7, మార్చి 2025, శుక్రవారం

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

 *జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

*పదవిభాగం, తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*దేవతలు పాలసముద్రాన్ని మథించి, చంద్రుణ్ణి, కల్పవృక్షము, కామధేనువు, చింతామణులనూ,అమృతాన్నీ, లక్ష్మినీ పొందిన విధంగా, పండితులు వేద సముద్రాన్ని మథించి, కల్పవృక్ష, కామధేను, చింతామణీ సముడయిన సోమేశ్వరుని పొందుతున్నారని శంకరులు చెప్పారు.*


*శ్లోకం : 37*      


*ఆమ్నాయాంబుధి మాదరేణ సుమనస్సంఘా స్సముద్యన్మనో*

              

*మంథానం దృఢభక్తి రజ్జు సహితం కృత్వా మధిత్వా తతః,*

              

*సోమం కల్పతరుం సుపర్వ సురభిం చింతామణిం ధీమతాం*

              

*నిత్యానంద సుధాం నిరంతర రమా సౌభాగ్య మాతన్వతే !!*


*పదవిభాగం:~*


*ఆమ్నాయాంబుధిమ్ _ ఆదరేణ _ సుమనస్సంఘాః _ సముద్యన్మనః _ మంథానం _ దృఢ భక్తి రజ్జు సహితం _ కృత్వా _ మథిత్వా _ థః _ సోమం కల్పతరుం _ సుపర్వసురభిం _ చింతామణిం _ ధీమతాం _ నిత్యానంద సుధాం _ నిరంతర రమా సౌభాగ్యమ్_ ఆతన్వతే.*


*తాత్పర్యము:~*


*దేవతలు అందరునూ, మంథరగిరిని కవ్వముగాజేసి , వాసుకిని తరిత్రాడుగా నమర్చి, సముద్రాన్ని మథించి, కల్పవృక్షమును, కామధేనువునూ, చింతామణినీ, అమృతాన్నీ, లక్ష్మినీ సంపాదించినట్లు, విద్వాంసులందరూ తమ మనస్సును కవ్వముగా చేసి, భక్తి అనే త్రాడును గట్టి, వేదములనే సముద్రాన్ని మధించి ఆ వేదసముద్రం నుండీ భక్తిశాలురకు కల్పవృక్ష, కామధేను, చింతామణి సముడునూ, నిత్యానంద స్వరూపుడునూ, మోక్ష లక్ష్మీ స్వరూపుడునూ, అయిన ఉమా సహితుడైన పరమేశ్వరుని పొందుతున్నారు.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

కామెంట్‌లు లేవు: