22, జులై 2023, శనివారం

Yemaya namaha

 నా చిరకాల మిత్రులు నాకు గురుతుల్యులు అయిన ముముక్షువులు శ్రీ కె. వి. అర్. పంతులుగారు కట్టోపనిషతును సరళ భాషలో వ్రాసింది

వేదవేత్తల విషయంలో

 వేదవేత్తల విషయంలో కృతజ్ఞత ఆవశ్యకం


జీవితంలో ధర్మాన్ని ఆచరించటం వలన సకల శ్రేయస్సులు, ఆధ్యాత్మిక కుశలత, అలానే క్షేమము లభిస్తాయి. ఆ ధర్మానికి మూలం వేదమే. వేదమూలకంగానే విధి, నిషేధాలను తెలుసుకోగలం. బ్రాహ్మణులు వేదాధ్యయనం చేసి ఒకరినుంచిఒకరికి వేదవిద్యను సంక్రమింపజేస్తారు. వీరిని వేదవేత్తలు అని వ్యవహరిస్తాము. వీరు సదా పూజ్యులు.


వేదవేత్తలకుగాక ఇంకెవర్ని నమస్కరించాలి అంటే భోజమహరాజు తాను రాసిన చంపూరామాయణం ప్రారంభంలో ఈవిధంగా వర్ణిస్తాడు, మన ధర్మశాస్త్రాలన్నీ "ధర్మో రక్షతి రక్షితః" అని పలికాయి. అంటే, ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో వారిని ధర్మం కాపాడుతుంది. అంతేకాక ధర్మాన్ని ఉల్లంగించితే మాత్రం వారికీ పతనంతప్పదు.

धर्म एवहतो हन्ति धर्मो रक्षति रक्षितः |

तस्माद् धर्मो न हस्तव्य मानो धर्मोहतोवधीत् ||


ధర్మానికి పునాది వేదము. వీటితోపాటు పురాణాలు, స్మృతులు, శాస్త్రములు మొదలైనవి. ఇవ్వన్నీ వేద ప్రమాణంగా ఉండాలి. వేదములు అపౌరుషేయాలు, స్మృతులు, పురాణాలు మొదలైనవి పురుష నిర్మితాలు. మన పూర్వులు వేదాధ్యయనపరులై మనకందరికీ ఆ వేదసంపదను అందజేసి మహోపకారం చేశారు. అట్టివారిపట్ల మనం ఎల్లప్పుడూ కచ్చితంగా కృతజ్ఞత చూపాలి.


--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు.

Useful information*

 *Useful information* 

🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷


1. *PAN* - permanent account number.

2. *PDF* - portable document format.

3. *SIM* - Subscriber Identity Module.

4. *ATM* - Automated Teller machine.

5. *IFSC* - Indian Financial System Code.

6. *FSSAI(Fssai)* - Food Safety & Standards Authority of India.

7. *Wi-Fi* - Wireless fidelity.

8. *GOOGLE* - Global Organization Of Oriented Group Language Of Earth.

9. *YAHOO* - Yet Another Hierarchical Officious Oracle.

10. *WINDOW* - Wide Interactive Network Development for Office work Solution.

11. *COMPUTER* - Common Oriented Machine. Particularly United and used under Technical and Educational Research.

12. *VIRUS* - Vital Information Resources Under Siege.

13. *UMTS* - Universal Mobile Telecommunicati ons System.

14. *AMOLED* - Active-matrix organic light-emitting diode.

15. *OLED* - Organic light-emitting diode.

16. *IMEI* - International Mobile Equipment Identity.

17. *ESN* - Electronic Serial Number.

18. *UPS* - Uninterruptible power supply.

19. *HDMI* - High-Definition Multimedia Interface.

20. *VPN* - Virtual private network.

21. *APN* - Access Point Name.

22. *LED* - Light emitting diode.

23. *DLNA* - Digital Living Network Alliance.

24. *RAM* - Random access memory.

25. *ROM* - Read only memory.

26. *VGA* - Video Graphics Array.

27. *QVGA* - Quarter Video Graphics Array.

28. *WVGA* - Wide video graphics array.

29. *WXGA* - Widescreen Extended Graphics Array.

30. *USB* - Universal serial Bus.

31. *WLAN* - Wireless Local Area Network.

32. *PPI* - Pixels Per Inch.

33. *LCD* - Liquid Crystal Display.

34. *HSDPA* - High speed down-link packet access.

35. *HSUPA* - High-Speed Uplink Packet Access.

36. *HSPA* - High Speed Packet Access.

37. *GPRS* - General Packet Radio Service.

38. *EDGE* - Enhanced Data Rates for Globa Evolution.

39. *NFC* - Near field communication.

40. *OTG* - On-the-go.

41. *S-LCD* - Super Liquid Crystal Display.

42. *O.S* - Operating system.

43. *SNS* - Social network service.

44. *H.S* - HOTSPOT.

45. *P.O.I* - Point of interest.

46. *GPS* - Global Positioning System.

47. *DVD* - Digital Video Disk.

48. *DTP* - Desk top publishing.

49. *DNSE* - Digital natural sound engine.

50. *OVI* - Ohio Video Intranet.

51. *CDMA* - Code Division Multiple Access.

52. *WCDMA* - Wide-band Code Division Multiple Access.

53. *GSM* - Global System for Mobile Communications.

54. *DIVX* - Digital internet video access.

55. *APK* - Authenticated public key.

56. *J2ME* - Java 2 micro edition.

57. *SIS* - Installation source.

58. *DELL* - Digital electronic link library.

59. *ACER* - Acquisition Collaboration Experimentation Reflection.

60. *RSS* - Really simple syndication.

61. *TFT* - Thin film transistor.

62. *AMR*- Adaptive Multi-Rate.

63. *MPEG* - moving pictures experts group.

64. *IVRS* - Interactive Voice Response System.

65. *HP* - Hewlett Packard.

రింగ్ రోడ్డు పై ప్రయాణం చేసే సమయం లో

 *రింగ్ రోడ్డు పై ప్రయాణం చేసే సమయం లో తికమక వద్దు గుర్తు పెట్టుకోండి*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


*Total ORR Exit Numbers are 19.*


*Exit No 1 - Kokapet.*


*Exit No 2 - Edula nagulapally.*


*Exit No 3 - Patancheru.*


*Exit No 4 - Sultanpur.*


*Exit No 5 - Dindigal/ Saragudem-dsn.*


*Exit No 6 - Medchal.*


*Exit No 7 - Shamirpet.*


*Exit No 8 - Keesara.*


*Exit No 9 - Ghatkesar.*


*Exit No 10 - Taramptipet.*


*Exit No 11 - Pedda Amberpet.*


*Exit No 12 - Bonguluru.*


*Exit No 13 - Raviryal.*


*Exit No 14 - Tukkuguda.*


*Exit No 15 - Pedda Golconda.*


*Exit No 16 - Shamshabad.*


*Exit No 17 - Rajendra Nagar.*


*Exit No 18 - TSPA.*


*Exit No 19 - Nanakramguda.*


*Total length - 158 Kms*


*Design speed - 120 Kmph.*


*Right of Way (ROW) - 150 m*


*Main Carriage Way - 8 lanes.*


*Hard shoulder for emergency Parking/breakdown vehicles - 3 m wide.*


*Width of Central Median - 5 m.*


*Service Roads on either side - 2 lanes.*


*Interchanges - 19.*


*Speed limit - 100 kmph.*


*Challan for overspeeding - INR 1035=00.*

😊

🚗🚗🚗🚗🚗🚗🚗

Happy & safe Driving... 🌹🎊

సుభాషితమ్

 .                       🕉️

              _*సుభాషితమ్*_


*ll శ్లోకం ll*


*ధర్మాగతం ప్రాప్యధనం యజేత* 

*దద్యాత్సదైవాతిధీన్ భోజయేచ్ఛ* 

*అనాధదానశ్చ పరైరదత్తం*

*సైషాగృహస్థోపనిషత్ పురాణీ*


తా𝕝𝕝 

ధనాన్ని ధర్మమార్గంలోనే సంపాదించాలి....సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని దైవకార్యాలకు, దానానికి వెచ్చించాలి.... ఇతరుల ధనాన్ని ఎన్నడూ అపహరించరాదు.... ఇతరులు దానం చేసిన దాన్ని తీసుకోవచ్చు.... ఇంటికి విచ్చేసిన అతిథులను సాదరంగా సత్కరించి, భోజన సమయమైతే తప్పక వారికి భోజనాన్ని ఏర్పాటు చేయాలి.... అతి ప్రాచీనమైన గృహస్థోపనిషత్ ఇదే!.

నిత్యాన్వేషణ

 నిత్యాన్వేషణ: 


దక్షిణామూర్తి అన్న పేరు శివుడికి ఎందుకు వచ్చింది? ఆ స్వరూపానికి ఉన్న విశిష్టత ఏమిటి?


దిక్కులు 4

మూలలు 4

మొత్తంగా 8 అని చెప్పుకోవచ్చు.

సూర్యుడు ఉదయించేది తూర్పు. అస్తమించేది పడమర

ఈశాన్యంలో ఉన్నది ఈశానుడు.

జీవుడు దక్షిణంలో నేర్చుకున్న జ్ఞానం; లేదా జ్ఞాన సముపార్జనతోనే పరబ్రహ్మణి చేరుతాడు అదే ఉత్తరాయణం.

శివుడు దక్షిణాభిముఖుడై కూర్చుని ఉంటాడు కనుక దక్షిణా మూర్తి అను నామంతో పిలుస్తారు.

సద్యో జాతాది పంచ బ్రహ్మ మంత్రములలో

ఈశ్వరుని పంచాననునిగా అందులో వామ దేవ ముఖము దక్షిణముగా ఉంటుంది అని ఆ ముఖము నుండే దక్షిణామ్నాయ మంత్రాలు ఉద్భవించినవి అని చెబుతారు కనుక ఈ మూర్తిని దక్షిణామూర్తిగా పిలుస్తారు.

ఈశాననుని చేరడానికి జీవునికి జ్ఞానం అవసరం కునుక జీవుడు ముందుగా ఉత్తరమునకు వెళ్ళి దక్షిణాభి ముఖుడై ఉన్న మూర్తిని అర్చించి జ్ఞానాన్ని పొంది తద్వారా.....ఈశాననుని చేరవలసి ఉంది. అని చెబుతారు.

ఈ దక్షిణామూర్తి

ఓం వామదేవాయ నమో జేష్టాయ నమః శ్రేష్టాయ నమో

రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణా నమో

బలవికరనాయ నమో బాలాయ నమో

బలప్రమధనాయ నమ సర్వభూతదమనాయ నమో

మనోన్మనాయ నమః ||

శరీరంలో దక్షిణ భాగం అనగా కుడివైపు శివుడు

ఎడమవైపు అమ్మవారు

ఆమె ఉమ కాదు,

ఈ దక్షిణా మూర్తి 16 ఏండ్ల వాడు. ఆయన ఎడమ తొడపై అమ్మవారు కూర్చుని ఉంటుంది.

శివుడు పంచభూతాత్మాకుడు.

ఈయన నుండే జ్ఞానాన్ని జనులు స్వీకరిస్తారు. తద్వారా వారి బ్రతుకు జరుగుతుంది. క్రతువులు నిర్వహించడానికి ఈయన ఇచ్చిన జ్ఞానమే కావాల్సి ఉంటుంది.

సుభాషితమ్

 .                       🕉️

              _*సుభాషితమ్*_


*ll శ్లోకం ll*


*ధర్మాగతం ప్రాప్యధనం యజేత* 

*దద్యాత్సదైవాతిధీన్ భోజయేచ్ఛ* 

*అనాధదానశ్చ పరైరదత్తం*

*సైషాగృహస్థోపనిషత్ పురాణీ*


తా𝕝𝕝 

ధనాన్ని ధర్మమార్గంలోనే సంపాదించాలి....సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని దైవకార్యాలకు, దానానికి వెచ్చించాలి.... ఇతరుల ధనాన్ని ఎన్నడూ అపహరించరాదు.... ఇతరులు దానం చేసిన దాన్ని తీసుకోవచ్చు.... ఇంటికి విచ్చేసిన అతిథులను సాదరంగా సత్కరించి, భోజన సమయమైతే తప్పక వారికి భోజనాన్ని ఏర్పాటు చేయాలి.... అతి ప్రాచీనమైన గృహస్థోపనిషత్ ఇదే!.

ఆదర్శవంతుడైన తండ్రి

 ఉత్తరాఖండ్ రాస్ట్రంలొని హరిద్వార్ నగరంలొ ఉద్యొగ మేళా జరుగుతుంది. అంతలొ అక్కడికి ఇద్దరు అమ్మాయిలను తీసుకుని ఒక పెద్దయన ఆటొలొ వచ్చారు. అంతే వాళ్లను చూసి అక్కడి అధికారులు, పొలీసులు, ఇతరులకు షాక్ కొట్టినట్టయింది. ఒక్కసారిగా అందరూ బిత్తరపొయి, నొరెళ్లబెట్టారు.

 

ఏందుకంటే అక్కడ జరుగుతున్న ఉద్యొగమేళా కు ఇంటర్యూ కు వచ్చిన ఆ ఆడపిల్లలిద్దరూ సాక్ష్యాత్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాధ్ గారి మేనకొడళ్ళయిన లక్ష్మి రావత్, అర్చనా లు. వారిని తీసుకుని వచ్చిన ఆ పెద్దాయన ( చేతిలొ కర్ర, టొపి పెట్టుకున్న పెద్దాయన) సాక్ష్యాత్తు యోగి ఆధిత్యనాధ్ తండ్రి గారయిన ఆనంద్ సింగ్ …. ఆనంద్ సింగ్ గారికి, లక్ష్మిరావత్_అర్చనా లు సొంత మనుమరాళ్ళు.

.


.

ఇక వారిని చూసి ప్రభుత్వ అధికారులు రాచమర్యాదలు చేయడం ప్రారంభించడంతొ, యోగి ఆధిత్యనాధ్ తండ్రి ఆనంద్ సింగ్ గారు, వారి మర్యాదలను తిరస్కరించి, తన మనువరాళ్లను అందరితొ పాటే లైన్లొ ఇంటర్యూకు పంపారు. ఈ సంధర్బంగా అక్కడికి వచ్చిన లొకల్ మీడియా తొ ఆనంద్ సింగ్ గారు మట్లాడుతూ ” ఇంటర్యూలకు వెళుతూఉంటే, ఇంటర్యూలలొ ఏలా విజయం సాధించాలొ వారే నేర్చుకుంటారని తెలిపారు. ఉద్యొగాలు అనేవి ప్రతిభ ఆధారంగానే రావాలి కాని, సిఫార్సుల ద్వారా కాదని చెప్పారు. ఒక వేళ నా కొడుకు యోగి ఆధిత్య, వీళ్ళ ఉద్యొగాలకు రికమండ్ చేసినా నేను ససేమిరా ఓప్పుకొనని అయన స్పష్టం చేశారు.

 

బహుశా ఇంత గొప్ప ఆదర్శవంతుడైన తండ్రి పెంపకంలొ పెరగడం వలననే యోగి ఆధిత్యనాద్ గారు గొప్ప  ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా అందరి ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. బహుశా కారణ జన్ములని ఇలాంటి వారినే అంటారేమొ.

సూర్యాస్త మయం- శ్రీనాధమహాకవి వర్ణనము*

 శు భో ద యం🙏


శు భో ద యం🙏


*సూర్యాస్త మయం-

శ్రీనాధమహాకవి వర్ణనము*

                                  


                    శా: "  వ్రాలెం  బశ్చమ శైలశృంగము  పయిం  బ్రత్యగ్ర  మధ్వాగమో


                             న్మీలత్కింశుక  కోరకస్తబక  కాంతిన్  భానుమన్మండలం ,


                             బాలంబించె ,మరుండు  హస్తమున  దక్షారామ లీలావతీ


                             భ్రూలేఖానిభ  విభ్రమాభ్యుదయమున్   బుండ్రేక్షు కోదండమున్; 


                                శివరాత్రి  మాహాత్మ్యము-      శ్రీ నాధుఁడు;


                                   ఆగామి ప్రబంధ యుగ కవులకు  ప్రేరణ నిచ్చిన వాడు శ్రీనాధమహాకవి. అతని వర్ణనలు అపూర్వ భావ సంభరితములై  ఆంద్రసరస్వతికి  అనుపమానమైన యాభరణము లైనవి. ఇది సూర్యాస్తమయ వర్ణనం.ముందుగా కఠిన పదాలకు 

అర్ధం తెలియ జేస్తాను.


                అర్ధములు; ప్రత్యగ్రము- ఎదురేగుట; అధ్వాగమము:బాటసారులరాక; ఉన్మీలనము- పెరకివేయుట; కింశుకము-మోదుగ-కోరకస్తబకము-మొగ్గల గుత్తి ; భానుమన్మండలము- సూర్యమండలము ; ఆలంబించెన్- అలముకొనెను;  మరుండు- మన్మధుడు;

లీలావతీ- అందగత్తె ; భ్రూలేఖానిభ- కనుబొమవలె వంపుతిరిగిన; విభ్రమాభ్యుదయము- ఆకర్షణ శోభ ; పుండ్రేక్షు కోదండము- చెరకు

విల్లు; 


          భావము:  పడమరకు  సూర్యకిరణాలు  వ్యాపిస్తునాయట. (సూర్యుడస్తమించేది పడమరనేగదా!)  ఎర్రని యాకాంతులు బాట

సారుల గుండెలను పిండే  మోదుగ మొగ్గల కాంతి నుప మిస్తున్నాయట! ఇక పొద్దుగూకుతోంది  మనకు అడ్డులేదని  మన్మధుడుఅనుకునేలా దక్షారామవిలాసినీ జనులు తమ కన్నుల సొబగుతో  విటుల నాకర్షించుచున్నారట. వంపులు దిరిగిన వారి

కనుబొమలు  మన్మధుడెత్తిన  చెరకు విల్లులా ఉన్నవట!


                   సూర్యస్త మయంలో  కిరణాలు యెర్రగానే ఉంటాయి. వాటిని మోదుగ మొగ్గలతో పోల్చి భార్యలకు దూరంగా ఉన్న బాటసారులను  అవి వేదన కల్పిచేలా ఉన్నాయని చెప్పటం. ఆవెంటనే దక్షారామ విలాసినీ జనాల  కనుబొమలు మన్మధుని చెరకు

విల్లువలె  ఉన్నాయనటం;  శ్రీనాధుని ప్రత్యేకత! 


                                          సూర్యాస్త మయంతో  విరహులైన పాంధులకు సేదతీరిచే సాధనాలుగా  దక్షారామ విలాసినీ

జనం సంసిధ్ధులై యుండటం శ్రీనాధుని రసికతకు నిదర్శనం!


                                                                    స్వస్తి !🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ   శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 


                             శ్లోకం :24/150 


సుతీక్ష్ణదశనశ్చైవ 

మహాకాయో మహాననః I  

విష్వక్సేనో హరిర్యజ్ఞః 

సంయుగాపీడవాహనః ॥ 24 ॥  


* సుతీక్ష్ణదశనః = మిక్కిలి పదునైన (వాడియైన) దంతములు కలవాడు, 

* మహాకాయః = గొప్ప శరీరము కలవాడు, 

* మహాననః = గొప్పదైన ముఖము కలవాడు, 

* విష్వక్సేనః = విష్ణు సేనాథిపతియైన విష్వక్సేనుని రూపము తానే అయినవాడు, 

* హరిః = విష్ణువే తానైనవాడు, 

* యజ్ఞః = తానే యజ్ఞపురుషుడైనవాడు, 

* సంయుగాపీడవాహనః = యుద్ధమందు బాధారహితమైన వాహనము కలవాడు. 


ప్రత్యేకం 


ॐ               హరిహర స్వరూపం 


    శంకరనారాయణ స్వరూపమూ అర్థనారీశ్వర స్వరూపమూ ఒకటేనని చెప్పడానికి శాస్త్రాలలో ఆధారాలున్నాయి. 

    మహావిష్ణువు ఈశ్వరునిలో ఒక భాగం; ఈశ్వరుడు కూడా మహావిష్ణువులో ఒక భాగమని చెప్పడానికి పురాణాల మూర్తులు, క్షేత్రాలు ఆధారాలు. 

    దక్షిణాన తిరునల్వేలి జిల్లాలో 'శంకర్ నయనార్ కోయల్ ' అనే ఊళ్ళో ఒకే మూర్తిలో శంకరనారాయణ స్వరూపంగా భగవానుడు ఉండటం నేటికీ మనం చూడవచ్చు. 

    ఇలాగే మైసూరు, మహారాష్ట్రలమధ్య 'హరిహర' క్షేత్రంలో హరి, హరుడు ఏకస్వరూపంగా ఇమిడి ఉన్నారు. 

             - కంచి పరమాచార్య 


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

బ్రాహ్మణుడు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*1. బ్రాహ్మణుడు పేదోడైతే  ‘కుచేలుడై’       శ్రీకృష్ణుని సేవలను అందుకొంటాడు.*


*2. బ్రాహ్మణుడు అవమానింపబడితే ‘చాణక్యుడై’ పగ సాధిస్తాడు.*


*3. బ్రాహ్మణుడు కోపగిస్తే  ‘పరశురాముడై’  గొడ్డలి పట్టి దుష్టులను నరికిపారేస్తాడు.*


*4. బ్రాహ్మణుడు విద్య నేర్చితే….     ‘ఆర్య భట్టుడై’ ప్రపంచానికి ‘సున్న’ నిస్తాడు.*


*5. బ్రాహ్మణుడు వేదనాశనం చూస్తే  ‘శంకరుడై’ వైదిక ధర్మ సంస్థాపన చేస్తాడు.*


*6. బ్రాహ్మణుడు రోగులను చూస్తే  ‘చరకుడై’ లోకానికి ఆయుర్వేదాన్నిస్తాడు.*


*బ్రాహ్మణుడు తన జ్ఞానముతో విశ్వానికే పౌరోహితుడౌతాడు.* 


*౧. బ్రాహ్మణ ధర్మం  ‘వేదము.‘*


*౨. బ్రాహ్మణ కర్మ  ‘గాయత్రి.‘*


*౩. బ్రాహ్మణ జీవనం  ‘త్యాగం.’*


*౪. బ్రాహ్మణ మిత్ర  ‘సుధాముడు.‘*


*౫. బ్రాహ్మణ క్రోధం ‘పరశురాముడు.‘*


*౬ . బ్రాహ్మణ త్యాగం  ‘దధీచి ఋషి.’* 


*౭. బ్రాహ్మణ రాజు  ‘బాజీరావ్ పేష్వే మయూర వర్మ’*


*౮. బ్రాహ్మణ ప్రతిజ్ఞ  ‘చాణక్య శపథం.’*


*౯. బ్రాహ్మణ బలిదానం*...   *‘మంగళ్ పాండే, చంద్ర శేఖర్ ఆజాద్* 


*౧౦. బ్రాహ్మణ భక్తి  ‘రావణుడు.’*


*౧౧. బ్రాహ్మణ జ్ఞానం…   ‘శంకర రామానుజ మధ్వ ఆచార్య త్రయం.’* 


*౧౨. బ్రాహ్మణ సమాజ సంస్కర్త  ‘మహర్షి దయానంద.’* 


*౧౩. బ్రాహ్మణ రాజనీతి  ‘కౌటిల్యుడు.’*


*౧౪.  బ్రాహ్మణ విజ్ఞానం  ‘ఆర్య భట్ట.‘* 


*౧౫.  బ్రాహ్మణ గణితం…*

          *‘రామానుజo.’* 


*౧౬. బ్రాహ్మణ క్రీడాకారులు  ‘జి ఆర్ విశ్వనాథ్, చంద్రశేఖర్, గవాస్కర్.‘* 


*ఇదంతా ఎలా సాధ్యమైంది? *


*కర్మ, భక్తి, జ్ఞాన, విజ్ఞానం, ధర్మ, శక్తి, యుక్తి, మూల్య విలువలు, బుద్ధి, కౌశలం, సంస్కార బలంతో...!*


*1. బ్రాహ్మణ జన్మ  ‘విష్ణాంశ.’* 


*2. బ్రాహ్మణ బుద్ధి  ‘సకల సమస్యా పరిష్కారం.’* 


*3. బ్రాహ్మణ వాణి  ‘వేద విజ్ఞానం.’*


*4. బ్రాహ్మణ దృష్టి  ‘సమతా*

        *మనోభావం..’*


*5. బ్రాహ్మణ జాతి  ‘సంకట హరణం.‘*


*6. బ్రాహ్మణ కృప  ‘భవసాగరమును ఈదు సాధనం.’*


*7. బ్రాహ్మణ కర్మ  ‘సర్వజనహితం.’* 


*8. బ్రాహ్మణ వాసం  ‘దేవాలయం.‘*


*9. బ్రాహ్మణ దర్శనం  ‘సర్వ మంగళ కరం.’*


*10. బ్రాహ్మణ ఆశీర్వాదం  ‘సమస్త సుఖ వైభవ ప్రాప్తి.’* 


*11. బ్రాహ్మణ వరదానం  ‘మోక్ష ప్రాప్తి.’*


*12. బ్రాహ్మణ అస్త్రం  ‘శాపం.‘*


*13. బ్రాహ్మణ శస్త్రం  ‘లేఖని.‘*


*14. బ్రాహ్మణ దానం  ‘సమస్త పాప విముక్తి.‘*


*15. బ్రాహ్మణ దక్షిణ  ‘సప్త జన్మ పాప విమోచనం.’*


*16. బ్రాహ్మణ ఘర్జన  ‘సర్వ భూత సంహారం.’*


*17. బ్రాహ్మణ కోపం  ‘సర్వ నాశనం.’*


*18. బ్రాహ్మణ ఐక్యత? (అదే డౌటు) ‘సర్వ శక్తి వంతం!’* ✍️

                                   …సేకరణ.


.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*


సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్. 

                    🚩🚩🚩

ఎంత చిత్రమైనది

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

Farwarded...


కాలం🕓ఎంత చిత్రమైనది🤔అంటే

బ్రాహ్మణులు కేవలం కూర్చుని సంపాదిస్తారు

వాళ్ళు ఎం పనులు చేయరు ప్రోడక్టివిటీ ఉండదు శ్రమ దోపిడీ చేస్తారు అనే దిక్కుమాలిన పెరియార్ సిద్ధాంతాన్ని నమ్మిన 

తీన్మార్🧐మల్లన్నకి లీగల్ గా ఏదైనా సమస్య వస్తే "మా లీగల్ హెడ్ కి ఫోన్📱చేద్దాం" అంటూ అడ్వకేట్ 👳‍♀️శరత్'సార్  గారూ అంటూ ఓ బ్రాహ్మణుడికి ఫోన్ చేస్తాడు.


అసలు పండుగలు పబ్బాలు గుళ్ళు🛕తిరగొద్దు మనం భీమ్ వారసులం అనే

RS🤨ప్రవీణ్'కుమార్ ఇప్పుడు దాదాపు అన్ని గుళ్ళూ తిరిగేసాడు.


ఇక సిపిఐ🪃నారాయణగారూ \!/తిరుపతి వెళ్లి పొర్లు దండాలు పెడితే, గద్దర్'గారు రామానుజ 😌విగ్రహం దగ్గర తన గాత్రం🎙️వినిపించాడు.


నటుడు 🤩ప్రకాష్'రాజ్ గారేమో తనకు సంతానం కలగాలని భార్యను కుక్కే సుబ్రమణ్యం గుడిలో🤲పూజలు చేయిస్తాడు. ఒక జర్నలిస్టు మితృడిని పంపి పనులు చేయించాడు.

ఫలితంగా ఏడాదిలోనే బిడ్డపుట్టడం🤵‍♀ కూడ జరిగిపోయింది.


పక్కా కమ్యూనిస్టులు దేవుడే లేడన్న వాళ్ళు ఇప్పుడు రోజుకో గుడికి🛕 వెళ్తున్నారు.


కాబట్టి ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే..

అన్ని నదులు సముద్రంలో కలిసినట్టు

అన్ని సిద్ధాంతాలు హిందుత్వంలో కలిసిపోతాయ్

కలవనివి అంతమై పోతాయి. అనవసరంగా నాస్తికమని, కమ్యూనిజం అని, బౌద్ధిజం అని దిక్కుమాలిన సిద్ధాంతాలతో మీ జీవితాలు నాశనం చేసుకోకండి అమృతతులమైన సనాతనం కి దూరంగా ఉండకండి.


సేకరణ:- శ్రీ కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్. 

🙏

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 122*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 122*


🔴 *రాజనీతి సూత్రాణి - ప్రథమధ్యాయము* :


📕 *దుర్వవ్యసనాదుల దుష్పరిణామాలు* : 📕


1. న వ్యసనపరస్య కార్యవాప్తిః (దుర్వ్యసనాలకి లొంగిపోయినవారికి ఏ పనీ జరగదు.) 


2. ఇంద్రియవశవర్తీ చతురఙ్ఞవాసపి వినశ్యతి (ఇంద్రియాలకి లొంగిపోయినవాడు చతురంగబలం ఉన్నా నశిస్తాడు.) 


3. నాస్తి కార్యం ద్యూతప్రవృత్తస్య (ద్యూత (జూదం) వ్యసనంలో పడ్డవాడు ఏ పనీ సాధించలేడు.) 


4. మృగయాపరస్య ధర్మార్థౌ నశ్యతః 

(వేట వ్యసనం ఉన్నవాని ధర్మం, అర్థం కూడా నశిస్తాయి.) 


5. న కామాసక్తస్య కార్యానుష్ఠానమ్ 

(కామాసక్తుడు ఏ పనీ చేయలేడు.) 


6. అర్థేషణా న వ్యసనేషు గణ్యతే 

(రాజుకు ధనాసక్తి ఉండడం వ్యసనంగా పరిగణించబడదు.) 


7. అర్థతోషిణం హి రాజానం శ్రీపరిత్యజతి 

(ఉన్న ధనం చాలునులే అనుకునే రాజును లక్ష్మి విడిచివేస్తుంది.) 


8. అగ్నిదాహాదపి విశిష్టం పరుషవాక్యమ్ (వాక్పారుష్యం అగ్ని వేడికంటే కూడా అధికమైనది.) 


9. దండపారుష్యాత్ సర్వజనద్వేష్యో భవతి

(దండం (శిక్షించడం) లో పరుషంగా ఉంటే అందరికీ ద్వేషపాత్రుడు అవుతాడు.) 


10. అమిత్రో దండనీత్యామాయత్తః

(శత్రువు దండనీతికి లొంగుతాడు.) 


11. దండనీతిమధితిష్టన్ ప్రజాః సంరక్షతి 

(దండనీతి అవలంబించినవాడే ప్రజల్ని రక్షించగలుగుతాడు.) 


12. దండః సంపదా యోజయతి 

(దండం సంపదను సంపాదించి పెడుతుంది.) 


13. దండాభావే త్రివర్గాభావః

(దండం అనేది లేకపోతే త్రివర్గమే (ధర్మ-అర్థ-కామాలే) లేదు.) 


14. న దండాదకార్యాణి కుర్వంతి 

(దండం ఉంది కాబట్టే చెడ్డపనులు చెయ్యరు.) 


15. దండనీత్యామాయత్త మాత్మరక్షణమ్ 

(ఆత్మ రక్షణం దండనీతిమీద ఆధారపడి ఉంటుంది.) 


16. ఆత్మనీ రక్షితే సర్వం రక్షితం భవతి 

(తనని తాను రక్షించుకుంటే అన్నీ రక్షించినట్లే.) 


17. ఆత్మాయత్తౌ వృధ్ధివినాశౌ

(అభివృద్ధి వినాశనము తన చేతుల్లోనే ఉంటుంది.) 


18. దండో హి విజ్ఞానేన ప్రణీయతే 

(దండాన్ని వివేకపూర్వకంగా ప్రయోగించాలి.) 


19. దుర్భలో పి రాజా నావమస్తవ్య 

(దుర్బలుడైన రాజును అవమానించకూడదు.) 


20. నాస్త్యగ్నే ర్ధౌర్భల్యమ్ 

(అగ్నికి దుర్భలత్వం అనేది ఉండదు.) 


21. దండే ప్రణీయతే వృత్తిః 

(దండం ఉంటేనే వృత్తులు (జీవనోపాయాలు) సాగుతాయి.) 


22. వృత్తి మూలమర్థలాభాః 

(వృత్తికి మూలం ధనలాభం. ధనలాభం ఉంటేనే ఎవరైన ఆ వృత్తి చేపడుతారు.) 


23. అర్థమూలౌ  ధర్మకామః

(ధర్మ-కామాలకి మూలకారణం అర్థమే.) 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*  


🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹