5, ఏప్రిల్ 2020, ఆదివారం

అసంకల్పిత ప్రతీకార చర్య

 ప్రతి జీవికి భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప శక్తీ ఈ అసంకల్పిత ప్రతీకార చర్య. మనకు తెలియకుండానే మనం మనలను కాపాడుకోటమే ఈ అసంకల్పిత ప్రతీకార చర్య అంటే.  దీనిని వివరిస్తాను. మనము తెలియకుండా ఏదైనా ఒక వస్తువును ముట్టు కున్నామనుకోండి అది మనం భరించనంత వేడిగా ఉంటే మన శరీరం మనకు తెలియకుండానే దాన్ని వదలి దూరంగా వెళ్ళుతుంది.  ఈ రకమైన చర్య మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది.  అందుకే దీనిని మనం అసంకల్పిత ప్రతీకార చర్య  అని అంటాం. 
ఇక మనకు ప్రమాణం ఆయన దానిని బట్టి మనం జాగ్రత్త పడటం.  ఉదా : ఒక క్రూర జంతువు, ఒక విష జంతువును చూసిన వెంటనే మనం అక్కడి నుండి పరిగెడతాం.  దానికి ప్రమాణం మనకు ఆ జంతువు మన ప్రాణాన్ని తీసి వేస్తుంది అంటే మనకు ప్రాణ హాని ఉందని మనం తెలుసుకొని జాగ్రత్త పడతాము.  ఇలా జాగ్రత్త పడటానికి మనకు ప్రత్యక్ష  ప్రమాణం అవసరం లేదు పరోక్ష ప్రమాణమే మనం ప్రమాణంగా తీసుకుంటాం. ప్రత్యక్ష  ప్రమాణం అంటే మనం ఏదైతే స్వతంత్రంగా అనుభవంలోకి తెచుకుంటామో అది స్వప్రమాణం. అంటే ఉదా: మనం ఒక అరిటి పండు తింటాం అది తియ్యగా వుంది.  ఆ విషయం మనం అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాం.  అదే వేరే ఎవరో చిప్పినదానిని నమ్మటం పరోక్ష ప్రమాణంగా మనం చూడ వచ్చు. ఒక పాము కాటు వేస్తే మనిషి చనిపోతాడు దానికి ప్రమాణం వేరే ఎవరో పాము కాటుకు బలి ఆయన వాళ్ళ  ప్రమాణం. ఈ జ్ఞ్యానం మనం యితరుల అనుభవంతో తెలుసు కున్నాము.  నిజానికి ప్రత్యక్ష ప్రమాణం పరోక్ష ప్రమాణం రెండు ప్రమాణాలే. కానీ మనం ప్రత్యక్ష ప్రమాణంకు ఇచ్చిన ప్రాధాన్యత పరోక్ష ప్రమాణంకు ఇవ్వము.  దానికి కారణం స్వానుభవం లేక పోవటమే.  కానీ మనం రెండు కుడా సమానమైన ప్రమాణాలుగా తీసుకోటం మంచిది. 
ఇప్పుడు ప్రపంచమంతా వుడికిస్తున్న వణికిస్తున్న ఈ కరొనకు ప్రత్యక్ష ప్రమాణాలకోసం చూడకండి కేవలం పరోక్ష ప్రమాణాలనే నమ్మాలి. అప్పుడే మనం ఈ కరోనాను పారద్రోలవచ్చు.  కరచాలంతో, స్పర్శతో, తాకిడితో అంటే ఆ వైరస్ వున్నా ప్రదేశాన్ని ఏదయినా వస్తువు కానీ స్థలం కానీ తాకటం వల్ల సంక్రమిస్తుందని వైదులు చూపుతున్నారు.  మనం వినాలి తప్పకుండ పాటించాలి.  అంతే కానీ మనం ఏమాత్రం ఏమరుపాటు వహించి ప్రత్యక్ష ప్రమాణాలకోసం చూశామా ఇక ఇంతే సంగతులు ఆ వైరస్ కదిలిస్తుంది.  కాబట్టి ప్రపంచంలో వుండే ప్రతి మానవునికి చెప్పేది ఏమిటంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇతరులను తాకటం అంటే పైన చెప్పిన వాటికి దూరంగా ఉండాలి. మనల్ని మనం కాపాడు కోవాలి. 
ఈ ప్రపంచంలో వున్నా వారంతా క్షేమంగా వుండాలని కోరుకుంటున్నాను. 
ఓం శాంతి శాంతి శాంతిః