31, ఆగస్టు 2023, గురువారం

స్కూళ్ల నిర్వాకం

 స్కూళ్ల నిర్వాకం...                                     

ఒక ప్రైవేట్ స్కూల్ కి DEO lnspection ki వెళ్లి, 

ఒక పిల్లాడిని లేపి అడిగారు


DEO: శివ ధనుస్సు విరిచినది ఎవరు ప్రశ్నించారు?


స్టూడెంట్: సార్...నేను కాదు అని ఏడుస్తూ బదులిచ్చాడు.


అది విని DEO క్లాస్ టీచర్ ని కోపంగా ఏంటి ఇది అని అడిగారు.


క్లాస్ టీచర్ : "చ..చ వీడు అలాంటి వాడు కాదు సర్.... నాకు వీడి గురించి బాగా తెలుసు" అని బదులిచ్చాడు.


కోపంతో DEO, HM ని పిలిపించి.. శివ ధనుస్సు విరిచింది ఎవరు అని అడిగితే పిల్లలకి తెలియకపోతే కనీసం క్లాస్ టీచర్ కి అయినా తెలియాలి కదా..అని అన్నారు.


వెంటనే HM: సార్ ఈ క్లాసు పిల్లలు అలాంటి వారు కాదు..6 వ క్లాస్ పిల్లలు చేసి ఉండవచ్చు.... అని అన్నారు.


కోపంతో DEO: స్కూల్ బంద్ చేయండి అని ఆర్డర్ వేసారు.


HM: వెంటనే స్కూల్ కరస్పాండెంట్ ని పిలిపించాడు.


కరస్పాండెంట్: సార్...స్కూల్ మూసేయకండి..కావాలంటే విల్లు ఖరీదు ఎంతైనా నేను ఇస్తాను....అని అన్నాడు.


కోపంతో DEO....విద్యా శాఖ మంత్రి దగ్గరికి వెళ్లి జరిగింది మొర పెట్టుకున్నాడు....


విద్యా శాఖ మంత్రి: ఏయ్.. ఏయ్ పిల్లలు అన్న తర్వాత అల్లరి చేస్తారు, ఏమైనా విరగకొడతారు. అయినా తెలిసి కూడా అక్కడ విల్లుని ఎందుకు వదిలేశారు అని అన్నారు....


DEO...తల పట్టుకుని CM దగ్గరికి వెళ్ళాడు..


CM: దీని గురించి నాకు తెలియదు.ఊరికే నేను ఏమీ చెప్పను..ఇదంతా ప్రతిపక్ష పార్టీల వాళ్ళు చేస్తున్న కుట్ర.... 


విల్లును ఎవరూ విరగ్గొట్టలేదు.... 

ఒకవేళ విరగ్గొడితే దీని పైన CBI enquiry  వేయిస్తాం. 

దీని వెనుక ఎంత పెద్ద వారు ఉన్నా సరే వదలం.

చట్టం ముందు దోషిగా నిలబెడతాం అని చెప్పారు.


DEO గారిని ఎర్రగడ్డ ఆసుపత్రిలో జాయిన్ చేశారు......😃   ఇది మన   చదువుల పరిస్థితి దుస్థితి  

🤣🤣🤣🤣🤣🤣


 ఒక్కరే నువ్వు కోకండి పక్క వారికి కూడా పంపండి.

అనురాగాలకు ప్రతీక కావాలని

 *మనసు పెట్టి ఆలోచించండీ...!* 


*మనం ముస్లింకి వ్యతిరేకం కాదు.. క్రైస్తవానికి వ్యతిరేకం కాదు... వాళ్లంతా వాళ్ల వాళ్ల ఆచారానికి , కట్టుబాట్లకు , సాంప్రదాయాలకీ కట్టుబడి జీవిస్తున్నారు..!* 


*ఒక ముస్లిం మన కోసం హలాల్ చేయని మాంసం తినడు, ఒక క్రిస్టియన్ హిందు దేవతల ప్రసాదం తినడు, బొట్టు పేట్టుకోడు...! అది వాళ్ల ఆచారం సాంప్రదాయం అని గట్టిగా నమ్ముతాడు.  ఇప్పుడు ఆలోచించండి మరి మనమెందుకు మన ధర్మాన్నీ మరిచి హలాల్ తింటాం, చర్చీకీ వెళతాం ఎందుకు? మనలా వాళ్లు ఆలోచించడం లేదెందుకు మనసు పేట్టి ఆలోచించండి..!*  


*వాళ్లకు పార్టీలతో సంబంధం లేదు , వర్గాలతో సంబంధం లేదు వాళ్ల ఆచారం మాత్రమే వాళ్లకు ముఖ్యం. మరి మన ఆచారాలకు సెక్యులర్ భావాలెందుకు మనసు పెట్టి ఆలోచించండీ...!* 


*మనలో కొంతమంది అందరం సమానమే వాళ్లను ఇలా అలా ఎందుకు అనాలి అంటుంటారు. సరే వాళ్లను మనం అనే హక్కు మనకు లేదు , కాని వాళ్లలా మనమెందుకు బతకాలో బతికేవాళ్లను అనకుండా ఎలా ఉండాలో  కాస్త మనసు పెట్టి ఆలోచించండీ...!* 


*ఒక్క ముస్లిం మన స్నేహితుడైతే ఆ స్నేహితుని కోసం మనం హలాల్ చేసి వాళ్లతో పాటే మనం తింటాం. మరి మనం వేల మంది ఉన్నారని ఏ   ఒక్క ముస్లిం అయినా మనతో కలిసి హలాల్ లేని మాంసం మనతో కలిసి తినగలుగుతున్నాడా..? లేదే మరెందుకు మనం హలాల్ చేయడం కాస్త మనసు పెట్టి ఆలోచించండీ...!* 


*ప్రతీ ఆదివారం చర్చికీ వేళ్లి ప్రార్థనలు చేసే క్రిష్టియన్ చెప్పే మాటలు పాటలు వాళ్లతో కలిసి పాడుకుంటాం ఆడుకుంటాం. అదే ఒక క్రిష్టియన్ మన గుడికి వచ్చీ మనతో భజన చేయగలడా..? లేదే! ఎందుకంటే పండగరోజు అయినా మనం మన గుడికి పోకుండా సెక్యూలరిజం అని గప్పాలు కొడుతున్నాం. సాంప్రదాయం పాటించేది వాళ్లా మనమా? కాస్త మనసు పెట్టి ఆలొచించండీ..!* 


*మనకు పార్టీలు ముఖ్యం, మనకు మన సాంప్రదాయాలు వద్దు. పక్కొడు మన దగ్గరికొచ్చి వాడి భావాలను రుద్దుతుంటే కనీసం వాళ్లను చూసైనా నేను వాళ్లలా నా ఆచారాలను పాటిస్తా అన్న సోయి కూడా లేని సన్నాసులం , దరిద్రులం... అవును కదా కాస్త మనసు పెట్టి ఆలోచించండీ...!* 


*మనం ఎవరికీ వ్యతిరేకం కాదు. వాళ్లను అనే హక్కు లేదు . వాళ్లు వాళ్ల మతం చెప్పినట్టు పాటిస్తున్నారు ఆచరిస్తున్నారు.  మరి మనం సిగ్గు శరం వదిలేసి సెక్యులర్ అని చెప్పి పీరీలు మోస్తాం, మసీదులకు వేళ్తాం, ప్రార్థనలు చేస్తాం, చర్చీలకు వెళ్తాం...  ఎందుకు ఈ సెక్యూలర్ కాస్త మనసు పెట్టి ఆలోచించండీ..!* 


*ఈ దేశంలో వాళ్లు వాళ్లలా బ్రతుకుతున్నప్పుడు మనం మనలా బ్రతుకుదాం. కొజ్జాల్లా అటు ఇటు కాకుండా బ్రతకడం ఎందుకు? నీవు నీ రాజకీయ పార్టీని ప్రేమించు , నీ కులాన్ని ప్రేమించు తప్పులేదు. కాని హిందువుగా జీవించు...* *హిందువుగా మరణించు...* 

*అనే భావాన్ని ప్రేమించు...!* 

*కాస్త మనసు పెట్టి ఆలోచించండీ అంతా అర్థమవుతుందీ...!* 


*రాఖీ పండగ ఆర్థికం కాకూడదు , అనురాగాలకు ప్రతీక కావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ... నేనిస్తున్న రాఖీ సందేశం ఇది...కాస్త మనసు పెట్టి ఆలోచించండీ...!* 


       *ఎం.ఎస్ లిరిక్స్*

శతకములు సంబంధ 23 పుస్తకాలు(PDF

 *శతకములు సంబంధ 23 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

వేమన శతకము www.freegurukul.org/g/Shathakam-1


కాళహస్తీశ్వర శతకము www.freegurukul.org/g/Shathakam-2


సుమతి శతకం www.freegurukul.org/g/Shathakam-3


కుమార శతకము www.freegurukul.org/g/Shathakam-4


కుమారి శతకం www.freegurukul.org/g/Shathakam-5


దాశరధి శతకము www.freegurukul.org/g/Shathakam-6


భర్త్రుహరి సుభాషితము www.freegurukul.org/g/Shathakam-7


వేమన శతకము www.freegurukul.org/g/Shathakam-8


భాస్కర శతకం www.freegurukul.org/g/Shathakam-9


పుణ్య గానము www.freegurukul.org/g/Shathakam-10


భర్త్రుహరి సుభాషితము www.freegurukul.org/g/Shathakam-11


శతక త్రయము www.freegurukul.org/g/Shathakam-12


శతకాల్లో రత్నాలు www.freegurukul.org/g/Shathakam-13


దాశరథి శతకము-కంచెర్ల గోపన్న-రామదాసు www.freegurukul.org/g/Shathakam-14


కృష్ణ శతకం www.freegurukul.org/g/Shathakam-15


దశావతారను శతకము www.freegurukul.org/g/Shathakam-16


కృష్ణ శతకం www.freegurukul.org/g/Shathakam-17


కలివర్తన దర్పణం www.freegurukul.org/g/Shathakam-18


ఆంధ్ర నాయక శతకం www.freegurukul.org/g/Shathakam-19


మదాంద్ర నాయక శతకము www.freegurukul.org/g/Shathakam-20


మారుతి శతకం www.freegurukul.org/g/Shathakam-21


మూక పంచశతి కటాక్ష శతకం www.freegurukul.org/g/Shathakam-22


నరసింహ శతకము www.freegurukul.org/g/Shathakam-23


ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను  ప్రతి రోజు పొందుటకు:

Telegram Channel లో join అగుటకు  https://t.me/freegurukul

Whatsapp Group లో join అగుటకు  www.freegurukul.org/join

Panchang

 


A


 

మన సంస్కృతి

 డాక్టర్ రాధా కుసుమ 

శీర్షిక -మన సంస్కృతి


విజ్ఞాన మణిరత్నాలు

సందర్భ సౌగంధాలు

హృదయ నవోత్సవాలు

మనస్సుద్ది నిధులు

తేనియ మధుర మందస్మితాలు

మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు...!


మహాలక్ష్మి వ్రతమైనా

రాఖీ పౌర్ణమైనా

హొళీ ఉత్సవమైనా

అమ్మవారి జాతర లైనా

సమాజ శ్రేయస్సు కోసం

భావితరాలకు ఆదర్శమై

అనురాగాల వర్షితమై

జనుల సహకార సౌగంధమై

నిరంతర గంగాప్రవాహిణిలా

సాగిపోయే దే కదా

మన ఆచారాల వైభవాలు..!


స్వచ్ఛమైన మనసుతో

సుగంధ సుమధుర పారిజాత పుష్పాలై

ఆనంద శుభ కోయిల రావాలై

ఈర్ష్యా ద్వేషాలకు అతీతంగా

మంచితనపు వ్రత కమ్మదనపు

కథల్లో

నీతిని గ్రహించి

జీవించాలని

తెలిపేదే జీవన శైలి విధానాలే

మన పండుగలు...


హరిత చందనాల చేరువలో

ప్రకృతి రమణీయత కాపాడాలని

సోదర సోదరీ అనుబంధాల

సంతోషపు విరుల ఆనందం

సమాజమంతా పొందాలని

నేస్తాల గృహసీమలు

అనురాగాల శోభితమై

సుఖసంతోషాలు చేకూరాలని

కాంక్షిస్తూ

మీ అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలంటున్నది

మీ రాధా కుసుమం 🌹

శృంగేరీలో తోరణ-గణపతి

 





శృంగేరీలో తోరణ-గణపతి

400 సంవత్సరాల క్రితం మఠం మరియు దాని దేవాలయాలు & ఆస్తులు అధికారం కోసం పోరాడుతూ పొరుగు ప్రాంతాలలోని చిరు పెద్దల దాడికి గురయ్యే ప్రమాదంలో ఉన్నప్పుడు, అప్పటి జగద్గురు శంకరాచార్య, శ్రీ నృసింహ భారతి (IV) ఆలోచనలో పడ్డారు. ధ్యానంలో ఉన్నప్పుడు, తనకు దగ్గలో ఉన్న దేవుని ప్రార్థించమని సూచించిన స్వరం ఆయనకి వినిపించింది. వెతుకుతూ, జగద్గురువు తన తలపైన గుమ్మంలో (అక్షరాలా "తోరణ"పై) శ్రీ మహాగణపతి రూపాన్ని కనుగొన్నారు. అనుష్టానములను పూర్తి చేసి, గణేశుడిని పూజించి, జగద్గురువులు సభకు ప్రసాదాలు పంపిణీ చేశారు. గణేశుడి ఆశీస్సులతో జరగబోయే ప్రమాదం తప్పింది. అప్పటి నుంచి శృంగేరి శారదా పీఠంలోని జగద్గురువులు తోరణ గణపతికి పూజలు చేస్తున్నారు.

శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి మహాస్వామీజీ కాలంలో శృంగేరి శారదా పీఠంలోని జగద్గురువులు తుంగనది ఉత్తర తీరంలో ఉండేవారు. ఆ నివాసంలో ఒకానొక గుమ్మం పై ఈ గణగతిని కనుగొన్నారు. ప్రస్తుత కాలంలో జగద్గురువుల మకాం తుంగనది దక్షిణ తీరంలో ‘గురునివాస్’కి మారింది. పూర్వం ఆ గణపతి ఉన్న గుమ్మం స్థానంలో గ్రానైట్ తో ‘తోరణ-గణపతి’ ఆలయం నిర్మించడం జరిగింది.

ఈ చరిత్రను ఆధారం చేసుకొని భక్తులు తమకు సమస్యలు వచ్చినపుడు, పెద్ద పెద్ద కార్యాలు నిర్విఘ్నంగా నిర్హించడానికి ఈ గుడికొచ్చి మొక్కుకుంటుంటాారు. మ్రుక్కులను 108 మొదకాలు లేదా 108 టెంకాయలు సమర్పించి తీర్చుకొంటూవుంటారు.




ఈ విషయాలకు మూలం:



Sri Torana GanapatiHistory and description of the Shrine of Sri Torana Ganapati at Sringeri


https://sringeri.net/temples/sri-torana-ganapati

శృంగేరీలో స్తంభగణపతి

శృంగేరీ పట్టణం మధ్యలో ఒక గుట్ట (కన్నడంలో బెట్ట) వుంది. దానిపై ఋష్యశృంగుని తండ్రియైన విభాండక మహాముని తపస్సుచేశాడని చెబుతారు. ఆ స్థలంలో మల్లిఖాార్జునస్వామి (కన్నడంలో మలహానికరేశ్వరస్వామి అంటారు) ఆలయం వుంది. ఈ ఆలయంలో, శ్రీ అభినవ నరసింహ భారతి (1599 - 1622: శంకరాచార్య పరంపరలో 24వ ఆచార్యడు), గణేశుడి చిత్రం లేకపోవడాన్ని గమనించి, స్తంభాలలో ఒకదానిపై పసుపు కొమ్ముతో వినాయకుని బొమ్మను గీసి పూజించారట. అప్పటి నుండి, గణేశుడి రూపురేఖలు క్రమంగా ఉబ్బెత్తుగా పొంగాయట (ఒక బేస్ రిలీఫ్‌ మాదిరిగా). ఇప్పుడు స్తంభంలో ఆ వినాయకుడి వెనుక ఉన్న గ్రానైట్ రాయి లోపల గుల్లబారి బోలుగా ఉంది. మిగిలిన స్తంభ భాగం మాత్రం బలంగానే (solid) ఉంది. దీనినే స్తంభ గణపతి (కన్నడంలో కంబద గణపతి) అంటారు.


ఈ విషయాలకు మూలం:



Sri Sthambha Ganapati - Sri Sringeri Sharada PeethamSthambha Ganapati वन्दारुजनमन्दारं इन्दुचूडतनूभवम् । सिन्दूर बन्धूरमुखं वन्दे स्तम्बेरमाननम् ॥ It is in this temple that, Sri Ahinava Narasimha Bharati(1599 – 1622) 24th Acharya, noticed the absence of any Ganesha image, drew a figure of Ganesha with a piece of turmeric on one of the front pillars and worshipped it. Ever since, the outlines of […]


https://sringeri.net/temples/sri-malahanikareshwara/sri-sthambha-ganapati

Saapaatu


 

సంప్రదాయ పచ్చళ్ళు*

 *SP PICKLES*

*సంప్రదాయ పచ్చళ్ళు*


*బ్రాహ్మణ సంప్రదాయ పద్దిలో బ్రాహ్మణ మహిళలతో తయారుచేయబడిన పచ్చళ్ళు*


**మాదగ్గర తయారు చేసిన అన్ని పచ్చళ్ళు పొడులు సంప్రయం పద్దతిలో కలర్స్ ప్రిసర్వేటివ్స్ లేకుండా క్వాలిటీ పదార్ధాలతో తయారుచేస్తాము**


*పచ్చళ్ళు*:  *1kg cost*


చింతకాయ తొక్కు450/-

ఉసిరి తొక్కు450/-

ఉప్పు గోంగూర  550/-

పులిహోర గోంగూర 750/-

పండుమిర్చి గోంగూర 650/-

పండుమిర్చి 550/-

ఉసిరికాయ 550/-

దబ్బకాయ 550/-

నిమ్మకాయ 550/-

ఆవకాయ(వెల్లుల్లి/లేకుండా) 600/-

బెల్లం ఆవకాయ 600/-

పెసర ఆవకాయ   600/-

మెంతి ఆవకాయ  600/-

నువ్వు ఆవకాయ 600/-

కాలి్ఫ్లవర్ ఆవకాయ 600/-

పనసపోట్టు ఆవకాయ 750/-

పచ్చఆవకాయ  850/-

దోసవకాయ. 600/-

మాగాయ  600/-

*వంకాయ నిల్వ పచ్చడి* 750/-

అల్లం పచ్చడి  650/-

మామిడి అల్లం పచ్చడి 650/-

టొమోటో పచ్చడి 550/-

మునక్కాయ టమోటా 650/-

*పచ్చిమిరప ఆవకాయ* 600/-


*పొడులు* :   *1kg cost*


కంది పొడి 550/

నువ్వులపొడి 500/-

ధనియాల పొడి 500/-

పప్పులపొడి 500/-

కరివేపాకు కారప్పొడి 550/-

అవిశగింజల పొడి 600/-

కొబ్బరి పొడి  550/-

రసం పొడి 500-

సాంబారు పొడి 650/-

నల్లకారం 600/-

పుదీనా కారపోదడి 750/-

మునగాకుపోడి 2000/-

మునగాకు కారపోడి 650/-


*వడియాలు* & *అప్పడాలు*: 


సగ్గుబియ్యం వడియాలు  1kg - 500/-

పెసర అప్పడాలు       650/-

మినప అప్పడాలు 650/-

మిర్చి   850/- *soldout*

గుమ్మడి వొడియలు 850/-

మినపిండి వోడియలు   600/-

*బుడందోసకాయ వొరుగు* 850/-

*మామిడి వొరుగు* 850/-


*మాదగ్గర ఇంకా*


 *చిట్టెంటాపోటు* *పాల ఇంగువ* * లభించును*


*మేము అన్నిరకాల పచ్చళ్ళు పొడులు AS బ్రాండ్ పప్పునూనెతో మాత్రమే తయారు చేస్తాము*


*అన్ని ప్రదేశాలకు కొరియర్ సౌకర్యం కలదు* *చార్జీలు అదనం*

 


*అందరికీ నమస్కారం.  మీరు దేశ విదేశాలలో ఎక్కడున్నా, మేము మీకు సహకరించగలము. మేము ఆహార పదార్థాలు (స్వీట్లు, ఖారా, పొడులు, పచ్చళ్ళు, చలిమిడి) స్వయంగా శుచి, శుభ్రతతో తయారు చేసి ఇయ్యగలము. మీ ఇంట్లో జరిగే ఏ శుభకార్యక్రమానికైనా మేము కావలసిన సరంజామా, మీ బడ్జెట్ ప్రకారం చీరలు, ధోవతులు, లుంగీలు, తువ్వాళ్ళు, జాకెట్టు బట్టలు, కర్చీఫ్లు, రిటర్న్ గిఫ్టులు పసుపు కుంకుమ పాకెట్లు, ఇట్లా మీకు కావాల్సిన ప్రతీది మీ సమయం ఆదా చేస్తూ, మీ ఇంటి దగ్గరకే ఏర్పాటు ఔతాయి. మీరు ఏ వయస్సు వారైనా మీకు పూజకైనా, పెళ్ళికైనా లేదా వ్రతాలకైనా అన్నీ ఏర్పాటు చేయబడతాయి. మీరు మమ్మల్ని సంప్రదించండి *


*దయచేసిమీకుతెలిసిన

బ్రాహ్మణ గ్రూపులలో

ఈ మెసేజ్ ని పంపవలసినదిగా

కోరుకుంటునను*


*జలసూత్రం పల్లవి*

*విజయవాడ*

*సంప్రదించండి* : *7981370664**Gp number*

*08662533848*


*7382665848* Gp or Pp number

శ్రావణ" పౌర్ణమి

 ॐ       "శ్రావణ" పౌర్ణమి శుభాకాంక్షలు. 


🍀అశ్వముఖం కలిగిన దేవుని (హయగ్రీవుడు) "జయంతి"గా ఈ పౌర్ణమికి ప్రసిద్ధివుంది.

    సర్వవిద్యలకూ ఆధారభూతుడు ఈ స్వామి. 


    క్రింది శ్లోక పఠనం ప్రతినిత్యం చేసుకుంటూ ఉంటే, 

    శ్రీమహావిష్ణువే అయిన హయగ్రీవుని అనుగ్రహంతో, 

    విద్యాజ్ఞానంతోకూడిన ఆనందం లభిస్తుంది. 


శ్లో. జ్ఞానానందమయం దేవం 

                 నిర్మల స్ఫటికాకృతిం I 

      ఆధారం సర్వవిద్యానాం 

              హయగ్రీవముపాస్మహే ॥ 


      ఓం శ్రీ లక్ష్మీహయగ్రీవాయనమః 


🍀"జంధ్యాల" పౌర్ణమిగా పిలువబడే ఈ రోజున, ప్రతీ సంవత్సరం, పాత యజ్ఞోపవీతాన్ని తీసి, క్రొత్త దానిని ధరించడం, వేద సంస్కృతిని అనుసరించే వారికి ఆనవాయితీ. 


🍀నేడు ఎక్కువగా ప్రాచుర్యం పొందిన "రాఖీ" పౌర్ణమి కూడా ఈనాడే. 

      సోదరీమణులు తమ సోదరులకు, తమ రక్షణ బాధ్యతతోబాటు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా నిలవాలని కోరుతూ, రాఖీని కడుతుంటారు. 


🍀"నేను నీకురక్ష, నీవు నాకురక్ష. మనమిరువురం దేశానికి రక్ష" అంటూ రక్షాబంధనం ధరించే "రక్షికా" పౌర్ణమికూడా ఇదే. 

      పరస్పరం రక్షించుకుంటూ

ధర్మరక్షణ, సమాజ పరిరక్షణా బాధ్యతలను తెలియజేసే అంతరార్థం ఇందులో ఇమిడివుంది.  


                         =x=x=x=x 


  — రామాయణం శర్మ 

          భద్రాచలం

ఔషధపు సీసా*

 https://chat.whatsapp.com/EgYgApRKGYKGTpoNHBUTsH


*ఒక ఔషధపు  సీసా* 

                ➖➖➖✍️

*ఈ ప్రపంచాన్ని నడిపించేది ఎవరు?*


```

రాజస్థాన్‌ లో  ‘రమేష్ చంద్ర’ అనే దయగల   ఒక శ్రీకృష్ణుని  భక్తుడు ఉండేవాడు.


అతనికి ఒక మందుల దుకాణం ఉండేది.   షాపులో ఒక మూలన శ్రీకృష్ణుడి చిన్న చిత్రం ఉంది.ప్రతిరోజూ దుకాణం తెరిచిన తర్వాత,తన చేతులు కడుక్కొని, ఆ దేవుని బొమ్మను శుభ్రం చేసి, దీపం, ధూపం మొదలైన వాటిని చాలా భక్తితో వెలిగించేవాడు.


అతనికి రాకేష్ అనే కొడుకు కూడా ఉన్నాడు, తన చదువు పూర్తి చేసి తండ్రితో పాటు దుకాణంలో కూర్చునేవాడు. తన తండ్రి రోజూ ఇదంతా చేయడం చూస్తూ ఉంటాడు.


నవీన యుగంలో చదువుకున్న యువకుడు అవడంవల్ల తన తండ్రితో, దేవుడు అంటూ ఎవరూ లేరని, ఇదంతా మన మనస్సు యొక్క భ్రమ అని వివరించేవాడు.


సూర్యుడు తన రథంలో విశ్వం చుట్టూ తిరుగుతున్నాడని శాస్త్రాలు చెబుతున్నాయి,     భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని సైన్స్ రుజువు చేసిందని చెప్తూ.. ఇలా ప్రతి రోజూ సైన్స్‌ నుండి కొత్త ఉదాహరణలను ఇస్తూ,దేవుడు లేడని నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.


తండ్రి అతనిని ఆప్యాయంగా చూసి నవ్వేవాడు తప్ప ఈ అంశంపై వాదించడానికి లేదా చర్చించడానికి ఇష్టపడేవాడుకాదు.

 

కాలం గడిచేకొద్దీ తండ్రి వృద్ధుడయ్యాడు. ఇప్పుడు తన అంతం ఆసన్నమైందని బహుశా అతను తెలుసుకుని ఉంటాడు... అలా ఒకరోజు తన కొడుకుతో ఇలా అన్నాడు… “నాయనా,నువ్వు భగవంతుని నమ్మినా నమ్మకపోయినా, నువ్వు కష్టపడి పని చేస్తూ, దయతో, నిజాయితీగా ఉంటే చాలు. అయితే నేను చెప్పే ఈ ఒక్క మాట విని, పాటిస్తావా?”

 

కొడుకు.., “అలాగే నాన్నా, తప్పకుండా పాటిస్తాను”, అని అన్నాడు.


తండ్రి ఇలా చెప్పాడు, "నాయనా, నా మరణానంతరం, ప్రతిరోజూ దుకాణంలో ఉన్న దేవుని బొమ్మను శుభ్రం చెయ్యి; రెండవది, నువ్వు ఎప్పుడైనా ఏదైనా సమస్యలో ఇరుక్కుంటే, చేతులు జోడించి,    శ్రీకృష్ణునికి నీ సమస్యను చెప్పుకో. నేను చెప్పినట్లు ఈ ఒక్క పని చెయ్యి చాలు.”


కొడుకు ఒప్పుకున్నాడు.


కొన్ని రోజుల తర్వాత తండ్రి చనిపోయాడు, కాలం అలా గడిచిపోతూ ఉంది.


ఒక రోజు జోరున వర్షం కురుస్తోంది. రాకేష్  రోజంతా షాపులో కూర్చునే ఉన్నాడు, కస్టమర్లు కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఆపై కరెంటు కూడా ఇబ్బంది పెడుతోంది.


ఆ చీకటిలో అకస్మాత్తుగా వర్షంలో తడుస్తూ ఓ కుర్రాడు పరుగు పరుగున వచ్చి “అన్నా... ఈ మందు కావాలి... మా అమ్మకి చాలా జబ్బుగా ఉంది... వెంటనే ఈ మందు నాలుగు చెంచాలు  వేస్తేనే ... అమ్మ  బతుకుతుందని  డాక్టర్ చెప్పారు... నీ దగ్గర ఈ మందు ఉందా?” అని అడిగాడు.


రాకేష్ మందుచీటి చూసి వెంటనే “ఆ...నా దగ్గర ఉంది” అని వెంటనే ఆ చాకటిలోనే  తీసి ఇచ్చాడు.


బాలుడు చాలా సంతోషించి, వెంటనే మందుసీసాతో వెళ్ళిపోయాడు.

***************


అయితే ఇది ఏమిటి!!


అబ్బాయి వెళ్లిన కొద్దిసేపటికే రాకేష్ కౌంటర్ వైపు చూడగానే చెమటలు పట్టాయి... కొద్దిసేపటి క్రితం ఓ కస్టమర్ ఎలుకల మందు సీసా తిరిగి ఇచ్చేసి(రిటన్ చేసి)వెళ్ళాడు. లైట్లు వెలగకపోవడంతో లైట్లు వచ్చింతర్వాత దానిని సరైన స్థలంలో పెడదామని భావించి రాకేష్ కౌంటర్ పై సీసాను అలాగే వదిలేశాడు.  అయితే మందు కోసం వచ్చిన ఈ బాలుడు తన మందు సీసాకు బదులు ఎలుకల మందు సీసాను తీసుకెళ్ళాడు... ఆ బాలుడు నిరక్షరాస్యుడు కూడా.


“ఓరి భగవంతుడా!” అని రాకేష్ నోటి నుండి అసంకల్పితంగా ఆ మాటలు వెలువడ్డాయి, “ఏమిటి ఈ విపత్తు!” అనుకుని,   అప్పుడు తన తండ్రి మాటలు గుర్తుకొచ్చి, వెంటనే, ముకుళిత హస్తాలతో, బరువెక్కిన హృదయంతో శ్రీకృష్ణుని చిత్రపటం ముందు ప్రార్థించడం ప్రారంభించాడు…. "ఓ ప్రభూ! మీరు ఉన్నారని నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. మీరు నిజంగా ఉన్నట్లయితే, దయచేసి ఈ రోజు ఈ అవాంఛనీయ సంఘటన జరగనివ్వకండి. తన కొడుకు చేతిలో నుండి తల్లిని విషం త్రాగనివ్వకండి! ప్రభూ ఆ విషాన్ని త్రాగనివ్వకండి!!”

***********


"అన్నా!" అని అప్పుడే వెనుక నుంచి ఒక గొంతు వినిపించింది... 


"అన్నా, నేను బురదలో  జారిపోయాను, మందు సీసా కూడా పగిలిపోయింది! దయచేసి నాకు మరో సీసా ఇవ్వవా", అని అడిగాడు.


ప్రేమపూరితమైన చిరునవ్వుతో ఉన్న భగవంతుని చిత్రాన్ని చూస్తూండగా రాకేష్ ముఖంపై కన్నీళ్లు కారడం మొదలయ్యాయి!!!


ఆ రోజు, ఈ సమస్త విశ్వాన్ని నడిపేవారు ఎవరో ఉన్నారని అతనిలో ఒక విశ్వాసం మేల్కొంది..!         కొందరు ఆయన్ని భగవంతుడంటే,      మరికొందరు సర్వోన్నతుడు అంటారు, కొందరు సర్వవ్యాపి అని, మరికొందరు దైవిక శక్తి అని అంటారు!✍️


 ♾ ♾ ♾ ♾ ♾ ♾ ♾ ♾ 


ప్రేమ, భక్తితో నిండిన హృదయంతో చేసిన ప్రార్థన ఎప్పుడూ ఆలకించబడుతుంది✍️```

           *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

రాయల వర్ణనా వైభవము!

 శుభోదయం🙏


రాయల వర్ణనా వైభవము!


గోవర్ధనగిరిధారి మురారి!

   

ఆయత యుష్మదాకృతి కరాగ్ర నగాంచల వాంత వారి ధా

రాయుత చంద్రకాంత ఫలకావళి బింబితయై వెలుంగ నా

రాయణమూర్తిమ త్కవచ రత్నముచే బరిరక్ష గాంచె నా

నో యదువీర వృష్టి బసి యూరడ బ్రోవవె సప్త రాత్రముల్;

ఆముక్తమాల్యద-4-ఆ.వర్షావర్ణనము.


          యాదవులపైకోపించి దేవేంద్రుడు రాళ్ళవానగురియిమచుచుండ వారిని రక్షించుటకయి కన్నయ్య గోవర్ధన ధారియయ్యెను.

      యాదవులందరు సపరివారముగా

నాపర్వతఛత్రముక్రిందకుఁజేరి ప్రాణభయవిముక్తులైనారు.

        అదీ ఇక్కడిదృశ్యము.


కృష్ణా !!నీవుగోవర్ధనమెత్తిపట్టఁగా భయంకరమైన యావానకు జారిపడుతున్న చంద్రకాంతశిలాఖండములలోను, ఆవర్షధారలలోనూ,నీరూపే ప్రతిఫలింప,

నారాయణ కవచధారులై గోకుల సహితముగా సర్వులురక్షింపబడుచున్నారో ?యనునట్లున్నదయ్యా! ఆదృశ్యము!!

కన్నయ్యా!నీమహిమలనంతములు.అని,

         చక్కని యుత్ప్రేక్షతో నా గోవర్ధనగిరిధారి దృశ్యమున కూపిరులూదెను.

     అనిదంపూర్వమైన ఇట్టివర్ణనలు రాయలకు వెన్నతో బెట్టినవిద్య!

                                     స్వస్తి!🙏🙏🙏🙏🌷🌷🌷🙏🙏🌷🌷🌷🌷

భార్యభర్తలు ఆనందంగా గడపాలి.

 విడాకులు పొందటానికి మనదేశంలో 6 నెలల నుంచి 20 ఏళ్ల వరకూ పట్టొచ్చు.అమెరికాలో 2 ఏళ్లు, ఐరోపా దేశాల్లో 6 ఏళ్ల సమయం పడుతుంది.


ఎక్కడైనా

సవరించు

హిందూ మహి ళ ఎక్కడైనా విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని, ఇందుకు హిందూ వివాహ చట్టం అనుమతిస్తుందనీ మద్రాసు హైకోర్టు ప్రకటించింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్-19కి సవరణలు చేయడం ద్వారా భారత్‌లో ఉన్న మహిళ విదేశాల్లోని తన భర్త నుంచి విడాకులు కోరుతూ, తాను నివసిస్తున్న ప్రాంతానికి చెందిన కుటుంబ న్యాయస్థానంలోనే కేసు దాఖలు చేసుకోవచ్చు.


వైవాహిక జీవితం సజావుగా సాగాలంటే

సవరించు

భార్యా భర్తలకు ఒకరి పట్ల ఒకరు ప్రేమ, నమ్మకం, బాధ్యత కలిగియుండాలి.

సంసార జీవితంలో సంభోగం (సెక్స్) అనేది ముఖ్య భాగం. రోజుకి ఒక్కసారైనా శారీరకంగా కలవాలి.

భర్త సమకూర్చడంలోను, భార్య చక్కబెట్టడంలోను తప్పనిసరిగా బాధ్యత వహించాలి.

ఇద్దరూ కష్టపడేది పిల్లలకోసమే అని గ్రహించాలి.

భార్యా భర్తలు సాధ్యమైనంతవరకూ ఒకరిపై ఒకరు ఆధారపడాలి.

మితిమీరిన వ్యక్తిగత స్వేచ్ఛ ప్రమాదకరం అని గ్రహించాలి.

రోజులో ఎక్కవ సమయం భార్యభర్తలు కలిసి ఆనందంగా గడపాలి.

జీవితభాగస్వామి గురించి ఎవరు ఏం చెప్పినా నమ్మరాదు.

వైవాహిక జీవితంలోని విషయాలు, భర్త/భార్య యొక్క వ్యక్తిగత విషయాలు తల్లిదండ్రులతో గాని, ఇతరులతోగాని పంచుకోరాదు.

తప్పని పరిస్థితుల్లో దాంపత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను తెలివిగా పరిష్కరించగలవారితో మాత్రమే చర్చించాలి.

వివాహం ఆనేది స్త్రీ పురుషుల మధ్య విడరాని శాశ్వత బంధం అని భార్యా భర్తలు గుర్తించాలి.

Panchaag

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


గురువారం, ఆగష్టు 31, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

నిజ శ్రావణ మాసం - శుక్ల పక్షం

తిథి:పౌర్ణమి ఉ 8.03 వరకు తదుపరి బహుళ పాడ్యమి తె5.39వరకు

వారం:గురువారం (బృహస్పతివాసరే)

నక్షత్రం:శతభిషం రా8.22 

యోగం:సుకర్మ రా8.39 

కరణం:బవ ఉ8.03  తదుపరి బాలువ రా6.50 ఆ తదుపరి కౌలువ తె5.39

వర్జ్యం:ఉ.శే.వ.6.13వరకు మరల రా2.21 - 3.50

దుర్ముహూర్తము:ఉ9.56 - 10.45 & మ2.54 - 3.44

అమృతకాలం:మ1.40 - 3.09

రాహుకాలం:మ1.30 - 3.00

యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30

చంద్ర రాశి:  కుంభం

సూర్యోదయం:5.48

సూర్యాస్తమయం: 6.13


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి*

తప్పుడు ప్రచారమని

 లవ్ జిహాద్ - ఇది ఒక తప్పుడు ప్రచారమని, హిందూ ముస్లింలను వేరు చేసి కుట్ర అని,అమాయకులైమా ముస్లిం యువకులను ఉన్మాదులుగా చిత్రీకరించేందుకు కొంత మంది హిందుత్వ వాదులు చేస్తున్న కుట్ర అని అంటుంటారు.


అయితే అలంటి ప్రశ్నలనింటికీ ప్రత్యక్ష ఉదాహరణ,సమాధానాలు ఈ రెండు లవ్ జిహాద్ కేసులు


గత రెండు నెలల క్రితం నిజామాబాద్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో వివాహం కోసం దరఖాస్తు చేసుకున్న హిందూ అమ్మాయి సోని సోలంకి ,ముస్లిం అబ్బాయి అజిమ్ అస్లాం ల దరఖాస్తు ఫారం ఫోటో సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అయింది.


ఆ మొత్తం కథను వెతుకుతూ వెళ్లగా యావత్ సమాజం విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి, సోని అనే అమ్మాయి మహారాష్ట్ర నాగ్ పూర్ కు చెందినది, ఈ అస్లాం అనే అబ్బాయి హైదరాబాద్ కు చెందిన వాడు వీరిద్దరికీ నకిలీ చిరునామా తో నిజామాబాద్ లో పెళ్లి చేయాలని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఏర్పాట్లు చేశారు, ఒక 10 రోజుల నిరంతర వెతుకులాట,పోరాటం తర్వాత సోని అనే అమ్మాయి మనకి టచ్ లోకి రావడం వల్ల ఆ అమ్మాయికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఆ పెళ్లిని తానే స్వయంగా రద్దు చేసుకుంది.


ఈ సోని అనే అమ్మాయి ఎంతో ఉన్నత విద్యావంతురాలు,వైద్య వృత్తి లో చేరాల్సిన అమ్మాయి,మంచి ఆర్థికంగా స్థిరపడిన కిటుంబానికి చెందినది


ఈ అస్లాం అనే వాడు 10వ తరగతి కూడా పాస్ కాలేదు,కనీసం అడ్రస్ లేని వ్యక్తి కేవలం మాయ మాటల ద్వారా మాత్రమే ఆ అమ్మాయిని ప్రేమ లో దింపి పెళ్లి దాకా తీసుకొచ్చాడు.


ఇప్పుడు దాదాపు అలాంటిదే మరో లవ్ జిహాద్ కేసు కామారెడ్డి రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఉన్నట్టు మన దృష్టికి రాగానే వెంటనే కామారెడ్డి కి వెళ్లి అక్కడి రిజిస్ట్రార్ గారికి వినతిపత్రం ఇచ్చి, వెంటనే ఆ అమ్మాయి వివరాలు, కుటుంబం అంతా తెలుసుకుని చివరకు ఆ అమ్మాయికి కూడా వాస్తవాలు చెప్పి,కౌన్సెలింగ్ నిర్వహించిన కారణంగా ఈ కుట్ర నుంచి ఈ అమ్మాయి కూడా తనకు తానే బయటపడింది.


ఇది చాలా పకడ్బందీగా జరుగుతున్న కుట్ర అని చెప్పడానికి ఇంతకన్నా ఋజువులేం కావాలి.


దాదాపు 10సం రాలుగా నేను,నాతో పాటు నడుస్తున్న సోదరులు, కార్యకర్తల సహకారంతో నాశక్తి మేర నేను పోరాడుతూనే వున్నాను,కానీ మా దృష్టి కి రాకుండా ఇంకెన్నో కుట్రలు జరుగుతున్నాయి, అందుకే అందరం జాగ్ర వహిద్దాం

ఇట్టి కార్యక్రమంలో పటేల్ ప్రసాద్ ,బంటు ప్రవీణ్ ,సుధాకర్, రవి, నరేష్ సాయి కిరణ్, చైతన్య, రాహుల్, ధీరజ్, రవి, తరుణ్, వంశీ, తదితరులు పాల్గొన్నారు

                            మీ 

                   పటేల్ ప్రసాద్ 

                        ఇందూర్

పంచాంగం 31.08.2023 Thursday,

 ఈ రోజు పంచాంగం 31.08.2023 Thursday,

 

స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు నిజ శ్రావణ మాస శుక్ల పక్ష: పౌర్ణమి తదుపరి ప్రతిపత్తి తిధి భృహస్పతి వాసర: శతభిషం నక్షత్రం సుకర్మ యోగ: బవ తదుపరి బాలవ తదుపరి కౌలవ కరణం ఇది ఈరోజు పంచాంగం. 


పౌర్ణమి ఉదయం 07:05 వరకు తదుపరి పాడ్యమి రాత్రి 03:19 వరకు.

శతభిషం సాయంత్రం 05:46 వరకు.

సూర్యోదయం : 06:05

సూర్యాస్తమయం : 06:27

వర్జ్యం : రాత్రి 11:25 నుండి 12:50 వరకు.

దుర్ముహూర్తం: పగలు 10:12 నుండి 11:02 వరకు తిరిగి మధ్యాహ్నం 03:09 నుండి 03:59 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం : ఉదయం 07:30 నుండి 09:30 వరకు.  

 


శుభోదయ:, నమస్కార: