18, ఆగస్టు 2025, సోమవారం

🌹19,ఆగస్టు, 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

     *🍁మంగళవారం🍁*

  *🌹19,ఆగస్టు, 2025🌹*  

     *దృగ్గణిత పంచాంగం*             


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షఋతౌః* 

*శ్రావణమాసం - కృష్ణపక్షం*


*తిథి  : ఏకాదశి* మ 03.32 వరకు ఉపరి *ద్వాదశి*

*వారం    : మంగళవారం* ( భౌమవాసరే )

*నక్షత్రం   : ఆరుద్ర* రా 01.07 వరకు ఉపరి *పునర్వసు*


       **ఈనాటి పర్వం*     

   *సర్వేషాం అజైకాదశి*


*యోగం : వజ్ర* రా 08.30 వరకు ఉపరి *సిద్ధి*

*కరణం  : బాలువ* మ 03.32 *కౌలువ* రా 02.43 ఉపరి *తైతుల*


*సాధారణ శుభ సమయాలు:*

              *—ఈరోజు లేవు—*

అమృత కాలం  : *మ 03.32 - 05.04*

అభిజిత్ కాలం  : *ప 11.46 - 12.36*

*వర్జ్యం      : ఉ 10.09 - 11.41*

*దుర్ముహూర్తం  : ఉ 08.24 - 09.14 రా 11.03 - 11.48*

*రాహు కాలం   : మ 03.20 - 04.55*

గుళికకాళం       : *మ 12.11 - 01.46*

యమగండం     : *ఉ 09.01 - 10.36*

సూర్యరాశి : *సింహం*

చంద్రరాశి : *మిధునం*

సూర్యోదయం :*ఉ 06.00*

సూర్యాస్తమయం :*సా 06.40*

*ప్రయాణశూల   : ఉత్తరం దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.52 - 08.24*

సంగవ కాలం         :     *08.24 - 10.55*

మధ్యాహ్న కాలం    :     *10.55 - 01.27*

అపరాహ్న కాలం    : *మ 01.27 - 03.58*


*ఆబ్ధికం తిధి         : శ్రావణ బహుళ ఏకాదశి*

సాయంకాలం        :*సా 03.58 - 06.30*

ప్రదోష కాలం         :  *సా 06.30 - 08.46*

రాత్రి కాలం           :*రా 08.46 - 11.48*

నిశీధి కాలం          :*రా 11.48 - 12.34*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.21 - 05.07*

******************************

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🍁శ్రీ ఆంజనేయ స్తుతి🍁*


*నమో శత్రుసంహారకం*  

*వజ్రకాయం*

*నమో మారుతిమ్* 

*రామ దూతం నమామి*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

సాక్షి

 🙏పానుగంటి లక్ష్మీనరసింహారావు ‘సాక్షి’ వ్యాసాలలోని ‘స్వభాష’లో కొన్ని మెరుపులు🙏


పరభాషా పదముల కర్థము తెలిసినంత మాత్రమునఁ బరభాషా పాండిత్యము లభించినదని భ్రమపడకుఁడు.భాషలోని కళను బ్రాణమును తత్త్వము నాత్మను గనిపెట్టవలయును. అది మీ కసాధ్యము. తుద కిన్ని యీనాములనమ్మి – యమ్మమెడలోని పుస్తెపూసలమ్మి – వంట యింటి పాత్రల నమ్మి – దైన్యపడి- వారములు చేసికొని – ముష్టియెత్తి సంపాదించిన – యాంగ్లేయ భాషలోని పాండిత్యపుఁబన యీ రంగులోనికి దిగినది. ఈ విధముగా బ్రద్దలైనది. స్వభాష యిదివరకు మీ చేతఁ జావనే చచ్చినది. మీ గతి యెంత యుభయ భ్రష్టమైనదో చూచు కొంటిరా? మీరు వెచ్చించిన ధనములోఁ బడిన శ్రమములో వినియోగపఱచిన కాలములోఁ, బొందిన దైన్యములో, నేడ్చిన యేడ్పులలోఁ, బదునాఱవ వంతైన నక్కఱ లేకుండ మీరు దేశభాషా పండితులై యుందురు. స్వభాషను మీరు నేర్చుకొనుట కేమంత శ్రమమున్నది? అక్షరాభ్యాస దినమునుండియె మీరు స్వభాష నభ్యసించు చున్నారని యనుకొనవలదు. మీ తల్లి కడుపులో నున్నప్పుడే నేర్చుకొనుట మొదలు పెట్టినారు. ఆమె భుజించిన పదార్థముల రసమును నాభీనాళ ద్వారమున మీలోఁ బ్రవేశపెట్టుచున్నప్పుడే యాంధ్ర భాషా జ్ఞానమును గూడ దానితో జోడించినది. తరతరముల నుండి వంశాను క్రమముగా మీ రక్తమలో జీర్ణమై, మీ మాంసమునకు మాంసమై, శల్యమునకు శల్యమై, మెదడుకి మెదడై, మీ తత్త్వముతో నైక్యమొందిన యాంధ్రభాషను, మీరిప్పుడు క్రొత్తగ నేర్చుకొను టయేమి? ఉపాధ్యాయుఁడైన నక్కఱ లేకుండ గ్రంథము లూరక చదువుకొనుచుఁబోయిన యెడల భాషా జ్ఞానసంపాదన మీ కెంతసేపు? నాకాంధ్రభాష రాదని మన యధ్యక్షుఁడు కంఠోక్తిగాఁ బలికినాఁడు. మా భాష మాకు రాదను ననర్హవాక్య మాంధ్రుని నోట నుండి వెడలఁదగదు. ఏ జాతి వారి నోటి నుండియు నంతే-ఆంధ్రదేశమున పుట్టి యెంత కాలమైనదో, ఇట్టి యనుచిత వాక్యము నేఁడు బయలువెడలినది. అనుచిత మనుమాట నిస్సందేహము. పోనిండు దీనికేమి? అనుచితకు – నసందర్భతకు -నవకతవకకు ననేక సంవత్సర ముల నుండి యలవాటుపడియే యున్నాము. భాష మీకు రాదేమి? అబ్బా! మీరే ప్రయత్నము చేసినా రని రాదనుచున్నారు? భాష తనంత తాను మీకు వచ్చుననియే యనుకొనుచున్నారా? మహమ్మదుగారి యెద్దకుఁ గొండ రాకపోయినప్పుడు మహమ్మదు గారు కొండ యెద్దకు వెళ్లినారా లేదా? మీకు భాష రాకపోవుట భాష లోపమా? మీ లోపమా? భాషను గొంచెము దీక్షతోఁ బఠించిన యెడల నది రానివాఁ డుండునా? పఠింపకుండ భాష రావలయునన్న నది పైపైన నున్నదా? భాష యందు మీకు నిర్లక్ష్యత యైనప్పుడు భాషకు మీ యందభిమానముండునా? భాషా గ్రంథము మీకుఁ దలక్రింద నెత్తునకైనఁ బనికిరానప్పుడు భాషా జ్ఞానము మీ తలలో నెట్లు దూరును? చదివినను భాష రానివాఁడెవ్వండు? ఎవ్వఁడో, వ్రేలు మడఁచి యొక్కని పేరెత్తి చెప్పుఁడు. భాషలోఁ బుట్టి భాష నేర్చుకొని భాషరాక భ్రష్టుఁడైన ప్రపంచాతీతపురుషుఁ డెవ్వఁడో చూతము. చూచి యథార్థముగ స్వభాషా జ్ఞానమున కర్హుఁడు కాని యద్భుతాజ్ఞానతత్త్వమే యగునెడ- నన్నయ భట్టుకాలము నుండి యిప్పటి వఱకున్న భాషా గ్రంథములన్నియుఁ గట్టకట్టి బంగాళా ఖాతములోఁ బాఱవే యుదము. మనకు రానిభాషతో మనకేమి పని? అయ్యయ్యో? రవంత కష్టమైనఁ బడనక్కఱ లేదా? నోరు మెదపనైన నక్కఱలేదా? ‘క్రిమినల్‌ ‌ప్రాసీజర్కోడ్‌’ ‌చేతఁ బట్టకుండనే మన యధ్యక్ష శిరోమణికి శిక్షాశాస్త్ర సిద్ధి యయినదా? ‘ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ‌ప్రాపర్టీ’ ఆక్టు తలఁగొట్టుకొని వల్లెవేసిన వారే – తారాశశాంక విజయము రవంత చదువలేరా? సరదా తీరును. శబ్దజ్ఞానము వచ్చునే – ఊరకే రమ్మన్న నేదైన వచ్చునా? అట్లెవ్వనికైన వచ్చినదా? కడుపు నిండుటకు నోటిలోఁ బడినదానిని మ్రింగనైన వలదా? అమాత్రపు శ్రమమైనఁ బడనక్కఱ లేదా? ‘మెయిన్సు పీనల్కోడ్‌’ ‌మడత వేయుటలో మెదడు చింపుకొన్న వాఁడవే- మనుచరిత్రమున నొక్క యాశ్వాసమును విలాసము కొఱకైనను జదువుటకు నీ కోపిక లేకపోయెనా? తీరిక లేకపోయెనా? శక్తి లేకపోయెనా? బుద్ధిలేకపోయెనా? చంద్రబుల్లి నామూలాగ్రముగ నెఱుఁగుదువుకాని చంద్రమతి పేరైన నెఱుఁగవే! ‘కన్హింగ్హామ్సు ఎవిడెన్సు’ ఆక్టు వలన నీకడుపే నిండునుగాని కంకంటి వారి రామాయణము వలన నీ మనస్సు నిండునే! ‘జస్టిసు హాలోనే’గారి జడ్జిమెంటు నొప్పఁజెప్పఁగలవు కాని జనకచక్రవర్తి ప్రపంచమునకు బోధించిన నీతి నెఱుఁగవే? ‘సివిల్‌ ‌ప్రాసీజర్కోడు లేటెస్టు ఎడిషన్‌’ ‌కుఁ గర్త యెవ్వఁడో యెఱుఁగుదువుకాని సీతా రామాంజనేయ కవి యెవఁడో యెఱుఁగవే? భారత భాగవతములను బఠింపని నీవు బారిష్టరు వైననేమి – ప్రభూత్తముఁడ వైననేమి? ఆంధ్రుడవై యేల పుట్టితివోయి నాయనా! నీవాంధ్ర దేశయన కెందులకోయి నాయనా. నాకు బోధపడక యడుగు చున్నాను. క్షమింపుము. నీవే పుస్తకములను జదువనక్కఱలేదు. దినమున కొక్కసారి పావుగంట తెఱపిచేసికొని రాత్రి భోజనమైన తరువాత నిల్లాలిని బిల్లలను నీ చుట్టు కూరుచుండఁబెట్టుకొని తాంబూల చర్వణ మాచరించుచు నడుమ నడుమ నాన్కో ఆపరేషను ముచ్చటలఁజెప్పుకొనుచు నాంధ్రపత్రికను జదుపరాదా? నాలుగు మాసములట్లు చదువుము. నాకాంధ్ర భాషా జ్ఞానమెంత వృద్ధియగునో తెలుఁగుబాసలో నేదైనపస యున్నదని నీ కప్పటికిఁ దెలిసినయెడల భాషా గ్రంథములను జదువవచ్చును. అందఱు తెలుఁగు మాటలాడవలసిన యిందఱలో నీ వొక్కఁడ నింగ్లీషుతో మాటలాడితివి! కావుకావు మని యనవలసిన కాకులన్నిటిలో నొక్క కాకి కొక్కొరకో యని యఱచినయెడల మిగిలిన కాకులు దానిని ముక్కుతోఁ బొడిచివేయక మానునా? మేము నీవంటి యనేక ప్రకృతుల కలవాటు పడినవారము కావున సరిపోయినది. కాని లేకున్న నేమి కాఁదగినది? ఆంగ్లేయభాష యేల చదువుకొంటివని నే నధిక్షేపింపను. ఇంతకన్న నధిక జ్ఞానమును గూడ నీ వాభాషలో సంపాదింపుము. నాకు మరింత యిష్టము కాని నీయాంగ్లేయభాషా జ్ఞాన మెందులకో నీ వెఱుఁగుదువా? ఆంగ్లేయభాషయే కాదు, ఇంక ననేక భాషలు కూడా నేర్చుకొనుము. నీవు సంపాదించిన పరభాషాజ్ఞానమంతయు నీ భాష నభివృద్ధి పఱచుటకే. నీ భాషను భాగ్యవత్తరమును జేయుటకే- నీ భాషను బరభాషాగ్రంథ ప్రశస్తాభి ప్రాయములతో వన్నెపెట్టుటకే – అంతకంటే వేరు కాదే. ఆంధ్రభాషలో అ ఆ లకంటే నవతలి యక్కఱము లెరుఁగని వాఁడవు కదా! ఆంధ్రుఁడవై యుండియు నాంధ్రభాషలో ‘ఆ’ యని నోరు మెదలుపలేనివాఁడవు కదా! నీ యాంగ్లేయ భాషా జ్ఞానమును దేశమున కెట్లు పచరింపఁ దలఁచితివో చెప్పుము. నాయనా! నిన్ను గ్రంథములు వ్రాయమని కోరుచున్నా ననుకొంటివేమో? నీవు వ్రాయునదేమి? పార్టీలనెత్తిన పేఁడ- ఏ గ్రంథము నీవు వ్రాయవలదు. ఏ గ్రంథమును జదువవలదు. రేపటి నుండియే యాంధ్రపత్రిక నామూలగ్రముగఁ జదువుచుండుము. తెఱపిలేదని సందేహించుచుంటివా? క్లబ్బులో గంటన్నర చీట్లాటకుఁ దెఱపియుండుఁగా, టెన్నిసు కోర్టులో రెండు గంటలు లోకాభిరామాయణమునకుఁ దెఱపియుండుఁగా, దేశభాషా పత్రికా రాజమును జూచుట కొక్క యరగంట తెఱపిలేకుండునా? తెఱపి లేకపోయినయెడలఁ జేసికో.


నాయనలారా! మన కింగ్లీషు మాటలతోఁ జెప్పినఁగాని యే యంశము కూడ మనస్సున కెక్కదు. అట్టి యభ్యాసము చిరకాలము నుండి యస్థిగత రోగమైయున్నది. ఆయుర్వేదవైద్యుఁడు వచ్చి ‘‘అయ్యా కరివేపాకు పొడుముతోఁబథ్యము పుచ్చుకొనుమని నీతోఁజెప్పఁగ నీ కామాట నచ్చదు. నానెన్సున్సు, కరివేపాకుపాడు మెందులకయ్యా యని నీ వా యాయుర్వేదవైద్యు నధిక్షేపింతువు. ధనియాలు ‘డైజేషన్‌కు’ మంచివి. మిరియాలు ‘లివర్‌’ ‌మీద ‘ఆక్టు’ చేయును. కరివేపాకు ‘గాల్‌ ‌బ్లాడర్‌’‌కు సత్తువ నిచ్చునని యెనఁడో ఎల్‌.ఎం.‌పి. మనవాఁడే చెప్పిన యెడల నీ కది శ్రుతిప్రమా ణము. నాయనలారా! మనమెంత లక్షాధి పతులమైనను గోటీశ్వరులమైనను మన బ్రదుకులు ముష్టి బ్రదుకులు కాని మఱియెకటి కాదు. ఈ ముష్టిదేవులాటలో నింగ్లీషు మాటలు కూడా నెందులకు? ఆ యేడుపేదో మాతృభాషతోడనే యేడ్చిన మంచిది కాదా? మన యేడుపు సహజముగాను సాపుగాను స్వతంత్రముగా నుండునే. ఏడుపులోఁ గూడ మన కస్వతంత్రత యేమి కర్మము? అందుకు సర్వస్వతంత్రులము సంపూర్ణాధికారులమే కదా? ముష్టి బ్రాహ్మణుఁడు నీ యింటికి వచ్చి యాయావరపు బ్రాహ్మణుఁడి నయ్యాయని యఱవక ‘‘బాయ్‌ ‌రూములోనున్న పాట్‌లో రైస్‌ ‌యేమైన నున్నదేమో, కైన్‌ ‌డ్లీగెటిట్‌ ‌హియర్‌; ‌థాంకు యూ ఇన్‌ ఆం‌టిసిపేషన్‌’’ అని నీతో సంభాషింపఁగ, వాతనికి ముష్టి వేయుదువా? మూఁతిమీఁద నీడ్చి యొక్కటి వేయుదువా? అలాగే మన ముష్టిలోని యీ ఇంగ్లీషు మాటలు కూడనంత గౌరవప్రదములే యని నిశ్చయముగా నమ్ముఁడు – నమ్ముఁడు.

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

చంద్ర గ్రహణం

 మెుదటి చంద్ర గ్రహణం 07-09-2025

----------------------

7/9/25 బాధ్రపద పూర్ణిమా ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవించును.ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం.కుంభరాశిలో శతభిషం,మరియు పూర్వాభాద్ర నక్షత్రాలలో ఇది సంభవించును.కావున కుంభరాశి వారు దీనిని చూడకూడదు.మరుసటి రోజు యధావిది చంద్రగ్రహణ శాంతి జరుపుకొనవలెను.

గ్రహణ స్పర్శ కాలం రాత్రి 9:50 ని.లు 

గ్రహణ మధ్యకాలం:రాత్రి 11:41ని,లు

గ్రహణ మోక్ష కాలం రాత్రి1:31ని.లు

గ్రహణ అద్యంత పుణ్యకాలం : 3:41ని.లు

నిజమైన స్నేహం

 **నిజమైన స్నేహం నిస్వార్ధంగా ఉంటుంది **

**నిర్మలంగా నిర్భయంగా ఉండమంటుంది **

@@@@ @@@@

**స్నేహాలు పలు రకాలు **

**స్నేహితులు రకరకాలు **

**అవసరం కోసం చేసే స్నేహం అవకాశం కోసం ఎదురుచూసే స్నేహం అవుతుంది ద్రోహం **

**నిజమైన స్నేహితుడికి ఉండదు అహం **

**అహం ఉన్న దేహంలో స్నేహం ఇమడదని కొందరి స్నేహితుల సందేహం **

**చాలామంది కి స్వచ్ఛమైన స్నేహం తనివితీరని దాహం **

**మంచిని పంచటంకోసం నిరంతర సన్నాహం **

**దీనిపైనా కూడా అతిగా పెంచుకోకు మోహం **

**నిజమైన ఫ్రెండ్స్ కి ద్రోహం చేస్తే జీవితం లో చూపించుకోలేవు మొహం **

**మంచివాడు ముంచేవాడిగా కనిపిస్తే నీ దృష్టి తప్పు ఈ సృష్టి తప్పు కాదు **

**స్నేహంలో ఓ హద్దుంటేనే ముద్దు హద్దుమీరిన స్నేహం వద్దు చేయొద్దు అనడంలో తప్పు లేదు **

**స్నేహం ముసుగులో కోటీస్వరులు ఉన్నారు కూటికి లేని ఈశ్వరులున్నారు **

**బంధువులతో అమ్మా నాన్నలతో కొన్ని మాత్రమే చెప్పగలం స్నేహితులతో అన్నీ చెప్పుకోగలం **

**నీ స్నేహితుల గురించి నువ్వు చెప్పు నువ్వేమిటో నేను చెబుతా అని హీరో శోభన్ బాబు గారు నాతో చెప్పారు నేను మీకు చెబుతున్నా -*

**మంచి మెసేజ్ కి బదులు ఇవ్వనివాడు బతకడం ఎందుకు అని కొందరి ప్రశ్న **

**మంచిని పంచేవారే నా ఫ్రెండ్స్ డైమండ్స్ నా స్నేహం లో ఉండవు డిమాండ్స్ **

**నా మిత్రులే అజాత శత్రువులు **

**ఇప్పటికి 103 సార్లు వృద్ధులకు అన్నదానం చేశాము 3,300కేజీల రైస్ నిరుపేదలకు పంచాము శ్రీ షిర్డీసాయి హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో **

**నా ఫ్రెండ్స్ డైమండ్స్ లా మెరుస్తారు ఆనందవర్షంలో తడుస్తారు **

**స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు నెరవేరాలి మీ ఆకాంక్షలు **

**బొమ్మిన వెంకటరమణ **

**సినీ మాటల రచయిత **

**83746 01678**

గమనించండి

 *దయచేసి గమనించండి*


రేపటి నుండి ఆగస్టు 22 వరకు వాతావరణం గత సంవత్సరం కంటే చల్లగా ఉంటుంది. దీన్ని అప్హెలియన్ (Aphelion) ఫినామినాన్ అని అంటారు. ఇది రేపు ఉదయం 5:00 గంటల నుండి 7:00 గంటల మధ్య ప్రారంభమవుతుంది. మనం ఈ అప్హెలియన్ ఫినామినాన్‌ను కేవలం గమనించడమే కాకుండా అనుభవిస్తాము కూడా. ఇది ఆగస్టు 22, 2025 న ముగుస్తుంది.


ఈ సమయంలో మునుపెన్నడూ అనుభవించని విధంగా చల్లని ఉష్ణోగ్రతలు ఉండవచ్చు. దీని కారణంగా శరీర నొప్పులు, గొంతు రాపిడి, జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు రావచ్చు. కాబట్టి విటమిన్లు మరియు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలతో మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడం మంచిది.


సాధారణంగా సూర్యుడు మరియు భూమి మధ్య దూరం 90,000,000 కి.మీ. ఉంటుంది. కానీ ఈ అప్హెలియన్ ఫినామినాన్ సమయంలో ఆ దూరం **152,000,000 కి.మీ.**కి పెరుగుతుంది, ఇది 66% పెరుగుదల.


దయచేసి ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సన్నిహితులతో పంచుకోండి. ఇది భయం కలిగించడానికి కాదు, మనం అనుభవించబోయే భౌగోళిక పరిస్థితులను తెలియజేయడానికే.

ధాతు పౌష్టిక లేహ్యము

 ధాతు పౌష్టిక లేహ్యము గురించి సంపూర్ణ వివరణ -


         ఈ లేహ్యము ప్రాచీనమైన ఒక మూలికల సమూహము మరియు భస్మాలను కలిపి తయారుచేయడం జరుగును . ఈ లేహ్యము నందు సుమారు 36 రకాల మూలికలు మరియు స్వర్ణభస్మం , రజతభస్మం , ముత్యభస్మం , శతపుటి అభ్రకం మొదలైన భస్మాలను కూర్చి స్వచ్ఛమైన తేనెతో కలిపి ఈ లేహ్యం తయారగును . ఇందులో కలిపే మూలికలను ఒక్కొక్కటి శుద్ది చేయుచూ ఉపయోగించవలెను . 


  ఈ లేహ్యం ఉపయోగించటం వలన ప్రయోజనాలు - 


 * శరీరము నందలి మేహ సంబంధ దోషాలు నివారణ అగును . 


 * నీరసం , నిస్సత్తువ తగ్గును . 


 * శరీరము నందు కండరాలు బలహీనపడి ఉన్నవారు మరియు శరీరము బక్కచిక్కి ఉన్నవారికి ఈ లేహ్యం వాడుచున్న కండరాలు బలంగా తయరగును . కండరాలు వృద్ధిచెందును . 


 * గుండె సంబంధ దోషాలు , గుండెల్లో దడ , గుండె మంట నివారణ అగును . 


 * నోటివెంట రక్తము పడుట తగ్గును . 


 * శరీరము నందు రక్తము వృద్ది అగును . 


 * రక్తము శుద్దిచేసి రక్తము నందలి టాక్సిన్స్ నిర్వీర్యం చేయును . 


 * థైరాయిడ్ గ్రంథి మీద పనిచేయును . గ్రంథి పనితీరు మెరుగుపరచును . 


 * మెదడు నందలి న్యూరాన్లకు మంచిశక్తిని ఇచ్చి బుద్ధిబలమును , జ్ఞాపకశక్తిని పెంచును . 


 * ఎముకలు బలపడును . మరింత గట్టిగా తయారగును . శరీరము నందలి క్యాల్షియం లోపములు తగ్గును. 


 * ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నవారు , ఆయసముతో ఇబ్బందిపడువారికి ఇది అత్యంత పుష్టిని కలుగచేయును . 


 * కాలేయమునకు బలమును ఇచ్చును. 


 * ఆడవారిలో గర్భసంబంధ దోషములను నివారించును . 


 * వయస్సు పెరుగుతున్న కొలది వచ్చు బలహీనత మరియు ఎముకల సులువుగా విరిగిపోవడానికి కారణం అయిన క్యాల్షియం లోపాన్ని పోగొట్టును . 


 * గర్భాశయాన్ని , అండాశయాలు శుద్దిచేయును . 


 * నరాల సంబంధ దోషాలను నివారించును . 


 * కాళ్ళు పట్టుకుపోవడం , కండరాల నొప్పులు నివారించును . 


 * చర్మాన్ని కాంతివంతముగా ఉంచును . 


• చిన్న పిల్లలలో అద్భుతమైన జ్ఞాపకాలు శక్తి, శరీర పుష్టి, రోగనిరోధక శక్తి పెంపోందించును. 


•. మగవారిలో మరియు ఆడవారిలో కలుగు హార్మోన్ సంబంధ సమస్యలకు ఇది అత్యద్భుతముగా పనిచేయును. 


•. నాడీ సంబంధ దోషాలు నివృత్తి అగును. శరీరము నందు వ్యాపించి ఉన్న 72 వేల నాడులు శుద్ధి అగును. 


•. జ్ఞానేంద్రియల శక్తి పెరుగును. 


•. మగవారిలో వీర్యశక్తి పెరుగును. వీర్యకణాల ఉత్పత్తి, శక్తి పెరుగును. 


•. సంసార సంబంధ బలహీనత తగ్గును. 


°. కీల్లానొప్పుల మీద కూడా ప్రభావాన్ని చూపించును.  


పైన చెప్పినవే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచును . ఈ మధ్యకాలంలో కరోనా వచ్చి తగ్గినవారిలో తీవ్రమైన బలహీనత ఏర్పడుచున్నది. అటువంటి సమస్యతో ఇబ్బందిపడేవారు ఈ లేహ్యాన్ని వాడటం మూలన త్వరగా శరీరబలాన్ని పొందవచ్చు. మాములుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా దీన్ని వాడుట మూలాన శరీరం నందలి రోగనిరోధక శక్తి పెరుగును రోగాలపాలు కాకుండా ఉంటారు . 


      ఈ లేహ్యంను చిన్నవారు మొదలుకొని స్త్రీపురుషులు మరియు వయస్సు మీదపడిన పెద్దవారు సహా అందరూ వాడవచ్చు . ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు . 


ముఖ్య గమనిక - 


      కరోనా వచ్చి తగ్గి శరీర బలహీనతతో ఇబ్బంది పడువారు ఈ లేహ్యాన్ని వాడుట వలన అత్యంత త్వరగా బలాన్ని పొందగలరు. 


           ఈ లేహ్యం కావల్సినవారు డైరెక్టుగా కాల్ చేయగలరు . 

   సంప్రదించవలసిన నంబర్ 9885030034 . 


               కాళహస్తి వేంకటేశ్వరరావు 


           అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                      9885030034

శిరావేధ పద్దతి

 శిరావేధ పద్దతి - ప్రాచీన చికిత్సా పద్దతి - 2 . 

     

అంతకు ముందు పోస్టు నందు మీకు మన ప్రాచీన అయుర్వేదము నందలి శిరావేధ చికిత్స గురించి , చేయు విధానం గురించి వివరించాను. శిరావేధ పద్ధతిని "రక్తమోక్షణం " అని కూడా అంటారు. ఈ రక్తమోక్షణం ఏయే భాగాలలో చేస్తే ఏయే వ్యాధులు తగ్గునో మీకు వివరిస్తాను . 

  

* పాదదాహము , పాద హర్షము ( గుర్రం మూతి ) , చిప్పము , విసర్పి , వాతరక్తం ( గౌట్ ) , వాత కంటము , విచర్చికా , పాదదారి మొదలగు వ్యాధుల యందు హస్తపాదముల మధ్య ఉండు క్షిప్రమర్మములకు పైభాగమున రెండు అంగుళములలో విహ్రీ ముఖము ( సన్నటి పరికరం ) తో శిరకు రంధ్రం చేసి దుష్టరక్తమును తీయవలెను . 

 

*  క్రోష్టుక శీర్షము , ఖంజము , పంగు వంటి వాతవ్యాధులకు చీలమండకు పైన నాలుగు అంగుళములలోని పిక్క యందు శిరకు రంధ్రం చేయవలెను . 

 * గృదసీవాతం ( సయాటికా ) నందు మోకాలు సంధికి నాలుగు అంగుళముల కింద గాని , పైన గాని శిరకు రంధ్రం చేయవలెను . 

 

*  గళ గండ రోగము నందు తొడ మొదట ఆశ్రయించి ఉండు శిరను వేధించిన కంఠమును ఆశ్రయించి ఉండు గళగండ రోగము నివృత్తి అగును. 

 

*  ప్లీహ ( spleen ) రోగము నందు ఎడమచేయి మోచేతి సంధి యందు ఉండు శిరను గాని లేక చేతి యొక్క చిటికెనవ్రేలుకు , ఉంగరం వ్రేలుకు మధ్య యందు ఉండు శిరను వేధించవలెను . 

 

*  కాలేయరోగము నందు ప్లీహమునకు చెప్పినట్టు కుడివైపున చేయవలెను . శ్వాసకాసలకు కూడ కుడి పార్శ్వముల యందు ఉండు శిరలను వేధించవలెను . 

 

*  పరివర్తిక , ఉపదంశ , శుక్రదోషముల యందు , శుక్రవ్యాధుల యందు శిశ్నము మధ్యయందలి శిరను వేధించవలెను . 

 

*  అసాధ్యములగు అంతర్విద్రదుల యందు , పార్శ్వశూల ( ఒకవైపు తలనొప్పి ) కక్షా స్థనభాగముల మధ్యవుండు శిరను వేధించవలెను . 

 

*  అసాధ్యమగు తృతీయక జ్వరం నందు ముడ్దిపూసకు మధ్య వెన్నెముక క్రింద ఉన్న శిరను వేధించవలెను . 

 

*  అసాధ్యమగు చాతుర్ధికా జ్వరం నందు భుజశిరస్సులకు క్రిందగా రెండు పార్శ్వముల యందు ఉండు సిరలలో ఎదైనా ఒకదానిని వేధించవలెను . 

             

ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతిరోగానికి ఏయే భాగములో శిరావేధ చేయవచ్చో అత్యంత ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో వివరణాత్మకంగా ఉన్నది . నేను అటువంటి గ్రంథాలను నా పరిశోధన నిమిత్తం అధ్యయనం చేయుచుండగా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోగలిగాను  . ఆ విజ్ఞానాన్ని మీకు అందించాలన్న సదుద్దేశముతో మీకు సంపూర్ణ సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది.  నేను రాసిన రెండు గ్రంథాలలో మరింత విపులంగా సమాచారాన్ని ఇచ్చాను. 

         

మరొక విలువైన సమచారాన్ని మీకు త్వరలో అందిస్తాను. 

                            


.                    సమాప్తం  



.          మరింత విలువైన సమాచారం మరియు అనేక రోగాలకు సులభ చిట్కాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


గమనిక  -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

.        నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

.         ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

.    ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

.       కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

.               9885030034

Panchaag

 


నారాయణాయ

 *ఓం నమో నారాయణాయ!*


 మొన్న కురిసిన భారీ వర్షాలకు కేరళ రాష్ట్రంలో ఎన్నో జిల్లాలు వరదల పాలయ్యాయి;

అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్న తిరువనంతపురం లోనూ వరదలు వచ్చాయి.

స్వామి వారి ఆలయం ముందు ఉండే పద్మ తీర్థం నిండిపోయింది , ఆలయం దగ్గరకు వెళ్ళే మార్గం వర్షపు నీటిలో మునిగిపోయింది . దాంతో మూడు రోజుల పాటు స్వామి వారి ఆలయం తెరువలేదు , నిత్య పూజలు జరుగలేదు. 

అయితే పురాణ ప్రాశస్త్యం ప్రకారం అనంత పద్మనాభ స్వామి వారిని ప్రతి రోజూ దేవతలు పుజిస్తారట. అర్చక స్వాములు ఆలయాన్ని తెరువక ముందే దేవతలు స్వామి వారిని సేవిస్తారట!

అనంత పద్మనాభ స్వామి వారి మూర్తి పూర్తిగా నీటిలో మునిగిపోతే ప్రళయం సంభవిస్తుందని ఆలయశాసనంలో ఉంది.

మొన్న కురిసిన వర్షాలకు తిరువనంతపురం దాదాపుగా మునిగిపోయింది; స్వామి వారి మూర్తి ఎంత వరకూ వరదలో మునిగిందో అని తిరువనంతపుర ప్రజలు భయాందోళనలు పొందారు . ఆలయం దగ్గర కనిపించిన వరద తాకిడి కూడా భయానకంగా కనిపించిందట! మూడు రోజుల తరువాత అర్చక స్వాములు ఆలయ తలుపులు తీసి చూసి నిశ్చేష్టు లయ్యారు . స్వామి వారి గర్భాలయం లోనికి నీరు ప్రవేశించలేదు . ఎక్కడా తేమ కూడా లేదు. అప్పుడే కడిగి శుభ్రపరచినట్లుగా పొడిగా, సుగంధ పరిమళాలతో సువాసనలతో, అఖండంగా ప్రజ్వరిల్లుతున్న దీపం దర్శన మిచ్చాయి . 

అంతే కాదు స్వామి వారికి అలంకరించిన పూలమాలలు తాజాగా ఉన్నాయి . బయట ధ్వజస్తంభం కూడా పరిశుభ్రంగా తేమ లేకుండా ఉంది; 

స్వామి వారి ఆలయం చుట్టూ ఉండే ఉపాలయాలలోను వరద నీరు ప్రవేశించలేదు. ఇటువంటి అద్భుతాలకు సైంటిఫిక్ రీజన్ ఉండదు. నాస్తికుల ప్రశ్నకు సమాధానం ఉండదు. అదేంటో మరి!


ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయ అద్భుతం నిజంగా భక్తుల హృదయాలను కదిలించే సంఘటన!


 *పురాణప్రాశస్త్యం ప్రకారం*


అనంత పద్మనాభ స్వామి నిత్యమూ దేవతల చేత పూజలు పొందుతారు అని జనం విశ్వాసం.


ఆయన విగ్రహం పూర్తిగా నీటిలో మునిగితే ప్రళయం సంభవిస్తుం దనే శాసనం ఉంది.


 భారీ వర్షాలతో తిరువనంతపురం మునిగినా,

 స్వామి వారి గర్భాలయం లోనికి నీరు ప్రవేశించక పోవడం,

దీపాలు నిరంతరం వెలిగిపోవడం,

పూలమాలలు తాజాగా ఉండడం,

ధ్వజస్తంభం కూడా తేమ లేకుండా శుభ్రంగా కనిపించడం

అన్నీ ఆ పరమాత్మ అనుగ్రహానికి స్పష్టమైన సాక్ష్యం.


ఇలాటి అద్భుతాలకు శాస్త్రీయ సమాధానం ఉండదు;

అది కేవలం భక్తి, విశ్వాసం,

 దైవకృపతోనే అర్థం చేసుకోవాలి.


 ఇది భక్తుల నమ్మకాన్ని మరింత బలపరచి, స్వామి వారి అఖండ పరిరక్షణశక్తిని నిరూపించింది.


*ఓం నమో నారాయణాయ!* అనేది కేవలం మంత్రం కాదు – అది సర్వలోక రక్షకుడి సన్నిధిని పిలిచే మహావాక్యం.


*(ఓం అనంత పద్మనాభ స్వామ్యై నమః*)


‌ 🌹🌹🌹🌹🌹

ప్రకృతి వైపు*

 సోనాలి బెంద్రే - క్యాన్సర్ 


ఇర్ఫాన్ ఖాన్ - క్యాన్సర్


మనీషా కొయిరాలా - క్యాన్సర్


యువరాజ్ సింగ్ - క్యాన్సర్


సైఫ్ అలీ ఖాన్ - గుండెపోటు


హృతిక్ రోషన్ - బ్రెయిన్ క్లాట్


అనురాగ్ బసు - రక్త క్యాన్సర్


ముంతాజ్ - రొమ్ము క్యాన్సర్


షారుఖ్ ఖాన్ - 8 శస్త్రచికిత్సలు

(మోకాలి, మోచేయి, భుజం మొదలైనవి)


అజయ్ దేవ్‌గన్ - లిటరల్ ఎపికొండైలిటిస్

(తీవ్రమైన భుజం వ్యాధి)


తాహిరా కశ్యప్ (ఆయుష్మాన్ ఖురానా భార్య) - క్యాన్సర్


రాకేశ్ రోషన్ - గొంతు క్యాన్సర్


లిసా రాయ్ - క్యాన్సర్

రాజేష్ ఖన్నా - క్యాన్సర్,

వినోద్ ఖన్నా - క్యాన్సర్

నర్గిస్ - క్యాన్సర్

ఫిరోజ్ ఖాన్ - క్యాన్సర్

టోమ్ బలిపీఠం - క్యాన్సర్ ...


ఈ వ్యక్తులు లేని వారు కాదు, 

డబ్బు కొరత లేని వారు...!!

డైటీషియన్ సలహా మేరకు ఎల్లప్పుడూ ఆహారం తీసుకుంటారు...!!

ఏసిలో నివసించేవారు మరియు బిస్లెరి నీరు త్రాగేవారు....!!

జిమ్‌కు కూడా వెళ్తారు...!!

రోజూ అన్ని రకాల శరీర పరీక్షలు చేయించుకుంటారు...!!


ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన స్వంత వైద్యులు ఉన్నారు...!!


ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది? 


వాళ్ళకు శరీరంపై చాలా శ్రద్ధ ఉన్నప్పటికీ, వాళ్ళు అకస్మాత్తుగా ఇంత తీవ్రమైన అనారోగ్యం ఎలా పొందారు?


ఎందుకంటే వారు  సహజమైన వస్తువులను ఉపయోగించడం మానేశారు.


ప్రకృతి మనకు ఎప్పటికీ హాని కలిగించదు కాబట్టి ఏదైనా ప్రకృతి సహజ ఫలo తినండి లేదా త్రాగండి...!!


శరీరానికి ఎటువంటి హాని జరుగదు..!!


మనం ఈ భూమిని కలుషితం చేయకపోతే, భూమి నుండి బయటకు వచ్చిన నీటి నాణ్యత చాలా బాగుంటుంది...!!


మీరు పుట్టినప్పటి నుండి మీ పిల్లవాడిని ఒక్క సూక్ష్మక్రిమి కూడా లేని చోట ఉంచి చూడండి. పెరిగిన తరువాత, సాధారణ ప్రదేశంలో నివసించడానికి వదిలివేసి చూడండి. ఉదాహరణకు మైఖేల్ జాక్సన్ ఆక్సిజన్ టెంట్లలో, అత్యంత పరిశుభ్రమైన పరిసరాల్లో నివసించినా, అనారోగ్యం పాలై, చిన్న వయసులోనే అతి దారుణమైన పరిస్థితుల్లో మరణించాడు....!!


ఆ పిల్లవాడు సాధారణ జ్వరాన్ని కూడా భరించలేడు!!!


ఎందుకంటే అతని శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ సూక్ష్మక్రిములతో పోరాడటానికి సరిపడినంతగా అభివృద్ధి చెందలేదు....!!


మీరు ఒక రోజు సబ్బుతో స్నానం చేయకపోతే మీరు సూక్ష్మక్రిములతో చుట్టుముట్టబడతారు మరియు సాయంత్రం కల్లా మీరు చనిపోతారని కార్పొరేట్ సంస్థలు మనల్ని భయభ్రాంతులకు గురిచేసాయి...!!


మనం ఎలా నివసిస్తున్నామో అర్థం కావడం లేదు.

ఒకరితో ఒకరు కరచాలనం చేసిన తరువాత ప్రజలు శానిటైజర్ను వాడడం మనం చూస్తున్నాము.


మీరు ఎప్పుడైనా గమనించారా!

పిజ్జా బర్గర్ తినే సిటీ పీపుల్

సులభంగా వ్యాధుల బారిన పడుతున్నారు. కార్పొరేట్ హాస్పిటళ్ళు వారిని పీల్చి పిప్పి చేస్తాయి. 


పాలు పెరుగు మజ్జిగ తినే

గ్రామంలో వృద్ధులకి అదే జ్వరం, మందులు లేకుండా నయమవుతుంది. వారికి చిన్న చిన్న సమస్యలను తట్టుకునే సహజసిద్ధ ఆరోగ్యం ఉంటుంది. ప్రకృతిలో మమేకమై, శారీరక శ్రమతో దినచర్య ఉండే వారు, దృఢంగా ఉంటారు. అంతేకానీ, ప్రతీ చిన్న సమస్యకు మందులపై ఆధారపడరు. 


డబ్బు ఎల్లవేళలా ఆరోగ్యాన్ని మరియు ఆనందాన్ని కలిగించదు...!!


 మళ్ళీ వెళ్దాం_

 *ప్రకృతి వైపు*

Panchaag