04-03-2025
శంకరాభరణం వారి సమస్య-
*పుష్పంబందున రెండు పుష్పములవే పుట్టెన్ మనోజ్ఞమ్ములై*
శా.
పుష్పంబే కద నాతిమోము శ్రీపుష్పంబుగాఁ దోచెనే
పుష్పంబౌ వదనారవిందమున సంపూర్ణత్వమే తోచగా
పుష్పాలై చెలినేత్రముల్ మెరయ సంబోధించిరే సత్కవుల్
*పుష్పంబందున రెండు పుష్పములవే పుట్టెన్ మనోజ్ఞమ్ములై*
(మరియొక ప్రయత్నము)
ఆ.
సుదతి వదనమదియె సుందర కమలమ్ము
కనులు జూడ రెండు గలువపూలు
ముగ్ధముఖము కనగ ముచ్చటలొలుకుచు
పువ్వులోన రెండు పూవులమరె
అరుణా చయనం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి