11, మార్చి 2025, మంగళవారం

నేనేమీ నరపాలునంత సమమా

 " శార్దూలము..

--

నేనేమీ నరపాలునంత సమమా నీరూపునెందున్ గనన్ 

నేనేమీ భవదిచ్ఛఁదీర్పనగునౌ నేకన్నపన్ కానుగా..

నేనేమీయహిరాజలూతగజముల్ నీచెంతనుండంగనో

మీనాక్షీహృదయస్థసుందరవిభూ (/భో ) మీభృత్యునిన్ *శంకరా* "(73 )

--

తప్పక చేసిననూ యది

 *2042*

*కం*

తప్పక చేసిననూ యది

తప్పేయని యొప్పుకొనెడి తత్వము తో నా

తప్పును మరి చేయనపుడు

తప్పక నుతులొందగలవు ధరణిన సుజనా.

*భావం*:-- ఓ సుజనా! తప్పనిసరి పరిస్థితుల్లో చేసి ననూ తన తప్పు ను తప్పే అని వొప్పుకునే తత్వం తో ఆ తప్పు ను మరలా చేయకుండా ఉన్నచో తప్పకుండా నీవు ఈ భూలోకంలో ప్రశంసలు అందుకొనగలవు.

*సందేశం*:-- ఒక వ్యవస్థ లో ఉన్నత శిఖరాలు చేరడం కోసం తప్పు లు చేసినప్పుడు ఖచ్చితంగా నాది తప్పే అని ఒప్పుకొని మరలా ఆ తప్పు చేయకుండా ఉండటం వలన నువ్వు గొప్ప వాడిగా కీర్తించబడెదవు. ఉదాహరణకు సినిమా రంగంలో ఎదుగుదల కు తప్పు లు చేసి తరువాత ఉన్నత స్థాయి చేరి కూడా అవేతప్పులు చేసే వారు నీచులు,ఆ తప్పు లను మరలా చేయకుండా ఉండే వారు గొప్ప వారు. ఇలా ఏ రంగంలో అయినా సరే.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

తప్పక

 *2042*

*కం*

తప్పక చేసిననూ యది

తప్పేయని యొప్పుకొనెడి తత్వము తో నా

తప్పును మరి చేయనపుడు

తప్పక నుతులొందగలవు ధరణిన సుజనా.

*భావం*:-- ఓ సుజనా! తప్పనిసరి పరిస్థితుల్లో చేసి ననూ తన తప్పు ను తప్పే అని వొప్పుకునే తత్వం తో ఆ తప్పు ను మరలా చేయకుండా ఉన్నచో తప్పకుండా నీవు ఈ భూలోకంలో ప్రశంసలు అందుకొనగలవు.

*సందేశం*:-- ఒక వ్యవస్థ లో ఉన్నత శిఖరాలు చేరడం కోసం తప్పు లు చేసినప్పుడు ఖచ్చితంగా నాది తప్పే అని ఒప్పుకొని మరలా ఆ తప్పు చేయకుండా ఉండటం వలన నువ్వు గొప్ప వాడిగా కీర్తించబడెదవు. ఉదాహరణకు సినిమా రంగంలో ఎదుగుదల కు తప్పు లు చేసి తరువాత ఉన్నత స్థాయి చేరి కూడా అవేతప్పులు చేసే వారు నీచులు,ఆ తప్పు లను మరలా చేయకుండా ఉండే వారు గొప్ప వారు. ఇలా ఏ రంగంలో అయినా సరే.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

మంగళవారం🍁* *🌹11, మార్చి, 2025🌹*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

    *🍁మంగళవారం🍁*

*🌹11, మార్చి, 2025🌹*

    *దృగ్గణిత పంచాంగం*                


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిరఋతౌః*

*ఫాల్గుణ మాసం -  శుక్లపక్షం*


*తిథి      : ద్వాదశి* ఉ 08.13 వరకు ఉపరి *త్రయోదశి*

*వారం    : మంగళవారం* ( భౌమవాసరే )

*నక్షత్రం  : ఆశ్లేష* రా 02.16 వరకు ఉపరి *మఖ*


*యోగం  : అతిగండ* మ 01.18 వరకు ఉపరి *సుకర్మ*

*కరణం   : బాలువ* ఉ 08.13 *కౌలువ* రా 08.39 ఉపరి *తైతుల*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.30 - 11.30 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *రా 12.33 - 02.15*

అభిజిత్ కాలం  : *ప 11.53 - 12.41*


*వర్జ్యం            : మ 02.24 - 04.05*

*దుర్ముహూర్తం  : ఉ 08.42 - 09.30 రా 11.05 - 11.53*

*రాహు కాలం   : మ 03.17 - 04.47*

గుళికకాళం      :  *మ 12.17 - 01.47*

యమగండం    : *ఉ 09.18 - 10.48*

సూర్యరాశి : *కుంభం* 

చంద్రరాశి : *కర్కాటకం/సింహం*

సూర్యోదయం :*ఉ 06.18*

సూర్యాస్తమయం :*సా 06.17*

*ప్రయాణశూల  : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :  *ఉ 06.18 - 08.42*

సంగవ కాలం         :      *08.42 - 11.06*

మధ్యాహ్న కాలం    :      *11.06 - 01.29*

అపరాహ్న కాలం    : *మ 01.29 - 03.53*


*ఆబ్ధికం తిధి         : ఫాల్గుణ శుద్ధ త్రయోదశి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.17*

ప్రదోష కాలం         :  *సా 06.17 - 08.41*

రాత్రి కాలం           :  *రా 08.41 - 11.53*

నిశీధి కాలం          :*రా 11.53 - 12.41*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.41 - 05.28*

________________________________

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🚩II జై శ్రీరామ్  - జై హనుమాన్ II🚩*


*!!శ్రీ రామ దూతం శిరసా నమామి.*

*చిరంజీవ వాయు నందన నమోనమో నమః.*

*లక్షణ ప్రాణ దాత నమో నమః*

*హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే*

*బలినా మగ్రగణ్యాయ నమః* 

*పాపహరాయతే లాభ దోసిత్వేమేవాసు* *హనుమాన్ రాక్షసాంతక!!*


*యశోజయంచ మే దేహి శత్రూన్ నాశయ నాశయ*

*స్వాశ్రితానామ భయదం య ఏవం స్తౌతి మారుతిం*

*హానిమేతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్.!!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

వదలనిపాశబంధములబాధలుచిత్తమునందునున్నవౌ

 " చంపకమాల..

--


వదలనిపాశబంధములబాధలుచిత్తమునందునున్నవౌ..

కదలనిపీఠశుద్ధినివిగాఢఁపుటూహలఁద్రెంచుమక్షరా

మెదలనిభక్తిసాధనసమీహితబుద్ధినిఁగూర్చుదీక్షకై..

బెదురదిలేనిధ్యానధనవిద్యనునీయుమునాకు *శంకరా* !!! " (72)

--

వివాహం..ఉద్యోగం..*

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..*


*వివాహం..ఉద్యోగం..*


ఆవిడ పేరు వెంకట రమణమ్మ..శ్రీ స్వామివారు మాలకొండలో తపోసాధన చేసే రోజుల్లో..ఒకటి రెండు సార్లు పార్వతీదేవి మఠం వద్ద శ్రీ స్వామివారిని చూసారు..అప్పుడు శ్రీ స్వామివారు వెంకట రమణమ్మ గారిని పలకరించి..ఆశీర్వదించి పంపారు..శ్రీ స్వామివారు మొగలిచెర్ల కు వచ్చేసి, ఆశ్రమ నిర్మాణం చేయించుకొని..ఇక్కడే సాధన చేసుకొనే రోజుల్లో కూడా రమణమ్మ గారు శ్రీ స్వామివారిని కలిశారు..అలా శ్రీ స్వామివారికోసం ఆశ్రమం వద్దకు వచ్చినప్పుడే మా తల్లిదండ్రులతో పరిచయం ఏర్పడింది..ఆ తరువాత ఒకటి రెండుసార్లు రమణమ్మ గారు ఆశ్రమానికి వచ్చి శ్రీ స్వామివారిని చూసి వెళ్లారు.. శ్రీ స్వామివారిని దర్శించుకునే సమయంలో మా ఇంట్లో గడిపారు..ఈ విషయాలన్నీ ఆవిడే స్వయంగా చెప్పారు..శ్రీ స్వామివారు సిద్ధిపొందిన తరువాత..రమణమ్మ గారు మొగలిచెర్ల కు వచ్చారు..అప్పుడు శ్రీ స్వామివారి తల్లిగారైన వెంకట సుబ్బమ్మ గారు మందిరం వద్ద వున్నారు..సుబ్బమ్మ గారి వద్దే రెండురోజుల పాటు రమణమ్మ గారు వున్నారు..వాళ్ళిద్దరి మధ్యా కొద్దిగా సాన్నిహిత్యం కూడా ఏర్పడింది..తాను శ్రీ స్వామివారికి దగ్గర మనిషిని అని రమణమ్మ గారు భావించేవారు..


ఈసారి రమణమ్మ గారి రాకకు ఒక కారణం ఉన్నది..ఆవిడ కూతురు బిడ్డ (మనుమరాలు) యుక్త వయసుకు వచ్చింది..ఉద్యోగము చేస్తున్నది..సుమారు పాతిక సంవత్సరాల వయసు వచ్చింది.. కానీ..వివాహం చేసుకోనని ఖరాఖండిగా తేల్చి చెప్పింది..ఆ అమ్మాయికి పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు ప్రయత్నం చేసి..విఫలమయ్యారు..ఎవరు చెప్పినా ఆ అమ్మాయి వివాహానికి ఒప్పుకోవడం లేదు..తాను ఇంకా కొన్నాళ్ల పాటు ఒంటరిగా వుంటూ ఉద్యోగం చేయదలచానని..తనను బలవంత పెట్టొద్దనీ గట్టిగా చెప్పింది.. 


మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి అమ్మాయిని తీసుకెళ్లండి..మార్పు వస్తుంది..అని రమణమ్మ గారు తన కూతురికి సలహా ఇచ్చారు.."నువ్వు కూడా మాతో స్వామివారి వద్దకు వచ్చేయి..అందరం కలిసే వెళదాము.." అని ఆ కూతురు చెప్పి..రమణమ్మ గారిని వెంటబెట్టుకొని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చింది..కాకుంటే మనుమరాలికి మాత్రం విషయం చెప్పకుండా..కేవలం దైవదర్శనం కోసం మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరం వద్దకు వెళుతున్నామని చెప్పారు..


రమణమ్మ గారు మందిర ప్రాంగణమంతా తిరిగి చూసారు..తాను మొదట్లో చూసిన మందిరానికి, ఇప్పటికీ చాలా తేడా వున్నదని అన్నారు..చాలా మార్పులు వచ్చాయి అని చెప్పారు..తాను, శ్రీ స్వామివారి తల్లి గారితో గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు..

(శ్రీ స్వామివారి తల్లిగారైన వెంకట సుబ్బమ్మ గారు..శ్రీ స్వామివారు సిద్ధిపొందిన తరువాత మందిరం వద్దకు వచ్చి..ఇక్కడే సుమారు పదిహేను సంవత్సరాల పాటు వున్నారు..ఆనాటి తరం వాళ్లందరికీ వెంకట సుబ్బమ్మ గారు బాగా గుర్తు వున్నారు..ఇప్పటికీ కొందరు మమ్మల్ని ఆవిడ గురించి అడుగుతూ వుంటారు..వెంకట సుబ్బమ్మ గారు సుమారు ఐదు సంవత్సరాల క్రితం, తన 101 వ ఏట మరణించారు..) 


ఆరాత్రికి రమణమ్మ గారు, ఆమెతో వచ్చిన కూతురు, అల్లుడు, మనుమరాలు..అందరూ మందిరం వద్దే నిద్ర చేశారు..తెల్లవారింది..అందరూ తలారా స్నానం చేసి, శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకున్నారు..మనుమరాలి చేత కూడా శ్రీ స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేయించారు..అందరూ ప్రధాన మందిరం వద్ద నుంచి బైటకు వచ్చి..మంటపం లో కూర్చున్నారు..రమణమ్మ గారు మాత్రం మళ్లీ లేచి ..శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి మరొక్కమారు నమస్కారం చేసుకొని ఇవతలకు వచ్చారు..మనమరాలిని తన దగ్గర కూర్చోబెట్టుకుని.."నీకు త్వరగా పెళ్లి కావాలని మొక్కు కోవడానికి మేమందరం నిన్ను వెంటబెట్టుకొని ఇక్కడకు వచ్చాము.." అని అసలు విషయం చెప్పేసారు..అప్పటిదాకా ఉత్సాహంతో ఉన్న ఆ అమ్మాయి, ఈ మాట వినగానే గంభీరంగా మారిపోయింది.."అమ్మమ్మా..పెళ్లి తరువాత కూడా నేను ఉద్యోగం చేయడానికి ఒప్పుకునే పక్షంలో..నేను వివాహం చేసుకుంటాను.." అని చెప్పింది..ఈ మాట వినగానే ఒక్కసారిగా అందరికీ ఆనందం వేసింది..సుమారు సంవత్సరం నుంచీ పెళ్లి ప్రసక్తి తెస్తేనే ససేమిరా అంటున్న అమ్మాయి..ఇప్పుడు వివాహానికి ఒప్పుకున్నది..శ్రీ స్వామివారి సమక్షం లోనే అమ్మాయి నోటి నుంచి సానుకూల వార్త వచ్చింది..ఇంతకంటే ఏమి కావాలి?


మరో మూడు నెలల కల్లా..ఆ అమ్మాయికి వివాహం జరిగిపోయింది..నూతన దంపతులను వెంటబెట్టుకొని రమణమ్మ గారు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..అందరూ మనసారా శ్రీ స్వామివారికి నమస్కారం చేసుకున్నారు..ఇంకొక విషయమేమిటంటే..పెళ్లి తరువాత కూడా ఉద్యోగం చేస్తాను అన్న అమ్మాయి..మరో నెలకల్లా ఉద్యోగం మానేసి..భర్త తో చక్కగా కాపురం చేసుకుంటున్నది..


"స్వామి తలచుకుంటే..అన్నీ చిటికెలో జరిగిపోతాయి..నా మొర వృధాగా పోదు..స్వామివారి పై పూర్తి విశ్వాసం ఉంది.." అంటుంటారు రమణమ్మ గారు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699)

ఆశ్రమం..ఆలయం..*

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..*


*ఆశ్రమం..ఆలయం..*


1975 వ సంవత్సరం మే నెల..కొద్దిరోజుల ముందు నేను పదవ తరగతి పరీక్షలు వ్రాసి, సెలవులకు మొగలిచెర్ల వచ్చి వున్నాను..ఆరోజుల్లో సెలవులకు ఇంటికి వస్తే..నేను గానీ మా అన్నయ్య కానీ..ప్రతిరోజూ ఉదయం సాయంత్రం రెండుపూటలా మొగలిచెర్ల లోని మా ఇంటివద్దనుంచి..ఎరువు ను ఎద్దుల బండిలో మా మాగాణి పొలానికి తీసుకెళ్లి అక్కడ చల్లి రావడం ఒక పనిగా చేయాల్సి వచ్చేది..మాగాణి పొలానికి వెళ్లాలంటే..విధిగా శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఆశ్రమం నిర్మించుకున్న ఫకీరు మాన్యం మీదుగానే వెళ్ళాలి..నేను అలా మాగాణికి ఎరువును బండిలో తీసుకెళ్లే రోజుల్లో..ఒక్కొక్కసారి శ్రీ స్వామివారిని చూడటం కోసం..ఆశ్రమం ముందు ఎద్దుల బండి ఆపుకొని..లోపలికి వెళ్లే వాడిని..శ్రీ స్వామివారు ధ్యానం లో లేని సమయం లో..ఆశ్రమ ప్రాంగణంలో తిరుగుతూ వుండేవారు..కొద్దిసేపు వారి వద్ద గడిపి..మళ్లీ బండిని తీసుకొని ఇంటికి వచ్చేసేవాడిని..మే నెలలో ఆ కార్యక్రమం విధిగా ఉండేది..


ఒకరోజు ఉదయాన్నే నాన్నగారు నన్ను పిలచి.."ఒరేయ్..సుధాదేవమ్మ అక్కయ్యను తీసుకొని..ఈ నెలాఖరుకు ఢిల్లీ వెళతావా?..అక్కయ్యను మా తమ్ముడు పరమేశ్వర రావు దగ్గర వదిలి..నాలుగు రోజుల పాటు అక్కడ వుండి..తిరిగి వచ్చేసెయ్యి..మీ సెలవులు అయిపోయేనాటికి అక్కయ్య మళ్లీ తిరిగి కనిగిరి వచ్చేస్తుంది..ఆమెను ఢిల్లీ తీసుకెళ్లడానికి నువ్వు తోడుగా వెళ్ళు.." అన్నారు..ఆ మాట వినగానే ఎగిరి గంతేశాను.. నిజమే..అప్పట్లో ఢిల్లీ ప్రయాణం అనేది నా వరకూ ఒక గొప్ప కార్యక్రమం..సరే అన్నాను సంతోషంగా..ఆ సంతోషం లోనే బండికి ఎరువు నింపుకొని..ఎద్దులు కట్టుకొని..మాగాణి పొలానికి ఉత్సాహంగా బయలుదేరాను..తిరిగి వచ్చేటప్పుడు ఉదయం పది గంటల సమయం లో..శ్రీ స్వామివారు..ఆశ్రమం బైట వైపు..దాదాపుగా మేము ప్రయాణించే దారి దగ్గర..నిలబడి వున్నారు..స్వామివారిని చూడగానే..బండి ఆపి..ప్రక్కకు పెట్టి..గబ గబా ఆయన దగ్గరకు వెళ్ళాను..


అత్యంత ప్రశాంతంగా..చిరునవ్వుతో నన్ను చూసి.."తెల్లవారక ముందే బండి కట్టుకొని మాగాణికి వెళ్ళావా?..పెందలాడే తిరిగొస్తున్నావు?.." అన్నారు..

"అవును స్వామీ.." అన్నాను..


"రా!..లోపలికి వెళదాము.." అని, ఆశ్రమం లోపలికి దారితీశారు..

వెనుకనే వెళ్ళాను..


శ్రీ స్వామివారు బావి వద్దకు వెళ్లి..నీళ్లు తోడుకొని..కాళ్ళు చేతులు కడుక్కొని..వరండా లోకి వెళ్లి పద్మాసనం వేసుకొని కూర్చున్నారు..నేనూ కాళ్ళూ చేతులు కడుక్కొని..శ్రీ స్వామివారి కి ఎదురుగ్గా కొద్దీ దూరంలో కూర్చున్నాను..


"ఏదో ఆనందం లో ఉన్నావే?..ఏమిటి విషయం?.." అన్నారు..

ఢిల్లీ కి వెళుతున్నాననీ..మొదటిసారి దేశరాజధానిని చూస్తున్నానని..చెప్పాను.

పెద్దగా నవ్వారు..నవ్వడం ఆపి.."ప్రయాణం చేయడం మంచిదే.. అనుభవం వస్తుంది.." అని పైకి లేచి నిలబడ్డారు..నేనూ లేచాను..

"నా వెనకే రా.." అంటూ..ఆశ్రమ ప్రాంగణం అంతా..ప్రదక్షిణగా తిరిగారు..నేనూ శ్రీ స్వామివారి వెనుకే వెళ్ళాను..తిరిగి మళ్లీ బావి వద్దకు వచ్చి..

"ఈ ప్రహరీ లోపల ఉన్న ప్రదేశం అంతా..సరిగ్గా చూడు..రాబోయే రోజుల్లో ఈ ప్రదేశం ఒక దత్త క్షేత్రంగా మారినప్పుడు..ఈ ఆశ్రమం..ఆలయంగా మారుతుంది..ఇక్కడ చాలా మార్పులు వస్తాయి..నువ్వు చూస్తావు..గుర్తుపెట్టుకో.." అన్నారు..


శ్రీ స్వామివారు చెపుతున్న మాటలకు అప్పుడు అర్ధం గోచరించలేదు..రాబోయే రోజుల్లో..ఈ ఆశ్రమం..గుడి రూపం సంతరించుకుంటుందనీ..అలానే శ్రీ స్వామివారు కట్టించుకున్న ధ్యాన మందిరం తప్ప..మిగిలిన వన్నీ మారిపోతాయనీ..అందులో నా ప్రమేయం ఉంటుందనీ..నాకు అవగాహన లేదు..నన్ను అన్నీ గుర్తుపెట్టుకోమని ముందుగానే ఎందుకు చెప్పారో..ఇప్పుడు అవగతం అవుతున్నది..ఆనాటి ఆశ్రమ రూపు రేఖలు ఇప్పుడు మనసులో తప్ప వాస్తవం లో లేవు..రాబోయే రోజుల్లో నేనే ఆశ్రమ నిర్వహణ చేస్తానని శ్రీ స్వామివారికి ముందుగానే తెలుసా?..అందుకే పదే పదే.."సరిగ్గా చూడు..!..గుర్తు పెట్టుకో..!.." అని చెప్పారా?..ఈనాడు ఆలోచించుకుంటే..అవును అనే సమాధానం చెప్పుకోవాలి..


లౌకికంగా ఆనాడు ఢిల్లీ ప్రయాణం నాకు అత్యంత ఆనందం కలిగించే విషయంగా భావించాను..కానీ ఆధ్యాత్మికంగా శ్రీ స్వామివారు చూపిన ఆశ్రమ బాధ్యత ఇంకా గొప్పది అని ఇన్నాళ్లకు తెలిసింది..ఈ ఆధ్యాత్మిక ప్రయాణం లో ఎందరో భక్తుల అనుభవాలను తెలుసుకునే అవకాశం కలిగింది..అందుకు శ్రీ స్వామివారి పాదపద్మాలకు అనుక్షణం భక్తితో నమస్కారం చేసుకోవాలి..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699)

పదియారు వన్నెల బంగారు కాంతుల

 పదియారు వన్నెల బంగారు కాంతుల తోడ

పొదలిన కలశాపుర హనుమంతుడు

॥పదియారు॥


ఎడమచేత బట్టె యిదివో పండ్లగొల

కుడిచేత రాకాసిగుంపుల గొట్టె

తొడిబడ నూరుపులతో దూరుపుమొగమైనాడు

పొడవైన కలశాపుర హనుమంతుడు

॥పదియారు॥


తొక్కి అక్షకుమారుని దుంచి యడగాళ సంది

నిక్కించెను తోక యెత్తి నింగి మోవను

చుక్కలు మోవ బెరిగి సుతు వద్ద వేదాలు

పుక్కిట బెట్టె కలశాపుర హనుమంతుఁడు

॥పదియారు॥


గట్టి దివ్యాంబరముతో కవచకుండలాలతో

పట్టపు శ్రీవేంకటేశు బంటు తానాయ

అట్టె వాయువునకు అంజనిదేవికిని

పుట్టినాడు కలశాపుర హనుమంతుఁడు

॥పదియారు॥


                  - తాళ్ళపాక అన్నమాచార్యులు

        గానం - శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్

ప్రణవ స్వరూపం*

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️        

  *ఓంకారం ప్రణవ స్వరూపం*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"ఓం" అనేది ప్రణవ స్వరూపం, శబ్దమయం.*


*1. అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న విశ్వంలో ఆకాశతత్వంతో నినదించిన తొలి రుక్కు, బ్రహ్మవాక్కు- ఓంకారం!*


*అది అకార, ఉకార, మకారాలనే బిందు సంయుక్తంగా ఏర్పడిన  మొట్టమొదటి శబ్దం.*


*2. అకారం సృష్టికి, ఉకారం పోషకత్వానికి, మకారం లయకారకత్వానికి చిహ్నాలు.*

 

*3. ఓంకారం- బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వం.*

 

*4. అది కేవలం ఓ మంత్రం కాదు; అన్ని మంత్రాలకూ అదే- బలం, జీవం, శక్తిరూపం.*


*5. ‘ఓంకారం లేని మంత్రం ప్రాకారం లేని గుడి వంటిది’ అని పెద్దల మాట.*


*6. మంత్రాలకు పరిపుష్టినిచ్చేది, రక్షణ కల్పించేది ఓంకారం. ఓం అనేది ఒక మతానికి సంబంధించినది కాదు.*


*7. అది ప్రార్థనా మందిరం లోని ఘంటానాదం.*


*8. ప్రతి మనిషి గుండె చప్పుడూ అదే.*

 

*9. నిత్యమూ యోగులు, మహర్షులు జపించేది, మోక్షదాయకమైనది ఓంకారం అని వేదం ప్రకటించింది.*


*10. ప్రతి నిత్యం 21 మార్లు ఓంకారం జపించడం వల్ల, మనిషి శరీరంలోని 21 తత్వాలు- అంటే, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కోశాలు, పంచ ప్రాణాలు, మనసు ఉత్తేజితమవుతాయని యోగ శాస్త్రం చెబుతోంది.*


*మనిషి జన్మ ‘సోహం’తో ప్రారంభమవుతుంది. సో అని వూపిరి పీల్చడం, హం అని వదలడంతో జన్మ ప్రారంభమవుతుంది.*


*సో నుంచి హం వరకు - అంటే గాలి పీల్చి జీవితాన్ని ప్రారంభించి ‘హం’ అంటూ వదిలి నిర్గుణత్వానికి మళ్లేవరకు, ‘కోహం’లోనే జీవిత అన్వేషణ సాగాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు.*


*కోహం అంటే, నేనెవరు అని ప్రశ్నించుకోవడం. తానెవరో, ఎందుకు జన్మించాడో, ఏ మార్గంలో వెళ్లడానికి ప్రయత్నించాలో మనిషి తెలుసుకోవడం; చివరకు ఎక్కడికి చేరుకోవాలో బోధించేవే .*


*11. వేదాలు, ఉపనిషత్తులు, ఇతర పురాణాలు. వీటిన్నింటికీ ఓంకార సాధనే మూలాధారం.*


*ఓంకార శబ్దసాధనకు, సంగీత సాధనకు దగ్గరి సంబంధం ఉంది. మంద్ర స్థాయి, తారస్థాయి- రెండూ సంగీత శ్రుతిలో మేళవించి ఉన్నట్లే, ఓంకార నాదమూ ఉంటుంది. అది లయబద్ధంగా సాగినప్పుడు- వ్యాధుల నుంచి ఉపశమనంతో పాటు శరీరానికి జవసత్వాలు లభిస్తాయని చెబుతారు. మానవుడు సత్వ, రజో, తమోగుణాలతో ఉంటాడు.* 


*12. అతిశయం, అహంకారం అతణ్ని వశం చేసుకున్నప్పుడు- పూర్తిగా సత్వగుణంలోకి మనసును నడిపించి సత్య ధర్మ శాంతి ప్రేమలను అందజేసే ఔషధమే ఓంకారం!*


*13. సత్యాన్వేషణలో మనిషికి సహకరించేది, ఆధ్యాత్మిక చింతన వైపు అతణ్ని మళ్లించేది, ఆవేశాన్ని అణచి అహింసా మార్గం వైపు నడిపించేది ఓంకారోపాసన- అని మహాత్మాగాంధీ అనేవారు.*


*సీతను రావణుడు అపహరించడంతో, శ్రీరామచంద్రుడు దుఃఖితుడయ్యాడు.ఆమె జాడ కనుగొనే యత్నంలో, సుగ్రీవుడితో మైత్రి సాగించాడు. అనంతరం సీతాన్వేషణకు ఆంజనేయుణ్ని దక్షిణ దిక్కు వైపు పంపించాడు. శత యోజనాల సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమయ్యాడు హనుమ. మహేంద్ర పర్వతం మీద నుంచి ఎగరడానికి ఆయన సన్నద్ధమైన తీరు ఓంకార తత్వాన్ని తెలియజేస్తుంది. ఆకాశమార్గాన వెళ్లాలని నిశ్చయించుకొన్న మారుతి, వూపిరి దీర్ఘంగా పీల్చి వదులుతూ కొంతసేపు ప్రాణాయామ స్థితిలో ఉన్నాడు. ఒక్కసారిగా శక్తినంతా కూడదీసుకొన్న ఆయన, ప్రణవ నాదం(ఓం శబ్దం)తో కుప్పించి ఆకాశవీధిలోకి ఎగిరాడని సుందరకాండ వెల్లడిస్తుంది.*


*14. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల పునరుద్ధరణకు; మంత్ర జపాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు, ఆత్మశక్తితో జీవిత లక్ష్యాన్ని సాధించేందుకు అనువైన సాధనే- ఓంకారం. యోగులు సంకల్పాలను నెరవేర్చుకొనే క్రియ.*


*15. ఓంకార సాధన అందరికీ ఆరోగ్యకరం, ఆనందదాయకం.

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(72వ రోజు)*

   *(క్రితం భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

          *భరతుడు గాథ*,

 *భరద్వాజుని జన్మ రహస్యం*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఇరవైవేల సంవత్సరాలు పాలించాడు భరతుడు. చివరకు ముక్తసంగుడై వనాలకు వెళ్ళిపోయాడు. తపస్సుతో దేహాన్ని చాలించాడు. విష్ణుపదం చేరుకున్నాడు.*


*భరతునికి ముగ్గురు భార్యలు. ఆ ముగ్గురూ విదర్భరాజ కుమార్తెలు. వారికి సంతానం కలిగింది. అయితే వారిలో ఏ ఒక్కరూ తండ్రితో సమానం కాలేకపోయారు. తండ్రి ధైర్యసాహసాలూ, అందచందాలూ అంటని ఆ పుత్రుల్ని, తల్లులే చంపివేశారు. తన పుత్రులు కారని భరతుడు శంకిస్తాడని వారి అనుమానం. వ్యభిచరించారని అంటాడన్న భయం తల్లుల్ని అందుకు పురిగొల్పింది.*


*అప్పుడు మరుత్తులను ఆరాధించాడు భరతుడు. యజ్ఞం చేశాడు. ఫలితంగా భరద్వాజుని తెచ్చి, అతనికి పుత్రునిగా బహూకరించారు మరుత్తులు. భరద్వాజుని పుట్టుక చాలా చిత్రమయినది.*


*అంగీరస మహర్షికి, శ్రద్ధకి జన్మించిన కుమారులలో ఒకరు బృహస్పతి. బృహస్పతి అన్న ఉతథ్యుడు. ఉతథ్యుని భార్య మమత.*


*దేవగురువు అయిన బృహస్పతి యొక్క భార్య తార.*


*ఉతథ్యుడు తీర్థయాత్రాపరుడైన సందర్భములో, మమత గర్భవతిగా ఉండగా, గర్భములోని శిశివు వలదు అని మొర పెట్టుకున్ననూ, అన్న భార్య అని కూడా చూడక, ఉతథ్యుడు యొక్క ఆశ్రమమునకు అతిథిగా వచ్చిన, దేవగురువైన బృహస్పతి అన్న భార్యతో   బలవంతముగా సంగమించుట జరుగుతుంది.*


*మమత గర్భములో ఉన్న శిశివును ఆ సందర్భములో బృహస్పతి, అంధుడుగా పుట్టమని శపిస్తాడు.*


*బలవంతముగా సంగమించి, మమత గర్భములో ఉన్న శిశివు బృహస్పతి విడిచిన వీర్యమును బయటకు తన్ని వేయుట జరుగుతుంది. ఆ వీర్యము నేలపై పడి బాలుడు కాగా, బృహస్పతి ఆ బాలుడును, గర్భములో ఉన్న శిశివుతో పాటు తనకు ఇద్దరు పుత్రులు ఉదయించారని చెప్పుకోమని అనటం జరుగుతుంది.*


*దానికి మమత అంగీకరించ లేదు. బృహస్పతి కూడా పుట్టిన బాలుడుని తీసుకు వెళ్ళేందుకు సమ్మతించ లేదు. నువ్వు పెంచమంటే నువ్వు పెంచమని ఆ బాలుడిని విడిచి వేయటం జరుగుతుంది. బృహస్పతి వేళ మించి పోతోంది అని తన దారి తాను వెళ్ళి పోయాడు. అదేవిధముగా మమత కూడా ఆ బాలుడిని వదలి వెళ్ళింది. మమత, బృహస్పతి ఇద్దరిచే విడిచి వేయబడిన వాడు కనుక ఆ బాలుడు ద్వాజుడు అయ్యాడు. పిల్లాణ్ణి నువ్వు భరించాలంటే నువ్వు భరించాలంటూ బృహస్పతీ, మమతా వాదులాడుకోవడంతో అతనికి ‘భరద్వాజుడు’ అని పేరొచ్చింది.*


*ఆఖరికి అతన్ని మరుత్తులు తీసుకుని పోయి పెంచసాగారు. అతన్నే ఇప్పుడు భరతునికి పుత్రునిగా బహూకరించారు.*


*వంశం వితథం(అసత్యం) అయినప్పుడు అవతరించాడు కనుక అతనికి ‘వితథుడు’ అని కూడా పేరు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

 *జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

*పదవిభాగం, తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*పరమేశ్వరుని దయవల్ల తనకు కరువు కాటకాల వల్ల భయం లేదని శంకరులు చెప్పారు.*


*శ్లోకం :  40*


*ధీయంత్రేణ వచోఘటేన కవితా కుల్యోపకుల్యాక్రమైః*

                      

*ఆనీతైశ్చ సదాశివస్య చరితాం భోరాశి దివ్యామృతైః*

                     

*హృత్కేదార యుతాశ్చ భక్తి కలమాః సాఫల్య మాతన్వతే*

                     

*దుర్భిక్షాన్ మమ సేవకస్య భగవన్! విశ్వేశ ! భీతిః కుతః !!*


*పదవిభాగం:~*


*ధీయంత్రేణ _ వచోఘటేన _ కవితాకుల్యోపకుల్యాక్రమైః _ ఆనీతైః _*

*చ _ సదాశివస్య _ చరితాంభోరాశిదివ్యామృతైః _ హృత్కేదారయుతాః _*

*చ _ భక్తికలమాః _ సాఫల్యమ్ _ ఆతన్వతే _ దుర్భిక్షాత్ _ మమ _ సేవకస్య*

*భగవన్ _ విశ్వేశ _ భీతిః _ కుతః .॥*


*తాత్పర్యము :~*


*హే భగవన్ ! విశ్వేశ్వరా బుద్ధియనే నీళ్ళు తోడే యంత్రము చేత, స్తోత్ర వచనములు అనే కుండతో కవిత్వమనే కాలువల, పిల్లకాలువల మార్గముల ద్వారా పైకి తోడబడిన, పరమేశ్వరుడవైన నీ యొక్క చరిత్రము అనే సముద్రమునందలి మంచి జలములతో , హృదయ క్షేత్రములందు మొలిచే భక్తి అనే వరిపైరులు సఫలత్వాన్ని పొందుతాయి. అప్పుడు సేవకుడనైన నాకు , ఇంక కరువువలన భయములేదు.*


*(పరమేశ్వరుని చరిత్రమును స్తుతించు భక్తి హృదయంలో ఉంటే, మానవులకు ఏలోపంకానీ, భయంగానీ కలుగదు  అని భావం ).*


*వివరణ :~*


*ఈ శ్లోకంలో శంకరులు ఇలా చెప్పారు.  బుద్ధి ఏతంలా పనిచేస్తే, వాక్కులు ఏతపు కుండల్లా పని చేస్తున్నాయట. లోతైన నూతుల నుండీ, గుంటల నుండి ఎత్తుగా ఉన్న ప్రదేశానికి నీళ్ళు తోడడానికి , ఏతమును ఉపయోగిస్తాము. ఇక్కడ వాక్కులు అంటే ,నోటితో పలికే స్తోత్రములు, నామజపాలు, పాటలు వగైరా అని గ్రహింౘాలి. ఈ వాక్కులనే కుండలతో, కవిత్వమనే పిల్లకాలువల ద్వారా ఈశ్వరుని చరిత్రలు అనే మహాసముద్రము నుండి బయలుదేరిన నీళ్ళు హృదయమనే వరమడిని తడిపి, సస్యశ్యామలం చేసి ,భక్తి అనే రాజనాల వరివధాన్యాన్ని పండిస్తున్నాయట. కాబట్టి శంకరుల హృదయం, నిండా ఆనందమనే వరిపంట నిండుగా వుంది. అందువల్ల కరువు వస్తుందనే భయం ఏ కొంచమూ లేదని వారు చెప్పారు.*


*బుద్ధిని నిలిపి, వాక్కుతో స్తోత్రాదులు చదివి , పరమేశ్వరునికై కవితలు చెప్పి ఈశ్వర చరిత్రలను వల్లిస్తే , హృదయ కేదారాలలో  భక్తి పంటలు పండుతాయని శంకరులు ఈ శ్లోకం ద్వారా భక్తులకు మార్గోపదేశం చేశారు. హృదయం నిండుగా శివభక్తి ఉంటే , ఆ భక్తులకు ఏమీ భయముండదని, హామీ ఇచ్చారు.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

తొలి భక్తుడు

 *శివుని యొక్క తొలి భక్తుడు ఎవరు* ❓


 *"సాటిలేని మహా భక్తుడు శ్రీ మహావిష్ణువు"‼️* 


శివుని యొక్క సాకార స్వరూపమైన సదాశివుని వామాంగం నుండి ఆవిర్భవించిన తొలి పురుషుడు శ్రీ మహావిష్ణువు. ఈ సృష్టిలో శివుని యొక్క తొలి శివ భక్తుడు అనే ఘనకీర్తి విష్ణు దేవునికే లభించినది. కారణం శివుడిని ఆరాధించే మొదటి అవకాశం మహాభాగ్యం విష్ణుదేవునికి లభించినది. 


పార్వతి శంకరుడిని, రాధ శ్రీ కృష్ణుడిని,సీత శ్రీరాముడిని, ఏ విధంగా ధ్యానం చేస్తూఉంటారో....ఆ విధంగా విష్ణువు శివుని సదా ధ్యానిస్తూ ఉంటాడు. 

నిరంతరం శివ నామస్మరణ చేస్తూ ఉంటాడు. ఈ కారణం వల్లనే!


శివుడి అష్టోత్తర శత నామాలలో శివుడు విష్ణు వల్లభుడని కీర్తించబడినాడు. నేను నిరంతరం ధ్యానించే శివుడు నాకు ప్రియమైన వాడు అందుకే శివుడిని విష్ణు వల్లభుడని అంటారని విష్ణువు పార్వతితో ఇలా తెలిపెను.


 *శంకర: శూలపాణిచ కట్వంగి విష్ణువల్లభా:* 


విష్ణువు యొక్క శివ భక్తికి మెచ్చి. శివుడు విష్ణువు కు ఎన్నో వరాలను ప్రసాదించాడు. ఎన్నో దివ్యశక్తులను ప్రసాదించాడు. క్షణాలలో శత్రువులను సమూలంగా నాశనం చేసే సుదర్శనచక్రాన్ని విష్ణువుకు ప్రసాదించాడు.


భూలోకములో మానవులచే పూజలందుకునే వరాన్ని కూడా ప్రసాదించాడు, భూలోకములో, క్షేత్రం, ప్రతిష్ట, ఉత్సవం, జరిగే విధంగా శివుడు విష్ణువుకు వరం ప్రసాదించాడు. 


విష్ణువు ఎంతటి శివభక్తుడంటే

.. ఆదిశంకరులు, పరమశివ! త్రిపుర సంహారం కాలమందు విష్ణువు నీకు బాణం అయ్యెను. వృషభ రూపమును పొంది నీకు వాహనం అయ్యెను. ఆర్య రూపమును పొంది నీ అర్థాంగమ్మున భార్య‌ అయినాడు. నీ పాదాలను దర్శించుటకు వరాహ రూపం దాల్చాడు .జగన్మోహిని రూపమును పొంది నీ వల్లభూదపొందేన. నీవు శివ తాండవం చేసే సమయాన నీ పాదాలకు నమస్కరించి సాహసం చేసిన నీ దేహం ఒక భాగం గలవాడై బ్రహ్మాదుల కంటే కూడా అధికంగా పూజింపబడిన లేనిచో విష్ణువు అంతటి పూజ్యుడు ఎలా అగునని తెలిపెను. 


హనుమంతుడు శ్రీరాముడిని నిండు ప్రేమతో, అనన్య భక్తితో ఏ విధంగా ప్రేమించాడో, సేవించాడు. ఆ విధంగా శివుడిని ప్రేమించినవాడు, సేవించినవాడు విష్ణువు. అందుకే ఎన్నో పురాణాలు విష్ణువు సాటిలేని గొప్ప శివ భక్తుడు అని కొనియాడారు.  


హనుమంతుడు తన హృదయములో గల శ్రీరాముడిని చూపినట్లు మహావిష్ణువు తన హృదయములో గల శివుడుని చూపించుని వామన పురాణం తెలిపినది. మహావిష్ణువు, కమలం అంటే తన హృదయాన నివసించే శివ లింగేశ్వరుని దేవతలకు చూపించెను.


 విష్ణువు ఎంతటి గొప్ప శివభక్తుడు, "శుద్ధగామం" ఈ విధంగా తెలిపినది. త్రయోదశo హరే రార్ధం - అర్ధనారి చతుర్దశo' 

 విష్ణువు శివుని ధ్యానించి సేవించి సగము శరీరమును పొందిన హరిహర మూర్తి. ఈ లీల రూపము మహేశ్వరుని లీలా రూపములలో 13వ అర్ధనారీశ్వర రూపం 14 విష్ణువు పార్వతీ కన్నా ముందే శివుని శరీరమును పొందాడు. అందుకే పార్వతి విష్ణువును ఆదర్శంగా తీసుకున్నది. విష్ణువుచే అష్టోత్తర శత నామాలను ఉపదేశం పొంది కఠోరంగా తపస్సు చేసి శివుని లో సగం శరీరం సాధించి "అర్ధనారీశ్వరి" అయినది.


 విష్ణువు ఎంతటి గొప్ప మహా శివ భక్తుడు కాబట్టే శివుడే దేవాది దేవుడు, ఆదిదేవుడు, పరమపురుషుడు.

* గరుడ పురాణం_

 * గరుడ పురాణం_*1వ భాగం*



_*వక్రతుండ మహాకాయ... కోటి సూర్య సమప్రభ...*_

_*నిర్విఘ్నం కురుమే దేవ... సర్వకార్యేషు సర్వదా...*_



_*పూర్వఖండం:*_


_*ఆచారకాండ: మొదటి అధ్యాయం:*_


_*శ్రీకృష్ణచంద్ర పరబ్రహ్మణేనమః*_


_*విష్ణుభగవానుని మహిమ అవతార వర్ణనం:-*_


_భారతీయము, వైదికమునగు సాంప్రదాయంలో 'జయ' శబ్దానికి గల ఆధ్యాత్మి కార్ధము పురాణమని, మహాభారతమని విజ్ఞులంటారు. ఏ పురాణాన్ని వ్రాయడం గాని చదవడంగాని మొదలు పెట్టినా ముందీశ్లోకాలుండాలి._


_*నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం |*_

_*దేవీం సరస్వతీం వ్యాసం  తతో జయముదీరయేత్ ॥*_


_నారాయణునికీ, తపశ్శక్తిలో ఆయనతో సమానుడైన నరోత్తముడు నరమహర్షికీ చదువుల తల్లి సరస్వతీ దేవికీ వాఙ్మయాధీశుడు వ్యాసమహర్షికీ నమస్కరించి ఈ జయ గ్రంథమును ప్రారంభించాలి._


_*అజమజరమనంతం జ్ఞానరూపం మహాంతం శివమమలమనాదిం భూత దేహాది హీనం !*_

_*సకల కరణ హీనం సర్వభూత స్థితం తం హరిమమల మమాయం సర్వగం వంద ఏకం ॥*_


_*నమస్యామి హరిం రుద్రం బ్రహ్మాణంచ గణాధిపం ।*_

_*దేవీం సరస్వతీం చైవ మనోవాక్కర్మభిః సదా॥*_


_పుట్టుకగాని ముసలితనముగాని లేని కల్యాణ స్వరూపుడు, అనంతుడు, జ్ఞాన స్వరూపుడు, విశుద్ధచారిత్రుడు, అనాదియైన వాడు, పాంచభౌతికశరీరుడు కానివాడు, ఇంద్రియములు లేనివాడు, ప్రాణులలో స్థానముకలవాడు, మాయకు అతీతుడు, సర్వవ్యాపకుడు, పరమ పవిత్రుడు, మంగళమయుడు, అద్వయుడునగు శ్రీహరికి వందనం. మనస్సులో, మాటతో, చేతుల ద్వారా ఆ శ్రీ హరికీ, శివునికీ, బ్రహ్మకీ, గణేశునికీ, సరస్వతీ దేవికీ సర్వదా నమస్కరిస్తుంటాను._


_*ఇది పురాణ లేఖకుని వచనము.*_


_*ఇక గరుడ మహాపురాణ ప్రారంభము:*_


_నైమిషారణ్యంలో జరిగింది. నిమిష నిమిషానికి పవిత్రత, జ్ఞానము ఏ అరణ్యంలో పెరుగుతాయో అదే నైమిషారణ్యము'._


_*అక్కడ లోకకళ్యాణం కోసం వేలాదిమునులు శౌనకుని ఆధ్వర్యంలో సత్రయాగం చేస్తుంటారు. ఇది వెయ్యేళ్ళ పాటు సాగే యజ్ఞం. విశ్వంలోని మునులందరూ, ఆచార్యు లందరూ, రాజగురువులందరూ, వ్యాసశిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళినపుడల్లా ఇక్కడికి వచ్చి వెళుతుంటారు.*_ 


_శౌనక మహర్షి అడగగానే కాదనకుండా తాము సంపాదించిన జ్ఞానాన్నంతటినీ మాట రూపంలో అక్కడ సమర్పించి వెళుతుంటారు. ఇతరుల ప్రసంగాలను కూడా వినడం వల్ల అక్కడి వారి, అక్కడికే తెంచిన వారిజ్ఞానం నిమిషనిమిషానికీ పెరిగి పోతుంటుంది. అందుకే అది నైమిషారణ్యం?._


_*ఒకనాడక్కడికి సర్వశాస్త్రపారంగతుడు, పురాణ విద్యాకుశలుడు, శాంత చిత్తుడు, వ్యాసమహర్షి శిష్యుడు, మహాత్ముడునైన సూతమహర్షి తీర్థ యాత్రలు చేసుకుంటూవచ్చాడు. అక్కడ ఒక పవిత్రాసనంపై కూర్చుని విష్ణుధ్యానంలో మునిగిపోయాడు. క్రాంత దర్శియైన ఈ మహాపౌరాణికుడు తనపై కాలు మోపగానే నైమిషారణ్యమే పులకించిపోయింది. ఆ పులకింత శౌనకమహర్షికి చెప్పకనే చెప్పింది ఎవరో మహానుభావుడు వచ్చాడని. ఆయన వెంటనే కొందరు ఉత్తమ ఋషులను వెంటనిడుకొని సూతమహర్షిని కనుగొని ఆయన కనులు తెఱచునందాక అక్కడే వేచియుండి ఆయనను సగౌరవంగా యాగస్థలికి తోడ్కొని వచ్చాడు. మునులందరూ ఆయనను సేవించి ఆతిథ్యమిచ్చి తమ జన్మను చరితార్థం చేసుకున్నారు.*_


* *గరుడ పురాణం_*2వ భాగం*


_తగిన విశ్రాంతి ఆయనకు లభించినాక శౌనకుడు మరొకమారు ప్రణామం చేసి ఇలా ప్రార్థించాడు:_


_*''హే సూతదేవా! మీరు సర్వజ్ఞులు అందుకే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మాకు ఈ విషయాన్ని బోధించండి. దేవతలందరిలోకీ శ్రేష్ఠుడెవరు? సర్వేశ్వరుడెవరు? పూజ్యుడు ధ్యానయోగ్యుడు నెవరు? ఈ జగత్తుకి స్రష్ట, పాలనకర్త, సంహర్త ఎవరు? ఎవరి ద్వారా ఈ సనాతన ధర్మం ప్రవర్తితమగుతున్నది? దుష్ట వినాశకుడెవరు? ఆ దేవ దేవుని యొక్క స్వరూపమెట్టిది? ఈ సంపూర్ణ జగత్తు యొక్క సృష్టి ఏ విధంగాజరిగింది? ఆ దేవదేవుడు ఏ వ్రతాలకు సంతుష్టుడౌతాడు? ఏ యోగం ద్వారా మనిషి ఆయనను పొందగలడు? ఆయన అవతారాలెన్ని? వాటికి వంశపరంపర వుంటే ఎలా వుంటుంది? వర్ణాశ్రమ ధర్మాలను నిర్దేశించి రక్షించేవాడెవరు? హే మహామతీ! వీటినీ, అవసరమైన చోట అన్య విషయాలనూ బోధించి మమ్ము ధన్యులను, జ్ఞానులను చేసి మా జీవితాలను సార్థకాలను చేయండి."*_


_ఒక్క నిముషంపాటు కనులు మూసుకొని ధ్యానం చేసి కనులుతెఱచి చెప్పసాగాడు సూతమహర్షి :_


_*"శౌనకదేవా! ఇతర మునీంద్రులారా! మీరడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానంగా గరుడ పురాణాన్ని వినిపించి నేనూ ధన్యుడనౌతాను.*_


_ఈ గరుడ మహాపురాణము సారభూతము. విష్ణుకథా పరిపూర్ణము. మహాత్ముడు, మహానుభావుడు, తన తపోబలంతో భాగ్యవిశేషంతో విష్ణు భగవానుని వాహనమై ఆయన సామీప్యాన్ని పొందినవాడైన గరుత్మంతుడు కశ్యపమహర్షికి ఈ పురాణాన్ని వినిపించాడు. మా గురుదేవులైన వ్యాసమహర్షి నాకు వినిపించి అనుగ్రహించారు._


_*దేవతా శ్రేష్ఠుడు శ్రీమన్నారాయణుడే. ఆయనే పరబ్రహ్మ: ఆయనే పరమాత్మ. ఆయన ద్వారానే ఈ జగత్తు ఉత్పత్తి, స్థితి, సంహారాలు జరుగుతున్నాయి. ఆయన జరామరణ రహితుడు. భగవంతుడైన ఆ వాసుదేవుడు జన్మ అనగా పుట్టుకలేని వాడైనా జగద్రక్షకై సనత్కుమారాదిగా ఎన్నో రూపాల్లో అవతరిస్తుంటాడు.*_


_మునులారా! ఆ పరమాత్మ మొట్టమొదట కౌమార సర్గులుగా అవతరించాడు. అప్పుడే కఠోర బ్రహ్మచర్య వ్రతాన్నవలంబించి దాని గొప్పదనాన్ని వేదాలతో సహాలోకానికి చాటి చెప్పాడు._


రెండవ అవతారంలో యజ్ఞేశ్వరుడైన ఆ శ్రీహరియే వరాహ శరీరాన్ని ధరించి హిరణ్యాక్షునిచే రసాతలంలో ముంచి వేయబడ్డ పృథ్విని ఉద్దరించి స్థితి కారకుడైనాడు._


_మూడవ అవతారం ఋషి నారదుడను పేరుతో జన్మించి 'సాత్వతతంత్ర' (నారద పాంచరాత్ర) బోధనను చేశాడు. ఇందులో నిష్కామకర్మను గూర్చి చెప్పబడింది._


_నాలుగవది 'నరనారాయణ' అవతారం. ఇందులో శ్రీహరి ధర్మరక్షన కోసం కఠోరతపస్సు చేశాడు. దేవతలూ దానవులూ కూడా నరనారాయణ మహర్షులను ఆరాధించారు._


_అయిదవ అవతారంలో శ్రీహరి కపిలనామంతో సిద్ధులలో సర్వశ్రేష్ఠునిగా జనించి కాలగర్భంలో కలిసి పోయిందనుకున్న సంఖ్యాశాస్త్రాన్ని సముద్దరించి ప్రపంచానికి ప్రసాదించాడు._


_ఆరవ అవతారం దత్తాత్రేయుడు అత్రి మహర్షి అనసూయ దంపతులకు ఒకప్పుడిచ్చిన వరాన్ని పురస్కరించుకొని శ్రీహరి వారికి పుత్రునిగా జన్మించి కొన్నివందల మందికి జ్ఞానోపదేశాన్నిచ్చాడు. ముఖ్యంగా అలర్క మహారాజుకీ, ప్రహ్లాదునికీ బ్రహ్మ విద్యను పదేశించాడు._


_ఏడవ అవతారం యజ్ఞదేవనామకం. శ్రీమన్నారాయణుడు రుచి ప్రజాపతి ఆకూతి దంపతులకు మన స్వాయంభువ మన్వంతరంలోనే జన్మించి ఇంద్రాది దేవగణాలచే అద్భుతమైన యజ్ఞాలను చేయించి, అందరికీ వాటి పద్ధతిని బోధించి యజ్ఞదేవుడను పేర పూజలందుకున్నాడు._


_ఎనిమిదవ అవతారంబుషభదేవుడు. కేశవుడే నాభి, మేరుదేవి దంపతుల పుత్రునిగా జనించి స్త్రీలకు పరమాదర్శంగా గృహస్థాశ్రమాన్ని నిర్దేశించి, నియమాల నేర్పఱచి సర్వాశ్రమాలచేత నమస్కరింపబడేటంత శ్రేష్ఠంగా గృహస్థాశ్రమన్ని సిద్ధముచేశాడు._


_ఋషులు ప్రార్థించగా లక్ష్మీనాథుడు పృథు మహారాజుగా పుట్టి గోరూపంలో నున్న పృథ్వినుండి దుగ్ధమునువలె అన్నాదికములనూ ఔషధరాశులను పిండి, పితికి మానవ జాతికి ప్రసాదించాడు. ఇది ఆయన తొమ్మిదవ అవతారమయింది._


_భగవంతుని పదవ అవతారము మత్స్యావతారం, చాక్షుష మన్వంతరం చివర్లో ప్రళయం వచ్చినపుడు విష్ణువొక బ్రహ్మండమైన చేపరూపమును ధరించి భూమినే నావగా మార్చి వైవస్వతమనువును ప్రాతినిథ్య జీవరాశులతో సహా అందులోకి రమ్మని ఆదేశించి ఆ పడవ మునిగిపోకుండా కాపాడి సృష్టిని రక్షించాడు._


_కూర్మావతారం మహావిష్ణువు యొక్క పదకొండవ అవతారం. క్షీరసాగర మథనవేళ మందర పర్వతం మునిగిపోకుండా కాపాడి అమృతాన్ని తేవడం కోసం వైద్యశాస్త్రాన్ని ప్రపంచానికి ప్రసాదించడం కోసం, దేవతలను తన్ని అమృతాన్ని లాక్కున్న దానవులను మురిపించి, మరిపించి అమృతాన్ని సన్మార్గులైన దేవతలకీయడం కోసం క్రమంగా ఆదికూర్మ, ధన్వంతరి, మోహినీ అవతారాలను మహావిష్ణువే ఎత్తవలసి వచ్చింది._


_పదునాల్గవదైన నృసింహావతారంలో శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని బారినుండి ప్రహ్లాదునీ, సకల లోకాలనూ రక్షించాడు. 


_పదిహేనవదైన వామనా వతరణంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి అంతవఱకు అతని ఆక్రమణలోనున్న ముల్లోకాలనూ దేవేంద్రుని న్యాయ, సక్రమ, వైదిక పాలనలోనికి తెచ్చాడు._

_*(అవతరణమనగా దిగుట. కాబట్టి 'వామనావతరణ' పద ప్రయోగం దోషం కాదు.)*_


_పదహారవదైన పరశురామనామక అవతారంలో శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ ద్రోహులై లోకకంటకులుగా దాపురించిన క్షత్రియులను సంహరించాడు._ 


_పదిహేడవదైన వ్యాసనామక అవతారంలో ఆయన పరాశరునికి సత్యవతి ద్వారా జన్మించి వేదాలను సంస్కరించి, పరిష్కరించి, బోధించి జనంలోకి తెచ్చాడు._


_పద్దెనిమిదవదైన శ్రీమహావిష్ణువు దానవసంహారానికై కౌసల్యా దశరథుల పుత్రుడై శ్రీరాముడను పేర అవతరించి రావణ సంహారం దేవతల ఉద్ధరణ గావించాడు._


_ఆయన యొక్క పందొమ్మిదవ, ఇరువదవ అవతారాలు బలరామ, శ్రీకృష్ణులు. ఈ అవతారాలలో స్వామి దుష్టశిక్షణ, శిష్టరక్షణ తాను చేయడమే కాక తన వారిచేత దగ్గరుండి చేయించాడు. దానవాంశతో పుట్టిన మానవులు లక్షల సంఖ్యలో మడిసిపోగా భూ భారం తగ్గింది. త్వరలోనే శ్రీహరి కీకట దేశంలో జినపుత్రునిగా 'బుద్ధ' నామంతో జనించి దేవద్రోహులను మోహంలో ముంచెత్తి లోకాలను రక్షిస్తాడు. ఇది ఆయన ఇరవై ఒకటవ అవతారం._


_*ఇరవైరెండవ అవతారం కలియుగం ఎనిమిదవ సంధ్యలో రాబోతోంది. రాజవర్గం సమాప్తమై అరాచకం చెలరేగినపుడు శ్రీహరి విష్ణుయశుడను బ్రాహ్మణునింట 'కల్కి' అనే పేరుతో అవతరించి లోకాన్ని చక్కబరుస్తాడు.*_


_ఇవికాక ఇంకా అసంఖ్యాక సందర్భాలలో శ్రీమహా విష్ణువు భూమిపై అవతరించాడు. మనువులుగా జాతిచరిత్రగతిని మార్చగలిగే మహర్షులుగా ఆయనే ఉద్భవించాడు. విష్ణు విభూతులుగా పేరొందిన ఈ అంశాలనే మా గురువుగారు వేదవ్యాస భగవానులు మాతో గరుడ మహాపురాణమను పేరిట అధ్యయనం చేయించారు._

_*(1వ అధ్యాయం - సమాప్తం)*_


మహర్షులు

 *108 మహర్షులు*

——————

1)కశ్యప 2)అత్రి 3)భరద్వాజ 4)విశ్వామిత్ర 5)గౌతమ 6)జమదగ్ని 7)వశిష్ట 8)అగస్త్య 9)అరణ్యక 10)అష్టావక్ర 11)అర్వావసువు 12)అస్టిక 13)అంగీరస 14)అరుణి 15)ఉద్ధాలక 16)ఉదంక 17)ఉపమన్యు 18)ఉతథ్య 19)రురు 20)రోమశ 21)రైభ్య 22)ఋచీక 23)ఋభు 24)ఋష్యశృంగ 25)ఔరవ 26)బకదాల్భ్య 27)బృహస్పతి 28)ఋృగు 29)కచ 30)కణ్వ 31)కండు 32)కర్దమ 33)కాశ్యప 34)కపిల 35)కాత్యాయన 36)కామందక 37)కతువు 38)కౌశిక 39)గర్గ 40)గృత్సమద 41)గౌరముఖ 42)చ్యవన 43)జడ 44)జరత్కప 45)జాబాలి 46)జైగీషవ్య 47)జైమిని 48)తండి 49)దధీచి 50)దక్ష 51)దత్తాత్రేయ 52)దీర్ఘతమ 53)దూర్వాసో 54)దేవల 55)దేవద్యుతి 56)ధౌమ్య 57)నరనారాయణ 58)నారద 59)నిదాఘ 60)నచికేతు 61)పరాశర 62)పరశురామ 63)పిప్పలాద 64)పులస్త్య 65)పైల 66)పృథు 67)మరీచి 68)మతంగ 69)మంకణ 70)మాండవ్య 71)మార్కండేయ 72)మాణక్యవాచకర్ 73)మైత్రేయ 74)మృతండు 75)ముద్గల 76)యాజ్ఞవల్క్య 77)లోమశ 78)వామదేవ 79)వాల్మీకి 80)వాత్స్యాయన 81)విపుల 82)విశ్రవస 83)విభాండక 84)వ్యాస 85)వ్యాఘ్రపాద 86)వైశంపాయన 87)సహస్రపాద 88)సనక,సనందన,సనత్కుమార, సనత్సుజాత

89)సంవర్త 90)సాందీపని 91)సారస్వత 92)సూత 93)స్థూలకేశ 94)సౌభరి 95)శక్తి 96)శృంగి 97)శరభంగు 98)శతానంద 99)శమీక 100)శాండిల్య 101)శంఖు 102)లిఖిత 103)శిలాద 104)శుక 105)శుక్ర 106)శ్వేతకేతు 107)శౌనక 108)హరిత.

🙏🌹🙏🌹🙏🌹🙏

కర్మానుభవం

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐

         *కర్మానుభవం*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*మానవ జన్మకు విముక్తి దొరకాలంటే చేసిన పాపం అయినా, పుణ్యం అయినా అనుభవించితీరాల్సిందే!*


*ప్రారబ్ధం మొదట రచించబడి తరువాత శరీరం రచించబడుతుంది. కాబట్టి, చింత దేనికి.*                                              


*పూర్వం ఒక సాధువు ఉండేవాడు. అతడు నిరంతరం భగవంతుని నామం జపిస్తూ ఉoడేవాడు. అతని వద్ద అనేకమంది శిష్యులు ఉండేవారు*.. 


*వారు ఆ సాధువుకి సపర్యలు చేసేవారు. కొంతకాలానికి సాధువు ముసలివాడయైపోయాడు. మంచం మీదనుండి లేవలేని పరిస్థితి వచ్చింది.*. 


*అప్పుడు అతని శిష్యులు ఆ సాధువు నిత్యకృత్యాలు తీర్చుకోవడానికి సహాయం చేసేవారు. సాధువు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వారు వచ్చి అతడిని శౌచానికి తీసుకెళ్ళేవారు.*.  


*రాను రాను శిష్యులు రెండుమూడు సార్లు పిలిస్తేనే గాని వచ్చేవారు కాదు. సాధువు చాలా బాధపడేవాడు. నేను ఇలా మంచానపడి ఉండటం ఎందుకు భగవంతుడు తీసుకొనిపోతే బాగుండును అనుకొనేవాడు. భగవంతుని నామజపం మాత్రం నిరంతరం చేసేవాడు.*.  


*తరువాత కాలంలో ఒక బాలకుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడే వచ్చి సాధువుకి సపర్యలు చేసేవాడు. అతని స్పర్శ చాలా మృదువుగా ఆహ్లాదంగా ఉండేది. ఈ బాలకుడిని నేను ఎప్పుడూ చూడలేదే అని సాధువు అనుకొనేవాడు..*


*ఒకరోజు సాధువు ఆ బాలుని చేయి గట్టిగా పట్టుకొని, 'నీవెవరువు, నిన్ను ఇదివరకు నేను ఎన్నడూ చూడలేదు' అని అడిగాడు..*


*అప్పుడు భగవంతుడు తనను తాను ప్రకటించుకున్నాడు. సాధువు భగవంతునికి నమస్కరించి, 'స్వామి! నాకు మీరు సేవ చేస్తున్నారా, నన్ను ఈ విధంగా కష్టపెట్టే కంటే నీ వద్దకు తీసుకుపోవచ్చుకదా!' అన్నాడు..* 


*భగవంతుడు, 'నీవు చేసుకున్న కర్మఫలం ఇంకా మిగిలి ఉన్నది. అది పూర్తిగా తీరేవరకూ నీవు కష్టాలు అనుభవించాలి' అని సమాధానం చెప్పాడు..*


*సాధువు, 'స్వామి! మీరు తలచుకుంటే నా కర్మఫలం తొలగించవచ్చుకదా! మీకు అసాధ్యం ఏముంటుంది' అన్నాడు..*


*దానికి బదులుగా భగవంతుడు, 'నీ కర్మఫలం ఈ జన్మలో నీవు అనుభవించకపోతే, ఆ కర్మఫలం అనుభవించడానికి నీవు మరలా జన్మించాల్సి ఉంటుంది' అన్నాడు..*


*ఇంకా ఇలా చెప్పాడు. 'చిన్న చిన్న పాపాలు నా నామస్మరణ వలన తొలగిపోతాయి. పాపకర్మల ఫలం కూడా నా నామజపంతో పోగొట్టుకొనవచ్చును..*


*కానీ పెద్ధ పాపాలు ఖచ్చితంగా ఎవరికి వారే అనుభవించి తీరాలి. కానీ నా నామజపం వలన ఆ కష్టాలు సులభంగా గట్టెక్కుతాయి' అని చెప్పి భగవంతుడు అదృశ్యమయ్యాడు..*               


*"అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశ్శుభం"*


*"చేసిన పాపం అయినా, పుణ్యం అయినా అనుభవించితీరాల్సిందే!"*


*ఓం నమః శివాయ।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

భగవద్గీత

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

               *భగవద్గీత*        

         *ప్రతిరోజూ ఒక శ్లోకం*

*(అర్ధ తాత్పర్య వివరణ సహితం)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

     *అథ షష్ఠోధ్యాయః.*        

   *ఆత్మసంయమయోగః.*

    *ఆరవ అధ్యాయము*     

   *ఆత్మసంయమ యోగము*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఈ అధ్యాయమునకు ఆత్మసంయమ యోగము అని పేరు.  దీనినే ధ్యానయోగమనియు చెప్పుదురు.*  


*ఇచట 'ఆత్మ' అను పదమునకు శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుధ్ధి - ఇవియన్నియునని యర్థము.*


*వానియన్నింటియొక్క నిగ్రహమెట్లు సాధించవలెనో ఆ పధ్ధతులన్నియు చక్కగ ఈ అధ్యాయమున బోధింపబడుటచే దీనికి ఆత్మసంయమయోగమని పేరు వచ్చినది.*


*ఈ అధ్యాయమందలి ప్రధానవిషయములు:-*


*నిష్కామకర్మయోగప్రస్తావన, యోగారూఢుని లక్షణములు - 1వ శ్లోకము నుండి 4వ శ్లోకము వఱకు.*


*ఆత్మోధ్ధరణ, జితేంద్రియుడగు జ్ఞానియొక్క స్వభావము - 5వ శ్లోకము నుండి 10వ శ్లోకము వఱకు.*


*ధ్యానయోగపధ్ధతి - 11వ శ్లోకము నుండి 32వ శ్లోకము వఱకు.*


*మనోనిగ్రహమును గూర్చిన విచారణ - 33వ శ్లోకము నుండి 36వ శ్లోకము వఱకు.*


*యోగభ్రష్టుని సద్గతి, ధ్యానయోగము యొక్క మహిమ - 37వ శ్లోకము నుండి 47వ శ్లోకము వఱకు.*


*పూర్వాధ్యాయముతో ఈ అధ్యాయమునకు గల సంబంధము:-*


*5వ అధ్యాయ ప్రారంభమున కర్మసన్న్యాసము (జ్ఞానయోగము) గొప్పదా, కర్మయోగము గొప్పదా యను అర్జునుని ప్రశ్నను పురస్కరించుకొని శ్రీకృష్ణపరమాత్మ రెండును గొప్పవే యనియు, అయినను సాధకులకు మొట్టమొదట కర్మయోగమే సులభసాధ్యమగుట బట్టి శ్రేయస్కరమని నుడువుచు, ఆ రెండు మార్గములను గూర్చి క్షుణ్ణముగ విచారణ సలిపి తుట్టతుదకు ఆ రెండింటికి సహాయభూతముగ నుండునట్టి ధ్యానయోగము (ఆత్మసంయమయోగము)ను ఒకింత ప్రస్తావించిరి.  కాని దానినిగూర్చి అచట వివరముగ తెలుపలేదు.*


*అందుచే ఈ 6వ అధ్యాయమును పూర్తిగ ఆ ధ్యానయోగము యొక్క వివరణమునకై భగవానుడు ప్రత్యేకించినాడు.  ఈ ప్రకారముగ ధ్యానయోగము (ఆత్మసంయమనయోగము)ను లెస్సగ వర్ణింపదలచినవాడై గీతాచార్యుడు ప్రప్రథమమున నిష్కామకర్మయోగమును గూర్చి ఒకటి రెండు మాటలను జెప్పదలచి ఇవ్విధముగ అధ్యాయమును ఆరంభించుచున్నాడు.*


*(రేపటినుండి అధ్యయనం చేద్దాం)*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

 *జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

*పదవిభాగం, తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఒక నగరంలో మంచి రాజు పరిపాలకుడుగా ఉండడం వలన దేశానికి సర్వ సమృద్ధి కలుగుతుంది. అలాగే తన హృదయపద్మంలో పరమేశ్వరుడు ఉండటంవల్ల తనకు సర్వ సమృద్ధి కల్గిందని శంకరులు చెప్పారు.*


*శ్లోకం : 39*     


*ధర్మో మే చతురంఘ్రికః సుచరితః పాపం వినాశం గతం*


*కామక్రోధమదాదయో విగలితాః కాలాః సుఖావిష్కృతాః ।*


*జ్ఞానానన్దమహౌషధిః సుఫలితా కైవల్య నాథే సదా*


*మాన్యే మానసపుణ్డరీకనగరే రాజావతంసే స్థితే ।*


*పూజ్యుడూ, మోక్షాధిపతీ అయిన చంద్రశేఖరుడు (చక్రవర్తి) పద్మము వంటి నా మనో నగరాన్ని, పరిపాలిస్తుండగా, ధర్మధేనువు నాలుగు పాదాలతో నడుస్తుంది. పాపము నశించింది. కామక్రోధమదమాత్సర్యాది అంతశ్శత్రువులు పారిపోయారు. పక్షము, మాసము, సంవత్సరము మొదలయిన కాలములు, సుఖంగా గడుస్తున్నాయి. జ్ఞానముతో కూడిన మోక్షము అనే గొప్ప ಓషధి ఫలించింది. శివుడనే రాజశేఖరుడు నా హృదయనగరాన్ని పరిపాలిస్తుండగా, సర్వ సౌఖ్యములూ కలిగాయి. ఇంక దుర్భిక్షము ఎక్కడ ఉంటుంది. నామనస్సనే నగరము సుభిక్షముగా ఉంది . దుర్భిక్షము లేనేలేదు. శివుడు మనస్సునందు ఉంటే, ఏకష్టమూ ఉండదని భావము.*


*వివరణ :-*


*ఉత్తముడైన రాజు రాజ్యాన్ని పాలిస్తుండగా, ధర్మము నాలుగు పాదాలతో నడచి, దేశం సుభిక్షంగా ఉండేటట్లు, మోక్షప్రదుడైన ఈశ్వరుడు హృదయ పుండరీకంలో నెలకొనియుంటే, పాపములు, పాపపు బుద్దులూ సంపూర్ణముగా నశించి జ్ఞానం అనే పంట పండి, జీవితం ఆనంద భరితమవుతుందని సారాంశం.*


*భగవద్గీత కూడా, భగవంతుడు ఉన్న చోటనే అన్నీ ఉంటాయని చెప్పింది.*


*యత్ర యోగీశ్వరఃకృష్ణో,*

*యత్ర పార్ధో ధనుర్ధరః*

 *తత్ర శ్రీ ర్విజయో భూతిః*

 *ధ్రువానీతిర్మతిర్మమ॥* "


*కృష్ణార్జునులు ఉన్న చోటనే సంపదలూ, సర్వ విజయములూ సకల ఐశ్వర్యములూ, సుస్థిరమైన నీతి ఉంటాయి.*


*కనుక మనం పరమేశ్వరుని మన హృదయ సింహాసనములో నిలిపి, పట్టాభిషిక్తుణ్ణి చేస్తే, మనకు సకల శుభాలూ కలుగుతాయని గ్రహించాలి.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(71వ రోజు)*

   *(క్రితం భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

           *శకుంతల గాథ*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఒకనాడు దుష్యంతుణ్ణి తలచుకుంటూ శకుంతల కలల లోకంలో విహరిస్తున్నది. ఆ సమయంలో ఆశ్రమానికి దుర్వాసుడు వచ్చాడు. వచ్చిన మునిని గమనించలేదు శకుంతల. అతనిని కన్నెత్తి చూడలేదు. పన్నెత్తి పలకరించలేదు. దాంతో కోపం వచ్చింది అతనికి.*


*‘‘ఎవరినయితే నువ్వు తలచుకుంటూ ఉన్నావో, ఆ వ్యక్తి నిన్ను మరచిపోవుగాక.’’ అని శపించాడు. వెళ్ళబోయాడు. అప్పుడు దుర్వాసుణ్ణి గమనించి, చేతులు జోడించి నమస్కరించింది శకుంతల. చేసిన తప్పుని క్షమించమంటూ, శాపవిమోచనం ప్రసాదించమని వేడుకుంది.‘‘తాను ఇచ్చిన ఉంగరం ఆ వ్యక్తి చూసినప్పుడు, నిన్ను అతను గుర్తిస్తాడు. జరిగిందంతా జ్ఞాపకానికి వస్తుంది.’’ అన్నాడు దుర్వాసుడు. నిష్క్రమించాడక్కణ్ణుంచి*


*దుష్యంతుని పిలుపు కోసం చూసి చూసి అలసిపోయి, అఖరికి కణ్వముని ఆదేశానుసారం భరతుణ్ణి తీసుకుని, తానే స్వయంగా బయల్దేరింది శకుంతల. రాజధానికి చేరింది. దుష్యంతుణ్ణి సందర్శించి, శకుంతలనంటూ, భరతుడు కుమారుడన్నది. తమని పరిగ్రహించమన్నది.*


*‘‘నువ్వెవరో నాకు తెలియదు. ఈ బాలుడు నా కుమారుడు ఏమిటి? అంతా అబద్ధం. తప్పు’’ అన్నాడు దుష్యంతుడు. దిగ్ర్భాంతి చెందింది శకుంతల. విలవిలలాడింది. భోరుమంది. వేటకి దుష్యంతుడు అడవికి రావడం, అలసిపోవడం, కణ్వాశ్రమనికి చేరడం, తనని చూడడం, గాంధర్వ వివాహం చేసుకోవడం అంతా దుష్యంతునికి గుర్తు చేసింది శకుంతల. ఏదీ గుర్తుకు రాలేదు దుష్యంతునికి. తల అడ్డంగా ఊపాడతను.*


*‘‘నువ్వు చెప్పినవేవీ నాకు సంబంధించినవి కావు. కావాలనే నువ్వెందుకో అబద్ధాలు ఆడుతున్నావు. పాపాన్ని మూటగట్టుకుంటున్నావు.’’ అన్నాడు దుష్యంతుడు.*


*శకుంతలను అసహ్యించుకుని అక్కణ్ణుంచి నిష్క్రమించబోయేంతలో ఆకాశవాణి ఇలా పలికింది.*


*‘‘దుష్యంతమహారాజా! శకుంతల చెప్పింది అంతా నిజం. ఆమె నీ భార్య, భరతుడు నీ కొడుకు. వారిని పరిగ్రహించి, నీ నిజాయితీని నువ్వు నిలుపుకో! పదే పదే శకుంతలను అవమానించకు.’’*


*‘‘మహారాజా! మీరు నాకు ఇచ్చిన ఉంగరాన్ని చూడండి, మీకు అంతా గుర్తుకు వస్తుంది.’’ అన్నది శకుంతల. ఆనాడు తనకి ఇచ్చిన ఉంగరాన్ని దుష్యంతునికి చూపించింది. ఉంగరాన్ని చూడగానే అతనికి అంతా జ్ఞాపకానికి వచ్చింది. చేసిన తప్పును క్షమించమన్నట్టుగా సన్నగా కన్నీరు పెట్టుకున్నాడు. శకుంతలనూ, భరతుణ్ణీ భార్యాపుత్రులుగా స్వీకరించాడు.*


*దుష్యంతుని తర్వాత భరతుడు చక్రవర్తి అయ్యాడు. ముల్లోకాల్లోనూ ఎనలేని కీర్తిప్రతిష్టలు గడించాడు. గంగాతీరంలో దీర్ఘతపుని ఆధ్వర్యంలో యూభై అయిదు అశ్వమేధయాగాలు చేశాడు. యమునాతీరంలో డెబ్బయి ఎనిమిది వాజిమేధాలు చేశాడు. మొత్తానికి నూటముప్పయి మూడు అశ్వమేధయాగాలు చేసి, భూరిదక్షిణలు ఇచ్చాడందరికీ. సమస్తరాజులూ సామంతులయ్యారతనికి. ఇరవైవేల సంవత్సరాలు పాలించాడు భరతుడు. చివరకు ముక్తసంగుడై వనాలకు వెళ్ళిపోయాడు. తపస్సుతో దేహాన్ని చాలించాడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

శ్రీ విశ్వనాధస్వామి

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

శ్రీ విశ్వనాధస్వామి. - వారణాశి

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*సప్తమోక్షక్షేత్రాలలో ఒకటైన కాశీ నగరమందు పవిత్ర గంగానదీ తీరంలో వెలసిన జ్యోతిర్లింగం కాశీవిశ్వేశ్వరుడు.*


*వరణ,అసి అనే రెండు నదులమధ్య ఉన్న నగరం వారణాశి మహా పుణ్యక్షేత్రం.*


*ప్రపంచమంతా బ్రతకడoకోసం అందరూ ఎన్నో కష్టాలు పడుతుంటే, కొంతమంది భక్తులు మాత్రం ఈ వారణాశిలో మరణించి మోక్షాన్ని పొందాలని తాప్రతాయిపడుతుంటారు. కాశీలో మరణించిన వారు సరాసరి ఈశ్వర సాన్నిధ్యాన్ని చేరుకొంటారని ప్రతీతి.*


*పురాణగాధ:~*


*కాశీక్షేత్రానికి వారణాసి, మహస్మశానం, ఆనందకాననం, రుద్రవాసం, ముక్తిభూమి ,శివపురి మొదలైన పేర్లు చాలా ఉన్నాయి. వేదాలలో,పురాణాలలో కాశీక్షేత్రం మహిమ గురించి వివరించారు.*


*సనాతనమైనటువంటి బ్రహ్మ సృష్టి మొదట్లో నిర్గుణం నుంచి సగుణమైన శివరూపాన్ని చేశాడు.తిరిగి ఆ శివశక్తితో స్త్రీ ,పురుష భేధంతో ప్రకృతి, పురుషులని సృష్టించాడు. వారిరువురిని ఉత్తమసృష్టి సాధనకై తపస్సు చేయమని ఆనతినిచ్చాడు.*


*తపస్సు కోసం అనువైన స్థలం చెప్పమని వారు బ్రహ్మను ప్రార్ధించగా ఆయన శివుడు నించున్నచోటు నుండి ఎటుచూసినా అయిదు క్రోసుల దూరం ఉండేట్టు భూమిని సృష్టించి అత్యంత శోభాయమానమైన పంచకాశీ నగరాన్ని నిర్మించాడు.*


*అక్కడ ప్రకృతి, పురుషులు తపస్సు చేశారు. ఈచోటనే విష్ణువు శివుని కోసం తపస్సు చేశాడు. ఆ తపము ఫలించి అక్కడ అనేక జలధారలు ప్రవహించాయి. ఆదృశ్యాన్ని చూసి విష్ణువు తలాడించగా, ఆయన చెవి నుండి ఒక మణి క్రిందపడింది. ఆ స్థానం మణికర్ణిగా గా పేరుగాంచింది.*


*మహేశ్వరుడు ఈ కాశీ నగరమందు జ్యోతిర్లింగరూపంలో విశ్వేశ్వరుడు నామధేయుడై అవతరించాడు.*


*ప్రళయకాలమందున ప్రపంచమంతా మునిగిపోయినా ఈ కాశీపట్టణంను మాత్రం పరమేశ్వరుడు తన త్రిశూలంతో పైకెత్తి పట్టుకొని రక్షించాడు. ఈ విధంగా కాశి అవినాశి అయ్యింది.*


*ఈ కాశి నగరాన్ని దండపాణి, కాలబైరవుడు సంరక్షకులుగా కాపాడుతుంటారు. ఇక్కడ గంగానదిలో 84 ఘాట్ లున్నాయి. ఎన్నో తీర్ధకుండాలున్నాయి.*


*విశ్వేశ్వరుని మందిరం చుట్టుప్రక్కల వందలాది శివలింగాలు, ఆలయాలు, ఆలయం వెలుపుల విశాలాక్షి అమ్మవారి మందిరం, కాశీ అన్నపూర్ణేశ్వరి మాత మందిరం, వారాహి మాత మందిరం కలవు.*


*ఒకటేమిటి కాశీక్షేత్రమంతా పరమేశ్వరుని దివ్యధామం.*


*ఉదయం గంగాస్నానాంతరం కేధార్ ఘాట్ లో పెద్దలకు నివాళి, కేధార్నాధుని మందిరంలో స్వామిని దర్శించడం, మిట్ట మధ్యాహ్నం సమంత్రయుక్తంగా మణికర్ణికఘాట్ లో స్నానం, తదుపరి కాశీ విశ్వేరుని, అమ్మవార్లను దర్శించడం , సాయంత్రం దశాశ్వమేధఘాట్ లో గంగాహరతిని చూడటం అదోక అనీర్వచనీయమైన దివ్యానుభూతి.*


*ఓం నమః శివాయ॥*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(70వ రోజు)*

   *(క్రితం భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

          *యయాతి చరిత్ర*

           *శకుంతల గాథ*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ముసలితనం ప్రాప్తించినా యయాతికి స్త్రీ వ్యామోహం పోలేదు. యౌవనాన్ని కోరుకున్నాడతను. కొడుకులను పిలిచాడు. వార్ధక్యాన్ని స్వీకరించి, వారిలో ఎవరయినా తనకి యౌవనాన్ని ప్రసాదించడంటూ కోరాడు. పెద్దవాళ్ళు ఎవరూ తండ్రి కోరికను మన్నించలేదు. అందరిలోకి చిన్నవాడు, ఆఖరివాడు శర్మిష్ఠ కొడుకు పూరుడు, తండ్రి కోరికను అంగీకరించాడు. తండ్రిని సంతోషపరచడమే విధిగా భావించాడు. తన యౌవనాన్ని యయాతికి ఇచ్చి, అతని వార్ధక్యాన్ని తాను స్వీకరించాడు. పూరుని యవ్వనంతో యయాతి ఎనలేనంతగా స్త్రీ సుఖాన్ని అనుభవించాడు. అనేక సంవత్సరాలు విషయసుఖాల్లో తేలి తూలాడు. ఆఖరికి అందులో విరక్తి కలిగిందతనికి. ఆ విరక్తితో యజ్ఞాలు చేసి భగవంతుణ్ణి ఆరాధించాడు. యవ్వనాన్ని పూరునికి ఇచ్చి, తన ముసలితనాన్ని తాను స్వీకరించాడు.*


*పూరుణ్ణి సార్వభౌముణ్ణి చేసి, అన్నలంతా అతని ఆజ్ఞను అనుసరించాలని శాసించాడు. నిరాసక్తుడై తపోవనాలకు తరలిపోయాడు. అక్కడ భగవంతుని ఆరాధిస్తూ, విష్ణుపదం పొందాడు. దేవయాని కూడా పతిని అనుసరించి, భగవంతునిపై మనసు నిలిపి, దేహత్యాగం చేసింది.ఈ పూరువంశం నుండే భరతవంశపు రాజులంతా జన్మించారు. మేధాతిథి, దుష్యంతుడు ఈ వంశంలోని వారే!*


*శకుంతల గాథ:~*


*శకుంతల, దుష్యంతుల కథ అందరికీ తెలిసిందే! ఈ కథనే మహాకవి కాళిదాసు నాటకంగా మలిచాడు. భారతంలో విపులంగా వివరించిన ఈ కథను, భాగవతంలో క్లుప్తీకరించాడు వ్యాసుడు.*


*ఒకప్పుడు విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ ఉండగా, అతని తపస్సును భగ్నం చేసేందుకు మేనకను పంపాడు ఇంద్రుడు. మేనక ప్రవేశంతో విశ్వామిత్రుని తపస్సు భగ్నమయింది. మేనకను మోహించాడు విశ్వామిత్రుడు. అతని వలన మేనకకు ఒక బాలిక జన్మించింది. ఆ బాలికను అక్కడే అడవిలో విడచిపెట్టి, మేనక స్వర్గానికి వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు కూడా తనదోవన తాను వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు వదలి వేసిన ఆ శిశువును, తమ రెక్కల నీడన పక్షులు రక్షించసాగాయి. పక్షులు రక్షిస్తున్న ఆ బాలికను కణ్వమహర్షి చూశాడు. తన ఆశ్రమానికి తీసుకునిపోయాడు ఆ పిల్లను. పెంచసాగాడక్కడ. పక్షులచే రక్షించబడినందున ఆ పిల్లకు ‘శకుంతల’ అని పేరు పెట్టాడు కణ్వుడు.*


*ఆశ్రమంలో పెరిగి పెద్దదయింది శకుంతల. యౌవనవతి అయింది. అందాలను సంతరించుకుంది.*


*ఒకనాడు దుష్యంతుడు వేటకు వచ్చాడు. అరణ్యంలో వేటాడి వేటాడి అలసిపోయాడు. దగ్గరగా ఉన్న కణ్వాశ్రమానికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఆశ్రమంలో కణ్వుడు లేడు. శకుంతలే దుష్యంతుణ్ణి ఆహ్వానించి, గౌరవించింది. శకుంతల అందచందాలకు దుష్యంతుడు అప్రతిభుడయ్యాడు. మోహించాడామెను.*


*శకుంతల కూడా దుష్యంతుణ్ణి ఆరాధనగా చూసింది. తనను వివాహమాడమన్నాడు దుష్యంతుడు. కణ్వమహర్షి అనుమతి లేనిదే అది సాధ్యం కాదన్నది శకుంతల. మహర్షి రాక కోసం వేచి చూద్దామన్నది. వినలేదు దుష్యంతుడు. క్షత్రియులకు గాంధర్వవివాహం శాస్త్రసమ్మతం అన్నాడు. శకుంతలను ఒప్పించాడు. ఆమెకు పుట్టిన కుమారుణ్ణే యువరాజుని చేస్తానని మాటిచ్చాడు. ఆఖరికి గాంధర్వ విధినే శకుంతలను వివాహమాడాడు దుష్యంతుడు. ఆ రాత్రి ఆమెను చేరి సుఖించాడు. మర్నాడు, రాజధానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. కూడా తను వస్తానన్నది శకుంతల. పరివారాన్నీ, పరిచారికుల్నీ పంపి, సగౌరవంగా తీసుకుని వెళ్తానన్నాడు దుష్యంతుడు. ఆలోపు కణ్వమహర్షి కూడా వస్తాడన్నాడు. తన వేలి ఉంగరాన్ని గుర్తుగా, ప్రేమగా శకుంతలకు ఇచ్చి వెళ్ళిపోయాడతను.*


*కొంతకాలానికి శకుంతల గర్భవతి అయింది. అప్పుడు ఆశ్రమానికి చేరుకున్నాడు కణ్వమహర్షి. అతని దృష్టిలో పడేందుకు భయపడింది శకుంతల. తాను చేసిన పనికి మహర్షి మందలిస్తాడనుకున్నది. అయితే దూరదృష్టితో అంతా గ్రహించిన కణ్వుడు, శకుంతల-దుష్యంతుల వివాహాన్ని అంగీకరించాడు. ఆమెను దీవించాడు.నెలలు నిండాయి. శకుంత ల కుమారుణ్ణి కన్నది. అతనికి భరతుడు అని పేరు పెట్టాడు కణ్వుడు.*


*విష్ణుదేవుని అంశతో ఎన్నో శుభలక్షణాలతో జన్మించిన భరతుడు, బాల్యంలోనే మహావీరుడనిపించుకున్నాడు. అరణ్యంలో సింహాలతోనూ, పులులతోనూ ఆటలాడుకునేవాడు. అతని శౌర్యసాహసాలకు అశ్చర్యపోయేవారంతా.*


*ఎంతకాలమయినా దుష్యంతుడు తిరిగి రాలేదు. శకుంతలను తోడుకుని తీసుకుని వచ్చేందుకు పరివారాన్నీ, పరిచారికుల్నీ పంపలేదు. భర్త తనని మరచిపోయాడనుకున్నది శకుంతల. బాధపడింది. శకుంతలను దుష్యంతుడు మరచిపోయేందుకు ఒక కారణం ఉన్నది..*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

ఆహోబిలంలో బ్రహ్మోత్సవాలు*

 *ఆహోబిలంలో బ్రహ్మోత్సవాలు* 


 *మార్చి 12 బుధవారం ఆహోబిలం శ్రీ నరసింహస్వామి కల్యాణం సందర్భంగా...* 


*పాల్గుణ శుద్ధ పంచమి నుండి పౌర్ణమి వరకు ఆహోబిలంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి వారికి కళ్యాణోత్సవం ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. ఎక్కడైనా భగవంతుడి కళ్యాణం జరిగితే భక్తులే భగవంతుడి వద్దకు వెళుతుంటారు. కానీ నా పెళ్ళికి రండి అంటూ దైవమే భక్తుల వద్దకు వెళ్లే సందర్భం మాత్రం ఒకే ఒక్కచోట ఉంటుంది. అది అహోబిల లక్ష్మీనరసింహ స్వామికే ప్రత్యేకం. అహోబిలం క్షేత్రంలో కొలువైన జ్వాలా నరసింహస్వామి. ప్రహ్లాదవరద స్వాములు పల్లకిలో కొలువై గ్రామాలకు వెళ్లి భక్తులకు తమ దర్శన భాగ్యం కల్పిస్తుంటారు. ఈ ప్రత్యేకమైన వరాన్ని కర్నూలు జిల్లాలోని 33 గ్రామాల ప్రజలు అందుకుంటున్నారు.* 


*ఇందులో భాగంగానే పార్వేట పేరిట ఆలయాన్ని, ఆప్తులను విడిచి భక్తుల చెంతకు పయనమవుతారు స్వామి. పరి అంటే గుర్రం. గుర్రంపై వేటాడడాన్ని పార్వేట అంటారు. ఈ సంప్రదాయం చాలా వైష్ణవ క్షేత్రాల్లో ఉంటుంది. ఇది ఒక్కరోజు మాత్రమే కొనసాగుతుంది. కానీ అహోబిలంలో మాత్రం ఈ ఉత్సవం పేరిట ఏకంగా 45 రోజుల పాటు స్వామిని ప్రజల మధ్యనే ఉంచుతారు. ఎగువ అహోబిలంలోని జ్వాలా నరసింహ స్వామి, దిగువ అహోబిలంలో ఉన్న ప్రహ్లాద వరద స్వామి ఇద్దరినీ ఒకే పల్లకిలో ఉంచి ఈ ఉత్సవాన్ని జరపడం అనవాయితీ. ఈ కార్యక్రమానికి ముందు 45 రోజుల పాటు స్వామివార్లకు సరిపడా ఆహారాన్ని అందించే "అన్న కూటోత్సవం" నిర్వహిస్తారు.*


*ఆ తర్వాత దాదాపు 45 రోజులపాటు ప్రజల మధ్యనే రాత్రనక, పగలనక గడుపుతూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ, తన కల్యాణోత్సవానికి రమ్మని భక్తులను ఆహ్వానిస్తారు స్వామి. కార్యక్రమం పూర్తి చేసుకుని అలసి సొలసి అహోబిలం చేరిన స్వామివార్లకు బడలిక తొలగేలా పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం 81 కలశాలతో తిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత పాల్గుణ శుద్ధ పంచమినుంచి పౌర్ణమి వరకు స్వామివార్లకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. కులమతాలకు అతీతంగా స్వామి ఉత్సవాలు జరుగుతాయి. స్వామి పరిణయమాడిన చెంచులక్ష్మిని స్థానిక చెంచులు తమ ఆడపడుచుగా భావిస్తారు. నరసింహ స్వామిని ఓబులేసుగా పిలుస్తారు. పార్వేట ఉత్సవాల్లో వీరే ముందుడి పల్లకిని ఆహ్వానించి, నడిపిస్తారు. స్వామి తమ గ్రామానికి వచ్చిన రోజునే సంక్రాంతిగా భావించి పండగ చేసుకుంటారు.*


*శ్రీవైష్ణవ సాంప్రదాయంలో పరమ పవిత్రంగా భావించే 108 దివ్యక్షేత్రాలలో ఒకటి అహోబిల నవనారసింహ క్షేత్రం. నల్లమల అడవులలో ఉన్న ఈ క్షేత్రం భక్తి ప్రపత్తులకేకాదు ప్రకృతి రామణీయతకు కూడా ఆలవాలం. ఈ క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణంలో సమగ్రంగా వివరించారు.*


*రాక్షస రాజైన హిరణ్యకశిపుని రాజ్యం ఇది. తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడడానికి హరి స్తంభంనుండి నరసింహుని రూపంలో వెలువడి హిరణ్యకశిపుని వధించింది ఇక్కడే. నరసింహస్వామి ఆవిర్భవించి హిరణ్యకశిపుని తన గోళ్ళతో చీల్చి చంపినప్పుడు ఆయన బలాన్ని, శక్తిని దేవతలు అహో బలం.. ఆహో బలం.. అని ప్రశంసించారు గనుక ఈ స్థలానికి వారు కీర్తించినట్లు అహోబలం అని పేరు వచ్చింది. ఎగువ అహోబిలంలో ప్రహ్లాదుని తపస్సుకి మెచ్చి నరసింహస్వామి బిలంలో స్వయంభువుగా వెలిశాడు గనుక అహో బిలం అన్నారు. ఈ క్షేత్రంలో స్వామీ తొమ్మిది ప్రదేశాలలో తొమ్మిది రూపాలలో ఆవిర్భవించారు. అందుచేతనే ఈ క్షేత్రం నవ నారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.*


*బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే స్వామివారి కల్యాణం తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు అహోబిలం చేరుకుంటారు. కల్యాణోత్సవాల్లో మెరిసిపోతున్న స్వామి అమ్మవార్లను చూసి భక్తులు పరవశులవుతారు. అసంఖ్యాకంగా తరలివచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు.*


*┈┉┅━❀꧁హరి ఓం꧂❀━┅┉┈* 

      *ఆధ్యాత్మికం, బ్రహ్మానందం*

🌺🌺🌺 🙏🕉️🙏 🌺🌺🌺

శివానందలహరి

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*శ్రీ ఆదిశంకరాచార్య విరచితం*


*శివానందలహరి – శ్లోకం – 53*


*ఆకాశేన శిఖీ సమస్తఫణినాం నేత్రా కలాపీ నతా-*

*ఽనుగ్రాహిప్రణవోపదేశనినదైః కేకీతి యో గీయతే ।*

*శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటన్తం ముదా*

*వేదాన్తోపవనే విహారరసికం తం నీలకణ్ఠం భజే ॥ 53 ॥*


ఆకాశము అనే పింఛముకలదీ, సర్పములరాజు వాసుకి అలంకారముగా కలదీ, నమస్కరించువారిని అనుగ్రహించు ప్రణవనాద ధ్వనులనే కేక కలిగినదీ (నెమలి అరుపులకి కేక అను పేరు), పర్వతరాజపుత్రి పార్వతి అను గొప్పకాంతిగల నల్లమేఘమును చూచి ముదమునొంది నాట్యము చేయునదీ, ఉపనిషత్తులనెడు ఉద్యానవనములో‌ విహరించుటయందు అనురాగము కలదీ‌ అగు ఆ (శివుడు అనబడే) నెమలిని సేవించున్నాను.


వ్యోమకేశుడూ, సర్పభూషణుడూ, భక్తులను ప్రణవోపదేశముతో‌ అనుగ్రహించువాడూ, పార్వతీ‌వల్లభుడూ, వేదాన్తవేద్యుడూ అయిన శివుని నమస్కరించుచున్నాను.


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


శ్రీ ధర్మశాస్త సేవాసమితి 🐆 విజయవాడ 🏹 7799797799

కష్టాలు, విఘ్నాలు

 :

_*"కష్టాలు, విఘ్నాలు మనసును బలహీనపరుస్తున్నాయి ! వాటి నుండి ఎలా బయటపడాలి ?"*_


_*మనం ఎప్పుడూ విజయాన్నే కోరుకోవడంవల్ల బాధకు లోనవుతున్నాం. కష్టాలు, విఘ్నాలు ఎవరినీ వదలవు. బాధైనా, కోపమైనా మితంగా ఉండే సందర్భాలున్నాయి. ఎవరికైనా రోజూ కష్టాలే ఉండవు. కాకపోతే వాటినే ఎక్కువగా గుర్తుంచుకొని స్మరిస్తుండటంచేత అలా భావిస్తుంటాం. మనకి లభించిన సంతోషాలను గుర్తుంచుకోవటంలేదు. లేదా అత్యాశ వల్ల పట్టించుకోవటంలేదు. మన విధానం ఎలా ఉండాలో తెలియజెప్పటమే అవతార పురుషుల అంతర్యం. శ్రీరాముడు, హనుమంతుడు కూడా సీతాదేవి విషయంలో బాధను అనుభవించారు. ఆమె కనిపించలేదని హనుమంతుడు చనిపోవాలని అనుకున్నాడు. కష్టాలు, విఘ్నాలను తట్టుకోవటంలోనే మన మనోనిగ్రహం తెలుస్తుంది. శ్రీరాముడు, సీతాదేవి కోసం దుఃఖించాడే తప్ప అలాగే చింతిస్తూ కూర్చుండి పోలేదు. అంత బాధలోనూ తన కర్తవ్యాన్ని విస్మరించనంత ధీరత్వంతో ఉన్నాడు. విజయం కోసం వెంపర్లాడలేదు. కేవలం ధర్మంగా తన పని తాను చేస్తూ వెళ్ళాడు. అదే మనకు సద్బోధ !*_


_*"సత్యం ఆవిష్కారం కావాలంటే అన్నీ త్యాగం చేయాల్సిందేనా ?"*_


_*హిందూ సంస్కృతి పరమ సత్యం కోసం దేన్నైనా త్యాగం చేయమంటుంది. బుద్ధభగవానుడు, రాఘవేంద్రస్వామి సత్యం కోసం సంసారాలే త్యాగం చేశారు. ఎవరికి వారు తాము ఆరాధించే గురువునే అందరూ పూజించాలి అనుకుంటారు. మనం చూస్తున్న మత ఘర్షణలన్నీ దీని వల్లే జరుగుతున్నాయి. జీవితంలో వివేకవంతమైన ప్రయాణం అవసరం. జీవితం గురించిన పరిపూర్ణ అవగాహన కోసమే సత్సంగాలు. మంచి మనసు అంటే సున్నితమైన మనసు. జీవితంలో అన్నీ సుకుమారంగా ఉండాలి. జ్ఞానులు ఫలానా పనే చేస్తామని భీష్మించుకోరు. తమ ముందుకు వచ్చిన పని పూర్తి చేస్తూ ముందుకు వెళతారు. శ్రీరమణమహర్షి ఒకరోజు గోశాలలో పనివారిని తదేకంగా చూస్తూ తన్మయత్వం చెందారు. ఇంతలో ఎవరో వచ్చి తమ కోసం భక్తులు ఎదురు చూస్తున్నారని చెప్పగానే ఏమాత్రం విసుగు చెందకుండా లేచి వెళ్ళారు. రాజ్య పట్టాభిషేకం చేస్తామన్నప్పుడు శ్రీరాముడు ఎలా ఉన్నదో.. అరణ్యవాసానికి వెళ్ళమన్నప్పుడు కూడా అలాగే ఉన్నాడు. మహాత్ముల ప్రతి కడలికలో కూడా ఆ సుకుమారం ఉంటుంది !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_

_*'వడలాల్సింది కర్తృత్వాన్ని, కర్మలను కాదు !'*-

ఎక్కువ మాటల కన్నను

 *2041*

*కం*

ఎక్కువ మాటల కన్నను

నెక్కువ భావమ్ము నిచ్చు నేర్పరి తనముల్

పెక్కుగ విలువైనవనెడి

చక్కని సత్యమ్మునెపుడు సడలకు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ఎక్కువగా మాట్లాడటం కన్నా ఎక్కువ భావము ను కలిగించే నేర్పరితనములు ఎక్కువ విలువైనవనే చక్కని సత్యాన్ని విడువవద్దు.

*సందేశం*:-- ఎక్కువగా మాట్లాడటం కన్నా ఎక్కువ భావాన్ని కలిగించే ప్రవర్తనన అలవాటు చేసుకుంటే దాని వలన ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. ఉదాహరణకు మంచిని బోధించడం కన్నా ఎంతో కొంత మంచి చేస్తూ ఉంటే మంచి బాగా వ్యాపించగలదు,ఉదాహరణకు మీ ఇంటిముందు శుభ్రం చేయమని పదేపదే చెప్పడం కన్నా శుభ్రం చేయడం వలన ఎక్కువ లాభం ఉంటుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

⚜ శ్రీ వాసుదేవపురం మహావిష్ణు దేవాలయం

 🕉 మన గుడి : నెం 1046


⚜ కేరళ  : అలువా - కొచ్చిన్ 


⚜ శ్రీ  వాసుదేవపురం మహావిష్ణు దేవాలయం



💠 శ్రీ వాసుదేవపురం మహావిష్ణు దేవాలయం కేరళ రాష్ట్రంలోని అలువా (జిల్లా ఎర్నాకులం) శివారులో పరశురాముడి చేత ప్రతిష్టించబడిందని నమ్ముతారు .


💠 భగవంతుడు మహాలక్ష్మి దేవిని ఆలింగనం చేసుకుంటున్నాడనే భావనలో మహర్షి పరశురాముడు మహావిష్ణువు విగ్రహాన్ని ప్రతిష్టించాడు. ప్రతిష్ఠాపన తర్వాత మహర్షి ఆలయ బాధ్యతలను కొంతమంది స్థానిక బ్రాహ్మణులకు అప్పగించారు. 


💠 ఈ బ్రాహ్మణులు మహాలక్ష్మి దేవి అనుగ్రహంతో ధనవంతులయ్యారు. కానీ తరువాత వారు తమ ఉన్నతికి కారణమైన ఆలయ కార్యకలాపాల పట్ల ఉదాసీనంగా మారారు.

 ఈ దేవాలయం కూడా కాలక్రమంలో తన సంపదను, వైభవాన్ని కోల్పోయింది.


💠 చాలా కాలం తర్వాత గురువాయూరప్పన్ యొక్క గొప్ప శిష్యుడైన విల్వమంగళం స్వామికల్ ఆలయాన్ని సందర్శించాడు. మహావిష్ణువు సేవలో నిమగ్నమైన మహాలక్ష్మి దర్శనం అతనికి లభించింది.


💠 స్వామివారు మరియు అమ్మవారి భౌతిక సన్నిధి ఉన్న ఆలయం యొక్క అధ్వాన్న స్థితిని చూసి స్వామివారు ఆశ్చర్యపోయారు. 

అతను దేవిని అడిగాడు, ఆలయం శ్రేయస్సు కోల్పోవడానికి మరియు ఆమె ఉనికిలో ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో నివసించే ప్రజల పేదరికానికి కారణం ఆలయ అధికారులు, ప్రజలు ఆలయ ఆచార వ్యవహారాలను పట్టించుకోవడం లేదని, అందుకే తాను భగవంతుని సేవలో నిమగ్నమై ఉన్నానని ఆమె సమాధానమిచ్చారు. దీంతో ప్రజల ప్రార్థనలకు హాజరయ్యేందుకు ఆమెకు సమయం దొరకడం లేదు.


💠 విల్వమంగళం స్వామివారు భక్తుల ప్రార్థనలకు సమాధానం ఇవ్వకపోతే, వారు ఆలయ దర్శనం మానేసి నాస్తికులుగా మారతారని దేవికి చెప్పారు. 

ఆలయానికి వచ్చే భక్తుల ప్రార్థనలు వినేందుకు కొంత సమయం ఇవ్వాలని దేవీని అభ్యర్థించారు. 

స్వామివారి అభ్యర్థనను విన్న దేవి సంవత్సరానికి ఒకసారి భక్తులకు దర్శనం ఇస్తానని వాగ్దానం చేసింది.


💠 కానీ స్వామివారు మాత్రం సంతృప్తి చెందలేదు. వివిధ వ్యక్తులకు సంపదతో పాటు కీర్తి, ఆరోగ్యం, జ్ఞానం, ఉద్యోగంలో విజయం, మంచి మరియు సుదీర్ఘమైన వైవాహిక జీవితం మొదలైన విభిన్నమైన ఆశీర్వాదాలు అవసరమని అతను మళ్ళీ మహాలక్ష్మిని అభ్యర్థించాడు.

 సమికల్ యొక్క హృదయపూర్వక అభ్యర్థన మేరకు, దేవి తన ఉనికిని ఆలయంలో అనుభూతి చెందుతుందని మరియు వైశాఖ మాసంలో (ఏప్రిల్ / మే) అక్షయ తృతీయతో ప్రారంభమయ్యే 8 రోజుల పాటు 8 విభిన్న రూపాల్లో తన భక్తులపై ఆశీర్వాదాలను కురిపిస్తుంది. 


💠 అష్టలక్ష్మిగా అంటే వీరలక్ష్మి, గజలక్ష్మి , సంతానలక్ష్మి, విజయలక్ష్మి , ధాన్యలక్ష్మి, ఆదిలక్ష్మి, ధనలక్ష్మి మరియు మహాలక్ష్మి వరుసగా.

ఇక నుండి ఈ 8 రోజులలో ఈ ఆలయంలో తాంబూల సమర్పణం ఒక ముఖ్యమైన నైవేద్యంగా మారింది. 


🔅 తాంబూల సమర్పణం


💠 తాంబూల సమర్పణం అనేది చాలా పవిత్రమైన మరియు ముఖ్యమైన ఆచారం, ఇది అక్షయ తృతీయ నుండి ప్రారంభమయ్యే ఈ 8 రోజులలో మాత్రమే నిర్వహించబడుతుంది. 

ఇది 3 తమలపాకులు, అరకప్పు మరియు భక్తుల సామర్థ్యానికి అనుగుణంగా డబ్బును విష్ణువు మరియు మహాలక్ష్మిల ముందు అంకితభావంతో మరియు ప్రార్థన యొక్క అభ్యర్థనతో ఉంచే నైవేద్యం. 

ఈ సమర్పణ లోతైన భక్తి మరియు భక్తి భావంతో చేయబడుతుంది మరియు ఇది నిజమైన కోరికల నెరవేర్పును తెస్తుంది. 


💠 ఈ రోజుల్లో ఆలయాన్ని సందర్శించే జంటలు సంపన్నమైన మరియు సంతోషకరమైన కుటుంబ జీవితంతో ఆశీర్వదించబడతారని నమ్ముతారు.


🔅 బియ్యం మరియు పసుపు పారా


💠 ఇది శ్రీ వాసుదేవపురం మహావిష్ణు దేవాలయం యొక్క అత్యంత దివ్యమైన మరియు విశిష్టమైన నైవేద్యం, ఇది తాంబూల సమర్పణం యొక్క 8 రోజులలో మాత్రమే నిర్వహించబడుతుంది. 

ఈ నైవేద్యాన్ని ప్రదర్శించే భక్తుడు రెండు కొలిచే కుండలను (పారా) బియ్యం మరియు పసుపుతో దివ్య మంత్రాలను జపిస్తూ నింపాలి.


💠 ఒక పురోహితుడు (పూజారి) మంత్రాలను సలహా ఇస్తాడు. 

ఈ నైవేద్యాన్ని నిర్వహించే వ్యక్తి మహాలక్ష్మి దేవి యొక్క దాసి (సేవకుడు) అవుతాడని నమ్ముతారు. 

ఈ నైవేద్యాన్ని నిర్వహించడానికి పురుష భక్తులకు అనుమతి లేదు.


🔅 మూడు ఉరుళి నివేద్యం


💠 శ్రీవాసుదేవపురం మహావిష్ణువు ఆలయంలో ఇది మరొక విశిష్టమైన నైవేద్యం, ఇది సంవత్సరం పొడవునా ఏ రోజునైనా నిర్వహించవచ్చు. తిరుమధురం, పల్పాయసం మరియు అప్పం వరుసగా బంగారం, వెండి మరియు కంచుతో చేసిన మూడు వేర్వేరు ఉరులిలలో (కుండలు) వడ్డిస్తారు. 

మంచి ఉద్యోగం, వివాహం, పిల్లల ఆశీర్వాదం, వ్యాపారంలో విజయం మొదలైన నిజమైన కోరికల నెరవేర్పు కోసం భక్తులు ఈ నైవేద్యాన్ని నిర్వహిస్తారు.

ఈ నైవేద్యాన్ని ముందస్తు బుకింగ్‌తో మాత్రమే నిర్వహించవచ్చు.


🔅 అశ్విన పౌర్ణమి మహాలక్ష్మి పూజ


💠 ఇది 'అశ్విన' మాసంలో పౌర్ణమి (పౌర్ణమి) నాడు జరుగుతుంది. 

లక్ష్మీ సహస్రనామం, కనకధారా స్తోత్రం, మహాలక్ష్మీ అష్టకం వంటి దివ్య మంత్రాలను పఠిస్తూ వివిధ రకాల అర్చనలు చేస్తారు. 

ఈ అర్చనలు, మంత్రాలు పఠించడం వల్ల ఐశ్వర్యం, శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం.


💠 కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పశ్చిమాన 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతీయ దేవాలయం


Rachana

©️ Santosh Kumar

14-18-గీతా మకరందము

 14-18-గీతా మకరందము

        గుణత్రయవిభాగయోగము


-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - ఆ యా గుణములు కలవారు మరణానంతర మేయేలోకములను బొందుదురో చెప్పుచున్నారు – 


ఊర్ధ్వం గచ్ఛన్తి సత్త్వస్థా  

మధ్యే తిష్ఠన్తి రాజసాః | 

జఘన్యగుణవృత్తిస్థా 

అధో గచ్ఛన్తి తామసాః || 

 

తాత్పర్యము:- సత్త్వగుణము గలవారు (మరణానంతరము) ఊర్ధ్వలోకముల కేగుచున్నారు. రజోగుణముగలవారు మధ్యమమగు మనుష్యలోకమున జన్మించుచున్నారు. నీచగుణ ప్రవృత్తిగల తమోగుణయుతులు (పాతాళాది) అధోలోకములకు (లేక, అల్పములగు పశ్వాదిజన్మలకు) జనుచున్నారు.


వ్యాఖ్య:- సత్త్వగుణముగలవారు ఊర్ధ్వలోకములను, ఊర్ధ్వగతినే పొందుదురని తెలుపుటవలన, ఆ

గుణము అవలంబనీయమనియు, రజోగుణతమోగుణయుతులు, మధ్య లోకమును, అధోలోకమును బొందుదురని చెప్పుటవలన ఆ గుణములు అభిలషణీయములు కావనియు స్పష్టమగుచున్నది. దీనినిబట్టి ఊర్ధ్వగతిగాని, అధోగతిగాని వారి వారి యధీనమునందే కలవని తేలుచున్నది. కాబట్టి ప్రయత్నపూర్వకముగ సత్త్వగుణసమాశ్రయముద్వారా ఊర్ధ్వగతినే పడయుటకు సర్వులును యత్నించవలెను.


ప్రశ్న:- సత్త్వగుణము కలవారు మరణానంతర మేలోకములకు పోవుదురు?

ఉత్తరము:- ఊర్ధ్వలోకములకు (లేక , ఊర్ధ్వగతికి) 

ప్రశ్న:- రజోగుణము కలవారు?

ఉత్తరము:- మధ్యమమగు మనుష్యలోకములకు (లేక, మధ్యమగతికి). 

ప్రశ్న:- తమోగుణము కలవారు?

ఉత్తరము:- అధోలోకములకు (లేక, అధోగతికి)

తిరుమల సర్వస్వం 174-*

 *తిరుమల సర్వస్వం 174-*

*శ్రీ హాథీరామ్ బావాజీ 6*


  *బాబాజీ జ్ఞాపకాలు* 


 బాబాజీ జీవితచరిత్రతో ముడివడియున్న అనేక జ్ఞాపకాలను నేడు కూడా తిరుమల క్షేత్రంలో దర్శించుకోవచ్చు. వాటిలో ముఖ్యమైన వాటిని గురించి ఇప్పుడు చెప్పుకుందాం.


 *హాథీరామ్ బాబా మఠం* 


 అలయ మహాద్వారానికి ఎదురుగా నిలబడితే, మనకు ఎడం ప్రక్కగా పాత సహస్రదీపార్చన మంటపం పైభాగంలో, స్వామివారితో పాచికలాడుతున్న హాథీరామ్ బాబా కుడ్యశిల్పం నయన మనోహరంగా దర్శనమిస్తుంది. సరిగ్గా, దానికి వెనుకభాగంలోనే, ఎత్తైన గుట్టపై హాథీరామ్ బాబా మఠం ఉంది. దక్షిణ మాడవీధి లో, తిరుమలనంబి ఆలయం దాటిన తరువాత, 'సుపథం' ప్రక్కన ఉన్న సన్నటి మార్గం ద్వారా వెళ్ళి, కొన్ని మెట్లెక్కి ఈ మఠాన్ని చేరుకోవచ్చు. ఆ ప్రదేశం లోనే బాబాజీ ఒకప్పుడు నివసించేవారు. బావాజీ ఒక రాత్రి నిర్బంధించబడింది కూడా ఆ ప్రదేశంలోనే!


 కొన్ని వందల ఏళ్ళ క్రితం, శేషాచల అరణ్యాలలో విరివిగా లభ్యమయ్యే ఎర్రచందనం స్తంభాలతో, వివిధ కళాకృతులు అత్యంత మనోహరంగా చెక్కబడిన తలుపులు ద్వారబంధాలతో, పటిష్ఠమైన పైకప్పుతో రాచఠీవి ఉట్టిపడేలా నిర్మించబడ్డ ఈ మఠం నేటికీ చెక్కుచెదరకుండా, తిరుమల యాత్రికులను ఆకట్టుకుంటోంది. దీనికి అనుబంధంగా తరువాతి కాలంలో నిర్మించబడ్డ కట్టడాలు యాత్రికులకు వసతిగృహంలా ఉపయోగ పడుతున్నాయి. ముందస్తుగా ఆరక్షణ (రిజర్వేషన్) చేసుకొని, ఇందులో గదులు పొందవచ్చు. అయితే, దేవాలయానికి అతి దగ్గరగా ఉండటం, సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరుడు నడయాడిన ప్రాంతం కావటం వంటి కారణాలవల్ల, ఇందులో వసతి లభించటం కొంచెం కష్టంతో కూడుకున్నది.


 ఈ అవరణలోనే, కొత్వాల్ ఆంజనేయస్వామి దేవాలయాన్ని మరియు గణపతి ఆలయాన్ని సందర్శించు కోవచ్చు.


 మఠం లోపల ఉన్న కోదండరామాలయంలో చలువరాతితో హృద్యంగా చెక్కబడిన సీతారామలక్ష్మణుల ముగ్ధమనోహరమైన విగ్రహాలను కన్నులారా వీక్షించుకోవచ్చు. ఆ విగ్రహాల చెంతనే, దశావతార సాలగ్రామాలు కూడా తరతరాలుగా పూజలందు కొంటున్నాయి. ఒక్కొక్క సాలగ్రామం పై ఒక్కొక్క దశావతారపు చిహ్నం మత్స్యాకారము, తాబేటి డిప్ప, వరాహమూపురము, మొదలైనవి ప్రకృతిసిద్ధంగా ముద్రాంకితమై, చూపరులకు అచ్చెరువు గొల్పుతుంటుంది.


 ఆ ఆలయానికి మూడు ప్రక్కలా ఊయలలో ఊగుతున్న చిన్నికృష్ణునికి, దశావతారాలకు ఉపాలయాలు ఉన్నాయి. ముద్దుల కృష్ణుని వెండి ఊయలను మనం కూడా ఊపి, స్వయంగా వారికి పవళింపు సేవ చేసి తరించవచ్చు.


 ఈ మఠంలో అన్నింటి కంటే ముఖ్యంగా చెప్పుకోదగ్గది హాథీరామ్ బాబాతో, శ్రీవేంకటేశ్వరుడు పాచికలాడిన ప్రదేశం. ఈ ప్రదేశంలో నిర్మించబడిన చిన్న మంటపంలో ఆనాడు పాచికలాడిన, పట్టువస్త్రపు పాచికలపటం మరియు అఖండజ్యోతి నేటికీ నిత్యపూజలందు కొంటున్నాయి. ఈ ప్రదేశం వద్ద, కొన్ని వందల సంవత్సరాలుగా ఎల్లవేళలా, విరామం లేకుండా, రామనామ జపం జరుప బడుతోంది. ఆశ్రమవాసుల కథనం ప్రకారం బావాజీ వారే ఈ రామనామ పారాయణానికి శ్రీకారం చుట్టారు. అప్పటినుండి అది నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఆ రామనామ సంకీర్తన మహాయజ్ఞంలో మనం కూడా కొంతసేపు శృతి కలపి, బాబాజీ కృపకు పాత్రులు కావచ్చు.


 బాబాజీ, వారి శిష్యులైన మహంతులు అసీనులై ఉండే గద్దె కూడా ఈ మఠంలో సంరక్షించబడింది. మఠం ప్రాంగణంలో మఠాధిపత్యం వహించిన మహంతుల సమాధులను కూడా పరిరక్షించారు. మఠం యొక్క ప్రహరీగోడకు గల గవాక్షం గుండా దేవాలయ ఉపరితల భాగాన్ని, గోపురాలను కన్నులపండువగా కాంచవచ్చు. ఇప్పటి ప్రధాన మహంతు, మహంతుమఠానికి చెందిన మరికొందరు సభ్యులు ఈ మఠంలోనే నివాసముంటారు. దాదాపు రెండున్నర ఎకరాల సువిశాల ప్రదేశంలో నిర్మితమైన హాథీరామ్ బాబా మఠం, తిరుమల యందు తప్పనిసరిగా దర్శించి తీరవలసిన విశేషాల్లో ఒకటి.


 దాదాపుగా ఇలాంటిదే మరొక మహంతు మఠం తిరుపతి పట్టణాన, గోవిందరాజస్వామి ఆలయానికి సమీపంలో ఉంది. ప్రస్తుతం అది మహంతుకు మరొక ఆవాసంగానూ; తిరుపతిని దర్శించుకొనే సాధవులకు, సన్యాసులకు, బైరాగులకు విడిదిగానూ ఉపయోగ పడుతోంది.


 తిరుమల క్షేత్రంలో బాబాజీ జీవితంతో ముడివడిన మరికొన్ని విశేషాలను, మహంతుల పరిపాలనాకాలంలో తిరుమల క్షేత్రం తీరుతెన్నులను ఇప్పుడు తెలుసుకుందాం.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము తృతీయాశ్వాసము*


*313 వ రోజు*


*యుద్ధారంభం*


ద్రోణుడు రణరంగమున ప్రవేశించి శంఖం పూరించి సైంధవునితో ఇలా అన్నాడు. నీవు, భూరిశ్రవసుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ, వృషసేనుడు, కృపాచార్యుడు అందరూ కలసి ఉండండి. మన బలములో పదునాలుగు వేల ఏనుగులు, అరవై వేల రథములు, ఒక లక్ష గుర్రములు, పది లక్షల పదాతి దళము మీ వెంట ఉంటుంది. నేను పన్ను యుద్ధ వ్యూహముకు మీరంతా మూడు యోజనముల దూరములో ఉండండి. అప్పుడు పాండవులు మీ వంక చూడ లేరు. ఆ తరువాత ద్రోణుడు పన్నెండు యోజనముల పొడవు అయిదు యోజనముల వెడల్పు కలిగిన శకట వ్యూహమును రచించాడు. ఆ శకట వ్యూహముకు పడమటగా ఉన్న అర్ధభాగం లోపల పద్మవ్యూహం పన్నాడు. ఆ పద్మవ్యూహం మధ్యభాగం నుండి శకటవ్యూహం మొదలు వరకు ఒక సూచీవ్యూహము నిర్మించాడు. ఆ సూచీవ్యూహ ముఖభాగమున కృతవర్మ, అతడి వెనుక కాంభోజరాజు, వారి వెనుక ఒక లక్షమంది యోధులు. సుయోధనుడు వారందరికి మూల స్థానమున సైంధవుని నిలిపాడు. దుర్మర్షణుడు అనే వాడు ఈ వ్యూహములో నేను నిలుచుట ఏమిటి అని నేను ఒక్కడినే అర్జునుడిని చంపగలను అని వ్యూహముకు దూరంగా తన సేనలతో నిలిచాడు. ద్రోణుడు పన్నిన వ్యూహముకు పదిహేను వందల ధనస్సుల దూరంలో దుశ్శాసనుడు, వికర్ణుడు సైంధవుని రక్షించుటకు సిద్ధంగా ఉన్నారు. ద్రోణా చార్యుడు శకట వ్యూహముకు ముందు భాగంలో ఉన్నాడు. ఈ వ్యూహము చూసి సుయోధనుడు సంతోషించాడు.


*అర్జునుడి యుద్ధరంగ ప్రవేశం*


పాండవ సైన్యాధ్యక్షుడు ధృష్టద్యుమ్నుడు వ్యూహానికి ప్రతి వ్యూహం పన్నాడు. కపిధ్వజము రెపరెపలాడగా అర్జునుడు యుద్ధరంగ ప్రవేశం చేసాడు. ఇరు పక్షాలలో యుద్ధభేరీలు మ్రోగాయి. ముందుగా దుర్మర్షణుడు విజృంభించాడు. అది చూసి అర్జునుడు " కృష్ణా! మన రధము దుర్మషణుడి వైపు పోనిమ్ము. ముందు వాడిని చంపి ఈ రోజు యుద్ధంలో వాడిని మొదటి కబళంగా భక్షిస్తాను " అన్నాడు. కృష్ణుడు రథమును దుర్మర్షణుడి వైపు పోనివ్వగానే దుర్మర్షణుడి గజసైన్యం అర్జునుడు ఒంటరివాడని తలచి చుట్టుముట్టి శరములు గుప్పించారు. మరుక్షణంలో రణభూమి ఏనుగు కళేబరాలతో సైనికుల తలలతో నిండి పోయింది. కౌరవులు కూడా అర్జునుడి మీద తమ శరములు గుప్పించారు. అర్జునుడు వాటిని మధ్యలోనే త్రుంచి వేస్తూనే దుర్మర్షణుడి గజబలమును, అశ్విక బలమును, రథికులను ముక్కలు ముక్కలు చేసాడు. దుర్మర్షణుడి ధనస్సులు, రథములు, కేతనములు విరిగాయి. అర్జునుడి ధాటికి ఆగలేక దుర్మర్షణుడు పారి పోయాడు. అతడి వెంట అతడి సేనలు పారి పోయాయి.


*దుశ్శాసనుడితో యుద్ధం*-


ఇంతలో దుశ్శాసనుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. దుశ్శాసనుడిని చూడగానే అర్జునుడు ఆగ్రహోదగ్రుడై గాండీవం సంధించి ధారాపాతగా అమ్ములు గుప్పించాడు. నిలబడిన ఏనుగులు నిలబడినట్లే ఉండగా వాటి మీద ఉన్న సైనికుల తలలు మాత్రం తాటి పండ్ల మాదిరి ఎగిరి పడుతున్నాయి. సైనికుల కాళ్ళు చేతులు తెగి నేల మీద దొర్లుతున్నాయి. తన సైన్యంతో పారిపోతున్న దుశ్శాసనుడిని చూసి అర్జునుడు " దుశ్శాసనా ! ఆగు ఎక్కడికి పారిపోతావు పారిపోతే చావు తప్పదు. అనాడు కురు సభలోమాటాడిన దానికి ఫలితం అనుభవించవా ! " అంటూ దుశ్శాసనుడిపై బాణములు వేసాడు. దుశ్శాసనుడు తిరిగి చూడకుండా ద్రోణుడి వద్దకు పోయాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: రెండవ అధ్యాయం

సాంఖ్యయోగం: శ్రీభగవానువాచ


నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా

న చాభావయతశ్శాంతిః అశాంతస్య కుతస్సుఖమ్ (66)


ఇంద్రియాణాం హి చరతాం యన్మనో௨ను విధీయతే 

తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి (67)



మనోనిగ్రహం లేనివాడికి ఆత్మవివేకం కాని ఆత్మచింతన కాని అలవడవు. అలాంటివాడికి మనశ్శాంతి వుండదు. మనశ్శాంతి లేనివాడికి సుఖం శూన్యం.

సుడిగాలి చుక్కాని లేని నావను దిక్కుతోచకుండా చేసినట్లు, ఇష్టానుసారం ప్రవర్తించే ఇంద్రియాలకు లొంగిపోయిన మనస్సు పురుషుడి బుద్ధిని పాడు చేస్తుంది.

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 *పరివర్తిని సంసారే* 

*మృతః కో వా న జాయతే* ।

     *స జాతో యేన జాతేన*

 *యాతి వంశసమున్నతిమ్* ॥


            *- _భర్తృహరి సుభాషితము_-*


*తా𝕝𝕝 ఈ సంసారచక్రమున జన్మించిన వారందరును పుట్టువారే.....అట్లు పుట్టినవారిలో నశింపని వారెవరు? ఎవని పుట్టుక వలన వంశము కీర్తినొందునో వాడే జన్మించిన వాడు.....వాని జన్మయే గణనీయము*.....


 ✍️🌹💐🪷🙏

పితృ ఋణం

 పితృ ఋణం అంటే ఏమిటి?


మాతా చ పితా చ పితరౌ..అని.


జీవుడు ఏ పని చేయాలన్నా ముందు దేహం ఉండాలి. ఆ దేహం తల్లిదండ్రులు అనుగ్రహించినందువల్ల వాళ్ళకు జీవితాంతం ఋణపడ్తాము.


ఇది కాక, ఊహ తెలియని పసి ప్రాయం నుండి శరీర రక్షణ, పోషణ చేసి , చదువు చెప్పించి, ప్రయోజకుణ్ణి చేస్తూన్నందువల్ల ఈ ఋణ భారం ఇంకా పెరుగుతూన్నది. ఇంకా తాను కష్టపడి దాచిపెట్టిన సంపదలకు వారసుణ్ణి చేస్తూన్నందువల్ల ఈ ఋణం త్రిగుణితం ఔతున్నది.


ఈ ఋణభారం తొలగించుకోక విముక్తి లేదు. ఇంత ఉపకారం చేస్తూన్న పితరులకు తన జీవితాంతం , సేవ చేయడం, విధేయుడై ఉండడం, వాళ్ళ మాటను ఆజ్ఞగా భావించి నెరవేర్చడం ఋణ విముక్తికి ప్రధమ సోపానం.


పితరులు అంటే తన కన్న తల్లిదండ్రులే కాదు. వాళ్ల పూర్వీకులున్నూ. వాళ్లు పితృ లోకంలో ఉండి , తమ వంశ శ్రేయస్సూ, అభివృద్ధీ కాంక్షిస్తూ ఉంటారు. వాళ్లకు సద్గతి కలిగే సత్కార్యాలు, దైవ కార్యాలు చేయడం మరొక బాధ్యత.


తిలోదకాలు ఇచ్చే వంశాంకురం లేకుండా పోతున్నదే ! అని విలపించే పితరుల వృత్తాంతం జరత్కారుడనే బ్రహ్మచారి కథలో కనిపిస్తుంది. వంశాంకురం లేకపోబట్టే ఊర్ధ్వ లోకాల నుంచి పతనమౌతున్న పితరుల కథ అది. భారత ఆది పర్వంలో వస్తుంది .


గృహస్థ ధర్మం స్వీకరించి సత్పుత్రులను పొందడం అత్యంత ముఖ్యమైన బాధ్యత —అనీ, ప్రజా తంతుం మా వ్యవచ్చేత్సీః అనీ అంటుంది వేదం. ఇక్కడ జన్మ స్వీకరించగోరే పితరుల ఆశ నెరవేర్చడంలో భాగం ఇది.


*పుత్రేణ లోకాన్ జయతి*— అని చెప్పారు గాబట్టి తన పితరులకు ఉన్నతి కలిగించే పనులే చేయాలి. పాండురాజుకు ఉత్తమ లోకాలు కలిగించడం పుత్రుడుగా తన ధర్మం అని ధర్మరాజు భావించినందువల్లనే రాజసూయ యాగం చేశాడు. దాని కారణంగా ఘోర యుద్ధం 13 సంవత్సరాల తర్వాత జరుగుతుంది— అని హెచ్చరించి , నారదుడు చెప్పి మరీ చేయించాడు ఆ యాగం.


రామాయణం పితృ ఋణ విమోచన కోసం ఆరంభమైనదే . ఇదొక అనిందంపూర్వ కార్యం. ఉన్న పితరుల మాటే పట్టించుకోని లోకం లో ఎపుడో తన పుటకకు ముందు మొగమాటానికి ఒకతెకు ఇచ్చిన మాటను తర్వాత ఎప్పుడో నేలమీద బడిన నిసుగు నెరవేర్చడానికి బద్ధకంకణుడు కావడం , ఏ ఉపదేశాలూ, ఆక్రందనలూ ఆ నిష్ఠ ముందు బలాదూర్ కావడం ఇక్కడే చూస్తాం.


తన తండ్రి మాట సత్యమై ఆయనకు సత్య లోక శాశ్వత నివాస స్థితి కలగడానికి పుత్రుడుగా ఆ దైవ స్వరూపుడు అంత కర్తవ్య నిష్ఠ చూపాడు. ఇదీ జీవితం అంటే —అని మానవ లోకానికి ఆదర్శమై నిలిచాడు. తండ్రి మోహంతో వెళ్లవద్దు. నన్ను బంధించి పదవి చేపట్టు అని మాటగా చెప్పినా, తల్లి నా మాట గూడా వినవలె, పోవద్దు ఆగు —అని వాత్సల్యంతో ముందు అడ్డుపడ్డా , ధర్మం! రామో విగ్రహవాన్ ధర్మః! —అని మనకు ఎరుక అయ్యేట్టు నడిచాడు.


తండ్రి తనతో అనే మాట కాదు . ఒకరికి చేసిన వాగ్దానం! అది నెరవేర్చే బాధ్యత తాను.. వద్దు అంటూన్నా నెత్తికెత్తుకొని, నెరవేర్చి ,ఇదీ పుత్రలక్షణం అని విడమరచి ఎరుక పరచాడు.


" జనకున్ స్వామిత్వము తనయోద్దేశమున ఉనికి" ని చాటిచెప్పి , తండ్రి హృదయం ఎరిగి ఏ చర్చా చేయకుండా శాశ్వత బ్రహ్మచర్యం లో నిలిచి లోకాదర్శమైన భీష్ముడు మనకందరికీ పితామహ స్థానంలో నిల్చి నేటికీ తిలోదకాలు అందుకోవడం మరో ఎత్తు. ఆయనకు సంతు లేకపోతే ఏమి? ఈ కులము వివర్ధింపగ నాక భిమతము అంటూ తాను బ్రహ్మచర్య నిష్ఠలో ఉండీ, కురువంశ గౌరవం విస్తృతీ చేయడానికే జీవితం అంకితం చేసిన మన పితామహుడు ఆయన.


తీర్థ యాత్రలు చేసి పితరులు చేసిన/ చేయవలసి వచ్చి చేసిన అహిత కర్మలకు ప్రక్షాళన చేసి ఉన్నతి కలిగించడం ఇంకా గొప్ప విషయం. వాళ్లు ఎలాంటి వాళ్లయినా మనకు పితరులు. వాళ్ల ఉన్నతి తర్వాతే మనకు. నీ (వంటి యోగ్యుడి) పుట్టుకకూ వాళ్లే గదా కారణం.! పితృ దేవతల అనుగ్రహం లేక ఇక్కడ జన్మే దొరకదే! శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం! ఎంత అమూల్య వస్తువిచ్చారు వాళ్లు —అనే కృతజ్ఞత ఉండాలి.


భగీరథుడు ఎంత పని చేశాడు! . ఊహకే అందదు ఆ దీక్ష. కొన్ని తరాలుగా శాప గ్రస్తులై భస్మీపటలమైన ఎందరెందరు తాతలను ఉట్టే ఎక్కలేని పతితులను ఒక్కసారిగా—- పైకి , పై పైకి ..ఉత్ ధరించి ,, ఆ ఆనందంలో.. ఆ పరమానందంలో నిశ్చలుడై నిలిచి,—- మనిషి ప్రయత్నం అంటే ఇట్లా ఉండాలి !అని నిరూపిస్తూ వియద్గంగను రసాతలానికి తెచ్చి సొంత పితరులే కాదు,. అందరి పితరులనూ ఉద్ధరించే గంగమ్మను అనుగ్రహించిన ఆ భగీరథ స్వామి కంటే పితృభక్తులెవరు?


కాశ్యాంతు మరణాత్ ముక్తిః.


పితరులను బుజాల మీద మోసి, తనకు అదే పని అని అనుకొని అన్ని తీర్థాలూ తిప్పిన ఆ శ్రావణుణ్ణి ఈ నాటికీ మరవం.


గయా శ్రాద్ధం చేసి విష్ణు పదం కలిగించడమూ పుత్రుల విధి. ఏ పుణ్య కర్మ చేసినా, వాళ్ల పేర చేయడమూ పితృ ఋణ విదూరులయ్యే ఉపాయం.


ప్రతి నిత్యమూ మాతృభ్యోనమః ,పితృభ్యో నమః , గురుభ్యో నమః —అంటూ ఋణం జ్ఞప్తిలో ఉంచుకొని విముక్తి మార్గం అన్వేషించుకోవడం వల్లనే జన్మ సార్ధకం అవుతుంది.


               *_🌻శుభమస్తు🌻

                             ఇట్లు

                              మీ

      అబ్బరాజు శ్రీనివాస మూర్తి 

               🕉️

          🙏 సర్వే జనాః సుఖినోభవంతు

         🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు

        🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

తప్పును నీవొనరించియు

 *2040*

*కం*

తప్పును నీవొనరించియు

తప్పని గుర్తించిగూడ తప్పనకనె యా

తప్పును మరియొకరిదనుచు

వొప్పించగనెంచ తప్పు వొప్పదు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! తప్పు నీవు చేసి, అది తప్పు అని గుర్తించి కూడా ఆ తప్పు ను మరొకరిది అని వొప్పించడానికి ప్రయత్నాలు చేయుట సరికాదు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

Golden Seniors

 🌷Dear Golden Seniors, Let us all examine ourselves getting 10/10 marks……..👇🏾


🌷 10 tips for Happy Seniors.❤️


🌷1. Early in the morning if you are woken up by your Alarm Clock, mobile phone, birds chirping or other noises, be happy and count yourself blessed.  It means you still are part of this world.


🌷2. After waking up, drink some water, text people you know, love and care for.  Greet them "Good Morning". It means you can think clearly and you are healthy.  You can begin a new and beautiful day.


🌷 3. You receive text messages and calls from friends inviting you to have meals together, or spend time with friends. It means you are friendly and have good relationships with people.  Your friends are still thinking of you.


🌷 4. Occasionally, some people may speak ill of you or gossip behind your back. It means that you are still a very important person in their hearts. They are certainly not doing as well as you in life. You should feel happy and blessed.


🌷 5. If you worry about being overweight, you are eating very well, and your meals are sumptuous and full of nutrients. Don't worry.  All health talks on healthy living, long life, and strong immunity are based on food.  Just exercise control and everything else in moderation.


🌷 6. If you often go out with friends, eating, chatting, travelling, seeing places and have a change in your environment, it proves that you have some standards in your way of life.


🌷 7. If you have a good sense of humour, it means you are young at heart and you are very healthy.


🌷 8. If you have passed 65, be happy and be contented.  According to a  world survey, only 8 out of 100 people live past 70 years old.


🌷 9. If you can go out and buy ingredients and cook; you see well; hear well; know how to use your mobile phone to send text messages; write about your memories; write a story; count yourself very blessed.  You have a very successful life.


🌷 10. If you are reading this message and a smile is on your face, you are a very happy, fulfilled and contented person.


🌷 If you can share this message with friends, it means that you are not selfish, you are kind hearted; you are a person who cares and loves humankind. 


🌷 Let Senior Friends read this message and spread the Happiness.


🙏😀

అసూయపడే కాలం పోయింది

 *డబ్బున్న వారిని చూసి అసూయపడే కాలం పోయింది...*


*ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న మనిషిని చూసి అసూయపడే కాలం నడుస్తుంది...*


*మనం జీర్ణం చేసుకునేంత తినడం...*


*మనకు కావలసినంత సంపాదించడం...*


*పక్క వాడితో పోల్చుకోకుండా బతకడం...*


*మనం కంట్రోల్ చేసుకునే వేగంతో ప్రయాణించడం...*


*ఏ కల్మషం లేకుండా నవ్వుతూ నవ్విస్తూ మనస్ఫూర్తిగా పలకరిస్తూ ఉండటం...*


*ఇవన్నీ ప్రశాంతతతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయి... అందుకే...*


*ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు.*

మూర్కునికి

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏             🏵️ *మూర్కునికి ఐదు లక్షణాలు.. 1)గర్వం ఎక్కువగా ఉండటం. 2)చెడ్డ మాటలు మాట్లాడే నైజం.3)మొండి పట్టుదల.4)అప్రియంగా మాట్లాడటం, వాదించడం.5)ఎదుటి వాళ్ళు చెప్పిన దాన్ని వ్యతిరేకంచి దానిని కాదనడం..ఈ లక్షణాలు ఉన్న మూర్కులకు ఎంత దూరంగా ఉండకలిగితే మన మనసు మరియు ఆలోచనలు అంత ప్రశాంతంగా ఉంటాయి*🏵️గర్వం ఒకటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి.. ధైర్యం ఒకటి చాలు జీవితంలో ఏదైనా సాధించడానికి..పోగొట్టుకునే ముందు ఆలోచించండి.. కలవడానికి మాట్లాడడానికి మరొక జన్మ లేదని.. పోగొట్టుకోవడం చాలా తేలిక.. సంపాదించడం అతి కష్టం🏵️ప్రతీ వారిలోనూ లోపాలు ఉంటాయి..అవి ఏమిటో మనకు తెలుసు కానీ వాటి కోసం ఏరైనా చెబితే కోపం వస్తుంది..కోపం తెచ్చుకునే బదులు సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది..హద్దులకు మించిన ఆశలు ఉన్నట్లు అయితే శక్తికి మించిన కష్టాలు పడాల్సి వస్తుంది🏵️నీకున్న అహమే నీలో ఇతరులపై ద్వేషాన్ని పెంచుతుంది.. అదే వినయంగా ఉంటే ఉత్తముడీగా తీర్చి దిద్దుతుంది...అందరినీ విమర్శించే వారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండలేరు.. కానీ ఇతరులను సరదాగా పలకరించే వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు🏵️🏵️మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593.9182075510*🙏🙏🙏

బాంధవా మేలుకో 6*

 *ప్రియ బాంధవా మేలుకో 6*




రోజుకు 24 గంటల చొప్పున జీవిత కాలం సమాజం మరియు  దేశ సంక్షేమం కొరకు ఆరాటపడి, పాటుపడే మనస్తత్వం కొందరు రచయితలకు ఉంటుంది. ఎందుకింత ఆరాటం అను సందేహాలు ఉద్భవించవచ్చును..అది వారి స్వభావం అంతే. వీరి ధృక్పథం అస్తమానం సామాజిక, జాతీయ అంశాలనే కథా వస్తువులుగా స్వీకరించి రచనలు చేస్తూ *నిస్త్రాణమై ఉన్న  సమాజ చైతన్యం కొరకు పాటు పడ్తూ ఉంటారు*.  వీరి ఉద్దేశ్యంలో సామాజిక శ్రేయస్సు అనేది ఇతరులతో ప్రజలకున్న సంబంధాల ద్వారా మాత్రమే గాకుండా...ప్రజలు సామాజిక సమూహాలలో ఏలా (మార్గాలు)  పాల్గొంటారు... *సామాజిక సంక్షేమం కొరకు ప్రజలు తమ సమయాన్ని మరియు సేవలను ఏలా అందిస్తారు* అను అంశాలను  రచయితలు తమ రచనల ద్వారా సూచిస్తారు.


మానవ స్వభావంలో  స్వార్థం అను లక్షణం సహజమే. బాల్యంలో విద్య, యౌవనంలో ఉపాధి మరియు సంసార బాధ్యతలు, మధ్య వయస్సులో సంతాన అవసరాలు, వారి అభివృద్ధి, జీవితంలో స్థిరపడుట ఇత్యాది సహజమే. *కాని, జీవితానికి కావలసిన హంగులన్ని సంప్రాప్తమైన పిదప గూడా స్వార్థపుటాలోచనలు* అభ్యంతరకరము మరియు ఒక్కొక్కప్పుడు ప్రమాదకరం కూడా. 


మానవ జీవితపు సగటు ఆయుర్ధాయం 80 సంవత్సరాలు అనుకుందాము. 65 సంవత్సరములు వచ్చేవరకు వ్యక్తులు తమ వ్యక్తిగత జీవిత ప్రయాసలు, కుటుంబ బాధ్యతల నిర్వహణ ఇత్యాది పూర్తిచేసుకున్న పిదప తీరుబడి జీవితానికి సమాయత్తమై ఉంటారు. *అప్పుడైనా  ప్రజలు సమాజం గురించి ఆలోచించాలని రచయితలు కోరుకుంటారు.*


ప్రకృతి ఎప్పుడు ఒకలా ఉండనట్లె ప్రజలందరూ కూడా ఒకలా ఉండరు. సమాజం, దేశం, ధర్మం, సంప్రదాయం గురించి అలోచించి, సత్కర్మలు ఆచరించే ప్రజలు కొందరవుతే, *ఏది ధర్మమో* తెలిసినా, చేయడానికి మనసొప్పని, ధైర్యం లేక ముందుకు రాని వారు, *ఏది అధర్మమో* తెలిసీ కూడా చేయకుండా ఉండలేని *దుర్యోధన* లక్షణాలు గల కుటిల మనస్కులు మరికొందరు. ఇటువంటి వారికి సంబంధించిన శ్లోకం చూద్దాము.

*శ్లో! జానామి ధర్మం నచమే ప్రవృత్తి. జానామి పాపం నచమే నివృత్తి*.


ఈ మనః ప్రవృత్తి కల జనులు మారరు. వీరు తమ స్వార్థానికే ఎక్కువ అనుకూలం అనుకున్నప్పుడు మాత్రమే ముందడుగేస్తారు. ఈ కోవలోనే మరొక వర్గం గమనిద్దాం.... *పెద్ద మనుష్యుల ముసుగులో గోముఖ వ్యాఘ్రాలు మన మధ్యనే ఉంటాయి*. పైకి చెప్పేది ఒకటి చేసేది మరోకటి.  వీరి వల్ల దేశానికి కడు ప్రమాదం పొంచి ఉంటుంది. అప్రమత్తంగా ఉండటం అవసరం.


దేశంలో అన్ని మోసాలు, అకృత్యాలు ప్రభుత్వమే అరికట్టాలనుకోవడం సమంజసం కాదు. *ప్రజా చైతన్యం ఉన్న చోట దుష్టులు వెనకడుగు వేస్తారు*.


ధన్యవాదములు

*(సశేషం)*.

మహిళే కదమన మాతయు

 *అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో...*


మహిళే కదమన మాతయు

మహిళే కద అక్క చెల్లి యన్నీ తానే

మహిళే కద యత్తయనిన

మహిళే మరి యమ్మ బామ్మ మహిలో కృష్ణా!


మహిరక్షణ రక్షించిన

మహళే మనుగడను గూర్చు మనరక్షణయౌ

మహిళలు లేకుండమనకు

మహిలో మన్నికయెలేదు మరవకు కృష్ణా!


✍🏼 గోగులపాటి కృష్ణమోహన్ 🙏🏼

పంచాంగం 11.03.2025

 ఈ రోజు పంచాంగం 11.03.2025 Tuesday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాస శుక్ల పక్ష ద్వాదశి తిథి భౌమ వాసర ఆశ్రేష నక్షత్రం అతిగండ యోగః: బాలవ తదుపరి కౌలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.



రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 

యమగండం: పగలు 09:00 నుండి 10:30  వరకు.



శుభోదయ:, నమస్కార:

నృసింహ ద్వాదశి /*

 *11/03/2025 - నృసింహ ద్వాదశి /*


ఫాల్గున శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. దీనినే గోవింద ద్వాదశి అని కూడా అంటారు.


ఈ పండుగ వేడుకలు

పూరీలోని జగ్గనాథ్ ఆలయంలో చాలా ముఖ్య మైనవి. గోవింద ద్వాదశి ద్వారక తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం, తిరుమల తిరుపతి బాలాజీ ఆలయం, ఇతర ప్రముఖ ఆలయాలలో కూడా ప్రసిద్ధి చెందింది.


గోవింద ద్వాదశి నాడు, భక్తులు సాయంకాలం విష్ణు దేవాలయాలను సందర్శించి, అక్కడ జరిగే పూజ ఆచారాలలో పాల్గొంటారు. విష్ణువు పేరు జపించడం, 'శ్రీ నరసింహకవచం' మంత్రాన్ని పఠించడం గోవింద ద్వాదశి నాడు చాలా ఘన మని భావిస్తారు.


భారతదేశం లోని దక్షిణరాష్ట్రాలలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకలలో కూడా గోవింద ద్వాదశిని ఎంతో ఉత్సాహంతో, భక్తితో జరుపు కుంటారు.


గోవింద ద్వాదశి రోజున, గంగ, సరస్వతి, యమున, గోదావరి వంటి పవిత్ర నదులలో ఉత్సవ స్నానాల వేడుకలు ఆచరిస్తారు.


ప్రత్యేక మైన హిందూ జ్యోతిష శాస్త్ర ప్రాముఖ్యం కారణంగా పవిత్రస్నానాలు చేయడానికి వేలాది మంది భక్తులు గోవింద ద్వాదశి రోజున పూరి తీరం లోని మహోదాది తీర్థాన్ని సందర్శిస్తారు. 


శ్రీమహావిష్ణువు 'పుండరీకాక్ష' రూపాన్ని గోవింద ద్వాదశి నాడు పూజిస్తారు.  


ఈ రోజు భక్తులు కఠిన మైన ఉపవాసాలను కూడా పాటిస్తారు.


గోవింద ద్వాదశి నాడు, భక్తులు సాయంసమయంలో విష్ణుదేవాలయాలను సందర్శించి పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. 


శ్రీహరి నామాన్ని జపించడం, నృసింహ ద్వాదశనామ స్తోత్రం, 'శ్రీనరసింహకవచం' పఠించడం వల్ల సమస్తపాపాలూ హరించి ముక్తిని పొందుతారు.


*ఓం శ్రీలక్ష్మీ నారసింహాయ నమః*


🙏🙏🙏🙏💐💐🙏🙏🙏🙏


(డాక్టర్ ఆర్.వి. కుమార్ గారి సౌజన్యంతో)

తమకము తోడ వాస్తవ పథమ్ముల

 చ.తమకము తోడ వాస్తవ పథమ్ముల  నెంచెడు యుక్తి లేక నే

గమనము నెంచ నేమగునొ కాంచగ లేక వృథా ప్రయాసలన్

గుములుచుఁ దల్లిదండ్రులకుఁ గూర్చుదు రేలనొ క్రొత్త చిక్కులన్

విమల యశస్సు నొంద గల విజ్ఞతఁ గాంచగ లేమి భారతీ!౹౹ 77


ఉ.హంసల వోలె కాకులు విహారముఁ జేయ సహించి యున్న వి

ధ్వంసమగున్ సమస్తమును దారుణ రీతుల దుష్ట చేష్టలన్

హింసను నింపి వైభవము నేగతి యైనను కూల్చి వేసెడున్

హంసలఁ బోలెడుత్తములె యందల మెక్కుట పాడి భారతీ!౹౹78

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం  - ద్వాదశి - ఆశ్రేష -‌‌ భౌమ వాసరే* (11.03.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*