21, జనవరి 2024, ఆదివారం

Led


 

Panchanag


 

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*తృతీయ స్కంధము*


*శ్రీమహిత వినుత దివిజస్తోమ! యశస్సీమ! రాజసోమ! సుమేరు స్థేమ! వినిర్జితభార్గవ రామ! దశాననవిరామ! రఘుకులరామా!*


వాక్కుల సంపదలతో దేవతలు గుంపులు గుంపులుగా చేరి నిన్ను స్తుతిస్తూ ఉంటారు. నీ కీర్తి చిట్టచివరి అంచులకు చేరినట్టిది. రాజులందరూ తారలు అనుకొంటే నీవు వారిలో చంద్రుడవు బంగారుకొండవలె సుస్థిరంగా నిలువగలవాడవు. ఇరవైయొక్క పర్యాయాలు రాజులనందరినీ ఊచకోతకోసిన పరశురాముడు నీచేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయాడు. పదితలల పెద్దరక్కసుడు రావణుడు నీతో పోరాడి ఘోరమైన చావు చచ్చాడు. స్వామీ! రఘువంశం నీవలన గొప్పమహిమను, అందచందాలనూ పొందింది. స్వామీ! అట్టి నీవు నాకవిత్వాన్ని ఆలకించి నన్ను ధన్యుణ్ణి చెయ్యి, స్వామీ!


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

Train break


 

Finger attachment


 

విశ్వకవి వేమన జయంతి*

 *విశ్వకవి వేమన జయంతి* సందర్భంగా శుభాకాంక్షలు.                                *వేమన పౌండేషన్ ..‌* అనంతపురము కేంద్రంగా వేమన విషయంగా  కృషి చేస్తూ వస్తుంది.అనేక కార్యక్రమాలు చేపట్టింది. మా ముందు మరింత బాధ్యత ఉంది. ఈ నేపథ్యంలో వేమన పౌండేషన్ కు మీవంతు సహకారం కోరుతున్నాం.                                          

                  @@@

      - వేమన పౌండేషన్ కార్యక్రమాల కోసం మీకు తోచిన సహాయసహకారాలు అందిచడం.                

      - వేమన పౌండేషన్ లో సభ్యులుగా చేరి భాగస్వామ్యులవడం. ఆయా ప్రాంతాలలో బాధ్యతలు తీసుకోవడం.  

      - వేమన 10 పుస్తకాలను 750 రుపాయలకు తీసుకొని పాఠశాలలకు, గ్రంథాలయాలకు ఇవ్వడం. 

     - ప్రతి సంవత్సరం మాకు వచ్చే ప్రతి  విరాళాలు, వ్యయాలను సభ్యుల ముందుంచుతాం.

    ....ధన్యవాదాలతో.....  

            వివరాలకు...

      @ *వేమన పౌండేషన్,*  

  అనంతపురము, 9963917187

జనవరి 22న సెలవు

 💐 *జనవరి 22న సెలవు ప్రకటించాల్సిందే👍* 

💐 *హిందువులుగా ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులు  అయోధ్య రామయ్య పండుగకు సెలవు అడగలేకపోవడమేమిటి* 


 💐 అయోధ్య రామయ్య తన ఇంటికి చేరుకుంటున్న శుభవేళ 👍

💐500 సంవత్సరాల నాటి నూరుకోట్ల  హిందువులకల నెరవేరిన శుభవేళ

 💐

 ఇది సగటు హిందూ ఉద్యోగి సంవేదన

💐  చిన్న విషయానికి కలెక్టరేట్ల ముట్టడి మండల స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమించే ఉద్యోగ సంఘాలనాయకులు నోర్లు  ఎందుకు మూగబోయాయి..

💐 *కమ్యూనిస్టులకు హిందువుల పండుగలు అక్కర్లేదా.* 

💐 సాక్షాత్తు అయోధ్య రామయ్య పండుగనే వ్యతిరేకించడమేమిటి.

💐 *ప్రతి హిందువు ఉద్యోగి ఎందుకు ఈ సమయంలో మౌనంగా ఉన్నారు.* 

💐 ప్రతి విషయానికి సింహాల్లాగా గర్జించే ఈ ఉద్యోగ సంఘాల నాయకులకు ఇప్పుడు ఏమైంది.

💐ఎవరికి భయపడుతున్నారు...

💐 అన్ని రకాల ఉద్యోగ సంఘాలు నాయకులు కమ్యూనిస్టులలో ఇరుక్కొని పోవడమే కదా.

💐 *ఇంతగా హిందుత్వాన్ని వ్యతిరేకించే సంఘాల్లో మనం కొనసాగడం అవసరమా.* 

💐 హిందువుల పై ఏమాత్రం గౌరవం ఉన్న వెంటనే  మీ జిల్లాస్థాయి, మీ రాష్ట్రస్థాయిలో ఉండే నాయకులతో మాట్లాడి సెలవులిమ్మని డిమాండ్ చేయండి పేపర్ ప్రకటనలు ఇవ్వండి ఎందుకు మౌనంగా ఉంటారు.

💐 *కమ్యూనిస్టులు స్వాతంత్రం రాక ముందు నుండి హిందుత్వాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు.* 

 💐పేరుకు సీతారాం ఏచూరి.

 ఈయన పేరులో  సీతమ్మ, రామయ్య ఇద్దరు ఉన్నారు

💐 కానీ తను అయోధ్య రామయ్య కార్యక్రమానికి రానే రాను,అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి కరాకండిగా చెప్పి ఉన్నారు.

💐 *కాబట్టి కమ్యూనిస్టుల గొడుగు కింద ఉన్నన్నాళ్ళు హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తారు.* 

💐 అందులో భాగమే ఈరోజు జనవరి 22న సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తి అయోధ్య రామ మందిరం లోనికి వెళుతున్న శుభవేళ హిందువులుగా ఉండి సెలవు అడగలేని దుస్థితి.

 💐వాస్తవాలు వినేటప్పుడు కొంతమందికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది.కానీ ధర్మం వైపు అడుగు వేయాలని విన్నపం 🙏

💐 ఇప్పటికైనా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం నాయకులందరికీ మా విజ్ఞప్తి ఏమిటంటే అయోధ్య బాల రాముడు తన ఇంటికి చేరుకుంటున్న శుభవేళ ఇది మనందరికీ పెద్ద పండుగ. కాబట్టి దీన్ని సాధించే వరకు మనం అందరం ఉద్యమించాలి ఎటువంటి సంఘాలతో సంబంధం లేదు👍 ఒక హిందువుగా ఆలోచించి ఉద్యమించి నెరవేర్చుకుందాం  👍

💐 ఈ స్టేట్మెంట్ లో ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి.

ధర్మం అని అనిపిస్తే ధర్మం వైపు ప్రయాణించండి.జైశ్రీరామ్ 👍🙏

విశ్వనాథ సీత*

 శు భో ద యం 🙏


*విశ్వనాథ సీత*


కల్పవృక్షంలో విశ్వనాథ వర్ణించిన అశోక వనంలో సీత సీతారామాద్వైతానికి ప్రతీక! 


*అశోక వనంలో సీత*!! 

             

                  

కల్పన అంటే ఊహ. ఒక కొత్త ఆలోచన, కొత్త దృక్కోణం. మనందరికీ తెలిసున్న విషయాల గురించి మనకి తెలీని ఒక కొత్త అంశాన్ని ఆవిష్కరించ గలగడమే కల్పనా చాతుర్యం. ఉదాహరణకి అశోకవనంలో సీతాదేవిని వర్ణించే యీ పద్యం చూడండి :


ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బొమ తీరు స్వామి చా

పాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైశికమందు రామ దే

హాకృతి, సర్వ దేహమున యందును రాఘవవంశమౌళి ధ

ర్మాకృతి, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞ మూర్తియై


సీతాదేవి ఎలా ఉందీ అంటే, ఆమె ఆకారం రామచంద్రుని విరహానికి రూపంలా ఉందట. కనుబొమలేమో రాముని విల్లులా ఉన్నాయి. రాముని కరుణ కన్నులలో మూర్తికట్టింది. జడేమో రాముని శరీరకాంతితో మెఱుస్తోంది.


రామాయణ కల్పవృక్షం

సీతాదేవి శరీరమంతా కూడా రఘువంశ చంద్రుడైన రాముని ధర్మం రూపుకట్టినట్టుగా ఉంది. ఆ కూర్చున్న విధానమేమో రాముని ప్రతిజ్ఞ మూర్తీభవించినట్టుగా ఉందట! ఎంత ఉదాత్తమైన ఊహ యిది! అంత ఎడబాటులో కూడా ఎప్పుడూ ఆ సీతారాములు కలిసే ఉన్నారన్న ఆలోచన గొప్పది. కనుబొమలని ధనుస్సుతో పోల్చడం మామూలే. అలాగే కురుల సౌందర్యాన్ని చెప్పడానికి వాటి నల్లని నిగనిగలు వర్ణించడమూ సామాన్యమే. కాని వాటిని సీత విషయంలో రాముని విల్లుగా, రాముని శరీర కాంతిగా అభివర్ణించడం అసామాన్యం. బాహ్య రూపంతో మొదలుపెట్టి, చివరికి ఆమె శరీరమంతా రాముని ధర్మానికి ప్రతిరూపంలా ఉందనడం, ఆమె కూర్చున్న తీరులో రాముని ప్రతిజ్ఞ కనిపిస్తోందనడం సాధారణ కవులు చెయ్యలేని ఊహ. ఇది సీతారాముల అద్వైతాన్ని నిరూపించే పద్యం. కల్పవృక్షం నిండా ఇలాంటి ఊహలే. అవి ఎంత విచిత్రంగా ఉంటాయో అంత సముచితంగా ఉంటాయి. అంత ఉదాత్తంగా ఉంటాయి.

నవగ్రహా పురాణం🪐*

 .        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *143వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*బుధగ్రహ మహిమ - 2*


*"అమ్మా" పాణిని గద్గదకంఠంతో అన్నాడు. "నిజమా ?!"*


*"వెళ్ళు ప్రాణినీ ! పరమేశ్వరుడి కటాక్షం ప్రాప్తిస్తుంది !"* గురుపత్ని గంభీరంగా అంది. *"ప్రణవ పూర్వకంగా పంచాక్షరీ మంత్రాన్ని జపించు ! తదేక దీక్షతో తపించు !"* 


పాణిని కన్నీళ్ళు తుడుచుకున్నాడు. రెండు చేతుల్తో గురుపత్ని పాదాలు స్పృశించాడు. *"మాతా ! విద్య అనే ఐశ్వర్యాన్ని మూటగట్టుకుని తిరిగి వచ్చి మీ దర్శనం చేసుకుంటాను !"*


*"విజయోస్తు !”* గురుపత్ని పాణిని తల మీద చెయ్యి పెట్టి దీవిస్తూ అంది. హిమాలయ పర్వత సమీపంలో పాణిని తపస్సు సాగుతోంది. తదేక దీక్షతో ప్రణవ సహితంగా పంచాక్షరీ మంత్రాన్ని అంతరంగంలో జపిస్తూ , అన్నపానీయాలు మరిచిపోయి తపస్సు చేస్తున్న పాణిని చుట్టూ మంచు గడ్డ కట్టుతోంది.


కాలం తన నిరంతర ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. గడ్డకట్టిన మంచు కరిగి , కాలువలు కట్టింది. పాణిని ఆ మార్పులు గమనించే స్థితిలో లేడు !


*"పాణినీ !”* మేఘ గర్జనలా ధ్వనిస్తూ పిలిచింది గంభీర కంఠం. పాణిని కనురెప్పలు మెల్లగా కదిలి , విచ్చుకున్నాయి. ఎదురుగా పరమశివుడి కమనీయ రూపం లీలగా ప్రత్యక్షమైంది.


*“పరమేశ్వరా ! మహదేవా ! విశ్వగురుదేవా ! విద్య ! విద్య ! విద్యను ప్రసాదించు !"* పాణిని కంఠం వణికింది.


*"పాణినీ ! ఒక అడ్డు ఉంది ! అది తొలగిపోతే గానీ , నేను నీకు విద్యాదానం చేయలేను..."* పరమశివుడు సానుభూతితో అన్నాడు.


*"స్వామి..."*


*"ఆ అడ్డంకి ఏమిటో తెలుసా ?" పరమశివుడు చిరునవ్వుతో అన్నాడు. "బుధుడి అశుభ దృష్టి ! నవగ్రహాలలో చతుర్ధ గ్రహ దేవత అయిన బుధుడు నిన్ను వక్ర దృష్టితో చూస్తున్నాడు. ఆ వక్రదృష్టి సక్రమ దృష్టిగా , శుభవీక్షణగా పరివర్తన చెందాలి...”*


*"స్వామీ..."  పాణిని ఏదో విన్నవించే ప్రయత్నం చేశాడు.


శివుడు చెయ్యెత్తి వారించాడు.  "నీ సందేహం నాకు తెలుసు ! దేవతలలో ఎవరి అధికారం వారిదే ! ఎవరి కారకశక్తి వారిదే ! బుధుడి అశుభదృష్టిని , నేను శుభదృష్టిగా మార్చను ; మార్చకూడదు. మొదట బుధుణ్ణి ప్రసన్నం చేసుకో. అతని శుభదృష్టిని సంపాదించు ! బుధుడు చూస్తే , నేను చదువు ఇస్తాను !”*


పాణిని పరమశివుడి పాదాల ముందు సాగిల పడ్డాడు.


*"ఆజ్ఞ !"*


*"బుధగ్రహ అనుగ్రహ ప్రాప్తిరస్తు !"* పరమశివుడు దీవించి , అంతర్థానమయ్యాడు.


**************************


*“అష్టాదశ విద్యాప్రదాత ఆజ్ఞ మేరకు పాణిని అక్కడే , అప్పుడే బుధుడి గురించి తపస్సు ప్రారంభించాడు. ఏకాగ్రతతో సాగిన పాణిని దీక్ష కఠోర స్థాయికి చేరుకుంది. బుధుడు అతడి ముందు సాక్షాత్కరించాడు. కన్నీళ్ళు కారుస్తూ కాతర స్వరంతో పాణిని తన మీద శుభదృష్టిని ప్రసాదించమని బుధుణ్ణి ప్రార్ధించాడు.


*"పాణినీ ! పూర్వజన్మ కర్మఫలంగా నీ మీద నా దృష్టి వక్రంగా ప్రసరించింది. నీ ప్రార్ధన ఫలించింది. నీకు సకల విద్యలూ లభిస్తాయి. ఆ పరమశివుడే నీకు పరమగురువు !”* బుధుడు సౌమ్యంగా అన్నాడు.


*"ధన్యుణ్ణి స్వామీ !”*


*"శుభం భూయాత్ ! అభవుణ్ణి ఆరాధించు !”* అంటూ బుధుడు అంతర్థానమయ్యాడు.


**************************


ఇనుమడించిన ఉత్సాహంతో , అఖండ విశ్వాసంతో పాణిని మానసిక శివారాధన కొనసాగించాడు. అచిరకాలంలో ఒక ప్రశాంత సంధ్యా సమయాన పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు.


*"పరమేశ్వరా ! విద్యాదానం అర్థిస్తున్నాను !”* పాణిని దోసిలి పెట్టి వినయంగా అన్నాడు.


*“పాణినీ ! మా ఢమరుక నాదాన్ని ఏకాగ్రతతో ఆలకించు ! ఆ శబ్దాలను నీ మేథస్సులో నిక్షిప్తం చేసుకో !"* పరమశివుడు గంభీరంగా అన్నాడు.


మరుక్షణం పరమేశ్వరుడి చేయి కదిలింది. ఆ ప్రశాంత ప్రభాత వాతావరణంలో పరమశివుడి ఢమరుక నాదం హిమపర్వత సానువులలో మారుమ్రోగింది. అవసరమైన విరామాలతో ఢమరుకం చతుర్దశ పర్యాయాలు మ్రోగి విభిన్నమైన శబ్దాల్ని సృష్టించింది. ఢమరుక నాదానికి అనుగుణంగా అక్షరానంద తాండవం చేస్తున్న పరమేశ్వరుడి పాదనూపురాలు సవ్వడిచేశాయి.


ఆనంద నర్తనను ఆపి అభవుడు చిరునవ్వులు చిందిస్తూ చూశాడు. *"పాణినీ ! ఢమరుక నాదాలనూ , నూపురాల శబ్దాలనూ ఆలకించావు కద ! మా ఢమరుకం పలికించిన శబ్దాలకు అర్థాలే నూపుర ధ్వనులు !”*


*“పరమేశ్వరా ! దివ్య ఢమరుక శబ్దాలను పదునాలుగింటినీ పదునాలుగు 'మాహేశ్వర సూత్రాలుగా' స్వీకరిస్తున్నాను. అందుకు అనుమతి అర్థిస్తున్నాను !"* రోమాంచంతో స్పందించిన శరీరాన్ని అదుపులో ఉంచుకుంటూ ప్రార్థించాడు పాణిని.


*“తథాస్తు !"* శివుడు చెయ్యెత్తి దీవించాడు.


*“మహాదేవా ! చతుర్దశ మహేశ్వర సూత్రాల ప్రాతిపదికతో వ్యాకరణ శాస్త్రాన్ని నిర్మిస్తాను !"* పాణిని ఆవేశంతో అన్నాడు.


*“దివ్యమైన ఆలోచన ! శరీరానికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో , భాషకు వ్యాకరణం అంత ముఖ్యం ! నువ్వు రచించబోయే భాషా శాస్త్రానికి 'పాణినీయం' అనే నామధేయాన్ని ప్రసాదిస్తున్నాను !"*


*"ధన్యుణ్ణి దేవా ! ధన్యుణ్ణి ! మీ అష్టమూర్తి తత్వాన్ని గుర్తుంచుకుని , అష్ట అధ్యాయాలతో ఆ గ్రంథాన్ని రూపొందిస్తాను !"*


*“సంకల్ప సిద్ధిరస్తు !”* పరమశివుడు చెయ్యెత్తి దీవించాడు. *“కాలాంతరంలో నువ్వు మా ఆస్థానంలో 'పార్షదుడు'గా ఉండగలవు !”*


**************************


నిర్వికల్పానంద శిష్యుల్ని కలయజూశాడు. *"పరమశివుడు ఢమరుక శబ్దాలతో అనుగ్రహించిన 'ప్రత్యాహార సూత్రాలు' అనబడే పధ్నాలుగు మాహేశ్వర సూత్రాల ఆధారంతో ఎనిమిది అధ్యాయాల వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు పాణిని. అధ్యాయాల సంఖ్య కారణంగా పాణినీయ వ్యాకరణం 'అష్టాధ్యాయి' అని కూడా ప్రసిద్ధి చెందింది. ఎనిమిది అధ్యాయాలలో సుమారు నాలుగు వేల వ్యాకరణ సూత్రాలను సృష్టించాడు పాణిని. సాక్షాత్తు ఆదిశేషుడి అవతారమైన పతంజలి మహర్షి పాణినీయ వ్యాకరణ గ్రంథానికి భాష్యం రచించి దానికి 'మహాభాష్యం' అనే మహత్తర నామ ధేయం నిర్ణయించాడు.


*"శివానుగ్రహం పొంది తిరిగి వచ్చిన పాణినిని గురువు వర్షాచార్యుడూ , గురుపత్నీ హృదయపూర్వకంగా అభినందించారు. బుధగ్రహ అనుగ్రహం శివానుగ్రహానికి మార్గాన్ని నిర్మించిందని వివరించాడు పాణిని. కాలాంతరంలో పాణిని మహాశయుడు కైలాస మందిరంలో భృంగి , భృంగిరిటీ , నంది మొదలైన ప్రమథ ప్రముఖులతో బాటు శివుడి కొలువులో సభ్యుడుగా ఉండిపోయాడు ! మహాభాష్యం వ్రాసిన పతంజలి కూడా మహా సర్పరూపంలో మానవ శిరస్సుతో కైలాసవాసుడి కొలువు కూటంలో పాణిని సన్నిహితుడుగా రాణించాడు. పాణిని చరిత్ర ద్వారా మనం బుధగ్రహ మహిమను తెలుసుకున్నాం !"* అంటూ ముగించాడు నిర్వికల్పానంద.


*రేపటి నుండి గురుగ్రహ మహిమ ప్రారంభం*

 

*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

.           *🌹వేమన పద్యములు🌹* 

.             *అర్థము - తాత్పర్యము*

.                      *Part - 6*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 13*


*అంజనంబు కనుల కంటించి చూచిన*

*సొమ్ము దొరకు భువిని సూత్రముగను*

*నమ్మి గురుని కరుణ నభమంటి చూడరా*

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

అంజనం వేసి చూస్తే సొమ్ములు దొరకవచ్చును గానీ దైవకృప గాంచలేడు కదా !


*💥వేమన పద్యాలు -- 14*


*అంజనంబు బెట్టి యాత్మలో ద్రవ్యంబు*

*గనగలేని ఘనత కడగి ఎరిగి*

*ఆశదప్పినప్పు డతడెపో ఘనయోగి* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹 తాత్పర్యము --*

ఆశాపాశముతో మానవ జన్మను వృధా చేసుకొనరాదు.

ఆశ వీడిన వాడే యోగిగా చలామణియై ఘనతను పొందుతాడు.


*💥వేమన పద్యాలు -- 15*

      

*ఆంటి యంటకుండు నమల స్వరూపమై*

*మింటి మంటి నడుమ మెలగు దాని*

*నొంటి స్థంభమందు జంటించి చూడరా* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*       

మనిషి తావన్మాత్రముగా ఆంటీ ముట్టనట్లుండి స్వచ్ఛమైన మనసుతో  ప్రవర్తించిన , ఏకేశ్వరోపాసన చేసిన మోక్షము తప్పకుండా కలుగును.



*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

.           *🌹శ్రీమద్భగవద్గీత🌹*

.           *ప్రధమ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.         *అర్జున విషాద యోగము*

.                  *శ్లోకము 42*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*సంకరో నరకాయైవ*

*కులఘ్నానాం కులస్య చ ।*

*పతంతి పితరో హ్యేషాం*

*లుప్తపిండోదకక్రియాః ।। 42 ।।*


*భావం: 1.42*

సంకరమైన సంతానం పెరగటం వలన కులమునకు, కుల నాశనము చేసిన వారికి కూడా నరకము ప్రాప్తించును. శ్రాద్ద తర్పణములు లుప్తమయిన కారణముగా ఆ భ్రష్టుపట్టిన వంశ పూర్వీకులు కూడా పతనమవుదురు.


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*అర్జున విషాద యోగము

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

.           *🌹శ్రీమద్భగవద్గీత🌹*

.           *ప్రధమ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.         *అర్జున విషాద యోగము*

.                *శ్లోకము 43-44*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*దోషైరేతైః కులఘ్నానాం*

*వర్ణసంకరకారకైః ।*

*ఉత్సాద్యంతే జాతిధర్మాః*

*కులధర్మాశ్చ శాశ్వతాః ।।43||*


*భావము:*

కుటుంబ ఆచారము నాశనము చేసి, అవాంఛిత సంతానం పెంపొందటానికి కారణమైన వారి దుష్ట చేష్టల వలన అనేకానేక సామాజిక, కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోవును.


🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

 

*ఉత్సన్నకులధర్మాణామ్*

*మనుష్యాణాం జనార్ధన ।*

*నరకేఽనియతం వాసో*

*భవతీత్యనుశుశ్రుమ ।।44||*


*భావము:* 

ఓ జనార్ధనా (కృష్ణా), కులాచారములను నాశనం చేసిన వారు నిరవధికముగా నరకములోనే ఉంటారని, నేను పండితుల నుండి వినియున్నాను;


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*తృతీయ స్కంధము*


*శ్రీమహిత వినుత దివిజస్తోమ! యశస్సీమ! రాజసోమ! సుమేరు స్థేమ! వినిర్జితభార్గవ రామ! దశాననవిరామ! రఘుకులరామా!*


వాక్కుల సంపదలతో దేవతలు గుంపులు గుంపులుగా చేరి నిన్ను స్తుతిస్తూ ఉంటారు. నీ కీర్తి చిట్టచివరి అంచులకు చేరినట్టిది. రాజులందరూ తారలు అనుకొంటే నీవు వారిలో చంద్రుడవు బంగారుకొండవలె సుస్థిరంగా నిలువగలవాడవు. ఇరవైయొక్క పర్యాయాలు రాజులనందరినీ ఊచకోతకోసిన పరశురాముడు నీచేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయాడు. పదితలల పెద్దరక్కసుడు రావణుడు నీతో పోరాడి ఘోరమైన చావు చచ్చాడు. స్వామీ! రఘువంశం నీవలన గొప్పమహిమను, అందచందాలనూ పొందింది. స్వామీ! అట్టి నీవు నాకవిత్వాన్ని ఆలకించి నన్ను ధన్యుణ్ణి చెయ్యి, స్వామీ!


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి (21.01.2024) వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

పల్లకీసేవ..పరివర్తన

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*పల్లకీసేవ..పరివర్తన..*


"నేను సహజంగా ఇలా మారుమూల పల్లెటూళ్లకు రానండీ..అంత సమయం కూడా నాకు దొరకదు..ఒక్కరోజు నేను మా ఆఫీస్ లో లేకపోయినా..ఎందరో ఇబ్బందిపడతారు..నాకూ అక్కడ ఒక్కక్షణం తీరిక ఉండదు..ఇదిగో ఈవిడ దత్త భక్తురాలు కాబట్టి..ఈ క్షేత్రం గురించి విని చూడాలని పట్టుబట్టింది..అందుకోసం విధిలేక ఆమెతో పాటు వచ్చాను..నేను ఈరోజే తిరిగి వెళ్లిపోవాలని అనుకున్నాను..ఇప్పుడు పల్లకీ సేవ లో పాల్గొని..రేపుదయం హారతులు కూడా చూసి..సమాధి దర్శనం చేసుకొని వెళదామని ఒకటే పోరు పెట్టింది..ఇక తప్పలేదు..మేము ఉండటానికి ఒక ac రూము దొరుకుతుందా?.." అని హైదరాబాద్ నుంచి వచ్చిన లక్ష్మణరావు గారు అడిగారు..ఆయన ముఖంలో అసహనం కొట్టొచ్చినట్టు కనబడుతోంది..


"ఇక్కడ ac రూములు లేవు..ఉన్న రూముల్లో కూడా నేలమీద పడుకోవాలి..చాపలు ఉంటాయి..ఎక్కువమంది భక్తులు మందిరం లోనే స్థలం చూసుకొని పడుకుంటారు.. పైగా ఇప్పుడు ఆ రూములు కూడా ఖాళీ లేవు..మీకు కావాలంటే..మందిరం వెనకాల రేకుల షెడ్ ఉంది..అందులో ఖాళీ ఉంది..అక్కడ ఉండొచ్చు.." అని మా సిబ్బంది ఆయనకు చెప్పారు..


"ఖర్మ!..ఖర్మ!.." అనుకుంటూ తన భార్యను తిట్టుకుంటూ..ఆయన తన జీవితంలో ఇంత బాధ ఎన్నడూ అనుభవించలేదన్నట్లు భావిస్తూ..పోయి తన కార్ లో కూర్చున్నారు..ఆయన భార్య మాత్రం ఇవేవీ పట్టకుండా..శ్రీ స్వామివారి పల్లకీ సేవ కోసం తమ పేర్లు నమోదు చేయించుకొన్నారు..


సాయంత్రం ఏడు గంటలకు పల్లకీసేవ ప్రారంభం అయింది..అయిష్టంగానే లక్ష్మణరావు గారు భార్యతో సహా పల్లకీసేవ లో కూర్చున్నారు..అర్చకస్వాములు సంకల్పం చెప్పి..వీరి గోత్రనామాలను కూడా పలికిన తరువాత..పూజ ప్రారంభం అయింది..పల్లకీ సేవలో కూర్చున్న లక్ష్మణరావు గారి లో ఉన్న అసహనం ఎటుపోయిందో తెలీదు..ఆయన అక్కడ జరుగుతున్న తంతును అత్యంత భక్తిగా చూడసాగారు..అర్చకస్వాములు పలుకుతున్న మంత్రాలను శ్రద్ధగా వినసాగారు..పూజ అనంతరం..పల్లకీని శ్రీ స్వామివారి మందిరం చుట్టూరా మూడు మార్లు ప్రదక్షిణగా త్రిప్పుతారు..ఆ సమయం లో పల్లకీ మోయడానికి ముందుగా పేర్లు నమోదు చేసుకొని, పూజలో కూర్చున్న వారికి ప్రాధాన్యత ఇస్తారు..ఆ క్రమంలో భాగంగా పూజలో కూర్చున్న లక్ష్మణరావు గారిని కూడా రమ్మనమని అర్చకస్వాములు చెప్పారు..మారు మాట్లాడకుండా లక్ష్మణరావు గారు పల్లకీని మోయడానికి సిద్ధపడ్డారు..ఆయన భార్య అవాక్కైపోయి చూస్తున్నది..ఇంతవరకూ తనను తిట్టిపోసిన తన భర్త..ఇప్పుడు ఈరకంగా అందరికంటే ముందుగా తయారైపోవడం ఆవిడకు అర్ధం కాలేదు..అంతా ఆ  దత్తుడి దయ అని అనుకున్నది..


మూడు ప్రదక్షిణాలు పూర్తయ్యేదాకా లక్ష్మణరావు పల్లకీని మోసారు.. అంతా అయిపోయి ప్రసాదం తీసుకొని నేరుగా నాదగ్గరకు ఆ దంపతులు వచ్చారు.

"పల్లకీ సేవ లో పాల్గొనడం నేను ఎప్పుడో చేసుకున్న పుణ్యం అండీ..నాకు ఈరోజు ఆ భాగ్యం కలిగింది..నిజానికి నేను చాలా విసుగుతో వున్నాను..మరి క్షణాల్లో నా మనసు మారిపోయింది..ఎలా జరిగిందో నాకూ అర్ధం కాలేదండీ..శ్రీ స్వామివారు నన్ను కరుణించారు అని మాత్రం చెప్పగలను..వీలున్నప్పుడల్లా నేను నా భార్య ఇద్దరం వచ్చి..ఈ పల్లకీసేవ లో పాల్గొంటాము..నాకున్న అపోహలన్నీ పటాపంచలై పోయాయి.." అన్నారు..


లక్ష్మణరావు గారు ఆ ప్రక్కరోజు ఉదయం శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..తిరిగి హైదరాబాద్ వెళ్లారు..ఈ సంఘటన జరిగి సుమారు మూడు సంవత్సరాలు అయింది..ఈ మూడేళ్ళలో ఆ దంపతులు కనీసం ఐదారు సార్లు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి..పల్లకీసేవ లో పాల్గొన్నారు..ఆయనలో మార్పు రావడానికి శ్రీ స్వామివారు ఏమి చేసారో..వారిద్దరికే తెలియాలి..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*





సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

పంచాంగం 21.01.2024

 ఈ రోజు పంచాంగం 21.01.2024

Sunday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం హేమన్త ఋతు పుష్య మాస శుక్ల పక్ష: ఏకాదశి తిధి భాను వాసర: రోహిణీ  

 నక్షత్రం శుక్ల యోగ: వణిజ తదుపరి భద్ర కరణం. ఇది ఈరోజు పంచాంగం.


ఏకాదశి రాత్రి 07:29 వరకు.

రోహిణి రాత్రి 03:52 వరకు.

సూర్యోదయం : 06:53

సూర్యాస్తమయం : 06:01


వర్జ్యం : రాత్రి 07:38 నుండి 09:17 వరకు.


దుర్ముహూర్తం : సాయంత్రం 04:32 నుండి 05:16 వరకు.


అమృత ఘడియలు : రాత్రి 12:34 నుండి 02:13 వరకు.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

రాశి ఫలితాలు

 *శుభోదయం*

16.2291923113

*****

21-01-2024

భాను వాసరః (ఆదివారం )

రాశి ఫలితాలు

XXXXX

మేషం

మాతృ సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. రావలసిన ధనం చేతికందడంలో  ఆలస్యం అవుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు ఫలించవు.

------------------------------------

వృషభం

చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. ధన వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో  సోదరుల సహాయ సహకారాలు అందుతాయి.

---------------------------------------

మిధునం

వ్యాపారాలు  సామాన్యంగా సాగుతాయి. గృహమున కొందరు మాటలు మానసికంగా చికాకు పరుస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. బందు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.

---------------------------------------

కర్కాటకం

దూరప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు  తగిన ఫలితం పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగమున  అనుగ్రహం పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.  సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

---------------------------------------

సింహం

ఉద్యోగమున అదనపు పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.

--------------------------------------

కన్య

కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో  చురుకుగా పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగమున  అనుకూల వాతావరణం ఉంటుంది. పదోన్నతులు పెరుగుతాయి. గృహమున సంతాన వివాహ విషయమైన ప్రస్తావన వస్తుంది. కొన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి.

---------------------------------------

తుల

నిరుద్యోగులు కొంత కష్టం మీద నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది.

--------------------------------------

వృశ్చికం

 కుటుంబ సభ్యుల మధ్య  అవగాహన లోపించి మనస్పర్ధలు కలుగుతాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో  కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.

---------------------------------------

ధనస్సు

ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. దాయాదులతో స్థిరాస్తి  తగాదాలు ఉంటాయి.  సంతానం విద్యా విషయాల నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాల  పట్ల ఆశక్తి పెరుగుతుంది.

--------------------------------------

మకరం

భూ క్రయ విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ఒక వ్యవహారంలో సోదరులతో విభేదిస్తారు. ఉద్యోగాల్లో ఇతరుల నుండి  విమర్శలు తప్పవు. వృధా ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి.  చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు.

-----------------------------------

కుంభం

సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సఖ్యతగా వ్యవహరించి పనులు పూర్తిచేస్తారు.  నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇతరుల  సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

---------------------------------------

మీనం

భూ సంభందిత వ్యవహారాలలో తగాదాలు చికాకు పరుస్తాయి. సంతానంతో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలు మిశ్రమ ఫలితాలుంటాయి.  దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఆర్ధిక లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాలలో భాగస్తులు నుండి ఒత్తిడి పెరుగుతుంది.

---------------------------------------

సంకల్పము

 *శుభోదయం*

**********

సంధ్యా వందన 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.21.01.2024 

ఆది వారం (భాను వాసరే) 

**********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

హేమంతృతౌ

పౌష్య మాసే శుక్ల పక్షే ఏకాదశ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భాను వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

*ఇతర పూజలకు*

*శ్రీ శోభకృత్  నామ సంవత్సరే ఉత్తరాయణే*

*హేమంతృతౌ పౌష్య మాసే  శుక్ల పక్షే*

*ఏకాదశ్యాం*

*భాను వాసరే అని చెప్పుకోవాలి*.


*ఇతర ఉపయుక్త విషయాలు*

సూ.ఉ.6.38

సూ.అ.5.44

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*ఉత్తరాయణ పుణ్యకాలం శరత్ ఋతువు*

*పుష్య మాసం *

*శుక్ల పక్షం ఏకాదశి రా.9.12 వరకు*.

*ఆది వారం*. 

నక్షత్రం రోహిణి

రా. తె. 5.28:వరకు. 

అమృతం  రా.తె.2.18 ల 3.53 వరకు. 

దుర్ముహూర్తం సా. 4.15 ల 5.00 వరకు.

వర్జ్యం రా. 9.32 ల 11.07 వరకు. 

యోగం శుక్లం ప. 12.00 వరకు. 

కరణం వనజి ప.9.39 వరకు.   

కరణం భద్ర రా. 9.12. వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం సా. 4.30 ల 6.00 వరకు. 

గుళిక కాలం మ. 3.00 ల 4.30 వరకు. 

యమగండ కాలం మ.12.00 ల 1.30 వరకు. 

---////----////---////---////---

పుణ్యతిధి పుష్య శుధ్ధ ఏకాదశి. 

*********************

బ్రాహ్మణ వధూవరుల వివరాలకై సంప్రదించండి:-

*శ్రీ పద్మావతి శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ*, 

(రి.జి.నెం.556/2013)

S2 - C 92, 6 - 3 -1599/92,

సచివాలయనగర్,వనస్థలిపురం,

హైదరాబాద్ 500 070.

ఫోన్(చరవాణి) నెం.

*8019566579/9848751577*

****

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

.