26, జులై 2025, శనివారం

పండుగల నెల శ్రావణం

 


శ్రీభారత్ వీక్షకులకు శ్రావణ శుభాకాంక్షలు 🌹ఒక్క నెలలో ఇన్ని పండుగలా! అని ఆశ్చర్యపోతాం శుభ శ్రావణాన్ని చూసి. మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి, రాఘవేంద్ర జయంతి, పోలాల అమావాస్య వంటి దాదాపు పన్నెండు పండుగల నెల శ్రావణం. ఆ వివరాలు చాలా చక్కగా చెప్పారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

_అమ్మను మించిన

 *_అమ్మను మించిన దైవమున్నదా...!?!?_*

================

🌸 _అమ్మకు ఆరోగ్యం బాలేకపోతే.. కొడుకు హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు... పరిస్థితి సీరియస్... లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది. కొడుకు ఆందోళనతో ఉన్నాడు. మధ్యాహ్నం ఒంటిగంట అవుతోంది. అతనికి ఆకలి అవుతోంది. ఈలోగా డాక్టర్ వచ్చి *"ఏం పర్వాలేదు.. నువ్వు వెళ్లి భోజనం చేసిరా!"* అని లోపలికి వెళ్ళిపోయాడు._

 

_మరలా ఓ రెండు గంటల తర్వాత ఆ కొడుకుకి డాక్టర్ ని కలిసే అవకాశం వచ్చింది. *"మా అమ్మ పరిస్థితి ఎలా ఉంది డాక్టర్ ..?"* ఆందోళనగా అడిగాడు కొడుకు..._


_డాక్టర్ గోడ గడియారం వైపు చూస్తూ... *"భోజనానికి వెళ్లొచ్చారా..?"* అంటూ వాకబు చేశాడు..._


_ఆ ప్రశ్న ఎందుకో అసందర్భంగా అనిపించింది అతడికి._ _*"ఆఁ! ఔను డాక్టర్... ఇప్పుడే చేశాను సార్..! మా అమ్మ పరిస్థితి... ఎలా ఉందో చెప్పండి సార్!*" అంటూ కాస్తా చిరాగ్గా, అంతకుమించి ఆత్రంగా అడిగాడు. దానికి చాలా ఇబ్బంది పడుతూనే జవాబిచ్చాడు వైద్యుడు..._


 _*"మీ అమ్మగారు ఇకలేరు. రెండు గంటల క్రితమే... మరణించారు!"* చెప్పాడు వైద్యుడు..._


_*"ఇది దారుణం.. ఇది అన్యాయం. ఆ విషయం ఇంత ఆలస్యంగా చెబుతారా..!?"* కోపం వచ్చింది అతడికి..._


_సమాధానంగా, ఓ కాగితం చూపించారు వైద్యుడు. అందులో... *"మా అబ్బాయి ఆకలికి తట్టుకోలేడు. ఆరునూరైనా మధ్యాహ్నం ఒంటిగంటకు భోంచేయాల్సిందే.. ఒకవేళ ఆలోపు నేను చనిపోయినా వాడితో చెప్పకండి డాక్టర్...!🙏"*_


*ఇంతకు మించి, అమ్మ గురించి ఇంకేం చెప్పగలం?* 

💐💐🚩🤔🤔🤔 *_మాతృదేవోభవ_* 💐💐🙏🙏🙏🙏

----------------------

*_{చాలా ఏళ్ళ క్రితం ఎక్కడో చదివి, సేకరించాను.: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}_*

గురువారం 24 జూలై 2025🌹*

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🌹గురువారం 24 జూలై 2025🌹*

                         🔟

                 *ప్రతిరోజూ*

 *మహాకవి బమ్మెర పోతనామాత్య*


   *శ్రీమద్భాగవత కథలు*```


(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```

``

*వేదాలు వేయి సార్లు చదివినా లభ్యం కాని ముక్తి, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది..!*``


          *వ్యాస మహర్షి*

             *భాగవతం*

       *ఎందుకు రాశాడు*               

```

మహర్షి వేదవ్యాసకృతమైన శ్రీమద్భాగవతం 'జన్మాద్యస్య యతో' అనే శ్లోకంతో ప్రారంభం అవుతుంది. అలాగే పోతనగారి తెలుగు భాగవతం 'విశ్వజన్మస్థితివిలయంబు లెవ్వని వలన' అనే పద్యంతో మొదలవుతుంది. జగత్తు సృష్టి, స్థితి, లయలు ఆ పరమాత్ముడి తోనే ఏర్పడ్డాయన్న అర్థంతో రాయడం జరిగింది వీటిని. పరమాత్మ ఉనికితోనే సృష్టికి ఉనికి ఏర్పడిందని దీని భావన. అందువల్ల ఆ పరమ సత్యమైన పరమాత్మను రచయితలు (సంస్కృతంలో వ్యాస మహర్షి, తెలుగులో బమ్మెర పోతనామాత్యుడు) ధ్యానించారు. 

వ్యాస మహర్షి శ్లోకం, బమ్మెర పోతన పద్యం ఇవే:```


*శ్లో: జన్మాద్యస్య యతో న్వయాదితరతశ్చార్థెష్వభిజ్ఞః స్వరాట్*

 *తేనే బ్రహ్మ హృదా య ఆదికవయే ముహ్యన్తి యత్సూరయః*

 *తేజోవారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గోమృషా*

 *ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి*


*సీ: విశ్వజన్మస్థితివిలయంబు లెవ్వని వలన నేర్పడు ననువర్తనమున*

 *వ్యావర్తనమునఁ గార్యములం దభిజ్ఞుడై తాన రాజగుచుఁ జిత్తమునఁజేసి*

 *వేదంబు లజునకు విదితముల్ గావించె నెవ్వఁడు బుధులు మోహింతురెవ్వ*

 *నికి నెండమావుల నీటఁ గాచాదుల నన్యోన్యబుద్ధి దా నడరునట్లు*


*ఆ: త్రిగుణసృష్టి యెందు దీపించి సత్యము, భంగిఁదోఁచు స్వప్రభానిరస్త*

 *కుహకుఁడెవ్వఁడతని గోరి చింతించెద, ననఘు సత్యుఁబరుని ననుదినంబు*```


అరణ్యాలన్నింటిలోకి నైమిశారణ్యం ప్రశస్తమైనది. ఆ నైమిశారణ్యంలోని విష్ణు క్షేత్రంలో శౌనకాది మహామునులు సత్రయాగాన్ని చేయడం మొదలు పెట్టారు. వారంతా సూతమహామునిని తమకు హరికథలు వినిపించమని కోరారు. వారి కోరికను అర్ధం చేసుకున్న సూతమహాముని నరనారాయణులకు నమస్కారం చేసి, భారతీదేవికి మొక్కి, వ్యాస భగవానుడి పాదాలకు ప్రణామం చేసి చెప్పడం ప్రారంభించాడు. దాని సారాంశమే ఇది...


ఈ విశ్వానికి పరమ పురుషుడు ఒక్కడే! ఆయనే పుట్టించడం, పాలించడం, నాశనం చెయ్యడం అనే పనులను బ్రహ్మ, విష్ణు, శివుడు అనే పేర్లతో చేస్తూ ఉంటాడు. ఆ ముగ్గురిలోనూ హరి చరాచర కోటికి శుభాలను ఇస్తాడు. భగవంతుడు 21 అవతారాలను ఎత్తాడు. 

ఈ కలియుగ- కృతయుగ సంధిలో 22 వ అవతారంలో విష్ణుయశుడు అనే బ్రాహ్మణుడికి కల్కి అనే పేరుతో అవతరిస్తాడు. ఈ అవతారాలన్నీ విష్ణువు అంశతో జన్మించిన వారే. శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా, వామనుడైనా, నృసింహస్వామి అయినా అంతా ఆయన అవతారాలే. ఆయన అవతారాల చరిత్ర సమస్తాన్ని భాగవత గ్రంథ రూపంలో వేదవ్యాస మహర్షి చెప్పాడు. శుకుడు అనే తన కొడుకుతో చదివించాడు. సకల వేదాల సారభూతమైనదీపురాణం. దీనిని శుక మహర్షి పరీక్షిన్మహారాజుకు చెప్పాడు.


అవే విషయాలను తనకు వచ్చిన రీతిలో శౌనకాది మహామునులకు చెప్తానన్నాడు సూతుడు. సూతమహాముని ఈ విషయం చెప్పగానే, భాగవత రచనలోని అంతరార్థం, ఎలా వ్యాసుడు భాగవత రచన చేశాడు, ఎందుకు చేశాడు, ప్రేరణ ఎవరిదీ, ఎందుకీ పురాణ గాథను పరీక్షిత్తుకు శుకుడు చెప్పాడు, అని అడిగారు వారంతా. 


ఆ విషయాలను చెప్తూ ఇలా అన్నాడు:


ఒకనాడు సకల లోకసంచారి నారద మహర్షి అశాంతితో వున్న వేదవ్యాసుడి దగ్గరకు వచ్చాడు. యధావిధిగా పూజలు అయిన తరువాత వారు సంభాషించారు. తన అశాంతికి కారణం తెలియడంలేదన్నాడు వ్యాసుడు. వ్యాసుడు సకల ధర్మాలను చెప్పినప్పటికీ, విష్ణు కథలను కొంచెమే చెప్పాడనీ, కేవలం ధర్మాలు చెప్తే సరిపోదనీ, గుణవిశేషాలు కూడా చెప్పాలనీ, శ్రీమహావిష్ణువును పొగడక పోవడమే ఆయన అశాంతికి కారణమనీ అన్నాడు నారదుడు. తెలియనివాడికి తెలిసేట్లుగా ఈశ్వరలీలలు గురించి వివరించమని చెప్పాడు. తన జన్మ వృత్తాంతాన్నీ, తానూ ముల్లోకాలు విష్ణు కథా గానం చేస్తూ తిరుగుతున్న వైనాన్నీ వివరించి నారదుడు వెళ్ళిపోయాడు.


నారదుడు వెళ్ళిపోయిన తరువాత ఆయన మాటలు అర్ధం చేసుకున్న వ్యాస మహర్షి, ఆ తరువాత, ఏం చేశాడో ఇలా చెప్పాడు సూతుడు శౌనకాది మహామునులకు.


సరస్వతీ నది పడమటి తీరంలో ఋషులు యాగాలు చేసుకోవడానికి వీలుగా బదరీ వృక్షాలతో కూడిన 'శమ్యాప్రాసం' అనే ప్రసిద్ధమైన ఆశ్రమం ఉన్నది. అక్కడ కూర్చుని వేదవ్యాసుడు జలాలను వార్చి, తన మనస్సును స్థిరం చేసుకుని, భక్తితో పూర్ణుడైన ఈశ్వరుడిని చూశాడు. నారాయణుడి మీద భక్తి మినహా తనకు వేరే ఉపశమనం లేదని నిశ్చయించుకున్నాడు.


ఈ భూమండలం మీద ఏ మహా గ్రంథాన్ని విన్న మాత్రం చేతనే లోకాలకు ఆధారభూతుడైన మాధవుడి మీద భక్తి విశేషాలు పుడతాయో, అలాంటి, ద్వాదశ స్కంధ భాగవతం అనే మహా గ్రంథాన్ని వ్యాస మహర్షి నేర్పుతో వ్రాశాడు. రాసి, దాన్ని నిర్మించి, మోక్షార్థి అయిన శుక మహర్షితో చదివించాడు. శ్రీహరి గుణాలను వర్ణించడం అంటే ఆసక్తికలవాడు, ఆయనమీద అమితమైన భక్తి కలవాడైన శుక మహర్షి ముల్లోకాలకు మంగళకరమైన భాగవత సంహితను పఠించాడు. వేదాలు వేయి సార్లు చదివినా ముక్తి లభ్యం కాదు కాని, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది.

```

                *(సశేషం)*

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*


          *రచన:శ్రీ వనం* 

   *జ్వాలా నరసింహారావు*

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

               🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

నాన్న నేర్పిన చదువు:*

 *నాన్న నేర్పిన చదువు:*


*తండ్రి:-*

।।ఓం నమః శివాయ।।

అబ్బాయీ! *పద్మము* అనే పదానికి పర్యాయవాచకాలను చెప్పు?


*కొడుకు:-*

కమలము, నళినము, తామరపూవు


*తండ్రి:-*

అంతేనా!?


*కొడుకు:-*

నాకంతే తెలుసు!!!


*తండ్రి:-*

నేను చెబుతాను చూడు - *వారిజము, నీరజము, జలజము, సలిలజము, కంజము, తోయజము, ఉదకజము, పుష్కరజము, పయోజము, అంభోజము, అంబుజము...*


*కొడుకు:-*

నాన్నా! నాన్నా! ఆగు.


*తండ్రి:-*

చెప్పు.


*కొడుకు:-*

వీటన్నిటికీ అర్థం *పద్మం* అనేనా!?


*తండ్రి:-*

అవును.


*కొడుకు:-*

మరి *నిఘంటువు* (డిక్షనరీ) వెదికితే ఇవన్నీ దొరుకుతాయా!?


*తండ్రి:-*

ఆయా డిక్షనరీ కర్తల ఓపికను బట్టి ఉంటుంది. అన్నీ అన్నిట్లోనూ దొరకకపోవచ్చు.


*కొడుకు:-*

మరి డిక్షనరీలలో కూడా దొరకని పదాలు నీకెలా దొరికాయి!?


*తండ్రి:-*

నేను *అమరకోశం* చదువుకున్నాను. అందువల్ల నేనే స్వయంగా అనేకపదాలను సృష్టించగలను. నాకు వేరే డిక్షనరీ అవసరం లేదు.  


*కొడుకు:-*

అదెలా!?


*తండ్రి:-*

*అమరకోశం* లో కొన్ని *పర్యాయపదా* లను *అమరసింహుడు* ఉపదేశించాడు. వాటికి కొన్ని *ప్రత్యయాలు* (Suffix) జోడిస్తే వేరే అర్థాన్ని బోధించే పదాలను మనం కూడా సృష్టించుకోవచ్చును.


*కొడుకు:-*

ఎలా?


*తండ్రి:-*

చెబుతా చూడు - *1. వారి, 2.నీరమ్, 3. జలమ్, 4.సలిలమ్, 5. కమ్, 6.తోయమ్, 7. ఉదకమ్, 8. పుష్కరమ్, 9.పయః, 10.అంభః, 11. అంబు...* ఇటువంటి కొన్ని పదాలను అమరసింహుడు *నీరు* అనే అర్థంలో చెప్పాడు.


*కొడుకు:-*

అయితే!?


*తండ్రి:-*

పద్మము పుట్టేది ఎక్కడ!? నీటిలో కదా!? అందువల్ల పైన చెప్పిన పదాలకు *జ* అనే ప్రత్యయం (suffix) చేరిస్తే - *పద్మము* అనేపదానికి సమానార్థకాలైన పదాలు వచ్చేస్తాయి. మళ్లీ చెప్పనా!? *వారిజము, నీరజము, జలజము, సలిలజము, కంజము, తోయజము, ఉదకజము, పుష్కరజము, పయోజము, అంభోజము, అంబుజము...*


*కొడుకు:-*

చివరలో *జ* - అని ఎందుకు చేర్చాలి!?


*తండ్రి:-*

*జ* - అంటే *జాతము, జన్మించినది* అని అర్థం వస్తుంది. *జలజ* అంటే *జలములో జన్మించినది* అని అర్థం. అలాగే *నీరజ* అంటే *నీటిలో జన్మించినది* అని అర్థం. అలా పదాలు పుట్టుకొస్తాయి.


*కొడుకు:-*

*జ* అనే ప్రత్యయం కాకుండా వేరే ప్రత్యయం చేర్చవచ్చా!?


*తండ్రి:-*

*"జాతము"* అనవచ్చు.


*కొడుకు:-*

అయితే నేను చెబుతాను చూడు. *వారిజాతము, నీరజాతము, జలజాతము, సలిలజాతము, కంజాతము, తోయజాతము, ఉదకజాతము, పుష్కరజాతము, పయోజాతము, అంభోజాతము, అంబుజాతము...*


*తండ్రి:-*

భలే! నీకు కూడా పదాలను సృష్టించే కళ వచ్చేసింది.


*కొడుకు:-*

*జ, జాత* మాత్రమే కాకుండా ఇంకే ప్రత్యయాలనైనా ఉపయోగించవచ్చా!?


*తండ్రి:-*

*భవ, ఉద్భవ, సంభవ* అనే పదాలను చేరిస్తే *పుట్టినది* లేదా *పుట్టినవాడు* అనే అర్థం వస్తుంది. ఉదాహరణకు *జలభవము, జలోద్భవము, జలసంభవము* అంటే *జలంలో పుట్టినది* అని అర్థం. అలాగే తృతీయ *నీరభవము, నీరోద్భవము, నీరసంభవము* అని చెప్పవచ్చు. అలాగే *రుహ* అనే ప్రత్యయం చేర్చవచ్చు. *రుహము* అంటే *పెరిగేది.* 


*కొడుకు:-*

అయితే నేను చెబుతా దానితో పేర్లు - *వారిరుహము, నీరరుహము, జలరుహము, సలిలరుహము, కంరుహము, తోయరుహము, ఉదకరుహము, పుష్కరరుహము, పయోరుహము, అంభోరుహము, అంబురుహము...*


*తండ్రి:-*

బాగా చెప్పావు. ఏకసంథాగ్రాహివి. వీటన్నిటికీ కూడా *పద్మము* అనే అర్థం. ఇంతకూ ఎన్ని పదాలను సృష్టించగలవో అర్థమైందా!?


*కొడుకు:-*

నీటికి *11* పర్యాయవాచకాలు చెప్పావు. వాటికి *జ* అనే ప్రత్యయం చేర్చి, *పద్మం* అనే అర్థంలో *11* పర్యాయవాచకాలు సృష్టించగలను. *జాత* అనే ప్రత్యయం చేర్చి మరో *11* పర్యాయవాచకాలు సృష్టించగలను. *రుహ* అనే ప్రత్యయం చేర్చి మరో *11* పర్యాయవాచకాలు సృష్టించగలను. *భవ* అనే ప్రత్యయం చేర్చి మరో *11* పర్యాయవాచకాలు చెప్పగలను, *ఉద్భవ* అనే ప్రత్యయం చేర్చి మరో *11* పర్యాయవాచకాలు చెప్పగలను, *సంభవ* అనే ప్రత్యయం చేర్చి మరో *11* పర్యాయవాచకాలు చెప్పగలను. అంటే, మొత్తానికి *పద్మము* అనే అర్థంలో ఇప్పటికిప్పుడు *66* పదాలను చెప్పగలను.


*తండ్రి:-*

మరి మొదట అడిగితే మూడే మూడు పదాలు చెప్పి, ఇంతకంటె మరేమీ చెప్పలేనన్నావు!? ఇప్పుడేమో ఏకంగా *66* పదాలు చెప్పగలనంటున్నావు!?


*కొడుకు:-*

నువ్వు ఇలా విడమరచి చెబితే ఎందుకు చెప్పలేను!?


*తండ్రి:-*

ఇంతే కాదు, వీటితో ఇంకా ఎన్నో అర్థాలలో ఎన్నెన్నో పదాలను సృష్టించవచ్చు.


*కొడుకు:-*

అదెలా నాన్నా!?


*తండ్రి:-*

పద్మంతో సంబంధం ఉన్న పౌరాణికవ్యక్తులెవరైనా ఉన్నారా చెప్పు!?


*కొడుకు:-*

పద్మాన్ని హస్తంలో ధరించే *విష్ణువు* ఉన్నాడు. పద్మాన్ని నాభిలో ధరించిన అదే *విష్ణువు* ఉన్నాడు. పద్మంలో జన్మించిన *బ్రహ్మదేవుడు* ఉన్నాడు. *క్షీరసాగర* మధ్యంలో *పద్మం* లో జన్మించిన *లక్ష్మీదేవి* ఉన్నది. 


*తండ్రి:-*

మంచి పురాణజ్ఞానం ఉన్నదే నీకు!? సరే, ఇప్పుడు చూడు. *పద్మం* అనే అర్థంలో నీవు *66* పదాలు చెప్పగలవు కదా!? వాటికి చివర *హస్తుడు* అని చేర్చు. వాటన్నిటికీ *పద్మాన్ని చేతిలో ధరించినవాడు* అనే భావంలో *విష్ణువు* అనే అర్థం వస్తుంది. అంటే ఈ క్షణంలో నీవు *విష్ణువు* అనే పదానికి పర్యాయవాచకాలు *66* చెప్పగలవు.


*కొడుకు:-*

ఓహో. బలే! అర్థమైంది. *వారిజహస్తుడు, నీరజహస్తుడు...* ఇలా అన్నమాట.  


*తండ్రి:-*

అవును.


*కొడుకు:-*

అయితే నాన్నా, *హస్తం* అనే పదంతో పాటు *కరము, పాణి* అనే పదాలను కూడా *చేయి* అనే అర్థంలోనే ప్రయోగిస్తాం కదా! వాటిని కూడా ప్రత్యయాలుగా ఉపయోగించవచ్చా!?  


*తండ్రి:-*

హాయిగా ఉపయోగించవచ్చు. ఆవిధంగా *హస్తుడు* అనే ప్రత్యయాన్ని చేర్చి *66*, *కరుడు* అనే ప్రత్యయాన్ని చేర్చి మరో *66*, *పాణి* అనే ప్రత్యయాన్ని చేర్చి మరో *66* మొత్తం *198* పదాలను నీవు స్వయంగా సృష్టించగలవు.


*కొడుకు:-*

అయ్యో నాన్నా, డబుల్ సెంచురీకి రెండు తక్కువైనాయే!?


*తండ్రి:-*

నీటికి ఇంకా *కబంధము, వనము, భువనము, అమృతము, అప్, సర్వతోముఖము, పానీయము, క్షీరము, శంబరము...* ఇట్లా చాలా పర్యాయవాచకాలు ఉన్నాయి. నీవు అన్నీ గుర్తుంచుకోలేక కంగారుపడతావని మొదట్లో ఓ పదకొండు మాత్రమే చెప్పాను. ఆ పదాలతో *పద్మం* అనే అర్థం సాధించి, మరలా ఆ *పద్మాన్ని చేత ధరించినవాడు* అనే అర్థంలో ఇంకెన్ని *విష్ణుపర్యాయవాచకాల* ను సృష్టించవచ్చో చూడు. 


*కొడుకు:-*

బలే నాన్నా! బలే. అలాగే *పద్మంలో పుట్టిన బ్రహ్మ* అనే అర్థంలో - పద్మం యొక్క *66* పర్యాయవాచకాలకు *జ, జాత, భవ, సంభవ, ఉద్భవ, రుహ* అనే ఆరు ప్రత్యయాలు చేర్చితే మొత్తం *396* (66x6) పదాలను ఈ క్షణంలోనే పుట్టించగలను.


*తండ్రి:-*

ఓహో! సమస్తప్రపంచాన్ని పుట్టించిన బ్రహ్మకే అన్ని పదాలు పుట్టించావా!? *పద్మజుడు, పద్మసంభవుడు* అంటూ వాటిని పుంలింగాలలో ప్రయోగిస్తే *బ్రహ్మ* అనే అర్థం వస్తుంది. వాటిని *పద్మజ, పద్మసంభవ* అంటూ స్త్రీలింగాలలో ప్రయోగిస్తే *లక్ష్మీ* అనే అర్థం వస్తుంది. మరి ఆ *బ్రహ్మకు తండ్రి విష్ణువు* అనే అర్థంలో మరెన్ని పుట్టించగలవో చెప్పు!? 

 

*కొడుకు:-*

*పద్మంలో పుట్టినవాడు బ్రహ్మ* అనే అర్థంలో *396* పదాలు సిద్ధంగా ఉన్నాయి కదా! *తండ్రి* అనే అర్థాన్నిచ్చే *జనక, గురు, పితా, జన్మద* అనే నాకు తెలిసిన ఓ నాలుగు ప్రత్యయాలను ఆ *396* పదాలకు చేరిస్తే (396x4) *1584* పదాలను *విష్ణువు* అనే అర్థంలో సృష్టించగలను.


*తండ్రి:-*

మరి *లక్ష్మీదేవికి భర్త విష్ణువు* అనే అర్థంలో ఎన్ని పదాలు సృష్టించగలవు!?


*కొడుకు:-*

*పద్మంలో పుట్టినది లక్ష్మీ* అనే అర్థంలో *396* పదాలు సిద్ధంగా ఉన్నాయి కదా! వాటికి *పతి, ప్రియ, వల్లభ, నాథ, భర్త, ప్రాణేశ* వంటి నాకు తెలిసిన ఓ *6* ప్రత్యయాలను చేర్చి (396x6) *2376* పదాలను సృష్టించగలను. 


*తండ్రి:-*

చూశావా, నీవు విష్ణుసహస్రనామాలను రచించావు. విష్ణువుకు మొత్తం *3960* నామాలను సృష్టించావు. (1584+2376)


*కొడుకు:-*

అయ్యో, నాలుగు వేల నామాలకు ఒక 40 తక్కువయ్యాయే.


*తండ్రి:-*

*పద్మాన్ని నాభిలో కలిగినవాడు పద్మనాభుడు* అంటే *విష్ణువు* కదా! పద్మానికి *66* పర్యాయపదాలు నీకు తెలుసు కదా! వాటికి చివర *నాభుడు* అనే ప్రత్యయం తగిలించు. *వారిజనాభుడు, జలజనాభుడు* అంటూ. కాబట్టి, *3960+66=4026* నామాలు వచ్చాయి. మొత్తానికి ఇలా *విష్ణుచతుస్సహస్రనామాలు* సృష్టించగలవు.


*కొడుకు:-*

సంస్కృతం కొద్దిగా నేర్చుకుంటే, పదసంపదను ఇంత సులువుగా, ఇంత అపారంగా సృష్టించవచ్చా!?


*తండ్రి:-*

అవును. ఇప్పుడు చెప్పినవి కేవలం మచ్చుకు మాత్రమే. ఈవిధంగా సంస్కృతపదాలను ఇంకా వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా అలవోకగా సృష్టించవచ్చు. ఇన్నేసి పదాలను డిక్షనరీలో చేర్చి వాటికి అర్థాలు ఎవరూ వ్రాయరు. అందువల్ల ఒక పదానికి అర్థం తెలియక డిక్షనరీ వెదికి, అక్కడ కనబడకపోతే అబ్బో అబ్బో సంస్కృతం చాల కష్టం సుమీ! అంటూ ఉంటారు.  


*కొడుకు:-*

అవును నాన్నా! ఇంతవరకు నేను కూడా ఇలాగే అనుకున్నాను.  


*తండ్రి:-*

సరే, *నళినదళేక్షణ* అనే పదం విన్నావా!?


*కొడుకు:-*

నా తరమా భవసాగరమీదను, నళినదళేక్షణ రామా అనే కీర్తనలో ప్రసిద్ధమే కదా!?


*తండ్రి:-*

*నళినదళేక్షణుడు* అంటే అర్థం ఏమిటి!?


*కొడుకు:-*

రాముడు.


*తండ్రి:-*

ఆ కీర్తన విని, ఆ కీర్తనలో రామపరంగా వాడిన పదాన్ని బట్టి *రాముడు* అంటూ రూఢి అర్థాన్ని గ్రహించావు. మరి *యౌగికార్థం* (యోగపరమైన) చెప్పు!?


*కొడుకు:-*

అదేమిటి?


*తండ్రి:-*

*నళినము* అంటే పద్మము. *నళినదళము* అంటే పద్మదళము, *ఈక్షణము* అంటే *చూపు* లేదా *కన్ను*. కాబట్టి *నళినదళేక్షణుడు* అంటే *పద్మపు రేకులవంటి కన్నులు కలవాడు* అని అర్థం. అది యౌగికార్థం అంటే. అటువంటి కళ్లు ఎవరికి ఉన్నా సరే, వాళ్లందరూ కూడా నళినదళేక్షణులే. నీవు ఇంతవరకూ చెప్పిన పద్మపర్యాయవాచకాలు, విష్ణుపర్యాయవాచకాలు, బ్రహ్మపర్యాయవాచకాలు, లక్ష్మీదేవి పర్యాయవాచకాలు అన్నీ యౌగికపదాలే.  


*కొడుకు:-*

ఓహో!!


*తండ్రి:-*

ఓహో!! అని ఆశ్చర్యపోవడం కాదు. *నళినదళేక్షణుడు* అంటే యౌగికార్థం తెలిసింది కదా!? మరి ఇప్పుడు సమానార్థకాలైన ఇంకెన్ని పదాలను సృష్టించగలవు!?


*కొడుకు:-*

*నళినము* అంటే పద్మము అనే అర్థంలో మునుపు *66* పదాలను సృష్టించివున్నాము కదా! వాటికి చివర *కన్ను* అనే అర్థంలో *ఈక్షణ, నేత్ర, నయన, లోచన, చక్షు, అక్ష* అని నాకు తెలిసిన *ఆరు* ప్రత్యయాలను ఉపయోగించి *పద్మేక్షణుడు, పద్మనేత్రుడు, పద్మనయనుడు, పద్మలోచనుడు, పద్మచక్షువు, పద్మాక్షుడు...* ఇలా *396* పదాలను (66x6) సృష్టించగలను. ఇలా పుంలింగంలో ఉపయోగిస్తే *396* పదాలతో *రాముడు* వస్తాడు. అలాగే *పద్మేక్షణ, పద్మనేత్ర, పద్మనయన, పద్మలోచన, పద్మచక్షువు, పద్మాక్షి* అంటూ మరో *396* పదాలను స్త్రీలింగంలో ఉపయోగిస్తే *సీతమ్మ* వారు. అంతేనా!?


*తండ్రి:-*

అవును. ఆ పదాలకు *రాముడు, సీతమ్మ* అని మాత్రమే అర్థాలను గ్రహిస్తే అవి నీకు *రూఢార్థాలు* (నిశ్చయింపబడిన అర్థాలు). అలా కాదు, *పద్మం వంటి కన్నులు* కలిగిన ఎవరైనా *పద్మాక్షుడు* లేదా *పద్మాక్షి* కావచ్చును అనే అర్థంలో గ్రహిస్తే అవి *యౌగికార్థాలు*


*కొడుకు:-*

అర్థమైంది నాన్నా!


*తండ్రి:-*

శుభమస్తు.


*కొడుకు:-*

*సర్వం శ్రీ నళినదళేక్షణార్పణమస్తు* అంటే *శ్రీరామార్పణమస్తు.*


*తండ్రి:-*

తథాస్తు.


*గమనిక:-* ఈ సందర్భంలో *ప్రత్యయం* అనే పదం ఆంగ్లంలోని *Suffix* అనే పదానికి సమానార్థకంగా వాడబడింది.

శ్రీ ఠాకూర్బారి ఆలయం

 🕉 మన గుడి : నెం 1184


⚜ మేఘాలయ : గ్యాంగ్ టక్


⚜ శ్రీ ఠాకూర్బారి ఆలయం



💠 ఠాకూర్బారి ఆలయం ( నేపాలీ : ठाकुरबारी मन्दिर ) భారతదేశంలోని సిక్కింలోని గాంగ్‌టక్‌లో పట్టణం నడిబొడ్డున ఉన్న ఒక హిందూ దేవాలయం . 

ఇది 1935లో సిక్కింకు చెందిన పూర్వపు చోగ్యాల్ విరాళంగా ఇచ్చిన భూమిపై నిర్మించబడిన సిక్కింలోని పురాతన హిందూ దేవాలయాలలో ఒకటి. 


💠 ఈ ఆలయం దాదాపు అన్ని ప్రధాన దేవతలకు నిలయంగా ఉంది మరియు గాంగ్‌టక్‌లోని హిందూ సమాజానికి ఒక ముఖ్యమైన కలయిక కేంద్రంగా ఉద్భవించింది .


💠 సిక్కింలోని ఠాకూర్బారి రాష్ట్రంలో ఉన్న అనేక గొప్ప ఆలయాలలో ఒకటి. బహుళ హిందూ దేవతలకు అంకితం చేయబడిన ఈ అందమైన ఆలయం ఆధ్యాత్మిక భక్తి మరియు సాంస్కృతిక వారసత్వ కేంద్రంగా ఉంది.


💠 దీనిని 1935 లో సిక్కిం మాజీ చోగ్యాల్ ఇచ్చిన భూమిపై ఒక చిన్న ఆలయంగా స్థాపించారు. 

ఆ తరువాత, 1945 మరియు 1947 మధ్య, ఈ ఆలయం ఒక ముఖ్యమైన ఆలయ సముదాయంగా అభివృద్ధి చేయబడింది. 

ఈ ఆలయంలో ఆచరణాత్మకంగా అన్ని ప్రధాన దేవతలు ఉన్నారు 


💠 ఈ ఆలయం అనేక పండుగలు మరియు సామాజిక సమావేశాలను ఏర్పాటు చేస్తుంది. ఈ ఉత్సవాలు ప్రపంచం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో సందర్శకులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తాయి. సందర్శకులు భగవంతుడిని ఆరాధించడానికి మరియు ఆయన ఆశీర్వాదాలను స్వీకరించడానికి ఇక్కడ గుమిగూడతారు.


💠 గాంగ్టక్ మధ్యలో ఉన్న ఠాకూర్బారి ఆలయం, పూర్వపు సిక్కిం దేశపు చక్రవర్తులైన చోగ్యాలు మతపరంగా సహనంతో ఉండేవారని రుజువు చేస్తుంది. 

ఈ ఆలయానికి స్థలం 1935లో నాంగ్యాల్ రాజవంశ యువరాజు మంజూరు చేశాడు మరియు ఇది ఈ ప్రాంతంలోని పురాతన హిందూ దేవాలయాలలో ఒకటి.


💠 ఠాకూర్బారి ఆలయం దేశం నలుమూలల నుండి ప్రజలను ఆకర్షిస్తుంది. సిక్కింకు వచ్చే సందర్శకులు మతపరమైన స్మారక చిహ్నాలు మరియు నిర్మాణాలను చూడటానికి ఈ ఆలయాన్ని తప్పక చూడాలి. 

భవనం అసాధారణంగా ఉన్నప్పటికీ, లోపలి అభయారణ్యం యొక్క ప్రశాంతత నగరం యొక్క కోలాహలం మరియు సందడికి భిన్నంగా ఉంటుంది.


💠 ఠాకూర్బారి ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ దాని ప్రశాంతమైన వాతావరణం మరియు ఒకే పైకప్పు క్రింద బహుళ దేవతలను కలిగి ఉండటం. 

భక్తులు శివుడు, దుర్గాదేవి, విష్ణువు మరియు ఇతర దేవతలకు ప్రార్థనలు చేయవచ్చు. 


💠 ఇది ధ్యానం మరియు ఆధ్యాత్మిక ప్రతిబింబానికి సరైన ప్రదేశంగా మారుతుంది.


💠 ఠాకూర్బారి ఆలయ నిర్మాణ శైలి మరియు లక్షణాల యొక్క అవలోకనం ఇక్కడ ఉంది:

ఆలయ నిర్మాణం స్థానిక సంస్కృతి మరియు మతపరమైన ఆచారాలను ప్రతిబింబిస్తూ సాంప్రదాయ హిందూ శైలులను ప్రదర్శిస్తుంది.


💠 ఆలయ రూపకల్పన సొగసైనది అయినప్పటికీ సరళమైనది, ప్రార్థన మరియు ధ్యానం కోసం ప్రశాంతమైన వాతావరణాన్ని అందించడంపై దృష్టి పెడుతుంది.


💠 ప్రధాన గర్భగుడిలో వివిధ హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయి. 

ఈ గర్భగుడి భక్తి మరియు భక్తిని ప్రోత్సహించే పవిత్ర వాతావరణాన్ని సృష్టించడానికి రూపొందించబడింది.


💠 ప్రార్థన మందిరం: 

ఆలయంలో విశాలమైన ప్రార్థన మందిరం ఉంది, ఇక్కడ భక్తులు ఆచారాలు మరియు వేడుకల కోసం సమావేశమవుతారు. 


💠 ఈ ఆలయంలో బాగా నిర్వహించబడిన ప్రాంగణంలోకి దారితీసే స్వాగత ద్వారం ఉంది. ప్రాంగణాన్ని తరచుగా సమాజ సమావేశాలు మరియు మతపరమైన కార్యక్రమాలకు ఉపయోగిస్తారు.


💠 క్లిష్టమైన శిల్పాలు: 

ఆలయ గోడలు మరియు స్తంభాలు హిందూ పురాణాల యొక్క వివిధ అంశాలను వర్ణించే క్లిష్టమైన శిల్పాలు మరియు మూలాంశాలతో అలంకరించబడి ఉన్నాయి.


💠 శిల్పాలు: వివిధ దేవతలు, పౌరాణిక వ్యక్తులు మరియు జంతువుల విగ్రహాలు మరియు శిల్పాలు ఆలయ ప్రాంగణం చుట్టూ ఉంచబడ్డాయి, ఇది దాని ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచుతుంది.


💠 ప్రార్థన జెండాలు: 

ఈ ప్రాంతంలోని హిందూ మరియు బౌద్ధ ఆచారాల సమకాలీనతను ప్రతిబింబిస్తూ, ఆలయ పరిసరాలు తరచుగా హిమాలయ మత ప్రదేశాలలో సాధారణంగా కనిపించే రంగురంగుల ప్రార్థన జెండాలను కలిగి ఉంటాయి.


💠 సందర్శకులు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయాన్ని సందర్శించవచ్చు. 



💠 MG మార్గ్ ఠాకూర్బారి ఆలయం నుండి 10 నిమిషాల డ్రైవ్ దూరంలో ఉంది.


రచన

©️ Santosh Kumar

18-59-గీతా మకరందము

 18-59-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అII ఒకవేళ అహంకారముచే నా వాక్యములను వినక "నేను యుద్ధముచేయ’ నని నీవు చెప్పినను ప్రకృతియే నీచే యుద్ధము చేయించునని భగవానుడు అర్జునునితో పలుకుచున్నారు -


యద్యహఙ్కారమాశ్రిత్య * 

న యోత్స్య ఇతి మన్యసే | 

మిథ్యైష వ్యవసాయ స్తే 

ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి || 


తా:- ఒకవేళ అహంకారము నవలంబించి "నేను యుద్ధముచేయను" అని నీవు తలంచెదవేని అట్టి నీ ప్రయత్నము వ్యర్థమైనదియే యగును. (ఏలయనిన) నీ (క్షత్రియ) స్వభావమే నిన్ను (యుద్ధమున) నియోగింపగలదు.


వ్యాఖ్య: - కర్తృత్వమునువీడి, క్షత్రియోచితమగు ధర్మయుద్ధమును గావింపుమని అర్జునునకు భగవాను డిదివఱలో తెలిపియుండిరి. ఇపుడు 

"ఓ అర్జునా! అహంకారము వలన నా ఈ వాక్యములను ఉల్లంఘించినచో అది నీయొక్క వ్యర్థప్రయత్నమే కాగలదు. ఏలయనిన, నీ క్షత్రియసంబంధ ప్రకృతియే, స్వభావమే బలాత్కారముగ నిన్ను యుద్ధమున దింపగలదు". అని భవిష్యజ్జ్ఞానముగల పరమాత్మ వచించిరి.

---------

* యదహంకారమాశ్రిత్య = పాఠాన్తరము.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*సౌప్తిక పర్వము ద్వితీయాశ్వాసము*


*448 వ రోజు*


*కృష్ణుడు అశ్వత్థామను శపించుట*


ఉత్తర గర్భమును రక్షించాండు కాని కృష్ణుడికి అశ్వత్థామ మీద కోపం చల్లారలేదు " అశ్వత్థామా ! బాల ఘాతకా ! బాలురూ యువకులూ అని లేకుండా అర్ధరాత్రి సమయంలో ఘాఢనిద్రలో ఉన్న వారిని దారుణంగా హత్య చేసినందుకు నీకు ఇదే నా శాపం అనుభవించు నేటి నుండి నీకు అన్నం దొరకదు నీకు ఎవరూ సహాయం చేయరు. నీ ఒంటి నిండా చీమూ నెత్తురు కారుతుంటుంది. ఈ ప్రకారం 3000 సంవత్సరాలు దేశ దిమ్మరివై తిరుగుదువు గాక ! కాని నా చేత రక్షింపబడిన ఉత్తరా గర్భ సంజాతుడు కృపాచార్యుడి వద్ద ధనుద్విద్య నేర్చుకుని అనేక సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. అతడి కుమారుడు జనమేజయుడు నీ కళ్ళ ముందే జనరంజకంగా రాజ్య పాలన చేస్తాడు. ఇది సత్యం " అని పలికాడు. ఆ మాటలు విన్న వ్యాసుడు " గురుకుమారా ! నీవు బ్రాహ్మణవంశంలో జన్మించినా క్షాత్రం అవలంబించావు. దారుణమారణ కాండకు పాల్పడ్డావు. ధర్మాధర్మ విచక్షణ మరచి బ్రహ్మశిరోనామాస్త్రమును ప్రయోగించావు. నా మాట కూడా లక్ష్య పెట్ట లేదు. కనుక కృష్ణుడి మాటలు అక్షరాల జరిగి తీరుతాయి " అని పలికాడు. అందుకు అశ్వత్థామ కోపించి " వ్యాస మునీంద్రా ! నీవు కూడా మా లాంటి మనుష్యుల మధ్యనే జీవించు. ఇది నా ప్రతి శాపం " అని చెప్పి తన శిరోరత్నమును పాండవులకు ఇచ్చి తాను తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళాడు. పాండవులు కృష్ణుడు వ్యాసుడికి నమస్కరించి ద్రౌపది ఉన్న చోటుకు వచ్చారు. భీముడు అశ్వత్థామ శిరోరత్నమును ద్రౌపదికి ఇచ్చి " ద్రౌపదీ ! శత్రుకార్యం పూర్తి అయింది. గురుపుత్రుడు అయినందున అర్జునుడు [అశ్వత్థామ ను చంపనిచ్చగించ లేదు. అందుకని అతడి శిరోరత్నమును తీసుకొని అతడి కీర్తిశరీరమును పడగొట్టాము. ఇక అతడు బ్రతికీ చచ్చినట్లే. ఇక నీ దుఃఖమును మాని ధర్మరాజు దుఃఖమును పోగొట్టుము " అన్నాడు. ద్రౌపది మహిమాన్వితమైన ఆ రత్నమును చేత పట్టుకుని ధర్మరాజుతో " ఈ రత్నమును పొందినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దీనిని పొందుటకు మీరు అర్హులు అని ఆ రత్నమును ధర్మరాజు కు ఇచ్చింది. ధర్మరాజు కూడా తనకు అశ్వత్థామ మీద ఉన్న గౌరవప్రపత్తులకు నిదర్శనంగా ఆ రత్నమును శిరస్సున ధరించాడు. అప్పుడు ధర్మరాజు అందరూ వినేలా తాము అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిన తరువాత జరిగినది అంతా ద్రౌపది కి, సహదేవుడికి మిగిలిన వారికి వివరించాడు. బ్రహ్మశిరోనామాస్త్ర ప్రభావం చేత అప్పటి వరకు నిలిచిన పాండవకుమారుల పత్నుల గర్భములు విచ్ఛిన్నమయ్యాయి. కాని ఉత్తరగర్భము యధాతధంగా ఉన్నది. ఈ విషయం ఉత్తరకు తెలియదు.*


ధర్మరాజు సందేహం*


అప్పుడు ధర్మరాజు కృష్ణుడితో " కృష్ణా ! బలంలో శౌర్యంలో ద్రౌపదీ పుత్రులు అత్యంత బలవంతులు కదా ! అశ్వత్థామ ఒక్కడే వారినందరిని ఎలా చంపగలిగాడు. అతడికి అంతటి శక్తి సామర్ధ్యాలు ఎలా వచ్చాయి. అజేయబలవందతుడు శక్తిసంపన్నుడైన దృష్టద్యుమ్నుడు అశ్వథ్థామ చేతిలో దారుణంగా చని పోవడానికి కారణమేమిటి ? నాకు వివరించవా ! " అని అడిగాడు. కృష్ణుడు ధర్మనందనా ! ప్రాణికోటి జన్మించుటకు, జీవించుటకు, లయించుటకు కారణ భూతుడైన పరమశివుని తత్వం నాకు బాగాతెలుసు అతడు సంకల్ప మాత్రమున ఈ జీవకోటిని జన్మింప చేయగలడు లయింప చేయగలడు. కాని అతడు భక్త సులభుడు. భక్తితో తప్ప ఇతర మార్గమున అతడిని ప్రసన్నుడుని చేసుకొనుట అసాధ్యము. కనుక అతడి శక్తి ఇంత అని చెప్పుట అసాధ్యము.


*బ్రహ్మ ప్రాణికోటిని సృష్టించుట*


తొలుత బ్రహ్మదేవుడు ఈ ప్రాణి కోటిని సృష్టించ వలెనన్న తలంపుతో మహాశివుని వద్దకు వెళ్ళి తన కోరికను చెప్పాడు. అప్పుడు మహాశివుడు " బ్రహ్మదేవా ! ఏకార్యం సిద్ధించుటకైనా తపస్సు ముఖ్యం. తపస్సుతో సాధించ లేని కార్యం ఈ జగతిన ఏదీ లేదు. అందుకని ముందు నేను తపస్సు చేస్తాను " అన్నాడు. తరువాత శివుడు నీటిలో మునిగి తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచి పోయినా పరమ శివుడు ఎంతకీ బయటకు రాలేదు. బ్రహ్మదేవుడికి విసుగు పుట్టి తుదకు శివుడి సహాయం లేకుండా తన తపః ప్రభావంతో దక్షప్రజాపతిని సృష్టించాడు. బ్రహ్మ " దక్షప్రజాపతీ ! నీవు నా ఆజ్ఞ మీద ప్రజోత్పత్తిని సాగించు " అన్నాడు. దక్షుడు " నా కంటే అధికులు లేకున్న నీవు చెప్పినట్లే సృష్టి కార్యం నిర్వహిస్తాను " అన్నాడు. " దక్షప్రజాపతీ ! శివుడు జలమున మునిగి అనేక వేల సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్నాడు. కనుక నీవే ఈ సృష్టిని సాగించు అన్నాడు. తరువాత దక్షుడు దేవతలను, అసురులను, తిర్యగ్జాతులను మొదలగు భూతములను సృష్టించాడు. కాని వాటికి ఆహారం సృష్టించ లేదు. అప్పుడు ప్రాణులు ఆకలితో దక్షుని భక్షించుటకు ప్రయత్నించాయి.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

సాష్టాంగ నమస్కారం

 *సాష్టాంగ నమస్కారం యొక్క విశిష్టత.


*_అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ ( స + అష్టాంగ ) నమస్కారము అని అంటారు._*


*సాష్టాంగ నమస్కారము అంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో నమస్కారము చేయటం అని అర్ధము.*


*ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః౹౹*


*అష్టాంగాలు అంటే...*


*"ఉరసా" అంటే తొడలు,*

*"శిరసా" అంటే తల,*

*"దృష్ట్యా" అనగా కళ్ళు,*

*"మనసా" అనగా హృదయం,*

*"వచసా" అనగా నోరు,*

*"పద్భ్యాం" అనగా పాదాలు,*

*"కరాభ్యాం" అనగా చేతులు,*

*"కర్ణాభ్యాం" అంటే చెవులు.*


*ఇలా "8 అంగములతో కూడిన నమస్కారం" చేయాలి.


*మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నేలకు తగిలించాలి..


*కాని, స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు


*వాళ్ళు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి.

*అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని శాస్త్రం చెబుతుంది.


*పూజ పూర్తయిన తరువాత మంత్రపుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యాలి.


*దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి.


*_నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టాంగ నమస్కారం చేసేవాళ్లు పొందుతారని శాస్త్రవచనం.

శ్రావణ మాస పూజా విశేషాలు*

 🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀


 *శ్రావణ మాస పూజా విశేషాలు* 


"" సృష్టి, స్థితి లయ కారకులైన త్రిమూర్తులలో స్థితికారుడు, దుష్టశిక్షకుడు, శిష్టరక్షకుడు అయిన శ్రీమహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీమహాలక్ష్మికి "" అత్యంత ప్రీతికరమైన, వివిధ వ్రతాలు, పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలు, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసం "శ్రావణ మాసం"


చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసం. *ఈ మాసంలోని పూర్ణిమనాదు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది* . శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం "శ్రవణా నక్షత్రం" అటువంటి శ్రవణా నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన మాసం.


శ్రావణ మాసంలోని మూడువారాలు అత్యంత పుణ్యప్రదమైనవి. *మంగళ,శుక్ర, శనివారాలు ఈ మాసంలో అత్యంత ప్రధానమైనవి,మహత్తును కలిగినవి. శ్రావణ మసంలోని మంగళవారాలు శ్రీగౌరీ పూజకు,శుక్రవారాలు శ్రీలక్ష్మీ పూజకు, శనివారాలు శ్రీమహావిష్ణువు పూజకు ముఖ్యమైన దినాలు* . వీటికితోడు శ్రావణమాసంలోని శుక్లపక్షంలోగల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ, ఒక్కోరోజు ఒక్కో దేవుని పూజ చేయాలని శాస్త్ర వచనం.


 *పాడ్యమి - బ్రహ్మదేవుడు* 

 *విదియ - శ్రీయఃపతి* 

 *తదియ - పార్వతీదేవి* 

 *చవితి - వినాయకుడు* 

 *పంచమి - శశి* 

 *షష్టి - నాగదేవతలు* 

 *సప్తమి - సూర్యుడు* 

 *అష్టమి - దుర్గాదేవి* 

 *నవమి - మాతృదేవతలు* 

 *దశమి - ధర్మరాజు* 

 *ఏకాదశి - మహర్షులు* 

 *ద్వాదశి - శ్రీమహావిష్ణువు* 

 *త్రయోదశి - అనంగుడు* 

 *చతుర్దశి - పరమశివుడు* 

 *పూర్ణిమ - పితృదేవతలు* 


 *మహిళలకు సౌభాగ్యానిచ్చే శ్రావణ మాస వ్రతాలు* 


 *శ్రావణమాసం మహిళలకు అత్యంత ముఖ్యమైనది. మహిళలు పాటించే వ్రతాల్లో అధికం ఈ మాసంలోనే ఉండడంవల్ల వ్రతాలమాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది.* 


 *మంగళగౌరీ వ్రతం* 


శ్రావణమాసంలో ఆచరించే వ్రతాల్లో ముఖ్యమైనది ఈ వ్రతం. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు చేయాలి. నెలలోని అన్ని మంగళవారాలు దీనిని చేయవలెను.


 *వరలక్ష్మీ వ్రతం* 


మహిళలకు అత్యంత ముఖ్యమైన శ్రావణమాసంలో ఆచరించే మరో ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను.


🌿 "శ్రావణమాసంలో వచ్చే పండగలు" 🌿


 *శుక్లచవితి-నాగులచవితి* 


మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు నాగులచవితి పండుగను జరుపుకుంటారు. ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి పూజిస్తారు.


 *శుక్ల ఏకాదశి-పుత్రదా ఏకాదశి* 


ఈ ఏకాదశికే లలితా ఏకాదశి అని కూడా పేరు. పుత్ర సంతానం కావాలనుకునేవారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది.


 *శ్రావణ పూర్ణిమ - రాఖీపూర్ణిమ* 


సోదరుడి సుఖసంతోషాలు కోరుతూ అక్కాచెల్లెళ్ళు సోదరుడి చేతికి రాఖీ కడతారు నుదుట బొట్టు పెట్టి.అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరి ఆశీర్వాదం తీసుకుని కానుకలివ్వడం ఆనవాయితీ. అంతే గాక ఈ దినం పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం.


 *పూర్ణిమ - హయగ్రీవ జయంతి* 


వేదాలను రక్షించేందుకు శ్రీమహావిష్ణువు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణ కథనం.హయగ్రీవ జయంతి ఐన ఈ రోజు హయగ్రీవుడిని పూజించి శనగలు,ఉలవలతో గుగ్గిళ్ళు తయారుచేసి నైవేద్యం సమర్పిస్తారు.


 *కృష్ణవిదియ- శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి* 


క్రీ.శ.1671 వ సంవత్సరంలో విరోధికృత్ నామ సంవత్సరం శ్రావణ బహుళ విదియనాడు శ్రీ రాఘవేంద్రస్వామివారు సజీవంగా సమాధిలో ప్రవేశించారు.


 *కృష్ణపక్ష అష్టమి - శ్రీకృష్ణాష్టమి* 


శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన దినం. దీనినే కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని పేర్లు. ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు , మీగడ, వెన్నలను సమర్పించడం ఆచారం.


 *కృష్ణపక్ష ఏకాదశి - కామిక ఏకాదశి* 


ఈ దినం ఏకాదశీ వ్రతం, ఉపవాసాలను పాటించడంతో పాటు నవనీతమును దానం చేయడం మంచిది.ఈ ఏకాదశీ వ్రతాన్ని పాటించడం వల్ల మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్ర వచనం.


 *కృష్ణపక్ష అమావాస్య - పోలాల అమావాస్య* 


ఇది వృషభాలను పూజించే పండుగ. కాగా కాలక్రమేములో పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.


🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

ధర్భల_మహిమ

 #ధర్భల_మహిమ


తులసి, ధర్భలు, బిల్వదళములు 

వున్న స్ధలం పరమ పవిత్రమైనదిగా 

భావిస్తారు.. 


ఒక విధమైన గడ్డి జాతికి చెందిన 

ధర్భ మొక్కలు శ్రీ రాముని  

స్పర్శ చేత పునీతమై, 

ఆ ధర్భలను పవిత్ర కార్యాలకు వినియోగించబడుతున్నది..


ధర్భలకు ఉష్ణ శక్తి ఎక్కువ.   

జలాన్ని శుభ్రపరుస్తుంది. 

విషానికి విరుగుడు గుణం కలది.

గ్రహణ కాలంలో వ్యాపించే విషక్రిమి 

నాశనానికి ఉప్పు కలిపిన పదార్థాలలో 

ధర్భలు వేసి వుంచడం గమనించవచ్చును..


ధర్భలని సంస్కృతం లో 

'అగ్ని గర్భం' అంటారు..


కుంభాభిషేకాలలోను 

యాగశాలలో ని కలశాలలోను‌,

బంగారు, వెండి తీగలతో పాటుగా

ధర్భలను కూడా తీగలుగా చుట్టి ఉపయోగిస్తారు.. 


ధర్భలలో కూడా స్త్రీ, పురుష , 

నపుంసక జాతి ధర్భలని 

మూడు రకాలు వున్నాయి.. 


పురుష జాతి దర్భలు అడుగు 

నుండి చివరికొసదాకా 

సమానంగా వుంటాయి.. 


పై భాగంలో దళసరిగా వుంటే 

అది స్త్రీ ధర్భ గా గుర్తిస్తారు.. 


అడుగున దళసరిగా వున్న 

ధర్భను నపుంసక ధర్భగా 

తెలుసుకోవచ్చును..


ధర్భల దిగువ భాగంలో   

బ్రహ్మకు , మధ్యస్థానంలో  

మహావిష్ణువుకు , శిఖరాన  

ఎన్నోపరమశివునికి  

నివాసంగా భావిస్తారు..


దేవతలను తలచుకొని యిచ్చే తర్పణాలు ధర్భ కొసలతోను, మానవులను తలచి యిచ్చే తర్పణాలలో ధర్భల మధ్యభాగం నుండి, పితృదేవతలను తలచుకొని యిచ్చే తర్పణాలలో ధర్భను మడిచి కొసలతోనూ తర్పణాలు సమర్పించడం విధాయకంగా వుంది..


వైదికకార్యాలలో , "పవిత్రం" అనే పేరుతో 

ధర్భతో చేసిన ఒక ఉంగరాన్ని కుడి చేతి ఉంగరం వేలికి ధరింపజేసి ఆయా కార్యాలను ఆచరింపజేస్తారు .ఈ వ్రేలిలో కఫనాడి వుండడం వలన యీ ఉంగర ధారణవలన కఫం శుభ్రం చేయబడుతోంది.


 ప్రేత కార్యాలలో ఒక ధర్భతోను, శుభ కార్యాలలో రెండు ధర్భలతోను, పితృ కార్యాలలో మూడు ధర్భలతోను , దేవ కార్యాలలో నాలుగు ధర్భలతోను‌, ఆ ధర్భ ఉంగరాన్ని ముడి వేస్తారు. 

దేవతారాధన, జపం, హోమం, దానం తర్పణం వంటి కార్యాలలో ధర్భతో చేసిన 'పవిత్రం'అనే యీ ఉంగరాన్ని తప్పనిసరిగా ధరించాలి.


ధర్భగడ్డిలో పులుపు, క్షార గుణాలు వుండడం వలన

రాగి విగ్రహాలను , బూడిద ధర్భలు ఉపయోగించి శుభ్రపర్చాలని శిల్ప శాస్త్రం చెప్తోంది.

ఇందు వలన శిల్పాలలోని ఆవాహన మంత్ర శక్తి తరగకుండా చాలా రోజులు ప్రకాశవంతంగా వుంటాయని శాస్త్రజ్ఞులు చెపుతారు.


 ఆదివారమునాడు కోసిన ధర్భలను ఒక వారముపాటు ఉపయోగించవచ్చును. అమావాస్యనాడు కోసి తీసుకుని వస్తే

ఒక మాసం వరకు ఉపయోగించవచ్చును. 

పౌర్ణమినాడు కోసి తెస్తే పదిహేను రోజులు ఉపయోగించ వచ్చును. 

 

శ్రావణమాసం లో కోసిన ధర్భలైతే తీసుకుని వస్తే ఒక ఏడాది ఉపయోగించ వచ్చును. భాద్రపద మాసంలో తీసుకుని వస్తే ఆరు మాసాలు ఉపయోగించ వచ్చును. శ్రాధ్ధ కార్యాలకోసం తెచ్చిన ధర్భలను ఏ రోజు కా రోజే ఉపయోగించాలి. తిరునల్లారు శైవక్షేత్రంలో ధర్భలే స్ధల వృక్షం. ఈ క్షేత్రంలో నెలవైయున్న ఈశ్వరుని పేరు ధర్భారణ్యేశ్వరుడు.


        

                    సర్వేజనాఃసుఖినోభవంతు


                               🙏

Panchaag



 

ప్రయత్నశీలమే

 శు భో ద యం 🙏


ప్రయత్నశీలమే విజయమునకు సోపానం!!


"ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై

యారంభించి పరిత్యజింతు రురు విఘ్నాయత్తులై మధ్యముల్

ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై

ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమా ప్రజ్ఞానిధుల్ గావునన్ ! "- 

 అన్నారు ఏనుగు లక్ష్మణ కవి. 

లక్ష్మణకవి. సుభాషితములను అనువాదంచేస్తూ,  


వ్యక్తులను మూడు రకాలుగా గుర్తించారు. 1విఘ్నాలు కలుగుతాయని ముందే ఊహించి భయంచేత ఆ పనినే చేయరట కొందరు..2 కొందరు ఆరంభిస్తారు కాని ఏ విధమైన అడ్డంకులు ఎదురైనా దానిని అక్కడితో ఆపేస్తారట.3 మరికొందరు మాత్రం ఏ పనిని ఆరంభించినా ఆ పనిలో ఎన్ని అడ్డంకులు ఎదురయినా భయపడకుండా ధైర్యంతో, ఉత్సాహంతో చివరకంట లక్ష్యం కోసం శ్రమిస్తారట. వారినే కార్య సాధకులుగా చెపుతారాయన.

 ప్రజ్ఞ అంతర్గత చైతన్యం. అది సుషుప్త్యావస్థలో ఉంటే.. వ్యక్తిలో వికసన ఉండదు. అది జాగృతమైన వేళ అసాధ్యాలు సుసాధ్యమౌతాయి.


 ప్రజ్ఞ ఏ వ్యక్తిలో ఎంతమేరకు ఉంటుందిఅన్నదిప్రశ్న?. ప్రజ్ఞ అందరిలో సమంగానే ఉంటుంది.. అయితే ఎవరిలో ధైర్యం ఉత్సాహం పాలు ఎక్కువ ఉంటాయో వారు ప్రజ్ఞను ఎక్కువగా ఉపయోగించుకో గలుగుతారు. అందుకే వారిని ప్రజ్ఞానిధులు అంటాడు, లక్ష్మణకవి. 

సేకరణ:

                   

                      -స్వస్తి!

🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🙏🙏🌷👌👌🌷🌷🌷🌷🌷🌷🌷

శనివారం 26 జూలై 2025🍁*

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🍁శనివారం 26 జూలై 2025🍁*

                      1️⃣2️⃣

                  *ప్రతిరోజూ*

*మహాకవి బమ్మెర పోతనామాత్య*


       *శ్రీమద్భాగవత కథలు*```


(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```

``

*వేదాలు వేయి సార్లు చదివినా లభ్యం కాని ముక్తి, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది..!*``


           *పరీక్షిత్తు జననం*

 *ధృతరాష్ట్రుడి దేహత్యాగం*               

```

భీష్మాచార్యుల మరణానంతరం, ఆయనకు ధర్మరాజాదులు అంతిమ సంస్కారాలు చేసిన తరువాత, శ్రీకృష్ణుడు హస్తినాపురంలో మరి కొన్ని రోజులున్నాడు. తరువాత ద్వారకానగరానికి ప్రయాణమయ్యాడు. సుభద్ర, ద్రౌపది, కుంతి, ఉత్తర, గాంధారి, ధృతరాష్ట్రుడు, విదురుడు, ధర్మరాజు ఇలా అందరూ శ్రీకృష్ణుడు బయల్దేరి పోతుంటే, ఆయనకు ఘనంగా వీడ్కోలు చెప్పారు. 


యమునా నదీ తీరంలోని కురుజాంగల, పాంచాల, శూరసేన దేశాలు దాటాడు. బ్రహ్మావర్తాన్ని, కురుక్షేత్రాన్ని, మత్స్య, సారస్వత, మరుధన్వ, సౌవీర, అభీర, సైంధవ దేశాలను దాటి, ద్వారకలో అంతర్భాగమైన ఆవార్త మండలానికి చేరుకొని అక్కడ నుండి ద్వారకా నగరాన్ని చూసి, సూర్యాస్తమయం సమయానికి ద్వారకా నగరానికి చేరుకున్నాడు శ్రీకృష్ణుడు. 


ఆయన రాకకు పురజనులంతా అమితంగా ఆనందపడ్డారు. ఇక ముందు ఆయన ఎక్కడికీ వెళ్లకుండా ద్వారకలోనే ఉండాలని ప్రార్థించారు వారంతా. 


ద్వారక రాజమార్గం ద్వారా ప్రయాణం చేసి, ఆయన, తల్లిదండ్రుల నివాసాలలోనికి వెళ్లి, దేవకికి, ఇతర ఏడుగురు తల్లులకు మొక్కాడు. అనంతరం ఏక కాలంలో పదహారువేల నూట ఎనిమిది మంది భార్యల భవనాలలోకి వెళ్లాడు. వాళ్ళతో సరససల్లాపాలు ఆడాడు.


ఇదిలా ఉండగా, 

అశ్వత్థామ కోపంతో ప్రయోగించిన బ్రహ్మాస్త్రం బారినుండి ఉత్తర గర్భస్థ శిశువును వాసుదేవుడు ఎలా రక్షించాడు? అలా రక్షించబడిన బాలుడు ఈ భూమ్మీద ఎన్ని సంవత్సరాలు జీవించాడు? అతడు ఎలాంటివాడు? ఏమి సాధించాడు? ఆయన తనువును ఎలా చాలించాడు అనే విషయాలను వరుసగా చెప్పడం ప్రారంభించాడు సూతుడు శౌనకాది మహా మునులు వింటుంటే.


అభిమన్యుడి భార్య గర్భంలో ఉన్న శిశువు పది నెలలు నిండేసరికి అశ్వత్థామ ప్రయోగించిన బాణానికి అంతులేని బాధపడుతూ ఆక్రోశించాడు. 

అలా ఆ బాలుడు చింతిస్తున్న సమయంలో అంగుష్ఠమాత్ర దేహంతో ఒక గద ధరించి విష్ణువు 

ఆ శిశువు ముందు ఆవిర్భవించాడు. అశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రం వేడి తగలకుండా, గదను గిరగిరా తిప్పుతూ, శిశువుకు రక్షణ కలిగించి ఆనందాన్ని చేకూర్చాడు. బాణాగ్నిని గదతో ముక్కలు చేశాడు. చేసి, అదృశ్యమయ్యాడు. ఇది జరిగాక ఒక శుభలగ్నంలో కుమారుడు పుట్టాడు ఉత్తరకు. విష్ణువు రక్షించడం వల్ల పుట్టాడు కనుక విష్ణురాతుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కుతాడని బ్రాహ్మణులు చెప్పారు. ధర్మరాజు అతడి భవిష్యత్ గురించి అడిగిన ప్రశ్నకు జవాబుగా, వారు, అతడు అఖండమైన కీర్తి గడిస్తాడని, విష్ణు భక్తుడు అవుతాడని చెప్పారు. చాలా సంవత్సరాలు జీవించిన తరువాత తక్షకుడు అనే సర్పం విషాగ్ని వలన తనకు మరణం ఉందని తెలుసుకుంటాడని అంటారు. శుకయోగి ద్వారా ఆత్మజ్ఞాన సంపన్నుడై, గంగానదీ తీరంలో శరీరాన్ని విడిచి పెడుతాడు అని జాతక ఫలం చెప్పారు.


తల్లి గర్భంలో ఉన్నప్పుడు చూసిన విభుడు, ఈ విశ్వమంతా ఉన్నాడు కాబట్టి, అతడే నిత్యం పరీక్షించాడు కాబట్టి, అతడిని 'పరీక్షిత్తు' అన్నారు. ఆ బాలుడు క్రమేపీ పెరిగి పెద్దవాడై, అన్నిటా పూర్ణుడయ్యాడు.


తదనంతరం, ధర్మరాజు బంధువులను కౌరవ పాండవ యుద్ధంలో చంపినందుకు దోష పరిహారంగా అశ్వమేధయాగం చేయాలనుకున్నాడు. యజ్ఞానికి అన్నీ సమకూర్చుకుని శ్రీకృష్ణుడిని ఆహ్వానించాడు. ఆయన్ను ఉద్దేశించి మూడు యజ్ఞాలు చేశాడు. ఆ తరువాత అర్జునుడితో కలసి ద్వారకకు వెళ్ళిపోయాడు కృష్ణుడు. కొంతకాలానికి విదురుడు మైత్రేయ ముని దగ్గర పరమార్థ జ్ఞానానికి సంబంధించిన విషయాలను తెలుసుకుని హస్తినాపురానికి వచ్చాడు. లోకంలోని వార్తలు ఏమిటని ఆయన్ను ధర్మరాజు అడిగాడు. అప్పుడాయన మేలు కలిగించే లోకంలోని సమస్త విషయాలను విశదంగా చెప్పాడు. కీడు వార్తలు ఏవీ చెప్పలేదు.


ధర్మరాజు రాజ్యభారాన్ని వహించి తన తమ్ములు, తానూ, మనుమడిని ముద్దు చేస్తూ, చాల కాలం మహావైభవంగా పాలన చేశాడు.


కొంతకాలానికి, ఒకనాడు, విదురుడు ధృతరాష్ట్రుడికి విరక్తి మార్గాన్ని ఉపదేశించాడు. అప్పుడాయన జ్ఞాన మార్గంలో హిమవత్పర్వతం దిశగా గాంధారి సమేతంగా వెళ్లాడు. విదురుడు కూడా వారితో వెళ్లాడు. 

ఆ మర్నాడు ఈ విషయం తెలియని ధర్మరాజు వారెక్కడికి పోయారని సంజయుడిని అడిగాడు. అలా ఇద్దరూ ఎటూ పాలుపోక దుఃఖిస్తున్న సమయంలో నారదుడు వచ్చాడు. ఆయన్ను వీరి గురించి అడిగాడు ధర్మరాజు. 


జవాబుగా నారదుడు:

'కాలాన్ని దాటడం ఎవరికీ శక్యం కాదు. చింత అక్కర లేదు. ధృతరాష్ట్రుడు గాంధారీ, విదురులతో హిమవత్పర్వత దక్షిణ భాగంలో ఉన్న ఒక మునివనానికి వెళ్లారు. అక్కడ సప్త మహర్షులకు సంతోషం కలిగించడానికి ఏడు ప్రవాహాలుగా ప్రవహిస్తున్న ఆకాశగంగ పుణ్య తీర్థంలో విష్ణువు గూర్చి ప్రార్థన చేస్తున్నాడు. నేటికి ఐదవ నాడు శరీర త్యాగం చేయబోతున్నాడు. ఆ తరువాత గాంధారి కూడా అగ్నిలో పడి భస్మమైపోతుంది. అది చూసిన విదురుడు చింతించి, తీర్థయాత్రలకు పోతాడు' అని విదుర, గాంధారీల వృత్తాంతాన్ని ధర్మరాజుకు చెప్పి, నారదుడు స్వర్గానికి వెళ్లిపోయాడు.

```

              *(సశేషం)*

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*

``

        *రచన:శ్రీ వనం* 

 *జ్వాలా నరసింహారావు* *సర్వంశ్రీకృష్ణార్పణమస్తు*

            🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

శనివారం🚩* *🌹26 జూలై 2025🌹*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐* 

      *🚩శనివారం🚩*

 *🌹26 జూలై 2025🌹*    

    *దృగ్గణిత పంచాంగం*  

                

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షఋతౌః* 

*శ్రావణమాసం - శుక్లపక్షం*


*తిథి  : విదియ* రా 10.41 వరకు ఉపరి *తదియ*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం   : ఆశ్లేష* సా 03.52 వరకు ఉపరి *మఖ*

*యోగం : వ్యతీపాత* రా.తె 04.06 వరకు ఉపరి *వరీయాన్*

*కరణం  : బాలువ* ఉ 10.57 *కౌలువ* రా 10.41 ఉపరి *తైతుల*


 *సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 11.00 - 01.00 సా 04.00 - 06.00*              

అమృత కాలం  : *మ 02.16 - 03.52*

అభిజిత్ కాలం  : *ప 11.48 - 12.40*

*వర్జ్యం      : శేషం ఉ 06.19 & తె 04.07 - 05.45*

*దుర్ముహూర్తం  : ఉ 05.46 - 07.30*

*రాహు కాలం   : ఉ 09.00 - 10.37*

గుళికకాళం       : *ఉ 05.46 - 07.23*

యమగండం     : *మ 01.51 - 03.28*

సూర్యరాశి : *కర్కాటకం* 

చంద్రరాశి : *కర్కాటకం/సింహం*

సూర్యోదయం :*ఉ 05.54*

సూర్యాస్తమయం :*సా 06.52*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.46 - 08.21*

సంగవ కాలం         :      *08.21 - 10.56*

మధ్యాహ్న కాలం    :     *10.56 - 01.31*

అపరాహ్న కాలం    : *మ 01.31 - 04.06*


*ఆబ్ధికం తిధి         : శ్రావణ శుద్ధ విదియ*

సాయంకాలం        :*సా 04.06 - 06.41*

ప్రదోష కాలం         :  *సా 06.41 - 08.55*

రాత్రి కాలం           :*రా 08.55 - 11.52*

నిశీధి కాలం          :*రా 11.52 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.18 - 05.02*

******************************

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🙏శ్రీ వేంకటేశ్వర స్వామి🙏* 

*🔯సహస్రనామ స్తోత్రం🔯*


*తారకాసురాటవీకుఠారమద్వి*

*తీయకం నాగరాడిరీశ్వరం* 

*నమామి వేంకటేశ్వరమ్*


*🌹ఓం నమో వెంకటేశాయ🌹*

******************************


*🍁శ్రీ ఆంజనేయ స్తోత్రం 🍁*


*యాతనా నాశనాయాస్తు* 

*నమో మర్కటరూపిణే*

*యక్షరాక్షస శార్దూల*  

*సర్పవృశ్చిక భీహ్నతే.!!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🚩🪷🌹🛕🌹🌷🪷🌷🚩

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - వర్ష ఋతువు - శ్రావణ మాసం - శుక్ల పక్షం -‌ ద్వితీయ - ఆశ్రేష -‌‌ స్థిర వాసరే* (26.07.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*