14, జూన్ 2021, సోమవారం

కేతువు యెుక్క అగ్ని తత్వము

 కేతువు యెుక్క అగ్ని తత్వము జీవునిగా అనగా కేశవ శక్తి మెుదటి అవతార శక్తియని అది కేతుకాగ్నియని *కమగ్నించనుతే*యని వేదం పదే పదే సమస్త ప్రకృతిలోగల అగ్నిని తెలుపు చున్నది.  అచ్చటినుండి వివిధ రూపములుగా వ్యాప్తి యని వసు, రుద్ర వరుణ ,పర్జన్య, రస, రూప గంధ, వర్ణ, వ్యాప్తమై పదార్ధ లక్షణమని అరుణ ప్రశ్న. మంత్ర పుష్పం, మహాశౌరం, యిలా ఎన్నో విధములుగా ప్రకృతి తత్వానికి సృష్టి పరిణామమును అగ్నిమూలమని  తెలుపుచున్నది. కేతుకాగ్ని, కేతు రూపంలో గల క జీవాగ్ని రూపములో జీవుని వునికి యని తెలియుచున్నది.కేతుక,నచితుకేతుక అగ్ని యని, పుట్టుక, మరణము జీవలక్షణమును, నచికేతు, యముని సంవాదం ద్వారా ద్వారా తెలియబడినది.అందవలననే నచికేతుకాగ్నిగా కూడా తెలియబడినది. అది  నచికేతుకాగ్ని, కేతుకాగ్ని రూపంలో గల  చిత్  మనస్సుతో జీవుడు సాధన చేయుటయేఅగ్ని చైతన్య ప్రకృతి రూప ఆరాధన. ప్రకృతి ఆరాధనయే జీవ లక్షణమని కూడా తెలుపుచున్నది. మనిషి మనుగడ ప్రకృతితో ముడి పడి యున్నది. ప్రకృతి వినాశనం జీవ వినాశనం. దైవ శక్తియైననూ మానవ రూపం చెంది వివిధ రూపములలో మానవ పరిణామమును తెలియుటయే ఙ్ఞానమని అదే అంతిమ లక్ష్యం.అది అఙ్ఞానమును విడిచి ఙ్ఞానపరమైన పదార్ద ప్రత్యక్ష నిరూపణ. అగ్ని రూపంలోనే ఏక్రియయైనా.ఎవరైనా ఆఖరికి భగవంతం శక్తి కూడా మానవ రూపంలో అగ్నిని ఆరాధనయేజీవ ప్రకృతినిఆరాధన అగ్ని కావ్యం చేయాలి. ప్రత్యక్షంగా అగ్నిని ఆరాధన చేయుట మానవ జీవనంలో ముఖ్య భాగం.అది ఏరూపంలోనైనా. అగ్నిలేని జీవితం వ్యర్ధం. దాని మూల పదార్ధ చైతన్య తత్వము ద్వారానే దాని లక్షణము తెలియును. అదే మానవ జీవనమునకు ముఖ్యం. మహాశౌరంలో పూర్తి వివరణ లేదు. అది నక్షత్ర శక్తి ద్వారా గ్రహ శక్తి తద్వారా పదార్ద రసరూప గంధములను సూత్ర పరంగానే వారు తప్ప వివరంగా పూర్తిగా తెలుపలేదు. దాని పూర్తి వివరణ అరుణ ప్రశ్న. అదే అగ్ని లక్షణము, అగ్ని తత్వం. దానిని అరుణ ప్రశ్న ద్వారా యింకా వివరంగా తెలిపియున్నది. వినడంలోనే కొన్ని విషయములు అవగాహన కలుగును. దేనికైనా శక్తియే మూలం దాని రూపమును మరే విధంగా తెలియుటకు వీలులేదు. క్రియారూపమే శక్తి చైతన్య నిర్వచనం. మనం చేయు పనిని బట్టి శక్తి పరిమాణము తెలియవచ్చును.  విష్ణువు నక్షత్రం శ్రవణం ద్వారా. శబ్ద శక్తిని తెలుసుకొనుట, వినటం వలననే యని, విష్ణువ్యాప్తమే జీవ శక్తి వ్యాప్త మైన ప్రకృతికి మూలం.  ప్రకృతి అంతా కేతుమయంగా అనగా కేశవ మయమేయని తెలుపుచున్నది. దానికి మూలం అగ్ని.అనంతమైన ప్రకృతి, ఙ్ఞాన సంబంధ విషయాలను తెలుసుకుంటూనే వుందాం.ఆచరిస్తూనే వుందాం.

కామెంట్‌లు లేవు: