19, జులై 2025, శనివారం

శ్రీమద్భాగవత కథలు*

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🚩శనివారం 19 జూలై 2025🚩*

                         5️⃣


                  *ప్రతిరోజూ*

*మహాకవి బమ్మెర పోతనామాత్య*

``

    *శ్రీమద్భాగవత కథలు*

               ```

(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```

_________________________

         *భాగవత జ్వాల*

```

ఓం కారం ఒక అద్భుత నాదం, బ్రహ్మ హృదయాకాశంలో ప్రభవించిన తొలిశబ్దం, పవిత్ర నాదం, బృహతీ వాక్కు, 'ఓమ్' అని వినిపిస్తుంది. ముందు శృతం. తరువాత అక్షరాకృతిని ధరించింది. ఆ ఓంకారమే బ్రహ్మవిద్యాసర్వస్వములైన అన్ని మంత్రాలకు, అన్ని ఉపనిషత్తులకు, పుట్టినిల్లైన వేదమాత. సత్త్వరజస్తమస్సులనే మూడు గుణాలు, ఋగ్యజుస్సామములనే మూడు నామాలు, భూర్భువస్సువస్సులనే మూడులోకాలు, జాగ్రత్స్వప్నసుషుప్తులనే మూడు వృత్తులను కలిగినది. కనుక ఓంకారం త్రిగుణాత్మకమైనది. అప్పుడు బ్రహ్మ ఆ ఓంకారం నుండి స్వరాలు, స్పర్శలు, అంతస్థములు, ఊష్మములు (హ్రస్వములు, దీర్ఘములు) మొదలైన లక్షణాలతో కూడిన అక్షర సమామ్నాయాన్ని రూపొందించాడు. 

ఆ అక్షరాల సహాయంతో ఆయన తన నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలను ఉద్భవింపచేశాడు. బ్రహ్మ మానస పుత్రులు మరీచి మొదలైన వారు బ్రహ్మ ఉపదేశానుసారం వేదాలను నేర్చుకుని, శిష్య ప్రశిష్యులకు బోధించారు. ఒక్కొక్క యుగంలో మహర్షులు గురుముఖతః పరంపరగా అనుశృతంగా వేదాలను ఉజ్జీవింపచేస్తూ వచ్చారు. ఇది భాగవత దర్శనం.


మనం 'జంబూద్వీపే భరత వర్షే' అని సంకల్పంలో చదువుతూ ఉంటాం. అదేమిటో వివరంగా భాగవతంలో కనిపిస్తుంది. సప్తద్వీపాలు, సప్త సముద్రాల ఆవిర్భావం తరువాత భూమి నైసర్గిక స్వరూపం వివరిస్తూ జంబూద్వీపం భరతవర్షం అని చెప్పిన అంశాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నదుల వివరాలు, అడవులు, కొండల గురించి భాగవతం తెలియజేస్తుంది. భరత వర్షం మోక్షం పొందడానికి అనువైన కర్మభూమి అని యజ్ఞభూమి అని భాగవతం వివరిస్తున్నది. తరువాత ఖగోళ విషయం విస్తారంగా ఉంటుంది. సూర్యుడి రథం, సప్తాశ్వాలు, అరుణుడు, సూర్యుడి పయనం, సూర్యుని గతిని అనుసరించి కాల నిర్ణయం, 27 నక్షత్రాల ఉనికి, నవగ్రహాల స్థితి, సంచారాల వివరాలు, దూరాలు విస్తారాల అంకెలు, పాతాళ నరకలోకాల భూమండలం అడుగున ఉన్న లోకాల వివరాలు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి.```


 *భారత వర్షం:* ```

స్వాయంభువ మనువుకు ప్రియవ్రతుడు జన్మించాడు. అతడికి అగ్నీధ్రుడు పుట్టాడు. అతడికి నాభి జన్మించి బలి చక్రవర్తితో స్నేహం చేస్తాడు. సమస్త భూమండలాన్ని పాలించాడు నాభి. అతడికి ఋషభుడు అనే సద్గుణవంతుడైన కొడుకు పుట్టాడు. అతడి కొడుకుల్లో పెద్దవాడైన భరతుడు ఘోరమైన తపస్సు చేసి, మనస్సును సంసార బంధాల నుండి మళ్లించి చివరకు వాసుదేవుడిని చేరుకున్నాడు. ఆ భరతుడనే పుణ్యాత్ముడు ఏలిన భూమండలానికి అతడి పేరు మీద మన 'భారతవర్షం' ఉద్భవించింది. ఇది మన భారత చరిత్ర. మనదేశానికి భారతదేశం అనే పేరు ఎందుకు వచ్చిందో భాగవతం వివరిస్తుంది. శ్రీమద్భాగవతం ఆ విధంగా చాలా సమగ్రమైన భారతీయ విజ్ఞాన సర్వస్వంగా మనకు కనిపిస్తుంది. పోతన భాగవతం అయిదు సంపుటాల్లో ఉంది. ఆ తరువాత టిటిడి వారు ఎనిమిది సంపుటాల్లో మరింత వివరంగా పోతన భాగవతాన్ని ప్రచురించారు. చాలా గొప్ప పుస్తకాలు అనడంలో సందేహం లేదు. కాని అందరూ అన్ని గ్రంధాలు సంపుటాలు చదవలేరు. అద్భుతమైన భాగవత పురాణ సారాంశాన్ని వీలైనంత తక్కువ పరిమాణానికి కుదించి అందులో సారమంతా దించి, మనముందుంచి జ్వాలా నరసింహారావుగారు గొప్ప మేలుచేశారు. కొత్తతరం వారు హాయిగా చదువుకొని తెలుసుకోవడానికి ఇది కరదీపికగా ఉపకరిస్తుంది.

```

 *మనిషిని తీర్చిదిద్దేవి భారత రామాయణ భాగవతాలు:* ```

మన నడవడికను శాసనాలు, రాజ్యాంగాలు, కోడ్ లు, చట్టాలు, శిక్షలు, సరిదిద్దడం చాలా కష్టం. ఇవన్నీ తప్పు జరిగిన తరువాత రంగంలోకి దిగి కొంత మందిని శిక్షించడానికి ఉపయోగపడతాయేమో గాని నేరం జరగకుండా ఆపడానికి అంతగా ఉపయోగపడక పోవచ్చు. ఒక నవయువకుడిని ఉత్తమ గుణ సంపన్నుడుగా తీర్చిదిద్దడానికి కావలసింది చట్టాలు, జైళ్లు, పోలీసులు కోర్టులు కాదు. సచ్ఛీలాన్ని ప్రేరేపించే నాలుగు మంచి మాటలు ఇంట్లో పెద్దలు ఆచరించే నాలుగు మంచి పనులు. వారు అనుసరించే మార్గాలు. వారిని నడిపించే ఆధ్యాత్మిక జీవన సూత్రాలు. రామాయణం వంటి కథలు. సత్యభాషణం, ప్రియభాషణం నేర్పే వ్యక్తిత్వ ప్రబోధాలు, ఏవి చేయకూడని పనులో, అవి చేస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో, వాటిని అదుపు చేయడం ఎంత అసాధ్యమో చెప్పే గాధలు. రామాయణం మనిషి ఏ విధంగా ఉండాలో చెబితే, మహాభారతంలో దుర్యోధనాదుల పతనం, ఏ విధంగా ఉండకూడదో చెబుతుంది. ఇక శ్రీమద్భాగవతమైతే చేసిన తప్పులకు పాపాలకు పరిహారాలు చూపి, భక్తి నేర్పి, కరుణ దయ ప్రేమ మార్గాలు చూపి, చివరకు జ్ఞానాన్ని ఇచ్చి, మహానందకరమైన మోక్షమార్గాన్ని సుగమం చేసే దివ్యజ్యోతి.


భాగవతంలో ముఖ్యమైన అవతార ఘట్టాలు రెండు- శ్రీకృష్ణావతారం, నరసింహావిర్భావం. నరసింహుని పేరు పెట్టుకున్నందుకు జ్వాలానరసింహారావు జన్మసార్థకం చేసే మంచి పని చేశారు. అదే ఈ భాగవత కథల రచన.


వ్యాస భాగవతం మనదేశపు అపారమైన వారసత్వ సంపద, సనాతన సంపద. సాహిత్యం, భాష, సంస్కృతి, హైందవం, భారతీయత, వైష్ణవం, అద్వైతం, అందులో విశిష్టాద్వైతం, ఉపనిషత్తులు, వేద వేదాంగాల సారం, భాగవతంలో లేనిదేదీ లేదు.```


 *మహాకావ్యం మహాభారతం:* ```

మహాభారతం ఒక మహా కావ్యం. చరిత్ర ఆ మహాభారతాన్ని ఎవరైనా పురాణ కథ అంటే నమ్మబుద్ధి కాదు. కొన్ని తరాల జీవితాన్ని వివరంగా తెలియజేస్తూ అనేక సత్పురుషుల జీవన కథా కథనాలతో ముడివేస్తూ, జన్మజన్మలబంధాలు వివరిస్తూ, ఈర్ష్యాద్వేషాలు, పగలు ప్రతీకారాలు, ధర్మాధర్మాలు, దురాశ, రాజ్యం కోసం కుట్రలు ఏ విధంగా జీవనాన్ని అతలాకుతలం చేస్తాయో చెబుతూ వాటి మధ్య ధార్మికంగా బతకడం గురించి చెప్పే సమర గాధ మహాభారతం. 

“మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్యఘర్షణం” అని శ్రీ శ్రీ రాసిన సినిమా పాటలో చరణాలు ఎంత నిజమో అనిపిస్తూఉంటుంది. మహాభారతం చాలా ఆసక్తి రేకెత్తించే కథల సమాహారం. యుద్ధం అన్నిటికన్నా ఆకర్షణీయమైనది. భయానకమైన హింస భారతయుద్ధంలో కనిపిస్తుంది. బహుశా అది గూడా ఒక కారణమై ఉంటుంది ప్రతి తరాన్ని ఆకర్షించడానికి.


భాగవతం ఆ విధంగా ఉండదు. సృష్టి క్రమాన్ని వివరించే పని చేస్తుంది. ప్రకృతి రహస్యాలను ఆవిష్కరించే జ్ఞానగ్రంధం భాగవతం. జీవుల నడవడికకు దీపస్తంభం భాగవతం. అందులో యుద్ధాలు, హింస ఉన్నప్పడికీ, భక్తికి భగవంతుడికి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని అడుగడుగునా తెలియజేసే అద్భుత గ్రంధం భాగవతం. వందలాది కథలు వేలాది కథానికలు, ఎన్నెన్నో నాటకాలు, నాటికలు, అవతారాలు, అవతార రహస్యాలు భాగవతాన్ని సుసంపన్నం చేస్తాయి. ఆ కథలు కొన్ని చాలామందికి తెలుసు. కాని చాలా కథలు చాలామందికి తెలియవు. మూల గ్రంధం చదివితే తప్ప తెలియని కథలు పుంఖానుపుంఖాలుగా ఉంటాయి. మూలగ్రంధం ఆసాంతం చదివే విద్యార్థులు ఈ తరంలో ఎందరు ఉన్నారంటే మనం చెప్పలేము. రామాయణ భారత భాగవతాలను ఒక్కసారయినా పూర్తిగా చదివితే తప్ప భారతీయుడు కాలేడనిపిస్తుంది. 

ఆ లెక్కన ఎంత మందిని నిజంగా భారతీయులని అనగలమో తెలియదు.


జ్వాలా తన జీవనంలో సింహభాగం పురాణాల పఠనానికి, అందులో విశేషాల రచనకు వినియోగించారు. అది ఆయన చేసిన మంచి పని. ఆరుకాండల రామాయణానికి అనువక్త అయ్యాడు. ముందు తను కథను అర్థం చేసుకున్నాడు. తనకు అర్ధమయిన ఆ కథను అందరికీ అర్థమయ్యే విధంగా మళ్లీ చెప్పుకొచ్చినాడు. ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే అద్భుత రమణీయాలు ఆ కథలు. అనేకులు రామాయణం తెలుసంటారు. నిజమే. ఆ కథ నడిచిన తీరు తెలియని వారు ఉండకపోవచ్చు. కాని వివరాలు, సూక్ష్మాలు, రహస్యాలు, అంతరర్థాలు తెలియాలంటే మొత్తం కొన్ని సార్లయినా చదవాలి. లేదా ఒక విమర్శనా దృక్కోణం నుంచి విశ్లేషించుకునేందుకు మనసును సిద్ధం చేసుకునైనా ఉండాలి. రెండూ లేకుండా సమగ్రమయిన అధ్యయనం సాధ్యంకాదు. ఏదీ లేకుండా నేను కూడా ఆ పురాణాలు చదివాను అంటే చెప్పేదేమీ లేదు.


భాగవత కథలలో మూల సూత్రం ఒకటే. కాని కథలు వేరు. కనుక ఆ కథలను ఒక శృంఖలం వలె ఒకటి తరువాత ఒకటి గా చదవవలసిన పని లేదు. చదివినా ఫరవాలేదు. కాని కథలు విడిగా చదివినా నష్టం లేదు. అటువంటి కథలే ఇవన్నీ..


భారతం వంటి పురాణాలు రాసిన వ్యాసుడికి మానసిక శాంతి లభించదు. అవును మరి. అక్షౌహిణీలకొద్దీ మానవ సంఘాల్ని మరణం వైపు నడిపించి రణం గురించి, ఆ రణానికి దారి తీసిన వ్రణాల గురించి వివరిస్తూ ఉంటే శాంతికి ఆస్కారం ఎక్కడ? వ్యాసుడు మహాభారతంలో స్వయంగా ఒక ప్రధానమైన పాత్రధారి. మొత్తం కథకు సూత్రధారి అనలేం కాని గత జన్మల గురించి, వెనుకటి తరాల గురించి, తరువాత తరాల గురించి తెలిసిన దీర్ఘాయువు వ్యాసుడు. పాండు రాజు ధృతరాష్ట్రుల తాత, చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడి తండ్రి. భీష్ముడికి సోదరసమానుడు. ఆయన మునిమనుమలు కొట్టుకుని అయిదుగురు తప్ప అంతా ముగిసిపోతే చూసిన ముత్తాత వ్యాసుడు. ఎంత అల్లకల్లోలానికి గురై ఉంటాడు. మనశ్శాంతి రమ్మంటే ఎందుకు వస్తుంది? ఎక్కడునించి వస్తుంది. మహాభారతంలో సాక్షాత్తూ శ్రీకృష్ణుడు కీలకమైన శక్తిగా భాసిల్లినప్పడికీ, వ్యాసుడు ఆయన అవతార తత్వాన్ని అందులో వివరించడానికి ఆస్కారం లభించలేదు.


భగవద్గీతలో ఉపనిషత్తుల వేదాల సారాన్ని పిండి ఇచ్చినప్పటికీ, అర్జుడిని విషాయోగం నుంచి రణకర్తవ్యోన్ముఖుడిని చేయడానికి సంబంధించినంత వరకు వివరణ ఉంది కాని, శ్రీ కృష్ణుని భగవత్ తత్త్వానికి సరైన వివరణ, సందర్భోచిత కథా కథనాలు మహాభారతంలో కనిపించవు. కనుక విడిగా భాగవతం అవసరమైంది. మహాభారతంలో చెప్పడానికి కుదరక, వీలుకాక, సందర్భం లభించక, చెప్పని కథలన్నీ భాగవతంలో వివరంగా చెప్పే అద్భుత అవకాశం కలిగింది. భగవద్గీతామృత సూత్రాలకు వందలాది వేలాది ఉదాహరణలు మనకు భారతంలో కాదు భాగవతంలో దొరుకుతాయి. భారతం సృష్టి వినాశనాన్ని దాని హేతువులను వివరిస్తే, భాగవతం సృష్టి రహస్యాలను, సృష్టి వివరాలను సృష్టి వికాసాలను అద్భుతంగా వివరిస్తుంది. రామాయణం కథ, భారతం కూడా కథే. కాని భాగవతం కథ కాదు. భారతీయత. విష్ణుతత్త్వం. పరంధాముడి పరతత్వ గాధ. భాగవతం ఒక ప్రబోధం. మనను నడిపించి మన మనసుల్లో మాలిన్యాల్ని తొలగించే పవిత్ర గ్రంధం భాగవతం. భగవంతుడికి సంబంధించిన గ్రంధం అని ఒక అర్ధం. భగవంతుడికి సంబంధించిన వ్యక్తుల కథ అని మరొక అర్థం. అందుకే భగవదవతారాల వివరణ ఉంటుంది. ఇది 21 భగవదవతారాల కథ.


శ్రీమన్నారాయణుడి విరాజమానమైన దివ్యరూపం మొదటి అవతారం. ఆ మొదటి అవతారమైన నాభి కమలం నుండి సృష్టి కర్త అయిన బ్రహ్మ పుట్టాడు. శ్రీమన్నారాయణుడి అవయవ స్థానాల నుండి అనేక లోకాలు సృష్టించబడ్డాయి. 1.మొదట

ఆ దేవుడు కౌమార సర్గాన్ని ఆశ్రయించి బ్రహ్మచర్యాన్ని చేపట్టాడు. 2.రెండవ సారి విశ్వసృష్టి కొరకు రసాతలానికి పోయి భూమండలాన్ని ఎత్తుతూ వరాహ దేహాన్ని ధరించాడు. 3.మూడవ అవతారం నారదుడు అనే దేవర్షిగా 4.నాల్గవది నర నారాయణ రూపం. 5.పంచమావతారం కపిలుడుగా. 6.ఆరవ అవతారం దత్తాత్రేయుడుగా అనసూయాదేవికి - అత్రిమహర్షికి పుట్టాడు. 7.ఏడవ అవతారం యజ్ఞుడు పేరుతో అకూతికి - రుచికి జన్మించాడు. 8.అష్టమ అవతారంలో ఉరుక్రముడు అనే పేరుతో జన్మించి విద్వాంసులకు పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు. 9.తొమ్మిదవ అవతారంలో పృధు చక్రవర్తిగా జన్మించాడు. 10.పదవ అవతారంలో మహా మీనావతారం దాల్చాడు. 11.పదకొండవ అవతారంలో తాబేలుగా పుట్టి మందరాచలాన్ని మోశాడు. 12.పన్నెండవ అవతారంలో ధన్వంతరిగా జన్మించాడు. 13.పదమూడవ అవతారంలో మోహినీ వేషం ధరించి రాక్షసులను మోహితులను చేసి దేవతలకు అమృతాన్ని పంచాడు. 14.పద్నాలుగోది హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహావతారం. 15.పదిహేనవది బలిని మూడు అడుగులు అడిగిన వామనావతారం. 16.పదహారవది పరశురామావతారం. 17.పదిహేడవది వేదవ్యాస అవతారంగా ఎత్తి వేదాలను విభజించడం చేశాడు. 18.పద్దెనిమిదో అవతారం శ్రీరామావతారం. 19,20.పంతొమ్మిది - ఇరవైవది బలరామ-కృష్ణావతారాలు. 21.ఇరవై ఒకటో అవతారం బుద్దావతారం.

```    

               *(సశేషం)*

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*

``

          *రచన: శ్రీ వనం*    

   *జ్వాలా నరసింహారావు*

``

  *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

పాస్ వర్డ్ చెప్పు “

 స్కూల్ లో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులందరికీ ఉపయోగపడే విషయం. ఇది డిల్లీ లోని ఒక స్కూల్ లో జరిగిన సంఘటన. 


ఈ ఫోటోలో ఉన్న ఎనిమిది సంవత్సరాల ఈ అమ్మాయిని సాయంత్రం వేళ స్కూల్ వదిలిపెట్టగానే, ప్రతిరోజూ ఆ అమ్మాయి తల్లి వచ్చి ఇంటికి తీసుకువెళ్ళేది. 


కానీ ఒకరోజు ట్రాఫిక్ వల్ల ఆమె ఇంటి దగ్గర నుండి స్కూల్ వద్దకు రావడం ఆలస్యమైంది. ఆ అమ్మాయి తన తల్లి కోసం స్కూల్ గేట్ బయట 

వేచి చూస్తూ ఉంది.


దీనిని ఆసరాగా తీసుకొన్న ఒక వ్యక్తి , ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి 

“ మీ అమ్మకు వేరే అర్జంట్ వర్క్ ఉండటం వల్ల ఇప్పుడు స్కూల్ దగ్గరకు రాలేకపోయింది, అందుకే నిన్ను తీసుకురమ్మని నన్ను పంపించింది “ అని 

ఆ అమ్మాయితో చెప్పాడు. 


వెంటనే ఆ అమ్మాయి , “ సరే మా అమ్మ నన్ను తీసుకురమ్మని , 

నిన్ను పంపించినట్లయితే మా అమ్మ నీకు చెప్పిన పాస్ వర్డ్ చెప్పు “ 

అని అడిగింది.


వాడికేమీ అర్థం కాలేదు.............. అటూ ఇటూ చూసి తడబడ్డాడు.........


 ఆ అమ్మాయికి వాడి దుర్మార్గపు బుద్ధి అర్థమై , 

గట్టిగా అరిచేలోపుగా వాడు అక్కడి నుండి తప్పించుకున్నాడు.


ఈ మధ్యకాలంలో మాయమాటలు చెప్పి,

 స్కూల్ పిల్లల కిడ్నాప్ లు ఎక్కువగా జరుగుతుండటంతో, 

ఆ అమ్మాయి తల్లి , తన కూతురికి ఒక పాస్ వర్డ్ ను చెప్పింది.


స్కూల్ వద్దకు తాను కాకుండా ఎవరైనా వచ్చి రమ్మని పిలిస్తే,

 వాళ్ళను ఆ పాస్ వర్డ్ ను అడగమని చెప్పింది. 


అప్పుడు ఆ పాస్ వర్డ్ వాళ్ళు చెప్పలేకపోతే...............

 కిడ్నాపర్ అని కనిపెట్టి గట్టిగా అరవమని చెప్పింది.


తన తల్లి చెప్పిన ఈ ఉపాయం వల్ల ,

ఆ అమ్మాయికిడ్నాపర్ ల బారి నుండి తప్పించుకోగలిగింది.


తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు ఈ పాస్ వర్డ్ విధానాన్ని పాటిస్,

తేచాలా వరకు కిడ్నాపర్ల బారి నుండి తమ పిల్లలను రక్షించుకోవచ్చు.

సముద్ర స్నానాలు

 *సముద్ర స్నానాలు ఎందుకు చేస్తారో తెలుసా.....??*


శరీరం మీద ఉండే స్వేద గ్రంథులు రోమాల వల్ల మూసుకొని ఉంటాయి.

ప్రతి నిత్యం మనం శరీరాన్ని ఆ స్వేద గ్రంథులు పూర్తిగా తెరుచుకోబడవు.


అకారణంగా ప్రాచీనులు వైద్య పరమైన ఒక నిర్ణయాన్ని చేస్తూ.

ప్రతీ వ్యక్తీ ఏడాదిలో నాలుగు సార్లు సముద్ర స్నానం చేయాలనే ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు, అందుకే ఆషాఢ మాసం, కార్తిక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం పూర్ణిమల్లో సముద్రం స్నానం చేయడం ఆచారంగా వస్తోంది.


🌸అయితే ఇలా స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్న అనవసరం పదార్థం స్వేద రూపంగా బయటకి విసర్జింపబడుతుంది.


🌿కాబట్టి సముద్ర స్నానం అనేది ఆథ్యాత్మికంగానే కాకుండా వైద్య పరంగా కూజా ఏర్పాటు చేయబడింది.


🌸ఆషాడ , కార్తిక, మాఘ, వైశాఖ.

నాలుగు మాసాల్లో వచ్చే పూర్ణిమ నాడు సముద్ర స్నానాన్ని చేయాలని శాస్త్రం చెబుతున్న మాట.


🌿ఈ నాల్గింటిని వ్యాస పూర్ణిమ ఉత్సవాలుగా అందుకే చెప్పారు.సముద్ర స్నానం అంటే పూర్తిగా శరీరాన్ని శిరోజాలతో సహా సముద్రంలో ముంచి స్నానం చేయడం అన్నమాట.


🌸అలా చేస్తే శరీరంలోని రోమకూ పాలు తెరుచుకొని శరీరంలో అనవసరంగా ఉండే స్వేదం మైదలైన వ్యర్థ పదార్థాలు బయటకి నెట్టబడతాయి.


🌿అదీగాక శరీరానికి తగినంత ఉప్పదనం పట్టే కారణంగా చర్మ వ్యాధులు దరిచేరవు. ఏ హీనీ కల్గించే రోగ క్రిములు శరీరానికి బాహిరభాగంలో ఉన్నాయో 


🌸అవన్నీ ఈ సముద్ర జలంలోని ఉప్పదనం కారణంగా పూర్తిగా మరణించి శరీరానికి సౌఖ్యాన్ని చేకూరుస్తాయి...


🌹🙏సముద్రస్నానం పుణ్యం..🙏🌹

           

🌿మనదేశంలోని  పవిత్రగంగా నది సహా  అన్ని పుణ్య నదులూ సముద్రంలోనే కలుస్తాయి.


🌸గంగానది బంగాళాఖాతంలో కలుస్తుంది.  అందువలన

అది తప్పితే మిగతా సముద్రాలలో స్నానం చేస్తే పుణ్యం దక్కదు అని అనుకోనక్కరలేదు.  


🌿ఈ ప్రపంచంలో ని  సముద్రాలన్ని ఎక్కడో ఒకచోట ఒకదానితో ఒకటి కలసివుండేవే. 


🌸అరేబియా సముద్రం  హిందూమహాసముద్రం, బంగాళాఖాతం  మాత్రమే కాకుండా పస్ఫిక్ మహాసముద్రం , 

అట్లాంటిక్ మొదలైన సముద్రాలు ప్రపంచంలో యేదో ఒక చోట కలుస్తూనే వున్నాయి. 


🌿అలాగే నదులన్నీ కూడా

ఆ ప్రాంతాన వున్న సముద్రాలలో  కలుస్తున్నాయి.  అందువలననే సముద్రస్నానం ఉత్తమమైన పుణ్యఫలాలు యిస్తుందని,  విశిష్టత కలిగినదని చెప్తారు. 


🌸సముద్రస్నానం వలన 

గంగలో స్నానం చేసినందువలన కలిగే పుణ్యం తప్పక లభిస్తుంది...


స్వస్తీ...🙏🌹


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

వకుళమాత ఆలయం

 వకుళమాత ఆలయం


తిరుపతిలోని పేరూరులో ఉన్న శ్రీ వకుళామాత ఆలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి (బాలాజీ) పెంపుడు తల్లి వకుళా దేవికి అంకితం చేయబడింది.


 వకుళా దేవి తన కొడుకు వివాహాన్ని చూడాలని కోరుకుందని మరియు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పెంపుడు తల్లిగా జన్మించిందని నమ్ముతారు. 


ఈ ఆలయం దేవత ముఖం శ్రీ వెంకటేశ్వర స్వామి నివసించే ఏడు కొండల వైపు మళ్ళించబడేలా ఉంది.


 ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఆచారం ఏమిటంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి మొదట శ్రీ వకుళామాతకు మరియు తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యాలు సమర్పించబడతాయి.


ప్రాముఖ్యత:


ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి పెంపుడు తల్లిగా శ్రీ వెంకటేశ్వర స్వామి జీవితంలో కీలక పాత్ర పోషించిన వకుళా దేవికి గౌరవప్రదమైన ప్రదేశం.


స్థానం:


ఇది ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి సమీపంలోని పేరూరు అనే గ్రామంలో ఉంది.


ఆలయ రూపకల్పన:


దేవుని ముఖం వెంకటేశ్వరుడు నివసించే ఏడు కొండల వైపు ఉండేలా ఆలయం రూపొందించబడింది, ఇది తల్లి తన కొడుకుపై చూపే శ్రద్ధగల దృష్టిని సూచిస్తుంది. 


సంప్రదాయం:


తిరుమలలోని వకుళమాతకు మరియు తరువాత వెంకటేశ్వరుడికి నైవేద్యాలు సమర్పించే ప్రత్యేక ఆచారం అనుసరించబడుతుంది, ఇది తల్లీకొడుకుల బంధాన్ని హైలైట్ చేస్తుంది.

మరింత శ్రేష్ఠుడు..

 శ్లో𝕝𝕝 *అజ్ఞేభ్యోగ్రంథిన: శ్రేష్ఠా:!* 

            *గ్రంథిభ్యో ధారనో వరా:!*

            *ధారిభ్యో జ్ఞానిన: శ్రేష్ఠా:!*

            *జ్ఞానిభ్యో వ్యవసాయన:!!*


         _ *మనుస్మ్రతి* _


తా𝕝𝕝 అజ్ఞానికంటే ఏదో ఒకగ్రంథం చదివినవాడు శ్రేష్ఠుడు.... 

గ్రంథం చదివినవాడికంటే దానిని కంఠస్థం చేసినవాడు శ్రేష్ఠుడు..... 

కంఠస్థం చేసినవాడి కంటే అందులోని *మంచితనాన్ని ఆచరణలో పెట్టినవాడు మరింత శ్రేష్ఠుడు....*

కృష్ణపరమాత్మ చెప్పిన మోక్షప్రాప్తి

 *కృష్ణపరమాత్మ చెప్పిన మోక్షప్రాప్తి ఎపుడు కలుగుతుంది?*

     

శ్రీ కృష్ణుడు రెండు విషయాలు చెప్పారు.


ఒకటి ఇంద్రియ నిగ్రహము. 


రెండవది మనస్సును ఆత్మయందు లగ్నం చేయడం.


మొదటిది బాహ్యంగా చేయవలసినది. రెండవది అంతర్గతంగా చేయాల్సిన పని.


ముందు ఇంద్రియములను అదుపులో ఉంచుకుంటే బుద్ధి కూడా స్థిరంగా ఉంటుంది.

బయట ఇంద్రియములను నిగ్రహిస్తే సరిపోదు, లోపల మనసును కూడా ఆత్మయందు లగ్నం చేస్తేనే గానీ, బుద్ధి స్థిరంగా ఉండదు అని అర్థము.


కాబట్టి ఇంద్రియములు అదుపులో ఉండాలి, వాసనలు పోవాలి, బుద్ధి స్థిరంగా ఉండాలి, మనస్సు ఆత్మయందు లగ్నం కావాలి.


అప్పుడే వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు.


ఇంద్రియ నిగ్రహము, నిరంతర సాధన, శాస్త్రజ్ఞానము, సత్సంగము వీటితో వస్తుంది.


ఇవి సాధిస్తే బుద్ధి స్థిరంగా ఉంటుంది. మనస్సు ఆత్మలో లీనం అవుతుంది.


అప్పుడే పరమానందం కలుగుతుంది. కాబట్టి అన్నింటికంటే ఇంద్రియ నిగ్రహము ముఖ్యము అని చెబుతున్నాడు పరమాత్మ.


ఎందుకంటే, ఈ ఇంద్రియములు బాగా శాస్త్ర జ్ఞానము, బుద్ధికల వాడిని కూడా పడగొడతాయి. ఇంద్రియములు రథానికి కట్టిన గుర్రాల వంటివి. గుర్రాలు తమ దారిన తాము రథాన్ని లాక్కుపోతుంటే, రథం గోతుల్లో ప్రయాణం చేస్తుంది. ప్రమాదానికి గురి అవుతుంది.


అలాగే ఇంద్రియాలు, బుద్ధి చెప్పినట్టు వినకుండా తమ దారిన తాము పోతుంటే, వాడు ఎన్నటికీ పరమాత్మను తెలుసుకోలేడు.


ఇంద్రియములను వశంలో ఉంచుకుంటే వాడి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది.


కాబట్టి సాధకుడు ఇంద్రియములను తన వశంలో ఉంచుకోవాలి. అవి తాను చెప్పినట్టు నడుచుకునేలా చేయాలి.


ఇది సాధించడానికి ఏమి చెయ్యాలి అంటే…


ధ్యానం చేయాలి!


ముందు మన మనస్సు పరమాత్మ యందు ఉంచాలి. పరమాత్మ గురించి ఆలోచించాలి. ముందు సగుణారాధనతో మొదలుపెట్టి, ఏదో ఒక రూపంలో ఉన్న విగ్రహమును పూజించి, ఆ తరువాత ఆ విగ్రహమును కూడా వదిలిపెట్టి నిర్గుణ ఆరాధన చెయ్యాలి. దానిని ధ్యానం అంటారు.


ధ్యానంలో కూర్చున్నప్పుడు మనసును పరమాత్మయందు లగ్నం చేయాలి.


*అప్పుడు మోక్షప్రాప్తి కలుగుతుంది అని బోధించాడు పరమాత్మ.*


🚩 *స్వస్తి* 🚩

సాధన చేస్తూ ఉంటే

 సాధన చేస్తూ ఉంటే ముక్తి లభించక పోతే ఎన్నో జన్మలు గడిచిపోయాయి కదా అనే మీ ప్రశ్నకు సమాధానం - భగవద్గీత 6/40 శ్లోకం చూడండి. న హి కళ్యాణ కృత్ కశ్చిత్ దుర్గతిం తాక గచ్ఛతి - సాధన చేస్తూ చేస్తూ ఉండగా ఏ సాధకుని శరీర పతనం అవుతుందో అతణ్ణి యోగ భ్రష్టుడు అంటారు.అటువంటి యోగ భ్రష్టునికి దుర్గతి ఎన్నటికీ లేదు.అటువంటి యోగ భ్రష్టుడు శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽభిజాయతే।యోగ భ్రష్టుడు వేదవేదాంగాల అధ్యయనంతో శుచి ఐన ఇంక పైగా శ్రీమంతుల ఇంట్లో జన్మిస్తాడు.లేకపోతే యోగుల ఇంట్లోనే జన్మిస్తాడు.అప్పుడు పూర్వ జన్మలో చేసిన శ్రవణ మనన నిదిధ్యాసల వల్ల తిరిగి ఈ జన్మలో సాధన మరింతగా చేసి ముక్తిని పొందుతాడు,అని పరమాత్మే చెప్పాడు కదా!కాబట్టి మన సాధన ఎక్కడికి పోదు.అది మనల్ని ముక్తి పథం దిశగానే నడిపిస్తుంది.ఎన్ని జన్మలకు అంటే అది మనం చేసుకునే సాధన పైనే ఆధారపడి ఉంటుంది.

భాగవతము- అంతరార్ధము

 🙏భాగవతము- అంతరార్ధము - తత్త్వము🙏


భాగవతము కలియుగమున మానవ కోటికి ఏకైక ముక్తి సోపానము. అందుకే పెద్దలు అంటారు “చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం”. ఇంతటి వరేణ్యానికి మూల కారణం, అది గాయత్రిని అధికరించిన మహా మంత్ర స్వరూపం కావటం. ఇక్కడ అధికరించిన అంటే అధికం చేయబడిన, వ్యాహృతి గావింపబడిన అని గ్రహించ వచ్చును. గాయత్రి మహా మంత్రం ఓంకార రూపం కనుక సాక్షాత్ శక్తి స్వరూపం. పర బ్రహ్మ తత్వం అని చెప్పబడుతుంది. ఓంకారం త్రైవర్ణాత్మకం. అకార, ఉకార, పూర్ణానుస్వరములు (మకారము) అనే మూడు వర్ణాలు లేదా శబ్దాల సమన్వితం. అకారం ఆరంభానికి, సృష్టికి, సృష్టికర్తకు ప్రతీక అనవచ్చు. . పూర్ణం (మకారము) ఇది లయానికి, ప్రళయానికి, శివునికి ప్రతీక అనవచ్చు. పూర్ణత్వం. ఉన్నది అనుకున్నది ఖాళీ కావటం అదే అనంతంతో నిండిపోవటం. ఉకారం స్థితికి, విశ్వానికి, సర్వ వ్యాపకానికి, విష్ణునికి ప్రతీక అనవచ్చు. ఇది త్రి మాత్ర పరిమితం. కార్య, కారణ, కర్తృత్వ ఆదుల సమన్వితం.

అలాగే శ్రీకారంలో శకార రకార ఈ కారములు

మూడు బీజాక్షరాలు శకారం శివ బీజం, రకారం అగ్ని బీజము ( శక్తీ బీజము ) ఈ కారము తురీయము అంటారు అంతకంటే వ్యక్తం చేయకూడదు.


భాగవతము ఒక మంత్ర శాస్త్రము బీజాక్షరముల అర్ధం కూడా చెప్పబడినది

ఓంకారం నకు వైదిక ప్రణవం అని పేరు వివరణ ఇవ్వవచ్చు శ్రీం మంత్ర శాస్త్ర ప్రణవం మంత్ర శాస్త్ర ప్రణవాలు ఐదు, వాటిని వ్రాయకూడదు వైదిక ప్రణవాలు ఐదు అవి వ్యక్తం చేయవచ్చును 

ఓం, నమః, స్వాహా, స్వదా, వ్ఔషట్ అనేవి.

అనేక సందర్భాలలో వీటిని ఉపయోగిస్తున్నాము.

    ఓంకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తులకు, సత్వరజస్తమములనే త్రిగుణాలకి, భూఃభువస్సువః అనే త్రిలోకాలకు, బ్రహ్మచర్య గృహస్త వానప్రస్తలనే ఆశ్రమ త్రయానికి, బ్రహ్మణ, క్షత్రియ, శూద్ర అనే త్రైవర్ణికానికి, ఋగ్యజుస్సామములనే త్రయి రూప వేదానికి, త్రికోణాత్మకమైన శక్తి స్వరూపికి, జాగృతి నిద్రా సుషుప్తులనే అవస్థా త్రయానికి మున్నగు వానికి అధిదేవత. ఇవి గాయత్రీ మహా మంత్రానికి, భాగవత మహా పురాణానికి సంపూర్ణంగా అన్వయిస్తాయి.


వీటికి అతీతమైనది తురీయం, నాలుగవది. గాయత్రీ మంత్రంలో మూడు పాదాలు వరకు సామాన్యులకు అర్హం. తురీయ పాదం, తురీయాశ్రమం సన్యాసంలో పరిణితి అందుకున్న వారికి, పాదుకాంత దీక్షా పరులకు అర్హం అయింది. ఆ తురీయావస్థ ముక్తి, మోక్షం, వైకుంఠం. . . అంటుంది భాగవతం. ఈ త్రయీ మార్గం దృష్టితో ఓంకారం, గాయత్రీ మహా మంత్రం, భాగవతం మధ్య సమత్వ ముంది.గాయత్రి మంత్రం యొక్క తురీయా పద భాష్యమే భాగవతం.

నాంది పద్యములో గాయిత్రి మంత్ర చతుష్పాద లక్ష్యమే భాగవతం అని గూఢముగా చెప్పినాడు గాయిత్రి మంత్ర చతుష్పాదము చెప్పకూడదు కావున చెప్పుట లేదు అది మోక్షదాయిని. ఈ పద్యమే సూక్ష్మ కామకళతో ప్రారంభం అయినది.ఇది మంత్ర శాస్త్రములోని రహస్య విషయం.

శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్‌ లోకర

క్షైకారంభకు భక్తపాలనకళా సంరంభకున్‌ దానవో

ద్రేక స్తంభకుఁ గేళిలోలవిలసద్దృగ్జాలసంభూతనా

నాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్‌

మోక్ష సాధనే భాగవత పరమప్రయోజనమని చాటి చెప్పాడు.

ఈ పద్యములో సృష్టి, స్థితి సంహారములు ఉన్నాయి గాయిత్రి చతుష్పాద లక్ష్యం ఉన్నది కావున ఇది చతుష్పాదములతో ఉన్న గాయిత్రి మంత్రము కావున ఈ పద్యం చదివితే నాలుగు పాదాల గాయిత్రి చేసినట్లే.

పోతన గారు జీవన్ముక్తుడైన తరువాత వ్రాశారు గాని భాగవతము రచించిన తరువాత కాదు.

ఎప్పుడైతే శ్రీ మహా విష్ణువు పోతన గారిని భాగవతము వ్రాయమన్నాడో అప్పటికే జీవన్ముక్తుడు. మనలను ఉద్దరించడానికి భాగవతము వ్రాశారు.అందువల్లనే భారతీయ భాషలలో ఏ భాగవతమునకు దక్కని గౌరవం పోతనగారి భాగవతానికి దక్కింది.

మరొక్క మాట

సాధారణంగా సంస్కృత శ్లోకాలు మాత్రమే పారాయణమునకు అర్హము. ఎందువల్లనంటే

సంస్కృత శ్లోకాలలో అంతర్లీనముగా బీజాక్షరాలు ఉంటాయి లలితా సహస్రము, విష్ణు సహస్రము ఉదాహరణముగా తీసుకోవచ్చు. ఇక తెలుగు భాగవతము విషయంలో పారాయణమునకు పూర్తి అర్హత కలిగినది. వివాహము కొరకు రుక్మిణి కల్యాణము, అలాగే వివిధ విషయాలకు గజేంద్ర మోక్షం వంటివి పారాయణమునకు అర్హత కలిగినవే. ఎందువల్లనంటే ఈ తెలుగు భాగవతములో కూడా అంతర్లీనముగా బీజాక్షరాల అర్ధము ఉంది.ఉదాహరణమునకు శ్రీమాత్రేనమః

శ్రీమాత్రేనమః అను నామము ఉచ్చరించాలి అంటే శుచియై ఉండాలి కాని పోతన గారి ఈ పద్యము చదవడానికి భక్తి ఒక్కటే అర్హత.

అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె

ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ, తన్ను లో

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా

యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.


భావము: ఇక్కడ దుర్గమ్మయే లలితమ్మ, మహా కామేశ్వరి.మరియు శ్రీమాత 

దుర్గాదేవి తల్లు లందరికి తల్లి; సప్తమాతృకలను కన్నతల్లి; ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి; అందరు అమ్మల కన్నా అధికురాలైన గొప్పతల్లి; దైత్యులను నాశనము చేసి వారి తల్లియైన దితి కడుపులో దుఃఖము చేకూర్చిన తల్లి; నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి; అయిన మా అమ్మ దయాసముద్రి అయి ఈ మహాభాగవత తెలుగు ప్రణీత మందు కవిత్వంలో మహత్వము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక.

ఇదే శ్రీమాత్రేనమః నామానికి అర్ధము ఇంకా అనేక భాష్యార్ధాలు ఉన్నాయి ఇక్కడ అప్రస్తుతము.


బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు అధ్యయనం చేస్తేకాని భాగవతాన్ని చేబట్టే సామర్ధ్యం చేకూరదు .కాని పోతన భాగవతం అలాంటిది కాదు .అడుగడుగునా హరినామ స్తుతి అలరారుతుంది .అవకాశం ఉన్నప్పుడే కాదు ,అవకాశం కల్పించుకొని హరినామ స్తుతి చేస్తాడు భక్తకవి పోతన .

శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా! 

లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా

నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా! 

నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!

              శ్రీకృష్ణా అంటూ ఎంత చక్కని పద్యం చెప్పాడు స్మరణ భక్తికి ఇంతకంటే ఇంకా ఏ ఉదాహరణ కావాలి మహాభాగవతము అంతా ఇటువంటి పద్యాలే కదా

వ్యాసము పెద్దది అవుతోంది కాబట్టి ముగిస్తున్నాను

                   స్వస్తి

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - గ్రీష్మ ఋతువు - ఆషాడ మాసం - కృష్ణ పక్షం -‌ నవమి - భరణి -‌‌ స్థిర వాసరే* (19.07.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

వకార పంచకం

 *"వకార పంచకం - వస్త్రధారణ"*

                   

మనకు కేవలం చదువు, డబ్బు ఉంటే చాలు అనుకుంటాం.కానీ అలా కాదు. వీటితోపాటు "వకార పంచకం" ఉండాలి. వకార పంచకం అంటే "వస్త్రము, వపుష్షు, వాక్కు, విద్య,వినయం" అనే ఐదింటిని "వకార పంచకం" అని ఉంటారు. ప్రతి మనిషికి ఈ ఐదు ఉండాలి. లేకపోతే ఈ లోకంలో మనిషికి గౌరవం ఉండదు. వస్త్రధారణ ఈ ఐదింటిలో ఇంకా ముఖ్యం. సరియైన వస్త్రధారణ లేకపోతే అందరూ చిన్న చూపు చూస్తారు. ఇదిగో ఈ కథ చదవండి మీకే అర్థమవుతుంది.పూర్వం ధర్మపురి అనే గ్రామంలో ధనపాలుడు అనే ధనవంతుడు ఉండేవాడు.అతడు తాను సంపాదించిన ధనమంతా దానధర్మాలకే ఉపయోగించేవాడు. "ధర్మో రక్షతి రక్షితః" అని పెద్దలు చెప్పినట్లుగా అతని దానధర్మాలను గురించి ప్రజలంతా గొప్పగా చెప్పుకునేవారు. అలా అలా అతని పేరు దేశమంతా వ్యాపించింది. ఒకనాడు ఒక పండితుడు ధనపాలుని గురించి విన్నాడు. పండితుడు ఎంతో పేదవాడు. అందుకే ప్రతిరోజు భిక్షాటన చేయటం కంటే ఒకసారి ధనపాలుడులాంటి దాతను అర్ధిస్తే తన దరిద్రమంతా పోతుందని భావించాడు. ధనపాలుని దర్శనం కోసం అతని భవనానికి వెళ్ళాడు. బీదవాడు కావడంతో చినిగిపోయిన, మాసిపోయిన బట్టలతో బాగా పెరిగిన గడ్డంతో ఉన్నాడు. ద్వారపాలకులు అతనిని పిచ్చివాడిగా భావించారే గాని పండితుడిగా గుర్తించలేదు. ద్వారపాలకులు ఎంతసేపైనా అతనిని ధనపాలుని దర్శనం కోసం లోనికి వెళ్ళనివ్వలేదు. నేను వేద వేదాంగాలు,సకల శాస్త్రాలు చదివిన పండితుడిని. పండితులంటే మీ యజమానికి ఎంతో గౌరవం. కాబట్టి నన్ను లోనికి వెళ్ళనివ్వండి.మీకు పుణ్యం ఉంటుంది అని బ్రతిమాలాడు. అయినా సరే వారు "నీవు పండితుడివా" అంటూ హేళన చేశారే గాని లోనికి పోనివ్వలేదు.పండితుడు నిరాశతో ఇంటికి చేరుకున్నాడు. ద్వారపాలకులు ఎటువంటి వారికి మర్యాదిస్తున్నారో జ్ఞాపకం తెచ్చుకున్నాడు. తాను ఎలాగైనా ధనపాలుని దర్శనం చేసుకోగలిగితే చాలు. తన దరిద్రం తీరినట్లే అనుకున్నాడు. మరుసటి రోజు అంతా తన గ్రామంలో భిక్షాటన చేయగా వచ్చిన ధనంతో ఇంట్లోకి వస్తువులు కొనకుండా తళ తళమెరిసే మంచి వస్త్రాలు కొన్నాడు. క్షురకర్మ చేయించుకున్నాడు. ఒక సెంటు బుడ్డి కొన్నాడు. ఆ మెరిసే వస్త్రాలు ధరించి,సెంటు రాసుకుని ముఖాన పెద్ద నామం పెట్టుకుని ఎంతో ఆర్భాటంగా ధనపాలుని భవనానికి చేరుకున్నాడు.అతనిని చూసింది తడవుగా ద్వార పాలకులు ఇతను ఎవరో గొప్పగా పండితుడిలా ఉన్నాడు అనుకుంటూ వినయంతో అతనికి వంగి వంగి నమస్కారం చేస్తూ ధనపాలుని భవనంలోనికి పంపారు. ధనపాలుడు పండితునితో చాలాసేపు మాట్లాడాడు. తన ధర్మసందేహాలకు పండితుడిచ్చిన సమాధానాలు విని ఎంతో ఆనందపడ్డాడు. అతనికి ఎంతో ధనాన్ని ఇచ్చాడు. అంతేకాక ఈరోజు మా ఇంట్లో భోజనం చేసి వెళ్లాలని కోరాడు. పంచభక్ష్య పరమాన్నాలతో అతనికి విందు భోజనం ఏర్పాటు చేశాడు. తన ప్రక్కనే కూర్చుండబెట్టుకున్నాడు. ఇలా పండితుని ఎంతో గౌరవించాడు. పండితుడు భోజన సమయంలో అన్ని పదార్థాలను కొంచెం కొంచెం అన్నంతో కలిపి ఒక పెద్ద ముద్దగా చేశాడు. తన వస్త్రాన్ని కిందపరిచి దానిలో అన్నాన్ని మూటగట్ట సాగాడు. ధనపాలుడు పండితుని చూసి" ఓ పండితోత్తమా! ఇదేమిటి ఆహారాన్ని మీరు తినకుండా ఇలా మూట కడుతున్నారేమిటి?"అని అడిగాడు. అప్పుడు పండితుడు "ఓ ధార్మిక! నేను మీ దర్శనం కోసం ఈ రోజే కాదు. నిన్న కూడా వచ్చాను. అయితే మాసిన గడ్డంతో,చినిగిన వస్త్రాలతో వచ్చాను. నా వేషం చూసి మీ ద్వారపాలకులు నన్ను లోనికి పంపలేదు. ఈరోజు తళతళలాడే ఈ వస్త్రాలతో వచ్చాను. నా వేషధారణ చూసి మీ సేవకులు లోనికి పంపారు. మీరు నన్ను ఎంతో గౌరవించారు. ఎంతో ధనం ఇచ్చారు. మంచి విందు భోజనం పెట్టారు. నిజం చెప్పాలంటే నా విద్య వలన కాకుండా ఈ వస్త్రాల వల్లనే ఈ రోజు నాకింత గౌరవం లభించింది. మరి నేను ఈ వస్త్రాలకు కృతజ్ఞతలు చెప్పవద్దా! అందుకే లభించిన ఆహారంలో కొంత ఆహారాన్ని ఈ వస్త్రాలకు పెడుతున్నానని తెలిపాడు. తన సేవకులు విద్యకు కాకుండా వేషానికి గౌరవిస్తున్నారని తెలిసిన ధనపాలుడు చాలా బాధపడ్డాడు. తన సేవకులు చేసిన తప్పుకు తాను క్షమాపణ కోరుతున్నానని క్షమించమని కోరాడు. అప్పుడు పండితుడు "ఓ ధార్మిక! ఇందులో మీ దోషం ఏమీ లేదు. మీ సేవకుల దోషం కూడా లేదు.

" వస్త్రేణ వపుషా వాచా,

   విద్యయా వినయేన చ

   వకారైఃపంచభిర్హీనః 

   నరో నాయాతి గౌరవం"

అని పెద్దలు చెబుతారు.

వస్త్రము( వేషధారణ )వపుష్షు( శారీరక సౌందర్యంతో/ అందం) వాక్కు, విద్య, వినయం అనే వకార పంచకం లేనిదే ఏ మనిషికి విలువ ఉండదు. ఇది తెలిసి కూడా నేను నా వేషధారణకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇంత ఎందుకు మంచి వేషధారణ చేయని వారి ఇంటిలో లక్ష్మీదేవి ఉండదు. అనగా దరిద్రం వస్తుందన్నమాట. పూర్వం సముద్రుడు కూడా పట్టు పీతాంబరాలు, (పచ్చని వస్త్రాలు) బంగారు ఆభరణాలు ధరించి వచ్చిన శ్రీమహావిష్ణువును చూసి ఇతడు చాలా బాగున్నాడు అనుకుని తన కుమార్తె అయిన లక్ష్మీదేవిని ఇచ్చి వివాహం చేశాడు. ఒంటికి బూడిద రాసుకొని, గజ చర్మాన్ని వస్త్రంగా ధరించి, మెడలో పాములను, కపాలా(పుర్రె)లను ధరించి వచ్చిన పరమేశ్వరుని చూసి కాలకూట విషం ఇచ్చాడట.

ఇలా ఒక్కొక్కరికి చూస్తే ఒక్కొక్కటి ఇవ్వబుద్ధి అవుతుంది.మన వేషధారణనుబట్టి మనకు ఇతరులు గౌరవం ఇస్తారు" అంటూ పండితుడు ధనపాలునికి వస్త్రధారణకు ఉన్న విలువ ఏమిటో తెలిపాడు.

ధనం ఉంటే చాలదు. మన అందంగా ఉండాలి. అందం ఉంటే చాలదు. మంచి మాట తీరు ఉండాలి. మాట తీరు చాలదు. మంచి చదువు చదవాలి. చదువు ఉంటే మాత్రమే చాలదు. వాటికి తోడు వినయం ఉండాలి. ఇవన్నీ ఉన్నా మంచి వస్త్రధారణ లేకుంటే మనిషికి సరియైన విలువ లభించదు.

అజ్ఞానికంటే

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


   శ్లో𝕝𝕝 *అజ్ఞేభ్యోగ్రంథిన: శ్రేష్ఠా:!* 

            *గ్రంథిభ్యో ధారనో వరా:!*

            *ధారిభ్యో జ్ఞానిన: శ్రేష్ఠా:!*

            *జ్ఞానిభ్యో వ్యవసాయన:!!*


         ___ *మనుస్మ్రతి* ___


తా𝕝𝕝 అజ్ఞానికంటే ఏదో ఒకగ్రంథం చదివినవాడు శ్రేష్ఠుడు.... 

గ్రంథం చదివినవాడికంటే దానిని కంఠస్థం చేసినవాడు శ్రేష్ఠుడు..... 

కంఠస్థం చేసినవాడి కంటే అందులోని *మంచితనాన్ని ఆచరణలో పెట్టినవాడు మరింత శ్రేష్ఠుడు....*


 ✍️VKS ©️ MSV🙏