12, డిసెంబర్ 2020, శనివారం

మంత్రపుష్పం

 *🌹. మంత్రపుష్పం అంటే ఏమిటి ? దాని విశిష్టత ఏమిటి ? 🌹*

📚. ప్రసాద్ భరద్వాజ 


సాధారణంగా పుష్పం అనేదానిని పూజలో ఉపయోగించినప్పుడు ఈశ్వరుడు మనకు చెవులు ఇచ్చినందుకు ఆయనకు మనం చెప్పే కృతజ్ఞతకు సాధనంగా వాడతాం. కన్ను ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా దీపం పెడతాం. నాలుక ఇచ్చి రుచి చూసే శక్తి ఇచ్చాడు కాబట్టి నైవేద్యం పెడతాం. స్పర్శ ఇచ్చాడు కాబట్టి చందనాన్ని అనులేపనం చేస్తాం. పంచేంద్రియములు ఒక్కొక్క డానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. వాసన చూసే అధికారం ఇచ్చాడు ముక్కుతో. ధూపం వేస్తాం. చెవులు ఇచ్చాడు. ఎన్నో ఉపకారాలు పొందుతున్నావు. అందుకని పువ్వులతో పూజ చేస్తున్నావు.


వినడానికి పువ్వుకు సంబంధం ఏమిటి అంటే తుమ్మెదల యొక్క ధ్వనులన్నీ పువ్వుల కోసం. పువ్వు దగ్గరికి వెళ్ళి తేనే తాగేటప్పుడు ధ్వనులన్నీ ఆగిపోయాయి.  కాబట్టి ధ్వనులు చెవుల ద్వారా వింటున్నాం కాబట్టి డానికి కృతజ్ఞతగా పువ్వులు వాడతాం. అంతేకాదు పువ్వు జ్ఞానమునకు గుర్తు. జ్ఞానం కలిగితే వికసనం కలుగుతుంది. బుద్ధి వికసిస్తుంది జ్ఞానము చేత. 


అందుకే పూజ చేసేటప్పుడు పువ్వు. చిట్టచివర చేతిలో పువ్వులు పట్టుకుని లేచి నిలబడతాం. పూజ చేసేటప్పుడు కూర్చుంటాం. అసలు రహస్యం తెలుసుకునేటప్పుడు లేచి నిలబడతాం. అప్పుడు చేతిలో పట్టుకున్న పువ్వులను మంత్రపుష్పం అంటారు. 


అంటే మంత్రం అనే పుష్పం ద్వారా అందుతున్న జ్ఞానాన్ని లోపలికి తీసుకో. లోపలికి పుచ్చుకున్నాను అనుభవంలోకి వచ్చేటట్లు చేయమని అడగడానికి పువ్వు ఈశ్వరుడి పాదం మీద పెట్టు. అది మంత్రపుష్పం. 


మంత్రపుష్పంలో ప్రారంభం చేస్తూనే ఒక మాట చెప్తాం – ‘ నాన్యః పంథాయనాయ విద్యతే’ – ఈశ్వరుడిని తెలుసుకోవడానికి ఇంకొక మార్గం లేదు. నీ ఎదురుగుండా పెట్టి నువ్వు ఇప్పటివరకూ ఎవరిని పూజ చేశావో అసలు వాడు ఎక్కడ ఉంటాడో నువ్వు తెలుసుకుంటే అది ఒక్కటే వాడిని తెలుసుకొనే మార్గం. 


ఎక్కడ ఉన్నాడు అంటే ‘హృదయం చాప్యధోముఖం’ – యోగవిద్యను కలిగిన వాడు తెలుసుకుంటాడు. వంగిన తామర మొగ్గ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది ‘నాభ్యాం ఉపతిష్టతి’ – చిటికెన వ్రేలు బొడ్డులో పెట్టుకుని బొటనవ్రేలు పైకి పెడితే బొటనవ్రేలు ఎక్కడ తగులుతుందో ఆ వంగిన మొగ్గ అక్కడికి వస్తుంది. దాని చివర ఒక చిన్న బిందువు ఉంటుంది. ‘నీవార   పీతాభా స్వస్త్యణూపమా’ ‘తస్య మధ్యే – మధ్యలో ఒక చిన్న ప్రకాశం వెలిగిపోతూ ఉంటుంది. ఆ కాంతి, ఆ వెలుగు ‘ఊర్ధ్వ మూల మధశ్శాయీ’ – దానికాంతి పైకి కొడుతోంది, క్రిందకి కొడుతోంది, ప్రక్కకు కొడుతోంది. ఆ కాంతి ఏదో అది జీవుడు. 


‘స బ్రహ్మః స శివః స హరిః సేంద్రః సోక్షరః పరమః స్వరాట్’ – ఏ పేరు పెట్టి పిలు అభ్యంతరం లేదు. కానీ ఆ వెలుగు ఉన్నదే అది పరమాత్మ. అది ఎక్కడ ఉంది? – అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా’. కాబట్టి నిజంగా ఈశ్వరుడిని చూడాలంటే కళ్ళు తెరిస్తే కనబడడం కాదు. కళ్ళు మూతలుపడి అంతర్ముఖత్వంతో లోపలికి ధ్యానంలో ప్రయాణం చేస్తే వెలుగులకు వెలుగైన వెలుగు కనబడుతుంది. వాడు ఈశ్వరుడు. 


వాడు సమస్త ప్రాణికోటియందు హృదయ క్షేత్రంలో వెలుగుతున్నాడు. కాబట్టే ఆ తొడుగుకు ఆకలి వేస్తోంది, నిద్రవస్తోంది. అది లేనినాడు ఆ తొడుగు శవం. అది ఉన్ననాడు ఆ తొడుగు శివం. ఆకలి దానివల్లనే వస్తోంది, ఆకలి తీరింది అని దానివల్లే తెలుసుకుంటోంది. జ్ఞాని ఎలా చూస్తాడంటే తనలో ఉన్నవాడిని చూస్తూ ఉంటాడు తప్ప ఆయనకు నామరూపాలు కాదు. లోపల ఉన్నది అన్నింటిలో నేనే. తెలిసో తెలియకో ఎక్కడ ఉన్నాడు అని శాస్త్రాలు చెప్పాయో అక్కడే చూపిస్తాడు ‘నేను’ అని. 


అంటే ఎవరు ఆ నేను? – భగవంతుడు. ఆ ‘నేను’ అక్కడా ఉంది. ‘నేను’ ‘నువ్వు’ – ఈ ‘నేను’కి, ‘నువ్వు’కి మధ్య స్వార్థం అంతా వస్తుంది. ‘నువ్వు’ పాడైపోయినా పర్లేదు, ‘నేను’బాగుండాలి. కానీ ఇందులో ‘నేను’ అందులో ‘నేను’ ఒక్కటే – జ్ఞానం. ఇక తరతమాలు లేవు, బేధాలు లేవు, అంతటా ఉన్నది పరబ్రహ్మమే. 


అప్పుడు బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఉన్నది ఒక్కటే అది ఎరుకలోకి వచ్చింది. అద్వితీయం – రెండవది లేదు. అద్వైతం – రెండు కానిది. ఒక్కటే. ఒక్కటి అంటే అది ఒకటి ఇది ఒకటి అని అంటారేమో అని రెండు కానిది అన్నారు. ఆ అద్వితీయానుభూతిలోకి వెళ్ళడానికి ఇది ఒక్కటే సాధనం. అందుకు అది మంత్రపుష్పం. 


అది మననాత్ త్రాయతే’ ఎంత ఆలోచించి సాధనలోకి తెచ్చుకుంటావో అంత గొప్పగా అద్వైతానుభూతిలో నిన్ను పెట్టగలదు. అందుకని పూజయందు చివరి భాగమై జ్ఞాన కటాక్షమై మంత్రపుష్పం అయింది. ఇది నా అంత నేను నిలబడితే రాదు, భగవంతుని అనుగ్రహం ఉంటే వస్తుంది. 


కాబట్టి ఆ వికసనాన్ని - ఇవ్వు అని విన్నదానిని పట్టుకుని ప్రయత్నం కోసం, అనుగ్రహం కోసం అడగడం ఆ  భగవంతునికే సమర్పించి నమస్కరించడం. అందుకే పూజ చివరలో మంత్రపుష్పం. పూజ అంతర్భాగంలో పుష్పార్చన...

🌹 🌹 🌹 🌹 🌹

ధార్మికగీత - 107*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                         *ధార్మికగీత - 107*

                                  *****

          *శ్లో:-  దుర్జనః  పరిహర్తవ్యః ౹*

                  *విద్యయా లంకృతో౽పి సన్ ౹*

                  *మణినా భూషిత స్సర్ప: ౹*

                  *కి మసౌ న భయంకరః?  ౹౹*

                                       *****

*భా:- లోకంలో అసత్యానికి, దౌర్జన్యానికి ఉన్నంత  ప్రచారము, ఆర్భాటము సత్యానికి , సౌజన్యానికి  ఉండవు. కాని అసత్యం, దుర్జనత్వము కలకాలం నిలబడలేవు.ఎప్పటికైనా సత్యమే, సౌజన్యమే విజయం సాధిస్తాయి. దుర్జనుడు ఎంత ఉన్నత విద్యలు అభ్యసించినా, శాస్త్రాలు,పురాణాలు తిరగేసినా,  నీతులు, సూక్తులు వల్లించినా, డాబు, దర్పం ప్రదర్శించినా అతడు ముమ్మాటికి విడిచిపెట్టదగిన వాడే! అతని చుట్టూ చేరిన పరివారం కూడ అలాంటిదే కదా! అతనితో స్నేహం మిక్కిలి ప్రమాదకరం. ఎలా! నాగరాజు ఉన్నాడు. పైగా పడగపై మణితో  ప్రకాశిస్తున్నాడు. విలువగలిగిన మణి మనకు కావాలి. సర్పాన్ని చూస్తేనే భయం. సర్పభయంతో ఆ విలువైన మణిని ఎలా సాధించలేమో, అలాగే అవగుణాలు గల ఆ  దుర్జనుని నుండి కూడ విద్యను సాధించ లేము. ఈ రెండూ కానిపనులే. కాన పామును నిర్దాక్షిణ్యంగా వదిలినట్లే, ఆ దుర్జనుని కూడ తత్ క్షణం విడిచిపెట్టాలి.  ఎన్ని ఆకర్షణలు ఉన్నా చెడువైపు పరుగెత్తరాదని, హంగు- ఆర్భాటం లేకున్నా  మంచివైపే నెమ్మదిగా పయనించాలని సారాంశము*.

                                *****

                *సమర్పణ   :    పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

స్త్రీ పై వ్యామోహం

 పరాయి స్త్రీ పై వ్యామోహం  ఎంగిలి ఆకులో భోజనం ఒకటే.. 


ఒకసారి ఒక రాజుగారు గుఱ్ఱం పై సవారీ చేస్తూ ఒక ఇంటి దగ్గర నిలబడ్డాడు.....


ఆ ఇంటిలో ఒకావిడ వాళ్ళ ఆయనకు అన్నం వడ్డిస్తూ ఉంది,

ఆమె చాలా అందగత్తె, ఆవిడ అందం చూసి రాజుగారికి ఆశ్చర్యం కలిగింది. నా రాజ్యంలో ఇంత అందమైన అమ్మాయిని ఇదివరకు చూడనేలేదే  అని అనుకున్నాడు.........


ఆమె భర్త భోజనం చేసి తన పనిపై బయటికి వెళ్ళిపోయాడు.భర్తను పంపించి ఆవిడ వాకిలి మూసేసి ఇంట్లోకి వెళ్ళింది...


అప్పుడు రాజుగారు ఆ ఇంటికి వచ్చి వాకిలి కొట్టాడు. ఆవిడ వచ్చి వాకిలి తీసింది...


రాజుగారు లోపలికి వెళ్ళి కుర్చీపై కూర్చున్నాడు. రాజుగారు తన గురించి చెప్పుకుంటూ నేను ఈ రాజ్యానికి రాజును ,నీవు చాలా అందంగా ఉన్నావు అందుకే నిన్ను నా భార్యగా చేసుకోవాలి  అని అనుకుంటున్నాను,నీవు ఒప్పుకుంటే నిన్ను పెళ్ళి చేసుకొని నా రాజ్యానికి రాణి ని చేస్తాను అని చెప్పాడు.....


ఆమె గుణవంతురాలు మరియు చాలా సంస్కారం కలది. ఆవిడ రాజుగారితో ఇలా చెప్పింది. రాజుగారు తప్పకుండా నేను మీ కోరిక తీరుస్తాను.ముందు  మీరు అలిసిపోయి వచ్చి ఉంటారు. శరీరం, మనసు రెండు ఆకలి తో ఉంటాయి.మీరు వెళ్ళి కాళ్ళూ చేతులు కడుక్కొని రండి అని చెప్పింది........


మా ఆయన ఈ అరిటాకులో ఇప్పుడే భోజనం చేసి వెళ్ళాడు. మీరు ఇదే ఆకులో భోజనం చెయ్యండి .మీకు తృప్తి అయ్యేంత వరకు భోజనం వడ్డిస్తాను .భోజనం అయ్యాక మీ కోరిక తీరుస్తాను  అని చెప్పింది......


అప్పుడు రాజుగారు ఇలా అన్నారు. నేను ఈ రాజ్యానికే మహారాజును,నీ భర్త భోజనం చేసిన ఎంగిలి విస్తరాకులో నేను భోజనం చెయ్యాలా అని అంటాడు.....?


అందుకు సమాధానంగా ఆమె ఇలా చెప్పింది.మహారాజా నా భర్త భోజనం చేసిన విస్తరాకు ఎంగిలిది అంటున్నారే, మరి నా శరీరాన్ని ప్రేమించే మీకు ఎంగిలి అడ్డురాలేదా,పెళ్ళైన నన్ను మళ్ళీ పెళ్ళి చేసుకోడానికి అడ్డురాని ఎంగిలి, నా భర్త భోంచేసిన విస్తరాకులో భోజనం చేస్తే అడ్డువచ్చిందా అని అడిగింది......


అప్పుడు రాజుగారికి తన తప్పు తెలిసొచ్చింది, ఆవిడను క్షమించమని అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు......

             

ఇందులోని నీతి ఏంటంటే.....


  # పరాయి స్త్రీని చెడు దృష్టి తో చూడ కూడదు అని అర్థం#

ఆవుపాల

 🎻🌹🙏ఆవుపాల శ్రేష్ఠత:-


1. కొంచెము పలుచగా ఉంటాయి.

2. త్వరగా అరుగుతాయి.

3. చిన్న పిల్లలకు మంచిది, తల్లిపాలతో సమానము

4. మనిషిలో చలాకీని పెంచుతుంది.

5. ఉదార సంబంధమైన జబ్బులు తగ్గుతాయి . ప్రేగులలో క్రిములు నశిస్తాయి .

6. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

7. చదువుకునే పిల్లలకు తెలివిని పెంచి వారిని నిష్ణాతులను చేస్తాయి.

8. మనస్సును, బుద్ధిని చైతన్య వంతం చేస్తాయి.

9. సాత్విక గుణమును పెంచుతాయి.

10. సాధువులు ఋషులు మునులు ఆవుపాలనే సేవిస్తారు.

11. యజ్ఞమునకు, హోమమునకు ఆవుపాలను వాడుతారు.

12. దేవాలయములలో పూజకు, అభిషేకానికి ఆవుపాలు వాడతారు.

13. కార్తీక పురాణములో- ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే పాపములు పోయి పుణ్యం లభిస్తుందని చెప్పారు.

14. గోవు దేవతా స్వరూపము. కైలాసం దగ్గరలోని గోలోకము నుండి వచ్చినది. ఆవుపాలు, ఆవు నెయ్యితో మనకు దేవతాశక్తి వస్తుంది.

15. ఆవుపాలలో – బంగారము ఉన్నది. ఆవు మూపురములో స్వర్ణనాడి సూర్య కిరణాలతో ఉత్తేజితమై బంగారు (చరక సంహిత) తత్వంగల ఒక పచ్చని పదార్ధాన్ని ఒదులుతుంది. అందువల్ల ఆవుపాలు పచ్చగా ఉంటాయి, ఆవుపాలలో మనకు అత్యంత మేలు చేసే బంగారపు తత్వం ఇమిడి ఉన్నది.

16. తెల్లఆవుపాలు వాతాన్ని, నల్ల (కపిల) ఆవుపాలు పిత్తాన్ని, ఎరుపు రంగు ఆవుపాలు కఫాన్ని హరిస్తాయి.

17. ఆవుపాలు సర్వరోగ నివారణి. ఆవు పాలు వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచుతాయి.

18. ఘృతేన వర్దేతే బుద్ధిః క్షీరేణాయుష్య వర్ధనం, ఆవు నెయ్యి బుద్ధి బలమును పెంచును. ఆవుపాలు ఆయుష్షును పెంచును, ఆవుపాలు గంగానదితో సమానమని కాశీఖండములో చెప్పారు. ఆవుపాలలో విషాన్ని హరించే శక్తి ఉన్నది.

19. చందోగ్య ఉపనిషత్ (6-6-3) మనం భుజించిన తేజో (అగ్ని) సంబంధమైన ఆవు నెయ్యి, నూనె, వెన్న, వగైరాలులోని స్థూల భాగం శరీరంలోని ఎముకలుగా మారుతుంది.


మధ్యభాగం మజ్జ (మూలుగ)గా మారుతుంది. సూక్ష్మభాగం వాక్కు అవుతుంది. ఆరోగ్యమైన ఎముకలు, మజ్జ (మూలుగ) మంచి సాత్విక, శ్రావ్యమైన హక్కు కోసం ఆవు నేయ్యి, వెన్న తప్పక తినవలెను.

20.భారతీయ గోవులకు మూపురము వుండును. ఈ మూపురములోని వెన్ను పూసకు సూర్యశక్తిని గ్రహించగల శక్తి ఉన్నది, అందువలన ఈ ఆవుపాలు, నెయ్యి, వెన్నలకు పైన చెప్పిన ప్రత్యేక గుణములున్నవి.


పాశ్యాత్య గోవులైన జర్సీ, హె.యఫ్ వంటి గోవులకు మూపురము ఉండదు. యివి సూర్యశక్తిని గ్రహించలేవు. అందువలన వీటి పాలు మంచివి కావు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తు మూపురము ఉన్న ఆవుపై ఆధారపడి ఉంది. ఈ ఆవుపాలు చలాకిని, తెలివిని, జ్ఞాపకశక్తిని, సత్వగుణమును, బుద్ధిబలమును, ఒజస్సును పెంచును, ఓజస్సు మనిషి యొక్క తెలివికి, ఆకర్షణశక్తి, వ్యాధి నిరోధక శక్తిని ప్రధాన కారణము, నెయ్యి – ఆరోగ్యమైన మంచి ఎముకలను మంచి రక్తమును ఉత్పత్తి చేయు మూలుగను, మంచి హక్కును, మేధాశక్తిని, కాంతిని, బుద్దిబలమును పెంచుతుంది. విద్యార్థులకు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రక్తంలో చెడు కొలెస్టిరాల్ అయిన యల్.డి.యల్ cholesterol ను పెరగనివ్వదు.


ఆవు నెయ్యి వలన ఉత్పత్తి అయిన మూలుగ నుండి మంచి రక్తము ఉత్పత్తి అయి, వ్యాధికారక క్రిములను (Aids ను కలుగచేయు Virus క్రిములతో సహా) చంపి వేసి, ఆరోగ్యమును కలుగజేయును. స్త్రీలలో ఎముకలు బలహీనమై Osteoporosis, Arthritis అనే వ్యాధి రాకుండా ఉండటానికి , వచ్చిన వ్యాధిని తగ్గించుటకు, గర్భిణి స్త్రీలు మంచి calcium పొందడానికి – Calcium మాటల కన్నా ఆవు నెయ్యి ఎంతో శ్రేష్టమైనది. స్త్రీ గర్భములోని బిడ్డకు ఎముక పుష్టికి, మేధాశక్తికి పునాది వేస్తుంది.


ఈ జన్మలో నిత్యమూ తీసుకొనే ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి యొక్క సూక్ష్మ అంశతో ఏర్పడే ‘మనస్సు, బుద్ధి’ రాబోవు జన్మలో వారికి మంచి మేధాశక్తి, బుద్ధిబలము ప్రసాదిస్తుంది. మన ఋషులు తపశ్శక్తితో చెప్పిన సూక్ష్మ విషయములు Scientists కొంతవరకే నిర్ధారించగలరు. ప్రాణము, మనస్సు, బుద్ధి, ఆత్మ చైతన్యము గురించిన వివరములు Science ఇంకనూ కనుగొనలేదు. వాటి గురించిన వివరములు తెలుసుకో గలిగినప్పుడే Scientists పై విషయములు చెప్పగలుగుతారు. ఆరోగ్యము మేధాశక్తితో కూడిన ప్రజలు మన దేశ భవిష్యత్తుకు మూలము...

స్వస్తి...సేకరణ...🙏🌹🎻

చిట్టికథ

 ✍️....నేటి చిట్టికథ


ఒక చిన్న గ్రామంలో రాళ్లు కొట్టేవాడు ఒకడు ఉండేవాడు. రొజంతా కష్టపడి రాళ్ళని సమమైన ఆకారం వచ్చేటట్లు కొట్టి , ఖాతాదారులకి తగినట్టుగా తయారు చేస్తూ ఉండేవాడు. ఈ పని వల్ల తన రెండు చేతులూ గట్టిగానూ మరియు బట్టలు చాలా మురికిగా తయారయ్యేవి.


ఒక రోజు ఒక పెద్ద శిలని కొట్టి గంటలు కష్టపడి పని చేశాడు .చాలా ఎండగా ఉండటం వల్ల అలిసిపొయి, నీడపట్టున కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు.


ఆ పక్కగా ఒక రాజుగారు వెళ్లడం చూసాడు....

రాజుగారిలా జీవిస్తే ఎంత బాగుండేదో ?” అనుకున్నాడు..అలా అనుకో గానే ఒక వింత జరిగింది.


రాళ్లు కొట్టే వాడు అకశ్మాత్తుగా మంచి ఖరీదుగల దుస్తులు, ఆభరణాలు వేసుకుని ఉన్నాడు. తన చెతులు ఎంతో మృదువుగా అయిపొయాయి. చక్కగా పల్లకిలో కుర్చుని ఉన్నాడు.


ఇలా ముందుకి పల్లకిలో సాగుతూ , కొద్దిసేపటికి రాజుగా మారిన రాళ్ళు కొట్టే వాడు ఎండ తట్టుకోలేక , మంత్రిని కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఆగమన్నాడు. 


అలా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అతనితో మంత్రి ఇలా అన్నాడు’ ,”మహారాజా మీరు ఈ రోజు సూర్యాస్తమయం అయ్యే లోపల అంత:పురానికి చేరుకోక పోతే నన్ను ఉరి తీస్తా అన్నారు కదా ?”అని మనవి చెశాడు .


అప్పుడు మళ్ళీ తన మనుసులో ఇలా అనుకున్నాడు, ” రాజుగా నేను యేమైనా చేయగలను కాని ,నాకంటే సూర్యుడు ఇంకా శక్తిగల వాడు. రాజుగా కంటే సూర్యుడిగా ఉంటే బాగుండు కదా “అని ఇలా అతడు అనుకోగానే  సూర్యుడి గా మారిపొయాడు.


ఇలా ఈ యొక్క కొత్త శక్తి ని అతను అదుపు లో పెట్టలేక పోయాడు.విపరీత మైన ఎండ కాయడం వల్ల పొలాలు ఎండి పొయేవి. సూర్య కిరణాలు వల్ల నీరు ఆవిరిగా మారి, భూమిని, పెద్ద మబ్బుగా కప్పి వేసింది ఆ ఆవిరి.


అప్పుడు అతను ” ఔనూ !సూర్యుడి కంటే మబ్బు శక్తివంత మైనది కదా “అనుకున్నాడు.


వెంటనే మబ్బుగా మారపోయాడు. తన శక్తిని చూపించుకో వాలనే అహంకార భావం వలన ,విపరీతమైన వాన, తుఫాను కురిపించాడు. పొలాలు, ఇళ్ళు అన్నీ కొట్టుకు పోయాయి. 


కాని, తను ఇదివరుకు పని చెస్తున్న శిల మాత్రం కదల లెదు. ఎంత వర్షం కురిసినా కదల కుండా అలా ఉండిపొయింది.


అప్పుడు శిల ఎంత శక్తి వంతమైనది కదా మబ్బు కంటే అనుకున్నాడు. రాళ్లు కొట్టే వాడికే కదా , అటువంటి శక్తివంతమైన శిలని మంచిగా తయారు చేయగలిగే శక్తి ఉంటుంది “! అని అనుకున్నాడు.


T.me/namonarayana


 వెంటనే మళ్ళీ అతను రాళ్లు కొట్టే వాడిగా మారి పొయాడు.


ఎప్పటి లాగానే తన రెండు చెతులూ కఠినంగా అయిపొయాయి, బట్టలు మాసి పోయి రాళ్లు కొడుతూ సంతోషంగా ఉన్నాడు.



తన తప్పుని తెలుసుకుని తృప్తిగా తన వృత్తి ధర్మాన్ని ఆనందంగా నిర్వర్తించ సాగాడు. 



🍁🍁🍁🍁🍁


శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః


----  భగవద్గీత


 “గొప్పగా ఉందనుకునే ఇతరుల ధర్మం కంటే, గొప్పగా కనిపించకపోయినా తన ధర్మమే మంచిది. ఆ ధర్మం ఆచరిస్తూ చనిపోయినా మంచిదే. అంతే కానీ పరుల ధర్మం ఆచరించడం భయంకరమైనది”


🍁🍁🍁🍁🍁

జీవిత సత్యం

 దయచేసి ఈ జీవిత సత్యం తెలుసుకోండి. 


ఒకానొక కోటీశ్వరుడు ప్రతి సంవత్సరం వ్యాపారం లో తనకొచ్చిన లాభాలలో నాలుగో వంతన్నా దాన ధర్మాలకు ఖర్చు చేసేవాడు. అందరూ తనను దాన కర్ణుడు అని ప్రశంసిస్తూ ఉంటే ఆయనకు అదొక తృప్తి గా ఉండేది. చనిపోయిన తరవాత కోటీశ్వరుడు స్వర్గం చేరాడు. కానీ అక్కడ కొద్ది కాలం మాత్రం గడిపిన తర వాత, యమదూతలు తనని నరకానికి తీసుకువెళ్లటం అతడికి బాధతో పాటు ఆశ్చర్యాన్ని కలిగింది. నరకా నికి వెళుతూనే, చిత్రగుప్తుడితో వాదం పెట్టుకొన్నాడు. ‘అయ్యా! ఇన్ని దానధర్మాలు చేసిన నన్ను నరకానికి పంపడ మేమిటి? మీ లెక్కలో ఏదో పొరపాటు జరిగింది. దాన్ని సరిచేయించండి’ అని.


 చిత్రగుప్తుడు కోటీశ్వరుడికి పరిస్థితి వివరించాడు: ‘నాయ నా, పొరపాటేమీ లేదు. నీకు నీ దానధర్మాల వల్ల చాలా పుణ్యం రావలసిన మాట నిజ మే. కానీ, నువ్వు దానం కోసం నీ దగ్గరకు వచ్చిన వాళ్ల ను చులకనగా చూసి, ఒకటికి పదిసార్లు నీ చుట్టూ తిప్పించుకొన్న తరవాతే నువ్వు చేసే దానమేదో చేసేవా డివి. ఆ కారణంగా, నీకు రావలసిన పుణ్యంలో నాలు గోవంతు చేతులారా నువ్వే పోగొట్టుకొన్నావు! ఆ తర వాత, ‘నేను అంత దానం చేశానూ, ఇంత దానం చేశానూ’ అని పదే పదే ప్రతిచోటా సందర్భం ఉన్నా లేకపోయినా ఆత్మస్తుతి చేసుకొని మరో నాలుగో వం తు పుణ్యం పోగొట్టుకున్నావు!’


 ‘అయినా, కనీసం ఆ మిగతా సగం పుణ్యమన్నా నాకు దక్కాలి గదా?’ అన్నాడు కోటీశ్వరుడు. ‘దక్కేదే, కానీ దాన గ్రహీతల చేత నువ్వు చేయించుకొన్న సత్కా రాలూ, సన్మానాలు, స్తుతులు, స్తోత్రాలూ వగైరాలకూ నీ పేరు ఉండాలని బలవంతం చేసి, నువ్వు సంపాదిం చిన పుణ్యంలో మిగిలిన భాగం కూడా అప్పుడే ఖర్చు చేసేసుకొన్నావు! కనక నీకు రావలసిన పుణ్యంలో స్వల్పమైన భాగమే నీ ఖాతాలో చేరింది’ అన్నాడు చిత్ర గుప్తుడు. ‘అదేమిటి? నా డబ్బుతో కట్టించిన ఆశ్రమా లకు నా పేరు పెట్టమంటే తప్పా? నా సొమ్ము దానం చేసినప్పుడు నేను దానం చేశానని చెప్పుకొంటే పాప మా?’ ఆక్రోశంతో ప్రశ్నించాడు కోటీశ్వరుడు.


 ‘అక్కడే చాలా మందిలా నువ్వూ పొరబడుతున్నా వు నాయనా! భూమి మీద నువ్వు జన్మ ఎత్తినప్పుడు నీ దగ్గర నువ్వు తెచ్చుకొన్న ద్రవ్యమంటూ ఒక్కపైసా లేదు. నీ జీవిత కాలంలో కొన్ని కోట్ల రూపాయలు నీ చేతికి వచ్చాయి. కానీ ఆ జీవిత కాలం ముగిసిన తర్వా త సంక్రమించినదాన్లో ఒక పైసా కూడా మళ్లీ నీతో తెచ్చుకోలేకపోయావు. ఇక అది నీ సొమ్ము ఎలాగ యింది చెప్పు? సృష్టిలో ఉన్న ఐశ్వర్యాలూ, వనరులూ అన్నీ భగవంతుడివే. నీ కర్మ ఫలం వల్ల, ఆయన తన మహదైశ్వర్యంలో కొద్దిపాటి భాగం కొంతసేపు నీ చేతి లో ఉంచాడు. ఆ ధనంలో కొంత భాగం నువ్వు ఆయ న మెచ్చే దానధర్మాల కోసం వాడిన మాట నిజమే! ఆ మాత్రానికే నీకు ఎంతో పుణ్యం రావలసింది. కానీ ఆ పుణ్యమేదో అప్పటికప్పుడే పేరు కోసం, కీర్తి కోసం, అహం కోసం ఖర్చు పెట్టేసుకొన్నావు. మిగిలిన అతి స్వల్ప భాగం నువ్వు చేసిన కొద్ది కాలపు స్వర్గవాసంతో చెల్లు అయిపోయింది’ అని చిత్రగుప్తుడు చెప్పేసరికి కోటీశ్వరుడు కొయ్యబారి పోయాడు.👏👏

కోరికలే కష్టాలకు కారణం

 కోరికలే కష్టాలకు కారణం. కాబట్టి అలాంటి కోరికల్ని త్యజించమన్నాడు బుద్ధుడు. కోరికలంటే ఎలాంటి కోరికలు? ప్రపంచమంతా సుఖంగా వర్ధిల్లాలని కోరుకోవడం ఇలాంటి కోరిక కాదు. శాంతి అహింసలు పరిఢవిల్లాలని కాంక్షించడమూ ఈ కోవలోకి చేరదు. కర్మఫల త్యాగాన్ని మన ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. కోరికలు లేకపోతే సుఖంగా బతకవచ్చని, ప్రజల హృదయాల్లో ముద్రవేసే విధంగా బుద్ధుడు చెప్పగలిగాడు. బుద్ధుడికి స్వర్గకాంక్ష లేదు. రాజ్య కాంక్ష అసలే లేదు. సంసారాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఏ కోరికాలేని మనీషి (బుద్ధుడు) అయ్యాడు. కాబట్టే శత్రువుకు మేలుచేయడం, ద్వేషించేవారిని ప్రేమించడం ఆయనకు సాధ్యపడింది.


               ఎంత జ్ఞానం ఉంటే ఇది సాధ్యపడుతుంది? ఆకాశమంత! తాను ఆ స్థాయికి చేరుకోవడమేగాక, సాధన చేస్తే అందరూ ఆ స్థాయిని పొంది 'బుద్ధులు' కావచ్చుననీ ఆయన బోధించాడు. ఈ సాధనకు మూల సూత్రం 'కోరిక లేకపోవడం'. తాను జీవితంలో ఆచరించి మరీ చెప్పాడు. భిక్షాటనతో బతికాడు. జంతుజాలమంతా మనవంటిదే కాబట్టి జాలితో చూడమన్నాడు. వాటిని రక్షించడం కోసం నిత్యం తహతహలాడాడు. 'మేకపిల్లను బలి ఇస్తే మోక్షం వస్తుందా? అయితే, మనిషిని బలి ఇస్తే మరీ మంచిది కదా! కాబట్టి నన్నే బలి ఇవ్వండి' అని ఒక జీవిని రక్షించడంకోసం తానే బలిపీఠం ఎక్కాడు. ఇందువల్ల ఆ మహాపురుషుడికి ఒరిగిందేమిటి? తాను అధికారంలోకి రావడానికో, పూజలందుకోవడానికో ఈ పనిచేయలేదు. ఉన్న అధికారాన్ని వదులుకున్నాడు. పూజలపై విశ్వాసంలేదు. 'కరుణ' కోరికలతో సంబంధంలేనిది. దేవుడు, స్వర్గం, ముక్తి... వీటిని గురించి బుద్ధుడు పట్టించుకోలేదు. స్వార్థ రహితమైన సజీవ ప్రేమను ప్రపంచ ప్రజలకు ఒక సందేశంగా అందించాడు.

ఈ లోకానికి మహోపకారం గావించిన మహాత్ములెవరూ తమకంటూ ఏమీ కోరుకోలేదు. ఆఖరికి తమ సంతానం సిరిసంపదలతో తులతూగాలనీ వాంఛించలేదు. 'నాకేంటి?' అనే ప్రశ్న కలలో కూడా మొలకెత్తని 'బుద్ధులు' వీళ్లు. ధర్మానికి బద్ధులు. 'సరే! నీకు ఇది ఇస్తా! మరి నాకేంటి? తిరిగి నాకు ఏమిస్తావు?' అనే ప్రబుద్ధులు నేటి సమాజంలో కనబడుతున్నారు. తమకు లాభం లేకపోతే వీళ్లు దేవుడికి దండం కూడా మనస్ఫూర్తిగా పెట్టరు. భక్తి వెనక ఏ కోరికా ఉండకూడదు. అధికమైన కోరికలకు కారణం అజ్ఞానం. ఒక శాస్త్రజ్ఞుడు అహర్నిశలూ పరిశోధిస్తున్నాడు. ఒక నూతన గణన యంత్రాన్ని నిర్మించడానికి శ్రమిస్తున్నాడు. అతడి కుమారుడు వచ్చి 'నాన్నా! ఇదేమిటి?' అని ప్రశ్నించాడు 'ఒక అపూర్వ గణన యంత్రాన్ని కనిపెడుతున్నాను!' అన్నాడు తండ్రి. 'ఇందులో నుంచి చాక్లెట్లు వస్తాయా?' ఆశగా ప్రశ్నించాడు కుమారుడు. 'అలాంటివేమీ రావు!' అన్నాడు శాస్త్రజ్ఞుడు. 'అయితే ఇది వట్టి పనికిమాలిన యంత్రం... దీంతో నాకు పనిలేదు!' అంటూ ఆ పుత్రరత్నం నిరాశతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. లోకం మొత్తానికి మేలుచేసే వస్తువు తనకూ మేలు చేస్తుంది గదా అనే ఆలోచన ఆ పసివాడికి కలగలేదు. అతడికి కావలసింది చాక్లెట్‌. తన కోరిక తీర్చేది ఉంటే చాలు. లోకం మేలుతో అతడికి పనిలేదు. పసివాళ్లకు అలా అనిపించడం సహజం. కారణం అజ్ఞానం. కానీ, ఉత్తమ విద్యలభ్యసించి, ఉన్నత పీఠాలు అధివసించినవారిది అజ్ఞానమా? కాదు అత్యాశ!

కన్నబిడ్డలకు అన్నం పెడతారు. వస్త్రాలిస్తారు. తల్లిదండ్రులకు ఎలాంటి ప్రతిఫలాపేక్షా ఉండదు. ఇలాంటి సేవాదృక్పథమే పాలకులకు ఉండాలి. 'ఇతరుల కోసం చేసే అతిస్వల్ప కార్యం కూడా మనలోని మహాశక్తిని మేల్కొలుపుతుంది' అంటాడు వివేకానందుడు. లోకానికి మనం ఇచ్చే ప్రతి వస్తువునూ ప్రతిఫలాపేక్ష రహితంగా సమర్పించడమే సనాతనధర్మం. ఒక పర్యాయం లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్‌ బొంబాయిలో ఉపన్యాసం ఇచ్చాడు. ఆయన అపార పరిజ్ఞానానికి సభాధ్యక్షుడు ఆశ్చర్యపోయాడు. 'తిలక్‌ మహాశయా! మీతో సాటిరాగల ప్రజ్ఞావంతులెవరూ లేరు. మీరు అనవసరంగా స్వాతంత్య్రపోరాటంలో కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. విశ్వవేదికలపై మీ అపార పాండిత్యాన్ని ప్రదర్శిస్తే అఖండ ఖ్యాతిని ఆర్జిస్తారు గదా!' అన్నాడు. తిలక్‌ ఇలా సమాధానమిచ్చాడు- 'అధ్యక్ష మహోదయా! దేశానికి స్వాతంత్య్రం వస్తే నావంటి ప్రజ్ఞానిధులు వేలమంది ఉద్భవిస్తారు. నాకు పేరు ప్రఖ్యాతులపై కోరికలేదు. భగవంతుడు నాకిచ్చిన శక్తిని దేశసేవకే వినియోగిస్తాను. నాకంటూ ఏమీ అవసరంలేదు!' ప్రతి ఒక్కరూ ఈ త్యాగమూర్తుల ఆదర్శ జీవితాన్ని స్మరిస్తే 'నాకేంటి'అనే మాట నోట రానేరాదు.👏👏👏

భగవంతుడు మనతోనే

 ఒక రోజు ఒక ఉన్నత అధికారి వేగంగా తన కొత్త కార్ -”జాగ్వార్” లో పని మీద వెళ్తున్నాడు.దూరం నుండి దారిలో పిల్లలు ఆడుకోవటం గమనించాడు. పిల్లలు ఆడుకుంటున్న చోట దెగ్గరికి వచ్చేసరికి బ్రేక్ వేసి పిల్లలుకు దెబ్బల తగలకుండా జాగ్రత్త పడ్డాడు. ఇంతలో హఠాత్తుగా ఒక ఇటుక రాయి ఎక్కడ నించో తన కార్ డోర్ మీద పడింది.


కార్ ని వెనుకకు తిప్పి ఇటుక రాయి పడేసిన ఆ కుర్రాడిని “ నువ్వు ఎవరు?ఎందుకలా చేశావురా “,అని కోపంగా మందలిస్తూ అడిగాడు. అంతే కాకుండా,”నా కార్ కొత్తదిరా,నీవు చేసిన పని వల్ల జరిగిన నష్టానికి నాకు చాలా డబ్బు ఖర్చు అవుతింది తెలుసా! నీవు ఎందుకలా చేశావు?”అని ఆ పిల్లవాడిని ఈ పెద్ద మనిషి నిలదీసి అడిగాడు.


దానికి జవాబుగా ఆ పిల్లవాడు”మాస్టారు!,దయ చేసి నా మాట వినండి,నన్ను తప్పుగా అర్ధం చేసుకోండి.ఎంత ప్రయత్నించినా ఎవరూ కార్ ను ఆపడం లేదు.. అందుకే నేను లా చేయవలసి వచ్చింది.”అదిగో అటు చూడండి సార్ ,మా తమ్ముడు వీల్ చైర్ నుండి కింద పడి పోయాడు?”వాడిని తిరిగి మళ్ళీ ఆ కుర్చీ లో కూర్చోపెట్టి ఇంటి వరకు తీసుకెళ్ళాలి,దయ చేసి నాకు సహాయం చేయగలరా,నేను ఒకడిని వాడిని ఎత్తి అందులో కూర్చో పెట్ట లేక పోయాను” అని ఏడుస్తూ  బ్రతిమాలాడు.


ఆ పిల్లవాడి పరిస్థితిని చూసి కార్ ఓనర్ చాలా జాలి పడ్డాడు,అతని కోపమంతా కరిగిపోయింది. వెంటనే తన చేతులతో క్రింద పడి ఉన్న ఆ పిల్ల వాడి తమ్ముడిని మళ్ళీ కుర్చీ లో కూర్చోపెట్టాడు. తన సొంత రుమాల్ (కర్చీఫ్ )ని తీసుకుని అతని ఒంటికి తగిలిన గాయాలను తుడిచి ,”నీకింకేమి కాదు,భయపడకు .”అని అన్నదమ్ములిద్దరికీ ధైర్యం చెప్పాడు.

ఎంతో దయతో సహాయం చేసిన అతనికి ఆ పిల్లవాడు కూడా,“ఆ భాగవతుడు మిమ్మల్ని  చల్లగా చూడాలి సార్” అని కృతజ్ఞతలను తెలుపుతూ వీల్ చైర్ లో కూర్చున్న తన తమ్ముడిని తోసుకుంటూ ఇంటి వైపు వెళ్ళిపోయాడు.


జోరుగా తగిలిన ఇటికరాయి దెబ్బకి కార్ డోర్ బానే సొట్ట బోయిందని తెలుసుకున్న ఓనర్ దాన్ని రిపేర్ చేయించకుండా  ఈ సంఘటనకి గుర్తుగా అలాగే  ఉంచేసాడు.


ఎందుకంటే దాని వల్ల ఆతను

“జీవితంలో మన చుట్టూ ఉన్న మనుషులని,పరిసరాలని పట్టించుకోకుండా మన సొంత పనులలో మునిగిపోతే,ఆపదలో ఉన్న వారిని గమనించలేము.అప్పుడు మన దృష్టిని వారి వైపు మరల్చటానికి ఎవరైనా ఇలంటి  సైగ చేసి మనని పిలిచే పరిస్థితి కలగకుండా మనము చూసుకోవాలి”అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు.”


నీతి: భగవంతుడు మనతోనే ఉంటూ మన బాగు కోసం అంతర్వాణి రూపంలో ( inner voice) మనకి ఎప్పటికప్పుడూ సూచనలను,హెచ్చరికలను ఇస్తూనే ఉంటాడు. కానీ ,మన గోలలో మనం పడి వాటిని అశ్రద్ధ చేసినప్పుడు అనుభవాల ద్వారా మనము గుర్తించేలా చేస్తాడు.వాటిని వినటం, వినకపోవడం మన చేతుల్లోనే ఉంది. కనుక నిజ జీవితంలో అతి వేగాన్ని తగ్గించుకుని నిదానంగా , మానసిక అలజడి లేకుండా ఉండగలిగితే మన మంచి చెడులే కాకుండా మన చుట్టు పక్క వాళ్ళ బాగోగులని కూడా తెలుసుకుని వారికి సహాయపడే అవకాశాన్ని ఆ  భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు.

ఏలూరు శాంపిల్స్‌ భయానకం

 ఆంధ్రప్రదేశ్ : పశ్చిమ గోదావరి : 


*ఏలూరు శాంపిల్స్‌ భయానకం- విస్తుపోతున్న డాక్టర్లు- బయటపడుతున్న నిజాలు*


  

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుపట్టని వ్యాధికి గల కారణాలు క్రమంగా బయటికి వస్తున్నాయి. వింతవ్యాధికి గల కారణాలను తేల్చేందుకు పంపుతున్న శాంపిల్స్‌ను పరీక్షిస్తున్న డాక్టర్లు విస్తుపోతున్నారు. అసలు ఇలాంటి పరిస్ధితుల్లో జనం అక్కడ ఎలా బతుకుకున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అంతా ఊహించినట్లుగానే నీటి కాలుష్యమే ఈ వింతవ్యాధికి కారణమని నిర్దారణ అవుతుండగా... ఇందులో క్రిమిసంహారకాల శాతం కొన్ని వేల రెట్లు అధికంగా ఉన్నట్లు తేలడం విభ్రాంతికి గురిచేస్తోంది. వ్యవసాయం పేరుతో స్ధానికంగా విచ్చలవిడిగా సాగుతున్న *పురుగుమందుల వాడకమే దీని వెనుక ఉన్నట్లు స్పష్టమవుతోంది*.




ఏలూరు వింతవ్యాధి శాంపిల్స్‌ భయానకం

ఏలూరులో తాజాగా బయటపడిన వింతవ్యాధికి గల కారణాలను వెలికితీసేందుకు ఎయిమ్స్‌, డబ్లూహెచ్‌వో, సీసీఎంబీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముందుగా రోగుల శరీరాల నుంచి సేకరించిన శాంపిల్స్‌ పరీక్షించినప్పుడు వాటిలో సీసం, నికెల్‌ ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు, ఇప్పుడు నీటి నమూనాలను పరీక్షిస్తే మరిన్ని విభ్రాంతికర వాస్తవాలు బయటికొచ్చాయి.


నీరు ఎన్నడూ లేనంత దారుణంగా కలుషితమైందని, వైరస్ ఆనవాళ్లు లేకపోయినా పురుగుమందుల అవశేషాలు మాత్రం వేల రెట్లు అధికంగా ఉన్నాయని నిర్ధారణ అవుతోంది. దీంతో వీటిని మరింత లోతుగా పరీక్షించేందుకు డాక్టర్లు సిద్ధమవుతున్నారు.



దారుణంగా కృష్ణా, గోదావరి నీరు..

ఏలూరుకు కృష్ణా, గోదావరి నదుల నుంచి నీళ్లు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాలకు కృష్ణా కాలువ నీరు, మరికొన్ని ప్రాంతాలకు గోదావరి నీళ్లను తాగునీరుగా మార్చి అందిస్తున్నారు. ఈ రెండు నదుల నీళ్ల నుంచి సేకరించిన శాంపిల్స్‌లోనూ క్రిమిసంహారకాలు వేల రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. వీటిలో కలుపుమొక్కల నివారణకు వాడే మందులతో పాటు దోమలు, ఈగలు, బొద్దింకల నివారణకు వాడేవి, పంటల్లో చీడపీడల నివారణకు వాడే అలాక్లోర్‌, ఓపీ-డీడీటీ, పీపీ-డీడీఈ వంటి ప్రమాదకర రసాయనాలు ఈ నీళ్లలో ఉన్నట్లు తేలింది.


కృష్ణా, గోదావరి కాలువల్లో అలాక్లార్‌ లీటర్‌కు సగటున 10 మిల్లీ గ్రాములకు పైగా ఉండగా.. పెన్షన్‌ లైన్ నీళ్లలో అలాక్లోర్‌ 14 మి.గ్రాములు, ఓపీ-డీడీటీ 15 మిల్లీగ్రాములు, జేపీ కాలనీలో పీపీ-డీడీఈ 14 మిల్లీగ్రాములు, ఓపీ-డీడీటీ 15 మిల్లీ గ్రాములు, గాంధీ కాలనీలో ఓపీ-డీడీడీ 14 మిల్లీగ్రాములు, పీపీ-డీడీడీ 15 మిల్లీగ్రాములు, రామచంద్రరావుపేటలో అలాక్లోర్ 10 మిల్లీగ్రాములు, ఓపీ-డీడీఈ 13.37 మిల్లీగ్రాములున్నట్లు తేలింది.





*17 వేల రెట్లు ఎక్కువగా రసాయనాలు*..


ఏలూరు కృష్ణా కాలువ నుంచి సేకరించిన నీటి నమూనాల్లో మెథాక్లీక్లోర్‌ ఏకంగా 17 వేల640 రెట్లు ఎక్కువగా ఉందని డాక్టర్లు తేల్చారు. తాగునీటిలో ఈ రసాయనం అసలు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కేవలం 0.001 మిల్లీ గ్రాములకు మించకూడదు. కానీ తాజా శాంపిల్స్‌ పరీక్షల్లో ఇది 17.64 మిల్లీ గ్రాములున్నట్లు తేలడం డాక్టర్లను సైతం కలవరపెడుతోంది.


ఏలూరులో దాదాపు ఆరు ప్రాంతాల్లో నీటి నమూనాలను సేకరించి పరీక్షించగా.. అన్ని చోట్లా దాదాపు ఒకే ఫలితాలు రావడంతో జనాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొన్నేళ్లుగా నగరానికి సరఫరా అవుతున్న కృష్ణా, గోదావరి జలాలు విషతుల్యం కావడం వల్లే రోగుల శరీరాల్లో సీసం, నికెల్‌ చేరినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వాల నిర్లక్ష్యం, రైతుల విచ్చలవిడితనం బయటికొస్తున్నాయి.


*శాంపిల్స్‌ చూసి విస్తుపోతున్న డాక్టర్లు*..


ఏలూరు నుంచి పలు ల్యాబ్‌లకు వెళ్తున్న శాంపిల్స్‌ పరీక్షిస్తున్న డాక్టర్లు నిర్ఘాంతపోతున్నారు. ఏలూరులో ఎన్నేళ్లుగా ఇలాంటి నీటిని జనం వాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇంతటి హానికర రసాయనాలు నీటిలో ఉండేందుకే వీల్లేదని, అలాంటిది వేల రెట్లు ఎక్కువగా ఉండటం, దాన్ని కొన్నేళ్లుగా అలాగే వాడేస్తుండటంతో జనం శరీరాల్లో భారీగా సీసం, నికెల్‌ అవశేషాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం రోగులుగా మారిన వారితో పాటు ఇతరులను కూడా పరీక్షించాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు. మరి ప్రభుత్వం అందుకు సిద్ధమవుతుందా లేక తీవ్రత బయటపడితే అభాసుపాలు కావాల్సి వస్తుందని వదిలేస్తుందా చూడాల్సి ఉంది.

సాధన చేస్తే

 సాధన చేస్తే ఈ భూమ్మీద ఏదైనా సాధించవచ్చును అంటారు. నిజమే. కాని ఏ సాధన చేస్తున్నాం? ఎవరి ఆధ్వర్యంలో చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఏయే నియమాలు పాటిస్తున్నాం, అన్నీ సరిగ్గా ఉన్నాయా, శాస్త్రీయ పద్ధతిలో సాధన సాగుతోందా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. సాధన అంత సులభం కాదు. సాధనలో వచ్చే అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు.


ఒక లౌకికమైన విషయం సాధించడానికి చాలా కష్టపడాలి. అలాంటిది అలౌకిక సాధనలకు ఎంత ఏకాగ్రత, పట్టుదల, అంకితభావం, దీక్ష ఉండాలి?


పుస్తకాల్లో చదివినప్పుడు అవి చేతికి అందినట్లుగానే ఉంటాయి. ఆ సూత్రాలను పాటించినప్పుడు, ఆ నియమాలను ఆచరించినప్పుడు సాధకుల గొప్పతనం బోధపడుతుంది.


పతంజలి యోగ సూత్రాలు, నారద భక్తి సూత్రాలు, యోగమార్గాలు అని వీటికి పేర్లు. రుషులు ఎంతో గొప్ప కృషి చేసి, సాధన చేసి లోకానికి అందించారు. వీటిని ఆచరణలోకి తీసుకురావడమన్నది సాదాసీదా వ్యక్తులకు అయ్యే పని కాదు. చంచల మనస్కులకు అసలు సాధ్యం కాదు. నేను-నాది అనే అహంకారులకు అసలే అంతుచిక్కదు.


సాధన చెయ్యాలనే కోరిక కలగడం కూడా పూర్వజన్మ సుకృతమేనంటారు. పట్టు విడవకుండా దాన్ని కొనసాగించడం పురుష ప్రయత్నం. దానికి దైవానుగ్రహం తోడవ్వాలి.


సాధనలో లోపాలు నాచుమీద నడకలా వెనక్కి లాగేస్తుంటాయి. చిల్లికుండతో నీళ్లు తెచ్చిన చందంలా ఎంతో చేస్తే, ఇంతేనా అని అనిపిస్తుంటాయి.


సరైన గురు సన్నిధిలో వినయ విధేయతలతో, నిజాయతీగా, నిరాడంబరతతో నేర్చుకోవాలనే తపన కలిగిన సాధకుడికి మాత్రమే అనుకూలమవుతుంది సాధన అని చెబుతారు పెద్దలు.


ధ్యానం చేసే వ్యక్తికి ఏకాగ్రత కావాలి. ప్రార్థన చేసే వ్యక్తికి ఆర్తి కావాలి. జపం చేసే వ్యక్తికి భావం కావాలి. పూజ చేసే వ్యక్తికి విశ్వాసం ఉండాలి.


సాధనను మనం నమ్మితే, సాధన మనల్ని నమ్ముతుంది. చేసిందే మళ్ళీ మళ్ళీ పట్టుదలతో చేస్తుంటే, ఆ విషయం మీద పట్టు వస్తుంది. నైపుణ్యం కలుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాని ఆత్మ పట్టుబడుతుంది. చివరికి సాధన మనకు మోకరిల్లుతుంది.


అర్జునుడి సాధన అతణ్ని గొప్ప విలుకాడిగా మార్చింది. హనుమంతుడి రామనామ సాధన అతణ్ని గొప్ప భక్తుడిగా తీర్చిదిద్దింది. సాధన అనేది పురుష ప్రయత్నం మీద ఆధారపడి ఉందని శ్రీరాముడికి వసిష్ఠుడు తెలియజేశాడు.


సత్యం తెలుసుకొని అరుణాచల కొండను ఆశ్రయించిన రమణ కూడా నిత్యం తన మౌన సాధనను కొనసాగించారు. సత్యం తెలుసుకోవడానికి మొదట సాధన చెయ్యాలి. తరవాత తెలుసుకున్న సత్యాన్ని నిలబెట్టుకోవడానికి సాధన చెయ్యాలి.


మెట్టు మెట్టు ఎక్కి శిఖరాగ్రాన్ని చేరుకోవాలి. బొట్టు బొట్టు కలిస్తేనే సముద్రమవుతుంది. మనం చిత్తశుద్ధితో చేసింది ఏనాడూ పోదు. క్రమం తప్పకుండా సాధన చేస్తే, లోపాలు వాటంతట అవే సరి అవుతాయి.


శాస్త్రం మీద, గురువు మీద, సాధన మీద నమ్మకం ఉన్నవారు విజేతలవుతారు. భావితరాలకు మార్గదర్శి అవుతారు. వెంటనే సాధన ప్రారంభిద్దాం. సాధ్యం కానిది లేదని నిరూపిద్దాం!

🔺🔺🔺🔺🔺🔺

నూతన వ్యవసాయ🌾 చట్టాలు

 నూతన వ్యవసాయ🌾 చట్టాలు తెలుగులో చాలా సులభంగా అర్ధమయ్యే రీతిలో చట్టాలు 🌾🇮🇳


మీతో బంద్ ను

సమర్ధించమని కోరేవారిని

నూతన వ్యవసాయ చట్టం

చదివారా?ఎందుకు బంద్ సమర్ధించాలో వివరించగలరా 

అని అడగండి... 


ఈ వ్యాసం 

పూర్తిగా చదివండి...

ఆ తర్వాత మీరు

బంద్ సమర్ధకులో  కాదో

విజ్ఞతతో నిర్ణయించుకోండి.


వ్యవసాయ చట్టాలపై 

గుడ్డి వ్యతిరేకత ...

అసలు చట్టంలో ఏముంది?


ముందుగా 

బిల్లుకి 

చట్టానికి 

తేడా తెలుసుకోవాలి.

పార్లమెంటులో 

ఆమోదం పొందేవరకు,

రాష్ట్రపతి సంతకం 

అయ్యి గెజిట్ నోటిఫికేషన్

వచ్చేవరకు అది బిల్.

నోటిఫికేషన్ వచ్చాక చట్టం. 


"ఈ చట్టం పేరు"


🌹The Farmers

(Empowerment 

And Protection)

Agreement on Price

Assurance And 

Farm Services Act

2020. 

Act 20 of 2020🌹


ఈ బిల్లుని 

లోక్ సభలో 

సెప్టెంబరు 14న,

రాజ్యసభలో 

సెప్టెంబరు 20న

ప్రవేశపెట్టడం జరిగింది.

చర్చలు లోక్ సభలో

17వ తేదీన, 

రాజ్యసభలో 

20వ తేదీన జరిగాయి.


అవి ఆమోదించబడి

రాష్ట్రపతి ఆమోదంపొంది

24వ తేదీన 

గెజెట్ నోటిఫికేషన్

విడుదల అవడంద్వారా

చట్టరూపం పొందింది.


అదే విధంగా 

"The Farmers Produce

Trade and Commerce

(Promotion and

Facilitation) Act 2020

కూడా Act 21 of 2020"


ఈ చట్టాలు 

ఏం చెబుతున్నాయి?


మొదటగా 

20 of 2020

తీసుకుందాం.


ఇది 

retrospective effect తో

అంటే 05-06-2020 నుండి

అమలులోకి వస్తుంది. 

ఆ రోజున ఆర్డినెన్స్

విడుదల చేసింది కేంద్రం.


ముందుగా 

Farm Services

అంటే ఏమేమి వస్తాయి?


విత్తనాల సరఫరా,

 ఫీడ్, 

దాణా, 

ఆగ్రో కెమికల్స్, 

ఆగ్రో మెషినరీ & టెక్నాలజీ,

సలహాలు, 

నాన్ కెమికల్ 

ఆగ్రో ఇన్ పుట్స్ 

మరియు 

ఇతరములైన 

వ్యవసాయ సంబంధిత

ఇన్ పుట్స్... 


రైతు అంటే ఎవరు?


స్వయంగా కానీ, 

కూలీలతో 

చేయించేవారు కానీ, 

కౌలు ద్వారా 

చేయించే వారు, 

Farmer Producer

Organizations.


అంటే వ్యవసాయంమీద

ఆధారపడ్డ అందరూ 

ఈచట్టం పరిధిలోకివస్తారు.


స్పాన్సర్ అంటే ఎవరు?


ఒక వ్యక్తి 

లేదా 

కంపెనీ 

లేదా 

భాగస్వామ్యం 

లేదా

Farm Production

Organization 

లేదా 

లిమిటెడ్ లయబిలిటీ

భాగస్వామ్యం 

లేదా 

కోఆపరేటివ్ సొసైటీ 

లేదా సొసైటీ 

లేదా కేంద్ర, రాష్ట్ర

ప్రభుత్వాల అనుమతితో

ప్రత్యేకంగా ఇందుకోసం

ఏర్పడిన అసొసియేషన్


"Farming Agreement"


అంటే వ్రాతపూర్వకంగా

రైతుకి, స్పాన్సర్ మధ్య

లేదా రైతుకి, స్పాన్సర్ కి,

మూడవ పార్టీకి మధ్య

జరిగే ఒప్పందం.

ఈ అగ్రిమెంటు 

నాట్లువెయ్యడానికిముందు 

లేదా 

rearing of farming

produce 

(In case of Live Stock)

కు ముందు చేసుకోవాలి.

ఈ ఒప్పందంలో 

నిర్ణీతమైన నాణ్యతను

ముందుగానే రాసుకోవాలి.

ఆ ప్రకారం ఒప్పందం

మేరకు స్పాన్సర్ 

రైతు దగ్గర కొని తీరాలి. 

ఈ ధర ప్రభుత్వం ప్రకటించే

మద్దతు ధరకు 

తగ్గకుండా ఉండాలి. 

అలాగే ఫామ్ సర్వీసెస్

కూడా అందించే 

క్లాజులనుకూడా

చేర్చుకోవచ్చు. 

S.2(g)


ఈ 

Farming

Agreement 

మూడు రకాలుగా

విభజించారు


 :Proviso i:


Trade and 

commerce

agreement


ఇందులో ప్రొడక్షన్ 

అంతా రైతు చేతిలోనే

ఉంటుంది. 

ముందుగా కుదుర్చుకున్న

రేటుకి స్పాన్సర్ కు

అమ్మవలసి ఉంటుంది.


 :Proviso ii:


 Production Agreement


ఇందులో స్పాన్సర్ 

అన్ని రకాల లేదా 

కొన్ని రకాల సేవలు 

రైతుకి అందిస్తాడు. 

దీనికి రైతు కొంత రుసుము

చెల్లించవలసి ఉంటుంది.


:Proviso iii: 


పై రెండు రకాలు కాకుండా

ఏ ఇతరమైన అగ్రిమెంట్లు

లేదా పై రెండు కలిపి కానీ

రైతు, స్పాన్సర్ ల మధ్య

కుదర్చుకోవచ్చు.

ఉదాహరణకు... 

సాయిల్ టెస్టింగ్, 

విత్తన సరఫరా, 

ఎరువులు, 

పురుగు మందులు, 

సస్య రక్షణ, 

సస్యరక్షణకు 

తగిన సలహాలు ఇవ్వడం

వంటివి ఉంటాయి.


:Farming Produce:


నూనెలు, 

నూనె గింజల ఉత్పత్తి, 

వరి, గోధుమ, 

పప్పు దినుసులు, 

కూరలు, 

పండ్లు, 

గింజలు 

(వేరుశనగ వంటివి),

మసాలా దినుసులు,

చెఱకు, పౌల్ట్రీ ఉత్పత్తులు,

పందుల పెంపకం, 

మేకలు, గొఱ్ఱెలు! 

చేపల పెంపకం, 

డెయిరీ ...

నేచురల్ లేక 

ప్రాసెస్డ్ రూపంలో కాని.

ఇంకా పశు దాణా, 

కాటన్, 

ginned or unginned,

కాటన్ సీడ్స్, 

జౌళి ఉత్పత్తులు.


ఈ అగ్రిమెంటు 

కనీస కాల వ్యవధి 

ఒక పంట కాలం, 

గరిష్ట వ్యవధి 

ఐదు సంవత్సరాలు. 

పంట కాలం ఐదేళ్ళకన్నా

ఎక్కువ ఉంటే 

రైతు, స్పాన్సర్ 

పరస్పర అంగీకారంతో

అగ్రిమెంటు వ్యవధిని

పెంచుకోవచ్చు.


అందరికీ 

ఉపయోగపడే విధంగా

కేంద్రం ఒక నమూనా

అగ్రిమెంటుని 

తయారు చేసి 

విడుదల చేస్తుంది.


అగ్రిమెంట్ ధర 

మార్కెట్ ధరకన్నా 

తక్కువ ఉంటే 

ఏం చెయ్యాలన్న 

విషయం కూడా 

అగ్రిమెంట్ లోనే

పొందుపరుస్తారు.


స్పాన్సర్ పంటను 

రైతు వద్దనే

తీసుకునేట్లయితే

అగ్రిమెంటులో  

ముందుగానిర్ణయించుకున్న

సమయంలోగా 

రైతువద్దకే వచ్చి

తీసుకోవాలి 

S.6(1)(a)


ఒక వేళ రైతే పంటను

స్పాన్సర్ వద్దకు చేర్చేట్లుగా

ఒప్పందం అయితే 

స్పాన్సర్ ఆ పంటను 

రైతు తీసుకురాగానే

accept చెయ్యాలి. 

ఆ తరువాత 

పంట తాలూకు బాధ్యత

అంతా స్పాన్సర్ దే.

S.6(1)(b).


పంట సొమ్ము రైతుకి

ఎప్పుడు చెల్లించాలి?


S.6(3)(a)

Seed Production

agreement అయితే 

66% డెలివరీ

సమయంలోనూ, 

మిగతా సొమ్ము 

Seed Certification

అయిన తరువాత

చెల్లించాలి. 

అయితే ఈ వ్యవధి 

30 రోజులకు మించరాదు. 


S.6(3)(b) 

మిగతా పంటలు 

లేదా లైవ్ స్టాక్ విషయంలో

డెలివరీ సమయంలోనే

మొత్తం చెల్లించాలి.


ఈ చెల్లించిన 

మొత్తాలకు 

రసీదులు ఇవ్వాలి.


సొమ్ము 

ఏ విధంగా చెల్లించాలి 

అన్న విషయం 

రాష్ట్ర ప్రభుత్వం

నిర్ణయిస్తుంది.


అగ్రిమెంటు 

అమలు విషయంలో

తగాయిదాలు వస్తే

పరిష్కరించడానికి

'కన్సీలియేషన్ బోర్డు'

ఉంటుంది. 

ఇందులో 

రైతులకు, స్పాన్సర్లకు

సమన్యాయం జరిగేలా

ప్రాతినిధ్యం ఉంటుంది. 

ఈ బోర్డు తన నిర్ణయాన్ని

30రోజులలోతీర్మానించాలి.

ఈ బోర్డు నిర్ణయం 

నచ్చని పక్షంలో 

ఏ పార్టీ అయినా 

అపీల్ చేసుకోడానికి 

Sub Divisional

Magistrate (RDO) కు

వెళ్తుంది. 

సదరు RDO 

అప్పిలేట్ బోర్డును

నియమిస్తారు. 

ఇక్కడ కూడా 30 రోజుల

వ్యవధిలోనే తీర్మానం

చెయ్యవలసి ఉంటుంది.


ఈ తీర్మానం 

ఇరు పార్టీలను 

బైండ్ చేస్తుంది.


అగ్రిమెంట్ లో

Conciliation board

ప్రస్థావన లేకపోతే 

RDO బోర్డును 

ఏర్పాటు చేస్తారు. 

ఆ బోర్డు నిర్ణయం ఫైనల్.

ఈ విషయంలో 

కోర్టుల జోక్యం ఉండదు.

కానీ బోర్డుకు సివిల్ కోర్టు

అధికారాలు ఉంటాయి.


బోర్డు తీర్మానం ప్రకారం

స్పాన్సర్  చెల్లించకపోతే

అగ్రిమెంట్ అమౌంటుకు

ఒకటిన్నర రెట్లు 

వసూలు చేసి రైతుకి ఇచ్చే

అధికారం బోర్డుకి ఉన్నది.


ఒకవేళ రైతు 

చెల్లించవలసి వస్తే మాత్రం actual cost 

మాత్రమే చెల్లించాలి.


ఇక్కడ 

మనకు వచ్చే సందేహం ...

force majere అంటే 

మన చేతుల్లో లేని

పరిస్థితుల వల్ల 

నష్టం ఏర్పడితే 

ఏమిటి పరిస్థిత.?


రైతుకు జరిమానా

విధించేందుకు 

ఎవరికీ ఎటువంటి

అధికారం లేదు.


ఒకవేళ రైతు నష్ట పరిహారం

చెల్లించవలసి వస్తే 

అతడి భూములను

స్వాధీనం చేసుకునే

అధికారం ఎవరికీ లేదు.


ఈ చట్టంలోని 

S.3(4) ప్రకారం 

పంట నాణ్యతను, 

లైవ్ స్టాక్ నాణ్యతను

పరిశీలించి 

ధృవీకరణ చెయ్యడానికి

ఇరువురి ఒప్పందం మేరకు

వ్యవసాయంలో 

నిష్ణాతులు అయిన వారిని

నియమించుకోవచ్చు.

(Qualified Assayers)

S.4(4).


కానీ 

కొన్ని నిత్యావసరాలను

Essential

Commodities Act

నుండి తొలగించారు.


ఎందుకు?


పంట బాగా పండిన చోట

ధర తక్కువ ఉంటుంది.

డిమాండ్ ఉన్నచోట 

పంట దొరకదు. 

అక్కడ రేటు విపరీతంగా

ఉంటుంది. 

ఉదాహరణకు...

ఉల్లిపాయలు,

టొమాటోలు, 

బంగాళ దుంపలు. 

వీటి ధరవరలు 

మనం సంవత్సరంలో

ఒకసారైనా చూస్తూనేఉంటాం.

టొమాటో రైతులు పంట

గిట్టుబాటు కాక రోడ్ల మీద

పారబోసిన సందర్భాలు

మనకు ప్రతి సంవత్సరం

కనపడుతూనే ఉంటాయి.

బుట్ట టొమాటోలు వంద

రూపాయలు కూడా 

పలకని స్థితి. 

కానీ వినియోగదారులమైన

మనకు మాత్రం 

కిలో నలభై, యాభైకు

అమ్ముతారు. 

ఆక్కడ బాగుపడుతోంది

ఎవరు? దళారీలు కదా.


మరి స్పాన్సర్లు 

hoarding చెయ్యరా? 

అనే అనుమానం రావచ్చు.


పెట్టుబడి పెట్టి 

లాభం కోసం చూసేవాడు

డిమాండ్ ఉన్నచోట

అమ్ముకుంటాడు. 

మరి రైతే 

డిమాండ్ ఉన్నచోట 

అమ్ముకోవచ్చు కదా?


మన దేశంలో 

చిన్న, మధ్య తరగతి

రైతులకు అంతశక్తిఉండదు. 

Storage capacity

ఉండదు. 

అలాగే holding capacity

ఉండదు. 

అందువల్లనే అయినకాడికి

అమ్ముకుంటున్నారు.


దేశంలోని 

అన్ని మార్కెట్లను

అనుసంధానం చేసి 

సింగిల్ ప్లాట్ ఫామ్ ఏర్పరిచే బాధ్యత 

కేంద్రం తీసుకుంది. 

ఎక్కడ తమ పంటకు

ఎక్కువ డిమాండ్ ఉందో

తెలుస్తుంది.


అలా తెలియడం వల్ల రైతుకి లాభం ఏమిటి?

అగ్రిమెంట్ ప్రకారం రైతుకి

చెల్లించవలసిన సొమ్ము

చెల్లించిన తరువాత 

ఆ పంటతో రైతుకు

సంబంధం లేదు.


కానీ ఎగ్రిమెంట్ లోనే 

ఈ విషయంపై 

ఒక క్లాజు ఉంటుంది. 

(పైన పేర్కొన్నాను).


రేటులో 

మరీ ఎక్కువ వ్యత్యాసం

ఉంటే రైతుకు బోనస్ 

లేదా ప్రీమియమ్

చెల్లించాల్సి ఉంటుంది.

S.5(b)


ఇప్పుడు ఆలోచించండి

వ్యవసాయ చట్టం 

20 of 2020 

రైతుకు మేలు చేస్తుందా? 

చెఱుపు చేస్తుందా?


 డా. బి, ఆర్. అంబేద్కర్ జీ

చెప్పిన విషయం 

గుర్తు చేసుకోండి... 


"Knowledge, 

Unite and Struggle"


ఇప్పుడు జరుగుతున్న

వ్యవసాయ చట్టాల వ్యతిరేక ర్యాలీలలో

పాల్గొనే వారిలో 

ఈ విషయంపై నాలెడ్జ్

ఎంతమందికి ఉంది?

కనీసం ఆత్మ పరిశీలన

చేసుకుంటే బాగుంటుంది. 


పంట చేతికి వచ్చే దశలో

రేటు బాగుంటుంది. 

కానీ మార్కెట్ యార్డుకి

వచ్చే రోజుకి పడిపోతుంది.


రైతులు తమ ఉత్పత్తులను

బళ్ళ మీద వేసుకుని

మార్కెట్ యార్డుల్లో 

రోజుల తరబడి ఎండల్లో,

వానల్లో, రాత్రనక, 

పగలనక తమ సరుకు

ఎప్పుడు కొంటారో, 

ఎంతకు కొంటారో 

తెలియక అయిన కాడికి

అమ్ముకునే పరిస్థితినుండి

రైతుని రక్షించేందుకు 

ఈ చట్టం చేయబడింది. 


వరంగల్ మార్కెట్ యార్డులో 

ఇలాంటి పరిస్థితి 

నా కళ్ళారా చూసాను.

అలా ఆ మిరపకాయల

 టబస్తాల మీద 

తుండు వేసుకుని పడుకునే

రైతులు అనేకమంది. 

పైగా అలాంటి వారికి 

ఉచిత భోజన సౌకర్యం

ఏర్పాటు చేసామనిగొప్పలు. 

రైతుకి మనంపెట్టేవాళ్ళమా? 


ఈ చట్టం వచ్చిన తరువాత

రైతులకు 

ఆ సమస్య ఉండదు. 


ఇకపోతే కార్పొరేట్ సంస్థలు రైతుని దోచేస్తాయని 

గోల చేసేవారికి 

ఒక విషయం గుర్తు చేయదలచుకున్నాను, 


మనం రోజూ వాడే

వస్తువులలో నూటికి 

తొంభై శాతం 

ఆ కార్పొరేట్ సంస్థలు

తయారు చేసినవే. 


ప్రభుత్వాలు ఏ చట్టం చేసిన అంబానీ కోసం అంటారు. 


అంబానీ ఇచ్చిన 

ఉచిత జియో ఫోను 

ఆఫర్ వాడుకోవడంలేదా?

ఉచితంగా వస్తే

వాడుకోడానికి లేని

అభ్యంతరం

వ్యాపారస్థుడైన అంబానీ

ప్రతి అవకాశాన్ని

దొరకబుచ్చుకుని 

పైకి ఎదుగుతుంటే 

బాధ పడటం ఎందుకు?

అదే హిపోక్రసీ. 

వాడి తమ్ముడు 

చతికిల పడ్డాడు. 

మరి కేంద్రం ఇద్దరికీ

సయోధ్య కుదర్చలేదే?


KG Basin విషయంలో

ముఖేష్ అంబానీపై 72,000 వేల కోట్లు 

పెనాల్టీ విధించింది

Directorate of 

Hydro Carbons. 

దాన్ని రద్దు చేయించలేదే?


ఏదైనా సమస్య మీద

స్పందించాలంటే 

విజ్ఞులైనవారు దాన్ని

అధ్యయనం చెయ్యాలి.

అర్ధం చేసుకోవాలి. 

లేకుంటే మౌనంగాఉండాలి.


ఈ చట్టం వల్ల 

వేల కోట్లు నష్టపోతోంది

కమీషన్ ఏజెంట్లు...

పంజాబ్, హర్యానా,

మహారాష్ట్ర వంటి

వ్యవసాయ 

ప్రధాన రాష్ట్రాలలోనే 

ఆది ఎక్కువగా ఉంది.

అకాలీ దళ్ కు చెందిన 

కేంద్ర మంత్రి సిమ్రాన్ జిత్

మాన్ కౌర్ 

ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ

రాజీనామా చేసారు.

ఎందుకంటే వారి 

స్వయానా బావ గారి

ఆదాయం సంవత్సరానికి

2500 కోట్లు. 

కేవలం కమీషన్ల మీదే.


అలాగే కనిమొళి.

వ్యవసాయ భూములు

లేకపోయినా 

వ్యవసాయ ఆదాయం

కింద ఎంత చూపించిందో

తెలిస్తే ముక్కున

వేలేసుకోవడమే కాదు, 

మన ముక్కు కూడా

ఊడిపోతుంది. 

అక్షరాలా పది వేల కోట్లు.


మరింత 

సమాచారం కావాలంటే

loksabha.nic.in

website లోకి వెళ్ళి

Legislations అనే 

పాపప్ లో 

Agriculture ను 

select చేసుకుంటే 

ఈ రెండు చట్టాలు

ఉంటాయి. 

ఓపిక ఉన్న వారు చదువుకోవచ్చు... 


 🙏🇮🇳🙏

Jai Jawan 

Jai Kisan 

Jai Vignan

👏🇮🇳👏