4, అక్టోబర్ 2020, ఆదివారం

Answer questions

 

Ayodya Temple big bell making

 

Nimisharanym

 






 

*ధార్మికగీత - 38*

  *శ్లో:- నిమిషం నిమిషార్థం వా౹*

                  *ప్రాణినాం విష్ణుచింతనం౹*

                  *క్రతు కోటి సహస్రాణాం ౹*

                  *ధ్యాన మేకం విశిష్యతే ౹౹*

                                        *****

*భా:- ఆధునికత, సాంకేతికత, యాంత్రికత వెల్లి విరిసిన నేటి నవీన సమాజంలో వృత్తి ప్రవృత్తులలో ఉరుకులు, పరుగులు పెడుతున్న మనిషికి భగవంతుని కించిత్తైనా తలచే అవకాశం కనుచూపుమేరలో కనబడడం లేదు. నిత్యం "నారాయణ" స్మరణలో తానే గొప్పనుకొని విర్ర వీగుతున్న నారదునికి , పగలంతా శ్రమించి రాత్రివేళ "రామ,కృష్ణ" అని ఒక్కసారి మనసారా తలచే ఆ కర్షకుడే మిన్న అని విష్ణువు కళ్ళు తెరిపించాడు. కోట్లాది క్రతువులు, యజ్ఞ యాగాల కంటె, ఒక నిమిషం గాని, అరనిమిషం గాని దైవనామాన్ని త్రికరణశుద్ధితో తనివితీరా ధ్యానిస్తే అదే విశేష ఫలితాన్ని ఇస్తుందనేది ఆధ్యాత్మ విదుల అనుభవోక్తి. ప్రహ్లాదుడు తింటూ,త్రాగుతూ,ఆడుతూ,పాడుతూ, చదువుతూ, తిరుగుతూ, ఎగురుతూ కూడా నామస్మరణ చేశాడట. మనకు కూడా మనసుంటే మార్గ ముంటుందనేది యథార్థము. చావడానికి కూడా క్షణం తీరిక లేదనే వారు కూడా నేటి లోకంలో తారస పడుతున్నారంటే ఆశ్చర్యపడ నవసరం లేదు. కాన ధ్యాన విశిష్టత తెలిసికోవలసిందే. "కోటిం త్యక్త్వా హరిం భజేత్ " అని మహర్షులు తీర్మానించారు. దుస్తర భవ సాగర తరణానికి , సకల సంకట పాప హరణానికి కేవలం "హరి" అనే రెండంటే రెండక్షరాలు చాలు అని, అవే ముక్తి మార్గ దిశా నిర్దేశాలని సారాంశము*.

                                    *****

                      *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

విస్తుపోయే నిజాలు వెల్లడి

  కరోనా వైరస్ ను జయించిన ఇటలీ

కరోనా మృతులకు శవపరీక్ష

From whatsapp

* కోవిడ్ -19 నుంచి మృతదేహంపై శవపరీక్ష (పోస్టుమార్టం) చేసిన మొట్టమొదటి దేశంగా ఇటలీ నిలిచింది.

కోవిడ్ -19 వైరస్ గా ఉనికిలో లేదని విస్తృతమైన దర్యాప్తులో తేలింది, బదులుగా ఇది చాలా పెద్ద ప్రపంచ కుంభకోణం లా ఉంది. ప్రజలు వాస్తవానికి "యాంప్లిఫైడ్ గ్లోబల్ 5 జి విద్యుదయస్కాంత వికిరణం (పాయిజన్)" తో మరణిస్తున్నారు. *

కరోనా వైరస్ కారణంగా మరణించిన మృతదేహాలపై శవపరీక్షలు (పోస్టుమార్టం) అనుమతించని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చట్టాన్ని ఇటాలియన్ వైద్యులు ఉల్లంఘించారు, తద్వారా కొంత శాస్త్రీయపరిశోధన, దర్యాప్తు తరువాత,దీని చిరునామా, ఇది వైరస్ కాదని, మరణానికి కారణమయ్యే బాక్టీరియం అని నిర్ధారించలేము, దీనివల్ల సిరల్లో రక్త నాళాలు ఏర్పడతాయి, అంటే, ఈ బ్యాక్టీరియా కారణంగా, సిరలు, నరాలలో రక్తం పేరుకుపోతుంది. ఇది రోగి మరణానికి కారణం అవుతుంది.

ఇటలీ వైరస్ను ఓడించింది, "వ్యాప్తి-ఇంట్రావాస్కులర్ కోగ్యులేషన్ (థ్రోంబోసిస్) తప్ప మరేమీ లేదు, దానిని ఎదుర్కునే పద్ధతి ..........

* యాంటీబయాటిక్స్ మాత్రలు}* రోగ నిరోధక * 

* యాంటికోగ్యులాటస్ * (ఆస్పిరిన్) తీసుకోవడం ద్వారా ఇది నయమవుతుంది.

ప్రపంచానికి ఈ సంచలనాత్మక వార్తలను ఇటాలియన్ వైద్యులు కోవిడ్ -19 వైరస్ తో చనిపోయిన వారికి శవపరీక్షలు (పోస్టుమార్టం) నిర్వహించడం ద్వారా తయారు చేశారు, ఇది వ్యాధి సాధ్యమని సూచిస్తుంది. మరికొందరు ఇటాలియన్ శాస్త్రవేత్తల ప్రకారం, వెంటిలేటర్లు ఇన్టెన్సివ్ కేర్ యూనిట్లు (ఐసియు) ఎప్పుడూ అవసరం లేదు. ఇందుకోసం ఇటలీలో ఇప్పుడు కొత్త మొలాసిస్ ప్రోటోకాల్స్ జారీ చేయబడ్డాయి.

చైనా కు దాని గురించి ముందే తెలుసు కానీ తన నివేదికను ఎవరికీ బహిరంగపరచలేదు.

దయచేసి ఈ సమాచారాన్ని మీ కుటుంబం, పొరుగువారు, నిపుణులు, స్నేహితులు, సహోద్యోగులందరికీ పంచుకోండి, తద్వారా వారు కోవిడ్ -19 భయం నుంచి బయటపడగలరు అంతేకాకుండా ఇది "వైరస్ " కాదని వారు అర్థం చేసుకున్నారు, కానీ కేవలం 5 జి రేడియేషన్ కలిగిన బాక్టీరియం రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్నవారికి హాని కలిగించడమే కారణం. ఇది రేడియేషన్ ఇన్ఫార్క్షన్ మరియు హైపోక్సియాను కూడా ఉత్పత్తి చేస్తుంది. ఈ పరిస్థితికి వచ్చే వారు * ఆస్ప్రిన్ -100 ఎంజి * అప్రోనికస్ లేదా పారాసిటమాల్ 650 ఎంజి * తీసుకోవాలి. ఎందుకు ... ??? .... ఎందుకంటే కోవిడ్ -19 తో రక్తము పేరుకుపోతుంది, ఇది థ్రోంబోసిస్‌కు కారణమవుతుంది. దీనివల్ల సిరల్లో రక్త ప్రసరణకు అవరోధం ఏర్పదు తుంది. ఈ కారణంగా మెదడు, గుండె ఊపిరితిత్తులు ఆక్సిజన్ పొందలేవు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం ప్రారంభిస్తాడు. శ్వాస లేకపోవడం వల్ల, వ్యక్తి వేగంగా మరణిస్తాడు.

ఇటాలియన్ వైద్యులు WHO ప్రోటోకాల్‌ను అనుసరించలేదు. కోవిడ్ -19తో మరణించిన వారి శవాలను పరీక్ష చేశారు. మృతదేహాలు, కాళ్ళు మరియు శరీరంలోని ఇతర భాగాలను తెరిచి పరిశీలించిన తరువాత, రక్త నాళాలు విడదీయబడి, సిరలు త్రోంబితో నిండి ఉన్నాయని వైద్యులు గుర్తించారు, ఇది సాధారణంగా రక్తం ప్రవహించకుండా చేస్తుంది. రోగి మరణానికి కారణమయ్యే శరీరానికి ఆక్సిజన్ ప్రవాహాన్ని కూడా తగ్గిస్తుంది.ఈ పరిశోధన తెలిసిన తరువాత, ఇటాలియన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెంటనే కోవిడ్ -19 చికిత్స ప్రోటోకాల్‌ను మార్చి, దాని సానుకూల రోగులకు ఆస్పిరిన్ ఇచ్చింది. 100mg మరియు ampromacus ఇవ్వడం ప్రారంభించింది. దీనివల్ల రోగులు కోలుకోవడం ప్రారంభించారు అంతేకాకుండా వారి ఆరోగ్యం చాలా మెరుగుపడింది. ఇటాలియన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒకే రోజులో 14000 మంది రోగులను డిశ్చార్జ్ చేసి వారి ఇళ్లకు పంపింది.

* మూలం: ఇటలీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ *

బ్రహ్మాండ పురాణము ఇలా చెప్పింది.

  ఓం నమో వేంకటేశాయ🙏

సహజ సుందర క్షేత్రాల్లో తిరుమల క్షేత్రం దివ్యమైంది. భవ్య మైంది మరియు నిత్యనూతన మైనది. ఈ పుణ్యాక్షేత్రాన్ని ప్రశంసిస్తూ బ్రహ్మాండ పురాణము ఇలా చెప్పింది.

 వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన"

   అంటే బ్రహ్మాండమంతా వెదకినా ఈ పుణ్యక్షేత్రం సాటియైన క్షేత్రం మరేదీ లేదు చెప్పింది. తిరుమల క్షేత్రం ఎన్నో పేర్లతో, అనేక శిఖరాలతో, వివిధ లోయలతో, తీర్థాలతో భూలోక వైకుంఠంగా వన్నె కెక్కింది.

సత్యం సత్యం పునస్సత్యం న దేవో వేంకటేశ్వరాత్ బ్రహ్మాండే నాస్తి యత్కించిత్ న భూతం న భవిష్యతి" -

 శ్రీవేంకటాచల మాహాత్యం (భవిష్యోత్తరపురాణం) .

 సత్యంగా చెబుతున్నమాట! ఒకమారు కాదు. రెండుమార్లు కాదు. పదే పదే చెబుతున్న సత్యమైన మాట! అంటే, శ్రీవేంకటేశ్వరునివంటి దేవుడు ఈ బ్రహ్మాండాల్లో ఎక్కడా లేదు. లేనేలేదు. ఇపుడు మాత్రమేకాదు. గడచిన భూతకాలంలోనూ, ఇటు రాబోయే భవిష్యత్కాలంలోను లేదు. లేనే లేదూ ఉండదు కూడా. అందువల్లే వెంకటేశ్వరస్వామి కలియుగ ప్రత్యక్షదైవంగా కీర్తింపబడ్డాడు.

"కృతేతు నరసింహాఽ..భూత్ త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసూదేవ శ్చ కలౌ వేంకటనాయకః"

కృతయుగంలో నరసింహుడు, త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో వాసుదేవుడు (శ్రీకృష్ణుడు), కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడు ఈ నాలుగు అవతారాలు నాలుగు యుగాలు ప్రసిద్ధి పొందాయి. 

 వీటిల్లో మొదటి మూడు అవతారాలు, శ్రీమహావిష్ణువు దశావతారాల్లో చెప్పబడ్డవే .

విచిత్రం! ఏమంటే కలియుగంలో వేంకటేశ్వరుడు అవతారంగా ప్రత్యేకంగా పేర్కొని బడటం విలక్షణంగా ఉంది .

ఆయా యుగాల్లో ఆయా రక్కసులను సంహరించి ధర్మం నిలబెట్టడం కోసం వచ్చిన అవతారాలు మాత్రమే ఈ మూడు కూడా...

కాని శ్రీనివాసుని అవతారం అలా సంభవించలేదు.

 శ్రీ వైకుంఠం నుంచి సాక్షాత్తుగా దిగివచ్చిన దివ్య మంగళ అర్చావతార మూర్తి శ్రీవేంకటేశ్వరుడు.                           

ఓం నమో వేంకటేశాయ 🙏.


15-12-గీతా మకరందము

 పురుషోత్తమప్రాప్తియోగము   

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి

అవతారిక - అట్టి పరమాత్మయొక్క మహిమను నాలుగు శ్లోకములద్వారా తెలియజేయుచున్నారు –

యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఽఖిలమ్ |యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌతత్తేజో విద్ధి మామకమ్ || 

తాత్పర్యము:- సూర్యునియందు ఏ తేజస్సు (ప్రకాశము, చైతన్యము) ప్రపంచమునంతను ప్రకాశింప

జేయుచున్నదో, అట్లే చంద్రునియందును, అగ్నియందును ఏ తేజస్సుగలదో, అదియంతయు నాదిగా నెఱుంగుము.

వ్యాఖ్య:- సూర్యాది ప్రకాశకపదార్థములందలి తేజస్సు తనదియని భగవానుడు తెలుపుటవలన ఆ యా వస్తువులను దర్శించినపుడు అవి భగవద్విభూతులే యను భావన గలిగియుండవలెను. ప్రపంచములో అనేక పదార్థములున్నప్పటికిని వానియన్నింటికిని మఱియొక వస్తువును ప్రకాశింపజేయు సామర్థ్యములేదు.  

సూర్యచంద్రాగ్నులకు మాత్రమే కలదు. అవి తాము ప్రకాశించును; ఇతరమునుగూడ ప్రకాశింపజేయు చుండును. వాని యందలి ఆ ప్రకాశకశక్తి, ఆ తేజస్సు భగవానుని విభూతియే అయియున్నదని ఈశ్లోకముద్వారా తెలియుచున్నది. (అయితే సూర్యాదులను కూడా ప్రకాశింపజేయునది ఆత్మయే అని ఈ సందర్భమున జ్ఞాపకమునందుంచుకొనవలెను).

ప్రశ్న:- సూర్యచంద్రాగ్నులయందలి తేజస్సు ఎట్టిది?

ఉత్తరము:- పరమాత్మసంబంధమైనది; దైవమునకు జెందినది.

Health

 

Bhagvatgeeta


















 

శ్రీవేంకటేశ మతిసుందరమోహనాంగం*

  శ్రీవేంకటేశ మతిసుందరమోహనాంగం*

*శ్రీ భూమికాంత మరవింద దళాయతాక్షం*

*ప్రాణప్రియంప్రవిమలసత్కరుణాంబురాశిం*

*బ్రహ్మేశ వంద్యమనిశం వరదం భజామి*!!

*వేంకటేశో వాసుదేవో వారిజాసన వందితః*

*స్వామి పుష్కరిణీవాసః శంఖ చక్రగదాధరః*

*పీతాంబరధరో దేవో గరుడారూఢశోభితః*

*విశ్వాత్మా విశ్వలోకేవిజయో వేంకటేశ్వరః*!!

పాండిత్యం

ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడి పాండిత్యం గురించి చాలా దూరదూరాల వరకు కీర్తి వ్యాపించింది. ఒకసారి ఆ దేశపు రాజు అతడిని !ఆహ్వానించాడు. చర్చ చివరలో అతడితో అన్నాడు- “అయ్యా నీవు జ్ఞానివి. విద్యావంతుడవు. కానీ నీ కొడుకు ఇంత మూర్ఖుడేంటి? అతడిని కూడా కాస్త చదివించు. అతడికి బంగారము వెండి మధ్యలో ఏది విలువైనదో కూడా తెలియదు.” 

 ఇంతవరకు చెప్పి ఆ రాజు పెద్దగా నవ్వాడు. బ్రాహ్మణుడు ఆ మాటకు చాలా బాధపడ్డాడు. ఇంటికి వచ్చి తన కొడుకును అడిగాడు- “బంగారము వెండి ఈ రెంటిలో ఏది విలువైనది?” అని. 

 బంగారము” ఒక క్షణం కూడా ఆలోచించకుండా అతని కొడుకు సమాధానం చెప్పాడు. 

 నీసమాధానం సరైనదే. మరి రాజు ఎందుకు ఇట్లా అన్నాడు? అందరి ఎదుట నన్ను పరిహసించాడు.” 

 అది విని అతడి కొడుకుకు విషయం మొత్తం అర్థం అయింది. అతడు అన్నాడు- “రాజు ఈ ఊరికి దగ్గరలో ఒక సభను నిర్వహిస్తాడు. గొప్పగా పేరుపొందిన వారంతా అక్కడ భాగం గ్రహిస్తారు. ఆ సదస్సు నేను బడికి పోయే దారిలో వస్తుంది. అతడు నన్ను చూడగానే వెంటనే పిలుస్తాడు. ఒక చేతిలో బంగారు నాణేన్ని, మరొక చేతిలో వెండి నాణేన్ని పట్టుకుంటాడు. ‘రెంటిలో ఎక్కువ విలువైనదానిని తీసుకో.’ అంటాడు. అప్పుడు నేను వెండి నాణేన్ని తీసుకుంటాను. అందరూ గట్టిగా నవ్వుతారు. వారికి వినోదం కలుగుతుంది. ఈ విధంగా ప్రతి రోజు జరుగుతుంది.”

 అయితే నీవు బంగారు నాణాన్ని ఎందుకు తీసుకోవు? జన సభలో నన్ను నిన్ను అవమానం పాలు ఎందుకు చేస్తావు?”

 అప్పుడు ఆ బాలుడు నవ్వాడు. తండ్రిని చేయి పట్టుకొని ఇంటి లోపలకు తీసుకొని వెళ్ళాడు. అల్మారాలోని ఒక పెట్టెను తెరిచి చూపించాడు. దాని నిండా వెండి నాణాలు ఉన్నాయి. అది చూసి బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపోయాడు.

 అప్పుడు అతడి కొడుకు ఇలా అన్నాడు- “తండ్రీ, ఏ రోజైతే నేను బంగారు నాణాన్ని తీసుకుంటానో అప్పుడు ఈ ఆట పూర్తవుతుంది. ఒకవేళ వారు నన్ను తెలివిలేని వాడిగా భావించి నవ్వితే నవ్వనివ్వండి. 

నేను వివేకవంతుడిని అని వారికి చూపిస్తే నాకేంటి లాభం? నేను బ్రాహ్మణుడి పుత్రుడిని. అందువల్ల తెలివితో పనిచేస్తాను. నిజంగా మూర్ఖుడిని అయితే అది వేరు. మూర్ఖుడిగా భావింపబడేది వేరు.

 బంగారం వంటి అవకాశం కోసం ఎదురు చూడటం కన్నా ప్రతి అవకాశాన్ని బంగారం లాగా మార్చుకోవటం నయం.”🙏

Venkateswara

 



 



 

 

**మహాభారతము**

  **దశిక రాము**

నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//

101 - అరణ్యపర్వం.

సత్యవంతుని తో సావిత్రి వివాహం చేయడం తనకెందుకు సమ్మతం కాదో, నారద మహర్షి, అశ్వపతికి వివరిస్తున్నాడు :' రాజా ! సత్యవంతుడు చిన్ననాటినుండి కూడా నాకు బాగాతెలుసు. అతని అసలు పేరు చిత్రాశ్వుడు. అతనికి అశ్వాలంటే యెంతో యిష్టము. చిన్నప్పటి నుండి మట్టితో, చిత్రలేఖనంలో అనేక అశ్వాల బొమ్మలు తయారుచేసి, చిత్ర విచిత్ర అలంకరణలు వాటికిచేసి మురిసిపోయేవాడు. కాలక్రమేణా, అతడు యెంతో సాత్విక ప్రవృత్తితో, మాతా పితరుల సేవలో, సత్యనిష్టాగరిష్ఠుడై, మెలుగుతూ వుండడంతో, సత్యవంతుడు అని పిలిచేవారు. అతడు మృదుస్వభావి, రూపవంతుడు. ఏవిధంగానూ సావిత్రికి తీసిపోడు. కానీ, నేను అతనితో వివాహం వద్దని చెప్పినకారణం వింటే, మీరే వెనుకడుగు వేస్తారు. అతని ఆయు:ప్రమాణం యింకా సంవత్సరం పాటు మాత్రమే వున్నది. ఇట్టి అల్పాయుష్కుని, చేసుకోవడానికి, యేస్త్రీ ముందుకువస్తుంది. ' అని చెప్పి మొదట అశ్వపతి వైపు, ఆపై సావిత్రి వైపు చూశాడు, నారదమహర్షి.      

అశ్వపతి సావిత్రిని ఆమె అభిప్రాయం మార్చుకొమ్మని, తిరిగి వరుని గురించి అన్వేషణ చేద్దామని చెప్పాడు. అయితే, సావిత్రి అందుకు అంగీకరించలేదు. ' నేను సత్యవంతుని వరించాను. కానున్నది కాలమే నిర్ణయిస్తుంది. నాకు యిప్పుడు వేరే పురుషుని భర్తగా అంగీకరించే వుద్దేశ్యం లేదు. ' అని స్పష్టంగా చెప్పింది. ' నాకు సత్యవంతుని ఆయు:ప్రమాణం గురించి తెలియకపోయినా, వారితో, నా అత్తమామలతో, అరణ్యంలో నేను నివసించాలని మటుకు నాకుతెలుసు. వారికి తిరిగి రాజ్యం సంప్రాప్టించేవరకు, వారితో పాటు, కష్టాలు పడడానికే నేను నిర్ణయించుకున్నాను. ఆయు: ప్రమాణము అంటారా, నాతో జతకూడిన తరువాత, ఆయనకు విధి అనుకూలంగా మారవచ్చును. అంతా దైవేచ్ఛ. నాకు నా మనస్సే ప్రధానం. కాబట్టి మావివాహం జరిపించండి. ' అని స్థిరంగా చెప్పింది.  

ఆమె చెప్పిన విధానానికి, నారదమహర్షి అబ్బురపడి, ఆమె ఉదాత్తమైన, ఉన్నతమైన స్థిరమైన అభిప్రాయానికి సంతోషంగా తనసమ్మతి కూడా తెలియ జేశాడు. లోక కల్యాణార్థం, ఆమెకు ముందరే రాబోయే ఉపద్రవం గురించి తెలియజేసి, మానసిక స్థిరత్వం కలిగించడమే మహర్షి వుద్దేశ్యమని తెలుస్తూనే వున్నదికదా ! ' మహారాజా ! సావిత్రీ సత్యవంతుల వివాహం నిర్విఘ్నంగా జరుగుతుంది. అందరికీ శుభం కలుగుతుంది. ఆమె యిష్టప్రకారమే వివాహం జరిపించండి. ' అని నారదమహర్షి వెళ్ళిపోయాడు.

వివాహ నిశ్చయ నియమాల ప్రకారం, అశ్వపతి అరణ్యానికి వెళ్లి ద్యుమత్సేనుని కలుసుకుని, తనను తాను పరిచయం చేసుకుని, తన కుమార్తె మనసులోని మాటను చెప్పి, తన కుమార్తె సావిత్రిని ఆయన కోడలుగా స్వీకరించమని ప్రార్ధించాడు. ద్యుమత్సేనుడు, అంత గొప్పసంబంధము తమ కుమారునికి వచ్చిందని, యెగిరి గంతు వెయ్యలేదు. ఎంతో నిదానంగా అలోచించి, ' అశ్వపతి మహారాజా ! నేను అంధుడిని, రాజ్యాన్ని పోగొట్టుకున్నవాడిని. తిరిగి నా రాజ్యం పొందగలననే ఆశకూడా లేకుండా జీవిస్తున్నవాడిని. ఇప్పుడు మీకుమార్తెను మా యింటికోడలుగా చేసి, ఆ సుకుమారిని కష్టాల పాలు చెయ్యడం న్యాయం కాదు. వియ్యానికి నేను మీతో తూగలేను, యిప్పటి పరిస్థితులలో. ' అనిచెప్పాడు. అయన మాటలకు అశ్వపతి యింకా సంతోషించాడు. 

' రాజర్షీ ! సుఖదుఃఖాలు క్షణభంగురాలు. వస్తూ వుంటాయి. పోతూ వుంటాయి. ఈ విషయాలు అన్నీ ఆలోచించుకునే మీవద్దకు వచ్చాము. కాబట్టి కాదనకండి.' అని అశ్వపతి అన్నాడు. అప్పుడు కాదనలేక, ' రాజా ! నాకు రాజ్యం వున్నరోజులలో, నామనసులో మీ అమ్మాయిని నాకోడలుగా చేసుకోవలెనని అభిప్రాయం తో వుండేవాడిని. కానీ, తరువాత జరిగిన నా అంధత్వము, రాజ్యభ్రష్టుత్వము వలన ఆ వుద్దేశ్యం విరమించుకోవలసి వచ్చింది. ఇప్పుడు మీరే కోరి మీకుమార్తెను మా యింటికోడలుగా పంపిస్తాము అంటున్నారు. కాదనడానికి నాకు మనసురావడం లేదు. ' అని తన అంగీకారం కూడా తెలియజేశాడు ద్యుమత్సేనుడు. 

ఆ విధంగా ఉభయుల అంగీకారంతో సావిత్రీ సత్యవంతుల వివాహం ఆశ్రమపరిధిలోనే, శాస్త్రోక్తం గా జరిపించారు. అశ్వపతిమహారాజు, తెచ్చిన కట్నకానుకలతో పాటు, కుమార్తె సావిత్రిని కూడా వారికి అప్పగించి, మద్రదేశానికి తన పరివారంతో వెళ్ళిపోయాడు.  

అంత అందమైన, సుగుణవతి అయిన భార్య దొరికినందుకు సత్యవంతుడు చాల సంతోషించాడు. సావిత్రి కూడా, పరమానందంతో, తన అత్తమామలను సేవిస్తూ, భర్తతో అనురాగ దాంపత్యజీవితం గడుపుతున్నది. తండ్రి యిచ్చిన రాజాభరణాలను ఆమె త్యజించి, అత్తమామల జీవనానినికి అనుగుణంగా నారచీరలు ధరించి, అనేకవ్రతాలను ఆచరిస్తూ, తపోజీవనం గడుపుతున్నది.  

రోజులు గడుస్తున్నాయి. నారదుని వచనాలు ఆమె మదిలో నిత్యం ప్రతిధ్వనించ సాగాయి. దినమొకయుగంగా ఆమె కఠోర నియమాలతో దైనందిన జీవితం గడుపుతున్నది.  

స్వస్తి.




వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.


🙏🙏🙏


సేకరణ


**ధర్మము-సంస్కృతి*


🙏🙏🙏




**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**


*మన ధర్మాన్ని రక్షిద్దాం**




**ధర్మో రక్షతి రక్షితః**


🙏🙏🙏

**హిందూ ధర్మం - 16**

 **దశిక రాము**


మనం కూడా చాలా పనులు మొక్కుబడికి చేస్తుంటాము. ఎప్పుడో, ఏదో ఆవేశంలో, ఒక మాట అనేస్తాం, నేను అది చెస్తాను, ఇది చేస్తాను అని ప్రగల్భాలు పలికేస్తాం. తర్వాత ఆ పని పూర్తి చేయడానికి నానా తంటాలు పడతాం. ఎందుకు చెప్పాన్రా బాబోయ్! అంటూ మన మీద చిరాకుపడతాం. ఆఖరికి పనైతే పూర్తవుతుంది. కానీ ఇది ధృతి అనిపించుకోదు అంటారు ఋషులు. బలవంతంగా పనులు, కార్యాలు పూర్తి చేయడం కాదు, అయిష్టంగా సంకల్పాలు నెరవెర్చడం కాదు, ఇష్టంతో చేయాలి, ఉత్సాహంతో చేయాలి, మనసా, వాచా, కర్మణా (త్రికరణ శుద్ధిగా) చేయాలి. అలా చేయడమే ధృతి అనిపించుంకుటుంది.


నేను ఈ ధర్మాన్ని ఆచరిస్తాను అనుకుంటాం. సుఖాలు ఉన్నప్పుడు, సమయం అనుకూలించినప్పుడు ఆచరించడం సులువే. కానీ కష్టం వచ్చినా, మరణం సమీపిస్తున్నా, ప్రళయం వస్తున్నా, ధర్మాన్ని అదే ఉత్సాహంతో, సంతోషంతో ఆచరించడం ధృతి. ధృతిని మనుమహర్షి ధర్మానికి మొదటి లక్షణంగా చెప్పడంలో ఒక రహస్యం ఉంది. ఈ ధర్మంలో ఆధునిక వైద్యశాస్త్రంలో ఉన్నట్టుగా దేనికి క్షణికమైన ఫలితాలు (Instant results) ఉండవూ, అనుసంగ ప్రభవాలు (Side Effects) ఉండవు. ఆయుర్వేదమే తీసుకోండి, ఒక్కో ఔషధం పని చేయాలంటే కనీసం 41 రోజులు పాటు దాన్ని సేవించాలి, కానీ దాని ఫలితాలు అధ్బుతంగా ఉంటాయి. ధ్యానం, యోగా కూడా అంతే. గురువు దగ్గరకు వెళ్ళగానే, రా నాయానా! నేను నీ కోసమే వేచి ఉన్నాను. మొత్తం నీకు ఇప్పుడే భోధిస్తాను అని చెప్పడు. ముందు బోలెడు పరీక్ష పెడతారు, మన ఓపికను పరీక్షిస్తారు, మన శ్రద్ధను గమనిస్తారు, మనం అన్నిటిని తట్టుకుని సిద్ధమయ్యాక, అప్పుడి జ్ఞానాన్ని భోధిస్తాడు. ఇక్కడ కూడా వ్యక్తికి ధృతి ఉండాలి. లేకుంటే మోక్షం పొందలేడు. అట్లాగే భగవంతుని అనుభూతి ఒక్క రోజులో కలగదు. దానికి బోలెడు సాధన కావాలి, ఆహార నియమాలు పాటించాలి, బాగా ఓపిక కావాలి, నిరనతరం ఉత్సాహం ఉండాలి, భగవంతుడిని చేరాలన్న తపన నిరనతరంగా కలుగుతూనే ఉండాలి. ఇదంతా కేవలం ధృతి వల్లనే కలుగుతుంది. కనుక మనుమహర్షి ధర్మాచరణలో ధార్మికునకు ఉండవలసిన మొదటి లక్షణం ధృతి అని ప్రవచించారు. తరువాతి లక్షణం క్షమా.


**ధర్మము - సంస్కృతి**

సకలశ్వరామ

 సకలశ్వరామనీయధీన, మదివిశ్వంబెలావాాప్పంచు

నీకొక లేశ్ంబు వికారమన్ గలుగ, దాతోమతకరుషలీక్షింపకూరక,

గరవంబునవిఱఱవీగెదరు; సరవ సావమామల్ నీవ .

పాయకరక్షించుట నీసవభావమ దయాఢ్యా!శ్రీనివాసప్రభూ!

ఓ ప్రభూ శ్రీనివాసా! విశ్వమందలి సంపదంత్య నీకు సావధీనమై విశ్వమంత్య వాాప్పంచి

ఉంది. అనినటియందు నీకే అధికారమననది. అందరినీ రక్షిస్తీ ఉంటావు. అది నీ

సవభావమ కూడా. అట్టవంటి నీకు కొంచెమైనా గర్ణవహంకార వికారమలు కలుగవు.

ఆవిధంగా కాకుండా కొందరు. తమ గొపపతనం ఏమాత్రం లేకపోయినా కూడా తమన్య త్యమ గొపపగా చెప్పుకొంటూ ఊరకే గరవంతో మిడిస్త్రపడుత్త ఉంటారు. 


స్నకరణ ∷ అద్ధవతవాణి

మూడు దావర్ణలు.

 త్రివిధం నరక స్నాదం దావరం నాశ్న మాతమనైః

కామైః క్రోదైః తథా లోభైః తసామ దేతతియం తాజేత్

కామ, క్రోధ, లోభా లనేవి నరకానికి మూడు దావర్ణలు. వాటివలన మన్యషుాడు

సరవనాశ్నం చెందుత్యడు. కాబటిో వాటిని పరితాజంచడం కరీవాం. పాండవ సంపదన్య చూచి దాని నేవిధంగానైనా అపహరించాలని పూన్యకొనన  

దురోాధన్యడిలో కామం పడగ విప్పపంది. పాండవులూ ద్రౌపదీ తనన్య చూచి నవావరని

అహంకరించి వారిపై ప్రతీకారం తీరుికొని అవమానాలపాలు చేయాలనే క్రోధం

దురోాధన్యడిలో విశ్వరూపం దాలిింది. శ్త్రుసంపదన్య హరించటమే కాకుండా వారికి

జీవితమలో ఎననడూ ర్ణజాాన్యభవసౌఖ్ాం లేకుండా చేయాలనే లోభం అతడిలో

వికృతనాటాం చేస్త్రంది. ఈ మూడు గుణాల సంపుటి దురోాధన్యడు. అందువలా

నరకదావర్ణలనీన తెరుచుకొనన జీవనమారగం దురోాధన్యడిది.

వెంకటేశ్వర స్వామి విగ్రహానికి హారతి

  





Multi purpose bag

 






 

మనస్సు అంటే

మనస్సు అంటే చంచలంగా ఉండేది అని అర్ధం. మనసు స్థిరంగా కూడా ఉంటుంది అనే అనుభవం మనకి లేదు. అలాంటి అనుభవం లేనంత మాత్రాన మనసు స్థిరంగా ఉండడం అసంభవం అనుకోకూడదు. ఒక్కసారి అసంభవం అనుకుంటే, ప్రయత్నించాలి అనే సంకల్పం నీరుకారిపోతుంది.

మనిషి ఎలా ఉన్నవాడిని అలా వున్నట్లుగా స్వీకరిస్తే మనసు వశం అవదు. మనసు వశం అవడానికి అభ్యాస, వైరాగ్యాలు కావాలి. మనల్ని వేరే విధంగా తయారు చేయగలిగే పద్ధతి, "అభ్యాసం". మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుండి వేరే స్థితికి తీసుకెళ్లడం," వైరాగ్యం". వైరాగ్యం అంటే జీవితంలో రాగం యెడల విముఖత. ఒక రాగం వ్యర్ధమైనపుడు, అన్ని రాగాలలో వ్యర్ధతని చూడగలిగే వాడికి వైరాగ్యం కలుగుతుంది. ఈ ప్రపంచంలో బాహ్యంగా ఎటువంటి సుఖం లభించదు అనే జ్ఞానాన్ని వైరాగ్యం అంటారు.

మంచిపని చేయాలని వచ్చిన ఆలోచన, ఆ మంచిపని చేయడానికి వేసే ప్రతీ అడుగు వలన, ఆ మంచిపని పూర్తి అయినా, అవకపోయినా మనిషి దుర్గతిని పొందడం జరుగదు. యోగం దిశగా చేసే ఏ ప్రయత్నం వృధాగా పోదు. పరమాత్మ వైపు వేసే ఏ అడుగు కూడా వ్యర్థం కాదు.

ఎవరికి పరమాత్మ యెడల శ్రద్ధ ఉంటుందో, అతను ఆ పరమాత్మని పొందడానికి ఎంతో శ్రమ పడతాడు. కానీ తాను పడే శ్రమ సరిపోయింది అని ఎప్పటికీ భావించడు. పూర్తిగా కష్టపడినా, పరమాత్మా! నీ సహాయం లేకుండా నిన్ను పొందుట అసంభవము అంటాడు. నీ అనుగ్రహం ఉంటేనే నిన్ను పొందగలను అంటాడు. మనం చేసే సాధన అంతా ఆ పరమాత్మ అనుగ్రహం కోసమే. విరాట్ జీవన సాగరంలో నేను ఒక బిందువు కన్నా ఎక్కువేమీ కాదు అని అనుకోవడమే శ్రద్ధ అంటే.

*power of poetry..*

*Poetry is-seed of greens and shades,

Source of Fruitful dreams n heartful arts.

Poem is- electric focus of five elements,

Act of react to dresses facts n adresses deeds.

Poetry is-sky of stars n rising raysof wishes,

Ocean of patience waves n peaceful pearls.

Poetry is-Earth of blossoming mindful crops n kindness mines.

Poem is flow of emotional thougts,

Glow of relations n chasing words.

Feel of heal n hale,

Tuning to time n society.

Poetry is air of life n

Power of challenging.

Poetry is Fire of flash,

Under the ash.

Breathing basics of eternities,boldness of humanity showers.

Solution When pollution, problems surrouded,

Enlightenment of hope n nobility of help.

Poetry gives wings of believe to live.

Let us delight with full moon light of poetry.

Aly.Ln.wr.Dr.Vedula srirama sarma'sirisha', kakinada.9866050220.

National poetry day best wishes.

అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా

ఈ నామములో అమ్మవారి లలాటము గురించి చెపుతున్నారు. శృంగారరసము కన్నులచేత తెలుస్తుంది. భయము హాస్యము చేత కలిగిన సంతోషము కన్నుల ద్వారా తెలుస్తుంది. ఏదైనా సమస్యతో పరితాపమును పొంది ఉన్నారా, ప్రసన్నముగా ఉన్నారా అన్న రెండు విషయములు మాత్రము నుదుటి చేత తెలుస్తాయి. ఏకాంతములో ఆలయములోకి వెళ్ళి దర్శనము చెయ్యడము కాక – చేసిన దర్శనము యొక్క అనుభూతి ద్యోతకము అవ్వాలి. ధ్యానములో అమ్మవారి లలాటదర్శనము చేత ఎటువంటి అనుభూతిని పొందుతున్నారన్నది గమనించవలసిన విషయము. జాగ్రత్తగా ధ్యానము చేయడానికి చాలా చమత్కారముగా కొన్ని అవసరమైన సూచనలను వ్యాసభగవానుడు ఈ నామములో ఇచ్చారు. 

 అమ్మవారి లలాటము అష్టమినాటి చంద్రునివలె ఉంటుందని అన్నారు. ‘విభ్రాజదళికస్థలశోభితా’ అనగా లలాటము శోభిస్తూ ప్రకాశిస్తున్నది. శుక్లపక్షములో, కృష్ణపక్షములోకూడా అష్టమి వస్తుంది. చంద్రుడు శుక్లపక్షములో పెరుగుతూ, కృష్ణపక్షములో తరుగుతూ ఉంటాడు. అమ్మవారి లలాటము ఏ చంద్రుడిలా ఉంటుంది ? తేడా ఏమైనా ఉంటుందా? అన్నది చమత్కారము. ఎలా ఉంటుందో చెప్పడానికి నెలరోజులు కావాలి. లలాటమును చూసి గుర్తుపడితే మనసులో అమ్మవారి లలాటము కనపడుతుంది. మరుక్షణమే పరితాపమునకు ఉపశాంతి కలుగుతుంది. దీర్ఘకాలము ఉండే పరితాపముల వలన జీవితాంతము దుఃఖము అనుభవిస్తూనే ఉంటారు. ఒక జన్మతో పోయేట్టు ఉండదు. ఎన్నో జన్మలు అనుభవించవలసిన దానిని అమ్మవారి లలాటము చూసిన ఉత్తరక్షణములో ఆ పాపము దగ్ధమైపోతుంది. వ్యాసుడు అమ్మవారి లలాటము గురించి చెప్పి మనలను ఉద్ధరించడానికి ప్రయత్నము చేస్తున్నారు. అమ్మవారి లలాటము కృష్ణపక్షములో చంద్రునిలా ఉంటుంది. ఏ పక్షములో చంద్రబింబమయినా చల్లగానే ఉంటుంది అందులో అమ్మవారి నుదురు చూడగలగాలి. బాహ్యములోచూసినప్పుడు దూరముగా ఉన్నా ధ్యానములో మనసులోనే సాక్షాత్కరిస్తుంది. లలితాసహస్రనామ స్తోత్రములో ఉన్న ఏ నామమయినా ఉద్ధరిస్తుంది. అది అనుసంధానము చేసుకోవడము రావాలి. శుక్లపక్షము అంటే చంద్రకళలు తగ్గడము, కృష్ణపక్షము అంటే చంద్రకళలు పెరగడము. పదిహేను కళలు పెరిగితే పౌర్ణమి, పదిహేను కళలు తరిగితే అమావాస్య వస్తుంది. ఎందులోనుంచి ఈ కళలు వచ్చి, మళ్ళీ వెళ్ళిపోతున్నాయో ఆ కళకు ‘లలిత’ అని పేరు. ఆ కళనే లలితకళ, శ్రీకళ, చిత్కళ, ఆద్యకళ అనిపిలుస్తారు. అష్టమితిథినాడు మాత్రమే ఒకే పేరు ఉన్న నిత్య శుక్లపక్ష, కృష్ణపక్షములలో కూడా వస్తుంది. అష్టమితిథినాడు ఎప్పుడూ చంద్రబింబములో ఉండే నిత్య నమస్కారము చెయ్యగానే చాలా తొందరగా కోరిక తీర్చకల శక్తి ఉన్నది. ఈ నామము చెప్పినా, ధ్యానము చేసినా, చాలా తొందరగా పరితాపము తగ్గి కోరికలు తీరతాయి. ఈ మాట మహానుభావుడు వ్యాసుడు, వశిన్యాదిదేవతలు చెప్పారు. లలాటదర్శనము చేత ఈ భాగ్యమును కృపచేస్తున్నది.   

భాగ్యము లలాటము చేత నిర్ణయింపబడుతుందని పెద్దలు అంటారు. సాముద్రికములో విశాలమైన లలాటము ఉంటే భాగ్యవంతులు అంటారు. అమ్మవారి లలాటము ముడత పడడము, చిట్లించుకోవడము ఉండదు. అన్నిటినీ కల్పించకలిగినది, తియ్యకలిగినది,శక్తి ఇవ్వకలిగినది అమ్మ కనక ఆవిడ లలాటము అలా ఉన్నదని చెప్పారు. కొన్ని రోజులు పెరుగుతు, తరిగిపోతు ఉన్న చంద్రబింబమును రోజు చూస్తుంటే అందులో అనేక చిత్రములు ద్యోతకము అవుతాయి. పరితాపము ఉపశమిస్తుందని కూడా చెపుతూ శంకరాచార్యులు ఒక అద్భుతమైన శ్లోకము ఇచ్చారు.  

 కళఙ్కః కస్తూరీ రజనికరబిమ్బం జలమయం

కలాభిః కర్పూరై ర్మరకతకరండం నిబిడితమ్ |

అతస్త్వద్భోగేన ప్రతిదిన మిదం రిక్తకుహరం 

విధి ర్భూయోభూయో నిబిడయతి నూనం తవ కృతే || 

అమ్మా! లోకములో ఉన్నవాళ్ళు ఆకాశములో చంద్రబింబము ఉన్నది అంటారు. అది గరుడమణి పూసల పెట్టి. అది పారదర్శకముగా లోపల ఉన్న పదార్ధము కనపడుతూ ఉంటుంది. చంద్రబింబమని పిలవబడేది చిన్నకుప్పె. అమ్మవారు స్నానము చేసినప్పుడు వాడుకునే పరిమళ జలములు తరవాత తన శరీరమునకు అలదుకునే అంగరాగములు అందులో పెట్టి ఉంటాయి. ఆవిడ రోజూ స్నానమునకు అలంకారమునకు వాడుతుంటే కరిగిపోతుంటాయి. అలా కరగిపోవడమే కృష్ణపక్షములో చంద్రుడు తరగిపోవడము. అన్నీ తగ్గిపోతుంటే అమ్మకు అన్నీ కొడుకు తీసుకుని వచ్చి సిద్ధము చెయ్యాలి కదా. అందుకని కొడుకైన బ్రహ్మగారు వెళ్ళి తీసుకుని వచ్చి పెట్టి నిత్య బ్రహ్మోత్సవము అమ్మవారికి చేస్తుంటాడు. అమ్మవారికి అందులో కొద్దిగా పరిమళ జలములు వేస్తాడు కొంచము పెరుగుతుంది. అంగరాగములు వేస్తాడు. ఇంకొంచము పెరుగుతుంది. కస్తూరి వేస్తే ఇంకొంచము పెరుగుతుంది. పౌర్ణమి వచ్చేటప్పటికి టాయిలెట్ బాక్స్. శుక్లపక్షము, కృష్ణపక్షము కాదు బ్రహ్మగారు సామాను తెచ్చి వేస్తుంటే సామాను పెరుగుతున్నది. వాడేసుకుంటే తరిగిపోతే కృష్ణపక్షము అంటున్నారు. నీకు బ్రహ్మగారు చేస్తున్న సేవ నిత్య బ్రహ్మోత్సవము. అమ్మవారికి చేస్తున్న బ్రహ్మోత్సవాలు చూడాలి అంటే ఎవరి ఇంటిముందు వారు అరుగు మీద నించుని ఆకాశము వంక చూస్తే చాలు కనపడుతుందని అన్నారు. అమ్మవారి ముఖమండలము నుంచి వచ్చే అమృతబిందువులు మనసులను చల్లబరచి, పరితాపమునకు ఉపశాంతిని, ఆహ్లాదమును కలగచేస్తాయి. 

*స్త్రీ అంటే అవసరం కాదు ధైర్యం*

రామునికి — సీత

కృష్ణునికి — రాధ 

ఈశునకు — ఈశ్వరి

మంత్రపఠనంలో — గాయత్రి 

గ్రంధ పఠనంలో — గీత

దేవుని యెదుట

 వందన, అర్చన, పూజ, హారతి, ఆరాధన

     వీరికి తోడుగా శ్రద్ధ

 *మన దినచర్యలో భాగంగా*

ఉదయానికే—ఉష, అరుణ


సాయింత్రం — సంధ్య


చీకటైతే — జ్యోతి, దీప


రాత్రి మత్తులో — నిషా


      పడుకున్నాక — స్వప్న




చూచేటప్పుడు— నయన


వినేటప్పుడు — శ్రావణి


మాట్లాడునప్పుడు—వాణి


ఓరిమిలో -వసుధ వడ్డించేటప్పుడు-అన్నపూర్ణ


నడుస్తున్నప్పుడు— హంస


నవ్వుచున్నప్పుడు — హాసిని, ప్రసన్న


 అద్దంలో చూస్తే— సుందరి


 చేసేపనికి -స్పూర్తి


 పని చేయడానికి — స్పందన


మంచి పనికి — పవిత్ర


ఇష్టంగాచేసే పనికి — ప్రీతి


నీరు త్రాగునపుడు — గంగ


ఐస్క్రీమ్ తినేటప్పుడు — హిమజ


      సినిమా చూస్తున్నప్పుడు — చిత్ర


అబద్ధ మాడునపుడు — కల్పన


నిజం చెప్పేటపుడు —సత్యవతి, నిర్మల


 ఆలోచనలప్పుడు — ఊహా, భావన చదువుచున్నప్పుడు — సరస్వతి


వ్యాపారంలో — ప్రతిభ , ప్రగతి


సంతోషంలో— సంతోషి


కోపంలో — భైరవి


ఆటలాడునప్పుడు— ఆనంది 


గెలుపు కోసం— జయ, విజయ


గెలిచిన తర్వాత — కీర్తి


      సరిగమలు నేర్చునపుడు — సంగీత


      పాటలు పాడునపుడు — శృతి, కోకిల


      తాళం వేయునపుడు — లయ


      


      సాహిత్య గోష్టిలో — కవిత 


నగరాన్ని కాపాడుతూ — ప్రకృతి




  జీవిత గమనంలో మనతో


విద్యాభ్యాసంలో — విద్య


సంపాదనప్పుడు — లక్ష్మి


చేసేవృత్తిలో — ప్రేరణ పని చేసి వచ్చాక — శాంతి


      చిన్నతనంలో — లాలన మధ్యవయస్సులో -మాధురి


      ముసలితనంలో- కరుణ, మమత


      జీవితాంతం మనతో — “జీవిత”.🙏 


 బాగుంది కదా మన తెలుగుభాష.....యొక్క గొప్పతనం...


**హిందూ ధర్మం** 56

 **దశిక రాము** 

 (అక్రోధః)#అక్రోధః - క్రోధము లేకుండుట. ధర్మం యొక్క లక్షణం.

మనిషికుండే అవలక్షణాల్లో ఒకటి, పరమదుర్గుణం కోపమే. కోపం ఆవేశానికి దారి తీస్తుంది. ఆవేశం కారణంగా అనకూడని మాటలు అనేస్తాం. ఆయుధం చేయి దాటితే ప్రాణం పోతుంది, మాట నోరు జారితే సమస్తం పోతుంది. ఒక్కోసారి ఆయుధ ప్రయోగం వలన తగిలే దెబ్బలు బాహ్యాంగానే ఉంటాయి. కానీ మాట జారడం వలన వ్యక్తి ఆంతరంగికంగా గాయపడతాడు. శరీరానికి తగిలిన గాయాలను నయం చేయచ్చు కానీ, మనసుకు తగిలిన గాయాలను మాంచలేము. అందుకే కోపంలేని జీవితాన్ని గడపమని ఋషులు చెప్తున్నారు.    

ఎంతో గొప్ప కీర్తివంతులు, మంచి పేరున్నవారు, సమాజంలో గౌరవంతో బ్రతుకుతున్నవారు కోపానికి గురై పొరపాటుగా పలికిన మాట వారి కీర్తిని, గొప్పతనాన్ని నాశనం చేస్తుంది. క్రోధానికి లోనవడం వలన ఆవేశంలో మంచివాడు కూడా దుర్మార్గపు పనులు చేస్తాడు. ఆవేశం అనర్ధాలకు దారి తీస్తుందన్నారు పెద్దలు. ఒక్కసారి ఆవేశానికి లోనయ్యామా, ఇక మనమేం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏమి గుర్తుకురావు. ఇంతకముందు మనం విన్న మంచిమాటలు, ధర్మసూక్ష్మాలు, శాస్త్రాలు, పురాణాలు, అన్నీ మర్చిపోతాం. అందుకే యోగి వేమన తన వేమన శతకంలో

కోపమున ఘనత కొంచెమైపోవును 

కోపమునను గుణము కొరతపడును 

కోపమణచనేని కోరికలీడేరు 

విశ్వదాభిరామ వినురవేమ








కోపం వలన కీర్తి, పరువుప్రతిష్టలు నశిస్తాయి. కోపము వలన మంచిగుణాలు కోల్పోతారు. కోపాన్ని అణుచుకున్నవాడి, అదుపు చేసుకున్నవాడి, జయించినవాడి కోరికలన్నీ తీరుతాయి అని భావం.   




       




కోపంలేని జీవితం ఒక్కసారిగా సాధ్యపడదు. దానికి సాధన కావాలి. కోపాన్ని అదుపు చేసుకోండి అని ఋషులు చెపలేదు, కోపాన్ని జయించమన్నారు. అదుపు చేసుకోవడం వేరు, జయించడం వేరు. అందుకు తగిన మార్గాలు కూడా వారే నిర్దేశించారు. 








తరువాయి భాగం రేపు......




🙏🙏🙏




సేకరణ




**ధర్మము-సంస్కృతి*




**ధర్మో రక్షతి రక్షితః**


*ధర్మము - సంస్కృతి*








**ధర్మో రక్షతి రక్షితః**




 గ్రూప్స్ ద్వారా




  క్షేత్ర దర్శనాలు , పురాణాలు , ఇతిహాసాలు, దైవ లీలలు పోస్ట్ చేస్తూ అందరికీ మన సనాతన ధర్మ వైభవాన్ని తెలియజేయాలనే ప్రయత్నం చేస్తున్నాము.మీరు కూడా సహకరిస్తే అందరం కలిసి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటుదాం.








**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**




*మన ధర్మాన్ని రక్షిద్దాం**








**ధర్మో రక్షతి రక్షితః**




🙏🙏🙏

సభలో


 

దేముడు













 

**రోగ నివారక సూర్యాష్టకం***

 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅

*

【తేటతెలుగు తేటగీతి పద్యాలు】

రచన:-

*******

భోగయగారి. చన్ద్రశేఖర శర్మ,

పెద్ద శంకరంపేట,

జిల్లా:మెదక్-944౦౦44142.*

~~~~~~~~~~~~~~~~~~~

తే.గీ:-1.

********

ఆదిదేవుడా! ప్రణతులనందుకొనుము

భాస్కరా! నన్ను దయజూడు ప్రణుతి జేతు

ప్రభల< జిమ్ము ప్రభాకరా! భక్త వరద!

సూర్యనారాయణా! నీకు జోతలివియె*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

తే.గీ:-2.

*********

ఏడు గుఱ్ఱాల రథమెక్కి యేగుదెంచు

అతుల తేజస్వి! శ్రీ కశ్యపాత్మజుండ!

శ్వేత పద్మమ్ము చేబట్టు వెలుగు ఱేడ!

సూర్యనారాయణా! నీకు జోతలివియె.*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

తే.గీ:-3.

*********

లోహ రథమెక్కి చరియించు లోకపూజ్య!

సకల లోకపితామహ! చండ తేజ!

పాప హారకా! ఘన తామసాపహారి!

సూర్యనారాయణా! నీకు జోతలివియె.*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

తే.గీ:-4.

*********

త్రిగుణ వశవర్తి! శూరుడా! శ్రీకరుండ!

బ్రహ్మవు, గిరిశుడవు చక్రపాణి వీవె

పాప సంహర్తవీవయ్య భక్తపాల!

సూర్యనారాయణా! నీకు జోతలివియె.*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

తే.గీ:-5.

*********

విస్తృతము జేసి తేజస్సు, విశ్వమందు

గాలి,యాకాశములలోన కలియజేయు

సర్వలోక ప్రభువు నీవు జయము నీకు

సూర్యనారాయణా! నీకు జోతలివియె.*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

తే.గీ:-6.

*********

తనువు మందార సుమరుచిన్ తనరుచుండ

హార,కుండలధరుడవు వీర! మిత్ర!

ఏక చక్ర రథ విహారి! శోక నాశ!

సూర్యనారాయణా! నీకు జోతలివియె.*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

తే.గీ:-7.

*********

ఘనుడవీవట లోకాల కర్తవీవె

గొప్ప వెలుగుల కిరణాల కుప్పవీవు

ఘోర పాపాపహారి! తుషార హారి

సూర్యనారాయణా! నీకు జోతలివియె.*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

తే.గీ:-8.

********

విష్ణుదేవుడవీవేను విమలరూప!

జగతి నాథుడ! జ్ఞాన విజ్ఞానదుడవు

మోక్షదాతవు వరదాన దక్షుడీవె

సూర్యనారాయణా! నీకు జోతలివియె.*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🕉ఫలశ్రుతి🌅:-

తే.గీ:-

*******

సూర్యనారాయణాష్టక శ్రోతకెపుడు,

పఠితకైనను గ్రహముల బాధలణగి,

ఆయురారోగ్య సంపదలబ్బుననుచు

చంద్రశేఖరుడినునిట్లు స్తవము జేసె.*

~~~~~~~~~~~~~~~~~~~

శ్రీరస్తు*శుభమస్తు*ఆరోగ్యమస్తు✋🏽

*లోకాః సమస్తాః సుఖినోభవంతు.

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿

దుర్మార్గుడు

 ఖలః సర్షపమాత్రాణి పరచ్ఛిద్రాణి పశ్యతి

ఆత్మనో బిల్వమాత్రాణి పశ్యన్నపి న పశ్యతి.



దుర్మార్గుడు ఇతరులలో ఉన్న ఆవగింజంత లోపాన్ని కూడా చూస్తూ ఉంటాడు. తనలో మారేడు పండంత లోపం ఉన్నా చూచి కూడా చూడడు.


శుభోదయము !

సాష్టాంగ నమస్కారం

 *సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి? సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలి?*


      *మనం నమస్కారాలను అనేక విధాలుగా చేస్తూ ఉంటాము. రెండు చేతులను జోడించి హృదయం దగ్గర ఉంచుకొని ఆ దేవుడికి చేసే నమస్కారం ఒకటి. రెండు చేతులను పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ చేసే ఆ సూర్య భగవానుడికి, గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మరణ చేస్తూ ఆ వేంకటేశ్వరునికి చేసే నమస్కారం మరొకటి. అలాగే గుడిలో దేవుని ముందు బోర్లా పడుకుని చేసే నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు. ఈ సాష్టాంగ నమస్కారాన్నే మరో పేరుతో అష్టాంగ నమస్కారం అని అంటారు. సాష్టాంగ నమస్కారము, అష్టాంగ నమస్కారము అంటే అర్థం ఏమిటంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో కలిపి నమస్కారము చేయుట అని అర్ధము.*


*అష్టాంగాలు అంటే :*

*ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః*


  *వీటి అర్థాలను ఒకసారి పరిశీలిస్తే "ఉరసా" అంటే తొడలు, "శిరసా" అంటే తల, "దృష్ట్యా" అనగా కళ్ళు, "మనసా" అనగా హృదయం, "వచసా" అనగా నోరు, "పద్భ్యాం" అనగా పాదములు, "కరాభ్యాం" అనగా చేతులు,"కర్ణాభ్యాం" అంటే చెవులు.*


      *ఇలా "ఎనిమిది అంగములతో కూడి కలిపి ఈ నమస్కారం చేయాలి. అందుకే ఈ నమస్కారాన్నే "అష్టాంగ, సాష్టాంగ నమస్కారం అంటారు.*


     *అలా ఎందుకు చేయాలంటే మానవుడు సహజంగా ఈ ఎనిమిది అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి..*


     *ముఖ్యంగా మనందరమూ తెలుసు కోవలసిన విషయం ఏమిటంటే దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ద్వారానికి ధ్వజ స్తంభానికి మధ్యలో వుండి చేయాలి.*


*1) ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి.*


*2) శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి.*


*3) దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి.*


*4) మనస్సుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మన:స్పూర్తిగా చేయాలి.*


*5) వచసా నమస్కారం అంటేవాక్కుతో నమస్కారం.. అంటే.. నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి. అంటే "ఓం నమః శివాయ" అని అంటూ నమస్కారం చేయాలి.*


*6) పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.*


*7) కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.*


*8) జానుభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి.*


   *అయితే స్త్రీలు మాత్రం సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్లు పంచాంగ నమస్కారం అనేది మాత్రమే చేయాలి. అంటే కాళ్లు, చేతులు, మోకాళ్ళు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని శాస్త్రం చెబుతుంది.*


      *పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యాలి. దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి.*


     *నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టంగ నమస్కారం చేయడం వల్ల పొందుతారని శాస్త్రవచనం.శుభం భూయాత్*

వకుళమాత

 అమ్మా! 

ఎవరు నాయనా అంటూ బయటకొచ్చింది వకుళమాత. ఎదురుగా తిరునామాలు పెట్టుకుని పట్టు పీతాంబరధారి అయిన నవ యువకుడు నిలబడి ఉన్నాడు. 


'ఎవరు నాయనా' అడిగింది మళ్ళీ 

'అనాథనమ్మా. అమ్మ కోసం వచ్చానమ్మ’. 

అప్పుడు అర్థమయింది ఆమెకు అతడెవరో. 

‘జగన్నాధుడివి కదా! అనాధవెట్లా అవుతావు. రా నాయనా లోనికి. నీకోసమే ఎదురు చూస్తున్నాను.’

హృదయ కవాటాలు తెరచి ఆహ్వానించింది ఆ తల్లి ఆ విశ్వనాధుడిని 

అమ్మా ఆకలిగా ఉంది ఏమైనా పెట్టవా తినటానికి 

తప్పక నాయనా పాలు వెన్న ఉంచాను నీ కోసమే కృష్ణ.అంటూ లోనికెళ్ళి వెండిగిన్నె లో వెన్న, కుండలో కాగి మీగడ కట్టిన పాలు తెచ్చి అందించింది. 


ఆకలితో ఆకొని ఉన్నాడేమో అతి ప్రేమతో ఆరగించేడు. తృప్తిగా పెదాలు వత్తుకున్నాడా క్షీర ప్రియుడు ఉత్తరీయం తో. 


యుగాల ఆకలిని తీర్చావు తల్లీ. కృష్ణా 

అని పిలిచేవు. ఎవరమ్మ అతడు. 


నీవే! నా కృష్ణుడివి. అమ్మా అని అంత తీయగా ఆర్తిగా ఇంకెవరు పిలుస్తారు నన్ను. ఆకలి తో నున్న సుతుని నీ తల్లి యశోద గుర్తించలేదా తండ్రి. నీ తల్లి యశోదనేగా. అందుకేగదా ఆకలివేళ అమ్మా అని నా దరికొచ్చావు. నీ కోసమే మరుజన్మనెత్తి ఎదురు చూస్తున్నాను ఎప్పుడు నీ దర్శన మవుతుందాయని. ఇన్నాళ్ళకు నీ దర్శన మయింది కృష్ణా.


యశోద ఒక పిచ్చితల్లి. కొడుకువనే అనుకుంది. గాని భగవంతుడివని తెలుసుకో లేక పోయింది. ఎన్ని లీలలు చూపినా ఆఖరికి నోరు తెరచి పదునాల్గు భువనాలు చూపినా తెలుసుకో లేకపోయింది నీవెవరో. చేతిలో ఉన్న మోక్షాన్ని కాలదన్నుకుని నీ వివాహం చూడాలనుకొంది. ఫలితం ఈ జన్మ. బ్రహ్మాండనాయకా నాతప్పు సైరించి మోక్షమిప్పించవా తండ్రి. 


ఏమి మాటలమ్మ ఇవి. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ నా తల్లివేనమ్మ నువ్వు. ఇప్పుడే కలిశాము. ఇంకా చేయవలసిన పనులు చూడవలసిన వేడుకలూ చాలా ఉన్నాయమ్మ. నీతోనే ఉంటాను ఇకపై. నీకోసమే వచ్చాను వెతుకుతున్నాను ఎక్కడున్నవా అని. నీ చేతి పాల్వెన్నలు ఆరగించి ఎన్నియుగాలో అయింది. ఆ రుచి పాలలో లేదమ్మా. నీ మనసులో పొంగే అపరిమిత ప్రేమ వాత్సల్యపూరితమైన నీకరస్పర్శలో ఉందమ్మా. అది నీవద్ద కాక ఇంకెక్కడ దొరుకుతుందమ్మా.  


తల్లి లేనివాడికి తల్లివయినావు. మాతృప్రేమని వాత్సల్యాన్ని చవి చూపావు. ఆ వాత్సల్యానికి నేనుకూడా మేను మరిచానమ్మా. ఆ జన్మ లో నీకూ నాకు అంతే యోగముందమ్మా. అందుకే 

మరో జన్మ మన యిద్దరికి. 


నా వివాహం నీ చేతి మీద జరిపించమ్మా. ఇదే ఆఖరు వివాహం అమ్మా. ఈ వివాహం తో నువ్వూ నేను ధన్యత చెందుతాం. వివాహానంతరం నీ చేతి వంట తింటూ ఇక్కడే ఉందామమ్మ.


కడుపు నిండుగా మనసు నిండగా నీ చేతి పాల్వెన్నలు ఆరగించితిని. కొంచెము సేపు నీ ఒడిలో సేద తీరుతానమ్మా. అనుమతినీయవూ. 


తప్పక తండ్రీ. పాలకడలిలో శేష శాయివై నిదురించు నీవు నా ఒడిని పావనం చేస్తానంటే అనుమతి ప్రశ్న లేనే లేదు. అది నా భాగ్యం. విశ్రమించు తండ్రీ. 


ఆమె తొడపై తలయుంచి నిదురించిన ఆ భగవంతుణ్ణి చూస్తూ మెల్లగా వీవన వీస్తూ తల్లి వకుళమాత అమందానందాన్ని పొందుతూంది. 


తల్లి ఒడిని మించిన పడక ఇంకెక్కడ. ఎన్ని యుగాలైందో అటువంటి పడక దొరికి. అనంత శయనుడు ఒడలు మరచి నిదురిస్తున్నాడు. 


ఆ అందమైన దృశ్యాన్ని ఊహించు కుంటూ మనం భక్తితో నమస్కరిద్దాం.

ఆదిపర్వము-39

 

కురురాజు జన్మవృత్తాంతం


ఆ ప్రకారం పాండవులు రాత్రిళ్ళు, పగళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఒకరోజు అర్థరాత్రి వారు గంగా తీరానికి చేరుకున్నారు. అది సోమశ్రవ తీర్థము. అందులో స్నానం చేయాలని అనుకున్నారు. ఆ సమయానికి అక్కడకు అంగారపర్ణుడు అనే గంధర్వుడు తన భార్యలతో కూడి విహారానికి వచ్చాడు. పాండవులను చూసి అంగారపర్ణుడికి కోఅపమం వచ్చింది.

“మానవా, ఇది అర్థరాత్రి సమయము. యక్షులు, రాక్షసులు, గంధర్వులు తిరిగే సమయము. ఈ వేళలో మానవులు తిరగరాదు. నేను అంగారపర్ణుడు అనే గంధర్వుడిని, ఈ అడవి, గంగాతీరం నా అధీనంలో ఉన్నాయి. మీరు ఇక్కడ నుండి వెళ్ళిపొండి. లేకపోతె నా బాణాలకు బాలి అవుతారు” అని గర్వంగా పలికాడు.

దానికి అర్జునుడు “నువ్వు చెప్పిన మాటలు బలహీనులైన మానవులకు వర్తిస్తాయి, కాని మావంటి మహా వీరులకు కాదు. ఇంకొక్క మాట ఈ భూమి మీద ఉన్న నదులు అన్నియు జనులకు ఉపయోగకరమైనవి. పైగా ఈ పవిత్ర గంగానది జనులందరికి చెందిన పుణ్య నది. ఇది ఏ ఒక్కరి సొంతమూ కాదు” అని పలికాడు.

తనకు ఒక మానవుడు ఎదురు చెప్పినందుకు అంగారపర్ణుడు కోపించాడు. అర్జునుని మీద పదునైన బాణాలు వేసాడు. అర్జునుడు ఆ బాణాలను, తన చేతిలోని కొరివితో అడ్డుకున్నాడు.

అంగారపర్ణుని చూసి “ఓయి గంధర్వా, ఇది ఆగ్నేయాస్త్రము. దేనిని పూర్వము అగ్నిదేవుడు బృహస్పతికి ఇచ్చాడు. అతడు భారద్వాజునికి ఇచ్చాడు. భరద్వాజుడు దానిని పరశురామునికి , పరశురాముడు ద్రోణుడికి ఇచ్చారు. నా గురువైన ద్రోణుడు నాకు ప్రసాదించాడు” అంటూ ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. వెంటనే అంగారపర్ణుని రథం కాలిపోయింది. అతను నేలమీద పడ్డాడు. అతనిని అర్జునుడు, ధర్మరాజు వద్దకు తీసుకొని వచ్చాడు.

“అర్జునా, ఓడిపోయిన వాడిని, శౌర్యం కోల్పోయిన వాడిని శిక్షించరాదు. విడిచిపెట్టుము” అన్నాడు.

అప్పుడు అంగారపర్ణుడు అర్జునుని చూసి, “అర్జునా, నీ పరాక్రమానికి మెచ్చాను. నీతో స్నేహం చెయ్యాలని ఉంది. నేను నీకు, నాకు లభించిన చాక్షుసీ విద్యను ఇస్తాను. నీకు మహా వేగం కల గుఱ్ఱాలను ఇస్తాను. నాకు నీ వద్ద ఉన్న ఆగ్నేయాస్త్రాన్ని ఇవ్వు” అని అడిగాడు.

దానికి అర్జునుడు “గంధర్వా, మనం ఎంత స్నేహితులమైనా, నీ వద్ద నుండి విద్యలను, ధనాన్ని స్వీకరించలేను. నీకు ఆగ్నేయాస్త్రాన్ని ఇస్తాను. నీ వద్ద నుండి గుఱ్ఱాలను స్వీకరిస్తాను” అని అన్నాడు.

దానికి గంధర్వుడు సమ్మతించాడు. అర్జునుడు గంధర్వుని చూసి “గంధర్వా,మేము ధర్మబుద్ధి కలవాళ్ళము. మమ్ములను చూసి నువ్వు ఎందుకు అలా గర్వంగా మాట్లాడావు?” అని అడిగాడు.

“అర్జునా, మీరు ఎవరో నాకు తెలియును. కాని ఆడవాళ్ళతో విహరించే వాళ్ళు ఎంత వివేకము కలవాడు అయినా అహంకారం కలిగి ఉంటాడు. కాని ఆ సమయంలో మనకు ఒక బ్రాహ్మణుడు పురోహితుడుగా ఉంటే, ధర్మాధర్మ విచక్షణ చేస్తాడు. మనలను తప్పు చెయ్యకుండా నివారిస్తాడు. ఓ తాపత్యా,మరి మీరు కూడా పురోహితుడు లేకుండా ఇలా సంచరించడం భావ్యం కాదు కదా. అందువలన ఒక ఉత్తమ బ్రాహ్మణుడిని పురోహితుడిగా చేసుకోండి” అని అన్నాడు.

అప్పుడు అర్జునుడికి ఒక సందేహం కలిగింది. “గంధర్వా, మేము కుంతీ పుత్రులము, నువ్వు తాపత్యా అన్నావు. మేము తాపత్యులము ఎలా అయ్యాము?” అని అడిగాడు.

దానికి ఆ గంధర్వుడు ఇలా చెప్పసాగాడు: “సూర్యునికి కూతురు,సావిత్రికి చెల్లులు అయిన తపతి అనే కన్య మహా సౌందర్యవతి. అజాఘీడుని కొడుకు సంవరణుడు. అతను సూర్యుని గూర్చి తపస్సు చేస్తున్నాడు. ఇది తెలిసిన సూర్యుడు, సంవరణుడే తన కూతురు తపతికి తగిన భర్త అనుకున్నాడు.

ఒకరోజు సంవరణుడు అడవికి వేటకు వెళ్ళాడు. తిరిగి తిరిగి అలసిపోయి, ఆ అరణ్యంలో విహరిస్తున్న తపతిని చూసాడు. తపతి సౌందర్యానికి సమ్మోహితుడయ్యాడు. ఆమెను చూసి “ఓ అబలా, నీవు ఎవరు? ఈ అరణ్యంలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు?” అని అడిగాడు. కాని తపతి బదులు చెప్పకుండా వెళ్ళిపోయింది.

సంవరణుడు ఆమె మీద మోహంతో, పిచ్చి వాడిలా ఆమె కోసం వెదుకుతున్నాడు. తపతి కూడా సంవరణుడిని చూసి మోహించింది. అతని దగ్గరకు వచ్చి “ఓ రాజా, నన్ను చూసి ఎందుకు మోహం చెందావు?” అని అడిగింది.దానికి సంవరణుడు “ఓ సౌందర్యవతీ, నేను ఎవరికీ భయపడలేదు. కాని నీ సౌందర్యం చూసి నువ్వు నాకు దక్కవేమో అని భయపడుతున్నాను. మన్మధ బాధ భరించలేకుండా ఉన్నాను. నిన్ను గాంధర్వ వివాహం చేసుకుంటాను” అని అడిగాడు.

తపతి అతనిని చూసి నవ్వి “నేను సూర్యుని కుమార్తెను. సావిత్రికి చెల్లిని. నా పేరు తపతి. నాకు స్వతంత్రము లేదు. నీకు నాపై ప్రేమ ఉంటే, నా తండ్రిని అడుగు. మన పెండ్లి జరుగుతుంది” అని చెప్పి వెళ్ళిపోయింది. అప్పటి నుండి సంవరణుడు అక్కడే ఉండి సూర్యుని పట్టుదలతో ఆరాధిస్తున్నాడు.

ఒకరోజు వసిష్టుడు సంవరణుడి దగ్గరకు వచ్చాడు. అతని బాధను తెలుసుకొని, వెంటనే సూర్యుని వద్దకు వెళ్ళాడు.వశిష్టుని చూసి సూర్యుడు అర్ఘ్య పాద్యాలు ఇచ్చి సత్కరించాడు. వచ్చిన కారణం అడిగాడు.

“పూరు వంశజుడు, ధర్మ పరుడు, సద్గుణ సంపన్నుడు అయిన సంవరణుడు నీ కుమార్తె తపతిని చూసి మోహించాడు. నువ్వు నీ కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చెయ్యాలి” అని చెప్పాడు. సూర్యుడు కూడా తన కోరిక తీరబోతున్నందుకు సంతోషించాడు. తపతిని వశిష్టునితో సంవరణుడి వద్దకు పంపించాడు. వసిష్టుడు ఇద్దరికి వివాహం జరిపించాడు. సంవరణుడికి , తపతికి కురు మహారాజు జన్మించాడు. మీరు కురు వంశజులు కాబట్టి, మీరు తాపత్యులు అయ్యారు” అని వివరించాడు అంగారపర్ణుడు.

రామాయణమ్.116

 

...

చిన్నపిల్లల ముద్దుముద్దు మాటలు మన హృదయానికి ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో సీతమ్మపలుకులు కూడా అంతే ఆహ్లాదకరంగా ఉన్నాయి అనుసూయామాతకు.

.

 సీతమ్మపెళ్ళిముచ్చట్లు చెప్పించుకొని సంబరపడిపోయింది ఆ మహాసాధ్వి.

.

అమ్మా సీతా! నీవు ప్రతి అక్షరము స్పష్టముగా ,ప్రతిపదమును మధరంగా పలికి నన్ను సంతోషపెట్టావే బంగారుతల్లీ .చాలా బాగుందమ్మా !

.

ఇక రాత్రి అవుతున్నది పక్షులన్నీ తమతమగూళ్ళు చేరుకొంటున్నాయి.నేనిచ్చిన వస్తువులు అలంకరించుకొని రాముడి వద్దకు ఇక వెళ్ళమ్మా అని అనగా సీతమ్మ అట్లే చేసి ఆమెకు శిరస్సు వంచి నమస్కరించి రాముని వద్దకు వెళ్ళింది.

.

అనసూయామాత ఇచ్చిన ఆభరణములు ,వస్త్రములు ధరించి నూతనశోభతో కనపడుతున్న తన రమణి సీత ను చూడగనే రాముడి హృదయంలో మధురభావనలు పులకలెత్తాయి.

.

మనుష్యులలో ఎవరికీ దక్కని గౌరవము తన భార్యకు దక్కినందుకు చాలా సంబరపడిపోయాడు రామయ్య.

.

ఆ రాత్రి గడిచింది .తెల్లవారగనే అగ్నిహోత్రము పూర్తి చేసుకొని ఉన్న మునులందరూ సీతారామలక్ష్మణులకు వీడ్కోలు పలికారు.

.

అరణ్యములోనికి ప్రవేశించుచున్న వారికి ఎన్నో జాగ్రత్తలు చెప్పారు వారు.రామా చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా .

ఈ అడవిలో నరమాంసభక్షకులైన రాక్షసులు వివిధరూపాలలో సంచరిస్తూ ఉంటారు.రక్తముత్రాగే క్రూరమృగాలు ఎన్నో ఉన్నాయి.వాటిని జాగ్రత్తగా తప్పించుకొని వెళ్ళు.అని అరణ్యములోనికి వారు వెళ్ళిరావడానికి నిత్యము ఉపయోగించే మార్గాన్ని చూపించారు.

.

అందరికి నమస్కరించి బయలుదేరిన సీతారామలక్ష్మణులు దట్టమైనమబ్బులలో దూరే సూర్యుడిలాగా ఆ అడవులలో ప్రవేశించారు.

.

ఈ రోజుతో "*****అయోధ్యకాండ సమాప్తము*****

.

శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః


రామాయణమ్..117

అరణ్యకాండము ప్రారంభము

.

ప్రవిశ్య తు మహారణ్యం దణ్డకారణ్యమాత్మవాన్.

రామోదదర్శదుర్దర్షస్తాపసాశ్రమమణ్డలమ్.

.

బుద్ధిమంతుడు ,ఎవరూకూడ తేరిపారచూడసాధ్యముకాని వాడు ఎదిరింపశక్యము కాని వాడు అయిన రాముడు దండకారణ్యములో ప్రవేశించి మునుల ఆశ్రమ సముదాయాన్ని చూశాడు.

.

ఆ ముని వాటికలలో అన్ని మృగాలూ నిర్భయంగా సంచరిస్తున్నాయి.వాకిళ్ళు అన్నీ రంగవల్లులతో తీర్చిదిద్దబడి మనోహరంగా ఉన్నాయి.

.

ఆ ఆశ్రమం చుట్టూ మధురఫలాలనిచ్చే ఎన్నో వృక్షాలు దట్టంగా ఏపుగా పెరిగి చూడటానికి మనోహరంగా ఉన్నాయి.

.

ఆ ఆశ్రమంలో బలిహోమాలతో దేవతాపూజలు,వేదఘోషలతో ప్రాంగణమంతా మారుమ్రోగుతూ బ్రహ్మలోకాన్ని తలపిస్తున్నది.

.

సూర్యుడితో సమానమైన తేజస్సుగల మహామునులంతా ఆ ఆశ్రమంలో నివసిస్తున్నారు.

.

వారందరినీ చూసి తన ధనస్సుకు ఉన్న నారి విప్పివేసి మెల్లగా వినయపూర్వమకముగా వారున్న వైపుకు రాముడు వెళ్ళాడు.

.

సీతారామలక్ష్మణులను కాంచినంతనే మునులు ఎదురేగి స్వాగతము పలికారు.

.

వారందరికీ ఒకటే ఆశ్చర్యం అబ్బ! ఎంత నయనమనోహరంగా ఉన్నాడు రాఘవుడు.

మంచి శోభతోకూడిన శరీర సౌష్ఢవము,సౌకుమార్యము,అద్భుత రూపసౌందర్యము చూసి రెప్పవాల్చకుండా తదేకంగా వారినే చూస్తూ ఉఙడిపోయారు ఆ ముని గణమంతా!

.

సీతారామలక్ష్మణులకు ఆశ్రమప్రాంగణంలో ఒక పర్ణశాలలో బస ఏర్పాటు చేసి ఆయనను సత్కరించి వినయపూర్వకముగా వేడుకున్నారు.,"రాఘవా,నీవే మాకు రాజువు రక్షకుడవు కావున సర్వదా తల్లిగర్భమును రక్షించినట్లు నీవు మమ్ములను రక్షించ వలెను ." అని పలికారు అందరూ.

.

వారి ఆతిధ్యము స్వీకరించి సూర్యోదయమైన వెంటనే మరల బయలు దేరాడు శ్రీ రాముడు.

.

అరణ్యమధ్యంలోకి ప్రవేశించారు.

అడవి ఈగలు రొదపెడుతున్నాయి,క్రూరమృగాలు గుంపులుగా తిరుగుతూకనపడుతున్నాయి.ఆ ప్రదేశంలో ఉన్న లతలూ వృక్షాలూ పాడుబడ్డట్టుగా కనిపిస్తున్నాయి.ఎక్కడా జలాశయమన్నదే కానరావడంలేదు.ఇంతలో ఎక్కడనుండో వస్తున్న భయంకరమైన అరుపులు పెడబొబ్బలతో అరణ్యమంతా మారు మ్రోగిపోతున్నది.

.

వారి ఎదురుగా పర్వతకాయుడైన ఒక రాక్షసుడు వికృతంగా అరుస్తూ నిలబడి ఉన్నాడు.

హృదయ ప్రక్షాళన

 


కంటికి కనిపించకుండా మానవ జీవితమనే మహానాటకాన్ని నడిపేది మనసొక్కటే! మనస్సంత చంచలమైనదీ, నిశ్చలమైనదీ, వజ్రకఠోరమైనదీ, వేగవంతమైనదీ, స్తబ్ధమైనదీ, పవిత్రమైనదీ, పాపభూయిష్ఠమైనదీ, సౌభాగ్యవంతమైనదీ, దౌర్భాగ్యమైనదీ మరోటిలేదు. మంచికీ చెడుకూ అదే మూలం. యశస్సుకూ, అపయశస్సుకూ అదే కేంద్రం. సుఖానికీ, దుఃఖానికీ అదే ప్రేరకం. ఎంతటివాడైనా మనసుకు దాసోహమనాల్సిందే. దాన్ని జయించడం చాలా కష్టం. చాలామందికి అసంభవం. జయించడమంటే అరిషడ్వర్గాలనీ, నవవికారాలనీ జయించినట్టే.

ఎంతటి వీరుడైనా, తాపసి అయినా, బ్రహ్మర్షి అయినా, మహానాయకుడైనా మనసు చెప్పినట్టు నడచుకోవాల్సిందే. మానసిక తృప్తి సంతోషాన్నిస్తుంది. ఆ సంతోషంకోసమే ఈ వెంపర్లాట. తెల్లవారింది మొదలు నిద్రించేవరకు మనిషి మానసిక తృప్తి, ఆనందంకోసమే తపనపడుతూంటాడు. ఆ సంతోషం, ఆనందం కోసం మంచేకానీ, చెడేకానీ ఏ విచక్షణా జ్ఞానం లేకుండా తాపత్రయపడుతూనే ఉంటాడు.


మనసును అదుపులో పెట్టుకోగలిగినవాడు ఇంద్రియాలను జయిస్తాడు. శాశ్వతమైన, సత్యమైన ఆనందానుభూతుల్లో తేలిపోతాడు. అందుకే, నిర్మలమైన హృదయం కోటి తీర్థయాత్రలతో సమానమైనదన్నారు. మనసు అనంతమైనది, అగాధమైనది. దానిలోతు ఎవరికీ అంతుపట్టదు. 


'ఏ మనస్సు జ్ఞానసాధనమో, ఏది ఆలోచనాశక్తిని కలిగి ఉంటుందో, ఏది ధైర్యానికి నిలయమో, ఏది వినాశరహితమైన ప్రకాశమో, దేనివల్ల సమస్త కార్యకలాపాలు జరుగుతాయో- అటువంటి మనస్సులో సదా శుభసంకల్పాలు ఉదయించుగాక' అని యజుర్వేదంలో భగవత్ప్రార్ధన కనిపిస్తుంది. మంచి మనస్సు మంచి శరీరానికి అలంకారం. మంచి శరీరం మంచి జీవితానికి సాధనం. మంచి జీవితం మంచి ఆధ్యాత్మికసౌధానికి సోపానం.


మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలంటే అనుక్షణం పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు అందులో పుట్టుకొచ్చే దురాలోచనలను బైటికి వెళ్లగొడుతూనే ఉండాలి. అలా హృదయ ప్రక్షాళన చేసుకున్నప్పుడు సుఖశాంతులకు, తృప్తికీ, ప్రసన్నతకు, దివ్యభావాలకు మనసులో చోటివ్వగలం. ఇందుకు మహానుభావుల సద్బోధనలు, సత్సాంగత్యాలు దోహదపడతాయి. సద్గ్రంథ అధ్యయనమూ తోడ్పడుతుంది. ధ్యానం, యోగ, ఉపవాసం, దీక్ష ఎంతగానో సహకరిస్తాయి. ప్రధానంగా క్రమేపీ కోరికల సంఖ్యను తగ్గించుకుపోతూండాలి. ఐహిక బంధాలను తెంచుకుంటూ, నిర్లిప్తత, సమదృష్టి అలవరచుకోవాలి. ఆధ్యాత్మిక ప్రస్థానానికి మార్గాన్వేషణ చేస్తూ ఉండాలి. 'మంచితనా'న్ని మంచి చేసుకోవాలి.


మంచి ఆలోచనలకు మనసు తలుపులనెప్పుడూ తెరిచే ఉంచాలి. దురాలోచల్ని అసలు లోనికే రానీయొద్దు. అదే సంయమనం. అది సాధనతోనే సాధ్యపడుతుంది. అదే ఆధ్యాత్మిక సాధన!

*ఆచార్య సద్భోదన*



హృదయంలో ప్రేమ, దయ లేనివారి పూజలను భగవంతుడు స్వీకరించగలడా? ఇతరులు కఠినంగా, విసుగుదలతో ఉన్నట్లు మనకు అనిపిస్తోందంటే ఆ భావాలన్నీ మనలోనే ఉన్నాయి. మనలోనే ఉన్నదే బయట వ్యక్తమవుతుంది. మన హృదయం ప్రేమ, మృదుత్వాలతో కూడి ఉంటే ఇతరుల్లోని కఠినత్వం మనకు సోకదు. నిస్వార్థత నిర్వచించబడలేనిది, కానీ సహజ సిద్ధమైనది. భగవంతుని, తోటి వారిని సేవించడం ద్వారా, వారి ఎడల భక్తిని కలిగి ఉండటం ద్వారా ఆధ్యాత్మిక పథంలో ఉన్నత సోపానాలపై అడుగుపెట్టే అర్హత లభిస్తుంది. మన హృదయంలో ప్రేమ జ్యోతి ప్రకాశిస్తే మనలో ఉత్తమ కార్యాలు చేసేందుకు, ఉత్తమ భాషణం చేసేందుకు శక్తి కలుగుతుంది. అప్పుడు భగవంతుడు మన నిష్కామ సేవను ఆరాధనను స్వీకరిస్తాడు.

సర్వేజనా స్శుఖినోభవంతు.


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

*శత శ్లోకీ రామాయణము

*


*(44,45)*

*స తేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తథా వనే*

*ప్రతిజ్ఞాతశ్చ రామేణ వథః సంయతి రక్షసామ్*

*ఋషీణామగ్ని కల్పానాం దండకారణ్య వాసినామ్*


రాక్షస ఆవాసమైన ఆ అరణ్యంలో ఋషులు చేసిన వేడికోలుకు రాముడు సానుకూలంగా స్పందించాడు. "యుద్ధంలో రాక్షసులను సంహరిస్తాను" అని రాముడు తేజస్సుతో అగ్నితో సమానులైన ఆ దండకారణ్య ఋషివర్యులకు వాగ్ధానం చేశాడు.


*జై శ్రీరామ్*

*శ్రీ మన్యు సూక్తమ్*



*(10)*

*సహస్వ మన్యో అభిమాతి మస్మే రుజన్ మృణన్ ప్రమృణన్ ప్రేహి శత్రూన్ ఉగ్రంతే పాజోనన్వారు రుధ్రే వశన్నయసఏక జత్వమ్*


మన్యుదేవతా! మా శత్రువులను అణచివేయుము. వారికి పీడను, అధికముగా దుఃఖమును కలిగించుచూ వారిని ఎదుర్కొనుము. నీ బలము ప్రచండమైనది కదా, దాని అడ్డగించువారు ఎవరూ లేరు. ఒక్కడిగా జన్మించిన దేవా! ఒక్కడివే నీవు మా శత్రువులను మా వశమునకు తెమ్ము.


*శుభంభూయాత్*

*శ్రీ నరసింహ శతము*

 


*(87)*

*అమరేంద్ర వినుత నే నతి దురాత్ముడనంచు గలలోన నైనను గనులబడవు*

*నీవు ప్రత్యక్షమై నిలువకుండిన మానె దొడ్డగా నొక యుక్తి దొరెకనయ్య*

*గట్టి కొయ్యను దెచ్చి ఘనముగా ఖండించి నీ స్వరూపము చేసి నిలుపుకొనుచు*

*ధూపదీపములిచ్చి తులసితో పూజించి నిత్యనైవేద్యము ల్నీమముగను*

*నడుపుచును నిన్ను దలచెద నమ్మి బుద్ధి నీ ప్రపంచంబు గలిగె నాకింతే చాలు*

*భూషణవికాస శ్రీధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర*


శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామీ! నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు. పాపములను పారద్రోలు వాడవు. దుష్టులను శిక్షించువాడవు.


తండ్రీ! సురరాజనుతా! నేను అతి దుష్టుడను అని కదూ కలలో కూడ కనిపించవు. పోనీలే, నీవు కనపడక పోయినా, నాకు ఒక ఉపాయం తట్టింది. గట్టి కొయ్యను తెచ్చుకొని, దానిని గొప్పగా చెక్కి, నీ రూపాన్ని అందులో నిలిపి, ధూపదీప తులసీ నైవేద్యములతో నియమం తప్పకుండా రోజూ పూజ చేసుకుంటాను. నిన్ను నమ్మినందుకు నాకు మంచి మార్గమే దొరికింది.


*జై నారసింహా*

*శ్రీ హనుమత్ ద్వాదశ నామ స్తోత్రమ్*



*హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః*

*రామేష్టః ఫల్గునసఖః పింగాక్షోమితవిక్రమః*

*ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశనః*

*లక్ష్మణప్రాణదాతా చ కపీంద్రస్య మహాత్మనః*

*స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః*

*తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్*


ఈ స్తోత్రం ప్రతి నిత్యము ఉదయం, ప్రయాణ సమయంలో, రాత్రి పరుండే ముందు చదువుకోవాలి. ఎటువంటి భయం ఉండదు.


*జై శ్రీహనుమాన్*

మంచి మాట


🌻 *మహానీయుని మాట*🍁

        -------------------------

"కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసినవాడు పక్కవాడిని దోచుకోడు.

ఇవ్వడంలో ఉన్న ఆనందం ఎరిగినవాడు ఉన్నది దాచుకోడు.

దోచుకోలేని ధనం మంచితనం అయితే

దాచుకోలేని ధనం ఆనందం."

 -------------------

🌹 *నేటీ మంచి మాట* 🌼

      ---------------------------

"ఒక అబద్ధం వల్ల కోల్పోయిన నమ్మకం వేయి నిజాలు చెప్పినా రాదు."

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

*ధార్మికగీత - 39*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                        

                                       *****

           *శ్లో:- కృషితో నాస్తి దుర్భిక్షం ౹*

                  *జపతో నాస్తి పాతకః ౹*

                  *మౌనేన కలహో నాస్తి ౹*

                  *నాస్తి జాగరతో భయమ్* ౹౹

                                     *****

*భా:- కృషి అంటే వ్యవసాయము, శ్రమ. ప్రయత్నము అని అర్థాలు. అన్నదాత నిరంతర సేద్యము సకల ప్రాణికోటికి జీవనాధారమై, కార్మిక, శ్రామిక, ఉద్యోగి, మేధావి వర్గాల అకుంఠిత శ్రమయే దేశ ప్రగతి రథానికి దీటైన చక్రమైనప్పుడు కరువు కాటకములే ఉండవు. స్వర్ణా పహరణ, సురా పానము, బ్రహ్మహత్య, గురుపత్నీ గమనము, వీరితో సహవాసము చేయడం అనే పంచ మహా పాతకాలు కూడా తీవ్రాతితీవ్ర జపమువల్ల తొలగి పోతాయి. అధికారి- ఉద్యోగి; భార్య- భర్త; అన్న- తమ్ముడు; యజమాని- సేవకుడు ఇలా ఇరుపక్షాలలో ఒకరు ఆవేశంతో ఊగి పోతున్నప్పుడు మరొకరు ఒక్కనిమిషం మౌనం వహిస్తే అసలు కలహమే ఉండదు. ప్రతి పనిలోను మనసుపెట్టి ఆచితూచి, జాగరూకతతో ఉండేవారికి భయమనేది ఉండనే ఉండదు. పాపాల, కలహాల జోలికి పోకుండా, కష్టపడి పనిచేసే తత్త్వాన్ని అలవరచుకొంటూ,కార్యసాధనలో అప్రమత్తంగా పురోగమిస్తే జయము, విజయము, దిగ్విజయము మనలను వరించి వస్తాయని సారాంశము.*

                                    *****

                      *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

వివేకానంద వచనాలు.-

 *Inspiring Sayings of Swami Vivekananda*


*Each work has to pass through these stages—ridicule, opposition, and then acceptance. Those who think ahead of their time are sure to be misunderstood.*


*స్వామి వివేకానంద స్ఫూర్తిదాయక వచనాలు.-*


*మానసికంగా బలహీనులైనవారే తప్పులు చేస్తారు. ఈ బలహీనత అనేది వారివారి తెలియనితనం వల్ల వచ్చినదే అని గ్రహించరు.*


*🍁🍀🧚‍♂️🌹Subham bhuyath Sarve janaha sukhino/శుభం భూయాత్ సర్వే జనాః సుఖినోభవంతు🍁🍀🧚‍♂️🌹*

క్రూరత్వ సాహిత్యం- లక్ష్యం హిందుత్వమే*

 *


1927 లో విడుదలయిన కేథరిన్ మాయో రచన “మదర్ ఇండియా”, బహుశా భారత దేశానికి, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా రచించబడ్డ మొదటి క్రూరత్వ సాహిత్యం. ఈ పుస్తకం లో మాయో హిందువులని ఒక అనాగరిక, క్రూర జాతిగా చిత్రీకరించింది. అక్కడక్కడ జరిగిన కొన్ని సంఘటనలని ఎంచుకొని హిందూ పురుషులని, స్త్రీలని పిల్లలని హింసించే వారిగా చిత్రీకరించింది. హిందూ సమాజం అనాగరికమైనదని, వారికి బ్రిటీష్ వారు నాగరికత నేర్పుతున్నారు అని ప్రపంచాన్ని మోసం చెయ్యడం ఈ పుస్తక లక్ష్యం. ఈరోజుకి కూడా భారత దేశానికి, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా క్రూరత్వ సాహిత్యం సృష్టించబడుతూనే ఉంది.


“క్రూరత్వ సాహిత్ర్యం” అంటే ఏమిటి?

స్థానిక నాగరికతలని, సంస్కృతులని అణచివేసి, స్వాధీనపరచుకొని, జీర్ణీకరించుకొని చివరికి నాశనం చెయ్యడానికి పాశ్చాత్యులు వందల సంవత్సరాలుగా వాడుతున్న ఒక మానసిక ఆయుధమే ఈ క్రూరత్వ సాహిత్యం. దీనికి మాధ్యమ రంగం తోడైతే దీని ప్రభావం అత్యధిక స్థాయిలో, కొన్ని సార్లు శాశ్వతంగా ఉంటుంది. ఎవరైతే తమ నాగరికతని, సంస్కృతిని నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారో వారినే నాశనం అవుతున్న వారు తమని రక్షిస్తున్న వారిగా భావించడం ఇందులో అత్యంత ప్రమాదకరమైన విషయం. పాశ్చాత్యులు ఇప్పటికే దీనిని స్థానిక అమెరికన్లకి, నల్ల జాతి వారికి, మనకి, ఇంకా ఎన్నో జాతులకి వ్యతిరేకంగా ఉపయోగించారు, ఉపయోగిస్తున్నారు. క్రీస్టియన్ మిషనరీలు, చర్చి, NGOలు, పాశ్చాత్య/భారత విద్యా సంస్థలు, మానవ/జంతు సంబంధ రక్షణ సంస్థలు మనకి వ్యతిరేకం గా ఈ క్రూరత్వ సాహిత్యాన్ని వాడుతున్నాయి.


“తాము ముందుగా ఒక నాగరికతని లక్ష్యంగా ఎన్నుకొని, అలా ఎంచుకున్న నాగరికత/సంస్కృతి తమ ప్రజలపైనే హింస సాగిస్తోందని, కాబట్టి వారిని రక్షించడానికి పాశ్చాత్య జోక్యం తప్పనిసరి అని ప్రపంచాన్ని నమ్మించే లక్ష్యంతో సృష్టించబడే సాహిత్యమే ఈ క్రూరత్వ సాహిత్యం” అని శ్రీ రాజీవ్ మల్హోత్రా దీని గురించి తన “బ్రేకింగ్ ఇండియా” పుస్తకంలో రాశారు. ప్రతీ సమాజం, నాగరికత, వ్యవస్థ, మతం, కులం, సంఘం, దేశం, ఇలా అన్నిట్లో ఎంతో కొంత చెడు ఉండి తీరుతుంది, అనే నిజం మీదే ఈ వ్యూహమంతా ఆధారపడి ఉంటుంది. వివాహ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థల లాంటి వాటికి కూడా ఇది వర్తిస్తుంది. ప్రతీ వ్యవస్థ వల్లా నష్ట పోయే వాళ్ళు కొందరైనా ఉంటారు కదా.


ఒక చిన్న ఉదాహరణ ద్వారా దీనిని వివరించే ప్రయత్నం చేస్తాను. కోటి మంది జనాభా ఉన్న ఒక పట్టణం ఉందనుకోండి. కోటి మంది జనాభా ఉన్న పట్టణంలో సహజంగానే అన్ని వృతుల వారు, మతాల వారు, కులాల వారు, పొడుగు వారు, పొట్టి వారు, నల్ల వారు, తెల్ల వారు, దొంగలు, హంతకులు, ఇలా అందరూ ఉంటారు. అది రామ రాజ్యం అయితే తప్ప అక్కడ హత్యలు, మానభంగాలు, దోపిడీలు, కొట్లాటలు ఇలా అన్ని రకాల నేరాలు జరుగుతూనే ఉంటాయి. అక్కడ గత 5 సంవత్సరాలలో 100 హత్యలు జరిగాయి అనుకుందాం. ఆ పట్టణంలో లో ఉన్న పొడుగు వారిని నాశనం చెయ్యడం కనుక లక్ష్యం అయితే వారికి వ్యతిరేకంగా క్రూరత్వ సాహిత్య సృష్టి జరుతుగుతుంది. 100 హత్యలలో కొన్నైనా పొడుగువాడు పొట్టి వాడిని చంపినవి ఉంటాయి. మీడియా ఆ హత్యల మీదే దృష్టి పెడుతుంది. “పొడుగు వాడి చేతిలో బలైపోయిన మరో పోట్టివాడు” లాంటి శీర్షికలు ఇటువంటి హత్య జరిగిన ప్రతీ సారీ మాధ్యమ రంగంలో విపరీతంగా కనిపిస్తాయి. కొంత కాలానికి న్యాయ వ్యవస్థ ఆ హత్యలకి పొడుగుకి ఏ సంబంధం లేదు అని తేల్చవచ్చు, కానీ దానికి మాధ్యమ రంగం ప్రాధాన్యత ఇవ్వరు, అందువల్ల ప్రజలకి ఆ విషయం తెలియదు. ఇలా కొంత కాలం జరిగేసరికి “పొట్టి వారిని చంపేస్తున్న పోడుగువారు” అనే వృత్తాంతం ప్రజలలో బలంగా నాటుకుపోతుంది.


ఇలా క్రూరత్వ సాహిత్యాన్ని మాధ్యమ రంగ సహాయంతో ఉపయోగించి ఏ వర్గాన్నైనా, ఏ వర్గానికైనా వ్యతిరేకం అని ప్రజలని నమ్మించవచ్చు. విషయాన్ని బాగా లోతుగా, సమాచారాన్నంతా ఉపయోగించి విశ్లేషిస్తేనేకానీ అసలు విషయం తెలియదు. దీని ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందంటే చివరికి పొడుగు వారు కూడా దీనిని నమ్మేస్తారు, నమ్మడమే కాకుండా ఈ సాహిత్యాన్ని సృష్టిస్తున్న వారి దగ్గరికే సహాయం కోసం కొందరు వెళ్ళినా ఆశ్చర్యం లేదు. ఇలా క్రూరులుగా చిత్రీకరించాబడ్డ పోడుగువారిని, పోట్టివారిని కాపాడటం అనే నెపంతో నాశనం చేసేస్తారు. ఈ ఉదాహరణలో పొడుగు వారి స్తానంలో హిందూ ధర్మాన్ని పొట్టి వారి స్థానంలో ఇతర మతాలని పెట్టి చూస్తే మనపై జరుగుతున్న కుట్ర మీకే అర్ధమవుతుంది.


ముందుగా నిర్ధారించుకున్న వృత్తాంతానికి సంబంధించిన వార్తలకి మాత్రమే విశేష ప్రచారం ఇవ్వడం, కొన్ని సందర్భాలలో వార్తలని ఈ వృత్తాంతానికి తగ్గట్టుగా మార్చి ప్రచారం చెయ్యడమే ఈ వ్యూహం.


భారతదేశం మానభంగాల రాజధానా?

నిర్భయ సంఘటన తరువాత మన దేశంలో జరుగుతున్న మానభంగాలకి ప్రాంతీయ, జాతీయ అలానే అంతర్జాతీయ మాధ్యమాలు విపరీత ప్రచారాన్ని ఇస్తున్నాయి. మన తెలుగు చానళ్ళు ఒకడుగు ముదుకు వేసి మగ వారిని “మ్రుగాళ్ళు” గా మార్చేశాయి. ఒక సమయంలో భారతదేశాన్ని “ప్రపంచ మానభంగాల రాజధాని” అని పిలిచారు. ఈ ప్రచారం వల్ల ప్రభావితమైన ఒక జర్మన్ విశ్వవిద్యాలయం పురుషుడు అన్న కారణంగా ఒక భారతీయుడికి తమ విశ్వవిద్యాలయంలో ప్రవేశాన్ని నిరాకరించింది. స్త్రీని దేవతగా పూజించే ఏకైక సంస్కృతి మనది. ఇటువంటి మన దేశంలో స్త్రీలపై జరిగే ఏ చిన్న దాడిఅయినా యావత్ దేశానికి సిగ్గుచేటే అయినా, వాస్తవ పరిస్తితిని కూడా సరిగా అర్ధం చేసుకోవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా దానితో జాతి గౌరవం ముడి పడి ఉన్నప్పుడు. “యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్” వారి మానభంగ సంబంధ గణాంకాలని క్రింద చూడండి (2003 – 2010. తరువాతవి అందుబాటులో లేవు)


ఒక లక్ష జనాభాకి మానభంగాల సంఖ్య

దేశం పేరు 2003 2004 2005 2006 2007 2008 2009 2010

దక్షిణ ఆఫ్రికా 148.4 145.2 137.6 133.4 144.8 138.5 132.4

స్వీడన్ 25 25.2 41.9 46.3 51.8 59 63.8 63.5

ఆస్ట్రేలియా 29.7 29 28.6

అమెరికా 32.2 32.3 31.8 31.5 30.6 29.8 29 27.3

న్యూజిల్యాండ్ 24 28.3 27 26.4 26.1 25.8

ఇస్రాయేల్ 20.4 18.5 19.1 18.4 17.5  

యూ.కే 15.7 17.7 19.1 18 17.7 15.9 17 

ఫ్రాన్స్ 17.3 17.3 16.4 15.9 16.4 16.5 16.2 

జర్మనీ 10.6 10.7 9.9 9.8 9.1 8.8 8.9 9.4

ఇటలీ 4.7 6.4 6.9 7.6    

డెన్మార్క్ 8.8 10.4 8.8 9.7 9.0 7.2 6.4 

కెనడా 1.7 1.8 1.8 1.7 1.6 1.5 1.4 1.7

జపాన్ 2.0 1.7 1.6 1.5 1.4 1.3 1.1 1.0

భారత్ 0.3 0.4 0.4 0.4 0.5 0.4 0.4

అజర్బైజాన్ 0.6 0.3 0.5 0.4 0.4 0.3 0.4 0.2

ఈ గణాంకాలని చూసిన ఎవరికైనా అర్ధమయ్యే విషయం, ప్రపంచంలో స్త్రీలకి అత్యంత సురక్షితమైన దేశం, భారత దేశం అని. దానికి కారణం ముమ్మాటికీ, “ప్రతీ స్త్రీలో తల్లిని చూడు” అని బోధించే హిందూ ధర్మమే. అయితే మనం జర్మనీ విశ్వవిద్యాలయాన్ని తప్పుబట్టాలెం. క్రూరత్వ సాహిత్యామే ఇక్కడ సమస్య. “భారతదేశం, ముఖ్యంగా హిందూ సమాజం పురుషాధిఖ్య సమాజం, వారు స్త్రీలని అణగద్రోక్కుతున్నారు” అనే వృత్తాంతాన్ని ప్రచారం చేసి తద్వారా స్త్రీలకి అభద్రతా భావాన్ని, పురుషులపై విముఖతని కల్పించి, విడాకులు పెంచి, కుటుంబ వ్యవస్తని నాశనం చేసి తద్వారా హిందూ సమాజాన్ని దెబ్బ తీయడమే ఈ ప్రచార లక్ష్యం. పాత తరం వారు కొంచెం లోతుగా ఆలోచిస్తే, ఉమ్మడి కుటుంబ వ్యవస్థని ఇలానే నాశనం చేసారు అనే విషయం అర్దమవుతుంది. ఇప్పుడు పురుషుడికి వ్యతిరేకంగా క్రూరత్వ సాహిత్య సృష్టి జరుగుతుంటే అప్పుడు అత్తగారికి వ్యతిరేకంగా జరిగేది.


క్రూరత్వ సాహిత్యం సృష్టించే/ప్రచారం చేసే వారి అంకెల గారడీకి ఈ ప్రక్క చిత్రమే ఉదాహరణ. ఇది చూసిన ఎవరికైనా కలిగే అభిప్రాయం భారతదేశం లో మానభంగాలు చాల ఎక్కువ, ప్రపంచంలోనే మనం రెండో స్థానంలో ఉన్నాం అని. ఇదే వీళ్ళ తెలివి. జనాభాని పరిగణలోకి తీసుకోకుండా చూపిస్తున్న ఈ లెక్కలు మనల్ని తప్పు దోవ పట్టించడానికే. ఈ చిత్రంలో ఉన్న మిగిలిన అన్ని దేశాల జనాభా అంతా కలిపినా కూడా 100కోట్లు దాటదు. అంటే నిజానికి మన దగ్గర కంటే మిగిలిన దేశాలలో ఈ నేరాలు దాదాపు 8 రెట్లు ఎక్కువగా జరుగుతాయి.


క్రూరత్వ సాహిత్యం గురించి అర్ధమైతేనే కానీ మన దేశంపై, ధర్మంపై, సంస్కృతిపై జరుగుతున్న వివిధ దాడులని అర్దం చేసుకోలేము


దీపావళి నాడు బాంబులు పేలిస్తే కాలుష్యం.

హోలీ ఆడితే నీరు వృధా

వినాయక చవితి వలన నీటి కాలుష్యం

పుట్టలో పాలు పొయ్యడం మూఢనమ్మకం

కోడి పందాల వల్ల కోళ్ళకి, ఎడ్ల పందాల వల్ల ఎడ్లకి ఇబ్బంది

జల్లికట్టులో జంతు హింస

ఇలా చెప్తూ పోతే ఇంకా బోలెడు. ఇది ఇలానే కొనసాగితే, హిందువులు గాలి పీల్చడం వలన వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోతోంది కాబట్టి హిందువులు గాలి పీల్చకూడదు అని కూడా అంటారు. పైన నేను ఉదాహరించిన వాటిలో కొంత నిజం లేకపోలేదు. అయితే వీటిని వ్యతిరేకించే సంస్థలకి కానీ, మనుష్యులకి కానీ జంతువులపై కానీ, పర్యావరణంపై కానీ ప్రేమ లేదు. వారి లక్ష్యం మనల్ని మన సంస్కృతి నుండి దూరం చెయ్యడం. అలా దూరమైన వారిని మతం మార్చడం సులభం.


దీపావళి వల్ల వాయు కాలుష్యం, జల్లికట్టులో జంతు హింస నిజమే. కొన్ని వేల ఎడ్లు పాల్గొనే సంబరంలో అక్కడక్కడా ఎడ్లని ఇబ్బంది కలిగించే సంఘటనలు జరగడం సహజం. అయితే దీనికి పరిష్కారం నియంత్రణ. నియమ నిబంధనలు ఏర్పరిచి వాటిని సరిగా అమలు చెయ్యడం. అంతే కానీ నిషేధం కాదు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అని ప్రయాణాలని నిషేధించరు కద.


ఒకే వార్త – వివిధ వృత్తాంతాలు

ఒకే వార్తని ఎన్ని రకాలుగా చూపించవచ్చో ఇప్పుడో ఉదాహరణ సహాయంతో చూద్దాం —


వార్త: రోగి భర్త ఒక వైద్య శాలలో నర్స్ ని కొట్టాడు


అన్ని వివరాలతో కూడిన వార్త: పంజాబ్ అకాలీదళ్ నాయకుడైన పరమ్జీత్ సింగ్, తన భార్యకి ఒక ప్రైవేటు ఆసుపత్రి లో ప్రాధాన్యత ఇవ్వలేదు అన్న కారణంగా గర్భవతి అయిన నర్స్ పై చెయ్యి చేసుకున్నాడు


అవకాశం ఉన్న వృత్తాంతాలు:


స్త్రీలని అణగద్రోక్కుతున్న అకాలీదళ్

పంజాబ్ లో స్త్రీలకి రక్షణ కరువు

నర్స్ పై మరో దాడి

భారతదేశంలో గర్భవతులకి రక్షణ కరువు

మరో సారి దాడికి గురైన ప్రైవేటు ఆసుపత్రి ఉద్యోగి

ఈ వార్తలో భాగమైన వారి కులం, మతం, ప్రాంతం లాంటి వాటిని పరిగణలోకి తీసుకుంటే ఇలాంటి వృత్తాంతాలని ఇంకా సృష్టించవచ్చు. ఇటువంటి ప్రచారం పట్ల భారతీయులు, హిందువులు జాగ్రతగా ఉండటం, సోషల్ మీడియా ద్వారా వ్యతిరేకించడం చాలా అవసరం.


సేకరణ

పూర్వఫల్గుణీ {పుబ్బ} నక్షత్రం - గుణగణాలు, ఫలితాలు

 


     పూర్వఫల్గుణీ నక్షత్రములలో ఇది 11వ నక్షత్రము. దీనికి పుబ్బ అని ఇంకొక పేరుంది. ఈ నక్షత్రము అధిపతి శుక్రుడు. రాశ్యాధిపతి సూర్యుడు, గణము మానవ గణము. జాతి పురుష జాతి. జంతువు సింహం, ఆధిదేవత భర్గుడు, రాశి సింహా రాశి. పూర్వ ఫల్గుణి నక్షత్రము నవాంశ విషయానికి వస్తే.. మొదటి పాదము సింహరాశి, రెండవ పాదము - కన్యారాశి, మూడవ పాదము - తులారాశి, నాలుగవ పాదము - వృశ్చికరాశి.


పూర్వఫల్గుణీ మొదటి పాదము

ఈ నక్షత్రములోని ఏ పాదంలో శిశువు జన్మించినా, సామాన్య దోషం కలుగుతుంది. ఈ దోష శాంతికి సామాన్య శాంతికి శిశువు ముఖాన్ని తండ్రి నూనెలో చూడాలి. అబ్బాయి పుడితే ధనవంతుడు, ధర్మాత్ముడు, కార్య విచారమును ఎరిగిన వాడుగా, నృత్య శాస్త్రమున సమర్థుడుగా అవుతాడు. స్త్రీ పుడితే ఉత్తమమైన సంతానం కలిగినదిగా, ధనవంతురాలుగా, శతృజయం పొందినదిగా అవుతుంది.


పూర్వఫల్గుణీ రెండవ పాదము

పూర్వఫల్గుణీ రెండో పాదములో జన్మించిన జాతకులకు 15 సంవత్సరముల వరకు శుక్ర మహర్దశ ఉంటుంది. అందువల్ల వజ్రమును బంగారమును ఉంగరపు వేలుకు పొదిగించుకుని ధరించాలి. 15 సంవత్సరముల నుంచి 21వ సంవత్సరముల వయస్సు వరకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించడం శ్రేయస్కరం. 21 సంవత్సరముల నుంచి 31 సంవత్సరముల వరకు ఈ జాతకులకు చంద్ర మహర్దశ ఉంటుంది. కనుక ఈ సమయాన ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 31 నుంచి 38 సంవత్సరముల వరకు కుజ మహర్దశ ఉంటుంది. కాబట్టి పగడమును బంగారముతో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించాలి. 38 నుంచి 56 సంవత్సరముల వరకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండిలో మధ్య వేలుకు ధరించగలరు. 

 

56 సంవత్సరము వయస్సు నుంచి 72 సంవత్సరముల వరకు గురు మహర్దశ. కాబట్టి కనుక పుష్యరాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించాలి. 72 సంవత్సరముల నుంచి 91 సంవత్సరముల వరకు శని మహర్దశ ఉంటుంది. కాబట్టి నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించాలని రత్నాల శాస్త్రం చెబుతోంది. 


పూర్వఫల్గుణీ మూడోపాదము

పూర్వఫల్గుణీ మూడో పాదములో జన్మించిన జాతకులైతే.. జన్మించిన 10 సంవత్సరముల వయస్సు వరకు ఈ జాతకులకు శుక్ర మహర్దశ ఉంటుంది. అందువల్ల వజ్రమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం ఉత్తమం. ఇక 10 సంవత్సరముల నుంచి 16 సంవత్సరముల వరకు రవి మహర్దశ. అందువల్ల కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 16 సంవత్సరముల నుంచి 26 సంవత్సరముల వరకు చంద్ర మహర్దశ ఉంటుంది. కాబట్టి ముత్యమును వెండిలో ఉంగరపు వేలుకు ధరించడం మంచిది.


26 నుంచి 33 సంవత్సరముల వరకు కుజ మహర్దశ. అందువల్ల పగడమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 33 సంవత్సరముల నుంచి 51 సంవత్సరముల వరకు రాహు మహర్దశ ఉంటుంది. కనుక గోమేధికమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించాలి. 51 నుంచి 67 సంవత్సరముల వరకు గురు మహర్దశ. అందువల్ల కనక పుష్యరాగమను బంగారములో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించడం మంచిది. 67 సంవత్సరముల నుంచి 86 సంవత్సరముల వరకు శని మహర్దశ ఉంటుంది. కాబట్టి మీరు నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం మంచిది.


పూర్వఫల్గుణీ నాలుగో పాదము

పుబ్బ నక్షత్రం 4వ పాదములో జన్మించిన జాతకులైతే జన్మించిన 5 సంవత్సరముల వరకు శుక్ర మహర్దశ ఉంటుంది. కాబట్టి వజ్రమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించాల్సి ఉంటుంది. 5 సంవత్సరముల నుంచి 11 సంవత్సరముల వరకు శని మహర్దశ. కాబట్టి కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించాలి. 11 సంవత్సరముల నుంచి 21 సంవత్సరముల వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో ఉంగరపు వేలుకు ధరించగలరు.


21 నుంచి 28 సంవత్సరముల వయస్సు వరకు కుజ మహర్దశ ఉంటుంది. కాబట్టి పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించాలి. 28 నుంచి 46 సంవత్సరాల వరకు రాహు మహర్దశ. కాబట్టి గోమేధికమును వెండిలో మధ్య వేలుకు ధరించాలి. 46 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వరకు గురు మహర్దశ. అందువల్ల కనకపుష్యరాగమును బంగారములో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించాలి. 62 ఏళ్ల వయసు నుంచి 81 సంవత్సరముల వరకు శని మహర్దశ. కాబట్టి నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం మంచిది.  


పూర్వఫల్గుణి నక్షత్రము - గుణగణాలు


పూర్వఫల్గుణీ నక్షత్రము అధిపతి శుక్రుడు. అందువల్ల వీరి బాల్యం సుఖమయంగా గడుస్తుంది. విద్యాభ్యాసముకు ఎలాంటి ఆటంకం కూడా రాదు. సౌమ్యత కలిగి ఉన్నా ఇతరులకు మనసులో అయినా తల వంచరు. సమయానుకూలముగా ప్రవర్తించే స్వభావం వల్ల అధికారులుగాను, నాయకులుగానూ రాణిస్తారు. 


ఇక ఎవరు ఏమనుకున్నా లెక్క చేయరు. సమాజానికి వ్యతిరేకులు కాదు కాని, సమాజ స్పృహ ఉండదు. దానధర్మాలు, అన్నదాన సత్రములు, విద్యా దానము చేస్తారు. స్వయంకృతాపరాధము వలన తాను శ్రమించి సంపాదించిందంతా వైరి వర్గానికి ధారపొస్తారు. 


మిత్రుల ఉచ్చు నుంచి కొందరు జీవితకాలమంతా బయటపడని సందర్భం ఎదురు కావొచ్చు. బయటకి కనిపించే జీవితము కాక రహస్య జీవితము వేరుగా ఉంటుంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా వీరి లోపాలాను ఎదురుగా చెప్ప లేరు. ఆర్ధిక పురోగతి బాగుంటుంది. అన్య భాషలు సైతము అనర్గళంగా మాట్లాడగలరు. తమ జీవన శైలికి భిన్నముగా సమ్తానాన్ని వేరు రంగాలలో ప్రోత్సహిస్తారు. సమాజములో చురుకైన పాత్ర పోషిస్తారు. దేశ విదేశాలలో పేరు తెచ్చుకుంటారు....మీ... *చింతా గోపి శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557

శివామృతలహరి


శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన

 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;

శా||

యోగాభ్యాసమొనర్చి నిన్నుబడయన్ యోగ్యుండనా? కాను పో

నీ గాఢమ్మగు భక్తి రెండు కనులన్ దీయించి మెప్పింతునా

భోగాసక్తుడనౌటఁగానిపని; సంపూర్ణానుకంపన్ పురా

రీ! గోపున్ ననుఁ బ్రోవ వేడుకొనెదన్ శ్రీ సిద్దలింగేశ్వరా !


భావం;

కఠినమైన యోగాభ్యాస సాధన చేసి నీ కృపను పొందుదామంటే, నాకా యోగ్యతలేదే, 

పోనీ గాఢమైన మూఢ భక్తితో 

భక్త కన్నప్పలా రెండు కళ్లూ పెకల్చి నీకు అర్పిద్దామనుకొంటే 

ఇంకా లౌకిక విషయాల పట్ల ఉన్న ఆసక్తి వల్ల అది నాకు సాధ్యమయ్యే పని కాదు. 

అందుకే నయ్యా

పురారీ! ఓ శివా

ఇవేమీ చేతకాని వాడినైన 

నన్ను సంపూర్ణమైన కరుణతో కటాక్షించమని వేడుకొంటున్నాను స్వామీ,శ్రీ సిద్ధ లింగేశ్వరా!

శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యము



✍️ గోపాలుని మధుసూదన రావు


భృగుమహర్షి విష్ణు వక్షస్థలమును తన్నుట 


మునియంతట ముందుకుజని 

కనియును వైకుంఠమనెడి కైవల్యపురిన్ 

కనె నచ్చట శ్రీకాంతుని 

కనులారగ లక్ష్మితోడ కాంక్షలు దీరన్ 34


హరి సిరి సరసకుసరసన 

సరసంబుల దేలియుండ సంయమి గాంచెన్ 

హరి హరి శ్రీనారాయణ !

కరుణించుము నన్నటంచు కరముల మ్రొక్కెన్ 35


జరుగునది జరగనున్నది 

హరి యెఱిగియు మిన్నకుండె నరమర తోడన్ 

హరి తత్త్వ మెఱుగజాలక 

గరువంబున వొళ్ళు మఱచె కఠినుడు భృగువూ 36


పన్నగశయనుని గాంచియు 

మిన్నంటిన యాగ్రహమున మీదకు నుఱికీ 

కన్నుల నిండిన పొగరున 

తన్నెను వక్షంబుపైన తాపసి జెడుడై 37


ముని జేసిన దుష్కృత్యము 

మనమున తానుంచుకొనక మమతలు మీఱన్ 

ననునయమును జూపించుచు 

ననియెను నీరీతి విష్ణు వాతనితోడన్ 38



“ స్వామీ ! మీ యాగమనము 

మీ మీవిధి గాంచకుంట మిక్కిలి తప్పే 

తామీశ్వర సంభూతులు 

తమరీ కోపంబు మాని దయనిటు గనుడీ 39


సున్నితమగు మీ పాదము 

తన్నిన నామేను దాకి తగ బాధ పడెన్ 

సన్నుత ! నను క్షమియించుము 

నన్నిటు నీ పాదసేవకనుమతి నిమ్మా “. 40


అని శ్రీహరి మునినాథుని 

తన కరముల చాచితెచ్చి తగురీతిగనూ 

కనకమయ యాసనంబున 

నునిచియు నాతిథ్యమిచ్చె ముని యుప్పొంగన్ 41


హరి తదుపరి సిరి యెదుటను 

కరమున కరమునిచి మునిని కడు మర్యాదన్ 

సరగున దెచ్చియు భక్తితొ 

నిరుకరములతోడ గడిగె నిరుపాదములన్ 42 


తదుపరి భృగుపాదంబును 

మృదువగు తనచేతబూని మృదువుగ నొత్తీ 

యదనును జూచియు శ్రీహరి 

యదిమియు చిదిమెను వెంటనె యడుగున కన్నున్ 43 


కన్నుల నిండిన మదమును 

వెన్నుడు యీరీతి నణచ , విస్మితుడగుచున్ 

కన్నుల భాష్పము లొలకగ 

వెన్నుని పాదంబులంటి వేడెను యిటులన్. 44 


“ కన్నుల కావరమొప్పగ 

తన్నితి నిను నేను స్వామి ! తామసబుద్దిన్ 

తన్నిన పాదము బట్టియు 

కన్నును చిదుమంగ నాదు గర్వంబణిగెన్ 45 



శ్రీకేశవ ! నారాయణ !

సంకర్షణ ! వాసుదేవ ! సత్త్వప్రకాశా !

శ్రీకరమగు నీ దృక్కుల 

ప్రాకటముగ నన్నునేల ప్రార్థింతుమదిన్. 46 



భృగువీరీతిగ కుందుచు 

భగవానుని పదములంటి ప్రార్థనసేయిన్ 

'వగవకు’ మనుచును శ్రీహరి 

యగణితమగు ప్రేమతోడ యనెనీరీతిన్. 47

67వ పద్యం

 

మ.

ఒకరిం జంపి పదస్థులై బ్రదుక దా మొక్కొక్క రూహింతు రే

లొకొ? తామెన్నడు జావరో? తమకు బోవో సంపదల్? పుత్రమి

త్రకళత్రాదులతోడ నిత్యసుఖమందం గందురో? యున్న వా

రికి లేదో మృతి యెన్నడుం గటకటా! శ్రీకాళహస్తీశ్వరా!

ఓం పీతవర్ణాయై నమః.🙏

 

(శ్రీ లలితా సహస్రనామములలో ౫౦౭వ నామము)


శా. దీనాళిన్ గను పీతవర్ణ! కను, స్వాధిష్ఠానచక్రప్రభా!


నీ నామస్మరణంబు పుణ్యఫలమే. నిత్యత్వమున్ గొల్పు, నా


లోనన్ నీవు సముజ్వలించి కరుణాలోకా! ప్రవర్ధిల్ల నన్


క్షోణిం జేయుమ, జ్ఞానతేజ మిడుచున్ కూర్మిన్, ముదంబందగన్.🙏



ఓం అతిగర్వితాయై నమః.🙏

(శ్రీ లలితా సహస్రనామములలో ౫౦౮వ నామము)

కం. స్వాధిష్ఠానాధిష్టా!


మేధా సంపన్న! నాకు మేల్గూర్చెడి నీ 


బోధను నతిగర్విత! నే


సాధించెద నీదు కృపను సత్కవనముతోన్.🙏


అమ్మపాదములకు ప్రణమిల్లుచు🙏

చింతా రామకృష్ణారావు.

688. ఓం *రాజపీఠనివేశిత నిజాశ్రితా* యై నమః.🙏

 


సీ. ప్రఖ్యాతమైనట్టి *రాజపీఠనివేశి త నిజాశ్రితా!* నిలు మనసునందు.


త్రికరణ శుద్ధిగా ప్రకటించఁ గల యట్టి భక్తిప్రపత్తులు ప్రబలనిచ్చి


యకళంకమైనట్టి యనుపమ భక్త సా మ్రాజ్యాధినేతగా మలచు నన్ను,


నీవెనేనయి గణనీయ సద్భక్తిని ప్రజలలో ప్రబలించి వరలనిమ్ము.


తే.గీ. వ్యర్థ భాషణలకు స్వస్తి పలుకఁజేసి


సార్థకత జన్మకబ్బగా సౌమ్యగతిని


బోధకల్పించి జనులలో శోధనమున


నిన్ను గనునట్లు చేయనీ మన్ననముగ.

🙏

అమ్మ పాదారవిందములకు ప్రణమిల్లుతూ🙏

చింతా రామకృష్ణారావు.

- *పాక్ ఆక్రమించిన* *లక్ష చదరపు కి.మీ.* *కాశ్మీర్ ఏమైంది

?*

(1.07 లక్షల చ.కి.మీ. = 2 కోట్ల 65 లక్షల ఎకరాలు) 


 *POK విస్తీర్ణం 13 వేల చ.కి.మీ. మాత్రమే. మిగతాది ఏమైంది!?* 


తెలుసుకుందాం...


*జమ్మూ కాశ్మీర్ మొత్తం విస్తీర్ణం:*

          2.22 లక్షల చ.కి.మీ.


 *భారత్* చేతిలో మిగిలింది:

          1.01 లక్షల చ.కి.మీ.

 *పాక్* ఆక్రమించింది:  

          1.07 లక్షల చ.కి.మీ.

 *చైనా* ఆక్రమించింది:

          0.33 లక్షల చ.కి.మీ.

 (పాక్ చైనాకు గిఫ్ట్ గా ఇచ్చిన 14 వేల చ.కి.మీ. కలిపి)


* * * * * * * * * * * 


నిన్న "గిల్గిత్ బాల్టిస్తాన్" ను ఖాళీ చేయమని మోడీ పాకిస్తాన్ కు నోటీస్ ఇచ్చే వరకు మనలో చాలా మందికి అది మన (భారత) భూభాగం అనే తెలియదు.


మీడియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సగం చానళ్లకు "బాల్టిస్తాన్", "బెలూచిస్తాన్" వేరు వేరు అని కూడా తెలీదు.


వార్త తెలిసిన వారికి కూడా దాని ప్రాముఖ్యత తెలియదు.


* * * * * * * * * * * 


పాకిస్తాన్ 1948 లో జమ్మూ కాశ్మీర్ పై దాడికి దిగి జమ్మూ కాశ్మీర్ లో సగం ఆక్రమించింది.


భారత పాలకుల లాగా బుద్ధి హీనులు కాదు కదా...


పాకిస్తాన్ వెంటనే ఆ ఆక్రమించిన భూమి లో 


 - 10% ని "ఆజాద్ కాశ్మీర్" గా ప్రకటించింది.


 - మరో 10% భూమిని చైనా కు 

బహుమతి ఇచ్చింది


 - 80% భూమిని "నార్తర్న్ ప్రావిన్స్" గా పేరు మార్చి పాకిస్తాన్ లో కలుపుకుంది. ఇదే "గిల్గిత్ & బాల్టిస్తాన్".


ఇందులో తెలివి చూడండి. 


ఎప్పుడైనా భారత్ ఈ భూమి గురించి అడిగితే చైనాకు కూడా వాటా ఇచ్చింది కనుక అది త్రైపాక్షిక వివాదం అవుతుంది.

చైనా పేరు రాగానే భారత్ భయ పడుతుంది.


అవసరం ఉన్నా లేక పోయినా "కాశ్మీర్" "కాశ్మీర్" అని లొల్లి చేస్తూ..., 


వివాదం కేవలం "కాశ్మీర్" పైనే ఉన్నట్టు.. 

"జమ్మూ భారత్ ది, ఆక్సాయ్ చిన్ చైనాది, గిల్గిత్ & బాల్టిస్తాన్ పాకిస్తాన్ ది".. 

వీటి పై వివాదం లేనట్టు..


సీన్ సెట్ చేసి పెట్టింది.


భారత రాజకీయ నాయకత్వానికి వివరాలు తెలుసుకునే ఓపిక ఎక్కడిది? 


ప్రతి ఏడూ ఎలక్షన్ ల మీదే దృష్టి.


1962 చైనా యుద్ధం లో చైనా 0.33 లక్షల చ.కి.మీ భూమిని ఆక్రమించు కుంది. (పాక్ బహుమతి గా ఇచ్చిన 0.14 లక్షల చ.కి.మీ తో కలిపి)


"చైనా తో ఏం కయ్యం పెట్టుకుంటాం లే. మనకు అంత సీన్ లేదు" అన్నట్టు భారత ప్రభుత్వాలూ వదిలేశాయి.


* * * * * * * * * * * 


ఈ ప్రాంతం ప్రాముఖ్యత ఏమిటంటే...


 - 5 దేశాలను కలిపే "వూఖాన్ కారిడార్".. 

(ఆసియా దేశాల మధ్య ఎప్పటికైనా రాబోయే రోడ్ / రైల్ / ఆయిల్ / గ్యాస్ కనిక్టివిటీ ఈ కారిడార్ లేకుండా సాధ్య పడదు). 


ఇది ఎవరి చేతిలో ఉంటే వారిని కాదని ముందుకు పోవటం ఇతరుల వల్ల కాదు. 


 - "భారత్ - ఆఫ్ఘాన్ రోడ్డు మార్గం".., 


 - చైనా నిర్మించ తలపెట్టిన CPEC 


ఈ ప్రాంతం లోకే వస్తాయి.


* * * * * * * * * * * 


కట్ చేస్తే, వాజ్ పేయీ ప్రభుత్వ హయాంలో భారత్ ఈ ప్రాంతం లో ఎలాంటి ప్రాజెక్ట్ లకూ లోన్లు ఇవ్వటానికి లేదని ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ కు నోటీస్ ఇచ్చింది. అప్పటి లోన్ లు కొన్ని ఆపి ఆ ప్రాంతాన్ని తిరిగి వివాదాస్పదం చేయ గలిగింది.


ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం పాకిస్తాన్ కు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయమని నోటీస్ ఇవ్వటం వెనుకా వ్యూహాత్మక ప్రయోజనాలు చాలా ఉన్నాయి.


  - *కీలక నదులపై ఆధిపత్యం..* 


 - CPEC ను పూర్తిగా ఆప లేక పోయినా, దానిపై ఏదో ఒక విధమైన జాప్యం, వివాదం మొదలు పెట్టటం..


 - అదృష్టం బాగుంటే ఆ ప్రాంతాన్ని మళ్లీ మన ఆధీనం లోకి తీసుకోవటం..


 - అక్కడి ఖనిజ సంపద పై ఆధిపత్యం..


 - రానున్న రోడ్ / రైల్ / ఆయిల్ / గ్యాస్ కనెక్టివిటీ పై ఆధిపత్యం


అందులో కొన్ని.


* * * * * * * * * * * 


మన పిల్లలకు మన ఆస్తి పై కాస్త అవగాహన కల్పించటం మన కర్తవ్యం.