16, జూన్ 2025, సోమవారం

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🕉️సోమవారం 16 జూన్ 2025🕉️*

``

          *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది…

``

      *వాల్మీకి రామాయణం*                

             *70వ భాగం*

```

హనుమంతుడు సీతమ్మని అలా చూస్తుండగా, మెల్లగా తెల్లవారింది. 


తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఆ లంకా పట్టణంలో బ్రహ్మరాక్షసులు (యజ్ఞ యాగాది క్రతువులని నిర్వహించేటప్పుడు సరైన దృష్టి లేకుండా, పక్షపాత బుద్ధితో మంత్రాన్ని ఎవరైతే పలుకుతారో, వారు ఉత్తర జన్మలలో బ్రహ్మరాక్షసులుగా పుడతారు) వేద మంత్రాలను పఠింస్తుండగా, మంగళవాయిద్యాలు వినపడుతుండగా రావణుడు నిద్రలేచాడు. 


రావణుడు నిద్రలేస్తూ, జారుతున్న వస్త్రాన్ని గట్టిగా బిగించుకున్నాడు. ఆ సమయంలో ఆయనకి సీతమ్మ గుర్తుకు వచ్చి విశేషమైన కామం కలిగింది. ఆయన వెంటనే ఉత్తమమైన ఆభరణములను ధరించి, స్నానం కూడా చెయ్యకుండా అశోకవనానికి బయలుదేరాడు. 


రాత్రి రావణుడితో క్రీడించిన కాంతలు కూడా ఆయన వెనకాల బయల్దేరారు. ఆ స్త్రీలలో ఒక స్త్రీ రావణుడి కోసం బంగారు పాత్రలో మద్యాన్ని పట్టుకొని వెళ్ళింది, ఇంకొక స్త్రీ రావణుడు ఉమ్మి వెయ్యడం కోసమని ఒక పాత్ర పట్టుకొని వెళ్ళింది, కొంతమంది ఆయనకి గొడుగు పట్టారు. ఆయన వెనకాల కొంతమంది మంగళవాయిద్యాలు మ్రోగిస్తూ వస్తున్నారు, అలాగే కొంతమంది రాక్షసులు కత్తులు పట్టుకొని వచ్చారు. ఇంతమంది పరివారంతో కలిసి దీనురాలైన ఒక స్త్రీ పట్ల తన కామాన్ని అభివ్యక్తం చెయ్యడానికి తెల్లవారుజామున రావణుడు బయలుదేరాడు.


అప్పటివరకూ శింశుపా వృక్షం కింద కూర్చుని రాముడిని తలుచుకుంటూ ఉన్న సీతమ్మ రావణుడు రావడాన్ని గమనించి, ఇటువంటి దుర్మార్గుడికి శరీరంలో ఏ అవయవములు కనపడితే ఏ ప్రమాదమో అని, స్త్రీ అవయవములు ఏవి కనపడితే పురుషుడు ఉద్రేకం చెందుతాడో అటువంటి అవయవములు కనపడకుండా జాగ్రత్తపడి, తన తొడలతో,చేతులతో శరీరాన్ని ముడుచుకొని కూర్చుంది. అలా ఉన్న సీతమ్మ తగ్గిపోయిన పూజలా, అపవాదాన్ని భరిస్తున్నదానిలా, శ్రద్ధ నశించిపోయినదానిలా, యజ్ఞ వేదిలో చల్లారిపోతున్న దానిలా ఉంది. 


అలా ఉన్న సీతమ్మ దగ్గరికి తెల్లటి పాలనురుగులాంటి వస్త్రం ధరించి రావణుడు వచ్చాడు. 


అప్పుడాయన తేజస్సుని చూడలేక హనుమంతుడు కొంచెం వెనక కొమ్మలలోకి వెళ్ళి, ఆకులని అడ్డు పెట్టుకొని రావణుడిని చూశాడు.


రావణుడు సీతమ్మతో… “సీతా! నీకు అందమైన స్తనములు ఉన్నాయి, ఏనుగు తొండాల్లాంటి తొడలు ఉన్నాయి. పిరికిదానా! నీకు ఎందుకు భయం, ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడున్న వాళ్ళందరూ రాక్షసులే, నేను రాక్షసుడినే. ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఎవ్వరూ రాలేరు. నేను అన్ని లోకాలని ఓడించాను. నా వైపు కన్నెత్తి చూసేవాడు ఎవ్వడూ లేడు, ఇక్కడ తప్పు చెయ్యడానికి భయపడతావు ఎందుకు. ఎవరన్నా ఉత్తమమైన స్త్రీలు కనపడితే వాళ్ళని తీసుకొచ్చి మాదిగా అనుభవించడం రాక్షసుల ధర్మం. నేను రాక్షసుడిని, నేను నా ధర్మాన్ని పాటించాను. ఏదో నేను తప్పు చేసినట్టు చూస్తావేంటి. మనిషికి శరీరంలో యవ్వనం అనేది కొంతకాలం మాత్రమే ఉంటుంది, నువ్వు యవ్వనంలో ఉన్నావు కాబట్టి నేను నిన్ను కామించాను, నువ్వు ఇలాగే చెట్టు కింద కూర్చొని ఉపవాసం చేస్తే నీ యవ్వనం వెళ్ళిపోతుంది, అప్పుడు నేను నిన్ను కన్నెత్తి కూడా చూడను. యవ్వనంలో ఉన్నప్పుడే భోగం అనుభవించాలి. నేను నిన్ను పొందాలి అని అనుకుని ఉండుంటే అది నాకు క్షణంలో పని, కాని నేను నిన్ను బలవంతంగా పొందను. నీ అంతట నువ్వు నా పాన్పు చేరాలి.


ఎందుకు ఇలా ఒంటిజడ వేసుకొని, మలినమైన బట్ట కట్టుకొని, భూమి మీద పడుకుని ఉపవాసాలు చేస్తూ ఉంటావు. నా అంతఃపురంలో ఎన్ని రకాల వంటలు ఉన్నాయో, ఆభరణములు ఉన్నాయో, వస్త్రములు ఉన్నాయో చూడు. 7000 మంది ఉత్తమకాంతలు నీకు దాసీ జనంగా వస్తారు. ఆ రాముడు దీనుడు, అడవులు పట్టి తిరుగుతున్నాడు, అసలు ఉన్నాడో లేదో కూడా తెలీదు. దేవతలు కూడా నన్ను ఏమీ చెయ్యలేరు, అలాంటిది ఒక నరుడు ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి వస్తాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు. నువ్వు హాయిగా తాగు, తిరుగు, కావలసినది అనుభవించు, ఆభరణాలు పెట్టుకో, నాతో రమించు. నాకున్న ఐశ్వర్యం అంతా నీ ఐశ్వర్యమే, నీ బంధువులని పిలిచి ఈ ఐశ్వర్యాన్ని వాళ్ళకి ఇవ్వు” అన్నాడు.


రావణుడి మాటలను విన్న సీతమ్మ శుద్ధమైన నవ్వు నవ్వి, ఒక గడ్డిపరకని తనకి రావణుడికి మధ్యలో పెట్టి… గడ్డిపరకని రావణుడిగా భావించి 

గడ్డిపరక వంక చూస్తూ “రావణా! నీ మనస్సు నీవారి యందు పెట్టుకో. నీకు అనేకమంది భార్యలు ఉన్నారు, వాళ్ళతో సుఖంగా ఉండు, పరాయి వాళ్ళ భార్యల గురించి ఆశపడకు. ఒంట్లో ఓపిక ఉంటే ఎలాగన్నా బతకవచ్చు, కాని చనిపోవడం నీ చేతులలో లేదు. నువ్వు సుఖంగా బతకాలన్నా, చనిపోవాలన్నా నీకు రామానుగ్రహం కావాలి. ఒంట్లో ఓపిక ఉందని పాపం చేస్తున్నావు, కాని ఆ పాపాన్ని అనుభవించవలసిననాడు బాధపడతావు. నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించి సంతోషంగా జీవించు, శరణు అన్నవాడిని రాముడు ఏమీ చెయ్యడు. 'నేను సీతని తీసుకొచ్చాను' అంటావేంటి, నీ జీవితంలో నువ్వు నన్ను తేలేవు. సూర్యుడి నుంచి సుర్యుడికాంతిని వేరు చేసి తేగలవా, వజ్రం నుంచి వజ్రం యొక్క ప్రభని వేరు చేసి తేగలవా, పువ్వు నుంచి పువ్వు యొక్క వాసనని వేరు చేసి తేగలవా, ఇవన్నీ ఎలా తీసుకురాలేవో అలా రాముడి నుండి నన్ను తీసుకురాలేవు. మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అంటావేమో, ఇదంతా నిన్ను చంపడానికి బ్రహ్మగారు వేసిన ప్రాతిపదిక.

ఒక పతివ్రత అయిన స్త్రీని అపహరించి చెయ్యరాని పాపం చేశావు, ఇక నీ పాపం ఊరికే పోదు. దీనికి ఒకటే మార్గం, నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించు, బతికిపోతావు. నేను నిన్ను ఇప్పుడే నా తపఃశక్తి చేత బూడిద చెయ్యగలను, కాని నన్ను రాముడు వచ్చి రక్షిస్తాడన్న కారణం చేత ఆగిపోయాను. అసలు ఈ ఊరిలో ధర్మం అనేది చెప్పేవారు లేరా? ఒకవేళ ఎవరన్నా చెప్పినా నువ్వు వినవా? ఒకవేళ విన్నా దానిని ఆచరించవా?” అని ప్రశ్నించింది.


ఈ మాటలు విన్న రావణుడికి ఆగ్రహం వచ్చి… “ఏ స్త్రీయందు విశేషమైన కామం ఉంటుందో ఆ స్త్రీయందు ఉపేక్షించే స్వభావం కూడా ఉంటుంది. నన్ను చూసి ఇంతమంది స్త్రీలు కామించి వెంటపడ్డారు. నీకు ఐశ్వర్యం ఇస్తాను, సింహాసనం మీద కుర్చోపెడతాను, నా పాన్పు చేరు అంటే ఇంత అమర్యాదగా మాట్లాడుతున్నావు, నీకు నా గొప్పతనం ఏంటో తెలియడం లేదు” అని చెప్పి, అక్కడున్న రాక్షస స్త్రీలను పిలిచి “ఈమెయందు సామమును, దానమును, బేధమును ప్రయోగించండి అని నేను మీకు చెప్పాను, కాని ఈమె లొంగలేదు, 10 నెలల సమయం అయిపోయింది. ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉంది, ఆ సమయంలో సీత నా పాన్పు తనంతట తాను చేరితే సరి, లేకపోతే మీరు సీతని దండించండి” అన్నాడు.

(ఇంట్లో తనని ప్రేమించి, అనుగమించే భార్య ఉన్నాకూడా, ఆ భార్యయందు మనస్సు ఉంచకుండా పరస్త్రీయందు మనస్సు ఉంచుకొని, పరస్త్రీతో సంగమించిన పురుషుడికి ఆ దోషం పోవాలంటే, 6 నెలలపాటు తిరిగిన వీధి తిరగకుండా, మిట్టమధ్యానం వేళ, చీకటి పడ్డాక, పాత్ర పట్టుకొని ఇళ్ళ ముందుకి వెళ్ళి 'నాయందు మనస్సున్న ఆరోగ్యవంతురాలైన భార్య ఇంట్లో ఉండగా వేరొక స్త్రీతో సంగమించిన మహాపాతకుడిని. నేను ఆ పాప విముక్తుడిని అవ్వాలి, అందుకని మీ చేతితో ఇంత అన్నం తీసుకొచ్చి పడెయ్యండమ్మా' అని ముష్టి ఎత్తుకున్న అన్నం తింటే వాడి పాపం పోతుంది. ఇది పురుషులకి వర్తిస్తుంది, స్త్రీలకి వర్తిస్తుంది.)


అప్పుడు రావణుడి భార్య అయిన ధాన్యమాలిని రావణుడిని గట్టిగా కౌగలించుకొని… “నీయందు మనస్సున్న స్త్రీతో భోగిస్తే అది ఆనందము, నీయందు మనస్సులేని స్త్రీతో ఎందుకు ఈ భోగము. మనము క్రీడిద్దాము పద” అనేసరికి ఆ రావణుడు నవ్వుకుంటూ తన భార్యలతో వెనక్కి వెళ్ళిపోయాడు.```


          *రేపు…71వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

జపము - జపమాల

 జపము - జపమాల గురించి సంపూర్ణ వివరణ - 

       

ఒక మంత్రాన్ని జపించుటకు జపమాల ముఖ్యము . జపమాల ఉపయోగించటం వలన మనం చేయు జపసంఖ్య తెలియును . జపసంఖ్య తెలియకుండా చేయు జపము వ్యర్ధము . దాని ఫలితము రాక్షసులకు పోవును . జపమాలను హృదయమాల అని అంటారు. జపమాల రక్షణకు , సిద్ధికి ముఖ్యము . జపమాల లేకుండా ఎన్నికోట్ల సార్లు జపం చేసినను వ్యర్థము . 108 లెక్కకు వచ్చు మాల పూర్ణమాల , 54 లెక్కకు వచ్చునది అర్ధమాల , 27 లెక్కకు వచ్చునది అధమ మాల . 

                

. జపమాల చేయు విధానం గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను . మధ్యన ముల్లులేని దారంతో మూడు మడతలతో పేని యజ్ఞోపవీతమునకు పురివేసినట్లు మూడు పేటలలో వేసిన ధారమునకే పూసలు గుచ్చవలెను . దీనిని ముత్తైదువులు చేసి ఇచ్చిన మంచిది లేదా స్వయంగా చేసుకొనవచ్చును. మాలకు మణులను గుచ్చునప్పుడు తాను యే మంత్రము జపించవలెను అనుకొనుచున్నాడో దానినే పలుకుతూ ఆ మణులను బంధించవలెను . మేరువుకు సరిగ్గా రెండుకోనలను దూర్చి మద్యన గ్రుచ్చవలెను . దీనిని శ్రీచక్రం పైనగాని లేక గాయత్రి వద్ద ఉంచిగాని , ప్రాణప్రతిష్ట 108 సార్లు చేసి గురువుగారికి ఇచ్చి 108 సార్లు వారు జపం చేసి ఇచ్చిన తరువాత తాను వాడవలెను . దీనివలన సర్వసిద్ధి కలుగును. జపమాలను దేహము నందు ధరించక , క్రింద ఉంచక దేవత వద్దనే ఉంచవలెను . దీనిని జపము చేయునపుడు " గోముఖము " వంటి సంచిలో ఉంచుకుని చేతికి తగిలించుకొని హృదయమునకు ఆనించుకుని మాల లోపలికి చుట్టి వచ్చునట్లుగా జపించవలెను . జపించు సమయము నందు మాలను చూచువారికి జపఫలితము దక్కును. కనుక జపము చేయి సందర్భము నందు మాలపైన గోముఖము లేదా వస్త్రమును గాని కప్పవలెను . జపమల లొపల తిరిగినచో జపఫలితము తనకే వచ్చును. బయట తిరిగినచో ఆ మాలను చూసినవారికి ఫలితము దక్కును. 

                 

. ఇప్పుడు మీకు ఏ వస్తువులు కల మాలలతో జపము చేసిన ఎటువంటి ఫలితాన్ని ఇచ్చునో మీకు తెలియచేస్తాను . రుద్రాక్షమాల ధర్మార్ధ , కామ , మోక్షములను ఇచ్చును. పద్మమాలిక సర్వబీష్ట సిద్ది , పగడమాల విద్య , వశీకరణము . పద్మరాగ మాల సమ్మోహనము , పుత్రజీవి మాలతో ( దీనికి ఎరుపు దారం ఉండాలి ) సంతానం , ఉశిరిక గింజల మాల జ్వరశాంతి , పసుపుకొమ్ముల మాలతో " బగళా మంత్రము , నవదుర్గ " ఇత్యాది జపించిన స్తంభన అగును. ఔదుంబర మూలికామాల సర్వసిద్ది , తాని మాలతో దారిద్ర్యనివారణ శత్రువులు పారిపోవుటకు 10 వేలు జపం చేయవలెను . హృదయమాల శీఘ్ర మంత్రసిద్ది , మణులతో చేసిన మాల సామ్రాజ్యము , స్పటికమాల సర్వకోరికలు నెరవేరుట , పద్మబీజములు మాల లక్ష్మీకరం , కీర్తికరం , రక్తచందన మాలతో వశీకరణం , భోగము కలిగించును. 

               

. జపము చేయనప్పుడు ఏ వ్రేళ్లకు ఏమి ఫలమో ఆ విధముగా చేయవలెను . ఉంగరపు వ్రేలు బొటనవ్రేలితో కలిపి మాలను పుచ్చుకొని జపించవలెను . మరి ఇతరవ్రేళ్ళకు సంబంధం ఉండరాదు. ఉత్తమకర్మ సిద్ది అగును. బ్రొటనవేలు , మధ్యవేలు మంత్రసిద్ది . చూపుడువేలు ఉచ్చారణ కొరకు , కనిష్ఠఅంగుష్ఠములు మరణము , చూపుడు వ్రేలు శత్రునాశనము , మధ్యవ్రేలు రోగహరి , ఉంగరపు వ్రేలు పుష్టి , కనిష్టము రక్షణ , అంగుష్ఠము మోక్షమును ఇచ్చును. 

     

  

. జపము చేయుటకు సూర్యోదయము నుంచి తిరిగి సూర్యోదయము అగు ఆహోరాత్రమును 6 భాగములు చేయవలెను . 24 గంటల సమయము నందు ఒక భాగము 4 గంటలు అగును. వీటిని ఋతువులు అందురు. ఏ కర్మ చేయాలనుకున్నచో ఆ కర్మకి సంబంధించిన ఋతువు నందే జపము చేయవలెను . మంచి విషయములకు సదా జపము చేయవచ్చును . 

            

. కొన్నిక్రియలకి సంబంధించిన జప సమయములు మరియు జప పద్దతి రహస్యముగానే ఉంచవలెను . అందుకే కొన్ని రహస్యాలు తెలియచేయలేకపోతున్నాను .  


గమనిక -

          

 నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.

           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.

            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.

      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 50 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.

           

 ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .

                  


. కాళహస్తి వేంకటేశ్వరరావు 

                          

     అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


. 9885030034

పంచకర్మ చికిత్స

 ఆయుర్వేదము నందలి పంచకర్మ చికిత్స గురించి వివరణ  - 


   ఆయుర్వేద చికిత్స పద్దతిలో ఔషధాలను 5 రకాలుగా ప్రయోగిస్తారు . దీనికే "పంచకర్మ " అని పిలుస్తారు .  వాటి గురించి మీకు వివరిస్తాను . 


    పంచకర్మములు  5 రకాలు అవి 


  స్నేహన విధి  ,  స్వేదన విధి , వమన విధి ,  విరేచన విధి , నస్య విధి . 


 *  స్నేహన విధి  - 


       తైలాదులను లేపనం చేయుట , చరుముట , రాయుట మొదలైనవి దీనికి లేపనవిధి అని మరొక పేరు కలదు . 


 *  స్వేద విధి  - 


       బాగా చెమట పట్టునట్లు వేడినీళ్ల యొక్క ఆవిరి పట్టుట . దీనికి కుంభాసేకమనియు  పేరుతో కూడా పిలుస్తారు . తరువాత కాలంలో " టర్కిష్ బాత్ " అని వ్యవహరిస్తున్నారు . 


 *  వమన విధి  - 


     వాంతి అగునట్లు ఔషధములను పుచ్చుకొనుట .


 *  విరేచన విధి  - 


     జీర్ణాశయమును , ప్రేవులను శుద్ది చేసుకొనుట కొరకు , లోపలి పేరుకొని పోయిన దుష్టపదార్ధమును  బయటకి వెడలగొట్టుటకు విరేచనాలు అయ్యే ఔషధాలను సేవించి జీర్ణవ్యవస్థను శుభ్రం చేసుకొనుట . 


 *  నస్య విధి  - 


      కొన్ని రకాల మూలికల యొక్క రసములను నాసికా రంధ్రముల యందు పోయుట . లేక  నాసికా రంధ్రముల నుండి లోపలికి పీల్చు విధానం . 


      పైన చెప్పినవే కాకుండగా మరికొన్ని చికిత్సా పద్దతులు కూడా కలవు . వాటి గురించి తరవాతి పోస్టులో వివరిస్తాను . 


   గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి.  పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

మిక్కిలి ప్రమాద కరమౌ

 *2050*

*కం*

మిక్కిలి ప్రమాద కరమౌ

కుక్కల నక్కున వహించి కూళాత్మకులై

చక్కని గోమాతలవిడ

కక్కసమగు వ్యాధులబడి కడచను సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ఎంతో ప్రమాదకరమైన కుక్కలను గుండెలకు హత్తుకొనియుండుటచే క్రూరత్వం పెరిగి చక్కని గోమాతలను విడిచిపెట్టడం వలన భయంకరమైన వ్యాధులపడి మరణించెదరు.(క్రూరమైన కసాయి ల బారిన పడి ఆ గోమాతలు మృతినొందును.).కూళము= క్రూరత్వం,కక్కసము = భయంకరమైన, వ్యాధులు = కసాయి వారు/బోయవారు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

ఆరోగ్యానికి హాని కలిగించే

 🌿 *మనిషి ఆరోగ్యానికి హాని కలిగించే వస్తువులు* 🌿


🟢 *ముందుమాట*  

*ఈ ఆధునిక యుగంలో వచ్చిన సౌకర్యాలతో పాటు, ఆరోగ్యానికి గణనీయమైన హానులు కలిగించే వస్తువులు మన నిత్యజీవితంలో భాగమైపోయాయి. వాటిని వాడక తప్పదు కానీ వాటి వలన కలిగే దుష్ఫలితాలను తెలుసుకొని జాగ్రత్తగా వాడాలి. ఈ వ్యాసంలో ఆరోగ్యానికి ప్రమాదకరమైన ముఖ్యమైన 15 వస్తువుల గురించి తెలుసుకుందాం.*


1️⃣ *ప్లాస్టిక్ వస్తువులు (Plastic Products)*  

*బిస్ఫినాల్-A వంటి కెమికల్స్ విడుదల చేసే ప్లాస్టిక్ బాటిళ్ళు, డబ్బాలు, కవర్లు హార్మోన్ల అసమతుల్యత, కేన్సర్, ప్రసూతి సంబంధిత సమస్యలకు దారి తీస్తాయి. వేడి పదార్థాలు పెట్టినప్పుడు ప్రమాదం మరింత పెరుగుతుంది. గాజు, స్టీల్ వంటివి ఉత్తమ ప్రత్యామ్నాయాలు.*


2️⃣ *సెల్ ఫోన్లు (Mobile Phones)*  

*రేడియేషన్ కారణంగా నిద్రలేమి, మతిమరుపు, బ్రెయిన్ ట్యూమర్లకు ప్రమాదం ఉంది. రాత్రి తలకింద ఫోన్ పెట్టడం ప్రమాదకరం. వినియోగాన్ని తగ్గించి, హెడ్‌ఫోన్ వాడటం మంచిది.*


3️⃣ *అల్యూమినియం ఫాయిల్ (Aluminium Foil)*  

*వేడి ఆహారం పెట్టినప్పుడు అల్యూమినియం కలిసిపోతూ నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. అల్జీమర్స్‌ వంటి వ్యాధులకు సంబంధముందని పరిశోధనలు చెబుతున్నాయి. బదులుగా చాకలి కవర్ లేదా స్టీల్ పాత్ర వాడాలి.*


4️⃣ *నాన్ స్టిక్ పాన్‌లు (Teflon Cookware)*  

*వేడి పెరిగినప్పుడు హానికర వాయువులు విడుదల చేసి క్యాన్సర్‌కు దారితీస్తాయి. PTFE పదార్థం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. స్టీల్ లేదా ఐరన్ పాన్‌లు ఉపయోగించాలి.*


5️⃣ *ఎయిర్ ఫ్రెషనర్లు, అగరబత్తీలు*  

*వాటిలో ఫార్మాల్డిహైడ్, బెంజీన్ వంటి టాక్సిన్లు ఉంటాయి. శ్వాస సంబంధిత సమస్యలు, అలర్జీలు కలిగిస్తాయి. తులసి, నిమ్మ వంటి సహజ వాసనలను ఉపయోగించడం మంచిది.*


6️⃣ *బ్లిచ్, వాషింగ్ కెమికల్స్*  

*చర్మం, కళ్ళు, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపే కెమికల్స్ ఉంటాయి. ఉపయోగించినప్పుడు మాస్క్, గ్లౌవ్స్ తప్పనిసరి. సహజ శుభ్రత పదార్థాలు ఉత్తమం.*


7️⃣ *వేడి నీళ్ల గీసర్లు, ప్లాస్టిక్ పైపులు*  

*వేడి నీరు ప్లాస్టిక్ పైపులలోనుండి హానికర రసాయనాలను విడుదల చేస్తుంది. దీర్ఘకాల వాడకంతో మూత్రపిండాలపై ప్రభావం ఉంటుంది. స్టీల్ పైపులు వాడటం మేలైన ఎంపిక.*


8️⃣ *ప్లాస్టిక్ టీ కప్పులు, స్ట్రా‌లు*  

*వేడి టీ, కాఫీ ప్లాస్టిక్ కప్పుల్లో వాడటం వల్ల టాక్సిన్లు శరీరంలోకి చేరుతాయి. చర్మ సమస్యలు, అంతర్గత ఇన్ఫెక్షన్లు కలిగించే అవకాశం ఉంది. గాజు కప్పులు సురక్షితమైనవి.*


9️⃣ *బ్యూటీ క్రీములు, fairness products*  

*ఈ క్రీముల్లో mercury, parabens, SLS వంటి పదార్థాలు చర్మానికి తాత్కాలిక నిగారింపు ఇచ్చినా దీర్ఘకాలానికి హానికరం. చర్మ కేన్సర్, అలర్జీలు కలగవచ్చు. ఆయుర్వేద పద్ధతులు మేలైనవి.*


🔟 *ప్లాస్టిక్ గ్లాసులు, టిఫిన్ బాక్సులు పిల్లల కోసం*  

*పిల్లల్లో హెర్మోన్ల అసమతుల్యత, అభివృద్ధి సమస్యలు కలగవచ్చు. ప్లాస్టిక్ బాక్సుల బదులు స్టీల్, మట్టి పదార్థాలు వాడటం ఉత్తమం.*


1️⃣1️⃣ *ఇన్సెక్టిసైడ్‌, పెస్టిసైడ్ వాసనలు*  

*ఇవి ఊపిరితిత్తులకు హానికరం. స్ప్రే చేసిన వెంటనే చిన్న పిల్లలు, వృద్ధులు ఆ ప్రదేశంలో ఉండకూడదు. సహజ నిమ్మ రసం, నువ్వుల నూనె వంటివి ఉపయోగించాలి.*


1️⃣2️⃣ *ఫ్లేవర్డ్ డ్రింకులు (Cool drinks, soda, energy drinks)*  

*అధిక చక్కెర, కెమికల్ కలర్స్ ఉండే ఈ పానీయాలు మెదడు, గుండె, కాలేయంపై ప్రభావం చూపుతాయి. జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తాయి. కొబ్బరి నీరు, మజ్జిగ వంటివి మేలైనవి.*


1️⃣3️⃣ *అధికంగా ప్రింట్ చేసిన టిష్యూలు, న్యాప్కిన్లు*  

*వీటిలోని ఇంక్‌లు చర్మానికి హానికరం. ఆహారానికి కలిసితే కెమికల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉంది. పేపర్ వాడేటప్పుడు జాగ్రత్త అవసరం.*


1️⃣4️⃣ *ప్లాస్టిక్ ప్లేట్లు – ఒకసారి ఉపయోగించేవి*  

*తక్కువ నాణ్యత గల పదార్థాలతో తయారవుతాయి. వేడి పదార్థాల వల్ల ప్లాస్టిక్ ఆహారంలో కలిసే అవకాశం ఉంటుంది. మట్టి, పీతల ప్లేట్లు వాడటం మంచిది.*


1️⃣5️⃣ *ఫోన్‌లో ఎక్కువ స్క్రీన్ టైమ్*  

*రోజుకు ఎక్కువ ఫోన్ వాడకం వల్ల కళ్ళు, మెదడు, మానసిక ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. నిద్రలేమి, ఒత్తిడి పెరుగుతాయి. రోజు 2 గంటలకు మించి స్క్రీన్ టైమ్ నివారించాలి.*


🔚 *ముగింపు*  

*మన ఆరోగ్యానికి హాని కలిగించే వస్తువులు మన చుట్టూ గలవే కాని అవగాహనతో వాటిని సురక్షితంగా వాడటం మన బాధ్యత. సహజ, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకుని, కెమికల్ రహిత జీవనశైలి వలన ఆరోగ్యంగా ఉండగలుగుతాం.*

శాస్త్రార్థములగు పుణ్య, పాప,

 ఋతే పదార్థభూతార్థ

భవిష్యద్వస్తుబోధతః

శేషంబభ్వహి గోమాయు

గజాదీనాం నృభిః సమమ్


భావం :-


శాస్త్రార్థములగు పుణ్య, పాప, బ్రహ్మతత్త్వాదుల గూర్చిన జ్ఞానము, భూత, భవిష్యత్పదార్థముల యొక్క జ్ఞానము తప్ప, తక్కిన జ్ఞానమంతయు ముంగిస, సర్పము, నక్క, ఏనుగు మున్నగువానికి, మనుష్యులకు సమానమే !


      .... యోగవాశిష్ఠం

పంచ ప్రయాగ యాత్ర

 *"పంచ ప్రయాగలు" అంటే ఏమిటి?*


 1️⃣

*విష్ణుప్రయాగం.*

అలకానందా + ధౌలిగంగా

పండితుల ప్రకారం శ్రీ విష్ణువు తపస్సు చేసిన ప్రదేశం.


2️⃣

*నందప్రయాగం.*

అలకానందా + నందాకిని

యయాతి రాజు యజ్ఞం చేసిన స్థలం.


3️⃣

*కర్ణప్రయాగం.*

అలకానందా + పిండర్ నది

మహాభారత కర్ణుడు తపస్సు చేసిన స్థలం.


4️⃣

*రుద్రప్రయాగం.*

అలకానందా + మంధాకినీ

శివుడు రుద్ర తాండవం చేసిన స్థలం.


5️⃣

*దేవప్రయాగం.*

అలకానందా + భగీరథి

ఇక్కడే గంగా నది రూపంగా కలుసుకుంటుంది – దీనినే నిజమైన గంగోత్రి సంగమంగా పరిగణిస్తారు.


*1. విష్ణుప్రయాగం.*

• *స్థానం:* జోషిమఠ్ దగ్గర

• *విశేషం:* ధౌలిగంగా నది ఇక్కడ అలకానందా నదిలో కలుస్తుంది

• *పవిత్రత:* విష్ణుమూర్తి తపస్సు చేసిన స్థలంగా భావించబడుతుంది

• *స్నాన మేళా:* పుణ్యకాలంలో ఇక్కడ స్నానం వలన పాప నివృత్తి, పుణ్య ప్రాప్తి అని నమ్మకం


*2. నందప్రయాగం.*

• నందాకినీ నది కలిసే స్థలం

• ఇక్కడ యయాతి మహారాజు యజ్ఞం చేశాడని పురాణాల ప్రకారం ఉంది


*3. కర్ణప్రయాగం.*

• కర్ణుడు ఇక్కడ సూర్య భగవానుని తపించి, అతిలోక బలాలను పొందాడని విశ్వాసం

• పిండర్ నది కలుస్తుంది


*4. రుద్రప్రయాగం.*

• మంధాకినీ నది కలుస్తుంది

• శివుడు ఇక్కడ తాండవం చేశాడని పురాణ ప్రస్తావన ఉంది

• నృత్యశాస్త్ర పుట్టిన స్థలంగా కొందరు భావిస్తారు


*5. దేవప్రయాగం.*   

(ముఖ్యమైనది)

• ఇక్కడ అలకానందా + భగీరథి నదులు కలుస్తాయి

• కలిసిన తర్వాత ఈ కలిసిన నదినే “గంగా” అని పిలుస్తారు

• ఇది అత్యంత పవిత్రమైన సంగమం — గంగానది ఇక్కడ నుండి మొదలవుతుంది అనొచ్చు


*పంచ ప్రయాగ మహిమ:*

• పంచ ప్రయాగల్లో యాత్ర చేయడం వల్ల తీర్థయాత్ర ఫలితం లభిస్తుంది.


• వీటిని కాశీ, గయ, ప్రయాగ తరహాలో పవిత్రంగా పరిగణిస్తారు.


• పవిత్ర నదుల సంగమంలో స్నానం చేయడం వల్ల పాప నివృత్తి, పితృదేవతలకు శాంతి, ఆత్మశుద్ధి కలుగుతాయని హిందూ గ్రంథాలలో చెప్పబడింది.


• స్కాంద పురాణం, కేదారఖండం, వాయుపురాణం లాంటి పురాణాలలో ఈ పంచ ప్రయాగ మహిమ ప్రస్తావించబడింది.


• అనేక తీర్థయాత్ర గ్రంథాలు కూడా ఈ సంగమాల మాహాత్మ్యాన్ని వివరిస్తాయి.


*పంచ ప్రయాగ యాత్ర మార్గం (ప్రయాణ క్రమంలో):*

1. *హరిద్వార్/రుషీకేశ్ → దేవప్రయాగ*

2. *దేవప్రయాగ → రుద్రప్రయాగ*

3. *రుద్రప్రయాగ → కర్ణప్రయాగ*

4. *కర్ణప్రయాగ → నందప్రయాగ*

5. *నందప్రయాగ → విష్ణుప్రయాగ → జోషిమఠ్*


*పంచ ప్రయాగలు అంటే “అలకానందా నదికి అనుసంధానమైన ఐదు పవిత్ర నదీ సంగమాలు”. ఇవి హిమాలయాలలో ఉన్న అత్యంత పవిత్రమైన యాత్రా క్షేత్రాలు


❀꧁ హరే కృష్ణ ꧂❀

మంగళకరమైనవాడు

 ‘రుద్ర’ అంటే రోదనం పోగొట్టేవాడు. ‘శివ’ అంటే మంగళకరమైనవాడు. జీవులకు రోదనము పోగొట్టి, మోక్షము కలిగించేవాడు శివుడు. భోళాశంకరుడు, భక్తవత్సలుడు అయిన శివుడిని ‘మహదేవ’ అని ముమ్మారు భగవన్నామాన్ని భక్తిశ్రద్ధలతో ఉచ్చరిస్తే... వారికి ముక్తిని ప్రసాదిస్తాడు... అంతేకాదు,

‘"మాని యే మహేశస్య ధృవమ ప్రజ్ఞానతోపి వా తేషాం కరతలే ముక్తిః’’ 


ఎవరైతే పరమేశ్వరుని యొక్క నామాలు జ్ఞానంచేత కాని, అజ్ఞానం చేతకాని స్తుతిస్తూ వున్నారో, వారికి ముక్తి చేతిలోనే వుంది అని వేదంలో పేర్కొనబడింది. వేదాలలో యుజుర్వేదం గొప్పది. దానిలో నాలుగవ కాండలో ఉన్న రుద్రం ఇంకా గొప్పది. రుద్రం మధ్యంలోని ‘పంచాక్షరి’ అంతకంటే ఇంకా గొప్పది. పంచాక్షరిలోని ‘శివ’ అనే రెండు అక్షరాలు మరీ గొప్పవి.'శివ’ నామోచ్చారణ మహాత్మ్యమునకు సంబంధించిన ఇతివృత్తం పద్మపురాణంలో, పాతాళ ఖండంలో వుంది. అటువంటి మహాశివుడిని కార్తీకమాసంలో పున్నమి తిథినాడు కులమతభేదాలు వయస్సు తారతమ్యాలు లేకుండా శివభక్తులంతా పూజిస్తారు. కార్తికంలో ఏరోజు శివపూజ చేయక పోయనాకార్తీక పున్నమినాడు మూడువందల అరవైవత్తుల గుత్తిని స్వామిఎదురుగా కానీ, తులసి సన్నిథిలోకానీ, మారేడు, రావిచెట్ల దగ్గర కానీ వెలిగిస్తే... ఆ సంవత్సరం దీపం వెలిగించని పాపమేదైనా ఉంటే అది దూరం అవుతుంది. కార్తీక పున్నమినాడు దేవాలయాల్లో శివుని ప్రత్యేక పూజలు నిర్వర్తిస్తారు.

"ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం౹ సదానందభాజాం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం౹ శివం శంకరం శంభు మీశానమీడే౹౹"

అని, కార్తికంలో ఈశ్వరుణ్ణి ప్రతివారు కొలుస్తుంటారు.


ఉసిరి మూలమున శ్రీహరి, స్కందమున శివుడు, ఊర్థ్వమున బ్రహ్మ సూర్యుడు; శాఖలయందు సమస్తదేవతలు, కూడి కార్తీకమాసంలో ఉసిరిచెట్టును ఆశ్రయించి ఉంటారు. కనుక కార్తీకమాసంలో ధాత్రీపూజవలన అశ్వమేధ ఫలం లభించి, ఉసిరి ఫలదానమువల్ల ముక్తి కలుగుతుంది. ఉసిరిక దీపదానం కూడా ఈ మాసంలో విశేషంగా చేస్తారు.

ఓం నమః శివాయ నమః అంటూ ఉసిరిక కాయమీదనో, పిండి ప్రమిదతోనో, మట్టి ప్రమిదతోనో దీపంవెలిగిస్తే... అనంతకోటి పుణ్యరాశి లభిస్తుంది. 

శివుని పేరిట ఉపవాసం చేసినా, ఏకభుక్తం చేసినా, నక్తంచేసినా, ఆయాచిత వ్రతం చేసినా, ఆఖరికి శివనామంతో సూర్యోదయానికి పూర్వం స్నానంచేసినా సరే, అనంతకోటి పుణ్యఫలాలను పరమశివుడు అనుగ్రహిస్తాడు... స్వస్తి


సర్వేజనాసుఖినో భవంతు

హోమియో

 తలకు జండు బాము తలనొప్పి కద్దాలు

పేరసీటమాలు పెయిను మాత్ర

తలలు జెరిచి గూల్చు దరలురా హోమ్యోకు

సకురు అప్ప రావు సత్య మిదిర!


భావం: తలనొప్పి రావటం అనే దాని వెనుక ఎన్నో రకాల కారణాలు ఉండవచ్చు! తలలో ట్యూమర్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, బి.పి ఉండొచ్చు మరేదైనా ప్రమాదకరమైన జబ్బుకు సూచన అయి ఉండవచ్చు! కానీ జండూబామ్, కళ్ళద్దాలు, పేరసిటామాల్(శారిడాన్), పెయిన్ కిల్లర్ మందులు వాడితే అవి సమస్యకు టెంపరరీ రిలీఫ్ ను ఇస్తూ, అణచి పెట్టి(సప్ప్రెస్ చేసి) ముదరబెట్టి, ప్రాణాలు పోయే దాకా సైలెంట్ గా కథ నడిపిస్తాయి! అలా కాకుండా లక్షణాల సహాయంతో సమస్యను ముందుగానే గుర్తించి, సమూలంగా నయం చేయగలిగే హోమియోపతీ మందులు వాడుకుంటే రాబోయే ప్రమాదం నుంచి సులభంగా తప్పించుకోవచ్చు! కాబట్టి టెంపరరీ ఇంగ్లీషు వైద్యాలకు, పైపై పూతలకూ స్వస్తి పలికి, హోమియో వైద్యానికి సరైన సమయంలో వెళ్ళి, మీ తల లోపల దాగి ఉన్న నిజమైన సమస్యను సంపూర్ణంగా నయం చేసుకుని, రాబోయే ప్రాణాపాయ సమస్య నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి! మైగ్రేన్ తలనొప్పి నైనా, సైనస్, స్ట్రెస్, బ్రెయిన్ ట్యూమర్ తలనొప్పులైనా హోమియో సహాయంతో సులభంగా నయం చేసుకోండి! టెంపరరీ రిలీఫ్ లతో, టెంపరరీ ఆపరేషన్ లతో సమస్యను ముదరబెట్టుకుని, ప్రాణాపాయ స్థితికి చేరుకోవద్దు!

సకురు అప్పారావూ ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, కరోనా లాంటి వైరస్ లు వ్యాప్తి చెందుతున్నా, రకరకాల జ్వరాలు ఏడిపిస్తున్నా, ప్లేట్ లెట్స్ తగ్గటం, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గటం, ఊపిరితిత్తులు, ఇతర ఆర్గాన్స్ సరిగ్గా పని చేయకపోవడం లాంటి పరిస్థితులు కలిగినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఎవరి ఇంటిలో వారే ఉంటూ, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

సుభాషితము

 👌 _*సుభాషితము*_ 👌


_*ప్రదానం ప్రచ్ఛన్నం గృహముపగతే సంభ్రమ విధిః*_

_*ప్రియం కృత్వా మౌనం సదసి కథనం చాప్యుపకృతేః!*_

_*అనుత్సేకో లక్ష్మ్యాం నిరభిభవసారాః పరకథాః*_

_*సతాం కేనోద్దిష్టం విషమమసిధారావ్రత మిదమ్!!*_ 


దానము రహస్యముగా చేయుట, ఇంటికి వచ్చిన యాచకునికి ప్రియముగా ఆదరణ చూపుట, ఇతరులకు తాను చేసిన మేలు చెప్పుకోకుండుట, ఇతరులు తనకి చేసిన ఉపకారములను సభల్లో ప్రస్తావించుట, సంపద వచ్చిననూ గర్వము లేకుండుట, పరులను ప్రశంసించుట అను ఈ అసిధారావ్రతము (కత్తిమీది సాము) సజ్జనులకు స్వభావ లక్షణమేగానీ ఎవరి ఉపదేశము చేత రాలేదు

పంచారామాలు

 మోక్షాన్ని ప్రసాదించే పంచారామాలు - క్షేత్రాల విశేషాలు...

భోళాశంకరునికి దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో జ్యోతిర్లింగాలు, పంచభూతలింగాలు, పంచారామాలు ప్రసిద్ధి చెందినవి. ప్రత్యేకించి ఈ పంచారామాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండడం విశేషం. మోక్షద్వారాలుగా పేరుగాంచిన పంచారామాలు  క్షేత్రాల విశేషాలు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.


పంచారామాలు అంటే ఏమిటి? అవి ఎన్ని...?

స్కాందపురాణం ప్రకారం, శివుడు తారకాసురుడిని సంహరించినప్పుడు, అతడి గొంతులోని ఆత్మలింగం ఐదు ముక్కలైంది. ఆ ఐదు ముక్కలను దేవతలు ఐదుచోట్ల ప్రతిష్ఠించారని నమ్ముతారు. ఈ ఐదింటిని పంచారామ క్షేత్రాలని అంటారు.


దక్షారామం : పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని "భీమేశ్వరుడు" అని పిలుస్తారు. స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది. పై అంతస్తు నుండి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు మరియు సగభాగం నలుపుతో ఉంటుంది. ఇక్కడ దక్షప్రజాపతి దక్షయజ్ఞం నిర్వహించాడు కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చినదని అంటారు.


అమరారామం : పంచారామల్లో రెండవదైన 'అమరారామం' గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణానదీ తీరములో వెలసి ఉంది. ఇక్కడ స్వామిని "అమరేశ్వరుడు" అని పిలుస్తారు. గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో, తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది. అమరేశ్వరుడైన 'ఇంద్రుడు' ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించి, ఈ ఆలయానికి తన నగరమైన అమరావతి పేరునే పెట్టారు అని పురాణాల ద్వారా తెలుస్తోంది.


క్షీరారామం : క్షీరారామం పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో కలదు. ఇక్కడ స్వామిని "క్షీరారామలింగేశ్వర స్వామి" అని పిలుస్తారు. ఈ స్వామివారిని త్రేతాయుగ కాలంలో 'సీతారాములు' కలిసి ప్రతిష్ఠించారట. ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కథ ఉంది. 'శివుడు' తన బాణాన్ని భూమిలోనికి వెయ్యగానే భూమి నుండి పాలధార వచ్చిందట. క్షీరం అనగా పాలు, దీనిమూలంగా ఈ ప్రాంతానికి క్షీరారామమని, క్షీరపురి అనే పేరు వచ్చింది. కాలక్రమేణా ఇదే 'పాలకొల్లుగా' మార్పు చెందింది. ఇక్కడి స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. ఆలయం 125 అడుగుల ఎత్తులో '9' గోపురాలుతో అత్యంత సుందరంగా ఉంటుంది.


సోమారామం : పంచరామాల్లో నాల్గవదైన "సోమారామము". పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్లు దూరంలో ఉంది. ఇక్కడ స్వామి వారిని "సోమేశ్వరుడు" అని పిలుస్తారు. ఇచ్చట 'శివలింగానికి' ఒక ప్రత్యేకత ఉంది. మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే 'శివలింగం', అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాస్ధానానికి చేరుతుంది. ఇక్కడ స్వామిని 'చంద్రుడు' ప్రతిష్ఠించాడు. కాబట్టి దీనికి 'సోమారామము' అని పేరు వచ్చింది.


కుమారభీమారామం : పంచారామాల్లో ఐదవది చివరిదైన 'కుమారభీమారామము', తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమిటరు దూరంలో కలదు. ఇక్కడ స్వామిని "కాల బైరవుడు" అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన, చాళుక్య రాజయిన భీముడు ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. అందుకే ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటేరకంగా, నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుందని స్థానికులు అంటారు.


పంచారామాలు ఒకే రోజు దర్శించడం వల్ల మోక్షం ప్రాప్తిస్తుందని స్కంద పురాణం ద్వారా తెలుస్తోంది. అందుకే కార్తికమాసం, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో భక్తులు ఈ పంచారామాలు విశేషంగా దర్శిస్తుంటారు. మోక్షాన్ని కోరుకునే ప్రతి ఒక్కరు తప్పక దర్శించాల్సిన క్షేత్రాలు ఈ పంచారామాలు.🙏

పితృ దేవతా జ్ఞానం..

 పితృ దేవతా జ్ఞానం.. 


*దీనిని పూర్తిగా చదవగలిగితే మీకు పితృదేవతల అనుగ్రహం ఉన్నట్టే.*

*మాసికాల రహస్యం ఇదే*!

*మాసికాలు ఎందుకు పెట్టాలి?*

*అన్ని మాసికాలు పెట్టాలా?*

*కొన్నిమానేయవచ్చా?*

వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు.

దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది.

*అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు.*


*కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి.*


చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు?

మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి?

దేవతగా ప్రేత ఎలా మారుతుంది?

పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి?

అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు.

వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది.

ఆ ఉపనిషత్తు పేరు *పిండోపనిషత్తు*.

ఇది అథర్వణ వేదశాఖకు చెందినది.

ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది.

ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది.

దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు.

బ్రహ్మదేవుని దేవతలు, మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు.

*మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు?*

అనే ప్రశ్నలు వేశారు.

దానికి సమాధానంగా బ్రహ్మ దేహం దేహి గురించి వివరాలు చెప్పాడు.

*మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి.*

ఈ శరీరం

*భూమి,*

*నిప్పు,*

*నీరు,*

*గాలి,*

*ఆకాశం*

అనే మహాభూతాలతో ఏర్పడింది.

*ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళిపోతాయి.*

ఇది ఆధునిక వైద్యశాస్త్రజ్ఞలు కూడా అంగీకరించినదే.

*ముందుగా గాలి వెళిపోతుంది (ఊపిరి తీసుకోవడం).*

*దాని వలన పంచప్రాణాలు పోతాయి.*

*గాలి తరువాత అగ్ని పోతుంది.*

*శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళిపోతుంది.*

*తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది.*

*ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి.*

*ఇవి భూమిలో కలిసిపోతాయి.*

*శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది.*

*క్లుప్తంగా జరిగేది ఇదే.*

*ఇది పంచభూతాలు వెళిపోయే విధానం.*

నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ

*కారణ శరీరం,*

*యాతనా శరీరం*

అని ఉంటాయి.

*కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం.*

*తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం మరో శరీరం వెతుక్కుంటూ వెళిపోతుంది.*

*అదే నూతన శరీరం పొందుతుంది.*

*యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళిపోతుంది.*

*ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది.*

*ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు, చుట్టూ తిరుగుతూ ఉంటుంది.*

*ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది.*

*దీని తరువాత పదోరోజున*

*సపిండులు,*

*సగోత్రీకులు,*

*బంధువులు,*

*స్నేహితులు*

*వచ్చి, వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి.*

*వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళిపోతుంది.*

*అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది.*

*పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ, ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది.*

*సపిండికరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో,*

*తన తండ్రి తాత ముత్తాతల్లో,*

*ముత్తాతను ముందు జరిపి,*

*ఆయన ఖాళీలో తాతను,*

*తాత స్థానంలో తండ్రిని,*

*తండ్రి స్థానంలో తాను*

*చేరుకుంటుంది.*

*పితృదేవతాస్థానం పొందుతుంది.*

*దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్టశ్రాద్ధాల రూపంలో అందుతుంది.*

*నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు.*

*వీటిలో మొదటి పిండం ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది.*

*దీన్నే కలనం అన్నాడు.*

*దీని తరువాత మాంసం, చర్మం, రెండో పిండం ద్వారా ఏర్పడతాయి.*

*మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. (మెదడు).*

*నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి.*

*ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి.*

*ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు ఏర్పడతాయి.*

*ఆయుప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది.*

*ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి.*

*తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి.*

*పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది.*

*ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన, పిండశరీరం నుంచీ సంపూర్తి శరీరం, పిండాల వలన కలుగుతుంది.*

*ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి, వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి ఋణం తీర్చుకోవాలి.*

*నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు.*

*వీటిలో 10 పిండాల గురించి మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది.*

*మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.*

*అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి.*

*ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది.*

*ఆ తరువాత*

*అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది.*

*కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే.*

*మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు.*

*ఏది వదిలితే, అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైకల్యం కలుగుతుంది.*

*మనకు కోట్లు ఖరీదు చేసినా దొరకని భోగశరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించినవారమవుతాము.*

*మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు.*

*మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది.*

*సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు.*

*తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి.*

*కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది.*

ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు.

ఇవన్నీ సామాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి.

*ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన*

*కురుక్షేత్రం,*

*ప్రయాగ,*

*కాశీ,*

*గయా,(*

*వంటి వాటిలో చేయాలి.*

*ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము.*

*దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది.*

*వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు.*

పిండాలు ప్రేతాలకు వెళతాయా?

అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు.

*నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు.*

*అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి.*

అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు.

వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే చెబుతారు.

గయలో ఎందుకు చేయాలి?

ప్రయాగలో ఎందుకు చేయాలి?

అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు.

పుణ్యక్షేత్రాలుగా చెబుతున్న ప్రాంతాలు అన్నీ పరమాత్మ శరీరాంగాలు.

ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు.... వంటివి.

ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి.

వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి.

వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు.

ఉదాహరణకు మాఘపౌర్ణమి చాలా మంచిది.

దాన్ని *మాఘపౌర్ణమి,* *మహామాఘి* అని అంటారు.

ఆ రోజున పితరలకు ప్రయాగలో పిండప్రదానం చేస్తే దివ్యమైన ఫలాలు, సంపదలు కలుగుతాయి.

ప్రయాగలో చివరిగా రాబోతున్న మహాశివరాత్రి స్నానానికి ముందు రానున్న పుణ్యదినం.

ఆ సమయానికి వెళ్ళలేని వారు మానసికంగా అయినా తమపెద్దలకు నమస్కరించుకొని స్వధానామసాధన చేసి, స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని, ఆవుకు ఒకరోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు.

*ఇవే మాసికాలు పిండప్రదానాల రహస్యాలు.*

రామాయణం

 *రామాయణం లో అత్యంత ముఖ్యమయిన/ విశిష్టమయిన శ్లోకం ఏది?*

             ➖➖➖

ఒకసారి విక్రమాదిత్య అనే రాజుకు తన సభలో ఉన్న “నవరత్నాలలో” ఎవరు ఉత్తమ పండితులో తెలుసుకోవాలని అనిపించింది.


రాజ్యసభలో ఉన్న పండితులందరినీ పిలిచి ‘రామాయణంలో ఉన్న శ్లోకాలలో అత్యంత ముఖ్యమైన శ్లోకం ఏది అయి ఉంటుంది’ అని ప్రశ్నించారు.


ఆ శ్లోకం గురించి చెప్పిన వారికి 1000 బంగారపు నాణేలు ఇస్తాము అని కూడా ప్రకటించారు.


ఈ శ్లోకాన్ని రామాయణంలో నుంచి వెతికి పట్టుకోవడానికి పండితులకు విక్రమాదిత్యుడు 40 రోజుల గడువు ఇచ్చాడు.


విక్రమాదిత్యుని రాజ్యసభలో “వరరుచి” అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి ఆ వెయ్యి బంగారు నాణాలు ఎలాగైనా సంపాదించాలి అని కోరిక కలిగింది.


అప్పుడు ఆ వరరుచి దేశాటనకు బయలుదేరి అనేక రాజ్యాలు తిరుగుతూ రామాయణం లో ఉన్న ముఖ్యమైన శ్లోకం ఏది అని అందరు పండితులను అడగటం మొదలు పెట్టాడు.


అయితే అతనికి రామాయణం లో ఉన్న అన్ని శ్లోకాలలో ఒకే ఒక్క శ్లోకాన్ని ఉత్తమమైనది అని చెప్పటం సాధ్యం కాదు అన్న సమాధానమే దొరికింది.


40 రోజులలో చివరి రోజు అతను తన రాజ్యానికి తిరిగి వస్తూ అలసిపోయి ఒక చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటున్నాడు.


నిద్రపోతున్న సమయంలో ఆ చెట్టు మీదకు ఇద్దరు వనదేవతలు వచ్చి సంభాషించుకుంటూ ఉన్నారు.


వారిలో ఒక వనదేవత మాట్లాడుతూ మాటల్లో రామాయణంలో ప్రముఖమయిన శ్లోకం “మాం విద్ధి..” అని చెప్పింది.


ఆ సంభాషణ విన్న వరరుచికి ఎంతో ఆనందం కలిగింది.


అతను వెంటనే విక్రమాదిత్య రాజ్యసభకు వెళ్లి ఆ ముఖ్యమయిన శ్లోకం ఏదో చెప్పాడు.


*ఆ శ్లోకం ఇది...```


*రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్*

*అయోధ్యామటవీం విద్ధి గచ్ఛ తాత యథాసుఖమ్*


```ఆ శ్లోకాన్ని విన్న విక్రమాదిత్యుడు.. ఆ శ్లోకానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? అని అడిగాడు.


అతను చెప్పిన 18 రకాలయిన అర్ధాలను విన్న విక్రమాదిత్యుడు రామాయణంలో ఇదే ఉత్తమమైన శ్లోకం గా భావించి అతనికి 1000 బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు.```


ఈ శ్లోకంలో ఉన్న అర్ధం ఏమిటి? ఎందుకు ఈ శ్లోకం అంత ముఖ్యమయినదిగా చెప్పారు?```


ఈ శ్లోకం వాల్మీకి రామాయణంలో అరణ్యకాండలో 40వ సర్గలో వస్తుంది...


రాముడు అరణ్యాలకి వెళ్తున్నాడు అని తెలిసి లక్ష్మణుడు తను కూడా అరణ్యాలకు బయలుదేరుతూ, తన తల్లి “సుమిత్ర” ఆశీర్వాదం కోరినప్పుడు సుమిత్ర లక్ష్మణుడికి చెప్పిన సమాధానం ఈ శ్లోకం...


ఈ శ్లోకానికి ఉన్న అనేక అర్థాలలో కొన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం...``` 


*రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్.*

*అయోధ్యామటవీం విధ్ది గచ్ఛ తాత! యథాసుఖమ్৷৷*


*మొదటి అర్ధం:```

రామ= రాముడు: దశరథం=దశరథుడు:  

విద్ధి=అనుకో: మామ్= నేనే; జనకాత్మజ= జనకుని కూతురు;

విద్ధి= అనుకో; అయోధ్యా= అయోధ్య; మాటవీం=అడవి; విద్ధి=అనుకో; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; 

యథా సుఖమ్=సుఖంగా```


లక్ష్మణా! రాముడే దశరథుడు అనుకో, సీతనే నేను(సుమిత్ర) అనుకో, అడవినే అయోధ్య అనుకో, సుఖంగా వెళ్ళిరా!



*రెండవ అర్ధం:```

రామ= రాముడు: (దశ = పక్షి రథం=రధం) దశరథం= పక్షిని రధంగా కలిగిన వాడు, విష్ణువు ; మామ్= లక్ష్మీదేవి; జనకాత్మజ= జనకుని కూతురు; అయోధ్యా= శతృదుర్భేద్యమయినది(వైకుంఠం); మాటవీం=అడవి; విద్ధి=అనుకో; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్=సుఖంగా.```


ఓ పుత్రా! ఈ రాముడే శ్రీమహావిష్ణువు, సీతే శ్రీ మహాలక్ష్మి, వారిద్దరూ ఎక్కడ ఉంటే అదే వైకుంఠం అనుకుని సుఖంగా వెళ్లి రా!



*మూడవ అర్ధం:```

రామ= రాముడు: దశరథం=దశరథుడు: విద్ధి=వలెనే: మామ్=నీ తల్లి (కైకను ఉద్దేశించి); జనకాత్మజ= జనకుని కూతురు; విద్ధి= వలెనే; అయోధ్యా= అయోధ్య; మాటవీం=అడవి; విద్ధి=వలెనే; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్= వీలయినంత సుఖంగా```


ఓ పుత్రా! నీ తండ్రి దశరధుడు భార్యమాటని విని, అత్యంత అమూల్యమయిన రాముని సాంగత్యం పోగొట్టుకుని ఎలా దుఃఖిస్తాడో, సీత మాట విని రాముడు కూడా అతనికి అమూల్యమయిన సీతను చేజార్చుకుని దుఃఖాన్ని పొందుతాడు.

రాముడు లేక అయోధ్య ఎలా శోకిస్తుందో అలాగే అరణ్యం కూడా సీత జాడ లేక శోకిస్తుంది.

కనుక వీలయినంత దైర్యం చెప్తూ రాముని చెంత నీవు ఉండు.✍️


ఈ దేశం ఎంత గొప్పది, ఇక్కడ ఋషులు ఎంత గొప్ప వారో వారు!  


వారసత్వంగా మనకు అందించిన….         

ఆ అమూల్య రత్నాలు ఎంత విలువైనవో గదా.                                            


   సేకరణ🙏

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: ఏడవ అధ్యాయం

విజ్ఞానయోగం: శ్రీ భగవానువాచ


బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే 

వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః (19)


కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతే௨న్యదేవతాః 

తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా (20)


అనేక జన్మలలో ఆచరించిన పుణ్యకర్మల ఫలితంగా జ్ఞాని చివర జగత్తు సర్వమూ వాసుదేవమయం అనే జ్ఞానంతో నన్నాశ్రయిస్తాడు. ఈ లోకంలో అలాంటి మహానుభావులు చాలా అరుదు. తమ తమ పూర్వ జన్మ సంస్కారాలకు సంబంధించిన కోరికల మూలంగా వివేకం కోల్పోయిన కొందరు, ఇతర దేవతలను, వాళ్ళకు తగిన నియమాలతో ఉపాసిస్తున్నారు.

తండ్రి ని యెరుగని వారి కి

 *2049*

*కం*

తండ్రి ని యెరుగని వారి కి

తండ్రుల దినమొకటి యుండు తండ్రి ని తలువన్.

తండ్రి ని యెరిగినవారికి

తండ్రి నిరతపూజ్యుడయ్యు ధరణిన సుజనా.

*భావం*:-- ఓ సుజనా! తండ్రి వివరాలు తెలియని వారి కోసం తండ్రి ని తలుచుకునేవొకదినం ఉంటుంది. తండ్రి వివరాలు తెలిసిన వారికి తండ్రి ఎల్లప్పుడూ పూజించబడే దైవమగును.

*సందర్భం*:-- పాశ్చాత్యుల స్వేచ్ఛా జీవన విధానంలో తండ్రి ని గుర్తించడం కష్టం కావడం తో ఒక దినము ను తండ్రుల దినం గా పాటించుకొనుచుండగా భారతీయులు కూడా ఆ దినము ప్రాముఖ్యము నెరుగక అవలంబించనెంచుచున్నారు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

అందరిలో మనం"

 *అందరిలో మనం" అనే భావనను ఆధ్యాత్మికంగా చూస్తే ఇది "అహం బ్రహ్మాస్మి" అనే మహావాక్యానికి దగ్గరగా ఉంటుంది. దీనివెనుక అర్థాన్ని విడమరిచి తెలుపితే *


 ఆధ్యాత్మిక విశ్లేషణ:


1. అభేద భావం (Non-duality / అద్వైతం):


"అందరిలో మనం" అనగా మనం ఒక విభిన్నమైన వ్యక్తులం కాదని, ప్రతి జీవిలో ఒకే చైతన్యం ఉంది అనే భావన. ఈ ఆలోచన ఆదిశంకరాచార్యుల అద్వైత వేదాంతంలో ప్రధానంగా ఉంటుంది.


> అంతఃప్రత్యయము:

"నాన్యత ఒక మాయా భావన మాత్రమే; నిజానికి ప్రతి ఒక్కరినీ ఆత్మ, చైతన్య స్వరూపంగా చూడాలి."


2. ఏకత్వ దృష్టి (Unity Consciousness):


ఈ భావన అనగా "నీలో నేను, నాలో నీవు" అనే అనుభూతి. ఇది భక్తి మార్గంలో సాధారణం. శివుడినే ప్రతి వ్యక్తిలో దర్శించే స్థితి.


> ఉదాహరణగా:

ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు, మనకు బాధ అనిపిస్తే – అది ఏకత్వ భావన. ఇది సహానుభూతి కంటే ఎక్కువ – అది ఆధ్యాత్మిక గుర్తింపు.


3. కర్మయోగ దృష్టికోణం:


కర్మయోగంలో "అందరిలో మనం" అనగా, సేవ చేసే సమయంలో "నేను ఇతరులకోసం చేస్తున్నాను" అన్న భావన లేకుండా, ప్రతి సేవను భగవంతుడికి అర్పించటమే. మనం చేసిన ప్రతి పనిలో పరమాత్మను చూసే దృష్టి.


> గీతా ఉల్లేఖం (BG 6.29):

"సర్వభూతస్థమాత్మానం, సర్వభూతాని చాత్మని"

అంటే: "సర్వజీవుల్లోనే ఆత్మను, ఆత్మలోనే సర్వజీవులను చూసే యోగి..."


"అందరిలో మనం" అనేది ఒక పరిపక్వ ఆధ్యాత్మిక దృష్టి. దీనివల్ల...


మనం ఇతరులను నిందించము


దయ, సహన, ప్రేమ పెరుగుతుంది


"సర్వేజనాః సుఖినో భవంతు" అనే భావన బలపడుతుంది.


మనలోని అహం కరిగిపోతుంది. 


చివరగా చెప్పాలంటే, మనిషి పరిమిత ‘నేను’ భావన నుండి, విశ్వచైతన్యంతో ఒకీభవించిన స్థితికి చేరడమే ఈ భావనలోని గమ్యం.


*(ఆధ్యాత్మిక కవిత)*


అందరిలో మనం, మనలో వారు,

ఆత్మలో ఆత్మ, పరబ్రహ్మ సారు!

ఒక్క వెలుగు వెలిగే జగత్ అంతట,

ఆ వెలుగే మనం – అవినాభావం మట్టే!


చూడు శివుని వాని లోకజనులో,

వేడుకే కాదు వేదనలోనూ!

హృదయంలో నీవు వెలిగితే వెలుగు,

ఆ వెలుగే ప్రతి జీవుకి శ్రుతిగా పలుకు.


బిడియము తీరెడు ప్రేమ చూపులో,

దయామయుని దర్శనమవుతుంది లోపులో!

జీవగణంలో భేదమెంత కాదు,

మనసే కలిసితే పరమేశ్వరుడే స్నానం!


నా క్షుద్ర ‘నేను’ మరిచిన వేళ,

నీలోనే నేనైపోయిన ఆనంద గోళ!

ఆ తత్వమే సాధన, ఆ తత్వమే సాధ్యం,

అందరిలో మనం — అదే మోక్ష మార్గం!.*

.

1 యోగ మార్గం ద్వారా ఎవరికి అయితే సత్వ బుద్ధి పురుష శుద్ధి కలుగుతుందో వారికి ఓంకార నాదం వినిపిస్తుంది కుడిచెవిలో 


ఓంకార నాద వినికిడిని మీద చిత్తం పెట్టి ఉండగలిగితే ఆ ఓంకార నాదం భూమధ్య స్థానం నుండి సహస్రం చేరుతుంది ఇలాంటి వారికి మళ్లీ జన్మ ఉండదు


2 ఎవరైతే సమస్తాన్ని భౌతిక ప్రపంచాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారో అలాంటి వారికి కూడా జన్మ ఉండదు ఎలాగంటే ఒక వ్యక్తితో మనం తిరుగుతున్నప్పుడు మంచి వారితో ఉంటే మంచి అలవాట్లు చెడ్డవారితో తిరిగితే చెడు అలవాట్లు ఆయన యొక్క అలవాట్లు మనకు కొన్ని వస్తాయి మంచివి అయినా చెడువి అలాగే 


మనం సమస్తము దైవ స్వరూపంగా భావించినప్పుడు అనుకోకుండానే మనం దైవాన్ని చేరుతాం

దీన్ని భ్రమరా కీటక న్యాయమంటారు

చూస్తూ చూస్తూ చూస్తూ చూస్తూ చూస్తూ చూస్తూ ఉంటే అదే అయిపోతుంది చివరికి.


3 కర్మలు చేసి ఫలితాన్ని వదిలేసిన మళ్లీ జన్మ ఉండదు.


4 భక్తి మార్గం ద్వారా త్రికరణ శుద్ధిగా దైవానికి శరణాగతి అయితే మళ్లీ జన్మ ఉండదు జరిగింది జరుగుతున్నది జరగబోయేది ఏదైనా సరే అది దేవుడే జరిపించాడు అని అనుకోని మంచి చెడు రెండిటిని సమానంగా స్వీకరించి ఫలితాన్ని దైవానికి అర్పించి దొరికినదారితో తృప్తిపడే జీవిస్తే చివరికి తాను దైవాన్ని చేరుతాడు.


5 హృదయ గ్రంధులు చేదించినప్పుడు

తామర తోడు లాగినప్పుడు ఒక్కొక్కటి తేగి వస్తుంది అలా హృదయ గ్రంథులు ఒక్కొక్కటి తెగిపోయినప్పుడు మళ్లీ జన్మ ఉండదు కర్మలన్ని తొలగిపోతాయి


6 యోగ మార్గము ద్వారా 

భృమధ్య స్థానంలో జీవుడు ఆత్మలో విలీనం అయినప్పుడు జీవబ్రహ్మైక్య సిద్ధిపొందినప్పుడు మళ్లీ జన్మ ఉండదు..*

⚜ శ్రీ వరదవినాయక దేవాలయం

 🕉 మన గుడి : నెం 1144


⚜ మహారాష్ట్ర : మహద్


⚜  శ్రీ వరదవినాయక దేవాలయం 


 

💠 భగవాన్ గణేశుడు మహారాష్ట్రలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత గౌరవనీయమైన దేవుడు. 

అయితే, మహారాష్ట్ర రాష్ట్రంలో, ఎనిమిది గణేశ ఆలయాలు ఉన్నాయి, వీటిని అష్టవినాయకులు లేదా ఎనిమిది ముఖ్యమైన గణేశ ఆలయాలు అని పిలుస్తారు.


💠 శ్రీ వరదవినాయక గణపతి ఆలయం, మహద్ వాటిలో ఒకటి. 

అష్టవినాయక యాత్ర సమయంలో భక్తులు సందర్శించే అష్టవినాయకుల జాబితాలో వరదవినాయక మహాద్ గణపతి మందిరం ఏడవ గణేశ మందిరం. ఈ ఆలయాన్ని మఠం అని కూడా పిలుస్తారు. 


💠 మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా ఖోపోలి సమీపంలోని మహాద్‌లోని వరదవినాయక ఆలయం గణేశుడి అష్టవినాయక ఆలయాలలో ఒకటి. 

ఈ ఆలయాన్ని పేష్వా జనరల్ రాంజీ మహాదేవ్ బివాల్కర్ 1725 లో నిర్మించారు (పునరుద్ధరించారు).


🔆 స్థల పురాణం 


💠 కౌడిన్యపూర్ రాజు భీముడు మరియు అతని భార్య సంతానం లేనివారు తపస్సు కోసం అడవికి వచ్చినప్పుడు విశ్వామిత్ర మహర్షిని కలిశారని పురాణాలు చెబుతున్నాయి . విశ్వామిత్రుడు రాజుకు ఏకశరగజన మంత్రాన్ని జపించమని చెప్పాడు, తద్వారా అతని కుమారుడు మరియు వారసుడు, యువరాజు రుక్మగంధుడు జన్మించాడు. రుక్మగంధుడు ఒక అందమైన  యువరాజుగా పెరిగాడు.


💠 ఒకరోజు, వేట యాత్రలో రుక్మగంధుడు ఋషి వాచక్నవి ఆశ్రమంలో ఆగాడు. 

ఆ ఋషి భార్య ముకుంద, ఆ అందమైన యువరాజును చూసి ప్రేమలో పడి, తన కోరికలు తీర్చమని కోరింది. ఆ సద్గుణవంతుడైన యువరాజు నిరాకరించి ఆ ఆశ్రమం నుండి వెళ్లిపోయాడు. 

ఆమె దుస్థితిని తెలుసుకున్న ఇంద్రుడు రుక్మగంధ రూపాన్ని ధరించి ఆమెను ప్రేమించాడు. ముకుంద గర్భవతి అయి, గృత్సమద అనే కొడుకుకు జన్మనిచ్చింది. 


💠 అతను చాలా తెలివైనవాడు మరియు పండితుడు. అతను ఒకసారి ఇతర పండితులను వాదనకు ఆహ్వానించాడు, కానీ వారు నిరాకరించారు, అతను బ్రాహ్మణుడు కానందున, వారు అతనితో మతపరమైన విషయాలను చర్చించలేరని చెప్పారు. గ్రిత్సమద తన తల్లిని తన జన్మ రహస్యం గురించి అడిగాడు. 


💠 అతని తల్లి నిరాకరించినప్పుడు, అతను ఆమెను శపించాడు. 

తల్లి కూడా అతన్ని శపించింది. 

కానీ ఒక దివ్య స్వరం అతను ఇంద్రుని కుమారుడని అతనికి చెప్పింది.


💠 కాలక్రమేణా, గ్రిత్సమద తన జనన పరిస్థితుల గురించి తెలుసుకున్నప్పుడు, అతను తన తల్లిని ఆకర్షణీయం కాని, ముళ్ళతో కలిగిన మొక్కగా మారమని శపించాడు. 

ముకుందుడు గ్రిత్సమద నుండి క్రూరమైన రాక్షసుడు పుడతాడని శపించారు. 



💠 ముకుంద భోర్ మొక్కగా రూపాంతరం చెందింది.. సిగ్గుపడి పశ్చాత్తాపపడిన గ్రిత్సమద పుష్పక అడవికి వెళ్ళిపోయాడు, అక్కడ అతను గణేశుడికి విముక్తి కోసం ప్రార్థించాడు.


💠 గణేశుడు గ్రిత్సమదుని తపస్సుకు సంతోషించి, శంకరుడు ( శివుడు ) తప్ప మరెవరి చేతిలోనూ ఓడిపోని కొడుకును కంటావని వరం ఇచ్చాడు . 


💠 గ్రిత్సమదుడు గణేశుడిని అడవిని దీవించమని అడుగుతాడు, తద్వారా ఇక్కడ ప్రార్థన చేసే భక్తులు విజయం సాధిస్తారు, మరియు గణేశుడు అక్కడే శాశ్వతంగా ఉండమని కోరాడు మరియు బ్రహ్మ జ్ఞానం కోరాడు . గ్రిత్సమదుడు అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాడు మరియు అక్కడ ప్రతిష్టించిన గణేశ విగ్రహాన్ని వరదవినాయక అని పిలుస్తారు. 

నేడు ఆ అడవిని భద్రక అని పిలుస్తారు. 


💠 మాఘి చతుర్థి సమయంలో ప్రసాదంగా స్వీకరించిన కొబ్బరికాయను తింటే, పుత్ర సంతానం కలుగుతుందని చెబుతారు. 

అందుకే మాఘి ఉత్సవం సమయంలో ఆలయం భక్తులతో నిండి ఉంటుంది


💠 ఈ ఆలయంలోని వరద వినాయక విగ్రహం స్వయంభువు మరియు దీనిని ప్రక్కనే ఉన్న సరస్సులో 1690లో మునిగిపోయిన స్థితిలో కనుగొన్నారు. ఈ ఆలయాన్ని 1725లో సుభేదార్ రాంజీ మహాదేవ్ బివాల్కర్ నిర్మించారని చెబుతారు . 


💠 ఆలయ ప్రాంగణం ఒక అందమైన చెరువుకు ఒక వైపున ఉంది. 

ఈ ఆలయ విగ్రహం తూర్పు ముఖంగా ఉంది మరియు అతని తొండం ఎడమ వైపుకు తిరిగి ఉంటుంది. 

ఈ మందిరంలో ఒక నూనె దీపం ఉంది, ఇది 1892 నుండి నిరంతరం వెలుగుతున్నట్లు చెబుతారు. 


💠 ఈ ఆలయంలో మూషిక , నవగ్రహ దేవతలు మరియు శివలింగ విగ్రహం కూడా ఉన్నాయి . 

ఆలయం యొక్క 4 వైపులా కాపలాగా 4 ఏనుగుల విగ్రహాలు ఉన్నాయి. 


💠 ఈ అష్ట వినాయక ఆలయంలో భక్తులు గర్భగృహంలోకి ప్రవేశించి విగ్రహానికి వ్యక్తిగతంగా నివాళులు అర్పించి, గౌరవించవచ్చు. 

భక్తులు ఏడాది పొడవునా వరదవినాయక మందిరాన్ని సందర్శిస్తారు. 


💠 మాఘ చతుర్థి వంటి పండుగల సమయంలో ఈ ఆలయంలో భారీ జనసమూహాన్ని చూడవచ్చు.



💠 ఈ గణపతి ఆలయం ముంబై నుండి 63 కి.మీ, పూణే నుండి 85 కి.మీ, కర్జాత్ నుండి 25 కి.మీ, లోనావాలా నుండి 21 కి.మీ మరియు ఖోపోలి నుండి 6 కి.మీ దూరంలో ఉంది. 


రచన

©️ Santosh Kumar

18-17-గీతా మకరందము

 18-17-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అl అహంకారము, కర్తృత్వబుద్ధి లేనివాడు కర్మలచే నంటబడడని వచించుచున్నారు– 


యస్య నాహంకృతో భావో 

బుద్ధిర్యస్య న లిప్యతే

హత్వా౽పి స ఇమాన్ లోకాన్

న హన్తి న నిబధ్యతే.


తా:- ఎవనికి "నేను కర్తను' అను తలంపు లేదో, ఎవనియొక్క బుద్ధి విషయములను, కర్మలను అంటదో అతడీ ప్రాణులన్నిటిని చంపినను వాస్తవముగ ఏమియు చంపుటలేదు. మరియు నతడు (కర్మలచే, పాపముచే) బంధింపబడుటయు లేదు.


వ్యాఖ్య:- అహంకారముగాని, 'నేను కర్తను' అను తలంపుగాని లేనివానికి, బుద్ధి విషయములందుగాని , కర్మలందుగాని అంటనివానికి ఈ ప్రాణులన్నిటిని వధించినను, వధించనట్లేయనియు, పాపముచే నతడు చుట్టుకొనబడడనియు, ఆతడు బంధింపబడడనియు ఇచట తెలుపబడెను. ఈ శ్లోకార్థమును బహుజాగ్రత్తగ యోచన చేయవలయును. లేకున్న మనుజుడు అజ్ఞానమను అఖాతమున పడిపోవు ప్రమాదము గలదు.

కర్మబంధమునకు కారణము కర్మలందు కర్తృత్వబుద్ధి గలిగియుండుట, బుద్ధి ఆ యా విషయములకు, కర్మలకు అంటుకొనుట (సంగము) అయియున్నది. కర్తృత్వబుద్ధి లేకుండ కర్మలు చేయువానికిగాని, విషయములందు బుద్ధి అంటకుండ (సంగములేకుండ) కర్మలు చేయువానికిగాని, ఆ కర్మజనిత సుఖదుఃఖములుగాని పుణ్యపాపములుగాని అంటవు. ఆ సత్యమే యిచట చెప్పబడినది. అంతియేకాని ప్రాణులను చంపుమనిగాని, చంపుట యుక్తమనిగాని యిచట బోధింపబడలేదు. పైగా సమస్తమును ఆత్మరూపముగ వీక్షించువాడు, కర్తృత్వములేనివాడు, అసంగుడై యుండువాడు, తాను మనస్సుగాదని తలంచువాడు, ఆత్మయందే స్థితిగలిగియుండును గావున అట్టివాడు సమస్తప్రాణులందును తన ఆత్మనే చూచుటవలన ఒక ప్రాణి కెట్లు బాధకలుగజేయగలడు? కాబట్టి అట్టి అసంగభావము గలవాడు, ఆత్మస్థితుడు జనులకు ఉపకారము చేయునేకాని, అపకారము చేయడు. ప్రాణులను హింసింపడు. ఒకవేళ హింసించినచో ఆతని కింకను ఆత్మజ్ఞానము కలుగలేదనియే ఊహించవలసియుండును.

       మనుజుడు వాస్తవముగ దేహముగాని, మనస్సుగాని కాదు - ఆత్మయే. కర్తృత్వము, అహంభావము లేనివాడు ఆత్మయందే స్థితి గల్గియుండును. అట్టివారు బుద్ధిచేగావింపబడు కర్మలతోగాని, తజ్జనిత బంధముతోగాని ఏ సంబంధమును లేకుండును. కాబట్టి యతడు ఒక ప్రాణినేకాదు, అన్ని ప్రాణులను ఒకవేళ చంపినను, బుద్ధితో సంగము లేకుండుటవలన, కర్తృత్వము లేకుండుటవలన, ఆత్మయందే యుండుటవలన ఆతడు చంపనట్లేయగుచున్నాడు. మరియు ఆ వధవలన కలుగు పాపముచే, బంధముచే అంటబడక నుండుచున్నాడు. ఇచట ఆత్మయొక్క ఆత్మస్థితునియొక్క నిర్లేపత్వమును గూర్చిన ఒకానొక సిద్దాంతము, సత్యము చెప్పబడినదేకాని హింసాప్రేరణము కాదు. వాస్తవముగ అట్టి నిర్లేపత్వమును బడసినవాడు, ఆత్మయందున్నవాడు నిరంతరము ప్రాణికోట్లకు మేలుచేయునే కాని, వానిని ఏ మాత్రము బాధింపడు. ఈ విషయమును ముముక్షువులు ముఖ్యముగ జ్ఞప్తియందుంచుకొనవలెను.

పుణ్యపాపములకు కారణము కర్తృత్వము, సంగము, ఆసక్తి; అనగా జీవుడు తన ఆత్మస్థానమును వదలి, దిగివచ్చి దృశ్యముతో, బుద్ధితో జేరి "నేను చేయుచున్నాను" అని తలంచుటయే. కాని ఎపు డట్టి సంగము (ఆసక్తి), కర్తృత్వములేదో అత్తటి ఆ పుణ్యపాపములతోగాని, తజ్ఞనిత సుఖదుఃఖములచే గాని, బంధమోక్షములతోగాని మనుజునకు సంబంధము యుండదు. కావుననే అట్టివాడు అందరిని చంపినను, చంపనివాడే యని చెప్పబడుటకు కారణము. "ఎంతపాపమైనను అంటదు" - అనుదానికి ఒక తార్కాణముగ, " అతడొకవేళ అందరిని చంపినను చంపనివాడేయగునని వచింపబడినదేకాని వారిని చంపుమని బోధింపబడలేదు.


మరియు అర్జునుడు క్షత్రియుడు. దుష్టశిక్షణ ప్రభువుకు ధర్మము, కర్తవ్యము. కౌరవులు అధర్మమును జేబట్టి దుష్టులుగ తయారైరి. " కావున అట్టివారినందరిని ఓ అర్జునా! అసంగబుద్ధిగలిగి, నిరహంకారముతో నీవు వధించినను వధింపనట్లేయగు’ నని భగవానుడు అర్జునునకు తెలియజేయుచున్నాడనియు భావించవచ్చును. బుద్ధినిదాటి, అహంభావమును దాటి ఆత్మయందు నెలకొనియుండువానికి ఆ బుద్ధితో ఏది చేసినను చేయనట్లేయగునుగదా! అయితే అట్టి స్థితియందుండువారు అసభ్యమైన, అధర్మయుతమైన, హింసాకరమైన, పీడాకరమైన క్రియలెవ్వియును జేయరు. " ఇమాన్ లోకాన్' అని అర్జునునకు చెప్పినందువలన “ ఈ యెదుటనున్న కౌరవరాజులు మున్నగువారు అనియు తలంచవచ్చును. ప్రభువులు దుష్టులకు, ద్రోహులకు గావించు శిక్ష పాపముగా పరిగణింపబడదు. కావున అది వారిని బంధింపదు. పైగా అట్టి క్రియను అసంగబుద్ధితో నాచరించునపుడు ఇంకను ఏ మాత్రము బంధప్రభావమును కలుగజేయదు.

కాబట్టి భగవానుడు తెలిపిన ఈ శ్లోకమందలి భావమును చాల లోతుగ విచారించి, పరప్రాణికి ఏమియు బాధ కలుగజేయక, ఆత్మయందు స్థితుడై అసంగబుద్ధితో ఆ యా కార్యముల నెరవేర్చుచు, బంధవిముక్తుడై వెలయవలెను.


ప్ర:- పాపమునకు, బంధమునకు కారణమేమి?

ఉ:- (1) అహంభావము ("నేను కర్తను' అనుభావము) (2) బుద్దియొక్క సంగము (విషయాదులతో, కర్మాదులతో అంటుకొనుట).


ప్ర:- పాపము, బంధము తొలగుటకు ఉపాయమేమి?

ఉ:- అట్టి సంగ కర్తృత్వాదులు లేకుండుట. అత్తటి కార్యములను జేసినను వానిచే నతడు బంధింపబడడు.

తిరుమల సర్వస్వం -272*

 *తిరుమల సర్వస్వం -272*

 *సుప్రభాత గానం 2* 


 సుప్రభాత అంతర్గతమైన ఒక్కొక్క విభాగంలో ఏముందో ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం.


 *శ్రీ వేంకటేశ సుప్రభాతం* 


 *'సుప్రభాతం'* అంటే మంగళకరమైన ఉదయపు వేళ అని అర్థం. వేంకటేశ సుప్రభాతం యొక్క ఇతివృత్తం ముఖ్యంగా శ్రీవారి మేలుకొలుపు గానమే అయినప్పటికీ అందులో వారి అపురూప సౌందర్యం, మంగళకరమైన గుణగణాలు, మహిమలు యొక్క సంక్షిప్త వర్ణన కూడా కానవస్తుంది. శ్రీవారు ముల్లోకాలకు రాజాధిరాజు. రాజులను, మహారాజులను సర్వలాంఛనాలతో మేలుకొలుపే సాంప్రదాయం అనాదిగా వస్తోంది. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ శ్రీవారికి, సతీ సమేతంగా, రాజోచిత సత్కారాలతో పాడే మేలుకొలుపే సుప్రభాతగానం. ప్రభాత సమయంలో ప్రకృతి శోభ; స్వామివారి తొలిదర్శనానికై వేచియుండే బ్రహ్మాదిదేవతల, నవగ్రహాల మరియు సప్తఋషుల కోలాహలం; రామచిలుకలు, తేనెటీగల వంటి అల్పప్రాణులు సైతం విభిన్నరీతుల్లో శ్రీవారికి తెలియజేసే అభినందనలు; శ్రీమహావిష్ణువు దశావతారాలు మున్నగు అంశాలు కూడా సుప్రభాతంలో మనోహరంగా వర్ణించబడ్డాయి.



 *శ్రీ వేంకటేశ స్తోత్రం* 


 *'స్తోత్రం'* అంటే స్తుతి లేదా పొగడ్త అని అర్థం. శ్రీ వేంకటేశ స్తోత్రంలో శ్రీవారి దశావతారాల మహిమలు; వారి విశ్వవ్యాపకత్వం, సార్వభౌమత్వం, ఆశ్రితజన పక్షపాతం; శ్రీరామచంద్రుని విలువిద్యా కౌశలం మున్నగునవి విస్తారంగా వర్ణించబడ్డాయి.


┉┅━❀❀┉┅━


 *శ్రీ వేంకటేశ ప్రపత్తి* 


 సాధారణంగా, భక్తి ప్రపత్తి అనే మాటలను ప్రత్యాయపదాలుగా ఉపయోగిస్తుంటాం. కానీ రెండింటికీ ఎంతో వ్యత్యాసముంది. భక్తిని 'మర్కటకిశోరన్యాయం' తో పోల్చవచ్చు. అంటే పిల్ల కోతి ఎల్లవేళలా తల్లి ఉదరాన్ని తన కాలి వ్రేళ్ళతో గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఏ క్షణంలో నైనా పట్టు తప్పితే కోతిపిల్ల ప్రమాదానికి లోనవుతుంది. కోతిపిల్లను భక్తుని తోనూ, తల్లికోతిని భగవంతుని తోనూ పోల్చినప్పుడు, 'మర్కట కిశోర న్యాయం' లో భగవంతునిపై విశేషమైన భక్తిభావ మున్నప్పటికీ, వారిని ఎల్లవేళలా అంటిపెట్టుకుని ఉండే బాధ్యత మాత్రం భక్తునిదే.


 కానీ 'ప్రపత్తి' విషయంలో అలా కాదు. ప్రపత్తిని 'మార్జాల కిశోర న్యాయం' తో పోల్చుతారు. తల్లిపిల్లి తన పిల్లను నోటితో కరుచుకుని ఒక చోటి నుండి మరో చోటికి క్షేమంగా చేర్చుతుంది. పిల్లిపిల్ల తన బాధ్యతను పూర్తిగా తల్లిపై వేసి, నిశ్చింతగా ఉంటుంది. అలాగే, భక్తుడు 'ప్రపత్తి' లేదా 'శరణాగతి' ని ఆశ్రయించినప్పుడు తన భారాన్నంతా దేవునిపై వేసి, ఐహిక చింతలకు దూరంగా ఉంటూ, భగవన్నామ స్మరణలో ప్రశాంతంగా గడప గలడన్న మాట.


 సంక్షిప్తంగా చెప్పాలంటే 'భక్తి' అంటే భగవంతుణ్ణి ఆరాధించడం; 'ప్రపత్తి' అంటే దేవుని శరణు వేడి భారాన్నంతా వానిపై వేసి నిశ్చింతగా ఉండటమన్న మాట. 'భక్తి' కంటే 'ప్రపత్తి' ని ఉత్తమమైనదిగా భావించి, అణ్ణన్ స్వామి దానినే ఆశ్రయించారు.


 శ్రీ వేంకటేశ ప్రపత్తిలో శ్రీనివాసుని పాదపద్మాలే ముల్లోకవాసులందరికి శరణ్యమని; వారి శరణువేడినవారికి మోక్షప్రాప్తి లభిస్తుందని; వారు ఈప్సితాలు ఈడేర్చే కల్పతరువని వర్ణించ బడింది. భక్తులకు శ్రీవారి పాదాలే శరణు కావున, వారి పాదారవిందాలను కూడా ప్రపత్తిలో అణ్ణన్ స్వామి విస్తారంగా వర్ణించారు.


 *శ్రీ వేంకటేశ మంగళాశాసనం* 


 *'మంగళాశాసనం'* అంటే 'ఆశీర్వచనము'. శ్రీవేంకటేశ్వరుడు మానవమాత్రునిగా జన్మించి, అర్చారూపంలో వెలసియుండటం వల్ల వారు కూడా నరదృష్టికి అతీతులు కారు. కావున అతిలోక సౌందర్యంతో వర్థిల్లే వారి దివ్యమంగళ మూర్తికి దృష్టి (దిష్టి) సోకుతుందేమోననే బెంగతో, అణ్ణన్ స్వామి శ్రీవారికి ఆశీర్వచనం పలికారు. వారి శుభచింతనను విని, గగనాన విహరించే తథాస్తు దేవతలు 'తథాస్తు' పలికి, శ్రీవారిని దుష్టశక్తుల నుండి కాపాడతారని అణ్ణన్ స్వాముల ఆకాంక్ష. అందువల్ల ముల్లోకాలను ఏలే, భక్తజనుల పాలిట కొంగుబంగారమైన శ్రీవేంకటేశ్వరుడు, శ్రీమహాలక్ష్మి కలకాలం వర్థిల్లాలనే ఆకాంక్షను 'మంగళాశాసనం' లో అణ్ణన్ స్వామి వెలిబుచ్చుతారు. 'శ్రీ వేంకటేశ మంగళాశాసనం' 'వరవరముని' అనే మరో భక్తుని ద్వారా రచించబడినదని కొన్ని గ్రంథాల్లో పేర్కొనబడింది. కానీ, అత్యధికులు మాత్రం దీనిని కూడా అణ్ణన్ స్వామివారే వ్రాశారని విశ్వసిస్తారు.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*శల్య పర్వము ప్రథమాశ్వాసము*

*409 వ రోజు*

*కురుపాండవ యుద్ధవ్యూహాలు*


పద్దెమిదవనాటి యుద్ధానికి కురుపాండవ సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఆజానుభాహుడైన శల్యుని ముందు నిలుపుకుని కౌరవ సైన్యాలు, పాండవులను ముందు నిలుపుకుని పాండవసైన్యాలు యుద్ధభూమికి చేరాయి " అని సంజయుడు చెప్పగానే ధృతరాష్ట్రుడు " ఇంకెందుకు సంశయం సంజయా ! పాండవులు శల్యుని నా కుమారుని ఎలా సంహరించారో చెప్పు " అని అడిగాడు. సంజయుడు " మహారాజా ! ఇంకా నువ్వు ఇలాంటి మరణవార్తలు వినే స్థితిలో ఉన్నావా ! నేను చెప్పు యుద్ధ విశేషాలు మందుగా విను. మరణవార్తలు ఎలాగూ వినక తప్పదుగా ! " అన్నాడు. " నీ కుమారుడు సుయోధనుడు ఎలాగైనా పద్దెనిమిదవ రోజైనా యుద్ధంలో పాండవులను జయించి రాజ్యాన్ని కైవశం చేసుకోవాలని పేరాశతో ఉన్నాడు. శల్యుడు కురుసైన్యాలను సర్వతోభద్రవ్యూహంలో నిలిపాడు. ముఖద్వారం వద్ద కర్ణుడి పుత్రులతో శల్యుడు నిలిచాడు, కుడి వైపున కృపాచార్యుడు, ఏడమవైపున త్రిగర్త వీరులతో కృతవర్మ నిలిచారు. వెనుకవైపు కాంభోజరాజ సైన్యాలతో కలిసి అశ్వత్థామ నిలిచాడు. మధ్యభాగాన సుయోధనుడు ససైన్యంగా నిలిచాడు. పాండవులు తమ సైన్యాలను త్రిముఖ వ్యూహంగా నిలిపారు. ధృష్టద్యుమ్నుడు, సాత్యకి, శిఖండి మూడు ముఖద్వారాల వద్ద నిలిచారు. భీమార్జునులు ధర్మరాజుకు ముందు రక్షగా నిలిచారు " అని సంజయుడు చెప్పగానే ధృతరాష్ట్రుడు " సంజయా ! ఈ పదిహేడు రోజుల యుద్ధం తరువాత ఎవరెవరికి ఎంత సేనలు మిగిలాయో వివరించు " అని అడిగాడు. మహారాజా ! మనపక్షాన పదకొండు వేల రథములు, పదివేల ఏడు వందల గజములు, రెండు లక్షల హయములు, మూడు కోట్ల సైనికులు మిగిలారు. పాండవ పక్షాన ఆరువేల రథములు, మూడువేల ఏనుగులు, ఒక లక్ష గుర్రములు, ఒక కోటి కాల్బలమూ మిగిలాయి " అన్నాడు.


*యుద్ధారంభం*


మరునాడు యుద్ధం ప్రారంభం అయింది. కురుక్షేత్ర సంగ్రామంలో ఆఖరి రోజు యుద్ధం ఆరంభం అయింది. ఇరు పక్షముల భేరి మృదంగనాదాలు మిన్నంటాయి. సైన్యాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. యుద్ధం భయంకరంగా సాగుతోంది. ఆరోజు అటో ఇటో తేలాలని ఇరుపక్షములు యుద్ధం సాగిస్తున్నారు. రథములు విరిగి పడుతున్నాయి. కాళ్ళు చేతులు విరిగిన సైనికులు కింద పడి దొర్లుతున్నారు. కొంత మంది సైనికులు తలలు తెగి పడిపోయి ఉన్నారు.గజములు, హయములు కుప్పలుగా పడి ఉన్నాయి. రణభూమి అంతా రక్తసిక్తమై ఉంది. వాటి మధ్య రథములు తిరుగుతున్నాయి. వీరులు జంకక బీభత్స వాతావరణంలో కూడా యుద్ధం చేస్తూనే ఉన్నారు.


*నకులుడి శౌర్యం*


కర్ణుడి మనుమడు చిత్రసేనుడు నకులుని ఎదుర్కొని అతడి విల్లు విరిచి, నుదుటన మూడు బాణములు నాటి, పతాకమును విరిచి, సారథిని చంపాడు. నకులుడు కత్తి డాలు తీసుకుని చిత్రసేనుడు వేయు బాణములు తప్పించుకుంటూ చిత్రసేనుడి దగ్గరకు వెళ్ళాడు. ఒక్కసారిగా విజృంభించి రథము మీద లంఘించి చిత్రసేనుడి తలని కత్తితో ఖండించాడు. అది చూసిన చిత్రసేనుడి సోదరులు సత్యసేనుడు, సుషేణుడు నకులునితో కలియబడ్డారు. నకులుడు మరొక రథం ఎక్కాడు. సత్యసేనుడు, సుషేణుడు నకులుడి మీద బల్లెములు విసిరారు. నకులుడు అవలీలగా వారి రథాశ్వములను చంపాడు. సత్యసేనుడు మరొక రథం ఎక్కి నకులుడి విల్లు విరిచాడు. నకులుడు శక్తి ఆయుధమును వేసి సత్యసేనుడి మీద ప్రయోగించి అతడి తల తెంచాడు. అది చూసి సుషేణుడు నకులుడి మీద బాణములు గుప్పించాడు. నకులుడు భీముడి పుత్రుడైన శ్రుతసోముని రథం ఎక్కి మరొక విల్లందుకుని సుషేణుడి మీద శరవర్షం కురిపించి సుషేణుడి తలను ఒక అర్ధచంద్ర బాణంతో తుంచాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

నాజన్మంబున

 

" నాజన్మంబున నింక నే ఫలము నైనన్ గోరనమ్మా ! నిజం 


బే జేయన్ దలపోయు ప్రార్థన మిదే ఈశాని ! నీ సాయ మిం 


తే , జిజ్ఞాసువులైన భృత్యుతతిలో నీ దాస దాసాళిలో 


నా జన్మస్థితి పాత్రుగా దలఁచుచున్నన్ జాలు నిత్యంబుగన్ 


నేనొక గొప్ప భక్తునిగ నీల్గితినేమి ? త్వదీయ దివ్యమా 


యానిబిడాoధకారమున కౌనని భాష్యము చెప్పుచుంటినా ?


నే నిటునీపరీక్షలకునిల్తునె ?

 కాదన - అట్టి శక్తులే 


వేని యొసంగుదేని , అపుడే తగురీతిగ మారుచెప్పెదన్. 

బాబుదేవీదాస్ రావు