6, అక్టోబర్ 2025, సోమవారం

సీనియర్ సిటిజన్స్* తిరుపతి

 *సీనియర్ సిటిజన్స్* కోసం  తిరుపతి "శ్రీ వెంకటేశ్వర స్వామి" వారి ఉచిత దర్శన పథకం*


*లబ్ధిదారులు: 65 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు...


*ఉచిత దర్శన సమయాలు:*

* ఉదయం 10:00 గంటలు

* మధ్యాహ్నం 3:00 గంటలు


*ఎలా ప్రవేశించాలి:*

* మీరు మీ *ఫోటో ఐడి* మరియు *వయస్సు రుజువు*ను *కౌంటర్ S-1* వద్ద మాత్రమే సమర్పించాలి.


*ఆలయానికి మార్గదర్శకత్వం:*

* ఆలయం యొక్క కుడి గోడ వెంట వంతెన కింద ఉన్న గ్యాలరీ గుండా వెళ్లండి.

* ఎక్కడానికి మెట్లు అవసరం లేదు.

* తగినంత స్థలం అందుబాటులో ఉంది.


*సౌకర్యాలు:*

1. *ఉచిత భోజనం:* దర్శనం తర్వాత, మీకు *ఉచిత వేడి సాంబార్ (మసాలా) బియ్యం, పెరుగు అన్నం & వేడి పాలు* అందించబడతాయి.


 2. *బ్యాటరీ కార్లు:* సౌలభ్యం కోసం, *బ్యాటరీ కార్లు* కూడా అందుబాటులో ఉన్నాయి, ఇవి మిమ్మల్ని *పార్కింగ్ ఏరియా* నుండి *కౌంటర్*కి మరియు తరువాత నిష్క్రమణ గేటుకు తీసుకెళతాయి.


*ముఖ్య గమనిక :*

* ఎటువంటి *బలవంతం* లేదా *ఒత్తిడి* లేదు - *దర్శనం* *సీనియర్ సిటిజన్లకు* మాత్రమే *రిజర్వ్ చేయబడింది*.

*మీరు *దర్శన క్యూలో* ఉన్న తర్వాత, మీరు మీ *సందర్శన* & *నిష్క్రమణ*ను కేవలం *30 నిమిషాల్లో* పూర్తి చేయవచ్చు.


*సహాయం కోసం సంప్రదించండి :*

*TTD (తిరుమల తిరుపతి దేవస్థానం) హెల్ప్‌డెస్క్ నంబర్ :* *8772277777*


*ప్రత్యేక అభ్యర్థన:* దయచేసి ఈ సమాచారాన్ని అన్ని ఉర్ *ఇతర గ్రూపులకు* షేర్ చేయండి...!!

కృషి పరాశర గ్రంథ

 పరాశర మునిచే రచించబడిన కృషి పరాశర గ్రంథ విశేషాలు -


 * మాఘఫాల్గుణ మాసములలో విత్తనములు అన్ని ఒకచోట చేర్చి ఎండలో ఎండబెట్టవలెను . ఎండబెట్టుటకు భూమిపైన ఏదన్నా ఉంచవలెను .సరాసరి భూమి తగలరాదు.

 

* సమాన ఆకారము లో ఉన్న విత్తనాలు మంచిఫలితాలను ఇచ్చును. అందువలన ఒకేరూపములో ఉన్న విత్తనాలను భద్రపరచవలెను.


 * బీజముల సంచులను పుట్టలపైన , చీమల బొరియల పైన , గోశాలలో , ప్రసూతి గృహములలో , వంధ్య స్త్రీ ఉన్న స్థలములలో ఉంచరాదు.

 

* బీజములను ఎంగిలి చేయరాదు . రజస్వల, వంధ్యస్త్రీ, గర్భిణీస్త్రీ , బాలింత బీజములను తాకరాదు.

 

* వ్యవసాయదారుడు పొరపాటున కూడా నెయ్యి, నూనె , మజ్జిగ, దీపము బీజముల పైన ఉంచరాదు. 


 * దీపము , అగ్ని, పొగతో ఎండిన , వర్షములో 

తడిచిన బీజములను పొలములో చల్లరాదు.

 

* విత్తనములు వృక్షరూపములో పెద్దవైన తరువాత వాటిని తీసివేయరాదు. ఫలితాన్ని ఇవ్వవు.

 

* శ్రావణములో హస్త ప్రమాణ దూరములో భాద్రపదములో హస్తానికి ప్రమాణానికి సగం దూరంలో , కన్యలో నాలుగంగుళాల దూరంలో పంటలను నాటవలెను.

 

* ఆషాడ , శ్రావణ మాసములలో పంటలను కోయవలెను . ఆ సమయంలో కోయకున్న బీజాలు అలానే ఉండును.

 

* శ్రావణ మాసములో పంటని కోసిన వర్షము వలన పంట నష్టం జరగదు. భాద్రపదములో పంటని కోసిన సగం పంట మాత్రమే మిగులును. ఆశ్వయుజ మాసములో పంటని కోసిన ఆ పంట పైన ఆశలు వదుకోవలసివచ్చును.

 

* పొలమును రోగముల నుండి రక్షించుటకు భాద్రపద మాసములో పొలములోని జలమును బయటకి తీయవలెను. కేవలం వరిమొక్క మొదళ్ళలో మాత్రమే నీరు ఉండునట్టు చేయవలెను . భాద్రపదములో జలముతో నిండిన పంట వివిధరోగములతో నాశనం అగును.

 

* రైతు మార్గశిర మాసము వచ్చినపుడు శుభదినములలో పొలం దగ్గరకి వెళ్లి రెండు ముష్టిల ధాన్యం కోయవలెను . కోసిన ధాన్యపు దుబ్బులకు గంధపుష్పములతో నైవేద్యం తగినవిధముగా చేసి పూజించి ఈశాన్య కోణము నుంచి కోయడం మొదలు పెట్టవలెను.

 

* కోసిన ధాన్యపు కట్టను శిరస్సుపైన ఉంచి దారిలో ఎవరిని ముట్టుకోకుండా రైతు మౌనముగా గృహమునకు రావలెను. ఇంటిలో నున్న గదిలో ఏడడుగులు నడిచి పూర్వదిశలో ధాన్యపు కట్టని ఉంచి పూజించవలెను.

 

* ధాన్యము కొలిచే ఆడకము ఆకారములో పన్నెండు అంగుళములు ఉండవలెను . ఆడకముతో ధాన్యపు రాశిని ఎడమవైపు నుండి కొలవవలెను. దక్షిణము నుండి ధాన్యమును కొలిచిన వ్యయకారకం అగును. ఎడమవైపు నుండి కొలిచిన ధాన్యము వృద్ధిని పొందును.

 

* ధాన్యము కొలుచు ఆడకము మామిడి, పున్నాగము కర్రతో చేసినది ఉత్తమముగా ఉండును. వెలగచెట్టు , జువ్విచెట్టు కర్రతో చేసిన ఆడకముతో కొలిచిన పేదరికము వృద్ది అగును.

 

* హస్త, శ్రవణ, ధనిష్ట, మృగశిర, శతబిషం , పుష్యమి, రేవతి , రోహిణి , భరణి, మూల, ఉత్తరాత్రయం , మఘ , పునర్వసు నక్షత్రములలో గురు, శుక్ర, సోమవారాలలో సూర్యుడు మీనలగ్నములలో ఉన్నప్పుడు ధాన్యస్థాపనం చేయవలెను . నిధన సమయములు అనగా ఆది , మంగళ , శని, బుధవారములలో ధాన్యస్థాపనం చేయకూడదు . ధాన్యస్థాపనం అనగా పండిన ధాన్యాన్ని నిలువచేయడం . 


*. హేమంత ఋతువులో వ్యవసాయం చేసిన బంగారం పండును. ఇక్కడ బంగారం అనగా మంచిగా పండును అని అర్ధం. 


*. బీజములను ఎంగిలి చేయరాదు. రజస్వల స్త్రీ, వంధ్యా దోషము కలిగిన స్త్రీ, గర్భిణీ స్త్రీ, పురుడు పోసుకున్న స్త్రీ, బీజములను తాకరాదు. 



. మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .  



గమనిక -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034