ప్రస్తుత "హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ & నాసా" అన్నీ కలిస్తే.. ఒకప్పటి "నలందా యూనివర్శిటీ" అవుతుంది..
నలందా యూనివర్శిటీని ఆరుగురు రాజులు కలిసి విస్తరించారు. అందులో 10000 మంది విద్యార్థులు ఏకకాలంలో చదువుకునే ఏర్పాట్లు చేశారు. నలందా యూనివర్శిటీలో వేదాలు, వ్యాకరణం, తర్కశాస్త్రం, ఫిలాసఫీ, వైద్యం, ఫిజిక్స్, ఆధ్యాత్మికత, గణితం, సంస్కృతం, ఖగోళశాస్త్రం, లిటరేచర్ & ఇంద్రజాలంతో సహా అనేక విభాగాలు ఉండేవి.
నలందా యూనివర్శిటీ లో ఉన్న ఒక విశిష్టమైన అంశం ఏంటంటే.. యూనివర్శిటీ మధ్యలో తొమ్మిది అంతస్తుల్లో నిర్మించబడి మిలియన్ల కొద్దీ పుస్తకాలున్న "ధర్మగ్రంథ" అనే పేరు గల గ్రంథాలయం. దీని విశిష్ఠత గురించి టిబెటన్ మోంక్ తారనాధ వివరించినట్లు.. ఆ గ్రంథాలయంలో రత్నదాధి, రత్నసాగర & రత్నరంజక అనే మూడు విభాగాలు ఉండేవి. నలందా విశ్వవిద్యాలయంలో వేలాది మంది ఉపాధ్యాయులు ఉండేవారు. ఒందలాది తరగతి గదుల్లో వేలాది విద్యార్థులకు పాఠాలు చెబుతుండేవారు. విద్యార్థులు సమయం వృధా చేయకుండా పఠనంలో లేదా చర్చల్లో నిమగ్నమై ఉండేవారు.
క్సువాన్‌జాంగ్ తో సహా అనేక మంది చైనా మోంక్‌లు భారత్‌లోని నలందా యూనివర్శిటీని సందర్శించి వృత్తులు, సైన్స్, కళలలతో సహా అసాధారణమైన భారతదేశ విజ్ఞానాన్ని తమతో చైనా తీసుకెళ్ళారు.
-"ఇండియాటుడే కాన్‌క్లేవ్ 2025" లో మాట్లాడుతూ.. విలియం డాల్రింపుల్, ప్రపంచ ప్రఖ్యాత రచయిత & చరిత్రకారుడు
🚩🪷🚩🪷🚩
#IndiaToday #nalanda
#IndiaTodayConclave
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి