6, ఆగస్టు 2025, బుధవారం

కథ

 



♥️ *కథ*-*181*♥️



మీరు ఎప్పుడైనా భగవంతుని చూశారా? చూడటానికి ఆయన ఎలా ఉంటాడు? ఆయన ఉనికిని అనుభూతి చెందడానికి మనకు ఏమి అవసరమో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?



 *ప్రార్థన* *యొక్క* *శక్తి*



 ఒక వృద్ధురాలు కూరగాయల దుకాణానికి వెళ్ళింది. కానీ కొనడానికి ఆమె వద్ద డబ్బు లేదు. కూరగాయలు అప్పుగా ఇవ్వమని దుకాణదారుని అభ్యర్థించింది, కానీ దుకాణదారుడు నిరాకరించాడు. ఆమె పదే పదే అడుగగా, దుకాణదారుడు "నీ వద్ద ఏదైనా విలువైన వస్తువు ఉంటే, ఈ త్రాసుపై ఉంచు. దాని బరువుకు సమానమైన కూరగాయలు ఇస్తాను", అని చెప్పాడు.


 వృద్ధురాలు కాసేపు ఆలోచించింది. ఆమె వద్ద అలాంటిదేమీ లేదు. కాసేపు ఆలోచించిన తర్వాత, ఒక కాగితం తీసి, దానిపై ఏదో రాసి, త్రాసుకి ఒక వైపు ఉంచింది.


 అది చూసి దుకాణదారుడు నవ్వడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ, కొన్ని కూరగాయలను తీసి, త్రాసులోని ఒక తక్కెడలో పెట్టి ఆశ్చర్యపోయాడు! కారణం, కాగితం ఉన్న తక్కెడ దిగువకు, కూరగాయల తక్కెడ పైకి కదిలింది. అప్పుడు అతను మరిన్ని కూరగాయలను వేసాడు, కాని కాగితం ఉన్న తక్కెడ పైకి రాలేదు. ఇప్పుడు దుకాణదారుడు మరికొన్ని కూరగాయలను ఉంచాడు, కాని కాగితం ఉన్న తక్కెడ మాత్రం ఇప్పటికీ క్రిందకే ఉంది.


ఎన్ని కూరగాయలు వేసినా, కాగితం ఉన్న తక్కెడ పైకి లేవకపోవడంతో, దుకాణదారుడు విసుగు చెంది, కాగితం తీసుకుని దాని మీద ఏమి వ్రాసిఉందో చదివాడు.


 కాగితంలో ఇలా రాసి ఉంది,

 *" ఓ భగవంతుడా, నన్ను చూసుకునే బాధ్యత నీదే, ఇప్పుడు ప్రతిదీ మీ చేతుల్లోనే ఉంది."* 


ఇది చదివి దుకాణదారుడు చాలా ఆశ్చర్యపోయి, తన కళ్లను తానే నమ్మలేక ఆ కాగితాన్ని మళ్లీ మళ్లీ చదివాడు. కానీ ఏమీ అర్థం కాలేదు, ఏమీ మాట్లాడకుండా కూరగాయలు వృద్ధురాలికి ఇచ్చాడు.


 అక్కడే నిలబడి ఇదంతా చూస్తున్న మరొక వ్యక్తి, "ఆశ్చర్యపోవద్దు ! ఆ ముసలావిడ ఈ కాగితంపై హృదయపూర్వకంగా ప్రార్థన వ్రాసింది, ప్రార్థన విలువ ఆ భగవంతునికి మాత్రమే తెలుసు" అని దుకాణదారునికి వివరించాడు.


 మనం భగవంతుని ప్రార్థించాలి, మన జీవితంలో ఆయన ఉనికిని అనుభవించడంలో సహాయం చేయమని ఆయనను అభ్యర్థించాలి.

ఒక గంటైనా, నిమిషం అయినా సరే, ప్రార్థన హృదయపూర్వకంగా చేస్తే, భగవంతుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ కథలో కూరగాయల అమ్ముకునేవాడు, కొంటున్న వృద్ధురాలి ప్రార్థన రూపంలో భగవంతుని ఉనికిని అనుభవించాడు.


 మనం భగవంతుని ప్రత్యక్షంగా చూడలేం, కానీ చాలా సూక్ష్మ ప్రకంపనల ద్వారా ఆయన ఉనికిని అనుభూతి చెందగలం. ఆయన మాట వినడానికి మనం మౌనం పాటించాలి... 

ఎందుకంటే భగవంతుని భాష నిశ్శబ్దం, అది దానికి అదే సంపూర్ణమైనది.


నిజానికి, మనం చేసే ప్రతి పనిలో భగవంతుడిని భాగస్వామిగా చేసుకోవాలి. మనం ఆయన గురించి ఆలోచించినప్పుడు, మన సమస్యలపై మన దృక్పథం కూడా మారడం మొదలవుతుంది.



                          ♾️



 ప్రేమ, భక్తితో నిండిన హృదయంతో చేసిన ప్రార్థన ఎప్పుడూ వృధా కాదు. 🌼

 

*బాబూజీ*







 హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌



HFN Story team

పోతన గారి సరస్వతి

 🙏పోతన గారి సరస్వతి ప్రార్ధన🙏

ఈ పద్యం చదివితే సరస్వతి కటాక్షం తప్పక కలుగుతుంది.

 క్షోణితలంబునన్ నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత

శ్రోణికిఁ, జంచరీక చయ సుందరవేణికి, రక్షితామర

శ్రేణికిఁ, దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్,

వాణికి. నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్.

ణి అక్షరం అనేక పర్యాయాలు ఆవృత్తి అయింది.ఇది ఒక అద్భుతం.ణ అంటే మంత్రశాస్త్రం లో జ్ఞానం అని అర్ధం. జ్ఞాన ప్రదాయిని కాబట్టి ణి ఆవృత్తి చేశారు.

 క్షోణితలంబునన్ = నేలకు; నుదురు = లలాటము; సోఁకఁగన్ = ఆనేలా; మ్రొక్కి = నమస్కరించి; నుతింతున్ = స్తుతిస్తాను; సైకత = ఇసక తిన్నెల లాంటి; శ్రోణి = పిరుదులు గలామె; కిన్ = కు; చంచరీక = తుమ్మెదల; చయ = గుంపు లాంటి; సుందర = అందమైన; వేణి = జుట్టు గలామె; కిన్ = కు; రక్షిత = రక్షింప బడే; అమర = దేవతల; శ్రేణి = సమూహము గలామె; కిన్ = కి; తోయజాతభవ = నీటిలో పుట్టిన (పద్మం) దానిలో పుట్టిన వాని (బ్రహ్మ) యొక్క; చిత్త = మనసును; వశీకరణ = వశీకరించు కోగల; ఏక = అసహాయ శూర; వాణి = వాక్కు గలామె; కిన్ = కి; వాణి = సరస్వతీదేవి; కిన్ = కి; అక్ష = స్పటికముల; దామ = మాల; శుక = రామ చిలుక; వారిజ = తామర పువ్వు; పుస్తక = పుస్తకము; రమ్య = అందంగా; పాణి = చేత ధరించి నామె; కిన్ = కి.

భావము:- నేలకు నెన్నుదురు తాకేలా సాగిలపడి మ్రొక్కి, సైకత శ్రోణీ, చదువులవాణీ, అలినీలవేణీ ఐన వాణిని సన్నుతిస్తాను. సుధలు వర్షించే సుందర సుకుమార సూక్తులతో అరవిందభవుని అంతరంగాన్ని ఆకర్షించే సౌందర్యరాశిని; కటాక్ష వీక్షణాలతో సుర నికరాన్ని కనికరించే కరుణామయిని; ఒక చేతిలో అక్షమాల, ఇంకో చేతిలో రాచిలుక, వేరొక చేతిలో తామర పువ్వు, మరో చేతిలో పుస్తకం ముచ్చటగా ధరించే ఆ తల్లిని సదా సంస్తుతిస్తాను.


పోతనామాత్యుల యొక్క సరస్వతీ భక్తిని ఎంత కొనియాడినా తక్కువే,ఎప్పుడు ఆయన సరస్వతీ స్తుతి చేసినా అమోఘం అద్భుతం అనితర సాధ్యం అన్నట్టు ఉంటాయి పద్యాలు.ఆ పద్యాలు చదువుకున్నప్పుడల్లా ఆ పద్యాల లో ఉండే భక్తిభావం, వారు చేసిన అమ్మవారి దర్శనం ఎటూ నావంటి అల్పునకు అసంభవం కానీ , కనీసం వాటి గురించి మట్లాడడానికి కైనా నాకున్న అర్హత ఏమిటి అనిపిస్తుంది ? మహాత్ములు , మహాభక్తులైన వారి భక్తికి ప్రణమిల్లి వారుచూపిన బాటలో వెళ్ళే ప్రయత్నం మనం చేయాలి .

 

సరే ఇహ ఈ పద్యం యొక్క భావానికి వద్దాం.

 అసలు ప్రారంభం చేస్తూనే “నా నుదురు నేలకి తాకించి నమస్కరిస్తున్నాను” అంటూ ప్రారంభంచేసారు పోతనామాత్యులు.ఎవరికి చేస్తున్నారయ్యా అటువంటి నమస్కారం ? అంటే,ఆయనే చెప్తున్నారు , నల్లని అందమైన శిరోజములు కలిగి,అక్షమాల(రుద్రాక్షమాల),చిలుక,పద్మము మరియు పుస్తకములను చేతుల యందు ధరించు తల్లికి , వాణికి ,దేవతలను రక్షించు తల్లికి,చతుర్ముఖ బ్రహ్మగారి హృదయేశ్వరికి ,సరస్వతీ దేవికి నా నుదురు నేలకి తాటించి సాష్టాంగ నమస్కారము చేస్తున్నాను అంటూ చెప్పుకొని పొంగిపోయాడు ఆ మహానుభావుడు.

మధుర భాగవత మహాకావ్యకర్త బమ్మెర పోతనామాత్య కృత సరస్వతీ దేవిస్తవం ఇది. చదువుల తల్లిని కావ్యారంభాన స్మరించాడు. నమస్కార స్మరణలో ఎన్ని విశేషాలో!

(ఇక్కడ పాఠాతరం ఉన్నది అందుకే పద్యం మళ్ళీ వ్రాశాను)

క్షోణితలంబు నెన్నుదురు సోకగమ్రొక్కి నుతింతు సైకత

శ్రొణికి జంచరీకచయసుందరవేణికి రక్షితామర

శ్రేణికి దోయజాతభవచిత్తవశీకరణైక వాణికిన్

వాణికి నక్షదామశుకవారిజ పుస్తకరమ్యపాణికిన్


నెన్నుదురు సోక అంటే నిండైన నుదురు భూమికి తాకించి మొక్కుతానన్నాడు. ఇది సాష్టాంగ నమస్కారం. కరచరణ యుగము నురము నొసలు, భుజములు, ధరణి సోక మొక్కగ లేదా!” అని అష్ట అంగములను త్యాగరాజస్వామి నమస్కార సమయాన భూమికి తాకించాలన్న సంప్రదాయం జ్ఞప్తిచేసాడు. సైకత శ్రోణి మరొక విశేషణం. ఇసుక తిన్నెల వంటి పిరుదులని. విశాల జఘనములని. ఇది విజ్ఞాన సంకేతం. విజ్ఞానం విశాలం, గోపనీయం, ఎంత ఎరిగినా ఒదిగి ఉండటం గోపనీయత. చంచరీక చయ అనగా తుమ్మెద సమూహం వంటి అందమైన కురులు కలది. తుమ్మెదలు పువ్వు పువ్వుకు తిరిగి మకరందం సాధించినట్టు జ్ఞానతృష్ణతో గ్రంథాలు శోధించమని సంకేతం. శిరోజాలు తలలోని విజ్ఞానానికి పుట్టిన ఆలోచనలకు సంకేతం. స్థూలదృష్టిలో స్త్రీ సౌందర్యం. సూక్ష్మదృష్టికి విజ్ఞాన సంకేతాలవి.


రక్షిత + అనత శ్రేణికి = వినయంతో ఒదిగి ఉండి చదివే విద్యార్థినీ విద్యార్థి సమూహానికి రక్షకురాలు. తోయజాత భవ చిత్తునకు వశీకరణ చేయగల ఏకవాణి. అనగా వశీకరణ చేయగల ఏకైక వాక్కు కలదని, తన వాక్యాలతో బ్రహ్మను వశం చేసుకోగలదని. బ్రహ్మను అనగా భగవంతుని వశం చేసుకోవడం వాక్కుకుసాధ్యం కాదు కదా! “యతో వాచో నివర్త్యంతే అప్రాప్య మనసాసహ” (వాక్కు, మనస్సు భగవంతుని, బ్రహ్మమును, పొందలేక తిరిగి వచ్చాయి) అని కదా ఉషనిషత్సూక్తి! కాని ఇక్కడ విజ్ఞానరూపిదేవిని మనం వశం చేసికొంటే బ్రహ్మ వశమవుతాడని. అంటే అర్థమవుతాడని, పొందగలమని అంతరార్థం. వాక్కుతో సభ వశీకరణమవుతుంది కదా! సమాజం వశమవుతుంది కదా!


వాణికి అంటే సరస్వతీదేవికి వాగ్రూపియైన దేవతకని సంకేతార్థమే.


అక్షదామం (స్ఫటిక జపమాల), శుక = చిలుక, వారిజ = పద్మం, పుస్తక = గ్రంథం చేతిలో గల రమ్యపాణి = అందమైన చేతులు కలది, లేదా పై వాటిని పట్టుకోవడంతో చేతులు అందమైనాయని, ‘పుస్తకం హస్త భూషణం” అని ఆర్యోక్తి కదా!


అమ్మ చతుర్భుజి. నాలుగు చేతులు నాలుగు ఋగ్యజుస్సామా ధర్వణాలు. తల్లివేద స్వరూపిణి. వేదస్థాపిత బ్రహ్మమును అర్థం చేసికొనే విద్యాధిదేవత అని సంకేతం. ఒకచేత పుస్తకం. ఇది ధర్మానికి సంకేతం. ధర్మానికి గ్రంథాలుగా ఉంటాయి. పూర్వవుజులు ఆచరించిన, నిశ్చయించిన, లిఖించినట్టివి. శుకం మరోచేత ఇది కామానికి సంకేతం. సౌందర్యవతి


స్త్రీ శుకరూపం. శుకం మన్మథవాహనం. భోగానికి గుర్తు. వారిజం మరోచేత. ఇది అర్థ సంకేతం. లక్ష్మీదేవి వారిజభవ. అక్షదామం (స్ఫటిక) శుద్ధమోక్షానికి సంకేతం. మోక్షార్థులు జపనిష్టులు. జపనం, భగవన్నామాధ్యానైక చిత్తానికి సోపానం, జపగణనకు అక్షమాల. ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు దేవి సంకేతరూపం. ఉపాసనా రూపం.

ఆ అర్థాలే పద్యం నిండా పరచుకొన్నాయి. పోతన్నవాణి సుమధుర, అష్ట ‘ణ’ కారయుత శోభిత అనుప్రాస ప్రియకవిత

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

ప్రతి స్మృతి*

 *ప్రతి స్మృతి*


ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వంలో ఒకనాడు వ్యాసులవారు ధర్మరాజు వద్దకు వచ్చి వారికి *ప్రతిస్మృతి* విద్యను నేర్పించారని, దానిని అర్జునునికి తెలియపరిస్తే వారికి దివ్య అస్త్రాలు సాధించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 


ఆశ్చర్యకరంగా, వ్యాసుల వారు ప్రతిస్మృతి శాస్త్రం గురించి ఏమీ వెల్లడించలేదు, అది అర్జునుడి కోరికను నిజం చేసుకోవడానికి సహాయపడుతుందని మాత్రమే చెప్పారు. ఇంతకు మించి ఆ సందర్భంలో ఎటువంటి వివరాలు కానరాదు. 


నేను స్వయాన అనుకోవడం *ప్రతిస్మృతి* అంటే ఒక వ్యక్తి గతంలో తెలుసుకున్న లేదా అనుభవించిన విషయాలను మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడం లేదా జ్ఞాపకం చేసుకోవడం, ఆ జ్ఞాపకశక్తిని ఉపయోగించడం. మహాభారతంలో, ప్రతిస్మృతి అనేది ఒక ప్రత్యేకమైన జ్ఞానమని, దీని ద్వారా అర్జునుడు తన గత అనుభవాలు, జ్ఞానాన్ని ఉపయోగించి దేవుళ్ళను మెప్పించడానికి ప్రయత్నించాడని విదితమవుతుంది. ఇది మన అవగాహనే కాని వ్యాసులవారు ప్రతి స్మృతి గురించిన మరిన్ని వివరాలు ఇచ్చినట్టు మహాభారతంలో ఎక్కడా పేర్కొనబడలేదు.


ధర్మరాజు వ్యాసులవారు చెప్పినట్టే దాన్ని అర్జునుడికే బోధించారు. అర్జునుడు ప్రతిస్మృతి సహాయంతో హిమాలయాలలో తపస్సు కోసం బయలుదేరి, కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడని, ఆ సమయంలో అతను శివుడి నుండి అంతిమ 'పాశుపత' అస్త్రాన్ని, మిగిలిన దేవతల నుండి దివ్యాయుధాలను పొందాడని మనందరికి తెలిసిన విషయమే. 


ఇక్కడ నా సందేహం ఏంటంటే ప్రతిస్మృతి ఏంటన్న విషయాన్ని పక్కన ఉంచినా (ఎవరికైనా ఈ వివరాలు తెలిస్తే ఇంకా గొప్ప విషయమే), వ్యాసులవారు ఆ విద్యను నేరుగా అర్జునునికే ఉపదేశించవచ్చును కదా, మధ్యన ధర్మరాజుకు చెప్పడం దేనికి? ఏవైనా protocol పాటించాలన్న అవసరం ఉన్నదా, లేదే మరి. ఇంకెందుకు అలా జరిగిందని. 


ఏదైనా సూక్ష్మమైన ఉపపత్తి (కారణం) కలదా, మరోటి, ఏవైనా కొత్త ప్రయోగం గురించి ప్రస్తావిస్తున్నప్పుడు దాని వివరాలను ముందుగా చర్చించాలి కదా, వాటిని మరుగున పెట్టాల్సిన అవసరం ఏంటి, సంస్కృత మూలంలో ఈ విషయాన్ని ఎలా తెలియబరిచారో మరి.

జీవిత సత్యం*

 🙏 *


        🤘 *జీవిత సత్యం*👌


         మిమ్మల్ని బలవంతుల్ని చేసే ప్రతీ ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతీ ఆలోచననూ తిరస్కరించండి.


 🏹 *నిత్య సత్యం* 🏑


        ఎవరు మన కోసం ఎదురు చూస్తారో వాళ్ళ కోసం బతకాలి. ఎవరు మన కోసం ఏడుస్తారో వాళ్ళని నవ్వించాలి. ఎవరు మన కోసం ఆలోచిస్తారో వాళ్ళని ప్రేమించాలి..

మహాకవి బమ్మెర పోతనామాత్య*

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🪷బుధవారం 6 ఆగస్టు 2025🪷*

                     2️⃣3️⃣

                 *ప్రతిరోజూ*

*మహాకవి బమ్మెర పోతనామాత్య*


   *శ్రీమద్భాగవత కథలు*```


(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```


*వేదాలు వేయి సార్లు చదివినా లభ్యం కాని ముక్తి, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది..!*``


          *చతుర్థ స్కంధం*

               

```

శ్రీ మహాభాగవతం అనే ఈ మహా పురాణాన్ని సహజ పాండిత్యుడు, బమ్మెర పోతనామాత్యుడు రచించాడు. చతుర్థ స్కంధాన్ని డాక్టర్ బి వెంకటేశ్వర్లు గారు అనువదించారు. చతుర్థ స్కంధంలో మైత్రేయుడు విదురుడికి స్వాయంభువ మనుపుత్రికల వంశ క్రమాన్ని తెలపడం దగ్గరనుంచి, నారదుడు ఉపదేశంతో ప్రచేతసులు ముక్తి పొందడం వరకు 30 అంశాలున్నాయి. క్లుప్తంగా ఆ 30 అంశాల వివరాలు వివరంగా:


మైత్రేయుడు విదురుడికి స్వాయంభువ మనుపుత్రికల వంశ క్రమాన్ని తెలపడం, స్వాయంభువ మనువుకు ఆకూతి, దేవహూతి, ప్రసూతి, ప్రియ్యవతుడు, ఉత్తానపాదుడు అనేవాళ్లు జన్మించడం, వాళ్ళలో ఆకూతిని 'రుచి' అనే ప్రజాపతికి ఇచ్చి వివాహం చేయడం, ఆ రుచి ప్రజాపతికి ఆకూతి గర్భంలో విష్ణుమూర్తి అంశతో యజ్ఞుడు జన్మించడం, లక్ష్మి అంశతో 'దక్షిణ' అనే కన్య కలగడం, మనువు కుమార్తె దేవహూతిని కర్దముడికి ఇవ్వడం, ప్రసూతిని దక్షప్రజాపతికి ఇవ్వడం, దక్షప్రజాపతి సంతతి, ప్రసూతి-దక్షుల వల్ల ప్రజాపరంపరలు కలగడం, కర్ణమప్రజాపతి సంతతి, కర్ణమ ప్రజాపతి తన పుత్రికలను క్షత్రియులకు, బ్రహ్మర్షులకు ఇవ్వడం, కర్దముడి కూతురైన కళ వల్ల మరీచికి కశ్యపుడు అనే కొడుకు, పూర్ణిమ అనే కూతురు పుట్టడం పూర్ణిమకు గంగ అనే కూతురు, విరజుడు అనే కొడుకు కలగడం ఉన్నాయి.


ఇంకా: కశ్యప ప్రజాపతి వల్ల కలిగిన ప్రజా పరంపరల చేత మూడు లోకాలు నిండి పోవడం, అత్రి మహాముని తపస్సు, ఆయనకు త్రిమూర్తులు ప్రత్యక్షం కావడం, అనసూయాదేవి పాతివ్రత్య మహాత్మ్యం వల్ల ఆమెకు త్రిమూర్తుల అంశతో చంద్రుడు, దత్తాత్రేయుడు దుర్వాసుడు జన్మించడం, దక్షుడి కుమార్తెల జననం, భృగువుకు ఖ్యాతికి శ్రీమహాలక్ష్మి జన్మించడం, సత్రయాగంలో దక్షుడు శివుడిని నిందించడం ఉన్నాయి.


ఇంకా: ఈశ్వరుడికి-దక్షప్రజాపతికి విరోధం కలగడం, దక్షప్రజాపతి యజ్ఞం చేసేటప్పుడు దాక్షాయణి అక్కడికి వెళ్లడం, శివుడు వీరభద్రుడి ద్వారా దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయించడం, అక్కడ నుండి పరాజితులైన దేవతలు బ్రహ్మకు విన్నవించడం, బ్రహ్మాదులు దక్షిణామూర్తి రూపుడైన ఈశ్వరుడుని స్తుతించడం, ఈశ్వరుడు దక్షుడుని అనుగ్రహించడం, దక్షాదులు విష్ణువును స్తుతించడం, సతీదేవి హిమవంతుడికి జన్మించి శివుడిని చేరడం. ఉత్తానపాదుడి వృత్తాంతం ఉన్నాయి.


ఇంకా: ధ్రువోపాఖ్యానం, ధ్రువుడు నారదుడి ఉపదేశాన్ని గైకొని తపస్సు చేయడం, సాక్షాత్కరించిన భగవంతుడిని ధ్రువుడు స్తుతించడం, శ్రీహరి అతడి మనోరధాన్ని నెరవేర్చడం, ధ్రువుడు మళ్లీ తన పురానికి రావడం, ధ్రువుడు కుబేరుడి అనుచరులైన గుహ్యకులతో యుద్ధం చేయడం, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ రాజ్యభోగాల పట్ల విరక్తి పొంది ఉల్యుడికి పట్టాభిషేకం చేసి ధ్రువుడు అంతరిక్షంలో నిలవడం, ఉల్కలుడు వత్సారుడు అనే కొడుకుకు పట్టం కట్టి హరిణి చేరడం, వత్సరుడి వంశపరంపర, అంగపుత్రుడు వేనుడి చరిత్ర, అర్చి పృథుల జననం, పృథు చక్రవర్తి గోరూపంలో ఉన్న భూమి నుండి ఓషధులను పితకడం, పృథు చక్రవర్తి అశ్వమేధం చేస్తుండగా ఇంద్రుడు అశ్వాన్ని అపహరించడం, ఆయనకు శ్రీహరి ప్రత్యక్షం కావడం, ఆధ్యాత్మ విద్యను ప్రభోదించడం ఉన్నాయి.


ఇవికాకుండా: నారాయణుడు ప్రసన్నుడై పృథు చక్రవర్తిని అనుగ్రహించడం, పృథు చక్రవర్తి సభాసదులకు సధర్మాలను ఉపదేశించడం, పృథు చక్రవర్తి దగ్గరకు సనకాదులు రావడం, పృథు చక్రవర్తి జ్ఞాన వైరాగ్యవంతుడై ముక్తిని పొందడం, రుద్రుడు ప్రచేతనులకు యోగాదేశం అనే స్తోత్రం చెప్పడం, రుద్రగీత-రుద్రుడు శ్రీహరిని స్తుతించడం, నారదుడు ప్రాచీనబర్తికి జ్ఞానమార్గాన్ని తెలియచేయడం, పురంజనోపాఖ్యానం, ప్రచేతసుల తపస్సుకు భగవంతుడు మెచ్చి వరాలివ్వడం, ప్రచేతసులకు మారిష వల్ల దక్షుడు జన్మించడం, నారదుడి ఉపదేశంతో ప్రచేతసులకు ముక్తి కలగడం ఈ చతుర్థ స్కంధంలో ఉన్నాయి.


ఇవన్నీ చదవగలగడం పూర్వజన్మ సుకృతం.


                  *(సశేషం)*

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*


          *రచన:శ్రీ వనం* 

  *జ్వాలా నరసింహారావు*

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷``


 *🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

బుధవారం🌷* *🪷06 ఆగస్టు 2025🪷*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🌷బుధవారం🌷*

   *🪷06 ఆగస్టు 2025🪷*   

     *దృగ్గణిత పంచాంగం*                


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షఋతౌః* 

*శ్రావణమాసం - శుక్లపక్షం*


*తిథి  : ద్వాదశి* మ 02.08 వరకు ఉపరి *త్రయోదశి*

*వారం    : బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం   : మూల* మ 01.00 వరకు ఉపరి *పూర్వాషాఢ*

*యోగం : వైధృతి* ఉ 07.18 వరకు ఉపరి విష్కుంబ 

*కరణం  : బాలువ* మ 02.08 *కౌలువ* రా 02.22 ఉపరి *తైతుల*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.00 - 10.00 సా 04.00 - 05.00*    

అమృత కాలం  : *ఉ 06.10 - 07.52*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం      : ప 11.17 - 01.00 & రా 11.00 - 12.40*

*దుర్ముహూర్తం  : ప 11.48 - 12.39*

*రాహు కాలం    : మ 12.13 - 01.49*

గుళికకాళం       : *ఉ 10.37 - 12.13*

యమగండం     : *ఉ 07.25 - 09.01*

సూర్యరాశి : *కర్కాటకం*  

చంద్రరాశి : *ధనుస్సు*

సూర్యోదయం :*ఉ 05.57*

సూర్యాస్తమయం :*సా 06.47*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.49 - 08.23*

సంగవ కాలం         :     *08.23 - 10.56*

మధ్యాహ్న కాలం    :     *10.56 - 01.30*

అపరాహ్న కాలం    : *మ 01.30 - 04.04*


*ఆబ్ధికం తిధి         : శ్రావణ శుద్ధ త్రయోదశి*

సాయంకాలం        :  *సా 04.04 - 06.37*

ప్రదోష కాలం         :  సా *06.37 - 08.52*

రాత్రి కాలం           :*రా 08.52 - 11.51*

నిశీధి కాలం          :*రా 11.51 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.20 - 05.05*

******************************

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷శ్రీ సరస్వతీ కవచం🪷*


*ఓం హ్రీం విద్యాదిష్ఠాతృదేవ్యై*

*స్వాహా చోష్ఠం సదాఽవతు.*


🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🌷🌷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🪷🪷🍃🌷

   🌹🌷🪷🌷🪷🌷🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - వర్ష ఋతువు - శ్రావణ మాసం - శుక్ల పక్షం -‌ ద్వాదశి - మూల -‌‌ సౌమ్య వాసరే* (06.08.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*