10, మార్చి 2025, సోమవారం

కడుపునొప్పులు

 3 రోజుల్లో అన్నిరకాల కడుపునొప్పులు హరించుట కొరకు సులభ ఔషదం - 


 పొంగించిన ఇంగువ రెండున్నర గ్రాములు , సైన్ధవ లవణం అరతులము రెండూ కలిపి మెత్తగా నూరి మూడు పొట్లాలు కట్టి ఉదయాన్నే పరగడుపున ఒక పొట్లం మధ్యాన్నం ఒక పొట్లం ,సాయంత్రం  ఆహారానికి గంట ముందు ఒక పొట్లం మంచినీటి అనుపానంతో పుచ్చుకున్న యెడల కడుపు నొప్పులు మూడు రోజుల్లొ హరించును . ఇలా మూడు రోజులకు 9 పొట్లాలు సరిపోవును. 


 గమనిక - 


    ఇంగువని ఒక గుంట గంటె లో వేసి వేడి చేసిన అది పొంగి శుద్ది అగును . దానిని అప్పుడు మాత్రమే ఔషధాల్లో వాడవలెను . 


మరిన్ని అనుభవపూర్వక, రహస్య ఆయుర్వేద ఔషధ యోగాలు గురించి మరింత వివరణాత్మక సమాచారం నా గ్రంధాల యందు వివరించాను. వాటిని క్షుణ్ణముగా చదవగలరు.


గమనిక  ~ 


నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

శ్రీ కాళహస్తీశ్వరా

 శు  భో  ద  యం 🙏


శ్రీ కాళహస్తీశ్వరా!


మ.

భసితోద్ధూళనధూసరాంగులు, జటాభారోత్తమాంగుల్, తపో

వ్యసనుల్, సాధిత పంచవర్ణరససుల్, వైరాగ్యవంతుల్, నితాం

తసుఖస్వాంతులు, సత్యభాషణసముద్యద్రత్నరుద్రాక్షరా

జిసమేతుల్ తుద నెవ్వరైన గొలుతున్ శ్రీకాళహస్తీశ్వరా!

-ధూర్జటి:కాళహస్తీశ్వరశతకం:102 పద్యం.

భావం: పరమశివుని భక్తులెవరైననూ సరియే వారిని సేవింతునని పరమేశ్వరునకు కవితెలుపుచున్నాడు.ఇది భక్తనకు ఉండవలసిన ప్రధమలక్షణం.

     దేవుడెవరైనగానీ వారికి తమభక్తులయెడ అపారమైన కరుణకలిగియుండుట సహజము. భక్తులనారాధించిన వానిపై భగవంతునకు అనుగ్రహముకలుగును.

       ధూర్జటి శివభక్తుడు.పరమేశ్వరభక్తులందరూ అతనికారాధ్యులే!

మరి యాభక్తులను గుర్తించుటయెట్లు?ఈపద్యమున దానినే కవి మనవిచేయుచున్నాడు.

    శరీమున విభూతి పూతలతో నిండినవారు,జటాధారులు,తపోవ్యసనులు,పంచాక్షరీ మంత్రసాధకులు,విరాగులు,నిత్యానందపరాయణులు,

నిత్యసత్యభాషణులు,అజినాదితపోపరికరయుక్తులు ఎవ్నరైననూ వారిని సేవింతును స్వామీ!నన్ననుగ్రహింపుమనుచున్నాడు.

    పరోక్షముగా నాటి శైవులు పాటించు జంగమార్చనా విధానమును ధూర్జటి సూచించుచున్నాడు.

                        స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

*ప్రియ బాంధవా మేలుకో 5*

 *ప్రియ బాంధవా మేలుకో 5*




గత వ్యాసాలలో నల్ల బజారు బడా బాబుల మరియు *ద్రవ్యోల్బణం* గురించి వివరాలు తెలుసుకున్నాము. దేశం ఎలా ఉంటే మాకేంటి *మేము, మా  పిల్లలు బాగున్నారు కదా యని సమాజంలో అధిక శాతం ప్రజలనుకుంటూ ఉంటారు,* అనుకుంటూనే ఉన్నారు కూడా.


నల్ల బజారు వ్యవహారాలు మరియు ద్రవ్యోల్బణము వలన దేశ ఆర్థిక వ్యవస్థ, సంబంధిత అంశాలన్ని ఇబ్బందులకు గురవుతూ ఉంటాయి. సదరు పరిస్థితులను సమతుల్యం చేయడానికి పాలకులు/ప్రభుత్వం  ఆదాయం పెంచడం కోసం పన్నులు పెంచాల్సి ఉంటుంది. *సదరు పన్నుల వలన ప్రజలపై మరింత భారం పడుతుంది*. 


మన దేశంలో స్థానిక, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పన్నులు ఇంకా మరెన్నో పన్నులు.

సౌలభ్యం కోసం పన్నులను రెండు రకాలుగా విభజిద్దాము....ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులు. మరింత విపులంగా పన్నుల వివరాలలోకి వెళ్లు అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు అప్రస్తుతము. భారత దేశానికి స్వపరిపాలన వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత గూడా ప్రస్తుతమున్న అసంగతాల గురించి ప్రస్తావించుకుంటున్నాము. 


పన్నుల దుర్దశ లేని దేశాలు ఉండవు కదా ఇది మామూలే అని అనుకోవడానికి వీలులేదు. ప్రపంచంలో కొన్ని దేశాలలో, కొన్ని ప్రదేశాలలో ప్రజలపై పన్నుపోటు ముఖ్యంగా ఆదాయపు పన్ను పోటు ఉండదు, అయినా ఆ ప్రాంత  అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి లోటు ఉండదు. పన్నులు లేకున్నా ఖజానా పై వత్తిడి ఉండదు. అన్ని వర్గాల ప్రజలకు సామాజిక భద్రత ఉంటుంది. సామాజిక అవసరాల రూపకల్పనకు, నిర్వహణకు పన్నులు అవసరమే. పన్నులలో ముఖ్యంగా ఆదాయము పై పన్నును కష్టంగా భావిస్తారు ప్రజలు. *పలు రకాల పన్నులు ఎలాగు చెల్లిస్తున్నాము, మళ్ళీ ఆదాయంపై పన్నులా అని ప్రజలు విసుక్కునే అవకాశము ఎక్కువ*. 


ఆదాయపు పన్ను లేని దేశాలలో ముఖ్యంగా గల్ఫ్ దేశాల పేర్లు చెప్పుకోవాలి.... సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్, ఎమిరేట్స్, కువైట్, ఖతర్, ఒమన్, బహైన్ మరియు ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల పరిధిలోని కేయన్ ఐలాండ్స్, బెర్ముడా, బహమాస్, అంగ్విలా, సెయింట్ కిట్స్, నివిస్ బ్రిటిష్ ఈలాంటి దేశాలు , ప్రదేశాలు ఎన్నెన్నో. ఉత్తర కొరియా దేశం 1974 లోనే అన్ని పన్నులు రద్దు చేసింది. 


ప్రపంచం చుట్టి రావడమెందుకంటే, అన్ని దేశాలలో ప్రజలు కూడా మన దేశంలోని అధిక శాతం జనాభాలాగే నిస్సత్తువగా, నిరస్త్రాణగా, దేశ కాల పరిస్థితులపై అవగాహన మరియు శ్రద్ధ చూపెట్టకుండా, తాము మాత్రమే బాగుంటే చాలు అని అనుకోరు, *అని తెలుసుకోవడానికి*. 


శ్రద్ధగా *నిరంతరం ప్రజలు తమ బాగోగులతో పాటు  దేశ, కాల పరిస్థితులను మరియు ప్రభుత్వ పాలనా సామర్థ్యాన్ని,  సాంఘికాభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలను, చర్యలను, దేశ భద్రతను గమనిస్తూ ఉండాలని, ప్రజలు చైతన్య దృష్టి అలవర్చుకోవాలని*, ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే అక్రమాల పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేయాలి, అక్రమాలని నిరోధించాలని ఈ వ్యాస పరంపర అభిమతము.


ధన్యవాదములు

*(సశేషం)*

10.03.2025,సోమవారం

 *🙏జై శ్రీమన్నారాయణ🙏*

10.03.2025,సోమవారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయనం - శిశిర ఋతువు

ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం

తిథి:ఏకాదశి ఉ9.52 వరకు

వారం:ఇందువాసరే  (సోమవారం)

నక్షత్రం:పుష్యమి రా2.32 వరకు

యోగం:శోభన మ3.58 వరకు

కరణం:భద్ర ఉ9.52 వరకు

తదుపరి బవ రా9.41 వరకు

వర్జ్యం:ఉ10.25 - 12.03

దుర్ముహూర్తము:మ12.34 - 1.21

మరల మ2.55 - 3.42

అమృతకాలం:రా8.05 - 9.42

రాహుకాలం:ఉ7.30 - 9.00

యమగండ/కేతుకాలం:ఉ10.30 - 12.00

సూర్యరాశి:కుంభం

చంద్రరాశి: కర్కాటకం

సూర్యోదయం:6.17

సూర్యాస్తమయం: 6.04


సంకల్పం అంటే.. 'చేయదలచుకున్న పనిని మనసా వాచా కర్మణా నమ్మి పూర్తి చేయగలగడం' అంటారు దైవజ్ఞులు. ఆ పని ఐహికమైన అభివృద్ధి కావచ్చు.. ఆధ్యాత్మికమైన సాధన కావచ్చు! 'సంకల్పం అనేది ఆత్మ మనస్సుల సంగమం' అంటారు స్వామి వివేకానంద. మనిషి ఆధ్యాత్మిక సాధనలో భగవంతుడి ప్రేమ అపారంగా పొందాలంటే, తనను తాను అన్నివిధాలా తీర్చిదిద్దుకోవాలి. ఎటువంటి అడ్డంకులు ఎదురైనా త్రికరణ శుద్ధిగా అధిగమించాలి. ‘తలపుల్లోగాని, వాక్కుతోగాని, చేష్టలతోగాని, ఏ ప్రాణికి అపకారం తలపెట్టను' అని మనసులో ప్రమాణం చేయాలి. 'సర్వశక్తిమంతుడు, సర్వవిదుడు, ప్రేమ సింధువు అయిన ఆ అంతర్యామిలో నేనొక భాగమనే భావనతో ఈరోజును ప్రారంభిస్తున్నాను' అని సంకల్పం చెప్పుకోవాలి. అలా ప్రతిరోజు చేయడం వల్ల ఆధ్యాత్మిక సాధనలో సాధకుడు మరో మెట్టు ఎక్కుతూ ఉంటాడు. ఆ భగవంతుడి దయకు పాత్రుడవుతూ ఉంటాడు. సంకల్పం వల్ల  ఆలోచనలకు స్థిరత్వం సిద్ధిస్తుంది. మనం సంకల్పించిన ధ్యేయం దగ్గరవుతుంది...

10.03.2025

 🕉️🌓 10.03.2025


🪔 శ్రీ పద్మాగోవిందాయనమః 🪔


కలియుగం: 5126


విక్రమ సంవత్సరం: 2081 పింగళ


శక సంవత్సరం: 1946 క్రోధి


🌿 ఆమలక‌ జనార్ధన పూజ 🌿


💫 దగ్ధయోగము 💫


🎉 కొరుకొండ‌ శ్రీ లక్ష్మీనృసింహ

 స్వామి తిరునాళ్ళు 🎉


🎈 రంగ్‌బరి‌ ఏకాదశి 🎈


🪄 కాశీ విశ్వనాథ శృంగార

ఉత్సవం 🪄


🎊 వెలిచెల‌ శ్రీ లక్ష్మీ నరసింహ

 స్వామి కల్యాణోత్సవం 🎊


🚩 శ్రీ గులాబ్‌పూరి‌ మహారాజ్

పుణ్యతిథి 🚩


🎋 బలిజిపేట శ్రీ వేంకటేశ్వర

 స్వామి కల్యాణోత్సవం 🎋


🎉 ఉప్మాక‌ శ్రీ వేంకటేశ్వర

స్వామి కల్యాణోత్సవం 🎉


🎊 తిరుపోరూర్ శ్రీ మురుగన్

ఉత్సవారంభం 🎊


🔯

ఓం నమో భగవతే రుద్రాయ

 ఓం నమో భగవతే రుద్రాయ, శంభవే నమః

నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ

మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాఙ్ఞికాలాయ 

కాలాఙ్ఞి రుద్రాయ నీలకంఠాయ

మృత్యుంజయాయ సర్వేశ్వరాయ

సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః


చంద్రచూడ శివశంకర పార్వతిరమణనె 

నినగె నమో నమో

సుందరతర పినాకధర హర గంగాధర గజచర్మాంబరధర

||చంద్రచూడ||


ధరగె దక్షిణకావేరీ కుంభపుర వాసనునీనే

కరదలి వీణెయ గానవ మాడువ

ఉరగభూషణను నీనె

కొరళలి భస్మ రుద్రాక్షవ ధరిసిద పరమ వైష్ణవను నీనె

గరుడగమన నమ్మ పురంధర విఠలన 

ప్రాణ ప్రియను నీనె

||చంద్రచూడ||


                     - పురందర దాసు

            గానం - రఘురాం మణికందన్

దూరేణ హ్యవరం

 2.49

*దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ ।*

*బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః ।। 49 ।।*

दूरेण ह्यवरं कर्म बुद्धियोगाद्धनञ्जय |

बुद्धौ शरणमन्विच्छ कृपणा: फलहेतव: || 49||


దూరేణ — (త్యజించు) దూరము నుండే; హి — నిజముగా; అవరం — నిమ్న స్థాయి లోనున్న; కర్మ — ఫలాపేక్షతో చేసే పనులు; బుద్ధి-యోగాత్ — దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము నందే బుద్ధి స్థిరముగా ఉంచి; ధనంజయ — అర్జునా; బుద్ధౌ — ఆధ్యాత్మిక జ్ఞానము, ఆంతర-దృష్టి; శరణం — ఆశ్రయం(శరణము); అన్విచ్ఛ — వెదుకుము; కృపణాః — లోభి/పిసినారి; ఫల-హేతవః — కర్మ ఫలములను ఆశించేవారు.


*BG 2.49 : దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించుము, ఓ అర్జునా, ఫలాపేక్షతో చేసే పనులను త్యజించుము; బుద్ధిని ఆధ్యాత్మిక దివ్యజ్ఞానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా, అవి నిమ్న స్థాయికి చెందినవి. తమ కర్మ ఫలములను తామే భోగించగోరే వారు లోభులు/పిసినారులు.*


*వ్యాఖ్యానం*


పనికి రెండు దృష్టికోణాలున్నాయి: 1) మనం బాహ్యంగా చేసే క్రియ 2) దాని పట్ల మన అంతర్గతంగా ఉన్న దృక్పథం. ఉదాహరణకి బృందావన పుణ్యక్షేత్రంలో ఒక దేవాలయం కడుతున్నారనుకోండి. అక్కడి పనివారు ఒక పుణ్య కార్యంలో పాలుపంచుకున్నట్టే, కానీ వారి దృక్పథం ప్రాపంచికమైనది. వారికి వారి జీతం గురించే ఆలోచన. మరొక కాంట్రాక్టర్ ఎక్కువ జీతం ఇస్తానంటే, ఆ కొత్త యజమాని దగ్గరికి వెళ్లడానికి వెనుకాడరు. అక్కడే బృందావనంలో ఉన్న ఒక సాధువు, ఒక గొప్ప గుడి కడుతున్నారని చూసి, భగవత్ సేవ లాగా, 'కర సేవ' (స్వచ్చంద పని) చేస్తాడు. బాహ్యంగా సాధువు చేసే పని, ఆ పనివారు చేసేపని ఒక్కటే అయినా, వారి అంతర్గత దృక్పథంలో చాలా తేడా ఉంది.

ఇక్కడ అర్జునుడికి ఉత్తమమైన ఆంతరంగిక దృక్పథం పెంచుకోమని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. స్వీయ-భోగం కోసం పనులు చేసేవారు పిసినారులు. ఫలములపై ఆశ త్యజించి తమ పనులన్నీ భగవత్ అర్పితం చేసినవారు ఉత్తములు. కర్మ ఫలములను భగవత్ అర్పితం చేసినవారు నిజమైన జ్ఞానం కలిగినవారు.

'కృపణ' (పిసినారి) అన్న పదం ఇక్కడ వాడబడింది. శ్రీమద్ భాగవతం, 'కృపణ' అంటే ఇలా నిర్వచించింది:

న వేద కృపణః శ్రేయ ఆత్మనో గుణ-వస్తు-దృక్

‘భౌతిక ప్రకృతి శక్తి నుండి ఉద్భవించిన ఇంద్రియ విషయములే పరమ సత్యం అని అనుకునే వారే కృపణులు’. మరల శ్రీమద్భాగవతం ఇలా అంటుంది: “కృపణో యో ఽఅజితేంద్రియః’ (11.19.44) ‘ఇంద్రియములపై ఎలాంటి అదుపు లేని వాడే కృపణుడు.’

ఒక వ్యక్తి విజ్ఞాన పై-స్థాయికి వెళ్ళే కొద్దీ, సహజంగానే కర్మ ఫలాలని అనుభోగించాలనే కోరిక విడిచిపెట్టి, సేవా దృక్పథం వైపు వెళతాడు. మైక్రోసాఫ్ట్ సంస్థలో తన పదవీత్యాగం చేసిన తరువాత ఇప్పుడు బిల్ గేట్స్, తన శక్తి సామర్ధ్యాలని సమాజ-సేవ లో వినియోగిస్తున్నాడు. అదే విధంగా, అమెరికా అధ్యక్షుడిగా తన హోదా, అధికారము పూర్తయిన తరువాత, బిల్ క్లింటన్, మానవ సమాజ సేవ యొక్క వైభవాన్ని బోధిస్తున్నాడు, ఇంకా ఆ విషయంపై ఒక పుస్తకం ‘గివింగ్ — హౌ ఈచ్ ఆఫ్ అస్ కెన్ ఛేంజ్ ద వరల్డ్’ (Giving — How Each Of Us Can Change The World.) కూడా రాసాడు. వారి సేవా దృక్పథం పొగడదగినదే, కానీ అది సరిగ్గా ఇంకా సరియైన దిశలో లేదు. మనం చేసే పనులు భగవంతుని ప్రీతి కోసం, భగవత్ అర్పితంగా చేయటం నేర్చుకున్నట్లయితే, ఆ సేవా దృక్పథం లోప (దోష) రహితమవుతుంది.


ఒరిజినల్ ఇంగ్లీష్ మూలం ఇక్కడ చూడండి: https://www.holy-bhagavad-gita.org//chapter/2/verse/49

ఊసరవెల్లి ఆత్మహత్య

 ఊ🙏🕉️శ్రీమాత్రేనమః శుభోదయం🕉️🙏            🔥 *ఊసరవెల్లి ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన వచ్చే ముందు చెట్టు పై ఇలా రాసిందట..రంగులు మార్చడంలో మనిషితో పోటీ పడలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను అని బాధతో రాసింది* 🔥రెక్కలోచ్చాయి కదా అని ఆకాశమంతా నాదే అనుకోకూడదు.. రెక్కలు అలిశాక దిగాల్సింది నేల మీదనే.. చేరాల్సింది సొంత గూటికి.. సంతోషమైనా దుఃఖమైనా పంచుకోవాల్సిందే మన అనే బంధంతోనే మరచిపోరాదు🔥జీవితంలో మనం నడిచి వచ్చిన దారిని ఎక్కివచ్చిన మెట్లుని ఎప్పటికి మరువకూడదు.. అలా మరిచావంటే నీ ఆనవాళ్ళు నీ చేతితోనే తుడిచినట్లు అవుతుంది..బుద్దిని ఉన్నత విషయాలలో అద్వితీయ మైన ఆదర్శలతో నింపుకొండి.. రేయింబవళ్లు మంచి ఆలోచనలతో కొనసాగించండి.. అప్పుడు అంతా మంచి జరుగుతుంది🔥🔥మీ                     *అల్లంరాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయి పోయిన వారు రాలేని వారు కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా మందులు పంపబడును9440893594* 🙏🙏🙏

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: రెండవ అధ్యాయం

సాంఖ్యయోగం: శ్రీభగవానువాచ


రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ 

ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి (64)


ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే 

ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే (65)


మనసును నిగ్రహించుకుని రాగద్వేషాలు లేకుండా తన అదుపాజ్ఞలలో వున్న ఇంద్రియాల వల్ల విషయసుఖాలు అనుభవించేవాడు మనశ్శాంతి పొందుతాడు. మనస్సు నిర్మలమైతే సమస్త దుఃఖాలూ సమసిపోతాయి. మనసు నిర్మలంగా వున్నవాడి ప్రజ్ఞకు చలనం లేదు.

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝   *ఆతురే నియమో నాస్తి,*

 *బాలే వృద్ధ తథైవచ*

         *సదాచారరతే చైవ*

 *హ్యేష ధర్మ స్సనాతనః*


తా𝕝𝕝 *రోగి, బాలుడు, వృద్ధులు, సదాచారి ( సదా ధర్మమును ఆచరించు వాడు ) వీరికి ఆచారనియమములు వర్తించవు. ఇది సనాతన ధర్మము. అంటే వీరు ఉపవాసాలు, జాగరణలు మొదలైన ఆచారాలు పాటించ నవసరం లేదు.*  🪷🌻🌿


 ✍️🌹💐🌸🙏

శ్రీ పూర్ణత్రయీశ దేవాలయం

 🕉 మన గుడి : నెం 1045


⚜ కేరళ : త్రిపురాంతర - కొచ్చి 


⚜ శ్రీ పూర్ణత్రయీశ దేవాలయం



💠 శ్రీ పూర్ణత్రయేశ దేవాలయం కొచ్చిలోని త్రిప్పునితురలో ఉన్న ఈ ఆలయం కేరళలోని గొప్ప దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది 


💠 ప్రధాన దైవం విష్ణువు సంతాన గోపాల మూర్తి లేదా పూర్ణత్రయీశ. సంతానం లేని దంపతులు పూర్ణత్రేశుడిని పూజిస్తే సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు


💠 ఇతర విష్ణు దేవాలయాల మాదిరిగా కాకుండా ఇది ఒక ప్రత్యేకమైన భంగిమ, ఇక్కడ భగవంతుడు సాధారణంగా దివ్య సర్పమైన అనంతపై శయన భంగిమలో కూర్చుని కనిపిస్తాడు. విష్ణువు యొక్క రెండు పై చేతులు శంకు మరియు సుదర్శన చక్రం మరియు దిగువ కుడి చేతి పద్మం (తామరపువ్వు) కలిగి ఉంటాయి.


💠 పూర్ణత్రయీశ అనే పేరు ఈ క్రింది విధంగా నిర్వచించబడింది, "త్ర" అంటే మూడు; 'పూర్ణ' అంటే పూర్తి మరియు 'ఈశ ' అంటే ఈశ్వరుడు అంటే జ్ఞానానికి ప్రభువు లేదా మూడు వేదాలకు ప్రభువు - ఋగ్, యజు మరియు సామవేదాల సారాంశంగా తనను తాను వ్యక్తపరిచే భగవంతుడు అని కూడా అర్థం, అతను అంతర్గత సాధన ద్వారా సాధించబడగలడు.


🔆 చరిత్ర


💠 ఒకానొకప్పుడు ద్వాపర యుగంలో ఒక బ్రాహ్మణుని భార్య ఒక బిడ్డకు జన్మనిచ్చింది. 

అయితే, దురదృష్టవశాత్తూ, పుట్టి నేలను తాకిన వెంటనే బిడ్డ మరణించింది.


💠 తన బిడ్డ అకాల మరణంతో బ్రాహ్మణుడు చాలా కలత చెందాడు. 

రాజుగారి తప్పేమీ లేకపోయినా, బిడ్డ చనిపోయిన బ్రాహ్మణుడు వెంటనే రాజభవనం తలుపు దగ్గరకు వెళ్లి రాజును నిందించటం మొదలుపెట్టాడు.


💠 బ్రాహ్మణుడు రాజు యొక్క అనర్హత కారణంగా తన కొత్తగా జన్మించిన శిశువు చనిపోయిందని రాజును ఆరోపించాడు. 

బ్రాహ్మణుడు దానిని చాలా అసహజంగా తీసుకున్నాడు, అందువల్ల అతను రాజును బాధ్యుడని చెప్పాడు.


(ఆధునిక రాజకీయాల్లో చక్రవర్తి పదవిని రద్దు చేసినప్పటికీ, పౌరుల సౌకర్యాలకు రాష్ట్రపతి బాధ్యత వహించడు. )


💠 బ్రాహ్మణుని రెండవ బిడ్డ కూడా చనిపోయాడు, మూడవది కూడా. అతనికి తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు, మరియు వారిలో ప్రతి ఒక్కరూ చనిపోయి జన్మించారు, మరియు ప్రతిసారీ అతను రాజును నిందించడానికి రాజభవన ద్వారం వద్దకు వచ్చాడు. 

తొమ్మిదవసారి ద్వారక రాజును నిందించడానికి బ్రాహ్మణుడు వచ్చినప్పుడు, అర్జునుడు కృష్ణుడితో కలిసి ఉన్నాడు. 


💠 అర్జునుడుతో బ్రాహ్మణుడు ఇలా జవాబిచ్చాడు, “నా ప్రియమైన అర్జునా, బలరాముడు ఉన్నాడు, కాని అతను నా పిల్లలకు రక్షణ ఇవ్వలేకపోయాడు. 

శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు, కానీ అతను కూడా వారికి రక్షణ కల్పించలేకపోయాడు. 

ప్రద్యుమ్నుడు మరియు అనిరుద్ధుడు వంటి అనేక ఇతర వీరులు కూడా ఉన్నారు, వారు విల్లు మరియు బాణాలు కలిగి ఉన్నారు, కాని వారు నా పిల్లలను రక్షించలేకపోయారు. 


💠 పరమాత్మునికి అసాధ్యమైన పనిని అర్జునుడు చేయలేడని బ్రాహ్మణుడు సూటిగా సూచించాడు.

 అర్జునుడు తన శక్తికి మించిన వాగ్దానం చేస్తున్నాడని భావించాడు. 


💠 బ్రాహ్మణుని 10 మంది పిల్లలకు పునర్జన్మ ఇవ్వాలని భగవంతుని సహాయం కోరినప్పుడు విష్ణువు అర్జునుడికి శ్రీ పూర్ణత్రయీశ విగ్రహాన్ని సమర్పించాడు 


💠 పునర్జన్మ ఇవ్వబడిన పది మంది పిల్లలను మరియు పవిత్ర విగ్రహాన్ని అర్జునుడు తన రథంలో తీసుకువెళ్లాడు మరియు అతను బ్రాహ్మణుడికి పిల్లలను అప్పగించాడు. ఈ సంఘటన జ్ఞాపకార్థం, రథం రూపంలో గర్భగుడితో ఆలయం నిర్మించబడింది. 


🔆 పండుగలు


💠 అంబలమ్ కతి ఉల్సవం ఈ సంఘటనను గుర్తుచేసుకునే ఒక ప్రత్యేకమైన పండుగ. 

తులం మాసంలో వచ్చే ఈ ప్రత్యేకమైన రోజున వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుంటారు. 


💠 సాయంత్రం దీపారాధన అనంతరం ఆలయం చుట్టూ ఏర్పాటు చేసిన కర్పూరం దహనం చేశారు.

 దీపాలన్నీ వెలిగించి, గుడి మొత్తం మంటల్లో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.


💠 ఈ ఆలయంలో నవంబర్ చివరిలో జరిగే వృశ్చికోల్సవం ప్రధాన పండుగ . 

వృశ్చిక ఉల్సవం అనేది సాధారణంగా ప్రతి నవంబర్-డిసెంబరులో ప్రారంభమయ్యే పండుగ.

 ఎనిమిది రోజుల పాటు ఈ పండుగ జరుగుతుంది. 


💠 పూర్ణత్రయీశ జన్మదినం మలయాళ మాసం కుంభం (ఫిబ్రవరి-మార్చి) యొక్క "ఉత్రం" నక్షత్రం నాడు వస్తుంది, దీనికి ముందు పారా ఉత్సవం జరుగుతుంది, ఇక్కడ ప్రజలు ఆలయానికి ప్రత్యేక నైవేద్యాలు ఇస్తారు. 

ప్రతి సంవత్సరం ఆగస్టు-సెప్టెంబర్‌లో, పూర్ణత్రయీశన్ యొక్క దివ్య మూర్తిని తీర్చిదిద్దిన శిల్పి స్మారకార్థం మూషరి ఉత్సవం అని పిలువబడే మరొక పండుగ ఉంటుంది. 

ఇప్పటికీ గర్భగుడిలో ఉపయోగించబడుతున్న పూర్ణత్రయీశ యొక్క అద్భుతమైన అచ్చుకు ప్రాణం పోయడానికి శిల్పి స్వయంగా దైవంతో కలిసిపోయాడని నమ్ముతారు.


💠 పంచలోహంలో మలచిన ఈ విగ్రహం ఒక ప్రత్యేకత కలిగి తూర్పు ముఖంగా ఉంటుంది.  

రోజుకు ఐదు పూజలు అందించబడతాయి మరియు వాటిలో ఒక తంత్రి మాత్రమే నిర్వహించాలి, ఇది తప్పనిసరి.  

ఉపయోగించిన వచనం పులియనూర్ తంత్రం, మరియు పూజ చేసేటప్పుడు ఏనుగు కూడా తప్పనిసరి.


💠 దేవాలయం కొచ్చి నగరానికి ఆగ్నేయంగా 10 కి.మీ దూరంలో త్రిపుణితురలో ఉంది. 


రచన

©️ Santosh Kumar

14-17-గీతా మకరందము

 14-17-గీతా మకరందము

        గుణత్రయవిభాగయోగము


-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - ఆ యా గుణములవలన కలుగు ఫలితములను తెలియజేయుచున్నారు -


సత్త్వాత్సఞ్జాయతే జ్ఞానం 

రజసో లోభ ఏవ చ | 

ప్రమాదమోహౌ తమసో 

భవతోఽజ్ఞాన మేవ చ || 


తాత్పర్యము:- సత్త్వగుణమువలన జ్ఞానము, రజోగుణమువలన లోభము, తమోగుణమువలన అజాగ్రత (మఱపు) భ్రమ, అజ్ఞానము కలుగుచున్నవి.


వ్యాఖ్య:- తత్త్వము బాగుగ దృఢపడుటకొఱకై - ఉపాధ్యాయుడు విద్యార్థికి బోధించిన చందమున - భగవానుడు అర్జునునకు చెప్పినవిషయమునే వివిధరీతుల మఱల మఱల తెలియజెప్పుచున్నారు. లోభము, అజ్ఞానము మున్నగునవి దుఃఖప్రదములు కావున అవాంఛనీయములైనవి. కాబట్టి అవి వేనివలన కలుగునో, అట్టి రజోగుణ, తమోగుణములను దూరీకరించి జ్ఞానదాయకమగు సత్త్వగుణమునే విజ్ఞుడాశ్రయించ వలయును.

ప్రశ్న:- సత్త్వగుణమువలన నేమికలుగును?

ఉత్తరము:- జ్ఞానము. 

ప్రశ్న:- రజోగుణమువలన నేమి కలుగును?

ఉత్తరము: - లోభము. 

ప్రశ్న:- తమోగుణమువలన నేమి కలుగును?

ఉత్తరము:- అజాగ్రత్త (మఱపు), భ్రమ, అజ్ఞానము కలుగును.

తిరుమల సర్వస్వం -173*

 *తిరుమల సర్వస్వం -173*

*శ్రీ హాథీరామ్ బావాజీ 5*

2  ఈ వృత్తాంతాన్నంతా విన్న రాజభటులకు, ఆలయ అధికారులకు బావాజీ చెప్పినదంతా నమ్మశక్యంగా గోచరించలేదు. ఆ హారాన్ని స్వాధీనపరచుకొని, బాబాజీని అప్పటి చంద్రగిరి పాలకుడైన 'గిరిధర రాయలు' వద్ద హాజరు పరిచారు. రాజుగారికి కూడా బావాజీ అదే విషయాన్ని తిరిగి చెప్పాడు. ఇదంతా కట్టుకథగా భావించిన రాజుగారు బాబాజీని గృహనిర్బంధంలో ఉంచి, తదుపరి విచారణ జరుప వలసిందిగా ఆజ్ఞాపించాడు. 


 అయితే, బావాజీ అదే విషయాన్ని పదే పదే నొక్కి చెప్పడంతో తన నిర్దోషిత్వాన్ని నిరూపించు కోవడానికి రాజుగారు ఒక అవకాశం ఇచ్చారు. బావాజీకి స్వామివారితో అంతటి చనువు ఉన్నట్లైతే, తన మహిమను ప్రత్యక్షంగా చూపించాలి. బాబాజీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం కోసం రాజుగారు ఒక పరీక్ష పెట్టారు. దాని ప్రకారం, రాజుగారి ఆజ్ఞ మేరకు బాబాజీని స్వగృహం లో నిర్బంధించి, అందులోనే బండెడు చెరకుగడలను ఉంచారు. మరునాటి ఉదయం లోపు ఆ చెరుకుగడ లన్నింటినీ బాబాజీ తినగలిగితే, వారు చెప్పేది యధార్థమైనట్లు లెక్క! లేకుంటే బాబాజీ తన నేరాన్ని అంగీకరించి, రాజుగారు విధించే శిక్షను అనుభవించాలి. ఆ శిక్ష అత్యంత కఠినంగా ఉండొచ్చు. ఆరోపణ 'దైవద్రోహానికి' సంబంధించినదవ్వడం వల్ల, మరణశిక్ష కూడా పడే అవకాశం ఉంది. ఆ విధమైన షరతు విధించి, ఆశ్రమం తలుపులను మూసివేసి, కొద్దిమంది భటులతో కట్టుదిట్టమైన కాపలా ఉంచి, మిగిలిన వారందరూ నిష్క్రమించారు.


 *గండం గట్టెక్కించిన గజరాజు* 


 బావాజీకి ఏం చేయాలో పాలుపోలేదు. చెయ్యని నేరానికి తనకెందుకీ శిక్ష? ఎందుకీ అగ్నిపరీక్ష ? ఒక్క రాత్రిలో ఆ చెరకుగడల రాశిని భుజించటం మానవమాత్రుడికి సాధ్యమయ్యే పని కాదు. ఆ పని చేయాలంటే కేవలం ఏనుగు వల్లనే సాధ్యం!


 ఆ విధంగా ఆలోచించిన బావాజీ, భగవంతునిపై భారం వేసి, స్వామివారిని స్మరించుకుంటూ నిశ్చింతగా ఆ రాత్రి గడపసాగాడు. ఆ స్వామివారే తనను ఎలాగైనా రక్షించుకుంటారని అతని ప్రగాఢ విశ్వాసం. కొద్దిసేపట్లో, బావాజీ భగవన్నామస్మరణలో ఉండగా ఓ మహాద్భుతం జరిగింది. నిశిరాత్రివేళలో శ్వేతవర్ణంలో ఉన్న, ఐరావతం వంటి మత్తగజం, శరీరమంతా చందన లేపనంతో, నుదుటన తిరునామాలు ధరించి, తలుపులు మూసి ఉన్న గృహంలో ప్రత్యక్షమైంది. బావాజీ ఉద్విగ్నుడై చూస్తూ ఉండగా ఆ మత్తగజం గృహం లోని చెరుకుగడలన్నింటిని తన తొండంతో తీసుకొని, తృప్తిగా ఆరగించి, సారం లేని చెరకు పిప్పిని గుట్టగా పోసింది.


 *రాజుగారి పశ్చాత్తాపం* 


 మదపుటేనుగు ఘీంకారానికి మెలకువ వచ్చిన రాజభటులు ఏనుగు చెరకుగడలను భుజించటం చూసి విస్తుపోయారు. మూసిన గృహద్వారాలు మూసినట్లే ఉండటంతో, నమ్మశక్యం కాని ఈ వింతను రాజు గారికి వివరించారు. ప్రత్యక్ష సాక్షుల ద్వారా ఈ కథనాన్ని వినడంతో జ్ఞానోదయమైన రాజుగారు బాబాజీ చెప్పిన శ్రీవారి పాచికలాట ఉదంతాన్ని విశ్వసించి, అతణ్ణి శ్రీవారి పరమభక్తుడిగా గుర్తించి, బావాజీకి అనుచరుడిగా మారిపోయాడు. అంతటితో, 'గిరిధర రాయలు', 'గిరిధర దాసు' గా మారి, బావాజీకి ప్రథమ శిష్యుడయ్యాడు. బావాజీ ఆశ్రమానికి లెక్కలేనన్ని కానుకలనిచ్చి తన భక్తిని చాటుకున్నాడు. అప్పటి నుండి ఆశారామ్ బలౌత్ 'హాథీరా బాబా' గా వినుతికెక్కారు.


 'హాథీ' అనగా ఏనుగు. ఆయన రామభక్తికి గుర్తుగా 'రాం' అనే పదం, ఉత్తరభారతదేశం లో సాధుపురుషులను సంబోధించే 'బాబా' లేదా 'బావా' అనే పదం వెరసి 'హాథీరామ్ బాబాజీ' గా అవతరించారు.


 ఈ ఉదంతంతో బావాజీ భక్తిప్రపత్తులు లోకప్రసిద్ధమై, వారిని దర్శించుకోవడానికి భక్తులు ఎగబడేవారు. ఉత్తరాది నుండి కూడా భక్తులు వెల్లువెత్తడం మొదలైంది. శ్రీవారి దర్శనానంతరం తప్పనిసరిగా బావాజీ ఆశ్రమానికి వచ్చి, వారిని కూడా భక్తిశ్రద్ధలతో నమస్కరించుకుని, కానుకలు సమర్పించుకునే వారు. అలా భక్తుల విరాళాలతో, రాజుగారి ప్రాపకంతో బాబాజీ ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేపట్టేవారు. దేవాలయానికి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం అనేక దానధర్మాలు నిర్వహించేవారు. బ్రహ్మోత్సవాల వంటి సందర్భాల్లో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు గావించేవారు. ఆ విధంగా భక్తుల విరాళాలతో, రాజుగారి అండదండలతో; అనతికాలంలోనే బాబాజీ నివాసముంటున్న చిన్న ఆశ్రమం ఈనాడు మనం చూస్తున్న పెద్దమఠం గా రూపు దిద్దుకుంది. ఎందరెందరో భక్తులు గృహస్తాశ్రమాన్ని త్యజించి, బావాజీ అనుచరులుగా, శిష్యులుగా మారారు. వారికి ప్రతిరాత్రి, బావాజి ఎవరితోనో సంభాషిస్తున్నట్లు, పాచికలు వేసిన సవ్వడి వినిపించేవి.


 తరువాతి కాలంలో బాబాజీ, తదనంతరం వారి అనుచరులు 'మహంతుమఠం' పేరిట ఒక ధార్మికసంస్థను ఏర్పరచి, దాని ద్వారా ఆలయాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేశారు. ఈ ఆశ్రమంలో నిరాశ్రయులకు, సాధువులు సన్యాసులకు, బైరాగులకు నిత్యాన్నదానం జరిగేది. 'మహంతు' అనే ఉత్తరభారత పదానికి 'సాధువు' లేదా 'సన్యాసి' అని అర్థం. కొందరి కథనం ప్రకారం, బావాజీ వల్లనే శ్రీవేంకటేశ్వరునికి 'బాలాజీ' అనే నామాంతరం వచ్చింది. అయితే, ఈ విషయం ధృవీకరించటానికి బలమైన ఆధారాలు లేవు. దేవాలయంలో పలు ఉత్తరభారత దేశ సాంప్రదాయాలకు మహంతుల కాలం లోనే శ్రీకారం చుట్టబడింది.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము తృతీయాశ్వాసము*


*312 వ రోజు*


*తృతీయాశ్వాసం*


సైంధవుని చంపడానికి శ్రీకృష్ణుడు మార్గం చూపాడు అని విన్న ధృతరాష్ట్రుడు ఉలిక్కిపడ్డాడు. సంజయా ! సైంధవుని పాండవులు నిర్జించారా ! లేక ద్రోణుడు సైంధవుని రక్షించాడా నాకు వివరంగా చెప్పు. సంజయుడు " ధృతరాష్ట్ర మహారాజా ! మరునాడు ధర్మరాజు వంధిమాగధుల స్తోత్రపాఠాలతో నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకుని పూజాధికములు ముగించి దానధర్మములు చేసి ఆ స్థాన మండపముకు వచ్చాడు. అప్పుడు అక్కడకు వచ్చిన శ్రీకృష్ణుని ధర్మరాజు సాదరంగా ఆహ్వానించి ఉచితాసనం చూపించాడు. భీముడు, నకులసహదేవులు, సాత్యకి, ద్రౌపదేయులు, ఘటోత్కచుడు, ద్రుపదుడు, విరాటుడు, కేకయరాజులు మొదలైన వారు వారి ఆసనములు అలంకరించారు. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణునితో " కృష్ణా ! ఇప్పటి వరకు మాకు అన్ని విధాల నీ సహాయ సహకారాలు అందించావు. ఇప్పుడు ఈ ఆపదనుండి మమ్ము నీవే కాపాడాలి " అన్నాడు. శ్రీకృష్ణుడు " ధర్మజా ! ఈ రోజు అర్జునుడు రణరంగమున వీరవిహారం చేసి సైంధవుని వధించుట తధ్యం " అని పలికాడు. ఇంతలో అక్కడకు వచ్చిన అర్జునుడు ముందు రోజు రాత్రి తాను కన్న కలను గురించి సభాసదులకు వివరించాడు. అది విన్న సభికులు విశ్మయమందారు. తరువాత అందరూ యుద్ధసన్నాహాలు చేసారు. శ్రీకృష్ణుడు, అర్జునుడు, సాత్యకి అందరూ కలిసి అర్జునుడి శిబిరానికి వెళ్ళారు. శ్రీకృష్ణుడు రధము ఎక్కి సారధిగా కూర్చున్నాడు. అర్జునుడు రధము ఎక్కి సాత్యకిని చూసి " సాత్యకీ ! మనకు మంచి శకునములు కనపడుతున్నాయి. ఈ రోజు నేను సైంధవుని వధించి నా శపథం నెరవేర్చుకుంటాను. సైంధవవధ ఎంత ముఖ్యమో ధర్మరాజు రక్షణా అంత ముఖ్యమే. ద్రోణాచార్యుని ప్రతిజ్ఞ గురించి మనం ఆలోచించాలి. కనుక నీవు ధర్మరాజు రక్షణ బాధ్యత వహించాలి " అన్నాడు. అర్జునుడి మాట మేర సాత్యకి ధర్మరాజు రక్షణకు వెళ్ళాడు. అని సంజయుడు చెప్పగానే ధృతరాష్ట్రుడు " సంజయా ! కుమారుని మరణం కలిగించిన శోకము కోపమూ కలగలసి మృత్యుదేవతగా వచ్చిన అర్జునుడిని కౌరవులు ఎలా ఎదుర్కొన్నారు. సైంధవుని ఇంట్లో ఆర్తనాదాలు వినపడుతున్నాయి. సంజయా ! నేను, భీష్ముడు, ద్రోణుడు చెప్పిన మాటలు వినక కర్ణుడు, శకుని, దుశ్శాసనుని మాటలు విన్నాడు. సంధి చెడగొట్టాడు తన వాళ్ళందరిని చంపుకుంటున్నాడు. శివుని ఓడించిన అర్జునుడితో వైరం పెట్టుకుంటున్నాడు. శ్రీకృష్ణుని చెలికానితో వైరం వద్దని చెప్పిన రాజ్యం మీద లోభంతో నా మాట వినలేదు. నేను చెయ్యగలిగినది ఏమి ? " అని వగచాడు. సంజయుడు " మహారాజా ! గతజల సేతుబంధన మేలనయ్యా ! మాయా జూదం నాడే నీవు అడ్డుకోవలసింది. సంధి ప్రయత్నంతో వచ్చిన శ్రీకృష్ణుడి మాటను ఆదరించి ఉండ వలసినది. నీ తమ్ముడు పాండురాజు రాజ్యపాలన చేసి విస్తరించిన రాజ్యంలో భాగాన్ని అతడి కుమారులకు ఇవ్వడానికి నీకు అభ్యంతరం ఎందుకు ? నీవు చేసిన పనికి నీ కుమారుని నిందించుట తగునా ! లోకులు నిన్ను లుబ్ధుడు, అధర్మపరుడు అనక ఏమి చేస్తారు. నీ దుర్నీతికి తగిన ఫలితం అనుభవిస్తున్నావు . ఇందుకు కౌరవులేమి చేస్తారు. గాండీవ ఘోష, పాంచజన్య తీవ్ర ధ్వని, కపిధ్వజ రెపరెపలు సహించుటకు దేవతలకు కూడా శక్యము కాదు. ఇక నీ కుమారులు ఎంత!


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు

 🕉 108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు ::

 

     89వ దివ్యదేశము  🕉


🙏 శ్రీ భక్తవత్సల పెరుమల్ ఆలయం, తిరునీంద్రవూర్, 

చెన్నై 🙏


🔅 ప్రధాన దైవం: భక్తవత్సల పెరుమాళ్ (విష్ణువు)

🔅ప్రధాన దేవత: నన్నుగన్నతల్లి

🔅 పుష్కరిణి: వరుణ పుష్కరిణి

🔅 విమానం: శ్రీనివాస విమానము

🔅 ప్రత్యక్షం: వరుణుడు


🔔 స్థలపురాణం 🔔


💠 శ్రీ బక్తవత్సల పెరుమాళ్ ఆలయం చెన్నై శివారులో, తిరునిన్రావూర్ అనే చిన్న పట్టణంలో ఉంది. ఇది 108 దివ్యదేశాలలో ఒకటి. ఈ ప్రదేశం దాని పేరు మహాలక్ష్మి నుండి వచ్చింది - తిరు అంటే లక్ష్మి మరియు నిన్రావూర్ ఆమె ఎప్పటికీ నిలిచే ప్రదేశం. 

ఈ ఆలయంలో మూలవార్ శ్రీ భక్తవత్సల పెరుమాళ్ మరియు ఇక్కడ ఉన్న లక్ష్మీ దేవిని 'ఎన్నై పెట్ర తాయర్' అని పిలుస్తారు.


💠పురాణం ప్రకారం, సముద్రరాజు (మహాసముద్ర రాజు) ఒక బిడ్డ కోసం ఆరాటపడి  మరియు మహాలక్ష్మి దేవి తన కుమార్తెగా జన్మించాలని అతని కోరిక. అతను చాలా సంవత్సరాలు ఆమెను ప్రార్థించాడు, ఆ తర్వాత దేవత అతని ముందు ప్రత్యక్షమై అతని కోరికను తీర్చారు. ఒక రోజు, అతను సముద్రంలో తామర పువ్వు మధ్యలో ఒక అందమైన ఆడపిల్లని కనుగొన్నాడు.

 లక్ష్మీ దేవికి కృతజ్ఞతలు తెలుపుతూ అతను "ఎన్నై పెట్రా తాయే" (నాకు జన్మనిచ్చిన తల్లి) బిడ్డకు ఎన్నై పెట్ర తయార్ అని పేరు పెట్టాడు.


💠 తిరుమంగై ఆళ్వారు ఇచ్చటకు పెరుమాళను దర్శించుటకు వచ్చిన సమయమున శ్రీమహాలక్ష్మితో ముచ్చటించుచున్న పెరుమాళ్ ఆళ్వారు రాకను గమనించ లేదు . 

అంతట తిరుమంగై ఆళ్వారు కోపముతో పెరుమాళ్ పూజ మాత్రమే చేసి మంగళాశాసనము చేయకనే తిరిగిపోయిరి.

పెరుమాళ్ కి ఆళ్వార్ చేత మంగళా శాసనం చేయించుకోవాలి అనే ఆశ... పరమాత్మ ఆళ్వార్ వెనుక పరుగున వెళ్లి....అప్పటికే  మహాబలిపురమున కడల్ మలై  పెరుమాళ్ వద్ద ఉన్న తిరుమంగై ఆళ్వారుని బుజ్జగించి...అచటనే  భక్త వస్థల పెరుమాళ్ గా  దర్శనం ఇచ్చాడు. అప్పుడు ఆనందంతో  తిరుమంగై ఆళ్వార్ ఈ తిరునిణ్ణపూర్ పెరుమాళ్ పై మంగళాశాసనము చేసెను .


💠ఇక్కడి ఆలయ విశిష్టత..ప్రత్యేక లక్ష్మీదేవి పూజ(వ్రతం)


💠 లక్ష్మీ పూజ పేరు సూచించినట్లుగా, ఇది సంపద, శ్రేయస్సు మరియు ప్రపంచంలోని అన్ని సంపదలకు ఆలయం. 

 ఎన్నై పెట్రా తయార్ సన్నిధి ముందు గీసిన తొమ్మిది చతురస్ర మాతృక ఉంది, ఇందులో నిర్దిష్ట సంఖ్యలు ఉన్నాయి. 

మీ పూజ గదిలో ఈ మాతృకను ప్రతిబింబించడం ద్వారా మరియు ప్రతి చతురస్రంపై ఒక రూపాయి నాణేలు ఉంచాలి. పూజ గదిలో తెల్లటి ముగ్గు పిండితో ముగ్గులు వేసి  , ఆలయంలో ప్రదర్శించే కార్డ్‌ని నమూనా ఉపయోగించి ఆ ముగ్గు మీద  యంత్రాన్ని గీయడం ద్వారా పూజ చేయవచ్చు. 

ప్రతి పెట్టెలో ఒక రూపాయి నాణేలు (ఒకే విలువ కలిగిన నాణేలు) ఉంచడం, మాతృకపై  కుంకుమ మరియు పూలను వేయడం మరియు లక్ష్మీ అష్టోత్రం పఠించడం ద్వారా తొమ్మిది రోజులు పూజ చేయాలి. మునుపటి రోజు నాణేలు తీసి సురక్షితంగా నిల్వ చెయ్యాలి. మరియు మరుసటి రోజు కొత్త నాణేలు ఉపయోగించాలి.

 అలా తొమ్మిది రోజుల పూజ పూర్తయిన తర్వాత తొమ్మిది సుమంగళీల కోసం తాంబూలంతో పాటు 81 నాణేలను ఆలయానికి తీసుకువెళతారు. 

ఆలయ పూజారి నాణేలను తాయారు పాదాల వద్ద ఉంచి అర్చన చేస్తారు. తర్వాత మొదటి తాంబూలం అమ్మవారికి సమర్పించబడుతుంది. ఆ తరువాత, అతను భక్తులకు నాణేలను తిరిగి ఇస్తాడు, ఆ తర్వాత నాణేలను మందిరం వెలుపల ఉన్న హుండీలో జమ చేస్తారు.


💠 శుక్రవారం నాడు పూజను ప్రారంభించడం ఉత్తమం. శుక్రవారం పౌర్ణమి రోజు అయితే, అది మరింత పవిత్రమైనది.


💠వివాహ సమస్యలు  ఉన్నవారు ఇక్కడికి వస్తే  ఆ కల్యాణ సమస్యలు తీరుతాయని  భావిస్తున్నారు. ఆదిశేషునికి ప్రత్యేక సన్నిధి  ఉంది మరియు ఆయనను పూజిస్తే రాహు-కేతు మరియు సర్ప దోషం తొలగిపోతాయని మరియు మాంగళ్యానికి ప్రయోజనం చేకూరుతుందని నమ్ముతారు.


🙏జై శ్రీమన్నారాయణ 🙏

సోమవారం🕉️* *🌹10, మార్చి, 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

     *🕉️సోమవారం🕉️*

*🌹10, మార్చి, 2025🌹*

    *దృగ్గణిత పంచాంగం*                


           *ఈనాటి పర్వం* 

  *సర్వేషాం అమలకైకాదశి*


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిరఋతౌః*

*ఫాల్గుణ మాసం - శుక్లపక్షం*


*తిథి : ఏకాదశి* ఉ 07.44 వరకు ఉపరి *ద్వాదశి*

*వారం    : సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం : పుష్యమి* రా 12.51 వరకు ఉపరి *ఆశ్లేష*


*యోగం  : శోభన* మ 01.57 వరకు ఉపరి *అతిగండ*

*కరణం : భద్ర* ఉ 07.44 *బవ* రా 07.45 ఉపరి *బాలువ*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 10.00 - 11.30 సా 04.00 - 06.00*

అమృత కాలం : *సా 06.12 - 07.52*

అభిజిత్ కాలం  : *ప 11.54 - 12.42*


*వర్జ్యం : ఉ 08.14 - 09.53*

*దుర్ముహూర్తం : మ 12.42 - 01.29 & 03.05 - 03.53*

*రాహు కాలం : ఉ 07.49 - 09.18*

గుళికకాళం : *మ 01.47 - 03.17*

యమగండం : *ఉ 10.48 - 12.18*

సూర్యరాశి : *కుంభం*

చంద్రరాశి : *కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 06.19*

సూర్యాస్తమయం :*సా 06.16*

*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :  *ఉ 06.19 - 08.42*

సంగవ కాలం         :      *08.42 - 11.06*

మధ్యాహ్న కాలం  :      *11.06 - 01.29*

అపరాహ్న కాలం   : *మ 01.29 - 03.53*

*ఆబ్ధికం తిధి        : ఫాల్గుణ శుద్ధ ద్వాదశి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.16*

ప్రదోష కాలం         :  *సా 06.16 - 08.41*

రాత్రి కాలం : *రా 08.41 - 11.53*

నిశీధి కాలం          :*రా 11.53 - 12.42*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.42 - 05.30*

________________________________

        🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*నటరాజ స్తోత్రం (పతంజలి కృతం)*

*అథ చరణశృంగరహిత శ్రీ నటరాజ స్తోత్రం*


*పరం సురవరం పురహరం పశుపతిం జనిత దంతిముఖ షణ్ముఖమముం*

*మృడం కనక పింగల జటం సనక పంకజ రవిం సుమనసం హిమరుచిమ్ ।*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

శంకరు భక్తిగొల్చెద రసజ్ఞ విలాస

 ఉ.శంకరు భక్తిగొల్చెద రసజ్ఞ విలాస మృదంగ నాద సా

లంకృత నాట్య శోభితుని లాస్య వశంగతు, భక్త జాల ర  

క్షంకరణైక లక్షిత విశారదు నీశ్వరు చంద్రశేఖరున్ 

శంకుని చిత్తమందునిడి సాగిలి మ్రొక్కి నుతింతు భారతీ!౹౹ 75


ఉ.భారపు విద్యలియ్యవి ప్రభా పరిపూర్ణ మనోవికాసమున్

ధీరమతిన్ సమోన్నతిని దీర్చగ నెంచిన మేలొసంగెడిన్

ధారణఁ బెంచుచున్ సునిశితత్వపు ధీమతిఁ గూర్చు విద్యలే

భారత దేశ వైభవము వర్ధిల జేసెడు గాన భారతీ!౹౹ 76

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం  - ఏకాదశి - పుష్యమి -‌‌ ఇందు వాసరే* (10.03.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*