*🙏జై శ్రీమన్నారాయణ🙏*
10.03.2025,సోమవారం
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయనం - శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం
తిథి:ఏకాదశి ఉ9.52 వరకు
వారం:ఇందువాసరే (సోమవారం)
నక్షత్రం:పుష్యమి రా2.32 వరకు
యోగం:శోభన మ3.58 వరకు
కరణం:భద్ర ఉ9.52 వరకు
తదుపరి బవ రా9.41 వరకు
వర్జ్యం:ఉ10.25 - 12.03
దుర్ముహూర్తము:మ12.34 - 1.21
మరల మ2.55 - 3.42
అమృతకాలం:రా8.05 - 9.42
రాహుకాలం:ఉ7.30 - 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 - 12.00
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం:6.17
సూర్యాస్తమయం: 6.04
సంకల్పం అంటే.. 'చేయదలచుకున్న పనిని మనసా వాచా కర్మణా నమ్మి పూర్తి చేయగలగడం' అంటారు దైవజ్ఞులు. ఆ పని ఐహికమైన అభివృద్ధి కావచ్చు.. ఆధ్యాత్మికమైన సాధన కావచ్చు! 'సంకల్పం అనేది ఆత్మ మనస్సుల సంగమం' అంటారు స్వామి వివేకానంద. మనిషి ఆధ్యాత్మిక సాధనలో భగవంతుడి ప్రేమ అపారంగా పొందాలంటే, తనను తాను అన్నివిధాలా తీర్చిదిద్దుకోవాలి. ఎటువంటి అడ్డంకులు ఎదురైనా త్రికరణ శుద్ధిగా అధిగమించాలి. ‘తలపుల్లోగాని, వాక్కుతోగాని, చేష్టలతోగాని, ఏ ప్రాణికి అపకారం తలపెట్టను' అని మనసులో ప్రమాణం చేయాలి. 'సర్వశక్తిమంతుడు, సర్వవిదుడు, ప్రేమ సింధువు అయిన ఆ అంతర్యామిలో నేనొక భాగమనే భావనతో ఈరోజును ప్రారంభిస్తున్నాను' అని సంకల్పం చెప్పుకోవాలి. అలా ప్రతిరోజు చేయడం వల్ల ఆధ్యాత్మిక సాధనలో సాధకుడు మరో మెట్టు ఎక్కుతూ ఉంటాడు. ఆ భగవంతుడి దయకు పాత్రుడవుతూ ఉంటాడు. సంకల్పం వల్ల ఆలోచనలకు స్థిరత్వం సిద్ధిస్తుంది. మనం సంకల్పించిన ధ్యేయం దగ్గరవుతుంది...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి