ్రితో చెబుతుంది. అప్పుడు ఆమె తండ్రి అదేమీ కాదని వివరించి గతంలో నాసాలో పనిచేసిన తన ప్రొఫెసర్ని కలిసి దీని గురించి వివరిస్తాడు.

తన కూతురు గదిలో దూళి చారలు ఏర్పడ్డాయని, తన జేబులోంచి పడిన నాణాన్ని ఆ దూళి చారలు ఆకర్షించాయని, వాటిని పరిశీలించి చూసి దానిని డీకోడ్ చేశానని, ఎక్కడో ఇతర లోకాల్లో ఉన్న జీవులు భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతాడు ఆ హీరో.  అయితే భూమిపైకి వస్తున్న ఆ పాజిటివ్ తరంగాలపై పరిశోధన చేయగా అవి శని గ్రహానికి(Saturn) దగ్గరలో ఉన్న ఒక పాలపుంతలోని (Galaxy) ఒక గ్రహం నుండి వస్తున్నాయని చెబుతాడు ఆ ప్రొఫెసర్.


అయితే అది భూమి ఉన్న పాలపుంత కాకపోవడం వల్ల ఆ పాలపుంతలోకి వెళ్ళడానికి ‘వార్మ్ హోల్’ (Warm hole) ద్వారా చేరుకోవచ్చని కొంతమంది బృందాన్ని తయారు చేసి ఒక వ్యోమ నౌక మీద వారి అందరినీ పంపిస్తాడు ఆ ప్రొఫెసర్ హీరోతో పాటుగా.  వార్మ్ హోల్ అంటే ఒక గాలక్సీ నుండి ఇంకో గాలక్సీకి వెళ్ళడానికి దగ్గరి దారి. అయితే వారి లక్ష్యం ఏంటంటే ఆ పాలపుంతలో మానవ జీవనానికి అనువుగా ఉండే గ్రహాన్ని కనిపెట్టి భూమిపై మనుషుల్ని అక్కడికి తరలించాలని.. వగైరా వగైరా(etc etc..).. అప్పటికి ఆ హీరో కూతురు వయ్యస్సు 10 సంవత్సరాలు (ఇక్కడ ఈ విషయం గుర్తుంచుకోవాలి). ఆ తరువాత కధ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆ హీరో ఆ పాలపుంతలో ఉన్న కృష్ణ బిలంలోనికి (Black hole) ప్రవేశిస్తాడు.   అయితే అది 4D లోకం. మనం ఉన్నది 3D ప్రపంచం.  నాలుగవ డైమెన్షన్ కాలం.


అంటే నాలుగవ డైమెన్షన్ ప్రపంచంలో మనం కాలంలో కూడా ప్రయాణించవచ్చన్న మాట.

అంటే ఇప్పుడు ఆ హీరో కాలంలో ప్రయాణించ గలడన్న మాట.  అయితే ఆ హీరో కాలంలో ప్రయాణించి తన కూతురు గదిలోకి వెళ్తాడు.  అప్పుడు గదిలో ఉన్న తన కూతురికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ పుస్తకాల అరలో నుంచి పుస్తకాలను కింద పడేస్తాడు.


ఇప్పుడు అర్ధం అయ్యిందా... అంటే వేరే లోకం నుండి భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నది భవిష్యత్తులో ఉన్న హీరోనే.

ఇక ఆ తరువాత కొంత కధ నడిచాక ఆ హీరో భూమిపైకి తిరిగి వస్తాడు.  అయితే అప్పటికే తన కూతురు ముసలిది అయిపోతుంది. కాని హీరో వయసు మాత్రం మారదు.  ఎందుకంటే హీరో వెళ్లిన గ్రహంలో ఒక గంట భూమిపై ఏడు సంవత్సరాలతో  సమానం.


పైన మహా భారతంలోని కథను చదివి మనం దాన్ని ఒక కధగానే తీసుకుంటాం. కాని ఆ కధలో నేటి సైన్స్ కన్నా ఎంతో ముందే  "సమయ విస్ఫారణం"(Time dilation), "కృష్ణ బిలం (Black hole), "వెచ్చని రంధ్రం” (Warm hole) వంటి ఆధునిక సైన్స్ చెబుతున్న వాటిని ఎప్పుడో మన హిందూ సనాతన ధర్మము యందు చెప్పడం జరిగింది.


అందుకే స్వామీ వివేకానంద అన్నారు.. "సైన్స్ అభివృద్ధి అయ్యేకొద్దీ సనాతన ధర్మం మరింత బలపడుతూ ఉంటుంది" అని.


ఇతర లోకాలకు, మనకు ఉన్న ఈ కాల వ్యత్యాసాన్నే "సమయ విస్ఫారణం” (Time dilation) అని నేటి సైన్స్ చెబుతుంది. మనం మహాభారతంలో చదువుకున్నాం.  పాండవులు చివరి రోజులలో స్వర్గాన్ని చేరుకోవడానికి హిమాలయాలు మీదుగా ప్రయాణం చేయడం.  కాని, స్వర్గం ఉండేది భూమిపై కాదు.   మరి స్వర్గాన్ని చేరుకోవడానికి భూమిపై ఉన్న హిమాలయాలకు వెళ్లడం ఏంటి అని అనుమానం వస్తుంది.  నాక్కుడా వచ్చింది.


పైన చెప్పిన వార్మ్ హోల్ సిద్ధాంతం ఇక్కడ మనం అర్ధం చేసుకోవాలి.  హిమాలయాల్లో స్వర్గానికి చేరుకునే వార్మ్ హోల్స్ ఉన్నాయన్న మాట. అలాగే ఆది శంకరాచార్యుల వారు బద్రీనాథ్ వద్ద అంతర్ధానం అయిపోయారని ఆయన చరిత్ర చెబుతుంది. అంటే అక్కడ వార్మ్ హోల్ ద్వారా ఆయన పరంధామం చేరుకున్నారని అర్ధం అవుతుంది.


మన హిందూ సనాతన ధర్మము ప్రకారం, మరియు గరుడ పురాణం బట్టి చూసినా చనిపోయిన వారికి 11 -15 రోజుల వరకూ ప్రతీరోజూ పిండ ప్రధానం చేస్తారు.  ఆ తరువాత సంవత్సరం వరకూ నెలకొక్కసారి చేస్తుంటారు.  ఆ తరువాత సంవత్సరానికి ఒకసారి చేస్తుంటారు.


ఎందుకో తెలుసా, చనిపోయిన 11 – 15 రోజుల వరకూ జీవుడు భూమిపైనే ఉంటాడు.  అందుకే ప్రతీరోజు పిండ ప్రధానం చేస్తాం.  ఆ తరువాత జీవుడు స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరు కోవడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది గరుడ పురాణం ప్రకారం.  ఆ సమయంలో భూమిపై నెలరోజుల కాలం ఆ లోకంలోని వారికి ఒకరోజుతో సమానం.  అందుకే నెలకొకసారి చేస్తే వారికి రోజు కొకసారి పెట్టినట్టు.  ఇక సంవత్సరం తరువాత స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరుకుంటారు.  అప్పుడు సంవత్సరానికి ఒకసారే పెడతాం.


ఎందుకంటే అక్కడ ఒక రోజు, భూమిపై ఒక సంవత్సరంతో సమానం. ఇలానే ఎన్నో లోకాలు, ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయి.  ఈ లోకాల మధ్య ఉన్న కాల వ్యత్యాసమే "సమయ విస్ఫారణం"(Time Dilation) అంటాం.


ఇట్లానే.. బ్రహ్మ దేవుఁడు శ్రీకృష్ణుని స్నేహితులను అపహరించినపుడు కూడా ఒక క్షణం పాటు అది ఒక సంవత్సరం అయ్యింది. అప్పుడు కృష్ణుడే అన్ని రూపాలుగా మారి అందరి పిల్లలుగా, జంతువులుగా మారి బ్రహ్మకు గుణపాఠం చెప్తాడు.


ఇలా మన పురాణాలలో ఎన్ని విషయాలు ఉన్నాయో కూడా తెలియని ఈ ప్రస్తుత సమాజం, మన సంస్కృతిని కాదని ఏ తల తోక లేని పరమతం మాయలో పడుతున్నారు.  మన తరువాత ఎప్పుడో వచ్చిన ఎడారి మతాలు ఇలాంటి విజ్ఞానంలో మన హిందూ సనాతన ధర్మమునకు దరిదాపుల్లో కూడా రాలేవు.


కుదిరితే ఈ వ్యాసం అందరికి పంపండి.  కనీసం చదువుకున్న వాళ్లకు అర్థం అవుతుంది.


|| ఓం నమః శివాయ ||

సప్త శతీ లోని కొన్ని మంత్రములు

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁ఇప్పుడు కరోనా అనే మహమ్మారి ని తొలగించుకోవడం కోసం, ఆ దేవి పాదాలు తప్ప వేరే ఏమీ లేదు. కావున ఆవిడను శరణాగతి కోరడానికి సప్త శతీ లోని కొన్ని మంత్రములు చేసుకుంటే బాగుంటుంది అని అభిప్రాయం. వాటిని క్రింద తెలుపుతున్నాను. ఇవి అందరికీ తెలిసినవే.

విశ్వవ్యాప్తం అయిన విపత్తి నాశనము కొరకు :-

దేవి ప్రసన్నార్తిహరే ప్రసీద ప్రసీద మాతర్జగతో అఖిలస్య!

ప్రసీద విశ్వేష్వరి పాహి విశ్వం త్వమీశ్వరీ దేవి చరాచరస్య!!

వీలైనన్ని సార్లు రోజూ ఎవరి ఇంట్లో వారు శుచిగా శుభ్రం గా జపం చేస్తే మనకూ మంచిది. మన దేశానికి మన రాష్ట్రం నకు మంచిది. ప్రజలు ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖశాంతులు తో ఉండాలి అని ఆ దేవిని మనసారా వేడుకుందాము.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ఆనందయ్యగారి కరోనా మందు

 మితృలారా రేపటినుండి ఆనందయ్యగారి కరోనా మందు సికింద్రాబాద్ లోని ఆర్యసమాజంలో దొరుకుతుంది.  ఈ మందును శ్రీ గుమ్మడవెల్లి శ్రీనివాస్ గారు తయారు చేశారు.  వారు ఆయుర్వేద వైద్యులు.  కరోనా పాజిటివ్ పేషంట్లు ఈ సదవకాశాన్ని వినియోగించుకో గలరు.


ఇప్పటి వరకూ వెయ్యి మందికి ఈ మందు ఇవ్వడం జరిగింది  మాకు అందిన సమాచారం ప్రకారం అందరూ పాజిటివ్ నుండి నెగిటివ్ కు రావడం జరిగింది


వివరాలకు 


మదన్ గుప్త - 9441200112

అకెం మురళీధర్ - 9440965929

పై రెండు నెంబర్లలో సంప్రదించవచ్చు.


మీ కోసం 

మీ మదన్ గుప్త

14-6-2021


మితృలారా నేటి నుండి కృష్ణపట్నం శ్రీ ఆనందయ్యగారి కరోనా మందు సికింద్రాబాద్ లోని *ఆర్యసమాజంలో* దొరుకుతుంది.  ఈ మందును శ్రీ గుమ్మడవెల్లి శ్రీనివాస్ గారు తయారు చేశారు.  వారు ఆయుర్వేద వైద్యులు.  కరోనా పాజిటివ్ పేషంట్లు ఈ సదవకాశాన్ని వినియోగించుకో గలరు.  


Corona రాని వారికి 'P' అని preventive మందు కూడా లభించును. అందరూ స్వీకరించవచ్చు.


Covid వచ్చిన వారి తాలూకు ఎవ్వరైనా వచ్చి ఆధార్ కార్డ్ కాపీ, కోవిడ్ Positive రిపోర్ట్ కాపీ తీసుకు వచ్చి మందు (P, F, L) తీసుకెళ్ళవచ్చును. 


ఇప్పటి వరకూ వెయ్యి మందికి ఈ మందు ఇవ్వడం జరిగింది  మాకు అందిన సమాచారం ప్రకారం అందరూ పాజిటివ్ నుండి నెగిటివ్ కు రావడం జరిగింది.


 *అన్ని ఉచితంగా ఇవ్వబడును* 


Subject to availability of stock


9866554500 

మశెట్టి శ్రీనివాస్ ఆర్య

President


+919490949596

కంది విశ్వనాథం

Secretary


+919849536685

నల్లవెల్లి విజయ్ కుమార్ 

Treasurer


మాశెట్టి శశికాంత్ ఆర్య

9866778800

Joint Secretary


వివరాలకు 

పై నెంబర్లలో సంప్రదించవచ్చు.


మీ కోసం 

 *ఆర్య సమాజం* , 144, రాష్ట్రపతి రోడ్, జీరా సికింద్రాబాద్.500003

Office phone :

+91 70758 04255


14-6-2021

గణిత పదనిసలు....

 *🌷గణిత పదనిసలు....*


⭕6 బయట 7 స్తూ కూర్చోకు!


⭕లెక్కలు అర్ధం కాకుంటే 7 పొస్తుంది.


⭕100న రావు ఎలా ఉన్నాడు??


⭕గురువులకు 100 నం చేద్దాం!


⭕1/2 టి కాయ బజ్జీలు బాగా రుచిగా ఉంటాయి.


⭕ఈ రోజు మా కూర 1/2 టి కాయ వేపుడు.


 ⭕కూరలో కారం తక్కువ 1000.


⭕10 కాలాల పాటు చల్లగా ఉండాలి.


⭕చెడువ్యసనాలతో ఆయువు 3 తుంది.


⭕పెళ్లికూతురు 100000 ణంగా ఉంది.


⭕పై 1/2 లో 1/4 రం ఉన్నది.


➖➖➖ *✍✍🚶🏿

మీకు తెలుసా?

 మీకు తెలుసా?

ఇది కేవలం HP  గ్యాస్ వినియోగదారులను ఉద్దేశించి వ్రాసింది. 

2018 వ సంవత్సరంలో  HP గ్యాసు కంపెనీ వారు వినియోగదారుల సఔకర్యార్దం EZY GAS Card ను ప్రెవేశపెట్టారు. మనందరికీ కూడా ఆ కార్డులు అంద చేశారు. కంపెనీ వారు 24 రూపాయలకు ఆ కార్డు విక్రయించారు.  కానీ మనకు మన డెలివరీ బోయలు అంతకంటే ఎక్కువ ధరకు (నేను 30 చెల్లించను) మనకు అందచేశారు.  అప్పుడు మనతో మీరు ఈ కార్డుతో గ్యాసు సిలండరు కొనవచ్చని చెప్పారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను డెలివరీ బోయిని ఆ కార్డు గూర్చి అడిగితె మాకు స్వీప్ మిషన్లు ఇవ్వలేదని చెపుతున్నారు.  మీలో ఎవరైనా ఆ కార్డు వినియోగించారా అయితే తెలుపగలరు. కాగా ఈ విషయంలో నేను నెట్లో వెతికితే 23rd April 2018 నాటి ఇండియన్ ఎక్సప్రెస్ పేపరు లో దానికి సంబందించిన కధనం కనపడింది.  మీరు క్రింది లింకుని క్లిక్ చేసి చదువగలరు 

https://www.newindianexpress.com/cities/hyderabad/2018/apr/23/ezy-gas-cards-not-making-things-easy-for-lpg-customers-in-city-1805132.html 

ఆ కధనం ప్రకారం HP గ్యాసు కంపెనీ వారు డెలివరీ బాయ్ వసూళ్లను అరికట్ట టానికి మరియు బ్లాకులో సీలిండర్లు అమ్మటానికి నిషేదించటానికి ఈ కొత్త విధానం ప్రవేశ పెట్టినట్లు పేర్కొన్నారు.  మరి నిజంగా వినియోగదారుల మీద ఇంత శ్రర్ధ ఉంటే ఇప్పటి దాకా స్వైపు మిషన్లు డెలివరీ బాయ్ లకు ఎందుకు ఇవ్వలేదు. లేక కంపెనీ ఇచ్చినా డెలివరీ బాయ్ వాటిని తీసుకొని రావటం లేదా ఇది ఎవరికి తెలియని విషయం. 

డెలివరీ బాయ్ సిలిండర్ దర మీద దాదాపు 30 రూపాయల దాకా ఎక్కువ వాసులు  చేస్తూ ఉండటం మన అనుభవం కాదని ఎవరైనా అనగలరా. 

ఇప్పుడు మనకు HP గ్యాసు మరియు HP pay అనే రెండు క్రొత్త apps వచ్చాయి వాటితో మనం గ్యాసు book చేయవచ్చు మరియు మన account నుండి నేరుగా సిలిండర్ ధరను చెల్లించ వచ్చు. 

మీలో ఎవరైనా ఈ విధంగా చిల్లిస్తుంటే తెలుపగలలరు . 


Noctoria (Night time urination)

 *Noctoria (Night time urination)* 

*Drinking water at night how it helps*

*Noctoria and heart problems are related.* 

 *It is worth spending two minutes to take read the information below.* 

*An American doctor tells us that Nocturia,  heart problem and cerebral infarction are related.* *The most common symptom of middle-aged and elderly people is nocturia (waking up at night to urinate). Because of nocturnal urine, the elderly are afraid of drinking water before bedtime. They don't know that not drinking water before going to bed, getting up in the middle of the night to pee without drinking water is an important cause of early morning cerebral infarction in middle-aged and elderly people.  In fact, nocturia is not a problem of bladder dysfunction. Nocturia is caused by the aging failure of the heart function in the elderly, and the inability of the right heart atrium to suck blood from the lower body. During the day, we are all in a standing position,  The blood will flow down. If the heart is not good, the blood volume of the heart is insufficient, the pressure on the lower body will increase, so middle-aged and elderly people will have lower body edema during the day. When they lie down at night, the pressure on the lower body will be relieved and a lot of water accumulate in the tissues  The water returns to the blood.  If there is too much water, the kidneys will work hard to separate out the water and drain it to the bladder, causing nocturia. Therefore, it usually takes about three or four hours after lying down to sleep to get up and go to the toilet for the first time. After that, the water in the blood continues to increase. So after another 3 hours, they will have to go to the toilet again. Why is this an important cause of cerebral infarction and myocardial infarction?  Because after two or three urinations, the water in the blood is greatly reduced. The body also continue to lose water through breathing. The blood then begins to become  thick and sticky, and the heart rate slows down due to the low metabolism of the body during sleep. With thick blood and slow blood flow, the stenosis of the blood vessel is easily blocked... This is why the middle-aged and elderly people almost always have myocardial infarction or cerebral infarction at 5 or 6 in the morning. This situation will lead to death while asleep. The first thing to tell everyone is that nocturia is not a malfunction of the bladder, but a problem of aging heart.  The second thing to tell everyone is that you must drink some warm water before going to bed, and you must drink some warm water after you wake up in the middle of the night to pee. Don't be afraid of nocturia, because not drinking water may take your life.  The third thing is that you must exercise more in normal times to strengthen the function of the heart. The human body is not a machine. A machine will wear out when used frequently, but the human body will be the opposite. It will become stronger when used frequently. Do not eat unhealthy food, especially high starch and fried foods.  If you like this article, please forward it to your middle-aged and elderly friends*

▪️▪️▪️👍👍▪️▪️▪️▪️

వాత్సల్య గోదావరి*

 *వాత్సల్య గోదావరి*


🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊


 *రచన: శ్రీమతి మణి వడ్లమాని*

✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍

      ఆషాడం చివరన,తొలకరి జల్లులు,కుంభవృష్టిగా   మారి ఆకాశం  చిల్లుపడ్డట్టుగా కుండపోతగా  వర్షం కురుస్తోంది.


వీధి వసారాలో సుబ్బుశాస్త్రిభోరున పడుతున్న వానను చూస్తూ,మనసులోబావురుమనుకుంటూ పీట మీద కూర్చొని శివ పంచాక్షరీ జపం చేస్తున్నాడు. పెదాలుమాత్రమేజపిస్తున్నాయి.చూపు మాత్రంవీధివైపు ఉంది. పంచాంగం ముందు పెట్టు కొని ఆరోజు తిది,వార,నక్షత్రాలు తో సహా సిద్ధంగాఉన్నాడు.అలాగే ఎవరన్నా వచ్చిపిలుస్తారేమోఅనివడికిన జంద్యాలు కూడా పక్కనేపెట్టుకున్నాడు


‘శాస్త్రి గారు’ అనే పిలుపు కోసం చెవులు రిక్కించి ఉంచాడు.


అబ్బే ఏది ఎవరూ  రాందే?


నిరాశగా  మళ్ళి పంచాక్షరీ జపం చేస్తున్నాడు. మనసులో మటుకు వరద గోదావరిలా ఎన్నో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి


ఈవర్షం కనక లేకపోతెరోజూ  ఈ పాటికల్లాగోదారొడ్డున ఉన్న  కోటిలింగాల  రేవుదగ్గర  ఉండేవాడు. ఉదయాన్నే వెళ్లి గోదావరి లో ఓ నాలుగు మునకలు వేసి  సంధ్యావందనం అక్కడే కానిచ్చి, ఈశ్వరుడి దర్శనం చేసుకొని,  ఆ పావంచాల అంచున కూర్చొని  ఎక్కడెక్కడి నుంచోపరమపావని అయిన  ఈ  గోదావరి లో స్నానం చెయ్యడానికి  వచ్చిన వాళ్ళ చేత సంకల్పం చెప్పించివాళ్ళు ఇచ్చిన తృణమో పణమో  తీసుకొని  ఆరోజు కి సరిపడ సంబారాలు కొనుక్కొని  ఇంటికి వెళ్ళే వాడు.ఇది రోజూ అతని దినచర్య. భార్య వర్ధనమ్మ ఎంతో ఒబ్బిడిగా సంసారం లాక్కొని వస్తోంది , లేదు,సరిపోదు అనకుండా తెచ్చిన వాటితోనే రుచికరమైన వంట చేసి భర్తకు పెట్టేది.


అందుకే ఎప్పుడు సుబ్బుశాస్త్రి అనేవాడు “వర్ధనం,నీ చేతి లో ఏదో మంత్రదండం ఉంది సుమా!” అని. ఆ తృప్తి తోనే ఆవిడకి కడుపు నిండి పోయేది.


కాని  నాలుగు రోజులనుంచి కురుస్తున్న ఈ కుంభవృష్టి  వల్ల యాత్రికులు ఎవరూ రావటం లేదు. ఇంచుమించుగా భార్యభర్తలిద్దరూ  అర్ధాకలితోనే కాలం వెళ్ళదీస్తున్నారు


 పోనీ,ఎవరైనా,ఆభ్దికాలకి భోక్తలుగా పిలుస్తున్నారా? అంటే అది లేదు. అయినా ఇళ్ళలో చేస్తేనే కదా  పిలిచేది అది కాస్తా మఠం  లోనే  కానిచ్చేస్తుంటే, ఇహ  చేసేదేముంది? అనుకుంటూ ‘ఆ గోదావరి తల్లినే నమ్ముకున్నాను. పుణ్యనదిలో స్నానాల కోసం ఎవరైనా రాకపోతారా? సంకల్పం చెప్పక పోతానా? నాలుగు రూపాయలు తెచ్చుకురానా?” అని ఆశగా చూస్తున్నాడు.


అందరిలా తను పెద్దగా పండితుడు కాదు,పూజలు ,పెళ్ళిళ్ళు చేయడానికి.ఏదో  బతుకు తెరువు కోసం, ఆభ్దికాలకి,భోక్తలుగా వెళ్ళడం, లేదా ఎవరైనా గ్రహ పూజలు చేస్తే ఆ దోష నివారణార్ధం దానం అందుకోవడం, అలా వాటితో వచ్చిన సొమ్ము తోనే  బ్రతుకును  వెళ్లదీసుకువస్తున్నాను.పిత్రార్జితం గ ఉన్న ఈ పెంకుటిల్లే.కాస్త నీడ నిస్తోంది.అది కాస్తశిధిలావస్థలోఉంది.ఉన్న ఈ ఆధారం  కూడా పోతె,ఇక నా దారి  నువ్వేతల్లీ, అనిగోదావరి వైపు దిగులుగాచూస్తున్నాడు.


నాలుగు రోజులనుంచి కడుపునిండా తిండి సరిగాలేదు,నిన్న రాత్రి తిన్న ఉప్పుడుపిండి ఏ మూలకు సరిపోతోంది. నీరసంగా ఉంది. పాపం నేనే ఇలా ఉంటెవర్ధనం  ఎలా తట్టుకుంటుందిఅనుకుంటూ పెరటివైపుకి చూసాడు. అక్కడ వసారాలో కూర్చొని వత్తులు చేసుకుంటూ ,గీతగోవిందం పాడుకుంటోంది.


జలజలా కురుస్తున్న వానని చూస్తూ “ఓ ఆకాశగంగాఎంతో ఉత్సాహంగా పైనుంచి కిందకి దూకుతున్నావు,ఆ గోదారేమోఅంతకంటే ఆవేశంతో నిన్నురమ్మనమని పిలుస్తోంది. మీ ఆట బాగానే ఉంది. అర్భకుడిని తల్లీ  మీ ఇద్దరిమధ్యలో  నన్ను బలి చెయ్యకండి.కాస్త  ఈదీనుడిని కరుణించి శాంతించండి” అని మనసులోనే వేడుకుంటున్నాడు.


భర్త ఆశగా చూసే చూపుని తప్పించుకుంటూ పెరటి వసారాలో వత్తులు చేస్తున్నవర్ధనమ్మ ఆవేదనగా తలపోస్తోంది. ఏదైనా వండి పెడదామన్నా, ఇంట్లో బొత్తిగా సరకులు  లేవు.ఉన్న రవ్వతో నిన్న రాత్రి కాసింత ఉప్పుడుపిండి చేసేసింది.ఈ పూట  ఏదైనా దొరికేతే పర్వాలేదు. లేకపోతె ఇహ ఈ పూట పస్తే. అని  ఏదోలెక్కలు వేసుకుంటూ అప్పుడే  గంట పదకొండు దాటి ఉండచ్చు ఆనుకుంది.


ఇంతలో   ముందు  వసారాలో ఏదో అలికిడి వినిపించింది. గభాల్న లేచి చెంగు దులుపుకుంటూ  వెళ్ళింది.  ఆ వానలో కళ్ళకి ఏమి కనబడటం లేదు. ఎవరా అనిఆరాగా తొంగి తొంగి చూసింది. “సుబ్బుశాస్త్రి  గారి ఇల్లు ఇదేనా?  అంటూ ఒక వ్యక్తి అడుగుతూ లోపలకి వచ్చారు. “అవునండి,” అని సమాధానం ఇచ్చే లోపల ఒకఆడావిడా మరో  మగమనిషి కూడా లోపలికి వచ్చారు.


ఈ హడావుడి అంతా విన్న సుబ్బుశాస్త్రి కూడా  లేచి నిలబడ్డాడు. వాళ్ళు తెచ్చిన గొడుగులనువసారా మెట్ల మీద పెట్టారు. వాటి లోంచి చుక్కా చుక్కా నీరుమెట్ల మీద నుంచి కిందకిజారుతున్నాయి.వచ్చిన వాళ్ళ చేతులలోఏవో సంచులు కూడా ఉన్నాయి.


వాళ్ళలో  ముందు గా మాట్లాడిన అతను. “వీళ్ళు మా అక్క,బావగారు.  కెనడాలో ఉంటారు. ఇవాళ మా బావగారి తండ్రి తిధి , గోదావరి ఒడ్డున పెట్టుకుందామని  వచ్చారు, మీ గురించి అవధాని గారు చెప్పారు కాని ఈ వానవల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక  స్వయం పాకం ఇచ్చేద్దాము అనుకుంటున్నాము”  అని అన్నాడు.


దానికి  సుబ్బుశాస్త్రి“ అబ్బే, నాకు ఏమిఫర్వాలేదు. మీ బావగారుఈ వానలో గోదారి ఒడ్డున కూర్చొని చెయ్యగలరా?”  అని సందేహం వెలిబుచ్చాడు.


“ఫర్వాలేదండి,వస్తాము… నేను కూర్చొని చేస్తాను” అని అతని బావగారు అన్నాడు. తెచ్చిన సంబారాలు అన్నీ సుబ్బుశాస్త్రి చేతికిచ్చారు.అవి అందుకొని “ఓ పని చేద్దాము.మా ఆవిడ ఇంత పెసరపప్పు,పరమాన్నము చేసి పెడుతుంది.మీ తండ్రి గారి ప్రసాదం తిన్న తృప్తి కూడా ఉంటుంది. అది కూడా మీకు అభ్యంతరం లేకపోతేనే సుమా” అని అన్నాడు.


“అయ్యో ఎంత మాట! అంతకంటే మహద్భాగ్యం ఇంకేముంటుంది” అంటూ ఎంతగానో సంతోష పడ్డారు. నలుగురూ గొడుగులుతీసుకొని రేవు దగ్గరకి వెళ్లారు.


వాళ్ళు వచ్చే లోపల వర్ధనమ్మ చక చకా,రెండు కూరలు, పప్పు, పరమాన్నంతో భోజనం వండిపెట్టి ఉంచింది. సరిగ్గా అపరాహ్న వేళకి వాళ్ళు కూడా కార్యక్రమం ముగించుకొని వచ్చారు.పెరట్లో ఉన్న అరటి ఆకులు కోసి  విస్తళ్ళు వేసి భోజనాలు వడ్డించింది.


భోజన కార్య క్రమం అయ్యాక “ అయ్యా! రండి,తమకి  తాంబూలం  ఇస్తాను” అని అన్నారు కెనడా నుంచి వచ్చిన శ్రీపతి శర్మగారు.


సుబ్బుశాస్త్రిని, వర్ధనమ్మని ఇద్దరినీ పక్కపక్కనే నిలుచోమని వాళ్ళ తల్లితండ్రుల జ్ఞాపకార్థం గా ఇద్దరికీ చీరా,పంచెల చాపు  తో పాటుగా  భారీగా  తాంబూలం కూడా ముట్ట చెప్పారు ఆ దంపతులు.


ఈ కార్య క్రమం అంతా అయ్యేసరికి మధ్యాహ్నం రెండు గంటలయింది.ఆ బావమరది వెళుతూ “తొందరలోనేపుష్కరాలు కూడా వస్తున్నాయి కదా శాస్త్రి గారు. అప్పుడు మళ్ళి వస్తాము. అన్నీ మీరే చెయ్యాలి” అని అన్నాడు.


“అయ్యో తప్పకుండా చేస్తాను బాబు” అంటూ ఎంతో నమ్రతగా చెప్పాడు.


www.bestsocialteacher.com 

అప్పుడు శ్రీపతిశర్మగారు,బావమరది తో అంటున్నారు’ చూడు భాస్కర్, ఇంత పరమ పవిత్రమైన కార్యం చేసే వీళ్ళ జీవితాలు చూస్తే నాకు చాల భాదగా ఉంది. అయ్యో, ఏమిటిది? శనిదానాలు పట్టే బ్రాహ్మలు, కర్మలు జరిపించే వాళ్ళు శుభకార్యాలు చెయ్యకూడదుట కదా, పైగా అందరిలో చులకనగా కూడా చూస్తారట. ఇందాక శాస్త్రి గారు అంటుంటే విన్నాను. ఆర్ధికంగా కూడా వీళ్ళు చాలా  బలహీనులు.


 చాలీ చాలని, బతుకులు, ఎలాగడుస్తుంది,మరి వీళ్ళని ఆదుకునేది ఎవరు?అందరికి లక్ష్మీదేవి ప్రసన్నం కావాలని  ఆశీర్వదించే  వీళ్ళింట మాత్రం ఎప్పుడూ దరిద్రదేవత తాండవం చేస్తోంది. మనం ఏదైనా చెయ్యలేమా? వాళ్ళకి కనీసం కడుపునిండా భోజనం చేసే అవకాశం కూడా కల్పించాలేమా? అనిపించింది.అప్పుడే  నాకు ఈ ఆలోచనకలిగింది.సుబ్బుశాస్త్రి గారి లాంటి వాళ్ళకి మనము సాయం చేయాలి.దానికి ఒక చక్కటిప్రణాళిక వేసుకొని  ఒక ట్రస్ట్గా ఏర్పడదాం .వీళ్ళల్లా ఆర్ధికంగా వెనకబడిన వాళ్ళకి మనం చేయగలిగినంత సాయం చేద్దాము. దానికి  నీసహయం కావాలి,నువ్వే కాదు సాయం చెయ్యాలన్న సంకల్పం,ఉద్దేశ్యం ఉన్న,ఎవరైనా సరే.వాళ్ళందరనీమన ప్రాజెక్ట్ ద్వారా కూడగట్టుకొని,ఈమంచిపనిని ఆరంభిద్దాము” అనిఆవేశంగా అన్నారు.           ఆయన సుబ్బు శాస్త్రిని చూసి బాగా కదిలిపోయారు అనుకున్నాడు భాస్కర్.


దానికి శ్రీపతిగారి భార్య,విజయ “అవును తప్పకుండా చేద్దాము నేను నా స్నేహితులకి చెబుతాను. ఒకమూడు నెలల లోఅన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి వీళ్ళకి సాయం అందేలా చూద్దాము”అనిఆవిడ కూడా భర్త నిసమర్థించారు.


“మనదేశం, సంస్కృతీ,నదులు,వేదాలు అంటూ గొప్పగా చెప్పుకోవడమే కాదు,వాటిని రక్షించి ముందు తరాలకి ఇవ్వడం కూడా  మనబాధ్యత.”


“తప్పకుండా బావగారు, ఈ పవిత్ర గోదావరి తీరాన  ఇలాంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి.అందరికీ మనం సాయం చేయలేకపోయినా,  కొందరికైనా  చేద్దాము.ఒక ముందడగువేసాము. ఆ అడుగేమనలని ఆపకుండా సాగిపోయేలా చేస్తుంది.నేను సైతం ఈ పవిత్రమైన కార్యం లోభాగం పంచుకుంటాను”.అని భాస్కర్ కూడాశ్రీపతి,విజయలతో ఏకీభవిస్తూ  అన్నాడు.


ఇవేమీ తెలియని శాస్త్రి, వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ “చూసావా వర్ధనం ఈ వేళ ఆదేవుడు పంపినట్లు గా వాళ్ళు ఇంత కుంభవృష్టి లోరావడం తండ్రికి ఆబ్దికంపెట్టి తర్పణాలు వదిలివెళ్ళడం మాములువిషయం కాదు. అంతా  మనం నమ్ముకున్న  ఆ తల్లి గోదావరి వల్లే.అందులోను ఎక్కడో కెనడా నుంచి వచ్చారుట.ఈ అఖండ గోదావరి దర్శనం కోసం,నిజంగా ఆ తల్లి నీడలో ఉండటం నిజంగా మనం  చేసుకున్న పుణ్యమే. ” అని  తాంబూలం లో ఉన్న నోట్లను లెక్కపెట్టుకొని  నిర్ఘాంత పోయాడు. అక్షరాలా పదివేల రూపాయలు.ఉన్నాయి.           “వర్ధనం ఏమిటో నాకు నమ్మబుద్ధి కావటం లేదు, నువ్వుఓ సారి లెక్కపెట్టి  చూడు…” అన్నాడు ఖంగారుపడుతూ. ఆవిడ కూడా మళ్ళీ మళ్ళీ లెక్కపెట్టింది.“అవును,అచ్చంగా పదివేల రూపాయలే, యెంత దొడ్డ మనసు వాళ్లది” అని సంతోషంగాఅంటూ వాళ్ళు పెట్టిన చీర చూసుకుంటోంది


“అవును ఈ వేళ నిజంగా  చాల సుదినం.నా వొంట్లో శక్తుడిగిపోయినా  పర్వాలేదు తండ్రీ, కొంత కాలం దాన్ని మటుకు పునిస్త్రీ  గానే ఉంచమనికోరుతున్నాను  ఎందుకు అనుకుంటున్నావేమో, అదిఅలా ఐదో తనంతో ఉంటె అందరూ దాన్నిముత్తైదువ గ  ఆదరిస్తారు. అప్పుడు దానితిండికి బట్టకి కొదవ లేకుండా ఉంటుంది అని”. సుబ్బుశాస్త్రి మనసులో అనుకున్నాడు.


ఉరకలేస్తూ ఉప్పొంగు తున్న గోదావరిని చూస్తూ “తల్లీ,ఏదోచాపల్యంతో నేనన్న మాటలు పట్టించుకోకుండా, కన్నతల్లిలా వాత్సల్యం  చూపించి నన్ను  కరుణించావు.” అంటూ భక్తిగా నమస్కరించాడు, సుబ్బుశాస్త్రి.


గోదావరి నిండుగా  నవ్వి,నేనున్నానని  ప్రేమగా నిమిరినట్లు అనిపించింది సుబ్బుశాస్త్రి కి.


*సేకరణ: కెయస్వీ కృష్ణారెడ్డి, 9492146689*

*ప్రధానోపాధ్యాయులు, జిల్లా పరిషత్ ఉన్నత* *పాఠశాల గంటి, కొత్తపేట *మండలం తూర్పుగోదావరి.*

www.bestsocialteacher.com 

********

_*

🌏🙏💐🙏💐🙏💐🙏🌏

స్థానాల్నీ నిర్ణయించేది ప్రకృతే!

 🛕🦢 *knvr* 🦢🛕

************************

       *శుభోదయం* 

       *సోమవారం* 

************************


🔥అడవిలో పెద్ద కొండ ఒకటి ఉండేది. ఆ కొండ మీద అనేక రకాల వృక్షజాతులు జీవనం సాగిస్తూ ఉండేవి. ఆ కొండ మొదట్లో చాలా పురాతనమైన చెట్టు ఒకటి ఉండేది. అన్ని చెట్లకంటే అది బలంగాను, చాలా ఎత్తుగాను ఉండేది. దాని ఆకులు కూడా చాలా పెద్దవిగా, చాలా సుందరంగా ఉండేవి. అంతే కాక దాని పూలు, పళ్ళు కూడా చాలా అందంగాను, మధురంగాను ఉండేవి. ఆ వృక్షరాజపు కొనకొమ్మకు చివరన- అన్నింటికంటే పెద్దఆకు ఒకటి ఉండేది. చల్లటి గాలులు మెల్లగా జోల పాటలు పాడుతుంటే అది హాయిహాయిగా కొమ్మ ఉయ్యాలలూగేది. 'ఇంతకు మించి ప్రపంచంలో మరే ఆనందమూ లేదు. ఇదే స్వర్గం' అనుకుంటుండేది. 'ఎప్పటికైనా తను నేల రాలాల్సిందే'అన్న నిజాన్ని మరిచిపోయి, ఆ తాత్కాలిక సుఖంలో ఓలలాడేది.అదే కొండ శిఖరంమీద మట్టిగడ్డ ఒకటి ఉండేది. ఎత్తైన ప్రదేశంలో ఉండీ ఉండీ , దానిలో 'తాను ఉన్నతమైనది' అన్న భావన స్థిరపడిపోయింది. హోరునవీచే గాలులు దానికి సుమధుర సంగీతంలా తోచేవి. 'తనను మించినది ప్రపంచంలో మరేదీ లేదు' అన్న ఆనందంతో అది ఎప్పుడూ పులకరించిపోతుండేది.ఒక రోజున గాలులు ఉధృతంగా వీచాయి. గాలి తాకిడికి మట్టిపెళ్ల విరిగింది. అంత ఎత్తు నుండి పర్వత పాదం వరకూ పడ్డది. ఉన్నతమైన తన స్థానం కోల్పోయినందుకు, పర్వతాగ్రం నుండి కిందికి దిగి రావల్సి వచ్చినందుకు అది విపరీతంగా బాధపడింది. గాలిని బాగా తిట్టుకున్నది. వీలైనన్ని శాపనార్థాలు పెట్టింది. ఇంతలో, చెట్టు కొనకొమ్మన ఆనందంలో ఊగిసలాడుతున్న ఆకు కూడా ఆ గాలికి కొమ్మనుండి వేరైంది. అది కూడా నేల రాలింది. తనకు చాలా అన్యాయం జరిగిందనిపించింది దానికి. కోపమూ, ఏడుపూ ఒకేసారి కమ్ముకురాగా అది ఎంతో విచారించింది. అలాగే గింగిరాలు తిరుక్కుంటూ కొట్టుకుపోతుంటే, వేరే ఎక్కడినుండో తిట్లు వినబడ్డాయి దానికి. అటు పోయి చూస్తే, అక్కడ ఉన్నది మట్టిగడ్డ! 'ఎందుకు, అంత బాధ పడుతున్నావు?'అని దాన్ని అడిగింది ఆకు. అలా అవి రెండూ ఒకదానికొకటి గత జీవిత వైభవాన్ని గురించీ, ప్రస్తుతకాలపు కష్టాలను గురించీ చెప్పుకున్నాయి. అట్లా తమ బాధల్ని పంచుకోవటం‌వల్ల, రెండింటి హృదయాలూ కొంత తేలిక పడ్డాయి. త్వరలోనే రెండూ మంచి మిత్రులయ్యాయి. రెండూ ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాయి: మట్టిపెళ్ల అన్నది, "ఒకవేళ వర్షం వస్తే, నాపైన నువ్వు ఉండి, నేను కరిగిపోకుండా కాపాడు" అని. ఆకు అన్నది, "తీవ్రమైన గాలులు వచ్చినప్పుడు, నువ్వు నామీద ఉండి, నేను ఎటూ కొట్టుకుపోకుండా చూడు" అని. ఇద్దరికీ లాభమే! తమ భద్రతకు ఇక తిరుగులేదనుకున్నాయి రెండూనూ. ఆ ఆనందంలో ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నాయి. 

కానీ ఏం చెప్పాలి, వాటి సంతోషం మూడు గంటల ముచ్చటే అయ్యింది. కొద్ది సేపటికే ప్రకృతి విలయ తాండవం మొదలెట్టింది. భయంకరమైన గాలివాన ప్రారంభమైంది. ఆ హడావిడిలో ఎవరు ఎవరిని రక్షించాలో మిత్రులిద్దరికీ అర్థం కాలేదు. ఆకు గాలికి కొట్టుకుపోయి, ఎక్కడో చిక్కుకుని చినిగిపోయింది. మట్టి పెళ్ల వానకు ముద్దై పుడమిలో కలిసిపోయింది.

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🏵️🏵️


 *నీతి* 

మన స్థానాలను మనం ఎంత భద్రంగా పెట్టుకోవాలనుకున్నా, చివరికి అందరి స్థానాల్నీ నిర్ణయించేది ప్రకృతే!

💖💖💖💖💖💖💖🌱🌱🌱🌱🌱🌱🌱

యుద్ధ కాండ సర్గ వ 18 శ్లోకం 35.

 *శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష..!!*


*సకృదేవ ప్రపన్నాయ*

*తవాస్మీతి చ  యాచతే*

*అభయం సర్వభూతేభ్యో*

*దదాంయేతద్ వ్రతం మమ.*


(యుద్ధ కాండ  సర్గ  వ 18 శ్లోకం 35.)


ఈ శ్లోకం రామాయణం మొత్తం లోకి సార భూతమైన శ్లోకము. శ్రీరామచంద్రుడు జీవులదరికీ ఇచ్చిన వాగ్దానం ఇది. 


ఈ శ్లోకంలో అభయం అనే మాట ఒకటి ఉంది. దాని అర్థం తెలుసుకోవాలి అనుకుంటే, భయ కారణా లేమిటో ముందుగా తెలుసుకోవాలి. సాధారణంగా అభయం అంటే శత్రువుల నుంచి భయం లేకుండా ఉండడం అనుకుంటాము. వేదాంత పరిభాషలో శత్రువులు అంటే అరిషడ్వర్గాలు ( కామక్రోధాలు వగైరా. అరి అంటే శత్రువు అని అర్థం). ఇవి లోపలి శత్రువులు.  వీటివల్లనే బయట శత్రువులు తయారవుతారు. కామం వల్ల రావణాసురుడికి రాముడితో  వైరం. లోభం వల్ల దుర్యోధనుడికి పాండవులతో వైరం. ప్రపంచంలో ఎక్కడ ఏ తగాదా వచ్చినా చూడండి అక్కడ పైన చెప్పిన ఆరింటిలో ఏదో ఒకటి ఉంటుంది.


శత్రుభయం తీసేస్తే మిగిలింది అనుకోని ఆపదలు. భూకంపాల నుంచి భయము. వరదల నుంచి భయము. ఆఖరలో దరిద్రం నుంచి భయము. రోగాల నుంచి భయము. అన్నిటి కంటే పెద్ద భయం, మృత్యువు నుంచి.


ఉన్నది పోతుందేమో, కోరుకునేది రాదేమో అనే చిన్న భయాల దగ్గరనుంచీ, చని పోతానేమో అనే భయము, చనిపోయిన తర్వాత ఏమి అవుతుందో అనే  భయం దాకా అన్ని భయాలకు శ్రీరాముడు ఇస్తానన్న ఈ అభయం జవాబు చెప్ప గలదు. అది అంత శక్తివంతమైన అభయము. *భగవద్గీతలో  "యోగక్షేమం వహామ్యహం" అన్న మాట*  ఏదైతే ఉందో ( భగవద్గీత 9 వ  అధ్యాయం 22 వ  శ్లోకం) అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది.


అభయం ఎవరికి ఇస్తాను ఎప్పుడు ఇస్తాను అనేది భగవంతుడు స్పష్టం చేశాడు.  అభయాన్ని ఆయన ప్రపన్నులకు ఇస్తా నన్నాడు.  ప్రపన్నులు అంటే శరణు కోరే వాళ్ళు. వాళ్లు కనుక ఆయనతో తవాస్మి అని అంటే వాళ్లకు అభయం ఇస్తాను అనేది ఆయన ప్రతిజ్ఞ.  తవాస్మి అంటే నేను నీ వాడిని అని భగవంతుడితో అనడం. తవాస్మి అన్నా ప్రపద్యే అన్నా ఒకటే.  సకృదేవ అంటే ఒకసారి అంటే చాలు అని. యాచతే అంటే దీనంగా అడగడం. "అన్నీ వదిలిపెట్టి నిన్నే నమ్ముకున్నాను అంటూ దీనంగా శరణం కోరిన వారికి నేను అభయమిస్తాను."  భూతేభ్యో అంటే అందరి నుంచి అని అందరి కొరకు అని రెండర్థాలు ఉన్నాయి. అలా అన్న వాళ్లందరికీ అభయమిస్తానని ఒకటి. ఎవరినుంచైనా నీకు అభయమిస్తానని ఇంకొకటీ అర్ధాలు. శరణాగతికి ఆరు లక్షణాలు ఉన్నాయంటారు.ఈ శ్లోకంలో అవన్నీ సూచనగా ఉన్నాయి.  


*అన్యధా శరణం నాస్తి*

*త్వమేవ శరణం మమ*

*తస్మాత్ కారుణ్య భావేన*

*రక్ష రక్ష జనార్ధన.*


ఇది ప్రసిద్ధమైన శరణాగతి శ్లోకం. ఈ మాట అనేస్తే భగవంతుడు  అభయ మిస్తాడా? చాలా సులభంగా అనిపిస్తుంది. అడవులకు వెళ్లి నియమాలతో తపస్సు చేయడం కంటే ఇది సులభం. కానీ ఇక్కడ కొన్ని జాగ్రత్తలు చెప్పాలి.


భగవంతుడు  మనతో   ఒక ఒప్పందానికి వచ్చాడు.  ఆ  ఒప్పందానికి సంబంధించిన నియమాలు ఇట్లా ఉన్నాయి.    మనం కనుక సత్యమైన శరణాగతి చేస్తే ఆయన సత్యమైన అభయం ఇస్తాడు. మనం కనుక దొంగ శరణాగతి చేస్తే ఆయన కూడా దొంగ అభయం ఇస్తాడు. మనం తాత్కాలిక శరణాగతి చేస్తే తాత్కాలిక ఆభయం వస్తుంది. శాశ్వత శరణాగతి చేస్తే శాశ్వత అభయం వస్తుంది. పిండి కొద్దీ రొట్టె.  మనం ఎంత పిండి ఇస్తే ఆయన మనకు  దానికి సరిపడా రొట్టె చేసి ఇస్తాడు. ఇందులో కల్తీలు మోసాలు ఆయన వైపు నుంచి ఉండవు. మనం ఇచ్చే పిండిలో కల్తీలు, కొలతల్లో తప్పులూ మొదలైనవి లేకుండా మనమే జాగ్రత్తపడాలి. ఈ నియమాలు  భగవద్గీతలో 4వ అధ్యాయం 11 వ శ్లోకం మొదటి పాదంలో ఉన్నాయి. కాబట్టి శరణాగతి అనేది మనసు లోపల్నుంచి ఆర్తితో నిజాయితీతో రావాలి. అప్పుడే అది ఫలిస్తుంది.


అభయము అంటే శ్రీరామరక్ష. రక్షణ మాత్రమే ఇస్తే ఎట్లా మిగిలిన కోరికలు తీరవద్దా అని సందేహ పడతారేమో. అట్లా ఉండదు. గదిలో పెట్టి తాళం పెట్టి, రక్షిస్తాను అన్న వాడు మనకు అవసరమైన అన్నమూ మనకు కావలసిన కాలక్షేపమూ మొదలైన వన్నీ ఏర్పాటు చెయ్యాలి కదా. అవి లేకపోతే రక్షణకు అర్థమే ఉండదు. కాబట్టి అవన్నీ ఆయనే చూసు కుంటాడు. యోగక్షేమం వహామ్యహం అంటే అదే మరి.


మనం ఇప్పుడు చర్చించుకుంటున్న శ్లోకం రామాయణంలో విభీషణుడికి అభయ ప్రదానం చేసే ఘట్టం లోనిది. విభీషణుడు శరణాగతి చేసేటప్పుడు అవి కావాలివి ఇవి కావాలి అని కోరుకోలేదు. విభీషణుడికి అభయం లభించిన తరువాత లంకా సామ్రాజ్యం మొత్తం లభిస్తుంది. చిరంజీవిగా ఉండే భాగ్యం కూడా లభిస్తుంది. శ్రీరాముడు అడగకుండా అవన్నీ ఇచ్చాడు.  ఎవరికైనా అంతకు మించి "యోగక్షేమం" మరేమి ఉంటుంది. శ్రీరామరక్ష అంటే అది. 


పురాణాలలో ప్రహ్లాదుడు అంబరీషుడు బలి చక్రవర్తి గజేంద్రుడు వీళ్లంతా శరణాగతి చేసి భగవంతుని రక్షణ లోకి వచ్చినవాళ్లు. అయనను నమ్మి బాగు పడినవాళ్లు.


*రాముడు మాట ఇచ్చేశాడు. ఆయన మాట తప్పడు. ఇప్పుడు మనమేం చేయాలి అన్నది ప్రశ్న.* 


*పవని నాగ ప్రదీప్.*

కేతువు యెుక్క అగ్ని తత్వము

 కేతువు యెుక్క అగ్ని తత్వము జీవునిగా అనగా కేశవ శక్తి మెుదటి అవతార శక్తియని అది కేతుకాగ్నియని *కమగ్నించనుతే*యని వేదం పదే పదే సమస్త ప్రకృతిలోగల అగ్నిని తెలుపు చున్నది.  అచ్చటినుండి వివిధ రూపములుగా వ్యాప్తి యని వసు, రుద్ర వరుణ ,పర్జన్య, రస, రూప గంధ, వర్ణ, వ్యాప్తమై పదార్ధ లక్షణమని అరుణ ప్రశ్న. మంత్ర పుష్పం, మహాశౌరం, యిలా ఎన్నో విధములుగా ప్రకృతి తత్వానికి సృష్టి పరిణామమును అగ్నిమూలమని  తెలుపుచున్నది. కేతుకాగ్ని, కేతు రూపంలో గల క జీవాగ్ని రూపములో జీవుని వునికి యని తెలియుచున్నది.కేతుక,నచితుకేతుక అగ్ని యని, పుట్టుక, మరణము జీవలక్షణమును, నచికేతు, యముని సంవాదం ద్వారా ద్వారా తెలియబడినది.అందవలననే నచికేతుకాగ్నిగా కూడా తెలియబడినది. అది  నచికేతుకాగ్ని, కేతుకాగ్ని రూపంలో గల  చిత్  మనస్సుతో జీవుడు సాధన చేయుటయేఅగ్ని చైతన్య ప్రకృతి రూప ఆరాధన. ప్రకృతి ఆరాధనయే జీవ లక్షణమని కూడా తెలుపుచున్నది. మనిషి మనుగడ ప్రకృతితో ముడి పడి యున్నది. ప్రకృతి వినాశనం జీవ వినాశనం. దైవ శక్తియైననూ మానవ రూపం చెంది వివిధ రూపములలో మానవ పరిణామమును తెలియుటయే ఙ్ఞానమని అదే అంతిమ లక్ష్యం.అది అఙ్ఞానమును విడిచి ఙ్ఞానపరమైన పదార్ద ప్రత్యక్ష నిరూపణ. అగ్ని రూపంలోనే ఏక్రియయైనా.ఎవరైనా ఆఖరికి భగవంతం శక్తి కూడా మానవ రూపంలో అగ్నిని ఆరాధనయేజీవ ప్రకృతినిఆరాధన అగ్ని కావ్యం చేయాలి. ప్రత్యక్షంగా అగ్నిని ఆరాధన చేయుట మానవ జీవనంలో ముఖ్య భాగం.అది ఏరూపంలోనైనా. అగ్నిలేని జీవితం వ్యర్ధం. దాని మూల పదార్ధ చైతన్య తత్వము ద్వారానే దాని లక్షణము తెలియును. అదే మానవ జీవనమునకు ముఖ్యం. మహాశౌరంలో పూర్తి వివరణ లేదు. అది నక్షత్ర శక్తి ద్వారా గ్రహ శక్తి తద్వారా పదార్ద రసరూప గంధములను సూత్ర పరంగానే వారు తప్ప వివరంగా పూర్తిగా తెలుపలేదు. దాని పూర్తి వివరణ అరుణ ప్రశ్న. అదే అగ్ని లక్షణము, అగ్ని తత్వం. దానిని అరుణ ప్రశ్న ద్వారా యింకా వివరంగా తెలిపియున్నది. వినడంలోనే కొన్ని విషయములు అవగాహన కలుగును. దేనికైనా శక్తియే మూలం దాని రూపమును మరే విధంగా తెలియుటకు వీలులేదు. క్రియారూపమే శక్తి చైతన్య నిర్వచనం. మనం చేయు పనిని బట్టి శక్తి పరిమాణము తెలియవచ్చును.  విష్ణువు నక్షత్రం శ్రవణం ద్వారా. శబ్ద శక్తిని తెలుసుకొనుట, వినటం వలననే యని, విష్ణువ్యాప్తమే జీవ శక్తి వ్యాప్త మైన ప్రకృతికి మూలం.  ప్రకృతి అంతా కేతుమయంగా అనగా కేశవ మయమేయని తెలుపుచున్నది. దానికి మూలం అగ్ని.అనంతమైన ప్రకృతి, ఙ్ఞాన సంబంధ విషయాలను తెలుసుకుంటూనే వుందాం.ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*శరీర త్యాగానికి సన్నద్ధం..*


*(యాభై ఎనిమదవ రోజు)*


శ్రీ స్వామివారి ధ్యాసంతా సజీవ సమాధి చెందడం మీదే ఉన్నది..పదే పదే శ్రీధరరావు దంపతులతో ఆ మాటే చెప్పడం..వాళ్ళు నిరాకరించడం జరుగుతోంది..కానీ శ్రీ స్వామివారు మాత్రం ఒకమాట స్పష్టం చేయసాగారు..సజీవ సమాధి జరిగినా జరుగకపోయినా.. తన అంత్యకాలం సమీపించిందనీ..తాను ఈ శరీరం విడిచిపెట్టక తప్పదని..


శ్రీధరరావు గారు శ్రీ చెక్కా కేశవులు గారికి, మీరాశెట్టి గారికి కబురు పెట్టి పిలిపించారు.. వారు మొగలిచెర్ల కు  చేరుకున్న తరువాత..శ్రీధరరావు దంపతులు..తమతో శ్రీ స్వామివారు వెలిబుచ్చిన కోరికను గూర్చి తెలియచేసి..ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా అని అడిగారు..వాళ్లిద్దరూ కూడా తాము ఒకసారి శ్రీ స్వామివారితో మాట్లాడతామని..తాము శ్రీ స్వామివారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తామని తెలిపారు..శ్రీధరరావు గారు అప్పటికప్పుడే గూడు బండి సిద్ధం చేయించి..కేశవులు గారిని, మీరాశెట్టి గారినీ శ్రీ స్వామివారి వద్దకు పంపారు..


శ్రీ స్వామివారు తన మనోభీష్టాన్ని వారికి తెలియచేసి..తనను సజీవ సమాధి చేయడానికి సహకరించమని కోరారు..కేశవులు గారు కొద్దిగా అసహనంతో.."స్వామీ!..మీరు ఇలా మంకు పట్టు పడితే ఎలా?..మీలాటి వారు ఉండబట్టే మాలాటి వాళ్లకు ఆధ్యాత్మిక భావనలు కలుగుతున్నాయి..మీ తపస్సుకు ఇబ్బంది లేకుండా ఇక్కడికి మల్లె..మా ఇంటివద్ద  అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను..విజయవాడ వచ్చి కొద్దిరోజుల పాటు వుండండి.. మాలాంటి వారికి బోధ చేయండి..మీకూ మార్పు ఉంటుంది.." అని ఎంతో దూరం చెప్పారు..మీరాశెట్టి గారు కూడా సౌమ్యంగా నచ్చచెప్పబోయారు..


శ్రీ స్వామివారు ఇద్దరి మాటలూ శ్రద్ధగా విన్నారు..వింటున్నంత సేపూ ప్రశాంతంగా వున్నారు..వాళ్ళు చెప్పడం ఆపైన తరువాత..ఆశ్రమ వరండా లో పద్మాసనం వేసుక్కూర్చుని..


"ఇద్దరూ వినండి..నేను ఏదో తమాషా చేద్దామని సజీవ సమాధి ప్రస్తావన తీసుకురాలేదు..మీరందరూ నా తపోసాధనకు ఎంతో భక్తి తో సహకరించారు..నానుంచి మీరు ఆశించింది కూడా ఏమీ లేదు..నిజానికి ఈ మీరాశెట్టి కి సంతాన యోగం లేదని ముందుగానే నేను చెప్పినా..తన కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధి గా చేసాడు..కేశవులు గారూ మీరూ అంతే!..ఇక ఆ దంపతుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు..మీకూ తెలుసు..కానీ మీరందరూ ఒక్క విషయాన్ని దాట వేస్తున్నారు..అది నా ఆయుర్దాయం గురించి..నాకు ఆయుష్షు కొద్దికాలమే ఉన్నది..అది పూర్తయితే నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి..అది విధి నిర్ణయం..మీరు ఊహిస్తున్నది నేనేదో బలవంతంగా సజీవ సమాధి పేరుతో ఆత్మత్యాగం చేయబోతున్నానని..అది నిజం కాదు..దైవం నాకు నిర్దేశించిన గడువులోపల నా తపస్సు పూర్తి చేసుకోవాలి..ఆ తరువాత ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు.."


"ఇక బోధల గురించి...శరీరం తోనే బోధ చేయాలనే నియమేమీ లేదు..అలా అనుకుంటే..కాలగర్భంలో కలిసిపోయిన మహనీయులందరూ నేటికీ శరీరధారులై ఉండాలి..నేను సమాధి చెందిన తరువాత నా సమాధి నుండే మీకు సమాధానం వస్తుంది..ఈ ఆశ్రమం క్షేత్రంగా మారుతుంది..ఎందరికో వారి వారి బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఇక్కడ..సంతానహీనులు సంతానాన్ని పొందుతారు..మానసిక రుగ్మతలు తొలగిపోతాయి..దుష్టగ్రహపీడలు నశిస్తాయి.."


"మీరు మనస్ఫూర్తిగా నా సజీవ సమాధి కి ఇష్టపడకపోతే..నేను ప్రత్యామ్నాయం చూసుకుంటాను..దైవ ధిక్కారం చేయను..చేయలేను.." అన్నారు నిర్వికారంగా చూస్తూ..


శ్రీ స్వామివారి మాటలు విన్న కేశవులు, మీరాశెట్టి గార్లు..ఇక చేసేదేమీ లేక..సెలవు తీసుకొని తిరిగి శ్రీధరరావు గారింటికి చేరారు..శ్రీధరరావు ప్రభావతి గార్లతో తమ సంభాషణ అంతా చెప్పారు..తాము ఎట్టి పరిస్థితుల్లో శ్రీ స్వామివారిని సజీవంగా సమాధి చేయరాదని అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు..


కానీ అక్కడ శ్రీ స్వామివారు తన ఏర్పాట్లలో తాను ఉన్నారనే విషయం వీళ్లకు తెలియదు..తాము ఒప్పుకోలేదు కనుక, శ్రీ స్వామివారు సజీవ సమాధి  ఆలోచనను మానుకొని..తపస్సు చేసుకుంటూ వుంటారులే !..అనే భ్రమలో వున్నారు..


సోదరుడు పద్మయ్య నాయుడు కి సూచనలు..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699)