22, సెప్టెంబర్ 2022, గురువారం

క్యాల్షియం

 క్యాల్షియం గురించి వివరణ - 1 . 


     మానవ దేహములో క్యాల్షియం ఎముకల పెరుగుదలకు , దంతాలు గట్టిగా ఉండి ఎదుగుటకు ప్రముఖ పాత్ర వహించును . 70 కిలోలు ఉన్న మానవ దేహము నందు సుమారుగా 1 కిలో క్యాల్షియం వివిధ లవణాలతో సంయోగం చెంది ఉండును . 


    క్యాల్షియం ఎక్కువుగా అవసరం అయ్యే పరిస్థితులు - 


 *  గర్భవతులుగా ఉన్న స్త్రీలు , పాలిచ్చు బాలింతలకు క్యాల్షియం చాలా ఎక్కువ అవసరం అగును . 


 *  ప్రమాదవశాత్తు గాయపడినప్పుడు కలుగు రక్తస్రావములో రక్తం గడ్డకట్టుటకు క్యాల్షియం అవసరం అగును . 


 *  విటమిన్ B12 శరీరం సంగ్రహించుటకు , కొన్ని ఎలర్జీ కేసులలో కూడా క్యాల్షియం అవసరం అగును . 


  క్యాల్షియం ఎక్కువుగా ఉన్న ఆహారపదార్దాలు - 


  పెద్ద ఉల్లి , ఆకుకూరలు , మునగ , గుడ్డు యందలి పచ్చసొన , చిక్కుడు మొదలగు ఆహారపదార్థాలలో క్యాల్షియం విరివిగా లభ్యం అగును . 


        గర్భిణీ స్త్రీలకు , బాలింతలకు ప్రతిరోజూ 1000 నుండి 1200 మిల్లీగ్రాముల క్యాల్షియం అవసరం అగును . సాధారణ ప్రజానీకానికి మాత్రం రోజుకు 400 నుండి 500 మిల్లీగ్రాముల క్యాల్షియం అవసరం అగును . 


  క్యాల్షియం గ్రహించుట మరియు విసర్జించుట - 


       క్యాల్షియం శరీరం సంగ్రహించుటకు అనేక పరిస్థితులు అనుకూలంగా ఉండవలెను . ముఖ్యముగా శారీరక ఆరోగ్యము పైన , జీర్ణాశయము నందలి చిన్నప్రేగుల పరిస్థితి పైన , ఆవ్యక్తి తీసుకొనే విటమిన్ల పైన అధారపడి ఉండును . 


               సాధారణముగా మలమూత్ర విసర్జన ద్వారా క్యాల్షియం శరీరం నుండి బయటకి వెడలిపోతుంది . శరీరానికి తగినంత క్యాల్షియం లేకపోవడాన్ని వైద్యులు   " హౌపో కాల్షిమియా " అంటారు . ఇలా క్యాల్షియం లోపించడానికి ముఖ్య కారణం మనము తీసుకునే ఆహరంలో A , B12 , D మరియు C విటమిన్స్ , ఫాస్ఫరస్ మొదలైనవి లోపించినప్పుడు కూడా క్యాల్షియం తగ్గును . ఇలా క్యాల్షియం లోపించినవారికి కండరాల నొప్పులు కలుగును . ఈ క్యాల్షియం మన శరీరం సంగ్రహించుటకు ముఖ్యమైనది సూర్యరశ్మి . ఈ సుర్యరశ్మి వలెనే క్యాల్షియం ఒంటబట్టించు విటమిన్ D మన శరీరము నందు తయరగును . కావున ప్రతిరోజు సుర్యరశ్మి మన శరీరముకు తగులునట్లు చూసుకోవలెను . 


   క్యాల్షియం లోపించుట వలన కలుగు బాధలు  - 


 * దొంతర పళ్లు పెరుగుట . 


 *  ఏ కొంచం పనిచేసిన అలిసిపోవుట . 


 *  పనిచేయాలనిపించక బద్ధకముగా ఉండటం . 


 *  చలికి తట్టుకోలేకపోవుట . 


 *  ప్రతి చిన్నపనికి అతిగా ఆందోళన చెందుట . మరణ భయం కలుగుట . 


 *  చలికాలము నందు కూడా తలచుట్టూ చెమటపట్టుట . వంటి భాధలు క్యాల్షియం లోపించటం వలన కలుగును . 


         మరింత విలువైన సమాచారం తరవాతి పోస్టు నందు వివరిస్తాను . 


 

         మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


   

కంపవాతము

 కంపవాతము  ( parkinsonism ) రావడానికి గల కారణాలు - లక్షణాలు . 


   ఆయుర్వేద శాస్త్రం నందు పార్కిన్సన్స్ వ్యాధిని కంపవాతం అని అంటారు. ఈ వ్యాధి పుర్తిగా నరములకు సంబంధించిన వ్యాది. మెదడులో     "డోపమైన్ " , నార్ - ఎపినెఫ్రిన్ , సిరోటినిన్ , ఎసిటైల్ కొలిన్ , కొలిస్ట్ స్టాకిన్ -8 , సబ్ స్టెన్సు -p మెటాక్ ఫాలిన్ మరియు ల్యూ ఎన్ ఏ ఫాలిన్ మొదలయిన హార్మోన్స్ అస్తవ్యస్తంగా తయారు అవుతాయి. దీని పరిణామమే పార్కిన్సన్ వ్యాది. దీనితో పాటు మెదడు వాపు , మెదడులో గడ్డలు ఏర్పడటం , మెదడుకు రక్తప్రసరణ లోపించడంతో పాటు కార్బన్ మోనాక్సయిడ్ పాయిజనింగ్ లు కూడా కారణాలుగా గమనించాలి . ఇది వాతప్రకోప వ్యాధిగా ఆయుర్వేదం నందు చెప్పబడినది. 


  ఈ వ్యాధి లక్షణాలు - 


 * కంపవాతం నందు వణుకు విచిత్రముగా ఉంటుంది. వణుకు చేతుల్లో మొదలు అవుతుంది. 


 *  పనిచేస్తున్నప్పుడు వణుకు ఉండదు. ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే వణుకు ఉంటుంది.


 *  కండరాలు బలహీనత పడతాయి. కండరాలు బిగదీసినట్టుగా ఉంటాయి. 


 * ఒళ్ళు తూలుతుంది . నడిచేప్పుడు వంగి నడుస్తారు. చేతులతో పాటు , పెదవులు , మెడకండరాలు , తల కూడా వణుకుతుంది.


 *  నోటి నుంచి చొంగ కారుతుంది. 


 *  కంటిచూపు కొంచం తీక్షణంగా ఉంటుంది. 

 

 *  రోగి మానసికంగా కృంగిపోతాడు . 


  గమనిక  -  మొదట చేతులు వణకడంతో ప్రారంభం అయిన వ్యాధి సరైన చికిత్స తీసుకోకపోవడం మూలాన ఎక్కువ అయ్యాక పైన చెప్పిన లక్షణాలు ఒక్కొక్కటిగా మొదలవుతాయి. 


   దీనికి చికిత్స కొరకు ప్రత్యేక ఔషదాలు ఉపయోగించవలసిందే ...ఆయుర్వేదం నందు స్వర్ణభస్మం వంటి భస్మాలతో వైద్యం చేస్తూ ఆహార విషయంలో వాతం కలిగించే ఆహారం తీసుకోకుండా కఠిన పథ్యం పాటిస్తే తప్పకుండా వ్యాధి నయం అవుతుంది. దీర్ఘకాలిక చికిత్స అవసరం అవుతుంది.


       మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


   

పాండిచ్చేరిలోని అరియూర్

 బ్రాహ్మణ కమ్యూనిటీలో 12వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థుల్లో ఎవరైనా 85% (MPC) మార్కులు సాధించినట్లయితే, వారు పాండిచ్చేరిలోని అరియూర్ వెంకటేశ్వర కళాశాలలో ఉచితంగా ఇంజనీరింగ్ కోర్సును అభ్యసించవచ్చు. ఎవరైనా పేద విద్యార్థులకు సహాయం చేయగలరు కాబట్టి దయచేసి షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం

శ్రీ దేవనారాయణన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ (రిటైర్డ్),

పాండిచ్చేరి యూనివర్సిటీ.


మొబైల్: 7010553544


ఎవరికైనా ఉపయోగపడవచ్చు ఫార్వర్డ్ చేయండి

తిథి అంటే ఏమిటి

 https://kutumbapp.page.link/MjKtv1reDGnWyXp6A *తిథి అంటే ఏమిటి?*          *అధిష్టాన దేవతలెవరు?*                   ➖➖➖✍️  *తిథి అంటే…  వేద సమయగణితము ప్రకారము చంద్రమాసములో ఒక రోజును తిథి అంటారు.*   *ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి, సూర్యుడు నుండి చంద్రుని కదలికలు తిధులవుతాయి, ఉదాహరణకు సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమావాస్య , అదే సూర్యచంద్రులు ఒకరికొకరు సమానదూరములో వుంటే పౌర్ణమి అవుతుంది.*  *శాస్త్రీయముగా సూర్యుడు, చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు.*   *తిథులు సూర్యోదయమున ప్రారంభము కావు సూర్యాస్తమయానికి ముగియవు. రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి... https://kutumbapp.page.link/MjKtv1reDGnWyXp6A

మహర్షుల చరిత్ర*

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

        *మన మహర్షుల చరిత్ర*          


*🌹ఈ రోజు 33 వ జైగీషవ్య మహర్షి గురించి తెలుసుకుందాము🌹*


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


*జిగీషువు అంటే జయించాలన్న కోరిక కలవాడు అని అర్థం ఏం జయించాడో చూద్దాం.*


🌸 జైగీషవ్యుడు కపిల మహర్షికి శిష్యుడు మిత్రుడు కూడా . వీళ్ళిద్దరూ కలిసి అశ్వశిరుడనే రాజుని చూడ్డానికి వెళ్ళారు . 


🌿రాజు అతిథి సత్కారం చేసి విష్ణుమూర్తి కటాక్షానికి ఏం చెయ్యాలో చెప్పమన్నాడు . 


🌸కపిలుడు నన్ను విష్ణుమూర్తిగా తెలుసుకో అన్నాడు . నాకు విష్ణుమూర్తి తెలుసు . అతనికి గద , శంఖం , చక్రం లాంటివి ఉంటాయి , 


🌿నీకు లేవుకదా అన్నాడు రాజు . కపిల మహర్షి గద , శంఖం , చక్రం అన్నిటితోను విష్ణువుగానూ , జైగీషవ్యుడు గరుడ వాహనంగానూ కనిపించారు . 


🌸మరి విష్ణుమూర్తి కమల నాభుడు కదా ! బ్రహ్మ ఏడి ? అన్నాడు రాజు . కపిలుడు కమల నాభుడుగా జైగీషవ్యుడు బ్రహ్మగానూ మారారు . 


🌿ఇదంతా మోసం నేను నమ్మనన్నాడు రాజు . కపిలుడు రాజ్యసభని మాయమైపోయేలా చేశాడు . ఎక్కడ చూసినా క్రూర జంతువులే కనిపంచాయి . 


🌸రాజు భయపడి కపిలుడికి నమస్కారం చేసి నువ్వే విష్ణువు , జైగీషవ్య మహర్షి బ్రహ్మ . నా తప్పుని క్షమించండి అన్నాడు . 


🌿దేవలుడు అనే మహాయోగికి తాను గొప్పవాడినని గర్వం . కాని అతడు సత్యవ్రతుడు , ఉత్తముడు , తపస్వికూడా . 


🌸ఒకనాడు జైగీషవ్యుడు దేవలుడింటికి వచ్చి కొన్నాళ్ళిక్కడే ఉండి తపస్సుచేసుకుంటానని చెప్పాడు .


🌿 జైగీష్యవుడి వంటి మహా యోగీశ్వరుడు తనింటి దగ్గర ఉండడమంటే దేవలుడికి చాలా ఆనందంగా అనిపించి అలాగే వుండమన్నాడు దేవులుడు .


🌸జైగీషవ్యుడు తపస్సు చేసుకుంటున్నాడు . ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి . మౌనం వదలడు . నిష్ట విడవడు .

ఉగ్రమైన తపస్సు చేస్తూ తేజస్సుతో వెలిగిపోతున్నాడు జైగీషవ్యుడు . 


🌿సుందరి దేవలుడు ఎలాగయినా తన గొప్పని నిరూపించుకోవాలని ఒకనాడు అంతర్ధానమై సముద్రస్నానానికి వెళ్ళేసరికి అప్పటికే స్నానం చేసి తపస్సు చేసుకుంటున్నాడు జైగీషవ్యుడు . 


🌸తన పని పూర్తిచేసుకుని యోగవిద్యతో తిరిగి వచ్చిన దేవలుడు యధాస్థానములో కూర్చుని మౌననిష్టలో వున్న జైగీషవ్యుడ్ని చూసి ఆశ్చరయపోయాడు . 


🌿ఇంకా తన శక్తి నిరూపించుకోవడం కోసం యోగశక్తితో ఆకాశానికి ఎగిరి సిద్ధలోకం చేరేటప్పటికి జైగీషవ్య మహర్షిని సిద్ధులు సేవిస్తూ కనిపించారు . 


🌸దేవలుడు పితృలోకం , యమలోకం , సోమలోకం అగ్నిలోకం , రుద్రలోకం ఇలా ఎక్కడికి వెళ్ళినా జైగీషవ్య మహర్షి అక్కడే కనిపించాడు .


🌿 దేవలుడు మహర్షి పాదాల మీద పడి సామాన్యమైన మనిషిలా నా ఆతిథ్యం అడిగావు , నువ్వింత గొప్పవాడివని నాకు తెలియదు క్షమించమన్నాడు .


🌸 దేవలుడు జైగీషవ్య మహర్షికి శిష్యుడయి తన తపస్సు ధారపోసి పితృదేవతలకు ఉత్తమగతులు భూతతృప్తి కలిగించి సన్యాసం తీసుకుని మోక్షాన్ని పొందాడు .


*🌹జై గీషవ్యుని పార్వతీపరమేశ్వరులు పరీక్షించుట : 🌹*


🌿జైగీషవ్యుఁడు పార్వతీపరమేశ్వరులు మేరుపర్వత ప్రాంతమున విహరించుచున్న సమయమున మహర్షి బోయి యీశ్వరసన్నిధిని కుర్చుండెను.


🌸పరమేశ్వరుని పరివార మంతయు 

సిద్ధ సాధ్య యక్ష గంధర్వా ఆప్సరసలు గణములు వారిని సేవించు ఆవకాశమున కెదురుచూచుచుండెను. 


🌿ఆ సమయమున పార్వతీ పరమేశ్వరుల ప్రసంగవశమున పార్వతి “దేవా! అర్థ మేది ? అర్థశక్తి యేది? దయ దలచి తెలుపు" మని భర్తను ప్రార్థించెను.


🌸పరమేశ్వరుడిట్ల ఆనెను. "దేవీ ! అర్థమును నేను. అర్థశ క్తివి నీవు. నేను భోక్తను. నీవు భోజ్యమవు. నేను వరుడను. నీవు ప్రకృతివి. విష్ణుడు డను,  బ్రహ్మను, యజ్ఞపురుషుడను 

నేనే.


🌿 “నాథా ! అర్థము, అర్థశక్తి వీనిలో 

ఏది యధిక" మని పార్వతి పరమేశ్వరు నడిగెను. ఆతడేమియు సమాధానము చెప్పక మిన్నకుండెను. అపుడు 

జై గీషవ్యుఁడు "తల్లీ ! అర్థమే అధికమైనది. 


🌸అర్థశక్తి యర్థమునందు లయించియున్న" ఆని బదులుచెప్పెను. తాను తనభర్తను ప్రశ్నింపగా సమాధాన మిచ్చుటకు వీడెవ డనియు,తను పలుకుట కాతని కెంత కండకావర ​మనియు పార్వతి యాతనిపై గోపించెను. 


🌿అది గ్రహించి జైగీషవ్యుడట అచట నుండి వెడలిపోయెను. అపుడు శివుడు పార్వతిని జూచి "దేవి! అతడు జైగీషవ్యుఁడు. మహాయోగి. మహా జ్ఞాని. మన పరమభక్తుడు. 


🌸పరమ ప్రశాంత చిత్తుడు. ఆతని నట్లు కోపించితివి. ఆతడు నా భక్తుడు. సఖుడు, శిష్యుడును" అని పలికెను. అందులకు పార్వతి “దేవా! నీ 

నా సంభాషణమున ఆతడడ్డువచ్చి సమాధాన మిచ్చుట 


🌿నన్న ఆవమానించుట కాదా? మనల నాశ్రయించి వరములు గ్రహింప వచ్చిన యాతడు మనతో సమానస్థాయిని మాటాడి దోషయుక్తుడై నాడని పలికెను.


🌸 దానిపై శివుడు "దేవీ! కాదు. కాదు. ఆతని కే వరము నక్కఱలేదు. 

ఆతడట్టి ఆశించి మన కడకు రాలేదు. ఆతడు ద్వంద్వాతీతుడు, 

సమలోష్టాశ్మ కాంచనుడు, నిరాశి. 


🌿ఆతని కింద్రత్వము, బ్రహ్మత్వము, రుద్రత్వము తృణప్రాయములు. ఆతడు బ్రహ్మజ్ఞాని. ఆతని నీ వట్లు తృణీకరింపరా" దనెను. అందులకు పార్వతి “ఐనచో ఆతని ఆశా రాహిత్యమును పరీక్షింప నా ఆనుజ్ఞయిమ్మని పరమేశ్వరుని కోరెను.


🌸 అపుడు పార్వతీపరమేశ్వరులు వృషభారూఢులై కొంతపరివారము వెంట రాగా, పరిశుద్దాత్ముడు, ముని శ్రేష్ఠుడు నగు జైగీషవ్యుని యాశ్రమమునకు వచ్చి చేరిరి.


🌿ఏ కోరికయు లేక గాలిలేనిచోట ప్రకాశించు దీపమువలె వెలుగుచు,  చిద్విలాసము ముఖమున  జిందులు ద్రొక్కు జైగీషవ్య యోగీంద్రుని దగ్గఱి పార్వతీపరమేశ్వరులు నిలిచి "యోగీంద్రా !


🌸 నీకు కావలసిన వర మేదైన కోరుకొమ్ము. ఎట్టి యసాధ్యవరమైన ఆనుగ్రహింతు” మని పలికిరి. 

జైగీషవ్యుడు వారికి నమస్కరించి శంకరుని జూచి "దేవా! నీ దయ ఈయలేని దేమున్నది ? 


🌿నేను కృతార్థుడను. నాకు వలయున దేమియు లేదు” అని బదులు చెప్పెను. పార్వతీపరమేశ్వరు ఆతని రెట్టించి రెట్టించి ఆడిగి ఏన్ని విధములనో ఆతనిని మభ్యపెట్ట జూచిరి కానీ మహర్షి ఏమియు గోరుకొనక ధ్యానంలో ఉండెను


🌿నిజముగ నాత ​ఆతనికి కావలసిన ఏమైన నున్నగదా కోరుట? ఏ కోరిక లేనివాడే కోరిక కోరును?


🌸పార్వతీ పరమేశ్వరు ఏంత యత్నించిన ఆతడు చలింపడాయెను.


🌿 పరమేశ్వరుడు పార్వతివంక జూచెను. ఆమె జైగీషవ్యుని పలుకరించి కనికరించి తాను పడ్డ కోపమునకు బాధపడకు మనెను. 


🌸ఆత“డమ్మా! కోపతాప లన్నియు నాకు సమానమే" యని పలికి భక్తితో వారిని వీడ్కొలిపెను. ఈ పరీక్షలో పార్వతీపరమేశ్వరు లోడిపోయిరి.

జైగీషవ్యుఁడు గెలిచెను...


🌿ఏమీ వద్దన్నాడు జైగీషవ్యుడు ! అంటే అసలు కోరికలే లేవు ఆయనకి . అంత గొప్ప మహర్షి .


🌸ఇదండీ జైగీశావ్యుడు మహర్షి గురించి మనం తెలుసుకున్న విషయాలు రేపు మరో మహర్షి చరిత్ర తెలుసుకుందాము స్వస్తి..


☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁

సంసారము నుండి బయటకు

 శ్లోకం:☝️

*చక్షుర్దక్షద్విషో యన్నతు దహతి*

 *పురః పూరయత్యేవ కామం*

*నాస్తం జుష్టం మరుద్భిర్యదిహ*

 *నియమినాం యానపాత్రం భవాబ్ధౌ l*

*యద్వీతశ్రాన్తి శశ్వద్భ్రమదపి*

 *జగతాం భ్రాంతిమభ్రాంతి హన్తి*

*బ్రధ్నస్యవ్యాద్విరుద్ధక్రియమథ*

 *చ హితాధాయి తన్మండలం వః ll*

   - సూర్య శతకం


భావం: అది దక్షుని శత్రువు అయిన శంకరుని నేత్రం. అది శంకరుని మూడో నేత్రం మన్మథుని భస్మం చేసినట్టు లోకాలను కాల్చివేయదు, జీవులలో కోరికలను పుట్టిస్తోంది. యోగ్యమైన వారిని సంసారము నుండి బయటకు తీయగల వాహనం (నౌక) అయినప్పటికీ, ఆ సామర్థ్యం ఉన్నప్పటికీ, ఏ గాలి దానిని కదిలించదు. ఈ ప్రపంచం తిరుగుతున్నప్పుడు కూడా అది ఎల్లప్పుడూ విశ్రాంతిగా ఉంటుంది. కానీ జీవులకు అది తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. అది అవిద్యను , అజ్ఞానాన్ని తొలగించగలదు. సూర్యుని యొక్క ఈ ప్రభావాలన్నీ ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నప్పటికీ, అది మనందరికీ శుభప్రదమైనది మరియు మనందరినీ రక్షిస్తుంది.🙏