19, ఏప్రిల్ 2025, శనివారం

నన్నయ కవిత్వంలోని నాటకీయత

 🙏🙏🙏నన్నయ కవిత్వంలోని నాటకీయత 

          శిశుపాల వధ ఘట్టం

నాటకీయత అనగానే తిక్కన గుర్తుకు వస్తాడు నిజమే! రావాలి.! ఆయన 15 పర్వాల భారతము నాటకీయత లక్షణంతో వ్రాశాడు. నన్నయ ప్రసన్న కథా కలితార్ధ యుక్తితో భారతం వ్రాసినా సందర్భం బట్టి అక్కడక్కడ అయన కవిత్వంలో కూడా నాటకీయతా లక్షణం ఉంది అని చెప్పడమే ఈ వ్యాస ఉద్దేశ్యం

తిక్కన కవిత్వంలో కూడా ప్రసన్న కథా కలితార్ధ యుక్తి లక్షణం సందర్బం బట్టి ఉపయోగించాడు అది వేరే వ్యాసంలో వ్రాస్తాను.

శిశుపాల వధా ఘట్టంలో చక్కటి సంభాషణ, వీర రస విన్యాసం, మనోనేత్రలకు ప్రత్యక్షమయ్యే పాత్రలు, అద్భుతమైన సన్నివేశాలు గొచరిస్తాయి. సందర్భానుసారముగా కొన్ని పద్యాలు ఉదాహరణ ఇస్తూ కథను చూద్దాము.ధర్మరాజు రాజసూయాగము చేస్తున్న సన్నివేశము.(ఇది సన్నివేశ ప్రకటన )మొత్తం కథ అంతా నాటకంలా సాగుతుంది గమనించగలరు.

ద్వారాకనగరం నుండి శ్రీకృష్ణుడు కానుకలు తీసుకుని ఇంద్రప్రస్థ పురానికి వచ్చాడు. ధర్మరాజు ఆయనకు యధావిధిగా అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పూజించాడు. తనను రాజసూయ యాగ కార్యక్రమంలో నియమించి అనుగ్రహించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు ధర్మరాజు. ఐశ్వర్యంలో దేవేంద్రుడి లాంటి వాడైన ధర్మరాజుకు సామ్రాజ్య బలం, దైవ బలం, మానవ బలం గొప్పగా అమరి వున్నాయని, అందువల్ల ఆయన యజ్ఞం చేయతగ్గవాడని శ్రీకృష్ణుడు అన్నాడు. తనతో సహా ఏఏ పనుల్లో ఎవరెవరు అవసరమౌతారో వారిని నియమించమని సూచించాడు. తమ్ముళ్ల అనుమతి కూడా తీసుకుని, ద్వైపాయనాదుల సమ్మతిని కూడా పొంది, ధర్మరాజు రాజసూయ యాగం చేయడానికి పూనుకున్నాడు. తమ్ములకు అవసరమైన బాధ్యతలు అప్పగించాడు.


అన్న ఆదేశానుసారం సహదేవుడి పిలుపు మేరకు భూమండలంలో వున్న రాజులు, బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు వచ్చి విడిది చేశారు. హస్తినాపురానికి ప్రత్యేకంగా వెళ్లిన నకులుడి వెంట భీష్మ విదురాదులతో సహా దుర్యోధనాదులు అపార ధనరాసులతో వచ్చారు. వారందరినీ తగురీతి సన్మానించాడు ధర్మరాజు. తన బందుజనులలో దక్షిణలు, దానాలు ఇచ్చే విషయంలో కృపాచార్యుడిని, కార్యాకార్యాలను గురించి ఆలోచించడంలో భీష్మద్రోణులను, పదార్ధాల వినియోగంలో విదురుడిని, కానుకలు గ్రహించడానికి దుర్యోధనుడిని, ఆహార పదార్ధాల విషయంలో దుశ్శాసనుడిని నియమించాడు ధర్మరాజు. మిగిలిన సంబంధిత పనులకు కూడా తగువారిని నియమించి, ధర్మరాజు యజ్ఞదీక్ష వహించి, మహావైభవంగా యజ్ఞశాలలో ప్రవేశించాడు.


మూర్తీభవించిన అనంత వేదాల లాంటి వారైన మహామునులు పైలధౌమ్యులు, యాజ్ఞవల్క్యుడు, వేదవ్యాసుడు, సుసాముడు ప్రధాన ఋత్విక్కులుగా, మైత్రావరుణుడు, అచ్చావాకుడు సహాయ ఋత్విక్కులుగా, నారదాది బ్రహ్మర్షులు సదస్యులుగా, భీష్మాది రాజర్షులు సహాయులుగా, శ్రీకృష్ణుడి రక్షణలో రాజసూయం మనోహరంగా కొనసాగింది. అప్పుడు, భీష్ముడు రాజసూయ యాగాన్ని చూసి సంతృప్తి చెంది, ధర్మరాజుతో, స్నాతకుడు, ఋత్విజుడు, సద్గురుడు, ఇష్టుడు, భూపాలుడు, జ్ఞానసంపన్నుడు పూజించతగినవారని, ఇలాంటివారిలో అధికుడిని ప్రేమతో పూజించమని సలహా ఇచ్చాడు. అలాంటివారెవరో భీష్ముడినే చెప్పమని కోరాడు ధర్మరాజు. సమాధానంగా భీష్ముడు, యజ్ఞపురుషుడు, సర్వలోక పూజ్యుడు, అచ్యుతుడు అయిన శ్రీకృష్ణుడిని పూజించమని చెప్పాడు. భీష్ముడి మాట ప్రకారం ధర్మరాజు సహదేవుడు తెచ్చిన అర్ఘ్యాన్ని పూజార్హుడైన శ్రీకృష్ణుడికి శాస్త్రోక్తంగా సమర్పించాడు(.పద్యాలు ఇంక ఇక్కడ వ్రాయలేదు ఇక్కడ నుండి సందర్భం బట్టి పద్యాలు వ్రాస్తాను )

(ఇది మంచి సంభాషణతో కూడిన సన్నివేశము )

ఇది చూసి సహించలేక శిశుపాలుడు శ్రీకృష్ణుడిని నిందిస్తూ ధర్మరాజుతో ఇలా అన్నాడు:


         మ: అవనీనాథు లనేకు లుండఁగ విశిష్టారాధ్యు లార్యుల్‌ మహీదివిజుల్‌ పూజ్యులు పల్వు రుండఁగ ధరిత్రీనాథ! గాంగేయు దుర్వ్యవసాయంబునఁ గృష్ణుఁ గష్టచరితున్‌ వార్‌ష్ణేయుఁ బూజించి నయవివేకం బెఱిఁగించి తిందఱకు; దాశార్హుండు పూజార్హుఁడే?   

ఎంకకున్న పద్యం మత్తేభం. మదపుటేనుగు వంటి నడక.

         (ఈ సభలో ఎందరో మహారాజులు వుండగా, విశేషంగా పూజించతగిన పెద్దలు, బ్రాహ్మణులు పెక్కుమంది వుండగా, భీష్ముడు చెప్పిన చెడు నిర్ణయాన్ని అనుసరించి, చెడు ప్రవర్తన కలవాడైన శ్రీకృష్ణుడిని పూజించి నీ తెలివితక్కువ తనాన్ని ఇంతమందికి తెలియచేశావు. దాశార్హుడు పూజార్హుడా?)

అంతటితో ఆగకుండా శ్రీకృష్ణుడిని పరిపరి విధాల నిందించడం కొనసాగించాడు. రాజసూయ యాగానికి వచ్చిన రాజులందరిని అవమానించాడని ధర్మరాజును దూషించాడు. ఒకవేళ ధర్మరాజు అజ్ఞానంతో ఇచ్చినప్పటికీ సిగ్గులేకుండా శ్రీకృష్ణుడు అర్ఘ్యాన్ని ఎలా తీసుకున్నాడని ఎద్దేవా చేశాడు. శ్రీకృష్ణుడిని పూజించడం అంటే నపుంసకుడికి పెళ్లి చేయడం లాంటిదన్నాడు. చివరకు సభనుండి లేచి వెళ్లిపోయాడు. ధర్మరాజు శిశుపాలుడి వెంట వెళ్లి అతడిని ఇంపైన మాటలతో బుజ్జగించి, పితామహుడైన భీష్ముడు అన్నీ ఆలోచించే శ్రీకృష్ణుడిని పూజార్హుడని చెప్పాడని, అది ఉచితం కాకుండా దోషం ఎలా అవుతుందని అన్నాడు. శిశుపాలుడికి నచ్చ చెప్తున్న ధర్మరాజుతో భీష్ముడు, అతడిని ఒప్పించే ప్రయత్నం చేయనవసరం లేదన్నాడు. అతడికి ధర్మతత్త్వం తెలుసుకోవడం సాధ్యం కాదన్నాడు. శిశుపాలుడిని తీవ్రంగా మందలించాడు. జగత్తుకు ఆధారమైన శ్రీకృష్ణుడు ముల్లోకాలలో నివసించే అందరికీ పూజార్హుడే అన్నాడు. అప్పుడు సహదేవుడిలా అన్నాడు:


         చ: ఎడపక యర్ఘ్య మచ్యుతున కిచ్చితి; మిచ్చిన దీని కిం దొడం

బడ మని దుర్జనత్వమునఁ బల్కెడువీరుల మస్తకంబుపై

నిడియెద నంచుఁ దాఁ జరణమెత్తె సభన్‌ సహదేవుఁ డట్టిచో

నుడిగి సభాసదుల్‌ వలుకకుండిరి తద్దయు భీతచిత్తులై  


(శ్రీకృష్ణుడికి ఇచ్చిన అర్ఘ్యానికి తిరుగులేదని, దుర్బుద్ధితో దీన్ని కాదనే వీరుల తలమీద తన పాదం పెట్టి అణగతొక్కుతానని సహదేవుడు పాదాన్ని పైకెత్తగానే సభాసదులంతా భయభ్రాంతులై మాట్లాడకుండా వుండిపోయారు). అప్పుడు:

చ. చెలువుగఁ బుష్పవృష్టి గురిసెన్‌ సహదేవుపయిన్‌; దివంబునన్‌

వెలయఁగ సాధువాదములు వించె; సభాసదులెల్ల విస్మయా

కులిత మనస్కులైరి; తన కుంచెయుఁ గృష్ణమృగాజినంబునుం

బలుమఱు వీచుచుం గలహబంధుఁడు నారదుఁ డాడె వేడుకన్‌

 (సహదేవుడి మీద అందంగా పూలవాన కురిసింది)

శిశుపాలుడు సభలోకి వచ్చి మళ్లీ శ్రీకృష్ణుడిని, భీష్ముడిని తూలనాడాడు. ఇది విని కోపంతెచ్చుకున్న భీముడు శిశుపాలుడి మీదికి పోతుంటే భీష్ముడు ఆపి శిశుపాలుడి జన్మ వృత్తాంతం చెప్పాడు. శ్రీకృష్ణుడి వల్లే తన కొడుకుకు మరణం అని తెలుసుకున్న అతడి తల్లి శిశుపాలుడు చేసే వంద తప్పులను క్షమించమని కృష్ణుడిని వేడుకున్న సంగతి చెప్పాడు. అతడి చావు శ్రీకృష్ణుడి చేతిలో ఉన్నదన్నాడు. ఇంతలో శిశుపాలుడు మరించ రెచ్చిపోయి భీష్ముడిని, శ్రీకృష్ణుడిని తనతో యుద్ధానికి సిద్ధం కమ్మని అంటాడు. శిశుపాలుడు ఒకదానివెంట ఒకటిగా శ్రీకృష్ణుడిని నిందిస్తుంటే, కోపం తెచ్చుకున్న శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో అతడి శిరస్సు ఖండించాడు. శిశుపాలుడి శరీరం శ్రీకృష్ణపరమాత్మ శరీరంలో చేరిపోయింది.


 ఆ విధంగా రాజసూయ యాగం నిరాటంకంగా, సుఖంగా ప్రారంభమై, శ్రీకృష్ణుడి సంరక్షణలో సమాప్తం అయింది. వివిధ దేశాల నుండి వచ్చిన రాజులు, భీష్మద్రోణాదులు, ద్రుపదు, కర్ణుడు, శల్యుడు, ఇతరులు వారివారి దేశాలకు ధర్మరాజు దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయారు. ఆ తరువాత శ్రీకృష్ణుడు కూడా పాండవుల వీడ్కోలు మధ్య ద్వారకానగరానికి వెళ్లాడు.


ఈ కథ, సన్నివేశాలు, సంభాషణ, వీర రస ప్రాధాన్యం, చూచిన మనకు ఒక నాటకం మన మనోనేత్రానికి గొచరిస్తుంది

                          స్వస్తి 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

26+ డిగ్రీల వద్ద AC ఉంచండి

 26+ డిగ్రీల వద్ద AC  ఉంచండి.


విద్యుత్ బోర్డు నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంపిన చాలా ఉపయోగకరమైన సమాచారం.


AC యొక్క సరైన ఉపయోగం:


వేడి వేసవి ప్రారంభమైనందున మరియు మేము ఎయిర్ కండిషనర్లను క్రమం తప్పకుండా ఉపయోగిస్తాము, సరైన పద్ధతిని అనుసరిద్దాం.


చాలా మందికి 20-22 డిగ్రీల వద్ద తమ ఎసిలను నడిపే అలవాటు ఉంది మరియు వారు చల్లగా ఉన్నప్పుడు, వారు తమ శరీరాలను దుప్పట్లతో కప్పుతారు. ఇది రెట్టింపు నష్టానికి దారితీస్తుంది.


ఎలా ???....


మన శరీర ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ అని మీకు తెలుసా?

శరీరం 23 డిగ్రీల నుండి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను సులభంగా తట్టుకోగలదు. దీనిని మానవ శరీర ఉష్ణోగ్రత సహనం అంటారు.


గది ఉష్ణోగ్రత తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నప్పుడు, తుమ్ము, వణుకు మొదలైన వాటి ద్వారా శరీరం స్పందిస్తుంది.


మీరు ఎసిని 19-20-21 డిగ్రీల వద్ద నడుపుతున్నప్పుడు, గది ఉష్ణోగ్రత సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే చాలా తక్కువగా ఉంటుంది మరియు ఇది శరీరంలో అల్పోష్ణస్థితి అని పిలువబడే ప్రక్రియను ప్రారంభిస్తుంది, ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది, తద్వారా శరీరంలోని కొన్ని భాగాలలో రక్త సరఫరా ఉండదు తగినంత. ఆర్థరైటిస్ మొదలైన వాటిలో దీర్ఘకాలిక ప్రతికూలతలు చాలా ఉన్నాయి,


ఎసి ఆన్‌లో ఉన్నప్పుడు ఎక్కువ సమయం చెమట ఉండదు, కాబట్టి శరీరంలోని టాక్సిన్స్ బయటకు రావు మరియు దీర్ఘకాలికంగా చర్మ అలెర్జీ లేదా దురద, అధిక రక్తపోటు మొదలైన అనేక వ్యాధుల ప్రమాదం ఏర్పడుతుంది.


మీరు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఎసిని నడుపుతున్నప్పుడు, ఇది కంప్రెసర్ నిరంతరం పూర్తి శక్తితో పనిచేస్తుంది, అది * ఫైవ్ స్టార్స్ * అయినా, అధిక శక్తిని వినియోగిస్తుంది మరియు ఇది మీ జేబు నుండి డబ్బును వీస్తుంది.


ఎసిని నడపడానికి ఉత్తమ మార్గం ఏమిటి ??


26 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ


26+వద్ద ఎసిని ఉంచడం ఎల్లప్పుడూ మంచిది. 28+ డిగ్రీలు ఉత్తమం.


దీనికి తక్కువ విద్యుత్ ఖర్చు అవుతుంది మరియు మీ శరీర ఉష్ణోగ్రత కూడా పరిధిలో ఉంటుంది మరియు మీ ఆరోగ్యంపై ఎటువంటి చెడు ప్రభావం ఉండదు.


దీని యొక్క మరొక ప్రయోజనం ఏమిటంటే, ఎసి తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది, మెదడుపై రక్తపోటు కూడా తగ్గుతుంది మరియు పొదుపు చివరికి గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలను తగ్గించటానికి సహాయపడుతుంది.


ఎలా ??...


26+ డిగ్రీ మరియు ఇతర 10 లక్షల ఇళ్ళలో ఎసిని నడపడం ద్వారా మీరు రాత్రికి 5 యూనిట్లు ఆదా చేస్తారని అనుకుందాం, అప్పుడు మేము రోజుకు 5 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఆదా చేస్తాము.


ప్రాంతీయ స్థాయిలో ఈ పొదుపు రోజుకు కోట్ల యూనిట్లు.

దయచేసి పైన పేర్కొన్న వాటిని పరిశీలించండి మరియు మీ ఏసీ ని 26 డిగ్రీల క్రింద అమలు చేయవద్దు. మీ శరీరం మరియు పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచండి..

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: నాల్గవ అధ్యాయం

జ్ఞానయోగం: శ్రీ భగవానువాచ


నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః 

శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ (21)


యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః 

సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వా௨పి న నిబధ్యతే (22)


వాంఛలు వదలిపెట్టి చిత్తమూ, మనస్సూ వశపరచుకుని, ఈ వస్తువు నాది అనేది లేకుండా కేవలం శరీరపోషణ కోసం కర్మలు ఆచరించేవాడు పాపం పొందడు. అప్రయత్నంగా లభించిన వస్తువులతో సంతృప్తి చెందుతూ, ఇతరులమీద ఈర్ష్యపడకుండా, సుఖదుఃఖాలకు లొంగకుండా జయాపజయాలపట్ల సమదృష్టి కలిగినవాడు కర్మలు చేసినా బంధాలలో చిక్కుకోడు.

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎

                  

 *శ్లో 𝕝𝕝 దుర్లభం త్రయమే వైతత్*

 

*దేవానుగ్రహ హేతుకమ్ |*

          *మనుష్యత్వం ముముక్షుత్వం* 


*మహాపురుష సంశ్రయః ॥*


తా 𝕝𝕝 *మానవజన్మ, మోక్ష చింతన, మహా పురుషుని సాంగత్యం అనే ఈ మూడు లభించడం ఎంతో కష్టం. కేవలం దైవానుగ్రహం వలననే ఇవి లభిస్తాయి.*

 

 ✍️💐🌹🪷🙏

శ్రీ భోజేశ్వర దేవాలయం

 🕉 మన గుడి : నెం 1082


⚜ మధ్యప్రదేశ్ : భోజ్‌పూర్


⚜ శ్రీ భోజేశ్వర దేవాలయం



💠 మానవులు ఎల్లప్పుడూ రహస్యాలు తెలుసు కోవటానికి ఆసక్తి కలిగి ఉంటారు, ఏదైనా అసంపూర్తిగా ఉన్న కథను లేదా అసంపూర్ణ నిర్మాణాన్ని చూడాలని ఆతృతగా ఉంటారు,అది చాలా సార్లు ఆకర్షణగా మారుతుంది. 


💠 అటువంటి మర్మమైన మరియు అద్భుతమైన నిర్మాణం మధ్యప్రదేశ్ రాజధాని #భోపాల్ నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోజ్పూర్ (రైసన్ జిల్లా) లో ఉంది.


💠 భోజ్‌పూర్ కొండపై అద్భుతమైన భారీ, కానీ అసంపూర్ణమైన శివాలయం ఉంది.  

దీనిని భోజ్‌పూర్ శివాలయం లేదా భోజేశ్వర్ ఆలయం అని పిలుస్తారు. 


💠 ఇక్కడివారి నమ్మకం ప్రకారం ఈ ఆలయాన్ని పాండవులు తమ తల్లి కుంతీదేవి పూజ చేసుకోవటంకోసం నిర్మించారంటారు.  

అక్కడివారి కధనం ప్రకారం కుంతీదేవి శివ భక్తురాలు.  

నిత్యం శివాభిషేకాలు, పూజలు చేస్తూ వుండేది.  

అప్పట్లో మనుషులు చాలా ఎత్తుగా వుండేవారుట.  

కుంతీ దేవి ఎత్తు 25 అడుగులని కూడా చెప్తారు.  

ఆవిడ గర్భగుడిలో నేలమీద నుంచుని ఆ విగ్రహానికి అభిషేకం చేసేదిట.  

ఇంత భారీలింగానికి భీముడు  మోకాళ్లపై కూర్చొని పుష్పాలు సమర్పించేవాడంట!!!

నమ్మేవాళ్ళు నమ్మవచ్చు.



💠 1000లో ఈ ప్రాంతాన్ని పాలించిన పరమార వంశీయుడైన భోజ రాజు పేరు మీద ఈ ఊరుకి భోజపూర్ అని పేరొచ్చింది. 


💠 ఈ ఆలయం ప్రఖ్యాతి చెందటానికి కారణం ఇందులో భారత దేశంలో అతి పెద్ద లింగం వున్నది.  

18 అడుగుల ఎత్తు, 7.5 అడుగుల చుట్టుకొలత వున్న ఈ లింగం ఒకే రాతిలో చెక్కబడింది.  

ఈ నిర్మాణం ఆర్కియాలాజికల్ సర్వే అఫ్ ఇండియా సంరక్షణలో వున్నది.  


💠 ఎత్తయిన పీఠం మీద, ఇంకా ఎత్తయిన ఆలయం దూరంనుంచే కనిపిస్తుంది. అయితే అప్పటికీ, ఇప్పటికీ ఈ ఆలయ నిర్మాణం మాత్రం పూర్తికాలేదు. అయివుంటే తప్పకుండా ఇది ఒక అద్భుత ఆలయంగా పేరు పొందేది.


 💠 పూర్తికాని దేవాలయమే ఇంత అద్భుతంగా, ఇన్ని వందల ఏళ్ళ తర్వాత కూడా ఇంతమంది సందర్శకులను ఆకర్షిస్తున్నదంటే ఆ ఆలయ నిర్మాణం పూర్తయితే ఎలా వుండేదో!! కానీ దురదృష్టం.  


💠 కళ్యాణి, గుజరాత్ చాళుక్యులు, కాలాచూరి వంశస్ధులైన లక్ష్మి-కర్ణలతో కలిసి భోజరాజు రాజ్యంపై దండెత్తారు. తన రాజ్యాన్ని రక్షించుకోవటానికి చేసిన ఆ భీకర పోరులో భోజరాజు చనిపోయాడు.


💠 గుట్ట మీద పునాది వేసి నిర్మించటం కాక దానిమీద మరొక ఐదు మీటర్ల ఎత్తు వేదిక నిర్మించి దాని పైన గుడి నిర్మించటం ఎంతో విశేషంగా కనపడుతుంది. 

దాదాపు 35 × 25 మీటర్ల పొడవూ, వెడల్పూ కలిగినదీ వేదిక. 


🔆 ఆలయ నిర్మాణం: 

ఈ ఆలయం 106 అడుగుల పొడుగు, 77 అడుగుల వెడల్పు, 17 అడుగుల ఎత్తు వున్న ఎత్తయిన పీఠం మీద నిర్మింపబడటంతో దూరంనుంచే సందర్శకులను ఆకర్షిస్తుంది.  


💠 ఆలయం చేరుకోవాలంటే ఈ ప్లాట్ ఫాం కి వున్న 16 మెట్లు ఎక్కాలి. గర్భగుడి దగ్గర కూడా కొన్ని మెట్లు ఎక్కాలి. గర్భ గుడి గుంటలో వున్నట్లు వుంటుంది. అక్కడ దిగే మెట్లూ ఎత్తుగానే వుంటాయి.  

దిగలేనివాళ్ళు ఆ మెట్లమీదనుంచే శివ దర్శనం చేసుకోవచ్చు.


 💠 ఆలయం ముఖద్వారానికి ఇరు పక్కల గంగ, యమునల విగ్రహాలున్నాయి.  

లోపల స్ధంబాల మీద ఉమా మహేశ్వరులు, లక్ష్మీ నారాయణులు, బ్రహ్మ సావిత్రిలు (సరస్వతి), సీతారాముల విగ్రహాలు అందంగా మలచబడ్డాయి. 


💠 ఈ ఆలయం యొక్క అతి పెద్ద లక్షణం ఇక్కడ భారీ శివలింగమే, ఈ శివలింగం యొక్క ప్రత్యేకమైన భారీ పరిమాణం కారణంగా, భోజేశ్వర్ ఆలయాన్ని ఉత్తర భారతదేశంలోని సోమనాథ్ అని కూడా పిలుస్తారు.


💠 మృదువైన ఎర్ర ఇసుకరాయితో తయారు చేయబడిన ఈ శివలింగం ఒకే రాయి నుండి తయారైంది మరియు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పురాతన శివలింగంగా పరిగణించబడుతుంది.


💠 పాలరాతితో చేసిన ఈ లింగం 20 పొడవూ, 18 చుట్టుకొలతతో భారీగా ఉంటుంది. 

ఇక్కడ నిత్యపూజా పునస్కారాలు కొంచెం తక్కువే.

యాత్రీకులు ఆలయం బయట ఉన్న శివపంచాయతనానికి పూజలు చేసుకుని మరలిపోతుంటారు.


💠 పై నుంచి అభిషేకం చేయటానికి ఉపయోగించే వారేమో, దాదాపు 2006 వ సంవత్సరం, దాకా ఇది ఇలాగే, శివుడు అనాచ్చాదితంగానే ఉండేది. అయితే ఈ మధ్యనే ఇది కప్పువేయబడిందని తెలిసింది. 

ఇన్ని కలిగి ఉన్న ఈ ఆలయం అసంపూర్తిగానే మిగిలిపోయినట్లు గోచరిస్తుంది. 

దగ్గరలో ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంది బెత్వానది, ప్రస్తుత ప్రభుత్వం శ్రద్ధతో దీన్ని అభివృద్ధి చేస్తోంది. 

అయితే ఇక్కడ ఇతర సౌకర్యాలు కల్పిస్తే తప్ప భక్తులు వెళ్లిరాలేరు.


💠 అసంపూర్తిగా ఉన్న ఈ దేవాలయం పూర్తయితే శివుని అతిపెద్ద దేవాలయాలలో ఒకటిగా ఉండేది.


🔆 ఉత్సవాలు:


💠 శివరాత్రికి ఇక్కడ పెద్ద తిరుణాల జరుగుతుంది.

భోజన సదుపాయం, వసతి సదుపాయం లేదు. భోపాల్ దగ్గరే. అక్కడ అన్ని సదుపాయాలూ వుంటాయి.


💠 దర్శన సమయాలు

ఉదయం నుంచి సాయంకాలందాకా.

ప్రవేశ రుసుము ఒక్కొక్కరికి 10 రూ.



💠 మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నగరానికి 28 కి.మీ. దూరం

 

Rachana

©️ Santosh Kumar

గీతా మకరందము

 16-13,14,15,16-గీతా మకరందము

   దైవాసురసంపద్విభాగయోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


ఇదమద్య మయా లబ్ధం

ఇమం ప్రాప్స్యే మనోరథమ్ | 

ఇదమస్తీదమపి వేు 

భవిష్యతి పునర్ధనమ్ || 


అసౌ మయా హతశ్శత్రుః

హనిష్యే చాపరానపి | 

ఈశ్వరోఽహమహం భోగీ 

సిద్ధోఽహం బలవాన్సుఖీ || 


ఆఢ్యోఽభిజనవానస్మి 

కోఽన్యోఽస్తి సదృశో మయా | 

యక్ష్యే దాస్యామి వెూదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః || 


అనేకచిత్తవిభ్రాన్తా మోహజాలసమావృతాః | 

ప్రసక్తాః కామభోగేషు 

పతన్తి నరకేఽశుచౌ || 


తాత్పర్యము:- (అసురసంపదగల వారు ఈ క్రింది విధముగా తలంచుచుందురు) - "ఈ కోరికను ఇపుడు నేను పొందితిని, ఈ కోరికను ఇకమీదట పొందగలను; ఈ ధనము ఇపుడు నాకు కలదు, ఇంకను ఎంతయోధనము నేను సంపాదింప గలను. ఈ శత్రువును నేనిపుడు చంపితిని, తక్కిన శత్రువులనుగూడ చంపగలను; నేను ప్రభువును; సమస్తభోగములను అనుభవించువాడను; తలంచినకార్యమును నెరవేర్ప శక్తిగలవాడను; బలవంతుడను; సుఖవంతుడను; ధనవంతుడను; గొప్పవంశమున జన్మించినవాడను; నాతో సమానమైనవాడు మఱియొక డెవడుకలడు? నేను యజ్ఞముల జేసెదను; దానముల నిచ్చెదను; ఆనందము ననుభవించెదను" - అని యీ ప్రకారముగ అజ్ఞానముచే మోహము (భ్రమ) నొందినవారును, అనేకవిధములైన చిత్తచాంచల్యములతో గూడినవారును, మోహము (దారాపుత్ర క్షేత్రాదులందు అభిమానము) అను వలచే బాగుగ గప్పబడినవారును, కామముల ననుభవించుట యందు మిగుల యాసక్తిగలవారును అయి, వారు (అసుర ప్రకృతి గలవారు) అపవిత్రమైన నరకమునందు పడుచున్నారు.


వ్యాఖ్య: - అసురసంపద నాశ్రయించువారి స్వభావము, చిత్తవృత్తి యెట్లుండునో ఈ శ్లోకములందు శ్రీకృష్ణపరమాత్మ చాల విశదముగ వర్ణించిరి. అసురగుణయుతులు ఈ దృశ్యప్రపంచమును శాశ్వతమని నమ్మి, ఆ క్షణికపదార్థములందే పేరాశగల వారై, ఆ యా వస్తుసంపాదనమునే గొప్పగ దలంచుచు గర్వముతో పలుకు వాక్యము లిచట చక్కగ నుదహరింపబడినవి. ఈ వాక్యములందు ఆ యసురస్వభావుల యొక్క అహంభావము, దర్పము, గర్వము ప్రస్ఫుటితమగుచున్నవి.

కోరికలను అనుభవించిన కొలది అవి ఇంకను పెరుగునేకాని తరగవు. కనుకనే వారు ఒక్కొక్క కోరికను అనుభవించుచు ఇంకను ఎన్నిటినో అనుభవించవలెనను కుతూహలము గలిగియుందురని చెప్పబడినది. మఱియు "నేను గొప్పవాడను. నాతో సమానమైన వాడెవడు?" అని విఱ్ఱవీగుచు గర్వాహంకారయుతులై వారు పెక్కు చిత్తవికారములు కలిగి అశాంతికిలోనై, తుదకు ఫెూరనరకములనే పొందగలరని యిచట పేర్కొనబడుట వలన ఆ దుర్గుణములన్నిటిని వివేకవంతుడు తప్పక త్యజించవలెనని స్పష్టమగుచున్నది. ఈ శ్లోకములందు వారు గావించు దోషములు, ఆ దోషములయొక్క దుష్ఫలితము - రెండును చెప్పబడినవి. నరకప్రాప్తియే ఆ దుష్ఫలితము. అజ్ఞానులీ ప్రపంచమున ఏమో సుఖమనుభవించుచున్నట్లు పైకి గోచరించినను లోన అనేక మనోవ్యథలను, చిత్తచాంచల్యములను, అనుభవించుచు తుదకు అపవిత్రమగు నరకమునే పొందుదురు. వారనుభవించు విషయసుఖములు రాజససుఖములేకాని సాత్త్వికసుఖములు కావు. రాజససుఖములు కడకు దుఃఖములుగనే పర్యవసించును.

 "యజ్ఞముల జేయుదును, దానముల నిచ్చెదను" అని వారు పలుకుట డంబమునకే గాని, వాస్తవముగగాదు. ఒకవేళ వారా యజ్ఞాదులను చేసినను, పరులమెప్పును సంపాదించుటకేగాని, సదుద్దేశ్యముతో గాదు. వారు కావించు ఆ యజ్ఞాదులు పేరునకు మాత్రమే యని 17వ శ్లోకమున భగవానుడు చెప్పబోవుదురు. (నామయజ్ఞైస్తే).


 ఇచట "సక్తాః” అని చెప్పక “ప్రసక్తాః” అని చెప్పుటవలన వారు విషయభోగములందు లెస్సగ ఆసక్తులైయుందురని తెలియుచున్నది. మఱియు "పతన్తి” అని పేర్కొనుటవలన వారు పతనమునే పొందుదురుగాని అభివృద్ధిని గాదని భావము. ఈ శ్లోకములనుబట్టి ప్రపంచములో మనుజులు ఎంత బలము, ఎంత ధనము, ఎంత కీర్తి, ఎంత ఐశ్వర్యము గలిగియున్నప్పటికిని చిత్తశుద్ధిలేనిచో, అహంకారము, గర్వము తొలగనిచో తుదకు పతనమునే పొందగలరని విదితమగుచున్నది.


ప్రశ్న:- అసురసంపదగల వారింకను ఎట్లు ప్రవర్తించుదురో తెలియజేయుడు?

ఉత్తరము:- వారు “ఈ కోరిక ఇపుడు నెరవేరినది. ఆ కోరిక త్వరలో నెరవేరగలదు; ఈ ధనమిపుడున్నది, ఆ ధనము త్వరలో సమకూడగలదు; నేను ఈ శత్రువును చంపితిని, మిగిలిన శత్రువులను గూడ చంపెదను. నేను ప్రభువును; నేను భోగిని; నేను కార్యసిద్ధిగలవాడను; నేను బలవంతుడను; నేను సుఖవంతుడను; నేను ధనవంతుడను; నేను గొప్పకులమందు జన్మించిన వాడను; నాతో సమానుడెవడు? నేను యాగములను చేయుదును, దానములను చేయుదును, ఆనందము ననుభవించెదను!" అని గర్వముతో అజ్ఞానమువలన పలుకుచుందురు. అనేక చిత్తవికారములుగల్గి భ్రాంతి జెందియుందురు. మఱియు మోహము (అజ్ఞానము, అభిమానము) అను వలచే జుట్టబడియుందురు.

ప్రశ్న:- ఇట్టి లక్షణములు గలవారికి ఏగతి లభించును?

ఉత్తరము: - వారు అపవిత్రమగు నరకమందు పడుదురు.

తిరుమల సర్వస్వం -210*

 *తిరుమల సర్వస్వం -210*

 *మాధవుడు చేసే మానవ సేవ – 7*

 *గోసేవ* 


 వైకుంఠాన్ని విడిచివెళ్లిన శ్రీమహాలక్ష్మిని అన్వేషిస్తూ భూలోకంలోని వేంకటాచల పర్వతానికి విచ్చేసిన శ్రీమహావిష్ణువు అలసి సొలసి ఆకలిదప్పులతో అలమటిస్తున్నప్పుడు వారిని ఒక గోమాత తన క్షీరంతో ఆదుకుంది. ఆ విధంగా శ్రీవేంకటేశ్వరునికి, గోవులకు విడదీయరాని బంధం ఏర్పడింది. అంతే కాకుండా, హైందవసంస్కృతిలో గోమాతకు విశిష్ఠమైన స్థానం ఉంది. గోమాత తనువులో ముక్కోటి దేవతలు కొలువై ఉన్నట్లుగా చెబుతారు.


 అలా గోవుకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని, గోసంరక్షణకై తి.తి.దే. అనేక చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే తిరుమల, తిరుపతి పట్టణాలలో వందలాది ఎకరాలలో విశాలమైన గోశాలలు ఏర్పాటు చేసి, అందులో వేలాది గోవులను సంరక్షిస్తున్నారు. వీటిలో పాలిచ్చే ఆవులతో పాటుగా ఒట్టిపోయిన ఆవులు, లేగదూడలు కూడా ఉన్నాయి. వయసుడిగిన ఆవులను కసాయిశాలలకు తరలిస్తుంటే గోరక్షాసమితి కార్యకర్తలు వాటిని రక్షించి, తి.తి.దే. గోశాలలకు తరలిస్తారు.


 ఆలయంలో ప్రసాదాల తయారీ కోసం, నేతిదీపాలు వెలిగించడం కోసం, అర్చకుల భుక్తి కోసం ఆలయానికి గోవులను దానం చేసే సాంప్రదాయం అనాదిగా వస్తోంది. 


 చరిత్రపుటల్లోకి వెళితే, లభించిన శాసనాలను బట్టి, మొట్టమొదటగా కుళోత్తుంగచోళుడనే చోళరాజు ప్రప్రథమంగా ఆలయానికి గోవులను దానం చేశాడు. తరువాత, 13వ శతాబ్దానికి చెందిన విజయగండ గోపాలుడు 33 గోవులను; యాదవరాజు వీరనరసింగ దేవరాయల వారి దేవేరి 64 ఆవులు, 2 ఆంబోతులను సమర్పించారు. ఇంకా పెరియతెమ్మ నాయకన్, వీరకుమార కంపన, చంద్రగిరికి చెందిన మాధవదాసన్, మహాకుండలేశ్వరుడు, సాళువ మహదేవమహారాజు, కందాడై రామానుజ అయ్యంగార్ వంటి ఎందరో మహారాజులు, వారి దేవేరులు, ఆచార్యపురుషులు, పీఠాధిపతులు, జమీందార్లు, వర్తకశ్రేష్ఠులు - ఇలా ఎందరెందరో శ్రీనివాసునికి గోవులనర్పించి తరించారు. 


 మొట్టమొదట *'గోశాల'* గా వ్యవహరించబడే ఈ గోసంరక్షణశాల తరువాత *'శ్రీవేంకటేశ్వర డైరీ ఫామ్'* గానూ, తరువాతి కాలంలో *'శ్రీవేంకటేశ్వర గోసంరక్షణ కేంద్రం'* గానూ రూపాంతరం చెందింది.


 మహంతుల కాలంలో గోవిందరాజస్వామి ఆలయ పరిసరాలో ఉన్న ఈ గోశాల, పెరుగుతున్న గోవుల సంఖ్యకు అనుగుణంగా తరువాతి కాలంలో కపిలతీర్థం మార్గంలో గల శ్రీవేంకటేశ్వర ఓరియంటల్ కళాశాల ప్రాంగణానికి, తదనంతరం ఇప్పుడు మహతీ ఆడిటోరియం ఉన్న ప్రదేశానికి, చివరగా తిరుపతి పట్టణ శివారులో ఇప్పుడున్న సువిశాల ప్రాంగణానికి మార్చబడింది. ప్రస్తుతం ఇందులో గోవులే కాకుండా రేవతి, పద్మ, లక్ష్మీ, మహాలక్ష్మి, వైష్ణవి అనే ఏనుగులు; గుర్రాలు, ఆంబోతులు, ఒంటెలు, జింకలు, పొట్టేళ్ళు, నెమళ్ళు, బాతులు; అనేక పక్షిజాతులు కూడా పెంచబడుతున్నాయి.


 దేశం మొత్తం మీద 33 జాతుల ఆవులుంటే, వాటిలో 13 జాతుల ఆవులు తిరుపతి లోని శ్రీవేంకటేశ్వర గోసంరక్షణ శాలలోనే ఉండడం విశేషం. ఇందులో సంరక్షించ బడుతున్న ఆవులలో చాలా వరకు భక్తులు సమర్పించుకున్నవే! దేశవాళీ ఆవుల సంతతిని వృద్ధి చేయాలనే లక్ష్యంతో మేలుజాతి ఒంగోలు వృషభాలు కూడా గోశాలలలో పెంచబడుతున్నాయి. దేశవాళీ ఆవుల యొక్క పాలు, గోమయం మరియు గోపంచకాలలో ఉన్న ఔషధ విలువలను గుర్తించి, వాటి వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు.


 గోశాలలలో ఆవుల ఆరోగ్యానికి, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తారు. ప్రతిరోజు నాలుగు సార్లు నిర్ణీతసమయాలలో పౌష్ఠికాహారాన్ని అందిస్తారు. క్రమం తప్పకుండా నిపుణులైన పశువైద్యులు వైద్యపరీక్షలు నిర్వహిస్తారు.


 పాల దిగుబడి పెంచడం కోసం గోమాతలకు సంగీతం వినిపించడం ఈ గోశాల ప్రత్యేకత. అన్నమయ్య సంకీర్తనలు, శాస్త్రీయసంగీతం నిరంతరంగా వినిపిస్తున్నందు వల్ల పాలదిగుబడి వృద్ధి చెందినట్లు శాస్త్రోక్తంగా వెల్లడైంది.


 రోజూ కొన్ని వేల లీటర్ల పాలు ఉత్పత్తి అయినప్పటికీ, పాలను విక్రయించే సాంప్రదాయం లేదు. ఉదయం, సాయంత్రం సేకరించిన స్వచ్ఛమైన పాలు, పెరుగు, వెన్న స్వామివారి సేవకు మరియు దేవాలయ అవసరాలకు వినియోగిస్తారు. మిగిలిన వాటిని వివిధ దేవస్థానాలకు, ఫలహారశాలలకు, అతిథిగృహాలకు, మూగ-బధిర పాఠశాలకు, హాస్టళ్ళకు, వైకుంఠం క్యూ సముదాయంలో వేచి ఉండే భక్తులకు సరఫరా చేస్తారు.


 2002వ సంవత్సరంలో ప్రారంభించబడ్డ గోసంరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో అనాథలుగా ఉన్న గోవుల ఆలనా-పాలనా, ఉచిత పశువైద్యశాలల నిర్వహణ, గోవుత్పత్తులు మరియు పశుసంరక్షణా పద్ధతులపై శాస్త్రీయపరిశోధన మున్నగునవి నిర్వహిస్తారు. గోమాత వైశిష్ట్యాన్ని చాటి చెప్పేందుకు గానూ తి.తి.దే. ఆధ్వర్యంలో ఒక జాతీయసదస్సు నిర్వహించబడింది.


 గోవుల పట్ల ప్రజలలో శ్రద్ధాభక్తులు పెంపొందించడం కోసం ప్రతిరోజూ గోపూజ నిర్వహిస్తూ, ప్రజలు కూడా పూజలో పాల్గొనే అవకాశం కలిగిస్తున్నారు. అలాగే, కృష్ణాష్టమి నాడు ఘనంగా ఉత్సవాలు నిర్వహించి, వేలాది మంది భక్తులు, పురప్రముఖుల సమక్షంలో గోమాతలకు విశేషపూజలు నిర్వహిస్తారు. 


 రేపటి భాగంలో ... *కళ్యాణ కట్ట* గురించి తెలుసుకుందాం


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

*సంపూర్ణ మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*


*348 వ రోజు*


*కర్ణుని విజృంభణ*


కర్ణుడు పాడవుల విజయోత్సాహానికి క్రుద్ధుడై విజృంభించి పాండవసేనలను తరుముతూ దొరికిన వారిని దొరికినట్లు చంపసాగాడు. అది చూసిన ధర్మరాజు అర్జునుడితో " అర్జునా ! చూసావా మధ్యందిన మార్తాండునిలా ఉన్న కర్ణుని విజృంభణ చూస్తే మనం ఊరకున్న ఈ రోజే పాండవ సేనను నాశనం చేసేలా ఉన్నాడు. నీవు అతడిని ఆపే మార్గం ఆలోచించు " అన్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుని చూసి " కృష్ణా ! అన్నయ్య ధర్మజుడు మన సేనలు పారి పోవడం చూసి భయపడుతున్నాడు. ఒక వైపు కర్ణుడు, మరొక వైపు ద్రోణుడు మన సైన్యాలను తరుముతున్నారు. ద్రోణుడిని తరువాత చూడవచ్చు ముందు కర్ణుని ఆపాలి మన రథం కర్ణుని ముందు నిలుపు " అన్నాడు. కృష్ణుడు " అర్జునా ! రాత్రులందు రాక్షసులకు బలం ఎక్కువ కనుక నీవు ఇప్పుడు ఘటోత్కచుడిని పంపి కర్ణుడిని నిలువరించుట ఉత్తమం. మాయా విద్యా ప్రవీణ్యుడు దివ్యాస్త్ర సంపన్నుడైన ఘటోత్కచుడు కర్ణుడిని నిలువరించగల సమర్ధుడు. మనం ద్రోణుని ఎదుర్కొంటాము " అన్నాడు. కృష్ణుని మాట విన్న అర్జునుడు ఘటోత్కచుడిని పిలిచి " కుమారా ఘటోత్కచా ! కర్ణుడి పరాక్రమానికి పాండవ సేన చెదిరి పోతుంది. నీవు నీ పరాక్రమాన్ని చూపి అతడిని నిలువరింపుము. రాత్రి సమయంలో కర్ణుడు నీ అంత సమర్ధవంతంగా యుద్ధం చేయలేడు కనుక నీవు అతడిని కట్టడి చేయగలవు కనుక కర్ణుడిని ఎదుర్కొని నీ తండ్రుల పేరు నిలుపు " అన్నాడు. ఘటోత్కచుడు అర్జునుడికి నమస్కరించి కర్ణుడిని ఎదుర్కొనుటకు వెళ్ళాడు.


*ఘతోత్కచాలంబసుల యుద్ధం*


ఆసమయంలో జటాసురుడి కుమారుడైన అలంబసుడు సుయోధనుడి వద్దకు వచ్చి " రారాజా ! నాకు ఎప్పటి నుండో పాండవుల మీద పగ ఉన్నది. మీరు అనుజ్ఞ ఇస్తే పాండవులను సంహరించగలను " అన్నాడు. సుయోధనుడు ఆనందపరవశుడై అందుకు అంగీకరించాడు. అలంబసుడు కర్ణుడిని దాటి ఘటోత్కచుడిని ఎదుర్కొన్నాడు. ఇరువురు మొదట విల్లంబులతో యుద్ధం మొదలు పెట్టారు. ఆ తరువాత రాక్షస మాయలు ప్రయోగించి యుద్ధం చేయసాగారు. ఒకరు సర్పంగా మారితే ఒకరు గరుడునిగా మారారు. ఒకడు ఏనుగుగా మారిన వేరొకరు సింహంగా మారారు. ఒకరికి ఒకరు తీసి పోకుండా యుద్ధం చేయసాగారు. చివరికి ముష్టి యుద్ధానికి దిగారు. చివరకు ఘటోత్కచుడు అలంబసుడిని కిందకు తోసి గొండెల మీద కాలు పెట్టి అలంబసుడి తల గుండ్రంగా తిప్పి అతడి తల తెంచాడు. ఆ తలను తీసి సుయోధనుడి రథము మీద విసిరాడు. అది చూసి ఆశ్చర్య పోతున్న సుయోధనుడితో " ఓ సుయోధనా! ఇది నీ స్నేహితుడి అలంబసుడి తల ఇంకొంచెం సేపటికి కర్ణుడి తల నీ రథం మీదకు వేస్తాను నీ వంతు వచ్చినప్పుడు నీ తల విసరగలను. నేను భీమసేనుడి కుమారుడినని తెలుసు కదా ! జాగర్త " అని గర్జించాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శనివారం🍁* *🌹19, ఏప్రిల్, 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

        *🍁శనివారం🍁*

  *🌹19, ఏప్రిల్, 2025🌹*

     *దృగ్గణిత పంచాంగం*


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్ర మాసం - కృష్ణపక్షం*


*తిథి      : షష్ఠి* సా 06.21 వరకు ఉపరి *సప్తమి*

*వారం    : శనివారం* ( స్ధిరవాసరే )

*నక్షత్రం   : మూల* ఉ 10.21 వరకు ఉపరి *పూర్వాషాడ*


*యోగం  : శివ* రా 12.53 వరకు ఉపరి సిద్ధ

*కరణం   : వణజి* సా 06.21 భద్ర పూర్తిగా రాత్రంతా


*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 10.30 - 12.30 సా 04.00 - 06.00*

అమృత కాలం  : *ఈరోజు లేదు*

అభిజిత్ కాలం  : *ప 11.41 - 12.32*


*వర్జ్యం         : ఉ 08.37 - 10.21 & రా 08.32 - 10.13*

*దుర్ముహూర్తం  : ఉ 05.50 - 07.30*

*రాహు కాలం   : ఉ 08.58 - 10.32*

గుళికకాళం       : *ఉ 05.50 - 07.24*

యమగండం     : *మ 01.41 - 03.15*

సూర్యరాశి : *మేషం*

చంద్రరాశి : *ధనుస్సు*

సూర్యోదయం :*ఉ 05.50*

సూర్యాస్తమయం :*సా 06.24*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.50 - 08.20*

సంగవకాలం         :*08.20 - 10.51*

మధ్యాహ్న కాలం    :     *10.51 - 01.22*

అపరాహ్న కాలం    : *మ 01.22 - 03.53*


*ఆబ్ధికం తిధి         : చైత్ర బహుళ షష్ఠి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.24*

ప్రదోష కాలం         :  *సా 06.24 - 08.41*

రాత్రి కాలం        :  *రా 08.41 - 11.43*

నిశీధి కాలం          :*రా 11.43 - 12.29*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.18 - 05.03*

--------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🚩శ్రీ ఆంజనేయ కరావలంబ స్తోత్రం🚩*


*ఏకేణ ఖడ్గ మపరేణ కరేణ శూల॥*

*ఆదిత్య రుద్ర వరుణాది నుత ప్రభావ॥*

*వారాహ రామ నరసింహ శివాది రూప ॥*

*శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్!!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🍁శనివారం 19 ఏప్రిల్ 2025🍁*


            *రామాయణం*


ఒకసారి చదివినంత మాత్రాన  

మన సమస్త పాపాలని తీసేస్తుంది...



   *వాల్మీకి రామాయణం*

         *13 వ  భాగం*                  

```

అప్పుడు విశ్వామిత్రుడు,... “నేను నీకు మెడలో బంగారు తాడులున్న పద్నాలుగు వేల ఏనుగులని ఇస్తాను, ఎనిమిది వందల బంగారు రథాలని ఇస్తాను, ఆ ఒక్కో రథానికి స్వర్ణాభరణములతో అలంకరింపబడ్డ నాలుగు గుర్రాలు ఉంటాయి, అలాగే గొప్ప గొప్ప జాతులకి చెందిన పదకొండు వేల గుర్రాలు ఇస్తాను, ఒక కోటి గోవుల్ని ఇస్తాను, బంగారము, వెండి ఎంత కావాలో నువ్వే అడుగు, నేను ఇచ్చేస్తాను” అన్నాడు.


ఇవన్నీ విన్న వశిష్ఠ మహర్షి, “నేను ఇంక ఏమి మాట్లాడను” అన్నారు.


ఆగ్రహించిన విశ్వామిత్రుడు, “ఈయన ఇవ్వడమేంటి నేను పుచ్చుకోవడమేంటి, అడిగినకొద్ది బెట్టు చేస్తున్నాడు, ఈ రత్నం నాకు చెందినది” అని ఆ శబళ మెడలో తాడు కట్టి, సైనికులకిచ్చి తీసుకెళ్ళమన్నాడు.


వాళ్ళు దాన్ని ఈడ్చుకెళుతుంటె ఆ శబళ ఏడ్చింది.


ఇంత జరుగుతున్నా వశిష్ఠుడు మాత్రం అలానే నిశబ్దంగా ఉన్నారు. అప్పుడా శబళ... “ఇంతకీ నన్ను వశిష్ఠుడు వదిలేశాడా, లేకపోతే విశ్వామిత్రుడు తీసుకెళుతున్నాడా, వశిష్ఠుడు నన్ను ఇవ్వను అంటే విశ్వామిత్రుడు నన్ను తీసుకెళ్ళగలడా, వశిష్ఠుడు నన్ను వదిలేశాడంటే నేను ఏదో పాపం కాని, పొరపాటు కాని చేసి ఉండాలి, ఒకవేళ నేను ఏదన్నా పాపం చేసి ఉంటే వశిష్ఠుడికి క్షమార్పణ చెప్తాను, ఆయన బ్రహ్మర్షి కనుక నన్ను తప్పకుండా క్షమిస్తారు” అని తాడు విడిపించుకొని వశిష్ఠుడి దగ్గరికి పరుగుతీసి వెళ్ళింది.


అప్పుడు వశిష్ఠుడు...```


*న త్వాం త్యజామి శబలే న అపి మే అపకృతం త్వయా |*

*ఏష త్వాం నయతే రాజా బలాత్ మత్తః మహాబలః ||*```


“శబళా! నేను నిన్ను విడిచిపెట్టలేదు. విశ్వామిత్రుడే నిన్ను బలాత్కారంగా తీసుకెళుతున్నాడు. ఆయన ఈ భూమికి ప్రభువు, కాని నేడు తప్పు ద్రోవలో వెళుతున్నాడు, అతను దోషం చేస్తే, ఆ దోషం అతనిని కాలుస్తుంది. నిన్ను ఈడ్చుకెళ్ళి దోషం చేశాడు, ఇక ఆయన అపరాధమే ఆయనని కాలుస్తుంద”ని చెప్పాడు.


“అయితే నన్ను నేను రక్షించుకోనా”అని శబళ అడుగగా, “తప్పకుండా రక్షించుకో!”  అని వశిష్ఠుడు చెప్పాడు.


అప్పుడా శబళ గట్టిగా ‘అంబా’ అని అరిచి శూలాయుధధరులైన పహ్లవులు కొంతమందిని సృష్టించింది. వాళ్ళు విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చెయ్యడం మొదలుపెట్టారు. ఇది గమనించిన విశ్వామిత్రుడు కత్తి పట్టుకొని యుద్ధరంగంలోకి వెళ్ళి చాలామంది పహ్లవులని సంహరించాడు.


ఆ శబళ పహ్లవులతో పాటుయవనులని సృష్టించింది, వాళ్ళందరూ కలిసి విశ్వామిత్రుడి సైన్యాన్ని తుడిచెయ్యడం ప్రారంభించారు. అప్పుడా శబళ వశిష్ఠుడితో... “చూశారా! ఆయన నాకు ఎదురుతిరిగాడు, ఇప్పుడు ఓటమి అంచులలో ఉన్నాడు” అని అన్నది.


“అయితే నువ్వు ఇక యదేచ్ఛగా సైన్యాన్ని సృష్టించు” అని వశిష్ఠుడు అన్నాడు.


అప్పుడా శబళ సూర్యుడి ప్రకాశంతో సమానమైన కాంభోజ వంశీయులని, తన పొదుగు నుండి కొన్ని వేల పహ్లవులని, యోని నుండి యవనులని, గోమయం పడే స్థానం నుంచి శకులు, రోమ కూపాల నుండి హారీతులు మరియు కిరాతకులని సృష్టించింది. వీరందరూ కలిసి ఆ విశ్వామిత్రుడి సైన్యాన్ని సమూలంగా తుడిచిపెట్టారు.


రథం నుండి కిందకి దిగి తన సైన్యాన్ని చూసిన విశ్వామిత్రుడు నిస్తేజుడయ్యాడు. ఇది కదా శబళ గొప్పతనం అనుకొని తన 100 కుమారుల వైపు చూశాడు. తమ తండ్రిని బాధపెట్టిన వశిష్ఠుడిని చంపెయ్యాలని అందరూ కత్తులు పట్టుకొని ఆయన మీదకి పరుగుతీసారు.


కూర్చుని ఉన్న వశిష్ఠుడు తన మీదకి వస్తున్న ఆ నూరుగురు పిల్లల్ని చూసి గట్టిగా…  “ఆ......” అని హుంకారం చేశారు.


ఆ నూరుగురు పిల్లలు భస్మరాసులై కిందపడిపోయారు.


ఇది చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు.

“ఇది కదా బ్రహ్మర్షి యొక్క గొప్పతనం అంటే! ఆయన “ఆ....” అంటె వందమంది బూడిదైపోయారు, ఆ ఆవు తలుచుకుంటె గొప్ప సైన్యాన్ని, అమోఘమైన భోజనాన్ని సృష్టించింది. రాచరికం కన్నా తపఃశక్తి చాలా గొప్పది, ఈ వశిష్ఠుడిని నాశనం చెయ్యాలంటే నాకున్న శక్తి సరిపోదు. కావున నాకు ధనుర్వేదంలోని సమస్త అస్త్ర-శస్త్రాలు తెలియాలి అనుకొని ఒక కుమారుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి, రాజ్యపాలన చెయ్యమని చెప్పి తాను తపస్సు చేసుకోడానికి హిమాలయ పర్వతాలకి వెళ్ళాడు.


*రేపు... 14వ భాగం*


*🚩జై శ్రీరామ్.!   జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

రామాయణం

 🐄🌷🏹🪔🛕🪔🏹🌷

*🌹శుక్రవారం 18 ఏప్రిల్ 2025🌹*


             *రామాయణం*


ఒకసారి చదివినంత మాత్రాన 

మన సమస్త పాపాలని తీసేస్తుంది...


    *వాల్మీకి రామాయణం*

           *12 వ భాగం*              


శతానందుడు రాముడితో ఇలా చెప్పసాగాడు.. “గాధి కుమారుడైన విశ్వామిత్రుడు చాలాకాలం రాజ్యపాలన చేశాడు. ఒకనాడు ఆయన ఒక అక్షౌహిణీ సైన్యంతో భూమి అంతా తిరుగుతూ తన రాజ్యంలోనే ఉన్న వశిష్ఠుడి ఆశ్రమంలోకి వెళ్ళారు. 

ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో జంతువులు పరస్పర వైరం మరచి జీవిస్తుంటాయి. పులి-జింక, ఎలుక-పాము, కుక్క-పిల్లి ఒకదానిని ఒకటి తరమదు, చంపదు. 

ఆ ఆశ్రమంలో కొన్ని వేల మంది శిష్యులున్నారు. ఎన్నో పర్ణశాలలతో, చెట్లతో, జంతువులతో ఆ ఆశ్రమం శోభాయమానంగా ఉండేది. ఆ ఆశ్రమంలో శబళ అనే కామధేనువు ఉండేది,అది అమృతంతో సమానమైన క్షీరాన్ని(పాలు) ఇస్తుండేది. ఆ పాలతోనే ఆ ఆశ్రమంలో యజ్ఞయాగాది క్రతువులు చేసేవారు. అంత పరమ పవిత్రమైన ఆశ్రమంలోకి విశ్వామిత్ర మహారాజు తన సైన్యాన్ని బయట విడిది చేయించి, ఆశ్రమంలోకి వెళ్ళారు.


అప్పుడు విశ్వామిత్ర మహారాజు వశిష్ఠుడితో... “అయ్యా! మీ ఆశ్రమంలో ఉన్న చెట్లన్నీ ఫలవంతంగా ఉన్నాయా, మీ యజ్ఞయాగాది క్రతువులు బాగా జరుగుతున్నాయా, మీ ఆశ్రమంలోని ఋషుల తపస్సులు ఎటువంటి విఘ్నం కలగకుండా సాగుతున్నాయా, మీరంతా సంతోషంగా ఉన్నారా?” అని పలు కుశల ప్రశ్నలు అడిగాడు.


సంతోషించిన వశిష్ఠుడు ఇలా అన్నాడు “నాయనా! నేను కుశలంగా ఉన్నాను, నువ్వు రాజధర్మంతో రాజ్యం చేస్తున్నావా (రాజధర్మం అంటె, ఎంత పన్ను ప్రజల దగ్గర నుండి పుచ్చుకోవాలో రాజు అంత మాత్రమే పుచ్చుకోవాలి. ఆ పుచ్చుకున్న ద్రవ్యంలో ఒక్క పైసా కూడా దుర్వినియోగం చెయ్యకుండా, ఆ ధనాన్ని వృద్ధి చెయ్యాలి. అప్పుడు దాన్ని అవసరంలో ఉన్న వాళ్ళకి ఇచ్చి దేశ క్షేమాన్ని కోరుకోవాలి), సామంతులందరూ నీకు లొంగి ఉన్నారా, శత్రువులను జయించావా, నీ మంత్రులు నీకు సహాయపడుతున్నారా?” అని పలు విషయాలని ప్రస్తావించిన తరువాత కొంతసేపటికి విశ్వామిత్రుడు.. “ఇక నేను వెళతాను” అన్నాడు.


అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నారు.........```


*సత్క్రియాం తు భవాన్ ఏతాం ప్రతీచ్ఛతు మయా కృతాం |*

*రాజన్ త్వం అతిథి శ్రేష్ఠః పూజనీయః ప్రయత్నతః ||*```


“ఈ భూమిని పరిపాలించే నువ్వు నాకు అతిథులలో శ్రేష్టుడివి, కనుక నా ఆతిధ్యం తీసుకోవాల”న్నాడు.


“మీరు నాకు చేతులు, కాళ్ళు కడుక్కోవడానికి, తాగడానికి నీళ్ళు ఇచ్చారు, మీరు తినే తేనె, కందమూలాలు నాకు పెట్టారు, అలాగే నాకు మీ దర్శనం కూడా అయ్యింది. ఇంతకంటే నాకు ఏమి కావాలి, ఇక మీరు శ్రమతీసుకోవద్దు” అని విశ్వామిత్రుడు అన్నాడు.


“అలా కాదు మీరు నా ఆతిధ్యం స్వీకరించాల్సిందే!” అని వశిష్ఠ మహర్షి అన్నారు.


“సరే, మీ ఇష్టం!” అని విశ్వామిత్రుడన్నాడు.


అప్పుడు వశిష్ఠ మహర్షి శబళ ని పిలిచి, “చూశావా మన ఆశ్రమంలోకి ఈ రోజు విశ్వామిత్ర మహారాజుగారు వచ్చారు, నువ్వు ఆయనకి, ఆయన అక్షౌహిణీ సైన్యానికి ఉత్తమమైన భోజనం ఏర్పాటు చెయ్యాలి. ఎవరెవరికి ఏది కావాలో నువ్వు అది ఏర్పాటు చెయ్యి” అన్నారు.*


ఆ శబళ ఎవరెవరు మనస్సులలో ఏమి కావాలని అనుకుంటున్నారో గ్రహించి, చెఱకు కర్రలు, తేనె, పానీయములు, కొండలంత ఎత్తున్న సన్నటి అన్నరాసులని, కొరుక్కు తినేవి, తాగేవి, నాకేవి, కూరలు, పచ్చళ్ళు, పులుసులు, పళ్ళరసాలు, పాలు, తాంబూలాలు మొదలైనవి సిద్ధం చేసింది.


శబళ సృష్టించిన భోజనాన్ని ఆ సైనికులందరూ భుజించారు, అందరూ ఈ భోజనం ఎంత బాగుందో అనుకున్నారు, ‘మళ్ళీ మన జీవితంలో ఇలాంటి రుచికరమైన భోజనం ఎప్పుడు చేస్తామో’ అని ఆవురావురుమని తిన్నారు. ఒక గోవు ఉత్తర క్షణంలో ఇంతమందికి సరిపడా భోజనాన్ని సృష్టించేసరికి విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఆయనకి మెల్లగా ఆ శబళ మీద వ్యామోహం పెరిగింది, ఆ శబళని తన సొంతం చేసుకోవాలని అనిపించింది. అప్పుడాయన ఆ వశిష్ఠ మహర్షితో...```


*“గవాం శత సహస్రేణ దీయతాం శబలా మమ |*```


“నేను మీకు ఒక లక్ష ఆవుల్ని ఇస్తాను, మీరు నాకు శబళని ఇవ్వండి” అన్నాడు.


అయితే ఈ విశ్వామిత్రుడు నాకు లంచం ఇవ్వాలని చూస్తున్నాడు అని వశిష్ఠ మహర్షి గ్రహించారు. వశిష్ఠుడు నవ్వి, “నేను నీకు శబళని ఇవ్వలేను” అన్నారు.


విశ్వామిత్రుడికి మెల్లగా క్రోధం పెరిగి ఇలా అన్నారు... “రాజ్యంలో ఎక్కడన్నా రత్నాలు ఉంటే అవి రాజుకే చెందుతాయి. రాజు దగ్గర విలువైనవి ఉండాలి. చాలా విలువైనది రత్నమైతే, ఇంత విలువైన శబళ కూడా రత్నమే. నా సొత్తు అయిన ఆ రత్నాన్ని నువ్వు ఉంచుకున్నావు, అందుకే ఇప్పుడు నేను ఆ రత్నాన్ని తీసుకెళుతున్నాను” అని అన్నాడు.


“నాయనా విశ్వామిత్రా! ఈ ఆవు ఒక రత్నము, దీనిని విలువగా దాచుకోవాలని అనుకుంటున్నావు. కాని ఈ ఆవు మా ఆశ్రమంలో దేవతారాధనకి, పితృదేవతారాధనకి పాలు ఇస్తుంది, నా ప్రాణయాత్ర దీనితో జరుగుతుంది. ఈ ఆశ్రమంలోని యజ్ఞాలు, విద్యాభ్యాసం సమస్తము ఈ శబళ మీద ఆధారపడి ఉంది, కాబట్టి నేను ఈ ధేనువుని నీకు ఇవ్వలేను” అని వశిష్ఠ మహర్షి అన్నారు.


*రేపు…13వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

నలందా యూనివర్శిటీ

 ప్రస్తుత "హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ & నాసా" అన్నీ కలిస్తే.. ఒకప్పటి "నలందా యూనివర్శిటీ" అవుతుంది..


నలందా యూనివర్శిటీని ఆరుగురు రాజులు కలిసి విస్తరించారు. అందులో 10000 మంది విద్యార్థులు ఏకకాలంలో చదువుకునే ఏర్పాట్లు చేశారు. నలందా యూనివర్శిటీలో వేదాలు, వ్యాకరణం, తర్కశాస్త్రం, ఫిలాసఫీ, వైద్యం, ఫిజిక్స్, ఆధ్యాత్మికత, గణితం, సంస్కృతం, ఖగోళశాస్త్రం, లిటరేచర్ & ఇంద్రజాలంతో సహా అనేక విభాగాలు ఉండేవి.


నలందా యూనివర్శిటీ లో ఉన్న ఒక విశిష్టమైన అంశం ఏంటంటే.. యూనివర్శిటీ మధ్యలో తొమ్మిది అంతస్తుల్లో నిర్మించబడి మిలియన్ల కొద్దీ పుస్తకాలున్న "ధర్మగ్రంథ" అనే పేరు గల గ్రంథాలయం. దీని విశిష్ఠత గురించి టిబెటన్ మోంక్ తారనాధ వివరించినట్లు.. ఆ గ్రంథాలయంలో రత్నదాధి, రత్నసాగర & రత్నరంజక అనే మూడు విభాగాలు ఉండేవి. నలందా విశ్వవిద్యాలయంలో వేలాది మంది ఉపాధ్యాయులు ఉండేవారు. ఒందలాది తరగతి గదుల్లో వేలాది విద్యార్థులకు పాఠాలు చెబుతుండేవారు. విద్యార్థులు సమయం వృధా చేయకుండా పఠనంలో లేదా చర్చల్లో నిమగ్నమై ఉండేవారు.


క్సువాన్‌జాంగ్ తో సహా అనేక మంది చైనా మోంక్‌లు భారత్‌లోని నలందా యూనివర్శిటీని సందర్శించి వృత్తులు, సైన్స్, కళలలతో సహా అసాధారణమైన భారతదేశ విజ్ఞానాన్ని తమతో చైనా తీసుకెళ్ళారు.


-"ఇండియాటుడే కాన్‌క్లేవ్ 2025" లో మాట్లాడుతూ.. విలియం డాల్రింపుల్, ప్రపంచ ప్రఖ్యాత రచయిత & చరిత్రకారుడు


🚩🪷🚩🪷🚩


#IndiaToday #nalanda


#IndiaTodayConclave

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం - చతుర్థి - జేష్ఠ -‌‌ గురు వాసరే* (17.04.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.






.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*