10, ఆగస్టు 2020, సోమవారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం



అష్టమ స్కంధము - పదియవ అధ్యాయము

దేవాసుర సంగ్రామము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

10.27 (ఇరువది ఏడవ శ్లోకము)

తేఽన్యోన్యమభిసంసృత్య క్షిపంతో మర్మభిర్మిథః|

ఆహ్వయంతో విశంతోఽగ్రే యుయుధుర్ద్వంద్వయోధినః॥6687॥

ఆ రెండు పక్షములవారు ఎదురెదురుగా మోహరించి పరస్పరము పరుషవచనములను పలుకుచుండిరి. ఈ విధముగా వారు యుద్ధమును కొనసాగించుచుండిరి. 

10.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

యుయోధ బలిరింద్రేణ తారకేణ గుహోఽస్యత|

వరుణో హేతినాయుధ్యన్మిత్రో రాజన్ ప్రహేతినా॥6689॥

10.28  (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

యమస్తు కాలనాభేన విశ్వకర్మా మయేన వై|

శంబరో యుయుధే త్వష్ట్రా సవిత్రా తు విరోచనః॥6689॥

రాజా! బలిచక్రవర్తి ఇంద్రునితోను, కుమారస్వామి తారకాసురునితోను, వరుణుడు హేతితోడను, మిత్రుడు ప్రహేతితోను తలపడి పోరుచుండిరి. యమధర్మరాజు కాలనాథుని, విశ్వకర్మ మయుని, శంబరాసురు త్వష్టతో, సవిత విరోచనుని ఎదుర్కొని యుద్ధము చేయుచుండిరి.

10.30 (ముప్పదియవ శ్లోకము)

అపరాజితేన నముచిరశ్వినౌ వృషపర్వణా|

సూర్యో బలిసుతైర్దేవో బాణజ్యేష్ఠైః శతేన చ॥6690॥

10.31 (ముప్పదియవ శ్లోకము)

రాహుణా చ తథా సోమః పులోమ్నా యుయుధేఽనిలః|

నిశుంభశుంభయోర్దేవీ భద్రకాలీ తరస్వినీ॥6691॥

అపరాజితుడు నముచితోను, అశ్వనీదేవతలు వృషపర్వునితోను, సూర్యుడు బలిచక్రవర్తియొక్క కుమారులైన బాణుడు మొదలగు నూరుమందితోను యుద్ధము సలుపుచుండిరి. చంద్రుడు రాహువుతోడను, వాయుదేవుడు పులోమునితోను పోరాడు చుండిరి. వేగముగల భద్రకాళీదేవి శుంభునిశుంభులను ఎదుర్కొనుచుండెను.

10.32 (ముప్పది రెండవ శ్లోకము)

వృషాకపిస్తు జంభేన మహిషేణ విభావసుః|

ఇల్వలః సహ వాతాపిర్బ్రహ్మపుత్రైరరిందమ॥6692॥

10.33 (ముప్పది మూడవ శ్లోకము)

కామదేవేన దుర్మర్ష ఉత్కలో మాతృభిః సహ|

బృహస్పతిశ్చోశనసా నరకేణ శనైశ్చరః॥6693॥

10.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

మరుతో నివాతకవచైః కాలేయైర్వసవోఽమరాః|

విశ్వేదేవాస్తు పౌలోమై రుద్రాః క్రోధవశైః సహ॥6694॥

శత్రుసూదనా! పరమశివుడు జంభాసురునితోను, అగ్నిదేవుడు మహిషాసురునితోను, బ్రహ్మదేవుని తనయులైన మరీచి మొదలగువారు వాతాపి, ఇల్వలులతోను పోరు సల్పుచుండిరి. దుర్మర్షణుని కామదేవుడు,ఉత్కళుని మాతృగణములవారును, శుక్రాచార్యుని బృహస్పతియు, శనైశ్చరుడు నరకాసురుని ఎదుర్కొనుచుండిరి. మరుద్గణముల వారు నివాత కవచులతోను, వసువులు కాలేయులతోను, విశ్వేదేవులు పౌలోములతోను, రుద్రగణములవారు క్రోధవశులతోను సంగ్రామ మొనర్చుచుండిరి.

10.35 (ముప్పది ఐదవ శ్లోకము)

త ఏవమాజావసురాః సురేంద్రాః  ద్వంద్వేన సంహత్య చ యుధ్యమానాః|

అన్యోన్యమాసాద్య నిజఘ్నురోజసా  జిగీషవస్తీక్ష్ణశరాసితోమరైః॥6695॥

ఈ విధముగా రణరంగమున దేవతలు, అసురులు ద్వంద్వయుద్ధము ద్వారాను, సామూహిక ఆక్రమణ ద్వారాను ఎదుర్కొనుచు పరస్పర విజయకాంక్షతో, వీరావేశముతో వాడియైన బాణములతోను, ఖడ్గములతోను, తోమరములతోను కొట్టుకొనుచుండిరి.

10.36 (ముప్పది ఆరవ శ్లోకము)

భుశుండిభిశ్చక్రగదర్ష్టిపట్టిశైః  శక్త్యుల్ముకైః ప్రాసపరశ్వధైరపి|

నిస్త్రింశభల్లైః పరిఘైః సముద్గరైః సభిందిపాలైశ్చ శిరాంసి చిచ్ఛిదుః॥6696॥

భుశుండులు, చక్రములు, గదలు, చురకత్తులు, అడ్డకత్తులు, కత్తులు, శక్తులు, కొరవులు, ఈటెలు, గండ్రగొడ్డళ్ళు, బల్లెములు, ఇనుపరోకళ్ళు, ముండ్లగదలు, ఇనుపగుదియలు మొదలగు ఆయుధములతో వారు శత్రువులయొక్క శిరములను ఖండించుచుండిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం



అష్టమ స్కంధము - పదియవ అధ్యాయము

దేవాసుర సంగ్రామము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

10.27 (ఇరువది ఏడవ శ్లోకము)

తేఽన్యోన్యమభిసంసృత్య క్షిపంతో మర్మభిర్మిథః|

ఆహ్వయంతో విశంతోఽగ్రే యుయుధుర్ద్వంద్వయోధినః॥6687॥

ఆ రెండు పక్షములవారు ఎదురెదురుగా మోహరించి పరస్పరము పరుషవచనములను పలుకుచుండిరి. ఈ విధముగా వారు యుద్ధమును కొనసాగించుచుండిరి. 

10.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

యుయోధ బలిరింద్రేణ తారకేణ గుహోఽస్యత|

వరుణో హేతినాయుధ్యన్మిత్రో రాజన్ ప్రహేతినా॥6689॥

10.28  (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

యమస్తు కాలనాభేన విశ్వకర్మా మయేన వై|

శంబరో యుయుధే త్వష్ట్రా సవిత్రా తు విరోచనః॥6689॥

రాజా! బలిచక్రవర్తి ఇంద్రునితోను, కుమారస్వామి తారకాసురునితోను, వరుణుడు హేతితోడను, మిత్రుడు ప్రహేతితోను తలపడి పోరుచుండిరి. యమధర్మరాజు కాలనాథుని, విశ్వకర్మ మయుని, శంబరాసురు త్వష్టతో, సవిత విరోచనుని ఎదుర్కొని యుద్ధము చేయుచుండిరి.

10.30 (ముప్పదియవ శ్లోకము)

అపరాజితేన నముచిరశ్వినౌ వృషపర్వణా|

సూర్యో బలిసుతైర్దేవో బాణజ్యేష్ఠైః శతేన చ॥6690॥

10.31 (ముప్పదియవ శ్లోకము)

రాహుణా చ తథా సోమః పులోమ్నా యుయుధేఽనిలః|

నిశుంభశుంభయోర్దేవీ భద్రకాలీ తరస్వినీ॥6691॥

అపరాజితుడు నముచితోను, అశ్వనీదేవతలు వృషపర్వునితోను, సూర్యుడు బలిచక్రవర్తియొక్క కుమారులైన బాణుడు మొదలగు నూరుమందితోను యుద్ధము సలుపుచుండిరి. చంద్రుడు రాహువుతోడను, వాయుదేవుడు పులోమునితోను పోరాడు చుండిరి. వేగముగల భద్రకాళీదేవి శుంభునిశుంభులను ఎదుర్కొనుచుండెను.

10.32 (ముప్పది రెండవ శ్లోకము)

వృషాకపిస్తు జంభేన మహిషేణ విభావసుః|

ఇల్వలః సహ వాతాపిర్బ్రహ్మపుత్రైరరిందమ॥6692॥

10.33 (ముప్పది మూడవ శ్లోకము)

కామదేవేన దుర్మర్ష ఉత్కలో మాతృభిః సహ|

బృహస్పతిశ్చోశనసా నరకేణ శనైశ్చరః॥6693॥

10.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

మరుతో నివాతకవచైః కాలేయైర్వసవోఽమరాః|

విశ్వేదేవాస్తు పౌలోమై రుద్రాః క్రోధవశైః సహ॥6694॥

శత్రుసూదనా! పరమశివుడు జంభాసురునితోను, అగ్నిదేవుడు మహిషాసురునితోను, బ్రహ్మదేవుని తనయులైన మరీచి మొదలగువారు వాతాపి, ఇల్వలులతోను పోరు సల్పుచుండిరి. దుర్మర్షణుని కామదేవుడు,ఉత్కళుని మాతృగణములవారును, శుక్రాచార్యుని బృహస్పతియు, శనైశ్చరుడు నరకాసురుని ఎదుర్కొనుచుండిరి. మరుద్గణముల వారు నివాత కవచులతోను, వసువులు కాలేయులతోను, విశ్వేదేవులు పౌలోములతోను, రుద్రగణములవారు క్రోధవశులతోను సంగ్రామ మొనర్చుచుండిరి.

10.35 (ముప్పది ఐదవ శ్లోకము)

త ఏవమాజావసురాః సురేంద్రాః  ద్వంద్వేన సంహత్య చ యుధ్యమానాః|

అన్యోన్యమాసాద్య నిజఘ్నురోజసా  జిగీషవస్తీక్ష్ణశరాసితోమరైః॥6695॥

ఈ విధముగా రణరంగమున దేవతలు, అసురులు ద్వంద్వయుద్ధము ద్వారాను, సామూహిక ఆక్రమణ ద్వారాను ఎదుర్కొనుచు పరస్పర విజయకాంక్షతో, వీరావేశముతో వాడియైన బాణములతోను, ఖడ్గములతోను, తోమరములతోను కొట్టుకొనుచుండిరి.

10.36 (ముప్పది ఆరవ శ్లోకము)

భుశుండిభిశ్చక్రగదర్ష్టిపట్టిశైః  శక్త్యుల్ముకైః ప్రాసపరశ్వధైరపి|

నిస్త్రింశభల్లైః పరిఘైః సముద్గరైః సభిందిపాలైశ్చ శిరాంసి చిచ్ఛిదుః॥6696॥

భుశుండులు, చక్రములు, గదలు, చురకత్తులు, అడ్డకత్తులు, కత్తులు, శక్తులు, కొరవులు, ఈటెలు, గండ్రగొడ్డళ్ళు, బల్లెములు, ఇనుపరోకళ్ళు, ముండ్లగదలు, ఇనుపగుదియలు మొదలగు ఆయుధములతో వారు శత్రువులయొక్క శిరములను ఖండించుచుండిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319

నల్లనయ్య .

నల్లనయ్య ... వెన్న దొంగ, ఇలా ముద్దుగా మనమందరమూ పిలుచుకునే  శ్రీ కృష్ణుని ప్రతి చర్యలలోనూ జీవన విధానంలోనూ ఎదో ఒక అమూల్యమైన సందేశం ఉంది  ..!

బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో చేసిన వెన్నముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందట.

వెన్న జ్ఞానానికి సంకేతంగా చెప్తారు. పెరుగును మధించగా మధించగా కాని వెన్న లభ్యంకాదు కదా! అట్టి తెల్లని వెన్నను తాను తింటూ, ఆ అజ్ఞానమనే నల్లని కుండను బద్దలుకొట్టి మానవులలో జ్ఞానజ్యోతిని వెలిగించడమే
గోవిందుని సందేశంగా భావించాలి అని చెప్తూ వుంటారు !

అలాగే, బాలకృష్ణుని మరో చిన్నారి చేష్టలోని సందేశం:  గోపికలు కుండలలో ఇండ్లకు నీళ్లను యమునానదిలో నుండి తీసుకుని వెళుతూవుంటే, రాళ్లను విసిరి వాటికి చిల్లు పడేలా చేసేవాడట. అలా ఆ కుండని  మానవశరీరము అనుకుంటే ఆకుండలోని నీరు 'అహంకారం' ఆ అహంకారం కారిపోతేనేగాని జీవికి ముక్తి లభించదని ఇలా వారి లీలలోని అంతర్యాన్ని భాగవతోత్తములు వివరిస్తూ ఉంటారు.

ఇంకా, ప్రముఖ భాగవతోత్తములు మనకు అందించే సమాచారాన్ని బట్టి యిప్పటికి సుమారు 30వ శతాబ్దమునకు పూర్వం అంటే క్రీస్తు పూర్వం 3122లో ద్వారకా పట్టణమందు కృష్ణభగవానుడు నిర్యాణము చెందినట్లు తెలియుచున్నది. నాటినుండే కలి ప్రవేశముతో "కలియుగం" ఆరంభమైనదని చెప్తారు. దుష్ట శిక్షణ కోసం భూమిపై శ్రీకృష్ణుడిగా పుట్టిన కృష్ణుడిని జన్మాష్టమి రోజున పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

నల్లనయ్య.. కన్నయ్య.. కిట్టయ్య.. గోపాలుడు.. ఇలా ఏ పేరుతో పిలిచినా.. పలికే దేవుడు కృష్ణుడు..  జీవితాన్ని చాలా సంతోషంగా, ఆడి పాడుతూ.. అహ్లదంగా చేయమని చెప్పిన ఆనందరూపం. వెన్న దొంగ అయినా.. మన్ను తిన్నా.. అందులో ఓ పరమార్ధం ఉంది.. కాళీయ మర్దనం జరిపినా.. వేల గోపికలతో సరసాలాడినా.. సంజయ రాయబారం నెరపినా.. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి దిశానిర్దేశం చేసినా.. ఒక్కో ఘట్టంలోనూ ఒక్కో సందేశం ఇమిడి ఉంది.. అందుకే యావత్ ప్రపంచం ఈవేళ కృష్ణ తత్వంపై ఆసక్తి పెంచుకుంటోంది.. కృష్ణ తత్వాన్ని మనసారా మననం చేసుకుంటుంది.

జీవితం ఒక బాధ్యత. మనిషి జీవితంలో ఉత్థాన పతనాలు సర్వ సాధారణం.. ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలతను సాధించడం ఒక సవాల్.. కృష్ణుడు మనకి బోధించినది ఇదే.. చిన్ని కృష్ణుడు చిన్ననాటి నుంచి అష్టకష్టాలు పడ్డాడు.. లైఫ్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొనాలో తన అవతారంతో వివరించాడు..
ఇక చిన్న తనమునుండే అనేకమంది రాక్షసులను సంహరిస్తూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కావిస్తూ తద్వారా మానవాళికి రాక్షస తత్వాన్ని ఎదుర్కొని వధించమనే సందేశమిచ్చాడు !

కృష్ణుడు సర్వాంతర్యామి.. ఇందుగలడందులేడను సందేహం వలదు.. ఈ కాలానికి.. ప్రత్యేకించి ఇప్పటి తరానికి రిలవెన్స్ ఉన్న ఒకే ఒక దేవుడు కృష్ణుడు.

కృష్ణతత్వం అంటే మానవాళిని మంచి పథంలో నడిపించే ఒక డైరీ.. ఒక జీవన సారం.. ఒక మార్గదర్శి.. ఒక దిక్సూచి.. కృష్ణుడు మానవ జీవితానికి చాలా దగ్గరగా మెలిగిన అవతారపురుషుడు.. ఒక మామూలు మనిషిలో ఉండే కామ, క్రోధ, మద, లోభ మాత్సర్యాలన్నీ మనకి కృష్ణుడి క్యారక్టర్‌లో కనిపిస్తాయి.. మనిషి జీవితంలో ఉండే అన్ని కోణాలు మనకి కృష్ణుడి వ్యక్తిత్వంలో కనిపిస్తాయ్‌.

అసలు ఈ భూమిపై కృష్ణావతారం ఎత్తడమే ఒక సంచలనం.. శ్రీకృష్ణుడు మంచి వ్యూహకర్త.. పరిస్థితులకు తగిన విధంగా ప్రవర్తించాడు.. నీపని నువ్వు చేయి.. ఫలితాన్ని నాకు వదిలిపెట్టు అనే సందేశాన్ని చాటాడు.. ప్రపంచాన్ని కారుచీకట్లు కమ్ముకుంటున్న వేళ.. పనిలో వేగం పెరిగి.. ఒత్తిడి పెరుగుతున్న వేళ అందరూ మరోసారి కృష్ణ తత్వాన్ని ఆశ్రయించాల్సిన తరుణమిది.. కృష్ణతత్వం అంటే ప్రేమమయం ఇదే జీవన పరమార్ధం.. యావత్ మానవాళి తెలుసుకోవాల్సిన విషయం..

కృష్ణుడి జీవితమే ఒక మానవ జీవన అనుభవసారం:

మూర్తీ భవించిన వ్యక్తిత్వ వికాసం.. శ్రీకృష్ణుని రూపం నల్లనిది.. మనసు మాత్రం వెన్న పూసలా తెల్లనిది..  దేనికీ భయపడని వ్యక్తిత్వంతో చేపట్టిన ప్రతీ పనిలోనూ విజయం సాధించాడు.. నమ్మిన వారికి కొండంత అండగా నిలిచాడు.

చిన్నప్పుడే కృష్ణయ్య... కన్న తల్లిదండ్రులకు దూరమయ్యాడు. సొంత మేనమామే శత్రువై సంహరించాలని చూసినా చలించ లేదు.. తామరాకు మీద నీటి బొట్టులా ఉన్నాడు... గోవుల మధ్య గోపన్నలా తిరిగాడు.. గోధూళి వేళ మురళిని వాయిస్తూ తన ఈడు పిల్లలతో చక్కగా కలసి పోయాడు... కాళీయ మర్దనం చేశాడు.. శత్రు సంహారం ఎలా చేయాలో చేసి చూపించాడు.. చిటికెన వేలితో గోవర్ధన గిరిని ఎత్తి తన మహిమను ప్రదర్శించాడు.. యశోదమ్మ దగ్గర పెరిగాడు..  అమాయక బాలునిలా మన్ను తిన్నాడు.. అదేమని చెవి మెలేసిన తల్లికి నోటిలో 14 భువన భాండాలు చూపించాడు..  తల్లి ప్రేమ పాశానికి లొంగిపోయి గంధర్వులకి శాపవిముక్తి కలిగించాడు.... ఉట్టి కొట్టాడు.. వెన్న దొంగలించాడు.. ఇదే ఇప్పటికీ కృష్ణాష్టమి రోజున ఉట్టి పండగగా మనం జరుపుకుంటున్నాం..

అసలు కృష్ణుడంటేనే అలౌకిక ఆనందానికి ప్రతిరూపం..  సచ్చిదానంద రూపం.. సత్‌చిత్ ఆనంద స్వరూపం.. పాపాల్ని నాశనం చేసేదే కృష్ణ తత్వం.. శ్రీ మహా విష్ణువు అష్టమ అవతారమే కృష్ణుడు.. కృష్ఱుడి పేరు తలుచుకుంటేనే అమరత్వం సిద్ధిస్తుంది.. జవసత్వాలు ఉట్టి పడతాయి.. కృష్ణ నామం కర్ణపేయంగా ఉంటుంది..

కృష్ణుడు అవతార పురుషుడే అయినా.. అన్నగారు బలరాముడంటే.. అమితమైన సోదర బంధం... అంతకన్నా మించిన గురు భావన.. కుటుంబంలో చిన్నవారు రక్త బంధాన్ని ఎలా గౌరవించాలో కృష్ణుడి క్యారక్టర్ చెబుతుంది.. అలాగే స్నేహంపై కూడా కృష్ణుడి వ్యక్తిత్వం నుంచి ఈతరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.. కుచేలుడు కృష్ణుడికన్నా.. ఎంతో కింది స్థాయి వ్యక్తి.. స్నేహ బంధమనేది వీటన్నింటికీ అతీతమైనది అని నిరూపించాడు ..... కుచేలుడు ప్రేమతో తెచ్చిన అటుకులనే ఇష్టంగా తిన్నాడు..

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత !
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహమ్ !!

ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే అన్నాడు కృష్ణుడు. కృష్ణుడు కారణజన్ముడు.. అందుకే తన అవసరం ఉంటే మళ్లీ మళ్లీ పుడతానన్నాడు.. కృష్ణుడిలో మంచి రాజకీయ వేత్త ఉన్నాడు..  కృష్ణుని ప్రమేయం లేకుండా మహాభారత యుద్ధం కానీ, భగవద్గీత పుట్టుక కానీ జరిగేది కాదు..  దుష్ట శిక్షణ కోసం.. శిష్ట రక్షణ కోసం పాటు పడ్డాడు..

కృష్ణుడు కారణజన్ముడు.. రామావతారంలో నరుడిగా జన్మించినా కృష్ణావతారంలో తానే దేవుడినని ప్రకటించాడు.. ప్రజలు అశాంతి, అధర్మ మార్గాల్లో పయనించినప్పుడు..  దుష్టులు చెలరేగి ధర్మం క్షీణిస్తున్న సమయంలో ధర్మ సంస్థాపనకు తాను మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటానని కృష్ణ పరమాత్మ చెప్పాడు.. దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు తగిన సమయం కోసం ఆగలేదు..  దానికోెసం పుట్టిన నాటి నుంచే పాటుపడ్డాడు..  పసి పిల్లాడిలా ఉండగానే మహిమలు ప్రదర్శించాడు.. భోగ లాలసుడిగా, నర్తకుడిగా, మహా యోధుడిగా, ప్రేమకు ప్రతిరూపంగా కృష్ణావతారాన్ని మనం చూడొచ్చు..

కృష్ణుడు మంచి రాజనీతి శాస్త్రవేత్త.. మహాభారతంలో పొలిటికల్ డైమన్షన్స్‌లో కృష్ణుడిదే కీలక పాత్ర.. సర్వ వేదాంత సారమయిన గీతా శాస్త్రాన్ని మనకి అందించిన మహాపురుషుడు.. కురుక్షేత్ర రణరంగంలో రథసారధిగా ఉంటూ అర్జునునికి గీతోపదేశం చేశాడు. అస్త్ర శస్త్రాలు త్యజించి వెన్నుచూపిన అర్జునుడిని కార్యోన్ముఖుడిని చేసిన  మార్గదర్శి..  ధర్మాన్ని రక్షించడానికి పాండవుల పక్షాన నిలిచి వారికి వెన్ను దన్నుగా నిలిచాడు..అసలు కృష్ణావతారంలో ప్రతీ ఘట్టం మన జీవితాలకు వర్తిస్తాయి.. సహాయం కోరిన వారికి ఒట్టి చెయ్యి ఎప్పుడూ చూపించలేదు. మోసాన్ని మోసంతోనే జయించాలని, ముల్లును ముల్లుతోనే తీయాలని, తగిన ఉపాయముంటే ఎంతటి అపాయం నుంచయినా బయట పడవచ్చునని రుజువు చేసి చూపాడు.

యుద్ధంలో విజయం సాధించడానికి భుజబలమే కాదు, బుద్ధిబలం ఉంటే చాలునని చూపింది కృష్ణుడే.  ఈ సూత్రం ఇవాల్టి తరానికి కూడా అతికినట్లు సరిపోతుంది.. కండ బలం కన్నా.. గుండె బలం.. బుద్ధి బలం గొప్పదని మనం మిత్రలాభం, మిత్రబేధం కథల ద్వారా తెలుసుకున్నాం కానీ.. ద్వాపర యుగంలోనే ఈ నిజాన్ని కృష్ణుడు చెప్పడమే కాదు.. చేసి చూపించాడు. దుష్ట శిక్షణ కోసం కొన్ని మహిమలు  ప్రయోగించాడు.. కౌరవుల దుర్మార్గాన్ని, దుర్బుద్ధిని దెబ్బ తీయడానికి తానే స్వయంగా సంధి వహించాడు. పాండవ పక్షపాతి అని అనిపించుకున్నా.. కౌరవులూ తనకు ముఖ్యమేనన్నట్లు నటించాడు.. కురుక్షేత్ర యుద్ధంలో  కౌరవులను తాను కావాలా లేక కోట్లది మంది సైన్యం కావాలా అని తెలివిగా ప్రశ్నించాడు.. మంద మతి అయిన దుర్యోధనుడు ఒక్క కృష్ణుడికన్నా.. కోట్లాది సైన్యం బెటర్ అనుకున్నాడు కానీ..,భగవత్ స్వరూపుడైన శ్రీకృష్ణుని శక్తిని, మహిమను గుర్తించలేకపోయాడు.. రథ, గజ, తురగ పదాతి దళాలను కౌరవుల పరం చేసి, తానొక్కడు మాత్రం పాండవుల పక్షం వహించి, వారిని విజయం వైపు నడిపించి నిరూపించాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటే..  సంఖ్య కాదు గొప్పది ..జ్ఞానం గొప్పది.. బుద్ధి బలం గొప్పది అని..

కృష్ణ రాయబార ఘట్టమూ అంతే.. పాండవులకు అయిదూళ్లిమ్మని అడగడం ద్వారా దుర్యోధనుడి అసలు బుద్ధిని బయట పెట్టిస్తాడు..ఇదంతా చేసింది కేవలం ధర్మ రక్షణ కోసమే.. కురు, పాండవ సంగ్రామం ఆపడానికి ప్రయత్నిస్తాడు మహాభారత కథలో..  దుష్ట శిక్షణ లక్ష్యాన్ని ఎజెండాగా పెట్టుకుని ముందుకు నడుస్తాడు. పాండవ పక్షపాతిలా కనిపించినా.. వారికీ ఏమీ చేసినట్లుండడు.. దుర్యోధనుడితోనూ మంచిగానే ఉన్నట్లు కనిపించినా.. ఏ సహాయమూ చేయడు.. ఇవన్నీ కూడా ఈ కాలానికీ  వర్తిస్తాయి. దుష్టులకు దూరంగా ఉండటమే కాదు.. అపాయంలో ఉపాయం ఎలా ఆలోచించాలో చెబుతాయి.దుర్మార్గులను చెండాడాలి.. ధర్మాన్ని నిలబెట్టాలి అని బోధిస్తాడు..  పెద్దలు తప్పులు చేస్తే పిల్లలు వాటిని అనుకరిస్తారు.. కాబట్టి లీడ్ రోల్ లో ఉండే వారు ఎంత జాగ్రత్తగా ఉండాలో కృష్ణ పరమాత్మ తన జీవితం ద్వారా చాటి చెప్పాడు..

ఇవాళ్టీతరం కృష్ణ తత్వాన్ని అర్ధం చేసుకోవడం చాలా అవసరం.. కృష్ణుడు న్యాయం వైపు ఉన్నాడు.. పరిస్థితులకి తగ్గట్లుగా ప్రవర్తించాడు... సర్వాంతర్యామే అయినా.. అందరితోనూ చాలా దూరంగా ఉన్నట్లు ఉంటాడు.. అదే సమయంలో కోరి పిలిస్తే.. క్షణాల్లో ఆదుకుంటాడు. ఏమీ తెలీనట్లే ఉంటాడు.. కానీ న్యాయం ఎక్కడుంటే అక్కడుంటాడు.. విజ్ఞానమే సర్వస్వం.. ఈ సూత్రం చెప్పినది కూడా  కన్నయ్యే..  భగవద్గీతలో జ్ఞాన సంపదని దోచుకోలేరని చెబుతాడు.. కష్టాలు, సవాళ్లు ఎదురయినప్పుడు.. ధైర్యంగా అడుగు ముందుకు వేయమంటాడు.. లక్ష్యాన్ని నిర్దేశించుకోమంటాడు.. మానసిక ధైర్యాన్ని అలవరచుకోమంటాడు.. ఇప్పటి తరంలో  వేగంతో పోటీ పడే ఉద్యోగులు, ముఖ్యంగా యువత కృష్ణాతత్వాన్ని ఒంట బట్టించుకోవాలి. పుస్తకాలు చదవడమే విజ్ఞానం కాదు.. భగవత్ తత్వాన్ని చూసిన వాడే సమదర్శకుడు అంటాడు.. మన భగవద్గీతను చూసి విదేశీయులు కూడా స్ఫూర్తి పొందుతున్నారు.. భగవద్గీతకు కులం లేదు.. మతం లేదు.. మానవాళికి వెలుగు రేఖలు చూపించే మార్గదర్శి ఆ గ్రంథం.. ఇప్పటితరం పరిష్కరించుకోలేని కొన్ని సమస్యలకి అందులో సమాధానాలు ఉన్నాయి.. కష్టాల కడలిని ఎలా ఈదాలో తెలుసుకోవాలంటే కృష్ణుడి జీవితమే ఒక ఉదాహారణ.. అందుకే ఈ తరం కూడా కృష్ణుడిని ఓ మేనేజ్‌మెంట్ గురుగా కొలుస్తోంది..

కృష్ణ తత్వం మానవాళిని ముందుకు నడిపించే మార్గం..  సమస్యల సుడిగుండంలో కూరుకుపోయిన వారికి అదొక రిలీవర్.. ఒత్తిడితో సతమతమయ్యే వారికి అదొక టానిక్.. అందుకే ప్రపంచ దేశాలు సైతం కృష్ణ తత్వంపై ఆసక్తి పెంచుకుంటున్నాయి.సమస్యలను ఛేదించే నిత్య జీవన సూత్రాలను తెలిపే గీతాసారం..  కృష్ణ తత్వం మనమూ తెలుసుకోవాలి.. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి

ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తనదైన శైలిలో కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో ఉన్న వాగ్దేవి విలాస్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో శ్రీకృష్ణుడి సైకత శిల్పాన్ని 2018 లో రూపొందించారు, ఇపుడు ఉందొ లేదో నాకు తెలియదు !

బాలకృష్ణుడి ఆకారంలో సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన ఈ శిల్పం అప్పట్లో చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. సైకత శిల్పం ముందుభాగంలో చిన్నికృష్ణుడి రూపం, వేణువు, వెన్నముద్ద ఆకారాలను తీర్చిదిద్దాడు. కృష్ణుడి వెనకభాగంలో విశ్వంలోని సౌరకుటుంబం, నక్షత్రాలు, పాలపుంతలు.. ఇలా నీలివర్ణ శోభితంలో ఉండేలా సైకతశిల్పాన్ని రూపొందించాడు. కృష్ణం వందే జగద్గురుం అనే సందేశం పట్నాయక్ రూపొందించిన సైకత శిల్పంలో స్పష్టమవుతోంది.

ఈ విధంగా కృష్ణకధలో ప్రతి సంఘటనలో ఎంతో తత్వం దాగి ఉంది.మీకూ మీ కుటుంబానికీ గోకులాష్టమి శుభాకాంక్షలు.
💐🙏💐

ఏకా లఘ్వీ కథా




బుద్ధిపరీక్షా

కుసుమపురం నామ నగరం అస్తి . తత్ర నందః నామ రాజా ఆసీత్ . సః నృపః నందః అతీవ బూద్ధిమాన్ .

నందస్య బుద్ధిపరీక్షా కరణీయా ఇతి ఏకదా తదాశ్రితానాం రాజ్ఞాం ఇచ్ఛా జాతా ।

 తదర్థం తే ముద్రాంకితాం ఏకాం సువర్ణపేటికాం తస్మై ప్రేషితవంతః .

పేటికాయాః అంతః ఏకః దారుఖండః ఆసీత్ . ఏకం పత్రం అపి తత్ర ఆసీత్

 పత్రే ఏవం లిఖితమ్ ఆసీత్ . అస్య దారుఖండస్య ముూలభాగః కః ? ఆగ్రభాగశ్చ కః ? ఇతి సూచనీయం . .

అనేకే బుద్ధిమంతః ఆగతాః . తే పత్రే స్థితం ప్రశ్నం పఠితవంతః . కింతు ఉత్తరం న జ్ఞాతవంతః .

చందనదాసః కశ్చన శ్రేష్ఠః వణిక్ . తస్య గృహే సుబుద్ధిః నామ కశ్చిత్ ఆసీత్ . సః పత్రవృత్తాంతం శ్రుతవాన్ . రాజసమీపం ఆగతవాన్ చ .

సుబుద్ధిః నందం ఉక్తవాన్ మహారాజ . అత్ర విచారణీయం కిం అస్తి . తం దారుదండం జలే నిక్షిపతు . యః భాగః జలే నిమజ్జతి సః మూలభాగః, యతః మూలే ఏవ భారః అధికః భవతి . యః భాగః జలస్య ఉపరి ప్లవతే సః ఆగ్రభాగః ఇతి

అనేన రాజా సంతుష్టః . సః సుబుద్ధిం ఏవ మంత్రిపదే నియోజితవాన్ .

సః ఏవ సుబద్ధిః ఏకస్మిన్ యుద్ధే భయం వినా ఘోరం యుద్ధం కృతవాన్ .

తతః ఆరభ్య సః అమాత్యరాక్షసః ఇతి ప్రసిద్ధః అభవత్ .

సంభాషణసంస్కృతం (మాసపత్రికా)

మూలం - సుగంధః (సంస్కతభారతీ)

రామాయణమ్. 26


..
త్రిశంకువు ఇక్ష్వాకు వంశపు రాజు ! ఆయనకు తన శరీరంతో స్వర్గానికి వెళ్ళాలనే కోరిక కలిగింది .ఆ కోరిక తీర్చటానికి యజ్ఞం చేయమని కులగురువు వశిష్ట మహర్షిని ఆశ్రయిస్తాడు!
అందుకు ఆయన నిరాకరించి ఇది సాధ్యమయ్యే పనికాదు అని చెప్పిపంపుతాడు .
.
త్రిశంకువు వశిష్టుడి కుమారులవద్దకు వెళ్ళి మీతండ్రి నిరాకరించగా వేరే మార్గము కానరాక మీ వద్దకు వచ్చాను నన్ను బొందితో స్వర్గానికి పంపండి అని అడుగుతాడు అందుకు వారు కూడా నిరాకరించి కులగురువు మాట పాటించని నీకు భయంకరమైన ,జుగుప్సాకరమైన రూపం కలుగుగాక అని శపిస్తారు..
.
ఆ రూపాన్నిచూసి బెదిరిపోయి అప్పటివరకు ఆయనను అంటి పెట్టుకున్న మంత్రి,సామంత,పురోహితులు,అందరూ దూరమవుతారు.
.
అప్పుడు ఆయనకు విశ్వామిత్ర రాజర్షి మదిలో మెదిలి ఆయనను ఆశ్రయించి వశిష్టుడు తనను ఎలా నిరాదరించింది,ఆయన పుత్రులు ఏవిధంగా శపించింది తెలియచెప్పి ఆయన చేయలేని పని నీవు చేయగలవు అని నీవద్దకు వచ్చాను. నన్ను సశరీరంగా స్వర్గానికి పంపగలవా! అని తన కోరిక వెలిబుచ్చాడు.
.
తన శత్రువు వశిష్టుడు నిరాకరించాడు కాబట్టి తాను చేయాలి అనే భావన తో సకల మునిగణాలనూ బెదిరించి తన ఆశ్రమానికి పిలిపించి యజ్ఞానికి శ్రీకారం చుట్టాడు. ఈయన బెదిరింపులకు లొంగని వశిష్ట పుత్రులను శపించి నాశనం చేస్తాడు .అంత నష్టపరచినా వశిష్టుడు శాంతంగానే ఉంటాడు.
.
యజ్ఞపరిసమాప్తి రోజు త్రిశంకువును శరీరంతో స్వర్గానికి పంపితే ఇంద్రుడు నిరాకరించి ఆతనిని స్వర్గం నుండి పడదోయగా త్రిశంకువు గింగరాలు తిరుగుతూ భూమిని సమీపిస్తూ కాపాడమని కేకలు వేస్తాడు.
.
తన దండం ఎత్తిపట్టి ఆతనని ఆకాశంలో ఉన్నచోటునే నిల్పి తీవ్రమైన కోపంతో భూమికి దక్షిణదిక్కుగా ఇంకొక స్వర్గాన్ని,ఇంకొక ఇంద్రుడిని ,గ్రహ తారక లను సృష్టించబూని మొదట కొన్ని గ్రహతారకలను సృష్టిస్తాడు .
.
ఈయన తలపెట్టిన కార్యంచూసి దేవతలు పరుగుపరుగున వచ్చి శాంతపరచి త్రిశంకువు చిరకాలం అలాగే తలక్రిందులుగా రోదసిలో ధృవముగా ఉండేటట్లు అనుగ్రహించి వెళ్ళిపోతారు.
.
తను తపఃశక్తి ఎంత నష్టపోయాడో గ్రహింపుకొచ్చిన ఆయన మరల తపస్సు మొదలుపెట్టి ఒకవేయిసంవత్సరములు చేస్తాడు అప్పుడు బ్రహ్మ, నీవు ఋషివయినావు అంటాడు ,మరల ఏవో భావావేశాలకు లోనయి తన తపస్సును పాడు చేసుకుంటాడు.
మరల కధమొదటికొచ్చింది తిరిగి తపస్సుచేస్తాడు ఈసారి బ్రహ్మగారు నీవు మహర్షివయినావు అంటాడు . తను చేరుకోవలసిన గమ్యం చాలా దూరమున్నది అనిగ్రహించిన ఆయన మరల తపస్సుకు కూర్చుంటాడు.
.
ఈయన తపస్సువలన తనపదవికి ఎక్కడ మూడుతుందో అని భయపడి ఇంద్రుడు మేనకను పంపిస్తాడు .మేనక అందానికి వశుడవుతాడు విశ్వామిత్రుడు! పదివేల సంవత్సరాలు సర్వం మరచి ఆవిడే లోకంగా బ్రతుకు తాడు .తను దారి తప్పిన విషయం ఒకరోజు అన్నిసంవత్సరాల తరువాత హఠాత్తుగా గుర్తుకు వస్తుంది ఆయనకు !
.
మేనకను పంపివేసి మరల తపస్సు మొదలు పెడతాడు విశ్వామిత్రుడు.
.
N.B
ఇప్పటిదాక అయిన విశ్వామిత్ర చరిత్ర మనకు చెపుతున్నదేమిటి?
1). మనిషికి భావావేశం కలిగినప్పటికీ వాటిని తన అదుపులో ఉంచుకోగల సమర్ధత కలిగి వుండాలి.భావావేశం అదుపులో ఉంచుకోవడం అంత తేలికేం కాదు . అందుకు నిరంతర సాధన కావాలి . అదే తపస్సు!
 విశ్వమిత్రుడిలో మదం,ఆతరువాత కోపం ,ఆతరువాత అసూయ ,అహంకారం ,కామం ....ఇలాంటి గుణాలన్నీ ప్రకటితమయి తానేం నష్టపోతున్నాడో వాటివల్ల గ్రహింపుకొచ్చి మరలమరల తపస్సు చేయసాగాడు! .అంటే ప్రతిసారి
Self Introspection...,Reconciliation ..చేసుకొని తనను తాను మెరుగు పరచుకొంటున్నాడు. ఇదే ప్రతిమనిషికి కావలసినది!
.
2) మన విశ్వానికి ఆవల ఎన్నో విశ్వాలున్నవి అని నేటి శాస్త్ర వేత్తలు మొన్నమొన్ననే కనుక్కున్నట్లుగా చెపుతున్నారు.
.
కానీ మన విశ్వానికి ఆవల ఇంకొక విశ్వముండవచ్చు అనే భావన భారతీయులకు రామాయణం కాలం నాటికే ఉన్నది అని త్రిశంకువు కధచెపుతున్నది ...ఇదీ భారతీయమంటే!
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

ముఖం మీద బొట్టు ఎందుకు

నేటి ధర్మ సందేహం:::::
ముఖం మీద బొట్టు ఎందుకు, ఎలా పెట్టుకోవాలి?
ఇప్పుడు ఉన్న ఈ తరం వాళ్ళకి ఖచ్చితంగా తెలియాల్సిన విషయం. వారు పాశ్చత్యులు నేర్పిన విధానం మార్చుకోవాలి.
మనకు కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రం ఉంటుంది. అది వేడిని పుట్టిస్తూ ఉంటుంది. అందుకే అక్కడ చల్లదనం కావాలి. అవసరం కూడా. పసుపు, కుంకుమ, తిలకం, భస్మం, చందనం, శ్రీచూర్ణం వగైరాలు ఈ అవసరాన్ని తీరుస్తాయి. ముఖం మీద బొట్టు గుండ్రంగా పెట్టుకోవాలా ? అడ్డం గా పెట్టుకోవాలా ? నిలువుగా పెట్టుకోవాలా? అని అడిగితే ఎవరి ఇష్టం మరియు వారి వంశాచారం ప్రకారం పెట్టుకోవాలి. ఏ బొట్టు అయినా ముఖానికి అందాన్ని, తేజస్సును ఇస్తుంది. మొత్తం మీద అడ్డంగా పెట్టుకునే భస్మం. ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేస్తుంది. నిలువుగా పెట్టుకునే శ్రీచూర్ణమ్ బ్రహ్మరంధ్రం ద్వారా జీవాత్మ చేరుకునే పరమపదాన్ని సూచిస్తుంది. కనుబొమ్మల మధ్య బొట్టు నాడీ వ్యవస్థ పై అనుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇక ఆడవారు పెట్టుకునే బొట్టు వారి సౌభాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని సూచిస్తుంది.
అందుకే ఆడవాళ్ళు ఎప్పుడు బొట్టుని ధరించాలి. స్టికర్ పెట్టడం నిషిద్ధం.
ఇక ఎవరూ ముక్కు పై భాగం లో బొట్టు పెట్టరాదు. ఇలా పెట్టడం వల్ల ఏమి ఫలితం ఉండదు.
::::::₹₹₹₹₹₹:::::::
 "కృతేయుగే నారసింహ: త్రేతాయాంరఘునందన:
 ద్వాపరే వాసు దేవశ్చ కలౌవేంకటనాయక:"
"అంజనాద్రి: వృషాద్రిశ్చ శేషాద్రి: గరుడాచల:తీర్థాద్రి: శ్రీ నివాసాద్రి: చిన్తామణి గిరిస్తథా వృషభాద్రి: వరాహాద్రి: జ్ఞానాద్రి: కనకాచల: ఆనన్దాద్రిశ్చ నీలాద్రి: సుమేరు శిఖరాచల"
::::₹₹₹₹::::.  🕉🕉

శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*



*59వ నామ మంత్రము* 10.8.2020

*ఓం మహాపద్మాటవీ సంస్థాయై నమః*

మహామహిమాన్వితమైన షట్చక్రములను పద్మములనే వనమునందుండు జగన్మాతకు  నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మహాపద్మాటవీసంస్థా* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం మహాపద్మాటవీ సంస్థాయై నమః* అని ఉచ్చరిస్తూ, ఆ కరుణామయిని పూజించితే ఆ భక్తులు ఐహికమైన ధర్మార్థకామపరమైన అభీష్టముల సిద్ధి మాత్రమే గాక పరమార్థమును సైతం పొంది తరిస్తారు.

సహస్రదళ పద్మమునకు మహాపద్మాటవి అని పేరు. ఆ మహాపద్మాటవిలో శ్రీమాత వసించుచున్నది.

ఆజ్ఞాచక్రమునకు పై భాగము నందు సహస్రదళ పద్మము ఉండును. అందు శ్రీమాత విరాజిల్లుచున్నదని ఈ నామ మంత్రములోని భావము. *ఇది పిండాండ విషయము*.

ఈ శరీరమే ఒక పద్మాటవి అనబడును. షట్చక్రములు, డెబ్బది రెండు నాడులు మొదలైనవన్నియును మహాపద్మములు అగును. ఇందు బ్రహ్మరంధ్రము నందలి సహస్రార కమలమునందు శ్రీదేవి విరాజిల్లుచుండును. మూలాధారమునందలి *కుండలినీ* శక్తిని జాగృతము చేసి సుషుమ్నా మార్గమున బ్రహ్మరంధ్రమును చేర్చినవారికి భవానీమాత సాక్షాత్కారమగును. సూర్యకిరణ తేజస్సు ద్వారా పద్మాలు వికసిస్తాయి. శుక్రము యొక్క సూక్ష్మముగా ఉండే ధాతువును ఓజస్సు, తేజస్సు, సహస్సు, భ్రాజస్సు లంటారు. వెన్నెముక మధ్యలో ఉండు సుషుమ్నా మార్గము ద్వారా ఊర్ధ్వ గతిలో పోయే కుండలినీ శక్తి తేజస్సు పైకి ప్రసరిస్తుంది. షట్చక్రములను ఛేదిస్తూ సహస్రారం చేరుతుంది. అచ్చటనుండి శ్రీమాత తమ చరణముల ద్వారా అమృత ధారలు కురిపిస్తుంది. అచ్చట షట్చక్రములు వికసిస్తాయి. వీటిపైన సహస్రార పద్మంలో శివ దేవునితో ఐక్యమై ఆనందమనుభవిస్తారు. కావున మహాపద్మటవీ సంస్థా అనబడుచున్నది. *ఇది పిండాండ విషయము*.

బ్రహ్మాండోపరిభాగమునందు మూడులక్షల యోజనముల విస్తీర్ణమైన మహాపద్మాటవి గలదు. అచట బంగారు వర్ణ పద్మముల నుండి సుధాసారము వంటి మకరంద ఝరులు ప్రవహించుచుండును. శ్రీగంధ సువాసనతో చల్లని గాలులు నిత్యము వీచుచుండును. ఇందుండే చింతామణి గృహమునందు పంచబ్రహ్మాసనమున శ్రీదేవి విరాజిల్లుచున్నది. *ఇది బ్రహ్మాండ విషయము*.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* అనుగ్రహముతో, వారి విరచితమైన *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🕉🕉🕉నేడు సోమ వారము🌻🌻🌻ఇందు వారము అని కూడా అంటాము🔱🔱🔱నీలకంఠుని ఆరాధించు పవిత్రమైన దినము🙏🙏🙏 *ఓం నమశ్శివాయ* అనే ఈ పంచాక్షరిని పదిసార్లు మననం చేసుకుందాము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - పదియవ అధ్యాయము*

*దేవాసుర సంగ్రామము*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*10.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*తస్యాసన్ సర్వతో యానైర్యూథానాం పతయోఽసురాః|*

*నముచిః శంబరో బాణో విప్రచిత్తిరయోముఖః॥6679॥*

*10.20 (ఇరువదియవ శ్లోకము)*

*ద్విమూర్ధా కాలనాభోఽథ ప్రహేతిర్హేతిరిల్వలః|*

*శకునిర్భూతసంతాపో వజ్రదంష్ట్రో విరోచనః॥6680॥*

*10.21 (ఇరువది రెండవ శ్లోకము)*

*హయగ్రీవః శంకుశిరాః కపిలో మేఘదుందుభిః|*

*తారకశ్చక్రదృక్ శుంభో నిశుంభో జంభ ఉత్కలః॥6681॥*

*10.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*అరిష్టోఽరిష్టనేమిశ్చ మయశ్చ త్రిపురాధిపః|*

*అన్యే పౌలోమకాలేయా నివాతకవచాదయః॥6682॥*

నలువైపుల తమ తమ విమానములపై సేనాపతులు కూర్చొనియుండిరి. వారిలో ప్రముఖులు నముచి, శంబరుడు, బాణుడు, విప్రచిత్తి, అయోముఖుడు, ద్విమూర్ధుడు, కాలనాభుడు, ప్రహేతి, హేతి, ఇల్వలుడు, శకుని, భూతసంతాపుడు, వజ్రదంష్ట్రుడు, విరోచనుడు, హయగ్రీవుడు, శంకుశిరుడు, కపిలుడు, మేఘదుందుభి, తారకుడు, చక్రాక్షుడు, శుంభుడు, నిశంభుడు, జంభుడు, ఉత్కలుడు, అరిష్టుడు, అరిష్టనేమి, త్రిపురాధిపతియైన మయుడు, పౌలోముడు, కాలేయుడు, నివాతకవచులు మొదలగువారు ఉండిరి.

*10.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*అలబ్ధభాగాః సోమస్య కేవలం క్లేశభాగినః|*

*సర్వ ఏతే రణముఖే బహుశో నిర్జితామరాః॥6683॥*

వీరు అందరు సముద్రమథనమునందు పాల్గొనియుండిరి. కాని,వారికి అమృతములో భాగము దొరకలేదు.  కేవలము కాయకష్టమే మిగిలినది. వీరు అందరును పెక్కు పర్యాయములు దేవతలను యుద్ధమునందు ఓడించియుండిరి.

*10.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*సింహనాదాన్ విముంచంతః శంఖాన్ దధ్ముర్మహారవాన్|*

*దృష్ట్వా సపత్నానుత్సిక్తాన్ బలభిత్కుపితో భృశమ్॥*

కనుక, వారందరును సమరోత్సాహముతో సింహనాదమొనర్చుచు బిగ్గరగా శంఖములను పూరించుచుండిరి. రణోత్సాహముతో వచ్చుచున్న శత్రువులను జూచి, ఇంద్రుడు మిగుల కుపితుడాయెను.

*10.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*ఐరావతం దిక్కరిణమారూఢః శుశుభే స్వరాట్|*

*యథా స్రవత్ప్రస్రవణముదయాద్రిమహర్పతిః॥6685॥*

ఆ ఇంద్రుడు తన వాహనమైన ఐరావతమను దిగ్గజమును అధిరోహించి యుండెను. ఆ గజము యొక్క కపోలముల నుండి మదజలము స్రవించు చుండెను. అప్పుడు అతడు పెక్కు సెలయేళ్ళు ప్రవహించుచున్న ఉదయాద్రిపై ఆరోహించి యున్న సూర్యభగవానునివలె శోభిల్లుచుండెను.

*10.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*తస్యాసన్ సర్వతో దేవా నానావాహధ్వజాయుధాః|*

*లోకపాలాః సహ గణైర్వాయ్వగ్నివరుణాదయః॥6686॥*

ఇంద్రునకు నలువైపుల దేవగణములు, ఇంకను వాయువు, అగ్ని, వరుణుడు మొదలగు లోకపాలురు తమ తమ గణములతో రక్షణగా నిలచియుండిరి. ఆ దేవ గణములు, తమతమ వాహనములను, ధ్వజములను, ఆయుధములను కలిగియుండిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

అష్టవిధ బ్రాహ్మణులు

ధర్మశాస్త్రాలు బ్రాహ్మణుని స్థాయిని బట్టి 8 విధాలుగా వర్ణించాయిట. అవి:

*మాత్రుడు:*
బ్రాహ్మణకులంలో జన్మించినా, ఉపనయనము, అనుష్ఠానమూ లేని వాడు.

*బ్రాహ్మణుడు:*
వేదాలను కొంతమేరకే అధ్యయనం చేసినవాడు. అయితే, ఆచారమూ, శాంతి, సత్యము, దయ కల వాడు, ఆ బుద్ధి కలిగినవాడు.

*శ్రోత్రియుడు:*
కనీసం ఒక వేదం శాఖను, కల్ప సూత్రాలతో, షడంగములతో,అధ్యయనం చేసి, యజ్ఞాది షట్కర్మలను చేసేవాడు.

*అనుశాసనుడు:* వేదాలను, ఉపనిషత్తులను అధ్యయనం చేసి అర్థం చేసుకున్నవాడు; నిర్మలమైన చిత్తం కలిగి శ్రోత్రియుడి లక్షణాలు కలవాడు.

*బ్రూణుడు:* 
యజ్ఞయాగాదులు, వేదాధ్యయనము, వ్రతాలు చేస్తూ, ఇంద్రియాలను జయించినవాడు; అనుశాసనుడి లక్షణాలు కలవాడు.

*ఋషికల్పుడు:*
వైదిక, లౌకిక వ్యవహారములు తెలిసి, గృహస్థుగా వున్నవాడు; బ్రూణుడి లక్షణాలు కలవాడు.

*ఋషి:*
తపస్వి;  కామమూనూ, ఆకలినీ జయించినవాడు, సత్యసంధత కలిగినవాడు; వరములను, శాపములను ఇవ్వగలిగినవాడు.

*ముని:*
అరిషడ్వర్గములను, ఇంద్రియములను, జయించినవాడు; వస్తుసంపదలపై మోహము లేనివాడు; మౌనియై సమాధి స్థితి పొందినవాడు....

సేకరణ

భగవద్ గీత*


శ్రీ కృష్ణుడు తన జీవిత కాలంలో రెండు గానాలు చేశాడట. ఒకటి వేణు గానం, రెండవది గీతా గానం.
శ్రీ కృష్ణ పరమాత్మ వేణు గాన మాధుర్యాన్ని ఆ కాలము లోని వారు విని ధన్యులవుతే... ఆ భాగ్యానికి నోచుకోని మనకు, దానికి మిన్నగా (మన భావన) అందించిన గానమే గీతా గానం. ఈ గానమృతములో లీనమైన వారి పాపాలన్నీ తొలగి పోతాయి.
గీతా పఠనావశ్యకత తెలుపుతూ... వేదముల సారభూతంగా శ్రీ కృష్ణుని చేత అర్జునుడికి చెప్పబడిన గీత పరమానంద స్వరూపమైనది. తనను ఆశ్రయించిన వారికి తత్వ జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని వరాహ పురాణము తెల్పిన మాట.
*కోరికలు* లేనటువంటి కర్మలను ఆచరించడం ద్వారా *భక్తి* కలుగుతుంది.
భక్తి *జ్ఞానానికి* మార్గం చూపుతుంది.
జ్ఞానం *మోక్షానికి* హేతువవుతుంది.
త్యాగం, యోగం, యజ్ఞం, తపస్సు ఈ నాటి జన సామాన్యానికి అనుభవంలో లేని అంశాలు.
అవుతే ఆనాడే శ్రీ కృష్ణ పరమాత్మ తన గీతోపదేశములో వీటిలోని మరో కోణాన్ని అందించారు. దాన్ని ఆచరణలో పెట్టే నట్లవుతే సమాజములో కొత్త వెలుగులు ప్రసరిస్తాయి.
అడవికి చేరి అన్నం, నీరు వదిలి తపస్సు చేసిన మహర్షులనెందరి గురించో విన్నాము. ఈనాడు అది అసాధ్య మవుతున్న పరిస్తితులలో *గీత సూచించిన మార్గమే శరణ్యం, ఆచరణ సాధ్యం కూడా*.
*శారీరకం, వాచికం మరియు మానసికం* అను మూడు విధాలుగా ఇది అలరారుతుంది.
1) సుగుణాలను అలవర్చుకుని దేవతలను, పెద్దలను, గురువులను, మహనీయులైన వారిని పూజించటం *శారీరక తపస్సు*.
2) ప్రేమగా మాట్లాడడం, నిజానికి కట్టుబడి ఉండడము, నిత్యం భగవత్ అధ్యయనం చేయడం *వాచికమైన తపస్సు*.
3) మనస్సును నిర్మలంగా ఉంచడం, భావ శుద్ధిని కలిగి ఉండడము *మానసిక తపస్సు*.
మూడు రకాలైన ఈ సాధనలను నిరంతరము ఆచరణలో పెట్టడం ఒక తపస్సని...నిజాయితీగా ప్రయత్నించే వారికి ఇది సాధమవు తుందని చెబుతుంది గీత.

దితి – కశ్యపుడు



కశ్యప ప్రజాపతికి పదమూడు మంది భార్యలు. ఆయన తన 13 మంది భార్యల తోను ధర్మ బద్ధమయిన జీవితం కొనసాగిస్తున్నాడు.

ఒకరోజు సాయంకాలం ఆయన అగ్నికార్యం చేసుకుంటున్నాడు. అసుర సంధ్యా సమయం ప్రారంభం అయింది. ఆయన సాక్షాత్తుగా రాశీ భూతమయిన తపశ్శక్తి. అటువంటి మహానుభావుడు. ఆయన దగ్గరికి ‘దితి’ వచ్చి ఆయనతో ఒక మాట అంది – “నామీద మన్మథుడు బాణ ప్రయోగం చేశాడు. నేను ఆ బాణ ప్రయోగపు తాకిడికి తట్టుకోలేక నిలువెల్లా కదిలిపోతున్నాను. నీవు నా భర్తవి. అందుచేత నీవు నన్ను అనుగ్రహించి నాలో కలిగిన ఈ కామావేశమునకు ఉపశాంతిని కలిగించు’ అని చెపుతూ ఆవిడ ఒకమాట చెప్పింది. ‘నేను ఇలా అడగడం వెనకాల ఒక రహస్యం ఉంది’ అంది.

‘అదేమిటో చెప్పవలసింది’ అని అడిగాడు కశ్యపుడు.
ఆవిడా అంది ‘నీకు 13 మంది భార్యలు ఉన్నారు. మేమందరం ఏకగర్భ సంజాతులం. 13 మందినీ ప్రజాపతి నీకిచ్చి వివాహం చేశాడు. అందులో 12 మందికి సంతానం కలిగారు. ఇంకా నాకు సంతానం కలుగలేదు. సాధారణంగా భార్యాభర్తల అనుబంధంలో ఒక గొప్ప సిద్ధాంతం ఉంది. ‘ఆత్మావై పుత్రనామాసి’ – భర్త భార్యకు అపురూపముగా ఇచ్చే కానుక ఏది? తానే తన భార్య కడుపున మళ్ళా ఉదయిస్తాడు.

ధర్మపత్ని విషయంలో అది ధర్మం. ఒక దీపమును పట్టుకు వెళ్ళి ఇంకొక దీపమును వెలిగిస్తాము. రెండు జ్యోతులు వెలుగుతున్నట్లు కనపడుతుంది. కానీ వత్తులు పొడుగు పొట్టి ఉండవచ్చు. ప్రమిదల రంగులలో తేడా ఉండవచ్చు. కానీ దీపశిఖ మాత్రం సమాన ధర్మమును కలిగి ఉంటుంది. దీపం చివర వెలుగుతున్న జ్యోతి మాత్రం ఒకటే. రెండు దీపముల జ్యోతికి తేడా ఉండదు. కాబట్టి తండ్రికి, కుమారుడికి భేదం లేదు.

తండ్రికీ, కుమారుడికీ భేదం లేకపోయినా రెండుగా కనపడేటట్లు చేయగలిగిన శక్తి ఈ ప్రపంచంలో ధర్మపత్ని ఒక్కతే. ఆవిడ మాత్రమే ఈ అధికారమును పొంది ఉంటుంది. ఆయన తేజస్సును తాను గ్రహించి తన భర్తను కొడుకుగా ప్రపంచము నందు నడిచేటట్లు చేయగలదు. కాబట్టి నీ తేజస్సును నాయందు ప్రవేశపెట్టమని అడుగుతున్నాను. ధర్మమునకు లోపము ఎక్కడ ఉంది? నాకు సంతానమును కటాక్షించు’ అంది.

ఆవిడ ఎంత ధర్మబద్ధంగా అడిగిందో చూడండి!అపుడు ఆయన అన్నాడు – ‘దితీ! నీవంటి భార్య దొరకడం నాకు చాలా సంతోషం. కానీ ఒక్కమాట చెపుతాను వినవలసింది.

ఇది ఉగ్రవేళ. అసుర సంధ్యా కాలంలో పరమశివుడు వృషభ వాహనమును అధిరోహించి భూమండలం మీద తిరుగుతాడు. ఈ సమయంలో ఆయన వెనక భూత గణములు వెడుతూ ఉంటాయి. వాళ్ళు చాలా ఉగ్రమూర్తులై ఉంటారు. వాళ్లకి ఆ సమయంలో శివుడి పట్ల ఎవరయినా అపచారముగా ప్రవర్తిస్తే శంకరుడు ఊరుకోవచ్చునేమో కానీ, ఆయన చుట్టూ ఉన్న గణములు అంగీకరించవు. చాలా తీవ్రమయిన ఫలితమును ఇచ్చేస్తారు. అందుచేత కొంతసేపు తాళవలసినది. ఒక్క ముహూర్త కాలము వేచి ఉండు. నీకు కలిగిన కోరికను భర్తగా నేను తీరుస్తాను’ అన్నాడు.
దితికి అటువంటి బుద్ధి కలిగింది.

భాగవతంలో ధర్మ భ్రష్టత్వము ఎక్కడ వస్తుందో మీరు గమనించాలి. ఆవిడ ఒక వెలయాలు ప్రవర్తించినట్లు కశ్యప ప్రజాపతి పంచెపట్టి లాగింది. అపుడు ఆయన ఈశ్వరునికి నమస్కారం చేసి, తానూ ధర్మపత్ని పట్ల ఇంతకన్నా వేరుగా ప్రవర్తించకూడదు అనుకోని, ఆవిడ కోరుకున్న సుఖమును ఆవిడకు కటాక్షించి, స్నానం, ఆచమనం చేసి తన కార్యమునందు నిమగ్నుడయిపోయాడు.

కొంతసేపు అయిపోయిన తరువాత దితికి అనుమానం వచ్చింది. చేయరాని పని చేశాను. దీని ఫలితము ఉగ్రముగా ఉంటుందేమోనని పరమశివుడికి, రుద్ర గణములకు క్షమాపణ చెప్పింది. కానీ అప్పటికి జరగవలసిన అపకారం జరిగిపోయింది. దితి చేసిన అకార్యమును భూత గణములలో భద్రాభద్రులు అనే వారు చూసి ఉగ్రమయిన ఫలితమును ఇచ్చేశారు.

పిమ్మట దితి కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి ‘అయ్యా, నా కడుపున పుట్టే బిడ్డలు ప్రమాదం తీసుకురారు కదా’ అని అడిగింది. అపుడు కశ్యప ప్రజాపతి అన్నాడు ‘నేను వద్దని చెప్పాను. కానీ నీవు వినలేదు. నీ కడుపున పుట్టబోయే ఇద్దరు బిడ్డలు కూడా లోక కంటకులు అవుతారు. వాళ్ళు పుట్టగానే ఆకాశం నెత్తురు వర్షిస్తుంది. నక్కలు కూస్తాయి. వాళ్ళు కొన్నివేల స్త్రీల కళ్ళమ్మట నీళ్ళు కార్పిస్తారు. ఋషులను, బాలురను, బ్రాహ్మణులను, బ్రహ్మచారులను, వేదములను, దేవతలను అవమాన పరుస్తారు. చిట్టచివరికి వాళ్ళు శ్రీహరి చేతిలో అంతమును పొందుతారు’ అని చెప్పాడు.

ఈ మాటలను విని దితి బావురుమని ఏడ్చింది. ‘చివరకు నాకు ఇంత అపఖ్యాతా? దీనికి నీవారణోపాయం లేదా’ అని అడిగింది. అపుడు కశ్యపప్రజాపతి ‘దీనికి పశ్చాత్తాపమే నివారణోపాయం. నీవు చాలా పశ్చాత్తాపం పడుతున్నావు. నీవు చేసిన దోషం పోదు. కానీ నీవు మహా భక్తుడయిన మనవడిని పొందుతావు.

హిరణ్యాక్ష హిరణ్యకశిపులలో ఒకనికి మహాభక్తుడయిన కుమారుడు పుడతాడు. నీ పశ్చాత్తాపము వలన ఒక మహాపురుషుడు, ఒక మహాభక్తుడు జన్మిస్తాడు. మనవడు అటువంటి వాడు పుడతాడు. కానీ అసురసంధ్య వేళలో నీవు చేసిన దుష్కృత్యము వలన కొడుకులు మాత్రం దుర్మార్గులు పుట్టి శ్రీహరి చేతిలో మరణిస్తారు’ అని చెప్పాడు.

భాగవతం కాలస్వరూపం ఎలా ఉంటుందో, ప్రమాదములు ఎక్కడ నుండి వస్తాయో బోధ చేస్తుంది. దితి మహా పతివ్రత. అప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా! అసలు పిల్లలను కనడం మానివేసింది. కడుపులో ఉంచేసింది. వాళ్ళు బయటకు వస్తే చంపేస్తారేమోనని నూరు సంవత్సరములు గర్భమునందు ఉంచేసింది.

అపుడు ఆ గర్భము నుంచి తేజస్సు బయలుదేరి లోకములను కప్పేస్తోంది. అపుడు అందరూ వెళ్ళి మళ్ళా మొరపెట్టుకున్నారు. దితి గర్భము నుండి వస్తున్న తేజస్సు లోకములను ఆక్రమిస్తోంది. కాబట్టి ఆవిడ బిడ్డలను కనేటట్టు చూడమని కశ్యప ప్రజాపతిని ప్రార్థించారు.

అపుడు కశ్యప ప్రజాపతి దితితో – ‘నీవు చేస్తున్న పని సృష్టి విరుద్ధం. నీ బిడ్డలను కనవలసింది’ అని చెప్పాడు. అపుడు దితికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు జన్మించారు.
ఆ పుట్టేవాళ్ళు ఎలా ఉంటారో కశ్యప ప్రజాపతికి ముందరే తెలుసు. వాళ్లకి ఆ పేర్లు కశ్యప ప్రజాపతే పెట్టారు. అందుకే ‘హిరణ్య’ ముందు పెట్టి ఒకనికి ‘అక్షి’, రెండవ వానికి ‘కశ్యప’ అని చేర్చి, ఒకనికి ‘హిరణ్యాక్షుడు’, రెండవ వానికి ‘హిరణ్యకశిపుడు’ అని పేర్లు పెట్టారు.

ఒకడు కనబడ్డ దానినల్లా తీసుకువెళ్ళి దాచేస్తాడు. ఒకడికి ఎంతసేపూ తానే గొప్పవాడినని, తానే భోగం అనుభవించాలని భావిస్తూ చివరకు యజ్ఞములు, యాగములు కూడా తనపేరు మీదనే చేయించుకుంటాడు. ఇద్దరూ అహంకార మమకారములే! ఈవిధంగా హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు ఇద్దరు దితి గర్భమునుండి జన్మించారు.

హిరణ్యాక్షుడు పుట్టీ పుట్టడం తోటే దుర్నిమిత్తములు అన్నీ కనబడ్డాయి. వాడు ఆకాశమంత ఎత్తు పెరిగిపోయాడు. వాడికి పుట్టినప్పటి నుంచి యుద్ధం చేయాలనే కోరికే! యుద్ధం కోసం అనేకమంది దగ్గరకు వెళ్ళాడు.

చిట్టచివర సముద్రం లోపల ఉన్న వరుణుడి దగ్గరకి వెళ్ళాడు. వెళ్ళి ‘ఏమయ్యా, నీవు ఎక్కడో సముద్రంలో ఉంటావు. నా భుజముల తీట తీరాలి. అందుకని నీవు వచ్చి నాతొ యుద్ధం చెయ్యి’ అన్నాడు. అపుడు వరుణుడు ‘నాకు నీతో యుద్ధం ఎందుకు? నీకోసం వచ్చేవాడు ఒకాయన ఉన్నాడు. నీవు ఎవరి చేతిలో చావాలని నిర్ణయం అయిందో వాడు వచ్చే సమయం అయిపొయింది. నీవు ఒక పర్యాయం సముద్రం మీదకు వెళ్ళు. ఆయన కనపడతాడు. ఆయనతో యుద్ధం చెయ్యి’ అన్నాడు.

ఈ విషయం వరుణుడు ఎలా చెప్పగలిగాడు? అంటే దీనికి వెనుక ఇంకొక ఆఖ్యానం కలుస్తుంది. భద్రాభద్రులు అనే రుద్ర గణములు చూసి దితి యందు ఉగ్రమయిన బిడ్డలు పుట్టాలని ఎప్పుడయితే నిర్ణయం జరిగిందో, అప్పుడు ఒక సంఘటన జరిగింది. పురాణము ఎంత శివ కేశవుల అభేదముగా నడుస్తుందో చూడండి....!

ఓం నమో భగవతే వాసుదేవాయ 

ధనిష్ఠ_నక్షత్రం

ధనిష్ఠ, మృగశిర, చిత్త ఇవి కుజుడు నక్షత్రాలు. వీరికి కుజ దశలో జీవితం ప్రారంభం అవుతుంది.

కుజ దశ 7 సంవత్సరాలు. తదుపరి
రాహు దశ 18 వత్సరాలు,
గురు దశ 16 వత్సరాలు,
శని దశ 19 వత్సరాలు,
బుధ దశ 17 వత్సరాలు,
కేతువు దశ 7 వత్సరాలు,
శుక్ర దశ 20 వత్సరాలు క్రమంగా వర్తిస్తాయి.

ఈ నక్షత్రానికి దోషం లేదు. 18, 25, 40, 50, 55, 60 సంవత్సరం లలో గoడాలు వస్తాయి. వీరు దాతృత్వం, కళల యందు ఆసక్తి కలవారు, శ్రమ జీవి అవుతారు.

ధనిష్ఠ 1వ పాదం సింహ నవాంశ వీరు రాజసం, ధైర్యసాహసాలు, పనియందు నేర్పు కలిగి యుంటారు.
2 వ పాదం కన్య నవాంశ వీరు వాణిజ్యం, విద్య యందు చక్కటి రాణింపు కలిగి యుంటారు.
3 వ పాదం తుల నవాంశ వీరు కళల యందు రాణిస్తారు, ఆకర్షణ ఎక్కువ.
4 వ పాదం వృశ్చిక నవాంశ వీరు కోపం, అడ్మినిస్ట్రేషన్ యందు రాణింపు, అలాగే కొంత తీవ్ర స్వభావం కలిగి యుంటారు.

వీరికి చిత్త ధనిష్ఠ లు జన్మతారలు. స్వాతి, ఆర్ద్ర, శతభిష సంపత్ తారలు. ఉత్తరాభాద్ర, పుష్యమి, అనురాధ క్షేమ తారలు. అశ్విని, మఖ, మూల సాధన తారలు. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ మిత్ర తారలు. రోహిణి, హస్త, శ్రవణ పరమ మిత్ర తారలు.

ధనిష్ఠ కి అధిపతి కుజుడు. కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి అధిపతి. సుబ్రహ్మణ్య ఆరాధన గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అలాగే, భగలాముఖి ఆరాధన గొప్ప ఫలితాన్ని మంచి అనుకూలతని విజయాల్ని ఇస్తుంది.

రేపు శతభిష నక్షత్ర విశేషములు

శ్రీ ఆంజనేయ కరావలంబ స్తోత్రం.


శ్రీ🌹
శ్రీరామ జయరామ జయ జయరామ..!!🙏

శ్రీ మత్కిరీట మణిమేఖాల వజ్ర కాయ॥
భోగేంద్ర భోగమణి రాజిత రుద్రరూప
కోదండ రామ పాదసేవన మగ్నచిత్త ॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్

బ్రహ్మేంద్ర రుద్రా మరుదర్క వారైద్విభావ్య॥
భక్తార్తి భంజన దయాకర రామదాస
సంసార ఘోర గహనే చరతోజితారే:॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్

సంసార కూ ప మతి ఘోర మఘాధ మూలం ॥
సంప్రాప్య దు:ఖ విష సర్ప వినష్ట్ర మూ ర్తే
ఆర్తన్య దేవ కృపయా పరిపాలితస్య ॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్

సంసార ఘోర విష సర్ప భయోగ్ర దం ష్ట్ర॥
భీతస్య దుష్టమతి దైత్య భయంకరేణ
ప్రాణ ప్రయాణ భవభీతి సమాకులస్య ॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్

సంసార కూప మతిమజ్జన మొహితస్య॥
భుజానిఖేద పరిహార పరావదార
లంకాదిరాజ్య పరిపాలన నాశహేతో॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్

ఏకేణ ఖడ్గ మపరేణ కరేణ శూలమ్॥
ఆదిత్య రుద్ర వరుణాది నుత ప్రభావ
వరాహ రామ నరసింహ శివాది రూప ॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్

ఆoజనేయ విభవే కరుణా కరాయ॥
పాప త్రయోప శయనాయ భవోషధాయ
త్రిష్టాది వృశిక జలాగ్ని పిశాచ రోగ ॥
కలేస వ్యయాయ హరయే గురవే నమస్తే.

భాగవతం - 25

శుకబ్రహ్మ రావడంలో ఒక గొప్పతనం ఉంది. ఒక సమస్య ఏర్పడడం గొప్పతనం కాదు. కలియుగ ప్రవేశం జరిగితే దానివల్ల ప్రభావితుడయినవాడు పరీక్షిన్మహారాజు గారు ఒక్కడే కాదు – కలియుగంలో ఉన్న మనం అందరూ కూడా కలి చేత బాధింపబడుతున్న వాళ్ళమే. కాబట్టి ఇప్పుడు కలి బాధనుండి తప్పుకోవడానికి మార్గం ఏదయినా ఉంటుందా –

ఇది చెప్పేవాడు ఎవరయినా ఉండాలి. మనం అందరం కలి బాధలను పడుతున్నాము. కలి ప్రభావం మనమీద ప్రసరించకుండా ఉండడం కోసమని మనం చేయవలసిన ప్రయత్నము నయినా చెప్పగలిగిన సమర్థుడు ఒకడు రావాలి. అటువంటి సమర్థుడు ఇప్పుడు వచ్చాడు. ఆయనే శుకుడు.

ఇక్కడ మన ఒక విషయమును పరిశీలించాలి. ఎవరికయినా మృత్యువు ఆసన్నమయిపోయిందని చెప్పారనుకోండి – ‘అయ్యా మీరు ఇక రెండు మూడు రోజులలో వెళ్ళిపోతారు’ అని చెప్పారనుకోండి –

అప్పుడు ఆ చనిపోబోయే ఆయన దగ్గరకు ఎవరయినా వెళ్ళి ‘అయ్యా, మీకు కొన్ని మంచి విషయములు చెపుదామని వచ్చామండి – మీకు భాగవతము చెపుదామని వచ్చామండి’ అని అన్నారనుకోండి – వాడు ఆ మంచి విషయమును వినడానికి అంగీకరించడు.

ఇప్పుడు ఎందుకండీ అంటాడు. ‘చచ్చేవేళ సంది మంత్రం’ అని మన వాళ్ళు ఒక మోటు సామెత ఒకటి చెపుతూ ఉంటారు. అపుడు సామాన్యమయిన వ్యక్తి చచ్చే వేళ ఎవరు రామాయణం గురించి, భాగవతం గురించి విందామని అనుకుంటాడు?

ఎవడికయినా ఎలా ఉంటుంది అంటే – ఆ ఉన్న రెండు రోజులు భార్యాబిడ్డలను చూసుకోవాలని అనిపిస్తుంది. కానీ ఇక్కడ పరీక్షిన్మహారాజు గారు ఒక గొప్ప విషయం చేశాడు. శుకమహర్షి వస్తే ఈయనను ఎవ్వరూ వేయని ప్రశ్న ఒకటి వేశాడు. పరీక్షిన్మహారాజు గారు అన్నాడు –

‘ఏడు రోజులలో నాకు మరణము ఖాయమన్న విషయము తెలిసిపోయినది. నేను పాముచేత కరవబడతానని శృంగి శపించాడు. శృంగి నన్ను శపించాడని నేను ఎంతమాత్రమూ ఖేదపడడం లేదు. కానీ నేను పరమ ధార్మికులయిన పాండవుల వంశములో జన్మించిన వాడనయి, తపస్సు చేసుకుంటున్న బ్రాహ్మీ మూర్తియై వున్న ఒక మహర్షి మేడలో మృత సర్పమును వేశాను. నేను చేయరాని పనిని చేశాను అని బాధపడుతున్నాను.

శృంగి నన్ను ఎలా శపించాడో అలాగే ఈ శరీరమును తీసుకువెళ్ళి ఆ పాముకి అప్పచేప్పేస్తాను. నేను నా మరణాన్ని అంగీకరిస్తున్నాను. నాకు భవిష్యత్తులో మళ్ళా జన్మము వచ్చినప్పుడు నా మనస్సు ఎప్పుడూ శ్రీమహావిష్ణువునే స్మరిస్తూ ఉండాలి. ఎక్కడయినా స్వామి వారి ఉత్సవమూర్తి కనపడ్డా, స్వామి దేవాలయం కనపడ్డా, గభాలున శిరస్సువంచి నమస్కరించగలిగిన సంస్కార బలం నాకు కావాలి. ఆ స్వామి గురించి నాలుగు మాటలు చెప్పేవాడు దొరికితే చాలు పరుగెత్తుకుంటూ వెళ్ళి వాని మాటలు వినే జిజ్ఞాస నాకు కలుగు గాక! నిరంతరమూ ఈశ్వరుని పాదసేవనము చేయగలిగిన కర్మేంద్రియములు నాకు కావాలి. నేను దానిని అర్థిస్తున్నాను. ఇది కలిగేటట్లుగా మీరందరూ నన్ను అనుగ్రహించ వలసినది. నాకు ఆశీర్వచనం చేయవలసింది’ అని ప్రార్థించాడు.

ఉత్తర జన్మలో ఉత్కృష్టమయిన జన్మ కావాలని ఆయన అడగలేదు. ఆయన అడిగింది – ఏ జన్మలో ఉన్నా, ఏ శరీరములో ఉన్నా కావలసినవి ఏమిటో వాటిని అడిగాడు పరీక్షిత్తు. ‘హరిచింతారతియున్’ ‘హరి ప్రణుతి’ ‘భాషాకర్ణనాసక్తియున్’ ‘హరిపాదాంబుజసేవయుం’ ఈ నాలుగూ నాకు కావాలి అని అడిగాడు.

శుకబ్రహ్మ వచ్చి కూర్చుని ఉంటే శుకబ్రహ్మకు పాదప్రక్షాళనం చేశాడు. ఆచమనీయం ఇచ్చాడు. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఒకమాట చెప్పాడు. ‘అయ్యా, నాకు ఒక్క కోరిక ఉంది. నేను మళ్ళా పుట్టవలసిన అవసరం లేని మోక్షమును పొందడానికి కల్పవృక్షంలా మీరు వచ్చారు. మీరు ఒకచోట ఉండేవారు కాదు. అటువంటిది మీరు అనుకోకుండా వచ్చి నన్ను అనుగ్రహించారు కనుక, నాకు అటువంటి విషయము ఏది ఉన్నదో దానిని నాకు తెలియజేయవలసినది’ అని ప్రార్థించాడు.

భాగవతం - ద్వితీయస్కంధము – 25

భాగవతంలో శుకుడు రావడమే ఒక పవిత్ర ఘట్టం. అటువంటి శుకబ్రహ్మ వచ్చి పరీక్షిత్తు చెప్పిన మాటలను విన్నాడు. తనగురించి తానూ ఏమీ చెప్పుకోలేదు. కానీ ఒక్కమాట చెప్పాడు. “పరీక్షిన్మహారాజా! నేనొక విషయం చెపుతాను. జాగ్రత్తగా విను.

పూర్వం ఖట్వాంగుడు అనే ఒకరాజు ఉండేవాడు. అతడు దేవతలకు సాయం చేయడం కోసమని యుద్ధం చేయడం కోసమని భూమిని విడిచిపెట్టి రథమును ఎక్కి స్వర్గలోకమునకు వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేశాడు. చాలా దీర్ఘకాలము పోరు సాగింది. రాక్షసులు ఓడిపోయారు. తదుపరి దేవతలు అందరూ ఖట్వాంగుడిని అభినందించారు. ‘నీవు మా కోసమని పైలోకమునకు వచ్చి యుద్ధం చేశావు. నీకేమి వరం కావాలో కోరుకో’ అన్నారు. అపుడు ఆయన ‘నాకేమీ వరం అక్కర్లేదు. కానీ నా ఆయుర్దాయం ఎంత మిగిలిందో చెపుతారా’ అని అడిగాడు.

అపుడు దేవతలు వాని ఆయుర్దాయం లేక్క చూసి ఇంకొక ఘడియ మాత్రమే ఉందని చెప్పారు. తాను తరించిపోవడానికి ఆ ఒక్క ఘడియ ఆయుర్దాయం చాలునని ఖట్వాంగుడు భావించాడు. వెంటనే తన రథం ఎక్కి గబగబా భూమండలమునకు వచ్చి అంతఃపురంలోకి వెళ్ళి ఈమాట చెప్పేసి, ధ్యానమగ్నుడై ఈశ్వరుడిని ధ్యానం చేస్తూ కూర్చుని శరీరమును విడిచి పెట్టేసి మోక్షమును పొందాడు. ఒక్క ఘడియ కాలం మాత్రమే ఆయుర్దాయం కలిగిన ఖట్వాంగుడే మోక్షమును పొందగలిగాడు. నీకు ఇంకా ఏడురోజుల సమయం ఉంది. నీకు తప్పక మోక్షం లభిస్తుంది’ అని చెప్పాడు శుకుడు.

ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. ఇలా మాట్లాడిన వాడు గురువు. మరణించే వారందరికీ పరీక్షిత్తు ప్రతినిధి. నేను నేననుకున్న ఈ శరీరమే రాకుండా కట్టెదుట అగ్నిహోత్రములో కాలి దోసెడు బూడిద అయిపోతోంది ఒక్క అరగంటలో ఏది నామరూపములు? వాడు పెట్టుకుంటే ఒక ఫోటో మిగిలిపోతుందంతే! పెట్టుకోక పోతే ఏ గొడవా లేదు. కాబట్టి ఇంతటి ఆభిజాత్యం కూడా పోయిందంతే! ఈ అహంకారమును గుర్తించని కారణము చేత మరల హీనోపాధి లోకి వెళ్ళిపోతున్నావు.

అందుకని నీవు ఈశ్వరాభిముఖుడవు కావలసింది. నీకు సంబంధించన ఈ భౌతిక సంబంధములు కాని, వ్యక్తులు కాని, ఆస్తులు కాని, సంపద కాని, ఏవీ నిన్ను రక్షించవు. నీవు ఈశ్వరుడి పాదములను పట్టుకో. అవి మాత్రమే నిన్ను రక్షిస్తాయి. వివేకము తెలుసుకో అని చెప్పాడు. ఇక్కడ శుకుడు విరాడ్రూప వర్ణనమునంతా చేశాడు. చేసి హరి లేని పదార్థము లేదు. ఋషులు, సముద్రములు, భూమి, పంచామహాభూతములు ఇవన్నీ కూడా ఈశ్వరుని అంగాంగములై ఉన్నాయి. కాబట్టి ఎక్కడ చూసిన ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే.

కానీ ఈశ్వరుడు కనపడడం లేదు. ఎందుకు? అదే మాయ. అది నామ రూపముల యండు కలిగిన తాదాత్మ్యం తదధిష్టానమయిన బ్రహ్మము నందు కలుగదు. అలా కలగాలంటే మాయ తొలగిపోవాలి. ప్రపంచంలో ఉన్నది మాయ అని తెలిస్తే అది తొలగిపోతుంది. ఇది మాయ అని గురుముఖంగా తెలియగానే మాయ తొలగిపోతుంది. అప్పటివరకు తొలగదు. దానికి ఈశ్వర కృప తోడయితే తొలగుతుంది. మాయ తొలగినపుడు లోపల వున్న ఆత్మ భాసిస్తుంది. కానీ మాయ తొలగడం అనేది అంత తేలికయిన విషయం కాదు.

ఈశ్వరుని కోసం నీవు ఎక్కడా తిరగనక్కరలేదు. విశ్వము హరి... హరి విశ్వము. అజ్ఞానము చేత లోకములో ఈశ్వరుడు, లోకము ఇంకా ఇంకా అలా కనపడుతున్నాయి. కానీ జ్ఞాన నేత్రము చేత చూస్తె ఉన్నది ఒక్కటే. నీవు కానీ సక్రమముగా వినదలుచుకుంటే హరిమయము కాని పదార్థము ఈ ప్రపంచమునందు లేదు. ఇది తెలుసుకొని సమస్తము ఈశ్వరమయం జగత్ అని అంగీకరించి, అంతటా బ్రహ్మమును చూసి ఉన్నది బ్రహ్మమే అని నీవు అంగీకరించగలిగితే నీకు ఉత్తర క్షణమే మోక్షము’ అని బోధచేసి భక్తి నిలబడడానికి శుకుడు ఒక మాట చెప్పాడు.

‘నేను భక్తిగా ఉంటాను అంటే కుదరదు. నీకు ఈశ్వరుని యందు పూనిక కలగాలి. ఇంట్లో కూర్చుని భగవంతుని మీద భక్తి రావాలని అనుకుంటే రాదు. ఈశ్వరునికి ముందు నీవు నమస్కారం చేయడం మొదలుపెడితే ఆయన నీకొక దారి చూపిస్తాడు. భగవంతుని కథలు వినదమనే స్థితికి నిన్ను తీసుకువెడతాడు.

కానీ మనిషి కొన్ని కోట్ల కోట్ల జన్మల వరకు అసలు భాగవత కథవైపు వెళ్ళడు. కానీ వెళ్ళాడు అంటే అతని జీవితంలో గొప్ప మార్పు ప్రారంభమయిందన్న మాట. భగవంతుని కథలను వినడం నీవు ప్రారంభిస్తే భక్తి కలుగుతుంది. ఆ భక్తితో అంతటా నిండియుండి చూస్తున్న వాడు, చేయిస్తున్న వాడు సర్వేశ్వరుడనే భావన నీకు కలిగిన నాడు, నీకు తెలియకుండా భక్తిలో ఒక విచిత్రం ఏర్పడుతుంది.

భాగవతం మనస్సుకు ఆలంబనం ఇస్తుంది. మనస్సును మారుస్తుంది. ఈశ్వరుని వైపు తిప్పుతుంది. దీనిని అందరూ పొందలేరు. ఈ అదృష్టం పొందాలి అంటే ఈశ్వరానుగ్రహం కూడా ఉండాలి. ఎవరిని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడో వారు మాత్రమే భాగవతమును వినగలరు తప్ప అందరూ భాగవతమును వినలేరు. అందుచేత ‘నీవు భగవత్ కథా శ్రవణముతో ప్రారంభము చెయ్యి. ఈ సమస్త జగత్తును సృష్టించిన వాడు ఆయనే’ అని చెప్పాడు...

ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏

ఉత్తరాషాడ_నక్షత్రం


ఈ నక్షత్రం పూర్తిగా శుభకరం. ఇందు 1 వ పాదం ధను రాశిలో మిగతా మాడు మకర రాశిలో ఉంటాయి.

ఈ నక్షత్రానికి రవి అధిపతి, కనుక రవి మహర్దశ లో జీవనం మొదలవుతుంది.

సూర్య మహర్దశ పూర్తీ 6 వత్సరములు, తదుపరి
చంద్ర మహర్దశ 10 వత్సరములు,
కుజ మహర్దశ 7 వత్సరములు,
రాహు మహర్దశ 18 వత్సరములు,
గురు మహర్దశ 16 వత్సరములు,
శని మహర్దశ 19 వత్సరములు,
బుధ మహర్దశ 17 వత్సరములు,
కేతు మహర్దశ 7 వత్సరములు,
శుక్ర మహార్దశ 20 వత్సరములుగా వరుసగా అనుభవం లోనికి వస్తాయి.

ఇందు ఎ పాదం లో పుట్టినా దోషం లేదు. పరమాయుర్ధయం 89 వత్సరములు.
5 వ వత్సరం జ్వర భయము,
28 న అపమృత్యువు,
40న జంతు భయము,
80 న గండం. మారక గ్రహ దశలను అనుసరించి ఆయుర్దాయం వస్తుంది.

ఉత్తరాషాడ 1 వ పాదం ధనుర్ నవాంశ కావున వీరు, పాండిత్యం, సత్ప్రవర్తన, శాస్త్ర జ్ఞానం కలవారగును.
2 వ పాదం మకర నవంశ కావున మొండి తనం, సేవక భావం, వాహన యోగం కలవారగును.
3 వ పాదం కుంభ నవాంశ కావున, వీరు బద్ధకం, తీవ్ర స్వభావం, బుద్ది మాంద్యం కలవారగును.
4 వ పాదం మీన నవాంశ కావున, వీరు శాస్త్రజ్ఞులు, వివేకవంతులు, సహాయ పడే గుణం కలవారగును.

ఉత్తర, ఉత్తరాషాడ, కృత్తిక ఇవి జన్మతారలు. ఈ నక్షత్రాధిపతి రవి, ఆదివారం, కెంపు, గోధుమలు, పద్మములు, ఎర్రని వస్త్రాలు, రాగి, బంగారం, రక్త చందనం రవికి ఇష్టమైనవి.
సూర్య జపం, అర్యమారధానం, అరుణం, ఆదిత్య హృదయం, ప్రేతికరమైన వటు దానం అనుకులిస్తాయి. జప సంఖ్యా 6 వేలు. రవి కి అధిపతి రుద్ర. తాంత్రిక అధిపతి దశ మహా విద్య రూపిణి త్రిపుర భైరవి.

#సుర్య_భాగవన్_జన్మరహస్యం


ప్రత్యక్ష దైవమైన సూర్యుడు సమస్త మానవాళికి జవజీవాలను కల్పిస్తున్నాడు. ఆ భగవానుడి వల్ల మానవులే కాదు దేవతలూ మేలు పొందారని పురాణాలూ చెబుతున్నాయి. అయితే సూర్యుడు క్రియాశక్తి ప్రవృత్తి, ‪కిరణాలతో‬ దేవతలను, పితృదేవతలను, మనుషుల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. చంద్రుడు శుక్లపక్షంలో సూర్యుడిలో ఉన్న అమృతాన్ని స్వీకరించి దాన్నే తన అమృతంగా మార్చుకుంటాడు. ఆ అమృతాన్ని సౌమ్యులు, కామ్యులు అయిన దేవతలు, పితృదేవతలు ఆహారంగా గ్రహిస్తారు. మరి సూర్యభగవానుడు ఎవరు? అయన జన్మ రహస్యం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రహ్మ పురాణం ప్రకారం, కశ్యప ప్రజాపతి, అదితి దంపతుల ముద్దుల తనయుడు సూర్యుడు. ఆ సమయానికే రాక్షసుల ఆగడాలు పెచ్చుపెరిగాయి. అసురుల ఆట కట్టించగల అపార శక్తిమంతుడిని బిడ్డగా ప్రసాదించమని అదితి సౌరశక్తిని ప్రార్థించింది. విశ్వమంతా విస్తరించిన తేజస్సునే సంక్షిప్తీకరించి ఆ తల్లి కడుపున నిక్షిప్తం చేసిందా దివ్యకాంతి. పుట్టబోయే కొడుకు కోసం వ్రతాలూ ఉపవాసాలూ చేస్తున్న అదితిని చూసి కశ్యపుడు ఎగతాళి చేశాడు. బిడ్డని ఆకలితో చంపేస్తావా? అని అరిచేశాడు. ఆ మాటకు తల్లి మనసు గాయపడింది. నిరసనగా తన గర్భాండాన్ని త్యజించింది. ఆమె కడుపులోంచి నేలమీద పడగానే లక్ష అగ్నిగోళాల్లా భగభగా మండిందా అండం. ఆ వేడికి సృష్టి అతలాకుతలమైంది. అదితీకశ్యపుల ప్రార్థన తర్వాత, ఆ అండం పగిలి అందులోంచి అందమైన పసివాడు బయటికొచ్చాడు. ఆ బాలుడే భానుడు! ఆనాడు మాఘశుద్ధ సప్తమి రథసప్తమి ఆ ముహూర్తానికే ఏడుగుర్రాల రథాన్ని అధిరోహించి, వెలుగుల దేవుడిగా బాధ్యతలు స్వీకరించాడని మత్స్యపురాణం చెబుతోంది.

తల్లి కోరిక మేరకు దేవతల శత్రువులైన రాక్షసులను ఓడించినందువల్ల ఆదిత్యుడని పిలవబడినాడు. సూర్యుడు ఎరుపు వర్ణము కలవాడు. ఆయన రథము నందు ఒకే చక్రముంటుంది. దీనినే సంవత్సరము అని అంటారు. ఈ రథము నందు పన్నెండు మాసములు, ఆరు ఋతువులు, నాలుగు – నాలుగు మాసముల చొప్పున మూడునాభులు ఉంటాయి. ఇదియే కాలచక్రమని కూడా అంటారు. కాబట్టి సూర్యభగవానుడు పన్నెండు మాసములలో 12పేర్లతో ఆరాధించబడతాడు.

విశ్వకర్మ తన నైపుణ్యాన్నంతా గుదిగుచ్చి అగ్నిగోళం లాంటి సూర్యబింబాన్ని అరగదీసి, కరగదీసి తాప తీవ్రతను తగ్గించాడు. ఆ అరుగుదలలో పుట్టిన రేణువుల నుంచీ విష్ణువుకు చక్రాన్నీ, శివుడికి శూలాన్నీ తయారు చేసిచ్చాడని పురాణం.
ఖగోళశాస్త్రం ప్రకారం, సూర్యుడి వయసు నాలుగువందల అరవై కోట్ల సంవత్సరాలు. దాదాపుగా సృష్టి వయసూ కూడా అదే. సూర్యుడు వేలవేల నక్షత్రాల మధ్య ఓ మహానక్షత్రం. హైడ్రోజన్‌, హీలియంలతో నిండిన వాయుగోళం. ఆ గురుత్వాకర్షణశక్తి కారణంగానే, భూమి సహా వివిధ గ్రహాలు సూర్యభ్రమణం చేస్తున్నాయి. సౌర వ్యవస్థలో తొంభైతొమ్మిదిశాతం దినకరుడి అధీనంలోనే ఉంది. సూర్యుడి వ్యాసం భూమి కంటే వందరెట్లు పెద్దది.

అయితే సూర్యభగవానుని రూపాలను పన్నెండుగా, వారినే ద్వాదశాదిత్యులుగా ఆయా మాసాలలో ఆ రూపాలలో పూజిస్తుంటారు. వాటిలో భాగంగానే కశ్యప్రజాపతి కుమారుడు సూర్యుడని, వారిలో ఇక్ష్వాకుడు రాజయిన కారణంగా ఇక్ష్వాకువంశంలో రాజులందరినీ సూర్యవంశ రాజులు అంటరాని చెబుతారు.

ఇక సూర్యుడు వేసే ప్రతి అడుగు వేగానికి, కాలగమనానికి కొలబద్ద. మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలకు ఆధారం సూర్యుడే. కాలమే వేదస్వరూపం అంటోంది వేదం. కాలం కంటికి కనబడదు. దైవమూ అంతే. కానీ కాలానికి ప్రమాణికమైన సూర్యుడు మనకు కనిపిస్తాడు. అందుకే ఆయనను ప్రత్యక్షదైవంలా కొలిచి, ఆది నారాయణుడిగా ఆరాధిస్తాం. భౌతిక, వైజ్ఞానిక, దృష్టితో పరిశీలిస్తే సృష్టి, స్థితి, లయ కారకుడు సూర్యుడు మాత్రమే. ఆయన వల్లే సమస్త ప్రకృతి చైతన్యమవుతుంది

ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే ..

.
33 రకాల దేవతా సమూహములు

యాజ్ఞవల్క్యా! దేవతలెందరు?
అష్ట వసుసవులెవరు? ఏకాదశ రుద్రులెవరు? ఆదిత్యులెవరు? అడిగాడు విదగ్ధుడు.

ముప్పైమూడు కోట్ల దేవతలు అంటే సంస్కృతం లో కోటి అంటే విభాగం అని అర్ధం. మొత్తం ముప్పైమూడు రకాలయిన దేవతలు అని అర్ధం వస్తుంది...

యాజ్ఞవల్క్యుడు మొదలుపెట్టేడు.🙏

ఓ శాకల్యుడా! వైశ్వదేవ శాస్త్రము యొక్క దేవతా సంఖ్యను తెలిపే నివిత్తు అనే మంత్రముతో ఎంత సంఖ్య గల దేవతలు ఏర్పడుతున్నారో అంతమంది దేవతలున్నారు.

ఆ మంత్రము ద్వారా 303 దేవతలు, 3003 దేవతలు కలిసి మొత్తం 3306 మంది దేవతలు.కాని 33 మంది దేవతల యొక్క విభూతులే ఆ మొత్తం దేవతలందరూ.

వారే ఆరుగురు దేవతలు గాను, ముగ్గురు దేవతలు గాను, ఇద్దరు దేవతలు గాను, ఒకటిన్నర దేవత గాను చివరగా ఒక్క దేవత గాను అయ్యారు.

అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, ఇంద్రుడు మరియు బ్రహ్మ (ప్రజాపతి) కలిపి మొత్తం ముప్పైమూడు మంది దేవతలు.

అష్ట వసువులు:

అగ్ని, పృథివి, వాయువు, అంతరిక్షము, ఆదిత్యుడు, ద్యులోకము, చంద్రుడు, నక్షత్రాలు అనే ఈ ఎనిమిదిలోనూ సర్వమూ ఉంచబడింది.అందుచే వారికి వసువులని పేరు. (భూమిపై గల సమస్త పదార్ధములకు రంగు రుచి వాసన గుణము ఆకారము (అస్థిత్వము) కల్పిస్తూ ప్రకాశించేవాళ్ళు వసువులు. భూమి యందలి ఏ రూపమైనా వసువులు లేకుండా ఏర్పడదు.)

ఏకాదశ రుద్రులు :

ఏకాదశ రుద్రులంటే పురుషునిలో ఉండే పంచప్రాణములు, మనస్సు, జీవాత్మ కలిపి ఒకటి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు మొత్తం పదకొండు రుద్రులు. ఆత్మయే పదకొండవ రుద్రుడు. ఈ ఆత్మ మర్త్య శరీరాన్ని వదలనని, విడిచి వెళ్ళననిచెప్పడం మానవునికి దుఃఖ హేతువు. ఆ రకంగా ఏడ్పించడం వల్లనే “రోదయంతి రుద్రః” – రుద్రులు అని పేరు వచ్చింది.

(ఆకాశంలో ఏర్పడే స్పందనలన్నీ రుద్రులు సృష్టించేవే. పంచభూతాత్మకమైన ప్రకృతిలో ఉండే మార్పులన్నీ వీరు సృష్టించే స్పందనలే కాబట్టి ప్రాణుల జీవనం వీరిదయపై ఆధారపడి ఉంది. మనలోని పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలను, మనస్సును శాసించేది ఈ రుద్రులే.

ద్వాదశ ఆదిత్యులు :

సంవత్సరము యొక్క పన్నెండు మాసాలు పన్నెండు ఆదిత్య దేవతలు. ఒక్కొక్క మాసంలో సూర్యకిరణాలు ఒక్కొక్క గుణాన్ని కలిగి ఉంటాయి. ఆ పన్నెండు ఆదిత్యులు వేరు వేరు గా ఉంటారు. ఆ యా మాసములందు పరివర్తన చెందుతూ ప్రాణుల ఆయుస్సును కర్మఫలమును హరించు చుండడం చేత “ఆదదానః” ఆదిత్యులు అని పిలవ బడుతున్నారు.

ఇంద్ర ప్రజాపతులు :

స్తనయిత్నువు అనే వాడే (మబ్బులు లేదా ఉరుములు) ఇంద్రుడు; యజ్ఞమే ప్రజాపతి. స్తనయిత్నువు అంటే వజ్రాయుధమే. యజ్ఞమంటే యజ్ఞపశువే.

ఆరుగురు దేవతలు:

విదగ్ధుని తర్వాతి ప్రశ్నకు సమాధానంగా... “విదగ్ధా! అగ్ని, భూమి, వాయువు, అంతరిక్షము, సూర్యుడు, ద్యులోకము అనే ఆరు ఆరుగురు దేవతలు. ఇంతకు ముందు చెప్పిన ముప్పయి ముగ్గురు దేవతలు ఈ ఆరుగురే అవుతున్నారు.

ముగ్గురు దేవతలు:
భూమి, సూర్యుడు, ద్యులోకము అనే ఈ మూడు లోకాలు ముగ్గురు దేవతలు. సర్వ దేవతలు (ఆరుగురు దేవతలు) ఈ ముగ్గురిలో అంతర్భావాన్ని కలిగి ఉన్నారు.

ఇద్దరు దేవతలు:
అన్నము, ప్రాణము అనేవి రెండూ పూర్వోక్తమైన ఇద్దరు దేవతలు.

. సగము అధికముగా గల దేవత:
వాయువే ఒకటిన్నర దేవత. వాయువే అధ్యర్ధము అన్నారు. ఒకటి వాయువు ఒక దేవత. వాయువు చేతనే సమస్తము అభివృద్ధి చెందుతోంది, అంతే కాకుండా చరాచర ప్రాణికోటికి ఆధారము వాయువే కాబట్టి ఇంకొక అర్ధ భాగం గా పేర్కోని వాయువును ఒకటిన్నర దేవతగా వర్ణించేరు.

ఒకే ఒక్క దేవత :
ప్రాణమే ఒక్క దేవత: సర్వ దేవతలు ఒక్క ప్రాణం లోనే ఉన్నారు. అందువల్ల ప్రాణమే సర్వ దేవాత్మక మైన బ్రహ్మము గా అభివర్ణించేరు.

“జ్యేష్ట శ్రేష్ట ప్రజాపతి” అని నామాన్ని పొందిన ప్రాణమే సర్వ దేవతా స్వరూపము.
ముప్పయి మూడు (3306) దేవతల యొక్క రూపమే ఈ ప్రాణ దేవత.....
అందుచేత ఆ ప్రాణమే బృహత్స్వరూపమైన ఆ పరబ్రహ్మమని చెప్పబడుతోంది...

ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏

🍁 #పాత_మహేష్

వేంకటేశ ప్రాతఃస్మరణం శ్లోకత్రయం



ప్రాతః స్మరామి రమయా సహ వేంకటేశం
మందస్మితం ముఖసరోరుహకాంతిరమ్యం .
మాణిక్యకాంతివిలసన్మకుటోర్ధ్వపుండ్రం పద్మాక్షలక్ష్యమణికుండలమండితాంగం

ప్రాతర్భజామి కరరమ్యసుశంఖచక్రం భక్తాభయప్రదకటిస్థలదత్తపాణిం . శ్రీవత్సకౌస్తుభలసన్మణిభూషణోద్యత్
పీతాంబరం మదనకోటిసుమోహనాంగం

ప్రాతర్నమామి పరమాద్య పదారవిందం ఆనందసాంద్రనిలయం మణినూపురాఢ్యం . ఏతత్సమస్తజగతామితి దర్శయంతం
వైకుంఠమత్ర భజతాం కరపల్లవేన

శ్లోకత్రయస్య పఠనం దినపూర్వకాలే దుస్స్వప్నదుశ్శకునదుర్భయపాపశాంత్యై .
నిత్యం కరోతి మతిమాన్పరమాత్మరూపం
శ్రీవేంకటేశనిలయం వ్రజతి స్మ యోఽసౌ ..

శ్రీః ఘనగురవే నమః . ..

🌷ఇతి వేంకటేశ ప్రాతఃస్మరణం శ్లోకత్రయం

ధనవంతుడిని కావాలంటే

సందేహం;- నేను ధనవంతుడిని కావాలంటే ఏ పూజలు చెయ్యాలో చెప్పండి?

సమాధానం;- ధనం కావాలంటే లక్ష్మీదేవినే కదా అందరూ పూజిస్తారు. ధనం ఒక్కటే కోరుకోవడంకంటే, ఐశ్వర్యం కావాలని కోరుకోవడం బాగుంటుంది. అయితే ఈ రెండిటికీ తేడా ఏమిటి?

ఐశ్వర్యం అంటే కేవలం ధనం ఒక్కటే కాదు. శరీర ఆరోగ్యం, మనోస్థైర్యం, కుటుంబ శ్రేయం, సామాజిక హోదా, కీర్తి ప్రతిష్టలు, ఉపాధి భద్రత, అభివృద్ధి ఇవన్నీ వస్తాయి.

మన కర్మలనుబట్టే మనకు ఇవి లభిస్తాయి. అయితే ఏ కర్మను ఎప్పుడు మనచేత అనుభవింప చేయాలో నిర్ణయించేది భగవంతుడే. అందువల్ల ఆయన్ను ఆరాధించడం మన కర్తవ్యం. అలా భగవంతుడిని ప్రేమించి, ప్రార్ధించే వారిని కృపతో చూసి, వారి పూర్వ జన్మల్లో చేసిన పుణ్య కర్మలను ముందుకు తెచ్చి అనుభవింప చేస్తాడు. ఇక ముందు కూడా పుణ్య కర్మలే చేసేటట్లు అనుగ్రహిస్తాడు కూడా.

అయితే శ్రీమహావిష్ణువును మనవైపు త్రిప్పి, మనల్ని కటాక్షింపజేసేది ఎప్పుడూ ఆయన వక్ష స్థలంలో ఉండే లక్ష్మీదేవే. మనల్ని సంస్కరించి, భగవానునికి అందించే పురుషకారం (రికమండేషన్) ఆమెదే.

అందువల్ల ఐశ్వర్యాదులు కోరేవారు నారాయణమూర్తిని లక్ష్మీదేవి ద్వారా ఆశ్రయించాలి. ఇద్దరినీ కలిపి పూజించాలి. స్తోత్రం చెయ్యాలి. దీనికి లక్ష్మీ అష్టోత్తరంతో అనుసంధించే శ్రీవిష్ణు సహస్ర నామ స్తోత్రం అత్యుత్తమం.

*శుభంభూయాత్* 

శ్రీ రామ అవతార ప్రాశస్త్యం


బ్రహ్మ దేవుడు ప్రత్యక్ష మై వరం కోరుకోమన్నప్పడు
రావణుడు తనకు చావు లేకుండా వరం ఇవ్వమన్నాడు అందుకు బ్రహ్మ దేవుడు ఒప్పుకోలేదు చివరకు రావణుడు ఆలోచించి ఇలా అడిగాడు

నాకు
దేవతల వలన గానీ , దానవుల వల్ల గానీ , గరుడుల వల్ల గానీ గంధర్వుల వల్ల గానీ మరణం లేకుండా ఉండే వరం ఇవ్వండి

నీచులు, అధములైన మానవుల గురించి నేను మాట్లాడను

ఇంతమంది చంపలేని నన్ను మానవుడు ఏంచేయగలడు వాడి పేరుతో వరం కోరుకోవడం కూడానా

అని ఈసడించి మాట్లాడాడు

అందుకే రావణ సంహరం కోసం శ్రీ మన్నారాయణుడే 11నెలలు కౌసల్యా గర్బవాసం చేసి మానవుడి గా జన్మించి శ్రీ రామచంద్ర మూర్తి గా భూమిపై నడయాడాడు

1-48 నిమిషాల వ్యవధి లో ఖర,దూషణాది రాక్షసులను నేలమట్టంచేసిన వీరుడు
అమిత శౌర్యం ధైర్యాలకు ప్రతీక మన రామచంద్ర ప్రభువు
యుద్ధం అంటూ వచ్చింది అనంటే ఆయన చేతులు తాండవం చేస్తాయి అరివీర భయంకరమైన ఆ బాణపరంపరకు యుద్ధ కౌశలమునకు ఎంతటి వారైనా నేలకొరగక తప్పదు అసలాయనను చూసినా ఆయన కరస్పర్శను పొందినా ఆ ధనస్సు కి కూడా రాశీ భూతమైన ఉత్సుకత తోడౌవుతుందేమో అందుకే ఆయన యుద్ధం చేసే క్రమాన్ని రామదాసు గారు ఇలా వర్ణన చేశారు ఫణి

భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణ తూణ కో
దండ కళాప్రచండ భుజతాండవ మూర్తికి రామమూర్తికిన్
రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరికా
డాండ డడాండ డాండ నినందంబులజాండము నిండ మత్త వే
దండమునెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ!

ఓ కరుణాసముద్రుడవైన శ్రీరామా! యుద్ధములో అమిత పరాక్రమవంతుడు, ఆర్తజనులకు బంధువు, ప్రకాశించే బాణముల అమ్ములపొది, కోదండము ధరించి ప్రంచండమైన భుజబలముతో శరములను సంధించే నీకు రెండవ సాటి దైవము లేడని నిశ్చయించుకొని మదించిన ఏనుగునెక్కి దుందుభిని మ్రోగించి డాండ డడాండ శబ్దభేరులు బ్రహ్మాండమంతా నిండేలా చాటెదను.

- దాశరధీ శతకం

శ్రీ రాముడు
ధర్మ సంస్థాపన కోసం వానర సమూహ సహాయం తో రావణుని సంహరించి మానవుని గొప్పతనాన్ని దశ దిశలకూ చాటి యుగ యుగాలకూ గుర్తుండేలా చేసి ఒక మానవుడు ధర్మబద్దంగా వీరోచితం గా ఎలా జీవించాలో ఆచరించి చూపిన శ్రీ రాముడే మానవుని కి ఆదర్శం
శ్రీ రామ చంద్ర పరబ్రహ్మణేనమ.

నూతన సృష్టికి మహాకాలుని ప్రణాళిక - 01


సద్గురు పండిత శ్రీరామ శర్మ ఆచార్య
. సంక్షిప్త సారం
అశుభ సమయాలు ప్రపంచ చరిత్రలో అనెకసార్లు వస్తూ వచ్చాయి. అయితే అనౌచిత్యాన్ని పరిధి దాటి రానివ్వరాదనేది సృష్టికర్త నియమం. దుర్మార్గులు తమ గతివిధులను వదిలిపెట్టనపుడు, పీడితులు వారిని ఆపడానికి సంసిద్దులు కానపుడు సృష్టికర్త ఆక్రోశం బయట పడుతుంది. “యదా యదా హి ధర్మస్య అన్న ప్రతిజ్ఞకు సృష్టికర్త బద్దుడై ఉంటాడు. యుగనంధి యొక్క పది సంవత్సరాలలో ఇది, ప్రసవవెదన లాంటి స్ధితి. ప్రసవకాలంలో ఒకవైపు గర్భిణి స్త్రీ సహించరాని ప్రసవక్రమాన్ని భరిస్తూ ఉంటే మరో వైపు సంతానప్రాప్తి అనే సుందర భావనలు కూడ మనసులోనే పులకింతను ఉత్పన్నం చేసూ ఉంటుంది. ఈ సంధి కాలంలో మనషి శాంతి, సౌజన్యాలతో మార్దంలో వెళ్ళడం నేర్చుకొని, కర్మఫల సునిశ్చిత ప్రక్రియను అవగతం చేసుకొని, ఏది చేయాలో అది చేసుకొంటూ, బుద్ధిమంతులు నడిచే మార్గంలో నడవాలి.

01. అనౌచిత్యం - ప్రతీకారం
అప్పుడప్పుడు అంటువ్యాధులలాగా అనాచారాలు కూడా తీవ్రగతిలో విజృంభించి వాటంతట అవే పాకే తీగలాగా అల్లుకుపోయి సమయం వస్తూ ఉంటుంది. సొంతవేర్లు లేకపోయినా అమర తీగ విస్తరిస్తూ చూస్తూ చూస్తూనే వృక్షమంతా వ్యాపిస్తుంది.

వనస్పతుల మీద అంటుకునే క్రిములు కూడా ఎవరి సహాయం లేకుండానే తమ వంశాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటాయి. వనస్పతులను నాశనం చేస్తూ ఉంటాయి.

దుష్టచింతన, దుష్టాచారాలు ఈ రోజులలో ఒక ప్రచలనగా తయారయ్యాయి. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ప్రతి వస్తువునూ క్రిందికి లాగుతూ ఉంటుంది. నీళ్ళు కూడా అప్రయత్నంగా పల్లంలోకి ప్రవహిస్తాయి. దుష్టత్వ పరిస్థితి కూడా ఇలాంటిదే. అది పతనం, పరాభవ దిశనే పట్టుకుంటుంది. కానీ ఎవరినైన ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అసాధారణ, కష్టసాధ్యమైన శ్రమ కావాలి. ఉదాహరణకు రావణుడు జన్మించింది ఒంటరిగానే. అతని పిల్లలు, మనవళ్లు కాక వంశస్టులు, ప్రజలు కూడా అదె రీతిని –నీతిని పుణికి పుచ్చుకొన్నారు. సర్వత్రా అనాచారం వ్యాపించింది. కంసుడు, జరాసంధుడు, వృత్తాసురుడు, మహివాసురుడు మొదలైన వారుకూడా తమ కాలంలో ఇలాంటి అనాచార విస్తరణ కార్యక్రమాన్ని సొంతం చేసుకున్నారు. అనాచారాలు అన్నివైపులా ఆధిక్యాన్ని ప్రదర్శించాయి.

అలాంటి అశుభ సమయాలు ప్రపంచ చరిత్రలో అనేకసార్లు వచ్చాయి. అయితే సృష్టికర్త నియమం ఏమిటంటె అనౌచిత్యాన్ని పరిధిని దాటి రానివ్వడు. చిన్నపిల్లలు చేసే తప్పులు వారి పరిధిలో ఉన్నంతవరకు తల్లిదండ్రులు క్షమిస్తూ ఉంటారు. అయితే క్రమశిక్షణ ఉల్లంఘించి అవాంఛనీయ వనులు చేయడం మొదలుపెడితే చెంపదెబ్బలు వేయడం, చెవి మెలిపెట్టడం లాంటి ప్రతీకారాలు కూడా చేస్తారు. అలా జరుగక పోతే ఉద్ధండత పెరిగిపోయి సృష్టి వ్యవస్థ అంతా అతలాకుతలం అవుతుంది. గత రెండువేల సంవత్సరాలలో అవినీతి, అనాచారాలు తమ అన్ని పరిధులను దాటి క్రమశిక్షణను ఉల్లంఘించాయి. సమర్ధులు అసమర్ధులను అన్ని విధాల బాధ పెడుతున్నారు.* *సామంతవాదం అనే పేరుగల ఈ యుగాన్ని అంధకార యుగంగా చెబుతూ వచ్చారు.

సమర్దులైన వారు గర్వంతో తమ సంయుక్త శక్తిని దురుపయోగం చేయడంలో ఎటువంటి లోపాన్నీ చూపలేదు. ఈ పరిస్థితులలో పీడితులు కూడా మానవీయ మర్యాదలకు అనుగుణంగా చేయదలచిన ఎటువంటి ప్రతిఘటన చేయలేదు. కష్టాలను భరించాలంటే ఇతరులది కాక, తన రక్తాన్ని ప్రవహింప జేయగలగటం - ఆపదల నుండి బయటపడడానికి మనిషి యొక్క ఈ శాశ్వత సామర్థ్యమే అతని ప్రత్యేకతగా ఉంది.

వాస్తవానికి మనిషి ఎలాంటి మట్టితో తయారయ్యాడంటే అవినీతిపై విజయం సాధించినా సాధించలేకపోయినా, దానితో కనీసం పోరాటమైనా చేయగలడు. అవినీతిని నిరాటంకంగా కొనసాగనివ్వడం లేదా దానిని సహిస్తూ ఉండే బదులు దానితో పోరాడుతూ మానవీయ గౌరవాన్ని జాగృతం చేయడం కూడ అవసరం. దుర్మార్డులు తమ దుర్మార్గాన్ని వదలనపుడు, పీడితులు పిరికితనం, భయంతో పోరాట పటిమను చూపించనపుడు సృష్టిని సృష్టించిన సృష్టికర్తకు నచ్చదు. అపుడు సృష్టికర్తకు ఆక్రోశం వస్తుంది.

సృష్టిలో దుర్మార్గం అయితే ఉన్నది. దానితో పాటు పీడితులు జయాపజయాలను ఆలోచించకుండా ప్రతీకారానికి, నిరోధించడానికి సిద్ధంగా ఉండాలనే విధానం కూడా ఉన్నది. దయ, క్షమల పేరుతో దుర్మార్దాన్ని పెంచుకుంటూ పోవడం ఎప్పుడూ అవాంఛనీయమే.

దుర్మార్గంతో పోరాడడం అనేది మానవీయ గొప్పదనాన్ని సూచిస్తుంది. రెండు వైపుల నుండి తప్పు జరుగుతూ ఉంటే తన వ్యవస్థ దిగజారుడుతనం చూస్తే సృష్టికర్తకు కోపం వస్తుంది. మనిషి చేయలేని పనిని స్వయంగా తనే చేయడానికి సిద్ధపడతాడు. దీనినే అవతార పరంపర అంటారు. 

నైవేద్యం



సమస్త జీవరాశికి ఎప్పుడు ఎప్పుడు, ఏమి కావాలన్న విషయం విష్ణువుకు తెలుసు. అందువల్లే ఆయన్ను స్థితి కారకుడు అంటారు. ఆ విష్ణువు రూపమైన వేంకటేశ్వరుడికి నైవేద్యం సమర్పించడం అంటే సష్టిలో ఆకలితో ఉన్న సమస్త జీవులను సంతృప్తి పరచడమేనని మన పురాణాల్లో చెప్పబడింది. కలియుగ దైవంగా తిరుమల కొండ పై కొలువై ఉన్న ఆ వేంకటేశ్వరుడికి నిత్యం మూడు పూటలా నైవేద్యాన్ని సమర్పిస్తారు. తిరుమల గర్భగుడిలో స్వామి వారి మూల విగ్రహం ఎత్తునకు అనుగుణంగా స్వామి వారికి ఏ పూట ఎంత పరిమాణంలో నైవేద్యం సమర్పించాలన్న విషయం శాస్త్రంలో స్పష్టంగా నిర్దేశించారు. అదే సమయంలో ఏ సమయంలో ఏ ఏ రకాల నైవేద్యం సమర్పించాలన్న విషయం కూడా శాస్త్రంలో పేర్కొన్నారు. ఆ నైవేద్యానికి సంబంధిచిన వివరాలతో పాటు నైవేద్యం సమయంలో ఎటువంటి ఆచారాలు పాటిస్తారన్న విషయానికి సంబంధించిన వివరాలు
బాలభోగం ఇలా సాధారణంగా తిరుపతి అనగానే లడ్డు మనకు గుర్తుకు వస్తుంది. అయితే ఈ లడ్డుతో పాటు స్వామివారికి మూడు పూటలా వివిధ రకాల పదార్థాలను స్వామివారికి నైవేద్యం పెడుతారు. అటు పై ఆ నైవేద్యాన్ని భక్తులకు పంచుతారు. ఈ మూడు పూటల్లో ఉదయం ఆరు గంటల నుంచి ఆరున్నర గంటల మధ్య సమర్పించే నైవేద్యాన్ని బాలభోగం అంటారు. ఇందులో మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్యోజనం, చక్కర పొంగలి, రవ్వకేసరి ఉంటుంది.
రాజభోగం
మధ్యాహ్నం సమర్పించే నైవేద్యాన్ని రాజభోగం అంటారు. ఇలా ఇది పది నుంచి పదకొండు గంటల మధ్య ఉంటుంది. ఇందులో శుద్ధాన్నం, పులిహోర, గుడాన్నం, దద్యోజనం, శీర లేదా చక్కెరన్నం ఉంటుంది. ఇక రాత్రి స్వామివారికి నివేదించే నైవేద్యాన్ని శయన భోగం అంటారు. ఇందులో మరీచ్య అన్నం (మిరియాల అన్నం) దోసె, లడ్డు, వడ తో పాటు వివిధ కూరగాయలతో కలిపి వండిన అన్నాన్ని సమర్పిస్తారు. దీనినే శాకాన్నం అని పిలుస్తారు.
శయనభోగం
రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య సమర్పిస్తారు. మూడు పూటలతో పాటు స్వామివారికి అల్పాహారాలు కూడా సమర్పిస్తారు. ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పిన తర్వత అప్పుడే తీసిన చిక్కని ఆవుపాలు సమర్పిస్తారు. తోమాల, సహస్రనామ అర్చన సేవల తర్వాత నువ్వులు, సొంఠి కలిపిన బెల్లం ఇస్తారు. తర్వాత బాలభోగం సమర్పిస్తారు. దీంతో ప్రాత:కాల ఆరాధన పూర్తవుతుంది. అటు పై సర్వదర్శనం మొదలవుతుంది. రాజభోగం అష్టోత్తర శతనామ అర్చన తర్వాత రాజభోగం సమర్పణ జరుగుతుంది. మళ్లీ సర్వ దర్శనం ప్రారంభమవుతుంది. సాయంకాల ఆరాధన తర్వాత గర్భాలయాన్ని శుద్ధి చేసి స్వామివారిని తాజా పూలతో అలంకరిస్తారు. అష్టోత్తర శతనామ అర్చన తర్వాత శయనభోగం సమర్పిస్తారు. అర్థరాత్రి తిరువీశం పేరుతో బెల్లపు అన్నం అందజేస్తారు. అటు పై ఏకాంత సేవలో భాగంగా నేతితో వేయించిన బాదం, జీడిపప్పులు, తాజా పండ్ల ముక్కలు, వేడి పాలు స్వామికి సమర్పిస్తారు.
అన్నీ ఆగమశాస్త్ర ప్రకారమే
ఇక నైవేద్యాలను ఎలా వండాలి, ఎవరు వండాలి అన్న విషయంతో పాటు ఆ సమయంలో ఎలా ఉండాలన్న విషయం మొత్తం ఆగమశాస్త్రంలో సవివరంగా పేర్కొన్నారు. నైవేద్యం వండే సమయంలో వాసన సోకకుండా నోటికి, ముక్కుకు అడ్డుగా వస్త్రం పెట్టుకొంటారు. స్వామికి సమర్పించేదాకా బయటివారు ఎవరూ నైవేద్యాన్ని కనీసం చూడటానికి కూడా అనుమతించరు. నైవేద్యాన్ని సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని నీళ్లతో శుద్ధి చేస్తారు. అటు పై నైవేద్యం పెట్టే సమయంలో అర్చకుడు మాత్రమే ఉంటారు. విష్ణు గాయత్రి మంత్రం పఠిస్తూ అర్చకుడు నైవేద్యం పై గ్రాసముద్రతో ప్రసాదన్ని తాకి దానిని స్వామి కుడిచేతికి తాకించి, నోటి దగ్గర తాకుతారు. పవిత్ర మంత్రాలు ఉచ్చరిస్తూ అన్నసూక్తం పఠిస్తారు. ముద్దముద్దకీ మధ్య ఔషద గుణాలున్న వివిధ పత్రాలు కలిపిన నీటిని కూడా సమర్పిస్తారు. నైవేద్యం సమర్పించేత వరకూ ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది.
51 లడ్డూలను ఒక ప్రోక్తం అంటారు. ఒక్కోసారి వెయ్యి ప్రోక్తాలను తిరుమలలో తయారు చేస్తారు. అంటే 51వేల లడ్డూలన్న మాట. ఇందుకుగాను 2వేల కిలోల శనగ పిండి, 4వేల కిలోల చక్కెర, 1850 కిలోల నెయ్యి, 350 కిలోల జీడిపప్పు, ఎనభై ఏడున్నర కిలోల ఎండుద్రాక్ష, 50 కిలోల యాలకులు, 50 కిలోల కలకండ అవసరమవుతాయి.
వివిధ నైవేద్యాలు
తిరుమలలో విజయనగర సామ్రాజ్య కాలం నాటికే రోజుకు వందకు పైగా నివేదనలు చేసే పద్ధతి ఏర్పడిపోయింది. వందలాది మంది దాతలు అనేక పదార్థాల నివేదనకు ఏర్పాట్లు చేయడంతో ఎన్నెన్నో నైవేద్యాలు స్వామివారికి నివేదిస్తూవుంటారు. వీటిలో కొన్నిటిని ప్రసాదంగా భక్తులకు పంచిపెట్టడమో, అమ్మడమో చేసే పద్ధతి ఉంది. స్వామి వారి కైంకర్యాలు, ఉత్సవాలు నిర్దుష్టంగా ఈస్టిండియా కంపెనీ పాలనా కాలంలో సవాల్ జవాబ్ పట్టీలో నిర్దేశించడంతో, తిరుమల తిరుపతి దేవస్థానం దానని ప్రమాణంగా తీసుకుని ఈ నివేదనలు కొనసాగిస్తోంది.
వేర్వేరు నైవేద్యాల పేర్లు ఇలా ఉన్నాయి:
అన్న నైవేద్యాలు
• సంధి తిరుప్పానకం
• తిరుప్పానకం
• రజన తిరుప్పానకం
• వెళ్ళై తిరుప్పానకం
• అర్ధనాయకతళిగ
• నాయికతళిగ
• దద్దోజనం (దధ్యోజనం)
• మట్టిరాయ్ తళిగ
• తిరుప్పావడ (పులిహోర లాంటి పదార్థం)
• తిరువలక్కం
• తిలాన్నం
• అక్కలిమండై


పంచవాహి - పవిత్ర అన్నం
భక్ష్యాలు
• అప్పపడి - అప్పాలు
• అతిరసపడి - అరిసెలు
• వడైపడి - వడ
• గోధిపడి - వడ వంటిది
• సుఖియాన్‌పడి
• ఇడ్డిలీపడి - ఇడ్లీ
• సిడైపడి
• ప్రోదిలింగైపడి
ఇతర పదార్థాలు
• పోరిపడి - అటుకులు
• తిరుక్కనమడై లేక మనోహరపడి - మినపలడ్డు (సున్నుండ లాంటిది)
• పారుప్పువియలు - గుగ్గిళ్ళు
• తిరుప్పయ్యారం - మినపవడ (పొట్టు ఉన్న మినుములతో చేస్తారు)
• అవల్‌పడి - గట్టి అటుకులు
• తెరకులాల్
ఇతర తినుబండారాలు
• మాత్ర
• బెల్లం
• పంచదార
• రకరకాల పళ్ళు
• వేయించిన జీడిపప్పు
• బాదం
• మినపసున్ని
• జిలేబీ
• దోసె
• వేయించిన నువ్వుల పొడి
• కజ్జాయం పాలు
• పెరుగు
• వెన్న
• తాంబూలం
******************

గోమాత పూజ - ఫలితాలు


ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ‘నాథా! జనులు పాపములనుండి విముక్తి చెందుటకు ఏదైనా మార్గమును , తరుణోపాయమును తెలుపమని’ అడుగగా, గోమాతకు చేసిన పూజల యొక్క ఫలితాల గురించి పరమేశ్వరుడు ఈవిధముగా చెప్పాడు.
‘‘పార్వతీ! గోమాత యందు సమస్త దేవతలు ఉన్నారు.
పాదముల యందు - పితృదేవతలు
కాళ్ళ యందు - సమస్త పర్వతములు
భ్రూమధ్యమున - గంధర్వులు
దంతముల యందు - గణపతి
ముక్కున - శివుడు
ముఖమున - జ్యేష్ఠాదేవి
కళ్ళయందు - సూర్య, చంద్రాదులు
చెవుల యందు - శంఖు చక్రములు
కంఠమునందు - విష్ణుమూర్తి
భుజమున - సరస్వతి
రొమ్మున - నవ గ్రహములు
వెన్నునందు - వరుణ దేవుడు , అగ్ని దేవుడు
తోక యందు - చంద్రుడు
చర్మమున - ప్రజాపతి
రోమములయందు - త్రింశత్కోటి దేవతలు నివసించెదరు.
అందువల్ల గోమాతను పూజించి పాపములను పోగొట్టుకొని ఆయురారోగ్యములను, అష్టశ్వైర్యములను పొందవచ్చును. గోవులకు తృప్తిగా ఆహారము పెడితే సమస్త దేవతలకు ఆహారము పెట్టినంత పుణ్యఫలము కలుగుతుంది. మనసారా నమస్కరిస్తే సమస్త దేవతలకు నమస్కరించినంత పుణ్యము కలుగుతుంది. గోమాతకు ప్రదక్షిణము చేస్తే భూమండలము అంతా ప్రదక్షిణము చేసినంత ఫలము కలుగుతుంది.
స్వామి రక్ష! శ్రీ రామ రక్ష!!
శ్రీ రామ రక్ష! సర్వ జగద్రక్ష !!’’ అని ముగించెను.

సత్యభామ - వివిధగాధలు!!

సత్యభామ దేవి గురించిన వివిధ గాధలు!!
కృష్ణుడి కి మురారి అనే పేరు ఎలా వచ్చింది!!!
దీపావళి స్వయంగా నరకాసురుడు కోరిన వరమా!!
దీపావళి అనేది చీకటి పైన వెలుగు సాధించిన విజయం.

సత్యభామ - శ్రీ కృష్ణుడి యుద్ధ నైపుణ్యం కల భార్య, నరకాసురుడిని చంపిన ధీరవనిత

హిందూ ధర్మం వివాహ జీవితాన్ని లేదా ఒక వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన భాగంగా చూపిస్తుంది. వివాహం,
కుటుంబాన్ని ప్రారంభించడం,
కుటుంబాన్ని పోషించడం మరియు అందించడం మానవజాతి మరియు ధర్మం యొక్క కొనసాగింపుకు చాలా ముఖ్యమైనది.దేవుళ్ళు కూడా భూమిపై ఎన్ని అవతారాలు తీసుకున్నా వారి జీవిత భాగస్వాములతో స్థిరపడ్డారు.రోజువారీ జీవితంలో గందరగోళాన్ని విజయవంతంగా నడిపించడానికి ఒక మగ మరియు ఒక ఆడ సమానమైన అడుగులు వేస్తూ జీవితాన్ని కొనసాగించేదే వివాహం,
ప్రేమ మరియు వివాహం యొక్క అటువంటి గాథ దేవి సత్యభామ మరియు శ్రీకృష్ణుల కథ.

సత్యభామ ఎవరు?

సత్యభామా దేవి భూమి దేవత అయిన మరో అవతారం అని నమ్ముతారు.సత్యభామ ద్వారక కోశాధికారిగా ఉన్న సూర్య భగవానుడి నుండి పొందిన దైవ ఆభరణమైన శ్యమంతక యాజమాన్యంలోని సత్రాజిత్ కుమార్తె.ఇది అతనికి చాలా విలువైనది. అదనపు రక్షణ కోసం ఆభరణాలను ఉగ్రసేనుడికి పంపమని శ్రీ కృష్ణ సత్రాజిత్‌కు సూచించారు.అయితే, సత్రాజిత్తు సోదరుడు ప్రసేనజిత్ ఆభరణాన్ని ధరించి వేట కోసం బయలుదేరాడు. అడవిలో, సింహం అతనిపై దాడి చేసి చంపగా అదే సమయంలో,జాంబవంతుడు ఈ ఆభరణాన్ని కనుగొని, దానితో ఆడటానికి తన కుమార్తెకు ఇచ్చాడు.

ప్రసేనజిత్ మరణ వార్త సత్రజిత్ కు తెలియగానే, ఆభరణం లేదని గ్రహించినప్పుడు, అతను శ్రీ కృష్ణుడే దొంగతనం చేశాడని ఆరోపించాడు. కోపంతో కృష్ణుడు ఆభరణాన్ని వెతకడానికి బయలుదేరగా ఒక గుహలో జంబవంతున్ని కనుగొన్నాడు శ్రీ క్రిష్ణుడు. ఆ ఆభరణం కోసం 28 రోజుల పాటు పోరాటం జరిగింది.తరువాత వయసు రీత్యా అలసిపోయిన జాంబవంతుడు శ్రీ కృష్ణుడిని గుర్తించి లొంగిపోయి క్షమించమని కోరాడు. అతన్ని ఆరాధించి, తన కుమార్తె జాంబవతిని వివాహం చేసుకోమని కోరాడు.

తిరిగి రాగానే కృష్ణుడు ఆభరణాన్ని సత్రాజిత్‌కు తిరిగి ఇచ్చాడు.సత్రాజిత్ నిజం గురించి తెలుసుకున్నప్పుడు, అతను తన తప్పుకు కృష్ణుడిని క్షమించమని వేడుకున్నాడు మరియు తన కుమార్తె సత్యభామను శ్రీ కృష్ణునితో వివాహం జరిపించాడు.

వైష్ణవ,స్కంద పురాణానికి చెందిన కార్తీకమాస మహాత్యానికి సత్యభామ జన్మకు మరో గాధ ఉంది. సత్యభామ తన మునుపటి జన్మలో గుణవతి, వివాహం తర్వాత తన తండ్రిని, భర్తను కోల్పోయింది. ఆమె దుఖం యొక్క సముద్రంలో మునిగిపోయింది మరియు దానిని అధిగమించింది. తొందరగానే తాను అన్ని కష్టాలను అధిగమించి తరువాతి ప్రపంచంలో ఇద్దరికీ ఉపయోగపడే కర్మలను ప్రదర్శించారు.

ఆమె విష్ణువు పట్ల భక్తితో మునిగిపోయింది, ప్రశాంతంగా,
నిజాయితీగా,
స్వచ్ఛంగా మరియు
ఇంద్రియాలను నియంత్రించి,
ఆ నగరంలో మాత్రమే నివసించి,
తన జీవితాన్ని నిలబెట్టింది.
పుట్టినప్పటి నుండి మరణం వరకు ఆమె రెండు ప్రతిజ్ఞలను సరిగ్గా పాటించింది:
ఏకాదశి యొక్క ప్రతిజ్ఞ మరియు కార్తీకం యొక్క ప్రతిజ్ఞ .ఆమె భక్తితో సంతోషించిన ఆమె మరణం తరువాత, ఆమె తన తదుపరి జీవితంలో విష్ణువు యొక్క ఒక రూపాన్ని వివాహం చేసుకుంటుందని ఒక వరం ఇవ్వబడింది. మునుపటి జీవితంలో ఆమె తండ్రి అయిన సారాజిత్ రాజుకు ఆమె సత్యభామగా జన్మించింది.

నరకాసుర

హిరణ్యాక్ష అనే రాక్షసుడు భూమి మరియు ఆకాశంలోని ప్రజలందరినీ ఒకేలా భయపెట్టడం తదితర చర్యల వలన అతన్ని ఇక సహించలేక, ప్రజలు హిరణ్యక్ష నుండి రక్షించమని విష్ణువు వద్దకు వెళ్లారు. విష్ణువు నుండి దాచడానికి తెలివైన రాక్షసుడు తన శక్తులను ఉపయోగించి
భూమిని దాని అక్షం నుండి కిందకు దాచడానికి నెట్టబడింది.హిరణ్యాక్ష భూమిని తాకినప్పుడు, భూదేవి, మరియు హిరణ్యాక్ష- నరకాసురుల మధ్య ఉన్న సంబంధం నుండి ఒక అసురుడు సృష్టించబడ్డాడు.

భూమి అంతరిక్షంలో లోతుగా పడిపోయింది. అప్పుడే విష్ణువు వరాహంలా అవతరించాడు భూమిని తన కొమ్ములతో పట్టుకొని ఆమెను తన అక్షంలో వెనక్కి నెట్టాడు.విష్ణువు హిరణ్యక్షతో పోరాడి ఓడించి చంపాడు.భూదేవి విష్ణువుతో అసురుడి గురించి చెప్పినప్పుడు, అతను తన కొడుకు అని, తల్లిదండ్రుల మాదిరిగానే శక్తివంతుడని ఆమెకు సమాచారం ఇచ్చాడు, కాని అతని విధి అంటే అతని మరణం ఇంకా జరగలేదు కనుక ప్రదర్శన చేస్తున్నాడు తన విద్యలను అని అన్నాడు.

నరకాసురుడు బలంగా,
శక్తివంతుడిగా ఎదిగాడు.శక్తివంతమైన అసురుడైన బాణాసురుడు నరకాసురుడి బలాన్ని చూసి అతన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.అమరత్వానికి సమానమైన శక్తులతో తనను ఆశీర్వదించే బ్రహ్మ దేవుడి కోసం ప్రార్థించమని అతడు కోరాడు.

అందువల్ల అతను ధ్యానం,మరియు తపస్సు చేశాడు.తన తపస్సు కు సంతోషించిన బ్రహ్మ తన పెరుగుతున్న శక్తులు మరియు అసుర వారసత్వం గురించి తెలుసుకున్నప్పటికీ, నరకాసురుడు ‘నా ప్రభూ!భూదేవి స్వయంగా నా తల్లి అని నాకు తెలిసింది. కాబట్టి నేను చనిపోవాలంటే అది నా తల్లి చేతిలో ఉండాలి మరెవరి చేతిలోనూ కాదు. ’
బ్రహ్మ అతనికి వరం ఇచ

్చాడు

కాని నరకాసురుడు సంతోషం గా వెళ్ళిపోయాడు.

ఒక వ్యక్తి ఎంత దుర్మార్గుడు అయినా, తల్లి తన కొడుకును ఎప్పుడూ చంపలేదు కదా, నరకాసురుడు తన రాజ్యమైన ప్రాజ్ఞోత్యశ్యపూర్‌కు తిరిగి వచ్చి యుద్ధానికి సన్నాహాలు చేశాడు.వరం తో ఆయుధాల తో అతను భూమిపై అన్ని రాజ్యాలపైన దాడి చేసి భూమిపై ఉన్న అన్ని రాజ్యాలకు పాలకుడు అయ్యాడు.

నరకాసురుడు పై లోకాలను కూడా వదలలేదు ఇంద్రుడు, దేవతల ప్రభువు కూడా బ్రహ్మ వరప్రభావానికి సరిపోలలేదు.ఇంద్రుడు మరియు ఇతర దేవతలు నలిగి అక్కడి నుండి పారిపోయారు. అతను 16,000 మంది మహిళలను స్వర్గంలో తన రాజభవనంలో బంధించాడు. దేవతల తల్లి అయిన అదితిని కూడా అతను ఒంటరిగా అనుమతించలేదు.అదితి ఆమె కోసం ఒక జత స్వర్గపు చెవిరింగులను కలిగి ఉంది. చెవిపోగులు చాలా విలువైనవి,
అవి చీకటిలో కూడా మెరుస్తున్నాయి. నరకాసురుడు ఒక్క క్షణం కూడా సంకోచించకుండా అదితి నుండి చెవిపోగులు లాగివేసాడు.

సత్యభామ అదితి యుద్ధం

సత్యభామ దేవతల తల్లి అదితి బంధువు అని అంటారు.ఆమె రాజభవన తోటలలో ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఆమెను అదితి సందర్శించారు. సత్యబామను చూసి కన్నీరుమున్నీరైన ఆమె నరకాసుర కాఠిన్యం గురించి చెప్పింది. కోపంతో సత్యహమ విషయాలను తన చేతుల్లోకి తీసుకోవాలని నిర్ణయించుకుని కృష్ణుడిని వెతకడానికి వెళ్ళింది తరువాత వారు నరకాసురుడితో యుద్ధానికి దిగాలని నిర్ణయించారు.

వెంటనే సత్యభామా దేవి తన ఆయుధాలను సిద్ధం చేసుకొని గరుడపై కూర్చుని ప్రజ్ఞోతిశ్యపూర్ వైపు వెళ్లింది.నరకాసురుడు మరియు కృష్ణుడి సైన్యం మధ్య జరిగిన యుద్ధం హాస్యాస్పదంగా ఉండేది. సత్యబామకు కృష్ణ, గరుడ సహాయం చేశారు సైన్యాన్ని నాశనం చేశారు.నరకాసురుడు తన రాజభవనం లోపల నుండి ఇవన్నీ చూసి కోపంగా వున్నాడు కానీ అతని జనరల్ ముర కూడా యుద్దభూమిలో చనిపోవడాన్ని నరకాసురుడు చూసి,అరుస్తూ బయటకు పరుగెత్తుకుంటూ కృష్ణుడి వద్ద తన సతగిని [పిడుగు] విసిరాడు. నరకాసురుడు వారి ఆయుధాలన్నింటినీ తటస్తం చేయగలిగాడు మరియు వెంటనే అతను కోపంగా ‘శక్తి’ అనే శక్తివంతమైన ఆయుధాన్ని బయటకు తీసి కృష్ణుడిపైకి విసిరాడు.ఆయుధం కృష్ణుడి వక్షస్తలానికి కి తగలడంతో సత్యభామ భయానకంగా చూసింది.

సత్యభామ నరకాసురుడిని చంపడం

సత్యభామ కోపంగా తనదైన ఒక శక్తివంతమైన ఆయుధాన్ని బయటకు తీసి నరకాసురుడిపై విసిరాడు. ఆమె క్రిష్ణుడు పడిపోవడం చూసినప్పుడు ఆమె ఒక్కసారి గా ఆశ్చర్యానికి గురై నరకాసురుడి పైకి ఆయుధాన్ని విసిరింది.

నరకాసురుడు అక్కడికక్కడే ఉండి, కృష్ణుడు తన శరీరంపై ఒక్క గీతలు అనగా గాయం కూడా లేకుండా మేల్కొన్నట్లు చూసాడు సత్యభామ కూడా ఆశ్చర్యంగా చూసి ఉన్న సమయం లో.ఇద్దరూ గరుడ నుండి దిగి నరకాసురుని వైపు రావడంతో కృష్ణుడు పకాలున నవ్వాడు.

ఈ సమయంలో అతని వరం ఎలా విఫలమైందో నరకాసురుడు ఆశ్చర్యపోయాడు, కాని చివరికి, బాణాసురుడి మార్గదర్శకత్వంలో అతను చేసిన తప్పిదాలకు దోషిగా మారాడు.

నరకాసురుడు వెంటనే తన మార్గాల్లో పశ్చాత్తాపపడి క్షమాపణ కోరాడు.కృష్ణుడు, నరకాసుర!ఈమె నిజంగా భూదేవి అవతారమైన సత్యభమ… 'కృష్ణుడు కొనసాగుతున్నప్పుడు సత్యభమ, నరకాసురుడు కృష్ణుడిని ఆశ్చర్యంతో చూశారు,' ఆమె మిమ్మల్ని ఓడించే ప్రత్యేక ఉద్దేశ్యంతోనే అవతరించింది… నేను నిన్ను ఎప్పుడూ ఓడించలేను… సత్యభామ మాత్రమే చేయగులుగుతుంది కాబట్టి నేను మార్గాన్ని మాత్రమే చూపిస్తాను.
అపస్మారక స్థితిలో పడటం మరియు మిగిలినది ఆమె చేత చేయబడినది.

నరకాసురుడు తన చివరి రోజు ను చూస్తూ, ‘నేను ఈ రోజు కాంతిని చూశాను, నా ప్రభూ… ప్రజలు ఈ రోజును చీకటిపై కాంతి సాధించిన రోజుగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను’ అని శ్రీ కృష్ణుడికి చెప్పాడు.

ఈ రోజు వరకు, నరకాసుర మరణం చీకటిపై కాంతి విజయంగా జరుపుకుంటారు… ఇది దీపావళి రెండవ రోజున ‘నరక చతుర్దశి’ గా వస్తుంది.

కృష్ణుడు నరకాసుర జనరల్ మురాను చంపాడు. ఈ కారణంగా,తనను ‘మురారి’ అని పిలుస్తారు.

సత్యభామ అదితి చెవిరింగులను తీసుకొని అదితికి మళ్లీ అప్పగించారు.

మంచి మాట

 భక్తులారా మీరీ కీర్తిప్రతిష్టలు, ధన కనక వస్తు వాహనాలు మీద నమ్మకం ఉంచుతున్నారు, ఇవన్నీ మీకు స్థూలంగా శాశ్వతంగా నదిలో పెద్ద మొద్దులలా గా కనబడుతున్నాయి, కానీ మిమ్ము -నదిలో పడిన వారిని పెద్ద మొద్దు కాపాడలేని విధంగా ఈ స్థూల వస్తుజాలం కాపాడలేదు సుమా. నదిలో పడిన వానిని ఒక సన్నని త్రాడు కాపాడుతుంది, త్రాడు సన్ననిదే కానీ కాపాడేది అదే, అదే మాదిరి మీ ఆత్మ రక్షణ సూత్రం భౌతికమైనది కాదు, సూక్ష్మమైనది. ఇంద్రియాలకు అగోచరమైనది,
సత్యసూత్రం అత్యంత సూక్ష్మమైనది, దుఖః ప్రవాహంలో నుంచి మిమ్ము బయట కి లాగే సూత్రం స్వచ్ఛమైన పరమాత్మ యందు విశ్వాసము. మిమ్ములను కాపాడేది శ్రీకృష్ణ పరమాత్మ మీద సంపూర్ణ విశ్వాసమే.

అందరూ

అందరూ ఆగస్ట్ 10 నుండి  సెప్టెంబర్ 10 వరకు కరోనా లక్షణాలు ఉన్నా, లేక పోయినా...

ఉదయం 7గం. ల నుండి 8గం. లలోపు 
మరియు
రాత్రి 7గం. ల నుండి 8గం. లలోపు వేడినీటితో కేవలం ఒక్క 10 నిముషాలు ఆవిరి పట్టినట్లైతే, వైరస్ కణాలుంటే తొలగిపోతాయి.
(వీలైతే ఆవిరి పట్టే నీటిలో కొద్దిగా పసుపు కానీ, పచ్చ కర్పూరం కానీ, యూకలిప్టస్ ఆయిల్ కానీ వేసి ఆవిరిపడితే చాలా బాగుంటుంది.)

అలాగే రోజంతా గోరు వెచ్చని నీళ్ళు త్రాగండి.
ఈ విధంగా చేస్తే కరోనా వైరస్ వ్యాప్తి అరికట్ట బడుతుంది.

ఇది అందరూ ఒక ఉద్యమంలా  చేస్తే...
వైరస్ చనిపోతుంది.
మనకు వైరస్ లేకున్నా ఆవిరిపట్టుట ద్వారా మనకు స్వచ్చమైన శ్వాస కలిగుతుంది.

ఈ మెసేజ్ మీ బంధు మిత్రులకు మీ గ్రూపులలో పోస్టు చేసి ఉద్యమంలా ఆచరిస్తూ ఉండండి...

మనం అందరము ఆవిరిపడదాం.
ఇలా అందరూ ఒకేసారి చేయడం వలన కరొనా Spread అయ్యే అవకాశం లేదు.
దాని వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉంటుంది.
********************

Did you know this 👹

A Rich man can be a Prime Minister, was
 proven by
Jawaharlal Nehru

A Poor man can be Prime Minister, was proven by
Lal Bahadur Shastri

An Old man can be Prime Minister, was proven by
Morarji Desai

A Lady can be Prime Minister, was proven by
Indira Gandhi

An Illiterate man can be Prime Minister, was proven by
Chaudhary Charan Singh

A Pilot can be Prime Minister, was proven by
Rajiv Gandhi

A man from Royal Family can be Prime Minister, was proven by
V P Singh

A Scholar can be Prime Minister, was proven by
P V Narasimha Rao

A Poet can be Prime Minister, was proven by
Atal Behari Vajpayee

Anybody can be Prime Minister, was proven by
H D Deva Gowda

A Tea seller can be Prime Minister, was proven by
Narendra Modi

A Prime Minister is not at all required, was proven by
Manmohan Singh

The Country can be ruled without being a Prime Minister,
Was proven by
Sonia Gandhi.

శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ

 P.Durga Subramanyam Br Wats:
శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ

636వ నామ మంత్రము 10.8.2020

ఓం గంధర్వ సేవితాయై నమః

గంధర్వులచే సేవింపబడు పరాశక్తికి నమస్కారము.

అద్భుత గాయకులైన గంధర్వులు తమ గానంతో జగన్మాతను సేవిస్తారని భావము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి గంధర్వ సేవితా అను ఆరక్షరముల (షడక్షరీ) నామ మంత్రమును ఓం గంధర్వ సేవితాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఆరాధించు భక్తులు షడ్గుణ సంపన్నులై, ఆ షడ్గుణములే సకల సంపదలై, జగన్మాత పాదపద్మముల నారాధిస్తూ జీవనం కొనసాగించి తరించుదురు.

విశ్వావసు మొదలైన గంధర్వులతో సేవింపబడుచున్నదని ఈ నామ మంత్రములోని భావము. గంధర్వులు రెండురకాలుగా ఉంటారు. మానవ గంధర్వులు, దేవ గంధర్వులు. మానవ గంధర్వులు అనగా తాము చేసిన పుణ్యకర్మల ప్రభావంతో గంధర్వ జన్మనందుకున్నవారు. దేవ గంధర్వు జన్మములు సదా గంధర్వ లోకమందు జన్మించినవారు. మానవ గంధర్వులు, దేవ గంధర్వులు వీరిద్దరి చేత శ్రీమాత పూజింపబడినందున గంధర్వ సేవితా అని జగన్మాత స్తుతింపబడుచున్నది. గంధర్వులు మంచి గాయకులు. మంచి సంగీతమును, శ్రుతి, లయ బద్ధముగా గానము చేస్తారు.

గంధర్వులు పర్వతాగ్ర భాగాలలో విహరిస్తారు. ఆ దేవిని ఉమా, గౌరీ, శైలేంద్రతనయా అంటూ శ్రీమాతను కర్ణ పేయముగా ఆహ్లాదకరంగా కలిగించే సుమధురస్తోత్ర గానములచేత సేవిస్తారు. ఆ పరాశక్తికి నమస్కరించునపుడు ఓం గంధర్వ సేవితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి అనుగ్రహముతో, వారి విరచితమైన శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🕉🕉🕉నేడు సోమ వారము🌻🌻🌻ఇందు వారము అని కూడా అంటాము🔱🔱🔱నీలకంఠుని ఆరాధించు పవిత్రమైన దినము🙏🙏🙏 ఓం నమశ్శివాయ అనే ఈ పంచాక్షరిని పదిసార్లు మననం చేసుకుందాము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉
[3:00 am, 10/08/2020] P.Durga Subramanyam Br Wats: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ

59వ నామ మంత్రము 10.8.2020

ఓం మహాపద్మాటవీ సంస్థాయై నమః

మహామహిమాన్వితమైన షట్చక్రములను పద్మములనే వనమునందుండు జగన్మాతకు  నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహాపద్మాటవీసంస్థా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం మహాపద్మాటవీ సంస్థాయై నమః అని ఉచ్చరిస్తూ, ఆ కరుణామయిని పూజించితే ఆ భక్తులు ఐహికమైన ధర్మార్థకామపరమైన అభీష్టముల సిద్ధి మాత్రమే గాక పరమార్థమును సైతం పొంది తరిస్తారు.

సహస్రదళ పద్మమునకు మహాపద్మాటవి అని పేరు. ఆ మహాపద్మాటవిలో శ్రీమాత వసించుచున్నది.

ఆజ్ఞాచక్రమునకు పై భాగము నందు సహస్రదళ పద్మము ఉండును. అందు శ్రీమాత విరాజిల్లుచున్నదని ఈ నామ మంత్రములోని భావము. ఇది పిండాండ విషయము.

ఈ శరీరమే ఒక పద్మాటవి అనబడును. షట్చక్రములు, డెబ్బది రెండు నాడులు మొదలైనవన్నియును మహాపద్మములు అగును. ఇందు బ్రహ్మరంధ్రము నందలి సహస్రార కమలమునందు శ్రీదేవి విరాజిల్లుచుండును. మూలాధారమునందలి కుండలినీ శక్తిని జాగృతము చేసి సుషుమ్నా మార్గమున బ్రహ్మరంధ్రమును చేర్చినవారికి భవానీమాత సాక్షాత్కారమగును. సూర్యకిరణ తేజస్సు ద్వారా పద్మాలు వికసిస్తాయి. శుక్రము యొక్క సూక్ష్మముగా ఉండే ధాతువును ఓజస్సు, తేజస్సు, సహస్సు, భ్రాజస్సు లంటారు. వెన్నెముక మధ్యలో ఉండు సుషుమ్నా మార్గము ద్వారా ఊర్ధ్వ గతిలో పోయే కుండలినీ శక్తి తేజస్సు పైకి ప్రసరిస్తుంది. షట్చక్రములను ఛేదిస్తూ సహస్రారం చేరుతుంది. అచ్చటనుండి శ్రీమాత తమ చరణముల ద్వారా అమృత ధారలు కురిపిస్తుంది. అచ్చట షట్చక్రములు వికసిస్తాయి. వీటిపైన సహస్రార పద్మంలో శివ దేవునితో ఐక్యమై ఆనందమనుభవిస్తారు. కావున మహాపద్మటవీ సంస్థా అనబడుచున్నది. ఇది పిండాండ విషయము.

బ్రహ్మాండోపరిభాగమునందు మూడులక్షల యోజనముల విస్తీర్ణమైన మహాపద్మాటవి గలదు. అచట బంగారు వర్ణ పద్మముల నుండి సుధాసారము వంటి మకరంద ఝరులు ప్రవహించుచుండును. శ్రీగంధ సువాసనతో చల్లని గాలులు నిత్యము వీచుచుండును. ఇందుండే చింతామణి గృహమునందు పంచబ్రహ్మాసనమున శ్రీదేవి విరాజిల్లుచున్నది. ఇది బ్రహ్మాండ విషయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి అనుగ్రహముతో, వారి విరచితమైన శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🕉🕉🕉నేడు సోమ వారము🌻🌻🌻ఇందు వారము అని కూడా అంటాము🔱🔱🔱నీలకంఠుని ఆరాధించు పవిత్రమైన దినము🙏🙏🙏 ఓం నమశ్శివాయ అనే ఈ పంచాక్షరిని పదిసార్లు మననం చేసుకుందాము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉

పిల్లలకు నేర్పించండి

ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం కూడా మరోసారి మననం చేసుకుందాం.

 దిక్కులు : (1) తూర్పు, (2) దక్షిణం, (3) పడమర, (4) ఉత్తరం

మూలలు :(1) ఆగ్నేయం, (2) నైరుతి,(3) వాయువ్యం, (4) ఈశాన్యం

 వేదాలు :(1) ఋగ్వే దం,
(2) యజుర్వేదం,(3) సామవేదం,
(4) అదర్వణ వేదం

 పురుషార్ధాలు :(1) ధర్మ, (2) అర్థ,
(3) కామ,(4) మోక్షా

 పంచభూతాలు :(1) గాలి, (2) నీరు,
(3) భూమి,(4) ఆకాశం,(5) అగ్ని.

  పంచేంద్రియాలు : (1) కన్ను,
(2) ముక్కు, (3) చెవి, (4) నాలుక,
(5) చర్మం.

 లలిత కళలు : (1) కవిత్వం,
(2) చిత్రలేఖనం, (3) నాట్యం,
(4) సంగీతం, (5) శిల్పం.

 పంచగంగలు : (1) గంగ, (2)  కృష్ణ,
(3) గోదావరి, (4) కావేరి,
(5) తుంగభద్ర.

 దేవతావృక్షాలు : (1) మందారం,
(2) పారిజాతం, (3) కల్పవృక్షం,
(4) సంతానం, (5) హరిచందనం.

 పంచోపచారాలు : (1) స్నానం,
(2) పూజ,  (3) నైవేద్యం,
(4) ప్రదక్షిణం, )5) నమస్కారం.

 
పంచామృతాలు : (1) ఆవుపాలు,
(2) పెరుగు, (3) నెయ్యి, (4) చక్కెర,
(5) తేనె.

 పంచలోహాలు : (1) బంగారం,
(2) వెండి,  (3) రాగి,
(4) సీసం, (5) తగరం.

 పంచారామాలు : )1) అమరావతి,
(2) భీమవరం, (3) పాలకొల్లు,
(4) సామర్లకోట, (5) ద్రాక్షారామం

 షడ్రుచులు : (1) తీపి, (2) పులుపు,
(3) చేదు, (4) వగరు,
(5) కారం, (6) ఉప్పు.

అరిషడ్వర్గాలు  షడ్గుణాలు:(1) కామం,
(2) క్రోధం, (3) లోభం, (4) మోహం,
(5) మదం, (6) మత్సరం.

ఋతువులు : (1) వసంత,(2) గ్రీష్మ,
(3) వర్ష, (4) శరద్ఋతువు,
(5) హేమంత, (6) శిశిర

 సప్త ఋషులు : (1) కాశ్యపుడు,
(2) గౌతముడు,  (3) అత్రి,
(4) విశ్వామిత్రుడు, (5) భరద్వాజ,
(6) జమదగ్ని, (7) వశిష్ఠుడు.

తిరుపతి సప్తగిరులు : (1) శేషాద్రి,
(2) నీలాద్రి, (3) గరుడాద్రి,
(4) అంజనాద్రి, (5) వృషభాద్రి,
(6) నారాయణాద్రి, (7) వేంకటాద్రి.

సప్త వ్యసనాలు : (1) జూదం,
(2) మద్యం, (3) దొంగతనం,
(4) వేట, (5) వ్యభిచారం,
(6) దుబారఖర్చు,
(7) కఠినంగా మాట్లాడటం.

 సప్త నదులు : (1) గంగ,
(2) యమునా,  (3) సరస్వతి,
(4) గోదావరి,  (5) సింధు,
(6) నర్మద,  (7) కావేరి.
           
నవధాన్యాలు : (1) గోధుమ,
(2) వడ్లు,  (3) పెసలు,
(4) శనగలు, (5) కందులు,
(6) నువ్వులు, (7) మినుములు,
(8) ఉలవలు, (9) అలసందలు.

నవరత్నాలు : (1) ముత్యం,
(2) పగడం, (3) గోమేధికం,
(4) వజ్రం, (5) కెంపు, (6) నీలం,
(7) కనకపుష్యరాగం,
(8) పచ్చ (మరకతం),
(9) ఎరుపు (వైడూర్యం).

నవధాతువులు : (1) బంగారం,
(2) వెండి, (3) ఇత్తడి, (4) రాగి,
(5) ఇనుము, (6) కంచు,
(7) సీసం, (8) తగరం,
(9) కాంతలోహం.

నవరసాలు : (1) హాస్యం,(2) శృంగార,
(3) కరుణ, (4) శాంత, (5) రౌద్ర,
(6) భయానక, (7) బీభత్స,
(8) అద్భుత, (9) వీర

నవదుర్గలు : (1) శైలపుత్రి,
(2) బ్రహ్మ చారిణి, (3) చంద్రఘంట,
(4) కూష్మాండ, (5) స్కందమాత,
(6) కాత్యాయని, (7) కాళరాత్రి,
(8) మహాగౌరి, (9) సిద్ధిధాత్రి.

 దశ సంస్కారాలు : (1 ) వివాహం,
( 2 ) గర్భాదానం, (3 ) పుంసవనం ,
(4 ) సీమంతం, (5) జాతకకర్మ,
(6 ) నామకరణం, (7) అన్నప్రాశనం,
(8 ) చూడకర్మ, (9 ) ఉపనయనం,
(10) సమవర్తనం

దశావతారాలు : (1) మత్స్య,
(2) కూర్మ, (3 ) వరాహ,
(4) నరసింహ, (5) వామన,
(6) పరశురామ, (7) శ్రీరామ,
(8) శ్రీకృష్ణ, (9) బుద్ధ, (10) కల్కి.

జ్యోతిర్లింగాలు :

హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .

కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .

మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)

గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)

మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం,    ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)

ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం)

తమిళనాడు ~ రామలింగేశ్వరం

తెలుగు వారాలు : (1) ఆది, (2) సోమ,
(3) మంగళ, (4) బుధ, (5) గురు,
(6) శుక్ర, (7) శని.

తెలుగు నెలలు : (1) చైత్రం,
(2) వైశాఖం,(3) జ్యేష్ఠం,(4) ఆషాఢం,
(5) శ్రావణం, (6) భాద్రపదం,
(7) ఆశ్వీయుజం, (8) కార్తీకం,
(9) మార్గశిరం, (10) పుష్యం,
(11) మాఘం, (12) ఫాల్గుణం.

 రాశులు : (1) మేషం,(2) వృషభం,
(3) మిథునం, (4) కర్కాటకం,
(5) సింహం, (6) కన్య, (7) తుల,
(8) వృశ్చికం, (9) ధనస్సు,
(10) మకరం, (11) కుంభం,
(12) మీనం.

తిథులు : (1) పాఢ్యమి, (2) విధియ,
(3) తదియ, (4) చవితి,(5) పంచమి,
(6) షష్ఠి, (7) సప్తమి, (8) అష్టమి,
(9) నవమి, (10) దశమి,(11) ఏకాదశి,
(12) ద్వాదశి, (13) త్రయోదశి,
(14) చతుర్దశి,
(15) అమావాస్య /పౌర్ణమి.

నక్షత్రాలు : (1) అశ్విని, (2) భరణి,
(3) కృత్తిక, (4) రోహిణి, (5) మృగశిర,
(6) ఆరుద్ర, (7) పునర్వసు,
(8) పుష్యమి, (9) ఆశ్లేష, (10) మఖ,
(11) పుబ్బ, (12) ఉత్తర, (13) హస్త,
(14) చిత్త, (15) స్వాతి, (16) విశాఖ,
(17) అనురాధ, (18) జ్యేష్ఠ,
(19) మూల, (20) పూర్వాషాఢ,
(21) ఉత్తరాషాఢ, (22) శ్రావణం,
(23) ధనిష్ఠ, (24) శతభిషం,
(25) పూర్వాబాద్ర, (26) ఉత్తరాబాద్ర,
(27) రేవతి.

తెలుగు సంవత్సరాల పేర్లు :
(1) ప్రభవ :-
1927, 1987, 2047, 2107

(2) విభవ :-
1928, 1988, 2048, 2108

(3) శుక్ల :-
1929, 1989, 2049, 2109

( 4 ) ప్రమోదూత :-
1930, 1990, 2050, 2110

( 5 ) ప్రజోత్పత్తి :-
1931, 1991, 2051, 2111

( 6 ) అంగీరస :-
1932, 1992, 2052, 2112

( 7 ) శ్రీముఖ :-
1933, 1993, 2053, 2113

( 8 )భావ. -
1934, 1994, 2054, 2114

9యువ.  -
1935, 1995, 2055, 2115

10.ధాత.  -
1936, 1996, 2056, 2116

11.ఈశ్వర. -
1937, 1997, 2057, 2117

12.బహుధాన్య.-
1938, 1998, 2058, 2118

13.ప్రమాది. -
1939, 1999, 2059, 2119

14.విక్రమ. -
1940, 2000, 2060, 2120

15.వృష.-
1941, 2001, 2061, 2121

16.చిత్రభాను. -
1942, 2002, 2062, 2122

17.స్వభాను. -
1943, 2003, 2063, 2123

18.తారణ. -
1944, 2004, 2064, 2124

19.పార్థివ. -
1945, 2005, 2065, 2125

20.వ్యయ.-
1946, 2006, 2066, 2126

21.సర్వజిత్తు. -
1947, 2007, 2067, 2127

22.సర్వదారి. -
1948, 2008, 2068, 2128

23.విరోధి. -
1949, 2009, 2069, 2129

24.వికృతి. -
1950, 2010, 2070, 2130

25.ఖర.
1951, 2011, 2071, 2131

26.నందన.
1952, 2012, 2072, 2132

27 విజయ.
1953, 2013, 2073, 2133,

28.జయ.
1954, 2014, 2074, 2134

29.మన్మద.
1955, 2015, 2075 , 2135

30.దుర్మిఖి.
1956, 2016, 2076, 2136

31.హేవళంబి.
1957, 2017, 2077, 2137

32.విళంబి.
1958, 2018, 2078, 2138

33.వికారి.
1959, 2019, 2079, 2139

34.శార్వారి.
1960, 2020, 2080, 2140

35.ప్లవ
1961, 2021, 2081, 2141

36.శుభకృత్.
1962, 2022, 2082, 2142

37.శోభకృత్.
1963, 2023, 2083, 2143

38. క్రోది.
1964, 2024, 2084, 2144,

39.విశ్వావసు.
1965, 2025, 2085, 2145

40.పరాభవ.
1966, 2026, 2086, 2146

41.ప్లవంగ.
1967, 2027, 2087, 2147

42.కీలక.
1968, 2028, 2088, 2148

43.సౌమ్య.
1969, 2029, 2089, 2149

44.సాధారణ .
1970, 2030, 2090, 2150

45.విరోధికృత్.
1971, 2031, 2091, 2151

46.పరీదావి.
1972, 2032, 2092, 2152

47.ప్రమాది.
1973, 2033, 2093, 2153

48.ఆనంద.
1974, 2034, 2094, 2154

49.రాక్షస.
1975, 2035, 2095, 2155

50.నల :-
1976, 2036, 2096, 2156,

51.పింగళ               
1977, 2037, 2097, 2157

52.కాళయుక్తి       
1978, 2038, 2098, 2158

53.సిద్ధార్ధి             
1979, 2039, 2099, 2159

54.రౌద్రి               
1980, 2040, 2100, 2160

55.దుర్మతి             
1981, 2041, 2101, 2161

56.దుందుభి           
1982, 2042, 2102, 2162

57.రుదిరోద్గారి       
1983, 2043, 2103, 2163

58.రక్తాక్షి               
1984, 2044, 2104, 2164

59.క్రోదన                 
1985, 2045, 2105, 216

60.అక్షయ             
1986, 2046, 2106, 2166.

ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం మరోసారి మననం చేసుకుందాం....
నమస్కారం👏👏👏

Covid-19 phobia

Dear All

today everybody are panic about this Covid-19.  in fact the doctors are saying that can be cured, but due to the phobia of the disease only many patients are loosing there lives. read the observations given by the expert doctors. 


OBSERVATIONAL STUDY (All evidences in the book) Our conclusion after successfully treating 5000 + ILI/Covid-19 patients with three step Flu diet:

 1) The rate of transmission (R0) of SARS-CoV-2 is comparable to that of common cold. 

2) The mortality rate of Covid-19 is comparable to that of seasonal Flu. 

3) In the absence of social distancing, the retransmission rate and the chances of infecting a person (symptomatically and not diagnostically) is surprisingly less than 2 % . 

4) Within the first 24 hours of three step Flu diet, the temperature comes to ≤ 100⁰ F for ≥ 90% of the patients. 

5) Within the first 48 hours of the three step Flu diet, 60 % of the patients tested negative for Covid-19 

6) Within 72 hours of the three step Flu diet, (i) All symptoms were resolved for approximately 80% of the patients. (ii) 75 % of the patients tested negative for Covid-19 

7 ) With the three step Flu diet for 3 days followed by D.I.P. Diet: • 95 % of the patients recovered within 7 days • 100 % of the patients recovered within 14 days

8) It is possible to successfully treat severely ill ILI/Covid-19 patients in home setting with zero medicines/without oxygen cylinders or external respiratory support. Severely ill means: • Temperature ≥104⁰F • SpO₂ ≤ 75 % • Severe Pneumonia • Acute Respiratory Distress Syndrome 

9) For more than 95% of the patients and their family members, the panic situation is not due to symptoms/physical discomfort rather it is due to the Covid-19 phobia and fear psychosis. N.I.C.E WAY TO CURE COVID-19 - DR. BISWAROOP ROY CHOWDHURY BROUGH


హెచ్చరిక

సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దు. 
ఇప్పుడు అందరి జేబులు కాళీ అయ్యాయి దానితో దొంగదోవలో డబ్బులు సంపాయించటం ఎలాగ అనేదానిపైనే చాలామంది కృషిచేస్తున్నారు. దానికోసం వాళ్ళ తెలివితేటలూ అన్ని ప్రదర్శిస్తున్నారు. ఇది ఈ రోజు కొత్తగా వచ్చింది ఏమి కాదు పూర్వమునుండి ఇతరులను దోచుకోవటానికి చేసే పన్నాగాలు ఎన్నో వుండేవి  మనకు తెలిసిన వారు కూడా ఎంతోమంది మోసపోయినట్లు మనకు తెలుసు. 
ఈ రోజు ఒక వాట్స్ ఆప్ మెసేజ్ చూసి ఇది వ్రాస్తున్నాను. అది ఏమిటంటే 
Providing Free Laptop For Youth 
Click Below to Book Your Free Laptop Now 
👉 https://oficayuda.club/laptops/

మనం ఇటువంటి మెసేజులు చూడంగానే ముందుగా ఆశ కలుగుతుంది. వెంటనే అది నిజామా కాదా అనే ఒక ఆలోచన కూడా కొంతమందికి కలుగుతుంది. కానీ ఎవ్వరమూ కూడా మనకు ఫ్రీగా ఎందుకు ఇస్తారు అని ఆలోచించం. ఎందుకంటె అది మన బలహీనత. ఈ బలహీనతనే కాష్ చేసుకుంటున్నారు ఎప్పటినుండో నేరగాళ్లు. ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు లేనందుకు ఇదే మంచి అదను అని వాళ్ళు విర్రవీగుతున్నారు. ఇటీవల మనం టీవీలో కూడా ఇటువంటి అనేక మోసాలను చూసాము. 
ఎటిఎం నుండి దొంగతనంగా డబ్బులు డ్రా చేసే ముఠా మొన్నీమధ్యనే పట్టుపడింది. 
ఉచిత గిఫ్టులు: మనం ఏదో పనిమీద వున్నప్పుడు ఒక ఆడ గొంతు ఫోన్ చేస్తుంది అందులో మీకు మేము నిర్వహించిన ఫలానా లాటరీలో మీ నుమ్బెరుకి అష్ట లక్షిమి పెండిట్ వచ్చింది. దాని ఖరీదు 8 వేలు. మీరు 2 వేలు కడితే మీకు వెంటనే పార్సల్ చేస్తాము. 
మీకు ఫలానా లాటరీ వచ్చింది మీ మెయిలు కు అని ఇలా ఎన్నో ఎన్నెన్నో. 
నేను బ్యాంకు మేనేజరును నీ ఏటీఎం కార్డు నెంబర్ చెప్పు, ఓటీపీ చెప్పు అని ఇలా ఎన్నో, ఎన్నెన్నో. 
మన భారతీయులను మభ్యపెట్టి దోచుకోటానికి కొంతమంది విదేశీయులు కూడా పూనుకుంటున్నారని మనం అప్పుడప్పుడు వార్తలు చూస్తున్నాం. 
ప్రస్తుతం మనం ఇంకొక మెసేజ్ చూస్తున్నాం. అదే ఏమిటంటే చివరకు కేంద్ర ప్రేభుత్వం ప్రతి సిటిజనుకు 2వేలు ఇవ్వటానికి ఒప్పుకుంది త్వరగా మీ వివరాలు అన్ని తెలియచేయండి అని వస్తున్నది ఇందులో ఇంకొక విచిత్రం ఏమిటంటే మన దేశపు మూడు సింహాలు గుర్తు వున్నది. అది చుస్తే ఎవరైనా నిజమే అని అనుకుంటారు. 
నాకు తెలిసిన కొన్ని మోసాలు మన జాగ్రత్త కోసం ఇక్కడ వ్రాస్తున్నాను. 
చాలా సమస్తరాలక్రింద జరిగిన ఒక సంఘటన: 
ఒక మధ్యతరగతి మహిళ భర్త ఆఫీసుకి వెళ్లిన తరువాత హైద్రాబాదులో కూరగాయలు కొనటానికి వెళ్ళింది. ఆమె కూరలు కొని ఇంటికి తిరిగి వస్తూవుంటే దారిలో ఒక బంగారు గొలుసు రోడ్డుమీద కనపడ్డది.  అది చూసి ఆమె తీసుకోపోయంది. ఆమె చెయ్ దానిమీద పడటమే ఆలస్యం ఇంకొక స్త్రీ అక్కడికి వచ్చి ఇది నేను చూసాను నాది అని దానిని తీసుకొనే ప్రయత్నం చేసింది. ఇద్దరి మధ్య వాగ్వివాదం మొదలయింది. ఆమె ఆ నగను రెండుగా చేసుకొని తీసుకుందాం అని అన్నది.  అంతలో ఒక మగ మనిషి ఎక్కడినుండి వచ్చాడో వచ్చి మీరిద్దరూ కొట్లాడుకోకండి దీనిని తుంచి తీసుకుంటే ఎవరికి ఉపయోగ పడదు దాని బాపతు మీరు ఒకరికి డబ్బులు ఇవ్వండి అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవు అని తరువాత వచ్చిన స్త్రీ అన్నది. దానిని ఆటను అమ్మ మీ దగ్గర యెంత డబ్బు వుంది అన్నాడు. 3వేలు అని మధ్యతరగతి మహిళ అన్నది అది చాలా తక్కువ ఆయన ఏమిచేస్తాం ఇవ్వండి అని ఆ స్త్రీ తీసుకుంది. చాల ఖరీదయిన బంగారం గొలుసు కేవలం 3 వేలకే వచ్చిందని పాపం ఆమె సంతోషం పెద్దది. కానీ చివరకు సాయంత్రం భర్త ఇంటికి వచ్చిన తరువాత కంసాలి వానివద్దకు వెళ్లిన తరువాత కానీ వాళ్లకు తెలియలేదు అది 100,150 కి దొరికే గిల్టు నగ అని. 
ఇటువంటి మోసాలు ఎన్నో రోజు జరుగుతున్నాయి. అందులో కొన్ని మనకు తెలుస్తున్నాయి కొన్ని తెలియటంలేదు. ఎదుటి వారి దురాశను పావుగా వాడుకొని మోసాలు చేసే వాళ్ళు అనేకమంది వున్నారు. ఇప్పుడు చాలామంది కంప్యూటర్ క్నాలెడ్జ్ వున్నవాళ్లు ఉద్యమంగా ఈ మోసాలు చేస్తున్నారు. స్త్రీలు కూడా ఇప్పుడు మోసాలకు పాలుపడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. 
నేను అందరిని కోరేది ఏమంటే ఎక్కడ ఏది ఉచితంగా రాదు. కేవలం ఎలుకల బోనులోనే ఆహరం ఉచితంగా వస్తుంది. 
మిత్రులు వాళ్లకు వున్న అనుభవాలు కూడా ఇక్కడ పంచుకుంటే మన వాళ్లకు కొంత గుణపాఠంలాగా ఉంటుంది. 
దయచేసి ఈ మెసేజీని మీకు తెలిసిన ఇతర గ్రూపులకు కూడా ఫార్వర్డ్ చేయండి సాటివారిని కొంతైనా మోసాలనుండి రక్షించండి. 
***********************