1, మే 2025, గురువారం

జ్ఞానానికి భాండాగారం!

 శీర్షిక.. జ్ఞానానికి భాండాగారం!


యుగాల ప్రాచీన చరిత్రకు సాక్ష్యంగా 

సంస్కృతీ సంప్రదాయాల ప్రాభవ వైభవ శిఖరం 

కళలకు కాణాచిగా 

జ్ఞాన విజ్ఞాన ఖనిగా 

బుద్ధిని పెంపెందించే సాగర మథనం..


వివేక విచక్షలను మేల్కొలుపుతూ 

అజ్ఞానపు చీకట్లను చీలుస్తూ

అధర్మా ధర్మాలను వచిస్తూ

సత్యా అసత్యాలకు మార్గదర్శిగా 

శాంతీ స్వేచ్ఛను నెలకొల్పే మేథా మథన మిది..


మమతానురాగాలు వెల్లువగా

నిరాశా నిస్పృహలకు ఓదార్పుగా 

స్నేహానికి చేయందించే చెలికానిగా

మానవతా విలువలకు దూరదర్శినిగా 

సమైక్య దీక్షకు ఐకమత్యంగా 

స్వతంత్ర భావాలను మేల్కొలిపే సుప్రభాతమిది..


ప్రణయ కావ్యాల క్రీగంటిచూపులతో

దయా కరుణా సేవా సంపన్నతతో 

ఉద్యమ భావాల విప్లవ స్పందనతో 

సహృదయ సౌభ్రాతృత్వాలను పెంపొందించే భావ మథనమిది..


మనో విజ్ఞాన వికాసానికి నాంది ఇది 

మానసిక ఆహ్లాదాన్ని పంచే వినోదమిది 

సరస రాగ పదబంధాలకు ప్రాణమిది 

నటనల నవరస నటనా వైదుష్యమిది 

గద్య పద్య కథా నాటక వ్యాసాల చతురంగ బలమిది 

వీణా వాణి కరకమలముల శోభిల్లు మేథా శోథన సంధానమిది

తరతరాల ప్రగతికి దారులు వేసే అనాది గ్రంథమిది

మానవ మస్తక మథనమిది..

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

ఇది నా స్వీయ కవిత

విమానంలో భోజనం

 విమానంలో భోజనం 🙏

.

విమానం లో నా సీట్ లో కూర్చున్నాను. ఢిల్లీ కు ఆరేడు గంటల ప్రయాణం . మంచి పుస్తకం చదువుకోవడం , ఒక గంట నిద్ర పోవడం --- ఇవీ నా ప్రయాణం లో నేను చేయ్యాలనుకున్నవి . 


సరిగ్గా టేకాఫ్ కి ముందు నా చుట్టూ ఉన్న సీట్ల లో10 మంది సైనికులు వచ్చి కూర్చున్నారు . అన్నీ నిండి పోయాయి . కాలక్షేపంగా ఉంటుందని పక్కన కూర్చున్న సైనికుడిని అడిగాను . " ఎక్కడకి వెడుతున్నారు ?" అని 

" ఆగ్రా సర్ ! అక్కడ రెండు వారాలు శిక్షణ. తర్వాత ఆపరేషన్ కి పంపిస్తారు " అన్నాడు అతను . 


ఒక గంట గడిచింది . అనౌన్సమెంట్ వినబడింది . కావలసిన వారు డబ్బులు చెల్లించి లంచ్ చేయవచ్చు అని . సరే ఇంకా చాలా టైం గడపాలి కదా అని లంచ్ చేస్తే ఓ పని అయిపోతుందనిపించింది . నేను పర్సు తీసుకుని లంచ్ బుక్ చేద్దామనుకుంటూ అనుకుంటుండగా మాటలు వినిపించాయి 

.

" మనం కూడా లంచ్ చేద్దామా ?" అడిగాడు ఆ సైనికులలో ఒకరు 

" వద్దు ! వీళ్ళ లంచ్ ఖరీదు ఎక్కువ. విమానం దిగాక సాధారణ హోటల్ లో తిందాం లే ! 

" సరే ! " 

నేను ఫ్లైట్ అటెండెంట్ దగ్గరకి వెళ్ళాను . ఆమెతో " వాళ్ళందరికీ కూడా లంచ్ ఇవ్వండి. " అని మొత్తం అందరి లంచ్ లకి డబ్బులు ఇచ్చాను . 


" ఆమె కళ్ళల్లో నీరు " నా తమ్ముడు కార్గిల్ లో ఉన్నాడు సర్ ! వాడికి మీరు భోజనం పెట్టినట్టు అనిపిస్తోంది సర్ ! " అంటూ దణ్ణం పెట్టింది. నాకేదో గా అనిపించింది క్షణ కాలం...

నేను నా సీట్ లోకి వచ్చి కూర్చున్నాను . 


అరగంటలో అందరికీ లంచ్ బాక్స్ లు వచ్చేసాయి...

నేను భోజనం ముగించి విమానం వెనక వున్న వాష్రూం కి వెళుతున్నాను . 

వెనుక సీట్ లో నుండి ఒక ముసలాయన వచ్చాడు .

నేను అంతా గమనించాను . మీకు అభినందనలు . 

ఆ మంచి పనిలో నాకూ భాగస్వామ్యం ఇవ్వండి అంటూ చేతిలో చేయి కలిపారు.

ఆ చేతిలో 500 రూపాయలు నోటు నా చేతికి తగిలింది...

మీ ఆనందం లో నా వంతు అన్నారాయన .


నేను వెనుకకు వచ్చేశాను. నా సీట్ లో కూర్చున్నాను. ఒక అరగంట గడిచింది. విమానం పైలట్ సీట్ నెంబర్లు వెతుక్కుంటూ నా దగ్గరకి వచ్చాడు. నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు.

" మీకు షేక్ హ్యాండ్ ఇద్దామనుకుంటున్నాను అన్నాడు ." 

నేను సీట్ బెల్ట్ విప్పి లేచి నిలబడ్డాను . 

అతడు షేక్ హేండ్ ఇస్తూ " నేను గతం లో యుధ్ధవిమాన ఫైలట్ గా పనిచేశాను . అపుడు ఎవరో ఒకాయన మీలాగే నాకు భోజనం కొని పెట్టారు . 

అది మీలోని ప్రేమకు చిహ్నం . నేను దానిని మరువలేను " అన్నాడు 

విమానం లోని పాసింజర్లు చప్పట్లు కొట్టారు . నాకు కొంచెం సిగ్గు గా అనిపించింది . నేను చేసింది ఒక మంచి పని అని చేశానంతే కానీ నేను పొగడ్తల కోసం చెయ్యలేదు.


నేను లేచి కొంచెం ముందు సీట్ల వైపు వెళ్లాను . ఒక 18 సంవత్సరాల కుర్రాడు నా ముందు షేక్ హేండ్ ఇస్తూ ఒక నోటు పెట్టాడు . 

ప్రయాణం ముగిసింది .


నేను దిగడం కోసం డోర్ దగ్గర నిలబడ్డాను . ఒకాయన మాట్లాడకుండా నా జేబులో ఏదో పెట్టి వెళ్లి పోయాడు . ఇంకో నోటు 


నేను దిగి బయటకు వెళ్లేలోగా నాతో పాటు దిగిన సైనికులు అందరూ ఒక చోట కలుసుకుంటున్నారు. నేను గబగబా వాళ్ళ దగ్గరకి వెళ్లి, నాకు విమానం లోపల తోటి పాసింజర్లు ఇచ్చిన నోట్లు జేబులో నుండి తీసి వాళ్ళకు ఇస్తూ " మీరు మీ ట్రైనింగ్ చోటుకి వెళ్ళే లోపులో ఈ డబ్బు మీకు ఏదన్నా తినడానికి పనికి వస్తాయి . మీరు మాకిచ్చే రక్షణ తో పోలిస్తే మేము ఏమి ఇచ్చినా తక్కువే ! మీరు ఈ దేశానికి చేస్తున్న పనికి మీకు ధన్య వాదాలు . భగవంతుడు మిమ్మల్ని , మీ కుటుంబాలను ప్రేమతో చూడాలి ! " అన్నాను . నా కళ్ళలో చిరు తడి . 

.

ఆ పది మంది సైనికులు విమానం లోని అందరు ప్రయాణికుల ప్రేమను వాళ్ళతో తీసుకు వెలుతున్నారు . నేను నా కారు ఎక్కుతూ తమ జీవితాలను ఈ దేశం కోసం ఇచ్చేయ్యబోతున్న వారిని దీర్ఘాయువులుగా చూడు స్వామీ ! అని దేవుడిని మనస్పూర్తి గా కోరుకున్నాను. 


ఒక సైనికుడు అంటే తన జీవితాన్ని ఇండియా కు చెల్లించబడే బ్లాంక్ చెక్కు లాంటి వాడు.

" బ్రతికినంత కాలమూ, జీవితాన్ని చెల్లించే ఖాళీ చెక్కు " 


ఇంకా వారి గొప్పతనాన్ని తెలియని వారెందరో ఉన్నారు !


మీరు షేర్ చేసినా సరే , కాపీ పేస్ట్ చేసినా సరే ! మీ ఇష్టం !


ఎన్ని సార్లు చదివినా కంటతడి పెట్టించేదే ఈ విషయం చదవండి, ఇంకొకరికి పంపండి ఈ భరత మాత ముద్దు బిడ్డలను  గౌరవించడమంటే మనల్ని మనం గౌరవించుకోవటమే. 


                  - జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳

మరో కదనం.

 మరో కదనం.



ఎల్కతుర్తి సభ ప్రభంజనం

ఎటు చూసినా జనం జనం

భారాస పాతికేండ్ల పయనం

పోరాటపు, పాలన సమ్మేళనం.


పాతికేళ్ళ సంబరం

గులాబీల అంబరం

బండెనక బండి కదనం

భారాస సభ జన సంద్రం.


తెలంగాణలో మరో సవ్వడి

పదునాల్గేళ్ళ ఉద్యమ సారధి

పదేళ్ళ పాలన ముచ్చట్లే అవధి

పాతికేళ్ళ సంబరంలో తీరు ఇది.


కాంగీనే తెలంగాణకు తొలి శత్రువు

భాజాపా చూపే మొండి సాయము

విమర్శ జేసే హైడ్రాతో జనం బేజారు

కాంగ్రేసునే కంచ చేను మేసిన తీరు.


సభా ప్రాంగణం లక్షలాది జనం

సౌకర్యాలను అమర్చిన గణం

అలుపెరుగని కేసియారు స్వరం

కేరింతలతో కార్యకర్తల సంబరం.


ఊహలకందని ఉత్సాహం

తెలంగాణలో నవ్య కదనం

భారత రాష్ట్ర సమితి పోరాటం

నేడు తెలంగాణాకు ఆశాదీపం.


*ఇది ఎల్కతుర్తిలో 27.04.2025న జరిగిన భారాసా పార్టీ పాతీకేళ్ళ సంబరాల సభను చూసి వ్రాసిన (కదన) కధా చిత్రం.*


అశోక్ చక్రవర్తి.నీలకంఠం.

వందే శంకరదేశికేంద్రవిబుధం

 రేపు శంకరజయంతిని పురస్కరించుకొని...


వందే శంకరదేశికేంద్రవిబుధం వందే యతీనాంగురుమ్ 

వందేషణ్మతబోధకం గుణనుతం వందే జగద్గౌరవమ్ 

వందే తుచ్ఛమవైదికాధమమతవ్రాతాంతకం ధీయుతం 

వందేఽద్వైతసుధావిహాపితమతిం వందే గురూణాంవరమ్ 

*~శ్రీశర్మద*

సింహాచల అప్పన్న చందనోత్సవం

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 సింహాచల అప్పన్న చందనోత్సవం ఆధ్యాత్మిక వాదులందరికి ఎంతో ఇష్టమైన వేడుక. అక్షయ తృతీయ సందర్భంగా జరిగే ఈ వేడుక  

 నేపథ్యం ఏమిటి?, అలనాటి చెంచులక్ష్మి సినిమాలో కథను ఎలా వక్రీకరించారన్న విశేషాలు ఎంతో ఆసక్తి కరంగా వివరించారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

గజేంద్ర మోక్షం🙏 రెండవ భాగం

 🙏గజేంద్ర మోక్షం🙏

                 రెండవ భాగం

నీరాట వనాటములకుఁ

బోరాటం బెట్లు కలిగెఁ? బురుషోత్తముచే

నారాట మెట్లు మానెను?

ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్.

 నీరాట = మొసలి {నీరాటము -- నీటిలో చరించునది, మొసలి}; వనాటముల = ఏనుగుల {వనాటము -అడవిలో చరించునది, ఏనుగు}; కున్ = కు; పోరాటంబు = కలహము; ఎట్లు = ఏ విధముగ; కలిగెన్ = కలిగినది; పురుషోత్తముని = విష్ణుమూర్తి; చేన్ = చేత; ఆరాటమున్ = సంకటమును; ఎట్లు = ఏ విధముగ; మానెను = తీరినది; ఘోర = భయంకరమైన; అటవి = అడవి; లోని = అందలి; భద్రకుంజరమున్ = గజరాజున {గజభేదములు - 1భద్రము 2మందము 3మృగము}; కున్ = కు.

భావము:- ”నీటిలో బతుకుతుంది మొసలి. అడవిలో తిరుగుతుంది ఏనుగు. వాటిలో అది భద్రగజం. అయితే ఆ రెంటికి అసలు పోరాటం ఎందుకు జరిగింది ఎలా జరిగింది. అలా జరిగిన ఆ పోరాటంలో పురుషోత్తముడైన శ్రీహరి ఆ గజేంద్రుడి ఆరాటాన్ని ఎలా పోగొట్టి కాపాడాడు.

భాగవతం బహుళార్థ సాధక గ్రంధం. అందులో పంచరత్న ఘట్టాలలో ఒకటైన గజేంద్రమోక్షంలోని ఎత్తుగడ పద్యం ఇది. చక్కటి ఏకేశ్వరోపాసనతో కూడుకున్న ఘట్టమిది. మంచి ప్రశ్న వేస్తే మంచి సమాధానం వస్తుంది. ఇంత మంచి ప్రశ్న పరీక్షిత్తు వేసాడు కనుకనే శుకుని నుండి గజేంద్రమోక్షణం అనే సుధ జాలువారింది. ఇక్కడ పోతనగారి చమత్కారం ఎంతగానో ప్రకాశించింది. ఇందులో త్రిప్రాసం ఉంది “నీరాట, పోరాట, నారాట, ఘోరాట” అని. భాషకి అలంకారాలు అధ్భుతమైన సౌందర్యాన్ని చేకూరుస్తాయి. రెండు లేక అంత కంటే ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు మరల మరల వస్తూ అర్థ భేదం కలిగి ఉంటే అది యమకాలంకారం. ఛేకాను ప్రాసంలో పదాల మధ్య ఎడం ఉండాలి. యమకంలో ఎడం ఉడటం లేకపోడం అనే భేదం లేదు. ఇక్కడ పోతనగారు ప్రయోగించిన యమకం అనే అలంకారం అమిత అందాన్ని ఇచ్చింది. యమకానికి చక్కటి ఉదాహరణ ఇదే అని చెప్పవచ్చు. ఏనుగులు భద్రం, మందం, మృగం అని మూడు రకాలు. వాటిలో భద్రగజం దైవకార్యాదులలో వాడతారు. అట్టి భద్రగజాల కోటికి రాజుట మన కథానాయకుడు గజేంద్రుడు. అఖిలలోకేశ్వరుడు, దయాసాగరుడు ఐన శ్రీహరి మొసలి నోటికి చిక్కిన ఒక గజరాజుని ప్రాణభయంనుండి కాపాడి రక్షించాడు. ఈ అధ్భుత ఘట్టంలోని “ఎవ్వనిచే జనించు. . .” మున్నగు పద్యాలన్నీ అమృతగుళికలే కదా.

రహస్యార్థం: నీరు అనగా చిత్స్వరూపి, బుద్ధి. (ప్రమాణం చిత్స్వరూపం, సర్వ వ్యాపకుడు అయిన విష్ణువే ద్రవ (జల) రూపం అయి నిస్సంశయంగా గంగారూపం పొందుతున్నాడు. అట్టి బుద్ధి రూపమే సంకల్ప రూపం పొందుతుంది. సంకల్పం మనస్సు ఒకటే. అది నీరాటము. సంకల్పం నుండి పుట్టేది కామము. వనమునకు వ్యుత్పత్తి “వన్యతే సేవ్యతే ఇతి వనం” అనగా జీవులచే సేవింపబడునది వనం. అలా కామం వనాటం. అంటే ఆత్మ యొక్క కళ అనే ప్రతిబింబం జీవుడు కదా. ఆ నీరాటమునకు మరియు వనాటం అయిన కామమునకు సంసారం అనే ఘోర అడవిలో కలహం ఎలా కలిగింది? అని ప్రశ్న. పురుషోత్తముడు అయిన విష్ణువు ఆ పోరు అనే భవదుఃఖాన్ని ఎలా తొలగించాడు? అని ప్రశ్న.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ🙏గజేంద్ర మోక్షం🙏

                 రెండవ భాగం

నీరాట వనాటములకుఁ

బోరాటం బెట్లు కలిగెఁ? బురుషోత్తముచే

నారాట మెట్లు మానెను?

ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్.

 నీరాట = మొసలి {నీరాటము -- నీటిలో చరించునది, మొసలి}; వనాటముల = ఏనుగుల {వనాటము -అడవిలో చరించునది, ఏనుగు}; కున్ = కు; పోరాటంబు = కలహము; ఎట్లు = ఏ విధముగ; కలిగెన్ = కలిగినది; పురుషోత్తముని = విష్ణుమూర్తి; చేన్ = చేత; ఆరాటమున్ = సంకటమును; ఎట్లు = ఏ విధముగ; మానెను = తీరినది; ఘోర = భయంకరమైన; అటవి = అడవి; లోని = అందలి; భద్రకుంజరమున్ = గజరాజున {గజభేదములు - 1భద్రము 2మందము 3మృగము}; కున్ = కు.

భావము:- ”నీటిలో బతుకుతుంది మొసలి. అడవిలో తిరుగుతుంది ఏనుగు. వాటిలో అది భద్రగజం. అయితే ఆ రెంటికి అసలు పోరాటం ఎందుకు జరిగింది ఎలా జరిగింది. అలా జరిగిన ఆ పోరాటంలో పురుషోత్తముడైన శ్రీహరి ఆ గజేంద్రుడి ఆరాటాన్ని ఎలా పోగొట్టి కాపాడాడు.

భాగవతం బహుళార్థ సాధక గ్రంధం. అందులో పంచరత్న ఘట్టాలలో ఒకటైన గజేంద్రమోక్షంలోని ఎత్తుగడ పద్యం ఇది. చక్కటి ఏకేశ్వరోపాసనతో కూడుకున్న ఘట్టమిది. మంచి ప్రశ్న వేస్తే మంచి సమాధానం వస్తుంది. ఇంత మంచి ప్రశ్న పరీక్షిత్తు వేసాడు కనుకనే శుకుని నుండి గజేంద్రమోక్షణం అనే సుధ జాలువారింది. ఇక్కడ పోతనగారి చమత్కారం ఎంతగానో ప్రకాశించింది. ఇందులో త్రిప్రాసం ఉంది “నీరాట, పోరాట, నారాట, ఘోరాట” అని. భాషకి అలంకారాలు అధ్భుతమైన సౌందర్యాన్ని చేకూరుస్తాయి. రెండు లేక అంత కంటే ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు మరల మరల వస్తూ అర్థ భేదం కలిగి ఉంటే అది యమకాలంకారం. ఛేకాను ప్రాసంలో పదాల మధ్య ఎడం ఉండాలి. యమకంలో ఎడం ఉడటం లేకపోడం అనే భేదం లేదు. ఇక్కడ పోతనగారు ప్రయోగించిన యమకం అనే అలంకారం అమిత అందాన్ని ఇచ్చింది. యమకానికి చక్కటి ఉదాహరణ ఇదే అని చెప్పవచ్చు. ఏనుగులు భద్రం, మందం, మృగం అని మూడు రకాలు. వాటిలో భద్రగజం దైవకార్యాదులలో వాడతారు. అట్టి భద్రగజాల కోటికి రాజుట మన కథానాయకుడు గజేంద్రుడు. అఖిలలోకేశ్వరుడు, దయాసాగరుడు ఐన శ్రీహరి మొసలి నోటికి చిక్కిన ఒక గజరాజుని ప్రాణభయంనుండి కాపాడి రక్షించాడు. ఈ అధ్భుత ఘట్టంలోని “ఎవ్వనిచే జనించు. . .” మున్నగు పద్యాలన్నీ అమృతగుళికలే కదా.

రహస్యార్థం: నీరు అనగా చిత్స్వరూపి, బుద్ధి. (ప్రమాణం చిత్స్వరూపం, సర్వ వ్యాపకుడు అయిన విష్ణువే ద్రవ (జల) రూపం అయి నిస్సంశయంగా గంగారూపం పొందుతున్నాడు. అట్టి బుద్ధి రూపమే సంకల్ప రూపం పొందుతుంది. సంకల్పం మనస్సు ఒకటే. అది నీరాటము. సంకల్పం నుండి పుట్టేది కామము. వనమునకు వ్యుత్పత్తి “వన్యతే సేవ్యతే ఇతి వనం” అనగా జీవులచే సేవింపబడునది వనం. అలా కామం వనాటం. అంటే ఆత్మ యొక్క కళ అనే ప్రతిబింబం జీవుడు కదా. ఆ నీరాటమునకు మరియు వనాటం అయిన కామమునకు సంసారం అనే ఘోర అడవిలో కలహం ఎలా కలిగింది? అని ప్రశ్న. పురుషోత్తముడు అయిన విష్ణువు ఆ పోరు అనే భవదుఃఖాన్ని ఎలా తొలగించాడు? అని ప్రశ్న.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

ఇసుకలో సౌధం చూస్తా

 🙏🕉️శ్రీమాత్రేనమః.శుభోదయం🕉️🙏 🏵️ *మనిషిది చాలా విచిత్రమైన స్వభావం.. ఇసుకలో సౌధం చూస్తాడు..రాయిలో శిల్పం చూస్తాడు.. లోహంలో ఆభరణం చూస్తాడు.. ఆకులో ఔషధం చూస్తాడు.. అద్దంలో అందం చూస్తాడు.. కానీ సాటి మనిషిలో మాత్రం మనిషిని చూడలేడు ఎందుచేతనో*🏵️ ముందు పొగడటం..వెనుక తిట్టడం..బాగుపడుతుంటే ఏడవడం.. బాధపడుతుంటే నవ్వడం.. తియ్యగా మాట్లాడడం.. వెనకే ఉంటూ వెన్నుపోటు పొదవడం.. నేటి మనుషుల ఆలోచన మరియు తీరు.. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు.. అదే బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు🏵️నదిలో నీళ్లు ఎప్పుడూ తియ్యగా ఉంటాయి.. ఏందుకంటే ఆది నీళ్ళు ఇస్తూనే ఉంటుంది కనుక.. సముద్రపు నీళ్ళు ఎప్పుడూ ఉప్పగా ఉంటాయి.. ఎందుకంటే ఆది తీసుకుంటుంది కనుక.. గుంటలో నీళ్ళు దుర్వాసనను ఇస్తుంటూయి.. ఎందుకంటే అవి ఒకే దగ్గర ఆగి ఉంటాయి కనుక.. *ఇదే జీవితం... అందుకే ఎదుటి వారి మీద ఈర్ష్య ద్యేషాలు ప్రక్కన పెట్టి ఆరోగ్యకరమైన ఆలోచనలతో ముందుకు వెళితే అందరికీ తీయగా ఉంటావు లేదంటే ఉప్పగా ఎవ్వరికీ పనికిరానివాడిగా గబ్బు కొట్టుకుంటూ మిగిలిపోతావు* 🏵️🏵️మీ అల్లంరాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్& జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారికి రాలేను వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593.9182075510* 🙏🙏🙏

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: ఐదవ అధ్యాయం

కర్మసన్యాసయోగం: శ్రీ భగవానువాచ:


పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ 

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే (8)


జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్త్వతః 

త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో௨ర్జున (9)


అర్జునా.. సజ్జన సంరక్షణకూ, దుర్జన సంహారానికీ, ధర్మసంస్థాపనకూ నేను అన్ని యుగాలలోనూ అవతరిస్తుంటాను. అలౌకికమైన నా అవతార రహస్యం యదార్థంగా ఎరిగిన వాడు ఈ శరీరం విడిచిపెట్టాక మళ్ళీ జన్మించడు. నన్నే చేరుతాడు.

శ్రీ కందారియా మహాదేవ ఆలయం

 🕉 మన గుడి : నెం 1097


⚜ మధ్యప్రదేశ్  : ఖజురహో


⚜  శ్రీ కందారియా మహాదేవ ఆలయం



💠 ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ వారి సున్నితమైన శిల్పాలు మరియు జీవితంలోని వివిధ అంశాలను వర్ణించే క్లిష్టమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందింది.  

ఈ అద్భుతమైన ఆలయాలలో, కందారియా మహాదేవ్ ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందినది.


💠 ఖజురాహో దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా వాటి అందమైన విగ్రహాలకు ప్రసిద్ధి చెందాయి, వీటిలో చాలా వరకు ప్రేమ జంటలను, కొన్నిసార్లు శృంగార భంగిమలలో చిత్రీకరిస్తాయి. 


💠 కందరియా మహాదేవ్ ఆలయం ఖజురహోలో మిగిలి ఉన్న దేవాలయాలలో అతిపెద్దది, ఎత్తైనది మరియు అత్యంత అలంకరించబడిన దేవాలయం.  

ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది.

ఈ అద్భుతమైన ఆలయం మాతంగేశ్వర మరియు విశ్వనాథ దేవాలయాలే కాకుండా పశ్చిమాన ఉన్న దేవాలయాలలో ఒకటి.


💠 స్థానిక పురాణాల ప్రకారం, ఖజురహో దేవాలయాలను చంద్రుని కుమారుడు నిర్మించాడని నమ్ముతారు. ఒక నదిలో స్నానం చేస్తున్న కన్య అందాన్ని చూసి అతను ఎలా మంత్రముగ్ధుడయ్యాడో, ఆమె దైవిక ఆకర్షణకు నివాళిగా ఈ అద్భుతమైన దేవాలయాలను సృష్టించడానికి అతన్ని ఎలా ప్రేరేపించాడో పురాణం వివరిస్తుంది. 

ప్రేమ మరియు భక్తి యొక్క ఇటువంటి కథలు దేవాలయాల ప్రకాశానికి పౌరాణిక ఆకర్షణను జోడిస్తాయి.


💠 ఖజురహో ఒకప్పుడు చందేలా రాజవంశానికి రాజధానిగా ఉండేది . భారతదేశంలో మధ్యయుగ కాలం నుండి సంరక్షించబడిన దేవాలయాలకు ఉత్తమ ఉదాహరణలలో ఒకటైన కందారియ మహాదేవ ఆలయం,

చందేలా పాలకులు నిర్మించిన ఖజురహో సముదాయంలోని పశ్చిమ దేవాలయాల సమూహంలో అతిపెద్దది. గర్భగుడిలో దైవంగా పరిగణించబడే ఆలయంలో శివుడు ప్రధాన దేవత . 


💠 కందారియ మహాదేవ ఆలయం విద్యాధర పాలనలో ( 1003-1035) నిర్మించబడింది . 

ఈ రాజవంశం పాలనలోని వివిధ కాలాల్లో హిందూ మతానికి చెందిన విష్ణువు, శివుడు, సూర్యుడు, శక్తికి మరియు జైన మతానికి చెందిన తీర్థంకరులకు అంకితం చేయబడిన అనేక ప్రసిద్ధ దేవాలయాలు నిర్మించబడ్డాయి. 


💠  4 మీటర్ల ఎత్తులో నిర్మించబడిన ఈ ఎత్తైన నిర్మాణం పర్వతం ఆకారంలో నిర్మించబడింది, ఇది ప్రపంచ సృష్టికి పౌరాణిక మూలం అని నమ్మే మేరు పర్వతానికి ప్రతీక. 

 ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉంది మరియు మెట్ల ద్వారా చేరుకోగల ఎత్తైన వేదికపై నిర్మించబడింది. 


💠 ఆలయంలో అనేక పరస్పర అనుసంధాన గదులు ఉన్నాయి, వీటిని వరుసగా సందర్శించవచ్చు.  అర్ధమండప, దీర్ఘచతురస్రాకార ప్రవేశ హాలు మండప అని పిలువబడే మధ్య స్తంభాల హాలుకు దారి తీస్తుంది. 


💠 ప్రధాన గోపురం మరియు శిఖరం గర్భగ్రహం పైన ఉన్నాయి. 

 గర్భగ్రహం లోపల శివుడిని సూచించే పాలరాతి లింగాన్ని మీరు చూడవచ్చు.  గ్రానైట్ పునాదిపై నిర్మించిన ఈ ఇసుకరాతి ఆలయంలో దాదాపు 900 శిల్పాలు చెక్కబడ్డాయి.


💠 ఈ ఆలయం గోడలు, పైకప్పులు మరియు స్తంభాలపై అద్భుతమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. 

 శిల్పాలు జీవితానికి అవసరమైన నాలుగు సాధనలను వర్ణిస్తాయి - కామ, అర్థ, ధర్మం మరియు మోక్షం.  


💠 ఆలయం ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది.  వారంలో అన్ని రోజులలో మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు ఇక్కడ ప్రసాదం అందుబాటులో ఉంటుంది.  

విదేశీయులు ఆలయంలోకి ప్రవేశించడానికి నామమాత్రపు మొత్తాన్ని వసూలు చేస్తారు.  

దేవుడికి స్వీట్లు, డ్రై ఫ్రూట్స్ సమర్పించేందుకు భక్తులను అనుమతిస్తారు.  


💠 ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ ఇక్కడ ఏటా ఫిబ్రవరి చివరి వారంలో మార్చి వరకు జరుపుకుంటారు.  

ఇక్కడ జరిగే ప్రధాన పండుగలలో మహాశివరాత్రి కూడా ఒకటి.


Rachana

©️ Santosh Kumar

గీతా మకరందము

 17-10-గీతా మకరందము.

           శ్రద్ధాత్రయ విభాగ యోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


యాతయామం గతరసం 

పూతి పర్యుషితం చ యత్ | 

ఉచ్ఛిష్టమపి చావేుధ్యం 

భోజనం తామస ప్రియమ్ || 


తాత్పర్యము:- వండిన పిమ్మట ఒక జాము దాటినదియు (లేక బాగుగ ఉడకనిదియు), సారము నశించినదియు, దుర్గంధము గలదియు, పాచిపోయినదియు (వండిన పిదప ఒక రాత్రి గడిచినదియు), ఒకరు తినగా మిగిలినది (ఎంగిలిచేసినది) యు, అశుద్ధముగా నున్నదియు (భగవంతునకు నివేదింపబడనిదియు) అగు ఆహారము తమోగుణము గలవారి కిష్టమైనది యగును.


వ్యాఖ్య:- ఆరోగ్యశాస్త్ర ప్రకారమున్ను ఇట్టి తామసాహారము, పైనదెల్పిన రాజసాహారము నిషిద్ధములే యగును. సారము నశించి పాచిపోయినట్టి పదార్థమును తినినచో మలినమైన ఆహారపదార్థములయొక్క అణువులు శరీరమున ప్రవేశించి రక్తమును చెడగొట్టి అనారోగ్యమును గలుగజేయుటయేగాక వాని సూక్ష్మాంశములు మనస్సునందు ప్రవేశించి అద్దానినిగూడ మలిన మొనర్చును. కాబట్టి ముముక్షువు లట్టి యాహారముల నెన్నడును సేవించరాదు.

తిరుమల సర్వస్వం -225*

 *తిరుమల సర్వస్వం -225*

 *శ్రీవేంకటేశ్వరుని సేవలో దాసభక్తులు-4*


 *భక్త కనకదాసు* 


 విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించే కాలంలో 'బీరప్ప' అనే యాదవ కులశ్రేష్ఠుడు సేనాధిపతిగా ఉండేవాడు. బీరప్ప- బుచ్చమ్మ దంపతులకు సుదీర్ఘకాలం తరువాత తిరుమలేశుని కృపవల్ల పుత్రసంతానం కలిగింది. తల్లిదండ్రులు ఆ బాలునికి 'తిమ్మప్ప' గా నామకరణం చేసి, అల్లారుముద్దుగా పెంచారు. 1509వ సంవత్సరంలో, కర్ణాటకకు చెందిన హవేరీ జిల్లా, 'బాద్' గ్రామంలో తిమ్మప్ప జన్మించినట్లుగా చరిత్రకారులు అభిప్రాయ పడతారు.


 దైవచింతనకు దూరమై, భోగభాగ్యాలకు అలవడిన తిమ్మప్ప యుక్తవయసులో ఉండగానే తల్లిదండ్రులు దూరమయ్యారు. తన కటాక్షంతో జన్మించిన తిమ్మప్పను సన్మార్గం లోనికి తీసుకురావాలనే లక్ష్యంతో, ఆదికేశవుడు అనేక పర్యాయాలు తిమ్మప్ప స్వప్నంలో ప్రత్యక్షమై; తనవైపు దృష్టి మరల్చుకొని మోక్షమార్గంలో పయనించవలసిందిగా ఆదేశించాడు. కానీ, తిమ్మప్ప సాక్షాత్తు శ్రీహరి హితబోధను సైతం పెడచెవిన బెట్టి, ఐహికవాంఛల సాధనకే మొగ్గు చూపాడు. నిత్యపూజను, సంధ్యానుష్ఠానాలను, హరినామస్మరణాన్ని, సత్పురుషుల సాంగత్యాన్ని త్రోసిరాజన్నాడు.


 *కరస్పర్శతో బాధోపశమనం* 


 ఆ ఘటనాఘటన సమర్ధుని లీలా విలాసం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? యుద్ధరంగంలో చిచ్చరపిడుగులా చెలరేగిపోయే తిమ్మప్పకు ఒక నాడు యుద్ధంలో తీవ్ర గాయమైంది. శత్రుసైనికుని ఖడ్గప్రహారంతో ఒడలంతా రక్తసిక్తమై, భరింపరాని బాధతో విలవిలలాడుతున్న తిమ్మప్పకు ఆదికేశవుడు మరలా స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు. రాగద్వేషాలను, ప్రాపంచిక బంధాలను, భోగలాలసత్వాన్ని విడనాడి తనను శరణు వేడమని పదే పదే శెలవిచ్చాడు. బాధతో దిక్కుతోచని తిమ్మప్ప తీవ్రంగా వేధిస్తున్న గాయం నుంచి తనకు సత్వర ఉపశమనం కలిగితేనే తాను ఆదికేశవుణ్ణి ఆరాధించుకుంటానని, లేకుంటే తానెప్పటికీ శ్రీహరిని సేవించుకోనని మొండిగా బదులిచ్చాడు. దాంతో, శ్రీవేంకటేశ్వరుడు చిద్విలాసం చిందిస్తూ తన కరస్పర్శతో తిమ్మప్ప శారీరక రుగ్మతను పూర్తిగా తొలగిస్తాడు. ఆ ఉదంతంతో శ్రీహరి మహిమను గుర్తెరిగిన తిమ్మప్ప జ్ఞానోదయం కలిగినవాడై, మోహవాంఛలను విడనాడి, శ్రీవేంకటేశ్వరునికి పరమ భక్తుడయ్యాడు.


 *కనకతూము* 


 వ్యాసరాయల వారి ఆదేశం మేరకు, యమాంశ సంభూతుడైన తిమృప్ప, యముని వాహనమైన మహిషం సాయంతో, ఒక పంటకాలువ త్రవ్వకానికి ఆటంకం కలిగిస్తున్న బండరాయిని తొలగించారు. తద్వారా నిమ్నకులస్తుడన్న కారణంగా ఒకప్పుడు తనను తిరస్కరించిన వ్యాసరాయల వారి మెప్పును సంపాదించి, వారి ద్వారా దాసదీక్షను పొందాడు. నాటి నుంచి తిమ్మప్పే *'కనకదాసు'* గా వ్యవహరింపబడుతున్నాడు. కనకదాసు జ్ఞాపకంగా, *'కనకతూము'* గా పిలువబడే ఈ కాలువ చిత్తూరు జిల్లా, మదనపల్లి శివారులో ఉంది.


 *శ్రీనివాసుని చిద్విలాసం!* 


 దాసదీక్షను పొంది తనను మనస్ఫూర్తిగా సేవించుకుంటున్న కనకదాసుకు ఒకనాడు స్వప్నంలో కనిపించిన శ్రీవేంకటేశ్వరుడు తన బ్రహ్మోత్సవాలకై తిరుమలకు రావలసిందిగా ఆహ్వానం పలికాడు. భగవంతుని ఆదేశానుసారం తిరుమలకు చేరుకున్న కనకదాసు నిలువనీడ లేక; ఎముకలు కొరికే చలిలో గజగజా వణుకుతూ, ఆరుబయటే విశ్రమిస్తాడు. భక్తుని దీనావస్థతో హృదయం ద్రవించిన శ్రీనివాసుడు నడిరేయి ఒక ఆజానుబాహువు రూపంలో వచ్చి; కడుపునింపుకోవడానికి శ్రీవారి ప్రసాదాన్ని, కప్పుకోవడం కోసం సరిగంచుపట్టు వస్త్రాన్ని ప్రసాదించి అదృశ్యమయ్యాడు. తదనంతరం ఆలయ యాజమాన్యం వారికి స్వప్నంలో సాక్షాత్కరించి, తన భక్తుడైన కనకదాసును సగౌరవంగా ఆలయం లోనికి తోడ్కొని రావలసిందిగా ఆదేశించాడు.


 మరునాటి ఉదయం కనకదాసు ఆలయద్వారం వద్దకు చేరుకోగా, నిరుపేద వలె గోచరిస్తున్న ఆ దాసభక్తుణ్ణి దేవాలయ సిబ్బంది గుర్తించలేకపోయారు. తత్ఫలితంగా కనకదాసుకు ఆలయప్రవేశం నిరాకరించబడింది. కనకదాసు ఆవేదనతో, ఆర్తితో నిద్రాహారాలు లేకుండా, ఆ రాత్రంతా శ్రీనివాసుణ్ణి స్మరించుకుంటూ ఆలయం బయటే నిరీక్షించాడు. దైవసంకల్పంతో అదే రాత్రి ఆలయంలో శ్రీవారి నగలు చోరీ అయ్యాయి. ఆ నేరం దేవాలయం ముంగిట వేచి ఉన్న కనకదాసుపై మోపబడింది. ఆలయ యాజమాన్యం నిష్పక్షపాతమైన విచారణ జరపకుండానే, కనకదాసుకు కొరడాదెబ్బల శిక్ష విధించింది. కనకదాసు మాత్రం, కాగలకార్యం గంధర్వులే తీర్చుతారన్నట్లు, భారమంతా దేవునిపై వేసి నిశ్చింతగా శ్రీహరిని స్మరించసాగాడు. ఆర్తత్రాణ పరాయణుడైన అలమేలుమంగాపతి ఆలయ అధికారులకు స్వప్నంలో దర్శనమిచ్చి, జరిగిన వృత్తాంతమంతా తెలియజేస్తాడు. తన భక్తుడైన కనకదాసును అనుమానించి, అవమానించినందుకు ఆ ఆనందనిలయుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. తమ తప్పు తెలుసుకున్న ఆలయ అధికారులు కనకదాసు పాదాలపై పడి క్షమాభిక్ష వేడుకుని; దైవదర్శనార్థం కనకదాసును ఆలయం వద్దకు తోడ్కొని వెళతారు. దేవాలయం తలుపులు తీయగానే, పోయినట్లు భావించబడిన ఆభరణాలతో స్వామివారు దర్శనమిస్తారు. ఆ విధంగా కనకదాసు భక్తి తత్పరతను శ్రీవారు లోకవిదితం చేసి, ఆ దాసభక్తుని కీర్తిని అజరామరం కావించారు.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*


*363 వ రోజు*

*అర్జునుడు వ్యానుని తన సందేహం తీర్చని కోరుట*

అశ్వత్థామను వదిలి వ్యాసుడు అర్జునుడి శిబిరానికి వెళ్ళాడు. సాక్షాత్తు ధర్మమూర్తి అయిన వ్యాసునికి అర్గ్యపాద్యాలు ఇచ్చి సత్కరించిన అర్జునుడు భక్తితో నమస్కరించి తన మనస్సులో మెదులుతున్న సందేహం వ్యాసుని ముందు బయట పెట్టాడు. " వ్యాస మునీంద్రా ! నేను రణరంగమున యుద్ధం చేస్తున్నప్పుడు నా ముందు ఒక ఆకారం పాదములు నేలకంటకుండా అగ్నిదేవునిలా వెలుగుతూ తన చేతిలో ఉన్న శూలముతో నేను చంపబోయే వారిని ముందుగా తానే చంపుతున్నాడు. ఆశూలము నుండి అనేకనేక శూలములు ఉద్భవించి శత్రుసంహారం చేస్తున్నాయి. ఆ తేజోమూర్తి చంపుతున్న వారిని నేను నామ మాత్రంగా నా బాణములతో చంపుతున్నాను. నేను చంపుతున్నట్లే ఉన్నా నిజానికి నేను ఎవరిని చంప లేదు. కాని వారిని చంపిన కీర్తి విజయం మాత్రమే నాకు దక్కాయి. ఆ మహానుభావుడు ఎవరు ? అలా ఎందుకు చంపుతున్నాడు "అని అడిగాడు.


*వ్యాసుడు అర్జునుడి సందేహం నివృత్తి చేయుట*


అర్జునుడి మాట విన్న వ్యాసుడు " అర్జునా ! అతడు ఆదిమధ్యాంత రహితుడు, సృష్టికి మూలకర్త, ఈ లోకములకు అన్నింటికి ప్రభువు, అవ్యయుడు, వేదమూర్తి, భక్త పరాధీనుడు, త్రినేత్రుడు, పార్వతీ పతి అతడే. యోగీశ్వర హృదయ విహారి, ప్రకృతీ అతడే, పురుషుడూ అతడే, భక్త సులభుడు, నిరాకారుడు, నీలఖంటుడు, నిత్యుడు, సత్యస్వరూపుడు, ప్రళయాగ్నిని తన చల్లని కిరణములతో చల్లార్చగల బాల చంద్రుని శితోభూషణముగా కలవాడు. నిర్మలుడు, సర్వాంతర్యామి, శాంతి ప్రియుడు అయ్న రుద్రుడే నీ ముందు నిలిచి నీకు బదులుగా ముందుగా సంహార క్రియ గావిస్తున్నాడు " అని ఇంకా తనివి తీరక ఆ పరమేశ్వరుని లీలలు విపులంగా వర్ణించాడు. " ఓ అర్జునా ! ఆ పరమ శివుడు నీ సన్నిధిలో ఉండి నిన్ను కరుణించాడు. పేదకు పెన్నిధి దొరికినట్లు నీకు ఈశ్వరకటాక్షం లభించింది. నీవు ధన్యుడివి. ఆ పరమేశ్వర అనుగ్రహంతో నీవు విజయుడివి ఔతావు. సాక్షాత్తు ఆ పరమశివుడే నీకు ముందుగా శత్రుసంహారం చేస్తుంటే విజయం నీకు కాక వేరెవరికి లభిస్తుంది. నీ తపస్సుకు మెచ్చి పాశుపతము ప్రసాదించిన పశుపతి తనివి తీరక తన భక్త పరాధీనతను నిరూపించుకున్నాడు. నీవు పుణ్యాత్ముడవు. ఆ పరమేశ్వరుని ఆత్మలోనిలిపి ధ్యానించిన నీకు సకల సౌభాగ్యములు ఆయురారోగ్యములు కలిగి సకల అభీష్టములు నెరవేరగలవు " అన్నాడు. అర్జునుడు పరమేశ్వరునికి భక్తితో నమస్కరించి తరువాత వ్యాసునికి ప్రమాణం చేసి భక్తితో అతడి ఆశీర్వచనములు పొందాడు. ఆ తరువాత వ్యాసుడు అక్కడి నుండి వెల్లాడు.


**ద్రోణ పర్వము పంచమాశ్వాసము సమాప్తం *

రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*