8, జులై 2020, బుధవారం

సంధ్యా

రెండు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు “సంధ్యాయై నమః' అని చెప్పాలి.
సం + ధ్యా - సంధ్యా అనగా - 'సమ్యక్ + ధ్యానము' అని 'సంధ్యా' పదం సూచిస్తుంది కాబట్టి చక్కగా ధ్యానము చేయబడునది అని అర్థం వస్తుంది. సంధ్యాకాలం గుఱించి ఈ క్రింది విధంగా చెప్పబడింది.

'అహోరాత్రస్యయస్సంధి సూర్య నక్షత్ర వర్జితః, తత్ర సంధ్యాముపాసీత సాయం ప్రాత స్సమాహితః
సూర్యుడు, నక్షత్రాలు లేని 'రాత్రి - పగటి' సంధికాలాన్ని సాయం సంధ్యా కాలం అంటారు. అంటే - సూర్యుడు అస్తమించిన తరువాత, నక్షత్ర దర్శనం కాకముందు సాయం సంధ్యా కాలంగాను, నక్షత్రములు కనబడకపోయిన తరువాత, సూర్యుడు ఉదయించక ముందు ప్రాతః సంధ్యా కాలంగాను గుర్తించారు.

వాస్తవానికి ఇలా చెప్పిన సంధ్యా కాలాలు ప్రతి రోజూ గుర్తించడం కష్టమౌతుంది. అందుకని ఛాందోగ్యంలో – వేరే విధంగా నిర్ణయించారు. దీని ప్రకారం సూర్యబింబం సగంకనబడునప్పటి నుండి నక్షత్రాలు కనబడేంతవరకు మధ్య గల కాలం సాయం సంధ్యా కాలంగాను; అలాగే, సూర్యోదయానికి మూడు ఘడియలు (72 ని.లు) కాలముండగా నక్షత్రాలు కనబడే కాలం నుండి సూర్యోదయమయే వరకు ప్రాతః సంధ్యాకాలం గాను నిర్ణయించారు. సూర్యునితో కూడి యుండిన సాయంసంధ్య, నక్షత్రాలతో కూడి యుండిన ప్రాతః సంధ్య, పగటికాలంలో 3/5 నుండి 4/5 వంతు దాకా ఉండే కాలంతో కూడిన మధ్యాహ్న సంధ్యాకాలాలను సంధ్యావందనానికి ఉత్తమ కాలాలుగా నిర్ణయించారు.
ఈ సంధ్యాకాలాల్లో అర్ధమవని విషయాలు అర్థమవుతాయని, జటిల సమస్యలకు పరిష్కారం స్ఫురిస్తుందని కనబడని (invisible) కనబడే (visible) జ్ఞానదేవతలు కలసి ఈ సంధ్యాకాలాలల్లో విధులగూర్చి నిర్ణయాలు తీసుకుంటారని పెద్దలు చెబుతారు. మళ్ళీ- ఈ మూడింటిలో ప్రాతః కాల, సాయంసంధ్యా ధ్యాన సమయాలు మరింత ఎక్కువ ప్రయోజనకరంగా వుంటాయేమోననిపిస్తుంది. (ఎందుకంటే - దేవతలు గూడా విధులు Duties మారే సమయాలు ఇవి కాబట్టి). (మాస్టరు సి.వి.వి. గారు కూడా ఈ ప్రాతః సంధ్యా, సాయం సంధ్యా సమయములకు సమన్వయముగా ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు 'ప్రేయరు' చేయమన్నారు.)

'సంధ్య' అంటే మధ్య ఉండేది - అనే అర్థం కూడా ఉంది. పంచకోశాలైన అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఐదింటిలో మధ్యగా ఉండేది మనోమయ కోశం. ' అన్యోంతర ఆత్మామనోమయు:', ... తస్య యజురేవశిరః, ఋక్ దక్షిణ పక్షః, సామోత్తర పక్షః, ఆదేశ ఆత్మా, అధర్వాంగిరసః పుచ్చం ప్రతిష్టా' - అని తైత్తిరీయం చెబుతుంది. 
మనోమయ కోశానికి శిరస్సు - యజుర్వేదం; 
దక్షిణ పార్శ్వం - ఋగ్వేదం;
ఉత్తర పార్శ్వం - సామవేదం; 
ఆదేశాలు అంటే బ్రాహ్మణాలు (Commentaries) - ఆత్మ, అధర్వణ వేదం - ప్రతిష్టారూపమైన పుచ్ఛం' అని పై మంత్రానికి అర్థం. కాబట్టి, ఈ విధంగా అవయవాలు కలిగిన మనోమయ కోశమే “సంధ్య' అనే వేదం యొక్క సూక్ష్మ రూపం. సంధ్య మనోమయ కోశానికి సంబంధించింది కాబట్టే మనస్సును ఆకాలంలో ధ్యానంలో ఉంచమని చెప్పారు. ఈ సంధ్య సాక్షాత్తూ అమ్మవారిని సూచిస్తుందని ప్రస్తుత నామం ద్వారా తెలుసుకోవాలి.
ఇడా, పింగళ, సుషుమ్నా నాడుల సంధి స్థానం భ్రూమధ్యంలో ఉంటుంది. ఈ స్థానమే పుణ్య కాశీ పట్టణాన్ని గూడా సూచిస్తుంది. అమ్మవారి కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు. మధ్యన ఉన్న కన్ను అగ్ని. ఇవి వరుసగా పగలు, రాత్రి, సంధ్యా కాలాలను . సూచిస్తాయి. కాబట్టి, రెండు కన్నుల మధ్య భాగం అయిన భ్రూమధ్యస్థానాన్ని సంధ్యగా గుర్తించి, ధ్యానానికి అనువైన స్థానంగా అర్థం చేసుకోవాలి. ఇదే మనస్తత్వాన్ని సూచించే ఆజ్ఞా చక్రస్థానం. ఇన్ని రకాలుగా పవిత్రమైన ఈ 'సంధ్య' అమ్మవారికి బిరుదు నామంగా ఏర్పడింది.
'చక్కగా ధ్యానం చేయబడునది' అని ఈ నామానికి అర్థం.

ఓం ఐం హ్రీం శ్రీo సంధ్యాయై నమః

శ్రీ మాత్రే నమః

శక్తి ఆరాధన శ్రీచక్ర ఉపాసన

ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదా?

బయట వినిపించే మాటల్లో ఇదొకటి. కుటుంబసభ్యులు ఎవరైనా మరణిస్తే, ఏడాది వరకు ఎటువంటి పూజలు చేయకూడదని ప్రచారం చేస్తున్నారు. కొందరైతే కనీసం దీపం కూడా వెలిగించరు, దేవతలందరిని ఒక బట్టలో చుట్టి, అటక మీద పెట్టేస్తారు. సంవత్సరీకాలన్నీ అయిపోయిన తర్వాత మరుసటి ఏడాది దేవుళ్ళ చిత్రపటాలను క్రిందకు దింపి, శుభ్రం చేసి పూజ చేస్తారు. అంటే ఆ వ్యక్తి మరణించిన ఇంట్లో ఏడాది పాటు దీపారాధాన, దైవానికి పూజ, నివేదన ఉండవన్నమాట. ఇది సరైన పద్ధతి కాదు. శాస్త్రం ఇలా చెప్పలేదు. 

దీపం లేని ఇల్లు స్మశానంతో సమానం. దీపం శుభానికి సంకేతం. దీపం ఎక్కడ వెలిగిస్తే అక్కడకు దేవతలు వస్తారు. ప్రతి ఇంట్లోను నిత్యం దీపారాధాన అనేది జరగాలి. మరణం సంభవించిన ఇంట్లో 11 వ రోజు తర్వాత శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. 12 వ రోజు శుభస్వీకారం జరుగుతుంది. ఆ కుటుంబం ఆ 11 రోజులు మాత్రమే ప్రత్యేకంగా పూజ చేయకూడదు. అంతవరకే శాస్త్రంలో చెప్పబడింది. అంతేకానీ ఏడాది పాటు దీపం వెలిగించకూడదని, పూజలు చేయకూడదని చెప్పలేదు. నిజానికి సూతకంలో ఉన్న సమయంలో కూడా సంధ్యావందనం చేయాలని, అర్ఘ్యప్రధానం వరకు బాహ్యంలో చేసి, మిగితాది మానసికంగా చేయాలని శాస్త్రం చెప్పింది. ఏడాది పాటు ఆలయాలకు వెళ్ళకూడదని కూడా చెప్పలేదు. మనం నిత్యం ఇంతకముందు ఏదైతే చేస్తున్నామో, అది నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు. కొత్త పూజలు అనేవి ప్రారంభించకూడదు. ఇంతకముందు రోజూ ఆలయానికి వెళ్తుంటే, సూతకం అయిన తర్వాత కూడా యధావిధిగా ఆలయదర్శనం చేయవచ్చు. 

మనం నిత్యం అర్చించడం వలన మనం పూజించే చిత్రపటాల్లో దేవతలు వచ్చి కూర్చుంటారు. అలా ఏడాది పాటు వారికి ధూప, దీప, నైవేధ్యాలు మొదలైన ఉపచారాలు చేయకుండా, బట్టలో చుట్టి పక్కన పెట్టడమే తప్పు. అది దోషము, అరిష్టము కూడా. కనుక తప్పకుండా ఇంట్లో నిత్య దీపారాధన, దైవారాధన జరగాలి. ఇంటికి గానీ, ఇంటి సభ్యులకు కానీ ఎలాంటి దోషాలున్నా, వాటిని అన్నిటిని ఆపే శక్తి ఆ ఇంట్లో చేసే దైవారాధనకు ఉంటుంది. కనుక ఎన్నడూ దైవారాధన, దీపారాధన మానకూడదు. ఈ విషయంలో పూజలు  చేయవచ్చు అనేకంటే చేసి తీరాలి అని చెప్పడం సరైన సమాధనం అవుతుందేమో!

Gouri Ganesh

గ్రామ_దేవత

గ్రామస్తులను చల్లగా చూస్తూ, అంటు వ్యాదుల నుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూత ప్రేతాలనుండి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపుకాస్తుండే దేవత - గ్రామదేవత.

గ్రామదేవతల పూజావిధానం తరతరాలుగా మనకు వస్తున్న గ్రామీణ సంప్రదాయం. మానవుడు నిత్య జీవితంలో యెన్నో జయాపజయాల్ని చవి చూస్తున్నాడు. మరో వైపు తన లక్ష్య సాధనకోసం యెన్నో ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. మాతృదేవతారాధనలో సకల చరాచర సృష్ఠికి మూల కారకురాలు మాతృదేవత అని గ్రహించిన పురాతన మానవుడు, ఆమెను సంతృప్తి పరచేటందుకు యెన్నో మార్గాలను ఆశ్రయించాడు. అందులో ప్రార్థన, మంత్రతాంత్రికతలు, పవిత్రీకరణ, ఆత్మహింస, బలి అనేవి ప్రధానంగా కనిపిస్తాయి.

గ్రామ_దేవత_వ్యవస్థ

గ్రామాలలో వెలిసే దేవత దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపoలను గ్రామదేవతలని అంటారు. సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు. ప్రాచీన కాలములో మానవుడు ఎంతో తెలివైనవాడు, ఇంట్లోవున్న చిన్నా, పెద్దా, ఆడా, మగా - అందరూ దేవీనవరాత్రుల కాలములో ఎక్కడోవున్న మధుర మీనాక్షమ్మ వద్దకో, కంచి కామాక్షమ్మ దగ్గరికో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే కుదరకపోవచ్చు. ఒక్కోక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళే వీలుండక పోవచ్చు. వీలుచిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము సాద్యపడకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేక పోయామే అని నిరాశ పొందకుండా వుండేందుకు ఎక్కడో వున్న తల్లిని ఇక్కడే దర్శించు కొన్నామనే తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేసారు పెద్దలు.
ఈ దేవతా ప్రతిష్ఠ గొప్ప విద్వాంసులైన వేద, స్మార్త, ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది. ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు అర్చకునిగా వుండే తీరిక, ఓపిక వుంటాయో అలాంటి వారిని వారికోరిక మేరకు అర్చకులుగా నియమించారు పూర్వికులు. అప్పటినుంచి ఆ అర్చకుని వంశము వాళ్ళే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు. దేవతా విగ్రహప్రతిష్ఠ శాస్త్రీయంగా నిర్వహించబడింది కాబట్టి, ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము సరైన మూహూర్తములోనే వేయబడింది కాబట్టి గ్రామదేవతలంతా శక్తివున్న దేవతలే అవుతారు - భక్తుల కోర్కెలు తీర్చగలవారవుతారు. అయితే ప్రతి సంవత్సరము ఆలయప్రతిష్ఠ జరిగిన ఆ నెల, ఆ తిథినాడు కచ్చితముగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్చిందే. అలా చేయడమువలన అమ్మకి మన ద్వారా ఏదైనా అపవిత్రత కలిగివుంటే తొలగుతుంది.

#దేవతల #ఆవిర్భావము

పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణముగానే ఈ ప్రపంచము ఏర్పడినది. అందుకని ఈ పంచ భూతాలకి ప్రతీకలుగా ఐదుగురు గ్రామదేవతలను ఏర్పాటు చేసారు తొలి దశలో.

#_పృధ్వీ_దేవత : పృధ్వీ అంటే నేల, ఇది పంటకి ఆధారము, కుంకుల్లు బాగా పండే ప్రాంతములో ప్రతిష్ఠించిన పృధ్వినీ దేవతను కుంకుళ్ళమ్మ అన్నారు. గోగులు బాగా పూచే ప్రాంతములో ఆ గోంగూర, గోగునార. ఇవే వారి జీవన ఆధారము కాబట్టి ఆపేరుతో గోగులమ్మని యేర్పాటు చేసారు. జొన్నలు పండేచోట జొన్నాళమ్మ అని, నూకలు అంటే వరి పండే ప్రాంతాలలో నూకాళమ్మ అని పిలుచుకున్నారు. మొదటిసారిగా పండిన పంటను ఆతల్లికే నివేదన చేయడము, అర్చకునిగా వున్నవానికి అందరూ ఆ పంటను యిస్తూవుండడము, దాన్నే సొమ్ముగా మార్చుకొని అతడు జీవించడము. ఇలా సాగుతూ వుండేదీ వ్యవస్థ. పంట వేసేటప్పుడుకూడా ఈ తల్లిని ఆరాదిస్తేగాని చేనుకి వెల్తూండేవారు కాదు. అన్నాన్ని పెట్టే తల్లి కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత ఉంది. ఇక పంటలన్నీ చేతికందాక సుఖసంతోషాలతో జాతర చేస్తూండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగూతూండడం జరుగుతూ ఉంది.

#_జల_దేవత : జలానికి సంబంధించిన తల్లి గంగమ్మ—గంగానమ్మ. ఈ తల్లి భూమి మీద కాక భూమిలోపల ఎంతో లోతుగా వుంటుంది. గుడి ఎత్తుగా కట్టినా తల్లిని చూడాలంటే మెట్లుదిగి కిందికి వెళ్ళ వలసి ఉంటుంది.

#_అగ్ని_దేవత : మూడవది తేజస్సు (అగ్ని). పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మనూ, రాత్రిపూట తేజస్సు నిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మ నీ దేవతలుగా చేసారు. సూరమ్మను ప్రతీ అమావాస్యనాడు, పున్నమ్మను ప్రతీ పౌర్ణమినాడు పూజించే విదముగా ఏర్పాటు చేసుకొని తమ కులవృత్తిని ఆరోజు మానేయడం చేసేవారు. ఇక అమ్మకి కుడి కన్ను సూర్యుడుగానూ ఎడమ కన్ను చంద్రుడిగాను ఆతల్లికి పెట్టిన పేరు ఇరుకళమ్మ (సూర్య,చంద్రుల కల వున్న అమ్మ).

#_వాయు_దేవత : నాలుగవది వాయువు కరువలి అంటే పెద్ద గాలి. కొండ ప్రాంతములో వుండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవము ఉండకుండా రక్షించేందుకు కరువలమ్మను యేర్పాటు చేసుకున్నారు.

#_ఆకాశ_దేవత : ఐదవది ఆకాశము ఎత్తులో వున్నందున కొండమ్మ ను ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు, గాలివాన. ఇలాంటి వాటి నుండి రక్షించేందుకు ఈ తల్లిని యేర్పాటు చేసుకున్నారు.

#పోషణ, #రక్షణనిచ్చే #దేవతలు 

ఇక ప్రజల మనసులో పుట్టి ఏ కోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరంచి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ. తలపు అంటే ఆలోచన వాటిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమముగా ఈమె 'తలుపులమ్మ'గా మారింది. ఇంట్లో నుండి బయటికి వెల్లేటపుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు. వూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో వుండేతల్లి పొలిమేరమ్మ క్రమముగా పోలేరమ్మ అయింది. పొలిమేరలో వుండే మరొక తల్లి శీతలాంబ. ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి. తన గ్రామంలోని ప్రజలకు వ్యాదులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిచాచ గణాలను గ్రామంలోనికి రాకుండా వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈదేవతే. 'ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము అందుకే 'ఎల్లమ్మ' కూడా ఈ పనిని చేసేదన్నమాట. ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోసించే తల్లి 'పోచ+అమ్మ=పోచమ్మ' అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే, పోచమ్మ పోషణ కలిగిస్తుంది. ఇక పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి పుట్టమ్మ ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి. అక్కడే సుబ్రహ్మణ్య షష్టికి అందరూ పుట్టలో పాలు పోస్తారు. ఈ తల్లికే 'నాగేశ్వరమ్మ' అని కూడా అంటారు. పాము+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి పాపమ్మ అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరుమీదే 'సుబ్బ+అమ్మ=సుబ్బమ్మ కూడా దైవముగా ఉంది.

#గ్రామదేవతా #నామ_విశేషాలు 

సాధారణంగా 15 వూళ్ళకో దేవత వుంటుంది. 'మా వూళ్ళన్నింటికీ అమ్మ' అనే అర్దములో ఆమెను మావూళ్ళమ్మ అని పిలుస్తూంటే క్రమముగా అది 'మావుళ్ళమ్మ' అయింది. శంకరునితో కలసి అర్దనారీశ్వర రూపముతో అమ్మవారుండేది. ఆకారణముగా శంకరుని మెడమీద (గళము) మచ్చ (అంకం) కారణముగా అంకగళమ్మ అంకాళమ్మ మారిపోయింది. బతుకుకి కావలసిన వర్షాన్ని పంటనీ ఇచ్చే తల్లి బతుకమ్మ. ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల (ఆ అవధినించి రక్షించగల) అమ్మే 'కట్టమేయ+అమ్మ=కట్టమేసెయమ్మ కాలక్రమములో కట్టమైసమ్మ అయింది. గ్రామప్రజల మంచిని చూసే (కనే) అమ్మ కన్నమ్మగా ఎప్పుడూ సత్యాన్ని (నిదర్శనాలని) చూస్తూవుండే తల్లి సత్య+అమ్మ= సత్తెమ్మ. స్వచ్ఛమైన అమ్మ అనే అర్దములో అచ్చ (స్వచ్ఛమని)సు+అచ్చ=స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి అచ్చమ్మగా అయ్యింది. అలాగే పుల్ల (వికసించిన కళ్ళున్న)అమ్మ పుల్లమ్మ. ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది. ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే చోటవున్న తల్లి అర్పణ+అమ్మ = అర్పణలమ్మ క్రమముగా అప్పలమ్మ అయినది. బెల్లము బాగా వున్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల+అమ్మ= అప్పలమ్మ అన్నారు. అమ్మవార్ల వూరేగింపులో అన్నిటికన్న చిన్నది బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన వుజ్జీ అయినదీ పెంటి (బాల)+అమ్మ= పెంటమ్మ. భోజనాన్ని అందించగల తల్లి అనే అర్దములో బోనముల (భోజనమనే పదానికి విక్రుతి)+అమ్మ= బోనాలమ్మ. అయ్య అయిన శంకరునికి అమ్మ (భార్య) కాబట్టి ఈమెను 'అయ్యమ్మ' అని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు. లలితాంబ, భండాసురుణ్ణి చంపేందుకు గుర్రాలమీద కూర్చొన్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది కాబట్టి గుర్రాల+అమ్మ= గుర్రాలమ్మ అయినది. ఇక ఊరు పేరుని బట్టి పిల్చుకొనే దేవతలు కొందరున్నారు. సోమప్రోలు+అంబ='సోమపోలమాంబ' అన్నారు. సోమప్రోలు అనే గ్రామం ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట.

#అమ్మోర్లు 

పార్వతే అమ్మోరు (అమ్మవారు)గా గ్రామాలలో గ్రామదేవతయై గ్రామాలను రోగాల బారినుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం. ఈ అమ్మోరులు మొత్తం 101 మంది అనీ వారందరికీ ఒకే ఒక్క తమ్ముడు పోతురాజనీ అంటారు. వారిలో కొందరు ........
పాగేలమ్మ, ముత్యాలమ్మ, గంగమ్మ, గంగానమ్మ, బంగారమ్మ, గొంతెమ్మ, సత్తెమ్మ, తాళ్ళమ్మ, చింతాలమ్మ, చిత్తారమ్మ, పోలేరమ్మ, మావుళ్ళమ్మ, మారెమ్మ, బంగారు బాపనమ్మ, పుట్టాలమ్మ, దక్షాయణమ్మ, పేరంటాళ్ళమ్మ, రావులమ్మ, గండి పోచమ్మ, మొగదారమ్మ, ఈరినమ్మ, దుర్గమ్మ, మొదుగులమ్మ, నూకాలమ్మ (అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా, కాకినాడ, సామర్లకోట, కాండ్రకోట (పెద్దాపురం), చింతలూరు, తూర్పుగోదావరి జిల్లా), మరిడమ్మ, నేరెళ్ళమ్మ, పుంతలో ముసలమ్మ (మొయ్యేరు, అత్తిలిదగ్గర, ప.గోజిల్లా), మాచరమ్మోరు, మద్ది అనపమ్మోరు, సోమాలమ్మ, పెద్దింట్లమ్మ, గుర్రాలక్క (అంతర్వేది, తూ.గో.జిల్లా) (గుర్రాలమ్మ), అంబికాలమ్మ, దనమ్మ, మాలక్ష్మమ్మ, ఇటకలమ్మ, దానాలమ్మ, రాట్నాలమ్మ, తలుపులమ్మ (తుని, తూ.గో.జిల్లా), పెన్నేరమ్మ, వెంకాయమ్మ, గున్నాలమ్మ, ఎల్లమ్మ (విశాఖపట్నం), పెద్దమ్మ, మంటాలమ్మ, గంటాలమ్మ, సుంకులమ్మ, జంబులమ్మ, పేరంటాలమ్మ, కంటికలమ్మ, వనువులమ్మ, సుబ్బాలమ్మ, అక్కమ్మ, గనికమ్మ, ధారాలమ్మ, మహాలక్ష్మమ్మ, లంకాలమ్మ, దోసాలమ్మ, పళ్ళాలమ్మ (వానపల్లి, తూ.గో.జిల్లా), ధనమ్మ, జోగులమ్మ, పైడితల్లి, చెంగాళామ్మ, రావులమ్మ, బూరుగులమ్మ, కనకమహాలక్ష్మి (విశాఖపట్టణం), పోలమ్మ, కొండాలమ్మ, వెర్నిమ్మ, దేశిమ్మ, గరవాలమ్మ, గరగలమ్మ, దానెమ్మ, మహంకాలమ్మ, వీరుళ్ళమ్మ, మరిడమ్మ, ముళ్ళమాంబిక, యల్లారమ్మ, వల్లూరమ్మ, నాగులమ్మ, వేగులమ్మ, ముడియలమ్మ, పెద్దింట్లమ్మ, నంగాలమ్మ, చాగళ్ళామ్మ, నాంచారమ్మ, సమ్మక్క, సారలమ్మ, మజ్జిగౌరమ్మ, కన్నమ్మ-పేరంటళ్ళమ్మ, రంగమ్మ-పేరంటాలమ్మ, వెంగమ్మ-పేరంటాలమ్మ, తిరుపతమ్మ, రెడ్డమ్మ, పగడాలమ్మ, మురుగులమ్మ (బండారులంక, తూ.గో.జిల్లా), విశాఖపట్నంలో కుంచమ్మ, ఎరకమ్మ, పెద్దింట్లమ్మ, మరిడమ్మ ఉన్నారు. మసకపల్లి పామర్రు మండలం తూర్పు గోదావరి జిల్లాలోని గ్రామదేవతలు గొల్లాలమ్మ (పినపళ్ళ), మసకపల్లమ్మ, వెలగలమ్మ, ఉర్లమ్మ తల్లి (గణపవరం, కర్లపాలెం మండలం, గూంటూరుజిల్లా) పైళ్లమ్మ తల్లి, బళ్లమ్మ తల్లి, లోల్లాలమ్మ తల్లి, వూదలమ్మ తల్లి, కట్వలాంబిక, నాగాలమ్మ-నాంచారమ్మ తల్లి, సింగమ్మ తల్లి,ఘట్టమ్మ తల్లి, అంజారమ్మ తల్లి, కొట్లమ్మ తల్లి (పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా), బర్రెమ్మ తల్లి (పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా), బలుసులమ్మ తల్లి (తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా), వెంకమ్మ తల్లి ఖమ్మం, నల్గొండ జిల్లాలలో ముత్యాలమ్మ తల్లి ఆరాధన ఎక్కువగా కానవస్తుంది.

పంచ పాత్ర

పంచ పాత్ర అంటే ఒక పాత్ర కాదు. ఆరాధనకు అయిదు పాత్రల్లో శుద్ధోదకం ఉండాలి. మనం ఒక పాత్రలోనే అన్నీ ఉంచి మమ అనేస్తున్నాము.

మొదటిది అర్ఘ్య పాత్ర: భగవంతుని చేతులు కడిగేందుకు సమర్పించే శుద్ధ జలాలతో  కూడిన పాత్ర

రెండవది పాద్య పాత్ర: ఇది భగవంతునికి పాదాలను శుభ్రపరిచేందుకు సమర్పించేందుకు శుద్ధ జలాలతో కూడిన పాత్ర

మూడవది ఆచమనీయ పాత్ర: ఇది భగవంతుని కి పుల్లించడానికి సమర్పించే శుద్ధోదకం నింపిన పాత్ర. 

నాలుగవది స్నాన పాత్ర: ఇది భగవంతుని కి స్నానము చేయించడానికి కావలసిన శుద్ధోదకం నింపుకున్న  పాత్ర

ఐదవది శుద్ధోదక పాత్ర- ఇందులో భగవంతుని కి సమర్పించే జలాలు నింపుకున్న పాత్ర

ఇవి పంచ పాత్రలు..ఇవి గాక ప్రతిగ్రాహక పాత్ర ఉపచారాలు చేశాక తీసిన నిర్మాల్యపు జలాలు నింపుకునే పాత్ర,మరొక శుద్ధ జలం అవసరం అయితే కావాల్సిన జలాన్ని నింపుకున్న పాత్ర, ఇంక ఆచార్య పూజ కూడా ఉండే వాళ్లకు ఆచార్యునికి అర్ఘ్య సమర్పణకు ఒక పాత్ర ఉండాలి.

ఇంకా సర్వార్థ జల పాత్ర- ఇది మన చేతులు మరియు,ప్రతీ ఉపచారానికి మధ్య మధ్యలో ఉద్ధరిణ శుభ్రం చేసి తిరిగి మరొక ఉపచారము చేసేప్పుడు వాడే దానికి శుద్ధ జలము నింపిన పాత్ర.
హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం-పాటిద్దాం

TELUGU

For those whose mother tongue is Telugu, Who loves Telugu and who wants to know something about Telugu. Interesting Facts of Telugu Language

1. Telugu Language was  known to exist since the Time period 400 BCE.

2. In 2012 Telugu has been voted as the 2nd best script in the world by International Alphabet Association, Korean ranks no 1.

3. Speaking Telugu Language activates about 72000 neurons in your body, highest for any Language in the world proven by Science.

4. An ethnic group from Sri Lanka called Sri Lankan Gypsy people mostly speak Telugu.

5. There are many many Telugu communities in Myanmar Just do a Google Search.

6. In 16th century an Italian Explorer Niccolò de’ Conti found that the words in Telugu language end with vowels, just like those in Italian, and hence referred it as “The Italian of the East”.

7. Telugu ranks 3rd by the number of native speakers in India (75 million people), and 15th in the Ethnologue list of most-spoken languages worldwide.

8. Telugu derived from trilinga, as in Trilinga Desa, “the country of the three lingas”. According to a Hindu legend, Shiva descended as a linga on three mountains: Kaleswaram in Nizam, Srisailam in Rayalaseema and Bhimeswaram in Kostha.

9. Telugu is the only language in the Eastern world, that has every single word ending with a vowel sound.

10. Telugu language has the most number of सामितलु i.e., idioms and proverbs.

11. Telugu language previosuly also known as Tenungu or Telungu.

12. Rabindranath Tagore is said to have stated that Telugu is the sweetest of all Indian Languages.

13. About 200 Years ago about 400 people Telugu speaking people were taken to Mauritius as plantation workers, now Prime Minister is one of their descendants.

14. A Palindrome of 40 slokas which when read from start to end is Ramayana and end to start Mahabharata, there is no other Language like this.

15. Sri Krishnadevaraya visited this temple in Srikakulam and paid homage to the deity. It was here that Krishnadevaraya wrote the literary classic, Amuktamalyada at the order of the Lord Andhra Vishnu who had said “Des Bhashalandu Telugu Lessa” (Telugu is the greatest among the state’s languages”) and ordered Sri Krishnadevaraya to adopt Telugu as the official language of his province.

16. We have a single lettered poem in Telugu also called ekakshara padhyamulu
Often said by all Greatest Saints that...Telugu language is greatest boon from Creators.

Be proud to Be a Telugu person.

తెలుగు

ఎవరి మాతృభాష తెలుగు, తెలుగును ఎవరు ప్రేమిస్తారు మరియు తెలుగు గురించి కొంత తెలుసుకోవాలనుకునే వారికి. తెలుగు భాష యొక్క ఆసక్తికరమైన వాస్తవాలు

1. క్రీస్తుపూర్వం 400 నుండి తెలుగు భాష ఉనికిలో ఉంది.

2. 2012 లో తెలుగును అంతర్జాతీయ ఆల్ఫాబెట్ అసోసియేషన్ ప్రపంచంలోని 2 వ ఉత్తమ స్క్రిప్ట్‌గా ఎన్నుకుంది, కొరియన్ ర్యాంక్ నంబర్ 1.

3. తెలుగు భాష మాట్లాడటం మీ శరీరంలో సుమారు 72000 న్యూరాన్‌లను సక్రియం చేస్తుంది, సైన్స్ నిరూపించిన ప్రపంచంలోని ఏ భాషకైనా ఇది అత్యధికం.

4. శ్రీలంక నుండి వచ్చిన ఒక జాతి శ్రీలంక జిప్సీ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడతారు.

5. మయన్మార్‌లో చాలా తెలుగు కమ్యూనిటీలు ఉన్నాయి గూగుల్ శోధన చేయండి.

6. 16 వ శతాబ్దంలో ఇటాలియన్ ఎక్స్‌ప్లోరర్ నికోలో డి కాంటి, తెలుగు భాషలోని పదాలు ఇటాలియన్‌లోని మాదిరిగానే అచ్చులతో ముగుస్తుందని కనుగొన్నారు, అందుకే దీనిని "ది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" అని పిలుస్తారు.

7. భారతదేశంలో స్థానిక మాట్లాడేవారి సంఖ్య (75 మిలియన్ల మంది) తో తెలుగు 3 వ స్థానంలో ఉంది మరియు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మాట్లాడే భాషల ఎథ్నోలాగ్ జాబితాలో 15 వ స్థానంలో ఉంది.

8. "మూడు లింగాల దేశం" అయిన త్రిలింగా దేశంలో ఉన్నట్లుగా తెలుగు నుండి తెలగు వచ్చింది. హిందూ పురాణం ప్రకారం, శివుడు మూడు పర్వతాలపై లింగాడిగా అవతరించాడు: నిజాం లోని కలేశ్వరం, రాయలసీమలోని శ్రీశైలం మరియు కోస్తలోని భీమేశ్వరం.

9. తూర్పు ప్రపంచంలో తెలుగు భాష మాత్రమే, ప్రతి పదం అచ్చు శబ్దంతో ముగుస్తుంది.

10. తెలుగు భాషలో అత్యధిక సంఖ్యలో  అనగా ఇడియమ్స్ మరియు సామెతలు ఉన్నాయి.

11. తెలుగు భాషను తెనుంగు లేదా తెలుంగు అని కూడా పిలుస్తారు.

12. రవీంద్రనాథ్ ఠాగూర్ అన్ని భారతీయ భాషలలో తెలుగు మధురమైనదని పేర్కొన్నారు.

13. సుమారు 200 సంవత్సరాల క్రితం సుమారు 400 మంది తెలుగు మాట్లాడే ప్రజలను మారిషస్కు తోటల కార్మికులుగా తీసుకువెళ్లారు, ఇప్పుడు వారి వారసులలో ప్రధానమంత్రి ఒకరు.

14. 40 స్లోకాల పాలిండ్రోమ్, ఇది మొదటి నుండి చివరి వరకు చదివినప్పుడు రామాయణం మరియు మహాభారతం ప్రారంభించడానికి ముగుస్తుంది, ఇలాంటి భాష మరొకటి లేదు.

15. శ్రీ కృష్ణదేవరాయ శ్రీకాకుళంలోని ఈ ఆలయాన్ని సందర్శించి దేవతకు నివాళులర్పించారు. ఇక్కడే కృష్ణదేవరాయ సాహిత్య క్లాసిక్, అముక్తమల్యడను "దేస్ భాషలందు తెలుగు లెస్సా" (రాష్ట్ర భాషలలో తెలుగు గొప్పది ") అని చెప్పిన ఆంధ్ర విష్ణువు ఆదేశానుసారం రాశారు మరియు శ్రీ కృష్ణదేవరాయను తెలుగును అధికారిక భాషగా స్వీకరించమని ఆదేశించారు. తన ప్రావిన్స్.

16. మనకు తెలుగులో ఒకే అక్షర పద్యములు అని పిలువబడే ఒకే అక్షర పద్యం ఉంది
అన్ని గొప్ప సెయింట్స్ తరచూ ఇలా అన్నారు ... తెలుగు భాష సృష్టికర్తల నుండి గొప్ప వరం.

*కణ నాట్యమే- నటరాజు పరమ శివుడి తాండవం:*

( *ఇదే సైన్స్ పుస్తకం ఒక భారతీయుడు రాసివుంటే మన దేశం లో కొన్ని లక్షల మంది వెటకారంగా, అపహష్యంగా మాట్లాడేవారు... పాపం వారికి ఆ అవకాశం లేదు*)

 శివ తాండవం అంటే ఏమిటో తెలియచేయాలంటే అది అనుభవించిన వాడే చెప్పగలడు. అట్టి అనుభవానికి జాతి, కుల, మత, దేశ కాల నియమాలు లేవని తెలియ చేయడానికే ఒక పాశ్చాత్యుని అనుభవం ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

*డా. ఫ్రిట్జ్ ఆఫ్ కాప్రా అమెరికాలో నివసించే భౌతిక శాస్త్రవేత్త.* డెబ్బయ్యవ దశకంలో ఉన్న కాప్రా వయోవృధ్ధుడే కాదు; అభివృధ్ధుడు, ఙ్ఞాన వృధ్ధుడు కూడా. ఙ్ఞానికి, చైతన్యానుభవానికి దేశ కాలాలు అడ్డుకావని చెప్పడానికి ఒక సజీవ ఉదాహరణ డా.కాప్రా. అతడు తన *'తావో ఆఫ్ ఫిజిక్స్'* అనే గ్రంథం ఉపోద్ఘాతంలో పొందుపరిచిన అనుభవం ఇది:

"ఐదు సంవత్సరాల క్రితం కలిగిన అద్భుతమైన అనుభవం నన్ను ఒక కొత్త మర్గంలో నడిపించి, ఈనాడు ఈ గ్రంథ రచనకు ప్రేరణగా నిలిచింది.

ఒకనాటి ఎండాకాలం సాయంకాలం సముద్రపు ఒడ్డున వచ్చి పోయే అలలను చూస్తూ, నా శ్వాసనిశ్వాసల లయబద్ధతను గమనిస్తూ కూర్చొని ఉన్నాను. ఉన్నట్టుండి నా అంతరంగానికి ఈ చుట్టూ ఉన్న వాతావరణమంతా ఒక గొప్ప నృత్యంలో భాగంగా నాట్యం చేస్తున్నట్టు గోచరించసాగింది.

ఒక శాస్త్రవేత్తగా ఈ ఇసుక, రాళ్ళు, నీరు, గాలి - అన్నీ కదుల్తున్న అణు, పరమాణువుల చేత చేయబడినవని తెలుసు. అలాగే భూమి యొక్క వాతావరణమంతా పదార్థ రాశి నిర్మింపబడడానికి అణుపరమాణువుల మధ్య జరిగే నిరంతర సంగ్రామాన్ని ఒక భౌతిక శాస్త్రవేత్తగా గ్రాఫ్లు ,బొమ్మలు, సూత్రాల ద్వారా మాత్రమే ఎరిగి ఉన్నాను.

కానీ ఈనాడు చల్లని ఈ సాయం సంధ్య నా పుస్తక ఙ్ఞానికి ప్రాణం పోసింది.

శక్తి తరంగాలు ఆకాశం నుండి దిగిరావడం నేను చూశాను.

లయబద్ధంగా ఆ శక్తి తరంగాలు పదార్థ రాశిగా మారడం, తిరిగి శక్తిగా లయించిపోవడం నేను చూశాను.
పదార్థంలోని పరమాణువులను నేను దర్శించగలిగాను.ప్రతి పదార్థములోని అణువులకు, చలనం ఉన్నది. ఉప పరమాణు క్షేత్రము (sub atomic field)లోనే కాకుండా, పరమాణు క్షేత్రములో కూడా "కణ తాండవం" జరుగుతూ ఉంటుంది. కానీ అది మన మామూలు కనులకు కనబడదు. పరమ సూక్ష్మ స్థాయిలో ఇది జరుగుతూ ఉంటుంది.భూ వాతావరణాన్ని, కాస్మిక్ కిరణాలు, నిరంతరం మర్దిస్తున్నాయని, అందులో ఉన్న అతి శక్తి కణాలు, గాలి లోకి చొచ్చుకొని వచ్చినపుడు , బహుళ సంఘాతాలకు గురి అగునని నాకు తెలుసు. భౌతిక శాస్త్ర పరిశోధనల వలన ఈ విషయం నాకు తెలుసు. అయితే ఈ పరిజ్ఞానమంతా, ఇప్పటి వరకు, గ్రాఫుల ద్వారా, చిత్రాల ద్వారా, గణిత-భౌతిక శాస్త్ర సిద్ధాంతాల ద్వారా మాత్రమే తెలుసు కున్నాను. సముద్ర తీరాన కూర్చొన్నపుడు, నా గత అనుభవాలన్నీ జీవం పోసుకున్నాయి. బాహ్య ఆకాశము నుండి అవతరించు, ఆవర్తనములను (సుడులు), అందులోని కణములు లయాత్మకంగా స్పందిస్తూ పొందు సృష్టిని, నాశనాన్ని చూశాను. మూల కాల పరమాణువులు, నా శరీరంలోని పరమాణువులు....ఈ విశ్వ శక్తి నాట్యంలో పాల్గొనడం నేను చూసాను. ఆ లయను నేను అనుభవించాను. ఆ ధ్వని విన్నాను. అదియో హిందువులు పూజించు "నటరాజు - శివుని నాట్యమని" ఆ క్షణంలో తెలుసుకున్నాను. ఇట్టి శివ తాండవములో పాల్గొనని నక్షత్రముండునా? పరమాణువు ఉండునా? చలించని తరంగ ముండునా?

    *అనుక్షణం తాండవిస్తూ, అట్టి కదలికల వలన శబ్దాన్ని ఉత్పన్నం చేయు పరమాణు సమూహములే, కంటికి కనిపించే "చరాచర జగత్తు"*

ఆ నృత్యం యొక్క క్రమం మారితే, దాని శబ్దం మారుతుంది. ప్రతి పరమాణువు కూడా తన గానాన్ని తానే పాడుతుంది. ఆ శబ్దము స్థూల-సూక్ష్మ రూపాలను ఉత్పన్నం చేస్తుంది. ఆ శబ్దమే.....శబ్ద బ్రహ్మముగా....అదే సృష్టి స్థితి లయలకు కారణాలుగా భావించి, దాని రూపమైన సంగీతాన్ని.....ఆధ్యాత్మిక సాధనగా గైకొనిన కబీరు, గురునానక్, త్యాగరాజు మొదలగు ఆత్మ వేత్తలు చెప్పిన దానికి, నేటి భౌతిక శాస్త్ర సిద్ధాంతాలు ఎంతో సన్నిహితంగా ఉన్నాయి.

నా శరీరంతో సహా సర్వంలోనూ ఉన్న ఆ అణుపరమాణువులు ఒక మహా శక్తి తరంగ నృత్యంలో భాగాలుగా నర్తించటం చూశాను.

*ఆ లయను నేను గుర్తించాను.*

*ఆ శబ్దాన్ని నేను విన్నాను.*

ఆ క్షణంలో నేను అనుభూతి చెందింది హిందువులు నటరాజుగా పూజించే పరమశివుని తాండవంగా తెలుసుకొని పరవశంతో నన్ను నేను మరచిపోయాను.

సజల నయనాలతో కాలం తెలియని అలౌకిక స్థితికి తీసుకెళ్ళిన ఆ అనుభూతిని, కాదు అనుభవాన్ని ఏమని వర్ణించగలను?!!

ఈ అనుభవమే నా గమ్యాన్ని, గమనాన్ని మార్చే దిక్సూచి అయింది. నా అడుగులు తూర్పు దేశాలలోని అద్భుత విద్య వైపు కదిలేలా చేసింది. ఎందరో మహనీయులను దర్శించే అవకాశం కలిగించింది".

     వివిధ గ్రంథాల్లో, శివ తాండవాన్ని, కవితాత్మక వర్ణనగా, కవిత్వం రూపంగా మాత్రమె కాదు. సర్వ రూపములు ఈశ్వరుడే....అంటే పరబ్రహ్మమే. కావున తాండవం అనగా నిత్యం స్పందించే (vibration) విశ్వమే శివుడు (ఈశ్వరుడు).ఆధునిక భౌతిక శాస్త్రం చెప్పినట్లు, ఈ తాండవం నిత్యం జరుగునదేఅంటాడు fritze of Capra.

   *ఇలా విశ్వం యొక్క  సృష్టి-స్థితి-లయలను, Fritze of Capra నటరాజు నృత్యంతో పోలుస్తాడు. నటరాజు కుడి చేతిలో డమరుకం, ఎడమ చేతిలో అగ్ని ఉంది. డమరుకం, నూతన అణువుల సృష్టికి సంకేతం. అగ్ని , పాత అణువుల విలీనానికి సంకేతం. మరొక కుడి చేతిలో అభయ ముద్ర, మరొక ఎడమ చేతితో వరద ముద్ర నెపంతో, తన పాదాలను ఆశ్రయించమని సూచిస్తున్నాడు. ఆయన గ్రంథం Tao of Physics మొదటి ముద్రణ ముఖ చిత్రంగా, నటరాజు పరమ శివుణ్ణే ఎన్నుకున్నాడు.*

 *మన పురాణ వర్ణనలు, వేదోక్త భావనలు, ఉపనిషత్తుల జ్ఞాన సంపద.....పాశ్చాత్య శాస్త్రవేత్తలకు క్రొంగొత్త భావనలు అందిస్తూ ఉంటే, భారతీయులలో భావ దాస్యం గల కొంతమంది మన సాహిత్యాన్ని పుక్కిటి పురాణాలుగా చెబుతున్నారు. ఎంత హైన్యం? ఎంత దైన్యం?*

ఈ భావ దాస్యం నుండి ఎప్పుడు బయట పడదాం.ఆలోచించండి

దేవతలు కూడా కాలం చేయవలసినదే,

అమృతం తాగిన దేవతలు కూడా ఒకనాడు కాలం చేయవలసినదే, కానీ విషాన్ని మింగిన శివుడు మృత్యుంజయుడు. ఆ తల్లి మాంగళ్యాన్ని ఎవ్వరు స్మరించినా గండాలు ఆపదలు తొలగిపోతుంది. మాంగళ్యాన్ని భావన చేసి నమస్కారం చేసుకోవాలి.

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాథకే,
శరణ్యే త్రంబకే దేవి నారాయణి నమోస్తుతే.

తాత్పర్యం:
 ఓం = ఓంకారము
సర్వ = సమస్తములైన
మంగళ = శుభములకును
మాంగళ్య = శుభ కరమగు దానా !
శివే = శివుని అర్ధాంగి అయిన
సర్వ = సమస్తములైన
అర్ధ = ప్రయోజనములను
సాధికే = నెర వేర్చెడి శక్తి గలదానా
శరణ్యే = భక్తులకు పెద్ద దిక్కు అయినదానా !
త్ర్యంబకే = ముక్కంటి అర్ధాంగి
నారాయణి = విష్ణుమూర్తి సోదరికి
గౌరీ = ఓ పార్వతి మాతా !
తే = నీకు
నమః = నా యీ వందనము
అస్తు = చెందును గాక !

🌹భావం: 
      సకల శుభములకు మూలమైన పార్వతీ! కోరికలన్నీ తీర్చు తల్లీ ! అందరికీ శరణము నిచ్చు,  మూడు కన్నుల కల శివుని అర్ధాంగి అయిన గౌరీ ! నారాయణుని సోదరీ ! నీకు నమస్కరము.

ఈ  శ్లోకమ్ స్త్రీలు పురుషులు అన్న బేధం లేకుండా అందరూ నిత్యం స్మరించవచ్చు.. ఉదయాన్నే వినాయకుడిని

ఓం గం గణపతయే నమః (21 సార్లు)

ఓం గంగా దేవై నమః (మూడు సార్లు) తలుచుకుని తర్వాత

సర్వ మంగళ మాంగళ్యే శివ సర్వార్ధ సాధికే
శరణ్యే త్య్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే||
సృష్టి స్థితి వినాశానాం శక్తి భూతే సనాతని
గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే||
శరణాగత దీనార్త పరిత్రాణ నారాయణే
సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే||
జయ నారాయణి నమోస్తుతే ( చై చూసుకుని నమస్కారం చేసాకే గణపతి స్మరణ తో మొదలు పెట్టాలి)

ఇలా స్త్రోత్రం చేసి తర్వాత మీ నిత్య కర్మలు పూర్తి చేసి ఇంటిదేవుణ్ణి, విష్ణు ఆరాధన చేసే వాళ్ళు వారి వారి పూజ విధులు యదా విధిగా పూర్తి చేసుకోవచ్చు.

రాత్రి పడుకునే సమయంలో 11 సార్లు శివ నామ స్మరణ చేయాలి.

🌹శ్రీ మాత్రే నమః🌹

విధి లిఖితం విష్ణువు నైనా విడిచిపెట్టదు*

 శ్రీకృష్ణుడి అంత్యక్రియలు:
రోజూ ఎన్నో మరణాలు సంభవిస్తుంటాయి. 
కోవిడ్ వచ్చింది కదా, లాక్డౌన్ ఉంది కదా అని ఇతర మరణాలు ఆగకుండా ఉండవు కదా. 

ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత బలగం ఉన్న మనిషి అయినా, ఎంత కీర్తిమంతుడైనా, సినీ ప్రముఖుడైనా, రాజకీయ నాయకుడైనా ఈ లాక్డౌన్ సమయంలో ప్రాణం విడిస్తే కుటుంబ సభ్యులు పడుతున్న బాధ "ఈ సమయంలో ఇలా ఏమిటి? అంతిమయాత్ర పట్టుమని పదిమంది కూడా లేకుండా ఏమిటి?" అని. చాలామంది ఇదే విషయానికి మరింతగా కృంగిపోతూ ఉండవచ్చు ప్రస్తుతం. సహజం. 
అంతేకాదు..కొందరికి ఉన్న కొడుకులు, కూతుళ్లు అందరూ విదేశాల్లో ఉన్నవారు ఉన్నారు. లాక్డౌన్లో ఏం జరిగా ఎవ్వరూ రాలేని పరిస్థితి. 
వారందరి కోసం "మహాభారతం" మౌసలపర్వంలోని శ్రీకృష్ణుని అంత్యక్రియల విషయం క్లుప్తంగా ఒక్కసారి చెప్పుకోవాల్సిన సందర్భం వచ్చింది.
ఎక్కడో ద్వారక. 
దానికి చాలా దూరంలో తపోవనం. 
ఆ తపోవనంలో శ్రీకృష్ణుడు తపస్సులో ఉన్నాడు. 
అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం విడిచాడు. ఆ అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది. కానీ బలరాముడు కూడా లేడు. సమస్త బంధుగణం మధ్య ఘనంగా ఆ కార్యక్రమం అర్జునుడే జరిపించాడు. 
ఆ కార్యక్రమం ముగిసాక అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్త నెమ్మదిగా చెప్పాలని వెతుక్కుంటూ ఒక్కడే తపోవనం దాకా ప్రయాణమై వచ్చాడు. వెతికాడు. దాదాపు రెండ్రోజులు కాళ్లరిగేలా తిరిగాడు. 
మొత్తానికి ఒకచోట శ్రీకృష్ణుడు కనిపించాడు...కానీ ప్రాణం లేకుండా..! అర్జునుడు హతాశయుడైపోయాడు. కుమిలిపోయాడు. రోదించాడు. అది శ్రీకృష్ణ కళేబరం కాదని కూడా నమ్మాలనుకున్నాడు. 
అర్జునిడితో పాటూ ఉన్న రథసారధి, ఇంకా ఇద్దరు ముగ్గురు మాత్రమే అర్జునుడిని ఓదార్చారు. 
అప్పటికే శ్రీకృష్ణుడు ఆ అరణ్యంలో బోయవాడి బాణం కాల్లో దిగడం వల్ల దేహాన్ని వదిలేసి 4-5 రోజులు గడిచాయి.  అప్పుడు ఆ మృతదేహాన్ని ద్వారకకి తీసుకువెళ్ళే వీలు లేక (ఎందుకంటే ద్వారక సరిగ్గా అప్పుడే సముద్రంలో మునగడానికి సిద్ధంగా ఉంది), అక్కడే అర్జునుడొక్కడే అరగంటలో అంత్యక్రియలు పూర్తిచేసాడు ఏ అర్భాటమూ, ఏ శాస్త్రమూ లేకుండా.

అష్టభార్యలు, ఎనభై మంది సంతానం, మనుమలు, విపరీతమైన బలగం, అఖండమైన కీర్తి ఉన్న శ్రీకృష్ణుడికి అంత్యక్రియల సమయానికి బావ అయిన అర్జునుడు తప్ప ఇంకెవ్వరూ లేరు. 
శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి ఇద్దరు కొడుకులున్నా వాళ్ల చేతులమీదుగా అంత్యక్రియలు జరుగలేదు.

అంతటి ఇతిహాసపురుషులకే అటువంటి అంతిమఘడియలు తప్పలేదు. మహానుభావుల మరణాలు కూడా కాలక్రమంలో సందేశాలు, ఊరటలు, మార్గనిర్దేశకాలు అవుతాయి అనడానికి ఇదొక ఉదాహరణ. 
మనమంతా కూడా కాలంలో కొట్టుకుపోయే వాళ్లమే. ఆ కాలం ఎప్పుడు ఎవరికి ఎలా నిర్ణయిస్తుందో ఎవరూ చెప్పలేరు. 

ఈ కరోనా లాక్డౌన్ సమయంలో మరణాలు పొందినవారి కుటుంబ సభ్యులకి ఈ శ్రీకృష్ణుడి అంత్యక్రియల ఘట్టం కొంతైనా భారాన్ని దింపుకునే శక్తిని ప్రసాదించుగాక. 

కరోనా సమస్యపై విశ్లేషణ -

     కరోనా అనే వ్యాధి ఒక వైరస్ వలన సంభవిస్తుంది అన్నది అందరికి తెలిసిన విషయమే . అసలు ఈ వైరస్ ల గురించి ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో ఏమి ఉన్నదో ఇప్పుడు మీకు వివరిస్తాను . కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన మహర్షులు ఈ బ్యాక్టీరియా , వైరస్ ల పైన సంపూర్ణ అవగాహన కలిగి ఉండి అవి వేటివేటి ద్వారా సంక్రమిస్తాయో అన్నది కూడా తెలుసుకోగలిగారు. వారువారు తమ ఆయుర్వేద గ్రంథాల యందు వీటిని భూతాలుగా , వాటికి చేయు చికిత్సలను భూతచికిత్సలుగా పేర్కొన్నారు. 

                  ప్రస్తుతం సమస్త మానవాళిని పట్టిపీడిస్తున్న ఈ " కరోనా వ్యాధి " కూడా ఇటువంటి భూత సంబంధ దోషమే . సరైన అవగహన ఉన్న పరిశోధకులు ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో వివరించిన భూత చికిత్సలపైన అవగాహన ఏర్పరచుకొని పరిశోధించవలెను. మనుష్యునికి ఎదైనా వ్యాధి సంభవించినప్పుడు ఏ ఔషధం పడితే ఆ ఔషధం వాడకుండా ముందు అసలు ఆ వ్యాధి సంభవించడానికి గల కారణం కనుక్కొని ఆ దోషాన్ని నివారించుటకు సరైన ఔషధాలను తీసుకుంటూ వచ్చిన వ్యాధిని తగ్గించుకోవలెను . వ్యాధి నివారణలో ఆహార సేవన అన్నది కూడా ప్రధానపాత్ర వహించును. 

                 కరోనా వ్యాధిని కలిగించు వైరస్ మన శరీరంలో ప్రవేశించినప్పుడు మన శరీరం నందు కఫదోషాన్ని ప్రకోపింపచేయును. కావున కఫాన్ని నిరోధించు ఔషధాలు వాడవలెను. ఈ వ్యాధి ప్రథమముగా నాసిక ద్వారా మనుష్య శరీరం నందు ప్రవేశించి గొంతు ఆ తరువాత ఊపిరితిత్తులను చేరును. ఊపిరితిత్తులను చేరిన తరువాత దీని క్రూర స్వభావాన్ని చూపించును. ఉపిరితిత్తులను చేరిన తరువాత ఉచ్చ్వాస , నిచ్చ్వాసాలు 50 నుండి 60 వరకు నిమిషానికి పెరుగును . నాడి 110 నుండి 120 వరకు ఉండును. పెదవులలో నలుపుదనం రావొచ్చు. తీవ్రమైన దగ్గు వస్తుంది. దగ్గుతో పాటు కళ్ళే వచ్చును. కొంతమందికి కళ్ళెతో పాటు రక్తం రంగుతో వచ్చును. మరికొంత మందికి నురుగుతో కూడి చిక్కగా కాని పసుపు రంగుతో గాని ఉండవచ్చు. జ్వరం వచ్చును. ఇది తీవ్రతరం అయినప్పుడు ముఖవర్చస్సు తప్పి రోగి తీవ్రముగా భాధపడును. పెదవులు నల్లబడి రక్తప్రసరణ మండలం స్తంభించి పోవును . వ్యాధి తీవ్రత ఎక్కువై గుండెకొట్టుకొనుట తగ్గును. తీవ్రమైన తలనొప్పి ఉండును. కంఠం ఆరిపోయి ఎర్రబడును. జ్వరం మూడు నుంచి నాలుగు రోజులపాటు ఉండును. ఒక్కోసారి వారంపాటు కూడ ఉండును. ఒక్కోసారి చెమట పట్టి జ్వరం తగ్గును. ఈ వ్యాదికి సంబంధించిన విషక్రిములు మనుష్య శరీరం ఏయే భాగాలకు చేరునో ఆయా భాగాలు రోగగ్రస్తం అయ్యి ఆయా దుష్ప్రభావాలు బయటకి కనిపించును. 

             ప్రస్తుత మనం అత్యంత ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నాము . ఇటువంటి పరిస్థితుల్లో ఈ సమస్యని సరైన జాగ్రత్తలు పాటిస్తూ శరీరంలో రోగనిరొధక శక్తిని పెంచుకోవటం ఒక్కటే మార్గం . నాకు తెలిసినంత వరకు పాజిటివ్ వచ్చింది అన్నవారికి అంత తొందరగా అది వదలదు అని నా నమ్మకం . రోగకారణమైన క్రిమి సూప్తావస్థలో ఉండి ఏ రోజైతే మనుష్యుడులోని రోగనిరోధక శక్తి తగ్గినపుడు తన తీవ్రప్రభావాన్ని చూపిస్తుంది. 

              ఇప్పుడు మనుషులలో రోగనిరోధకశక్తి అత్యంత తక్కువుగా ఉంది. దీనికి ప్రధానకారణం మనం తీసుకునే పురుగు మందులు కలిసిన ఆహారం . ప్రతి సంవత్సరం మన భారతీయులు ఆహారం ద్వారా 300ml పురుగుమందు లోపలికి తీసుకుంటున్నారు. ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనలో రోగనిరొధక శక్తి ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ముందు మన ఆహారం మరియు దినచర్యలో తప్పక మార్పులు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

                  మనలో రోగనిరోధక శక్తిని పెంపొందించుటకు వీలైనంతవరకు శాకాహారం తీసుకోవడం చాలా మంచిది . విటమిన్స్ కలిగిన తాజా ఆకుకూరలు , పండ్లు తీసుకోవడం చాలామంచిది. ఎంత అవసరమో అంతవరకే వండుకొని తినండి. ఫ్రిజుల్లో నిలువ ఉంచుకుని మరలా వేడి చేసుకుని తినడం అత్యంత ప్రమాదకరం . సాధ్యమైనంతవరకు తేలికగా ఉండి త్వరగా జీర్ణం అయ్యే ఆహారపదార్ధాలు తీసుకోవడం అత్యంత ఉత్తమమైన పని . 

       ఇప్పుడు మీకు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే ఔషధాల గురించి తెలియచేస్తాను. వాటిలో అత్యంత ప్రధానమైనది స్వర్ణభస్మం . దీనిని వాడటం వలన శరీరానికి అత్యంత బలం వచ్చును. ఓజస్సును పెంపొందించును. ఓజస్సు అనగా ఆయుర్వేదం నందు రోగనిరొధక శక్తి అంటారు. ఈ స్వర్ణభస్మం ఖరీదు ఎక్కువుగా ఉండును. అనుభవ వైద్యుల సహాయంతో వాడవలెను. అశ్వగంధ కూడా రోగనిరొధక శక్తిని పెంపొందించుటలో ప్రధానపాత్ర పెంపొందించును. 

          కరోనా లక్షణాలు కనిపించినచో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కఫాన్ని హరించు ఔషధాలు వాడుకోవలెను. అదేవిధముగా రోగనిరోధక శక్తిని పెంచే ఔషధాలు వాడవలెను. నా అనుభవసారం కొన్నిరకాల మూలికల గురించి తెలియచేస్తాను. అవి 

    * కరక్కాయ 

     * అక్కలకర్ర . 

     *  అశ్వగంధ . 

      * చ్యవన్ ప్రాశ  ఇందులో ఉశిరిక ముఖ్యమయినది.

      *  అడ్డసరం . 

      *  గోమూత్రము . 

      *  మిరియాలు .

      *   పిప్పిళ్లు . 

      *   శొంఠి . 

      *   లవంగాలు . 

      *  వేపనూనె , వేపచెక్క కషాయం . 

      *  వెల్లుల్లి . 

       *  కుంకుమపువ్వు . 

       *  ఉలవల కషాయం . 

       *  తేనె . 

       *  నిమ్మపండ్లు . 

       *  నీరుల్లిపాయ . 

       *  మంజిష్ట . 

       * రజత భస్మం . 

       *  స్వర్ణభస్మం . 

       *  సన్నరాష్ట్రం . 

       *  అల్లం . 

       *  పచ్చకర్పూరం . 

       *  తులసి . 

       *  చండ్ర కషాయం . 

           పైన చెప్పినవన్నీ బ్యాక్టీరియా , వైరస్ లను నిర్మూలించగలిగిన శక్తి ఉండి శరీరంలో కఫదోషాన్ని నివారించగలిగినవే . గొంతు నందు నొప్పి మొదలైన వెంటనే అల్లం ముక్కకి ఉప్పు అద్దుకుని బుగ్గన పెట్టుకుని రసం మింగండి. కొంత సమయంలోనే సమస్య తీరిపోవును . జ్వరం వచ్చుచున్న బెత్తెడు వేపచెట్టు బెరడు తీసుకుని ఒక గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి తాగించి లొపలికి గాలిచొరబడకుండా రోగికి నిండుగా దుప్పట్లు కప్పవలెను ఇలా 3 పూటల 3 రోజుల పాటు చేసిన ఎంతటి తీవ్రమైన జ్వరం అయినా తగ్గును. 

        చివరగా ఒక్క విషయం ఆల్కాహాల్ తో కూడినటువంటి శానిటైజర్లను చేతులు శుభ్రపరచుకోవడానికి అదే పనిగా వాడకండి. "పటిక" అత్యుత్తమ శానిటైజర్ . పటిక ని మెత్తటి చూర్ణం చేసి ఒక కప్పు నీటిలో 3 చిటికెల చూర్ణం కలిపి శానిటైజర్ తయారుచేసుకోండి . ప్రమాదరహితమైనది. 

         తగిన జాగ్రత్తలు పాటిస్తూ మీయొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ మీదనే ఆధారపడిన మీ కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని కూడా కాపాడండి. 

              కాళహస్తి వేంకటేశ్వరరావు 

          అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                     9885030034

*దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు…

 ఈ సృష్టి మొత్తం వ్యాపించి వుండి, దాని ఉత్పత్తి, పెంపు, లయములకు ఎవరు కారణమవు తున్నారో…, అతనినే ‘దేవుడు’ అని అన్నారు మన ఋషులు. మరి ఆ దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు…అనే సందేహం మనలో చాలా మందికి కలగవచ్చు. నిజాన్ని పరిశీలిస్తే… పాంచభౌతికమైన మన శరీర అవయవాలకు వున్న శక్తి చాలా పరిమితం. ఉదాహరణకు…

– మన కాళ్ళు…ఈ విశ్వాన్ని మొత్తం నడచి రాలేవు. వాటికి అంత శక్తి లేదు.

– మన చేతులు..కైలాస పర్వతాన్ని ఎత్తిపట్టుకుని మోయలేవు. వాటికి అంత శక్తి లేదు.

– మన కళ్ళు…అతి విసృతమైన పదార్ధాన్నిగానీ.. అతి సూ‌క్ష్మమైన పదార్ధాన్నిగానీ… చూడలేవు. వాటికి అంత శక్తి లేదు.
ఆకాశం మన కంటికి కనిపించదు. చూస్తున్నామని అనుకోవడం మన భ్రమ. అతి సూక్ష్మక్రిమి అయిన ‘అమీబా’ని సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్) సాయంతో చూస్తున్నాం కదా అని మీరు అడగవచ్చు. మన కళ్ళకు అంత శక్తి లేదు కనుకనే… మనం సూక్ష్మదర్శినిని ఆశ్రయించవలసి వస్తుంది.
మరి ఈ కళ్ళతో ‘దేవుని’ చూచిన ఋషులు వున్నారుకదా..అని మీరు అడగవచ్చు.

– కళ్ళు భౌతికమైన పదార్ధాలను మాత్రమే చూడగలవు.

– మనోనేత్రం అభౌతికమైన పదార్ధాలను దర్శిస్తాయి.
‘దేవుడు’ మనోనేత్రానికి దర్శనమిస్తాడు. తను సంకల్పించినప్పుడు మాత్రం మన భౌతిక నేత్రాల ముందు ప్రత్యక్షమౌతాడు. చూడడానికి, దర్శించడానికి ఉన్న తేడా అది.
మరి *మనోనేత్రంతో ‘దేవుని’ దర్శించడం ఎలా* అన్నదే ఈనాటి మన ప్రశ్న.
పంచభూతాల శక్తుల సమ్మిళితమే…భూలోక జీవుల శరీర నిర్మాణం. అందుకే… ఈ లోకంలోని జీవులన్నీ భూమిని ఆశ్రయించి జీవిస్తూంటాయి. పంచభూతాల తత్త్వాలు మన శరీరాన్ని ఆవహించి ఉన్నంత వరకూ…,వాటికి అతీతంగా ఉండే ‘పరమాత్మ’ మన కళ్ళకు దర్శనమివ్వడు. ఆ దేవదేవుని దర్శించాలంటే…పంచభూత తత్త్వాలనూ, వాటి గుణాలనూ, త్యజించాలి. ఏమిటి వాటి గుణాలు, తత్త్వాలు…అంటే….

– *ఆకాశానికి* ఉన్న ఒకే ఒక గుణం…శబ్దం.

– *వాయువు* కు ఉన్నగుణాలు రెండు…శబ్దము, స్పర్శ.

– *అగ్ని* కి ఉన్న గుణాలు మూడు…శబ్ద, స్పర్శ, రూపములు.

– *జలము* కు ఉన్న గుణాలు నాలుగు…శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు.

– *భూమి* కి ఉన్న గుణాలు ఐదు…శబ్ద, స్పర్శ, రూప, రస, గంథాలు.
ఈ ఐదు గుణాలూ…పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.

– *జలము*…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము.

– *అగ్ని*…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.

– *వాయువు*…‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.

– *ఆకాశం*…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.

కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు…, ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే…, పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే *‘అహం బ్రహ్మాస్మి’* అంటే. *‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే.* అదే దైవ సాక్షాత్కారం అంటే.

*కణ నాట్యమే- నటరాజు పరమ శివుడి తాండవం:*


( *ఇదే సైన్స్ పుస్తకం ఒక భారతీయుడు రాసివుంటే మన దేశం లో కొన్ని లక్షల మంది వెటకారంగా, అపహష్యంగా మాట్లాడేవారు... పాపం వారికి ఆ అవకాశం లేదు*)

 శివ తాండవం అంటే ఏమిటో తెలియచేయాలంటే అది అనుభవించిన వాడే చెప్పగలడు. అట్టి అనుభవానికి జాతి, కుల, మత, దేశ కాల నియమాలు లేవని తెలియ చేయడానికే ఒక పాశ్చాత్యుని అనుభవం ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

*డా. ఫ్రిట్జ్ ఆఫ్ కాప్రా అమెరికాలో నివసించే భౌతిక శాస్త్రవేత్త.* డెబ్బయ్యవ దశకంలో ఉన్న కాప్రా వయోవృధ్ధుడే కాదు; అభివృధ్ధుడు, ఙ్ఞాన వృధ్ధుడు కూడా. ఙ్ఞానికి, చైతన్యానుభవానికి దేశ కాలాలు అడ్డుకావని చెప్పడానికి ఒక సజీవ ఉదాహరణ డా.కాప్రా. అతడు తన *'తావో ఆఫ్ ఫిజిక్స్'* అనే గ్రంథం ఉపోద్ఘాతంలో పొందుపరిచిన అనుభవం ఇది:

"ఐదు సంవత్సరాల క్రితం కలిగిన అద్భుతమైన అనుభవం నన్ను ఒక కొత్త మర్గంలో నడిపించి, ఈనాడు ఈ గ్రంథ రచనకు ప్రేరణగా నిలిచింది.

ఒకనాటి ఎండాకాలం సాయంకాలం సముద్రపు ఒడ్డున వచ్చి పోయే అలలను చూస్తూ, నా శ్వాసనిశ్వాసల లయబద్ధతను గమనిస్తూ కూర్చొని ఉన్నాను. ఉన్నట్టుండి నా అంతరంగానికి ఈ చుట్టూ ఉన్న వాతావరణమంతా ఒక గొప్ప నృత్యంలో భాగంగా నాట్యం చేస్తున్నట్టు గోచరించసాగింది.

ఒక శాస్త్రవేత్తగా ఈ ఇసుక, రాళ్ళు, నీరు, గాలి - అన్నీ కదుల్తున్న అణు, పరమాణువుల చేత చేయబడినవని తెలుసు. అలాగే భూమి యొక్క వాతావరణమంతా పదార్థ రాశి నిర్మింపబడడానికి అణుపరమాణువుల మధ్య జరిగే నిరంతర సంగ్రామాన్ని ఒక భౌతిక శాస్త్రవేత్తగా గ్రాఫ్లు ,బొమ్మలు, సూత్రాల ద్వారా మాత్రమే ఎరిగి ఉన్నాను.

కానీ ఈనాడు చల్లని ఈ సాయం సంధ్య నా పుస్తక ఙ్ఞానికి ప్రాణం పోసింది.

శక్తి తరంగాలు ఆకాశం నుండి దిగిరావడం నేను చూశాను.

లయబద్ధంగా ఆ శక్తి తరంగాలు పదార్థ రాశిగా మారడం, తిరిగి శక్తిగా లయించిపోవడం నేను చూశాను.
పదార్థంలోని పరమాణువులను నేను దర్శించగలిగాను.ప్రతి పదార్థములోని అణువులకు, చలనం ఉన్నది. ఉప పరమాణు క్షేత్రము (sub atomic field)లోనే కాకుండా, పరమాణు క్షేత్రములో కూడా "కణ తాండవం" జరుగుతూ ఉంటుంది. కానీ అది మన మామూలు కనులకు కనబడదు. పరమ సూక్ష్మ స్థాయిలో ఇది జరుగుతూ ఉంటుంది.భూ వాతావరణాన్ని, కాస్మిక్ కిరణాలు, నిరంతరం మర్దిస్తున్నాయని, అందులో ఉన్న అతి శక్తి కణాలు, గాలి లోకి చొచ్చుకొని వచ్చినపుడు , బహుళ సంఘాతాలకు గురి అగునని నాకు తెలుసు. భౌతిక శాస్త్ర పరిశోధనల వలన ఈ విషయం నాకు తెలుసు. అయితే ఈ పరిజ్ఞానమంతా, ఇప్పటి వరకు, గ్రాఫుల ద్వారా, చిత్రాల ద్వారా, గణిత-భౌతిక శాస్త్ర సిద్ధాంతాల ద్వారా మాత్రమే తెలుసు కున్నాను. సముద్ర తీరాన కూర్చొన్నపుడు, నా గత అనుభవాలన్నీ జీవం పోసుకున్నాయి. బాహ్య ఆకాశము నుండి అవతరించు, ఆవర్తనములను (సుడులు), అందులోని కణములు లయాత్మకంగా స్పందిస్తూ పొందు సృష్టిని, నాశనాన్ని చూశాను. మూల కాల పరమాణువులు, నా శరీరంలోని పరమాణువులు....ఈ విశ్వ శక్తి నాట్యంలో పాల్గొనడం నేను చూసాను. ఆ లయను నేను అనుభవించాను. ఆ ధ్వని విన్నాను. అదియో హిందువులు పూజించు "నటరాజు - శివుని నాట్యమని" ఆ క్షణంలో తెలుసుకున్నాను. ఇట్టి శివ తాండవములో పాల్గొనని నక్షత్రముండునా? పరమాణువు ఉండునా? చలించని తరంగ ముండునా?

    *అనుక్షణం తాండవిస్తూ, అట్టి కదలికల వలన శబ్దాన్ని ఉత్పన్నం చేయు పరమాణు సమూహములే, కంటికి కనిపించే "చరాచర జగత్తు"*

ఆ నృత్యం యొక్క క్రమం మారితే, దాని శబ్దం మారుతుంది. ప్రతి పరమాణువు కూడా తన గానాన్ని తానే పాడుతుంది. ఆ శబ్దము స్థూల-సూక్ష్మ రూపాలను ఉత్పన్నం చేస్తుంది. ఆ శబ్దమే.....శబ్ద బ్రహ్మముగా....అదే సృష్టి స్థితి లయలకు కారణాలుగా భావించి, దాని రూపమైన సంగీతాన్ని.....ఆధ్యాత్మిక సాధనగా గైకొనిన కబీరు, గురునానక్, త్యాగరాజు మొదలగు ఆత్మ వేత్తలు చెప్పిన దానికి, నేటి భౌతిక శాస్త్ర సిద్ధాంతాలు ఎంతో సన్నిహితంగా ఉన్నాయి.

నా శరీరంతో సహా సర్వంలోనూ ఉన్న ఆ అణుపరమాణువులు ఒక మహా శక్తి తరంగ నృత్యంలో భాగాలుగా నర్తించటం చూశాను.

*ఆ లయను నేను గుర్తించాను.*

*ఆ శబ్దాన్ని నేను విన్నాను.*

ఆ క్షణంలో నేను అనుభూతి చెందింది హిందువులు నటరాజుగా పూజించే పరమశివుని తాండవంగా తెలుసుకొని పరవశంతో నన్ను నేను మరచిపోయాను.

సజల నయనాలతో కాలం తెలియని అలౌకిక స్థితికి తీసుకెళ్ళిన ఆ అనుభూతిని, కాదు అనుభవాన్ని ఏమని వర్ణించగలను?!!

ఈ అనుభవమే నా గమ్యాన్ని, గమనాన్ని మార్చే దిక్సూచి అయింది. నా అడుగులు తూర్పు దేశాలలోని అద్భుత విద్య వైపు కదిలేలా చేసింది. ఎందరో మహనీయులను దర్శించే అవకాశం కలిగించింది".

     వివిధ గ్రంథాల్లో, శివ తాండవాన్ని, కవితాత్మక వర్ణనగా, కవిత్వం రూపంగా మాత్రమె కాదు. సర్వ రూపములు ఈశ్వరుడే....అంటే పరబ్రహ్మమే. కావున తాండవం అనగా నిత్యం స్పందించే (vibration) విశ్వమే శివుడు (ఈశ్వరుడు).ఆధునిక భౌతిక శాస్త్రం చెప్పినట్లు, ఈ తాండవం నిత్యం జరుగునదేఅంటాడు fritze of Capra.

   *ఇలా విశ్వం యొక్క  సృష్టి-స్థితి-లయలను, Fritze of Capra నటరాజు నృత్యంతో పోలుస్తాడు. నటరాజు కుడి చేతిలో డమరుకం, ఎడమ చేతిలో అగ్ని ఉంది. డమరుకం, నూతన అణువుల సృష్టికి సంకేతం. అగ్ని , పాత అణువుల విలీనానికి సంకేతం. మరొక కుడి చేతిలో అభయ ముద్ర, మరొక ఎడమ చేతితో వరద ముద్ర నెపంతో, తన పాదాలను ఆశ్రయించమని సూచిస్తున్నాడు. ఆయన గ్రంథం Tao of Physics మొదటి ముద్రణ ముఖ చిత్రంగా, నటరాజు పరమ శివుణ్ణే ఎన్నుకున్నాడు.*

 *మన పురాణ వర్ణనలు, వేదోక్త భావనలు, ఉపనిషత్తుల జ్ఞాన సంపద.....పాశ్చాత్య శాస్త్రవేత్తలకు క్రొంగొత్త భావనలు అందిస్తూ ఉంటే, భారతీయులలో భావ దాస్యం గల కొంతమంది మన సాహిత్యాన్ని పుక్కిటి పురాణాలుగా చెబుతున్నారు. ఎంత హైన్యం? ఎంత దైన్యం?*

ఈ భావ దాస్యం నుండి ఎప్పుడు బయట పడదాం.ఆలోచించండి

Corona


మన శరీరం లో ప్రవేశించాక అది మన శరీరంలో ఉండే proteins, amino acids వాడుకోని తన సైన్యం పెంచుకుంటుంది•
మన శరీరం లో proteins, amino acids.. Glycin తయారీ కి ఉపయెాగ పడతాయి• 
Glycin వెన్నెముక నుంచి మెదడుకి సంకేతాలు పారడానికి ఉపయెాగ పడుతుంది•
అంటే Corona మన శరీరంలో ఉండే Glycin మెుత్తం వాడుకొని సైన్యం పెంచుకుంటుంది•
అందువల్ల corona వచ్చిన వ్యక్తికి glycin లేక brain కి సమకేతాలు వెళ్ళక రుచి, వాసన కోల్పోతాడు.
శరీరంలో పుార్తగా glycin అయిపోయిన తర్వాత oxygen కూడా తీసుకోలేక చనిపోతున్నాడు.
మనం శరీరంలోకి Glycin తయారీకి అవసరం అయిన protein, amino acids పంపక పోతే corona చనిపోతుంది కాని దానితోపాటు మనం కూడా చస్తాం•
👉కాబట్టి శరరంలో అవసరం కన్నా ఎక్కువ Glycin తయారు అవ్వడం ద్వారా మన శరీరం Corona తో  పోరాడ గలదు•
Glycin తయారీకి ఉపయెాగ పడే పదార్దాలు రోజుకి కనీసం 20gm నుంచి 50gm వరకు తీసుకోవాలి•
👉Glycin కి ఉపయెాగపడేవి•
1. తోటకూర
2. నువ్వులు
3.ఆవాలు
పైన చెప్పిన పదార్దములు రోజు తినడం ద్వారా Corona నుంచి       బయట పడగలరు•

పాలేరు కధ

ఒక ఊర్లో ఒక శాస్త్రి గారు వుండేవారు ఆయన పరమ నిష్ఠాగరిష్టుడు. వాళ్ళ తాత ముత్తాతల నుంచి వస్తున్న
శివ పంచాయతనం వుండేది. శాస్త్రి గారు రోజూ నమక
చమకములతో అభిషేకము చేసి శ్రద్దగా పూజ చేస్తూ ఉండేవారు.  

ఒకరోజు వాళ్ళ ఇంటి ఆవిడ గారెలు చేసి, వాళ్ళ పాలేరు కు నాలుగు పెట్టినది. వాడు కమ్మగా తిని, అమ్మా
ఇంక నాలుగు వడలు పెట్టు అమ్మా అన్నాడు. ఇంటి
ఆవిడ “లేవురా అయిపోయినాయి” అన్నది.
అదేంటి అమ్మగారు ఇంట్లో ఇంకా 23 గారెలు పెట్టుకొని
లేవు అంటారు అని అన్నాడు.
ఆవిడ వంటింట్లోకి వెళ్లి లెక్క పెడితే సరిగ్గా 23 గారెలు వున్నాయి. నీకెలా తెలుసురా అని అడిగినది. తెలుసులెండి అని వాడు అన్నాడు. ఈ విషయాన్ని తన భర్తకు తెలిపినది ఆ మహా ఇల్లాలు. శాస్త్రి గారు పాలేరును నిలదీసినాడు ..నీకు ఎలా
తెలుసు అని. తెలుసు లెండి
గురువు గారు అన్నాడు. వదల లేదు శాస్త్రి గారు. అదొక విద్య లెండి నాకు మా అయ్య నుంచి వచ్చినది, నాకు ఒక యక్షిణి చెవులో చెబుతుంది ఇదంతా
అన్నాడు.

ఆ రోజు రాత్రికి శాస్త్రి గారికి నిద్ర పట్టలేదు. ప్రక్క
రోజు పాలేరును అడిగాడు. ఒరేయ్ ఇన్ని రోజుల నుంచి నేను పూజ చేస్తున్నాను, నాకు ఏ విద్యరాలేదు, ఏ శక్తి రాలేదు, నీకు ఈ విద్య ఎలా వచ్చినది? ఆ మంత్రము ఏమిటో నాకు చెప్పరా అని అడిగినాడు.
విధి లేక పాలేరు ఆ మంత్రాన్ని (కర్ణ పిశాచి) మంత్రమును గురువు గారికి చెప్పినాడు. తర్వాత రోజు గురువు గారు శ్రద్దగా ఆ మంత్రాన్ని
పఠించినాడు. కర్ణ పిశాచి ఇంటి బయట నుంచి పలికినది.
శాస్త్రి గారూ అని పిలిచినది. ఏమి కావాలి అని అడిగినది.
గురువు గారు ఇంట్లో నుంచి ఎవరూ అని అడిగినాడు. నేను కర్ణ పిశాచిని (యక్షిణి) మీ ఇంట్లోకి రావాలంటే ఆ పూజా మందిరములోని దేవతా
మూర్తులను బయట పడెయ్యండి, నేను లోపలి
వస్తాను అని అన్నది.
శాస్త్రి గారి గుండె గుభేలు మన్నది. అప్పుడు అర్ధమైనది. ఒరేయ్ మా ఇంట్లో పూజా
మందిరములోని దేవతా మూర్తులు ఎంత శక్తి
వంతమైనవో, వాటి వలనే గదా ఈ పిశాచము లోనికి రాలేదు. ఇలా ఎన్ని రోజుల నుంచి నన్ను నా కుటుంబాన్ని దుష్ట శక్తుల నుంచి కాపాడు తున్నాయో గదా, ఇన్నాళ్ళు నాకు తెలియ లేదు, పెద్దలు ఇచ్చిన నిజమైన
ఆస్తి ఇదే కదా అని, నీవూ వద్దు, నీ మంత్రము వద్దు అని ఆ పిశాచాన్ని వెళ్లి పొమ్మన్నాడు. తన పూజా మందిరములోకి వెళ్లి ఆ పరమ శివుని కాళ్ళ మీద పడి
కృతజ్ఞతతో “ ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ నమః” అని చెంపలు వేసుకొన్నాడు. మంత్ర
విద్య వున్నది నమ్మకము శ్రద్ధ అవసరము దేనికైనా.
పూజా మందిరములో వున్న విగ్రహాలు పాతవైనా, అరిగి
పోయినా మీ తాత ముత్తాతలు పూజించినవి అవి. వాటిల్లో ఎంతో శక్తి దాగి వుంటుంది. వాటిల్ని పారేయకండి. భక్తితో ఒక్క పుష్పం పెట్టండి. అవి చైతన్య మౌతాయి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతాయి.

నా జీవితం లోనివి కష్టాలు కాదు, భగవంతుని వరాలు!

నేను శక్తిని అడిగాను - భగవంతుడు నాకు కష్టాన్ని ఇచ్చి శక్తిని పొందమన్నాడు.

నేను సంపదను అడిగాను - భగవంతుడు నాకు మట్టిని ఇచ్చి బంగారం చేసుకోమన్నాడు.

నేను ధైర్యాన్ని అడిగాను - భగవంతుడు నాకు ప్రమాదాలు ఇచ్చి ధైర్యం వహించమన్నాడు.

నేను వరాలు అడిగాను - భగవంతుడు నాకు అవకాశాలు ఇచ్చాడు.

నేను ఆయన ప్రేమను అడిగాను- భగవంతుడు ఆపదల్లో ఉన్నవారి చెంతకు నన్ను పంపించాడు.

నేను జ్ఞానాన్ని అడిగాను - భగవంతుడు నాకు సమస్యల్ని ఇచ్చి పరిష్కరించమన్నాడు.

నేను పురోగతి అడిగాను - భగవంతుడు నాకు అవరోధాలు కల్పించి సాధించమన్నాడు.

నేను లోకానికి మంచి చెయ్యాలని అడిగాను - భగవంతుడు ఇబ్బందులు కల్పించి అధిగమించమన్నాడు.

నేను ఆయన్ను మరువకూడదు అని అడిగాను - భగవంతుడు భాధలు ఇచ్చి ఆయన్ను గుర్తుంచుకోమన్నాడు.

నేను పాపాలు క్షమించమని అడిగాను - భగవంతుడు ధ్యాన సాధన చేసుకోమన్నాడు.

అలా జీవితం లో నేను కోరుకున్నదేదీ పొందలేదు - నాకు కావలసిందే నేను పొందాను.

ఈ విధంగా జీవితంలో జరిగే ప్రతీ సంఘటననుండి నాకు అవసరమైనది పొందటం నేను నేర్చుకున్నాను.
చివరకు ఏది జరిగినా నా మంచికే అని అర్ధం చేసుకున్నాను.

బర్బరీకుడి కథ.

హైద్రాబాదు కాచిగూడలో రైల్వే స్టేషన్కు ఎదురుగా వీరన్న గుట్టమీద అత్యంత శోభాయమానంగా వున్న శామా మందిరం తెలియని వారు ఇక్కడ వుండరు.  కానీ ఈ శ్యామా మందిరం కృష్ణుని మందిరం అని కొందరు భావ్విస్తారు నిజానికి ఈ శామా భారతంలో వున్న ఒక యోధుడు అతని చెరిత్ర ఇక్కడ చుడండి. 

మహాభారతంలో మహా మహులను అందరినీ ఒక్క నిముషంలో చంపి యుద్ధం మొత్తం ఒక్క నిముషంలో పూర్తి చేయగలిగే సామర్థ్యం ఉండి మొట్టమొదట తనను తానే బలిదానం చేసుకున్న బర్బరీకుడి  కథ:* ఎన్ని రకాల కేరక్టర్లు, ఎన్ని రకాల తత్వాలు. మహాభారతం తవ్వేకొద్దీ అనేకానేక పాత్రలు దర్శనమిస్తాయి. కొన్ని ఆలోచనల్లో పడేస్తే, కొన్ని ఆవేదనకు గురిచేస్తాయి. కొన్ని ఆశ్యర్యాన్ని కలిగిస్తే, కొన్ని దిగ్భమలో పడేస్తాయి. దాదాపు అన్ని ఉద్వేగాలకూ మహాభారతమే. మొత్తం భారతంలో అన్నింటికన్నా భిన్నమైన కేరక్టర్ ఒకటి ఉంది. తన పేరు బర్బరీకుడు. బహుశా ప్రస్తావనపూర్వకంగా ఎక్కడైనా తన పేరు విని ఉంటారేమో. కానీ తన గురించి ఇంకా తెలుసుకోవాలి. నిజానికి మహాభారతం అంటేనే శ్రీకృష్ణుడి చరిత్ర అనుకుంటాం. నిజానికి మహాభారతం నిండా కూడా శ్రీకృష్ణుడే. తను లేనిదే మహాభారతం లేదు. ఇంతకీ ఈ బర్బరీకుడు ఎవరు అంటారా. తను ఘటోత్కచుడి కొడుకు. లక్క ఇల్లు తగులబడ్డాక, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీస్తున్న ఆ వనవాసంలో హిడింబి అనే ఓ రాక్షస యువతిని పెళ్లిచేసుకుంటాడు భీముడు. వాళ్ల కొడుకే ఘటోత్కచుడు. ఈ ఘటోత్కచుడు ఓ యాదవ రాజు మురు బిడ్డ మౌర్విని (అహిలావతి) పెళ్లాడతాడు. వాళ్ల కొడుకే ఈ బర్బరీకుడు. నిజానికి తను ఓ యక్షుడు. ఓ కారణం వల్ల మనిషిగా జన్మిస్తాడు. రాజస్థాన్లో ఖటుశ్యామ్జీ పేరిట, గుజరాత్లో బలియాదేవ్ పేరిట కొలుస్తారు బర్బరీకుడిని. అక్కడి జానపదాలు ఈ పాత్రను అంతగా జనంలోకి తీసుకెళ్లాయి. తను చిన్నప్పటి నుంచే తల్లి దగ్గర యుద్ధవిద్యలు నేర్చుకుంటాడు. దేవీ ఉపాసకుడు కూడా. దేవి ప్రత్యక్షమై మూడు ప్రత్యేక బాణాల్ని వరంగా ఇస్తుంది. ఆ మూడు బాణాల్నే బర్బరీకుడు తన వెంట ఉంచుకుంటాడు. అందుకే తనను త్రిబాణధారి అంటారు. పాండవులు, కౌరవుల నడుమ యుద్ధం అనివార్యం అని తెలిశాక, భారత చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సైన్యాలు ఇరుపక్షాలకూ చేరుతున్న వేళ, బర్బరీకుడు ఆ యుద్దాన్ని చూడాలని కోరుకుంటాడు. వెళ్లే ముందు తల్లికి ఓ మాట ఇస్తాడు. ఒకవేళ నేను యుద్ధంలో దిగి పోరాడాలని అనుకుంటే నేను బలహీనుల పక్షాన నిలబడి మాత్రమే యుద్ధం చేస్తాను. ఓడిపోయేవారిని గెలిపిస్తాను అని. తర్వాత తన ధనుస్సు, నీలి గుర్రం, తన మూడు బాణాలు తీసుకుని బయల్దేరతాడు. యుద్ధం ప్రారంభం కావటానికి ముందు ప్రతి యోధుడినీ శ్రీకృష్ణుడు ఒక ప్రశ్న వేస్తాడు. నీకే బాధ్యతలు ఇస్తే యుద్దాన్ని ఎన్ని రోజులలో ముగించగలవు? ఇదీ ప్రశ్న. 20 రోజులు చాలునని భీష్ముడు అంటే, 25 రోజులు కావాలని ద్రోణుడు చెబుతాడు. 24 రోజులు సరిపోతాయని కర్ణుడు, 28 రోజులు పడుతుందని అర్జునుడు. ఇలా తలా ఓ రకంగా చెబుతారు. దూరంగా ఉండి ఇవన్నీ చూస్తున్న బర్బరీకుడిని గమనిస్తాడు శ్రీకృష్ణుడు. ఒంటరిగా తనను ఓ బ్రాహ్మణవేషంలో సమీపించి శ్రీకృష్ణుడు అందరినీ అడుగుతున్నాడు కదా, నీకూ ఆ ప్రశ్న వేస్తే ఏం చెబుతావు యోధుడా? అని అడుగుతాడు. నిజంగా నేను బరిలోకి దిగితే ఒకే నిమిషంలో యుద్ధం ముగిసిపోతుంది అంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు ఒక్కక్షణం దిగ్భాంతికి గురై, అదెలా సాధ్యం అనడుగుతాడు. తన దగ్గర ఉన్న 3 బాణాలను చూపిస్తాడు బర్బరీకుడు. వాటి శక్తి వివరిస్తాడు. నేను మొదటి బాణాన్ని వేస్తే ఎవరెవరిని హతం చేయాలో, వేటిని ధ్వంసం చేయాలో వాటిని, వాళ్లందరినీ గుర్తించి పెడుతుంది. (టార్గెట్స్ ను ఐడెంటిఫై చేస్తుంది. రెండో బాణాన్ని వేస్తే ఎవరెవరిని రక్షించాలో మార్క్ చేసి పెడుతుంది. మూడో బాణం వేస్తే రక్షించాల్సిన వాళ్లను విడిచిపెట్టి, మొదటి బాణం మార్క్ చేసిన ప్రతిదాన్నీ ధ్వంసం చేస్తుంది. ఆ బాణాలు మళ్లీ నా దగ్గరకు వచ్చేస్తాయి అంటాడు బర్బరీకుడు. నేను నమ్మను, నేనే కాదు, ఈ సృష్టిలో ఎవరూ దీన్ని నమ్మరు, నమ్మలేరు అంటాడు శ్రీకృష్ణుడు. బర్బరీకుడిలో క్రమేపీ ఉక్రోషం పెరుగుతుంది. ఏదీ, ఆ రావిచెట్టుకున్న ఆకులన్నీ ఒకేసారి రాల్చేయగలవా అంటాడు శ్రీకృష్ణుడు. చాలా సులభం అంటాడు బర్బరీకుడు. చేసి చూపించు అంటాడు శ్రీకృష్ణుడు. బాణం వదిలేముందు దేవీ ధ్యానం కోసం ఒక్క క్షణం కళ్లు మూసుకుంటాడు బర్బరీకుడు. ఈలోపు శ్రీకృష్ణుడు ఒక ఆకును తన పాదం కింద దాచిపెడతాడు. ఆ బాణం ఆ చెట్టుకున్న ప్రతి ఆకును మార్క్ చేస్తుంది. చివరకు శ్రీకృష్ణుడి పాదం దగ్గరకు వెళ్తుంది. ఇదేమిటి అనడుగుతాడు అమాయకంగా శ్రీకృష్ణుడు. నీ పాదం కింద ఆకు ఉండి ఉంటుంది. అందుకే అదక్కడకు వచ్చింది. నీ పాదం తీసివేయి. లేకపోతే నీ పాదాన్ని చీల్చుకుని వెళ్లి మరీ ఆ ఆకును గుర్తిస్తుంది అది అంటాడు బర్బరీకుడు. తప్పనిసరై పాదం తీసేస్తాడు. మరో బాణం వెళ్లి చెట్టుపై ఉన్న పక్షుల్ని, ఇతర జీవులన్నింటినీ గుర్తిస్తుంది. (రక్షింపబడాల్సినవి). తరువాత బాణం ఆ ఆకులన్నింటినీ రాల్చేసి, ఒక్క దగ్గర మోపు కట్టేస్తుంది. ఆశ్చర్యంగా చూస్తాడు శ్రీకృష్ణుడు. ఈ బాణాల శక్తి నుంచి ఎవరినీ దాచలేమనీ, కాపాడలేమనీ అర్థమవుతుంది. అయితే ఆ యోధుడి వైఖరిలోనే ఓ తప్పుందని, గందరగోళం ఉందనీ గమనిస్తాడు. బర్బరీకుడు ఏ కారణం చేతనైనా సరే కౌరవపక్షాన చేరితే పాండవుల్ని తాను కాపాడలేననీ గుర్తించి కలవరపడతాడు. ఒకవేళ భీముడి మనమడు కాబట్టి పాండవుల పక్షాన చేరితే ఏం జరుగుతుంది? అందుకే దివ్యదృష్టిని సారించి కొన్ని నిజాలు తెలుసుకుని ఇలా ఓ లాజికల్ సంభాషణ ఆరంభిస్తాడు. ఏమోయీ, నువ్వు ఎవరు? నువ్వు కూడా యుద్ధం చేస్తావా? అని అడుగుతాడు. నేను ఘటోత్కచుడి కుమారుడిని. యుద్ధం చూడాలని వచ్చాను. యుద్ధం చేయాలనుకుంటే మాత్రం ఓడిపోయే బలహీనుల పక్షాన నిలబడతానని నా తల్లికి మాటిచ్చాను. పాండవుల పక్షాన కేవలం ఏడు అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉంది. కౌరవుల పక్షాన పదకొండు అక్షౌహిణులు. అంటే పాండవులే బలహీనులు కదా. అవును, అయితే నేను పాండవ పక్షాన నిలబడాల్సి ఉంటుంది. అదే జరిగితే వారితో జతకూడే నీ బాణాల శక్తి కారణంగా పాండవులు బలోపేతమవుతారు. కౌరవులు బలహీనులు అవుతారు కదా. అవునవును. తిరిగి నేను కౌరవుల పక్షాన చేరాల్సి ఉంటుంది. కానీ దాని వల్ల కౌరవులు బలోపేతులై తిరిగి పాండవులు బలహీనులు అవుతారు కదా. మరేం చేయుట? ఇక్కడే తను తీసుకున్న వైఖరిలో లోపమేమిటో బర్బరీకుడికి అర్థమవుతుంది. తన కారణంగానే మారిపోయే బలాబలాలను బట్టి తను ఎటూ స్థిరంగా నిలబడలేనని అటూఇటూ మారితే చివరకు ఇరుపక్షాలూ సమూలంగా హతమారిపోయి ఆఖరికి మరణించకుండా మిగిలేది తనొక్కడే అనీ. విజేత అంటూ ఎవరూ ఉండరు అని బోధపడుతుంది. శ్రీకృష్ణుడి వైపు చూస్తూ ఎవరు మహాశయా మీరు అని ప్రశ్నిస్తాడు అనుమానంగా. ముందు నాకు ఓ వాగ్దానం చేయి, నీకే తెలియని నీ జన్మ వృత్తాంతం కూడా చెబుతాను అంటాడు శ్రీకృష్ణుడు. అలాగే అని చేతిలో చేయి వేసి చెబుతాడు బర్బరీకుడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపిస్తాడు. తనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు అంటాడు. సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అడిగితే నేనేమి కాదనగలను అంటాడు బర్బరీకుడు. యుద్ధాన్ని చూడాలనేది నీ కోరిక కదా. ఇంత భారీ జనహనన యుద్దాన్ని ఓ అత్యంత సాహస వీరుడి బలితో ప్రారంభించాలనేది సంప్రదాయం. నిన్ను మించిన యోధుడు లేడిక్కడ. నిన్నెవరూ హతమార్చలేరు. అందుకే నువ్వే నీ తలను తీసి నాకివ్వు అంటాడు శ్రీకృష్ణుడు. నన్నే ఎందుకు బలి ఇవ్వాలి? ఇంతమంది యోధులు ఉండగా. పైగా వాళ్లంతా ప్రాణాలకు తెగించి వచ్చినవాళ్లు కదా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు. బర్బరీకా నువ్వు గత జన్మలో ఓ యక్షుడివి భూమి మీద అధర్మం పెరిగిపోయింది నువ్వే కాపాడాలి శ్రీమహావిష్ణు అంటూ బ్రహ్మదేవుడిని వెంటేసుకుని ఓసారి దేవుళ్లంతా నా దగ్గరకు వచ్చారు. దుష్టశక్తుల్ని సంహరించటానికి త్వరలో మనిషిగా జన్మిస్తాను అని వాళ్లకు చెప్పాను. ఇదంతా వింటున్న నువ్వు ఈ మాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి? నేనొక్కడిని చాలనా అని ఒకింత పొగరుగా మాట్లాడావు. దానికి నోచ్చుకున్న బ్రహ్మ నీకు ఓ శాపం విధించాడు. ధర్మానికీ, అధర్మానికీ నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది నువ్వే అని శపించాడు. అందుకే నీ బలి. అంతేకాదు నీ శాపవిమోచనం కూడా అని వివరిస్తాడు శ్రీకృష్ణుడు. కానీ నాకు యుద్దాన్ని చూడాలని ఉంది అంటాడు బర్బరీకుడు. ముందు నీ తలను ఇవ్వు అంటాడు శ్రీకృష్ణుడు. అప్పుడు సంతోషంగా తన తలను తనే నరుక్కుంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు ఆ తలను ఓ గుట్టపైకి తీసుకెళ్లి, మొత్తం యుద్ధం కనిపించే ప్రదేశంలో పెడతాడు. యుద్ధం ముగిసింది. విజయ గర్వంతో ఉన్న పాండవులు ఈ విజయానికి నేనంటే నేనే కారణమంటూ వాదించుకుంటూ ఉంటారు. వారిని బర్బరీకుడి తల దగ్గరకు తీసుకెళ్తాడు శ్రీకృష్ణుడు. తన కథ చెబుతాడు. భీముడు విలపిస్తాడు. తరువాత శ్రీకృష్ణుడు బర్బరీకుడికి ఓ ప్రశ్న వేస్తాడు. వత్సా! ఈ మొత్తం యుద్దంలో ఏ క్షణమేం జరిగిందో చూసింది నువ్వు ఒక్కడివే, నువ్వు చెప్పు ఏం గమనించావో? స్వామీ! ఒక చక్రం యుద్ధక్షేత్రమంతటా తిరుగుతూ అధర్మం పక్షాన ఎవరుంటే వాళ్లను హతమార్చడాన్ని చూశాను. మహాకాళి వేల నాలుకలతో పాపులను బలితీసుకోవటాన్ని చూశాను. ఆ మహాశక్తి నువ్వు మాత్రమే. యుద్ద కారకులు, యుద్ధకర్తలు, మిగతావాళ్లంతా కేవలం పాత్రధారులు మాత్రమే అని సమాధానమిచ్చి తన శాపం ముగిసిపోయి తిరిగి యక్ష రూపాన్ని పొంది ఊర్ధ్వలోకాలకు వెళ్లిపోతాడు. ఇదీ మహాభారతంలోని బర్బరీకుడి కథ