19, మార్చి 2024, మంగళవారం

పరివర్తన

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*పరివర్తన..*


"అయ్యా..స్వామికి ఒక ఆవును ఇద్దామనుకుంటున్నాను..ఎప్పుడు తీసుకొని రమ్మంటావు.."? అని నిన్న ఆదివారం ఉదయం యానాది అని పిలువబడే అతను అడిగాడు.."వచ్చే వారం తీసుకొని రా.." అన్నాను..సరే అని వెళ్ళిపోయాడు..అతనిని చూస్తే..ఒకప్పుడు తీవ్రమైన మానసిక వ్యాధితో బాధపడ్డాడు ఇతను అనే ఆలోచనే రాదు..


2014 లో సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామం నుంచి ఆ యువకుడిని, అతని తల్లిదండ్రులు అతి కష్టమ్మీద శ్రీ స్వామివారి మందిరం వద్దకు తీసుకొని వచ్చారు..అతి కష్టమ్మీద అని ఎందుకు అన్నానంటే..ఆ యువకుడు ఒక పట్టాన ఓ ప్రక్క నిలవడం లేదు..చూపు ఎటో ఉంది..మనిషి ప్రవర్తన తేడాగా ఉంది..తనలో తానే మాట్లాడుకుంటూ..ఉన్నట్టుండి పరుగెట్టేవాడు..పట్టుకోవడం కూడా కష్టం..పోనీ చిన్నపిల్లవాడా అంటే కాదు..సుమారు ముప్పై సంవత్సరాల వయసు..పెళ్లి కూడా జరిగి నాలుగైదు సంవత్సరాల కాలం గడిచి పోయింది..


అతని పేరు కోడిపల్లి యానాది..వృత్తి గొర్రెల పెంపకం..చిన్నతనం నుంచీ తల్లిదండ్రులకు చేదోడు వాదోడు గా వుండేవాడు..కొద్దిగా బిడియస్తుడే గానీ..నెమ్మదస్తుడు..ఎటువంటి వివాదాల్లోకి వెళ్లే మనస్తత్వం కాదు..తన పనేమిటో..తానేమిటో..అన్నట్లుగా వుండేవాడు..వయసు వచ్చిన తరువాత తల్లిదండ్రులు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు..మూడేళ్ల పాటు సంసారం ఏ ఇబ్బందీ లేకుండా సాగిపోయింది..ఇద్దరు పిల్లలు కూడా కలిగారు..ఉన్నట్టుండి అతనికి ఏమైయిందో తెలీదు..ఒక్కసారిగా యానాది ప్రవర్తనే మారిపోయింది..మానసికంగా మనిషి కుంగిపోతున్నాడు..పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు..

భార్యా..తల్లిదండ్రులు..యానాది లో వచ్చిన మార్పు చూసి తల్లడిల్లిపోయారు..


అన్ని ప్రయత్నాలు చేసిన తరువాత..శ్రీ స్వామివారి మందిరం వద్దకు తీసుకొచ్చారు..శ్రీ స్వామివారి సమాధి చుట్టూ ప్రదక్షిణాలు చేయించారు..మొదటి రెండు మూడు రోజులూ తల్లీ తండ్రీ..భార్యా..ఇలా ఎవరో ఒకరు యానాది ని పట్టుకొని ప్రదక్షిణాలు చేయించే పరిస్థితి..కానీ నాలుగో రోజు గడిచేసరికి..తన పాటికి తానే శ్రీ స్వామివారి మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేయసాగాడు..తనలో తాను మాట్లాడుకోవడం తగ్గి పోయింది..మార్పు స్పష్టంగా కనబడ సాగింది..


అతనిని మేమూ చాలా కుతూహలంగా గమనించసాగాము..మాకూ కూడా యానాదిలో వస్తున్న మార్పు ఆశ్చర్యం కలిగించసాగింది.."అయ్యా..మా అబ్బాయి యానాదిని ఇక్కడికి తీసుకొచ్చి..ఆ స్వామి సమాధి చుట్టూ త్రిప్పుతుంటే..వాడిలో చాలా మార్పు కనబడుతోంది.. మేము మండలం రోజుల పాటు వాడిని ఇక్కడే ఉంచాలని అనుకుంటున్నాము..మా పాటికి మేము వంట చేసుకుంటాము..కాకుంటే మా సామాను పెట్టుకోవడానికి ఒక చిన్న గది ఇప్పించండి.."అన్నారు..సరే అని ఒక చిన్న గది కేటాయించాము..అందులో వుండసాగారు..


మరో వారం రోజులు గడిచాయి..యానాది ఒక క్రమ పద్దతి ప్రకారం ప్రదక్షిణాలు చేయడం..శ్రీ స్వామివారి దీపారాధన కోసం నూనె తీసుకొచ్చి అర్చకులకు ఇవ్వడం..ఇతర ఉపాలయాల్లో కూడా ప్రదక్షిణాలు చేసి రావడం..తల్లిదండ్రులతో అప్పుడప్పుడూ మాట్లాడటం..పిల్లలను దగ్గరకు తీసుకోవటం..చేయసాగాడు..మనిషి లో గుణాత్మక మార్పు వచ్చేసింది..చిత్రమేమిటంటే..శ్రీ స్వామివారి మందిరం లో ఉన్న అర్చకులకే కాదు..ఇతర సిబ్బంది కి.. అందరికీ...యానాది ప్రీతిపాత్రుడిగా మారడం..అట్లని అతనేమీ అతి చనువు తీసుకొని ప్రవర్తించడం లేదు..


మండలం రోజులు పూర్తయ్యేదాకా యానాది శ్రీ స్వామివారి మందిరం వద్దే వున్నాడు..యానాది మళ్లీ మామూలు మనిషిగా మారాడు..తనకు వచ్చిన ఇబ్బందిని తీర్చిన శ్రీ స్వామివారిని యానాది మర్చిపోలేదు..తన గ్రామానికి వెళ్లి తన వ్యాపకం తాను చేసుకుంటూ...తాను సంపాదించిన ప్రతి రూపాయ లో కొంత శాతం శ్రీ స్వామివారి వద్ద అన్నదానానికి కేటాయించసాగాడు..ఇప్పటికీ అదే పద్దతి కొనసాగిస్తున్నాడు..గొర్రెలు కాచుకుని జీవనం సాగించే యానాదికి అన్నదానమంటే అత్యంత ఇష్టం.."అన్నమొక్కటే కదయ్యా మనచేత "ఇక చాలు"..అని అనిపించేది.." అంటాడు నవ్వుతూ..తనకు ఏ కష్టం వచ్చినా..నేరుగా శ్రీ స్వామివారి సమాధి వద్దకు వచ్చి మ్రొక్కుకొని వెళుతూ ఉంటాడు..


అత్యంత మితంగా మాట్లాడే యానాది మనసంతా శ్రీ దత్తాత్రేయ స్వామివారే నిండి పోయి వున్నారు..అదే అతనికి శ్రీరామరక్ష..


సర్వం..

దత్తకృప.


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్:523 114..సెల్..94402 66380 & 99089 73699).

జంతు బలులు"

 *💥"జంతు బలులు"💥*

హింసనా? అహింసనా? 

ఈ యొక్క ఆచారాలు ఎలా వచ్చాయి. దీనికి ఆద్యుడు ఎవరు?

 దీని యొక్క పూర్వాపరాలు తెలుసుకుందాం.మిత్రులారా....!

అరుణాచలశివ 🌹


ప్రకృతిలో ని నియమం ధర్మం తప్పితే మనిషికి ఒక మాట,పశువుకు ఒక డెబ్బ,రాక్షస సంహారం;

చర్యకు ప్రతిచర్య-cause and effect-యద్భావంతద్భవతి ఇవే కర్మ సిధ్ధాంతానికి మూలాలు,తెలియక చేసిన తప్పు వలన తెలియకుండా అనుభవిస్తారు తెలిసి చేసిన తప్పు వలన తెలిసేలా,గుణపాఠంలా అనుభవిస్తారు;

మన ఆచారాలు దివ్యద్రష్టలైన ఋషులు తమ తపస్సు లో తాము తెలుసుకున్న అనుభవాలన్నింటినీ క్రోడీకరించి..

అర్ధం చేసుకుని ఆచరించి చెప్పిన అఖండ సత్య సూత్రాలే నేటి మన ఆచారాలు,

బుద్ధుడు,వర్ధమాన మహా వీరుడు ఖండించిన విషయాలు 

👉మొదటి ది జంతుబలులు ఖండించడం,

👉రెండోది ఖర్మకాండాలను, పిండ ప్రధానం,

 👉మూడోది గంగాస్నానం వల్ల పాపాలు(సంస్కారములు) పోవని.

 ➡️భారతీయ సాంప్రదాయం లో మన ఆచారాలలో రెండు ప్రధాన మార్గాలు 

1.దక్షిణాచారం(యోగాచారం సదాచారం,వైధికాచారం,దైవాచారం)

2.వామాచారం(రాక్షసాచారం, నిషేదితాచారం,

పంచ'మ'కార ఆచారం,క్షుధ్రాచారం) 

పై రెండు ఆచారాలలో వామాచారంలో మాత్రమే ఈ భలికి సంబంధించిన సమాచారం,వీటి ఆచారాలు వేద శాస్త్రాలకు భిన్నంగా వుంటు లక్ష్యం మాత్రం ఒక్కటే వుండేది,ఈ సాధనలో పతనానికి,మార్గబ్రష్టులవడాని,ప్రాణాలకు ముప్పు రావడానికి ఆస్కారం ఎక్కువ.వామాచారం మొట్ట మొదటిసారి ఆచరించింది రాక్షసులు,వారు నరభలులు,జీవ జాతుల భలులు భలిదేవతకి ఇచ్చి 

1.మాంసాహారాన్ని,

2.మధ్యపానాన్ని, 3.మైధునం(sex),

4.ముద్ర, 

5.మంత్రం 

పై వాటిని(పంచ'మ'కారాలు) వీరి సాధన అమవాస్య రోజు రాత్రి ఎందుకంటే మనస్సు పనిచేయదు కాబట్టి సాధన, జాగరణం అధ్బుతమైన ఫలితాలను ఇస్తుంది.కానీ ఈ సాధన చేయడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే,మనవులకు ఈ సాధనలు నిషేధించారు,వీటిలో మంత్రం,ముద్ర మాత్రమే తీసుకుని

శాఖాహారం తో సాధన చేయవచ్చును 

👉కృత,త్రేతా,ద్వాపర యుగాలలో పరమాత్మ రాక్షస సంహారం చేశాడు,రాక్షసభల్లులు(dino+asur)రాక్షసులు పూర్తిగా అంతరించి పోయాయి;

కలియుగంలో ఆ రాక్షసులకు "మహిష అసుర

(🐃దున్నపోతు🦬)"

అనే జన్మలు ఇచ్చి వాటిని భలి పశువుగా మానవులకు యోగుల ద్వారా కలియుగంలో భలిసాంప్రదాయ రూపంలో ఇచ్చారు,ఇక్కడ కర్మసిద్ధాంతం కూడా పనిచేస్తుంది. ఒక్కప్పుడు ఎవరైతే బలిచ్చారో వారే మరలా బలిపశువుగా మారి వారి వారి కర్మలను తీర్చుకుంటున్నారు,

➡️పార్వతీ దేవి భూలోకంలో గోమాతగా,వేపచెట్టుగా,తులసి ,గోరింట,నిమ్మ వృక్షం గా అవతరించింది.

ఈ అవతారాలు దుష్టశిక్షణ,చిత్తశుద్దికోసమే.ఇక భలి ఖచ్చితంగా ""⚡వేపచెట్టుకు""⚡మాత్రమే

ఇవ్వాలి,వేప చేదు రాక్షసుల గుణాలను లయం చేయగలదు ,భలిపశువుకు🦬🐃 నొప్పి తెలియకుండా కనురెప్ప పాటులో తల వేరుకావాలి. తల భలిదేవతకి వదిలేసి తలలోనే అహంకారం,కర్మలు, 

సంస్కారములు వుంటాయి కావున,

 మిగిలిన శరీరం శూద్రులు/అంటరానివారు(చెమట వచ్చే విధంగా పనిచేసే వారు కర్మేంద్రియాలను ఎక్కువగా వాడేవారు)దానంగా ఇచ్చేయాలి,ఇక్కడ భలి వలన హింసకు తావు లేదు.బలి పశువుకూడా మంచే జరుగుతుంది,

కానీ నాడు జంతుభలులు రాక్షస సంహారం కోసం మాత్రమే,మాంసాహారం కోసమో భలిదేవతకి ఆహారం కోసమో కాదు,కానీ నేటి జంతు భలులు కేవలం మాంసాహారం కోసం మాత్రమే అదికూడా హింసే,

 నేటి మాంసాహారంలో హలాల్ కూడా అంతా హింసే కదా,హింసించి కృూరంగా చంపుతున్నారు.అప్పుడు భలి అమావాస్య రోజు మాత్రమే ఇస్తే,ఇప్పుడు నిత్యం హింసనే,

నాడు శూద్రులు మాత్రమే మాంసాహారులు,

నేడు ప్రతి నిత్యం 800కోట్ల జనాభాలో 99%మాంసాహారులే(మాంసాహారులే అంటరానివారు)

 జంతు,పక్షి,హింసాహార విహారాలు,మానవులే రాక్షసులైవున్నారు మానవత్వం ఎక్కడుంది,అధర్మం అనగ హింసాత్మక ప్రకృతి విరుద్ధమైన జీవనవిధానం లో 

మనిషి రోగాలు,కష్టనష్టాలు,

కరోనావిజృంభన,ప్రకృతి వైపరీత్యాలు,ప్రళయాలు

ఎందుకుండవు,వినాశకాలేవిపరీతబుద్ది.నేను జంతు బలిని సమర్థిస్తున్నాను కాని పక్షుల భలులు కాదు

అంటే హింసాత్మక ఆహరాన్ని, మద్యపానాన్ని ప్రోస్తహించట్లేదు,కనీసం వాటికి హింస వుండదని(something better than nothing),గుడ్డి కన్నా మెల్లమేలు;

ఎర్రచీమ మాంసాహారి,నల్లచీమ శాఖాహారి మన శరీరంపై ఈ రెండుచీమలుప్రాకితే ఎర్రచీమను చంపేస్తాం.ఎందుకంటే అది హింసాజీవి,

జంతు భలులను ఖండించిన ప్రముఖులలో గౌతమ సిద్ధార్ధుడు(బుద్ధుడు) అగ్రగణ్యుడు,ఈయన చేసిన గణకార్యాలలో ఆనాపానసతి,విపస్సన,

పూర్తి శాఖాహారం

(బ్రాహ్మణజీవితం),

పంచశీలాలు;

అంతవరకూ బాగానేవుంది కాని మన భారతదేశ ఆచారాలు మూఢనమ్మకాలుగా చిత్రించి ఖండించడం బాగా ఆలోచించాల్సిన విషయం,ఖండిస్తే ఖండింపబడటం 

ప్రకృతి నియమం,అందుకే

సాక్షాత్తు ఆధి శంకరాచార్యులు బౌద్ధంను,జైన మతమును పూర్తిగా ఖండించాడు,

సమాజానికి మూఢనమ్మకాలు తీవ్రప్రమాదంకాదు 

కాని మూఢంగా ఖండించినవాడు సమాజానికి అత్యంత ప్రమాదకరం,

ఆ సమయంలో జంతుబలులు తగ్గడం వలన రాక్షసులు మానవరాజులుగా అవతరించి నేటి దుర్మార్గానికి పునాదులు వేశారు,

ఆ సమయంలో బుద్ధుడు

జంతువుభలులు ఖండించకుంటే,

నేడీ దుస్థితి లేకుండా వుండేది,

నిజానికి ఇప్పుడు(హింసాత్మకాహారం)మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించాల్చిన సమయం వచ్చింది,

👉సృష్టి సదా ఒకే విధంగా వుంది కానీ 

ఒక్కొక్కరికి ఒక్కోలాగ వున్నట్లు బ్రమ కలిగిస్తుంది,

అంతమాత్రాన

సృష్టిలో లోపం ఉందనుకుంటే ఖచ్చితంగా అది నీ పొరపాటే అవుతుంది,సాధన లో మనస్సు మాయలో పడుతుంది,బుద్ధి బ్రమకులోనవుతుంది,యదార్థానికి బదులుగా పెడార్తాలు,అపార్థాలు చోటుచేసుకునేఅవకాశం వుంది కావున

అలాంటి సందర్భంలో పూర్వాపరాలు పరిశీలించి వేదాలను ప్రమాణంగా తీసుకుని అనుగుణంగా వుంటే సరియైనది,విరుద్ధంగా వుంటే ఆ గురువు సాధన లో ఇంకా విద్యార్థి దశలోనే వున్నట్లు,ఆఖరికి కరోనా కూడా అందరినీ సమానంగా కలుపుకొనివెళ్ళింది,

దేవుడు/గురువు మాత్రము నా భక్తులు,నా శిష్యులు,నా సాధన అన్నాడంటే నిజమైన దేవుడు/గురువు ఎలా అవుతాడు,

➡️వేదాలు సృష్టి జరగకముందే వున్నాయి వీటిని

సృతులు(పరబ్రహ్మ నుండి వినిపించినవి,వెలువడినవి),ఋషులు,మునులు,యోగులు,బుద్ధులు వారి సాధన అనుభవాలను 

 స్మృతులు అంటారు,

➡️“అహం బ్రహ్మాస్మి” 🟰ఋగ్వేదము

➡️"తత్వమసి"🟰సామవేదము

➡️"అయమాత్మా బ్రహ్మ " 🟰యజుర్వేదము

➡️" ప్రజ్ఞానం బ్రహ్మ"🟰

         అధర్వణవేదము

ఈ మహా వాక్యములు నాలుగు వేదముల,ఉపనిషత్తుల

సారాంశం

👉ఈ అనంతమైన విశ్వంలో అనంతమైన సాధన మార్గాలు ఋషులు,మునులు మనకు అందించారు,ఒక మార్గంలో ప్రయానించేవారు ఇంకొక మార్గంలో ప్రయాణించే వారిని గౌరవించాలి,కలుపుకొని పోవాలి లేదా పరామర్శించాలి కాని విమర్శించద్దు,

ఖండించవద్దు అవి ప్రకృతి విరుద్ధమైన వ్యతిరేక పదాలు,మనలోనే వ్యతిరేకత వుంటే ప్రపంచశాంతికి ఎలా ఉపయోగపడుతుంది అని ఆత్మ విమర్శ చేసుకోవాలి 

Don't judge the book by its cover

👍

👉పిండం పెట్టడం అనేది ప్రాచీనశాస్త్రము(advanced

science)

మనిషి చనిపోయిన వారి శరీరం 27 నుండి 100 గ్రాములు వరకు తగ్గుతుంది,అంటే అర్ధం పొయిన వారు శూక్ష్మశరీరం తోవున్నారనే కదా అర్థం,దేవలోకం,భువర్లోకం

మోక్షం పొందనివారంతా పిండప్రదానాలపై ఆదారపడతారు,

వారికి ప్రతిసంవత్సరం ఒక ముద్ద అన్నం వారి శరీరానికి సంవత్సరం కాలం పోషంపబడుతుంది,

దీనికి ఆధారాలు గరుడ పురాణం,

💥మోక్షం పొందినవారికి, బ్రహ్మలోకానికి కారణ శరీరంతో చనిపోయిన వారికి పిండం అవసరం లేదు వారు మరలా కారణజన్మలుగా అవతరిస్తారు,

మీ తదనంతరం మీ వారసులు పిండం పెడతారో లేదో ఈ జన్మలోనే మోక్షం పొందితే పిండం ప్రదానాలమీద ఆధారపడవలసిన అవసరం లేదు

👉ఇక గంగానది పవిత్రత,శక్తిని గురించిన విషయం నేను చెప్పను మీరే ప్రత్యక్షంగా గంగోత్రి కి వెళ్ళి తెలుసుకోండి,పురుషులలో పుణ్యపురుషులు వేరు అలాగే నదులలో గంగానది ప్రత్యేకం చూడటానికి ఒకేవిధంగా వుండవచ్చును,

ఆ నదిలో బ్యాక్టీరియా ఉన్నట్లు

నేటికీ శాస్త్రవేత్తలు నిరూపించలేకపోయారు,

భగవద్గీత లో ప్రపంచంలోని నదులలో గంగానదిని నేను అన్నాడు

💥మీఆచారం,మీమతం,

మీసాధన బాగుంది అనిపిస్తే గోరంతను

కొండంతగా చెప్పుకోండి,మాది గొప్ప సాధన/మతం అన్నా పర్వాలేదు,మీ సాధన/మతం "కన్నా"మాదే గొప్ప అనడం,

 విమర్శలు,ఖండించడం వలనే మతకలహములు,అభిప్రాయబేధములు,వాదోపవాదాలు,

మాదేవుడు/మాగురువు గొప్పోడు అనడంలో తప్పు లేదు కానీ మీదేవుడు/మీగురువు కన్నా మాదేవుడు/మాగురువు గొప్ప అనడం ఎంతవరకు సరియైనది,

దేవుడు&గురువు అంటేనే గొప్ప వీరు అందరికీ చెందిన అందరివాళ్లు,పంచభూతాలు మాదిరిగానే;

*"నేను&నాది"*

అనే అజ్ఞానతత్వము పోవాలి,*మనం&మనది*అనే మన అనే మానవత్వం రావాలి,మన భూమాత(mother earth),

మన వసుదైక కుటుంబం(universal family)అనే అర్థం మారిపోయింది,మత,దేశ కుటుంబాలు వచ్చాయి🤦‍♂️;

➡️ప్రపంచదేశభక్తి రావాలి,మనం మనుషులము మనకు నిజాలు కావాలి,సత్యం గ్రహించి సత్యం లో జీవిద్దాం; 

👉ఈ భూప్రపంచం అంతటా మనభవిష్యత్ అంతా మన ఆచారాలతో ఓలలాడబోతోంది,ఎందుకంటే ప్రస్తుత సమస్యలకు పరిష్కార మార్గం మన భారతీయ ప్రాచీన శాస్త్రములు,ఆచారాలు,సంప్రదాయాలు దారి చూపిస్తాయి

💥ఏ ఆచారానైనా మతాన్నైనా,సిద్దాంతాన్నైనా

గుడ్డిగా నమ్మకండి గుడ్డిగా ఖండించకండి,తెలియకపోతే

తెలియదు అనాలి కానీ గుడ్డిగా ఖండించవద్దు,అజ్ఞానాన్ని సమాజంలో రూపుమాపాలి,బౌద్ధధర్మం,మతము పేరుతో 

దేవతల నుండి వచ్చిన సదాచారాలను ఖండించవద్దు,

భారతీయ ఆచారాలు ఎల‍ా తప్పో నిరూపించు ప్రకృతి కూడా సత్యానికి సహకరిస్తుంది,

👉నా దృష్టిలో మతములు పగటి వేషాల లాంటివి,ప్రపంచంశాంతికి/

ప్రపంచానికి మతం ఏవిధమైన ఉపయోగం లేదు,ప్రస్తుతానికి మానవులకు మతం అవసరం లేదని చెప్పాడమే నా అభిమతం

➡️ప్రపంచం లోని అన్ని దుఃఖములకు

బుద్ధుడు చెప్పినట్లు 

కోరికలు కాదు,మనస్సు కాదు 

 అజ్ఞానం,అవిధ్య&అధర్మం మాత్రమే మూలకారణం అనగా

అజ్ఞానమే దుఃఖహేతువు,

పరమాత్మ లేదా యోగులు సదా సంపూర్ణమైన జ్ఞానాన్ని కలిగివుంటారు,యోగులు సర్వం తెలిసినవారు,సామాన్యులు కార్యం చూస్తే యోగులు 

కార్యకారణ సంబంధం,పూర్వాపరాలు పరిశీలించి నిర్ధారిస్తారు,

అజ్ఞానమే దుఃఖహేతువు.

➡️లోకులు లోకానికి సంబంధించిన జ్ఞానం కల్గి వుంటే.... యోగి లోకానికి సంబంధించిన జ్ఞానం తో పాటు లోకాతీత జ్ఞానం కూడా కల్గివుంటాడు.

అరుణాచలశివ 🌹

*💥సత్య మేవ జయతే💥*

***గురు బ్రహ్మ 

     గురు విష్ణు

     గురు దెేవోమహేశ్వర 

     గురు సాక్షాత్త్ పరబ్రహ్మ***


🙏సమస్త లోకా,సర్వేజనా

సుఖినోభవంతు🙏

దైవత్వం

 *🌴దైవత్వం పొందగలమా.....!🌴*


దైవత్వం అనేది అంగట్లో దొరికే వస్తువు కాదు. సాటి మనిషిని నిస్వార్థంగా ప్రేమించి, అవసరంలో ఎదుటి మనిషికి, జీవులకు అండగా నిలిచే మనిషి దేవుడు అనిపించుకుంటాడు.

 

మనిషికి మనిషి శత్రువు కాదు... పరిస్థితులే శత్రువును చేస్తాయి...

 

ఆ పరిస్థితుల కారణంగా మనిషి ప్రవర్తించే తీరు - మనిషికి మనిషిని శత్రువుగా మారుస్తుంది..


శతృత్వం, మితృత్వం అనేది మనిషి యొక్క భావనలు.. అంతే...


శతృత్వం ద్వేషాన్ని, అసూయను, కోపాన్ని కలిగిస్తే, మితృత్వం ప్రేమను వ్యక్తపరుస్తుంది. 


*ప్రేమతో దగ్గర తీస్తే క్రూరమృగం కూడా మచ్చిక అవుతుంది.... ప్రేమ తత్వమే దైవత్వం...*


*ఒకప్పుడు రాముడు లాంటి వాడు.. సత్య హరిశ్చంద్రుని వంటి వాడు అని అనిపించుకునేందుకు మనిషి చాలా కష్టపడే వాడు ... ఆ పోలిక చాలా ఉన్నతంగా ఉండేది ..* 


కానీ నేటి మనిషి జంతువులతో, అది కూడా క్రూర జంతువులైన సింహం, పులి, నక్క... లాంటి వాటితో పోల్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు... 


*యత్భావం తత్భవతి... అనే విశ్వ నియమం ప్రకారం ... ఏ రకంగా మన ఆలోచనా తీరు ఉంటుందో, మన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది.*

 

మన ఆలోచనా విధానం లో మార్పు రాకపోతే, దైవత్వం వైపు అడుగులు వేయడం అనేది పూర్తిగా అసాధ్యం..... 


ఏ గుడికో వెళ్లి ఒక దండం పడేసి, ఇంట్లో ఒక దీపం వెలిగించి, కనీసం ఇంట్లో వ్యక్తులకు కూడా గౌరవం ఇవ్వలేని వాడు దైవత్వానికి ఎలా అర్హుడు అవుతాడు?.. 


*సాటి మనిషిని ప్రేమిస్తూ, తోటి జీవజంతుజాలం పట్ల దయతో ఉంటూ, ప్రకృతి పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ, ధర్మాన్ని అనుసరించి నడుచుకుంటే, అదే.. మనం భగవంతుడికి చేసే నిత్య పూజ. అదే మనలో ఉన్న దైవత్వాన్ని మేల్కొలపడానికి తొలి మెట్టు..... ఇది పూర్తిగా అలవరచుకోవాలి.*


    


     *🙏సర్వం శ్రీపరమేశ్వరార్పణమస్తు*

కర్మసిద్ధాంతం- 12

 కర్మసిద్ధాంతం- 12

మనం చేసే కర్మలు కాయిక, వాచిక, మానసిక కర్మలుగా విభజించబడ్డాయి. కాయిక అంటే నోటితో చేసే కర్మలు, మానసికం అంటే మనస్సుతో చేసేవి, వాచిక అంటే మాటల ద్వారా చేయబడేవి. భౌతిక శరీరంతో జీవుడు కర్మ చేస్తాడు.

ఆ కర్మలకు కారణం త్రిగుణాత్మకమైన ప్రకృతి. అంటే త్రిగుణాలతో కూడిన ప్రకృతి. ఆ ముడు గుణాలే సత్త్వ, రజో, తమో గుణాలు. నిజానికి జీవుడు (ఆత్మ) కళ్ళకు కనిపించే స్థూల శరీరం కాదు, కనిపించని సూక్ష్మ, కారణ శరీరాదులు కూడా కాదు. 'బ్రహ్మం యొక్క ప్రతిబింబమై ఉండీ (సూక్ష్మ శరీరంలో), తాను స్థూలశరీరమని భ్రమపడేవాడు జీవుడు. కానీ ఈ జీవుడు ఈశ్వరుని నుంచి వేరు కాదు' అని ఆదిశంకరులు తత్త్వబోధలో చెప్తారు.


ఈ ప్రపంచం పంచభూతాత్మకం. పంచభూతాలైన ఆకాసం, వాయువు, అగ్ని, నీరు, పృధ్వీల పంచీకరణం అనే ప్రక్రియ ద్వారా ఏర్పడింది.


3 గుణాలు ఇవి.

సత్త్వగుణం - శుద్ధత్వం మరియు జ్ఞానం దీని లక్షణాలు; ఉదాహరణ - సాత్త్వికమైన వ్యక్తి ఎవరిని బాధించడు. ఇతరులు తనకు అపకారం చేసినా, కోపగించుకోకుండా, ప్రతీకారానికి వెళ్ళకుండా, ఏ విధమైన భావావేశానికి లోనుకాకుండా, నిశ్చలంగా, కరుణాపూరితుడై ఉంటాడు. తన స్వార్ధం చూడకుండా, అందరి మేలు తలుస్తాడు.


రజో గుణం - క్రియ (కార్యము) మరియు కోరిక దీని లక్షణాలు; ఉదాహరణ - రజోగుణం ఉంటేనే పని చేయగలుగుతాము. మనస్సులో సంకల్పాలు కలిగించేది ఈ గుణమే. రజోగుణం గలవాడు కూడా ఎవరి జోలికి వెల్లడు. కానీ తన జోలికి ఎవరైనా వస్తే ఊరుకోడు. తన స్వార్ధం చూసుకుంటూనే ఇతరులకు మేలు చేయాలని చూస్తాడు.


తమో గుణం - అజ్ఞానం మరియు జడత్వం దీని లక్షణాలు; ఉదాహరణ - తమోగుణం కలిగిన వ్యక్తి అందరిని బాధిస్తాడు. ఇతరులకు ఉపకారం చేయడమన్నమాటే ఉండదు. ఎప్పుడూ హానీ చేయాలనే తలుస్తాడు. తన స్వార్ధం గురించి ఆలోచిస్తూనే, ఇతరులు సుఖంగా ఉండకూడదని తలుస్తాడు. తన జోలికి రాకున్నా, ఇతరులను పీడించి, అందులో ఆనందం పొందుతాడు. దురాశ, ప్రతీకారం మొదలైన దుర్గుణాలు దీని లక్షణాలు.


పంచభూతాల సత్త్వగుణ అంశ నుంచి అంతఃకరణాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఉద్భవించాయి. రజోగుణ అంశ నుంచి పంచకర్మేంద్రియాలు, పంచవాయువులు ఉద్భవించాయి. తమోగుణ అంశ నుంచి స్థూలమైన పంచభూతాలు, స్థూల శరీరము ఏర్పడ్డాయి.


ఇవన్నీ పంచీకరణం అనే ప్రక్రియలో ఏర్పడ్డాయి. పంచభూతాల్లో, ప్రతి భూతంలోనూ, దాని తత్వం 1/2 వంతు, తక్కిన 4 భూతాల తత్వాలు ఒక్కొక్కటి 1/8 వంతుగా ఉంటాయి. ఉదాహరణకు భూమి- అందులో 1/2 భూతత్వం అయితే, 1/8 జలం, 1/8 అగ్ని, 1/8 వాయువు, 1/8 ఆకాశం ఉంటాయి. దీన్నే 'పంచీకరణం' అంటారు.


విశ్వం ఏర్పడటానికి కారణమైన పంచీకరణమే ఈ శరీరం ఏర్పడాటానికి కారణమైంది. జీవుడి స్థూల శరీరం పిండాండమైతే, కనిపించే ఈ విశ్వం బ్రహ్మాండం. ఈ పిండాండం దేనితో ఏర్పడింది, ఈ బ్రహ్మాండం కూడా దానితోనే ఏర్పడింది. కాబట్టి పిండాండాన్ని అర్ధం చేసుకుంటే, బ్రహ్మాండాన్ని అర్ధం చేసుకోవచ్చని చెప్పారు ఋషులు. ఇంకా ఉంది .!

బలి చక్రవర్తి గతజన్మ

 బలి చక్రవర్తి గతజన్మ వృత్తాంతం:


బలి చక్రవర్తి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన సాక్షాత్ శ్రీమహావిష్ణువుకే మూడు అడుగుల భూమిని దానం చేసిన మహనీయుడిగా, గొప్ప దాతగా చరిత్రలో నిలిచిపోయాడు. అతనికి అంతటి గొప్ప అవకాశం రావటానికి కారణం తను గతజన్మలో చేసుకొన్న పుణ్యమే. బలి గతజన్మలో ఒక దరిదృడు. అతను నాస్తికంగా ఉంటూ వేదపండితులనూ దేవతలనూ నిత్యం దూషిస్తూ తిరుగుతుండేవాడు. అతను దరిదృడే ఐనా వేశ్య లోలుడు. ఒక సారి వేశ్యా సంగమానికి సిద్ధమై ఎలాగో తను సంపాదించిన తాంబూలం, సుగంధ ద్రవ్యాలూ, శ్రీ చందనం, కర్పూరం, మల్లె పూలూ ఇత్యాది భోగవస్తువులను ఒక సంచీలో పెట్టుకొని వేశ్యావాటిక కి బయల్దేరాడు. మార్గమధ్యంలో కాలుజారి నేలమీద పడ్డాడు. అలా పడేటప్పుడు తన తలకి బలంగా గాయమయ్యి మూర్చపోయాడు. ఆ సమయంలో తనకి విచిత్రమైన ఒక ఊహ కలిగింది. తన దగ్గరున్న ఈ పరిమళద్రవ్యాలన్నీ శివుడికి నివేదనచేస్తున్నట్టు. ఆ ఊహలో ఉండగానే తను ప్రాణాలు విడిచాడు. తన దగరున్న సర్వస్వాన్నీ భగవంతుడికి నివేదించినందుకు గానూ ఆ పరమేశ్వరుడి దయవల్ల అతనికి గొప్ప పుణ్యఫలం లభించింది.


మరణించిన తనను యమభటులు నరకానికి తీసుకుపోయారు. అక్కడ యముడు అతని పాపపుణ్యాలని విచారించగా అతనికి చేసిన పాపాలకి గానూ ఘోరమైన నరక శిక్షలు విధించాల్సి ఉందని చిత్రగుప్తుడు చెప్పాడు. కానీ అతను చివరలో తనయావత్తూ ఆ పరమేశ్వరుడికి నివేదిస్తున్నట్టూ భావించినందుకు మూడు ఘడియలపాటూ ఇంద్ర పదవిని చేపట్టాల్సి ఉందంది అలా మూడు ఘడియలూ పూర్తయ్యాకా అతనిని నరకంలో శిక్షించవచ్చని చెప్పాడు. ఇదంతా విన్న ఆ పాపికి తను ఇన్నాళ్ళూ చేసినపనులెంత ఘోరమైనవో తెలిసింది. జన్మ చివరలో దేవుడికే అన్నీ దానం చేస్తున్నా అని అనుకోగానే ఇంత ఫలితం వచ్చింది, అలాంటిది తను నిజంగానే దానం చేస్తే ఎంత బాగుంటుందీ ? అనిపించింది. ఇంతలో ఇందృడు, ఇంద్రగణాలు, అప్సరాగణాలూ మొత్తం అక్కడికి వచ్చి ఆ వేశ్యాలోలుడిని ఐరావతం మీద ఎక్కించుకొని సకల లాంచనాలతో సదరంగా స్వర్గానికి తోడుకొని వెళ్ళారు.


తను ఇంద్ర సిమ్హాసనమ్మీద కూర్చొన్న వెంఠనే అగస్త్యుడికి ఐరావతాన్నీ, విశ్వామిత్రుడికి ఉచ్చైశ్రవాన్నీ, వశిష్టుడికి కామధేనువునూ, గాలవుడికి చింతామణినీ, కౌండిణ్యుడికి కల్పతరువునూ ఇలా ఇంద్రలోకంలోని గొప్ప గొప్ప మహర్షులకి విలువైన సంపదనంతా దానం చేసేసాడు. వారంతా ఎంతగానో సంతోషించి అతన్ని ఆశీర్వదించారు.


మూడు ఘడియల కాలం ఐపోయిన వెంఠనే ఇందృడక్కడకి వచ్చాడు. ఐరావతం మొదలు పారిజాత వృక్షం వరకూ అన్నిటినీ ఆ వేశ్యాలోలుడు దానం చెయ్యడం తెలుసుకొని కోపగించుకొన్నాడు. ఇంతలో యముడూ అక్కడికి వచ్చాడు ఆ పాపిని మళ్ళీ నరకానికి వెళ్ళడానికి సిద్ధంకమ్మన్నాడు. ఐతే మరలా చిత్రగుప్తుడు అడ్డుచెప్పి అతను ఈ మూడు ఘడియలకాలంలో చేసిన పుణ్య ఫలితంవల్ల తను ఇక మీదట నరకానికి రానవసరం లేదనీ, మరు జన్మలో మహా చక్రవర్తిగా భూమి మీద జన్మిస్తాడనీ చెప్పాడు. తను మునుపు చేసిన పనులకి గానూ అసుర వంశానికి రాజౌతాడని చెప్పాడు. ఆ దాన ఫలితంగనే బలి చక్రవర్తిగా అవతరించి సాక్షాత్ శ్రీ మహా విష్ణువుకే మూడు అడుగుల రూపేణా మూడు లోకాలను దానం చేసిన పుణ్యాన్ని పొందాడు. చిరంజీవిగా పాతాళానికి రాజై నిలిచిపోయాడు


దానం చెయ్యాలని మనలో ఏ కొద్ది మందికో ఉంటుంది. చాలా మందికి దానం చెయ్యడం వల్ల వచ్చే ఫలితం తెలియక దానధర్మాలు చేయకుండా జీవితం సాగిస్తుంటారు. మన వాంగ్మయ సర్వస్వం చేసిన ధర్మం వల్లే మనకు కామితార్ధాలు అన్నీ సమకూరతాయని తెలియజేస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకొన్న ఒక వ్యక్తి జీవితం ఎంతగా మారిపోయిందో తెలిపే కధే ఇది

ఇంట్లో దీపం పెట్టెటప్పుడు

 🎻🌹🙏రోజు ఇంట్లో దీపం పెట్టెటప్పుడు పాటించవలసిన నియమాలు .....!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌿దీపం తేజస్ తత్వానికి ప్రతీక. రోజు రెండు సార్లు, ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి. 


🌸దీపప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండని చెప్పలేదు, దీపాన్నీ పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం. 


🌿మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. 


🌸దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు.


🌿అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీలేవు. ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే, సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. 


🌸సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖమూ, కాళ్ళూ, చేతులు, నోరు కడుక్కుని దీపారాధన చేయాలి. మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారీ తలంటుస్నానం చేయనవసరంలేదు. మామూలు స్నానం సరిపోతుంది.


🌿ఇక దీపం వెలిగించే ప్రమిద బంగారం కానీ, వెండిది కానీ, ఇత్తడిది, మట్టిదైనా అయి ఉండాలి. స్టీలు, ఇనుప ప్రమిదలో ఎప్పుడు దీపం వెలిగించకూడదు. 


🌸దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచనట్టు అవుతుంది. క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టి ప్లేట్ లాంటిది పెట్టి, దానిపై ప్రమిద ఉంచాలి.


🌿 అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటలా ఇల్లు శుభ్రపరచాలి. శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట, నీటితో తుడిచి, బియ్యపు పిండితో ముగ్గు వేసి (చిన్నదైనా సరే), కొద్దిగా పసుపుకుంకుమ చల్లి, అప్పుడు దీపపు ప్రమిద పెట్టి, దీపం వెలిగించాలి. 


🌸ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి, వేరే చిన్నవత్తిని కానీ, హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో, ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. 


🌿(ఇవన్నీ రోజు చేయడం కష్టంగా భావిస్తే, రోజు మాములుగా దీపం వెలిగించి, పర్వటి రోజులు, సెలవు రోజుల్లోనైనా ఈ విధానం పాటించండి.)


🌸దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చేయకూడదు. అది అశుభసూచకం. కనీసం రెండు వత్తులైనా వేయాలి, అనగా రెండు వత్తులని కలిపి వేయాలి, విడివిడిగా కాదు.. రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు.


🌿దీపారాధానకు ఆవునెయి ఉత్తమం, తరువాత నువ్వులనూనె. దీపం వెలిగించాక, ప్రమిదకు గంధం, కుంకుమ పెట్టి, పూలు సమర్పించాలి.


🌸 సర్వదేవతస్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి. చిన్న బెల్లం ముక్క కానీ, పటికబెల్లం పలుకులు కానీ, ఏదో ఒక పండుగానీ, లేక అందుబాటులో ఉన్నది దీపానికి నివేదన చేయాలి.


🌿ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన ఆ ఇంట లక్ష్మీ ఎప్పటికి నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు.


🌸వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపారస్థలంలో దీపారాధాన చేయడం వలన కలిగే మార్పు స్వయంగా గమనించవచ్చు.


🌿నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో, వారికి ఉన్న గ్రహదోషాలు, పీడలు చాలావరకు దీపారాధన మహిమవల్ల పరిహారమవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.


🌸ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది.


🌿తమసోమా జ్యోతిర్గమయా – 

ఓ పరమాత్మ! మేము తమస్సు (చీకటి) నుంచి వెలుగులోకి వెళ్ళెదము ......🚩🌞🙏🌹🎻 జై శ్రీ రామ్

కంచర్ల వెంకటరమణ

హరే కృష్ణ గోవిందా

కృష్ణం వందే జగద్గురుమ్

🌸🪔🌸🙏🌸🎻🌸🥭🌸

పంచాంగం 18.03.2024 Monday,

 ఈ రోజు పంచాంగం 18.03.2024 Monday,

 

స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతు ఫాల్గున మాస శుక్ల పక్ష: నవమి తిధి ఇందు వాసర: ఆర్ద్ర నక్షత్రం సౌభాగ్య యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


నవమి రాత్రి 10:52 వరకు.

ఆర్ద్ర సాయంత్రం 06:14 వరకు.

సూర్యోదయం : 06:26

సూర్యాస్తమయం : 06:23


వర్జ్యం : ఈ రోజు లేదు .


దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:48 నుండి 01:36 వరకు తిరిగి మధ్యాహ్నం 03:12 నుండి 04:00 వరకు. 


అమృతఘడియలు : ఉదయం 07:39 నుండి 09:21 వరకు.


రాహుకాలం : పగలు 07:30 నుండి 09:00 వరకు.


యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.



శుభోదయ:, నమస్కార:

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

*19-03-2024 / మంగళవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

మేషం


వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలలో నూతన సమస్యలు కలుగుతాయి.

---------------------------------------

వృషభం


చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. దీర్ఘకాలిక రుణాలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధికమౌతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది. సన్నిహితుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.

---------------------------------------

మిధునం


ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరులతో సఖ్యత కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారంలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. 

---------------------------------------

కర్కాటకం


చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. ప్రయాణమున మార్గావరోధాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

---------------------------------------

సింహం


బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి కలుగుతుంది. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి.

---------------------------------------

కన్య


కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. చేపట్టిన పనులు సమయానికి పూర్తి కావు. దూర ప్రాంత బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు ఉండవు. ఆదాయం మార్గాలు గంధరగోళంగా ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాల పై ఆసక్తి పెరుగుతుంది. 

---------------------------------------

తుల


జీవిత భాగస్వామితో దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు. గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. గృహమున కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

వృశ్చికం


ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాల గురించి చర్చిస్తారు. దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

---------------------------------------

ధనస్సు


సన్నిహితుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార సంబంధిత వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. 

---------------------------------------

మకరం


 ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో నూతన సమస్యలు కలుగుతాయి.

---------------------------------------

కుంభం


ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన వాహన యోగం ఉన్నది. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

మీనం


శత్రువులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లభిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగములో సమస్యలు తొలగి అధికారుల ఆదరణ పెరుగుతుంది.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

🍀 *శుభం భూయాత్* 🍁