21, నవంబర్ 2025, శుక్రవారం

మాతృ నిందా

 మాతృ నిందా మహా వ్యాధి: 

పితృ నిందా పిశాచతః!! 

దైవ నిందా దరిద్ర స్యాతు 

గురు నిందా కుల క్షయం.!!


భావం :-


అమ్మను నింద చేస్తే వ్యాధి వస్తుంది. నాన్న ను నింద చేస్తే పిశాచి ఔతాడు. దైవాన్ని నింద చేస్తే దరిద్రుదౌతాడు. గురువును నింద చేస్తే కుల క్షయం. అవుతుంది


(గరుడ పురాణం)

తల్లిదండ్రులను

  💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


   శ్లో𝕝𝕝   *మాతరం పితరం భక్త్యా*

            *తోషయేన్న ప్రకోపయేత్* l

            *మాతృశాపేణ నాగానాం*

           *సర్పసత్రేఽభవత్ క్షయః* ll


      *--- _చారుచర్యా - క్షేమేన్ద్రః_ ---*


తా𝕝𝕝 *తల్లిదండ్రులను భక్తితో సేవించాలి.... వారికి సంతోషం కలిగించాలి... కోపం కలిగించరాదు....తల్లికి ఆగ్రహం కలిగించి శాపగ్రస్తులై నాగసంతతి { సర్పయాగంలో హతులైనారు మిగిలిన వారు చెల్లాచెదురై }పాతాలమును చేరి దుస్థితిని అనుభవించారుకదా!!!*


✍️💐🌹🌸🙏

నేటి సూక్తి*

  *నేటి సూక్తి*


*జీవితంలో తట్టుకోలేనంత కష్టం వచ్చినప్పుడే అనిపిస్తుంది మనం ఇంతకాలం బాధపడింది చాలా చిన్నచిన్న కష్టాలకే కదా అని.*


*క్రాంతి కిరణాలు* 


*కం.తన జీవితమున కష్టము* 

*లనుకోని విధమున చేరి యాపద లిడగా*

*మును వచ్చిన వాటన్నియు* 

*పెను ముప్పులుగా తలవక వెంటనే మరచున్*


*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

*శ్రీ పోతన భాగవత మధురిమలు*

*శ్రీ పోతన భాగవత మధురిమలు* 

(రోజుకొకటి, ఒక సంవత్సరం)


(2-95-క)

యజ్ఞాంగి యజ్ఞఫలదుఁడు

యజ్ఞేశుఁడు యజ్ఞకర్తయగు భగవంతున్

యజ్ఞపురుషుఁగా మానస

యజ్ఞముఁ గావించితిం దదర్పణ బుద్ధిన్.


*భావము:-* యజ్ఞం శరీర మైన వాడు, యజ్ఞానికి ఫలితా న్నిచ్చే వాడు, ప్రభువు, కర్తా అయినట్టి ఆ భగవంతుని యజ్ఞ పురుషునిగా చేసుకొన్నాను. ఆ యజ్ఞాన్ని ఆయనకే అర్పించా లనే బుద్ధితో మానసయజ్ఞం చేశాను.

(నారదునితో బ్రహ్మదేవుడు)


శ్రీ శంకరాచార్య కృత శ్రీ 'జ్ఞానప్రసూనాంబికా' స్తోత్రంతో, *పరమ పవిత్ర మార్గశిర మాస* ప్రారంభ శుభాకాంక్షలు.


*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*

ధర్మో*శ్రీ పోతన భాగవత మధురిమలు* 

(రోజుకొకటి, ఒక సంవత్సరం)


(2-95-క)

యజ్ఞాంగి యజ్ఞఫలదుఁడు

యజ్ఞేశుఁడు యజ్ఞకర్తయగు భగవంతున్

యజ్ఞపురుషుఁగా మానస

యజ్ఞముఁ గావించితిం దదర్పణ బుద్ధిన్.


*భావము:-* యజ్ఞం శరీర మైన వాడు, యజ్ఞానికి ఫలితా న్నిచ్చే వాడు, ప్రభువు, కర్తా అయినట్టి ఆ భగవంతుని యజ్ఞ పురుషునిగా చేసుకొన్నాను. ఆ యజ్ఞాన్ని ఆయనకే అర్పించా లనే బుద్ధితో మానసయజ్ఞం చేశాను.

(నారదునితో బ్రహ్మదేవుడు)


శ్రీ శంకరాచార్య కృత శ్రీ 'జ్ఞానప్రసూనాంబికా' స్తోత్రంతో, *పరమ పవిత్ర మార్గశిర మాస* ప్రారంభ శుభాకాంక్షలు.


*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*

ధర్మో రక్షతి రక్షితః రక్షతి రక్షితః

మనం గొప్పవారం కాదు!!

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸  

ఏ.. విషయంలో.. మనం గొప్పవారం కాదు!!

పది మంది కస్టపడి.. కృషి చేసి మన తో నడిస్తే.. మనం గొప్ప వారం అవుతాం!!

ఇదేదో.. నా ప్రతిభ... అనుకోవడం ఖచ్చితంగా మన అమాయకత్వం!!!

ఒక వేళ ఒక కార్యక్రమం సక్సెస్ అయ్యింది... అది నీది కాదు! నీ ప్రతిభ కాదు.. అది అక్కడకు హాజరు అయ్యిన వారిది!! 

ఏదైనా.. ""సక్సెస్"" "గొప్ప"" ఖచ్చితంగా భగవత్ అర్పితం చేయగలిగే తత్వం.. పెంచుకోవాలి...

అలాగే ఒక కార్యక్రమం.. ఫెయిల్ అయ్యే సందర్భం ఉంటుంది!! దానికి భాద్యత వహించవలిసినది... నిర్వాహకులే...

కారణాలు విశ్లేషణ చెయ్యాలి.. ఎందుకు దూరం జరుగుతున్నారు అని ఆలోచన చెయ్యాలి...

మనం ఒకరిని పదే పదే విమర్శ చేస్తున్నప్పుడు...

ఖచ్చితంగా మనల్ని గమనించే వారు చాలా మంది పెరుగుతూ ఉంటారు!!

సమర్ధుడు సక్సెస్ ఫెయిల్ రెండూ ఒకేలా భావిస్తాడు!!

అసమర్ధుడు ఈర్ష్యా పరుడు స్వార్ధం కోసం పరితపించేవాడు... వాళ్ళని వీళ్ళని భాద్యులు చేస్తూ.. నిందలు వేస్తాడు!!

నిస్వార్ధ భగవత్ అర్పితం చేసి అమ్మవారి మీద భారం వెయ్యి ఖచ్చితంగా అమ్మవారే వెంట ఉండి ముందుకు నడిపిస్తారు!!

జనాలు చేసే... భూషణ దూషణలు... లెక్క చెయ్యక్కర్లేదు!!

భగవంతుడు కోర్ట్ లో.. భగవంతుడు అనుగ్రహo కోరుకోవాలి.. అది సరి అయిన సన్మానం 

దానిముందు ఏ సన్మానం సరిపోతుంది??

మిర్తిపాటి

కంటికి నిద్రవచ్చునె

 కంటికి నిద్రవచ్చునె సుఖంబగునే రతికేళి జిహ్వకున్ / వంటకమిందునే ఇతర వైభవముల్ పదివేలు మానసం / బంటునె మానుషంబు గలయట్టి మనుష్యున కెట్టివానికిన్ / కంటకుడైన శాత్రవుడొకండు తనంతటివాడు గల్గినన్". 

సోమరసం

 “సోమరసం” అనేది వేదాలలో ప్రసిద్ధిగాంచిన పవిత్ర పానీయం. ఇది వేదయుగంలో జరిగే సోమయాగాలు (సోమయజ్ఞాలు) లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దాని గురించి స్పష్టమైన, సంపూర్ణ వివరణ ఇక్కడ ఉంది


సోమరసం — పూర్తి వివరణ


1. సోమరసం అంటే ఏమిటి?


సోమరసం అనేది

✔️ సోమలత (Soma creeper) అనే ఔషధ వృక్షం నుండి తీసిన రసం

✔️ యజ్ఞంలో దేవతలకు అర్పించబడే పవిత్ర ద్రవ్యం

✔️ రిగ్వేదంలో అత్యధికంగా స్తుతించబడిన పదార్థం (Rigveda లో దాదాపు 120 హృచాలు "సోమం"కు అంకితం)



---


2. సోమలత (Soma Plant)


ఈ లత గురించి వేదాలలో చెప్పిన లక్షణాలు:


పర్వత ప్రాంతాల్లో పెరుగుతుంది


పసుపు/ఆకుపచ్చ రంగులో ఉంటుంది


కాండం నుండి ద్రవం వస్తుంది


ఔషధ గుణాలు ఎంతో శక్తివంతంగా ఉంటాయి



ఇది ఆధునిక కాలంలో పూర్తిగా గుర్తుపట్టలేక పోయినా, ഗവేషకులు కొన్ని మొక్కలను సమానమైనవి అని ఊహిస్తున్నారు:


Ephedra


Sarcostemma acidum (Soma-lata)


Periploca aphylla



వేదకారులు చాలా స్పష్టంగా సోమలత = మత్తు కలిగించే మద్యం కాదు అని పేర్కొన్నారు.



---


3. సోమరసం తయారీ విధానం (Vedic Process)


సోమయాగంలో తయారీకి ప్రత్యేక రీతి ఉంది:


(1) సోమలతను తీసుకురావడం


పర్వత ప్రాంతం / అరణ్యం నుండి అచ్ఛంగా తెచ్చి

దాన్ని అధ్వర్యువు శుద్ధిగా కడుగుతాడు.


(2) గ్రావణాలు (Pressing stones)తో నూరడం


ప్రత్యేకమైన రాళ్లతో సోమలతను నూరి రసం తీస్తారు.


(3) వాడిఫిల్టర్ చేయడం


తేనెబుట్టలా ఉండే ఛదయం (ఫిల్టర్) మీద గడచించి

స్పటికసమానమైన రసం పొందుతారు.


(4) పాలు, నీరు, యవం (barley) కలపడం


అగ్నికి, ఇంద్రునికి, అశ్వినులకు వేర్వేరు మిశ్రమాలు చేస్తారు.


(5) హవనం


అగ్నిలో అర్పిస్తారు

మిగిలిన భాగం యజ్ఞకర్త (ఋత్విజులు) ప్రాశనం చేస్తారు.



---


4. సోమరసం యొక్క లక్షణాలు (Vedic description)


వేదాలలో సోమరసం గురించి ఇచ్చిన వర్ణనలు:


శక్తిని పెంచుతుంది


మనస్సుకు స్పూర్తి, వివేకం ఇస్తుంది


ఔషధ గుణాలతో శరీరాన్ని శుద్ధి చేస్తుంది


“అమృతం” అనే బిరుదు ఉంది


యజ్ఞంలో దేవతలను రంజింపజేస్తుంది



ఇందువల్లా సోమాన్ని

ఔషధపదార్థం + పవిత్రమైన ఆహార ద్రవ్యం

గా భావించారు.



---


5. సోమరసం మద్యం కాదు!


కొంతమంది సోమరసాన్ని మద్యం అనుకుంటారు, కానీ వేదాలు స్పష్టంగా చెబుతాయి:


మత్తు కలిగించే లక్షణం లేదు


పూజా పానీయం మాత్రమే


శక్తి, ఆరోగ్యం, ప్రేరణ ఇచ్చేది


ఔషధ రసం



వేదంలో “మద” అనే పదం వస్తుంది, అది

మత్తు కాదు, ఉత్సాహం / ఎనర్జీ అని అర్థం.



---


6. సోమరసం ఎవరికోసం?


యజ్ఞంలో సోమరసం సాధారణంగా కింది దేవతలకు అర్పిస్తారు:


ఇంద్రుడు (సోమపతి)


అగ్ని


అశ్వినులు


రుద్రులు


విశ్వదేవతలు



ఇంద్రుడు సోమరసాన్ని అత్యంత ప్రీతి చేస్తాడని వేదాలు చెబుతాయి.



---


7. సోమరసం ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది?


సంప్రదాయం ప్రకారం నిజమైన సోమలత

ఒకప్పుడు హిమాలయ ప్రాంతంలో ఉన్నట్లు చెబుతారు.

ప్రస్తుతం సోమలతను పూర్తిగా గుర్తుపట్టలేకపోవడం వల్ల

సోమయాగాల సమయంలో పవిత్రతను కాపాడే ప్రత్యామ్నాయ ఔషధలతలు వాడుతున్నారు.

గడ్డిచామంతి


గడ్డిచామంతి ఆకుల రసం గాయాలకు చక్కటి మందు


  . దెబ్బ తగిలిన చోట ఏర్పడిన గాయానికి గడ్డి చామంతి ఆకుల రసాన్ని అప్లై చేస్తే .. అది యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. అంతేకాదు గడ్దిచామంతి అనేక రకాల చర్మ వ్యాధులకు ఈ ఆకు రసం.. ఇప్పటికీ మన దేశంలో అనేక ప్రదేశాల్లో వాడుతూనే ఉన్నాయి. కొన్ని పల్లెటూర్లలోని రైతులు గడ్డి చామంతిని పశువుల గాయాలు, పుండ్లకు వైద్యం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కను ఎగ్జిమా నివారణకు శక్తిమంతంగా ఉపయోగించవచ్చని పలు పరిశోధనల్లో వెల్లడైంది.

పంచాంగం

 జై శ్రీమన్నారాయణ 

21.11.2025, శుక్రవారం 

*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*   

*దక్షిణాయనం - హేమంత ఋతువు*

*మార్గశిర మాసం - శుక్ల పక్షం*  

*తిథి   : పాడ్యమి మ12.45 వరకు*

*వారం   :భృగువాసరే  (శుక్రవారం)*

*నక్షత్రం : అనూరాధ మ1.02 వరకు*

*యోగం : అతిగండ ఉ10.48 వరకు*

*కరణం  : బవ మ12.45 వరకు*

*తదుపరి బాలువ రా1.47 వరకు*

*వర్జ్యం  :  రా7.32 - 8.58 దుర్ముహూర్తము : ఉ8.25 - 9.10*

*మరల మ12.08 - 12.52*

*అమృతకాలం : తె5.48 నుండి*

*రాహుకాలం    : ఉ10.30 - 12.00*

*యమగండ/కేతుకాలం : మ3.00 - 4.30*

*సూర్యరాశి: వృశ్చికం* 

*చంద్రరాశి: వృశ్చికం*

*సూర్యోదయం: 6.12* 

*సూర్యాస్తమయం: 5.20*


*


కార్తీకమాసం ఈ అమావాస్యతో అంటే.. నిన్నటి రోజు గురువారం 20వ తేదీతో ముగిసింది. ఆ మరునాడు అంటే ఈరోజు వచ్చే పాడ్యమిని పోలి పాడ్యమని జరుపుకుంటారు. దీనిని పోలి స్వర్గం అని కూడా అంటారు.  ఈరోజు శుక్రవారం పోలి పాడ్యమిని జరుపుకుంటారు. ఈ పాడ్యమి నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది.


'మాసానాం మార్గశీర్షోహం'

శ్రీ కృష్ణుడు భగవద్గీతలో వివరించినట్లుగా 'మాసానాం మార్గశీర్షోహం' అంటే మార్గశిర మాసం మాసాలలోకెల్లా 'శీర్షం' అంటే' శిరసు' వంటిదని అర్ధం. ఈ మాసంలో పౌర్ణమి నాటి నక్షత్రంగా మృగశిర ఉన్న మాసానికే మార్గశిరమని పేరు.

 మాసాల్లో మార్గశిరాన్ని నేను అని గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా తెలిపారు అని శాస్త్రం చెబుతుంది.


 *ధనుర్మాసం* 

ఈ నెలలోనే సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ కాలమంతా ధనుర్మాసంగా భావిస్తారు. శ్రీ వైష్ణవులకు ధనుర్మాసం అత్యంత ముఖ్యమైన పండుగ . వైష్ణవాలయాలను దర్శించేందుకు, నారాయణుడిని అర్చించుకునేందుకు ఈ మాసం ప్రధానమైనది. వివాహం కావలసిన అమ్మాయిలు కాత్యాయనీ (తిరుప్పావై )వ్రతం ఆచరించడం, తమలోని భక్తిభావం స్థిరమయ్యేలా గోదాదేవి రచించిన పాశురాలను చదవడం ఈ మాసం ప్రత్యేకతలు.


 *ఈ రోజు దీపం వెలిగించేటప్పుడు చదవాల్సిన మంత్రం ఇదే..!* 

 *శుభం కరోతి కళ్యాణం, ఆరోగ్యం ధన సంపదః, శత్రు బుద్ధి వినాశాయ, దీప జ్యోతి నమోస్తుతే"* అనే మంత్రాన్ని చదవాలి


తొలి నుంచి ఈ మాసాంతం వరకు అన్ని శుభ తిథులే. ఇక పోలి పాడ్యమి ఈ రోజు మహిళలు తెల్లవారుజామున నిద్ర లేచి చెరువులు, నదుల్లో దీపాలు వదులుతారు.. ఈ రోజు మరి ముఖ్యంగా పోలి కథను చదువుకోంటారు.  ఈ నెలంతా దీపాలు వెలిగిస్తారు. ఈపాడ్యమి రోజు 30 వత్తులతో దీపాలను వెలిగిస్తారు. అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. అనంతరం మూడు సార్లు నీటిని తోస్తూ నమస్కరించుకుని పోలి స్వర్గం కథ వింటారు...


మార్గశిర మాసం వచ్చిందంటే చాలు తూర్పు తీర నగరం విశాఖపట్నం బురుజుపేటలో కొలువు తీరిన శ్రీకనక మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పే కాదు.. రాష్ట్ర ప్రజల కొంగు బంగారంగా అమ్మవారిని కొలుస్తారు. ఈ ఆమె వారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఈ మాసంలో.. అది, గురువారం అత్యంత పవిత్రమైన దినంగా భావిస్తారు. మార్గ శిర గురువారం కనక మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో బురుజుపేటలోని ఆలయం జన సంద్రంగా మారుతుంది...


 *ఇంతటి విశిష్టమైన మార్గశిర మాసాన్ని ఆధ్యాత్మిక సాధన కోసం వినియోగించుకుందాం. మోక్షాన్ని పొందుదాం. జై శ్రీమన్నారాయణ!*

అపూర్వమైన వరం

 🙏🕉️శ్రీమాత్రేనమః శుభోదయం🕉️🙏 🔥 * *భగవంతుడు మనిషికి ప్రసాదించిన అపూర్వమైన వరం మనసు.. కంటికి కనిపించదు.. చెంచలత్వం ఎక్కువ.. కానీ కనపడనంత దూర తీరాలు విహరిస్తూ అద్భుతాలు సృష్టిస్తుంది.. ఆనందమయమైన మరో లోకం లో విహరింపజేస్తుంది.. మంచిని మరియు చెడుని సమతుల్యంగా స్వీకరిస్తుంది.. మన కంటితో చూడనివి చెవితో వినని విషయాలను పలికిస్తుంది.. దాని వల్ల బంధాలు అనుబంధాలు మరియు స్నేహ సంబంధాలు పాడుచేస్తుంది..ఈ మనసు నాలుకచే మంచిని మరియు చెడుని

చేప్పిస్తుంది.. కొంతమందికి అమృతంలాగా మరి కొంతమందికి చేదుగాను అనిపిస్తుంది అది వాళ్ళు దాన్ని తాగి ఆనందం పొందవచ్చు లేదా బిలి కావచ్చు🔥 ఎవరైతే మనసును అదుపులో ఉంచుకుంటారో వారికి ఆ మనసే బంధువు అవుతుంది.. ఎవరైతే మనసు అదుపులో ఉంచుకోకుండా దాన్ని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తింపజేస్తారో వారికీ ఆ మనసే శత్రువు అవుతుంది.. అందుకే మనసుని దైవచింతనతో నింపి పలికే ప్రతీ మాట సంతోషకరమైనదిగా ఉండేటట్లు చూసుకోవాలి*🔥🔥మీ *అల్లంరాజు భాస్కర శర్మ శ్రీ విజయ ఆయుర్వేదిక్& జనరల్ ఏజన్సీస్ D. N.29-2-3. గోక వరం బస్ స్టాండ్ దగ్గర. స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి. 

పంచాంగం

 ఈ రోజు పంచాంగం 21.11.2025 Friday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాస శుక్ల పక్ష ప్రతిపత్తి తిథి భృగు వాసర అనురాధ నకత్రం అతిగండ యోగః బవ తదుపరి బాలవ కరణం.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు. 

  

 

శ్రాద్ధ తిథి: ఈ రోజు శ్రాద్ధ తిథి లేదు.

 


నమస్కారః , శుభోదయం

సర్వం ఖల్విదం బ్రహ్మ*

  సర్వం ఖల్విదం బ్రహ్మ*

ఇది ఛాందోగ్యోపనిషత్తులోని ఒక మహా వాక్యం దీని భావం ఏమిటంటే ఈ సృష్టి అంతా కూడా బ్రహ్మమయమే బ్రహ్మ కానిది అంటూ ఏది లేదు అనేదే ఈ మహా వాక్యంలోని అర్థము దీనిని ఒక చిన్న కథ ద్వారా విశ్లేషిద్దాము.

*ఒకరోజు రామారావు ఒకరి ఇంటికి వస్తాడు. ఆ ఇంటి ఇల్లాలు ఎంతో రుచిగా జీడిపప్పు, పిస్తా వేసి పాయసం వండి పెడుతుంది. అతడు అంత రుచికరమైన పాయసం తిని ఆనందంతో పాయస పాత్రలోని గరిటకు నమస్కారం చేస్తూ నువ్వు నాకు భగవంతుడివి ఇంత రుచికరమైన పాయసం విస్తరిలో వేసావు అంటాడు…*

*వెంటనే ఆ గరిట నన్ను పొగిడితే ఏమీ ఉపయోగం లేదు. వడ్డించిన చేతికి నమస్కరించు మరింత పాయసం దొరుకుతుంది అంటుంది.*

* వడ్డించిన ఇల్లాలు ఇది నా గొప్పతనం కాదు నా భర్త కష్టపడి సంపాదించి తెస్తే నేను వండిపెట్టాను ఆయనకు నమస్కరించమంటుంది.*

*యజమాని ఇందులో నా గొప్పతనమేమి లేదు భూదేవి మహిమ ఆమె వలన పండిన పంటతో నేను ఆతిథ్యం ఇచ్చాను అంటాడు.*

*భూదేవి నాకు జలం ఆధారం ఆయనకు నమస్కరించు అనగా.. జలం ఆగ్నికి, అగ్ని వాయువుకు, వాయువు ఆకాశానికి ఇలా చివరకు మా అందరికి ఆధారభూతమైన వాడు ఒక్కడే ఆయనే “పరమాత్మ” ఆయనకు నమస్కరించమని చెబుతారు.*

*మనం తినే పాయసానికి పరమాత్మకు సంబంధం ఇదే..*

*సృష్ఠిలో ప్రతిదానికి మూలం ఆ పరబ్రహ్మమే.. మన దగ్గర ఎంత ధనమున్నా, కీర్తి ప్రతిష్టలున్నా వాటన్నిటిని సృష్టించిన వాడు, వాటన్నిటికి అధిపతి ఆ పరమేశ్వరుడే. ఈ సత్యం తెలుసుకొని ప్రతి సాధకుడు ఈ చరాచర జగత్తు మొత్తం పరబ్రహ్మ కలిగి ఉన్నాడు అనే భావనలోకి వచ్చి తను కూడా పరబ్రహ్మలో ఒక అంశం అని తెలుసుకొని పరబ్రహ్మలో లీనయినమయ్యే టందుకు అంటే మోక్షమార్గాన్ని ఎంచుకొని నిత్యం మోక్ష పదం వైపు పయనించాలని ఈ ఉపనిషత్తు ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము.*

ఓం శాంతి శాంతి శాంతిః

 ఇట్లు 

మీ 

చేరువేల భార్గవ శర్మ

*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*


🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - హేమంత ఋతువు - మార్గశిర మాసం - శుక్ల పక్షం - ప్రతిపత్ - అనూరాధ -‌‌ భృగు వాసరే* (21.11.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*