ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
25, ఆగస్టు 2025, సోమవారం
మహాకవి మయూరుడు🙏
మహాకవి మయూరుడు🙏
రెండవ భాగం
“భక్త మయూర వక్త్రాబ్జ పదవిన్యాస శాలినీ నర్తకీవవరీవర్తి సభా మధ్యే సరస్వతీ” అని జయ మంగళుడు మయూరుని కీర్తించాడు. భక్తుడైన మయూరుని ముఖపద్మంపై పదవిన్యాసం చేస్తున్న సరస్వతి సభలో నర్తకిలా అతిశయంగా ఒప్పుతున్నదని భావం. రాజశేఖరుడు మయూరుని ఇలా శ్లాఘించాడు:
“దర్పం కవి భుజంగానాం గతా శ్రవణ గోచరం
విషవిద్యేవ మాయూరీ మయూరీ వాఙ్నికృంతతి”
భావం : నెమలి క్రేంకారం వంటి మయూరుని వాక్కు నీచకవులనే విషసర్పాల చెవిని సోకగానే విషవిద్య వలే వారి దర్పాన్ని నశింపజేస్తుంది
మయూరుని సూర్య శతకం చదివితే పై ప్రశంసల్లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదని తెలిసింది. శతకంలో ఒక్కో శ్లోకం చదువుతున్న కొద్దీ, మయూరుడు కేవలం వంద పద్యాలతో మహా కవి ఎలా అయ్యాడో అర్ధమవుతుంది . అద్భుతమైన వర్ణనలు, భాషపై సంపూర్ణమైన అధికారం, రచనా విధానంలో ప్రౌఢిమ అనితర సాధ్యంగా తోచింది. .
మయూరుని సూర్యశతకము ఊహకి అందని అద్భుత రహస్య విషయాలను చక్కని శతకంగా అందించినారు. ఇది మామూలు శతకము కాదు. దీని నిండా ఎన్నో నిధి నిక్షేపాలు ఉన్నట్లు ఎన్నో అద్భుత విషయాలు చోటు చేసుకున్నాయి. ఆరోగ్యపరంగా ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఇంక విజ్ఞానంగా చూస్తే ఈ అద్భుత విషయాల పక్క మన దృష్టి మరలి వానిలోని ఖగోళ రహస్యాలను అర్థం చేసుకోవాలి.
“జంభారీతీభ కుంభోద్భవమివ దధతస్సాంద్ర సింధూర రేణుం
రక్తాస్సిక్తా ఇవౌఘై రుదయతటీ ధాతు ధారాద్రవస్య
ఆయాంత్యా తుల్య కాలం కమలవన రుచేవారుణా వో విభూత్యై
భూయాసు ర్భాసయంతో భువనమభినవా భానవో భానవీయాః || “
జంభ + అరాతి + ఇభ + కుంభ + ఉద్భవం = ఇంద్రుని వాహనమైన ఐరావతం యొక్క కుంభస్థలం నుండి పుట్టిన
సాంద్ర సింధూర రేణుం = దట్టమైన సింధూరపు ధూళిని
దధతః ఇవ = ధరించినట్లు
ఉదయ గిరి తటీ = తూర్పు కొండ చరియలందు
ధాతు ధారా ద్రవస్య = ధాతువుల యొక్క రసధారలయొక్క
ఓఘైః + సిక్తాః + రక్తాః ఇవ = ప్రవాహం చేత తడుపబడి ఎర్రని రంగును కలిగినట్లు
తుల్యకాలం = అదే సమయంలో (సూర్యోదయంతో బాటుగా)
ఆయాంత్యా = వచ్చుచున్నటువంటి
కమల వన రుచా = పద్మవనం యొక్క కాంతిచే
అరుణాః ఇవ = ఎర్రనైనవిగా ఉన్నటువంటి
భువనం + భాసయంతః = ముల్లోకాలను ప్రకాశింప చేయుచున్నవై
భానవీయాః = సూర్యుని యొక్క
భానవః = కిరణాలు
వః = మీ యొక్క
విభూత్యై = ఐశ్వర్యము కొరకు
భూయాసుః = అగును గాక
తాత్పర్యం: సూర్యకిరణాలు ఐరావతం కుంభస్థలంనుండి పుట్టిన సింధూరపు ధూళికమ్ముకున్నట్లు ఉన్నాయి. ఉదయం స్వర్గంనుండి బయలుదేరినప్పుడు స్వర్గలోకపు వస్తువులతో పోలిక అన్నమాట. తరువాత తూర్పు కొండ చరియల లోని గైరికాది ధాతువుల ద్రవాలచే తడిచి ఎర్రబడినవా అన్నట్లు కనబడుతున్నాయి. తరువాత సూర్యుని రాకతో బాటే వికసించిన పద్మ వనంయొక్క ఎర్రని కాంతితో ఎర్రబడినట్లు కనిపిస్తున్నాయి. భూమిని చేరిన కిరణాలు అలా కనిపిస్తున్నాయన్న మాట. ఈ విధంగా ముల్లోకాలను ప్రకాశింపజేస్తున్న భానుని కిరణాలు మీ అందరి సంపదలకూ కారణమగు గాక!
సూర్యునికిరణాలు ఎలాగున్నాయంటే జంభునితోవైరమున్న ఇంద్రునికి చెందిన ఐరావతం యొక్క కుంభస్థలమును తమ ఉత్పత్తిస్థానంగా చేసుకొనియున్న దట్టమైన సింధూరరేణువులవలే భాసిస్తున్నాయట. గోదావరి నాసికాత్ర్యంబకంలో మొదలైనట్లుగా. అరుణవర్ణము తలంపుమాత్రముననే మంగళదాయకం. ఎంచేతంటే అమ్మవారు “అరుణాం కరుణాతతంగితాక్షీం” కదా. అంటే అమ్మవారు కారుణ్యానికి తత్తుల్యము మరియు సంకేతము. అలాగే “ఇందతి ఇతి ఇంద్రః”. పరమైశ్వర్యయుక్తుడు.
భానవో భానవీయాః’ అన్నది ఎంత సుందర పద ప్రయోగమో గమనించండి! ఇలాంటి శ్లేషాలంకార పద ప్రయోగాలు, శబ్దాలంకారాలు శతకంలోని ప్రతి పద్యంలోనూ కనిపిస్తాయి. పై పద్యంలో “మీ అందరికీ శుభాలు కలుగు గాక” అని చెప్పడాన్ని బట్టి తన కుష్ఠువ్యాధిని పోగొట్టుకోవడానికి ఈ శతకం చెప్పలేదనే భావన కలుగుతుంది
వ్యగ్రైరగ్ర్య గ్రహేన్దుగ్రసనగురు భరైర్నో సమగ్రైరుదగ్రైః
ప్రత్యగ్రైరీషదుగ్రైరుదయగిరిగతో గోగణైర్గౌరయన్ గామ్
ఉద్గాఢార్చిర్విలీనామరనగరనగగ్రావగర్భామివాహ్నా
మగ్రే శ్రేయో విధత్తే గ్లపయతు గహనం స గ్రహగ్రామణీర్వః
అర్థం
యః = ఏ సూర్యుడు
ఉదయగిరి గత: = ఉదయ పర్వతాన్ని పొందినవాడై
వ్యగ్రైః = అంతటా ప్రసరించుచున్నట్టియు
అగ్ర్య = తూర్పు దిక్కునందున్న
గ్రహ = గ్రహాలైన
ఇందు = చంద్రుడు మొదలగు వారియొక్క
గ్రసన = తిరస్కరించుట యొక్క
గురుభరైః = గొప్ప భారం కలవియును,
నో సమగ్రైః = సంపూర్ణములు కానివియును
ఉదగ్రైః = పెద్దగా పెరుగుచున్నట్టియును
ప్రత్యగ్రైః = వినూత్నములైనట్టియును
ఈషత్ + ఉగ్రైః = కొద్దిగా వేడిని కలిగినట్టివియును
గోగణైః = కిరణ సమూహములచే
అహ్నాం + అగ్రే = పగళ్ళ యొక్క ప్రారంభమున (ఉదయ కాలంలో)
గాం = భూమిని
ఉద్గాఢ = మిక్కుటమైన
అర్చిన్ = కాంతులలో
విలీన = కలిసి పోయిన
గ్రావ గర్భాం = శిలలు గర్భమందు కల
అమర నగర నగ = మేరుపర్వతం యొక్క
గౌరయన్ = బంగారు రంగు కలదానిగా
శ్రేయః = శ్రీయస్సును
విధత్తే = కలిగించుచున్నాడో
సః = ఆ
గ్రహ గ్రామణీ = గ్రహ నాయకుడైన సూర్యుడు
వః = మీయొక్క
గహనం = పాపమును
గ్లపయతు = పోగొట్టు గాక
తాత్పర్యం: సూర్యుడు, ఉదయాద్రిపై ఉదయ కాలంలో చకచకా నడుస్తూ తనకు తూర్పుదిక్కునున్న చంద్రాది గ్రహాలను తన లేతకిరణాలలో వెలవెల బోయేటట్లు చేస్తున్నాడు. ఉదయ కాలం కనుక ఆ కిరణాలు సంపూర్ణం కాదు. కొంచెం వేడిగా ఉన్నాయి. పెరుగుతున్నాయి. అట్టి కిరణాలచే ఈ భూమిని, ఆ కాంతులను తమలో ఇముడ్చుకొని బంగారు రంగులో ప్రకాశిస్తున్న మేరు పర్వత శిలలు కలదానిగా చేస్తూ శ్రేయస్సును కలిగిస్తున్నాడు. అట్టి గ్రహనాయకుడైన సూర్యుడు మీ పాపాలను పోగొట్టు గాక!
ఈ పుస్తకం ఇంకా దొరుతుందో లేదో తెలియదు. ఇంత మంచి కవిత్వం సంస్కృత సాహిత్యాభిమానులకు అందుబాటులోకి రావలసిన అవసరం ఎంతైనా ఉంది.
దివః కిం బాన్ధవః స్యాత్ప్రియసుహృదథవాచార్య ఆహోస్విదర్యో
రక్షా చక్షుర్ను దీపో గురురుత జనకో జీవితం బీజమోజః
ఏవం నిర్ణీయతే యః క ఇవ న జగతాం సర్వథా సర్వదాసౌ
సర్వాకారోపకారీ దిశతు దశశతాభీషురభ్యర్థితం వః
“ఈ లోకములలో సూర్యుని ఏమని భావించాలి? దేవుడనియా? బంధువనియా? ఆచార్యుడనియా? లేక కులీనుడైన ప్రభువనియా? అది కాకుంటే సర్వలోక రక్షకుడనియా? మరి సూర్యుని లోకాలకు కన్నులాంటివాడందామా? దీపమందామా? పోనీ పూజ్యుడందామా? లేక ప్రాణమే అందామా? జన్మ కారణమందామా? పైన చెప్పినవారిలో సూర్యుడ్ని ఎవరని చెప్పగలం? నిజానికి వీరిలో ఒక్కడని సూర్యుని వర్ణించలేము. ఎందుకంటే సర్వ కాలాల్లో, సర్వ విధాలా, సర్వాన్నీ ఇచ్చేవాడు సూర్యుడు. సర్వ దేవత రూపమున, బాంధవాది రూపమున, లోకాలకు మహోపకారం కలిగించేవాడు సూర్యుడు. అతడు సర్వ దేవతా స్వరూపుడు. అట్టి సహస్ర కిరణ సూర్యుడు మిమ్ములను రక్షించు గాక!”
ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ ధనమిచ్ఛేత్ హుతాసనాత్
ఈశానాత్ జ్ఞానమన్విచ్ఛేత్ మోక్షమిచ్ఛేత్ జనార్దనాత్
అంటోంది స్కాందం. ఆరోగ్యానికి ఆదిత్యున్ని ఆశ్రయించాలి . ఐశ్వర్యానికి అగ్నిని ఆశ్రయించాలి . జ్ఞానానికి ఈశ్వరుణ్ణి ఆశ్రయించాలి . అలాగే మోక్షానికి జనార్దనుడిని ఆశ్రయించాలి . అంటే ఒక్కొక్క సంస్థానానికి ఒక్కొక్కడు అధిపతి. “వైద్యోనారాయణోహరిః“ కదా. అంచేతనే సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడయ్యాడు.
స్వస్తి
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
అమ్మేగా కనగలదు
కొన్ని నెలల క్రితం, కొత్తగా ఒక పనిమనిషి చేరింది, నాకు పనిమనిషి అన్న పదం పలకడం ఇష్టం ఉండదు, మీకందరికి అర్థం కావటానికి ఇలా రాశా, ఇక ఈ వ్యాసంలో ఈ పదాన్ని ఊయోగించను. ఆవిడ పేరు.......
మూడు నాలుగు రోజుల తరువాత అడిగా..
అమ్మా! ఎక్కడ మీ ఇల్లు, ఎంత మంది పిల్లలు అని.
ముగ్గురు అమ్మాయిలు అండి,
పెళ్లిళ్లు అయ్యాయా, లేదండి ఇంకా చదువుకుంటున్నారు.
O.K, ఏం చదువు కుంటున్నారు అని క్యాజువల్ గా అడిగా, పెద్ద అమ్మాయి M.Sc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి డిగ్రీ కాలేజ్ లో కాంట్రాక్ట్ లెక్చరర్ గా చేస్తోంది,
ఆ అంటూ నోరు తెరిచా,
రెండో అమ్మాయి M.Sc Computers మొదటి సంవత్సరం,
మూడో అమ్మాయి ఎంబీబీస్ రెండో సంవత్సరం.
ఆ అని నోరు వెళ్ల బెట్టా. నర్సింగా అన్నా,
కాదు సార్ M.B.B.S అంది.
నాకు అర్థం కావటం లేదు, ఈవిడ ఏమంటోంది,
ఏం మాట్లాడుతోంది. ఈవిడకు ఏం మాట్లాడుతోందో అర్థం అవుతోందా?
మళ్ళీ అడిగా, అవే సమాధానాలు,
M.B.B.S ఫ్రీ సీటా అని అడిగా, అవును సార్,
ఫ్రీ సీట్ యే,
అదేదో బిల్డింగ్ ఫీజ్ అంటా, దానికే తంటాలు పడుతున్నా కట్టడానికి.
ఏ స్కూలులో చదువుకున్నారు అమ్మా మీ పిల్లలు అని అడిగా?
ఇక్కడే, మన ఊరి బడి లొనే 10 వ తరగతి వరకు.
లాంగ్ టర్మ్ గట్రా వెళ్లిందా ఎంబీబీస్ అమ్మాయి అని అడిగా, ఏం లేదయ్యా, మన ఊరి కాలేజ్ యే, నాకు ఈ చదువుల గోల ఏం తెలీదయ్యా, ఇప్పుడు ఇప్పుడే కాస్త నోరు తిరుగుతోంది.
ఏం చదువుకున్నావు అమ్మా నువ్వు అని అడిగా,
రెండులో మానేశానయ్యా, నాకు కూడికలు, తీసి వేతలు కూడా రావు. చాలా కష్టాలు పడ్డాను పిల్లలను ఈ స్థాయికి తీసుకు రావటానికి.
మీ ఆయన ఏం చేస్తాడు అని అడిగా,
ఆయనా అందరి లాగే, ఇంటి విషయాలు ఏం పట్టవు.
ఆయన త్రాగుతాడు,
100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఇంట్లో ఇవ్వడం కూడా గగనం. ఇప్పుడు ఇప్పుడు కొంచం మారుతున్నడు, పాప డాక్టర్ కోర్స్ లో చేరిన తరువాత.
మా పెద్ద అమ్మాయిని ఏడో తరగతిలో చదువు మానిపించేసా, కానీ వాళ్ల టీచర్ ఇంటికి వచ్చి, నన్ను మందలించి, మంచి తెలివి గల అమ్మాయి, చక్కగా చదువు కొంటోంది అని చెప్పి బడికి తీసుకొని వెళ్ళింది. అప్పటికి అర్థం అయ్యింది నాకు, నా పిల్లలు తెలివి గల వాళ్ళు అని, నా పిల్లల చదువులు ఆగ కూడదు అని ఇంకో రెండు ఇల్లులు ఎక్కువ ఒప్పుకోవటం మొదలు పెట్టా.
ఇంట్లో సరిగ్గా కరెంట్ కూడా ఉండేది కాదు, మూడు మూడు నెలలు బిల్ కట్టలేక పోయే దాన్ని, పిల్లలు ఆలాగే బుడ్డి దీపాల్లో చదువుకున్నారు.
ఇప్పుడు కాస్త పర్వాలేదు, పెద్ద అమ్మాయి కాస్త సంపాదిస్తోంది. ఎలాగో కిందా మీదా పడుతున్నాను అంది.
నాకు నోట మాట రాలేదు. ఒక చదువుకోని మహిళ,
భర్త త్రాగుబోతు, ఇంతగా కష్టపడి పిల్లలను ఇంతగా వృద్ధిలోకి తెచ్చిందా.
లక్షలు, లక్షలు ఫీజులు పోస్తుంటే నాపిల్లలు అస్సలు చదవట్లేదు. నా పిల్లలు వీళ్ళలో సగం చదువుకున్నా చాలు అనుకున్నా.
అంతే, నాకు అర్జంట్ గా వీళ్ళ ముగ్గురు పిల్లలని కలవాలి అనిపించింది.
నేను మీ ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడాలి, నాకు పరిచయం చేయ్యాలి అని అడిగా, అలా మా పిల్లలను చూపించినట్లు ఉంటుంది అన్నా.
నేను ఆడిగినట్లే, ముగ్గురిని తీసుకొని సాయంత్రం ఇంటికి వచ్చింది ........
ముగ్గురు వాళ్ళ అమ్మతో పాటు నేలపై కూర్చున్నారు. నా మనస్సు చివుక్కుమంది. ఎంతగానో బ్రతిమాలితే గాని, కుర్చీలపై కూర్చో లేదు.
ఆమె నేల పైనే. నాకు అలవాటే సారూ అంది,
నా పిల్లలు నాలా మిగిలి పోకూడదు అనే ఈ నా శ్రమ అంతా. మీలాంటి గొప్ప వాళ్ళతో పాటు సరి సమానంగా కూర్చున్నారు చూడండి, ఇది చాలు, అంది కళ్ళ నీళ్లతో.....
నేను కాదు, వీళ్లు కాదు,
నువ్వూ ... గొప్ప దానివి అన్నా.
మొదటి పది నిమిషాలు ముగ్గరు ముడుచుకు కూర్చున్నారు, తరువాత కొంచం కొంచం మాట్లాడ్డం మొదలు పెట్టారు.
తాము పడిన కష్టాలు, పడుతున్న కష్టాలు, ఎలా సీట్లు తెచ్చుకొంది, ఎంతో కొంత స్కాలర్షిప్ లు రావటం, అవి సహాయ పడ్డం. నిజంగా ఇలాంటి వారే పథకాలకు అర్హులు.
వీళ్లకు ఏదన్నా సహాయం చేద్దాం అని గట్టిగా మనసులో అనుకున్నా.
ఏం కావాలి అని అడిగా,
ఎంత అనుకువగా ఉన్నారో, అంత ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం మెండుగా ఉన్నాయి. ఏమి అడిగినా, ఆహా వద్దు అనే సమాధానం.
నేను, నా అర్ధాంగి అడగంగా, అడగంగా, ఒక Two వీలర్ ఇప్పించండి, ముగ్గరము కలిసి ఊయోగించు కుంటాం, మీకు నెల నెలా ఇస్తాం, మేము లోన్లో తీసుకోలేము, అనవసరమైన వడ్డీ అన్నారు. Two వీలర్ ఉంటే, కాస్త సౌలభ్యoగా ఉంటుంది, సగం డబ్బులు ఆటోలకు అయి పోతున్నాయి, మా ఏరియా దగ్గర షేర్ ఆటోలు దొరకవు, దొరికే స్టాప్ వరకు నడచి అలిసిపోవటం, సమయం కూడా వ్యర్థం అవుతున్నాయి. Two వీలర్ ఉంటే అలిసిపోము, మిగిలిన సమయాన్ని చదువు కునేందుకు ఉపయోగించు కుంటాము అన్నారు.
Two వీలర్ ఇప్పించా డబ్బులు కట్టి,
ఒక తొమ్మిది నెలల్లో నాకు ఒక పైసా వదలకుండా మొత్తం తీర్చేశారు, ఒక పది వేలు ఉంచుకోండి అని అన్నా వినకుండా.
పెద్ద అమ్మాయి ఇద్దరిని డ్రాప్ చేసిన తరువాత తన కాలేజ్ కు వెళ్లి పోతుంది. మళ్ళీ ఇద్దరని పికప్.
పెద్ద అమ్మాయి J.L పోస్టులకు సన్నద్ధం అవుతోంది. రెండో అమ్మాయి Software ఫీల్డ్ వైపు వెళ్ళాలి అని.
చెప్పటం మరిచా ఇప్పుడు పెద్ద అమ్మాయి మా పిల్లలకు హోమ్ ట్యూటర్. ప్రతి రోజు రెండు గంటలు.
ఏదో సినిమాలో అమ్మకంటే పెద్ద యోధురాలు ఎవరు ఉండరు అంటాడు హీరో, మనకు తెలియని ఈ తల్లి లాంటి యోధురాళ్లు ఎందరో..
ఒకసారి ఆమె తో అన్నా, ఇంకో రెండు సంవత్సరాలు కష్టం మీకు, తరువాత పిల్లలు చూసుకుంటారు మిమ్మల్ని అని,
ఏం సారూ నన్ను పనిలో నుంచి తీసేయ్యాలి అనుకుంటున్నారా, నా ఒంట్లో శక్తి ఉన్నoత వరకు నేను నా పని మానను.
ఆమెను అడిగా, మీ ఆయన మీద కోపం లేదా అని,
లేదు అన్నది, పిల్లలకు ఉంది, అయినా వీళ్లు తమ చదువులు అయిపోయి, పెళ్లిళ్లు చేసుకొని వెళ్లి పోతే తను నేనే కదండి, కోపాలు, తాపాలు పెట్టుకుంటే అవుతుందా అని సమాధానం. చిన్న చిన్న వాటికి గొడవలు పడి విడి పోతున్న జంటలకు ఈమె పెద్ద సమాధానం.
ఒక సారి పెద్ద అమ్మాయి అంది, మా నాన్న తన స్నేహితుల ముందర మా గురుంచి గొప్పగా చెబుతుంటాడు, అక్కడే ఆయన మొహం ముందరే వారికి చెబుతాం, ఇదంతా మా అమ్మ కష్టం అని......
ఎందరో అమ్మల నిజమైన కథ..!!!
అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే మాటకు .
కుదిరితే ఈ వ్యాసం అందరికి పంపండి. కనీసం చదువు కున్న వాళ్లకు అర్థం అవుతుంది.
🙏🙏..
సోమవారం 25 ఆగస్టు 2025🕉️
🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯
*🕉️సోమవారం 25 ఆగస్టు 2025🕉️*
4️⃣2️⃣
*ప్రతిరోజూ*
*మహాకవి బమ్మెర పోతనామాత్య*
*శ్రీమద్భాగవత కథలు*```
(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```
*వేదాలు వేయి సార్లు చదివినా లభ్యం కాని ముక్తి, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది..!*``
*జంబూద్వీపంలో భారతవర్షం కర్మభూమి*
```
వర్షాలన్నింటిలోను భారత వర్షమే కర్మక్షేత్రం. ఏ వర్షంలో ఎవరు ఎలాంటి సుఖదుఃఖాలను అనుభవించినా దానికి కారణాలైన పుణ్యకర్మలనీ, పాప కర్మలనీ ఆచరించే స్థలం భారత వర్షం. మిగతా ఎనిమిది వర్షాలు పుణ్యకర్మలను అనుభవించే స్థానాలు, పుణ్యకర్మలను అనుభవించే స్థానానికి స్వర్గం అని పేరు. ఆ కర్మలో కొంతమేరకు కర్మఫలాన్ని అనుభవించి, మిగులు ఉండగా జీవులు భూమిని చేరుతూ ఉంటారు. అలా చేరి, మిగిలి ఉన్న పుణ్యఫలాలను అనుభవిస్తారు. వాటిని భౌమ స్వర్గాలని అంటారు. అలాంటి భౌమ స్వర్గాలు ఎనిమిది వర్షాలు. దానికి మూలమైన పుణ్యాన్ని ఆచరించే స్థానం భారత వర్షం. ఇక శ్రేష్టమైన భారత వర్షం కథ ఏమిటంటే:
స్వాయంభువ మనువుకు ప్రియవ్రతుడు అనే కొడుకు జన్మించాడు. అతడికి అగ్నీధ్రుడు అనే కుమారుడు పుట్టాడు. అతడికి నాభి అనే వాడు పుట్టి బలి చక్రవర్తితో స్నేహం చేశాడు. సమస్త భూమండలాన్ని పాలించాడు నాభి అతడికి ఋషభుడు అనే సద్గుణవంతుడైన కొడుకు పుట్టాడు. అతడి కొడుకుల్లో పెద్దవాడైన భరతుడు ఘోరమైన తపస్సు చేసి, మనస్సును సంసార బంధాల నుండి మళ్లించి చివరకు వాసుదేవుడిని చేరుకున్నాడు. ఆ పుణ్యాత్ముడు ఏలిన భూమండలానికి అతడి పేరుమీద 'భారతవర్షం' అని ఏర్పడి, క్రమేపీ జగత్వసిద్ధం అయింది.
ఇలావృతం మొదలుగా గల తొమ్మిది వర్గాలలోనూ భగవానుడైన నారాయణుడు అవతరించి, నిత్యం లోకాలను అనుగ్రహిస్తూ, లోకులందరికీ జ్ఞానం ఇస్తాడు. ఇలావృత వర్గానికి అధిపతి త్రిపురాలను హరించిన రుద్రుడు. భద్రాశ్వ వర్షానికి అధిపతి భద్రశ్రవుడు. హరి వర్షానికి అధిపతి నరసింహస్వామి. కేతుమాల వర్షంలో భగవానుడు కామదేవుడు (ఈయన్నే ప్రద్యుమ్నుడు అని అంటారు) అనే పేరుతో లక్ష్మీదేవికి ప్రీతి కలిగిస్తూ ఉంటాడు. ఈ వర్షానికి అధిపతులు ప్రజాపతైన సంవత్సురిడి కుమార్తెలు, కుమారులు. కొడుకులు పగళ్లు, కూతుర్లు రాత్రులు. రమ్యక వర్షానికి అధిదేవత మత్స్యరూపంలో ఉంటాడు. అతడు హరే! ఈ వర్షాధిపతి మనువు. ఇతడు మత్స్యమూర్తిని ఆరాధిస్తుంటాడు. ఇక హిరణ్మయ వర్షం అధినేత కూర్మావతార రూపుడైన పద్మగర్భుడు శ్రీమహావిష్ణువు. పితృదేవతల అధిపతియైన అర్యముడు హిరణ్మయవర్ష పాలకుడు. ఉత్తర కురు భూములకు వరాహదేవుడు అధిపతి. భూదేవి అతడికి పూజ చేస్తుంటుంది. కింపురుష వర్షానికి సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామభద్రుడు అధిపతి. భారత వర్గానికి అధిపతి నారాయణుడు. బదరికాశ్రమంలో నరుడితో కలిసి తపస్సు చేశాడు. భారత వర్షంలో ఎన్నో పుణ్యశైలాలు, గంబీరంగా ప్రవహించే అనేక నదులు ఉన్నాయి. అవి...
పుణ్యశైలాలు: మలయ పర్వతం, మంగళ ప్రస్థం, మైనాకం, ఋషభం, కూతకం, కొల్లకం, సహయం, వేదగిరి, ఋష్యమూకం, శ్రీశైలం, వేంకటాద్రి, మహేంద్రం, వారిధరం, వింధ్యపర్వతం, శుక్తిమత్పర్వతం, ఋక్షగిరి, పారియాత్రం, ద్రోణపర్వతం, చిత్రకూటం, రైవతకం, కుకుభం, నీలగిరి, గోకాముఖం, ఇంద్రకీలం, రామగిరి మొదలైనవి.
*పవిత్ర నదులు:* పైన చెప్పిన పర్వతాలకు పుత్రికలైన పుణ్యనదులు: చంద్రపట, తామ్రపర్ణి, కృతమాల, వైహాయాసి, కావేరి, వేణి, పయస్విని, పయోద, శర్కరావర్త, తుంగభద్ర, కృష్ణవేణి, భీమరథి, గోదావరి, నిర్వింధ్య, పయోష్ఠి, తాపి, రెవ, సురస, చర్మణవతి, వేదస్మృతి, ఋషికుల్వ, త్రిసోమ, కౌశికి, మందాకిని, యమునా, సరస్వతి, దృషద్వతి, గోమతి, సరయువు, భోగవతి, సుషోమ, శతద్రువు, చంద్రభాగ, మరుద్వరుథ, వితస్త, అసిక్ని, విశ్వ అనే మహానదులు. నర్మదానది, సింధువు, శోణ అనే నదాలు భారత వర్షంలో ప్రవహిస్తున్న మహా ప్రవాహాలు. వీటిల్లో పవిత్రంగా స్నానాలు చేస్తే మానవులు ముక్తిని పొందుతారు.
భారత వర్షం ఎంతో ఉత్తమమైనదని మహాపురుషులు స్తుతిస్తారు. భారత వర్షంలో జన్మించిన వారి భాగ్యాన్ని వర్ణించి చెప్పడం సాధ్యం కాదు. భారత వర్షంలో శ్రీహరి ఎన్నో అవతారాలను ఎత్తి, జీవులకు తత్త్వం ఉపదేశించాడు. అందువల్ల భారత వర్షంలోని జనులకు సాధ్యం కానిదేదీ లేదు. నారాయణుడిని స్మరించడం వల్ల సకల పాపాలు నశిస్తాయి. భారత వర్షంలో ఒక్క క్షణకాలం మనఃపూర్వకంగా సర్వ సంగ పరిత్యాగం చేస్తే, అతడు పురుష శ్రేష్ఠుడు అవుతాడు. ఒక్కమాటలో చెప్పాలంటే, భారత వర్షం మోక్షాన్ని పొందడానికి అనువైన కర్మ భూమి, యజ్ఞాభూమి.
జంబూ ద్వీపానికి చుట్టూ లక్ష యోజనాల మేర ఉప్పు సముద్రం చుట్టి ఉన్నది. ప్లక్ష ద్వీపానికి చుట్టూ చెరకు రసం నిండిన సముద్రం ఉన్నది. అది రెండు లక్షల యోజనాల మేర చుట్టి ఉన్నది. ద్వీప మధ్య భాగంలో పక్షం అనే జువ్వి చెట్టు ఉన్నది కాబట్టి ఈ ద్వీపానికి ప్లక్ష ద్వీపం అన్న పేరు వచ్చింది. అగ్నిదేవుడు దీనికి అధిపతి. (ప్రియవ్రతుడి కొడుకు ఇధ్మజిహ్వుడు దీని పాలకుడు). ఈ ప్లక్ష ద్వీపాన్ని ఏడు వర్షాలుగా విభజించడం జరిగింది. అవి శివ, యశస్య, సుభద్ర, శాంత, క్షేమ, అమృత, అభయ అనేవి.
ఈ సప్త వర్షాలకు సప్త కుల పర్వతాలున్నాయి. వాటి పేర్లు: మణికూటం, వజ్రకూటం, ఇంద్రసేనం, జ్యోతిష్మంతం, ధూమ్రవర్ణం, హిరణ్యగ్రీవం, మేఘమాలం. ఈ వర్షాలకు సప్త మహానదులున్నాయి. అవి: అరుణ, నృష్ణ, అంగిరసి, సావిత్రి, సుప్రభాత, ఋతంబర, సత్యంభర అనేవి. ప్లక్ష ద్వీపానికి ముందు, జంబూద్వీపానికి మధ్య లవణ సముద్రం ఉన్నట్లే, ప్లక్ష శాల్మలీ ద్వీపాలకు మధ్యలో ఇక్షురస జలంతో నిండిన ఇక్షురస సముద్రం ఉన్నది. ఇది రెండు లక్షల యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఇక్షురస సముద్రానికి రెట్టింపు వైశాల్యం కలిగినది శాల్మలీ ద్వీపం.
*(సశేషం)*
*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*
*రచన: శ్రీ వనం*
*జ్వాలా నరసింహారావు*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷``
*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩*
ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
సోమవారం🕉️* *🌹25 ఆగస్టు 2025🌹* *దృగ్గణిత పంచాంగం*
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🕉️సోమవారం🕉️*
*🌹25 ఆగస్టు 2025🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
*దక్షిణాయనం - వర్షఋతౌః*
*భాద్రపద మాసం - శుక్లపక్షం*
*తిథి : విదియ* మ 12.34 వరకు ఉపరి *తదియ*
*వారం : సోమవారం* ( ఇందువాసరే )
*నక్షత్రం : ఉత్తర* రా 03.49 వరకు ఉపరి *హస్త*
*యోగం : సిద్ధ* మ 12.06 వరకు ఉపరి *సాధ్య*
*కరణం : కౌలువ* మ 12.34 *తైతుల* రా 01.10 ఉపరి *గరజి*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 06.00 - 07.00 & 11.30 - 12.30*
అమృత కాలం : *రా 08.06 - 09.49*
అభిజిత్ కాలం : *ప 11.44 - 12.34*
*వర్జ్యం : ఉ 09.49 - 11.32*
*దుర్ముహూర్తం : మ 12.34 - 01.25 & 03.05 - 03.55*
*రాహు కాలం : ఉ 07.27 - 09.01*
గుళికకాళం : *మ 01.43 - 03.17*
యమగండం : *ఉ 10.35 - 12.09*
సూర్యరాశి : *సింహం*
చంద్రరాశి : *సింహం/కన్య*
సూర్యోదయం :*ఉ 06.01*
సూర్యాస్తమయం :*సా 06.35*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 05.53 - 08.24*
సంగవ కాలం : *08.24 - 10.54*
మధ్యాహ్న కాలం : *10.54 - 01.25*
అపరాహ్న కాలం : *మ 01.25 - 03.55*
*ఆబ్ధికం తిధి : భాద్రపద శుద్ధ తదియ*
సాయంకాలం :*సా 03.55 - 06.26*
ప్రదోష కాలం : *సా 06.26 - 08.43*
రాత్రి కాలం :*రా 08.43 - 11.46*
నిశీధి కాలం :*రా 11.46 - 12.32*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.07*
******************************
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*
*తత్వోఽజ్ఞాతే విచారైః*
*శ్రవణమననయోః కిం*
*నిదిధ్యాసితవ్యం*
🕉️ *ఓం నమః శివాయ*🕉️
🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🕉️🕉️🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🕉️🕉️🌹🌷
🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹
బమ్మెఱపోతన
బమ్మెఱపోతన రూప చిత్రణము
--------------------------------------------------
సీ: కుప్పించి యెగసిన కుండలమ్ముల కాంతి
గగన భాగంబెల్ల గప్పి కొనఁగ ;
నుఱికిన నోర్వక యుదరంబు లోనున్న
జగముల వ్రేగున జగతి గదుల ;
చక్రంబుఁ జేపట్టి ద చనుదెంచు రయమున
పైనున్న పచ్చని పటము జార;
నమ్మితి నాలావు నగుబాటు సేయకు
మన్నింపు మని క్రీడి మరలఁ బిలువఁ ;
గీ: గరికి లఘించు సింహంబు కరణి మెఱసి ,
నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు,
విడువు మర్జున! యంచు , మద్విశిఖ వృత్తిఁ
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు .
శ్రీ: ఆం: భాగవతము- ప్రథమస్కంథము- 40 వ: పద్యము;
తెలుగు వారి పుణ్యాలపేటి,యైన, భాగవత గ్రంధంలో పోతన రూపచిత్రణం అత్యద్భుతం! ఆయాపాత్రల యథాతధ స్థితిని కన్నులకు గట్టించటం పోతన కవితలోని ప్రత్యేకత! భాగవత ప్రధమ స్కంధంలోని భీష్మ స్తుతి యిందుకు చక్కని యుదాహరణ.
నాఁడు కురుక్షేత్ర రణరంగంలో ప్రచండంగా యుధ్ధం చేస్తున్నప్పుడు, అర్జునుఁడా బాణాఘాతములకు నొచ్చి, కలత పడువేళ చక్రధారియై కృష్ణుఁడు భీష్ముని పైకి నురుకు దృశ్యము ను ఈపద్యమునందు కన్ను లముందు నిలిపినాఁడు.
అలతి యలతి సుందర పద భాసితమైన యీపద్యానికి అర్ధవివరణ మక్కరలేదు. అయినను భావార్ధ దర్శన మొనరింతముగాక!
" చక్ర ధారియై కృష్ణుఁడు రథమునుండి యురికినపుడు కుప్పించి యెగసినాడట .(ఒకింతశరీరమును పైకి
లేపుట)అపుడాతని కర్ణాభరణముల కాంతి మెఱపు మెరసినట్లయి ఆదివ్యకాంతి నలుఁగడలవిస్తరించినదట, అట్లు ఉరుకుచే తనలోనున్న 14 భువనముల భారము కదలినట్లయి ఉదరము క్రిందికి పైకినూగెనట., చక్రధారియై యురకు నపుడు పైనున్న పీతాంబరము జాినదట.అట్టిస్థితిలో అర్జునుడు ముకుళిత హస్తుడై
" కష్ణా! నాపరాక్రమమును శంకింపకుము, నాశక్తి నే నెఱుంగుదును ,భీష్ముని నీవువధించి నాకు నలుగురిలో నవమానమును ఘటింపకుము మరలుమని " వేడుచున్నాడట.అతనిమొరవిని,
" ఏనుఁగు పై నురుకు సింహమువలె గర్జించుచు, " నేడు భీష్ముని సంహరించి నిన్ను కాపాడెదను.నన్ను విడువుము"- అనిపలుకుచు నాబాణములకు తాళలేక నాపై లఘించు చక్రధారియే నాకు దిక్కగుగాక!
అనిభీష్ముని ప్రార్ధన! ఇదీ పోతన గారి రూపచిత్రణం!
స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
25-08-2025 సోమవారం రాశి ఫలితాలు
25-08-2025 సోమవారం రాశి ఫలితాలు
మేషం
ఆదాయం తగినంత ఉండదు. ఉద్యోగమున ముఖ్యమైన పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.
---------------------------------------
వృషభం
వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక చికాకు కలిగిస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారపరంగా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది.
---------------------------------------
మిధునం
నూతన విషయాలు సేకరిస్తారు. గృహమునకు బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి.
---------------------------------------
కర్కాటకం
మొండి బాకీలు వసూలు అవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగమున మంచి పనితీరుతో అధికారులను ఆకట్టుకొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
---------------------------------------
సింహం
ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలంగా సాగుతాయి.
---------------------------------------
కన్య
చేపట్టిన పనులలో ఒత్తిడి అధికమైన సకాలంలో పూర్తిచేస్తారు. ఇతరులకు ధన పరంగా మాట ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి.
---------------------------------------
తుల
నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. సోదర స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.
---------------------------------------
వృశ్చికం
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకుంలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.
--------------------------------------
ధనస్సు
కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతాయి. నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారములను విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు.
---------------------------------------
మకరం
వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు చికాకు పరుస్తాయి. ధన పరంగా ఒడిదుడుకులు అదిగమిస్తారు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.
---------------------------------------
కుంభం
వృత్తి వ్యాపారాలు కొంత అనుకూలంగా సాగుతాయి. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్న నాటి మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన స్థాన చలనాలుంటాయి.
---------------------------------------
మీనం
ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. వృత్తి వ్యాపారాల్లో స్వంత ఆలోచనలు అమలుచేస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్ధిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది.
---------------------------------------
పంచాంగం
ఈ రోజు పంచాంగం 25.08.2025
Monday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస శుక్ల పక్ష ద్వితీయ తిథి ఇందు వాసర ఉత్తరఫల్గుని నక్షత్రం సిద్ధ యోగః కౌలవ తదుపరి తైతుల కరణం
రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.
యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.
నమస్కారః , శుభోదయం
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5126*
*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - వర్ష ఋతువు - భాద్రపద మాసం - శుక్ల పక్షం - ద్వితీయ - ఉత్తరాఫల్గుణి - ఇందు వాసరే* (25.08.2025)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
