శు భో ద యం 🙏
ప్రయత్నశీలమే విజయమునకు సోపానం!!
"ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజింతు రురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమా ప్రజ్ఞానిధుల్ గావునన్ ! "-
అన్నారు ఏనుగు లక్ష్మణ కవి.
లక్ష్మణకవి. సుభాషితములను అనువాదంచేస్తూ,
వ్యక్తులను మూడు రకాలుగా గుర్తించారు. 1విఘ్నాలు కలుగుతాయని ముందే ఊహించి భయంచేత ఆ పనినే చేయరట కొందరు..2 కొందరు ఆరంభిస్తారు కాని ఏ విధమైన అడ్డంకులు ఎదురైనా దానిని అక్కడితో ఆపేస్తారట.3 మరికొందరు మాత్రం ఏ పనిని ఆరంభించినా ఆ పనిలో ఎన్ని అడ్డంకులు ఎదురయినా భయపడకుండా ధైర్యంతో, ఉత్సాహంతో చివరకంట లక్ష్యం కోసం శ్రమిస్తారట. వారినే కార్య సాధకులుగా చెపుతారాయన.
ప్రజ్ఞ అంతర్గత చైతన్యం. అది సుషుప్త్యావస్థలో ఉంటే.. వ్యక్తిలో వికసన ఉండదు. అది జాగృతమైన వేళ అసాధ్యాలు సుసాధ్యమౌతాయి.
ప్రజ్ఞ ఏ వ్యక్తిలో ఎంతమేరకు ఉంటుందిఅన్నదిప్రశ్న?. ప్రజ్ఞ అందరిలో సమంగానే ఉంటుంది.. అయితే ఎవరిలో ధైర్యం ఉత్సాహం పాలు ఎక్కువ ఉంటాయో వారు ప్రజ్ఞను ఎక్కువగా ఉపయోగించుకో గలుగుతారు. అందుకే వారిని ప్రజ్ఞానిధులు అంటాడు, లక్ష్మణకవి.
సేకరణ:
-స్వస్తి!
🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🙏🙏🌷👌👌🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి