ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
9, జూన్ 2025, సోమవారం
సమస్యా పూరణలు ★★★ సమస్య.గొజ్జె దున్నాయె, మేకలు బజ్జెలాయె. 1] తే.గీ. "దున్నగొజ్జె - బజ్జెలు- మేకలన్ని" యనుచు, చెప్పుమని బల్కె గురుడది, - శిష్యునొకని, వాడు- తత్తఱబిత్తజై పలుకనపుడు, గొట్టెదున్నాయె,మేకలు బజ్జెలాయె. 2] అల్పబుద్ధులు– తామెప్పుడధికమనుచు, కోరి, వ్యాప్తికై –డప్పాల గొట్టుకొనుచు, విర్రవీగెడు కాలమ్ము పెరిగెనపుడు, గొట్టెదున్నాయె– మేకలు బజ్జెలాయె. 3] "పాకు"గొజ్జెయు– మితిమీరి వాగుచుండె, "బంగ్ల"మేకలు –గతిదప్పి వచ్చుచుండె, భరతసింహమ! నీవింక వదలబోకు! గొట్టెదున్నాయె మేకలు బజ్జెలాయె. సురభి శంకరశర్మ, అష్టావధాని.
M
★★★
సమస్య.గొజ్జె దున్నాయె, మేకలు బజ్జెలాయె.
1] తే.గీ. "దున్నగొజ్జె - బజ్జెలు- మేకలన్ని" యనుచు, చెప్పుమని బల్కె గురుడది, - శిష్యునొకని, వాడు- తత్తఱబిత్తజై పలుకనపుడు, గొట్టెదున్నాయె,మేకలు బజ్జెలాయె.
2] అల్పబుద్ధులు– తామెప్పుడధికమనుచు, కోరి, వ్యాప్తికై –డప్పాల గొట్టుకొనుచు, విర్రవీగెడు కాలమ్ము పెరిగెనపుడు, గొట్టెదున్నాయె– మేకలు బజ్జెలాయె.
3] "పాకు"గొజ్జెయు– మితిమీరి వాగుచుండె, "బంగ్ల"మేకలు –గతిదప్పి వచ్చుచుండె, భరతసింహమ! నీవింక వదలబోకు! గొట్టెదున్నాయె మేకలు బజ్జెలాయె.
సురభి శంకరశర్మ, అష్టావధాని.
⚜ శ్రీ సుందరనారాయణ ఆలయం
🕉 మన గుడి : నెం 1137
⚜ మహారాష్ట్ర : నాసిక్
⚜ శ్రీ సుందరనారాయణ ఆలయం
💠 గంగా ఘాట్ సమీపంలో ఉన్న పురాతన ఆలయాలలో ఇది ఒకటి. గంగాధర్ యశ్వంత్ చంద్రచూడ్ దీనిని 1756లో నిర్మించారు.
లక్ష్మి మరియు సరస్వతితో పాటు విష్ణువు ప్రధాన దేవత.
💠 ఈ ఆలయాన్ని "సుందర నారాయణ (విష్ణువు)" అని పిలవడానికి ప్రధాన కారణం, ఒకసారి జలంధర్ (దుష్ట రాక్షసుడు) భార్య వృంద ఇచ్చిన శాపం వల్ల విష్ణువు వికారంగా మారాడు.
💠 పురాణాల ప్రకారం, ఈ ప్రాంతం ఒకప్పుడు శివునికి అత్యంత భక్తుడైన జలంధర్ అనే దుష్ట రాక్షసుడిచే వెంటాడబడే ప్రదేశం.
ఆ రాక్షసుడు క్రూరంగా ఉండి దుష్ట పనులు చేసినప్పటికీ, అతనికి ధర్మబద్ధమైన మరియు సద్గుణవంతురాలైన భార్య వృందా దేవి ఉండేది.
అతని భక్తికి శివుడు ఎంతో ఆకర్షితుడై ఆ రాక్షసుడికి అమరత్వం అనే వరం ఇచ్చాడు. ఈ వరం జలంధర్ ఆ ప్రాంతంలో విధ్వంసం సృష్టించేలా చేసింది.
💠 మానవాళిని రక్షించడానికి రాక్షసుడిని చంపడం ఎంత ముఖ్యమో దేవతలు గ్రహించారు.
ఈ గొప్ప పనిలో సహాయం చేయడానికి దేవతలు విష్ణువును సంప్రదించారు. జలందర్ భార్య యొక్క పవిత్రత మరియు భక్తి అతని జీవితానికి కవచంగా పనిచేస్తుందని విష్ణువు అర్థం చేసుకున్నాడు.
💠 విష్ణువు జలందర్ రూపాన్ని స్వీకరించి తన భార్యతో జీవించడం ప్రారంభించాడు.
అతను జలందర్‌ను చంపాడు. జలందర్ భార్య దేవి వృంద ఈ విషయం తెలుసుకున్నప్పుడు, ఆమె విష్ణువును నల్లగా మరియు వికారంగా మారమని శపించింది.
ఆ స్త్రీ శాపం అతన్ని నల్లగా మార్చింది మరియు అతను తన అసలు రూపాన్ని తిరిగి పొందడానికి గోదావరి నదిలో పవిత్ర స్నానం చేయాల్సి వచ్చింది.
తన అసలు రూపాన్ని తిరిగి పొందిన తర్వాత, విష్ణువును సుందరనారాయణ అని పిలుస్తారు.
💠 ఈ ఆలయం ముఖ్యంగా మొఘల్ శిల్పంతో ముడిపడి ఉన్న వంపుతిరిగిన గూడును ప్రదర్శిస్తుంది.
తూర్పు ముఖంగా ఉన్న ఆలయంలో తోరణాలు మరియు గోళాకార గోపురాలతో కూడిన మూడు వరండాలు ఉన్నాయి.
💠 లక్ష్మీ మరియు సరస్వతితో చుట్టుముట్టబడిన ప్రధాన దేవత విష్ణువును గర్భగుడిలో ఉంచారు. గోడలపై హనుమంతుడు, నారాయణ మరియు ఇందిరల చిన్న శిల్పాలు ఉన్నాయి.
💠 ఈ ఆలయం గురించి అత్యంత అద్భుతమైన విషయం ఏమిటంటే ఇది నిర్మించబడిన కోణం.
ప్రతి సంవత్సరం మార్చి 21న ఉదయించే సూర్యుని కిరణాలు మొదట విగ్రహాలపై నేరుగా పడతాయి. ఈ పవిత్ర కార్యక్రమాన్ని చూడటానికి ఈ రోజున వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.
💠 ఇది మరాఠా నిర్మాణ శైలిలో మరియు హేమద్‌పంతి నిర్మాణ శైలిలో సంక్లిష్టమైన పనితనంతో పూజకు అత్యంత పురాతనమైన ఆలయాలలో ఒకటి.
గర్భగుడి ప్రాంతంలో విష్ణువు యొక్క అందమైన విగ్రహం ఉంది, ఇది సాధారణంగా పండుగల యొక్క వివిధ దశలలో పండ్లు మరియు పువ్వులతో అలంకరించబడుతుంది.
ముఖ్యంగా పండుగలు లేదా రామ నవమి మరియు కార్తీక పూర్ణిమ వంటి ఇతర వేడుకల సమయంలో ప్రజలు పూజించడానికి అక్కడికి వెళతారు. మతపరమైన ప్రదేశం కావడంతో, ఆలయ వాతావరణం ప్రశాంతంగా మరియు ఆధ్యాత్మికంగా ఉంటుంది.
💠 దాని నిర్మాణ నిర్మాణాన్ని పరిశీలిస్తే, సుందరనారాయణ ఆలయానికి శతాబ్దాల పురాతన చరిత్ర ఉందని స్పష్టంగా తెలుస్తుంది.
ఈ స్మారక చిహ్నం నిర్మాణం 13వ శతాబ్దంలో యాదవుల పాలనలో జరిగిందని చెబుతారు, తద్వారా సమకాలీన భవన నిర్మాణ శైలులను ప్రతిబింబిస్తుంది. అప్పటి నుండి ఈ ఆలయం కొన్ని నిర్మాణాత్మక మార్పులు మరియు సౌందర్య మెరుగుదలలకు గురైంది, అదే సమయంలో సాంస్కృతిక మరియు మతపరమైన ప్రాముఖ్యతను నిలుపుకుంది.
💠 విష్ణువు ఆలయం కావడంతో, ఈ ఆలయం మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమైన ప్రార్థనా స్థలాలలో ఒకటి మరియు ముఖ్యమైన యాత్రా కేంద్రంగా ఉంది. చారిత్రాత్మకంగా, శతాబ్దాల క్రితం కూడా ఆచరణలో ఉన్న సంప్రదాయాలు మరియు ఆచారాలను తగిన గౌరవంతో నిర్వహించడం ద్వారా ఇది నాసిక్ యొక్క మతపరమైన జీవితానికి అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది.
💠 సమయాలు:
ఉదయం 6 - మధ్యాహ్నం 12 మరియు సాయంత్రం 5 - రాత్రి 9 గంటల వరకు.
💠 నాసిక్ సెంట్రల్ బస్ స్టేషన్ నుండి 2 కి.మీ దూరంలో, సుందరనారాయణ ఆలయం నాసిక్ లోని పంచవటి ప్రాంతంలోని రామ్ కుండ్ సమీపంలోని అహిల్యబాయి హోల్కర్ వంతెన మూలలో ఉంది.
రచన
©️ Santosh Kumar
18-09-గీతా మకరందము
18-09-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారిక -ఇక సాత్త్వికత్యాగమును వివరించుచున్నారు-
కార్యమిత్యేవ యత్కర్మ
నియతం క్రియతేఽర్జున ! |
సఙ్గం త్యక్త్వా ఫలం చైవ
స త్యాగస్సాత్త్వికో మతః ||
తాత్పర్యము:- ఇది చేయదగినదియే యని తలంచి శాస్త్రనియతమగు ఏ కర్మము అభిమానము, ఫలము విడిచిపెట్టబడి చేయబడుచున్నదో అట్టి (కర్మమందలి సంగఫల) త్యాగము సాత్త్వికత్యాగమని నిశ్చయింపబడినది.
వ్యాఖ్య:- త్యాగమనగా సంగత్యాగమేకాని, ఫలత్యాగమేకాని కర్మత్యాగముకాదని ఈశ్లోకముద్వారా స్పష్టముగ వెల్లడియగుచున్నది. మఱియు “కార్యమ్" అని చెప్పినందువలన శాస్త్రనియతమగు కర్మ మనుజుడు తప్పక చేయవలెననియే బోధితమగుచున్నది. తామసుడు శాస్త్రవిధి తెలియక దాని నాచరించకనుండును. రాజసుడు తెలిసియు ఆచరించుట కష్టమని భావించి దానిని చేయకుండును. సాత్త్వికుడు తెలిసియు, కష్టములకు జంకక - సంగమును, ఫలమును త్యజించి దాని నాచరించును. సాత్త్వికునిదే ఉత్తమపద్ధతియనియు, ఆతడు కావించిన త్యాగమే ఉత్తమత్యాగమనియు ఈశ్లోకముద్వారా విదితమగుచున్నది. కావున అద్దానినే విజ్ఞులవలంబించవలెను.
ప్రశ్న:- సాత్త్వికత్యాగముయొక్క లక్షణమేమి?
ఉత్తరము: - శాస్త్ర నియతమగు కర్మను, "ఇది తప్పక చేయవలెను" అని యెంచి ఫలమును, సంగమును (ఆసక్తిని) వదలివైచి చేయుట సాత్త్వికత్యాగమనబడును.
తిరుమల సర్వస్వం -265*
*తిరుమల సర్వస్వం -265*
*శ్రీవారి సంవత్సర సేవలు - 2*
2 *ఈ ఉత్సవాలు శ్రావణశుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి దినాలలో; సంపంగిప్రాకారంలో నున్న శ్రీవేంకటరమణుని కళ్యాణమంటపంలో జరుగుతాయి.*
ముందురోజు సాయం సమయాన విష్వక్సేనుల వారు వసంతోత్సవ మండపం చేరుకుంటారు. అక్కడ మృత్సంగ్రహణం (పుట్టమన్ను సేకరించడం), అంకురార్పణ జరిగిన తరువాత పవిత్రోత్సవాలు ప్రారంభ మవుతాయి.
మొదటి రోజైన దశమి నాడు 'పవిత్రాల ప్రతిష్ఠ', శాంతిహోమాలు, ఉభయదేవేరిసహిత మలయప్పస్వామి వారికి అభిషేకాలు, రాత్రివేళలో పూర్ణాహుతి అర్పించడంతో మొదటిరోజు ఉత్సవాలు ముగుస్తాయి.
రెండవరోజైన ఏకాదశి నాడు పూర్ణాహుతి పూర్తయిన తరువాత; ఆలయం లోపల, బయటా ఉన్న ఉపాలయాలకు, బలిపీఠం మరియు ధ్వజస్తంభానికి పవిత్రాల సమర్పణ జరుగుతుంది. తదనంతరం పూర్ణాహుతితో రెండవరోజు కార్యక్రమం ముగుస్తుంది.
మూడవరోజు విశేషహోమం మరియు పూర్ణాహుతితో మూడురోజుల పవిత్రోత్సవాలు సుసంపన్నమవుతాయి. ఈ ఉత్సవాలతో దోషపరిహారం జరిగి, ఆలయ పవిత్రత ఇనుమడిస్తుందని ప్రతీతి.
ఆణివార ఆస్థాన మహోత్సవం
1843 వ సంవత్సరంలో అప్పటి ఆంగ్లపాలకులు తిరుమల ఆలయ నిర్వహణ బాధ్యతను మహంతుల కప్పగించినట్లు ఇంతకు మునుపే తెలుసుకున్నాం. యాదృచ్ఛికంగా జరిగిందో లేదా శుభ ముహూర్తాన్ననుసరించి జరిగిందో తెలియదు కానీ ఆ యాజమాన్య మార్పిడి సరిగ్గా తమిళమాసమైన 'ఆణిమాసం' ఆఖరి రోజున జరిగింది. అదే రోజు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభ మవుతుంది. 'కర్కాటక సంక్రాంతి' గా కూడా పిలువబడే ఈ పర్వదినం, ప్రతి ఏడాది జూలై 16 లేదా 17 వ తారీఖుల్లో వస్తుంది. సరిగ్గా దీనికి ఆరుమాసాల ముందు జనవరి 15 వ తారీఖున, ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమయ్యే రోజున మనం మకరసంక్రాంతి జరుపుకుంటాము. తిరుమలలో తమిళులు అధికంగా అనుసరించే సౌరమానం ప్రకారం జరుపుకునే ఉత్సవాలలో ఇది కూడా ఒకటి.
ఆలయ వ్యవహారాలు మహంతుల చేతికి వచ్చినప్పటి నుండి ఆలయ వార్షిక లెక్కల్ని అదే రోజు, లాంఛనంగా ప్రారంభించడం ఆనవాయితీగా వచ్చింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకుని, ఆణిమాసం ఆఖరి రోజున, అట్టహాసంగా *'ఆణివార ఆస్థాన మహోత్సవం'* జరుప బడుతుంది. తరువాతి కాలంలో మిగిలిన అన్ని ఆర్థిక, ధార్మిక, వాణిజ్య సంస్థల్లా ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ ఒకటవ తేదీన ప్రారంభిస్తున్నప్పటికీ; అనాదిగా వస్తున్న *'ఆణివార ఆస్థానోత్సవం'* మాత్రం అదే రోజు జరుపబడుతోంది.
ఆరోజు ప్రాతఃకాల కైంకర్యాలను యథావిథిగా నిర్వహిస్తారు. అయితే, ప్రతినిత్యం కొలువు శ్రీనివాసునికి మునపటి రోజు ఆదాయవ్యయాలను అప్పగించే 'కొలువు' లేదా 'దర్బారు' సేవ మాత్రం జరగదు. ఏకంగా వార్షిక లెక్టల్నే స్వామివారికి నివేదిస్తారు కాబట్టి, ఆరోజుకిక దినవారీ లెక్కలు ఉండవన్న మాట. తరువాత తిరుమామణి మంటపంలో సర్వభూపాలవాహనంపై ఉభయదేవేరీ సమేతులైన మలయప్పస్వామిని; వారి ప్రక్కగా సర్వసేనాధిపతి విష్వక్సేనుణ్ణి వేంచేపు చేస్తారు. విశేష నైవేద్యసమర్పణ జరిగిన తరువాత జియ్యంగార్లు విమాన ప్రదక్షిణమార్గం లోని పరిమళపు ఆర నుండి ఆరు పట్టువస్త్రాలను పెద్ద వెండితట్టలో నుంచి తీసుకు వస్తారు. ఆ ఆరింటిలో మూలవిరాట్టుకు ధోవతి అంగవస్త్రాలుగా చెరి ఒకటి; ఆకాశరాజు కిరీటం, నందక ఖడ్గం, మలయప్పస్వామికి, విష్వక్సేనుల వారికి ఒక్కొక్కటి చొప్పున అలంకరిస్తారు. అప్పుడు గత సంవత్సరం ఆదాయవ్యయాల వివరాలను, నగదు నిల్వలను, సంబంధిత ఆలయాధికారులు స్వామివారికి విన్నవిస్తారు. ఆణివార ఆస్థానమహోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించడం ద్వారా సకలసంపదలు స్వామివారి సొంతమని; మిగిలిన వారందరు వారికి పరిచారకులేనని; వారి ప్రతినిధులుగా మాత్రమే వారి సంపదను, ఆదాయాన్ని పరిరక్షిస్తున్నారన్న సందేశం పంపబడుతుంది. తద్వారా ఆలయానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల నిర్వహణలో జవాబుదారీతనం మరింత పెరుగుతుంది.
తరువాతి ఘట్టంలో జియ్యంగారి అధికారిక మొహరును, 'లచ్చన' అని పిలువబడే తాళం చెవులగుత్తిని స్వామివారి పాదాలకు తాకించి జియ్యరువారికి అందజేస్తారు. ఆ తరువాత గమేకార్లు (ప్రసాదం గంగాళాలను రవాణా చేసే కార్మికులు), మహంతుమఠం వారు, తాళ్ళపాక మరియు తరిగొండ వంశీయులు హరతు లర్పిస్తారు. తదనంతరం ఉత్సవానికి విచ్చేసిన భక్తులు, సిబ్బంది నుండి ఒక్కొక్క రూపాయి చొప్పున కానుకలు స్వీకరించి శ్రీవారి ఖజానాకు జమ చేస్తారు. దీనిని 'రూపాయి హారతిగా' వ్యవహరిస్తారు.
ఆణివార ఆస్థానోత్సవ సందర్భంగా ఆరోజు సాయంకాలం మలయప్పస్వామిని, ఉభయ దేవేరులను పుష్పపల్లకిలో అధిరోహింప జేసి, మాడవీధుల్లో అత్యంత వైభవోపేతంగా ఊరేగిస్తారు.
ఈ ఆర్జితసేవను కాంచిన భక్తులకు పూర్వజన్మ వాసనలు నశించి, సుఖశాంతులు ఏర్పడుతాయని భక్తుల విశ్వాసం.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
మహాభారతము
*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*కర్ణ పర్వం – తృతీయాశ్వాసం*
*402 వ రోజు*
*కర్ణార్జునుల యుద్ధం*
కర్ణుడు అర్జునుడు ఢీకొన్నారు. యుద్ధం తీవ్రం అయింది. అర్జునుడితో కృష్ణుడు " అర్జునా ! అడుగో కర్ణుడు నీ ప్రతాపం చూపించు. కర్ణుడి శరీరం నిండా శరములు నాటు. కర్ణుడు నీకు ఎందులో సరి రాడు. అర్జునా ! విజృంభించి కర్ణుడిని వధించు " అన్నాడు. కర్ణుడిని కూడా కౌరవ వీరులు ఉత్సాహ పరుస్తున్నారు. " కర్ణా ! ఇన్నాళ్ళు అడవులలో మృగముల మాదిరి తిరిగిన పాండవులు ఇప్పుడు యుద్ధానికి వచ్చారు. నువ్వు అర్జునుడిని చంపితే మిగిలిన పాండవులు తిరిగి అడవులకు పోతారు. సుయోధనుడు కురుసామ్రాజ్యాధిపతి ఔతాడు. నీ శక్తిని అంతా ఉపయోగించి అర్జునుడిని చంపు " అన్నాడు. కర్ణుడు అర్జునుడి శరీరంలో పది బాణములు నాటాడు. అర్జునుడు కర్ణుడి శరీరంలో పందొమ్మది బాణములు నాటాడు. కర్ణుడు అర్జునుడి మీద తొమ్మది పదునైన బాణములు ప్రయోగించాడు. అతడు కృష్ణుడిని కూడా వద లేదు. అది చూసిన అర్జునుడు తన బాణములతో కర్ణుడిని రక్తం కారేలా కొట్టాడు. కర్ణుడు కోపించి కృష్ణార్జునులను పదునైన బాణములతో గాయపరిచాడు. అర్జునుడు కర్ణుడి సారధిని, అశ్వములను కొట్టి కర్ణుడి మీద ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. కర్ణుడు వారుణాస్త్ర ప్రయోగంతో దానిని నిర్వీర్యం చేసాడు. అర్జునుడు కర్ణుని మీద మేఘాస్త్ర ప్రయోగం చేసి కౌరవ సేనలను మేఘాలతో కప్పి అంధకారం సృష్టించాడు. కర్ణుడు అనిలాస్త్ర ప్రయోగంతో దానిని నిర్వీర్యం చేసాడు. ఇంతలో అర్జునుడు ఇంద్రశక్తిని ప్రయోగించాడు. కర్ణుడు మంత్రశక్తితో ఇంద్రశక్తిని నిర్వీర్యం చేసి అర్జునుడి మీద పదునైన బాణములు వేసాడు. అది చూసిన భీముడు " తమ్ముడా అర్జునా ! ఈ కర్ణుడు ఈ రోజు మనతో అటో ఇటో తేల్చుకోవాలని వచ్చాడు. నీ ప్రతిజ్ఞా భంగం కాకుండా నీవు చంపుతావా ! లేక నాగదా ఘాతంతో అతడి తల ముక్కలు చెక్కలు చేయనా ! " అన్నాడు. అది చూసి కృష్ణుడు " అర్జునా ! నీవు ప్రయోగించిన దివ్యాస్త్రాలను కర్ణుడు తిప్పి కొడుతున్నాడు. పైగా నిన్ను తీవ్రంగా తన బాణములతో గాయపరుస్తున్నాడు. నీ పరిస్థితి కౌరవసేనలో ఉత్సాహాన్ని పాండవసేనలో నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. కారణం తెలియక ఉంది. నా చక్రాన్ని ఇస్తాను దానిని ప్రయోగించి కర్ణుడి తల తుంచు " అన్నాడు. అర్జునుడు " కృష్ణా ! అంత పని వద్దులే నేను కర్ణుడి మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాను " అని బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. అది కర్ణుడి మీదకు వేగంగా రాసాగింది. కర్ణుడు బెదరక నిశ్చలంగా నిలబడి తన మంత్రశక్తితో దానిని నిర్వీర్యం చేసి కృష్ణార్జునులను తన బాణములతో గాయపరిచాడు. అర్జునుడు కర్ణశల్యులను మీద తొమ్మిదేసి బాణములను ప్రయోగించాడు. కర్ణుడు అర్జునుడి వింటి నారిని తెంచాడు. అర్జునుడు నారిని సరి చేసుకుని కర్ణుడి వింటి నారిని తెంచాడు. అర్జునుడి ధాటికి తాళ లేని కర్ణుడి చక్రరక్షకులు పారి పోయారు. అది చూసి సుయోధనుడు అర్జునుడిని చంపమని తన సైన్యమును ప్రోత్సహించాడు. సుయోధన బలగాలు అర్జునుడిని చుట్టుముట్టాయి. అర్జునుడు వాడి అయిన బాణములు ప్రయోగించి వారిని చెదరగొట్టాడు. ఇరు పక్షముల వీరులు యుద్ధం వదిలి కర్ణార్జునుల యుద్ధం వీక్షించసాగారు. సుయోధనుడు " యోధులారా ! కర్ణుడు అత్యంత పరాక్రమంతో పోరుతుండగా మీరు చూస్తూ ఉండటం భావ్యమా ! పోయి కర్ణుడికి సాయపడండి " అన్నాడు. ఆమాటలకు రోషపడి కౌరవ వీరులు అర్జునుడిని ఎదుర్కొన్నారు. అర్జునుడు పదునైన బాణములు వేసి వారి కేతములు, రధములు, ధనస్సులను విరిచి అశ్వములను పంపాడు. ముందుకు పోతే అర్జునుడు చంపు తున్నాడు. వెనక్కు పోతే సుయోధనుడు హెచ్చరిస్తున్నాడు. కౌరవ వీరులు అయోమయ అవస్థకు లోనయ్యారు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
మూఢం అంటే ఏంటి?*
*మూఢం అంటే ఏంటి?*
మూఢం అంటే శుభకార్యాలు చేయడానికి వీలులేని రోజులు. ఏ పని చేయకుండా పనికిరాని కాలంగా, విడిచిపెట్టే కాలంగా దీనిని భావిస్తారు. హిందువులు గ్రహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గ్రహస్థితి సరిగ్గా లేకపోతే శుభకార్యాలు చేయరు. మూఢం సమయంలో శుభకార్యాలు చేయకూడదు. కొన్ని తప్పులు కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు.
ఎందుకు మూఢం వస్తుంది, ఈ సమయంలో ఎందుకు శుభకార్యాలు చేయకూడదు?
మూఢం అనేది రెండు రకాలు.
1) గురు మూఢం,
2) శుక్ర మూఢం అని అంటారు. ఇక ఇప్పుడు వచ్చేది జూన్ 10వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు గురు మూఢం.ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఈ మూఢం రోజుల్లో శుభకార్యాలు చేస్తే ఇంట్లో చెడు సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మూఢం సమయంలో శుభకార్యాలు చేస్తే ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు.ఈ సమయంలో శుభకార్యాలు చేయరు. శుభకార్యాలు ఎప్పుడూ కూడా గురు బలం, శుక్ర బలం ఉంటేనే జరుపుతారు. ఈ మూఢం సమయంలో గురు గ్రహానికి శుక్ర గ్రహానికి తక్కువ శక్తి ఉంటుంది. ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటే ఏ పని చేసినా కలిసి రాదు. అందుకే దీనిని మూఢం అని అంటారు.
*మూఢం సమయంలో ఏం చేయకూడదు?*
మూఢం సమయంలో 1)పెళ్లిచూపులు నిర్వహించడం వంటివి చేయకూడదు.
2)పెళ్లిళ్లు కూడా ఈ సమయంలో జరపకూడదు. ఒకవేళ పెళ్లిళ్లు జరిపిస్తే కొత్త దంపతుల మధ్య సఖ్యత ఉండదు. గొడవలు పడుతూ ఉంటారు. విడిపోయే అవకాశాలు ఉన్నాయి.
శుభకార్యాలని ఈ మూఢం సమయంలో ప్రారంభించకూడదు. అలా చేస్తే చెడు జరిగే ప్రమాదం ఉంది.
3)లగ్న పత్రికలు రాసుకోకూడదు. పెళ్లి పత్రికల జోలికే వెళ్ళకూడదు.
4)మూఢం సమయంలో పెళ్లి మాటలు మాట్లాడటం కూడా తప్పు.
5)పసి పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు.
6) కొత్త వ్యాపారాలని మొదలుపెట్టకూడదు. పుట్టు వెంట్రుకలు ఈ సమయంలో తీస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
7)చెవులు కుట్టించకూడదు.
8)కొత్త వాహనాలు కొనుగోలు చేయరాదు
9)శంకుస్థాపన చేయడం వంటివి కూడా చేయకూడదు.
10)ఈ సమయంలో కొత్త ఇంట్లోకి మారడం, సొంత ఇంటికి వెళ్లిపోవడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే కుటుంబ సమస్యలు వస్తాయి. 11)దేవుడికి మొక్కలు చెల్లించుకోవడం కూడా ఈ మూఢం సమయంలో చేయకూడదు.
12)వ్రతాలు చేయడం, విగ్రహ ప్రతిష్టాపనలు లాంటివి కూడా చేయకూడదు.
13)ఈ మూఢం సమయంలో వైభవంగా పుట్టిన రోజులు చేయకూడదు.
14)చెరువులు తవ్వడం, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం, ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది.
*మూఢం సమయంలో ఏం చేయవచ్చు?*
1)చిన్న పిల్లలకు అన్నప్రాసన చెయ్యచ్చు.
2)దూర ప్రయాణాలు చెయ్యచ్చు.
3)ఇంటికి ఏమైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే కూడా చేయించుకోవచ్చు.
4)భూముల అమ్మడం, భూములు కొనడం వంటివి చేయొచ్చు.
5)అగ్రిమెంట్లు రాసుకోవడంలో తప్పులేదు.
6)రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం లాంటివి కూడా చేయొచ్చు.
7)విదేశాలకు వెళ్లడం, కొత్త ఉద్యోగంలో చేరడం వంటివి చేయొచ్చు.
8)కొత్త బట్టల్ని కొనుగోలు చేయొచ్చు.
9)ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లొచ్చు. 10)దేవాలయాల్లో అన్నదానాలు చేయడం, సీమంతం వేడుకలు చేసుకోవడం, దైవ కార్యాలను నిర్వహించడం చేయొచ్చు.
11)నవగ్రహ శాంతులు, హోమాలు చేయించుకోవచ్చు.
12)మూఢం సమయంలో బాలింతలు, గర్భిణీలు ప్రయాణం చేయడం మంచిది కాదు. ఒకవేళ చేయాల్సి వస్తే అశ్విని లేదా రేవతి నక్షత్రాల్లో ప్రయాణం చేయొచ్చు.
🙏🙏🙏🙏🙏
⚜ శ్రీ చక్రతీర్థ - చక్ర నరసింహ ఆలయం
🕉 మన గుడి
⚜ ఒడిస్సా : పూరీ
⚜ శ్రీ చక్రతీర్థ - చక్ర నరసింహ ఆలయం
💠 జగన్నాథ ఆలయానికి సమీపంలో ఉన్న చక్రతీర్థ ఆలయం ఒడిశాలో తప్పక సందర్శించాల్సిన ఆలయాలలో ఒకటి.
💠 ఒడిశా భారతదేశంలో సాంస్కృతికంగా గొప్ప రాష్ట్రం అనే వాస్తవాన్ని సమర్థిస్తూ, ఈ ఆలయం ఒక ప్రధాన ఉదాహరణ.
💠 ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు మరియు యాత్రికుల దృష్టిని ఆకర్షించింది, వారు ఒడిశా పర్యటనను ప్లాన్ చేసుకునేటప్పుడు ఇక్కడకు తప్పనిసరిగా వెళ్లాలి.
💠 చక్రతీర్థ ఆలయం పూరికి ఉత్తరాన ఉంది మరియు ఇది నృసింహ దేవునికి అంకితం చేయబడిన ఆలయం. స్థానికంగా ఈ ఆలయాన్ని చక్ర నారాయణ ఆలయం, చక్ర నృసింహ ఆలయం లేదా చక్ర నరసింహ ఆలయం వంటి అనేక పేర్లతో పిలుస్తారు.
💠 ఇది పూరి పట్టణం యొక్క ఉత్తర చివరలో మరియు జగన్నాథ ఆలయం నుండి 3 కి.మీ దూరంలో ఉంది. స్థానికులు ఈ ఆలయాన్ని చక్ర నరసింహ ఆలయం, చక్ర నృసింహ ఆలయం మరియు చక్ర నారాయణ ఆలయం వంటి వివిధ పేర్లతో పిలుస్తారు.
ఈ ఆలయంలో, జగన్నాథుని దైవిక ఆయుధమైన పెద్ద చక్రం, నల్ల గ్రానైట్‌తో తయారు చేయబడిన గర్భగుడిలో నీటిలో పూజించబడుతోంది, మధ్యలో చక్రనారాయణ అని పిలువబడే నారాయణ విగ్రహం ఉంది.
మహాలక్ష్మి నివాసం ఇక్కడ ఉన్నందున చక్రతీర్థానికి మరో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది.
💠 ఆలయం యొక్క ప్రధాన దేవతలు అభయ నృసింహ, చక్ర నృసింహ మరియు లక్ష్మీ నృసింహ అని పిలువబడే నృసింహుని మూడు చిత్రాలు.
చక్ర తీర్థంలో పూజించబడే నృసింహుని ఈ 3 విభిన్న రూపాలు.
అభయ నృసింహ రూపం :
శ్రీ బలభద్రుడిని సూచిస్తుంది.
చక్ర నృసింహ రూపం:
సుభద్రా దేవిని సూచిస్తుంది మరియు
లక్ష్మీ నృసింహ రూపం :
జగన్నాథుడిని సూచిస్తుంది.
💠 పురాణాలలో, విశ్వంలోని మొదటి 3 దేవుళ్ళు, బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు వరుసగా చక్ర నృసింహ, లక్ష్మీ నృసింహ మరియు అభయ నృసింహ రూపాల్లో కూడా వ్యక్తీకరణను కనుగొన్నారు.
💠 ఒకప్పుడు పూరీలో తుఫాను సంభవించినప్పుడు నీలచక్రం (జగన్నాథ ఆలయం పైభాగంలో ఉన్న చక్రం) దాని స్థానం నుండి స్థానభ్రంశం చెంది, ఆకాశం మీదుగా ఎగిరి చివరకు చక్రతీర్థంలో పడిందని స్థానిక ప్రజలు నమ్ముతారు.
💠 'దారు' (నవకళేవర సమయంలో జగన్నాథ ఆలయం యొక్క దేవతల సృష్టి కోసం దైవిక చెక్క దుంగ) సముద్రం గుండా మొదటిసారిగా చక్రతీర్థంలో నేలను తాకిందని కూడా నమ్ముతారు.
💠 చక్రతీర్థ ఆలయానికి జగన్నాథ ఆలయంతో దగ్గరి సంబంధం ఉంది మరియు ప్రతి సంవత్సరం జగన్నాథుడి నుండి అగ్న్యమాల నృసింహుని వద్దకు వస్తుంది.
💠 ఈ ఆలయంలో నృసింహ జన్మ (నృసింహ స్వామి జననం) ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.
💠 ఈ ఆలయంలో చక్రనారాయణ్ అని పిలువబడే జగన్నాథుని విగ్రహం మరియు నల్ల గ్రానైట్ తో చెక్కబడిన చక్రం ఉన్నాయి. ఈ చక్రం ఎల్లప్పుడూ నీటిలోనే ఉంటుంది.
💠 స్థానికుల కథనం ప్రకారం, పూరీలో ఒకసారి తుఫాను సంభవించినప్పుడు, తుఫాను సమయంలో జగన్నాథ ఆలయం పైభాగంలో ఉన్న చక్రం ఆకాశంలో ఎగిరి చక్రతీర్థ ఆలయంలో పడిపోయింది.
💠 మరొక పురాణం ప్రకారం, దరు (జగన్నాథ ఆలయంలో దేవతలు చెక్కబడిన దుంగ) మొదటిసారి ఇక్కడే భూమిని తాకింది.
💠 సందర్శించడానికి ఉత్తమ సమయం
చక్రతీర్థ ఆలయాన్ని సందర్శించడానికి జూలై-మార్చి నెలల మధ్య సమయం ఉత్తమం.
💠 చక్రతీర్థ ఆలయానికి జగన్నాథ ఆలయంతో దగ్గరి సంబంధం ఉంది మరియు ప్రతి సంవత్సరం జగన్నాథుడి నుండి అగ్నీమాల నృసింహుడికి వస్తుంది.
ఈ ఆలయంలో నృసింహ జన్మ (నృసింహ జన్మ) పండుగను ఎంతో భక్తితో జరుపుకుంటారు.
కుల విద్య,
ఉత్తమా కుల విద్యా చ
మధ్యమౌ కృషి వాణిజౌ।
అథమా సేవకా వృత్తి-
ర్మృత్యు శ్చౌర్యోపజీవనమ్।।
కుల విద్యా-తర తరాలుగా వచ్చే కుల విద్య,
ఉత్తమా-మిక్కిలి గొప్పది.
చ-మరియును,
కృషి-వ్యవసాయమును
వాణిజౌ-వ్యాపారమును,
మధ్యమా-మధ్యమమైనవి.
సేవకా వృత్తిః-సేవా ధర్మము,
అధమా-నీచ మైనది.
చౌర్య-దొంగతనము చేస్తూ,
ఉపజీవనం-బ్రతకడం,
మృత్యుః-చావే గదా।।
ఈలోకంలో విద్య లన్నింటిలో కుల విద్య మహోన్నత మైనది.వ్యవసాయమూ , వాణిజ్యమూ మధ్యమమైనవి.సేవా ధర్మము నీచమైనది.ఇంక దొంగతనము మరణముతో సమానము సుమా।।
9-6-25/సోమవారం/రెంటాల
సుభాషితం
*"నేటి సుభాషితం"*
(శ్రీ వాల్మీకి రామాయణం నుంచి, రోజుకొకటి)
సులభాః పురుషా రాజన్సతతం ప్రియవాదినః.
అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః
(వా.రా 3.37.2)
*అర్థం:*
రాజా, ఆహ్లాదకరమైన మాటలు మాట్లాడే వ్యక్తులను కనుగొనడం ఎల్లప్పుడూ సులభం, కానీ (చెవులకు) అసహ్యకరమైన కానీ (జీవితంలో) ప్రయోజనకరమైన పదాలను ఉపయోగించే వక్త మరియు శ్రోతను పొందడం కష్టం.
_(ఈ మాటలు రాక్షసుడైన మారీచుడు రావణునితో చెప్పాడు. రాక్షసుడైనా ఏ కాలానికైనా సరిపడే సత్యం వచించాడో చూడండి.)_
శ్రీ శంకరాచార్య కృత 'వేదసార శివ స్తోత్రం' తో శుభోదయం
*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష*
ధర్మో రక్షతి రక్షితః
సుభాషితమ్
💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో|| *దేవద్విజగురుప్రాజ్ఞ పూజనం శౌచమార్జనమ్ |*
*బ్రహ్మచర్యమహింసా చశారీరకం తప ఉచ్యతే ||*
తా|| *దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించుట, శరీరశుద్ధి కలిగియుండుట మరియు ఋజుత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శరీరముచే చేయదగిన తపస్సులని చెప్పబడుచున్నవి.*
✍️VKS ©️ MSV🙏
భావధారిద్రం
*✍️మన మనుషుల్లో ఎంత భావధారిద్రం ఉందంటే....*
*👉చదువుకున్నోడు,* *బలిసినోడు ఇతర దేశాలకి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ డబ్బు సంపాదిస్తే చాలా గొప్పగా చెపుతాం....*
*విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడని....*
*👉చదువుకోనోడు.. పేదోడు*
*దుబాయ్, సౌదీ.. చివరికి మనదేశంలోనే బొంబాయ్ లాంటిచోట్లకెళ్ళి తోచిన పనిచేసుకుంటూ డబ్బు సంపాదిస్తుంటేమాత్రం మాత్రం "బ్రతకనీకి పోయిండు", "వలస పోయిండు" అంటం....!*
*👆👉డబ్బు సంపాదన అనే ఒకే రకమైన విషయానికి సమాజం ఉన్నోనికి, పేదోనికి..*
*చదువుకున్నోనికి చదువుకోనోనికి ఎంత భావదారిద్రాన్ని చూయిస్తుందో ఈ ధరిద్రపు వ్యవస్థలో....!*
*🚩హన్మకొండ శ్రీకాంత్ శర్మ🚩*
పండితులతో వేళాకోళం చేయరాదు
పండితులతో వేళాకోళం చేయరాదు
చదరంగం ప్రియుడయిన ఒక రాజు వద్దకు ఒక వేద పండితుడు వచ్చాడు.ఆ పండితుడు అతన్ని ఒక ఘనపనస చదివి ఆశీర్వదించాడు.
అప్పుడు ఆ రాజుగారు "ఏమయ్యా! పండితా! ఈ వేదపనసలు ఎవరైనా నేర్చుకుని చదవవచ్చు!
చదరంగం ఆడడానికి సహజమైన తెలివి కావాలి. నాతో కేవలం ఒక 20 ఎత్తులు పూర్తయ్యే వరకు ఆడి నిలువు! అప్పుడు నువ్వడిగిన కోరికను నెరవేర్చుతాను." అన్నాడు.
అప్పుడు ఆ పండితుడు "రాజా! నాకు చదరంగం వస్తుందని కాదు గానీ, మిమ్ములను సంతోషపరచడానికి ఆడతాను" అంటూ రాజుతో చదరంగం ఆడి 20 ఎత్తులు పూర్తయ్యే వరకు నిలిచాడు.
రాజు గారూ ఆటను చివరి వరకూ కొనసాగిద్దాం! అన్నాడు.కానీ ఆ పండితుడు "రాజా! ఆటను ఇక్కడితో ఆపడం నాకు క్షేమమూ - గౌరవం కూడా!
రాజు గారితో 20 ఎత్తుల వరకు ఆడగలిగాను అని గొప్పగా చెప్పుకోవచ్చు! " అంటూ సున్నితంగా తిరస్కరించాడు.
"సరే! పండితా! నీ తెలివిని గుర్తించాను. మాట ఇచ్చినట్లుగా నీ కోరిక నేరవేర్చుతాను.చెప్పు! " అన్నాడు రాజుగారు.
మహారాజా! చదరంగంలో 64 గడులు ఉంటాయి కదా!
ఒక గడిలో ఒక గింజ -
రెండవ గడికి అంతకు రెట్టింపు రెండు గింజలు -
మూడవ గడికి మళ్లి రెట్టింపు 4 గింజలు -
నాలుగవ గడికి మళ్లి రెట్టింపు 8 గింజలు -
.... ఇలా 64 గడులకు లెక్క వేసి ఆ ధాన్యాన్ని పంపండి చాలు! అదే మహాప్రసాదం." అంటూ ఆ పండితుడు వెళ్లిపోయాడు.
రాజు సరే ! అని ఆ పని మంత్రికి పురమాయించాడు.
ఆ పండితుని వెంట మంత్రి గారు కూడా వెళ్లి తన ఆస్థాన గణికులతో ఎంత ధాన్యం అవుతుందో విచారించాడు.
తిరిగి వచ్చిన మంత్రితో రాజుగారు "పండితుడడిగాడు కదా .. మొదటి గడిలో ఒక ధాన్యపు గింజ.. రెండవ గడిలో దానికి రెట్టింపు రెండు.. మూడవగడిలో దానికి రెట్టింపు నాలుగు.. తర్వాత8 గింజలు, ఐదవ గడిలో 16 గింజలు..
‘అయితే ఏముంది.. చదరంగంలో ఉన్నదంతా 64 గళ్లేగా.. ఇచ్చుకోవలసిందేమో గడికీ గడికీ రెట్టింపు.. వెఱ్ఱి పండితుడు.. గింజలకు గింజలు రెట్టింపు చేసుకు పోయినా ఎన్నివస్తాయి..? ఏదేనా మంచి అగ్రహారం కోరుకుని ఉండాల్సింది..’
‘అలా తీసెయ్యకండి మహారాజా !.. ఆ పండితుడేమీ వెర్రిబాగులవాడు కాదు.. ’
‘ఎందుచేత..?’ అన్నాడు రాజుగారు.
‘లెక్క కట్టి చూసుకుంటే.. ఆ పండితుడడిగిన ధాన్యపు గింజలు ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు కనుక..!’
‘ఎందుకు..? ఆశ్చర్యపోతూ అడిగాడు మహారాజు
ఎన్ని ధాన్యపు గింజలో మన గణికులు గంటలకొద్ది లెక్కించి చెప్పిన సంఖ్యను ఆ పండితుడు వేదగణితం ద్వారా క్షణంలో చెప్పేసాడు మహారాజా ! అంతే కాదు దాన్ని సులువుగా గుర్తుంచుకునే విధంగా ఆశువుగా ఒక చంపకమాల పద్యం కూడా చెప్పాడు.
‘అలాగా.. ఏమిటా పద్యం..?’
‘ఇదుగో.. వినండి మహారాజా !’
శర శశి షట్క చంద్ర శర
సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ
ధర గగనాబ్ధి వేద గిరి
తర్క పయోనిధి పద్మజాస్య కుం
జర తుహినాంశు సంఖ్యకు ని
జంబగు తచ్చతురంగ గేహ వి
స్తర మగు రెట్టికగు
సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్
పద్యం విన్న మహారాజు ‘దీన్లో తేలిన లెక్కెక్కడుంది..? అంతా బాణాలూ, చంద్రులూ, ఆకాశం, అంబుధి,కొండలు తప్ప..’
‘అదే మహారాజా ! మనదేశ పండితుల మేధ.. సంక్షిప్తంగా అల్పాక్షరములతో అనల్పార్థసాధకంగా ప్రజ్వరిల్లిన మేధాశక్తి అది..’
‘సరే… సరే.. విప్పి చెప్పు..’
‘ఈ పద్యంలో లెక్కచిక్కు విడిపోవాలంటే మనపూర్వుల సంఖ్యాగణన పద్ధతి తెలియాలి.. వారు ఒక్కొక్క అంకెకు విశ్వంలో విరాజిల్లే ప్రకృతిశక్తులను సంకేతాలుగా ఏర్పాటు చేసుకున్నారు..
ఈ పద్యంలో
శర, సాయక, - అనే పదాలకు అర్థం బాణాలు అని .( మన్మథుని పంచసాయకములు) ఇక్కడ ఆ రెండు పదాలు 5 సంఖ్యను సూచిస్తాయి.
గగన, వియత్ - 0
(ఆకాశం గగనం శూన్యం)
శశి, చంద్ర, తుహినాంశు -1
(చంద్రుడొకడే భూమికి )
షట్కము - 6
రంధ్ర - 9
(నవరంధ్రాలు)
నగ, గిరి, భూధర - 7
అగ్ని - 3
(మూడగ్నులు; గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని,ఆహవనీయాగ్ని)
అబ్ధి, పయోనిధి - 4
వేద -4
(చతుర్వేదములు)
తర్క - 6
( షట్ తర్కప్రమాణాలు, ‘ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన,శబ్ద, అర్థాపత్తి, అనుపలబ్ధి’)
పద్మజాస్య - 4
(పద్మజుడు బ్రహ్మ, చతుర్ముఖుడు)
కుంజర - 8
(అష్ట దిగ్గజములు)
ఇవీ ఇందులోని అంకెలసంకేతాలు.. ఇప్పుడు ఇవి ఆయా పదాల దగ్గర పెట్టుకుని చూస్తే..’
శర శశి షట్క చంద్ర శర
5 1 6 1 5
సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ
5 9 0 7 3
ధర గగనాబ్ధి వేద గిరి
7 0 4 4 7
తర్క పయోనిధి పద్మజాస్య కుం
6 4 4
జర తుహినాంశు సంఖ్యకు ని
8 1
జంబగు తచ్చతురంగ గేహ వి
స్తర మగు రెట్టికగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్
అంకెలు లెక్కించెటప్పుడు మనపూర్వీకుల సాంప్రదాయ సూత్రం .. ‘అంకానాం వామతో గతిః’ -
కుడినుంచి ఎడమకు చేర్చి చదువుకోవాలి..
అలా చేస్తే చివరగా తేలిన సంఖ్య.
1,84,46,74,40,73,70,95,51,615
ఒకకోటి 84లక్షల 46వేల 74కోట్ల 40 లక్షల73 వేల 70కోట్ల 95 లక్షల 51వేల 615
ఇంత పెద్ద సంఖ్యను పిలవడమే కష్టం.ఇక ఇంతోటి ధాన్యాన్ని నిలవచేయాలి అంటే,
ఒక ఘనమీటరు విస్తృతిగల గాదెలో దాదాపు ఒకటిన్నర కోటి గింజలు దాచవచ్చు అని అంచనా వేసుకుంటే,
4మీటర్ల ఎత్తు 10 మీటర్ల నిడివిగల గాదెలు దాదాపుగా 12,000 ఘనకిలోమీటర్లు విస్తీర్ణం కావాలి..
పేర్చుకుంటూ వెళితే 300,000,000-ముప్పై కోట్ల కిలోమీటర్లు.. అంటే భూమికి సూర్యునికి ఉన్నదూరానికి రెట్టింపు.
పోనీ లెక్కపెట్టడానికి ఎంత సమయం పడుతుందో అంటే
సెకనుకు ఒక్కగింజగా లెక్కించితే అన్నీ లెక్కించటానికయ్యేవి 58,495 కోట్ల సంవత్సరాలు..
అదీ సంగతి…
వేదపండితులతో వేళాకోళం తగదు మహారాజా !…నిజానికి అతడు చదివిన గణపనస కూడా లెక్కలకు ,ధారణ శక్తికి సంబంధించినదే ! ఎంతో ధారణ శక్తి - పాండిత్యం - సాధన ఉంటేకానీ
ఘణాపాటి కాలేరు. అతడు ప్రేమగా ఆశీర్వదించడానికి వస్తే అతని వేదవిద్యను కించపరిచారు. ఇప్పుడు ఏం చేయడం ? మాట తప్పిన దోషం సంక్రమిస్తుంది .
అది విన్న మహారాజు సిగ్గుపడ్డాడు. అతని పూర్వీకులనుండి ఎవ్వరు కూడా ఇప్పటివరకు మాట తప్పలేదు.
ఏం చేసి ఈ దోషం నుండి తప్పించుకోవలో ఆ పండితున్నే అడుగుదాము. అని ఆ పండితున్ని పిలిపించి క్షమించుమంటూ వాగ్దాన భంగ దోషం అంటకుండా ఏం చేయాలో చెప్పుమన్నాడు .
ఆ పండితుడు" రాజా ! ఈ లోకంలో ఆవుకు విలువ కట్టలేము. ధాన్యం బదులుగా అవును ఇవ్వండి చాలు !" అని ఆ రాజును వాగ్దాన భంగ దోషం నుండి తప్పించాడు.
సేకరణ
రామాయణం
🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹
*🕉️సోమవారం 9 జూన్ 2025🕉️*
``
*రామాయణం*
ఒకసారి చదివినంత
మాత్రాన మన సమస్త
పాపాలని తీసేస్తుంది…
``
*వాల్మీకి రామాయణం*
*63వ భాగం*
```
ఇంక అక్కడున్న వానరాలకి ఇది చూడగానే చాలా సంతోషంవేసింది. సముద్రాన్ని దాటుదామని వాళ్ళందరూ కలిసి సముద్రం యొక్క ఉత్తర తీరానికి చేరుకున్నారు.
అప్పుడు వాళ్ళు అనుకున్నారు “ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళగలిగినవాడు ఎవడు. మిగిలిన వానర జాతికి ఎవడు ప్రాణప్రదానం చెయ్యగలిగినవాడు. ఈ సముద్రం దగ్గర నిలబడిపోయిన వానరాలు సంతోషంగా తిరిగి వెళ్ళి తమ భార్యాపిల్లలని చూసేటట్టు చెయ్యగలిగినవాడు ఎవడు. ఎవరివల్ల ఈ కార్యం జరుగుతుంది, ఎవరు అంతటి సమర్ధుడు?” అని అడిగారు.
అప్పుడు శరభుడు లేచి, ‘నేను 30 యోజనములు వెళతాను’ అన్నాడు, అలాగే ఋషభుడు ‘40 యోజనములు వెళతాను’ అన్నాడు, గంధమాదనుడు 50, మైందుడు 60, ద్వివిదుడు 70, సుషేణుడు 80. అప్పుడు జాంబవంతుడు లేచి అన్నాడు… “నేను యవ్వనంలో ఉన్నప్పుడు చాలా బలంగా ఉండేవాడిని. పరమేశ్వరుడు త్రివిక్రమావతారంతో(వామన) పెరిగిపోతుంటే నేను ఆయనకి 21 సార్లు ప్రదక్షిణ చేశాను. కాని ఇప్పుడు నేను ముసలివాడిని అయిపోయాను, నేను ఇప్పుడు 90 యోజనాలు ఎగరగలను” అన్నాడు.
అప్పుడు అంగదుడు అన్నాడు
“నేను 100 యోజనాలు వెళ్ళగలను, కాని తిరిగి మళ్ళి ఈ 100 యోజనాలు తిరిగి రాలేను” అన్నాడు.
అప్పుడు జాంబవంతుడు “అయ్యో, అది మహా పాపం. ప్రభువు వెళ్ళి పని చేస్తుంటే, ఆయనని సేవించేవారు హాయిగా కూర్చుంటే అది చాలా అసహ్యంగా ఉంటుంది. నువ్వు వెళ్ళకూడదు, నువ్వు మాకు పనిని పురమాయించాలి. ఎవరిని పంపాలో నాకు తెలుసు, వాడిని నేను పంపిస్తాను, మీరందరూ చూడండి” అని ఒక్కడిగా కూర్చున్న హనుమంతుడి దగ్గరికి వెళ్ళి “ఏమయ్యా హనుమా! ఏమీ తెలియని వాడిలా ఇలా కూర్చున్నావు. ఒకానొకప్పుడు అప్సరసలలో శ్రేష్టురాలైన పుంజికస్థల అనబడే ఒక అప్సరస శాపవశం చేత కుంజరుడు అనే వానరానికి కుమార్తెగా జన్మించింది. ఆమెకి అంజన అని పేరు పెట్టారు. ఆమె నీ తండ్రి అయిన కేసరి యొక్క భార్య. నీ తల్లి కామరూపి అవడంచేత ఒకనాడు మనుష్య రూపం దాల్చి ఒక పర్వత శిఖరం మీద నిలబడింది. వాయువు ఆమెని చూసి మోహించి, తన దీర్ఘమైన బాహువుల చేత గట్టిగా కౌగలించుకున్నాడు. అప్పుడా తల్లి
‘ఎవడురా దుర్మార్గుడు నా పాతివ్రత్యాన్ని చెరప చూస్తున్నవాడు' అనింది.
అప్పుడా వాయువు అన్నాడు
'అమ్మా! బ్రహ్మగారు మా తేజస్సులని వానర స్త్రీలయందు ప్రవేశపెట్టి వానరాలని సృష్టించమన్నారు. అందుకని నీ పాతివ్రత్యానికి భంగం కలగకుండా గొప్ప పరాక్రమము ఉన్నవాడు, బుద్ధిమంతుడు, నాతో సమానంగా దూకగలిగినవాడు, ఎగరగలిగినవాడైన పుత్రుడు కేవలం నిన్ను నేను మానసికముగా చూసినంత మాత్రాన నీ కడుపుయందు జన్మించనున్నాడు' అన్నాడు.
ఆ కారణం చేత నువ్వు జన్మించావు.
నువ్వు పుట్టగానే ఆకాశంలో ఉన్న సూర్యుడిని చూసి తినే ఫలం అనుకొని ఆయనని పట్టుకోబోయావు. సూర్య పధానికి అడ్డు వస్తున్నావని కోపమొచ్చి ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే, నీ ఎడమ దవడ చొట్టపడి కింద పడ్డావు. సొట్టపడ్డ (దవడ)హనుములు కలిగినవాడివి కనుక నిన్ను హనుమ అని పిలిచారు. నువ్వు అలా పడిపోవడం చేత నీ తండ్రి అయిన వాయుదేవుడికి కోపం వచ్చి భూమిమీద వీచడం మానేశాడు. అప్పుడు బ్రహ్మగారు పరుగు పరుగున వచ్చి, గాలి వీచకపోతే సృష్టి ఆగిపోతుందని “హనుమా! ఏ అస్త్రము చేత, ఏ శస్త్రము చేత నిన్ను ఎవరూ బంధించలేరు” అని వరం ఇచ్చారు. అలాగే ఇంద్రుడు నీకు స్వచ్ఛంద మరణ వరం ఇచ్చాడు. నీ అంత నువ్వు సంకల్పం చేసి శరీరాన్ని విడిచిపెట్టాలి కాని, నిన్ను పడగొట్టగలిగే పురుషుడు ఈ బ్రహ్మాండంలో ఎక్కడా ఉండడు.
నేను ఎన్నో సందర్భాలలో సముద్రంలో ఉన్న పాముల్ని గరుత్మంతుడు తన్నుకుపోతుండగా చూశాను. నీ తండ్రి అయిన వాయుదేవుడు ప్రభంజనుడై వీస్తే పెద్ద పెద్ద చెట్ల యొక్క కొమ్మలని విరిచేస్తాడు. అటువంటి శక్తిమంతుడైన వాయుదేవుడి కుమారుడవైన నీకు ఆ గమన శక్తి ఉంది, గరుత్మంతుడికి ఆ గమన శక్తి ఉంది. ఇవ్వాళ కొన్ని కోట్ల వానరముల భవిత, సౌభాగ్యము, ప్రాణములు నీ చేతులలో ఉన్నాయి. నీ వీర్యమును, తేజస్సును, పరాక్రమమును ఒక్కసారి పుంజుకో. 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా దాటి సీతమ్మ జాడ కనిపెట్టి ఇక్కడికి రా. హనుమా! నీ శక్తిని చూపించు” అని జాంబవంతుడు అన్నాడు.
జాంబవంతుడి మాటలు విన్న హనుమంతుడు మేరు పర్వతం పెరిగినట్టు తన శరీరాన్ని పెంచేశాడు. గుహలో నుండి సింహం ఆవలిస్తూ బయటకి వస్తుంటే దానిని చూసిన ప్రాణులు భయంతో ఎలా నిలబడిపోతాయో, అలా అప్పటివరకూ తమతో తిరిగిన హనుమంతుడు అటువంటి స్వరూపాన్ని పొంది, ఒక్కసారి ఆవలించి, బాహువులని పైకి ఎత్తి ఒక్కసారి విదిల్చి భూమి మీద కొట్టేసరికి వానరములన్నీ భయపడిపోతూ, శ్రీమహా విష్ణువు దర్శనం అయితే ఎలా నిలబడతారో అలా హనుమంతుడిని చూసి అంజలి ఘటించి నిలబడిపోయారు.
అప్పుడు హనుమంతుడు అక్కడ ఉన్న వృద్ధులైన వానరాలకి నమస్కరించి… “నా తండ్రి వాయుదేవుడు, ఆయన అగ్నిదేవుడి యొక్క సఖుడు. వాయుదేవుడు ఎటువంటి గమనంతో వెళతాడో నేను అటువంటి గమనంతో వెళతాను. నేను వెళుతున్నప్పుడు నాకు అడ్డొచ్చిన ఏ ప్రాణినైనా నా వక్షస్థలంతో గుద్ది చంపేస్తాను. పర్వతాలని చూర్ణం చేస్తాను, సముద్రాల్ని కలయ తిప్పుతాను. నా బాహువుల శక్తి చేత ఈ సముద్రాన్ని తిరగ తోడుతాను. 100 యోజనములే కాదు 10,000 యోజనములైనా సరే కొన్ని వేల మార్లు అటువైపు నుండి ఇటువైపుకి వెళతాను. సూర్యుడు ఉదయిస్తుండగా భూమి నుండి ఆకాశంలోకి వెళతాను, సూర్యుడి సమీపంలో నిలబడి నమస్కారం చేస్తాను. సూర్యుడు అస్తమించడానికి పశ్చిమ దిక్కుకి వెళుతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళి నమస్కరించి వస్తాను. గరుత్మంతుడు సముద్రం మీద తిరుగుతుండగా ఆయనకి కొన్ని వేలసార్లు ప్రదక్షిణం చేస్తాను. ఇక్కడ నుండి లేచి దక్షిణ దిక్కున ఉన్న సముద్రాన్ని ముట్టుకుంటాను. రావణాసురుడిని కొట్టి చంపేస్తాను, లేదా లంకని పెల్లఘించి చేతితో పట్టి సముద్రానికి ఈవలి ఒడ్డుకి తీసుకువచ్చి రాముడి పాదాల దగ్గర పడేస్తాను. ఇక నా పరాక్రమము ముందు నిలబడగలిగినవాడు లేడు. బ్రహ్మగారు, దేవేంద్రుడు చెరొక ఆసనం మీద కుర్చూని మధ్య ఆసనంలో అమృతాన్ని పెడితే, ఇద్దరి మధ్యలోకి వెళ్ళి, చెరొక చేతితో ఇద్దరినీ అడ్డగించి అమృతాన్ని తీసుకురాగలను. ఈ భూమి నన్ను తట్టుకోలేకపోతుంది, అందుకని మహేంద్రగిరి పర్వతం మీద నుంచి బయలుదేరతాను” అన్నాడు.
అలా హనుమంతుడు ఆ మహేంద్రగిరి పర్వతాన్ని ఎక్కుతుంటే, అక్కడున్న గంధర్వులు, విద్యాధరులు ఎగిరి పారిపోయారు. అనిల కుమారుడి(హనుమ) పద ఘట్టనకి ఆ పర్వతం కంపించిపోయింది, చెట్లు నేలరాలిపోయాయి, మృగములన్నీ దిక్కులు పట్టి పారిపోయాయి. హనుమంతుడిని చూసిన వానరాలు… “మహానుభావా! ఋషుల యొక్క ఆశీర్వచనము చేత, గురువుల యొక్క ఆశీర్వచనము చేత, దేవతల యొక్క ప్రభావము చేత ఏ విధమైన ప్రతిబంధకము లేకుండా 100 యోజనముల సముద్రాన్ని దాటి సీతమ్మ జాడ కనిపెట్టి తిరిగి నువ్వు ఎప్పుడు వస్తావా అని ఒంటి పాదం మీద నిలబడి ఉంటాము. ఇన్ని కోట్ల వానరాలకి ప్రాణము పెట్టిన వాడిగా కీర్తి గడించెదవుగాక. నీకోసం పుణ్య కర్మలను చేస్తూ ఇక్కడ నిలబడి ఉంటాము” అన్నారు.
హనుమంతుడు మానసిక ఉత్సాహమును పొంది లంకా పట్టణాన్ని మనస్సుతో చేరిపోయి ఉన్నాడు.```
*రేపు …64వ భాగం*
*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*
*🙏జై జై శ్రీ రామ్.!🙏*
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏
సోమవారం🕉️* *🌹09 జూన్ 2025🌹* *దృగ్గణిత పంచాంగం*
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🕉️సోమవారం🕉️*
*🌹09 జూన్ 2025🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*
*జ్యేష్ఠ మాసం - శుక్లపక్షం*
*తిథి : త్రయోదశి* ఉ 09.35 వరకు ఉపరి *చతుర్దశి*
*వారం : సోమవారం* (ఇందువాసరే)
*నక్షత్రం : విశాఖ* మ 03.31 వరకు ఉపరి *అనూరాధ*
*యోగం : శివ* మ 01.09 వరకు ఉపరి *సిద్ధ*
*కరణం : తైతుల* ఉ 09.35 *గరజి* రా 10.38 ఉపరి *వణజి*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 06.00 - 07.00 సా 05.00 - 06.00*
అమృత కాలం : *ఉ 05.41 - 07.28*
అభిజిత్ కాలం : *ప 11.41 - 12.33*
*వర్జ్యం : రా 07.56 - 09.42*
*దుర్ముహూర్తం : మ 12.33 - 01.25 & 03.10 - 04.02*
*రాహు కాలం : ఉ 07.12 - 08.50*
గుళికకాళం : *మ 01.45 - 03.23*
యమగండం : *ఉ 10.29 - 12.07*
సూర్యరాశి : *వృషభం*
చంద్రరాశి : *తుల/వృశ్చికం*
సూర్యోదయం :*ఉ 05.41*
సూర్యాస్తమయం :*సా 06.50*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 05.34 - 08.11*
సంగవకాలం :*08.11 - 10.48*
మధ్యాహ్న కాలం : *10.48 - 01.25*
అపరాహ్న కాలం : *మ 01.25 - 04.02*
*ఆబ్ధికం తిధి : జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి*
సాయంకాలం :*సా 04.02 - 06.39*
ప్రదోష కాలం : *సా 06.39 - 08.50*
రాత్రి కాలం :*రా 08.50 - 11.45*
నిశీధి కాలం :*రా 11.45 - 12.29*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.07 - 04.51*
------------------------------------------------
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*
*నానారోగాదిదుఃఖాద్రుదిత*
*పరవశః శంకరం న స్మరామి*
*క్షంతవ్యో మేఽపరాధః శివ*
*శివ శివ భో శ్రీమహాదేవ శంభో*
🕉️ *ఓం నమః శివాయ*🕉️
🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🕉️🕉️🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🕉️🕉️🌹🌷
🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹
వాత్సల్య గోదావరి*
*వాత్సల్య గోదావరి*
🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊
*రచన: శ్రీమతి మణి వడ్లమాని*
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍
ఆషాడం చివరన,తొలకరి జల్లులు,కుంభవృష్టిగా మారి ఆకాశం చిల్లుపడ్డట్టుగా కుండపోతగా వర్షం కురుస్తోంది.
వీధి వసారాలో సుబ్బుశాస్త్రిభోరున పడుతున్న వానను చూస్తూ,మనసులోబావురుమనుకుంటూ పీట మీద కూర్చొని శివ పంచాక్షరీ జపం చేస్తున్నాడు. పెదాలుమాత్రమేజపిస్తున్నాయి.చూపు మాత్రంవీధివైపు ఉంది. పంచాంగం ముందు పెట్టు కొని ఆరోజు తిది,వార,నక్షత్రాలు తో సహా సిద్ధంగాఉన్నాడు.అలాగే ఎవరన్నా వచ్చిపిలుస్తారేమోఅనివడికిన జంద్యాలు కూడా పక్కనేపెట్టుకున్నాడు
‘శాస్త్రి గారు’ అనే పిలుపు కోసం చెవులు రిక్కించి ఉంచాడు.
అబ్బే ఏది ఎవరూ రాందే?
నిరాశగా మళ్ళి పంచాక్షరీ జపం చేస్తున్నాడు. మనసులో మటుకు వరద గోదావరిలా ఎన్నో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి
ఈవర్షం కనక లేకపోతెరోజూ ఈ పాటికల్లాగోదారొడ్డున ఉన్న కోటిలింగాల రేవుదగ్గర ఉండేవాడు. ఉదయాన్నే వెళ్లి గోదావరి లో ఓ నాలుగు మునకలు వేసి సంధ్యావందనం అక్కడే కానిచ్చి, ఈశ్వరుడి దర్శనం చేసుకొని, ఆ పావంచాల అంచున కూర్చొని ఎక్కడెక్కడి నుంచోపరమపావని అయిన ఈ గోదావరి లో స్నానం చెయ్యడానికి వచ్చిన వాళ్ళ చేత సంకల్పం చెప్పించివాళ్ళు ఇచ్చిన తృణమో పణమో తీసుకొని ఆరోజు కి సరిపడ సంబారాలు కొనుక్కొని ఇంటికి వెళ్ళే వాడు.ఇది రోజూ అతని దినచర్య. భార్య వర్ధనమ్మ ఎంతో ఒబ్బిడిగా సంసారం లాక్కొని వస్తోంది , లేదు,సరిపోదు అనకుండా తెచ్చిన వాటితోనే రుచికరమైన వంట చేసి భర్తకు పెట్టేది.
అందుకే ఎప్పుడు సుబ్బుశాస్త్రి అనేవాడు “వర్ధనం,నీ చేతి లో ఏదో మంత్రదండం ఉంది సుమా!” అని. ఆ తృప్తి తోనే ఆవిడకి కడుపు నిండి పోయేది.
కాని నాలుగు రోజులనుంచి కురుస్తున్న ఈ కుంభవృష్టి వల్ల యాత్రికులు ఎవరూ రావటం లేదు. ఇంచుమించుగా భార్యభర్తలిద్దరూ అర్ధాకలితోనే కాలం వెళ్ళదీస్తున్నారు
పోనీ,ఎవరైనా,ఆభ్దికాలకి భోక్తలుగా పిలుస్తున్నారా? అంటే అది లేదు. అయినా ఇళ్ళలో చేస్తేనే కదా పిలిచేది అది కాస్తా మఠం లోనే కానిచ్చేస్తుంటే, ఇహ చేసేదేముంది? అనుకుంటూ ‘ఆ గోదావరి తల్లినే నమ్ముకున్నాను. పుణ్యనదిలో స్నానాల కోసం ఎవరైనా రాకపోతారా? సంకల్పం చెప్పక పోతానా? నాలుగు రూపాయలు తెచ్చుకురానా?” అని ఆశగా చూస్తున్నాడు.
అందరిలా తను పెద్దగా పండితుడు కాదు,పూజలు ,పెళ్ళిళ్ళు చేయడానికి.ఏదో బతుకు తెరువు కోసం, ఆభ్దికాలకి,భోక్తలుగా వెళ్ళడం, లేదా ఎవరైనా గ్రహ పూజలు చేస్తే ఆ దోష నివారణార్ధం దానం అందుకోవడం, అలా వాటితో వచ్చిన సొమ్ము తోనే బ్రతుకును వెళ్లదీసుకువస్తున్నాను.పిత్రార్జితం గ ఉన్న ఈ పెంకుటిల్లే.కాస్త నీడ నిస్తోంది.అది కాస్తశిధిలావస్థలోఉంది.ఉన్న ఈ ఆధారం కూడా పోతె,ఇక నా దారి నువ్వేతల్లీ, అనిగోదావరి వైపు దిగులుగాచూస్తున్నాడు.
నాలుగు రోజులనుంచి కడుపునిండా తిండి సరిగాలేదు,నిన్న రాత్రి తిన్న ఉప్పుడుపిండి ఏ మూలకు సరిపోతోంది. నీరసంగా ఉంది. పాపం నేనే ఇలా ఉంటెవర్ధనం ఎలా తట్టుకుంటుందిఅనుకుంటూ పెరటివైపుకి చూసాడు. అక్కడ వసారాలో కూర్చొని వత్తులు చేసుకుంటూ ,గీతగోవిందం పాడుకుంటోంది.
జలజలా కురుస్తున్న వానని చూస్తూ “ఓ ఆకాశగంగాఎంతో ఉత్సాహంగా పైనుంచి కిందకి దూకుతున్నావు,ఆ గోదారేమోఅంతకంటే ఆవేశంతో నిన్నురమ్మనమని పిలుస్తోంది. మీ ఆట బాగానే ఉంది. అర్భకుడిని తల్లీ మీ ఇద్దరిమధ్యలో నన్ను బలి చెయ్యకండి.కాస్త ఈదీనుడిని కరుణించి శాంతించండి” అని మనసులోనే వేడుకుంటున్నాడు.
భర్త ఆశగా చూసే చూపుని తప్పించుకుంటూ పెరటి వసారాలో వత్తులు చేస్తున్నవర్ధనమ్మ ఆవేదనగా తలపోస్తోంది. ఏదైనా వండి పెడదామన్నా, ఇంట్లో బొత్తిగా సరకులు లేవు.ఉన్న రవ్వతో నిన్న రాత్రి కాసింత ఉప్పుడుపిండి చేసేసింది.ఈ పూట ఏదైనా దొరికేతే పర్వాలేదు. లేకపోతె ఇహ ఈ పూట పస్తే. అని ఏదోలెక్కలు వేసుకుంటూ అప్పుడే గంట పదకొండు దాటి ఉండచ్చు ఆనుకుంది.
ఇంతలో ముందు వసారాలో ఏదో అలికిడి వినిపించింది. గభాల్న లేచి చెంగు దులుపుకుంటూ వెళ్ళింది. ఆ వానలో కళ్ళకి ఏమి కనబడటం లేదు. ఎవరా అనిఆరాగా తొంగి తొంగి చూసింది. “సుబ్బుశాస్త్రి గారి ఇల్లు ఇదేనా? అంటూ ఒక వ్యక్తి అడుగుతూ లోపలకి వచ్చారు. “అవునండి,” అని సమాధానం ఇచ్చే లోపల ఒకఆడావిడా మరో మగమనిషి కూడా లోపలికి వచ్చారు.
ఈ హడావుడి అంతా విన్న సుబ్బుశాస్త్రి కూడా లేచి నిలబడ్డాడు. వాళ్ళు తెచ్చిన గొడుగులనువసారా మెట్ల మీద పెట్టారు. వాటి లోంచి చుక్కా చుక్కా నీరుమెట్ల మీద నుంచి కిందకిజారుతున్నాయి.వచ్చిన వాళ్ళ చేతులలోఏవో సంచులు కూడా ఉన్నాయి.
వాళ్ళలో ముందు గా మాట్లాడిన అతను. “వీళ్ళు మా అక్క,బావగారు. కెనడాలో ఉంటారు. ఇవాళ మా బావగారి తండ్రి తిధి , గోదావరి ఒడ్డున పెట్టుకుందామని వచ్చారు, మీ గురించి అవధాని గారు చెప్పారు కాని ఈ వానవల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక స్వయం పాకం ఇచ్చేద్దాము అనుకుంటున్నాము” అని అన్నాడు.
దానికి సుబ్బుశాస్త్రి“ అబ్బే, నాకు ఏమిఫర్వాలేదు. మీ బావగారుఈ వానలో గోదారి ఒడ్డున కూర్చొని చెయ్యగలరా?” అని సందేహం వెలిబుచ్చాడు.
“ఫర్వాలేదండి,వస్తాము… నేను కూర్చొని చేస్తాను” అని అతని బావగారు అన్నాడు. తెచ్చిన సంబారాలు అన్నీ సుబ్బుశాస్త్రి చేతికిచ్చారు.అవి అందుకొని “ఓ పని చేద్దాము.మా ఆవిడ ఇంత పెసరపప్పు,పరమాన్నము చేసి పెడుతుంది.మీ తండ్రి గారి ప్రసాదం తిన్న తృప్తి కూడా ఉంటుంది. అది కూడా మీకు అభ్యంతరం లేకపోతేనే సుమా” అని అన్నాడు.
“అయ్యో ఎంత మాట! అంతకంటే మహద్భాగ్యం ఇంకేముంటుంది” అంటూ ఎంతగానో సంతోష పడ్డారు. నలుగురూ గొడుగులుతీసుకొని రేవు దగ్గరకి వెళ్లారు.
వాళ్ళు వచ్చే లోపల వర్ధనమ్మ చక చకా,రెండు కూరలు, పప్పు, పరమాన్నంతో భోజనం వండిపెట్టి ఉంచింది. సరిగ్గా అపరాహ్న వేళకి వాళ్ళు కూడా కార్యక్రమం ముగించుకొని వచ్చారు.పెరట్లో ఉన్న అరటి ఆకులు కోసి విస్తళ్ళు వేసి భోజనాలు వడ్డించింది.
భోజన కార్య క్రమం అయ్యాక “ అయ్యా! రండి,తమకి తాంబూలం ఇస్తాను” అని అన్నారు కెనడా నుంచి వచ్చిన శ్రీపతి శర్మగారు.
సుబ్బుశాస్త్రిని, వర్ధనమ్మని ఇద్దరినీ పక్కపక్కనే నిలుచోమని వాళ్ళ తల్లితండ్రుల జ్ఞాపకార్థం గా ఇద్దరికీ చీరా,పంచెల చాపు తో పాటుగా భారీగా తాంబూలం కూడా ముట్ట చెప్పారు ఆ దంపతులు.
ఈ కార్య క్రమం అంతా అయ్యేసరికి మధ్యాహ్నం రెండు గంటలయింది.ఆ బావమరది వెళుతూ “తొందరలోనేపుష్కరాలు కూడా వస్తున్నాయి కదా శాస్త్రి గారు. అప్పుడు మళ్ళి వస్తాము. అన్నీ మీరే చెయ్యాలి” అని అన్నాడు.
“అయ్యో తప్పకుండా చేస్తాను బాబు” అంటూ ఎంతో నమ్రతగా చెప్పాడు.
www.bestsocialteacher.com
అప్పుడు శ్రీపతిశర్మగారు,బావమరది తో అంటున్నారు’ చూడు భాస్కర్, ఇంత పరమ పవిత్రమైన కార్యం చేసే వీళ్ళ జీవితాలు చూస్తే నాకు చాల భాదగా ఉంది. అయ్యో, ఏమిటిది? శనిదానాలు పట్టే బ్రాహ్మలు, కర్మలు జరిపించే వాళ్ళు శుభకార్యాలు చెయ్యకూడదుట కదా, పైగా అందరిలో చులకనగా కూడా చూస్తారట. ఇందాక శాస్త్రి గారు అంటుంటే విన్నాను. ఆర్ధికంగా కూడా వీళ్ళు చాలా బలహీనులు.
చాలీ చాలని, బతుకులు, ఎలాగడుస్తుంది,మరి వీళ్ళని ఆదుకునేది ఎవరు?అందరికి లక్ష్మీదేవి ప్రసన్నం కావాలని ఆశీర్వదించే వీళ్ళింట మాత్రం ఎప్పుడూ దరిద్రదేవత తాండవం చేస్తోంది. మనం ఏదైనా చెయ్యలేమా? వాళ్ళకి కనీసం కడుపునిండా భోజనం చేసే అవకాశం కూడా కల్పించాలేమా? అనిపించింది.అప్పుడే నాకు ఈ ఆలోచనకలిగింది.సుబ్బుశాస్త్రి గారి లాంటి వాళ్ళకి మనము సాయం చేయాలి.దానికి ఒక చక్కటిప్రణాళిక వేసుకొని ఒక ట్రస్ట్గా ఏర్పడదాం .వీళ్ళల్లా ఆర్ధికంగా వెనకబడిన వాళ్ళకి మనం చేయగలిగినంత సాయం చేద్దాము. దానికి నీసహయం కావాలి,నువ్వే కాదు సాయం చెయ్యాలన్న సంకల్పం,ఉద్దేశ్యం ఉన్న,ఎవరైనా సరే.వాళ్ళందరనీమన ప్రాజెక్ట్ ద్వారా కూడగట్టుకొని,ఈమంచిపనిని ఆరంభిద్దాము” అనిఆవేశంగా అన్నారు. ఆయన సుబ్బు శాస్త్రిని చూసి బాగా కదిలిపోయారు అనుకున్నాడు భాస్కర్.
దానికి శ్రీపతిగారి భార్య,విజయ “అవును తప్పకుండా చేద్దాము నేను నా స్నేహితులకి చెబుతాను. ఒకమూడు నెలల లోఅన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి వీళ్ళకి సాయం అందేలా చూద్దాము”అనిఆవిడ కూడా భర్త నిసమర్థించారు.
“మనదేశం, సంస్కృతీ,నదులు,వేదాలు అంటూ గొప్పగా చెప్పుకోవడమే కాదు,వాటిని రక్షించి ముందు తరాలకి ఇవ్వడం కూడా మనబాధ్యత.”
“తప్పకుండా బావగారు, ఈ పవిత్ర గోదావరి తీరాన ఇలాంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి.అందరికీ మనం సాయం చేయలేకపోయినా, కొందరికైనా చేద్దాము.ఒక ముందడగువేసాము. ఆ అడుగేమనలని ఆపకుండా సాగిపోయేలా చేస్తుంది.నేను సైతం ఈ పవిత్రమైన కార్యం లోభాగం పంచుకుంటాను”.అని భాస్కర్ కూడాశ్రీపతి,విజయలతో ఏకీభవిస్తూ అన్నాడు.
ఇవేమీ తెలియని శాస్త్రి, వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ “చూసావా వర్ధనం ఈ వేళ ఆదేవుడు పంపినట్లు గా వాళ్ళు ఇంత కుంభవృష్టి లోరావడం తండ్రికి ఆబ్దికంపెట్టి తర్పణాలు వదిలివెళ్ళడం మాములువిషయం కాదు. అంతా మనం నమ్ముకున్న ఆ తల్లి గోదావరి వల్లే.అందులోను ఎక్కడో కెనడా నుంచి వచ్చారుట.ఈ అఖండ గోదావరి దర్శనం కోసం,నిజంగా ఆ తల్లి నీడలో ఉండటం నిజంగా మనం చేసుకున్న పుణ్యమే. ” అని తాంబూలం లో ఉన్న నోట్లను లెక్కపెట్టుకొని నిర్ఘాంత పోయాడు. అక్షరాలా పదివేల రూపాయలు.ఉన్నాయి. “వర్ధనం ఏమిటో నాకు నమ్మబుద్ధి కావటం లేదు, నువ్వుఓ సారి లెక్కపెట్టి చూడు…” అన్నాడు ఖంగారుపడుతూ. ఆవిడ కూడా మళ్ళీ మళ్ళీ లెక్కపెట్టింది.“అవును,అచ్చంగా పదివేల రూపాయలే, యెంత దొడ్డ మనసు వాళ్లది” అని సంతోషంగాఅంటూ వాళ్ళు పెట్టిన చీర చూసుకుంటోంది
“అవును ఈ వేళ నిజంగా చాల సుదినం.నా వొంట్లో శక్తుడిగిపోయినా పర్వాలేదు తండ్రీ, కొంత కాలం దాన్ని మటుకు పునిస్త్రీ గానే ఉంచమనికోరుతున్నాను ఎందుకు అనుకుంటున్నావేమో, అదిఅలా ఐదో తనంతో ఉంటె అందరూ దాన్నిముత్తైదువ గ ఆదరిస్తారు. అప్పుడు దానితిండికి బట్టకి కొదవ లేకుండా ఉంటుంది అని”. సుబ్బుశాస్త్రి మనసులో అనుకున్నాడు.
ఉరకలేస్తూ ఉప్పొంగు తున్న గోదావరిని చూస్తూ “తల్లీ,ఏదోచాపల్యంతో నేనన్న మాటలు పట్టించుకోకుండా, కన్నతల్లిలా వాత్సల్యం చూపించి నన్ను కరుణించావు.” అంటూ భక్తిగా నమస్కరించాడు, సుబ్బుశాస్త్రి.
గోదావరి నిండుగా నవ్వి,నేనున్నానని ప్రేమగా నిమిరినట్లు అనిపించింది సుబ్బుశాస్త్రి కి.
*సేకరణ: కెయస్వీ కృష్ణారెడ్డి, 9492146689*
*ప్రధానోపాధ్యాయులు, జిల్లా పరిషత్ ఉన్నత* *పాఠశాల గంటి, కొత్తపేట *మండలం తూర్పుగోదావరి.*
********
_*
