10, ఆగస్టు 2020, సోమవారం

అష్టవిధ బ్రాహ్మణులు

ధర్మశాస్త్రాలు బ్రాహ్మణుని స్థాయిని బట్టి 8 విధాలుగా వర్ణించాయిట. అవి:

*మాత్రుడు:*
బ్రాహ్మణకులంలో జన్మించినా, ఉపనయనము, అనుష్ఠానమూ లేని వాడు.

*బ్రాహ్మణుడు:*
వేదాలను కొంతమేరకే అధ్యయనం చేసినవాడు. అయితే, ఆచారమూ, శాంతి, సత్యము, దయ కల వాడు, ఆ బుద్ధి కలిగినవాడు.

*శ్రోత్రియుడు:*
కనీసం ఒక వేదం శాఖను, కల్ప సూత్రాలతో, షడంగములతో,అధ్యయనం చేసి, యజ్ఞాది షట్కర్మలను చేసేవాడు.

*అనుశాసనుడు:* వేదాలను, ఉపనిషత్తులను అధ్యయనం చేసి అర్థం చేసుకున్నవాడు; నిర్మలమైన చిత్తం కలిగి శ్రోత్రియుడి లక్షణాలు కలవాడు.

*బ్రూణుడు:* 
యజ్ఞయాగాదులు, వేదాధ్యయనము, వ్రతాలు చేస్తూ, ఇంద్రియాలను జయించినవాడు; అనుశాసనుడి లక్షణాలు కలవాడు.

*ఋషికల్పుడు:*
వైదిక, లౌకిక వ్యవహారములు తెలిసి, గృహస్థుగా వున్నవాడు; బ్రూణుడి లక్షణాలు కలవాడు.

*ఋషి:*
తపస్వి;  కామమూనూ, ఆకలినీ జయించినవాడు, సత్యసంధత కలిగినవాడు; వరములను, శాపములను ఇవ్వగలిగినవాడు.

*ముని:*
అరిషడ్వర్గములను, ఇంద్రియములను, జయించినవాడు; వస్తుసంపదలపై మోహము లేనివాడు; మౌనియై సమాధి స్థితి పొందినవాడు....

సేకరణ

కామెంట్‌లు లేవు: