10, ఆగస్టు 2020, సోమవారం

శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ

 P.Durga Subramanyam Br Wats:
శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ

636వ నామ మంత్రము 10.8.2020

ఓం గంధర్వ సేవితాయై నమః

గంధర్వులచే సేవింపబడు పరాశక్తికి నమస్కారము.

అద్భుత గాయకులైన గంధర్వులు తమ గానంతో జగన్మాతను సేవిస్తారని భావము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి గంధర్వ సేవితా అను ఆరక్షరముల (షడక్షరీ) నామ మంత్రమును ఓం గంధర్వ సేవితాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఆరాధించు భక్తులు షడ్గుణ సంపన్నులై, ఆ షడ్గుణములే సకల సంపదలై, జగన్మాత పాదపద్మముల నారాధిస్తూ జీవనం కొనసాగించి తరించుదురు.

విశ్వావసు మొదలైన గంధర్వులతో సేవింపబడుచున్నదని ఈ నామ మంత్రములోని భావము. గంధర్వులు రెండురకాలుగా ఉంటారు. మానవ గంధర్వులు, దేవ గంధర్వులు. మానవ గంధర్వులు అనగా తాము చేసిన పుణ్యకర్మల ప్రభావంతో గంధర్వ జన్మనందుకున్నవారు. దేవ గంధర్వు జన్మములు సదా గంధర్వ లోకమందు జన్మించినవారు. మానవ గంధర్వులు, దేవ గంధర్వులు వీరిద్దరి చేత శ్రీమాత పూజింపబడినందున గంధర్వ సేవితా అని జగన్మాత స్తుతింపబడుచున్నది. గంధర్వులు మంచి గాయకులు. మంచి సంగీతమును, శ్రుతి, లయ బద్ధముగా గానము చేస్తారు.

గంధర్వులు పర్వతాగ్ర భాగాలలో విహరిస్తారు. ఆ దేవిని ఉమా, గౌరీ, శైలేంద్రతనయా అంటూ శ్రీమాతను కర్ణ పేయముగా ఆహ్లాదకరంగా కలిగించే సుమధురస్తోత్ర గానములచేత సేవిస్తారు. ఆ పరాశక్తికి నమస్కరించునపుడు ఓం గంధర్వ సేవితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి అనుగ్రహముతో, వారి విరచితమైన శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🕉🕉🕉నేడు సోమ వారము🌻🌻🌻ఇందు వారము అని కూడా అంటాము🔱🔱🔱నీలకంఠుని ఆరాధించు పవిత్రమైన దినము🙏🙏🙏 ఓం నమశ్శివాయ అనే ఈ పంచాక్షరిని పదిసార్లు మననం చేసుకుందాము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉
[3:00 am, 10/08/2020] P.Durga Subramanyam Br Wats: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ

59వ నామ మంత్రము 10.8.2020

ఓం మహాపద్మాటవీ సంస్థాయై నమః

మహామహిమాన్వితమైన షట్చక్రములను పద్మములనే వనమునందుండు జగన్మాతకు  నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహాపద్మాటవీసంస్థా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం మహాపద్మాటవీ సంస్థాయై నమః అని ఉచ్చరిస్తూ, ఆ కరుణామయిని పూజించితే ఆ భక్తులు ఐహికమైన ధర్మార్థకామపరమైన అభీష్టముల సిద్ధి మాత్రమే గాక పరమార్థమును సైతం పొంది తరిస్తారు.

సహస్రదళ పద్మమునకు మహాపద్మాటవి అని పేరు. ఆ మహాపద్మాటవిలో శ్రీమాత వసించుచున్నది.

ఆజ్ఞాచక్రమునకు పై భాగము నందు సహస్రదళ పద్మము ఉండును. అందు శ్రీమాత విరాజిల్లుచున్నదని ఈ నామ మంత్రములోని భావము. ఇది పిండాండ విషయము.

ఈ శరీరమే ఒక పద్మాటవి అనబడును. షట్చక్రములు, డెబ్బది రెండు నాడులు మొదలైనవన్నియును మహాపద్మములు అగును. ఇందు బ్రహ్మరంధ్రము నందలి సహస్రార కమలమునందు శ్రీదేవి విరాజిల్లుచుండును. మూలాధారమునందలి కుండలినీ శక్తిని జాగృతము చేసి సుషుమ్నా మార్గమున బ్రహ్మరంధ్రమును చేర్చినవారికి భవానీమాత సాక్షాత్కారమగును. సూర్యకిరణ తేజస్సు ద్వారా పద్మాలు వికసిస్తాయి. శుక్రము యొక్క సూక్ష్మముగా ఉండే ధాతువును ఓజస్సు, తేజస్సు, సహస్సు, భ్రాజస్సు లంటారు. వెన్నెముక మధ్యలో ఉండు సుషుమ్నా మార్గము ద్వారా ఊర్ధ్వ గతిలో పోయే కుండలినీ శక్తి తేజస్సు పైకి ప్రసరిస్తుంది. షట్చక్రములను ఛేదిస్తూ సహస్రారం చేరుతుంది. అచ్చటనుండి శ్రీమాత తమ చరణముల ద్వారా అమృత ధారలు కురిపిస్తుంది. అచ్చట షట్చక్రములు వికసిస్తాయి. వీటిపైన సహస్రార పద్మంలో శివ దేవునితో ఐక్యమై ఆనందమనుభవిస్తారు. కావున మహాపద్మటవీ సంస్థా అనబడుచున్నది. ఇది పిండాండ విషయము.

బ్రహ్మాండోపరిభాగమునందు మూడులక్షల యోజనముల విస్తీర్ణమైన మహాపద్మాటవి గలదు. అచట బంగారు వర్ణ పద్మముల నుండి సుధాసారము వంటి మకరంద ఝరులు ప్రవహించుచుండును. శ్రీగంధ సువాసనతో చల్లని గాలులు నిత్యము వీచుచుండును. ఇందుండే చింతామణి గృహమునందు పంచబ్రహ్మాసనమున శ్రీదేవి విరాజిల్లుచున్నది. ఇది బ్రహ్మాండ విషయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి అనుగ్రహముతో, వారి విరచితమైన శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🕉🕉🕉నేడు సోమ వారము🌻🌻🌻ఇందు వారము అని కూడా అంటాము🔱🔱🔱నీలకంఠుని ఆరాధించు పవిత్రమైన దినము🙏🙏🙏 ఓం నమశ్శివాయ అనే ఈ పంచాక్షరిని పదిసార్లు మననం చేసుకుందాము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉

కామెంట్‌లు లేవు: