10, అక్టోబర్ 2025, శుక్రవారం

వేదాల సారం పురాణాలలో

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹మన సనాతన సంప్రదాయాల గురించి తెలుసుకోవలసినవి ఎన్నో.. ఎన్నెన్నో. వేదాల సారం పురాణాలలో ఉంటే, ఆ పురాణాల సారం శ్రీభారత్ ఛానల్ లో ఉంటుందన్నట్లుగా ప్రతివారం ఆ పురాణ కథలు మీ ముందుకు తెస్తున్నాం. అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు ఆ కథలను అందిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

శుక్రవారం🌹*_ *10అక్టోబర్2025* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       _*🌹శుక్రవారం🌹*_ 

         *10అక్టోబర్2025*         

       *దృగ్గణిత పంచాంగం*

                  

            *ఈనాటి పర్వం*     

        *సంకష్టహర చతుర్థి*


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - శరత్ఋతౌః*

*ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం*


*తిథి  : చవితి* రా 07.37 వరకు ఉపరి *పంచమి*

*వారం    : శుక్రవారం* ( భృగువాసరే )

*నక్షత్రం  : కృత్తిక* సా 05.31 వరకు ఉపరి *రోహిణి*

*యోగం : సిద్ధి* సా 05.31 వరకు ఉపరి *వ్యతీపాత*

*కరణం  : బవ* ఉ 09.14 *బాలువ* రా 07.37 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.30 - 10.30 సా 04.30 - 05.30*

అమృత కాలం  : *సా 03.22 - 04.48*

అభిజిత్ కాలం  : *ప 11.31 - 12.18*

*వర్జ్యం    : ‌ఉ 06.47 - 08.12*

*దుర్ముహూర్తం  : ఉ 08.21 - 09.08 మ 12.18 - 01.05*

*రాహు కాలం   : ఉ 10.25 - 11.54*

గుళికకాళం      : *ఉ 07.28 - 08.57*

యమగండం    : *మ 02.52 - 04.21*

సూర్యరాశి : *కన్య*                      

చంద్రరాశి : *వృషభం*

సూర్యోదయం :*ఉ 06.08*  

సూర్యాస్తమయం :*సా 05.57*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.59 - 08.21*

సంగవ కాలం         :     *08.21 - 10.43*

మధ్యాహ్న కాలం    :     *10.43 - 01.05*

అపరాహ్న కాలం    : *మ 01.05 - 03.27*


*ఆబ్ధికం తిధి         : ఆశ్వయుజ బహుళ చవితి*

సాయంకాలం        :*సా 03.27 - 05.50*

ప్రదోష కాలం         :  *సా 05.50 - 08.15*

రాత్రి కాలం           :*రా 08.15 - 11.30*

నిశీధి కాలం          :*రా 11.30 - 12.19*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.10*

******************************

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷*


*ఇచ్ఛారూపాం భగవత*

*స్సచ్చిదానందరూపిణీమ్*


            *🪷ఓం శ్రీ🪷* 

*🌷మహాలక్ష్మీయై నమః🌷*

🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


           🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

అంశం.. వర్షం (బాల గేయం)

 అంశం.. వర్షం (బాల గేయం)

శీర్షిక.. చిటపట చినుకులు! 


బాలల్లారా రారండి 

ఉరకులు వేసే ఉత్సాహంతో 

పరుగులు తీస్తూ రారండి

చిటపట చినుకుల్లో చిందులు వేయగా రారండి..


నింగికి నేలకు నిచ్చెన లేస్తూ 

మబ్బులు పందిరి వేసాయండీ 

చల్లని గాలులు వీచాయండి

చిటపట చినుకుల్లో చిందులు వేయగ రారండి..


ముత్యాల తలంబ్రాలు చల్లాయండీ 

మట్టిని మాణిక్యంలా చేస్తూ 

సిరి సౌభాగ్యాలను పండించేందుకు

శ్రీరస్తు శుభమస్తని దీవించాయండీ..


కురిసాయండీ వానజల్లులు 

చెట్టూ చేమా పులకించగా 

విరుల హరివిల్లులు వికసించగా 

పైరూ పంటలు సయ్యాటలు ఆడగా..


ఏరులు సెలయేరులు ఝరులై పొంగగా 

నదులు అలలతో కిలకిలలాడగా 

ప్రకృతి కన్నియ పైయెద ఉప్పొంగగా 

ఆనందాలు చిగురులు వేయగా..


చిందులు వేద్దాం చిటపట చినుకులతో 

గెంతులు వేద్దాం వానా వానా వల్లప్పతో 

జోరుగా కురిసే వానలో హుషారుగా 

కిలకిల కలకల నవ్వుల నదిలో ఆటలు ఆడేద్దాం..!

               *******

ఇది నా స్వీయ బాలగేయం

మహిత మార్గ శీర్షం

 ఓం శ్రీ మాత్రే నమః

9-10-25

మహిత మార్గ శీర్షం 

(అవధాన పుష్కరిణీ అంతర్జాల మాస పత్రికార్థం)

(కవితా ఖండిక)

డా.రఘుపతి శాస్త్రుల


మాసములందు మార్గ శిర మాసమె శ్రేష్ఠ మటంచు చెప్పె వి

శ్వాసము గూర్చు నట్లు భగవానుడు కృష్ణుడు వర్షమందు నీ

మాసపు ధ్యాన సంపదలు మానిత సత్ఫలితార్థ సిద్ధితో

భాసిత రీతులన్ సుగతి వర్ధిల గూర్చుచు నుండు నెప్పుడున్ 


స్కందుడు షష్ట మాతృకల సంపదగా జననమ్మునందె యీ

సుందరమైన షష్టిని, సుశోభిత రీతుల నొప్పు పూజలా

నందము తోడ గైకొను సనాతన దైవము, భక్తి చిత్తమం

దొంద, ననుగ్రహమ్మును యథోచిత రీతుల గూర్చు నీశుడున్ 


గీతాచార్యుని కృష్ణునిన్ జగతి సంక్షేమ ప్రదానార్థమౌ

గీతార్థమ్ము స్మరించినన్ సుమతితో కీర్తింప ప్రద్యుమ్నుడున్  

చేతోమోదమునందు మాసమిదియే శీఘ్రమ్ముగా స్తోత్రముల్

ప్రీతిన్ గాంచుచు సద్గతుల్ గనగ సంవేద్యుండు గూర్చున్ సదా 


దత్తాత్రేయుడు దివ్య రూపుడు భువిన్ తత్త్వార్థ త్రైలోక్య సం

పత్తిన్ గాంచిన మాసమిద్ది తలపన్ వైవిధ్యమౌ రీతులన్ 

దత్తోపాసన జేయగల్గినను ప్రత్యక్ష స్తుతిన్ పూర్ణిమన్ 

బత్తిన్ సాధన జేయువారలిలలో వర్ధిల్లగన్ సాధ్యమౌ


సమశీతోష్ణపు శోభలం గనుచు ప్రాశస్త్యమ్ముగా పృథ్వియున్

తమికాన్పించుచు వేడ్క చేయు నెదకున్ తాల్మింగనన్ కర్షకుల్ 

తమదౌ త్యాగము వర్ధిలన్ కృషిని సంధానింప నీ నేలయున్ 

రమణీయమ్మగు సంపదన్ హరిత సామ్రాజ్యంపు సొంపొప్పెడిన్


నమస్సులతో 


డా.రఘుపతి శాస్త్రుల

హైదరాబాద్ 

రిటైర్డ్ ప్రిన్సిపల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల

మూత్రపిండాలు-Kidneys*

 


    *మూత్రపిండాలు-Kidneys*

                ➖➖➖✍️


*Kidneys : ఈ త‌ప్పులు చేశారంటే.. మూత్రపిండాలు దెబ్బ తింటాయి జాగ్ర‌త్త‌..!*

```

మ‌న శరీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంలో మూత్ర పిండాలు ముఖ్య‌మైన పాత్రను పోషిస్తాయి. మ‌నం ఆరోగ్యంగా ఉండాలి అంటే మూత్ర పిండాలు నిరంత‌రంగా ప‌ని చేస్తూనే ఉండాలి. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను, విష ప‌దార్థాల‌ను వ‌డ‌బోసి మూత్ర పిండాలు వాటిని బ‌య‌టకు పంపిస్తాయి. కానీ ప్ర‌స్తుత తరుణంలో చాలా మంది మూత్రాశ‌య సంబంధిత స‌మ‌స్య‌లు, మూత్ర పిండాల‌లో రాళ్లు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. మూత్రపిండాల ఆరోగ్యం మ‌నం తీసుకునే ఆహారం, తాగే నీటి శాతంపై ఆధారప‌డి ఉంటుంది. మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉండ‌డానికి మ‌నం పాటించాల్సిన సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..


*1. మ‌ద్య‌పానం వ‌ల్ల మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బ తింటుంది. మ‌ద్యం మూత్ర పిండాలపై ఒత్తిడిని క‌లిగించి అవి దెబ్బ తినేలా చేస్తుంది. క‌నుక మ‌ద్య‌పానం చేయ‌కపోవ‌డ‌మే ఆరోగ్యానికి చాలా మంచిది.


*2. మ‌న‌లో చాలా మంది మూత్రం వ‌చ్చిన‌ప్పుడు వెళ్ల‌కుండా ఆపుకుంటూ ఉంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల మూత్రపిండాల‌కు ఎంతో హాని క‌లుగుతుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల మూత్రపిండాల‌లో రాళ్లు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోకూడ‌దు. మూత్రం వ‌చ్చిన వెంట‌నే పోసేయాలి.


*3. మ‌నం రుచి కోసం వంట‌ల్లో ఉప‌యోగించే ఉప్పు కూడా మూత్రపిండాల ప‌ని తీరును దెబ్బ తీస్తుంది. ఉప్పును అధికంగా వాడ‌డం వ‌ల్ల అధిక ర‌క్త పోటు వ‌చ్చే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. రోజుకి 5 గ్రాముల కంటే అధికంగా ఉప్పును తీసుకోవ‌డం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. క‌నుక ఉప్పు వాడ‌కాన్ని త‌గ్గించాలి.


*4. పంచ‌దార అధికంగా క‌లిగిన ప‌దార్థాల‌ను, పానీయాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మూత్ర పిండాల‌లో రాళ్లు వ‌స్తాయి. క‌నుక వీటిని త‌క్కువ‌గా తీసుకోవ‌డం మంచిది.


*5. శ‌రీరానికి తగినంత నిద్ర ల‌భించ‌క పోతే మూత్రపిండాలు అనారోగ్యాల‌కు గుర‌వుతాయి. క‌నుక రోజుకు క‌నీసం 6 నుంచి 8 గంట‌లు అయినా స‌రే నిద్ర‌పోవాలి.


*6. ప్రోటీన్స్ అధికంగా ఉన్న ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మూత్రపిండాల‌పై ఒత్తిడి అధికంగా ప‌డి మూత్ర పిండాలు త్వ‌ర‌గా దెబ్బ తింటాయి. క‌నుక‌ ప్రోటీన్స్ అధికంగా ఉన్న ఆహార ప‌దార్థాల‌ను త‌క్కువ‌గా తీసుకోవాలి.


7. శ‌రీరంలో విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ లోపం వ‌ల్ల కూడా మూత్ర పిండాల ఆరోగ్యం దెబ్బ తింటుంది. విట‌మిన్ బి6, విట‌మిన్ ఎ, మెగ్నిషియం అధికంగా కలిగిన ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మూత్ర పిండాల ప‌నితీరు మెరుగుప‌డ‌డమే కాకుండా మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.


*8. మ‌నం తాగే నీరు మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచ‌డంలో ప్రాధాన పాత్ర పోషిస్తుంది. మ‌నం రోజుకి కనీసం 6 నుండి 7 గ్లాసుల నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.


ఈ నియ‌మాల‌ను పాటించ‌డం వ‌ల్ల మూత్ర పిండాల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. అలాగే మూత్ర పిండాల‌లో రాళ్లు వ‌చ్చే అవ‌కాశాలు కూడా త‌క్కువ‌గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.✍️```

-సేకరణ.

మన గ్రూప్ లోవచ్చే ఆర్టికల్స్ 

కేవలం గ్రూప్ సభ్యుల అవగాహన కోసం మాత్రమే!

మీ అన్ని ఆరోగ్య సమస్యలకు మీమీ డాక్టర్ గారి సలహాలను పాటించండి 🙏

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖