7, మార్చి 2025, శుక్రవారం

శనివారం🍁* *🌹08, మార్చి, 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*

       *🍁శనివారం🍁*

*🌹08, మార్చి, 2025🌹*

    *దృగ్గణిత పంచాంగం*                    


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిరఋతౌః*

*ఫాల్గుణ మాసం -  శుక్లపక్షం*


*తిథి      : నవమి* ఉ 08.16 వరకు ఉపరి *దశమి*

*వారం    : శనివారం* ( స్ధిరవాసరే )

*నక్షత్రం  : ఆరుద్ర* రా 11.28 వరకు ఉపరి *పునర్వసు*


*యోగం  : ఆయుష్మాన్* సా 04.24 వరకు ఉపరి *సౌభాగ్య*

*కరణం   : కౌలువ* ఉ 08.16 *తైతుల* రా 07.56 ఉపరి *గరజి*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 11.00 - 01.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *మ 01.30 - 03.05*

అభిజిత్ కాలం  : *ప 11.54 - 12.42*


*వర్జ్యం             : *ఉ 07.54 - 09.30*

*దుర్ముహూర్తం  : ఉ 06.20 - 07.56*

*రాహు కాలం   : ఉ 09.19 - 10.49*

గుళికకాళం      :  *ఉ 06.20 - 07.50*

యమగండం    : *మ 01.48 - 03.17*

సూర్యరాశి : *కుంభం* 

చంద్రరాశి : *మిధునం*

సూర్యోదయం :*ఉ 06.20*

సూర్యాస్తమయం :*సా 06.16*

*ప్రయాణశూల  : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :  *ఉ 06.20 - 08.44*

సంగవ కాలం         :      *08.44 - 11.07*

మధ్యాహ్న కాలం    :      *11.07 - 01.30*

అపరాహ్న కాలం    : *మ 01.30 - 03.53*


*ఆబ్ధికం తిధి         : ఫాల్గుణ శుద్ధ దశమి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.16*

ప్రదోష కాలం         :  *సా 06.16 - 08.41*

రాత్రి కాలం           :  *రా 08.41 - 11.54*

నిశీధి కాలం          :*రా 11.54 - 12.42*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.43 - 05.31*

________________________________

        *🍁ప్రతినిత్యం🍁*

       *_గోమాతను 🐄  పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🙏శ్రీ వేంకటేశ్వరస్వామి🙏* 

*🔯ద్వాదశనామ స్తోత్రం🔯*


*ఏతద్ద్వాదశనామాని* 

*త్రిసంధ్యం యః పఠేన్నరః*

*దారిద్ర్యదుఃఖనిర్ముక్తో* 

*ధనధాన్యసమృద్ధిమాన్* 


*🙏ఓం నమో వేంకటేశాయ 🙏*

******************************


*🚩||జై శ్రీ రామ్  - జై హనుమాన్||🚩*                  


*నీవే ధైర్యము స్థైర్యము*

*నీవే మా యండ దండ*

*నీవే హనుమా!*

*నీవే శ్రీ రామ చరిత!*

*నీవే భవ భంజక హర!* 

 *నీకివె ప్రణతుల్*


           🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>           


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

ఉపనిషత్తులు ఉపవేదాలు

  అసలు మనము మన సనాతన సాంప్రదాయంలో మూలాలు బాగా పరిశీలిస్తే మనకు మొట్టమొదట వేదాలు ఉపనిషత్తులు ఉపవేదాలు ఇట్లా రకరకాల అయినటువంటి వచ్చాయి వీటిని కేవలము విద్వత్తు గల అనగా గొప్ప గురువుగారు గా ఉన్న వాళ్ళు మాత్రమే ఋషులు మహర్షులు ఇలాంటి వాళ్లంతా బాగా తెలుసుకొని అవి నలుగురికి పంచుతూ వచ్చారు. కానీ చాలామందికి ఇవి అర్థము అయ్యేటివి కావు అందువలన మరల ఈ వేదాలలోని ముఖ్యమైన ఘట్టాలను తీసుకొని ఈ పురాణాలనేటివి రచించడం జరిగినది. తర్వాత కొన్ని ఇతిహాసాలు కూడా అయినాయి అలాంటి పురాణాలే రామావతారము, శ్రీకృష్ణ అవతారం. 

మనకు దేవాలయానికి వెళితే మూలవిరాట్టును చూసి త్వరగా నమస్కారం చేసుకొని బయటికి వచ్చేస్తాం కానీ ఉత్సవ విగ్రహాలు బయటికి వస్తే అవి కనుమరుగయ్యే వరకు కూడా మనము చాలా జాగ్రత్తగా ఒళ్లంతా కూడా కళ్ళు చేసుకుని తిలకిస్తూ ఉంటాం అంతేకాదు తన్మయత్వంతో ఉండిపోతాం అలాంటివే ఈ పురాణాలు కూడా!!

సాక్షాత్తు శ్రీమన్నారాయణు డి అవతారము రాముడు కృష్ణుడు రామావతారంలో మానవుడు తన ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి తల్లితండ్రులకు ఎలా గౌరవం ఇవ్వాలి వారిని ఎలా అభిమానించాలి అన్నదమ్ములతో ఎలా ప్రవర్తించాలి మరుదులను ఎలా చూసుకోవాలి అని తెలిపిన వారే రాములవారు సీతా అమ్మవారు. సీతమ్మవారనగా సాక్షాత్తు ఆ ఆదిలక్ష్మి దేవే. అందులో ఎలాంటి సందేహము లేదు ఆమె కూడా తనకు తెలుసు తను ఏమైనా చేయగలను అనేది కూడా ఎక్కడ ఆమె ప్రవర్తించలేదు ఎంతో వినయము విధేయతతో మసలుకుంది దీనికి మనకు రామాయణంలో ప్రత్యేకంగా ఆత్రి మహర్షి అనసూయ దేవి దంపతుల ఆశ్రమానికి వెళ్ళినప్పుడు విషయం తెలుస్తుంది పతివ్రత ధర్మాలు ఎలా ఉండాలి అసలు ఎలా ఆచరించుకోవాలి అని వాళ్ళ ద్వారా సాక్షాత్తు ఆ జగన్మాతనే వినింది అన్నది తెలుస్తుంది. అంటే ఇక్కడ ఆమెకు తెలియక కాదు మనకు తెలియజెప్పడం కోసం ఆ తల్లి వాళ్ళ దగ్గర తెలుసుకుంది. దీనినిబట్టి భార్య భర్తలు వినయ విధేయతలతో కలిసి మెలిసి కాపురం చేసుకోవాలి అని తెలుపుతుంది శ్రీమద్రామాయణం. 


ఇక రెండవది శ్రీకృష్ణ అవతారం ఇందులో మహావిష్ణువు సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడి గా దిగివచ్చినట్లు తనే అవతార పురుషుడు అన్నట్టు మనకు తెలుస్తోంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది ఎంత అవసరమో దాని ప్రకారము ఆయన నడుచుకున్నాడు ఆయన చేయవలసిన దుష్టశిక్షణ ఆయన చేస్తూ మిగిలినవారు ఎవరు ఎవరి చేతిలో మరణించాలో దానిని వారి చేత ఆచరింపజేస్తూ అందరిని తరింపజేశాడు 

కృష్ణావతారంలో చాలా విషయాలలో చాలామంది వక్రీకరించి చెప్పడమే ఎక్కువగా ఉన్నది. రాధాకృష్ణులు వాళ్లకు వివాహమైంది అని అంటారు అది కూడా శుద్ధ తప్పు అపద్దం. ఇక ఆయన గోపిక వస్త్రాపహరణం చేశాడు అనేది దానిలో కూడా ఒక ముఖ్యమైన విషయం ఉంది. పూర్వము ఒకసారి మహర్షులందరూ వైకుంఠానికి వెళ్లి సాక్షాత్తు ఆ అచ్చ్యతుడిని వరం అడిగారు దానికి ఆయన మీకు నేను ద్వాపరయుగంలో మీ కోరిక తీరుస్తాను అని చెప్పాడు ఇంతకీ ఆ వరం ఏమిటంటే ఆయనను ఒక్కసారి వీళ్ళు ఆలింగనం చేసుకోవాలి అని కోరుకున్నారు దాని ప్రకారమే శ్రీకృష్ణ అవతారంలో మీరు దేహము మీద వ్యామోహం వదిలి చేతులు పైకెత్తి నన్ను పిలిస్తే నేను వస్తాను అని చెబుతాడు ఆ విధంగానే వాళ్ళు చేస్తారు అప్పుడు వాళ్ళను అనుగ్రహిస్తాడు వాసుదేవుడు. 

ఈ విధంగా రామాయణము ధర్మపరివర్తనమును తెలియజేస్తే మహాభారతం అధర్మాన్ని అధర్మంతో జయించాలి అని తెలియజేస్తుంది. ఇవన్నీ మనకు పురాణాల ద్వారా తెలిసి మనము వాటిలోని మంచిని స్వీకరించి ముందుకు నడవాలి అని ఇలా ఆ భగవంతుడు అవతారము ఎత్తినాడు.


       నమస్కారమండీ 

                  మీ 

   చంద్రమోహన్ మాండవ్య 

🙏🍁🌿🍒🪻🦚🦜🏵️🕉️🌸

రామాయణం, మహాభారతం

 దీని వెనుకున్న శాస్త్ర వివరణ నాకు తెలియదు కానీ.. చాలామంది ప్రవచన కర్తల ద్వారా విని తెలుసుకున్న సారమేమిటంటే ఈ ప్రపంచం అంతా కూడా రామాయణం, మహాభారతం ఈ రెండు మహా గాథలు మానవాళికి అందించిన మహా వరం.. ఎందుకంటే రాముడు ఒక మనిషి అనే వాడు ఎలా ధర్మంగా బతకాలో ప్రపంచానికి నేర్పించాడు.. అందుకే *రామో విగ్రహవాన్ ధర్మః* అనే నానుడి ఉంది. అలాగే కృష్ణతత్వం ఒక మనిషి ప్రతినిత్యం ఎలా ముందుకు వెళ్లాలో ఓ భగవద్గీత ద్వారా అర్జునుడికి గీతోపదేశం చేసిన విషయాలు మానవాళికి వజ్రాయుధాల లాంటి మాటలు.. అందుకే కృష్ణ తత్వం చెప్పేది ఏంటంటే *అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ*.. _*సర్వ ధర్మాన్ పరిత్యజ్యా మామేకం శరణం వ్రజ*_ అని ఏ ధర్మాన్ని విడిచినా కూడా కృష్ణుడిని శరణు వేడితే చాలట.. మిగతా అన్ని అవతారాలు రాక్షస సంహారాన్ని మాత్రమే చేశాయి.. కానీ స్ఫూర్తివంతమైన జీవన మార్గాన్ని బోధించింది కృష్ణ రామావతరాలే.. అందుకే *హరే రామ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే* అని జపాన్ని చేస్తూ ఉంటారు ఎక్కువగా... అందుకే కృష్ణుడిని రాముడిని యుగపురుషులు అని కూడా అంటారు.. *సర్వేజనాః సుఖినోభవంతు*🙏🏻

Panchaag

 


నీలమోహనం



నీలమోహనం! 

      

      బులుసు వారి నీలమోహనం

   చమత్కారభాసురం!  


(మరోమారు నెమరేసు కుందాం)


 భావుకుడైన ఒకమహాకవివ్రాసిన పద్యకృతి నీలమోహనం.ఆపేరుచదవగానే నీలమేఘశ్యాముడై భువనమోహనుడై

వెలుగొందే ఆనల్లనయ్యే మనకన్నులముందు సాక్షత్కరిస్తాడు.అవును. ఈకృతిలో అణువణువునా ఉన్నదాకృష్ణయ్యే!


యమునాతీరం,ఆసుందరబృందావనం,

ఆఆలమందలు,ఆసుందర,గో,గోపికాబృందాలు,ఆమధురమైనపిల్లనగ్రోవిగానం,

ఆగానానికి తన్మయమై (అచేతనప్రాయమై) చిత్తరువును దలపింపజేసే ప్రకృతి పరిసరాలు, నేపధ్యంగా

రచియింప బడిన యీపద్యాలు,అనవద్యహృద్యాలు,రసహృదయవేద్యాలు,భావుకతా నైవేద్యాలు,

ప్రతిపద్యం ఒకఅనర్ఘరత్నం.

ఆపదాలపోహళింపు,ఆభావాలమోహరింపు,ఆసమాసఘటన,ఆప్రకృతిచిత్రణలు,ఆరసపోషణావిధానము,

ఒకటేమిటి? సర్వం ,ఒకఅద్భుతం!

                  ఇలాంటి సర్వసంపన్నమైన

నీలమోహనం నేడు మనముందుకు రావడం మనసుకృతం.రసలోలుపులైన పండితప్రియంభావుకు లందరకు నేడు

 పసందైన సాహిత్యపు విందు.

ఇకసమాహితహృదయంతో కృతినిపర్యాలోకనమొనరింతుముగాక!

ముందుగా నేనొకపద్యమును చవిచూపి

ముగింతును .


"అళినీలాలకమై,కృపామధురహాసాంకూరమై,ఆవియ

త్తల సంపూరిత కేకిపింఛ ఘనరుక్ తారళ్యమై,నవ్యమై,

లలితోదార లలాటికా మృగమదాహ్లాద ప్రియంబైన,ని

ర్మల వంశీమదనాభిరామ,ముఖబింబం బాత్మనిండారెడిన్;

         

                 కవి తనయాత్మలో నిండిన నీలమోహనమూర్తిని యీపద్యంలో ఆవిష్కరిస్తున్నాడు.ఇందులోభౌతికమైనరూపం,ఆంతరమైనరూపం రెండురూపాలు ఆవిష్కరింపబడుతున్నాయి.

భౌతికంగా:తుమ్మెదలనుబోలిని ముంగురులు,దయామృతమొలికించే మందహాసాంకురములు,శిరసునఇంద్రచాపంలామెఱసే కేకిపింఛ నవతారుణ్యఛ్ఛాయలు,నవ నవోయమైననుదుటికస్తూరీతిలకపుపరీమళాలు,

పెదవులపై నడయాడుతూ,అల్లన మ్రోగే

పిల్లగ్రోవి రాగాల సరాగాలతో కూడిన ఆచల్లనయ్యనీలమోహనరూపం నాయాత్మలో నిండిపోయినదిఅనిబాహ్యార్ధం,

ఇది బాహ్యరూపం!


ఇకఆంతరం!

            నల్లనియాతనువు విశ్వాకారమై,గగనసదృశమైయొప్పారటం,అందుచేతనే చెంగట ఇంద్రచాపం(కేకిపింఛం)మందహాసాలమెరపులయొరపులు.వంశీరవసాదృశ్యంతో వేదనాదాలు,ఇత్యాదిగాఆయనవిశ్వాయతత్తత్వాన్ని స్ఫూర్తిమంతంచేయటం జరిగింది.


              ఇలా మనలోచనాలకు,సులోచనాలకూగూడా అందనియర్ధాలెన్నో,కన్నయ్య అందాలెన్నో,మన ఆలోచనాలోచనాలకు

అగుపిస్తాయి.అదే కవిరచనలోని భావుకత!

అందుకే బులుసు వేంకటేశ్వరులుగారు "మహాకవు"లయ్యారు.కనుకనేమహాకవిత్వతత్వాన్నిలాఆవిష్కరింపగలిగారు.

ఇలాప్రతీపద్యాన్ని ఆస్వాదింపగలిగితే

రసోవైసః మనముందే!!   

                                       స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

పసుపు కుంకుమ సున్నిపిండి అమ్మబడును

 అందరికీ నమస్కారం అండీ  మేము మా ఊరిలో పండే పసుపు కొమ్ములను తీసుకుని మర పట్టించి అమ్ముతున్నాము అన్ని శుభకార్యాలకి పసుపు కుంకుమ సున్నిపిండి అమ్మబడును 


 👉పసుపు కొమ్ముల నోముకు  లక్ష పసుపు కొమ్ములు అందించబడును


🙏కైలాస గౌరీ నోముకు, అన్ని రకముల నోములకు కావలసిన


👉 పసుపు కుంకుమలు ఎటువంటి రసాయనాలు రంగులు కలపకుండా స్వచ్ఛమైనవి అమ్మబడును   

👉లక్ష గాజులు నోముకు పంపబడును 

👉పసుపు గౌరీ, కుంకుమ గౌరి నోముకు వెదురు బుట్టలు పంపబడును 


👉పచ్చి పసుపు లభించును 

 👉చాటల నోము కి చాటలు కూడా అందించబడును

👉తాంబూలాలలో పెట్టే చిన్న చిన్న పసుపు కుంకుమ ప్యాకెట్స్ కూడా చేసి ఇవ్వబడును కావలసినవారు   సంప్రదించండి

*అన్ని ప్రదేశాలకు కొరియర్ సౌకర్యం కలదు* *చార్జీలు అదనం*

 

*అందరికీ నమస్కారం.  మీరు దేశ విదేశాలలో ఎక్కడున్నా, మేము మీకు సహకరించగలము. మేము ఆహార పదార్థాలు (స్వీట్లు, ఖారా, పొడులు, పచ్చళ్ళు, చలిమిడి) స్వయంగా శుచి, శుభ్రతతో తయారు చేసి ఇయ్యగలము. మీ ఇంట్లో జరిగే ఏ శుభకార్యక్రమానికైనా మేము కావలసిన సరంజామా, మీ బడ్జెట్ ప్రకారం చీరలు, ధోవతులు, లుంగీలు, తువ్వాళ్ళు, జాకెట్టు బట్టలు, కర్చీఫ్లు, రిటర్న్ గిఫ్టులు పసుపు కుంకుమ పాకెట్లు, ఇట్లా మీకు కావాల్సిన ప్రతీది మీ సమయం ఆదా చేస్తూ, మీ ఇంటి దగ్గరకే ఏర్పాటు ఔతాయి. మీరు ఏ వయస్సు వారైనా మీకు పూజకైనా, పెళ్ళికైనా లేదా వ్రతాలకైనా అన్నీ ఏర్పాటు చేయబడతాయి. మీరు మమ్మల్ని సంప్రదించండి*


*దయచేసిమీకుతెలిసిన

బ్రాహ్మణ గ్రూపులలో

ఈ మెసేజ్ ని పంపవలసినదిగా

కోరుకుంటునను*


*లక్ష్మీ సౌజన్య *

హరితస గోత్రం*

*కుంచనపల్లి 

*విజయవాడ 

*సంప్రదించండి* : *7731985475


*8712919841* Gp or Pp numbe

సమస్య

 04-03-2025

శంకరాభరణం వారి సమస్య-

*పుష్పంబందున రెండు పుష్పములవే పుట్టెన్ మనోజ్ఞమ్ములై*


శా.

పుష్పంబే కద నాతిమోము శ్రీపుష్పంబుగాఁ దోచెనే

పుష్పంబౌ వదనారవిందమున సంపూర్ణత్వమే తోచగా

పుష్పాలై చెలినేత్రముల్ మెరయ సంబోధించిరే సత్కవుల్

*పుష్పంబందున రెండు పుష్పములవే పుట్టెన్ మనోజ్ఞమ్ములై*


(మరియొక ప్రయత్నము)

ఆ.

సుదతి వదనమదియె సుందర కమలమ్ము

కనులు జూడ రెండు గలువపూలు

 ముగ్ధముఖము కనగ ముచ్చటలొలుకుచు

పువ్వులోన రెండు పూవులమరె


అరుణా చయనం

భయము ను చంపిన వెంటనె

 *2036*

*కం*

భయము ను చంపిన వెంటనె

జయములు నీ వెంటబడును సతతము పుడమిన్.

భయమును మించిన శత్రువు

జయము ను మించెడి హితులును సాధ్యమ సుజనా?.

*భావం*:-- ఓ సుజనా! భయాన్ని చంపిన వెంటనే జయములు ఈ భూలోకంలో నీ వెంటబడతాయి. భయము కన్నా పెద్ద శత్రువు గానీ జయము కన్నా గొప్ప మిత్రము గానీ సాధ్యమవుతుందా!!??.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*


*2037*

*కం*

ఎవ్వారల పని కష్టము

లవ్వారలకే తెలియును నవనిన నెపుడున్.

ఎవ్వరి పనినైనను నట

రవ్వాడగనెంచబోకు రయమున సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ఎవరి పని లో కష్టం ఎల్లప్పుడూ వారి కే తెలుస్తుంది. ఎవరి పనినీ నీవు తొందరపడి (రయమున)నిందించడానికి(రవ్వాడు) ప్రయత్నించవద్దు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*


*2038*

*కం*

దానము జేసిన వారల

హీనముగా జూచుటెల్ల హేయంబెపుడున్.

దానము మించిన సుకృతము

లీ నరలోకంబునందు లేవుర(లేవిల) సుజనా.

*భావం*:-- ఓ సుజనా! దానం చేసి న వారి ని హీనంగా చూడటం ఎన్నడూ నీచ బుధ్ధి యే. దానము ను మించిన పుణ్యాలు ఈ నరలోకంలో ఉండవు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*


మానవత్వానికి నిజాయితీకి చోటు లేదు

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🔥మంచికి మానవత్వానికి నిజాయితీకి చోటు లేదు ఈ ప్రపంచములో..అడుగడుగునా మోసం..అణువణువునా స్వార్థం.. అన్ని జీవరాసులలోకి ఉన్నతమైనది మానవ జమ్మ అంటారు.. మరి ఏ జీవికి లేని ఇన్ని ఆవలక్షణాలు ఒక మనిషికే ఎందుకు ఉన్నాయి🔥మనిషికి కాలం విలువ తెలుసు.. డబ్బు విలువ తెలుసు..బంధం విలువ తెలుసు.. ప్రాణం విలువ తెలుసు.. ఇన్ని తెలిసిన మనిషికి ఎదుట మనిషిని అర్ధం చేసుకోవడం ఎందుకో అశ్రద్ద(అహంకారం)తెలియడం లేదు🔥కోకిలతో మనిషి అన్నాడు..నీవు నల్లగా లేకపోతే ఎంతో బాగుండేదిఅని..అదే మనిషి సముద్రంతో ఆనాడు..నీవ్వు ఉప్పగా లేకపోతే ఎంతో రుచిగా ఉండేది అని..గులాబీతో అన్నాడు..నీకు ఇలా ముళ్ళు లేకపోతే ఎంతో బాగుండేది అని.. అప్పుడు ఈ మూడు కలిసి మూకుమ్మడిగా ఇలా అన్నాయి..ఓ మనిషి ఎప్పుడూ ఎదుటి వారిలో లోపాలు వెతికే గుణం నీకు లేకపోతే నీవ్వు ఇంకేంత అద్భుతంగా ఉండేవాడివో తెలుసుకో🔥 పుట్టే వరకూ తపన.. పెరిగిన తరువాత కోరిక.. పెద్దయ్యాక ఆశ.. అభివృద్ధి చెందాక ఆరాటం.. ఎన్నెన్నో చెప్పలేని వక్ర ఆలోచనలు మరియు స్వార్థంతో మనిషి స్వాభావం మార్చుకొని వక్రమార్గంలో పయనం.. పనిషి జీవితం ఎక్కడ ప్రారంభం మైనా ముగింపు మాత్రం చావుతోనే.. దేనికోసం ఈ తాపత్రయం🔥🔥మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్& జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3.గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయి పోయిన వారు రాలేని వారు కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును.9440893593 9182075510* 🙏🙏🙏

నవరత్నాలను ఉపయోగించి చేయు వైద్య ప్రక్రియలు -

 ఆయుర్వేదం నందు నవరత్నాలను ఉపయోగించి చేయు వైద్య ప్రక్రియలు  -


     నవరత్నాలు అనగా మాణిక్యం , ముత్యము , పగడము , పచ్చ, పుష్యరాగము , వజ్రము , నీలము , వైడూర్యము , గోమేధికము  ఈ తొమ్మిదింటిని  నవరత్నాలు అని పిలుస్తారు . చాలామందికి ఇవి కేవలం ఆభరణాలలో ఉపయోగించు విలువయిన రాళ్ళగా మాత్రమే పరిచయం . భారతీయ పురాతన ఆయుర్వేద వైద్యులు వీటిలోని ఔషధ గుణాలను తమ పరిశోధనల ద్వారా తెలుసుకుని వాటిని తమ వైద్యములో విరివిగా ఉపయోగించారు. వారు తమ పరిశోధనా ఫలితాలను తమ గ్రంథాలలో సంపూర్ణంగా వివరించారు . ఇవి ఎక్కువుగా సంస్కృత లిపిలో ఉన్నాయి . ఈ మధ్యకాలంలో నేను అటువంటి పురాతన గ్రంథాలను సేకరించి వాటిపైన కొంత పరిశోధన కూడా చేశాను . ఆ విలువైన సమాచారాన్ని ఇప్పుడు మీకు నేను అందించబోవుతున్నాను.


         జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మాణిక్యం అనగా కెంపు సూర్యునకు , ముత్యము చంద్రునకు , పగడము అంగారకునకు , మరకతము అనగా పచ్చ బుధునకు , పుష్యరాగము గురువునకు , వజ్రము శుక్రునకు , నీలము శనికి , వైడుర్యము రాహువునకు , గోమేధికము కేతువునకు ప్రీతికరములు మరియు ప్రతిరూపములుగా పేర్కొన్నారు . మరియు ఆయా గ్రహ దోషములకు ఆయా రత్నములను ధరించి గ్రహపీడ నుండి బయటపడవచ్చు.


            ఇప్పుడు ఆయుర్వేదం నందలి నవరత్నాల ఉపయోగాలు మీకు తెలియచేస్తాను .


 *  మాణిక్యం  -


           ఈ మాణిక్యం పద్మరాగము అని ప్రసిద్ధి కలిగినది . తామరరేకు వన్నె కలిగి బరువుతో స్ఫుటంగా ఉండును. మిక్కిలి కాంతివంతముగా ఉండును. స్ఫుటముగా , బరువుగా , గుండ్రముగా ఉండు మాణిక్యం పరిశుద్ధం అయినది.  ఈ మాణిక్యమును సరైన పద్ధతుల్లో శుద్దిచేసి పుటం పెట్టి ఆ భస్మమును ఉపయోగించిన  శరీరము నందలి వాత,పిత్త, శ్లేష్మములను శాంతింపచేసి అగ్నిదీపమును కలిగించును. శరీరముకు దారుఢ్యము కలిగించును. మరియు దీనిని ధరించిన  భూత , బేతాళ పీడలు తొలగును . అతి భయం వంటి మానశిక దోషాలలో ఇది మంచి ప్రభావం చూపించును.


 *  ముత్యము  -


           గుండ్రగా ఉండి తెల్లని కాంతి కలిగి , తేలికైనది , నీటి కాంతి కలిగి , నిర్మలంగా ఉండి అందంగా ఉన్న ముత్యము శుభకరమైనది. వెలవెలపోతూ పైన పొరలుపొరలుగా ఉండి గొగ్గులుగొగ్గులుగా ఉన్నది మంచి ముత్యం కాదుగా గ్రహించాలి.ఇలాంటి ముత్యాలను అసలు వాడకూడదు.


          మంచి ముత్యమును పుఠం పెట్టి భస్మం చేసి ఒక మోతాదులో ప్రతినిత్యం పుచ్చుకొనుచున్న మనుజులకు రక్తపిత్తం, క్షయ వంటి రోగాలు నిర్మూలనం అగును. దేహమునకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చును. ఆయుష్షును వృద్దిచేయును . వీర్యవృద్ధి చేయును , శరీరం నందు జఠరాగ్ని వృద్ధిచెందించి శరీరానికి ఉత్సాహం కలుగచేయును .


 *  పగడం  -


            బాగా పండిన దొండపండు వలే ఎర్రని రంగు కలిగి గుండ్రని నునుపైన బుడిపెలు , వంకరలు , తొర్రలు మొదలగునవి లేకుండా పెద్దగా ఉండు పగడం శ్రేష్టమైనది. శుభప్రదం అయినది. 


          మంచి పగడమును సేకరించి సహదేవి ఆకు రసము నందు నానబెట్టిన శుద్ది అగును. దానిని భస్మము చేసి సేవించిన యెడల క్షయరోగములు , రక్తపిత్తములు , కాసరోగము , నేత్రరోగములు , విషదోషాలు మున్నగు వాటిని శమింపచేయును . అగ్నిదీప్తిని , జీర్ణశక్తిని కలిగించి వార్ధక్యమును పోగొట్టి దేహమునకు కాంతిని , బలమును కలిగించును. దీనిని ముట్టునొప్పికి విశేషముగా వాడుదురు.


 *  గరుడ పచ్చ  -


         మంచి గరుడపచ్చ ఆకుపచ్చని రంగు కలిగి మెరుగులు తేలుతూ బరువుగా , నున్నగా ఉండును. మిక్కిలి కాంతిమంతంగా ఉండును. దీనిని ఔషధముల యందు ఉపయోగించవచ్చు . తెల్లగా , నల్లగా , బుడుపులు కలిగి ఉన్న , పెలుసుగా ఉన్న ఆ పచ్చ మంచిది కాదు అని అర్థం .


            గరుడ పచ్చను ఆవుపాలలో నానబెట్టి శుద్దిచేసి భస్మము చేసి సేవించుతున్న పాండువ్యాధులు , మొలలు , విషదోషాలు , సన్నిపాత జ్వరాలు , సామాన్య జ్వరాలు , వాంతులు , శ్వాస సంబంధ సమస్యలు , కాసరోగం , అగ్నిమాంద్యం వంటి రోగాలను పోగొట్టును . దేహమున మిక్కిలి కాంతిని ఇచ్చి మేలుచేయును .


 *  పుష్యరాగము  -


           పుష్యరాగము శుద్ధముగా , నునుపుగా , లావుగా , బరువుగా , ఎగుడుదిగుడు లేనిదిగా ఉండి గోగుపూవ్వు రంగు కలిగి తళతళ ప్రకాశించుచుండును. ఇట్టి లక్షణాలు కలిగినది అత్యుత్తమం అయినది.ఇలా కాక గోరోచనపు రంగు గాని పచ్చగా కాని మిక్కిలి తెలుపుగా గాని ఉండిన మంచిది కాదు.


             దీని భస్మం సేవించిన తీవ్రమగు దాహమును , వాంతులను , వాతరోగములను , కుష్టు వ్యాధిని , విషదోషములను పోగొట్టి దేహమునకు మిక్కిలి కాంతిని కలుగచేయును .


 *  వజ్రము  - 


            ఈ వజ్రము నందు స్త్రీ, పురుష , నపుంసక అని మూడు రకాల జాతులు కలవు.


       ఎనిమిది అంచులు కలిగి , పక్షములు ఎనిమిది , కోణములు ఆరు కలిగి ఇంద్రధనస్సు వలే ప్రకాశించుతూ నీటివలె నీడదేరునది పురుషవజ్రము అనబడును.


             గుండ్రనైన ఆడుకులు గట్టి ఉండు ఆకారం కలిగి ఉండినది స్త్రీ వజ్రం అనబడును.


        మణిగిపోయిన మూలాలు , అగ్రమును కలిగి ఉండి మిక్కిలి గుండ్రముగా ఉండునది నపుంసక వజ్రం అనబడును. 


           మంచి పురుషజాతి వజ్రమును భస్మం చేసి వాడుతున్న సమస్తరోగములను పోగొట్టి వీర్యాభివృద్ధిని కలిగించి వార్థక్యమును పోగొట్టి బాగుగా ఆకలి పుట్టించును . మానవులకు ఇది అమృతప్రాయమై ఉండును. 


 * నీలము  -


           దీనిలో జలనీలము , ఇంద్రనీలము అను రెండు విభిన్న రకాలు కలవు. ఇందులో ఇంద్రనీలము శ్రేష్టము . జలనీలము తేలికగా ఉండి తెలుపుతో కూడిన వర్ణము కలిగి ఉండును. ఇంద్రనీలము బరువుగా ఉండి నలుపువర్ణము నందు నీలం మిశ్రితము కాక నీలవర్ణం కాంతి కలిగి నునుపుగా మలినం లేకుండా మృదువుగా మద్యభాగము నందు కాంతి కలిగి ఉండును. ఇది అత్యంత శ్రేష్టం అయినది.


             ఈ నీలమును గాడిద మూత్రములో నానబెట్టి మంచి తీవ్రత కలిగిన ఎండలో ఎండించిన శుద్ధం అగును.


        ఈ భస్మాన్ని ఉపయోగించుతున్న శ్వాస , కాస రోగాలు మానును . వీర్యవర్ధకం , త్రిదోషాలను హరించును . అగ్నిదీప్తిని పెంచును. విషమజ్వరం , మూలశంఖ రోగము , పాపసంబంధ రోగాలను హరించును .


 *  వైడుర్యము  -


           నలుపు , తెలుపు కాంతి కలిగి సమానమై , స్వచ్ఛమై , బరువై , స్ఫుటమై , లొపల తెల్లని ఉత్తరీయము వంటి పొర కలిగినది శ్రేష్టమైన వైడుర్యము . నల్లగా కాని తెల్లగా కాని ఉండి పారలుపొరలుగా ఉండి లొపల ఎర్రని ఉత్తరీయము వంటి పొర కలిగినది చెడు వైడుర్యముగా గుర్తించవలెను . మంచిది కాదు.


        దీనిని కొండపిండి రసములో నానబెట్టి ఎండించి బాగా కాల్చి ఆ తరువాత గజపుటము వేయవలెను .


         ఈ భస్మము రక్తపిత్తవ్యాధిని హరించును . బుద్ధిని , శరీర బలాన్ని , ఆయుర్వృద్దిని కలిగించును. పిత్తాన్ని పెంచును , అగ్నిదీప్తిని చేయును . మలములను శరీరం బయటకి వెడలించును.


 *  గోమేధికం  -


            ఇది ఆవుయొక్క మెదడుని పోలి ఉండటం వలన గోమేధికం అని పేరు వచ్చినది . ఇది స్వచ్చమైన గోమూత్రము కాంతి కలిగి నునుపుగా ఉండి హెచ్చుతగ్గులు లేకుండా బరువుగా ఉండి పొరలు లేకుండా దట్టముగా ఉండును. మెరుపు లేకుండా తేలికగా ఉండి కాంతివిహీనం అయి గాజుపెంకు వలే ఉండునది దోషయుక్తము .


          దీనిని గోమూత్రము నందు నానబెట్టి ఎండించి ఆ తరువాత నేలగుమ్ముడు సమూల రసము నందు నానబెట్టి ఆ తరువాత ఎండించిన శుద్ది అగును. ఆ తరువాత నల్ల ఉమ్మెత్తకు రసము నందు నానబెట్టి ఎండించి పుఠం పెట్టిన భస్మం అగును.


        ఈ గోమేధిక భస్మమును శ్లేష్మ, పైత్య రోగాలు , క్షయ , పాండువు వంటి రోగాల నివారణలో వాడతారు. అగ్నిదీప్తిని కలిగించి ఆహారాన్ని జీర్ణం చేయును . రుచికరంగా ఉండును. ఇంద్రియాలకు బుద్దిని , బలాన్ని ఇచ్చును.


         పైన చెప్పినటువంటి రత్నభస్మాలను అనుభవవైద్యుల పర్యవేక్షణలోనే తగినమోతాదులో వాడవలెను. స్వంత నిర్ణయాలు మంచివి కాదు.


  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 



 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

కలి దోష నివారణకు*

 🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

       *కలి దోష నివారణకు*

    *లలితా సహస్ర నామ స్తోత్ర*

              *పారాయణం.*

🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

*శ్రీవిద్యాం జగతాం ధాత్రీం*

*సర్గ స్థితి లయేశ్వరీమ్,*


*నమామి లలితాం నిత్యాం*

*మహా త్రిపుర సుందరీమ్.॥*


*బ్రహ్మాండ పురాణమున శ్రీవిష్ణు స్వరూపులైన హయగ్రీవులు లలితా దేవి యొక్క చరిత్రను అద్భుతముగా చెప్పి వున్నారు. శ్రీదేవి పుట్టుక, శ్రీపుర వర్ణన, శ్రీవిద్యా మంత్రముల విశిష్టత, అంతర్యాగ, బహిర్యాగ క్రమము, జప లక్షణము, హోమ ద్రవ్యములు, శ్రీచక్రము, శ్రీ విద్య, గురు శిష్యుల సంబంధము పలు స్తోత్రములు చెప్పివున్నారు.*


*లలితా దేవి యొక్క సహస్ర నామములు వినడానికి నాకు యోగ్యత లేదా మరి ఎందువలన నాకు సెలవియ్యలేదు, అని ఎన్నో సంవత్సరముల నుంచి ప్రాధేయపడుచున్న తపోధనుడైన అగస్త్యుడిని చూచి హయగ్రీవులు ఇలా అన్నారు..*


*లోపాముద్రకు పతివైన ఓ అగస్త్యా...*

*లలితా సహస్రనామములు అతి రహస్యాలు. (అంటే ఆషామాషిగా చెప్పబడేవి కావు), అతి శక్తిమంతమైనవి, భక్తిప్రపత్తులతో అడుగుతున్నందువలన నీకు ఉపదేశము చేస్తున్నాను. ఇవి శఠునికి, దుష్టుడికి, విశ్వాసహీనుడికి ఎప్పుడూ చెప్పకూడదు. శ్రీ మాతృ భక్తిలో పూర్ణ భక్తి గల వారికి, శ్రీవిద్య ఎరిగిన వారికి, శ్రీ దేవీ ఉపాసకులకు మాత్రమే యీ సహస్రనామములు చెప్పవలెను.*


*మంత్రములలో శ్రీవిద్య ఎలా ముఖ్యమైనదో, శ్రీవిద్యలలో ఎలా కాళీ విద్య ముఖ్యమో, పురములలో శ్రీపురం ఎలా ప్రధానమైనదో, శక్తులలో లలితాదేవి ఎలాగో, శ్రీవిద్యోపాసకులలో పరమ శివుడు ఎలా గొప్పవాడో, అలా సహస్రనామాలలో యీ లలితా సహస్రనామాలు బహు శ్రేష్టాలు. ఈ నామాలు పఠించటం చేత శ్రీ లలితాదేవి బహు ప్రీతి నొందును.* 


*శ్రీచక్ర రాజములో లలితా దేవిని బిల్వ దళాలతోగాని, పద్మాలతో గాని, తులసి పత్రములతో గాని, ఈ సహస్రానామాలతో ఎవడు పూజిస్తాడో అతడికి లలితా దేవి వెంటనే మేలు చేకూర్చును.*

*చక్రరాజమైన శ్రీచక్రమును పూజించి, పంచదశాక్షరీ మంత్రాన్ని జపించి, తరువాత ప్రతి దినము ఈ సహస్రానామాలతో కీర్తించవలెను. జప పూజాదులు నిర్వర్తించలేనప్పుడు కనీసం సహస్రనామ పారాయణం చేయాలి. ప్రతిదినము నిత్యకర్మల మాదిరి యీ లలితా సహస్రనామములు చేయవలెను. శ్రీలలితా దేవి ఆజ్ఞ చేత వశిన్యాది దేవతలు యీ లలితా సహస్రనామములను స్తోత్రము చేసిరి.*


*సకల రోగాలను పోగొట్టి..సకల సంపదలను..ఇచ్చేఈ స్తోత్రమునకు సమానమైన స్త్రోత్రము ఇంతవరకు లేదు. ఇది సమస్త అకాల మరణములను పోగొట్టి, అపమృత్యువుని దరి చేరనీయకుండా, సకల జ్వరాలను, రోగాలను శమింపజేసి, దీర్గాయుష్షును అందజేస్తుంది. పుత్ర భాగ్యం లేనివారికి పుత్రులను ఇస్తుంది.*


*ధర్మార్ధ కామ మోక్షాలనే నాలుగు పురుషార్ధములను చేకూరుస్తుంది.*


*లలితాదేవి పూజాతత్పరులు ప్రతిదినం ప్రయత్న పూర్వకముగా శ్రీవిద్యా జపము చేసి, శ్రీచక్రార్చన చేసి, ఈ నామములను చదువ వలెను.*


*గంగ మొదలైన నదులలో కోటి జన్మలు స్నాన మాచరిస్తే ఏ ఫలం కలుగుతుందో, కాశీ క్షేత్రంలో కోటి లింగాలను ప్రతిష్ట చేస్తే ఏ ఫలం కలుగుతుందో, కురుక్షేత్రములో సూర్య గ్రహణ సమయంలో కోటిమార్లు దానాలు చేస్తే ఏ ఫలం దక్కుతుందో, గంగా తీరంలో కోటి అశ్వమేధ యాగాలను చేస్తే ఏ ఫలం దక్కుతుందో.. అంతటి పుణ్యానికి కోటి రెట్లు అధిక పుణ్యము యీ సహస్ర నామాలలో ఒక్కటి పఠించినా కూడా లభిస్తుంది.*


*నిత్య కర్మలు చెయ్యకపోవటం చేత, నిషిద్ధ కర్మలు చెయ్యటం చేత కలిగే పాపాలు కూడా సమసిపోవటం నిశ్చయం. సమస్త పాపాలను పోగొట్టడంలో ఒక్క సహస్రానామానికి వుండే శక్తి ఎలాంటిది అంటే, ఈ పద్నాలుగు లోకాలలోని వారంతా కలిసి చేసే మొత్తం పాపాలు కూడా యీ సహస్రనామ శక్తికి తీసికట్టే. దాని శక్తికి మించినవి ఏ మాత్రం కావు.*


*ప్రతి రోజు చేయక పోయినా.. పుణ్య దినములలో.. తన భార్య, తన బిడ్డల జన్మ నక్షత్రము వచ్చే రోజులలో, అష్టమి, నవమి, చతుర్దశి, పౌర్ణమి, శుక్రవారములలో ముఖ్యముగా పఠించవలెను.*

       

*పౌర్ణమి నాడు చంద్రుడిలో లలితాదేవిని ధ్యానించి పంచోపచారముల చేత పూజ చేసి, సహస్ర నామములను పఠిస్తే సమస్త రోగములు పోయి, దీర్గాయుష్షు కలుగుతుంది. ఇది కామ్య ప్రయోగ విధి.*


*పిల్లలు లేని గొడ్రాలికి వెన్నను ఈ నామ పారాయణ చేత మంత్రించి ఇస్తే గ్రహ పీడలు తొలగి పుత్రులు కలుగుతారు.*


*ఈ సహస్ర నామ పారాయణుని పై ఎవరైనా అభిచారాది దుష్ట ప్రయోగములు చేస్తే, ప్రత్యంగిరా దేవి ఆ ప్రయోగములను తిరుగ గొట్టి, ఆ ప్రయోక్తలను సంహరిస్తుంది.*


*శ్రీదేవీ ఉపాసకులను..ఎవరైనా దూషించినా..నిందించినా..అనరాని మాటలు అనినా. . అగౌరవ పరచినా.. అవమాన పరచినా..క్రూర దృష్టితో చూచినా.. వాదించినా.. వాడి ధనమును దోచినా.. కృతఘ్నత చూపినా..వాడ్ని క్షేత్రపాలకుడు అయిన శివుడు చంపుతాడు. నకులేశ్వరి వాడి నాలుకను తెగకోయును.వాక్ స్థంభనము చేయును.*


*ఎవడు భక్తితో ఈ నామములను ఆరు నెలలు చేస్తాడో, అతడి యింట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును.*


*ఎవరు శ్రీవిద్యను ఉపాసన చేస్తారో..ఎవరు నిత్యం శ్రీచక్రాన్ని అర్చిస్తారో..ఎవరు యీ నామాలను కీర్తిస్తారో..* *వారికి దానం ప్రయత్న పూర్వకముగా ఇవ్వవలెను. దానం చెయ్యాలను కొనేవారు, పరీక్షించి శ్రీవిద్య తెలిసిన వారికే దానం చెయ్యవలెను.*


*లోక వాక్యాలకంటే విష్ణు సంకీర్తనం ముఖ్యం. అలాటి విష్ణు సహస్ర నామముల కంటే గొప్పది ఒక్క శివ నామము. శివ సహస్ర నామాలకన్నా దేవీ నామం ఒక్కటి ఎంతో మహిమ గలది.*


*దేవీ సహస్ర నామాలలో పది విధాలైన సహస్ర నామములు ప్రధానమైనవి.*


*అవి..*


*గంగ..భవాని..గాయత్రీ..కాళి.. లక్ష్మి… సరస్వతి..రాజ రాజేశ్వరి.. బాల..శ్యామల..లలిత..*


*వీటిలో లలితా సహస్ర నామములు అతి శ్రేష్ఠమైనవి.*


*అందు చేత కలి దోష నివారణ నిమిత్తం వీటిని నిత్యం పారాయణ విధిగా చేయవలెను..స్వస్తి..!!*


*శ్రీ మాత్రే నమః।*



🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

విష్ణు సహస్రనామ స్తోత్రము*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

 *విష్ణు సహస్రనామ స్తోత్రము*

           *రోజూ ఒక శ్లోకం*

*అర్థం, తాత్పర్యం, ఆడియోతో*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*శ్లోకం (69)*


*కాలనేమినిహా వీరః*

*శౌరిః శూరజనేశ్వరః ।*


*త్రిలోకాత్మా త్రిలోకేశః*

*కేశవః కేశిహా హరిః ॥* 


*ప్రతి పదార్థం:~*


*646) కాలనేమినిహా - కాల చక్రమునకు అంచు అయిన అవిద్యను (అజ్ఞానమును) విధ్వంసం చేసేవాడు; కాలనేమి యను రాక్షసుని సంహరించినవాడు.*


*647) వీరః : - సదా శౌర్య వంతుడు, విజయము పొందేవాడు; వీరత్వము గలవాడు.*


*648) శౌరిః : - శూరుని పుత్రుడు (వసుదేవుని మరొక పేరు శూరుడు)*


*649) శూరజనేస్వరః : - శూరులు అయినవారికి ప్రభువు; శూరులలో శ్రేష్ఠుడు.*


*650) త్రిలోకాత్మా - మూడు లోకములలోని సకలములకు అంతరాత్మ.;*


*651) త్రిలోకేశః : - మూడు లోకములకు ప్రభువు.*


*652) కేశవః : - సుందరమైన కేశములు కలవాడు;*


*653) కేశిహాః : - కేశి యనుడి రాక్షసుని చంపినవాడు.*


*654) హరిః : - పచ్చని శరీరచ్ఛాయ కలిగిన వాడు; తన భక్తుల దుఃఖమును హరించువాడు;*


*తాత్పర్యం :~*


*కాలనేమి యను రాక్షసుని సంహరించినవాడును, కాలాతీతుడును, మహావీరుడును, మహా వీర్యసంపన్నుడును, శూరుడను వాని వంశమున జన్మించినవాడును, మిక్కిలి శూరులగు వారందరికంటే ప్రసిద్ధుడును, మూడు లోకములకును ఆత్మయై యున్నవాడును, మూడు లోకములకును అధిపతియును, సుందరమగు కేశములతో భాసిల్లువాడును, కేశి యను దుష్టరాక్షసుని సంహరించిన వాడును, సంసార భయమును హరించువాడును అగు శ్రీమన్నారాయణుడికి శిరస్సు వంచి వందనం మొనర్చుచున్నాను*


*పాఠకులందరికీ శుభం కలుగు గాక ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

       ‌ *సూచన*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*జ్యేష్ట నక్షత్రం 1వ పాదం జాతకులు పై 69వ శ్లోకమును, నిత్యం కనీసం 11 పర్యాయములు పఠించడం ద్వారా వారు మంచి ఫలితాలు పొందగలరు.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఓం నమో నారాయణాయ!*

*ఓం నమః శివాయ!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

 *జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

*పదవిభాగం, తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*దేవతలు పాలసముద్రాన్ని మథించి, చంద్రుణ్ణి, కల్పవృక్షము, కామధేనువు, చింతామణులనూ,అమృతాన్నీ, లక్ష్మినీ పొందిన విధంగా, పండితులు వేద సముద్రాన్ని మథించి, కల్పవృక్ష, కామధేను, చింతామణీ సముడయిన సోమేశ్వరుని పొందుతున్నారని శంకరులు చెప్పారు.*


*శ్లోకం : 37*      


*ఆమ్నాయాంబుధి మాదరేణ సుమనస్సంఘా స్సముద్యన్మనో*

              

*మంథానం దృఢభక్తి రజ్జు సహితం కృత్వా మధిత్వా తతః,*

              

*సోమం కల్పతరుం సుపర్వ సురభిం చింతామణిం ధీమతాం*

              

*నిత్యానంద సుధాం నిరంతర రమా సౌభాగ్య మాతన్వతే !!*


*పదవిభాగం:~*


*ఆమ్నాయాంబుధిమ్ _ ఆదరేణ _ సుమనస్సంఘాః _ సముద్యన్మనః _ మంథానం _ దృఢ భక్తి రజ్జు సహితం _ కృత్వా _ మథిత్వా _ థః _ సోమం కల్పతరుం _ సుపర్వసురభిం _ చింతామణిం _ ధీమతాం _ నిత్యానంద సుధాం _ నిరంతర రమా సౌభాగ్యమ్_ ఆతన్వతే.*


*తాత్పర్యము:~*


*దేవతలు అందరునూ, మంథరగిరిని కవ్వముగాజేసి , వాసుకిని తరిత్రాడుగా నమర్చి, సముద్రాన్ని మథించి, కల్పవృక్షమును, కామధేనువునూ, చింతామణినీ, అమృతాన్నీ, లక్ష్మినీ సంపాదించినట్లు, విద్వాంసులందరూ తమ మనస్సును కవ్వముగా చేసి, భక్తి అనే త్రాడును గట్టి, వేదములనే సముద్రాన్ని మధించి ఆ వేదసముద్రం నుండీ భక్తిశాలురకు కల్పవృక్ష, కామధేను, చింతామణి సముడునూ, నిత్యానంద స్వరూపుడునూ, మోక్ష లక్ష్మీ స్వరూపుడునూ, అయిన ఉమా సహితుడైన పరమేశ్వరుని పొందుతున్నారు.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(69వ రోజు)*

   *(క్రితం భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

          *యయాతి చరిత్ర*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*దేవయాని కోరిక మేరకు ఆమెను యయాతికి ఇచ్చి వివాహం చేశాడు శుక్రాచార్యుడు. అత్తారింటికి శర్మిష్ఠ, చెలికత్తెలతో సహా చేరుకుంది దేవయాని. అయితే శర్మిష్ఠ అందాన్ని చూస్తే ఆమెను యయాతి కావాలనుకుంటాడని గ్రహించి, శర్మిష్ఠను భర్త కన్నెత్తి చూడరాదనీ, పన్నెత్తి పలకరించరాదనీ ఒట్టు పెట్టింది దేవయాని. కట్టుబడ్డాడు యయాతి.*


*అంతఃపురంలో శర్మిష్ఠకు ప్రత్యేక మందిరాన్ని నిర్మించి, అందులో ఆమె ఉండేందుకు ఏర్పాట్లు చేశాడు. రోజు రోజుకీ దేవయానికీ, శర్మిష్ఠకీ స్పర్థలు ఏర్పడి, పంతాలు పెరిగిపోయాయి. రాకుమార్తె అయిన తాను, గురుపుత్రిక దేవయానికి దాసిగా ఉండడాన్ని శర్మిష్ఠ భరించలేకపోయింది. తన యౌవనం, చక్కదనం వ్యర్థమవుతున్నందుకు కుమిలిపోసాగింది. ఒకనాడు ఋతుస్నాతయై చక్కగా అలంకరించుకుని, ఏకాంతంగా ఉంది శర్మిష్ఠ. అప్పుడామెకు యయాతి కనిపించాడు. అతన్ని అడ్డుకున్నదామె. తన మనోవాంఛ తెలియజేసింది. పత్నిగా చేపట్టి, సంతానాన్ని ప్రసాదించమని వేడుకున్నదామె. వనిత తనంత తానుగా వలచి వచ్చినప్పుడు కాదనకూడదు. అది ధర్మం కూడా కాదు. ఆ కారణంగా శర్మిష్ఠ కోరికను తీర్చాడు యయాతి. ఫలితంగా ఆమె గర్భవతి అయింది. శర్మిష్ఠ గర్భవతి అని తెలిసి భగ్గున మండిపడింది దేవయాని. ఒట్టు తీసి గట్టు మీద పెట్టిన యయాతిని అసహ్యించుకుంది. అతనిపై కోపగించుకుంది. అలిగి పుట్టింటికి చేరుకుంది. జరిగిందంతా తండ్రి శుక్రాచార్యునికి చెప్పుకుని బాధపడింది.*


*దేవయానిని సమీపించాడు యయాతి. ఇంటికి రమ్మని ఎన్నో విధాల పార్థించాడు.*


*అనేక విధాల నచ్చజెప్పజూశాడు. లాభం లేకపోయింది. తన కుమార్తెకు తీరని అన్యాయం చేశావంటూ యయాతిపై అంత ఎత్తున లేచాడు శుక్రాచార్యుడు.‘‘కాముకుడివై, శర్మిష్ఠను కూడి నా కుమార్తెకు తీరని బాధ కలిగించావు. ఇందుకు ఫలితంగా నీకు దుర్భరమయిన ముసలితనం ప్రాప్తించుగాక.’’ అని శపించాడు. శుక్రాచార్యుని శాపానికి తిరుగులేదు. అనుభవించక తప్పదు అనుకుంటూ శాపవిమోచనను ప్రసాదించమన్నాడు యయాతి.‘*


*‘నీ వార్ధక్యాన్ని ఎవరికయినా ఇచ్చి, వారి యౌవనాన్ని స్వీకరించవచ్చు. ఇదొక్కటే నీకు మార్గం.’’ అన్నాడు శుక్రాచార్యుడు. ముదిమితో వజావజా వణికిపోసాగాడు యయాతి. అప్పటికే అతను తండ్రి. దేవయాని వలన అతనికి యదు, తుర్వసు అని ఇద్దరు కుమారులు జన్మించారు. శర్మిష్ఠ వలన ద్రుహ్యుడు, అనుడు, పూరుడు అను ముగ్గురు కుమారులు జన్మించారు. ముసలితనం ప్రాప్తించినా యయాతికి స్త్రీ వ్యామోహం పోలేదు. యౌవనాన్ని కోరుకున్నాడతను. కొడుకులను పిలిచాడు. వార్ధక్యాన్ని స్వీకరించి, వారిలో ఎవరయినా తనకి యౌవనాన్ని ప్రసాదించడంటూ కోరాడు. పెద్దవాళ్ళు ఎవరూ తండ్రి కోరికను మన్నించలేదు. అందరిలోకి చిన్నవాడు, ఆఖరివాడు శర్మిష్ఠ కొడుకు పూరుడు, తండ్రి కోరికను అంగీకరించాడు. తండ్రిని సంతోషపరచడమే విధిగా భావించాడు. తన యౌవనాన్ని యయాతికి ఇచ్చి, అతని వార్ధక్యాన్ని తాను స్వీకరించాడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

శుక్రవారం🌹* *🪷07, మార్చి, 2025🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*

       *🌹శుక్రవారం🌹*

*🪷07, మార్చి, 2025🪷*     

    *దృగ్గణిత పంచాంగం*                 


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిరఋతౌః*

*ఫాల్గుణ మాసం - శుక్లపక్షం*


*తిథి : అష్టమి* ఉ 09.18 వరకు ఉపరి *నవమి*

*వారం    : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం : మృగశిర* రా 11.32 వరకు ఉపరి *ఆరుద్ర*


*యోగం  : ప్రీతి* సా 06.15 వరకు ఉపరి *ఆయుష్మాన్*

*కరణం : బవ* ఉ 09.18 *బాలువ* రా 08.43 ఉపరి *కౌలువ*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.30 - 10.30 సా 05.00 - 06.00*

అమృత కాలం : *మ 02.56 - 04.30*

అభిజిత్ కాలం  : *ప 11.55 - 12.42*


*వర్జ్యం : శేషం ఉ 07.07 వరకు*

*దుర్ముహూర్తం : ఉ 08.44 - 09.32 మ 12.42 - 01.30*

*రాహు కాలం : ఉ 10.49 - 12.18*

గుళికకాళం : *ఉ 07.50 - 09.20*

యమగండం : *మ 03.17 - 04.46*

సూర్యరాశి : *కుంభం*

చంద్రరాశి : *వృషభం/మిధునం*

సూర్యోదయం :*ఉ 06.21* 

సూర్యాస్తమయం :*సా 06.16*


*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :  *ఉ 06.23 - 08.45*

సంగవ కాలం         :      *08.45 - 11.07*

మధ్యాహ్న కాలం  :      *11.07 - 01.30*

అపరాహ్న కాలం   : *మ 01.30 - 03.53*


*ఆబ్ధికం తిధి        : ఫాల్గుణ శుద్ధ నవమి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.16*

ప్రదోష కాలం         :  *సా 06.16 - 08.41*

రాత్రి కాలం : *రా 08.41 - 11.54*

నిశీధి కాలం          :*రా 11.54 - 12.42*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.44 - 05.32*

________________________________

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


   *🪷శ్రీ లక్ష్మీదేవి కవచం🪷*


*రోమరాజి కలా చారు భుగ్న నాభి తలోదరీమ్*

*పట్టవస్త్ర సముద్భాసి సునితంబాది లక్షణాం*


*🪷ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః🪷*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹