8, జులై 2025, మంగళవారం

బంధాలను బలపరచుకోండి

 ఏమండీ! మీ అమ్మగారి పుట్టినరోజు వస్తోందికదా! మీ అమ్మగారికి ఒక సెల్ ఫోను

కొనిద్దామా? మీరేమంటారు? " అంటూ శ్యామల తన భర్త శేఖర్ ను అడిగింది.


శేఖర్ తన తండ్రి చనిపోయిన తరువాత తన ఇద్దరి చెల్లెల్లకు పెళ్ళిళ్ళు చేసి

భాద్యతలన్నీ నెరవేర్చి అమ్మ చూసిన సంబంధం చేసుకున్న మంచి

మనిషి.........శ్యామల కూడా మంచి అమ్మాయే! తన చెల్లెళ్ళు ఇద్దరూ

ఇంటికి 2 కి.మీ దూరంలోనే ఉన్నారు. శ్యామలకూడా ఉద్యోగం చేస్తుంది.


శేఖర్ , శ్యామల ఇద్దరూ ఆఫీసుకు వెళ్ళిపోయాక శేఖర్ అమ్మగారు

పక్కనే ఉన్న గుడికి వెళ్ళడం....టీ.వీ చూడటం.........ఇరుగుపొరుగుతో

కాసేపు మాట్లాడటం.........అప్పుడప్పూడూ కూతుళ్ళు,...మనవళ్ళూ....

మనవరాలు తరచుగా వచ్చి పలకరించిపోయేవారు.........


శ్యామల అమ్మకు ఫోను తీసి ఇద్దాము అన్న ఆలోచన శేఖర్ కు కూడా

నచ్చి ఒక సెల్ ఫోనును కొనుక్కుని వచ్చి అమ్మకు పుట్టినరోజు

కానుకగా ఇచ్చాడు........ఇస్తున్నప్పుడు ఆ అమ్మ కళ్ళల్లో సంతోషం

కనపడింది......ఆ సెల్ పోనును ఎలా వాడాలో......అన్నీ చెప్పి.......

నెంబర్లన్నీ అందులోకి ఫీడ్ చేసి అమ్మకు ఇచ్చాడు శేఖర్.........


సెల్ ఫోను రాగానే ఇక అమ్మకు మంచి టైంపాస్ అయింది. కూతురు

ఫోను చేసి" అమ్మా! నువ్వుచేసే పొదినా పచ్చడి నీ అల్లుడికి చాలా

ఇష్టం.......ఎలా చేయాలో ఒకసారి చెప్పమ్మా! " అని అడగడం

పిల్లలు అమ్మమ్మా! బాగున్నావా అని రోజూ మాట్లాడటం చాలా బాగా

నచ్చింది ఆమెకు..........ఇలా రోజూ అందరితో మాట్లాడుతూ చాలా

సంతోషంగానే గడిపారు ఆవిడ.


ఒక నెల రోజులు గడిచాయి........అమ్మ మొహం బాగా వాడిపోయిందన్న

విషయం గమనించాడు శేఖర్...........అమ్మతో ఇలా అన్నాడు.


" ఏమ్మా! అలా ఉన్నావు.......ఆరోగ్యం బాలేదా? డాక్టరు దగ్గరికి

వెళదామా చెప్పు? "


దానికి ఆవిడ " అలాంటిదేమీ లేదులేరా? నువ్వు ప్రశాంతంగా

ఆఫీసుకు వెళ్ళు " అని అంది.


కానీ శేఖర్ మాత్రం ఏదో ఉందని గ్రహించాడు......ఆఫీసుకు వెళ్ళేముందు

మళ్ళీ అడిగాడు.....


" ఏమీ లేదని ఎందుకే అబద్దం చెపుతావు? నీ మొహమే చెపుతోంది.

పరవాలేదు చెప్పమ్మా!


" మరేమో! మరేమో! పెద్ద విషయం ఏమీ లేదుగానీ.....నాకు ఈ

సెల్ ఫోను వద్దురా! నువ్వే ఉంచుకో! " అంది అమ్మ.


" ఎందుకలా అంటున్నావు చెప్పు.........ఎవరైనా ఏమైనా అన్నారా?"

శేఖర్ అడిగాడు.


" ఎవ్వరూ ఏమీ అనలేదు కానీ..........ఈ ఫోను వచ్చాక నన్ను చూడటానికి

ఎవ్వరూ రావడంలేదు.......రోజూ ఫోనులో మాట్లాడుతున్నాగా అమ్మా!

అని కూతుళ్ళూ......మనవళ్ళు.....మనవరాళ్ళు అంటున్నారు......

ఈ సెల్ వచ్చాక వారు ఎవరూ రావడంలేదు.........ఇది నాకు వారిని

దూరం చేస్తోంది......నాకు ఈ వయస్సులో ఆప్యాయంగా నా పక్కన

కూర్చోని మాట్లాడే నా బిడ్డలు కావాలి కానీ.......ఫోనులో అన్నీ

మాట్లాడేసుకుని కలవకుండా ఉండే బంధాలు వద్దురా! నాకు ఈ

సెల్ వద్దు.......అమ్మమ్మా! అంటూ పరిగెత్తుకుని వచ్చి నామెడను

చుట్టుకునే బంధమే కావాలి........నా మాటవిని ఈ సెల్ నాకు వద్దు,"


అని అమ్మ అన్నారు.......అది విన్న శేఖర్ కూడా నిజమే కదా!

అనుకుని నవ్వుకున్నాడు.........


పెద్దవారితో రోజూ ఫోనులో మాట్లాడినా సరే దయచేసి మీ వీలును చూసు్కుని

వెళ్ళి కలవండి.......బంధాలను బలపరచుకోండి..........👏బంధాలనుబలపరచుకోవాలి...

అనుబంధాలనుపెంచుకోవాలి....

మార్కండేయుడి తండ్రి

 మార్కండేయుడి తండ్రి మృకండు మహర్షి ఒక సార్థక నామధేయుడు. ఆయన తపస్సులో లీనమై నిశ్చలుడై ఉన్న సమయంలో ఆయన శిల వలె ఉండడం వల్ల మృగములు వచ్చి తమ దురద పోవడానికి వారి శరీరాన్ని రాయిలా పరిగణించి రాపిడిచేసి తమ దురదలను తీర్చుకొనేవి కదా. అలా మృగముల దురదలను తీర్చినవాడు కాబట్టి ఆయనను మృకండు మహర్షి అని పిలిచేవారని ప్రతీతి. ఇది సమంజసముగా వుంది. 


ఇలా ఆనాటి ఋషులు వందలు వేల కొలది సంవత్సరాలు తపస్సు నాచరించటంతో కొందరి చుట్టూ పుట్టలు విపరీతంగా పెరిగిపోవడం, కొందరు ఇలా మృకండుడులా శిలలా తయారు కావడం తరచూ జరిగేవేమో. 


ఇలా శిలలాగా రూపాంతరం చెందిన మృకండుడుని మృగాలు తమ తమ దురదలను తీర్చుకోవడం కోసం వాడుకోవడం గొప్ప విషయమే. 


కాని మరో చిన్న సందేహం, మృగాలు దురదలు తీర్చుకొన్నాయి కనుక మృకండుడు అయ్యారు కదా, అంతకు ముందు అంటే వారి పూర్వపు నామధేయం ఎలా ఉండేదని, ఎవరైనా తెలియజేయగలరు.

*చ మ త్కా ర శ్లో క ము.

 *శ్రీ విహంగో వాహనం యేషాం, త్రికంచధరపాణయః!*

*చ మ త్కా ర శ్లో క ము.*


ఒక బ్రాహ్మణుడు ఒక ధనవంతుని ఇంటికి వెళ్ళాడు. ఆ ధనికుడు సంపాదనతో పాటు సంస్కారమున్నవాడు.


ఆ బ్రాహ్మడికి కడుపునిండా షడ్రసోపేతమైన భోజనం పెట్టి, చక్కని పట్టు వస్త్రాలను యిచ్చి ఘనంగా సత్కరించాడు.


దానితో బ్రాహ్మణుడు తనకు జరిగిన సత్కారానికి మిగుల సంతోషించి, ఆ ధనవంతుడిని ఆశీర్వదించాలని అనిపించింది. ఒక ఆశీర్వచన శ్లోకం ఇలా చెప్పాడు. 


శ్లోకం. 


విహంగో వాహనం యేషాం,

త్రికంచధరపాణయః

పాసాల సహితా దేవాః

సదాతిష్ఠన్తు తే గృహే.


భావము.

*పక్షులు* వాహనాలుగా కలవారునూ...

*త్రికములను* ధరించిన వారునూ... 

*పాసాల* తో నిండిన వారునూ...

అగు దేవతలు మీ యింట ఎప్పుడూ ఉందురు గాక!


ఇదేమి ఆశీర్వచనం అనుకుంటే పొరపాటే... దీని అర్థం ఇలా ఉంది...


*వి* అంటే పక్షి,

*హం* అంటే హంస,

*గో* అంటే ఎద్దు,


*పక్షి వాహనంగా కలవాడు విష్ణువు.*

*హంస వాహనుడు బ్రహ్మ.*

*ఎద్దు వాగాహనం గలవాడు శివుడు.*

*అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ...


త్రికంచ అనగా...


త్రికం ను ధరించినవారు.


*త్రి* అంటే త్రిశూలం.*

*కం* అంటే శంఖము.*

*చ* అంటే చక్రములను ధరించినవారు


త్రిమూర్తులు...


*త్రిశూల ధారి శివుడు.*

*శంఖ ధారి బ్రహ్మ.*

*సుదర్శన ధారి విష్ణువు.*


ఈ ముగ్గురూ *పాసములతో* కూడిన దేవతలు.


*పా* అంటే పార్వతి.*

*స* అంటే సరస్వతి.*

*ల* అంటే లక్ష్మీ దేవి.


*పార్వతి, సరస్వతి, లక్ష్మీదేవి తో కూడిన దేవుళ్ళు*

*మీ యింట ఎల్లప్పుడూ వుందురుగాక! అని అర్థము.*


*సరస్వతి, లక్ష్మీ, పార్వతులనడంలో*

*విద్యలు, ఐశ్వర్యములు, సౌభాగ్యములు*

*మీ యింట వుండాలి అని అర్థం.*


*శంఖ, చక్ర, త్రిశూలములు ధరించిన వారు అనడం వలన శత్రు బాధలు, రాక్షస బాధలు, మీకు వుండవు అని భావము.*


*త్రిమూర్తులు వారి భార్యలతో మీ ఇంట వుందురు గాక! అనటం తో సర్వ సౌఖ్యములు, విద్యలతో పాటు, శాశ్వతమైన పరంధామము మీకు లభించుగాక!* 


అని అంత గొప్ప ఆశీర్వచనం ఇచ్చాడు ఆ బ్రాహ్మణుడు.


*చమత్కారమైన ఆశీర్వాదము.*

*****************************

నువ్వు లేకపోతే

 నువ్వు లేకపోతే ఈ లోకం ఏమీ ఆగిపోదు… పిచ్చి భ్రమల్లో బతకొద్దు…


ఒక సిస్టమ్‌, ఆర్గనైజేషన్‌, రిలేషన్‌షిప్‌ ఇలా దేనిలో ఉన్నవారినైనా ఇంకొకరితో రీప్లేస్‌ చేయొచ్చు. ‘నేను లేకపోతే ఈ కంపెనీ.. ఆఫీస్‌.. ఇల్లు.. రాష్ట్రం.. దేశం.. ఏమైపోతుందో’ అని చాలా అనుకుంటారు. ఏం నష్టం లేదు.


అన్నీ మామూలుగానే నడుస్తూ ఉంటాయి. మీలో ఉన్న ప్రత్యేక లక్షణం వల్ల జీవితంలో ఈ స్థాయిలో ఉండవచ్చు. మీకున్న అనుభవం, మీరు ఆలోచించే విధానం, మీరు ఆఫీస్‌కు వచ్చినప్పుడు మీతో వచ్చే ఎనర్జీ ఇలా ఎన్నో మంచి లక్షణాలు మీలో ఉండవచ్చు.


ఆ విషయంలో మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అయినా, మీ టైమ్‌ బాగుండకపోయినా, దగ్గర పడినా అందరూ పక్కన పెడతారు”


”ఎన్నో ఏళ్లు పనిచేసిన కంపెనీలో మీ రిటర్మైంట్‌ రోజున బాగా భావోద్వేగానికి గురవుతూ మాట్లాడుతూ ఉంటారు. అప్పటివరకూ సాధించిన వాటి గురించి చెబుతూ ఉంటారు. కానీ, ఇటు మీ స్పీచ్‌ నడుస్తుంటే, మీ యాక్సిస్‌ కార్డును ఇంకొకడు డి-యాక్టివేట్‌ చేస్తుంటాడు.


మరొకడు మీ అఫీషియల్‌ మెయిల్‌ ఐడీ పాస్‌వర్డ్‌ మార్చేస్తాడు. మీకు కాఫీ ఇచ్చే బాయ్‌ అప్పటికే మీ డెస్క్‌ ఖాళీ చేసి, అన్నీ మీ కారులో పెట్టేసుంటాడు. మీ సహచర ఉద్యోగులు మిమ్మల్ని ఎంతో మిస్‌ అవుతున్నామని కన్నీళ్లతో చప్పట్లు కొడుతూ ఉంటారు.


అదే సమయంలో మీ తర్వాత ఆ కుర్చీలో కూర్చొనేవాడు మీ పక్కనే బాధగా నిలబడి, మీ స్పీచ్‌ అయిపోగానే ఓ పెగ్‌ వేద్దామని చూస్తుంటాడు. వీడ్కోలు పార్టీ అయిపోగానే అందరూ మిమ్మల్ని మర్చిపోతారు. ఆ తర్వాత జీవితం అంతా ఇంట్లోనే”


”ఆఫీస్‌ నుంచి ఎవరైనా వచ్చి మీ సలహాలు, సూచనలు తీసుకుంటారని ఎదురు చూడొద్దు. ఎవడూ రాడు. ఏదైనా సలహా కావాలంటే చాట్‌- జీపీటీని అడుగుతాడు. ప్రపంచం ఎంతో వేగంతో పరుగెడుతోంది. కళ్లు మూసి తెరిస్తే అన్నీ మారిపోతాయి. మనం అందరూ మర్చిపోకూడని విషయం ఏంటో తెలుసా?


స్టీవ్‌జాబ్స్‌ను అతని సొంత కంపెనీలోనే రెండుసార్లు మార్చారు. జీవితమంతా నిరూపించుకుంటూ బతకలేం. మంచి పొజిషన్‌.. సక్సెస్‌లో ఉన్నప్పుడే అందరికీ గుర్తుంటాం. తర్వాత అందరూ మర్చిపోతారు. ‘నేనే లేకపోతే’ అని ప్రతి అత్తగారు అనుకుంటుంది. కానీ, కొత్త కోడలు వస్తుంది. ఆమెకంటే ఇల్లు బాగా చూసుకుంటుంది”


”ఒకరి స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం అనేది అవమానించడం కాదు. మీరు చేయాల్సిన పనులు అక్కడ పూర్తయ్యాయని అర్థం. మిగిలిన జీవితం హాయిగా బతకండి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి. కొత్త సవాళ్లను ఎదుర్కోండి. మిమ్మల్ని వీరు గౌరవించుకోండి.


ఇంకా ఆఫీస్‌ను నెత్తి మీద పెట్టుకుని మోయద్దు. హాలీడేకు వెళ్లండి. మీ పెంపుడు జంతువుతో సరదాగా ఆడుకోండి. పవర్‌.. మనీ.. సక్సెస్‌.. జీవితాంతం ఉండవు. అవి ఉన్నప్పుడు లేనప్పుడూ బతకడం నేర్చుకోవాలి.


‘నేనే లేకపోతే..’ అనే ఆలోచన వస్తే, ఒక్కటే గుర్తు పెట్టుకోండి. మీరే లేకపోతే ఈ ప్రపంచం ఇంకా ప్రశాంతంగా ఉంటుంది… ఏదీ ఆగదు… పాత నీరు పోతూనే ఉంటుంది… కొత్త నీరు భర్తీ చేస్తూనే ఉంటుంది… జస్ట్, ఎ లైఫ్, ఇట్ హేపెన్స్..!!

Panchaag

 


రామాయణం


          *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది.

``

      *వాల్మీకి రామాయణం*                    

            *90వ భాగం*

```

ఇంద్రజిత్ మరణించాడన్న వార్త విన్న రావణుడు కూర్చున్న తల్పం మీదనుండి కిందపడి దీర్ఘమూర్చని పొందాడు. 


తరువాత ఆయన అన్నాడు… 

“నా కుమారుడు ఇంద్రజిత్ ఎవరి చేత సంహరింపబడనివాడు, ఇవ్వాళ ఇంత దారుణంగా మరణించాడు. ఇంక నాకీ జీవితం ఎందుకు. అసలు ఇన్ని ఉపద్రవాలకి కారణం అయిన సీతని సంహరించేస్తాను” అని ఒక పెద్ద కత్తి పట్టుకుని బయలుదేరాడు. 


ఆగ్రహంతో తన వైపుకి వస్తున్న రావణుడిని చూసి సీతమ్మ ఒణికిపోయింది. 


రావణుడు సీతమ్మని చంపుదామనుకునేసరికి మహాపార్షుడు అక్కడికి వచ్చి అన్నాడు… “ఇంత బతుకు బతికి, ఇంత చదువు చదివి, ఇంతమందిని ఓడించి, ఇంతమందీ చచ్చిపోయాక ఒక ఆడదాన్ని కూడా రావణుడు చంపాడన్న అపకీర్తిని మూటకట్టుకుంటావా రావణా. నువ్వు మగాడివైతే యుద్ధం చేసి రాముడిని చంపు, అంతేకాని ఆడదానిమీద ఎందుకు నీ ప్రతాపం” అన్నాడు.


అప్పుడు రావణుడు… “రేపు అమావాస్య, రేపు రాముడితో యుద్ధం చేస్తాను” అని అంతఃపురానికి వచ్చేశాడు.


మరునాడు రావణుడు విరూపాక్షుడు, మహోదరుడు, మహాపార్షుడు మొదలైన రాక్షస వీరులతో యుద్ధానికి వచ్చాడు. 

ఆ యుద్ధంలో విరూపాక్షుడిని, మహోదరుడిని సుగ్రీవుడు చంపాడు, మహాపార్షుడిని అంగదుడు చంపాడు.


అప్పుడు రాముడు మండలాకారంగా తన ధనుస్సుని పట్టుకొని బాణాలు వేస్తుంటే, లోపలినుంచి కోరికలు పుట్టిస్తున్న జీవాత్మ ఎలా కనపడదో, అలా బాణపు దెబ్బలు తగులుతున్నాయి, ఏనుగుల తొండాలు తెగిపోతున్నాయి, గుర్రాలు కాళ్ళు తెగి పడిపోతున్నాయి, లక్షల రాక్షస సైన్యం పడిపోతోంది కాని రాముడు మాత్రం కనపడడం లేదు. 


ఆ సమయంలో రాముడు అగ్ని చక్రం తిరిగినట్టు తిరుగుతూ, మండలాకారంగా(వృత్తాకారంలో) ధనుస్సుని పట్టుకుని తిరుగుతూ కొన్ని కోట్ల రాక్షసులని కొట్టాడు.


'తన ఇంటి గుట్టుని రాముడికి చెప్పి ఇంతమంది రాక్షసుల మరణానికి కారణమైనవాడు ఆ విభీషణుడు' అనుకొని, రావణుడు శక్తి అనే అస్త్రాన్ని విభీషణుడి మీదకి ప్రయోగించబోతుండగా, లక్ష్మణుడు బాణములతో ఆయన చేతిని కొట్టాడు. 


ఆగ్రహించిన రావణుడు ఆ శక్తిని లక్ష్మణుడి మీద ప్రయోగించాడు, అప్పుడా శక్తి లక్ష్మణుడి వక్షస్థలం నుండి దూసుకుపోయింది. వెంటనే ఆయన మూర్చపోయి కిందపడి పోయాడు. 


అప్పుడు హనుమంతుడు లక్ష్మణుడిని ఎత్తి తీసుకెళ్ళి రాముడి దగ్గర పెట్టాడు.


అప్పుడు రాముడన్నాడు…

“నా చేతిలోనుంచి ధనుస్సు జారిపోతోంది, మంత్రములు జ్ఞాపకానికి రావడం లేదు. ఏ దేశానికి వెళ్ళినా భార్య దొరుకుతుంది, ఏ దేశానికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు, కాని తోడపుట్టినవాడు మాత్రం జీవితంలో ఒక్కసారే వస్తాడు” అని బాధపడ్డాడు.


అప్పుడు హనుమంతుడు… “రామా! నువ్వు బెంగపెట్టుకోకు, లక్ష్మణుడిని ఎలా బతికించుకోవాలో నాకు తెలుసు” అని మళ్ళి ఆకాశంలోకి ఎగిరి, హిమాలయ పర్వతాలని చేరుకొని అక్కడున్న ఓషధ పర్వతాన్ని తీసుకొచ్చాడు. 


అప్పుడు సుషేణుడు ఆ ఓషదులని లక్ష్మణుడి ముక్కులో పిండాడు, ఆ ఓషదుల వాసన తగలగానే లక్ష్మణుడు మళ్ళి పైకి లేచాడు.


“ఇంక నేను యుద్ధం చేస్తాను ఈ రావణుడితో” అని రాముడు ముందుకి బయలుదేరాడు. 


ఆ సమయంలో ఆ యుద్ధాన్ని ఆకాశంలో నుండి చూస్తున్న దేవతలు 'దుర్మార్గుడు, దుష్టుడు అయిన రావణుడు రథంలో ఉండి యుద్ధం చేస్తున్నాడు, మహానుభావుడైన రాముడు భూమి మీద నుండి యుద్ధం చేస్తున్నాడు' అని అనుకున్నారు. 


అప్పుడు ఇంద్రుడు తన సారధి అయిన మాతలిని రాముడికి సహాయం చెయ్యమని చెప్పి తన రథం ఇచ్చి పంపించాడు.


అప్పుడా మాతలి రాముడితో అన్నాడు… “రామా! ఇంద్రుడు ఈ రథాన్ని పంపించాడు. దీనికి ఆకుపచ్చని గుర్రాలు కట్టి ఉంటాయి. పూర్తిగా కాల్చిన బంగారంతో ఈ రథం నిర్మింపబడినది. ఇందులో అక్షయబాణ తూణీరాలు, ఇంద్రుడు పట్టుకునే గొప్ప ధనుస్సు ఉన్నాయి. మీరు ఈ రథాన్ని ఎక్కండి, నేను మీకు సారధ్యం చేస్తాను. శ్రీ మహావిష్ణువుని గరుడుడు వహించినట్టు నేను మీకు సారధ్యం చేస్తాను. మీకు ఇవ్వమని చెప్పి ఇంద్రుడు ఈ శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు, మీరు దీన్ని స్వీకరించండి” అన్నాడు.


రాముడు ఆ రథానికి నమస్కరించి దానిలోకి ఎక్కాడు. అప్పుడు రాముడికి రావణుడికి చండప్రచండమైన యుద్ధం జరిగింది. 


రాముడి బాణాల వేగాన్ని తట్టుకోలేక ఆ రావణుడు వెనక్కి వెళ్ళాడు. వాళ్ళిద్దరికీ యుద్ధం జరుగుతుండగా ఆకాశం అంతా చీకటిగా అయిపోయింది. పగటి వేళలో వాళ్ళిద్దరి బాణ పరంపర ఆకాశాన్ని కప్పేసింది. అప్పుడు రాముడన్నాడు “ఇంక మీరెవ్వరూ యుద్ధం చెయ్యకండి, అలా నిలబడి చూడండి. రావణుడో రాముడో తేలిపోవాలి!” అన్నాడు.


అటుపక్క రాక్షసులు, ఇటుపక్క వానరాలు నిలబడిపోయి రామ-రావణ యుద్ధాన్ని చూస్తున్నాయి. రావణుడు 20 చేతులతో ఆయుధాలని రాముడి మీదకి ప్రయోగిస్తున్నాడు. ఆ సమయంలో రావణుడు శక్తి అనే అస్తాన్ని రాముడి మీదకి విడిచిపెట్టాడు. అప్పుడు రాముడనుకున్నాడు… 'ఈ రథం ఎక్కాక, లక్ష్మణుడు బతికాక, నాకు విపరీతమైన ఆనందం కలుగుతోంది. అన్ని అస్త్ర-శస్త్రాలు నాకు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఉత్సాహం పొటమరిస్తోంది' అనుకొని, ఇంద్రుడు ఇచ్చిన శక్తిని ప్రయోగించాడు. ఇద్దరి యొక్క శక్తులు ఆకాశంలో కొట్టుకొని నిర్వీర్యం అయ్యి కిందపడిపోయాయి. ఆ తరువాత రాముడు వేసిన బాణాలని రావణుడు తట్టుకోలేకపోయాడు, ఆయన చేతిలోని ధనుస్సు విరిగిపోయింది. 


అటువంటి సమయంలో రావణుడి సారధి ఆయన రథాన్ని యుద్ధభూమి నుండి దూరంగా తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు రావణుడు ఆ సారధితో… “ఛీ నీచుడా! నా జీవితంలో లేదు ఇటువంటి అప్రతిష్ట. యుద్ధభూమిలో ఉండగా నా తలలు తెగిపోయినా పరవాలేదు, కాని నువ్వు రథాన్ని చాటుకి తీసుకొచ్చి దాచావు. నువ్వు శత్రువుల దగ్గర లంచం తీసుకున్నావు కనుకనే ఇలాంటి పని చేశావు, నిజం చెప్పు?” అన్నాడు.


అప్పుడా సారధి… “మీ దగ్గర ఇంత కాలం పని చేశాను. ఇప్పుడు ఒకరి దగ్గర లంచం తీసుకొని మిమ్మల్ని అవమానించవలసిన అగత్యం నాకు లేదు. నేను శాస్త్రం తెలియనివాడిని కాదు, మర్యాద తెలియనివాడిని కాదు, రధికుడు రథంలో ఉండగా ఎలా నడపాలో తెలియని భ్రష్టుడిని కాదు. నేను ఎంతో కాలంగా మీ ఉప్పు తిన్నాను, మీయందు కృతజ్ఞుడనై ఉన్నాను. ద్వంద యుద్ధం జరుగుతున్నప్పుడు సమయోచితంగా అవసరాన్ని బట్టి రథాన్ని దగ్గరికి తీసుకెళ్ళాలి, దూరంగా కూడా తీసుకెళ్ళాలి, గుర్రాలు అలసిపోతున్నాయేమో చూసుకోవాలి, వెనుకన ఉన్న రథియొక్క పరిస్థితిని గమనించుకోవాలి. రాముడి బాణపు వేడి చేత గుర్రాలు శోషించిపోయాయి, తిరిగి ఆయుధాన్ని ప్రయోగించలేని నీరస స్థితిని మీరు పొందుతున్నారు. అప్పుడు రథికుడిని రక్షించుకోవలసిన బాధ్యత సారధికి ఉంది, అందుకని నేను రథాన్ని వెనక్కి తెచ్చాను. అంతేకాని ఒకరి దగ్గర లంచం తీసుకొని మిమ్మల్ని తేవలసిన అవసరం నాకు లేదు, మీ సేవలో ధన్యుడను అవ్వడానికి నీతికి కట్టుబడిన సారధిని నేను” అన్నాడు.


అప్పుడు రావణుడు… “నేను నిన్ను ఎన్ని మాటలు అన్ననురా సారధీ. నువ్వు ఉత్తమ సేవకుడివి” అని చెప్పి, తన చేతికున్న స్వర్ణ కంకణాన్ని తీసి సారధికి ఇచ్చాడు.


ఈ సమయంలోనే లంకా పట్టణంలో ఉన్న ప్రజలు ఒకరితో ఒకరు… “ఆ శూర్పణఖ జుట్టు తెల్లబడిపోయి వృద్ధురాలు అయిపోయింది, ఒళ్ళు ముడతలు పడిపోయింది, భయంకరమైన, వికృతమైన స్వరూపంతో ఉంటుంది, జారిపోయిన కడుపు ఉన్నది, కఠినమైన మాట కలిగినటువంటిది. అటువంటి శూర్పణఖ మన్మదుడితో సమానమైన ఆకృతి కలిగినవాడిని, అంత మధురముగా మాట్లాడగలిగినవాడిని, అటువంటి సౌందర్య రాశిని, చక్కటి నడువడి కలిగినవాడిని, సర్వకాలములయందు ధర్మమును అనుష్టించేవాడు అయిన రాముడిని ఏ ముఖం పెట్టుకొని కామించింది? రాముడిని పొందాలన్న కోరిక ఎలా కలిగింది? ఆ రాముడు వైముఖ్యాన్ని ప్రదర్శిస్తే, కడుపులో కక్ష పెంచుకుని సీతాపహరణానికి దారితీసేటట్టుగా రావణుడి మనస్సు వ్యగ్రత పొందేటట్టుగా ఎలా మాట్లడగలిగింది? రావణుడు ఎంత మూర్ఖుడు, రాముడు అరణ్యంలో 14,000 మంది రాక్షసులని, ఖర-దూషణులని సంహరించాడు. అలాంటివాడితో సంధి చేసుకుందాము అన్న ఆలోచన లేకుండా శూర్పణఖ మాటలు విని సీతని అపహరించడానికి వెళ్ళాడు.


పోనీ అప్పటికీ రాముడు అంత పరాక్రమము ఉన్నవాడని రావణుడు తెలుసుకోలేకపోయాడు అని అనుకుందాము. కాని రాజ్యభ్రష్టుడై అన్నగారి చేత తరమబడి, ఋష్యమూక పర్వత శిఖరముల మీద కూర్చున్న సుగ్రీవుడిని రక్షించడం కోసమని ఆయనతో స్నేహాన్ని చేసుకొని, వాలిని ఒక్క బాణంతో సంహరించి, చేసుకున్న స్నేహానికి, ఒప్పందానికి నిలబడి సుగ్రీవుడిని రాజ్యమునందు ప్రతిష్టించినప్పుడైనా రావణుడి కళ్ళుతెరుచుకోలేదా.


పోని అప్పుడు కూడా తెలుసుకోలేకపోయాడు అని అనుకుందాము. కాని విభీషణుడు ధర్మబద్ధమైన మాట చెప్పాడు 

'అన్నయ్యా, నువ్వు రాముడిని నిగ్రహించలేవు, లంక అంతా నాశనమయిపోతుంది. నువ్వు చేసినది పాపపు నడువడితో కూడిన పని. నా మాట విని సీతమ్మని తీసుకెళ్ళి రాముడికి ఇచెయ్యి' అని చెప్పాడు. విభీషణుడి మాటలు కాని రావణుడు విని ఉంటే ఇవ్వాళ లంకా పట్టణానికి ఇంతటి చేటుకాలం దాపురించేది కాదు. తోడపుట్టినవాడైన కుంభకర్ణుడు రాముడి చేతిలో చనిపోయాడు, తన కుమారులైన నరాంతకుడు, అతికాయుడు మొదలైన వారందరూ మరణించారు, మహోదర, మహాపార్షులు మొదలైనవారు మరణించారు, ఆఖరికి ఇంద్రజిత్ కూడా లక్ష్మణుడి చేతిలో మరణించాడు. ఇంతమంది చనిపోయాక కూడా వచ్చినవాడు సామాన్య నరుడు కాదన్న ఆలోచన రావణుడికి రావట్లేదే? ఒకానొకసారి దేవతలందరూ కూడా రావణుడు చేస్తున్న ఆగడములను భరించలేక అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి 'అయ్యా! రావణుడు చేస్తున్న ఆగడాలు మేము భరించలేక పోతున్నాము, నరవానరముల చేతిలో తప్ప వాడికి ఎవరి చేతిలో చావు లేదు. ఇవ్వాళ వాడి ముందుకెళ్ళి నిలబడగలిగే ధైర్యం ఎవరికీ లేదు. సముద్రం కూడా కెరటాలతో వాడి ముందు నిలబడడానికి భయపడుతుంది, సూర్యుడు గట్టిగా ప్రకాశించడం లేదు, అలా దిక్పాలకులని కూడా శాసించగలిగే స్థితిలో ఉన్నాడు. వాడి చేతిలో లోకములన్నీ పీడింపబడుతున్నాయి, మేము ఎలా జీవించాలి' అని అడిగారు. 


అప్పుడు బ్రహ్మగారు 'నేను ఇవ్వాల్టి నుంచి ఒక కట్టుబాటు చేస్తున్నాను. ఈ రాక్షసులు మూడు లోకములలోనూ తిరుగుతూ ఉంటారు, ఒక చోట ఉండరు, దానివల్ల మీకు కొంత ఉపశాంతి కలుగుతుంది' అని అన్నారు. 


దానివల్ల ఆ దేవతలు పూర్తి ఉపశాంతిని పొందకపోవడం చేత శివుడి కోసం తపస్సు చేశారు. త్రిపురములను తన కంటి మంట చేత నశింపచేసినవాడైన పరమశివుడు ఆ దేవతలయందు ప్రీతి చెంది, వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యి 'ఇంత తపస్సు కలిగిన రావణుడు మరణించడానికి కావలసిన విధంగా, సీత అన్న పేరుతో అమ్మవారు ఉదయించబోతోంది' అని ఆరోజున శివుడు దేవతలకి వరం ఇచ్చాడు. 


అందుచేత రావణుడు అపహరించి తీసుకొచ్చిన ఆ మైథిలి సాక్షాత్తుగా రావణుడి ప్రాణములను తీసుకోడానికి, ఈ లంకా పట్టణాన్ని సర్వనాశనం చెయ్యడానికి, రాక్షసులందరినీ పరిమార్చడానికి కాళ రాత్రిలా వచ్చింది. ఈ విషయాన్ని రావణుడు తెలుసుకోలేక రాముడి మీదకి యుద్ధానికి వెళుతున్నాడు” అని ఆ లంకా పట్టణంలోని ప్రజలు చెప్పుకుంటున్నారు. 


ఇటుపక్కన రాముడు అలసిపోయినవాడై ‘ఈ రావణుడిని అసలు ఎలా సంహరించడం?' అని ఆలోచిస్తుండగా, ఆ సమయంలో దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, ఋషులు మొదలైనవారందరూ ఆకాశంలో నిలబడ్డారు. అందరితోపాటుగా వారిలోకి గబగబా అగస్త్య మహర్షి వచ్చి “రామా! రామా! ఇప్పుడు నేను నీకు ఆదిత్య హృదయం ఉపదేశం చేస్తున్నాను, దీనిని నువ్వు స్వీకరించు. ఇది కాని నువ్వు పొందావా, ఇక నీకు ఏ విధమైన అలసట ఉండదు. ఈ పరమ మంగళమైన ఆదిత్య హృదయాన్ని నీకు భయం కలిగినప్పుడు కాని, అరణ్యంలో ఉన్నప్పుడు కాని చదువుకో, నీకు రక్ష చేస్తుంది” అని చెప్పి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు.

```

*“తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం*

*రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం*

*దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం*

*ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః*```


అగస్త్య ఉవాచ:```

*రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం*

*యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి*

*ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం*

*జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం*

*సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం*

*చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం*

*రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం*

*పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం*

*సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః*

*ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః*

*ఏశ బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః*

*మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః*

*పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః*

*వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః*

*ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్*

*సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః*

*హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్*

*తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండక అంషుమాన్*

*హిరణ్యగర్భహ్ శిశిరస్తపనో భాస్కరో రవిః*

*అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనహ్*

*వ్యోమనాథ స్తమోభెదీ ఋగ్ యజుస్సామ పారగః*

*ఘన వృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః*

*ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః*

*కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః*

*నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః*

*తెజసామపి తేజస్వీ* *ద్వాదశాత్మన్నమోస్తుతే*

*నమః పూర్వాయ గిరయే* *పశ్చిమాయాద్రయె నమః*

*జ్యోతిర్గణాణాం పతయే* *దినధిపతయే నమః*

*జయాయ జయభద్రాయ* *హర్యశ్వాయ నమో నమః*

*నమో నమస్సహస్రాంశో* *ఆదిత్యాయ నమో నమః*

*నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః*

*నమః పద్మ ప్రబోధాయ ప్రచండాయ నమో నమః*

*బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే*

*భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషె నమః*

*తమొఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనె*

*కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః*

*తప్త చామీక రాభాయ హరయే విష్వకర్మణే*

*నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే*

*నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః*

*పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః*

*ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః*

*ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం*

*వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ*

*యాని కృత్యాని లోకేషు సర్వేషు పరమ ప్రభుః*✍️

*ఏనమాపత్సు కృత్ శ్రేషు కాంతారేషు భయేషు చ*

*కీర్తయన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవః*

*పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం*

*ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి*

*అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి*

*ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం*

*ఏతత్ శృత్వా మహాతెజా నష్టశొకొభవత్తదా*

*ధారయామాస సుప్రీతొ రాఘవహ్ ప్రయతాత్మవాన్*

*ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్*

*త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్*

*రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్*

*సర్వ యత్నేన మహతా వధె తస్య ధృతోభవత్*

*అథ రవి రవదన్నిరీక్ష్య రామం*

*ముదితమనాః పరమం* *ప్రహృష్యమానః*

*నిశిచరపతి సంక్షయం విదిత్వా*

*సురగణమధ్యగతో వచస్త్వరేతి*

```

1 నుండి 2 శ్లోకాలు: అగస్త్యుడు శ్రీరాముడికి వద్ద కు వచ్చుట.


3 నుండి 5 శ్లోకాలు : ఆదిత్య హృదయ పారాయణ వైశిష్టత చెప్పబడింది.


6 నుండి 15 శ్లోకాలు : సూర్యుడంటే బయటకు వ్యక్త మవుతున్న లోపలి ఆత్మ స్వరూపమని, బాహ్యరూపము అంతః స్వరూపము ఒక్కటే.


16 నుండి 20 శ్లోకాలు : మంత్ర జపం

21 నుండి 24 శ్లోకాలు : సూర్యుడు గురించి శ్లోక మంత్రాలు.


25 నుండి 30 శ్లోకాలు : పారాయణ వల్ల కలిగే ఫలం, పారాయణ చేయ వలసిన విధానం, సూర్యభగవానుడు 

శ్రీ రాముడు విజయాన్ని పొందేటట్లు అశీర్వదించడం.


అగస్త్యుడు అన్నాడు “ఈ ఆదిత్య హృదయాన్ని చదువు, నువ్వు నీ సర్వ శత్రువులని జయిస్తావు, నీ శత్రువులని దునుమాడేస్తావు, నీ కోరికలన్నీ సిద్ధిస్తాయి. రావణుడు నీ చేతిలో నిహతుడు అవుతాడు” అన్నాడు.


రాముడు ఆ ఆదిత్య హృదయాన్ని మూడు సార్లు చదివాక అగస్త్యుడు వెళ్ళిపోయాడు.```


        *రేపు…91వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏


*👆వేరే పని ఒత్తిడి వల్ల నిన్న ఆదివారం 90వ భాగం పంపలేక పోయినందుకు మన్నించాలి*


*ఈ రోజు ఆదివారం 90వ భాగం మరియు రేపటి రోజు సోమవారం 91వ భాగం పంపుతున్నాను🙏*

*************************


``

          *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది.

``

      *వాల్మీకి రామాయణం*                     

           *91వ భాగం*

```

ఆ తరువాత రావణుడు నల్లటి గుర్రాలు కట్టి ఉన్న తన రథం మీద యుద్ద భూమికి తీవ్రమైన వేగంతో వచ్చాడు.


అప్పుడు రాముడు… “మాతలీ! ప్రతిద్వంది వస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండు, ఎంత మాత్రం పొరబడకు. రథాన్ని కుడి చేతి వైపుకి తీసుకువెళ్ళు. నేను నీకు చెప్పాను అని మరోలా అనుకోకు, నువ్వు ఇంద్రుడికి సారధ్యం చేస్తున్నవాడివి, నీకు అన్నీ తెలుసు. కాని నీ మనస్సునందు ధైర్యం ఉండడం కోసమని ఈ మాట చెప్పాను. వేరొకలా భావించకు” అన్నాడు.


ఆ యుద్ధ భూమిలో ఒకరికి ఎదురుగా ఒకరి రథాలని నిలబెట్టారు. ఆకాశంలో దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు అందరూ నిలబడి… “రాముడు ఈ యుద్ధంలో గెలవాలి, రావణ సంహారం చెయ్యాలి!” అని స్వస్తి వాచకం చేస్తున్నారు.


రావణుడు యుద్ధ భూమిలోకి వచ్చి నిలబడుతున్న సమయంలో ఆకాశం నుండి రక్త వర్షం కురిసింది, అదే సమయంలో మండలాకారంలో గాలులు తిరిగాయి, ఆకాశంలో గ్రద్దలు తిరుగుతూ వచ్చి ఆయన ధ్వజం మీద వాలాయి, నిష్కారణంగా అక్కడున్న భూమి కదిలింది, ఆకాశంలో మేఘాలు లేకుండానే రాక్షస సైన్యం వైపు పిడుగులు పడ్డాయి, ఆకాశం నుండి ఒక తోకచుక్క రావణుడి రథం మీద పడింది, రాక్షసులు తమ ఆయుధములను ప్రయోగిద్దామని చేతులు పైకి ఎత్తుతుంటే ఎవరో వచ్చి పట్టుకున్నట్టు చేతులు ఆగిపోయాయి, లంకా పట్టణం అంతా కాలిపోతున్నట్టు ఎర్రటి కాంతిని పొందింది, ఇళ్ళల్లో ఉన్న గోరువంకల మీద రాబందులు వచ్చి దాడి చేశాయి, సూర్యమండలం నుంచి ఎర్రటి, తెల్లటి, పసుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన కిరణాలు రావణుడి మీద పడ్డాయి, నిష్కారణంగా గుర్రాలు ఏడిచాయి, నక్కలు పెద్ద పెద్ద కూతలు కూశాయి, క్రూరమైన మృగాలు రావణుడి ముఖాన్ని చూస్తూ పెద్దగా అరిచాయి.


రామ-రావణ యుద్ధం ప్రారంభం అవ్వగానే అప్పటిదాకా కొట్టుకున్న వానరులు, రాక్షసులు ఒకరి పక్కన ఒకరు నిలబడి అలా చూస్తుండి పోయారు. రాముడు, రావణుడు ప్రయోగించిన బాణాలకి ఆకాశం అంతా చీకటి అయిపోయి, ఆకాశంలో గుద్దుకుంటున్న బాణముల మెరుపులే కనపడుతున్నాయి. అప్పుడు రావణుడు కొన్ని బాణములని రాముడి రథం యొక్క ధ్వజం మీదకి ప్రయోగించాడు. ఆ రథం యొక్క శక్తి చేత రావణుడు వేసిన బాణములు నిర్వీర్యం అయిపోయాయి. తరువాత రాముడు వేసిన బాణములకు రావణుడి ధ్వజం విరిగిపోయి నేలమీద పడిపోయింది. 


ఆ తరువాత రావణుడు బాణములతో రాముడి రథాన్ని లాగుతున్న గుర్రాలని కొట్టాడు. కాని ఆ గుర్రాలు రావణుడి బాణాలు తగిలినా కనీసం కదలను కూడా కదలలేదు. రావణుడు వేస్తున్న మాయతో కూడిన బాణముల నుంచి కొన్ని వేల రోకళ్ళు, పర్వతములు, వృక్షాలు, రోళ్ళు, చిత్ర విచిత్రమైన వన్నీ పుట్టి రాముడి రథం మీద పడిపోతున్నాయి. 


రావణుడి అన్ని బాణములకు సమాధానంగా రాముడు బాణ ప్రయోగం చేసి రావణుడి సారధిని, గుర్రాలని, ధ్వజాన్ని కొట్టాడు.


వాళ్ళిద్దరూ చేస్తున్న యుద్ధానికి సముద్రాలన్నీ క్షోభించాయి, నదులు గట్లు దాటి ప్రవహించాయి, భూమి అంతా కదిలిపోయింది, సూర్యమండలం అంతా ధూమముతో ఆవహించబడి ఉంది, బ్రహ్మాండములో ఉన్న సర్వ భూతములు కలత చెందాయి.

```

*గగనం గగనాకారం సాగరం సాగరోపమం*

*రామ రావణయోర్యుద్ధం రామరావణయోరివ*

```

ఆ భయంకరమైన యుద్ధాన్ని వర్ణిస్తూ వాల్మీకి మహర్షి… “ఆకాశానికి ఆకాశమే పోలిక, సముద్రానికి సముద్రమే పోలిక, రామ-రావణ యుద్ధానికి రామ-రావణ యుద్ధమే పోలిక” అన్నారు.


అప్పుడు రాముడు విషంతో కూడిన సర్పం వంటి బాణమును తీసి, వింటినారికి సంధించి, రావణుడి కంఠానికి గురిచూసి విడిచిపెట్టాడు. ఆ బాణం తగలగానే రావణుడి ఒక శిరస్సు తెగిపోయి భూమి మీద పడిపోయింది. ఆ శిరస్సు అలా పడిపోగానే మళ్ళీ ఒక కొత్త శిరస్సు మొలకెత్తింది. మళ్ళీ బాణం పెట్టి ఇంకొక శిరస్సుని రాముడు కొట్టాడు, అది కూడా మొదటిదానిలాగానే కిందపడిపోయింది, కాని మళ్ళీ కొత్త శిరస్సు పుట్టింది. అలా రాముడు మొత్తం 100 సార్లు రావణుడి శిరస్సులను కొట్టాడు.

అప్పుడు రాముడు అనుకున్నాడు 

‘ఈ బాణంతో మారీచుడిని, ఖరుడిని, దూషణుడిని, వాలిని సంహరించాను. ఈ బాణానికి ఎదురులేదు, ఈ బాణంతో ఇప్పటికి నూరు తలకాయలు భూమి మీద పడేశాను. కాని ఈ బాణం రావణుడి చంపలేకపోతోంది’ అని అనుకున్నాడు.


వాళ్ళిద్దరి మధ్య ఆ యుద్ధం 7 రాత్రులు, 7 పగళ్ళు, ఒక్క క్షణం కూడా విరామం లేకుండా జరిగింది. ఆకాశం అంతా దేవతలు, ఋషులు మొదలైన వాళ్ళతో నిండిపోయింది.


అప్పుడు మాతలి… “రామా! 7రాత్రులు 7 పగళ్ళ నుంచి యుద్ధం చేస్తున్నావు. దేవతలందరూ రావణుడి శిరస్సు పడిపోయే ముహూర్తాన్ని నిర్ణయించిన సమయం ఆసన్నమయిపోయింది. అగస్త్యడు ఇచ్చిన దివ్యమైన అస్త్రం నీయొక్క బాణతుణీరంలో ఉంది, దానిని బయటకి తీసి అభిమంత్రించి విడిచిపెట్టు” అన్నాడు.


అప్పుడు రాముడు ఆ అస్త్రాన్ని బయటకి తీస్తుంటే, అది పుట్టలోనుంచి బయటకి వస్తున్న బ్రహ్మాండమైన సర్పంలా ఉంది. లోకాలని రక్షించమని ఆ అస్త్రాన్ని బ్రహ్మగారు దేవేంద్రుడికి ఇచ్చారు. 

ఆ అస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టగానే అది వాయు వేగంతో వెళ్ళిపోతోంది, దానికున్న బంగారు ములుకులో అగ్ని, సూర్యుడు ఉంటారు, దాని శరీరం బ్రహ్మమయం అయి ఉంటుంది, సుర్యుడివంటి తేజస్సుతో ఉంటుంది, ధూమంతో నిండిపోయిన కాలాగ్నిలా ఉంటుంది. ఆ బాణం ఇంతకుముందు ఎన్నో పర్వతాలని చీల్చుకుంటూ, ద్వారాలని బద్దలుకొడుతూ, పరిఘలని విరుచుకుంటూ, ఎందరో రాక్షసుల గుండెల్ని ఛేధించుకుంటూ వెళ్ళింది. దాని ఒంటి మీద కొంచెం రక్తం, కొవ్వు ఉంటాయి. ఆ బాణం ఇంతకుముందు ఎక్కడెక్కడ ప్రయోగింపబడిందో అక్కడ వెంటనే డేగలు, గ్రద్దలు, రాబందులు, నక్కలు, క్రూరమృగాలు గుంపులుగా వచ్చి చనిపోయిన శత్రువుల మాంసాన్ని తినేవి.


రాముడు ఆ బాణాన్ని చేతితో పట్టుకుని దానిమీద వేదప్రోక్తంగా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాడు. 


ఆయనలా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించేసరికి భూమి అంతా కంపించింది. అప్పుడాయన ఆ బాణాన్ని వింటినారికి తగిలించి, చెవి వరకూ లాగి, పరమాత్మని స్తోత్రం చేస్తూ, శత్రువు నిగ్రహింపబడాలని కోరుకుంటూ విడిచిపెట్టాడు. ఆ బాణం ఒక్క క్షణంలో భయంకరమైన ధ్వనిని చేస్తూ, లోకాలన్నిటినీ క్షోభింప చేస్తూ, ఇంతకాలం ఏ రావణుడు లోకములన్నిటినీ పీడించాడో, ఆ రావణుడి గుండెల్ని బద్దలు చేస్తూ ఆయన వక్షస్థలం నుండి దూసుకు వెళ్ళింది.

రావణుడి చేతిలో ఉన్న ధనుస్సు, ఆయుధములు కింద పడిపోయాయి, ప్రాణాలు విడిచిపెట్టేసి ఆ శరీరంతో కింద పడిపోయాడు.

రావణాసురుడు మరణించాడు.


రావణుడు మరణించగానే ఆకాశంలో దేవదుందుభిలు మ్రోగాయి. వెంటనే సుగ్రీవుడు, లక్ష్మణుడు, అంగదుడు, ఋషభుడు, వేగదర్శి, నీలుడు, సుషేణుడు, గందమాధనుడు, మైందుడు, జాంబవంతుడు, కొన్ని కోట్ల వానరములు అందరూ పరమానందంతో రాముడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. 


అందరూ రాముడి పాదాల మీద పడిపోయి, ఆనందంతో పూజలు చేసి, “రామ రామ” అంటూ ఆయన శరీరాన్ని ముట్టుకుని పరవశించిపోయారు. 


హనుమంతుడు ఆనందంతో నాట్యం చేశాడు.


రావణుడు రథం మీద నుంచి కింద పడిపోయేసరికి అక్కడున్న రాక్షసులు పరుగులు తీశారు. వానరాలన్నీ కనపడ్డ రాక్షసుడిని వెంట తరిమి సంహరించారు.


ఆకాశంలో దేవతలందరూ పొంగిపోయి రాముడిని వేనోళ్ళ పొగిడారు.```


       *రేపు…92వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *

``

          *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది.

``

     *వాల్మీకి రామాయణం*               

            *92వ భాగం*

```

రావణుడు ఆ రణభూమిలో నిహతుడై పడిపోగానే విభీషణుడు ఏడుస్తూ ఆయన దగ్గరికి పరిగెత్తాడు. అప్పుడాయన అన్నాడు… “అన్నయ్యా! ఆనాడే నేను నీకు చెప్పాను'యుద్ధానికి వెళ్ళవద్దు, తప్పు చేసింది నువ్వు, 

నీ తప్పు నువ్వు దిద్దుకో’ అన్నాను. కాని నువ్వు నా మాట వినలేదు. ఆ వినకపోవడం వల్ల ఈనాడు ఎలా పడిపోయి ఉన్నావో చూశావా. ఆ రోజున దర్పంతో ప్రహస్తుడు, ఇంద్రజిత్, కుంభకర్ణుడు, అతిరధుడు, అతికాయుడు, నరాంతకుడు నా మాట వినలేదు. మా అన్నయ్య జీవించి ఉన్నంతకాలం ఎందరికో దానాలు చేశాడు, గొప్ప అగ్నిహోత్రాలు నిర్వహించాడు, మిత్రధర్మాన్ని నెరపి స్నేహితులకి కానుకలు ఇచ్చాడు, భూరి దానాలు చేశాడు, శత్రువుల గుండెల్లో నిద్రపోయాడు. ఇన్ని చేసినవాడు ఇవ్వాళ కేవలం కిందపడిపోయి, ఎందుకూ పనికిరానివాడిగా చేతులు భూమికి ఆన్చి, నోరు తెరిచి ఉండిపోయాడు. శాంతి పొందిన అగ్నిహోత్రంలా ఉన్నావాన్నయ్యా” అని కన్నీటితో ఎంతో దుఃఖించాడు.


అప్పుడు రాముడు “విభీషణా! నీకొక మాట చెబుతాను. నీ అన్నయ్య యుద్ధం చెయ్యడానికి బెంగపెట్టుకోలేదు, భయపడలేదు, ఉత్సాహంతో యుద్ధం చేసి పడిపోయాడు. ఒక వీరుడు ఎలా పడిపోవాలని కోరుకుంటాడో మీ అన్నయ్య కూడా అలానే పడిపోయాడు” అన్నాడు.


అప్పడు అంతఃపురం నుండి కొన్ని వేల అంతఃపుర కాంతలు పరిగెత్తుకుంటూ వచ్చి… “రావణా! నువ్వు వెళ్ళిపోయావు, నీతో పాటు మా అయిదోతనము వెళ్ళిపోయింది, భోగము వెళ్ళిపోయింది. ఇంత గొప్పవాడివి ఒక మనుష్యుడి చేతిలో మరణించావు” అన్నారు.


ఆ సమయంలోనే అక్కడికి మేలి ముసుగు తీసేసి పరిగెత్తుకుంటూ రావణుడి పట్టమహిషి అయిన మండోదరి వచ్చి, రావణుడిని కౌగలించుకొని… “ఇవ్వాళ నేను మేలి ముసుగు లేకుండా పరిగెత్తుకొచ్చానని కోపం తెచ్చుకోకు. నువ్వు దేవతలందరినీ ఓడించావు, ఎందరినో తరిమికొట్టావు, దుర్భేద్యమైన కాంచన లంకని నిర్మించావు, 10 తలలతో 

20 చేతులతో ప్రకాశించావు, గొప్ప తపస్సు చేసి చివరికి ఒక మనుష్యుడి చేతిలో మరణించావు. ఆ రోజు హనుమంతుడు ఈ సముద్రాన్ని దాటి… 'నీ పది తలకాయలు ఇప్పుడే గిల్లేస్తాను, కాని రాముడు నిన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు కనుక వదిలేస్తున్నాను' అని, లంకని కాల్చి వెళ్ళిపోయాడు. ఒక్కడే అలా వచ్చి లంకని నాశనం చేసి వెళ్ళిపోతే నీ మనస్సులో శంక కలగలేదు. నీ జీవితానికి ప్రమాదం వస్తుందని నువ్వు ఆలోచించలేదు. కోతులంటే చపల బుద్ధికి పెట్టింది పేరు, అలాంటి కొన్ని కోట్ల కోతుల్ని రాముడు వెంట పెట్టుకుని సముద్రానికి సేతువు కట్టించి దాటి వచ్చాడు, నీకు అప్పుడైనా అనుమానం రాలేదా. ఒక మనుష్యుడైన రాముడి చేతిలో చనిపోయావా” అని పక్కకి తిరిగి రాముడిని చూసింది.


రాముడిని చూడగానే మండోదరి ఇలా అన్నది… “ఈయన మనుష్యుడు కాదు, సనాతనమైన పరమాత్మ. నిన్ను నిగ్రహించడానికి వచ్చిన 

శ్రీ మహావిష్ణువు. దేవతలందరినీ వానర రూపాలు ధరింప చేసి, వాళ్ళని వెంట బెట్టుకుని, శంఖ చక్ర గదా పద్మములను పట్టుకున్న 

శ్రీ మహావిష్ణువు వచ్చాడు. రాముడిని ఇన్ని సార్లు చూసినా, 

నీకు వచ్చింది విష్ణువు అని ఎందుకు అర్ధం కాలేదు రావణా! నువ్వు రాముడి చేత సంహరింపబడ్డావని లోకం అనుకుంటుంది, నువ్వు ఎందువల్ల చనిపోయావో నాకు తెలుసు. ఒకప్పుడు నువ్వు తపస్సు చెయ్యాలనుకొని నీ ఇంద్రియాలని బలవంతంగా తొక్కి పెట్టావు. అప్పుడు నీ ఇంద్రియాలు నీ మీద పగబట్టాయి. అందుకని నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రియాలే నిన్ను చంపాయి.


ఒక్కసారి కామం పుట్టింది అనడానికి నీ విషయంలో ఆస్కారం లేదు. మహా సౌందర్యరాశులైన భార్యలు నీకు కొన్ని వేల మంది ఉన్నారు, వారితో నువ్వు ఎవరితో క్రీడించినా నీ కామము అదుపులో ఉంటుంది. ఎక్కడో అరణ్యం లో ఉన్న సీతమ్మయందు కామం పుట్టి ఆవిడని నువ్వు అనుభవించడం కాదు, నువ్వు, 

నీ రాజ్యము, నీ వారు భ్రష్టమవ్వడం కోసం నీకు ఆ కోరిక పుట్టింది. దుర్మతీ! నీకు సీతమ్మ ఎవరో అర్ధం కాలేదు, ఆవిడ రోహిణి కన్నా, అరుంధతి కన్నా గొప్పది. తన భర్తని అనుగమించి వచ్చిన ఇల్లాలిని ఒంటరిగా ఉన్నప్పుడు ఎత్తుకొచ్చావు, ఆ తల్లి తేజస్సు నిన్ను కాల్చింది. నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఆ తల్లిని తేవడం వల్ల నువ్వు పొందే సుఖం ఏమి లేదు, నాశనం అయిపోతావని చెప్పాను. నువ్వు చేసుకున్న పూర్వ పుణ్యముల వల్ల కాంచన లంకని అనుభవించావు, ఎన్నో సుఖాలు పొందావు, కాని సీతమ్మని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం వల్ల ఆ పాపాన్ని అనుభవించాల్సి వచ్చి ఈనాడు పడిపోయావు. విభీషణుడు పుణ్యాలు చేశాడు, సీతమ్మ ఎవరో తెలుసుకున్నాడు, ఆ పుణ్య ఫలం ఇవ్వాళ విభీషణుడికి అనుభవంలోకి వచ్చింది, బతికిపోయాడు.


రావణా! సీత నాకన్నా గొప్ప కులంలో పుట్టిందా, నాకన్నా గొప్ప రూపవతా, నాకన్నా గొప్ప దాక్షిణ్యం ఉన్నదా, సీత నాకన్నా ఎందులో గొప్పది? కాని నీ దురదృష్టం, నాకన్నా సీత నీకు గొప్పదిలా కనపడింది. నా తండ్రి దానవ రాజైన మయుడు, నా భర్త లోకములను గెలిచిన రావణుడు, నా కుమారుడు ఇంద్రుడిని జయించిన మేఘనాధుడు, నేనున్నది కాంచన లంకలో అని అహంకరించాను, కాని ఇది నిలబడలేదు, అబద్ధమయిపోయింది. ఇవ్వాళ నాకు కొడుకు లేడు, భర్త లేడు, రాజ్యం లేదు, బంధువులు లేరు, నీకు తలకొరివి పెట్టడానికి ఒక్క కొడుకూ లేడు. నువ్వు మహాపాతకం చెయ్యడం వల్ల 10 రోజులలో నా పరిస్థితి ఇలా అయిపోయింది. మహా పతివ్రత అయిన స్త్రీ ఏ ఇంటికన్నా వచ్చి కన్నీరు పెడితే, ఆ కన్నీరు కిందపడితే, ఆ ఇల్లు నాశనమయిపోతుంది” అని బాధపడింది. (ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, పతివ్రత అయిన వేరొకడి భార్య నేను చేసిన పని వల్ల ఏడవడం కాదు, నా భార్య నేను చేసిన పని వల్ల ఏడిచినా, ఆ పాపం వల్ల నేను నశించిపోతాను)


అప్పుడు రాముడు అన్నాడు… “ఆవిడ చాలా శోకించింది, ఆవిడని లోపలికి తీసుకువెళ్ళండి. రావణుడి కొడుకులందరూ చనిపోయారు కనుక, ఈ శరీరానికి చెయ్యవలసిన కార్యాన్ని విభీషణా నువ్వు చెయ్యి!” అన్నాడు.


అప్పుడు విభీషణుడు… “రామా! మీరు ఏమైనా చెప్పండి, వీడు బతికున్నంత కాలం వీడి జీవితంలో ధర్మం అన్న మాటే లేదు, బతికున్నంత కాలం పర స్త్రీల వెంట తిరిగాడు, ఇటువంటి వాడికి అంచేష్టి సంస్కారం ఏమిటి? ఆ శరీరాన్ని అలా వదిలేద్దాము” అన్నాడు.


అప్పుడు రాముడు… “విభీషణా! అవతలివాడు ఏ శరీరంతో ఇన్ని పాపాలు చేశాడో ఆ పాపాలన్నీ ఆ శరీరంతోనే వెళ్ళిపోయాయి. అందుకని ఇంక వైరం పెట్టుకోకూడదు. ఆ శరీరానికి సంస్కారం చెయ్యకపోతే వాడు ఉత్తమ గతులకి వెళ్ళడు. ఒకవేళ నువ్వు 'చెయ్యను' అంటే, నువ్వు నాకు స్నేహితుడివి కదా, స్నేహితుడి అన్నయ్య నాకూ అన్నయ్యే కదా, నువ్వు చెయ్యకపోతే ఆయనని అన్నగారిగా భావించి నేను సంస్కారం చేస్తాను” అన్నాడు.


అప్పుడు విభీషణుడు రావణుడికి అంచేష్టి సంస్కారం చేశాడు. 


ఆ తరువాత ఆకాశంలో ఉన్న దేవతలందరూ మెల్లగా ఒకరి తరువాత ఒకరు వెళ్ళిపోయారు.


అప్పుడు రాముడు “విభీషణుడికి సింహాసనం మీద అభిషేకం జరిగితే చూడాలని ఉంది లక్ష్మణా. సముద్రానికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి విభీషణుడికి పట్టాభిషేకం చెయ్యండి” అన్నాడు.


విభీషణుడికి అభిషేకం చేశాక రాముడు హనుమంతుడిని పిలిచి… “ఇవ్వాళ విభీషణుడు అభిషేకం జరిగి లంకకి రాజయ్యాడు కనుక ఆయన అనుమతి తీసుకొని లంకలోకి వెళ్ళి సీత దర్శనం చెయ్యి. నేను సుగ్రీవుడి సాయంతో, విభీషణుడి సాయంతో రావణుడిని సంహరించి లంకా పట్టణాన్ని స్వాధీనం చేసుకొని క్షేమంగా ఉన్నానని చెప్పు. విభీషణుడికి పట్టాభిషేకం అయిపోయిందని చెప్పు. అందుకని ఇవ్వాళ సీత నా మిత్రుడైన విభీషణుడి ఇంట్లో ఉంది కనుక బెంగపడవలసిన అవసరం లేదని చెప్పు” అన్నాడు.


హనుమంతుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళగా, సీతమ్మ హనుమంతుడిని చూసి తల తిప్పుకొని ఏదో ధ్యానం చేసుకుంటుంది. మళ్ళి ఓ సారి హనుమంతుడి వంక చూసి…  

“హనుమ! నువ్వు కదా” అంది.


అప్పుడు హనుమంతుడు…  

“సీతమ్మా! రాముడు సుగ్రీవుడిని, విభీషణుడిని తన పక్కన పెట్టుకుని, వాళ్ళ యొక్క సహాయంతో రావణుడిని సంహరించి లంకని తనదిగా చేసుకున్నాడు. ఇవ్వాళ విభీషణుడిని లంకా రాజ్యానికి రాజుగా చేశారు. ఇప్పుడు నువ్వు రాముడి మిత్రుడైన విభీషణుడి ప్రమదావనంలో ఉన్నావు, అందుచేత నువ్వు బెంగపడవలసిన పరిస్థితి లేదు. నీ శోకాన్ని విడిచిపెట్టు”అన్నాడు. 


అప్పుడు సీతమ్మ… “ఎంత మంచిమాట చెప్పావయ్యా హనుమా” అని చెప్పి ఒక్క నిమిషం అలా ఉండిపోయింది.


అప్పుడు హనుమంతుడు….  

“అదేమిటమ్మా ఏమి మాట్లాడవు?” అన్నాడు.


సీతమ్మ… “10 నెలల నుంచి ఈ మాట ఎప్పుడు వింటానా అని తపస్సు చేశాను కదా హనుమా. నువ్వు నిజంగా వచ్చి ఈ మాట చెప్పేటప్పటికి నా నోటి వెంట మాటరాలేదు. నువ్వు చెప్పిన మాటకి నేను చాలా ఆనందాన్ని పొందాను. కాబట్టి నేను నీకు ఏదో ఒక బహుమతి ఇవ్వాలి, కాని నేను ఆలోచన చేస్తే, నేను నీకు ఏమి ఇవ్వగలను. ఎంత బంగారం ఇచ్చినా, రత్నాలు ఇచ్చినా, మూడు లోకములని ఇచ్చినా సరిపోదు. ఇవ్వాళ నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీలేదు హనుమా. నువ్వు మధురాతి మధురంగా మాట్లాడతావు, నీకు అష్టాంగ యోగంతో కూడిన బుద్ధి ఉంది, వీర్యము, పరాక్రమము, తేజస్సు ఉంది. నిన్ను చూసి పొంగిపోతున్నానయ్యా” అంది.


అప్పుడు హనుమంతుడు… “అమ్మా! నువ్వు నా గురించి ఇన్ని మాటలు చెప్పి, నాకు ఇవ్వడానికి నీ దగ్గర గొప్ప వస్తువు లేదన్నావు కదా. నేనొక వరం అడుగుతాను ఇస్తావా తల్లీ” అని, “ఇంతకముందు వచ్చినప్పుడు శింశుపా వృక్షం మీద కూర్చుని చూశానమ్మా, ఈ రాక్షస స్త్రీలందరూ నీ గురించి ఎన్ని మాటలు మాట్లాడారు. నువ్వు బ్రతికుండగా నిన్ను వాటాలు వేసుకున్నారు. 'నిన్ను అనుమతించాను హనుమా' అని ఒక్కమాట అను, నేను వాళ్ళని గోళ్ళతో గిల్లేస్తాను, మోకాళ్ళతో గుద్దేస్తాను, కొంతమందికి పళ్ళు పీకేస్తాను, కొంతమంది జుట్టు పీకేస్తాను, కొంతమందిని గుద్దేస్తాను” అన్నాడు.


అప్పుడు సీతమ్మ… “హనుమా! వాళ్ళు దాసీజనం, ప్రభువు ఎలా చెయ్యమంటే వాళ్ళు అలా చేస్తారు. దోషం వాళ్ళది కాదు, దోషం ప్రభువుది. ఏ దోషం వాళ్ళయందు ఉందని వాళ్ళని చంపేస్తావు. నీ ప్రభువు చెబితే నువ్వు చేసినట్టు, వాళ్ళ ప్రభువు చెప్పినట్టు వాళ్ళు చేశారు. ప్రభుభక్తి విషయంలో నువ్వు ఎటువంటివాడివో వాళ్ళు కూడా అటువంటివాళ్ళే. గతంలో నేను చేసిన పాపం ఏదో ఉంది, ఆ పాపానికి ఫలితంగా ఇన్ని కష్టాలు పడ్డాను.

పూర్వకాలంలో ఒక వేటగాడు అడవిలో వెళ్ళిపోతుంటే ఒక పెద్ద పులి అతనిని తరుముకొచ్చింది. అప్పుడా వేటగాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు ఎక్కాడు. తీరా చెట్టు మీదకి ఎక్కి చూస్తే అక్కడ ఒక భల్లూకం పడుకొని ఉంది. ఆ వేటగాడు పైకి వెళితే భల్లూకం తినేస్తుంది, కిందకి వెళితే పులి తినేస్తుంది.

ఈ స్థితిలో పులి భల్లూకంతో… 'వాడు నరుడు, మనిద్దరమూ క్రూర జంతువులము, మనిద్దరిది ఒక జాతి, వాడిది ఒక జాతి, కనుక వాడిని కిందకి తోసేయ్యి' అంది.


అప్పుడా భల్లూకం 'వాడు తెలిసో తెలియకో ఆర్తితో పరుగు పరుగున నేనున్న చెట్టు ఎక్కాడు, అందుకని వాడు నన్ను ‘శరణాగతి’ చేసినట్టు. వాడు నాకు అతిథి. కనుక నేను వాడిని తొయ్యను, నేను వాడికి ఆతిధ్యం ఇస్తున్నాను' అంది.


ఆ పెద్ద పులి అలా చెట్టు కిందనే ఉంది. కొంతసేపయ్యాక భల్లూకం వేటగాడితో… 'నాకూ పెద్ద పులి చేత ప్రమాదమే. నాకు నిద్రొస్తోంది, నిద్రొస్తే జారి కిందపడిపోతాను. అందుకని నేను నీ ఒడిలో తల పెట్టుకుని పడుకుంటాను, కొంచెం పడిపోకుండా చూడు' అన్నది. 


అప్పుడా వేటగాడు… 'తప్పకుండా పడుకో!' అన్నాడు.


ఆ భల్లూకం పడుకున్నాక పెద్ద పులి అన్నది… 'దానికి నిద్రలేచాక ఆకలి వేస్తుంది. అది సహజంగా క్రూర జంతువు కనుక నిన్ను చంపేసి తింటుంది. అందుకని ఇదే అదును, నువ్వు ఆ భల్లూకాన్ని కిందకి తోసేయ్యి. అప్పుడు నేను 

ఆ భల్లూకాన్ని తిని వెళ్ళిపోతాను, తరువాత నువ్వు కూడా నీదారిన నీవు వెళ్ళిపోవచ్చు' అంది.


ఈ మాట వినగానే ఆ వేటగాడు నిద్రపోతున్న భల్లూకాన్ని కిందకి తోసేశాడు. 


ఆ భల్లూకం కిందకి పడిపోతూ పడిపోతూ ఒక చెట్టుకొమ్మని పట్టుకొని పైకి ఎక్కింది. 


అప్పుడా పులి… 'చూశావా, నిద్రపోతున్న నిన్ను వాడు కిందకి తోసేశాడు, ఎప్పటికైనా మనిషి మనిషే మనం మనమే. అందుకని వాడిని కిందకి తోసేయ్యి' అంది.


అప్పుడా భల్లూకం… 'అపకారం చేసినవాడే అయినా, వాడు నా ఇంటికి వచ్చాడు కాబట్టి, అపకారికి కూడా ప్రయత్నపూర్వకంగా అపకారము చెయ్యకూడదు కాబట్టి నేను ఆ వేటగాడిని తొయ్యను' అని ఆ భల్లూకం చెప్పింది. 


నేను మనుష్య స్త్రీగా పుట్టి, క్షత్రియ కాంతనై, రాముడికి ఇల్లాలినై ఆ రాక్షస స్త్రీలని చంపిస్తే నేను ఉత్తమ కులాంగనను అవుతానా. చెడ్డగా ఎవడున్నాడో, ఎవడు పాడయిపోయాడో వాడి మీద దయ ఉండాలి. ఈ రాక్షస స్త్రీలు చెయ్యకూడని పనులు చేశారు, వీళ్ళ మీద కదా నేను దయతో ఉండాలి. వీళ్ళందరికీ నా రక్ష!” అన్నది.


“అమ్మా! ఈ మాట చెప్పడం నీకే చెల్లింది తల్లీ” అని సీతమ్మతో అని, 


అక్కడినుంచి బయలుదేరి రాముడి దగ్గరికి వెళ్ళి… “రామా! సీతమ్మ  

నీ దర్శనం చెయ్యాలని అనుకుంటోంది” అని రాముడితో చెప్పాడు.


హనుమంతుడు చెప్పిన మాట విన్న రాముడు కొంచెంసేపు ఆలోచించాడు, ఆ సమయంలో ఆయన కళ్ళల్లో నీళ్ళు నిండాయి. చాలా శోకం పొందినవాడిలా అయ్యి, ఒకసారి భూమివంక చూసి, తన పక్కన ఉన్న విభీషణుడిని పిలిచి… “విభీషణా! నువ్వు లోపలికి వెళ్ళి, సీతకి నేను చెప్పానని చెప్పి తలస్నానం చేయించి, పట్టు వస్త్రం కట్టించి, అన్ని అలంకారములు చేసి నా దగ్గరికి ప్రవేశపెట్టు” అన్నాడు. 


రాముడి మాటలు విన్న విభీషణుడు ఆశ్చర్యపోయి సీతమ్మ దగ్గరికి వెళ్ళి… “సీతమ్మా! నువ్వు తల స్నానం చేసి, పట్టుబట్ట కట్టుకొని, ఒంటినిండా అలంకారాలు చేసుకుని వస్తే రాముడు నిన్ను చూడాలని అనుకుంటున్నాడు” అన్నాడు.


అపుడు సీతమ్మ అన్నది… “నేను ఎలా ఉన్నానో అలానే వచ్చి రామదర్శనం చేసుకోవాలని నా మనస్సు కోరుకుంటోంది” అంది.


విభీషణుడు అన్నాడు… “అమ్మా! అది రామ ఆజ్ఞ. ప్రభువు ఎలా చెప్పాడో అలా చెయ్యడం మంచిది. అంతఃపుర కాంతలు నీకు తలస్నానం చేయిస్తారు, నువ్వు దివ్యాంగరాదములను అలదుకొని, మంచి భూషణములను వేసుకొని, రాముడికి దర్శనం ఇవ్వమ్మా” అన్నాడు.```


       *

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🌞ఆదివారం 6 జూలై 2025🌞*

``

          *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది.

``

      *వాల్మీకి రామాయణం*                    

            *90వ భాగం*

```

ఇంద్రజిత్ మరణించాడన్న వార్త విన్న రావణుడు కూర్చున్న తల్పం మీదనుండి కిందపడి దీర్ఘమూర్చని పొందాడు. 


తరువాత ఆయన అన్నాడు… 

“నా కుమారుడు ఇంద్రజిత్ ఎవరి చేత సంహరింపబడనివాడు, ఇవ్వాళ ఇంత దారుణంగా మరణించాడు. ఇంక నాకీ జీవితం ఎందుకు. అసలు ఇన్ని ఉపద్రవాలకి కారణం అయిన సీతని సంహరించేస్తాను” అని ఒక పెద్ద కత్తి పట్టుకుని బయలుదేరాడు. 


ఆగ్రహంతో తన వైపుకి వస్తున్న రావణుడిని చూసి సీతమ్మ ఒణికిపోయింది. 


రావణుడు సీతమ్మని చంపుదామనుకునేసరికి మహాపార్షుడు అక్కడికి వచ్చి అన్నాడు… “ఇంత బతుకు బతికి, ఇంత చదువు చదివి, ఇంతమందిని ఓడించి, ఇంతమందీ చచ్చిపోయాక ఒక ఆడదాన్ని కూడా రావణుడు చంపాడన్న అపకీర్తిని మూటకట్టుకుంటావా రావణా. నువ్వు మగాడివైతే యుద్ధం చేసి రాముడిని చంపు, అంతేకాని ఆడదానిమీద ఎందుకు నీ ప్రతాపం” అన్నాడు.


అప్పుడు రావణుడు… “రేపు అమావాస్య, రేపు రాముడితో యుద్ధం చేస్తాను” అని అంతఃపురానికి వచ్చేశాడు.


మరునాడు రావణుడు విరూపాక్షుడు, మహోదరుడు, మహాపార్షుడు మొదలైన రాక్షస వీరులతో యుద్ధానికి వచ్చాడు. 

ఆ యుద్ధంలో విరూపాక్షుడిని, మహోదరుడిని సుగ్రీవుడు చంపాడు, మహాపార్షుడిని అంగదుడు చంపాడు.


అప్పుడు రాముడు మండలాకారంగా తన ధనుస్సుని పట్టుకొని బాణాలు వేస్తుంటే, లోపలినుంచి కోరికలు పుట్టిస్తున్న జీవాత్మ ఎలా కనపడదో, అలా బాణపు దెబ్బలు తగులుతున్నాయి, ఏనుగుల తొండాలు తెగిపోతున్నాయి, గుర్రాలు కాళ్ళు తెగి పడిపోతున్నాయి, లక్షల రాక్షస సైన్యం పడిపోతోంది కాని రాముడు మాత్రం కనపడడం లేదు. 


ఆ సమయంలో రాముడు అగ్ని చక్రం తిరిగినట్టు తిరుగుతూ, మండలాకారంగా(వృత్తాకారంలో) ధనుస్సుని పట్టుకుని తిరుగుతూ కొన్ని కోట్ల రాక్షసులని కొట్టాడు.


'తన ఇంటి గుట్టుని రాముడికి చెప్పి ఇంతమంది రాక్షసుల మరణానికి కారణమైనవాడు ఆ విభీషణుడు' అనుకొని, రావణుడు శక్తి అనే అస్త్రాన్ని విభీషణుడి మీదకి ప్రయోగించబోతుండగా, లక్ష్మణుడు బాణములతో ఆయన చేతిని కొట్టాడు. 


ఆగ్రహించిన రావణుడు ఆ శక్తిని లక్ష్మణుడి మీద ప్రయోగించాడు, అప్పుడా శక్తి లక్ష్మణుడి వక్షస్థలం నుండి దూసుకుపోయింది. వెంటనే ఆయన మూర్చపోయి కిందపడి పోయాడు. 


అప్పుడు హనుమంతుడు లక్ష్మణుడిని ఎత్తి తీసుకెళ్ళి రాముడి దగ్గర పెట్టాడు.


అప్పుడు రాముడన్నాడు…

“నా చేతిలోనుంచి ధనుస్సు జారిపోతోంది, మంత్రములు జ్ఞాపకానికి రావడం లేదు. ఏ దేశానికి వెళ్ళినా భార్య దొరుకుతుంది, ఏ దేశానికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు, కాని తోడపుట్టినవాడు మాత్రం జీవితంలో ఒక్కసారే వస్తాడు” అని బాధపడ్డాడు.


అప్పుడు హనుమంతుడు… “రామా! నువ్వు బెంగపెట్టుకోకు, లక్ష్మణుడిని ఎలా బతికించుకోవాలో నాకు తెలుసు” అని మళ్ళి ఆకాశంలోకి ఎగిరి, హిమాలయ పర్వతాలని చేరుకొని అక్కడున్న ఓషధ పర్వతాన్ని తీసుకొచ్చాడు. 


అప్పుడు సుషేణుడు ఆ ఓషదులని లక్ష్మణుడి ముక్కులో పిండాడు, ఆ ఓషదుల వాసన తగలగానే లక్ష్మణుడు మళ్ళి పైకి లేచాడు.


“ఇంక నేను యుద్ధం చేస్తాను ఈ రావణుడితో” అని రాముడు ముందుకి బయలుదేరాడు. 


ఆ సమయంలో ఆ యుద్ధాన్ని ఆకాశంలో నుండి చూస్తున్న దేవతలు 'దుర్మార్గుడు, దుష్టుడు అయిన రావణుడు రథంలో ఉండి యుద్ధం చేస్తున్నాడు, మహానుభావుడైన రాముడు భూమి మీద నుండి యుద్ధం చేస్తున్నాడు' అని అనుకున్నారు. 


అప్పుడు ఇంద్రుడు తన సారధి అయిన మాతలిని రాముడికి సహాయం చెయ్యమని చెప్పి తన రథం ఇచ్చి పంపించాడు.


అప్పుడా మాతలి రాముడితో అన్నాడు… “రామా! ఇంద్రుడు ఈ రథాన్ని పంపించాడు. దీనికి ఆకుపచ్చని గుర్రాలు కట్టి ఉంటాయి. పూర్తిగా కాల్చిన బంగారంతో ఈ రథం నిర్మింపబడినది. ఇందులో అక్షయబాణ తూణీరాలు, ఇంద్రుడు పట్టుకునే గొప్ప ధనుస్సు ఉన్నాయి. మీరు ఈ రథాన్ని ఎక్కండి, నేను మీకు సారధ్యం చేస్తాను. శ్రీ మహావిష్ణువుని గరుడుడు వహించినట్టు నేను మీకు సారధ్యం చేస్తాను. మీకు ఇవ్వమని చెప్పి ఇంద్రుడు ఈ శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు, మీరు దీన్ని స్వీకరించండి” అన్నాడు.


రాముడు ఆ రథానికి నమస్కరించి దానిలోకి ఎక్కాడు. అప్పుడు రాముడికి రావణుడికి చండప్రచండమైన యుద్ధం జరిగింది. 


రాముడి బాణాల వేగాన్ని తట్టుకోలేక ఆ రావణుడు వెనక్కి వెళ్ళాడు. వాళ్ళిద్దరికీ యుద్ధం జరుగుతుండగా ఆకాశం అంతా చీకటిగా అయిపోయింది. పగటి వేళలో వాళ్ళిద్దరి బాణ పరంపర ఆకాశాన్ని కప్పేసింది. అప్పుడు రాముడన్నాడు “ఇంక మీరెవ్వరూ యుద్ధం చెయ్యకండి, అలా నిలబడి చూడండి. రావణుడో రాముడో తేలిపోవాలి!” అన్నాడు.


అటుపక్క రాక్షసులు, ఇటుపక్క వానరాలు నిలబడిపోయి రామ-రావణ యుద్ధాన్ని చూస్తున్నాయి. రావణుడు 20 చేతులతో ఆయుధాలని రాముడి మీదకి ప్రయోగిస్తున్నాడు. ఆ సమయంలో రావణుడు శక్తి అనే అస్తాన్ని రాముడి మీదకి విడిచిపెట్టాడు. అప్పుడు రాముడనుకున్నాడు… 'ఈ రథం ఎక్కాక, లక్ష్మణుడు బతికాక, నాకు విపరీతమైన ఆనందం కలుగుతోంది. అన్ని అస్త్ర-శస్త్రాలు నాకు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఉత్సాహం పొటమరిస్తోంది' అనుకొని, ఇంద్రుడు ఇచ్చిన శక్తిని ప్రయోగించాడు. ఇద్దరి యొక్క శక్తులు ఆకాశంలో కొట్టుకొని నిర్వీర్యం అయ్యి కిందపడిపోయాయి. ఆ తరువాత రాముడు వేసిన బాణాలని రావణుడు తట్టుకోలేకపోయాడు, ఆయన చేతిలోని ధనుస్సు విరిగిపోయింది. 


అటువంటి సమయంలో రావణుడి సారధి ఆయన రథాన్ని యుద్ధభూమి నుండి దూరంగా తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు రావణుడు ఆ సారధితో… “ఛీ నీచుడా! నా జీవితంలో లేదు ఇటువంటి అప్రతిష్ట. యుద్ధభూమిలో ఉండగా నా తలలు తెగిపోయినా పరవాలేదు, కాని నువ్వు రథాన్ని చాటుకి తీసుకొచ్చి దాచావు. నువ్వు శత్రువుల దగ్గర లంచం తీసుకున్నావు కనుకనే ఇలాంటి పని చేశావు, నిజం చెప్పు?” అన్నాడు.


అప్పుడా సారధి… “మీ దగ్గర ఇంత కాలం పని చేశాను. ఇప్పుడు ఒకరి దగ్గర లంచం తీసుకొని మిమ్మల్ని అవమానించవలసిన అగత్యం నాకు లేదు. నేను శాస్త్రం తెలియనివాడిని కాదు, మర్యాద తెలియనివాడిని కాదు, రధికుడు రథంలో ఉండగా ఎలా నడపాలో తెలియని భ్రష్టుడిని కాదు. నేను ఎంతో కాలంగా మీ ఉప్పు తిన్నాను, మీయందు కృతజ్ఞుడనై ఉన్నాను. ద్వంద యుద్ధం జరుగుతున్నప్పుడు సమయోచితంగా అవసరాన్ని బట్టి రథాన్ని దగ్గరికి తీసుకెళ్ళాలి, దూరంగా కూడా తీసుకెళ్ళాలి, గుర్రాలు అలసిపోతున్నాయేమో చూసుకోవాలి, వెనుకన ఉన్న రథియొక్క పరిస్థితిని గమనించుకోవాలి. రాముడి బాణపు వేడి చేత గుర్రాలు శోషించిపోయాయి, తిరిగి ఆయుధాన్ని ప్రయోగించలేని నీరస స్థితిని మీరు పొందుతున్నారు. అప్పుడు రథికుడిని రక్షించుకోవలసిన బాధ్యత సారధికి ఉంది, అందుకని నేను రథాన్ని వెనక్కి తెచ్చాను. అంతేకాని ఒకరి దగ్గర లంచం తీసుకొని మిమ్మల్ని తేవలసిన అవసరం నాకు లేదు, మీ సేవలో ధన్యుడను అవ్వడానికి నీతికి కట్టుబడిన సారధిని నేను” అన్నాడు.


అప్పుడు రావణుడు… “నేను నిన్ను ఎన్ని మాటలు అన్ననురా సారధీ. నువ్వు ఉత్తమ సేవకుడివి” అని చెప్పి, తన చేతికున్న స్వర్ణ కంకణాన్ని తీసి సారధికి ఇచ్చాడు.


ఈ సమయంలోనే లంకా పట్టణంలో ఉన్న ప్రజలు ఒకరితో ఒకరు… “ఆ శూర్పణఖ జుట్టు తెల్లబడిపోయి వృద్ధురాలు అయిపోయింది, ఒళ్ళు ముడతలు పడిపోయింది, భయంకరమైన, వికృతమైన స్వరూపంతో ఉంటుంది, జారిపోయిన కడుపు ఉన్నది, కఠినమైన మాట కలిగినటువంటిది. అటువంటి శూర్పణఖ మన్మదుడితో సమానమైన ఆకృతి కలిగినవాడిని, అంత మధురముగా మాట్లాడగలిగినవాడిని, అటువంటి సౌందర్య రాశిని, చక్కటి నడువడి కలిగినవాడిని, సర్వకాలములయందు ధర్మమును అనుష్టించేవాడు అయిన రాముడిని ఏ ముఖం పెట్టుకొని కామించింది? రాముడిని పొందాలన్న కోరిక ఎలా కలిగింది? ఆ రాముడు వైముఖ్యాన్ని ప్రదర్శిస్తే, కడుపులో కక్ష పెంచుకుని సీతాపహరణానికి దారితీసేటట్టుగా రావణుడి మనస్సు వ్యగ్రత పొందేటట్టుగా ఎలా మాట్లడగలిగింది? రావణుడు ఎంత మూర్ఖుడు, రాముడు అరణ్యంలో 14,000 మంది రాక్షసులని, ఖర-దూషణులని సంహరించాడు. అలాంటివాడితో సంధి చేసుకుందాము అన్న ఆలోచన లేకుండా శూర్పణఖ మాటలు విని సీతని అపహరించడానికి వెళ్ళాడు.


పోనీ అప్పటికీ రాముడు అంత పరాక్రమము ఉన్నవాడని రావణుడు తెలుసుకోలేకపోయాడు అని అనుకుందాము. కాని రాజ్యభ్రష్టుడై అన్నగారి చేత తరమబడి, ఋష్యమూక పర్వత శిఖరముల మీద కూర్చున్న సుగ్రీవుడిని రక్షించడం కోసమని ఆయనతో స్నేహాన్ని చేసుకొని, వాలిని ఒక్క బాణంతో సంహరించి, చేసుకున్న స్నేహానికి, ఒప్పందానికి నిలబడి సుగ్రీవుడిని రాజ్యమునందు ప్రతిష్టించినప్పుడైనా రావణుడి కళ్ళుతెరుచుకోలేదా.


పోని అప్పుడు కూడా తెలుసుకోలేకపోయాడు అని అనుకుందాము. కాని విభీషణుడు ధర్మబద్ధమైన మాట చెప్పాడు 

'అన్నయ్యా, నువ్వు రాముడిని నిగ్రహించలేవు, లంక అంతా నాశనమయిపోతుంది. నువ్వు చేసినది పాపపు నడువడితో కూడిన పని. నా మాట విని సీతమ్మని తీసుకెళ్ళి రాముడికి ఇచెయ్యి' అని చెప్పాడు. విభీషణుడి మాటలు కాని రావణుడు విని ఉంటే ఇవ్వాళ లంకా పట్టణానికి ఇంతటి చేటుకాలం దాపురించేది కాదు. తోడపుట్టినవాడైన కుంభకర్ణుడు రాముడి చేతిలో చనిపోయాడు, తన కుమారులైన నరాంతకుడు, అతికాయుడు మొదలైన వారందరూ మరణించారు, మహోదర, మహాపార్షులు మొదలైనవారు మరణించారు, ఆఖరికి ఇంద్రజిత్ కూడా లక్ష్మణుడి చేతిలో మరణించాడు. ఇంతమంది చనిపోయాక కూడా వచ్చినవాడు సామాన్య నరుడు కాదన్న ఆలోచన రావణుడికి రావట్లేదే? ఒకానొకసారి దేవతలందరూ కూడా రావణుడు చేస్తున్న ఆగడములను భరించలేక అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి 'అయ్యా! రావణుడు చేస్తున్న ఆగడాలు మేము భరించలేక పోతున్నాము, నరవానరముల చేతిలో తప్ప వాడికి ఎవరి చేతిలో చావు లేదు. ఇవ్వాళ వాడి ముందుకెళ్ళి నిలబడగలిగే ధైర్యం ఎవరికీ లేదు. సముద్రం కూడా కెరటాలతో వాడి ముందు నిలబడడానికి భయపడుతుంది, సూర్యుడు గట్టిగా ప్రకాశించడం లేదు, అలా దిక్పాలకులని కూడా శాసించగలిగే స్థితిలో ఉన్నాడు. వాడి చేతిలో లోకములన్నీ పీడింపబడుతున్నాయి, మేము ఎలా జీవించాలి' అని అడిగారు. 


అప్పుడు బ్రహ్మగారు 'నేను ఇవ్వాల్టి నుంచి ఒక కట్టుబాటు చేస్తున్నాను. ఈ రాక్షసులు మూడు లోకములలోనూ తిరుగుతూ ఉంటారు, ఒక చోట ఉండరు, దానివల్ల మీకు కొంత ఉపశాంతి కలుగుతుంది' అని అన్నారు. 


దానివల్ల ఆ దేవతలు పూర్తి ఉపశాంతిని పొందకపోవడం చేత శివుడి కోసం తపస్సు చేశారు. త్రిపురములను తన కంటి మంట చేత నశింపచేసినవాడైన పరమశివుడు ఆ దేవతలయందు ప్రీతి చెంది, వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యి 'ఇంత తపస్సు కలిగిన రావణుడు మరణించడానికి కావలసిన విధంగా, సీత అన్న పేరుతో అమ్మవారు ఉదయించబోతోంది' అని ఆరోజున శివుడు దేవతలకి వరం ఇచ్చాడు. 


అందుచేత రావణుడు అపహరించి తీసుకొచ్చిన ఆ మైథిలి సాక్షాత్తుగా రావణుడి ప్రాణములను తీసుకోడానికి, ఈ లంకా పట్టణాన్ని సర్వనాశనం చెయ్యడానికి, రాక్షసులందరినీ పరిమార్చడానికి కాళ రాత్రిలా వచ్చింది. ఈ విషయాన్ని రావణుడు తెలుసుకోలేక రాముడి మీదకి యుద్ధానికి వెళుతున్నాడు” అని ఆ లంకా పట్టణంలోని ప్రజలు చెప్పుకుంటున్నారు. 


ఇటుపక్కన రాముడు అలసిపోయినవాడై ‘ఈ రావణుడిని అసలు ఎలా సంహరించడం?' అని ఆలోచిస్తుండగా, ఆ సమయంలో దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, ఋషులు మొదలైనవారందరూ ఆకాశంలో నిలబడ్డారు. అందరితోపాటుగా వారిలోకి గబగబా అగస్త్య మహర్షి వచ్చి “రామా! రామా! ఇప్పుడు నేను నీకు ఆదిత్య హృదయం ఉపదేశం చేస్తున్నాను, దీనిని నువ్వు స్వీకరించు. ఇది కాని నువ్వు పొందావా, ఇక నీకు ఏ విధమైన అలసట ఉండదు. ఈ పరమ మంగళమైన ఆదిత్య హృదయాన్ని నీకు భయం కలిగినప్పుడు కాని, అరణ్యంలో ఉన్నప్పుడు కాని చదువుకో, నీకు రక్ష చేస్తుంది” అని చెప్పి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు.

```

*“తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం*

*రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం*

*దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం*

*ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః*```


అగస్త్య ఉవాచ:```

*రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం*

*యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి*

*ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం*

*జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం*

*సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం*

*చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం*

*రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం*

*పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం*

*సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః*

*ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః*

*ఏశ బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః*

*మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః*

*పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః*

*వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః*

*ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్*

*సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః*

*హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్*

*తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండక అంషుమాన్*

*హిరణ్యగర్భహ్ శిశిరస్తపనో భాస్కరో రవిః*

*అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనహ్*

*వ్యోమనాథ స్తమోభెదీ ఋగ్ యజుస్సామ పారగః*

*ఘన వృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః*

*ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః*

*కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః*

*నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః*

*తెజసామపి తేజస్వీ* *ద్వాదశాత్మన్నమోస్తుతే*

*నమః పూర్వాయ గిరయే* *పశ్చిమాయాద్రయె నమః*

*జ్యోతిర్గణాణాం పతయే* *దినధిపతయే నమః*

*జయాయ జయభద్రాయ* *హర్యశ్వాయ నమో నమః*

*నమో నమస్సహస్రాంశో* *ఆదిత్యాయ నమో నమః*

*నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః*

*నమః పద్మ ప్రబోధాయ ప్రచండాయ నమో నమః*

*బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే*

*భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషె నమః*

*తమొఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనె*

*కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః*

*తప్త చామీక రాభాయ హరయే విష్వకర్మణే*

*నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే*

*నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః*

*పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః*

*ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః*

*ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం*

*వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ*

*యాని కృత్యాని లోకేషు సర్వేషు పరమ ప్రభుః*✍️

*ఏనమాపత్సు కృత్ శ్రేషు కాంతారేషు భయేషు చ*

*కీర్తయన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవః*

*పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం*

*ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి*

*అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి*

*ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం*

*ఏతత్ శృత్వా మహాతెజా నష్టశొకొభవత్తదా*

*ధారయామాస సుప్రీతొ రాఘవహ్ ప్రయతాత్మవాన్*

*ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్*

*త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్*

*రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్*

*సర్వ యత్నేన మహతా వధె తస్య ధృతోభవత్*

*అథ రవి రవదన్నిరీక్ష్య రామం*

*ముదితమనాః పరమం* *ప్రహృష్యమానః*

*నిశిచరపతి సంక్షయం విదిత్వా*

*సురగణమధ్యగతో వచస్త్వరేతి*

```

1 నుండి 2 శ్లోకాలు: అగస్త్యుడు శ్రీరాముడికి వద్ద కు వచ్చుట.


3 నుండి 5 శ్లోకాలు : ఆదిత్య హృదయ పారాయణ వైశిష్టత చెప్పబడింది.


6 నుండి 15 శ్లోకాలు : సూర్యుడంటే బయటకు వ్యక్త మవుతున్న లోపలి ఆత్మ స్వరూపమని, బాహ్యరూపము అంతః స్వరూపము ఒక్కటే.


16 నుండి 20 శ్లోకాలు : మంత్ర జపం

21 నుండి 24 శ్లోకాలు : సూర్యుడు గురించి శ్లోక మంత్రాలు.


25 నుండి 30 శ్లోకాలు : పారాయణ వల్ల కలిగే ఫలం, పారాయణ చేయ వలసిన విధానం, సూర్యభగవానుడు 

శ్రీ రాముడు విజయాన్ని పొందేటట్లు అశీర్వదించడం.


అగస్త్యుడు అన్నాడు “ఈ ఆదిత్య హృదయాన్ని చదువు, నువ్వు నీ సర్వ శత్రువులని జయిస్తావు, నీ శత్రువులని దునుమాడేస్తావు, నీ కోరికలన్నీ సిద్ధిస్తాయి. రావణుడు నీ చేతిలో నిహతుడు అవుతాడు” అన్నాడు.


రాముడు ఆ ఆదిత్య హృదయాన్ని మూడు సార్లు చదివాక అగస్త్యుడు వెళ్ళిపోయాడు.```


        *రేపు…91వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *

ధనవంతులైన అంధులు

 ధనవంతులైన అంధులు  


పరమాచార్యు స్వామివారు తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని పాపనాశంలో మకాం చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి చాలామంది వచ్చారు. చెన్నైకి చెందిన ఒక ధనవంతుడు స్వామివారు ఎక్కడ మకాం చేస్తే ,అక్కడికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవడం అలవాటుగా చేసుకున్నాడు. ఇప్పుడు పాపనాశానికి కూడా స్వామివారి ఆశీస్సులు పొందేందుకు వచ్చాడు.


స్వామివారు మకాంచేసిన ప్రాంతం బయట అంధ దంపతులు ఒకరు, కళ్ళు లేని బిడ్డతో కలిసి భిక్షాటన చేస్తూ కూర్చున్నారు. ఆ ధనవంతుడు, వారు భిక్ష అడిగినందుకు కోపంతో వారిని దుర్భాషలాడాడు. అంతేకాక స్వామివారి ఆశీస్సులకోశం లోపలకు వెడుతూ వారిని తన్నాడు కూడా.


స్వామివారి దర్శనం కోసం చాలా మంది ఉన్నారు. స్వామివారు ఆ ధనవంతుణ్ణి పట్టించుకోకుండా అందరికీ ప్రసాదం ఇచ్చేదాకా ఎదురుచూసేలాగా చేశారు. ఆ ధనవంతుడు స్వామివారి ముందు పళ్ళు, ఇతర వస్తువులుంచి నమస్కరించాగనే, స్వామివారు చాలా కోపంతో బయట ఉన్న భిక్షకులతో ప్రవర్తించిన తీరును ప్రశ్నించారు. “నేను ఏమీ ఇవ్వను అని ఒక్క మాట చెబితే సరిపోయేది. కానీ నీవు వారిని దుర్బాషలాడడమే కాకుండా ఆ గుడ్డివారిని తన్నావు. నీవు చేసిన ఈ పాపానికి నిష్కృతి లేదు" చెప్పారు స్వామివారు. 


ఆ ధనవంతుడు కన్నీళ్లతో స్వామివారికి సాష్టాంగం చేసి, క్షమాపణలు కోరుతూ, “నేను చాలా పెద్ద అపచారం చేశాను, నన్ను మన్నించి రక్షించండి” అని వేడుకున్నాడు. 


వెంటనే స్వామివారు కరుణతో, మృదుస్వరంతో “ఇక్కడే ఉన్న పాపవినేశ్వర స్వామిని సేవించి పూజించు. నీ పాపానికి పరిహారం పొందు" అని చెప్పారు. ఆ రోజు రాత్రి కలలో అతనికి స్వామివారు పాపవినేశ్వరునిగా దర్శనమిచ్చి, "ఆ అంధ కుటుంబానికి నీ వంతుగా సాధ్యమైనంత సహాయం చెయ్ – అదే నీకు మోక్షాన్ని ఇస్తుంది" అని చెప్పారు.


తర్వాత ఉదయం ఆ ధనవంతుడు వెళ్లి, ఆ అంధ కుటుంబం చేతులు పట్టుకుని రోదించాడు. "నేను మహా పాపం చేశాను. మీరు ముగ్గురికీ చూపు వచ్చేందుకు శస్త్రచికిత్స చేయిస్తాను. నన్ను ఈ పని చేయమని సాక్షాత్తు ఆ పాపవినేశ్వరుడే ఆదేశించాడు” అంటూ అప్పటికప్పుడు వారికి 20 లక్షల రూపాయల చెక్కును ఇచ్చి తిరస్కరించకండి అని బ్రతిమలాడాడు.


తర్వాత వారిని చెన్నైకి తీసుకెళ్లి తన ఇంట్లోనే ఉంచుకుని, శస్త్రచికిత్స చేయించాడు. స్వామివారి అనుగ్రహం వల్ల వారికి చూపు లభించింది. ఇప్పుడు వారు ఈజిప్టులో ఉన్నారు. స్వామివారి అపార కరుణ వల్ల ఒక అంధ, పేద కుటుంబం, చూపును పొంది ధనవంతులుగా మారిపోయారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

పుత్రుడు పుత్రునిగా

 పుత్రుడు పుత్రునిగా ఎప్పుడు మారతాడు?

జవాబు

శ్లో॥ జీవతో ర్వాక్యకరణా త్ప్రత్యబ్దం భూరి భోజనాత్ ! గయాయాం పిండదానాశ్చ త్రిభిః పుత్రస్య పుత్రతా

ప్రతిపదార్థం:

* జీవతోః - జీవించియున్న (తల్లిదండ్రుల)

* వాక్యకరణాత్ - మాటలను పాటించడం వలన

* ప్రత్యబ్దం - ప్రతి సంవత్సరం

* భూరి భోజనాత్ - పెద్ద ఎత్తున భోజనం పెట్టడం (శ్రాద్ధ కర్మలో భాగంగా)

* గయాయాం - గయలో

* పిండదానాత్ చ - పిండప్రదానం చేయడం వలన కూడా

* త్రిభిః - ఈ మూడు (కార్యాల) ద్వారా

* పుత్రస్య - పుత్రుడికి

* పుత్రతా - పుత్రత్వం (పుత్రుడు అనే గుర్తింపు /ధర్మంవస్తుంది.

తాత్పర్యం:

తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడు వారి మాటలను గౌరవించి, వాటిని అనుసరించడం, ప్రతి సంవత్సరం వారి జ్ఞాపకార్థం శ్రాద్ధ కర్మలు ఆచరించి, పెద్ద ఎత్తున బంధువులకు, పేదలకు అన్నదానం చేయడం, మరియు పితృదేవతలకు మోక్ష ప్రాప్తి కోసం గయ క్షేత్రంలో పిండ ప్రదానం చేయడం - ఈ మూడు పనులను ఒక పుత్రుడు నిర్వహించినప్పుడు, అతడు తన పుత్రధర్మాన్ని పూర్తిగా నెరవేర్చినవాడు అవుతాడు.

విశేషాలు:

* ఈ శ్లోకం ఒక పుత్రుడికి ఉండాల్సిన మూడు ముఖ్యమైన లక్షణాలను లేదా చేయవలసిన ధర్మాలను వివరిస్తుంది.

* తల్లిదండ్రుల ఆజ్ఞాపాలన: తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పుడు వారి మాట వినడం, వారిని సేవించడం అత్యంత ప్రధానమైన ధర్మం. ఇది ఒక వ్యక్తికి ఉండాల్సిన ప్రాథమిక సంస్కారాన్ని తెలియజేస్తుంది.

* ప్రత్యాబ్దిక శ్రాద్ధం, అన్నదానం: తల్లిదండ్రులు మరణించిన తర్వాత ప్రతి సంవత్సరం వారి పేరు మీద శ్రాద్ధ కర్మలు నిర్వహించడం, ముఖ్యంగా ఆమశ్రాద్ధ విధి ద్వారా, అన్నదానం చేయడం వారి పట్ల ఉన్న కృతజ్ఞతను, ప్రేమను తెలియజేస్తుంది. ఇది పితృ ఋణాన్ని తీర్చుకునే మార్గంగా భావిస్తారు.

* గయా పిండప్రదానం: హిందూ ధర్మంలో గయ క్షేత్రం పితృ కర్మలకు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. అక్కడ పిండ ప్రదానం చేయడం ద్వారా పితృదేవతలకు మోక్షం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం.

* ఒక పుత్రుడు కేవలం జన్మతః కాకుండా, తన కర్మల ద్వారా కూడా పుత్రుడిగా నిరూపించుకోవాలని ఈ శ్లోకం స్పష్టం చేస్తుంది. ఇవి సమాజంలో ఒక పుత్రునికి కావలసిన నైతిక, ధార్మిక బాధ్యతలను సూచిస్తాయి.

ధర్మోపాత్త జీవితానాం

 ధర్మోపాత్త జీవితానాం జనానాం

శాస్త్రేషు జ్ఞానేషు సదా రతానామ్౹

జితేంద్రియాణా మతిథి ప్రియాణాం 

గృహేషు మోక్ష: పురుషోత్తమానామ్॥


ధర్మ-ధర్మబద్ధమైన విధంగా, 

ఉపాత్త-నడిచే, 

జీవితానాం-జీవనము గల వారును, 

శాస్త్రేషు-శాస్త్రములందును, 

జ్ఞానేషు-వివిధ జ్ఞాన విషయాలందును, 

సదా-నిత్యమును, 

రతానాం-ఆసక్తి గల వారును, 

జిత ఇంద్రియాణాం-ఇంద్రియ నిగ్రహము గల వారును, 

అతిథి ప్రియాణాం-అతిథుల పట్ల ఇష్టము గల వారును ఐన,

జనానాం-జనులకు, 

పురుష ఉత్తమానాం-మహా పురుషులకు, 

మోక్ష: -మోక్షము, 

గృహేషు-ఇళ్ళయందే(ఉంటుంది)॥


ఈలోకంలో ధర్మంగా ఆర్జించిన జీవ ధన సంపదలును, శాస్త్ర విజ్ఞాన విషయాలందు ఆసక్తియును, ఇంద్రియ నిగ్రహమును, అతిథులపట్ల ఇష్ట మును అనే ఉత్తమ లక్షణా లున్న మహా పురుషులకు మోక్షము తమ తమ ఇళ్లలోనే ఉంటుంది॥

8-7-25/మంగళవారం/రెంటాల

సుభాషితమ్

* సుభాషితమ్ గ్ *

అగ్నిర్దేవోద్విజాతీనాం 

*మునీనాం హృది దైవతం* 

ప్రతిమా స్వల్పబుద్ధీనాం* సర్వత్ర సమదర్శినః


ద్విజులకుఅగ్నిహోత్రమేదైవం...మునులకు. ..మేధావులకు,బుద్ధిశాలులకు...హృదయం లోనే దేవుడు ఉంటాడు..అల్ప బుద్ధి (సామాన్యులు)కలవారికి విగ్రహాలులయందేదేవుడుంటాడనపిస్తుంది. ..జ్ఞానులకు అన్నిటా హరియే!!! సమదృష్టి కలవారికి అన్ని చోట్లా దైవమే కనిపిస్తాడు*...


AAA


ఆంజనేయశాస్త్రి.కొంపెల్ల

వ్యాస పూర్ణిమ

 🙏🚩🙏🚩🙏

(రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ వేదవ్యాస మహర్షికి జై)

తేదీ 10-07-25 గురువారం వ్యాస పూర్ణిమ దీనినే గురు పూర్ణిమ అంటారు.

సృష్టికి ఆధారమైన వేదాలను నాలుగు భాగాలుగా సులభతరం చేసి అందించినందుకు వీరు వేద వ్యాసుడు అని పిలువబడుతారు.

(🌝వ్యాస మహర్షి🌝)

శ్రీ మహాభారతం,భాగవతం, అష్టాదశ (18) పురాణాలను రచించారు.

ముఖ్యంగా హిందువులు అందరూ గ్రహించవలసిన విషయం ఏమిటంటే వ్యాస మహర్షి సప్త(7) చిరంజీవులలో ఒకరు, వీరి అవతారానికి మరణం లేదు.

ఇప్పటికీ ఎప్పటికీ ఈ సృష్టిలో జీవించి ఉండే శ్రీ వ్యాస మహర్షిని గురు పూర్ణిమ రోజున అందరూ స్మరించాలి,పూజించాలి, వీరినే ఆరాధించాలి, అంతేకాని మన ధర్మానికి సంబంధం లేని అన్యమతస్థులను గురువులుగా భావించకూడదు.

ఈ సత్యాన్ని ప్రతీ ఒక్కరూ మీ పిల్లలకు తెలియజేయండి.

గురు పరంపరలో మూలగురువైన శ్రీ వేదవ్యాస మహర్షికి గురుపూర్ణిమ రోజున జై అని చెప్పించండి.

ఆ చిరంజీవికి అదే మనమిచ్చే గురు కానుక.

మీ గురువులను గురు సమానమైన వారిని కూడా వ్యాస పౌర్ణమి రోజున పూజించవచ్చు.

🙏అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ వేదవ్యాస మహర్షికి జై 

🙏🚩🙏🚩🙏

పరమాచార్య అనుగ్రహం

 అంతా పరమాచార్య అనుగ్రహం


మా పాట్టి (బామ్మ) పరమాచార్య స్వామివారికి భక్తురాలు. మఠం అందరూ తనని ‘దేవకొట్టై ఆచి’ అని పిలిచేవారు. ఆమె గురించి తెలియని వారు ఎవరూలేరు. ఆవిడ మాకు ఒక మార్గదర్శిలా మమ్మల్ని నడిపింది. కేవలం ఆవిడ వల్లనే చాలా చిన్నతనం నుండే మాకు శ్రీమఠంతో సంబంధం ఉండేది. ఇది నాకు కలిగిన భాగ్యం అని తలుస్తాను. మా పాట్టిని నేను ఎప్పటికి మరచిపోను. పరమాచార్య స్వామివారు చెప్పేవారు, ‘మనకు ఎవరైనా మంచి చేస్తే లేదా సహాయం చేస్తే, మనం ఎప్పటికి కృతజ్ఞతను మరచిపోరాదు’. ఈ మాటలను స్వామివారు చెబుతున్నప్పుడు నేను విన్నాను. నాకు ఎనిమిది సంవత్సరాల వయస్సప్పటి నుండి నేను శంకర మఠంకి వస్తున్నాను. మా బామ్మ నన్ను అక్కడకు తీసుకునివెళ్ళేది.


పరమాచార్య స్వామివారు, జయేంద్ర సరస్వతి స్వామివారు ఇలయత్తాంగుడిలో మకాం చేస్తున్నప్పుడు, మా బామ్మ ప్రతీ శుక్రవారం ఒక బ్రాహ్మణ బాలుడిని కండకావేరి చెరువులోని కమలాలను కోయమని చెప్పి, వాటిని రెండు బుట్టలలో పెట్టుకుని, వాటిని తీసుకురమ్మని ఆ పిల్లాడికి చెప్పి, నన్ను మా పిన్ని కొడుకు అళగప్పన్ ని (ఇప్పుడు వాడిని బామ్మ దత్తత తీసుకుంది) వెంటబెట్టుకుని వెళ్లి, ఆ పూలను ఇలయత్తాంగుడిలో పూజలో సమర్పించి, పూజ తరువాత ఇద్దరు ఆచార్యుల దర్శనం చేసుకుని, తరువాత నైవేద్యం పెట్టిన చక్కర పొంగలిని మాకు పెట్టేది; అందులోనుండి నెయ్యి అలా కారుతూ ఉండేది. మేము చెరువు గట్టున ప్రసాదాన్ని ఆరగించి, చివరి బస్సు పట్టుకుని దేవకొట్టై వెళ్ళిపోయేవాళ్ళం.


ఆ రోజులని ఎప్పటికి మరచిపోలేను. అక్కడ శ్రీమఠం మకాం ఉన్నన్నిరోజులూ అక్కడి ప్రజలకు, మాకు మనస్సు నిండిపోయింది. అది పరిపూర్ణ ఆనందం. ఈ భువిపై అటువంటి నడిచే దైవం ఉండడం ఈ ప్రపంచ ప్రజలు చేసుకున్న అదృష్టం. ఈ భువిపై ఆ దైవం ఉన్నప్పుడు మేము కూడా ఉన్నామన్న భావన అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది.


మరొక సందర్భంలో ఇద్దరు ఆచార్యులు కార్వేటినగరంలో మకాం చేస్తున్నారు. అప్పటికి నాకు వివాహం అయ్యింది. నేను, నా భర్త, మా నాన్నగారు మరియు పాట్టి - మేమందరమూ అక్కడికి వెళ్లి వారంరోజులు ఉన్నాము. అక్కడ ఒక కొలను ఉంది. గట్టుపై ఒక పాక నిర్మించారు. పూజ అయిపోయిన తరువాత మహాస్వామివారు అక్కడకు వచ్చి దర్శనం ఇచ్చేవారు. ప్రశాంతమైన ప్రదేశం. అక్కడకు వచ్చిన భక్తులతో స్వామివార్లు మాట్లాడేవారు. మేము ఆ సంభాషణలను వింటుండేవాళ్ళం. (మేము అక్కడకు వెళ్ళినప్పుడు నా మనస్సు స్థిమితంగా లేదు). అక్కడ సమయం ఎలా గడిచిపోయేదో తెలిసేది కాదు. ఎన్నో మంచి విషయాలను మాట్లాడుతూ, వాటిని హాస్య సంభాషణలుగా మలచేవారు. వారంరోజుల పాటు వారి మాటలను విన్నాను; ఫలితంగా నా మనస్సుకు శాంతి కలిగింది.


మా బంధువులందరి ఇళ్ళల్లోని పూజ గదిలో స్వామివారికోసం ఒక ప్రత్యేక హుండి ఉండేది. ఇంటి ఖర్చులతో మొదలుకుని ప్రతి సందర్భంలోనూ స్వామివారిని తలచుకుని అందులో డబ్బులు వేసి, పని మొదలుపెట్టేవాళ్ళం. శ్రావణ మాసంలో ఆ హుండి డబ్బులను సేకరించి, భిక్షావందనానికి శంకర మఠానికి వెళ్ళినప్పుడు అక్కడ జమ చేసేవాళ్ళం. దాంతోపాటు మా బంధువులందరూ చిన్న మొత్తాల్లో ఇచ్చిన డబ్బుతో కలిపి మేమి భిక్షావందనం చేశాము. తరువాత బామ్మకు వయసైపోయింది. తను అందరి వద్ద హుండి డబ్బులు సేకరించి, అదనంగా ఇచ్చే డబ్బును చేర్చి దాంతో భిక్షావందనం నిర్వహించేది.


బామ్మ ఒక వారం ముందరే అక్కడకు వెళ్లి ఏర్పాట్లు చేసేది. తనకు చాలా వయసైపోయిన తరువాత, మహాస్వామివారితో, “నేను ముసలిదాన్నైపోయాను. నేను కొద్దిగా ధనం సేకరించి మఠంలో జమ చేస్తాను. ఇందులోకి దేవకొట్టై నగరత్తార్ లను కూడా చేర్చుకోవచ్చా?” అని అడిగింది. స్వామివారు అందుకు అంగీకరించారు. తరువాత బామ్మ ధనాన్ని సేకరించి మఠంలో సమర్పించింది. అప్పటినుండి క్రమం తప్పకుండా ఆగష్టు 30న ‘దేవకొట్టై నగరత్తార్ భిక్షా వందనం’ జరుగుతోంది. మా బామ్మ వల్లనే మాకు ఈ అదృష్టం కలిగింది. ఇప్పుడు మా బామ్మ లేదు. కాని తను ఏర్పాటు చేసినవన్నీ ఇప్పటికీ జరుగుతున్నాయి. మా బామ్మ తన మనవళ్ళు మనవరాళ్ళను శ్రీమఠానికి దగ్గర చేయడం ఎప్పటికి మరచిపోలేని విషయం.


మా బామ్మ ఒకసారి మహాస్వామి వారి దర్శనం కోసం కాంచీపురానికి వెళ్ళింది. తను స్వామివారితో మాట్లాడేటప్పుడు, స్వామివారు మా పాట్టితో, “కాంచీపురంలో ఎన్నో శివలింగాలు ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నాయి. ఆ ఎండ వానల నుండి రక్షణగా వాటికి ఒక చిన్న దేవాలయం నిర్మించి, రోజుకు ఒక్కపూట నైవేద్యానికి ఏర్పాటు చెయ్యాలి; అవకాశం ఉన్నవారు దీన్ని చెయ్యాలి” అని చెప్పారని బామ్మ మాతో చెప్పింది. తరువాత స్వామివారు మా బామ్మను పిలిచి, “నువ్వు ఒక దేవాలయం నిర్మించు” అని ఆదేశించారు. అందుకు మా బామ్మ, “దేవాలయం నిర్మించమని నా మనవరాలిని అడుగుతాను. బహుశా మూడువేల రూపాయలు అవ్వొచ్చు” అని చెప్పింది. తరువాత కాంచీపురం నుండి చేన్నిలోని మా ఇంటికి వచ్చి, స్వామివారు చెప్పిన విషయాలను మాకు తెలిపింది.నేను అందుకు సరే అని చెప్పి ఆ విషయాన్ని పూర్తిగా మరచిపోయాను. రెండేళ్ళు గడిచిపోయాయి. బామ్మ తరచుగా కాంచీపురం వెళ్తోంది. అలా ఒకసారి స్వామివారి దర్శనం చేసుకుని, పూజ అయిపోయిన తరువాత ఫలహారం కోసమని దగ్గరలోని హోటలుకు వెళ్ళింది. స్వామివారు దగ్గర ఉన్న ఒక సేవకుడితో, “ఆచి ఎక్కడ ఉంది? ఆమెను పిలువు” అని తెలిపారు. ఫలహారం చెయ్యడానికి ఆచి హోటలుకు వెళ్లిందని చెప్పి, అక్కడకు వెళ్లి ఆచితో, “ఆచి అమ్మ, పరమాచార్య స్వామివారు పిలుస్తున్నారు” అని చెప్పాడు. ‘నన్ను ఎందుకు పిలిచారబ్బా’ అని పాట్టి పరుగుపరుగున వచ్చింది.


తను వచ్చి స్వామివారిని కలవగానే, “దేవాలయం నిర్మిస్తానని తెలిపావు కదా! అది ఏమైంది?” అని అడిగారు స్వామివారు. రెండేళ్ళు గడిచిపోవడంతో బామ్మకు వెంటనే గుర్తుకురాలేదు. కాస్త తీవ్రంగా ఆలోచించి, విషయం గుర్తుకు వచ్చి, “నా మనవరాలు నిర్మిస్తానని తెలిపింది. నేను చెన్నై వెళ్లి తనని స్వామివారిని దర్శించమని చెబుతాను” అని చెప్పింది. తరువాత మా బామ్మ చెన్నై రాకుండా దేవకొట్టై వెళ్లి అక్కడినుండి నాకు ఫోను చేసింది. నేను స్వామివారిని కలుస్తానని చెప్పాను.


“అళగప్పన్ కూడా అక్కడకు వస్తాడు; ఇద్దరూ వెళ్లి స్వామివారిని కలవండి” తను నాకు చెప్పింది. మరుసటిరోజు అళగప్పన్ మా ఇంటికి వచ్చాడు. మేమిద్దరమూ కాంచీపురం వెళ్లి, స్వామివారిని కలవడానికి వచ్చామని అక్కడున్నవారితో చెప్పాము. “దేవకొట్టై ఆచి మనవడు, మనవరాలు వచ్చారు” అని వారు స్వామివారికి తెలిపారు.


మా రాకకు కారణం తెలుసుకోవాలని “ఏమిటి?” అని అడిగారు స్వామివారు.

“ఒక శివలింగానికి దేవాలయం నిర్మించాలని అనుకున్నాము. ఆ విషయమై పరమాచార్య స్వామివారిని కలవమని పాట్టి చెప్పింది. అందుకు వచ్చాము” అని తెలిపాము స్వామివారికి.


మంగళా తీర్థం వద్ద నిర్మాణంలో ఉన్న ఆలయాన్ని మాకు చూపమని ఒక అయ్యర్ ను మాకు తోడుగా పంపారు స్వామివారు. కేవలం ఇక ప్లాస్టరింగ్ పని మాత్రమే మిగులుంది. అక్కడున్నవారు మాతో, “ఈ ఆలయాన్ని నిర్మిస్తున్న ఇంజనీయరు చెన్నై వెళ్ళాడు, ఇప్పుడు ఇక్కడ లేడు. అతను వచ్చిన తరువాత మిగతా విషయాలు కనుక్కోండి” అని తెలిపారు.


అంతేకాక ఇప్పటి దాకా ఎనభై వేల రూపాయలు అయ్యిందని, దాదాపు లక్షదాకా అవుతుందని చెప్పారు. నేను అళగప్పన్ ని, “దీనికి మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అని మన ఆచి చెప్పింది కదా! మీ బావకు ఈ ఇవన్నీ తెలియవు. మా చిన్న మావగారిని సంప్రదించిన తరువాతనే నేను ఏమైనా చెయ్యగలను. స్వామివారు ఏమి చెబుతారో? ఏమి చేద్దాం ఇప్పుడు?” అని అడిగాను.


“ఈ స్థలం సరిగ్గా మఠానికి ఎదురుగా ఉంది. మహాస్వామివారు తరచుగా అక్కడకు వెళ్తుంటారు. ఇది చాలా మంచి అవకాశం. ఎలాగోలా నువ్వే కట్టించు. ఈ అవకాశం మరలా రాదు” అన్నాడు అళగప్పన్.


తరువాత మేము స్వామివారితో, “ఇంజనీయరు చెన్నై వెళ్ళాడుట” అని చెప్పి, “పాట్టి మాతో మూడు వేల రూపాయలు అవుతుంది అని చెప్పింది. కాని వారు ఇప్పుడు లక్ష దాకా అవుతుంది అని అంటున్నారు” అని అడిగాను. స్వామివారు ఏమనుకున్నారో తెలియదు కాని, “ఆ ఇంజనీయరు చెన్నై నుండి వచ్చిన తరువాత మీకు విషయం తెలుపుతాము. ఇప్పుడు మీరు వెళ్ళండి” అన్నారు స్వామివారు.


నాకు ఏమీ అర్థం కాలేదు. నేను నా తమ్ముడు అళగప్పన్ తో, “నాకు మనస్సులో చాలా దిగులుగా ఉంది. మనం అలా చెప్పకుండా ఉండాల్సింది. సరే, నా వద్ద పది సవర్ల బంగారు గొలుసు ఉంది. దాన్ని అమ్మి, మిగిలిన డబ్బు కూడా ఎలాగో అలా ఏర్పాటు చేసి, నేనే ఆ దేవాలయాన్ని నిర్మిస్తాను” అని అన్నాను. స్వామివారితో కూడా, “ఖర్చు ఎంతైనా ఈ దేవాలయాన్ని నేనే నిర్మిస్తాను” అని చెప్పాను. “మేము తెలియజేస్తాము. ప్రభుత్వమే నిర్మిస్తుందని అంటున్నారు. అలా కాకపొతే, నువ్వే నిర్మించవచ్చు” అన్నారు స్వామివారు.


నేను చెన్నై తిరిగొచ్చాను; అళగప్పన్ కూడా తన ఊరికి వెళ్ళిపోయాడు. మఠం నుండి ఎటువంటి సమాచారం రాలేదు. అళగప్పన్ అన్ని విషయాలు చెప్పడంతో బామ్మ మా ఇంటికి వచ్చింది. “దిగులు పడకు. మనవాళ్ళని డబ్బు అడుగుదాము” అని ధైర్యం చెప్పింది. పదివేల రూపాయలు తీసుకుని నేను, బామ్మ కాంచీపురం వెళ్లి, మా ప్రణాళిక స్వామివారికి తెలిపాము. “అవకాశం రాని, చూద్దాం” అన్నారు స్వామివారు.


తరువాత బామ్మ స్వామివారితో, “శివునికోసం పది వేలు తీసుకుని వచ్చాను. దీన్ని ఇంటికి తీసుకునివెళ్ళలేను. మఠంలో జమ చేస్తాను” అని చెప్పిడంతో స్వామివారు సరే అన్నారు. ఆ డబ్బు నేను మఠంలో జమ చేశాను.


అయినా నా మనసుకు శాంతి లేదు. ఏడుస్తూనే ఉన్నాను. నా బాధను పోగొట్టాలని పాట్టి నాతో, “స్వామివారికి మన ఆర్తి తెలుసు, తప్పక పరిగణిస్తారు. ఆ దేవాలయాన్ని నిన్నే నిర్మించమని చెబుతారు, అలా దిగులు పడకు. నేను కాంచీపురం వెళ్లి దేవకొట్టై వెళ్తాను” అని చెప్పింది. బామ్మ వెళ్తూ ఒక మాట చెప్పింది, “ముందు వొద్దన్న ఒకామెకు కూడా రెండు దేవాలయాలు నిర్మించడానికి అనుమతిచ్చారు స్వామివారు. మంచి అనుకో; మనకు అనుకూలంగానే జరుగుతుంది”.కలత చెందిన మనసుతో సోఫాలో వాలుకుని నిద్రలోకి జారుకున్నాను. బహుశా మధ్యాహ్నం పన్నెండు గంటలు అనుకుంటా. మా బామ్మ వచ్చి తలుపు కొడుతోంది. నాకు తలుపు కొట్టిన చప్పుడుతో పాటు మాటలు కూడా వినబడుతున్నాయి. “లక్ష్మీ తలుపు తెరువు. దేవాలయ నిర్మాణం నువ్వే చెయ్యమన్నారు మహాస్వామివారు”. హఠాత్తుగా మెలకువ వచ్చింది. ఏమి అద్భుతం! బామ్మ నిజంగానే తలుపు కొడుతోంది.


అది తలుచుకుంటే ఇప్పటికి నాకు పారవశ్యం కలుగుతుంది. ఈ సంఘటనని నేను ఎన్నటికి మరచిపోలేను. వెంటనే నేను తలుపు తీశాను. బయట బామ్మా నిలబడి ఉంది. “ఊరికి వెళ్ళలేదా?” అని అడిగాను. “లేదు. పరమాచార్య స్వామివారు నిన్నే దేవాలయం నిర్మించమన్నారు. వచ్చేయ్, ఇప్పుడే కాంచీపురం వెళ్దాము” అని చెప్పింది. వెంటనే స్వామివారి దర్శనానికి బయలుదేరాము. మేము స్వామివారి దర్శనం చేసుకుంటున్నప్పుడు, “నీవే దేవాలయం నిర్మించు” అని ఆదేశించారు. నాకు చాలా సంతోషం కలిగింది. “నేను మా ఊరికి వెళ్లి, మా మావగారికి విషయం తెలిపి డబ్బుకు ఏర్పాట్లు చేస్తాను” అని స్వామివారికి తెలిపాను. అదనుకు స్వామివారు సరే అన్నారు.


నేను మా ఊరికి వెళ్లి మా నాన్నగారికి, చిన్న మామగారికి విషయం తెలిపాను. వాళ్ళు ‘సరే చూద్దాం’ అన్నారు. నాన్న ఒక్కరే ఏమీ చెయ్యలేరు. అవకాశం రానివ్వు అన్నారు ఇద్దరూ. నాకు కొద్దిగా కోపం వచ్చింది. ఒక నిర్ణయానికి వచ్చి చెన్నై చేరుకొని నాకు తెలిసిన వారితో మాట్లాడాను. వారు ఆహృదయులు; “మాకు తెలిసిన వారిని సంప్రదించి అవసరమైన ధనాన్ని ఏర్పాటు చేస్తాము” అని అన్నారు. నేను సరే అన్నాను; వెంటనే వారు ముప్పైవేల రూపాయల చెక్కును ఇచ్చారు. దాన్ని డబ్బుగా మార్చుకుని మరుసటిరోజే కాంచీపురం బయలుదేరాను. “ఏమిటి, మీ ఊరికి వెళ్లి, మీవాళ్ళను అడిగావా?” అని అడిగారు స్వామివారు. జరిగిన విషయం మొత్తం స్వామివారికి తెలిపాను. “సరే ఈ డబ్బుని మేనేజరు నీలకంఠ అయ్యర్ కు ఇచ్చి రశీదు తీసుకో. రాతిపై నీ భర్త పేరు వేయించాల్సి ఉంటుంది కనుక పేరు విలాసము ఇచ్చి వెళ్ళు” అని ఆదేశించారు. స్వామివారు చ్పెపినట్టు చేశాను.


ఇదంతా జరిగేటప్పటికి రాత్రి పది గంటలు అయ్యింది. దేవాలయ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది అన్న నా ప్రశ్నకు, బహుశా నలుగు నెలలు పట్టవచ్చు అని చెప్పారు. దాదాపు రెండు నెలలు గడచినా తరువాత బామ్మ ఫోను చేసింది. “కుంభాభిషేకానికి ఏర్పాటు చేశారు. మీ మనవరాలికి చెప్పు; మీ బంధువులని తీసుకునిరా” అని స్వామివారు బామ్మతో చెప్పారు. నా భర్త మలేషియాలో ఉండడం వల్ల నాకు ఏమి చెయ్యాలో పాలుపోలేదు. ఇక్కడ లేకుండా చెయ్యడం ఎలా? నేను వెంటనే స్వామివారిని కలిసి విషయం తెలిపాను.


“అంతా సజావుగా జరుగుతుంది. ఓక ఫోను చేసి విషయం చెప్పు. అలాగే మీ బంధువులకు కూడా తెలుపు” అన్నారు స్వామివారు. వంటనే నేను చెన్నై వచ్చాను. అప్పటికే మలేషియా వెళ్ళడానికి మా చిన్న మామగారి అమ్మాయి వచ్చింది. నా భర్తను ఇక్కడకు త్వరగా పంపమని తనకు తెలిపి మా ఊరికి వచ్చేశాను. సమయం లేకపోవడంతో అందరికి విషయం చెప్పలేక, మా చిన్న మామగారికి మాత్రం కుంభాభిషేకం విషయం తెలిపాను.


నేను ఇక్కడకు రాగానే తెలిసిన విషయం ఏమిటంటే, మలేషియా నుండి నా భర్త నేరుగా కాంచీపురం వచ్చారని, వెంటనే నన్ను కూడా అక్కడకు రమ్మన్నారని.


ఆరోజు అక్కడకు ఆర్.యం. వీరప్పన్ కూడా వచ్చారు. మంగళా తీర్థం కొలను స్వామివారు స్నానం చేశారు. ప్రభుత్వం తరుపున మంగళా తీర్థం కొలనును జీర్ణోద్ధరణ చెయ్యడానికి ఆర్.యం. వీరప్పన్ గారు ఏర్పాట్లు చేశారు. స్నానం తరువాత స్వామివారు మంగళేశ్వరర్ దర్శనం చేసుకున్నారు. అక్కడి నుండి నేరుగా మఠానికి వచ్చారు. మా అమ్మాయి ముత్తు కరుప్పితో పాటుగా నేను స్వామివారి దర్శనం చేసుకునాను. అప్పుడు అక్కడ ఆర్.యం. వీరప్పన్ కూడా ఉన్నారు. స్వామివారు మమ్మల్ని ఆయనకు పరిచయం చేశారు. తరువాత స్వామివారు కట్టిన పూల ఉండను మా అమ్మాయి చేతిలో వేసి మమ్మల్ని ఆశీర్వదించారు. దాంతోపాటు ఏకామ్రేశ్వర కామాక్షి అమ్మవార్ల పెళ్లి పట్టు చీరను కూడా ఇచ్చారు. అది ఇప్పటికి నా వద్ద భద్రంగా ఉంది.


అక్కడున్నవారు అందరూ ఆ పట్టు వస్త్రాన్ని ఎంతో భక్తిగా తాకి కళ్ళకద్దుకుని, “అంతటి పవిత్రమైన వస్తువు ఎవరికీ లభించలేదు. మీకు లభించింది. ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉందిమంచి భర్త లభిస్తాడు” అని మాతో అన్నారు. వారు అన్నట్టుగానే తరువాత తనకు ఒక మంచి డాక్టరు భర్తగా లభించాడు. తనకు ఇప్పుడు ఒక కూతురు, కొడుకు. ఆరోజు కామాక్షి అమ్మవారి కల్యాణోత్సవం. తరువాత నేను స్వామివారిని, “మా బంధువులు వస్తారు. వారికి ఆహారం పెట్టాలి. వంట చేసేవారు ఎవరూ లేరు. అందుకు అవసరమైన సరుకులు కొనాలి. మాకు ఒక మండపం కూడా కావాలి. ఏమి చెయ్యాలి?” అని అడిగాను.


“దేని గురించి నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు; అంతా సవ్యంగా జరుగుతుంది” అన్నారు స్వామివారు. మాకు బాలాజీ కళ్యాణ మండపాన్ని ఇచ్చారు; మఠం నుండి కావాల్సిన కిరాణా వస్తువులను ఇచ్చారు. మరుసటి రోజు ఉదయమే ఆలయ కుంభాభిషేకం. కుంభకోణం నుండి వంట బ్రాహ్మణుడు ఒకరు స్వామివారి దర్శనానికి వచ్చాడు.స్వామివారు అతనితో, “నువ్వు వెళ్లి ఆచి అమ్మ కోసం వంట చెయ్యి” అని ఆదేశించగా అతను సరేనన్నాడు.


“ఈ నగరత్తారులకి మంచిగా వడలు, పాయసము తయారు చెయ్యి” అని అతనికి చెప్పారు స్వామివారు. అలాగే అతను కూడా చాలా గొప్పగా వంట చేశాడు. స్థానికంగా ఉన్నవారు కూడా వచ్చి ఆహారం స్వీకరించారు. మాకు ఎంతో సంతృప్తి కలిగింది. కుంభాభిషేకం ఆహ్వాన పత్రికతో సహా అన్నీ స్వామివారే చూసుకున్నారు.


కుంభాభిషేకానికి ముందు స్వామివారిని పూర్ణ కుంభంతో స్వాగతించాము. స్వామివారు యాగశాలలో ఉంది కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తరువాత కుంభాభిషేకం కూడా నిర్విహించారు.


ఎలా ఎన్నో సంఘటనలను చెప్పవచ్చు. నా జీవితంలో ఇలా ఎన్నో జరిగాయి. వాటిని వ్రాస్తూ జీవితాంతం గడపవచ్చు. అటువంటి నడిచే దైవం ఉన్న సమయంలో మనం ఉన్నాము అన్న భావనే మనస్సుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.


--- లక్ష్మి, మంగలేశ్వరర్ కోవిల్, దేవకొట్టై ఆచి మనవరాలు. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


https://chat.whatsapp.com/JY0yPPPRgIiHuoZll8ImNd


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

శ్రీ గణపతి ఆలయం

 🕉 మన గుడి : నెం 1166


⚜ మహారాష్ట్ర : తస్గావ్


⚜ శ్రీ గణపతి ఆలయం



💠 భారతదేశంలోని మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో ఉన్న తస్గావ్ గణేష్ ఆలయం, గణేశుడికి అంకితం చేయబడిన ఒక ప్రముఖ హిందూ దేవాలయం. 

దాని ప్రత్యేకమైన నిర్మాణం మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందిన ఇది సుదూర ప్రాంతాల నుండి భక్తులను ఆకర్షిస్తుంది.


🔆 చరిత్ర


💠 నిర్మాణం: 

ఈ ఆలయ నిర్మాణం 1779లో మరాఠా జనరల్ పరశురాం భావు పట్వర్ధన్ చే ప్రారంభించబడింది మరియు 1799లో అతని కుమారుడు అప్పాజీ పట్వర్ధన్ చే పూర్తి చేయబడింది.


💠 చాలా గణపతి విగ్రహాలకు ఎడమ వైపున ఉన్న తొండం ఉంటుంది , అయితే ఈ ఆలయ విగ్రహాల తొండం కుడి వైపుకు వంగి ఉంటుంది. 

కుడి వైపున ఉన్న తొండం ఉన్న గణపతి విగ్రహాన్ని 'చురుకైన (జాగృతం ) ' అని అంటారు. 

ఈ గణపతిని సజీవ విగ్రహంగా భావిస్తారు .

ఈ విగ్రహం 125 కిలోగ్రాముల (276 పౌండ్లు) బరువున్న ఘన బంగారంతో అలంకరించబడింది.


💠 వార్షిక రథయాత్ర: 

ఈ ఆలయం భద్రపద చతుర్థి తర్వాత రోజు ఒక గొప్ప రథయాత్ర నిర్వహిస్తుంది, వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది.


💠 ఈ ఆలయం సాంస్కృతిక మరియు మతపరమైన కేంద్రంగా పనిచేస్తుంది, సమాజ మరియు ఆధ్యాత్మిక సంబంధాన్ని పెంపొందిస్తుంది.


💠 తస్గావ్ గణేష్ ఆలయం మహారాష్ట్ర యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనం, ఇది నిర్మాణ సౌందర్యం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు సమాజ భావనల మిశ్రమాన్ని అందిస్తుంది. 

దాని చారిత్రక ప్రాముఖ్యతతో కలిపి దాని ప్రత్యేక లక్షణాలు భక్తులు మరియు పర్యాటకులు తప్పక సందర్శించవలసిన గమ్యస్థానంగా చేస్తాయి.


💠 భద్రపత్ చతుర్థి మరుసటి రోజు వేలాది మంది ఈ శుభ సందర్భాన్ని జరుపుకోవడానికి నగరంలో గొప్ప వేడుక జరుగుతుంది. 

ఈ పండుగ ప్రజలు ఐక్యంగా ఉండటానికి సహాయపడే సాంస్కృతిక మరియు మతపరమైన కార్యక్రమం. 

ఈ గణపతి ఒకటిన్నర రోజులు ఉంటారు. గణపతి నిమజ్జనం కోసం మధ్యాహ్నం ఊరేగింపు ప్రారంభమవుతుంది. 

ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించబడే 30 అడుగుల 'రథం' గణపతి భక్తులు రథాన్ని నదిలోకి లాగుతారు, అక్కడ వారు గణపతి నిమజ్జనం చేస్తారు. 


💠 ఈ సంప్రదాయం 1785 నుండి కొనసాగుతోంది. మరియు ఈ రథం గురించి మొదటిసారిగా ప్రస్తావించబడినది అప్పరాజే పట్వర్ధన్‌కు కులాన్ని ప్రకటించాలి, ఎందుకంటే వారు సంస్థాన్ గణపతి ఆలయాన్ని నిర్మించారు. 

మొదట రథం టేకు కలపతో తయారు చేయబడింది, ఇది చాలా బరువుగా ఉంది. ఒక సంవత్సరంలో జరిగిన ప్రమాదం కారణంగా, కొత్త ఇనుప రథం వెలుగులోకి వచ్చింది.



💠 సమీప రైల్వే స్టేషన్: 

కిర్లోస్కర్వాడి & మిరాజ్ జంక్షన్.



Rachana

©️ Santosh Kumar

18-40-గీతా మకరందము

 18-40-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అ || సత్త్వాది త్రిగుణములతో గూడియుండని వస్తువు ఈ ముల్లోకములందును ఏదియులేదని వచించుచున్నారు -


న తదస్తి పృథివ్యాం వా 

దివి దేవేషు వా పునః |

సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిస్స్యాత్త్రిభిర్గుణైః || 


తా:- ప్రకృతి (మాయ) నుండి పుట్టినవగు ఈ మూడుగుణములతో గూడియుండని వస్తు వీభూలోకమునగాని, స్వర్గమందుగాని, దేవతలయందుగాని ఎచటనులేదు.


వ్యాఖ్య:- ముల్లోకములందలి ప్రతివస్తువున్ను సత్త్వరజస్తమస్సులను ఈ మూడు గుణములతో గూడియుండుననియు, ఆ గుణములతో గూడియుండని వస్తువు (జీవన్ముక్తుడు తప్ప) ఏదియు ఈ ప్రపంచమున లేదనియు చెప్పుచున్నారు. జీవన్ముక్తులగు మహనీయులు తప్ప తక్కినవారందఱు ఏదియో యొక గుణముతో కాని, గుణములతో గాని గూడియున్నవారే. స్వర్గలోకములో నున్నవారున్ను త్రిగుణములతో గూడినవారేయనియు, వానినుండి విడుదలపొందినవారు కాదనియు ఈ శ్లోకమున భగవానుడు చెప్పిరి. కాబట్టి వారున్ను బంధముననున్నవారే. వారున్ను ఎప్పటికైనను జ్ఞానాదులను బడసి గుణరహితులు, ముక్తులు కావలసియున్నారు.

“ప్రకృతిజైః” - అని చెప్పినందువలన ఈ మూడు గుణములకు ఉత్పత్తిస్థానము ప్రకృతి, లేక మాయ (అజ్ఞానము) అని స్పష్టమగుచున్నది. ఈ మూడు గుణములలో ఏది యున్నను వారింకను ప్రకృతితో గూడియున్నవారేయని తాత్పర్యము. కావున రజస్తమస్సులను ప్రయత్నాతిశయముచేతను, అభ్యాసప్రాబల్యముచేతను దాటి సత్త్వగుణముయొద్దకు వచ్చి, క్రమముగ గుణాతీత ఆత్మస్థితిని బడయవలెను. అదియే మోక్షము.


ప్ర:- సత్త్వాది త్రిగుణములు దేనినుండి పుట్టినవి?

ఉ :- ప్రకృతినుండి (మాయనుండి, అజ్ఞానమునుండి).

ప్ర:- ఈ గుణములతో గూడని వస్తువేదైన ఈ ప్రపంచమున గలదా?

ఉ:- లేదు (జీవన్ముక్తుడు తప్ప).

ప్ర:- ఇట్టిస్థితి ఈ లోకమందేనా? లేక తదితర లోకములందుగూడనా?

ఉ:- స్వర్గాది ఇతర లోకములందును, దేవతలందును ఇదియే పరిస్థితి.

తిరుమల సర్వస్వం -294*

 *తిరుమల సర్వస్వం -294*

చరిత్రపుటల్లో శ్రీనివాసుడు-9

ఆర్కాటు నవాబులు

➖➖➖➖➖➖

తరువాత మొఘలు చక్రవర్తి ఔరంగజేబు దక్షిణభారతం వైపు దృష్టి సారించడంతో - తిరుమల క్షేత్రం పై ఆధిపత్యం ఆర్కాటు నవాబులకు సంక్రమించింది. వారు హుండీ ఆదాయాన్ని హస్తగతం చేసుకున్నారు కానీ; ఆలయ పరిపాలన వ్యవహారాలలో జోక్యం చేసుకోలేదు. ఆగమ కైంకర్యాలన్నీ యథావిధిగా కొనసాగాయి. 


1713 వ సం. లో ఆర్కాటు నవాబుగా సింహాసనాన్ని అధిష్టించిన సాదతుల్లాఖాన్ కు తోడరుమల్లు అనే హైందవ మంత్రి - సేనాధిపతి, ఆప్తుడు కుడిభుజంగా వ్యవహరించేవాడు. ఆయన శ్రీవారికి పరమభక్తుడు కూడా! తిరుమల క్షేత్రాన్ని ముస్లిం మతఛాందస వాదుల దండయాత్రల నుంచి రక్షించడంలో ఆయన సలిపిన విశేష కృషికి గుర్తుగా - ఆలయం యొక్క సంపంగి ప్రాకారంలో ప్రతిష్ఠించబడిన మాతా, సతీ సమేతుడైన తోడరుమల్లు కాంశ్యవిగ్రహాన్ని నేడు కూడా దర్శించుకోవచ్చు. 


అమల్దారీ వ్యవస్థ

➖➖➖➖➖➖➖

తిరుమల క్షేత్రాన్ని ఓ ముఖ్య ఆదాయవనరుగా పరిగణించిన ఆర్కాటు నవాబులు అమల్దారీ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. క్షేత్రం మొత్తం ఆర్థిక వ్యవహారాల బాధ్యతను అమల్దారు అనే ఒక శ్రీవైష్ణవ బ్రాహ్మణునికి వార్షిక ప్రాతిపదికన గుత్తకు ఇచ్చేవారు. కొంతకాలం ఈ నిబంధన సడలించి కేవలం హైందవుడైతే చాలనే వెసులుబాటు కల్పించారు. దాదాపుగా ఈనాడు ఆలయ పేష్కారు, కార్యనిర్వహణాధికారి నిర్వహించే విధులన్నీ అమల్దారు నిర్వర్తించే వాడు‌. అన్ని మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం ఆ అమల్దారు హక్కుభుక్తం. అలాగే, క్షేత్ర నిర్వహణకు - నిత్యకైంకర్యాలు, ప్రసాదాల తయారీతో సహా - అయ్యే ఖర్చంతా అమల్దారే భరించాలి‌. లాభనష్టాలతో సంబంధం లేకుండా, అమల్దారు ఆర్కాటు నవాబులకు ముందుగా నిర్ణయించ బడిన వార్షిక రుసుము చెల్లించాలి. ప్రతిగా - నవాబులు ఆలయానికి, అమల్దారుకి, భక్తులకు రక్షణ కల్పించేవారు. ఈ ఏర్పాటు ద్వారా నవాబులకు ఆలయ ఆర్థిక నిర్వహణా భారం నుంచి ఉపశమనం లభించడమే కాకుండా, స్థిరాదాయం ఒనగూడేది. ఆలయ నిర్వహణ హైందవావలంబుల ఆధ్వర్యం లోనే నడిచేది. తరువాతి కాలంలో ఆర్కాటు నవాబులు సంధి షరతుల్లో భాగంగా - అమల్దారీ వ్యవస్థ ద్వారా తమకు సంక్రమించబోయే వార్షికాదాయాన్ని ఈస్టిండియా కంపెనీకి శాశ్వతంగా బదిలీ చేయడం వల్ల, వారి హయాంలో కూడా అమల్దారీ వ్వవస్థ కొనసాగింది. ఉదాహరణకు - 1749 లో సాలీనా 47,000 పగోడాలు చెల్లించే షరతు మీద వాసుదేవాచాచారి అనే శ్రీవైష్ణవుణ్ణి అమల్దారుగా నియమించారు. 


పగోడాలంటే?

➖➖➖➖➖


పగోడాలు అంటే ఆరోజుల్లో కొన్ని రాజవంశాలు ముద్రించిన, విస్తృత చలామణీ కలిగిన స్వర్ణనాణేలు. విజయనగర రాజుల కాలంలో ప్రారంభమైన పగోడాల ముద్రణ ఈస్టిండియా కంపెనీ పాలన వరకూ కొనసాగింది. సుమారు మూడు గ్రాముల బరువు కలిగిన ఒక సాధారణ స్వర్ణ పగోడా మూడు రూపాయల విలువకు సమానం. నక్షత్ర పగోడా అంటే మరి కొంచెం విలువ గలిగిన నాణెం. ఆరోజుల్లో - వివిధ రాజ్యాలు, సంస్థానాల్లో వేర్వేరు కరెన్సీలు చెలామణీ లో ఉండటం వల్ల, వేంకటేశునికి కానుకలు దాదాపు దేశవ్యాప్తంగా చెల్లుబాటులో ఉన్న పగోడాల రూపంలో కూడా విరివిగా వచ్చేవి. 


ఆధారాలు లభించినంతలో - 1700 సం. లో ప్రారంభమై శతాబ్దకాలం పాటు కొనసాగిన అమల్దారీ వ్తవస్థలో భాగంగా 28 మంది అమల్దార్లు నియమించ బడ్డారు. 


వేంకటెశుని సేవలో ఒడయార్లు (మైసూరు మహారాజులు)

➖➖➖➖➖➖➖

తిరుమల క్షేత్రం మైసూరు మహారాజుల ప్రత్యక్ష పాలనలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు లేవు. కానీ, ఆలయాభివృద్ధికి వారు చేసిన కృషి, వేంకటేశునికి వారు చేసిన భూరి విరాళాలు, దానాలు చిరస్మరణీయం. వాస్తవానికి, పది - పధ్నాలుగవ శతాబ్దాల మధ్య నేటి కర్నాటక లోని సువిశాల ప్రదేశాన్ని పరిపాలించిన హోయసల రాజుల ప్రతినిధులుగా అప్పటి ఒడయార్లు ఆలయానికి చేసిన సేవలతో - మైసూరు మహారాజులకు తిరుమలేశునితో అనుబంధం మొదలైంది. అత్యద్భుత శిల్పకళా కృతులతో అలరారే బేలూరు, హళేబీడు వంటి చారిత్రాత్మక కట్టడాలు హోయసల రాజులు సృష్టించినవే! 


మైసూరు ఒడయార్లు స్వతంత్ర పాలన లోనికి వచ్చిన తరువాత ఆలయానికి అనేక దానాలు చేసినప్పటికీ - వారు శ్రీనివాసునికి సమర్పించుకున్న అఖండదీపం చరిత్ర ప్రసిద్ధి కెక్కింది. ఈ దీపం మైసూరు అఖండంగా ఖ్యాతి గాంచి, ఈనాటికీ శ్రీవారి గర్భాలయంలో దేదీప్యమానంగా వేలుగుతోంది. అలాగే, వారు ఆలయానికి చేసిన సేవలకు గుర్తుగా, అలిపిరి మెట్ల మార్గం లోని ఒక గోపురం మైసూరు గోపురం గా పిలువ బడుతోంది. మైసూరు మహారాజావారు బహూకరించిన మకరకంఠి అనే ఐదున్నర కిలోల మూడుపేటల హారం ఎప్పుడూ మూలమూర్తిని అలంకరించే ఉంటుంది. ఆ మహారాజుల ఔదార్యాన్ని, వేంకటేశుని పట్ల ప్రగాఢ భక్తిని తరతరాలుగా కొనసాగిస్తూ - వారి వారసుల భాగస్వామ్యం, ప్రేరణలతో ఏర్పాటైన మైసూర్ చారిటీస్ అనే ధార్మికసంస్థ 1965 వ సం‌. లో 32 కిలోల బరువున్న సహస్రనామహారాన్ని శ్రీవారికి సమర్పించుకుంది. అది కూడా నిత్యం శ్రీవారికి అలంకరింపబడే ఉంటుంది. 


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*శల్య పర్వము ద్వితీయాశ్వాసము*


*431 వ రోజు*

ఇంకాచెప్తాను విను. ద్రుపదుడు భీష్మ, ద్రోణులను పడగొట్టాలని చేసిన యజ్ఞంలో నుండి జన్మించిన శిఖండి, ధృష్టద్యుమ్నుడు భీష్మ, ద్రోణ మరణాలకు నిమిత్తమాతృలే కాని అసలు వారు పతనం కావడానికి కారణం నువ్వే. నీవే ఈ అకారణ యుద్ధానికి కారణం. యుద్ధములో డస్సిఉన్న సాత్యకిని భూశ్రవసుడు చంపడానికి కత్తి దూసే సమయంలో అతడిని చంపడం అధర్మమా ! బంధువుల మరణిస్తుంటే వీరులెవరైనా చూస్తూ ఊరుకుంటాడా. బాలుడైన అభిమన్యుని అనేకులు చుట్టు ముట్టి చంపడం నీకు అధర్మంగా కనిపించ లేదుకాని. చెల్లెలి వరుస అని చూడక అడవులలో ద్రౌపదిని చెరపట్టిన జయధ్రధుని యుద్ధభూమిలో చంపక వదలడానికి అర్జునుడు వెర్రి వాడా ! ఘోషయాత్ర పేరుతో పాండవులను అవమానించడానికివెళ్ళి గంధర్వుల చేత చిక్కిన నిన్ను అర్జునుడు కాపాడిన విషయం మరచుట నీకు ధర్మమా ! గోగ్రహణ సమయంలో సమ్మోహనాస్త్రం ప్రభావితుడవైన నిన్ను అర్జునుడు ప్రాణములతో విడుచుట మరవడం ధర్మమా ! నీవు చేసిన అకృత్యములకు మూల పురుషుడైన కర్ణుడు యుద్ధ భూమిలో చిక్కిన కర్ణుడిని అర్జునుడు ఊరక విడుస్తాడా ! అర్జునుడు విడిచిన బ్రాహ్మణ శాపగ్రస్తుడైన కర్ణుడి రథం పైకి లేవగలదా ! యుధిష్టరుడు శల్యుడిని చంపడం అధర్మమం అననందుకు పరమ సంతోషం. సుయోధనా ! నీవు బాల్యం నుడి నీ అన్నదమ్ములైన పాండవులను ద్వేషించావు. కాని పాండవులు నిన్ను ఎన్నడూ ద్వేషించలేదు. కురువంశానిని కూకటి వేళ్ళతో పెకలించడానికి మాయాజూదం అనే గునపం పట్టింది నీవే. నీతొడలు విరుగకొడతానని చెప్పిన భీముడు నిన్ను పిడి గుద్దులు గుద్ది వదులుతాడా ! కనుక వృధా మాటలు కట్టిపెట్టు " అన్నాడు. ఆ మాటలు విన్న సుయోధనుడు " కృష్ణా ! నేను అనేక యజ్ఞ యాగాదులు చేసాను, వేద వేదాంగములను చదివాను. ఎందరో మహారాజులతో నీరాజనాలు అందుకున్నాను. నా శత్రువుల మదం అణచి బంధుమిత్రుల సహితంగా స్వర్గసుఖములను అనుభవించడానికి వెళుతున్నాను. మీ దృష్టిలో నేను దుర్మార్గుడనే అయినా మీరంతా మీ శేష జీవితం పశ్చాత్తాపంతో గడపవలసిందే " అన్నాడు.


*పాండవులను కృష్ణుడు ఒదార్చుట*


పాండవులు సుయోధనుడి మాటలు విని భీష్మ, ద్రోణ, కర్ణులను అధర్మంగా పడగొట్టామా అని తలలు దించుకున్నారు. వారిని చూసిన కృష్ణుడు " మీరు భీష్మ, ద్రోణ, కర్ణులను అధర్మంగా చంపామని బాధ పడవలదు. మహా యోధులైన వారిని ధర్మయుద్ధంలో చంపుట కష్టం కనుక అనేక ఉపాయములతో వారిని పడగొట్టవలసి వచ్చింది. ఆ మహాయోధులు మామూలుగా మరణించరు. అదియును కాక వారి పూర్వజన్మ సుకృతం వారికి మరణం సంభవించేలా చేసింది. దైవ సంకల్పం తప్పించడం మీ తరమా ! ఈ సంతోషసమయాన మీరిలా చింతించ తగదు " అన్నాడు. అప్పటికి పొద్దు వాలింది. కృష్ణుడు పాంచజన్యము, ధర్మరాజు అనంత విజయము, భీముడు పౌండ్రకము, అర్జునుడు దేవదత్తము, నకుల సహదేవులు సుఘోష అనే శంఖములను పూరించారు. భేరీ మృదంగ నాదములు మిన్నంటాయి. అక్కడి వారు ధర్మరాజు విజయుడు అయినందుకు వేనోళ్ళ కొనియాడారు. పాండవులు కౌరవ శిబిరాలకు వెళ్ళారు. సాత్యకి కూడా వారితో వెళ్ళాడు. ధృష్టద్యుమ్నుడు, ద్రుపదుని దాయాదులు, ద్రౌపదీ సుతులు, మిగిలిన మహారాజులంతా ధర్మజుని అనుమతి తీసుకొని ససైన్యంగా తమ శిబిరాలకు వెళ్ళారు. మరునాడు హస్థినాపురం వళ్ళాలని అనుకున్నారు. పాండవులు కౌరవ శిబిరాలకు వెళ్ళారు. నీ కుమారుడి శిబిరం, నాటకం ముగిసిన రంగస్థలం వలె నిశ్శబ్ధంగా ఉంది. అక్కడి పరిచారికలు ధర్మరాజును సత్కరించి గంధపుష్పాక్షితలు సమర్పించారు.



*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

మహాప్రదోషం

 🕉️ *మహాప్రదోషం*🕉️


*గురుబోధ:*

ఉదయం పూట, మధ్యాహ్నానికి కొంచెం ముందు శివలింగ దర్శనం అత్యంత శుభప్రదం. సూర్యోదయానికి ముందు 20ని.లు, సూర్యాస్తమయం తరువాత 20 ని.లు ఈ కాలాన్ని ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం, శివారాధన, శివ పూజ, శివాభిషేకము, జపము చాలా విశేషమైనది, చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు. శివాలయంలో శివలింగం బయట కాని ఆలయ గోపురంపై కాని శివవిగ్రహం ఉంటే, ఆ ఆలయంలో పూజాదికాలు నిర్వహించినవారికి శివపదం వస్తుంది. శివలింగం యొక్క పీఠం లేక పానవట్టం అమ్మవారు. శివలింగం చేతనాత్మకమైన శివస్వరూపం. పానవట్టంతో కూడిన శివలింగం పార్వతీపరమేశ్వరుల ఐక్యరూపం.


https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: తొమ్మిదవఅధ్యాయం

అక్షరపరబ్రహ్మయోగం:శ్రీ భగవానువాచ:


అశ్రద్దధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప 

అప్రాప్య మాం నివర్తంతే మృత్యుసంసారవర్త్మని (3)


మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా 

మత్‌స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః (4)


అర్జునా.. ఈ ధర్మంపట్ల శ్రద్ధలేని పురుషులు నన్ను పొందకుండా మరణరూపమైన సంసారపథంలో పరిభ్రమిస్తారు. ఇంద్రియాలకు కనుపించని నా రూపం ఈ విశ్వమంతా వ్యాపించి వున్నది. సకలజీవులూ నాలో వున్నాయి; నేను మాత్రం వాటిలో లేను.

నా భారత దేశం.

 విద్వన్మండలికి శుభోదయం 

                 ||శ్రీః।।.              

          నా భారత దేశం.           


 కం || శ్రీమంతముబ్రహ్మజ్ఞసు 

ధీమంతముపుణ్యభూనదీ. నదవన వా 

టీమంతము పావన గో 

స్త్రీమంతము భారతోర్వి చెలువొందు భువిన్. 


పదునాలుగు విద్యలకుo 

గుదురై పదునై నృపతి కుంజర తతికిన్ 

జదువై శ్రుతి హిత ధర్మా 

స్పదమై మా భరత సీమ జెన్నారున్. 


గీ || శిష్టసంరక్షణము దుష్టశిక్షణంబు 

సలిపి పరిపూర్ణ ధర్మంబు నిలుపుకొరకు 

యుగయుగంబున నెందు సముద్భవించు 

విష్ణు , నదియె మా భారతోర్వీమ తల్లి. 


దేశభక్తియు ప్రభుభక్తి దేవభక్తి 

మాతృభక్తియుపితృభక్తియు 

మఱియు దేశి 

కాగ్రణులయందు బేదల యందు భక్తి 

ఉగ్గుపాల నేర్తురు భారతోర్వి జనులు .🌹🌷🕉🙏🌹🌷

బాబు దేవీదాస్ రావు.

సుభాషితం

 *"నేటి సుభాషితం"*

(శ్రీ వాల్మీకి రామాయణం నుంచి, రోజుకొకటి)

తదున్నసం పాణ్డురదన్తమవ్రణం 

శుచిస్మితం పద్మపలాశలోచనమ్

ద్రక్ష్యే తదార్యావదనం కదాన్వహం 

ప్రసన్నతారాధిపతుల్యదర్శనమ్

(5.13.68)


*అర్థం:*

ఓహ్! చంద్రునిలాంటి ముఖం, ప్రముఖ ముక్కు, తెల్లటి దంతాలు, ఆహ్లాదకరమైన చిరునవ్వు మరియు తామర రేకుల వంటి కళ్ళు కలిగిన, ప్రసన్నమైన స్వభావం కలిగిన ఆ అందమైన గొప్ప మహిళను (సీతా మాతను) నేను ఎప్పుడు, ఎలా చూస్తాను.


(*సుందరకాండలో, ఈ శ్లోకం రోజుకు 108 సార్లు, 40 రోజులు నమ్మకంతో జపిస్తే,* కష్టాలు తొలగిపోయి సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం ఉంది)



శ్రీ రామదాసు కీర్తన తో శుభోదయం 


*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష*

ధర్మో రక్షతి రక్షితః

సుభాషితం

 *"నేటి సుభాషితం"*

(శ్రీ వాల్మీకి రామాయణం నుంచి, రోజుకొకటి)

తదున్నసం పాణ్డురదన్తమవ్రణం 

శుచిస్మితం పద్మపలాశలోచనమ్

ద్రక్ష్యే తదార్యావదనం కదాన్వహం 

ప్రసన్నతారాధిపతుల్యదర్శనమ్

(5.13.68)


*అర్థం:*

ఓహ్! చంద్రునిలాంటి ముఖం, ప్రముఖ ముక్కు, తెల్లటి దంతాలు, ఆహ్లాదకరమైన చిరునవ్వు మరియు తామర రేకుల వంటి కళ్ళు కలిగిన, ప్రసన్నమైన స్వభావం కలిగిన ఆ అందమైన గొప్ప మహిళను (సీతా మాతను) నేను ఎప్పుడు, ఎలా చూస్తాను.


(*సుందరకాండలో, ఈ శ్లోకం రోజుకు 108 సార్లు, 40 రోజులు నమ్మకంతో జపిస్తే,* కష్టాలు తొలగిపోయి సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం ఉంది)



శ్రీ రామదాసు కీర్తన తో శుభోదయం 


*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష*

ధర్మో రక్షతి రక్షితః

అరుణాచలం

 అరుణాచల👏

*అరుణాచలం.....*


గిరులపై ఆలయాలు ఉంటాయి.. కానీ ఆ పర్వతమే ఓ మహాలయం... అదే పరమ పావనం, దివ్యశోభితమైన అరుణగిరి. భక్తులు మహాదేవుడిగా భావించినా, రమణులు ఆత్మ స్వరూపంగా దర్శించినా ఈ గిరి ఔన్నత్యం అనంతం. సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపంగా భావించి ఈ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసేవారి సంఖ్య అసంఖ్యాకం. అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన మహా క్షేత్రం కార్తిక పౌర్ణమినాడు దేదీప్యమానంగా వెలుగుతుంది.


*ఏమిటీ అరుణాచలం...*


తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. అగ్ని లింగేశ్వరుడుగా ఆదిదేవుడు ఇక్కడ పూజలందుకుంటున్నాడు. ‘స్మరణాత్‌ అరుణాచలే’ అంటారు. అరుణాచలం అనే పేరే ఒక మహామంత్రంగా భావిస్తారు. వైష్ణవులు పరమపావనమైన ఈ కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు. విష్ణువు హస్తభూషణమైన చక్రాయుధం గిరి రూపంగా భువిపై సాకారమైందని విష్ణు భక్తుల నమ్మకం. తిరువణ్ణామలై అంటే శ్రీకరమైన మహాగిరి అని అర్థం. అరుణగిరి రుణానుబంధాల్ని హరించివేస్తుందని అరుణాచల మహాత్మ్యం పేర్కొంది. స్కాంద పురాణంలోని అరుణాచల మహత్యం ఈ క్షేత్ర ప్రశస్తిని, గిరి వైభవాన్ని విశేషంగా వర్ణించింది. మహేశ్వరపురాణంలో వేద వ్యాసుడు అరుణాచల వైశిష్ట్యాన్ని విశదీకరించారు. ముక్తిగిరి, శివగిరి, ఆనందాచలం, అగ్నిగిరి, ఓంకారాచలం ఇలా ఎన్నో పేర్లు అరుణగిరికి ఉన్నాయి. ‘సూర్యుడి నుంచి కాంతిని స్వీకరించే చంద్రుడిలా ఇతర క్షేత్రాలు ఆలంబనగా చేసుకుని ఈ గిరి నుంచి పవిత్రతను అందుకుంటాయని అంటారు. అరుణాచలాన్ని దర్శిస్తే రుణాలు తీరతాయని నానుడి. ఇక్కడ రుణాలు తీరడమంటే బంధనాల నుంచి విడివడి ముక్తిమార్గం వైపు పయనించడం. కైలాసంలో ఉన్న శివమహాదేవుడు నిరంతరం తపోదీక్షలో కొనసాగుతుంటాడు. ఆయన ధ్యానానంతరం కళ్లు తెరవగానే శివుని చూపులు అరుణగిరిపై ప్రసరిస్తాయంటారు. సదాశివుని శుభమంగళ వీక్షణాలతో అరుణాచలం సదా పులకితయామినిగా పరిమళిస్తుంది. అగ్ని లింగమై పరంజ్యోతి స్వరూపుడిగా దర్శనమిచ్చే శివుడు ఈ గిరి రూపంలో విరాట్‌ రూపాన్ని సంతరించుకున్నాడు. ‘ఎవరెన్ని మార్గాల్లో సంచరించినా చివరికి అందరి గమ్యం అరుణాచలమే’ అనేది తమిళనాట జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న సందేశం.


*అప్పుడు... ఇప్పుడు... ఎప్పుడూ...*

 

అరుణాచలానికి యుగయుగాల ప్రశస్తి ఉంది. కృత యుగంలో దీన్ని అగ్ని పర్వతమని, త్రేతాయుగంలో స్వర్ణగిరి అని, ద్వాపరంలో తామ్ర శైలమని వ్యవహరించారు. కలియుగాన శిలాశోభితమైన గిరి ఎన్నో రహస్యాల్ని తనలో నిక్షిప్తం చేసుకుంది. అరుణాచలం 260 కోట్ల సంవత్సరాలనాటిదని ప్రఖ్యాత పురాతత్త్వ శాస్త్రవేత్త బీర్బల్‌్ సహాని నిర్థరించారు. ఈ గిరిపై ఉన్న శిలలు ఎంతో ప్రత్యేకమైనవని, ఈ కొండపై ఉన్న మట్టిలో అనేక ఔషధీగుణాలున్నాయని శాస్త్రీయంగా నిర్థరించారు. గౌతముడు, అగస్త్య మహర్షి ఈ గిరిని శోణాచలమన్నారు. 43 కోణాల్లో శ్రీచక్రాకారంలో ఉండే ఈ పర్వతం శ్రీచక్రత్తాళ్వార్‌కు స్థాణువు రూపంగా వైష్ణవాగమాలు ప్రకటించాయి. జగద్గురువు ఆది శంకరాచార్యులు ఈ కొండను మేరువు గిరి అన్నారు. భగవద్రామానుజులు అరుణాచలాన్ని మహా సాలగ్రామంగా దర్శించారు.


*|| ఓం నమః శివాయ ||*

ఆత్మనాశన హేతువులు.*

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


   శ్లో𝕝𝕝 *అప్రమాణ్యం చ వేదానాం*

           *శాస్త్రాణాం చాభిలంఘనమ్l*

           *అవ్యవస్థా చ సర్వత్ర*

           *ఏతన్నాశనమాత్మనఃll*


              *...మహాభారతమ్…*


తా𝕝𝕝 *వేదాలను అప్రమాణంగా భావించటం, శాస్త్రమర్యాదను అతిక్రమించటం - ఇవి రెండూ ఆత్మనాశన హేతువులు.*


 ✍️VKS ©️ MSV🙏

_జూలై 8, 2025_* 🌝

 🌻🌹 🪷 🌹 *ॐ 卐 ॐ* 🌹 🪷 🌹🌻


     🌞 *_జూలై 8, 2025_* 🌝

*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*

*ఉత్తరాయణం*

*గ్రీష్మ ఋతువు*

*ఆషాఢ మాసం*

*శుక్ల పక్షం*

తిథి: *త్రయోదశి* రా 11.50

వారం: *భౌమవాసరే*

(మంగళవారం)

నక్షత్రం : మర్నాడు *జ్యేష్ఠ* తె 3.21

యోగం: *శుక్లం* రా 11.06

కరణం: *కౌలువ* ఉ 11.03

*తైతుల* రా11.50

వర్జ్యం: *ఉ 7.16 - 9.01*

దుర్ముహూర్తము: *ఉ 8.27 - 9.19*

*రా 10.58 - 11.42*

అమృతకాలం: *సా 5.58 - 7.43*

రాహుకాలం: *మ 3.37 - 5.15*

యమగండం: *ఉ 9.05 - 10.43*

సూర్యరాశి: *మిథునం*

చంద్రరాశి: *వృశ్చికం*

సూర్యోదయం: *5.49*

సూర్యాస్తమయం: *6.54*

           

🌻 🌸 *ఓం శ్రియై నమః* 🙏 🙏

💐 🌹 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏

🌺 *లోకాః సమస్తాః సుఖినోభవంతు* 🌸

🪷 *సర్వే జనాః సుఖినోభవంతు*🌹

🪷🪴 *శుభమస్తు* 🙏 🙏

అమ్మ@న్యాయమూర్తి

 అమ్మ@న్యాయమూర్తి


"మీరు విడాకులు ఎందుకు కావాలనుకుంటున్నారు?" అని ప్రశ్నించింది జడ్జి రాజ్యలక్ష్మి, కోర్టు బోనులో నిలుచున్న ఊర్మిళ అనే యువతిని.


ఊర్మిళ దగ్గర నుండి సమాధానం రాకపోవడంతో, మరో ప్రశ్నలు వరుసగా వెల్లువెత్తాయి.


"మీ భర్త మిమ్మల్ని బాధిస్తున్నారా? ప్రేమగా చూడడంలేదా? పెళ్లి అయి ఎంతకాలమైంది?"


అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం —


"మా పెళ్లయి ఎనిమిది నెలలైంది."


జడ్జి రాజ్యలక్ష్మి ఒక్కసారి ఉలిక్కిపడింది. "ఎనిమిది నెలల కాపురానికే విడాకులా?"


"మీది పెద్దలు కుదిర్చిన పెళ్లి లేదా ప్రేమ వివాహమా?"


"పెద్దలే చూశారు మేడం," అని నెమ్మదిగా చెప్పింది ఊర్మిళ.


"అయితే పెళ్లి చూపుల్లో మాట్లాడుకోలేదా? తిరగలేదా కలసి?"


"తిరిగాం మేడం... పెళ్లి ముందు కలిసి సినిమాలు, షికార్లు చేశాం. పెళ్లి ఘనంగా జరిగింది."


"అయితే సమస్య ఏమిటి?"


"హనీమూన్‌కి తీసుకెళ్లమన్నాను. ముందు ఒప్పుకున్నారు


పెళ్లయ్యాక ఎన్నో మినహాయింపులు చెప్పాడు. ప్రతిరోజూ అదే గొడవ. మాట తప్పితే నాకు కోపం ఎక్కువ.


అది నాకు తెలుసు మేడం. పుట్టినరోజుకి ప్రామిస్‌ చేసిన పార్టీ కూడ మరిచిపోయాడు. ఇవన్నీ నా మనసు కలతపరిచాయి."


"సరే, మీరు వెళ్లొచ్చు," అన్న జడ్జి రాజ్యలక్ష్మి మాటలకు


ఊర్మిళ బోను దిగింది.


తర్వాత రామారావును పిలిపించారు.


"మీ భార్య చెప్పింది నిజమేనా?"


"నిజమే మేడం," అన్నాడు రామారావు.


"అయితే ఎందుకు మాట తప్పారు?"


"మేడం, పెళ్లైన వెంటనే ఉద్యోగం పోయింది. ఈ విషయం ఆమెకు తెలుసు. నూతన ఉద్యోగంలో స్థిరపడాక హనీమూన్‌కి తీసుకెళ్లాలని అనుకున్నాను. ఇది హృదయపూర్వకమైన విషయంలో మాట తప్పింది అనిపించలేదు.


కానీ ఆమె కోపంగా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయింది


వారు కూడా విడాకులకు ప్రోత్సహించారు."


జడ్జికి ఆశ్చర్యంగా అనిపించింది. సమస్య పెద్దదేమీ కాదు. మామూలు గొడవే. కానీ ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే బ్రేకప్ అనుకోవడం, విడాకులు అనుకోవడం యువతలో పెరిగిపోతోంది అన్న ఆలోచన మదిలో మెదలింది.


ఆ కేసు వాయిదా వేసిన జడ్జి, ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మంచంపై వాలింది.


అప్పుడే కాలింగ్ బెల్‌ మోగింది


తలుపు తీయగా, తలుపు దగ్గర నిలుచుంది


తన కూతురు వనజ.


"ఏమ్మా అల్లుడుగారు రాలేదా?"


"లేదు.. నేనే వచ్చేసా."


"ఏంటి అంటే?"


"అతను టూర్‌ వాయిదా వేశాడు.


ఆ విషయం మీద గొడవ.


కోపంగా వచ్చేశా."


ఒక్కసారిగా రాజ్యలక్ష్మికి షాక్‌. అదే మాటలు... అదే కోపం... మళ్లీ ఇదే సమస్య.


"అవును... వనజ మాటల్లో ఊర్మిళ ప్రతిబింబమైంది."


రాత్రి అల్లుడికి ఫోన్ చేసింది రాజ్యలక్ష్మి.


"టూర్‌ పూర్తిగా రద్దా? లేక ఇంకా ప్లాన్‌ ఉన్నదా?"


"పదిహేను రోజుల్లో వెళ్లాలని చూస్తున్నాం అత్తయ్య గారు " అన్నాడు అల్లుడు.


ఆ సమాధానంతో రాజ్యలక్ష్మి తృప్తి పడింది .ఆ పదిహేను రోజులు కూతురు వనజ తల్లి రాజ్యలక్ష్మి ఇంట్లోనే ఉంది. ఈ మధ్య కాలంలో తన తల్లి మాటల్లో కనిపించిన బాధను, ఆలోచనలను, గమనించింది వనజ. అల్లుడు రోజూ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండడం వల్ల ఒరిగిపోయిన అనుబంధాలు మళ్లీ తడిగా మారాయి.


పదిహేను రోజులు గడిచేసరికి, వెళ్ళడానికి రెడీ అయిన


వనజ తో "ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోమ్మా... జీవితంలో ప్రతి ప్రణయం, ప్రతి పెళ్లి ఫొటోలా అందంగా ఉండదు. కానీ ఆ ఫొటో వెనుకున్న కష్టాలు, ఒప్పందాలు, ఓర్పులే జీవితాన్ని నిలబెడతాయి. మొగుడంటే షికార్లు తీసుకు వెళ్లే వాడే కాదు. అతని బాధను కూడా పంచుకుని అర్థం చేసుకునే నిశ్శబ్దమే అసలైన ప్రేమ." అని చెప్పింది రాజ్యలక్ష్మి..


ఇది వివాహ బంధం. ఇవాళ మొగుడు మీద ఉన్న కోపం రేపు ఉండదు. రేపటికి దాని తీవ్రత బాగా తగ్గిపోతుంది. అలా రోజులు గడిచే కొద్దీ మనలో ఆలోచనలు ప్రారంభమవుతాయి


మన తప్పు ఎంతవరకు ఉంది ఇందులో అని లెక్క చూసుకుంటాము.


ఈ రోజుల్లో విడాకులు తీసుకోవడం పెద్ద సమస్య కాదు. ఒక్కసారి విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు నిన్ను ప్రోత్సహించిన కుటుంబ సభ్యులు ఎవరు ఉండరు. అప్పుడు నువ్వు ఒంటరిగా నిలబడిన రోజు తప్పు చేశామని భావన నీలో కలుగుతుంది. అప్పటికి వయసు అయిపోతుంది. జీవితం ముగిసిపోతుంది. ఆఖరి రోజుల్లో ఏ తోడు లేకుండా ఉన్నప్పుడు నీలో బాధ కలుగుతుంది అని చెప్పిన తల్లి మాటలకి కన్నీళ్లు కార్చి తలదించుకుంది వనజ.


మీ తరం వాళ్లకి ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు జీవితాలు పాడు చేసుకుంటున్నారు అని చెప్పవలసిన రెండు మాటలు చెప్పి మౌనంగా ఊరుకుంది రాజ్యలక్ష్మి


అదే సమయంలో ఊర్మిళ కూడా కోర్టులో వచ్చిన కేసును వెనక్కి తీసుకుంది. కారణం రాజ్యలక్ష్మి జడ్జిగా కాదు, ఊర్మిళ విషయంలో కూడా ఒక తల్లిలా ఆలోచించి ఇరుపక్షాల లాయర్లను రామారావు ఊర్మిళ దంపతులను , వాళ్ళిద్దరి తల్లిదండ్రులను కూడా పిలిపించి ఆ దంపతులు ఇద్దరి మధ్య గొడవకి కారణమైన హనీమూన్ వెళ్లడానికి ఏర్పాట్లు చేయించింది జడ్జి రాజ్యలక్ష్మి కాదు కాదు ఒక బాధ్యత గల తల్లి రాజ్యలక్ష్మి. ఆ హనీమూన్ కి అయ్యే ఖర్చుని రామారావు ఊర్మిళ దంపతుల తల్లిదండ్రులు భరించే విధంగా ఏర్పాటు చేసింది.


ఇదంతా కోర్టు ఆవరణలో కాదు. కోర్టు గోడలు దాటి తను చేయగలిగిన సహాయం చేసింది జడ్జి రాజ్యలక్ష్మి. అంతేకాదు ఇరుపక్షాల లాయర్లని కూడా ఒక బాధ్యత గల పౌరురాలిగా సున్నితంగా మందలించింది. మీ దగ్గరికి కేసు రాగానే గబగబా కోర్టులో ఫైల్ చేయడం కాదు. సాధ్యమైనంత వరకు ఇద్దరికీ నచ్చ చెప్పడానికి ప్రయత్నించాలి. ఇలా పెళ్లయిన వెంటనే విడాకులు తీసుకునే జంటలను మనం ప్రోత్సహిస్తే మన సమాజంలో కుటుంబ వ్యవస్థ మిగలదు.


అలా విడాకులు తీసుకున్న యువత మనసు విరిగిపోయి చెడు అలవాట్లకు బానిస అయిపోతారు. అంతే కాదు సమాజానికి చీడపురుగులుగా తయారవుతారు. నేను చెప్పేది కేవలం చిన్న చిన్న తగాదాలతో కాపురాలు విడిపోవడానికి మన దగ్గరకు వచ్చే వాళ్ల విషయం మాత్రమే. హనీమూన్ అన్నది మన సంస్కృతి కాదు. మన సంస్కృతి కానీ విషయాలన్నీ మన భారతీయ వివాహ వ్యవస్థలోకి తీసుకుని వచ్చి చివరికి కాపురాలు కూలిపోయే పరిస్థితిలు ఏర్పడుతున్నాయి. నలుగురికి మన దాంపత్య బంధం లోని విషయాలు ఫోటోల ద్వారా చూపించుకోవాలనే తాపత్రయం తప్పితే వేరే ఆనందం ఏమీ లేదు ఇందులో. నాకోసం మరొక మనిషి ఎదురు చూస్తున్నాడు అనే విషయంలోనే ఎంతో ఆనందం ఉంది. అనుబంధం ఉంది .ఆత్మీయత ఉంది. సినిమాలు చూసి వాతలు పెట్టుకోకూడదు అని చెప్పిన రాజ్యలక్ష్మి మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ తలలు దించుకున్నారు


ఎవరో అన్నట్లు—


"కాపురం అనేది ఓ ప్రయాణం... స్టేషన్‌కి కాకుండా గమ్యం కి చేరాలంటే ఓర్పే టికెట్!" ఓర్చినమ్మకు తేటనీరు అనే సామెత కూడా ఉంది మనకి. భారతీయ కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యత ఉన్నది. దీనిని సవ్యంగా నడిపించే బాధ్యత ఈనాటి యువతరం మీద ఎంతైనా ఉంది.


ఇది కథ ,కానీ నిజజీవితంలో ఇది జరిగే పని కాదు. ఇటువంటి చిలిపి తగాదాలను కోర్టు వరకు రానివ్వకుండా తల్లితండ్రులే న్యాయమూర్తులుగా వ్యవహరించి కాపురాలు చక్కదిద్దాలి. ఇప్పటికే లక్షల కేసులు కోర్టులో ఉన్నాయి. మానవత్వంతో జడ్జి రాజ్యలక్ష్మి చేసిన అరుదైన తీర్పును అన్ని పత్రికలు


ప్రశంసించే యి . అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు రాజ్యలక్ష్మిని సన్మానించాయి.


రాజ్యలక్ష్మి తన బాధను మాటల్లో చెప్పకపోయినా, వనజ, ఊర్మిళ వంటి యువతులను తప్పుదోవనుండి రక్షించడం ద్వారా ఒంటరిగా మిగిలిపోయిన తనలాంటి వాళ్ళు పడే బాధ నుండి తప్పించింది.


రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు


కాకినాడ 9491792279