16, జులై 2020, గురువారం

ఋణానుబంధం - కధ

అన్నిటిని పరిత్యజించి మోక్షానికి వెళ్లవలసిన ఒక యోగి, ఒకనాటి మండుటెండలో వెడుతూ ఎండకి ఓర్చుకోలేక,  ఒక చెప్పులు కుట్టే వాడు దారిలో పెట్టిన చెప్పులపై కొంత సేపు నిలబడ్డాడు.

ఆ మాత్రం నిలబడినందున, ఆ ఋణం తీర్చు కోవడానికి  మరుజన్మలో ధారానగరంలో పరమేశ్వరి, సోముడు - అనే దంపతులకు సునందుడు అను పేరుతో పుట్టాడు. 

జాతకం చూపిస్తే,  పెద్దలు ఆ తలిదండ్రులకు ఒక హెచ్చరిక చేస్తారు. 

ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణపడి ఉన్నాడు. 'వాడి చేతి నుంచి పైసా కూడా తీసుకోకండి. అతడికి మీరే అన్నీ ఇస్తూండండి' అని చెప్తారు. 

నాటినుంచీ తల్లిదండ్రులు వానినుంచి ఏమీ ఆశించకుండా పెంచుతారు. 

పూర్వజన్మ గుర్తున్నందున ఆపిల్లవాడు వారి రుణంతీర్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. 

ఒకరోజు రాత్రి రాజభటుడైన తన తండ్రికి బదులుగా 
తాను రాజనగరుకు కాపలా కాయవలసి వచ్చింది. 
అపుడు ప్రతి జాముకీ ఒకసారి ఆ యువకుడు నగరప్రజలను హెచ్చరిస్తూ హితవు ఒకటి చెబుతుండే వాడు. 

రాజుగారు మారువేషంలో తిరుగుతూ ఇవన్నీ విని ఇతడు సామాన్యుడు కాడని గుర్తిస్తాడు. 

మరునాడు స్వయంగా అతడి ఇంటికి వెళ్లి రాత్రి తాను అన్నీ విన్నాననీ, తన మనసు ప్రశాంతి పొందిందనీ అంటాడు. 

పళ్లెంలో వెంట తెప్పించిన ధనాన్ని అతడికి అందిస్తాడు. 

అతడు వెంటనేె ఆ ధన రాశిని తల్లికి ఇవ్వగా ఆమె పుత్రోత్సాహంలో,  నియమం మరచి ఆ పళ్లెం అందుకుంటుంది. 

వెంటనే అతడు తనువును విడిచి ముక్తి పొందుతాడు. 
తలిదండ్రులు దుఃఖిస్తే రాజు ఆ యువకుడు రాత్రి కావలి సమయంలో చెప్పిన ఈ క్రింది ఉపదేశాలు వినిపించి ఓదారుస్తాడు : 

1. మాతా నాస్తి, పితా నాస్తి, 
నాస్తి బంధు సహోదరః| 
అర్థం నాస్తి, గృహం నాస్తి, 
తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు. 
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 

2. జన్మ దుఃఖం, జరా దుఃఖం, 
జాయా దుఃఖం పునః పునః| 
సంసార సాగరం దుఃఖం 
తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా:- ఈ జన్మ, వృద్ధాప్యము, భార్య, సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. 

కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 

3. కామః  క్రోధశ్చ, లోభశ్చ 
దేహే తిష్ఠతి తస్కరాః| 
జ్ఞాన రత్నాపహారాయ 
తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా :-  కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు  విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. 
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 

4. ఆశయా బధ్యతే జంతుః 
కర్మణా బహు చింతయా| 
ఆయుక్షీణం న జానాతి 
తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఏదో ఆశకు, కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో,  జీవితాలు 
గడుపుతుంటారు. ఆయుర్ధాయం తరిగిపోతుందన్న 
విషయాన్ని గమనించరు. 
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 

5. సంపదః స్వప్న సంకాశాః 
యౌవనం కుసుమోపమ్| 
విధుఛ్చచంచల ఆయుషం 
తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, అంటే అశాశ్వతాలు.  యౌవనం పూవుతో సమానం అంటే ఎపుడు వాడి నశిస్తుందో తెలియదు. ఆయుష్షు మెరుపుతీగవలె చంచలమైనది.  
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 

6. క్షణం విత్తం, క్షణం చిత్తం, 
క్షణం జీవితమావయోః| 
యమస్య కరుణా నాస్తి 
తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


7. యావత్ కాలం భవేత్ కర్మ 
తావత్ తిష్ఠతి జంతవః| 
తస్మిన్ క్షీణే వినశ్యంతి 
తత్ర కా పరివేదన|| 

తా:- ప్రపంచంలో తమ కర్మబంధము ఎంతవరకు ఉంటుందో,  అంతవరకే ప్రాణులు జీవిస్తాయి. ఆ కర్మబంధం వీడిపోగానే మరణిస్తారు. జననమరణాలు జీవుని ధర్మము. దానికి బాధపడటం ఎందుకు. 


8. ఋణానుబంధ రూపేణ 
పశుపత్నిసుతాలయః| 
ఋణక్షయే క్షయం యాంతి 
తత్ర కా పరివేదన|| 

తా:- గత జన్మ ఋణానుబంధము ఉన్నంతవరకే భార్య, సంతానం, ఇల్లు, పశువులు ఉంటాయి. ఆ బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి. అందుకు వ్యథ చెందడ మెందుకు. 

9. పక్వాని తరుపర్ణాని 
పతంతి క్రమశో యథా| 
తథైవ జంతవః కాలే 
తత్ర కా పరివేదన|| 

తా:-  పండిన ఆకులు చెట్టునుండి ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు? 


10. ఏక వృక్ష సమారూఢ 
నానాజాతి విహంగమాః| 
ప్రభతే క్రమశో యాంతి 
తత్ర కా పరివేదన|| 

తా:-  చీకటి పడగానే అనేక జాతులు పక్షులు ఒకే వృక్షం 
ఆశ్రయించి విశ్రమిస్తాయి. తెల్లవారగానే ఆ పక్షులు 
అన్నీ చెట్టును విడచి తమతమ ఆహార సంపాదనకు 
వెళ్ళిపోతాయి. అదే విధంగాబంధువులతో కూడిన 
మానవుడు కాలమాసన్నమైనపుడు తన శరీరాన్ని 
ఇంటిని వదలి వెళ్ళిపోతాడు. అందుకు బాధపడ 
నవసరములేదు. 


11. ఇదం కాష్టం ఇదం కాష్టం 
నధ్యం వహతి సంగతః| 
సంయోగాశ్చ వియోగాశ్చ 
కా తత్ర పరివేదన|| 

తా - ప్రవహించే నదిలో రెండు కట్టెలు దగ్గరకు చేరతాయి. కొంతదూరం కలిసి పయనిస్తాయి తరువాత విడిపోతాయి. అదేవిధంగా మానవుడు ఈ ప్రపంచ ప్రవాహంలో కొంతకాలం సంయోగసుఖమును, మరికొంతకాలం వియోగదుఃఖమును అనుభవిస్తాడు. దానికి పరివేదన చెందనవసరములేదు. 


ఈచివరి శ్లోకం భార్యభర్తల గురించి సంకేతంగా చెప్పినదే! ఒక అమ్మాయి,ఒక అబ్బాయి వేరు వేరు కుటుంబాలలో జన్మిస్తారు. వీరిద్దరు జీవితమనే నదిలో కలుస్తారు. కొంతకాలం కలిసి బతుకుతారు. కాలం సమీపించడంతో ఒకరు కైవల్యం చెందుతారు, మరొకరు ఉండిపోతారు మరికొంతకాలం. ఇది సహజం మరియు సృష్టి క్రమం.

ఇందులో  వేదన ఉండదని చెప్పలేదు. వేదన పడవద్దనీ చెప్పలేదు. సృష్టి సహజంగా వేదన తప్పదు. అందునా ఇద్దరు చాలా సంవత్సరాలు కలిసి జీవించిన వారిలో ఒకరు జారిపోతే మరొకరు వేదన పొందక ఎలా ఉండగలరు? సహజమైన వేదనను అడ్డుకోలేం. దానిని అనుభవించవలసినదే! 

మరి పరివేదన పనికిరాదన్నారు. వేదనకి, పరివేదనకి తేడా ఉంది. వేదన సహజాతం.  దానిని అను భవించాలి, పరివేదన అలాకాదు, మనం తలుచుకుని తలుచుకుని వేదన చెందడాన్నే పరివేదన అంటారు. ఈ పరివేదన పనికి రాదన్నారు. 

 యఇది సహజం, సృష్టి క్రమం సుమా! ఏడిస్తే పోయినవారు తిరిగొస్తారా? రాగలరా? సాధ్యమా? సృష్టి క్రమం ఇలాగే జరుతుంది, వేదన తప్పదు, పరివేదన పడకు అన్నారు.

మానవులలో చాలా రకాల బంధుత్వాలున్నాయి, కాని భార్యాభర్తలది ప్రత్యేక బంధం, ఇటువంటిది మరొకటి లేదు. అందుకే వీరిగురించి మాత్రమే ప్రత్యేకంగా ఉదహరించి చెప్పేరు. దంపతులిద్దరూ ఒకసారి పోరు, ఎవరి సమయమొస్తే వారు జారిపోతారు, రెండవవారు మిగిలిపోతారు,కొంతకాలం, ఒంటరిగా. 

ఇది అందరు భార్యభర్తలకీ జరిగేదే! 

ఇది సహజ పరిణామం,సృష్టి క్రమమమని చెప్పి ఓదార్చడమే లక్ష్యం.

సమయస్పూర్తి -- కధ

ఆఫీసులో fb ఓపెన్ చేసి చూస్తుంటే సుజాతారావ్ అని ఫ్రెండ్ రిక్వెస్ట్ కనిపించింది..
ఎవరా అని డీటెల్స్ చూసా..
ఒక అమ్మాయి పంపింది..
ఫోటోలు ఏవీ అప్లోడ్ చెయ్యలేదు..
బహుశా కొత్తగా ఎకౌంట్ ఓపెన్ చేసిందనుకుంటా..
సరే మనం Fb లో కొద్దిగా యాక్టివ్ కదా..
అందుకే రిక్వెష్ట్ పెట్టింది అనుకొని ఓకే చేసా...!

👉కొన్ని రోజులు తర్వాత నేను పెట్టే ఫోటోలకు, పోష్టులకు లైక్ లు కొడుతుంది..
తర్వాత చాటింగ్ మొదలు పెట్టాం..
ఒక రోజు నీ భార్యంటే నీకు ఇష్టమా..!?
అందంగా ఉంటుందా..!?
అని అడిగింది..
నేను పాజిటివ్ గా స్పందించా..
నేను కూడా అందముగా ఉంటాను తెలుసా...!? అన్నది..
👆👉ఇలా కొన్ని రోజులు చాట్ తర్వాత సడన్ గా నేను బిజినెస్ పనిమీద మీఊరు వచ్చా..
మనం హోటల్ లో కలుద్దాం..
డిన్నర్ చేసి సినిమా కెళ్దాం..అన్నది..
లేదు మా ఇంటికి రండి నాభార్య చాలా బాగా చికెన్ కర్రీ చేస్తుంది..
డిన్నర్ చేసి ముగ్గురం సినిమాకి వెళ్దాం అని చెప్పా..
తను ఒప్పుకోలేదు చాలా రకాలుగా నన్ను ఒప్పించాలని ప్రయత్నించింది..
చివరిగా ఈ ఒక్కరోజే నేను
మీ ఊరిలో ఉండేది..
తర్వాత నీ ఇష్టం అన్నది..
నేను సున్నితంగా తిరస్కరించా..
ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళా..
డైనింగ్ టేబుల్ నీట్ గా అలంకరించి ఉంది.. నాకిష్టమైన చికెన్ కర్రీ స్మెల్ గుమాయించి వస్తుంది....
నా భార్య చిరునవ్వుతో ఆహ్లాదంగా కనిపించింది..
👆👉నేను.. ఏమిటీ ఈ రోజు విశేషం...!? అని అడిగా..
తను అన్నది.. ఈ రోజు మీ Fb ప్రెండ్ సుజాతారావ్ డిన్నర్ కి మన ఇంటికి వస్తుంది అని..

👆👉ఆమె గురించి నీకు ఎలా తెలుసు...!? అని అడిగా....
తెలుసు...!! ఎలా అంటే
ఆ "సుజాతారావ్ ను నేనే" కాబట్టీ..
మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉందండీ అంటూ ఆనందంతో కౌగిలించుకుంది....!

🔥Note :-
అప్పుడప్పుడు మీ భార్యల మొబైల్ ఫోన్, లాప్ టాప్ చెక్ చేయండి.. లేదనుకో స్టోరీ ఇలా ఉండదు రివర్స్ లో ఉంటుంది..

👆👉ఒకవేళ గనక సినిమా కి డిన్నర్ కి ok సెప్పి ఉంటే అతన్ని పక్కా బంగాళాఖాతంలో ముంచేది అదే  భార్యామణి...!

భిలాషాష్టకము’ (ఆత్మావీరేశ్వర స్తోత్రం)

విశ్వానరుడు వీరేశ్వర లింగమునుండి తనకు ఎనిమిదేళ్ళ బాలునిగా సాక్షాత్కరించిన శివుని స్తుతించినది.

1. ఏకం బ్రహ్మైవాద్వితీయం సమస్తం సత్యం సత్యం నేహ నానాస్తి కించిత్!
ఏకోరుద్రో నద్వితీయోవతస్థే తస్మాదేకం త్వాం ప్రపద్యే మహేశం!!

2. ఏకః కర్తా త్వం హి సర్వస్య శంభో నానారూపే ష్వేకరూపోస్య రూపః!
యద్వత్ప్రత్యపస్వర్క ఏకోప్యనేక స్తస్మాన్నాన్యం త్వాం వినేశం ప్రపద్యే!!

3. రజ్జౌ సర్పః శుక్తికాయాంచ రూప్యం నైరః పూరః తన్మృగాఖ్యే మరీచౌ!
యద్వత్తద్వద్విష్వగేష ప్రపంచో యస్మిన్ జ్ఞాతే తమ్ ప్రపద్యే మహేశం!!

4. తోయే శైత్యం దాహకత్వం చ వహ్నౌ తాపో భానౌ శీతభానౌ ప్రసాదః!
పుష్పే గంధో దుగ్ధమధ్యేపి సర్పిః యత్తచ్ఛంభోత్వం తతస్త్యాం ప్రపద్యే!!

5. శబ్దం గృహ్ణాసి అశ్రవాస్త్యం హి జిఘ్రేరఘ్రాణస్త్యం వ్యంఘ్రిరాయాసి దూరాత్!
వ్యక్షః పశ్యేస్త్యం రసజ్ఞోప్యజిహ్వః కస్త్వాం సమ్యగ్ వేత్త్యతస్త్యాం ప్రపద్యే!!

6. నో వేదస్త్వామీశ సాక్షాద్ధివేద నోవా విష్ణుః నోవిధాతాఖిలస్య!
నోయోగీంద్రా నేంద్ర ముఖ్యాశ్చ దేవా భక్తో వేద త్వామతస్త్యాం ప్రపద్యే!!

7. నో తే గోత్రం నేశ జన్మాపి నాఖ్యా నోవారూపం నైవశీలం న దేశః!
ఇత్థం భూతోపీశ్వరస్త్యం త్రైలోక్యాః సర్వాన్ కామాన్ పూరయే స్తద్భజే త్వాం!!

8. త్వత్తః సర్వం త్వంహి సర్వం స్మరారే త్వం గౌరీశస్త్యంచ నగ్నోతి శాంతః!
త్వం వైవృద్ధస్త్వం యువాత్వం చ బాలః తత్త్వం యత్కిం నాస్యతస్త్యాం నతోస్మి!!

ఫలశ్రుతి: ఈ స్తోత్ర పఠనం పుత్రపౌత్ర ధనప్రదము, సర్వ శాంతికరము, సర్వాపత్పరినాశకము, స్వర్గమోక్ష సంపత్తికారకము. ప్రాతః కాలమున నిద్రమేల్కొని, చక్కగా స్నానము చేసి, శివలింగమును పూజించి ఒక సంవత్సరము జపించిన యెడల అపుత్రకుడు పుత్రవంతుడగును. వైశాఖ, కార్తిక, మాఘమాసము లందు విశేష ఫలప్రదము. స్త్రీగాని, పురుషుడు గాని వీరేశ్వర లింగ సన్నిధియందు నియమ పూర్వకముగా ఒక సంవత్సరము జపించుటవలన పుత్రవంతుడగును. సందేహం లేదు.

శ్లో!! స్త్రియావా పురుషేణాపి నియమాల్లింగసన్నిధౌ!
అబ్దం జప్తమిదం స్తోత్రం పుత్రదం నాత్ర సంశయః!!

బ్రాహ్మణులం ...అంటే ?


వేదపండితులు ఎక్కడా ఎవరిదగ్గరకూ వెళ్ళి పూజలు ప్రార్ధనలు మంత్రాలంటూ బలవంతపెట్టడంలేదు.ఎవరైనా వారి నమ్మకం తో వస్తేనే తెలిసింది చేస్తారు..
మనలో చాల మందికి ఎన్నో అపోహలున్నాయి బ్రాహ్మణులంటే
ఏదో వేదమంత్రాలు చదువుకొని హప్పీగా పూజలు చేసుకుంటూ బ్రతికేస్తారని,
కష్టమన్నది ఎరగకుండా సంపాదిస్తారని చాల అపోహలున్నాయి .
కాని ఏ 10% బ్రాహ్మణులు తప్ప మిగిలిన వారు కడుపు తిప్పలకోసం
ఎంత స్ట్రగుల్ చేస్తున్నారు అన్నది కొన్ని జీవితాలను దగ్గరినుండి చూసిన
నాకు తెలుసు .
సంప్రదాయాలలో బందీలు అవుతూ చిన్న చిన్న సరదాలు కూడా కోల్పోయిన బ్రాహ్మణులూ ఎందరో ..?నాణేనికి బొమ్మా,బొరుసు ఉన్నట్లే వారి జీవితాలలో చీకటి పేజీలు ఎన్నో ఉన్నాయి.
తెల్లవారు జామున 4 గంటలకే లేచి చన్నీటి స్నానం చేసి మడి వస్త్రాన్నిధరించి మంత్రోచ్చారణ చేసుకుంటూ దేవాలయాన్ని ప్రక్షాళన చేసి మూల విరాట్టులను అభిషేకించి, చక్కగా అలంకరించి వచ్చే భక్తుల కోసం ఎదురుచూస్తూ వారి గోత్రనామాలతో అర్చన చేసి వారిచ్చే దక్షిణతో కుటుంబాన్ని వెల్లదియడం,
కొందరు ప్రభుద్దులు ఇంటికి పిలిపించుకొని పూజలు చేయించుకొని దక్షిణ ఇవ్వడం
కోసం పదిసార్లు తిప్పించుకుంటే.. మౌనంగా వెనుతిరగడం చూసాను.
.సంప్రదాయాన్ని పాటించే బ్రాహ్మణులను చూస్తూ వారిని అనుకరిస్తూ వెకిలిగా నవ్వే వారిని చూసాను .
వేదాలు చదివి బ్రహ్మణ వృత్తిని చేపడితే పెళ్ళిళ్ళు కాకుండా 40 ఏళ్ళుగా బ్రహ్మచారులుగా మిగిలిపోయిన వారు నాకు తెలుసు .
మనం వారిలో కొన్ని మార్పులు రావాలని కోరుకుందాం ...
అంతే కాని హేతువాదులు,నాస్తికులు అనబడే విష పురుగులు విరజిమ్మే
అపోహల కాలుష్యం నిజమని నమ్మి వారి పట్ల అపోహలు పెంచుకుంటే ...మనదైనా
సనాతన వారసత్వాన్ని,సంప్రదాయ విలువలను కోల్పోతాం
వేద విహితమైన మన సంప్రదాయాలు, ఆచారాలు కాపాడటం హిందువుల అందరి ధర్మ. ఆ ధర్మం పాటించటం అంటే బ్రాహ్మణులను గాబురవించటం వారిని సంతోషపెట్టటమే. అప్పుడే మన హిందూ ధర్మం నిలుస్తుంది. 

కొత్త జాడ్యం

ఈ మధ్య కొత్త జాడ్యం ఒకటి అందరిలోనూ కనిపిస్తోంది.

శుభకార్యం అయినవెంటనే  #పురోహితుడి కి #దక్షిణ ఇవ్వకుండా , కనీసం చెప్పకుండా, ఆశీర్వచనం తీసుకోకుండా అక్కడినుంచి వెళ్లిపోవడం,

వివాహాంలో అయితే కనీసం కంకణం విప్పాలి కాబట్టి ఉంటున్నారు.

తరువాత వాళ్ళమాట!....
" తరువాత కలుస్తాము"
శుభకార్యం అయిన చోటే.. సభా తాంబూలం ఇద్దాం అనే ఇంగిత జ్ఞానం కూడా ఉండదు.

వివాహం లో చేసే ఆర్ర్భాటాలు:

Dj పేరుతో రోడ్డుమీద తాగి గెంతడం ఖర్చు 50,000/-

ఫ్రెండ్స్ కోసం మందు  ఖర్చు అక్షరాలా లక్ష..100,000/--

పనికిమాలిన డెకరేషన్ కోసం.(పచ్చని తోరణం ఉండదు) ఖర్చు మరో లక్ష..100,000/-

భోజనాలు ఖర్చు. 5  లకారాలు దాటిన మాటే (lacs)

పెద్దిళ్లలో..ఈవెంట్ పేరుతో ఆర్డనగ్న నృత్యాలు. వాళ్ళు వేసే వెకిలి వేషాలు , మాట్లాడే తీరు కోసం ఖర్చు లక్ష.100,000/-

                 పెళ్లి మండపంలో.
పువ్వులు ఉండవు,

అరటిపళ్ళు ఉండవు,

తమలపాకులు ఉండవు,

మంచినీళ్లు ఉండవు,

పసుపు,కుంకుమ చిన్న పొట్లాలు తో ఉంటాయి,

ద్రవ్యాలు వేసుకోవడానికి పళ్ళాలు ఉండవు,

కూర్చొడానికి పీటలు ఆసనాలు ఉండవు,

అసలు పెళ్లికి కనీసం గంట ముందు ఎవరు ఉండరు

మండపమ్ లో ఉండేవి ఏంటి?
*********

తలంబ్రాలు పేరుతో తర్మోకోల్ ముక్కలు, రంగు బియ్యం,

Foam స్ప్రేలు,

పేలిస్తే అందరిమీద పడే కాయితం ముక్కలు

తాగేసిన ఫ్రెండ్స్ కేకలు ,

ఇంకా ఇలాంటి దరిద్రాలు ఎన్నో!!!!

ఆట్లా ఇట్లా... కిందా మీద పడి ..పెళ్లి అయిపోతుంది పురోహితుడికి దక్షిణ కోసం 36 మంది వస్తారు. వాళ్ళు చెప్పే మాట

" బాబు మీరే దయ చూడాలి చాలా ఖర్చు అయ్యింది #అప్పులు చేసి పెళ్లి చేస్తున్నాం"" 

అక్కడ 50 బేరాలు మా దక్షిణ అడగాలంటే #అసహ్యం వేస్తుంది.

పైగా ఎవడో ఒక వెధవ ఉంటాడు వాడు అంటాడు ... ఈమధ్య.#పంతుళ్ళకి గొప్ప సొమ్ము అని... ఆ వెధవకి తెలీదు మూఢమ్ 6 మాసాలు పంతులు ఎలా బ్రతుకుతాడు అని.
ఆఖరికి కట్నం సూన్యం, ఇస్తాడో??  ఇవ్వడో?? తెలీదు.

ఇక. గృహప్రవేశం ఇదో విధంగా  ఉంటుంది.
***********

మొత్తం కార్యక్రమం అయిపోతుంది, వ్రతం అయిపోతుంది,
ప్రసాదం తీసుకోవడం వెళ్లిపోవడం అంతే దక్షిణ ఇద్దాము అనే స్పృహ అసలు ఉండదు

అసలు అక్కడ పురోహితులు ఉన్నారు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కుర్చీల మీద కూర్చొని సొల్లు బాతాకాని చేస్తూ ఉండడం

"మేము వెళతాం" అని చెపితే కనీసంతాంబూలం ఇచ్చి, దణ్ణం పెట్టి  ఆశీర్వచనం తీసుకుందాం అనే #ఆలోచన ఉండదు.

శంఖం వాడికి
మేళాలు వాళ్ళకి
క్యాటరింగ్ వాళ్ళకి. Etc etc వాళ్ళకి ముందే డబ్బులు ఇచ్చేస్తారు. ఒక్క పురోహితుడే ఆఖర్లో అడిగిన కూడా ఇస్తారాకులు ఎత్తే వాడిలాగా యూడిపోవాలి...
వాడికి దక్షిణ ఇవ్వకుండా ఉండే ఇలాంటివాళ్లను ఏమనాలి??

ఈమధ్య కొందరు... బ్రాహ్మణ వ్యవస్థను బ్రష్టు పట్టించాలని... వివాహాది శుభకార్యాలు కొందరు పనిగట్టుకుని మేమూ చేస్తాం అంటూ వీధి కూడళ్లలో జంధ్యంధరించి ముఖాన విభూదిరేఖలు పెట్టుకుని... అపుడపుడూ తాగి తూలుతూ కనిపించి.... చూసేవారికి అసహ్యంగా కనిపిస్తుంటారు వీళ్ళను చూసి అందరూ బ్రాహ్మణులు ఇలాగే తయారయ్యారని మిగతావారిని దూషించడం మంచిదికాదు.

పైపైన ప్రార్ధనలు చెప్పే పాస్టర్ల కు క్రైస్తవులు గౌరవాలిస్తారు.

ఖురాన్ చదివి సూరత్ పలికే ముల్లాలకు ముస్లింలు మర్యాద లిస్తారు.

ఈమధ్య గృహప్రవేశాలకు... వివహకార్యాస్తలాల దగ్గరకూ ఆడ, మగ కానీ మూడో రకమైన హిజ్రాలు వచ్చి కేవలం 5 నిముషాలు నానా హంగామా/ రభస చేసేస్తే... వాళ్ళ శాపనార్ధాలకు భయపడి పోయి ఉచ్చోసుకుని... గజ గజ వనిపిపోయికి వాళ్ళను బ్రతిమాలి,భామాలి 5,000,10,000,15000 ఇస్తున్నారే??

మరి!..ప్రతీ తంతు ని తూ,చ తప్పకుండా... మీ శ్రేయస్సుకు,మీ అష్టైశ్వర్య సిధ్ధికోసం ,మీ సంతాన సుభిక్షంకోసం శ్రమించే బ్రాహ్మణులే మీకు లోకువయ్యారా???

పురోహితుల్ని దుఃఖపడితే  కార్యం చేయించుకున్నోళ్లకు శుభం అవుతుందా??

కొసమెరుపు:
కొన్నిచోట్ల కార్యక్రమము  అంతా అయ్యిన తరువాత. మేము మీకు దక్షిణ ఇవ్వలేము ఎందుకంటే మాకు కలెక్షన్ తక్కువ అయ్యింది అనీ అనేవాళ్ళు కూడా అక్కడక్కడా ఉంటారు..

పుడమి దేవుణ్ణి బాధించి... పుణ్యాలేల మూటగట్టు కుంటారయ్యా???...ఆలోచించండి.పుణ్యాత్ములారా.

వేదమంత్రాన్ని వింటే లాభమొస్తుందా?

మనపీఠాదిపతులు, అవధూతలు, సత్యమెరిగిన వారు ఎమంటారంటే సమాన్య జనానికి వేదం రాకపోయినా ఫర్వాలేదు వారు వింటే చాలు లాభం చేకూరుతుంది అంటారు. మంత్రశాబ్దాన్ని వింటేనే ఏమి లాభం కలుగుతుంది అని అనుమానం మనకు రాకపోదు.

మనకు చిన్నప్పుడు మన అమ్మ లాలి పాట పాడుతుంది. కొన్ని సార్లు కేవలం కొన్ని పదాలతో జోకొడుతుంది. ఆ పాటలో ఉన్న పదాల అర్ధం ఆ చంటిపిల్లకు తెలియనవసరం లేదు, అది ఏ రాగమో అర్ధం అవ్వవలసిన అవసరం లేదు, కేవలం తల్లి ఆ పాట పాడితే నిద్ర వస్తుంది చిన్ని పాపకి.

Vedas will help the human beings
ఇదే విధంగా వేదమంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా మన చుట్టూ తయారయ్యే ఆ శబ్దతరంగాలు అంతటిని ప్రభావితం చేస్తాయి. ఆ శబ్దబ్రహ్మం మనకు రక్ష అవుతుంది.

ఉదాహరణకు మన చుట్టూ ఎన్నో తరంగాలు ఉంటాయి. కొన్ని రేడియో తరంగాలు, కొన్ని AV/ఆడియో వీడియో తరంగాలు, కమ్యూనికేషన్ తరంగాలు, UV తరంగాలు, ఇలా మన చుట్టూ ఎప్పుడూ మనకు తెలియని శక్తి తరంగాలు ఒక వాటి వాటి నిర్దుష్ట frequencyతో మనను చుట్టుముట్టి వుంటాయి. మనమొక రేడియో రిసీవర్ పెట్టుకుని ఆ స్టేషన్ కి ట్యూన్ చేస్తే ఆ తరంగాలు రేడియో నుండి ఒక మంచి పాట రూపంలో అవగతం అవుతాయి.

లేదా మన మొబైల్ నుండి వాటిని డేటా గానో, ఒక ఫోన్ కాల్ గానో అందుకోగలము. అటువంటి పరికరం మన దగ్గర ఉన్నప్పుడు వాటిని మనం సరిగ్గా రిసీవ్ చేసుకుని ఆనందించగలము. వాటితో పాటు మనకు noise కూడా వస్తుంది. రిసీవర్ సరైనది కాకపోతే ఆ noise మన చెవులకు కానీ కళ్ళకు కాని ఇబ్బంది కలిగిస్తుంది. ఇంకా మనం వినగా వినగా చిరాకు పుట్టి మానసిక ప్రశాంతత కోల్పోగలము.

ఎలా అయితే ఇటువంటి తరంగాలు ఉన్నాయో, మనకు తెలియని నెగటివ్ ఫీలింగ్స్ తప్పుడు ప్రభావం కలిగించే తరంగాలు కూడా మన చుట్టూ ఉంటాయి. అలాగే మంచిని ప్రేరేపించే తరంగాలు కూడా ఉంటాయి.

ప్రతి మంత్రానికి స్వర, అనుస్వర ఉదాత్తలతో ఒక నిర్దుష్టమైన రీతిలో పలికే పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో ఆ మంత్రోచ్చారణ చేస్తే ఆ విధమైన తరంగాలు మన చుట్టూ ప్రకటితం అవుతాయి. ఈ తరంగాలు మంచిని ప్రేరేపించే భావాలను పెంపొందించి చెడుకు ప్రేరేపించే ఆలోచనా తరంగాలను తొక్కిపెట్టి ఉంచుతాయి. తద్వారా కేవలం మన కర్ణావయవం ద్వారా కేవలం మంచికి సంబంధించిన frequency మన మెదడుకు అందిస్తుంది. తద్వారా మన బ్రెయిన్లో grey matter పెంపొందుతుంది. మానసిక దౌర్భాల్యం మాయమై ఒకానొక శక్తి ప్రవేశిస్తుంది.

అదే మంత్రం మరిన్ని సార్లు మనమే చదవగలిగితే ఆ ఎనర్జీ మనమే తయారు చేసుకోగలము. మంత్రాన్ని కేవలం వినడం ద్వారా మన చుట్టూ ఉన్న నెగటివ్ సిగ్నల్స్ ను దూరం చేస్తే అదే మనం ఉచ్చరించగలిగితే మరింత శక్తియుతంగా ఆ పాజిటివ్ శక్తిని మనం గ్రహించగలము. ఎలాగంటే ఒక గదిలో చెడు వాసన వస్తుంటే మనమొక రూమ్ స్ప్రే ద్వారా ఆ చెడు వాసనను పోగొట్టి మంచి సువాసనను ఆ గదిలో కొంత సేపు నిలపగలమొ అలాగే మంత్రాన్ని విన్నంత సేపు అదే జరుగుతుంది. అదే ఆ చెడు వాసన ఎక్కడ నుండి వస్తోందో మనమే కనిపెట్టి దాన్ని బయటకు విసర్జించి సంపూర్ణంగా నివారించడం అనేది మనమే మంత్రోచ్చారణ చేస్తుంటే ఆ మంత్రం మనకున్న మనలో ఉన్న చెడు వాసనలను పోగొట్టి దైవత్వం నింపడం లాంటిది.

కేవలం ఉచ్చరించడం తో ఆగిపోతే అక్కడ వరకు లాభం. అన్నం కేవలం తిని ఆకలి తీర్చుకోవడం కోసం మాత్రమే కాదు కదా. అది జీర్ణం అవ్వాలి. అది జీర్ణం అయితేనే ఆ ఆహారం నాకు శక్తిని ఇస్తుంది. ఆ శక్తితో మనం మరిన్ని పనులు చెయ్యగలము. అదే విధంగా కేవలం మంత్రోచ్చరణతో ఆగకుండా ఆ మంత్రం ప్రయోజనం మీద మనం ధ్యానం చెయ్యగలిగితే ఆ పరమార్ధం ఆ మంత్రాధిష్టాన దేవత ప్రచోదయం చేస్తుంది. తద్వారా మనం మంత్రం వలన సంపూర్ణలాభం పొందుతాము. "మననాత్ త్రాయతే ఇతి మంత్రః". మననం చెయ్యడం మాత్రం వల్ల రక్షించేస్తుంది. ఇక నిధిధ్యాస చేసి ఆ మంత్రం మీద తపిస్తే లభించే శక్తి మనకే కాదు మన చుట్టూ మొత్తం ప్రపంచానికి శాంతిని కలుగచేస్తుంది.

మన కర్మలవలన లోకశాంతి ఆశిస్తే ఆ లోకంలో నువ్వు ఒక వ్యక్తివి కాబట్టి నీకు కూడా ఆ లాభం వస్తుంది. మన సనాతన ధర్మం ఎప్పుడూ లోకహితం చెబుతుంది. నువ్వు చెప్పే అష్తోత్తరంలో నీ నక్షత్ర పాదానికి ఒక్క నామం అయితే మిగిలిన 107 నామాలు 27నక్షత్రాల x 4పాదాలకు చెందిన లోకం అంతటికీ మంచి జరగాలని ఆకాంక్షించేవిధంగా మనకు విష్ణు సహస్రనామాలు 108 జపించమని, లేదా మంత్రం తక్కువలో తక్కువగా 108 స్మరించమని పద్ధతిని తెలియజేస్తుంది శాస్త్రం. ఏది చేసినా అందరూ సుభిక్షంగా శాంతిగా ఉండాలని ఆకాంక్షించే అద్భుతమైన భారతదేశ ధర్మం మన సనాతన ధర్మం, లోకా సమస్తా సుఖినో భవంతు.

సేకరణ.....

వరలక్ష్మి వ్రతం తీసుకోవలసిన జాగ్రత్తలు


హాయ్ లేడీస్, శ్రావణ మాసం వచ్చేస్తోంది,  అందరు అమ్మవారిని ఆహ్వానించే హడావిడి లో ఉన్నారు. ఇళ్ళు వాకిళ్లు  శుభ్రం చేసుకుని నోములు,  పూజలు,  వ్రతాలు చేసుకోవాలి అని, పనులు మొదలెట్టారు.  ఇక నైవేద్యం పేరుతో  పిండి వంటలు లాగించేయొచ్చు. ఈ సందర్భంగా అందరికీ ఒక విన్నపం. ఈ సంవత్సరం మన దేశం corona  అనే మహమ్మారి తో పోరాడుతోంది. రాబోయే కొద్ది నెలలు మనకి చాలా కీలకమైనవి. మనదేశంలో ఎంతో మంది వైద్యులు, వారికి సహాయం చేసేవారు, ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. ఎన్నో హాస్పిటల్స్ లో బెడ్ సరిపోక, వెంటిలేటర్లు లేక, జనాలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గమనించాల్సింది, మనం చేసే ఏ పని వల్ల చిన్న ఇబ్బంది కలిగినా  వైద్య వ్యవస్థ తట్టుకునే పరిస్థితి మనకి లేదు. మనం అందరం చాలా బాధ్యతతో, జాగ్రత్తతో, వ్యవహరించాల్సిన సమయం. ఏ చిన్న పొరపాటు జరిగినా, కొన్ని వందల కుటుంబాలు, డాక్టర్లు నర్సులు, పెద్దలు పిల్లలు ఎంతో మంది కరోనా బారిన పడతారు. దయచేసి ఆడవారు ఈ విషయాన్ని మర్చిపోవద్దు. పేరంటాలు పూజలు పేరిట పదిమందిని పిలవకండి. ఇది క్షమించరాని తప్పు. భగవంతుడు కూడా దీన్ని అంగీకరించడు. గుళ్ళు కూడా మూసేసి, నైవేద్యాలు ప్రసాదాలు ఇవ్వడంలేదు ఎక్కడ. అంటే మన సమస్య తీవ్రత గురించి అర్థం అవుతోంది. భగవంతుడు కూడా  నియమాలు పాటిస్తున్నాడు. మనం కూడా నిజమైన భక్తులం అయితే ఆయనతో నడవాలి. అసలు భక్తి అంటే ఏంటి? మనం క్షేమంగా ఉండి, అందరి క్షేమాన్ని కోరుకోవడం. దానికి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చాలు,ఒక మంచి నైవేద్యం, ఒక చిన్న దీపారాధన, భక్తితో ఒక స్తోత్రం చేసుకుంటే చాలదా? పదిమందిని పిలిచి ఈ సంవత్సరం ఎందుకు ఈ ఆర్భాటాలు? ఎందుకు ఈ చాదస్తాలు? ఒక సంవత్సరం ఇంట్లో పూజ చేసుకో లేమా? మాస్కు పెట్టుకున్నాం కదా, శానిటైజర్ రాసుకుందాం కదా, దూరంగా కూర్చున్నాం కదా అని దయచేసి అనుకోవద్దు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, దురదృష్టవశాత్తు ఎంతోమంది కరోనా బారిన పడుతున్నారు. ప్రసాదాలు తీర్ధాలు పంచడం వల్ల, ఇతరులని ఇబ్బంది పెట్టిన వాళ్లు అవుతారు. మీ భక్తి పేరుతో ఎవరిని ఇబ్బంది పెట్టకండి. మీరు పిలిచారు కదా అని మొహమాటంతో ఇష్టం లేకపోయినా, వచ్చి ఇబ్బంది పడతారు, ఇబ్బంది పెడతారు. ప్రతి కుటుంబంలోనూ పెద్దవాళ్లు, ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళు, చంటి పిల్లలు, ఉండొచ్చు. దయచేసి ఆ విషయం గుర్తుంచుకోండి. దయచేసి ఎవరి ఇంట్లో వాళ్ళు హాయిగా ఉన్నదాంట్లో మనస్పూర్తిగా అమ్మవారిని పూజించుకుందాం. భక్తి వేరు, చాదస్తాలు వేరు, దయచేసి అర్థం చేసుకోండి. 10 మందికి హాని కలిగించే విషయం ఏ మతము సమ్మతించదు. భగవంతుడు హర్షించ డు. ఒక్కరూ ఆదర్శంగా ఈ మార్గాన్ని అనుసరించి నా, పది మంది మిమ్మల్ని అనుసరిస్తారు, తద్వారా దేశానికి, వైద్య వ్యవస్థ కి మేలు చేసిన వారం అవుతాం. #Stay home stay safe. #NoSocialgatherings.

పోత‌న త‌ల‌పులో.


మ‌హాక‌వి బొమ్మెర పోత‌నా  మాత్యులు (1410-1470) శ్రీ మ‌హాభాగ‌వ‌తాన్ని తెలుగులో అందించి తెలుగుజాతికి మ‌హోప‌కారం చేశారు. ఆ భాగ‌వ‌తంలోని కొన్ని ప‌ద్యాలు మ‌రోసారి ....
శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకర
క్షైకారమ్భకు భక్తపాలన కళా సంరభకున్ దానవో
ద్రేక స్తంభకు గేళిలోల విలసద్ద్రుగ్జాలసంభూత నా
నాకంజాత భవాండ కుంభకు మహానందాంగానా డింభకున్
                             **
లో్క‌ర‌క్షా ప‌రాయ‌ణుడు, భ‌క్త‌పాల‌న‌మే ఒక క‌ళ‌గా ఆచ‌రించేవాడు,దాన‌వుల ఉధృతాన్ని అరిక‌ట్టేవాడు, లీలావ‌లోక‌న మాత్రంచేత అనేక బ్ర‌హ్మాండాల‌ను ఉద్బ‌వింప‌చేసేవాడు అయిన మ‌హానందున‌(నంద‌రాజు) ఇల్లాల (య‌శోద‌) ముద్దుల బిడ్డడైన (బాల‌కృష్ణుని) శ్రీ కైవ‌ల్య ప‌దం పొంద‌డానికి నేను ధ్యానిస్తున్నాను అన్నాడు.
ఒక్క ప‌ద్యంలో కృష్ణ‌య్య జీవితాన్ని, ద‌శావ‌తార‌లాను స్ఫుర‌ణ‌కు వ‌చ్చేట్టు చేశాడు.
ఇది శ్రీమదాంద్ర మహా భాగవతము లోని మొదటిపద్యము.
భాగవత రచన ఆరంభానికి  ముందు పోతన గారు చేసిన ప్రార్ధనఇది.
శ్రీ‌కైవ‌ల్య ప‌దం చేర‌డానికే మ‌హాభాగ‌వ‌త ర‌చ‌న అని ఆదిలోనే నివేదించాడు.
రామభద్రుడు కృతి కర్త , క‌థానాయ‌కుడు కృష్ణుడు.
 కావ్యం ఎందుకు రాస్తున్నాడో అందులో ఏముందో, ఏమి ఆసించాడో,అన్ని ఒక్క పద్యంలో ప్రార్ధనలోనే చెప్పిన ఘనత పోతనదే.
ఇది చ‌దివిన వారికి , నేర్చుకున్న వారికి, మ‌న‌నం చేసుకునే వారికి శ్రీ కైవ‌ల్య‌ప‌దం త‌ప్ప‌క సిద్ధిస్తుంది.
పోత‌న‌ ప‌ద్యాలు-మాన‌వాళి ఉన్నంత వ‌ర‌కూ నిలిచే ప‌ద్యాలు, జాతికి వెలుగు చూపే దివిటీలు.

అహంకారం

*మనిషిని పతనావస్థకు లోను చేసేది అహంకారం. దానిని జయించినవారే జీవితంలో రాణిస్తారు. దీనినో సాధించామని, సంపదలని పొగుచేసుకున్నామని, తిరుగులేని అధికారం తమ సొంతమని, అనంతమైన పేరు ప్రతిష్టలు సంపాదించామని, తమంతటివారు ఎవరు ఉండరని అహంతో వ్యవహరిస్తారు. ఇతరులని చులకనగా చూస్తూ, తమని తాము అధికులమనుకుంటారు. కానీ ఈ అహం వారికి యశోభుషణం ఎంత మాత్రం కాదు. అది గర్వకారణం కాదు. అతి అల్పమైనది. అందువల్లే అహాన్ని వదిలి వ్యవహరించాల్సిన అవసరాన్ని తథాగతుడు పదే పదే ప్రబోధించారు:*

*"అహంకారాన్ని జయించాలనే సిద్దాంతాన్ని ఎందుకు భోధిస్తున్నానంటే మనుష్యుల ఆత్మలను నాశనం చేయడం కోసం కాక వాటిని కాపాడడం కోసమే. అహంకారాన్ని జయించినవారు అహంకారానికి దాసుడైన వారికంటే జీవించడానికి మరింత అర్హత పొందుతారు, విజయాలను సాధిస్తారు, జీవితంలో జయప్రదామవుతారు. అహంకారం కల్పించే భ్రమలనుంచి బయట పడ్డ వాడు జీవిత సమరంలో పతనం చెందడు, దృడంగా నిలబడతాడు". అలాంటి మహితోక్తులు ఉత్తేజపురితంగా ఉంటాయి. అయితే వాటిని ఆచరణలో భాగం చేసుకున్న వారి హృదయాలే వెలుగును సంతరించుకుంటాయి. అలాంటి వారి మాట, చేత పదుగురికి స్ఫూర్తినిస్తాయి. తమని తాము అధికులుగా భావించుకున్న వారు ఎక్కడో చోట ఎప్పుడోసారి భంగపడతారు. ఒక చిన్న మాటతో వారి అహం కుప్పకూలి పోతుంది. తమ సంపదలు, అధికారం, పేరు ప్రతిష్టలు శాశ్వతం కావని తెలుసుకోలేని అజ్ఞానమే ఈ దుస్థితికి మూలం. మనసా, వాచా, కర్మణా శుద్ధముగా వ్యవరించే శైలి మాత్రమే మనుషుల్ని ఉన్నత స్థితికి తీసుకువెళుతుంది. పదుగురి మధ్య ఉదాత్తంగా నిలుపుతుంది.*


*సర్వేజనా సుఖినో భవంతు....మీ ఆకొండి రామ మూర్తి...