11, జులై 2025, శుక్రవారం

ఉచ్చిష్టం శివనిర్మాల్యం

 *"ఉచ్చిష్టం శివనిర్మాల్యం వమనం శవకర్పటమ్!*

*కాకవిష్ఠా సముత్పన్నః పంచైతేఽతి పవిత్రకాః!!"*


 *~ఎంగిలి, శివ నిర్మాల్యం, వాంతి (కక్కినది), శవముపైన కప్పిన బట్ట, కాకి రెట్ట నుండి పుట్టినది అత్యంత పవిత్రములు….!*


 *సమన్వయం:~*


 *1) ఉచ్చిష్టం (ఎంగిలి):~*

*’ఉచ్చిష్టం (ఎంగిలి)’ అంటే దూడ తాగిన తరువాత పితికిన ఆవుపాలు. దూడ ఎంగిలి చేసినా అన్ని వైదిక, దైవిక కార్యక్రమాలకీ లౌకిక కార్యక్రమాలకీ అత్యంత శ్రేష్ఠం, పవిత్రం, పంచామృతాల్లో మొదటిగా వెలుగొందేది.*


 *2) శివనిర్మాల్యం (శివార్చనానంతరం తీసిన ఆ పూజాద్రవ్యాలు):~*

 *’శివనిర్మాల్యం (శివార్చనానంతరం తీసిన ఆ పూజాద్రవ్యాలు)’ శివుని ఝటాఝూటముల నుండి జాలువారే గంగ. శివుని అభిషేకించిన, పూజించిన ద్రవ్యములు శివ స్పర్శచెందినదేదైనా పవిత్రమే. విధిపూర్వకముగా గ్రహిస్తే అవి అత్యంత మహిమాన్వితములు.*


 *3) వమనం (వాంతి లాగా కక్కినది):~*

 *’వమనం (వాంతి లాగా కక్కినది)’ అంటే రకరకాల పూలనుండి తేనెటీగలు మకరందం సేకరించి తేనెపట్టులో దాచడం. త్రాగిన తేనెను తేనెపట్టులో కక్కుట ద్వారా దాచినా అది వైదిక, అర్చనాది కార్యక్రమాలకు అత్యంత పవిత్రమైనదే. పంచామృతాలలో ఒకటి.*


 *4) శవకర్పటం (శవంపై కప్పబడిన వస్త్రం):~*

 *’శవకర్పటం (శవంపై కప్పబడిన వస్త్రం)’ అంటే చనిపోయిన పట్టు పురుగు చుట్టూ ఉండే పట్టుగూడు నుండి తీసిన దారముతో నేసిన పట్టుపుట్టం. పట్టుదారం తీయడానికి పట్టుకాయలో దాగున్న పట్టుపురుగుని చంపి, అది చనిపోయిన తరువాత పట్టునూలు సేకరించినప్పటికీ పట్టువస్త్రం శుభకరమే.*


 *5) ‘కాకవిష్ఠాసముత్పన్నం (కాకి రెట్ట నుండి పుట్టినది)’:~*

 *’కాకవిష్ఠాసముత్పన్నం (కాకి రెట్ట నుండి పుట్టినది)’ దేవాలయ, తటాక, నదీతీర, మైదాన, అరణ్యాలలోని రావి చెట్లు కాకి రెట్ట(విసర్జనం)ద్వారా స్వతస్సిద్ధంగా మొలకెత్తి పెరుగుతాయి. అయినాకూడా రావి పరమ పవిత్రం సాక్షాత్ విష్ణు స్వరూపం, త్రిమూర్తి స్వరూపం. యఙ్ఞ యాగాది క్రతువులలో సమిధగా సమర్పించుటకు అత్యంత అర్హమైనది.*


 *దోషములతో కూడుకున్నవిగా కనిపించినప్పటికీ ఈ ఐదు వస్తువులూ అత్యంత పవిత్రమైనవి.*

సున్న పై ములుగు విశ్వ నాధ శాస్త్రి గారి కవితా విన్యాసం

 *00000000000000000*


*సున్న పై ములుగు విశ్వ నాధ శాస్త్రి గారి కవితా విన్యాసం*


*00000000000000000*


*0* కి విలువెంత అని *పంతుల్ని* అడిగితే 

*సున్నా* కి విలువేంటి? *శూన్యం* అంటాడు!


*0* లేకుండా 

*పంతులూ* లేడు! ఏ *పండితుడూ* లేడు!


*అంకెల* దరిజేరి అది విలువలను పెంచు!

పదముల దరిజేరి పదార్థములనే కూర్చు!


*సున్న* ప్రక్కన *0* చేరి *సున్నం* అయ్యె! 

*అన్న* ప్రక్కన *0* చేరి *అన్నం* అయ్యె!  

*ఆంధ్రా* లో *అన్నబియ్యం* కూడా కిలో *రెండు* అయ్యె!


*పది* మధ్యలో దూరి 

*పంది* గా మారె!

*నది* మధ్యలో దూకి 

*నంది* గా మారె!


ప్రతి *కొంప* లోనూ 

అది తిష్ట వేసింది!

*0* లేనట్టి *సంసారమే* లేదు! 


*కాంగి* లోనూ దూరె! 

*దేశం* లోనూ దూరె!

*కమలం* లోనూ దూరే !

అది *రాజకీయం* కూడా నడుపుచుండె!

*పంచాయతీ* నుండి *పార్లమెంటు* వరకూ అది మెంబరై ఉండ! 


*గుండుసున్నా* 

అని ఎగతాళి చేయకు 

*గూండా* గా మారి రుబాబు చేయు!


*ఆరంభము* న *0*! *అంత* మందున *0*!

*జననం* లో *0*! 

*మరణం* లో *0*!

*శూన్యం* లో *0*! *అనంతము* లో *0*!


*ఇందూ*, *అందూ* 

అను సందేహమేల!

*అండ*, *పిండ*, *బ్రహ్మాండము* లలో *0*!   


*సత్యం*, 

*శివం*, 

*సుందరం* 

అన్నింటిలోనూ అది అలరారుతోంది!


*0* తోటే ఉంది 

*అందం*! *ఆనందం*!

*జీవితం* లో చివరకి మిగిలేది *0* !


*గోవిందా*! *ముకుందా*! *శంభో*! *శంకరా*!

*సున్నాలు* గలవే ఈ భగవన్నామాలు అన్నీ! 

*ఏడుకొండల* వాడా! *వెంకట* రమణా!

నీకు నామాలతో పాటు అందు *సున్నాలు* లేవా!


తిరుపతిలో ఎక్కు ప్రతి *కొండ* లోనూ *0*!

తిరిగి దిగి వచ్చు ప్రతి *గుండు* లోనూ *0*!


ఇంత మహిమ గల *0* - 

మరి *గుడి* లోను లేదని, *బడి* లోను లేదని 

దిగులెందుకన్నా!


*గుడి* లోన జేరి *గుండి* గా,

*బడి* లోన జేరి *బండి* గా మారడం దాని *అభిమతం* కానే కాదన్నా! 

 

కనుక గుడి *గంట* లో చేరి, బడి *గంట* లోనూ చేరి 

మోత మోగిస్తోందన్నా! 

ఆ మోత *నాదం* లోనూ *0*!


*కాలం* తోటే అది పరుగులిడుతోంది!

ప్రతి *గంట*, 

ప్రతి *దినం*, 

ప్రతి *వారం*,

ప్రతి *పక్షం*,  

ప్రతి *మాసం*, 

ప్రతి *సంవత్సరం*,

అన్నిటా ఉండి *కాలచక్రo* ను అది తిప్పుతోంది!


*వారం*, *వర్జ్యం* అంటూ, *గ్రహం* - *గ్రహణం* అంటూ

*పంచాంగం* అంతా *సున్నా* ల మయమే!


*దేహం* తోటే అది అంటిపెట్టుకుని ఉండె!

*కంటి* లోనూ *0*!  

*పంటి* లోనూ *0*!

*కంఠం* లో *0*! 

*కండరం* లో *0*!

*చర్మం* లో *0*!  

*రక్తం* లో *0*!

 

*దాహం* లో *0*! 

*మోహం* లో *0*!

*రాగం* లో *0*! *అనురాగం* లో *0*! 

*సరసం* లో *0*!  

*విరసం* లో *0*!

*కామం* లో *0*!  

*క్రోధం* లో *0*! 

*నరనరం* లో అది *జీర్ణించుకు* ని పోయె!


*రోగం* లో *0* ! దానికి చేసే *వైద్యం* లో *0*!

*అంగాంగము* న *0* అంటిపెట్టుకుని ఉండ

*దేహం* తోటే అది దహనమగుననిపించె! 

తీరా చితా *భస్మం* చూడ అందు కూడ కనిపించె!

మన గతులనే మార్చివేసి అదిi *గంతు* లేస్తోంది! 


*"జైహో సున్నా*

*జయ జయహోసున్నా" ౦*


సేకరణ

కాలాయ నమః*

 *కాలాయ నమః*




కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మానవులకు ప్రాప్తించిన వియోగ విలాపాలు, వినోద విలాసాలు, సిరి సంపదలు, ఉత్తాన పతనాలు ఇవన్నీ స్వయం కృత్యాలు అందామా ప్రారబ్ధ కర్మలా, అన్నిటికి మించి కాల మహిమ కావచ్చునా. ప్రధానంగా ఈ కలియుగంలో దుష్కర్మలకు, సత్కర్మలకు ఫలితాలు ఇక్కడే అనుభవించాలని గూడ పెద్దలంటూ ఉంటారు. మనకు తెలిసిన సత్యం *కాల నియమానికి ఎవరు అతీతులు కారు గాక కారు*. 


విశ్వంలోని ప్రతి జీవి కాలాధీనమై ప్రవర్తించాల్సిందే. కాలం పరమేశ్వర స్వరూపం. దాని ప్రభావం తప్పుకోలేనిది. అయినా *సేవా ధర్మములచే కాల ప్రభావాల "తీవ్రత" నుండి కొంత శాంతి/ఉపశమనము పొందవచ్చును*. మానవుడు కాలాన్ని ఎలా వినియోగించు

కుంటాడన్నది చాలా ముఖ్యము, అవసరము కూడా. వినియోగించుకోని క్షణము తిరిగిరాదు. కాలాన్ని వృధాచేయడమంటే మానవుడు అన్నివిధాలా నష్ట పోయినట్లే. భవిష్యత్తులో ఏదో జరుగుతుందని, ఏదో రాబోతుందనే ఆశాభావంతో ప్రస్తుత క్షణాలను చేజార్చుకోవడం తగదు. మంచి క్షణం కోసం ఎదురుచూసే దానికంటే, *ఉన్న క్షణాన్నే మంచిగా మలచుకోవడం విజ్ఞుల లక్షణం* మానవ జీవితం సహజంగానే సుఖ దుఃఖాల మయం.



సృష్టి క్రమంలో *మనం* భగవంతుడి స్వరూపాలుగా

 (భగవాన్ మానుష రూపేణ) మానవ లోకంలో జన్మించి, కర్మానుసారం *సరళ* జీవనము సాగిస్తూ ఉండాలి. దేవుడికి అందరు సమానులే. మనుష్యులే వారి వారి తెలివితేటల ప్రకారం, రక రకాల ప్రవర్తనల తోటి సంఘ జీవనం గడుపుతూ ఉంటారు. ఇట్టి మానవ జీవితంలో

 *అసూయలు, అహంకారాలు, వైషమ్యాలు, మనస్పర్థలు ఎందుకు*.  

కొన్ని మానవ స్వభావాలు గమనిద్దాము.

1) *అహంకారం*

అన్నీ తెలుసు, అన్నీ ఉన్నాయన్న అహంకారం వద్దు. ఎందుకంటే రాత్రంతా విరిసిన పూవుకే తెలియదు, తెల్లవారితే దాని పయనం గుడికో, స్మశానికో లేదా పాదచారుల కాలికిందికో. ఎవరికి ఏమి అపచారము, ఇబ్బంది కలిగించని పూవు భవిష్యత్తే అలా ఏమి చెప్పలేకుండా ఉంటే...అహంకార పూరిత మనుషుల జీవితం ఎంత నరకంగా ఉంటుంది. 

2) *స్వార్థపరత్వం*

*భూమి నాది నాది* యని విర్రవీగిన వారిని చూసి భూమి ఫక్కున నవ్వుతుందట. నువ్వే శాశ్వతం కాదు, ఈ భూమి నీకెలా శాశ్వతం అని. *దాన హీనుని చూసి ధనము నవ్వునట* వేమన వచనాలు. దానము చేయని వారి ధనము పరుల పాలగుట తథ్యము.

3) *నిందా వాక్యములు*

ఎప్పుడు ఇతరులపై నిందలు వేయ స్వభావం గలవారి గురించి పెద్దలు చెప్పిన హితోక్తులు.

 *నహి నిందా, ప్రశస్తా వాక్యం* ఇతరుల గురించి నిందల చెప్పడం మాని, మంచి విషయాలు ఏవైనా ఉంటే చెప్పడం చేయాలి. 

4) *ఓర్పు*

  *నిందా వాక్యములను గూడా నీరాజనాలుగా భావించే* మనస్తత్వం గొప్పది. కాని, ఎంతవరకు సాధ్యము. 

5) *విలువ* 

విలువ అనేది అవతలి వారికి ఇచ్చినప్పుడే మనకు పుచ్చుకునే అర్హత వస్తుంది.


*మరువరాని* విషయము గూడా ఒకటున్నది. *కాలో దురతి క్రమణీయః* కాల ప్రభావాన బుద్ధులు పెడదారిన పడతాయి. *వినాశ కాలే విపరీత బుద్ధిః* 


*మిత్రస్య చక్షుసా సమీక్షా మహే:* మానవుల మధ్య సంబంధాలన్నీ స్నేహ భావంతో ఉండాలని వేదం అనేక సందర్భాలలో, అనేక సార్లు ఆకాంక్షను వెలిబుచ్చినది. మేలైన విషయాలను వినాలి, మంచి ఘటనలే చూడాలి అని వైదిక స్వస్తి మంత్రాలు తెలియజేస్తున్నాయి. *అన్ని మంగళాలే సంభవించాలని వేదాశీస్సులు* దీవిస్తున్నాయి.


ధన్యవాదములు

🙏🙏🙏

సమస్యకు

 *కన్ననుc గాంచకున్నను వికారము నొందుట చిత్తనైజమే*

ఈ సమస్యకు నా పూరణ. 


ఉ. ఎన్ని దినంబులున్ గడిచె నెన్నడు గల్గునొ నీ యనుగ్రహం


బెన్నడొ కన్నులార నిను నీప్సను తీరగ చూచు భాగ్యమో


మన్నన చూపుమన్న విని మాకును దర్శన మీయకున్న వెం


కన్ననుc గాంచకున్నను వికారము నొందుట చిత్తనైజమే.


అల్వాల లక్ష్మణ మూర్తి

 *ఎలుకకు బుట్టె నేనుcగు జనించెను జింకకు వ్యాఘ్ర మక్కటా*

ఈ సమస్యకు నా పూరణ.


ధర్మరాజుతో వార్తాహరుడు. 


చం. కలకలమున్ జనించె నృప! కందకమున్ గనుపట్టె వింతలున్


తలపయి కొమ్ములున్ మొలిచి తాండవ మాడెను సర్పమొక్కటిన్


ఎలుకకు బుట్టె నేనుcగు జనించెను జింకకు వ్యాఘ్ర మక్కటా!


పలికెను నక్క నాశమని వాకిలిలో - కలికాల మయ్యెనే.



అల్వాల లక్ష్మణ మూర్తి

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: తొమ్మిదవఅధ్యాయం

అక్షరపరబ్రహ్మయోగం:శ్రీ భగవానువాచ:


న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ 

ఉదాసీనవదాసీనమసక్తం తేషు కర్మసు (9)


మయా௨ధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరమ్ 

హేతునా௨నేన కౌంతేయ జగద్విపరివర్తతే (10)


కౌంతేయా.. వాటిపై ఆసక్తిలేని తటస్థుణ్ణి కావడం వల్ల ఈ కర్మలు నన్ను బంధించలేవు. ప్రకృతి నా పర్యవేక్షణలో ఈ చరాచర జగత్తును సృష్టిస్తున్నది. అందువల్లనే అవిచ్ఛిన్నంగా జగన్నాటకం జరుగుతున్నది.

శ్రీ కాలా రామ్ ఆలయం

 🕉 మన గుడి : నెం 1169


⚜ మహారాష్ట్ర : నాసిక్


⚜  శ్రీ కాలా రామ్ ఆలయం



💠 ఈ పురాతన ఆలయం సీతాదేవి, లక్ష్మణుడు మరియు హనుమంతుడితో పాటు ఉన్న శ్రీరాముడికి అంకితం చేయబడింది. 


💠 రాముడి విగ్రహం నల్ల రంగులో ఉండటం వల్ల రాముడిని కాలరాముడు అని పిలుస్తారు. 

ఈ ఆలయాన్ని పద్దెనిమిదవ శతాబ్దంలో సర్దార్ రంగారావు ఓధేకర్ నిర్మించారు, అతను గోదావరి నది నుండి దేవతలను కనుగొన్నాడు. 


💠 గోదావరి నదిలో దేవతల స్థానాన్ని చూపించే కలలో ఓధేకర్ చూశాడని, ఆ తరువాత ఆయన వాటిని కనుగొన్నాడని చెబుతారు. 

రాముడు తన వనవాస కాలంలో కొంతకాలం నివసించిన ప్రదేశం ఈ ఆలయ స్థలం.


💠 ఆలయ ప్రవేశ ద్వారం వద్ద హనుమంతుడి నల్లని విగ్రహం కాపలాగా ఉంది. 

ఆలయ సముదాయంలో దత్తాత్రేయుడి దివ్య పాదముద్రలు ఒక రాయిపై గుర్తించబడ్డాయి.



💠 తెలియని దేవతకు అంకితం చేయబడిన అసలు ఆలయం చాలా పాతది, ఇది 7 నుండి 11వ శతాబ్దాల వరకు రాష్ట్రకూట కాలం నాటిదని అంచనా. 

అయితే, 2000 సంవత్సరాలకు పైగా పురాతనమైన రామ విగ్రహం యొక్క పురాతనత్వాన్ని ధృవీకరించలేదు.


💠 ఒక కథ ప్రకారం, ప్రారంభ టర్కిష్ దండయాత్రల సమయంలో, దేవత విగ్రహాన్ని కాపాడటానికి ఆలయ బ్రాహ్మణులు గోదావరి నదిలో విసిరేశారు. 

సర్దార్ రంగారావు ఓధేకర్ అనే వ్యక్తి 1700ల చుట్టూ పునర్నిర్మించబడిన కొత్త ఆలయానికి నిధులు సమకూర్చాడు. 


💠 నల్ల రంగులో ఉన్న రాముడి విగ్రహం గోదావరి నదిలో ఉందని ఒకసారి ఓధేకర్ కలగన్నాడని చెబుతారు . 

విగ్రహాన్ని పునరుద్ధరించడానికి అతను యాత్ర నిర్వహించి అద్భుతంగా దానిని పొందాడు. 


💠 ఓధేకర్ నది నుండి విగ్రహాన్ని తీసుకొని, కలలో దేవుడు ఇచ్చిన సూచనల ప్రకారం విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించడానికి ఒక సాధువును అభ్యర్థించాడు. 

ఆ తర్వాత ఓధేకర్ ఆలయాన్ని నిర్మించాడు. ఓధేకర్ యాత్ర నాసిక్ చరిత్రలో ఒక ముఖ్యమైన భాగం. ఆలయంలో సర్దార్ ఒధేకర్ విగ్రహం ఉంది.


💠 రామాయణంలోని పురాతన ఇతిహాసం ప్రకారం , రాముడిని పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి పంపారు. పదవ సంవత్సరం వనవాసం తర్వాత, రాముడు లక్ష్మణుడు మరియు సీతతో కలిసి నాసిక్ సమీపంలోని గోదావరి ఉత్తర ఒడ్డున రెండున్నర సంవత్సరాలు నివసించాడు . 

ఈ ప్రదేశం పంచవటి అని పిలువబడుతుంది .


💠 బి.ఆర్. అంబేద్కర్ నిర్వహించిన సత్యాగ్రహం వల్ల ఏర్పడిన సంఘర్షణ మధ్యలో ఈ ఆలయం వచ్చింది . ఇప్పుడు దీనిని కాలారాం మందిర్ సత్యాగ్రహం అని పిలుస్తారు . ఆలయంలోకి ప్రవేశించడానికి అంబేద్కర్ మార్చి 2, 1930న ఈ ఆలయం వెలుపల పెద్ద నిరసనను నిర్వహించారు. చాలా మంది దళిత నిరసనకారులు ట్రక్కుల ద్వారా పట్టణానికి చేరుకుని, ఆలయాన్ని చుట్టుముట్టి, దాని చుట్టూ కూర్చున్నారు. వారు పాటలు పాడారు, తరచుగా యుద్ధ నినాదాలు చేశారు, ఆలయంలోకి ప్రవేశించాలని డిమాండ్ చేశారు. 

నాసిక్ ప్రజలు నిరసనకారులను బహిష్కరించారు.


💠 ప్రధాన ద్వారం వద్ద నల్లని హనుమంతుడి విగ్రహం ఉంది . దత్తాత్రేయుడి పాదముద్రలు ఒక రాయిపై గుర్తించబడిన చాలా పాత చెట్టు కూడా ఉంది .


💠 యాత్రికులు కాలారామ్ ఆలయానికి సమీపంలో ఉన్న కపాలేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని సందర్శిస్తారు.


💠 హనుమంతుడి విగ్రహం నుండి రాముడి విగ్రహం కనిపించే విధంగా హనుమంతుడి ఆలయం రూపొందించబడింది.


💠 రాముడి ప్రధాన ఆలయంలో 14 మెట్లు ఉన్నాయి, ఇది రాముడి వనవాసం యొక్క 14 సంవత్సరాలను సూచిస్తుంది.


💠 అలాగే, ఈ ఆలయంలో 84 స్తంభాలు ఉన్నాయి, ఇవి మానవ జన్మ పొందడానికి ఒకరు వెళ్ళాల్సిన 84 లక్షల జాతుల చక్రాన్ని సూచిస్తాయి.



 రచన

©️ Santosh Kumar

18-43-గీతా మకరందము

 18-43-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అIl క్షత్రియుల కర్మలను వివరించుచున్నారు–


శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం 

యుద్ధే చాప్యపలాయనమ్ | 

దానమీశ్వరభావశ్చ 

క్షాత్రం కర్మ స్వభావజమ్ ||


తా:- శూరత్వము, తేజస్సు (కీర్తి, ప్రతాపము), ధైర్యము, సామర్థ్యము, యుద్ధము నందు పాఱిపోకుండుట, దానము, (ధర్మపూర్వక) ప్రజాపరిపాలనాశక్తి (శాసకత్వము) - ఇయ్యవి స్వభావమువలన పుట్టిన క్షత్రియకర్మయైయున్నది.


వ్యాఖ్య: - "యుద్ధేచాప్యపలాయనమ్” యుద్ధమునందు పాఱిపోవుట క్షత్రియుని ధర్మముకాదనియు తెలుపబడినది. అయితే బాహ్యయుద్ధ మెపుడో యొకపుడు సంభవించును. కాని అంతర్యుద్ధము మోక్షపర్యంతము సర్వజీవులయందును జరుగుచునే యుండును. మంచికి చెడ్డకు, ధర్మమునకు అధర్మమునకు, దైవసంపదకు అసురసంపదకు సంగ్రామము హృదయమున నిరంతరము సాగుచునే యుండును. బలవత్తరమగు మాయతో జరుగు అట్టి యుద్ధమున ప్రతిమనుజుడు ఇట్టి క్షాత్రమునే ప్రదర్శించ వలసియుండును. అనగా మాయ (ప్రకృతి)తో జరుగుయుద్ధమున వెన్నుచూపరాదు. ముందు వేసిన అడుగును వెనుకకు త్రిప్పరాదు. బాహ్యయుద్ధమున క్షత్రియులు చూపు, ధైర్య, పరాక్రమములకంటె అధికతరములగు ధైర్యసాహసములను మనుజుడు తన అంతర్యుద్ధమున జూపవలసియుండును. అపుడే విజయము కరతలామలకమై జీవుడు మోక్షసామ్రాజ్యాభిషిక్తుడు కాగల్గును. కావున బ్రహ్మతేజము, క్షాత్రవీర్యము - అను నీ రెండిటిని జీవుడు సంపాదించవలసియున్నది. మఱియు లక్ష్యమగు ఆత్మసాక్షాత్కారము, జీవన్ముక్తి పొందువఱకు మనుజుడు వెనుకకు మఱలరాదు. ఇవ్విధమున “యుద్ధేచాప్య పలాయనమ్' అను ఈ క్షత్రియ ధర్మసూత్రమును ప్రతివాడును తన అంతర్యుద్ధమున అవలంబించి కృతార్థుడు కావలయును.


ప్ర:- క్షత్రియుని స్వభావజనిత కర్మలెవ్వి?

ఉ:- (1) శూరత్వము (2) తేజస్సు (కీర్తి, ప్రతాపము) (3) ధైర్యము (4) సామర్థ్యము (5) యుద్ధమునందు వెనుకకు మఱలకుండుట (6) దానము (7) ప్రజాపరిపాలనాశక్తి (శాసకత్వము) ఇవి క్షత్రియుని కర్మములు.

తిరుమల సర్వస్వం -297*

 *తిరుమల సర్వస్వం -297*

చరిత్రపుటల్లో శ్రీనివాసుడు-12


బ్రూస్ కోడ్ లేదా బ్రూస్ నిబంధనావళి 

ఆలయం ఆర్కాటు నవాబుల నుండి సంపూర్ణంగా ఈస్టిండియా కంపెనీ ఆధిపత్యం లోనికి వచ్చిన తరువాత, ఆలయ ఆదాయవ్యయాలను క్రమబద్ధీకరించి నికరాదాయాన్ని పెంపొందించు కోవడం కొసం 1821 వ సం‌ లో బ్రూస్ అనే ఉన్నతాధికారి నేతృత్వంలో రూపొందించిన ఆలయ పరిపాలనా నియమాల సంకలనం బ్రూస్ నిబంధనావళి గా పేరొందింది. 42 నియమాలు కలిగిన ఈ నిబంధనావళి 1843 వ సం‌. లో ఆలయం మహంతుల అధీనం లోకి వచ్చేంత వరకూ కొనసాగింది. దీని ననుసరించి -


ఆలయం మరియు ఆలయంలో వివిధ బాధ్యతలు నిర్వర్తించే నిమిత్తం నియమించబడిన, అనువంశిక సిబ్బంది మొత్తం - చిత్తూరు కేంద్రంగా గలిగిన నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ అధీనంలో ఉండేవారు. ఆలయ, క్షేత్ర రోజువారీ నిర్వహణను పర్యవేక్షించే బాధ్యత - తిరుపతి కేంద్రంగా కలిగిన తహసీల్దార్ వహించేవారు. విధి నిర్వహణ నిమిత్తం కలెక్టర్ మరియు తహసీల్దార్ తరచుగా తిరుమలను సందర్శించి, స్వామివారి ఆభరణాలను తణిఖీ చేయాలి. వారు వివిధ వనరుల ద్వారా వచ్చే ఆలయ ఆదాయం పెంపొందించడం పై ఎనలేని శ్రద్ధ వహించేవారు‌. అధికమొత్తంలో కానుకలు సమర్పించుకునే ధనిక భక్తులకు దర్శనాల విషయంలో ప్రాధాన్యత ఉండేది. వారు సమర్పించుకున్న కానుకలను బట్టి వారికి తలపాగా, పట్టు అంగీ, శాలువా వంటి వస్తువులను శ్రీవారి ప్రసాదంగా బహూకరించేవారు. గంటలకొద్దీ క్యూలో వేచివుండే సాధారణ భక్తులను తడవకు యాభై మంది చొప్పున దర్శనార్థం అనుమతించేవారు. . బ్రహ్మోత్సవాల సమయంలో పూలంగి సేవకు రూ. 1, అద్దాల మంటపం సేవకు రూ. 0.50, పులికాపు సేవకు రూ. 2 చొప్పున రుసుము వసూలు చేసేవారు. శ్రీవైష్ణవ చిహ్నాలైన పంచాయుధాలను ఆసక్తి కలిగిన భక్తుల భుజాలపై ముద్రించడానికి సైతం నిర్ణీత రుసుము వసూలు చేయబడేది. 


రొజువారీ ఆదాయం లెక్కలను పర్యవేక్షించడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండేవి. ఏరోజు ఆదాయాన్ని ఆరోజు లేదా మరుసటి రోజు అణాపైసలతో సహా లెక్కించి, ఆలయ పారుపత్యదారు దినవారీ నివేదిక తయారు చేసేవారు. జియ్యంగారు గుమాస్తాచే ధృవీకరించ బడిన తరువాత, ఆ నివేదిక దిగువ తిరుపతిలో ఉండే తహసీల్దార్ కు, అక్కడి నుండి చిత్తూరులో ఉన్న కలెక్టరుకు చేరుకునేది. నివేదికతో బాటుగా, రొక్ఖం మరియు వస్తురూపాలలొ ఉన్న నికరాదాయం కూడా కలెక్టరు కార్యాలయం ద్వారా సర్కారువారి ఖజానాకు సాధారణ సమయాల్లో నెలకొకసారి, బ్రహ్మోత్సవాల్లో ప్రతిదినం చేరుకునేది. 


అన్ని దారుల గుండా ఆలయానికి వస్తున్న భక్తుల రక్షణ బాధ్యత సంబంధిత పాలెగార్లు వహించే వారు. అయితే - ఆలయ ప్రాంగణంలో శాంతిభద్రతల పరిరక్షణ, ఆలయం లోనికి అన్యమతస్తులు ప్రవేశించకుండా చూడటం తహసీల్దార్ మరియు మేజిస్ట్రేట్ ల సంయుక్త బాధ్యత. దిట్టం పుస్తకంలో పొందుపరిచిన విధి విధానాల ననుసరించి ప్రసాదాలు తయారు చేయడాన్ని పారుపత్యదారు, తహసీల్దార్ సమిష్టిగా పర్యవేక్షించే వారు. 


ఆగమకైంకర్యాలు నిర్వర్తించే అర్చకులు, ఇతర అనువంశిక కైంకర్యపరులు కాకుండా - ఆదాయ వ్యయాల లెక్కలు చూస్తూ తహసీల్దార్ కు జవాబుదారీగా ఉండే శెరిస్తేదార్, నలుగురైదుగురు కానుకలు లెక్కించే గుమాస్తాలు, నివేదికలు తయారు చేసే గణకులు, ధాన్యం కొలిచే సేవకులు, చందనం దుంగల్ని మోసే పరిచారకులు, అల్లిన పూలదండల్ని తీసుకు వచ్చే వాహకులు, కస్తూరి లేపనం తీసేవారు, వంటచెరకు తెచ్చేవారు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి తెచ్చే గొల్లవారు, ఆలయ ప్రాంగణం శుభ్రపరిచే కార్మికులు, దీపాలు, దివిటీలు వెలిగించే పనివారు, రక్షణ సిబ్బంది మొదలగు వారు ఆలయంలో పనిచేసేవారు. 


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*శల్య పర్వము ద్వితీయాశ్వాసము*


*434 వ రోజు*


*అశ్వత్థామ సుయోధనుడిని చూసి విలపించుట*


అంతలో చుట్టు జనపదములలో ఉన్న వారు, ముని కుమారులు సుయోధనుడిని చూడ వచ్చారు. వారితో పాటు అక్కడికి వచ్చిన కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ సుయోధనుడి దురవస్థ చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. అశ్వత్థామ సుయోధనుడి చూసి " రారాజా ! అనేక రాజన్యులు నీచుట్టూ చేరి ప్రశంసింస్తుంటారే ఇప్పుడిలా ఒంటరిగా పడి ఉన్నావా ! కురుసామ్రాజ్య సింహాసాధిష్టుడవైన నువ్విలా కటిక నేల మీద పడి ఉండమని ఆ విధాత నీ నొసటన వ్రాసాడా ! నీ బల సౌర్యములు ఏమయ్యాయి, అహర్నిశం పట్టు ఆ పట్టు ఛత్రములు ఎక్కడ, నీ సైన్యాధిపతు లేమయ్యారు రారాజా ! ఈ నాడిలా ఒంటరిగా దుమ్ము కొట్టుకుని కటిక నేలను పడి ఉన్నావు. పన్నీటి జలకాలు ఆడవా రారాజా ! భీష్మ, ద్రోణ, కర్ణులు నీ పక్కన ఆశీనులై ఉండగా దుశ్శాసన, వికర్ణుల సేవలందుకుంటూ పరివేష్టితుడవై అష్టశ్వైర్యములు అనుభవించిన నిన్ను రాజులంతా మరచినారా ! ఒక్కరూ రారేమి ! నీ విషయంలో లక్ష్మీ ఇంత చంచలమైందా ! విధి నీ పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించిందేమి నేనేమి చెయ్యను " అని విలపించాడు.


*సుయోధనుడు అశ్వత్థామను చూసి విలపించుట*


అశ్వత్థామను చూసి సుయోధనుడు " గురుపుత్రా ! నీవెరుగనిది ఏమున్నది. మనుజుల విధి విధానములు నీకు తెలియనివి కాదు కదా ! ఆ బ్రహ్మ దృష్టిలో ఆ సుఖదుఃఖాలు వస్తుంటాయి పోతుంటాయి. మనం అన్నిటినీ సమంగా చూడాలి. సుఖదుఃఖాలు వస్తుంటాయి పోతుంటాయి. నా బంధుమిత్రులు మహా వీరులు యుద్ధంలో మరణించిన తరువాత నేను ఒక్కడినే జీవించు ఉండటం ధర్మమా ! నా బాహు బలము, వీర్యము, ధైర్యము సడలి పోగా శత్రువులు నన్ను పడగొట్టి నాకు సద్గతి కలిగించారు. మీరు ముగ్గురూ వారికంట పడక నా కంట పడటం నాకు ఆనందం కలిగిస్తుంది. " అని పాడవులు అక్కడికి వచ్చిన తరువాత జరిగిన విషయములు సవిస్తరంగా వారికి వివరించాడు. అది విని అశ్వత్థామ కోపంతో ఊగి పోయాడు.

*అశ్వత్థామ సైన్యాధ్యక్షునిగా అభిషిక్తుడగుట*

అశ్వత్థామ కోపంతో " రారాజా ! నా తండ్రిని అర్జునుడు అధర్మంగా చంపినప్పుడే నా గుండెలు మండి పోయాయి. ఇప్పుడు నిన్ను అక్రమంగా పడతోసారు. ఆ పాడవులను నా అస్త్రములతో దగ్ధం చేయకున్న నేను బ్రతికీ వ్యర్ధమే ! రారాజా ! సుయోధన సార్వభౌమా ! నేను సత్యం పలుకుతున్నాను. పాండవులను, పాంచాలురను వారి బంధుమిత్రులను కృష్ణుడు చూస్తుండగా నేను వధిస్తాను. ఇదే నాప్రతిజ్ఞ నన్ను ఆజ్ఞాపించండి " అని సుయోధనుడి ముందు మోకరిల్లాడు. సుయోధనుని మనసు ఆహ్లాదంతో నిండి పోయింది. " కృపాచార్యా ! వెంటనే పుణ్యజలాలు తెప్పించండి అన్నాడు. వారిని చూడటానికి వచ్చిన ముని కుమారులను అడిగి పుణ్య జలాలను తెప్పించాడు కృతవర్మ. అప్పుడు సుయోధనుడు కృపాచార్యుని చూసి " కృపాచార్యా ! అశ్వత్థామను సైన్యాధ్యక్షిడిగా అభిషేకించండి. అశ్వత్థామ పుట్టుకతో బ్రాహ్మణుడైనా రారాజు కోరిక మీద యుద్ధం చేయుట పరమధర్మం " అన్నాడు. కృపాచార్యుడు పుణ్యాహవాచన మంత్రములు చదివి అశ్వత్థామను కౌరవసేనకు అధ్యక్షునిగా అభిషేకించాడు. తనకు లభించిన గౌరవానికి అశ్వథ్థామ పొంగి పోతూ రారాజును గుండెలకు హత్తుకొని పైకి లేచి సింహ నాదం చేసి " రారాజా ! పాండవులను సమూలంగా నాశనం చేసి నీ దర్శనం చేసుకుంటాను " అన్నాడు. కృతవర్మ, కృపాచార్యుడు వెంటరాగా పాండవశిబిరాల వంకకు వెళ్ళాడు " అని సంజయుడు దృతరాష్ట్రునికి వివరించాడని వైశంపాయనుడు జనమే జయునికి చెప్పాడు.

*శల్య పర్వము ద్వితీయాశ్వాసము సమాప్తం*

*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శుక్రవారం🌹*_ *🪷11 జూలై 2025🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     _*🌹శుక్రవారం🌹*_ 

  *🪷11 జూలై 2025🪷*     

    *దృగ్గణిత పంచాంగం*                  


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*ఆషాఢమాసం - కృష్ణపక్షం*


*తిథి  : పాడ్యమి* రా 02.08 వరకు ఉపరి *విదియ* 

*వారం    : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం   : పూర్వాషాఢ* ఉ 05.56 వరకు ఉపరి *ఉత్తరాషాఢ*

*యోగం : వైధృతి* రా 08.45 వరకు ఉపరి *విష్కుంబ*

*కరణం   : బాలువ* మ 02.10 *కౌలువ* రా 02.08 ఉపరి *తైతుల*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.30 - 10.30 సా 05.30 - 06.30*

అమృత కాలం  : *రా 12.01 - 01.40*

అభిజిత్ కాలం  : *ప 11.47 - 12.39* 

*వర్జ్యం      : మ 02.09- 03.48*

*దుర్ముహూర్తం  : ఉ 08.18 - 09.10 మ 12.39 - 01.31*

*రాహు కాలం   : ఉ 10.35 - 12.13*

గుళికకాళం       : *ఉ 07.19 - 08.57*

యమగండం     : *మ 03.29 - 05.06*

సూర్యరాశి : *మిధునం*  

చంద్రరాశి : *ధనస్సు/మకరం*

సూర్యోదయం :*ఉ 05.49*

సూర్యాస్తమయం :*సా 06.55*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.42 - 08.18*

సంగవ కాలం         :      *08.18 - 10.55*

మధ్యాహ్న కాలం    :     *10.55 - 01.31*

అపరాహ్న కాలం    : మ *01.31 - 04.08*

*ఆబ్ధికం తిధి         : ఆషాఢ బహుళ పాడ్యమి*

సాయంకాలం        :*సా 04.08 - 06.44*

ప్రదోష కాలం         :  *సా 06.44 - 08.56*

రాత్రి కాలం           :*రా 08.56 - 11.51*

నిశీధి కాలం          :*రా 11.51 - 12.35*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.14 - 04.58*

------------------------------------------------

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷*


*సనత్కుమార*  

*భగవన్సర్వజ్ఞోఽసి విశేషతః*

*ఆస్తిక్యసిద్ధయే నౄణాం* *క్షిప్రధర్మార్థసాధనమ్*


*🪷ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః🪷*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో|| *బ్రహ్మ ముఖాబ్జే వాగ్వనితా వక్షసి విష్ణోః శ్రీర్లలితా*

         *శంభు శరీరే భాగమితా విశ్వ శరీరే వ్యోమ్ని తతా!!*


తా|| *బ్రహ్మముఖాన సరస్వతిగా, విష్ణు వక్షస్థలమున శ్రీలక్ష్మిగా, శంభుని దేహాన అర్ధ్భాగంగా, విశ్వ శరీరునిలో ఆకాశ రూపంలో ఉన్నది పరాశక్తి.*


 ✍️VKS ©️ MSV🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - ఆషాడ మాసం - కృష్ణ పక్షం -‌ ప్రతిపత్ - పూర్వాషాఢ / ఉత్తరాషాఢ-‌‌ భృగు వాసరే* (11.07.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

కాశీ యాత్ర Kaasi Yaatra

 దక్షిణభారతదేశం నుంచి కాశీ యాత్ర చేయదలచినవారు ఎవరైనా ముందుగా రామేశ్వరం చేరుకోవాలి. రామేశ్వరానికి ఇరవై ఎనిమిది కిలో మీటర్ల దూరంలో ఉన్న ధనుష్కొడి కి వెళ్ళాలి. అక్కడ సముద్రస్నానం చేసి కాశీ యాత్రకు సంకల్పం చెప్పుకోవాలి. ఆ సమయంలో ఆసముద్రపు ఇసుకతో నాలుగు శివలింగాలను చేయాలి. సేతు మాధవ, వేణీమాధవ, బిందుమాధవ, రామనాథస్వాములని ఆ లింగములకు పేర్లు పెట్టాలి. వాటికి పూజ చెయ్యాలి. తరువాత వేణీమాధవ సైకతలింగాన్ని ప్రయాగలోని త్రివేణీసంగమం లో నిమజ్జనం చేయటానికి ఒక పెట్టెలో భద్రంగా ఉంచాలి. మిగిలిన మూడు లింగాలను సముద్రంలో కలిపివేయాలి. అక్కడినుంచి రామేశ్వరం చేరుకోవాలి. అక్కడ రామేశ్వరస్వామివారి గుడి ప్రాంగణంలో ఉన్న నూతుల నీళ్ళతో స్నానం చేసి అక్కడ ఉన్న నూతలలోని జలాలను ఒక పాత్రలో భద్రం చేసుకోవాలి.

అక్కడి నుంచి కాశీ యాత్రకు ప్రయాణం ప్రారంభించాలి. కాశీ యాత్ర అంటే ... ముందు ప్రయాగ ...అక్కడి నుంచి కాశీ ...అక్కడి నుంచి గయ వెళ్ళటమన్నమాట.ప్రయాగలో ... సంకల్పం, వేణీదానం, త్రివేణీ సంగమంలో తమతో ధనుష్కోడి నుంచి తెచ్చిన సైకతలింగాన్ని నిమజ్జనం చెయ్యటం, వేణీమాధవస్వామి దర్శనం చేసుకోవటం, అక్కడి గంగనీటిని సేకరించటం, హిరణ్యశ్రాద్ధం, పిండప్రదానం, తిలతర్పణం చెయ్యటం అనేవి ముఖ్య విధులు. అక్కడి నుంచి కాశీ చేరుకోవాలి.

కాశీలో మొదటి రోజు గణపతి పూజ, మహాసంకల్పం, తర్పణం, మణికర్ణిక ఘాట్ లో స్నానం, ఫలదానం, అన్నరూపహోమశ్రాద్ధం, పిండప్రదానం, తిలతర్పణం చెయ్యాలి. ఆ రోజు సాయంకాలం శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి, అన్నపూర్ణ, విశాలాక్షి అమ్మవార్ల దర్శనం చేసుకోవాలి. అక్కడ శ్రీకాశీవిశ్వనాథస్వామివారికి శ్రీరామేశ్వరం నుంచి తెచ్చిన సముద్రజలాలతో అభిషేకం చెయ్యాలి.

కాశీలో రెండవరోజు అసి ఘాట్, వరుణఘాట్, దశాశ్వమేధఘాట్, పంచగంగా ఘాట్, మణికర్ణికఘాట్ లలో పిండప్రదానం, తిలతర్పణం చెయ్యాలి. అక్కడి నుంచి బిందుమాధవదర్శనం చేసుకుని గంగా పూజ చెయ్యాలి. మూడవరోజు గయకు చేరుకోవాలి. గయలో మహాసంకల్పం, పల్గుణీ తీర్థస్నానం, హిరణ్యశ్రాద్ధం, పిండప్రదానం, విష్ణుపాద హిరణ్య శ్రాద్ధం, హోమసహిత అన్నశ్రాద్ధం, అక్షయవటం దగ్గర పిండప్రదానం, ఫలదానం చెయ్యాలి.

నాల్గవరోజున తిరిగి వారణాశికి (కాశీకి మరో పేరు వారణాశి) చేరుకుని అక్కడ గంగాతీరంలో దంపతీ ఫూజ చేసి అక్కడినుంచి కాలభైరవస్వామి ఆలయంలో భైరవదర్శనం చేసుకుని రక్షతాడు కట్టుకోవాలి. కాలభైరవ దర్శనంతో కాశీ దర్శనం పూర్తి అయ్యింది అన్న మాట. అక్కడి నుంచి తిరిగి రామేశ్వరానికి చేరుకుని శ్రీరామనాథస్వామిని ప్రయాగలో సేకరించిన గంగాజలాలతో అభిషేకించాలి. ఈ అభిషేకవిధితో కాశీయాత్ర పరిపూర్ణమౌతుంది. కాశీలో తొమ్మిది రోజులు బస చెయ్యాలి. ఇది కాశీ-రామేశ్వరయాత్ర చేసే విధానము.