10, అక్టోబర్ 2020, శనివారం

ఆశీర్వచనం ఎందుకు చేస్తారు?

 ఆశీర్వచనం ఎందుకు చేస్తారు?


ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఎమీటి సంబంధం??

పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి???


భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ వుంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు. 


విద్యార్ధులను విద్యా ప్రాప్తిరస్తు అని, 

పెళ్ళయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని, 

పురుషులని దీర్ఘాయుష్మాన్ భవ వగైరా సమయానికి తగ్గట్లు వుంటాయి ఆ దీవెనలు.


యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో అక్కడ పండితులు గో బ్రాహ్మణో శుభంభవతు, లోకాస్సమస్త సుఖినోభవంతు……… అనే ఆశీర్వచనంతో దేశంలో రాజు న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలనీ, దేశం సుభిక్షంగా వుండాలనీ, గోవులు, బ్రాహ్మణులు, ప్రజలందరూ సుఖంగా వుండాలనీ, దేశంలో సకాలంలో వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా వుండాలనీ, 

పిల్లలు లేనివారికి పిల్లలు కలగాలనీ, వున్నవారికి వంశాభివృధ్ధి చేసే మనవలు కలగాలనీ, ధనం లేని వారికి సంపదలు కలగాలనీ, వగైరా సమాజంలో అందరి శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనం చేస్తారు.


అయితే ఈ ఆశీర్వచనాలకి ప్రభావం వుందా? 

అవి ఫలిస్తాయా? 

తప్పకుండా ఫలిస్తాయి.


సత్పధంలో నడిచే వారికి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి. 

ఈ ఆశీర్వచనాల వల్ల జాతకంలో వుండే దోషాలు తొలుగుతాయి, అకాల మృత్యు దోషాలు తొలుగుతాయి. అంతేకాదు, పూర్వ జన్మ పాపాలు కూడా నాశనమవుతాయంటారు.


గురువులు, సిధ్ధులు, యోగులు, వేద పండితులు, మనకన్నా చిన్నవారైనా వారి కాళ్ళకి నమస్కరించి వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు. అక్కడ మనం నమస్కరించేది వారి వయసుకి కాదు – వారి విద్వత్తుకు, వారిలోని సరస్వతికి. . .


అక్షింతల సంకేతం:


సాధారణంగా శిశువు జన్మించినప్పుడు పురిటి స్నానం రోజునుంచీ ప్రతి శుభసందర్బం లోనూ ఆశీర్వదించినప్పుడు తలమీద అక్షింతలు జల్లుతారు. ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఎమీటి సంబంధం? అక్షింతలే ఎందుకు చల్లాలి వేరే ధాన్యాలు వున్నాయికదా వాటిని చల్లవచ్చుకదా? 

మరి పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి? 


బియ్యం చంద్రుడికి కారకం. చంద్రుడు మనస్సుకి కారకుడు. అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నమన్నమాట. 


బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారకం. గురువు శుభ గ్రహం. ఆయనకి సంకేతంగా, శుబానికి సంకేతంగా పసుపు రంగు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తలమీద చల్లుతారు. 


మంత్రం అంటే క్షయం లేనటువంటిది. అకారంనుంచి క్షకారం దాకా వున్న అక్షరాలతో, బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి వుంటుంది. మంత్రాన్ని చదివేటప్పుడి చేతితో పట్టుకున్న అక్షింతలకి కూడా ఆ శక్తి వస్తుంది. క్షయంలేని మంత్రాలను, క్షయంలేని అక్షింతలు పట్టుకుని చదివి, అవి ఎవరి తలపై వేస్తారో వారుకూడా క్షయం లేకుండా ఆభివృధ్ధి చెందాలని ఆశీర్వదిస్తారు. ఆలాంటి ఆశీర్వచనానికి శక్తి వుంటుంది.


మన పూజలు, శుభ సందర్భాల్లో అక్షింతలకు ఏంతో ప్రాధాన్యత ఉంది. అక్షింతల్ని సంస్కృతంలో అక్షతలు అంటారు. ఏ పూజ చేసినా దేవుని వద్ద అక్షింతలు ఉంచి మధ్యమధ్యలో ”అక్షతాన్ సమర్పయామి” అంటూ భక్తిగా అక్షతలు జల్లడం హిందూ సంప్రదాయం. పెళ్ళిళ్ళు, పేరంటాలలో వధూవరులపై అక్షతలు జల్లి ఆశీర్వదిస్తారు. ఉయ్యాల, పుట్టినరోజు లాంటి అనేక వేడుకల్లోనూ అక్షింతలు తలపై జల్లి ఆశీర్వచనాలు పలుకుతారు.


మంత్రించిన అక్షతలు తలపై జల్లి ఆశీర్వదించినట్లయితే, శుభం చేకూరుతుందని, చెడు ఫలితాలు, దోషాలు అంటకుండా ఉంటాయని పెద్దలు చెప్తారు. కేవలం పెళ్ళిళ్ళు, శుభకార్యాల్లోనే కాదు, అశుభ కార్యాల్లో కూడా అక్షతలు ఉపయోగించే సంప్రదాయం ఉంది.


బియ్యంలో తగినంత పసుపు, చిటికెడు కుంకుమ, తడిచీ తడవనట్లు కొన్ని నీళ్ళు, నాలుగు చుక్కలు నూనె వేసి అక్షతలను తయారుచేస్తారు. ఒకవేళ మంత్రించిన పసుపు లేదా కుంకుమలను వేసి తయారుచేసినట్లయితే ఆ అక్షతలు మరీ పవిత్రమైనవి

తామరాకు మీద నిలిచిన నీటి బొట్టు

 



తామరాకు మీద నిలిచిన నీటి బొట్టు ఒక్క క్షణం కూడా స్థిరంగా ఉండదు. మానవ జీవితం నీటి బుడగ లాంటిది. ఏడుస్తూ పుడుతాము. పెద్దయ్యాక కోరికలు తీరలేదని ఏడుస్తాం. చివరిలో మృత్యువు పీడిస్తుంది. లోకం సమస్తం శోక హతం. అందుకే ఎక్కువ ఆశలు పెట్టుకొని తీర్చు కునేదానికి మూర్ఖులు కారాదని అంటున్నారు. క్షణం కూడా వృధా కాకుండా మానవ జీవిత పరమలక్ష్మమయిన భగవత్ సంబంధమయిన సత్కార్యలలో జ్యాప్యం వలదని అంటున్నారు శ్రీ ఆది శంకరాచార్యుల వారు.

ఏది చదివితే ఏమి ఫలితం వస్తుంది ...




1. గణనాయకాష్టకం - అన్ని విజయాలకు.




2. శివాష్టకం - శివ అనుగ్రహం..




3. ఆదిత్యహృదయం - ఆరోగ్యం , ఉద్యోగం...




4. శ్రీరాజరాజేశ్వరి అష్టకం - సర్వ వాంచసిద్ది...




5. అన్నపూర్ణ అష్టకం - ఆకలి దప్పులకి....




6. కాలభైరవ అష్టకం - ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం...




7. దుర్గష్టోత్తర శతనామం - భయహరం..




8. విశ్వనాథ అష్టకం - విద్య విజయం..




9. సుబ్రహ్మణ్యం అష్టకం - సర్పదోష నాశనం , పాప నాశనం..




10. హనుమాన్ చాలీసా - శని బాధలు , పిశాచపీడ...




11. విష్ణు శతనామ స్తోత్రం - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి...




12. శివ అష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి...




13. భ్రమరాంబిక అష్టకం - సర్వ శుభప్రాప్తి...




14. శివషడక్షరి స్తోత్రం - చేయకూడని పాప నాశనం...




15. లక్ష్మీనరసింహ స్తోత్రం - ఆపదలో సహాయం , పీడ నాశనం.




16. కృష్ణ అష్టకం - కోటి జన్మపాప నాశనం..




17. ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యత..




18. శ్రీ రామరక్ష స్తోత్రం - హనుమాన్ కటాక్షం..




19. లలిత పంచరత్నం - స్త్రీ కీర్తి..




20. శ్యామాల దండకం - వాక్శుద్ధి..




21. త్రిపుర సుందరి స్తోత్రం - సర్వజ్ఞాన ప్రాప్తి..




22. శివ తాండవ స్తోత్రం - రథ గజ తురంగ ప్రాప్తి...




23. శని స్తోత్రం - శని పీడ నివారణ...




24. మహిషాసుర మర్ధిని స్తోత్రం - శత్రు నాశనం..




25. అంగారక ఋణ విమోచన స్తోత్రం - ఋణ బాధకి...




26. కార్యవీర్యార్జున స్తోత్రం - నష్ట ద్రవ్యలాభం..




27. కనకధార స్తోత్రం - కనకధారయే...




28. శ్రీ సూక్తం - ధన లాభం..




29. సూర్య కవచం - సామ్రాజ్య సిద్ది..




30. సుదర్శన మంత్రం - శత్రు నాశనం...




31. విష్ణు సహస్ర నామ స్తోత్రం - ఆశ్వమేధయాగ ఫలం...




32. రుద్రకవచం - అఖండ ఐశ్వర్య ప్రాప్తి..




33. దక్షిణ కాళీ - శని బాధలు , ఈతిబాధలు...




34. భువనేశ్వరి కవచం - మనశ్శాంతి , మానసిక బాధలకు..




35. వారాహి స్తోత్రం - పిశాచ పీడ నివారణకు...




36. దత్త స్తోత్రం - పిశాచ పీడ నివారణకు..




37. లలిత సహస్రనామం - సర్వార్థ సిద్దికి...




*నిత్యము భగవన్నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశిస్తాయి..*


.........................................................




ప్రతీ మనిషి ఆలోచన విధానం మారాలి 


లోకా సమస్తా సుఖీనోభవంతూ




ఓం శం శరవణభవయ నమః

శ్రీశైల మల్లన్నను

  *మల్లికార్జున పండితుడు శ్రీశైల మల్లన్నను* *అచ్చులు,హల్లులతో ఎలా స్తుతించాడో చూడండి.*




'అ'ఖిల లోకాధార - 'ఆ'నంద పూర


'ఇ'న చంద్ర శిఖి నేత్ర - 'ఈ'డితామల గాత్ర


'ఉ'రు లింగ నిజరూప- 'ఊ'ర్జితా జలచాప


'ఌ'లిత తాండవకాండ -'ౡ'నికృతా జాండ


'ఏ'కైక వర్యేశ -'ఐ'క్య సౌఖ్యా వేశ


'ఓం' కార దివ్యాంగ- 'ఔ'న్నత్య గుణ సంగ


'అం'బికా హృదయేశ- 'అః'స్తోక కలనాశ


'క'నద హీనాభరణ -'ఖ'ల జలంధర హరణ


'గ'ల నాయక విధేయ- 'ఘ'న భక్తి విజేయ


'జ'శ్చూల కాలధర-'చ'రిత త్రిశూల ధర


'ఛ'ర్మ యాధ్వస్త -'ఞ'న గుణ ధళ ధీర


'ట త్రయాది విదూర- 'ఠ' ప్రభావాకార


'డ'మరుకాది విహార - 'ఢ' వ్రాత పరిహార


'ణ' ప్రవాగార - 'త'త్త్వ జోనేత


'థ'వి దూర జవ పక్ష - 'ధ'వన పాలన దీక్ష


'ధ'రణీ థవోల్లీడ - 'నంది కేశారూఢ


'ప'ర్వతీశ్వర లింగ - 'బ'హుళ భూత విలాస


'భ'క్త్వ హృద్వ నహన - 'మంత్రస్తుతోధార 


'య'క్ష రుద్రాకార- 'ర'తిరాజ బిన హంస


'ల'లిత గంగోత్తంస - 'ళ'మా విదవ్రంశ 


'వ'రద శైల విహార - 'శ'ర సంభ వాస్ఫార


'ష'ట్తింశ తత్త్వగత - 'స'కల సురముని వినుత


'హ'రి నేత్ర పద పద్మ- అంశిత భూధర పద్మ


'క్ష'ర రహిత చరిత్ర - అక్షరాంక స్తోత్ర 


శ్రీ పర్వత లింగ నమస్తే నమస్తే నమః

శ్రీ అమ్మవారి స్ధల పురాణం

 


విజయవాడ పట్టణంలో దుర్గాదేవి వెలశిన పర్వతం పేరు ఇంద్రకీలాద్రి, పర్వత రూపుడైన కీలుడు దుర్గాదేవి ఉపాసకుడు. ఆ దుర్గాదేవిని తన హృదయ కుహరంలో (గుహలో) నివశించమని అపార తపస్సు చేశాడు. కీలుని భక్తికి కరుణారస ప్రపూర్ణ అయిన జగదంబ దుర్గ కనకదుర్గగా వాని హృదయ కుహరంలో స్వయంభువుగా వెలసింది. స్వర్ణ మణిమయ కాంతులతో ప్రకాశిస్తున్న ఆ కనకదుర్గను ఇంద్రాది దేవతలు వచ్చి, శ్రీ కృష్ణ రూపిణి అయిన కృష్ణవేణీ నదిలో స్నానమాడి కనక దుర్గను పూజించి ప్రణమిల్లారు. నాటి నుండి కీలాద్రి ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందింది. దుర్గమాసురుని సంహరించిన దుర్గ కీలాద్రిన నిలచిపోగా ఈశ్వరుడు జ్యోతిర్లింగ రూపముతో స్వయంభువుడుగా ఈ ఇంద్రకీలాద్రి మీద వెలశాడు. బ్రహ్మాది దేవతలు ఆ లింగమును మల్లికా కదంబ పుష్ఫాలతో పూజించగా అప్పటి నుండి మల్లేశ్వరుడుగా పిలువబడుతున్నాడు.




అర్జునుడు ఈ కీలాద్రి మీద తపస్సు చేసి శివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొంది విజయడైనాడు. కనుక ఈ క్షేత్రానికి ఫల్గున క్షేత్రమని, విజయపురి అనే పేర్లు పురాణ ప్రసిద్ధాలైనాయి. దుర్గాదేవి శుంభ నిశుంభులను వధించి జయం పొందటం చేత జయవాడ అని పేరున్నదని ఒక ఇతిహాసమున్నది. ఆ కాలములోనే కనకవాడ అని కూడా పిలువబడేదని కూడా కొన్నిచోట్ల చెప్పబడినది.


పూర్వమెన్నడో సృష్టికర్త అయిన బ్రహ్మ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి హరీ! కలియుగమ్లో జనులు అనేక పాప చింతనలతో ధర్మమార్గం తప్పి చరిస్తారు. కనుక వారికి తరించే మార్గం ఏదైనా చెప్పుమని కోరాడు. బ్రహ్మ మాటను మన్నించి హరి తన అంశతో కృష్ణను సృజించాడు. ఆమె రూపలావణ్యాలకు ఆశ్చర్యపడిన బ్రహ్మ ఆమెను తన కూతురిగా ఇమ్మని అడిగాడు. కృష్ణను విష్ణువు బ్రహ్మకు ఇవ్వగా కృష్ణ బ్రహ్మపుత్రి అని పిలువ బడుతున్నది.




కొంతకాలనికి కలియుగం పాప భూయిష్టం కాగా ఆ పాప పరిహారార్ధం విష్ణువు మరల కృష్ణను తనకిమ్మని బ్రహ్మను అడిగాడు. విష్ణు స్వాధీన అయిన కృష్ణను ఎక్కడ వుంచాలని ఇంద్రాది దేవతలను హారి అడిగాడు. అప్పుడు వారు భూమినంతా పరిశీలించాడు. అప్పుడు శ్రీహరిని కోరి ఒకచోట పర్వత రూపంలో ఘోర తపస్సు చేస్తున్న సహ్యమునిని చూపించారు. దేవతలు వెంటనే సహ్యముని వద్దకు వెళ్ళి సహ్యమునీ నీవు ఏ కోరికతో పర్వత రూపం ధరించి ఘోర తపస్సు చేస్తున్నావో ఆ విఘ్ణవే భూమిని ఉద్భవించటానికి విఘ్ణరూపిణి అయిన కృష్ణతో సహా వచ్చి ఉన్నాడు. కృష్ణ సకలాభీష్ట ప్రదాయిని అని చెప్పారు. పరమానందభరితుడైన సహ్యముని విఘ్ణవును విఘ్ణ స్వరూపిణి అయిన కృష్ణను షోఢశోపచారాలతో పూజించాడు. దేవతలారా! నేను శ్రీ మహా విఘ్ణవు కోరి తపస్సు చేస్తున్నాను. మీరు సమస్త ఫలదాయిని అయిన కృష్ణతోపాటుగా విష్ణువును ఇక్కడకు తీసుకొని వచ్చారు. నా జన్మతరించింది. నేను కృష్ణా నదీమ తల్లిని సేవించి నిశ్చల భక్తిని జ్జానాలను పొందుతాను. హే విష్ణూ! కృష్ణతో కూడి దయతో నా మీద నిలచి నన్ను కృతార్ధుడిని చేయమని వేడుకున్నాడు. అతని ఆత్మ నివేదనను కృష్ణ అనుగ్రహించింది. సహ్యమునీంద్రా నేను నా అంశతో ఈ సహ్యాద్రి మీద నివశిస్తాను. నీ తపస్సు ఫలించి లోకోపకారం అయింది. నీ ఉపకారం వల్ల లోకాలు పునీతం అవుతాయని పరమిచ్చింది. విష్ణువు కూడా సంప్రీతుడై పర్వత రూపంలో వున్న నీమీద (సహ్యాద్రి మీద) నిత్య నివాసం ఏర్పరచుకుంటానని ఇద్దరూ ఆ సహ్యాద్రి మీద పాదం మోపారు. సహ్యముని వారిని రత్నాలతోనూ పరిమళ పుష్ఫాలతోనూ అర్చించాడు.




శ్రీ మహ విష్ణువు శ్వేతాశ్వత్ధ వృక్షంగా (తెల్ల రావి చెట్టుగా) సహ్యాద్రి మీద ఆవిర్భవించాడు. ఆ రావిచెట్టు అంతర్భాగాన రెండు వైపుల ధవళాకృతిలో నదీమ తల్లిగా కృష్ణ ఆవిర్భవించింది. పడమటి కనుమలలో బ్రహ్మగిరి, వేదగిరి అని రెండు శిఖరాలున్నాయి. బ్రహ్మ ఒకప్పుడు బ్రహ్మ గిరి మీద నారాయణుని గురించి తపస్సు చేయగా నారాయణుడు తెల్ల రావిచెట్టు రూపంలో ప్రత్యక్షం అయినాడు. తరువాత విధాత వేదగిరి మీద తపస్సు చేయగా పరమేశ్వరుడు ఆమ్ల(ఉసిరి) చెట్టుగా ప్రత్యక్షం అయినాడు. శ్వేతాశ్వత్థ వృక్షం (నారాయణుడు) కృష్ణ గానూ ఆమలక వృక్షం (ఈశ్వరుడు) వేణి గానూ ఒకదానితో ఒకటి కలసి కృష్ణవేణి నదిగా ప్రభవించినట్లు విఘ్ణ పురాణంలో చెప్పబడినది. ఈ జలాలు సహ్యాద్రి నుండి శ్రీశైలం వరకూ గంగతో సమానమనీ, భగవత్ నిలయమైన శస్య శ్యామల క్షేత్రమని, ఆధ్యాత్మిక సంపదలకు ఆలవాలమనీ ప్రసిద్ధి చెందినది. అటువంటి క్షేత్రాలలో విజయవాడ ఎన్నదగినది.




సహ్యాద్రి పర్వతం మీద పుట్టిన ఓషధాలను బీజాలను తన ప్రవాహములో తరలించుకొని పోవుచుండగా కీలాద్రి అడ్డుపడి అక్కడే నిలచిపోగా ఆ బీజాలు మొలకెత్తి ఆ ప్రదేశము సస్యశ్యామలమైనది. సాగర సంగమాభిలాషతో ఉరకలుగా వచ్చిన కృష్ణవేణీ నది తనకు దారి ఇమ్మని కీలుని కోరినది. కీలుడు అంగీకరించలేదు. దేవతలు వచ్చి కీలునికి నచ్చ చెప్పగా సొరంగ మార్గం మాత్రం ఇవ్వడానికి అంగీకరించాడు. ఆ ప్రవాహ వేగానికి కీలాద్రి నుండి ఒక ముక్క విరిగి ప్రవాహా వేగములో రెండు క్రోసుల దూరము కొట్టుకుపోయి నిలచినది. ఈ రెండు క్రోసులదూరమును ఫల్గున తీర్ధమనీ, ఆ కొండ ముక్కకు తేలుకొండ (తేలిన కొండ) అని పేర్లు అని సహ్యాద్రి ఖండంలో చెప్పబడినది. అది యనమలకుదురు అని విజయవాడకు ప్రక్క గ్రామము ఈ ఇంద్రకీలాద్రి పర్వతము మంగళాచలము (మంగళగిరి) వరకు వ్యాపించివున్నది.




దుర్గా దేవి కుడికన్ను సూర్యుడు. ఎడమ కన్ను చంద్రుడు. కనకవర్ణంతో ప్రకాశించే పొలము రాత్రింబవళ్ళకు నడిమీ సంధ్య. దుర్గాదేవి తన చూపులతో శత్రువులను క్షోభ పెట్టిన చోట్లన్నిటికీ ఒక్కొక్క దృష్టి. ఆయా నామాలతో నేటికి ప్రసిద్ధాలై ఉన్నవి. కార్వేటి వంశ పల్లవ కేతు భూపాల శాసనానుసారము దుర్గా మల్లేశ్వరుల మహాత్యము, అనుగ్రహము మనకు తెలుస్తున్నవి. విజయవాడ మాధవ శర్మ పాలనలో వున్నప్పటి ఒక ఉదంతం కనకదుర్గా మల్లేశ్వరుల అనుగ్రహానికి నిదర్శనంగా చెప్పబడినది. మాధవ శర్మ కుమారుడు ఒకనాడు రథం మీద వెళ్ళుచుండగా ఆ రథము క్రింద చింత చిగురు అమ్ముకునే ఒక అభాగ్యురాలి కొడుకు పడి మరణించాడట. ధర్మ సంరక్షణా నిరతుడైన మాధవ వర్మ తన కుమారుని హత్యా నేరస్తునిగా ఉరిశిక్ష విధించినాడట. మాధవ శర్మ ధర్మ దీక్షకు కనకదుర్గా మల్లేశ్వరులు సంతసించి ఆ మరణించిన బాలురిద్దరి మీద కనక వర్షము కురిపించి ప్రాణదాన మొనరించగా కనకదుర్గా పండితుని ప్రభావాన్ని కూడా వెల్లడించినది. అప్పుడు విజయవాడ వేంగ రాజుల పాలనలో ఉన్నది.




కనకదుర్గా మల్లేశ్వరుల పరభక్త శిఖామణి ఆరాధ్య పండితుడు శ్రీ పతి పండితయ్య. ఆయన తాను కాంశీపుర వాసిననీ అయిననూ విజయవాడ మల్లిఖార్జున పాదపద్మారాధకుడననీ చెప్పుకున్నావాడు. శివ తత్వసారమనే మహా గ్రంధకర్త. శివుడు గాక వేరు దైవము లేడను పరమ భక్తుడు. అందుచేత ఊరి ప్రజలు అతని మీద అసూయ ద్వేషాలు పెంచుకున్నారు. యజ్ఞయాగాది క్రతువులకు పిలవటం మానివేశారు. ఆయనకు ఊరిలో నిప్పు కూడా పుట్టకుండా కట్టడి చేశారు.




అయినా శ్రీపతి పండితయ్య ఏ మాత్రమూ చింతించలేదు. తన ముక్కంటి దొరను ( త్రినేత్రుడైన శివుని) ప్రార్థించి అగ్నిని తన ఉత్తరీయములో మూటకట్టి ఒక జమ్మి చెట్టు కొమ్మకు వ్రేలాడ కట్టి, నగరంలో అగ్నిహోత్రుడు వెలగరాదని శపించాడు. తాను మాత్రము నియమము తప్పక అగ్నికార్యమును కొనసాగించుకొంటూనే ఉన్నాడు. ఆ కాలంలో వేంగీ రాజు అనంతపాలుని పాలనలో ఉన్నది నగరం. అంతట ప్రజలు అందరూ ప్రభువును ముందుంచుకొని శ్రీపతి పండితయ్యను అగ్నికి విడువుమని ప్రార్థించాడు. పండితయ్య అనుగ్రహించాడు. ఈ నాటికీ జమ్మిదొడ్డిగా పిలువబడుతున్న ప్రాంతమే ఆ నాడు పండితయ్య నిప్పును వ్రేలాడదీసిన శమీ వృక్షమున్న చోటు ఈ శాసనము కూడా అక్కడే లభించినది.




వేప చెట్టు మహాలక్ష్మీ. రావి చెట్టు విఘ్ణవు. శమీ వృక్షం (జమ్మిచెట్టు) శివ శకైక్య స్వరూపం. ఆ శమీ వృక్షం ఆదిపారాశక్తి అంశ వనదుర్గ. ఆమే రూపుదాల్చిన కుండలీని శక్తి. వివిధ శాఖావృతమైన శమీవృక్ష శిరోభాగమే భయంకర భుజంగ (సర్ప)రూపము. అనంతంగా విస్తరించిన వృక్షాగ్రం పగటిని సైతం రాత్రిగా చేయగల కాల స్వరూపం. శమీ వృక్షం వనదేవత. శుభకర తరువు. సంతాన ప్రదాయిని. సర్వశత్రు వినాశిని.




పుత్రదం సర్వ పాపఘ్నం సర్వ శత్రు వినాశకం అని శమీ వృక్షం చెప్పబడినది. బ్రహ్మ విఘ్ణవు మొదలైన దేవతల చేత ఆవరించబడి, ఢాకినీ మొదలైన భూత గణాలచే రక్షించబడుతూ ఉంటుంది. వనదుర్గ స్థలదుర్గ జలదుర్గ అని దేవికి పేర్లు. అన్నింటిలోకి వనదుర్గ సుఖప్రద. వనదుర్గా రూపంలో ప్రభవించి ప్రకాశించే శమీవృక్షం అనేక దేవతా నిలయం మహా మాయా సంపద కలది. అందుకే పాండవాగ్రజుడైన ధర్మరాజు వారి అజ్ఞాతవాసం ప్రారంభించే ముందు వారి ఆయుధాలను శమీ వృక్షం మీద దాచిపెట్టి వనదేవతారూపిణి అయిన వనదుర్గనిలా ప్రార్థించాడు. విషస్ఫురిత భుజంగ భంగి భయంకర రూపంతో మా ఆయుధాలను కనుపింప చేయమని కోరాడు.




చిత్త క్షోభం కలిగించే దీని ఆకృతి దేవీ స్వరూప స్వభావాలకు ప్రతీక. సమస్త ప్రాణులలోనూ వ్యాపించి చిత్త వికారాలను కలిగించే భ్రమరాంబ అష్టాదశ పీఠాలలో ఒకటైన శ్రీశైలపీఠశక్తి. శాకినీ, ఢాకినీ మొదలైన యోగినీ గణాలతో ఆవృతమై అరణ్య మధ్యంలో నెలకొన్న వనదుర్గా రూపమీ శమీ తరువు. కనుకనే ధర్మరాజు అజ్ఞాత వాసంలో భీముని ఆ గ్రహ ప్రవృత్తిని నిగ్రహించుకొనే విధంగా శాశించు తల్లీ అని వన దేవతా రూపిణి అయిన శమీ వృక్షాన్ని ప్రార్థించి తగిన నివేదనలు సమర్పించాడు. శత్రువులు ఎవరూ ఆ శమీ వృక్షాన్ని దాటి రాకుండా చూడుమని అర్థించాడు. శమీ వృక్షం శివ శకైక స్వరూపం కనుకనే మహా దేవ శక్తి పాశు పతాస్త్రాన్ని ధరించి భరించింది.




నాటికీ, నేటికీ శమీ పూజ పార్వేట వాడ వాడలా నవరాత్ర ఉత్సవాల ముగింపుగా జరుగుతూనే వున్నది. ఎందుకనగా గ్రామ దేవతా మూర్తులు లేని మరుమూల గ్రామాలలో కూడా రావి, వేప, శమీ వంటి వృక్షాలే వనదేవతలుగా గ్రామాలను కాపాడుతాయి అనే ప్రగాఢ విశ్వాసమే యుగయుగాలుగా చాటిన సత్యం.




దేవీ దుర్గ మహిషాసురుని వధించి మహోగ్రంగా కనిపిస్తుండగా దేవతలందరూ అమ్మా నీవు లోకాలను రక్షించే తల్లివి. ఇంతటి మహోగ్రరూపం మహిషాసురుని వంటి రాక్షస వధకే గాని మేమెట్లు భరించగలం? మూల ప్రకృతినైన నిన్నెట్లు సమీపించగలం? తల్లీ నీవు శాంతి రూపిణివై లోకాలను కపాడుమని వేడుకున్నారు. ఆ తల్లి కరుణారస సంపూర్ణ అయిన రాజ రాజేశ్వరిగా అవతరించింది. కాలాంతములో జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు మహోగ్ర శక్తులను శ్రీ చక్రము నందు నిక్షిప్తం చేసి, శ్రీ అమ్మవారి పాదాల చెంత శ్రీ చక్రరాజమును స్థాపన చేయటమైనది.




ప్రతి సంవత్సరము ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి మొదలు నవమి వరకు దుర్గోత్సవం అను పేరుతో దేవీ శరన్నవరాత్రోత్సవములను, సంవత్సరారంభంలో చైత్ర శుద్ధ పాఢ్యమినుండి నవమి వరకు వసంత నవరాత్రోత్సవములను పేరుతో నన్ను ఆరాధించినా నా చరిత్రను వినినా ఇహలోకాన ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో, పుత్ర పౌత్రాభి వృద్ధితో సమస్త సుఖశాంతులు పొందగలరని వరమిచ్చింది.




నాటి నుండి దుర్గమ్మ రాజరాజేశ్వరిగా లోకాలను పాలిస్తూ, బాలా త్రిపురసుందరిగా కోరికలీడేరుస్తూ, అన్నపూర్ణగా ఆకలి తీరుస్తూ, లలితగా లాలిస్తూ, సరస్వతిగా సకల విద్యలూ ప్రసాదిస్తూ అనేక అంశలతో అర్భామూర్తిగా ఆరాధించబడుతూ వున్నది. ‘ద’ కారం దైత్యనాశకం. ‘ఉ’ కారం విఘ్న నాశకం. ‘ర్’ కారం రోగ నాశకం. ‘గ’ కారం పాప నాశకం. ఆ భయనాశక వాచకం. కనుకనే అమ్మవారికి పర్యయపదమైన దుర్గా నామమును ఉచ్చరించినా, స్మరించినా పాపాలూ నశిస్తాయని సాక్షాత్తూ పరమ శివుడు చెప్పిన మాట అని సకల లోక పితామహుడు సృష్టి కర్త అయిన బ్రహ్మ మార్కెండేయ మహర్షికి చెప్పిన ప్రమణమున్నది.




ఈ విధంగా మహిషాసుర మర్థినీ బ్రహ్మ తేజస్విని శుద్ధ స్పటిక రూపిణి అయిన కనకదుర్గ కృష్ణా తీరాన వెలసి తూర్పున ఐంద్రి, పడమర వారుణి, ఉత్తరాన కౌమారి, దక్షిణ దిక్కున శ్రేష్ఠ ధర్మ దేవతా స్వరూపిణి అయిన హంసవాహినిగా లోకాలను కాపాడుతూ ఉన్నది. కొలచిన వారికి కొంగు బంగారము, సర్వర్థ ధాత్రి, మూల ప్రకృతి, సౌకుమార్య సౌందర్యలహరి, మల్లేశ్వర హృదయ సామ్రాజ్య పట్ట మహిషి అయిన చల్లని తల్లి అయిన దుర్గమ్మ. దూర దూరాల నుండి వచ్చే నీ బిడ్డలు అయిన భక్తుల మీద కరుణాంతరంగవై సుభశాంతులను వర్షించుచూ, జ్ఞానా సిద్ధిని ప్రసాదించుమని నిత్యము సేవించుకుందాము.




“ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే




శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే”

అనంత పద్మనాభస్వామి ఆలయం


 

ఆశాపాశ స్థితో జీవః పాశముక్త స్సదాశివః*

 *ఆశాపాశ స్థితో జీవః పాశముక్త స్సదాశివః*


మానవుడు ఆశతో నున్నంత వరకు జీవుడని పిలువబడును. వివేక వైరాగ్య భక్తి యోగముల ద్వారా ఆశను నశింప చేసుకున్న మహనీయుడు సాక్షాత్తు శివుడనబడును.


*న తథా భాతి పూర్ణేందు*

*ర్నపూర్ణః క్షీరసాగరః*

*న లక్ష్మీ వదనం కాంతం*

*స్పృహా హీనం యథా మనః*


ఆశలేని వాని హృదయము (మనస్సు) ప్రకాశించునట్లు పూర్ణచంద్రుడు గానీ, పాల సముద్రము గానీ, లక్ష్మదేవి ముఖము గానీ ప్రకాశింపవు.


*వైరాగ్యస్య ఫలం బోధః*


వైరాగ్యము యొక్క మహత్ ఫలము ఆత్మజ్ఞానము కలుగుటయే యగును.


🙏🌹

బంగారు మూట

 రాజుగారు రాజమార్గంపై ఒక బండరాయిని ఉంచారు. చెట్టుచాటున నక్కి ఏం జరుగుతుందో గమనిస్తున్నారు.


బడాబడా వ్యాపారులు వచ్చారు. రాయిని పట్టించుకోలేదు. పక్కనుంచి వెళ్లిపోయారు.


"రాజుగారి పరిపాలన అధ్వాన్నంగా ఉంది. లేకపోతే రోడ్డు మీద 

అడ్డంగా బండరాయి ఉండటం ఏమిటి? దాన్ని ఇంత వరకూ తీయించకపోవడం ఏమిటి?' అంటూ తిట్టుకున్నారు.


ఉన్నతాధికారులు అదే దారిన వెళ్లారు. బండరాయిని చూసి " ఎవరక్కడ....ఇదెవరు చేశారు? వాడెవడో పట్టి కారాగారంలో పడేయండి' అని హుకుం జారీ చేశారు.


అందరూ వస్తున్నారు....వెళ్తున్నారు. 

తోచిన నాలుగు మాటలు అని వెళ్లిపోతున్నారు.

చివరికి ఒక రైతు వచ్చాడు.


అతను బండి దిగి, బండరాయి దగ్గరకు వచ్చాడు. ధోతీ పైకి ఎగకట్టి, శక్తినంతా ఉపయోగించి ఆ రాయిని రోడ్డు పక్కకి జరిపేశాడు.


ఆ బండరాయి కింద ఒక బంగారు నాణాల మూట కనిపించింది. నిజానికి అది రాజుగారు దాచిందే.


తిట్టుకోవడమో లేక ఇతరులకు పురమాయించడమో కాదు. సవాలో లేక సమస్యో వచ్చినప్పుడు దాని 

పరిష్కారానికి స్వయంగా పూనుకోవాలి. 


సమస్య అనే బండరాయి కింద అవకాశమనే బంగారు మూట ఉండొచ్చేమో.


🙏👍👏 👏👍🙏

మనస్సు... స్థితి గతులు.....*


మనస్సు.. శరీరములు.. అభిన్నములు. ఆత్మయే మనస్సు శరీరములను ప్రకాశింపజేస్తూ ఉండటంవల్ల మనస్సు శరీరముల అన్ని చేష్టలు కూడా సఫలములవుతాయి. మనస్సు ఏ వస్తువును వెతుకుతుందో అది తప్పక లభిస్తుంది.

మనస్సు ద్వారానే మనను మనమే పవిత్ర మార్గంలో పెట్టుకోవాలి. మనస్సు దేనికి అనుసంధానమవుతుందో కర్మేంద్రియములు దానికి అనుగుణంగా స్పందిస్తాయి. మాలిన్యయుక్తమైన మనస్సునే చిత్తమనవచ్చు.


మనస్సు చిత్తములు ఆత్మ యొక్క క్రియా స్వరూపములే. దానికన్నా భిన్నమైనది ఏదీ లేదు. వాసనలు చిత్తము యొక్క అంశ మాత్రమే.

మనస్సు తన వినాశన క్రియను తనలోనే చేసుకొంటుంది. అన్ని దుఃఖముల నుండీ దూరము కావటానికి మూలము మనో నాశనమే. వివేకంతో శోధించటం వలన మనోనాశము అవుతుంది.

మనస్సు ఎంత శక్తిని ధారణ చెయ్యగలదనే విషయాన్ని తేలికగా స్పష్టం చెయ్యవచ్చును.

నీ మనస్సు ఒకవేళ వేరే విషయం మీద లగ్నమై ఉంటే, నీవు తినే పదార్థాల రుచి కూడా నీకు తెలియదు.


మనస్సు అన్యత్ర లగ్నమైతే నీకేమీ కనపడదు, వినపడదు. శరీరం వరకూ నిశ్చేష్టితం అవుతుంది. మనస్సు చిత్తములు రెండూ పరస్పర సాకారులు కనుక రెండూ సమానమైనవి. అయినా మనస్సు ఆ రెంటిలో ఉత్కృష్టమైనది. ఎందుకంటే మనస్సు నుంచే చిత్తము యొక్క క్రియ పుట్టినది, అంతేకాని చిత్తము నుంచి మనస్సు పుట్టలేదు సుఖమును దుఃఖమని భావించటము, దుఃఖమును సుఖమని భావించటము కేవలము మనస్సు యొక్క పని. మనస్సు దర్శించని వస్తువనేది లేదు.

గింజ నుండి వృక్షము, లత, పత్రము, పుష్పములు పుట్టినట్లు మనస్సు నుంచే జగత్తు స్వప్నము, వాసన, చింత, విలాసములు అన్నీ పుడతాయి.


నాట్యశాలలో ఒకే నటుడు నానా ప్రకారములైన వేషాలు ధరించి, నానా రకాల భావాలను ఎట్లా ప్రదర్శిస్తాడో అట్లాగే మన మనస్సు కూడా జాగ్రత్, స్వప్న రూపాలలో పుట్టి, అన్ని సమయాలలోనూ నానా రకాల ఆలోచనలు చేస్తుంది. మనస్సు స్వయంగా నిరాకారం అయినప్పటికీ ఎప్పుడూ తాత్కాలిక సాకారమైనది కావటంవలన జీవుడు ఎప్పుడూ పుడుతూ చస్తూ ఉంటాడు.


తిలలో తైలము ఉన్నట్లు, మనస్సులో సుఖ దుఃఖములు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. సమయాన్ని బట్టి అప్పుడప్పుడు తగ్గటం, అప్పుడప్పుడు పెరగటం జరుగుతుంది.

ఎవరి మనస్సు నిశ్చలము, ఒకే విషయము మీద లగ్నము కాగల శిక్షణను పొందుతుందో,

అదే పరబ్రహ్మ యొక్క ధ్యానం చెయ్యటంలో సమర్థవంతమైనది అవుతుంది.


మనో సంయమనం వలన సంసారిక విలాసాలలో శాంతి లభిస్తుంది. ఉద్వేగ రహితమైతే మనోజనం లభిస్తుంది. మనస్సును జయించిన వారికి త్రిలోక విజయం కూడా తుచ్ఛమైనది గానే అనిపిస్తుంది. మనోజయమంటే తాను తన భావంలో అంటే పూర్ణబ్రహ్మంలో స్థిరంగా ఉండటమని అర్థము. చంచలత్వము మనస్సు యొక్క రూపము, అగ్ని యొక్క ధర్మము ఉష్ణత అయినట్లు, మనస్సు యొక్క ధర్మము చంచలత.


స్పందన లేకుండా వాయువు యొక్క శక్తి అనుభవంలోనికి రానట్లు, చంచలత్వం లేకపోతే మనస్సు యొక్క ఉనికి తెలియబడదు.

చంచలత్వము లేని మనోస్థితియే మోక్షము. మనోనాశమైతే దుఃఖమునకు శాంతి లభిస్తుంది. మనస్సు యొక్క చంచలత్వమును, అవిద్యావాసనలను వాటి వివేచన ద్వారా వదిలిపెడితే మోక్షం లభిస్తుంది.


సత్, అసత్తుల మధ్యనుండేది చిన్మయత్వము. చిన్మయత్వ జడత్వముల మధ్యనున్న అవస్థను మనస్సు అని అంటారని తెలిస్తే జడత యొక్క అభ్యాసం వలన మనస్సు జడముగాను, వివేకము యొక్క అభ్యాసము వలన మనస్సు చైతన్య రూపంగాను మారిపోతాయి. భావనాయుతమైన అస్థిర మనస్సును వివేకయుతమైన మనస్సుతో ఉద్ధరించాలి. రాజు తప్ప మరెవ్వరూ ఇతర రాజును జయించలేనట్లు, మనస్సును మనస్సే తప్ప మరేదీ జయించలేదు.


ఆత్మకు ముక్తి కలగటానికి, మనస్సును జయించటం తప్ప వేరే ఉపాయం లేదు. మనస్సే కర్మఫలమును అనుభవిస్తుంది. మనస్సులోనే అనంతమైన సుఖదుఃఖములు కలుగుతాయి. శరీరంలో ఏమీ కావు. జడ శరీరము సుఖ దుఃఖములను అనుభవించలేదు. మనస్సు కర్త. అందుకే మనస్సును మానవునిగా గుర్తించాలి. మనస్సు యొక్క ఆద్యంతములు నశించిపోయేవే అయితే, దాని మధ్య భాగములను కూడా అసత్ అనే చెప్పాలి. మనస్సు యొక్క ఈ అసత్ రూపం ఎవరికి తెలియదో వారికి దుఃఖానుభవము అనివార్యము అవుతుంది. మనస్సు దేనిని చేస్తుందో అదే అవుతుంది, దేనిని చేయదో అది కానే కాదు.

ఈ విశ్వము మనోవృత్తి స్వరూపము. మనస్సే అన్ని కర్మలకు, అన్ని చేష్టలకు, అన్ని భావాలకు, అన్ని గతులకు బీజము. ఈ మనస్సు పరిత్యజించ గలిగితే, అన్ని కర్మలూ పరిత్యక్తవౌతాయి. అదే అన్ని దుఃఖాలకూ లక్ష్యం అవుతుంది.


అన్ని కర్మలకూ భయహేతువవుతుంది.

పట్టు పురుగు తాను ఉండటానికి గూడు కట్టుకొన్నట్లే మనస్సు కూడా తాను ఉండటానికి ఈ శరీరాన్ని నిర్మించుకొన్నది. పట్టుపురుగు గూడు ఆ పట్టుపురుగు కన్న వేరు కానట్లు మనస్సు శరీరాలలో తేడా లేదు. మనస్సే శరీరమునకు ఉపాదానము. అంతేకాక మనస్సులోనే అన్నీ సంభవిస్తాయి. మనస్సులో పుట్టని శక్తి అనేది ఏదీ లేదు. చిత్‌ ప్రతిబింబ స్వరూపమైన మనస్సే జీవుడై, తానే కల్పించుకొన్న భూత భవిష్యత్ వర్తమాన కాలాత్మకమైన జగత్తు యొక్క నిర్మాణ పరివర్తన వినాశములకు కర్తయై, స్వయం వ్యక్తమవుతుంది. ధాన్యంలో బియ్యం ఉన్నట్లుగా ఈ ప్రపంచమంతా బ్రహ్మలోనే ఉన్నది. ఈ జడ జగత్తును అస్తిత్వము లేదు...

నిర్వాణ షట్కము. శ్రీ ఆదిశంకరులు.

 మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం

న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే

న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః

చిదానందరూపః శివోహం శివోహం

చిదానందరూపః శివోహం శివోహం



నేను మనస్సు కాదు - నేను బుద్ధి కాదు - నేను జ్ఞానం కాదు - నేను అహంకారం కాదు

నేను - చెవి, నాలుక, ముక్కు, కన్ను - ఇందులో ఏ ఇంద్రియమూ కాదు

నేను - ఆకాశం, భూమి, అగ్ని, వాయవు - ఏదీ కాదు

నేను - ఆనందరూప చిత్తమయిన - శివుణ్ణి



                                                                                 2

న చ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయుః

న వా సప్తధాతుః న వా పంచకోశః

న వాక్పాణిపాదం న చోపస్థపాయుః

చిదానందరూపః శివోహం శివోహం

చిదానందరూపః శివోహం శివోహం

 

 



నేను - ప్రాణానికి ఉనికి కాదు - ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన మొదలైన పంచ వాయువులు కాదు

నేను - రస, రక్త, మాంస, మేద, అస్థి, మజ్జ, శుక్ర - మొదలైన సప్తధాతువులు కాదు; నేను - అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాది పంచకోశాలు కాదు

నేను - మాట, చేయి, పాదం, విసర్జకావయవాలు - ఏదీ కాదు

నేను - ఆనందరూప చిత్తమయిన - శివుణ్ణి


టెక్

                                                                                  3

న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ

మదో నైవ మే నైవ మాత్సర్యభావః

న ధర్మో న చార్థో న కామో న మోక్షః

చిదానందరూపః శివోహం శివోహం

చిదానందరూపః శివోహం శివోహం



నాకు - ద్వేషం, అనురాగం, లోభం, మోహం - ఏదీ లేదు

నాకు - మదం (గర్వం), అసూయ - లేవు

నాకు - ధర్మార్థ కామ మోక్షాలు - ఏవీ లేవు

నేను - ఆనందరూప చిత్తమయిన - శివుణ్ణి



                                                                                4

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం

న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా

అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా

చిదానందరూపః శివోహం శివోహం

చిదానందరూపః శివోహం శివోహం



నాకు - పుణ్యం, పాపం, సుఖం, దుఃఖం - ఏవీ లేవు

నాకు - మంత్రం, పుణ్యతీర్థం, వేదం, యజ్ఞం - ఏవీ లేవు - దేనికీ నేను బద్ధుడిని కాదు

నాకు అనుభవం లేదు - నేను అనుభవించబడునది కాదు - నేను అనుభవించువాడను కాదు

నేను ఆనందరూప చిత్తమయిన శివుణ్ణి



                                                                               5

న మే మృత్యుశంకా న మే జాతి భేదః

పితా నైవ మే నైవ మాతా న జన్మః

న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యం

చిదానందరూపః శివోహం శివోహం

చిదానందరూపః శివోహం శివోహం



నాకు - మరణమంటే భయం లేదు - జాతి భేదం లేదు

నాకు - తండ్రి లేడు - తల్లి లేదు - జన్మ లేదు

నేను - బంధువులు కాను - స్నేహితుడిని కాను - గురువును కాను - శిష్యుడిని కాను

నేను - ఆనందరూప చిత్తమయిన - శివుణ్ణి



                                                                               6

అహం నిర్వికల్పో నిరాకార రూపః

విభుర్వ్యాప్య సర్వత్ర సర్వెంద్రియాణాం

సదామే సమత్వం న ముక్తిర్న బంధః

చిదానందరూపః శివోహం శివోహం

చిదానందరూపః శివోహం శివోహం



నాకు - మార్పు లేదు - ఆకారం లేదు

నేను - అన్ని ప్రదేశాలలో - అన్ని ఇంద్రియాలలో - వ్యాపించి వున్నాను

నాకు - అన్నిటా సమదృష్టి ; నాకు - బంధము లేదు - నాకు విముక్తి లేదు

నేను ఆనందరూప చిత్తమయిన శివుణ్ణి

ఆకలి.. నేరం

 అమెరికా పోలీసులు ఒక 15 ఏళ్ళ కుర్రాడిని అరెస్ట్ చేసి కోర్ట్ లో ప్రవేశ పెట్టారు 

జడ్జి విషయమేంటని అడిగితే 

ఈ అబ్బాయి ఒక బేకరీ లో బ్రెడ్ దొంగతనం చేసి పారిపోతుండగా అక్కడ వాచ్మాన్ పట్టుకున్నాడని అప్పుడు పెద్ద అద్దం పగిలిపోయిందని అందుకుగాను ఆ యజమాని కంప్లైంట్ ఇచ్చినట్టు చెప్పారు 


జడ్జి: దొంగతనం చేసావా 

పిల్లాడు : అవును మేడం 


జడ్జి :ఏమీ దొంగతనం చేసావు 

పిల్లాడు: ఒక బ్రెడ్ ప్యాకెట్ 


జడ్జి: డబ్బులిచ్చి తీసుకుని ఉండొచ్చుగా 

పిల్లాడు :డబ్బులు లేక తీసుకున్నాను మేడం 


జడ్జి :ఇంట్లో వారిని అడిగి ఉండొచ్చుకదా 

పిల్లాడు :అమ్మ మాత్రమే ఉన్నారు అందులోనూ         

              అనారోగ్యం అన్నాడు 


జడ్జి :ఏదైనా పని చేయొచ్చుగా నువ్వు 

పిల్లాడు :ఒక కారు షెడ్ లో పనిచేస్తుండేవాడిని         

              మేడం అమ్మకు అనారోగ్యమని ఒక్కరోజు  

             సెలవు పెట్టినందుకు పని నుండి తీసేసారు 


జడ్జి :ఇంకెక్కడైనా పని చేయొచ్చుగా 

పిల్లాడు :ఉదయం నుండి యాభై మంది దాకా పని 

                 అడిగాను ఒక్కరుకూడా ఇవ్వలేదు 

               సూర్యుడు అస్తమించేసాడు ఇక ఏమీ  

               చేయలేక ఈ పనిచేశానని 

                 తలదించుకున్నాడు 


పిల్లాడితో సంభాషించాక జడ్జి తీర్పు రాయడం మొదలుపెట్టారు 

ఈరోజు ఈ పిల్లాడి పరిస్థితికి అందరం నేరస్థులమే నాతో సహా 

ఆకలి అంటున్న అబ్బాయికి ఒక్క స్నేహహస్తాన్ని అందించలేక పోయాము 

అందుకు జరిమానా ఇక్కడ కోర్ట్ లో ఉన్న ప్రతిఒక్కరు ఇతడిని పట్టుకున్న పోలీసులు నాతో సహా అందరూ 10 డాలర్ లు కట్టాలి 

ఏ ఒక్కరు కట్టకుండా బయటకు వెళ్ళలేరు 

ఇక ఇతడిపై కేసు పెట్టిన షాప్ యజమాని 100 డాలర్ లు జరిమానా కట్టాలి 


ఈ మొత్తాన్ని ఆ పిల్లాడికి అందించాలి అని తీర్పు రాశారు 

ఆ పిల్లాడు అక్కడ ప్రజలు ఆ జడ్జి తీర్పుకు ఆశ్చర్యపోయారు 

ఆ పిల్లాడు తల ఎత్తి జడ్జి ని చూడగా బాధతో కళ్ళ వెంట కన్నీళ్లు 


సమాజంలో ఆకలి కోసం దొంగతనం జరుగుతున్నది అంటే మనం అందించలేని ఆ స్నేహహస్తమే కారణం అని ఆ జడ్జి తలవంచుకున్నారు 


ఇంకా ఏదో ఒక మూల నీతి నిజాయితీ బతికేఉన్నదని ఇలాంటివారిని చూసినప్పుడే అనిపిస్తున్నది 


ఆకలి అన్నవారికి అన్నం పెట్టేదం 

ఆకలి విషయంలో అబద్ధం ఆడలేరు కదా ఎవరైనా 


నా హృదయం..


#Copypost

🌹బుద్ది - హృదయం..🌹




అర్ధం చేసుకోవడం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బుద్దితో, రెండవది హృదయంతో. ఈశ్వరార్పణం అనేది ఎప్పుడూ బుద్ధితో జరగని పని. ఎందుకంటే బుద్ధి ఎప్పుడూ అహంకారాన్ని దాటిపోదు.


 కర్మ నాది, ఫలం నీది అనే సూత్రాన్ని బుద్ధి అర్ధం చేసుకోలేదు. హృదయం తో అర్ధం చేసుకోవడం అంటే, లభించిన ప్రతీది పరమాత్మ ప్రసాదమే అని గ్రహించడం.


 తర్కము కానీ, బుద్ధి కానీ ఎందుకు? Why? అని ప్రశ్నిస్తాయి. ఆ ఎందుకు అనే దానికి జవాబు దొరకకపోతే అవి వెనక్కి వచ్చేస్తాయి. ఎక్కడ ఈ ఎందుకు? అనే దానికి జవాబు దొరకదో, అక్కడ హృదయం శోధిస్తుంది.


 ఏది బయట ద్వారా లోపలికి తీసుకోబడుతుందో, దానికి ఆహారం అని పేరు. అంటే భోజనం ఒక్కటే కాదు. మనం ఇంద్రియాల నుండి లోపలికి తీసుకునే ప్రతీది, ప్రాణాన్ని ప్రాణంలోకి సమర్పించడానికి అనువుగా ఉండాలి.


 మనం తీసుకునే ఆహారం, ప్రాణానికి ఉత్తేజం, ఉద్వేగం కలిగించి, ప్రాణం బయట వస్తువుల వైపు పరుగులు తీసేలా చేస్తుంది. ఆ పరుగుని ఆపగలిగితే ఈ ప్రాణం, మహాప్రాణంలో విలీనం అవుతుంది.


ఈ ప్రపంచంలో అజ్ఞానానికి మించిన మృత్యువు ఏదీ లేదు. శరీరంలో శరీరం గురించి తప్ప మరే తత్త్వము తెలియని వాడు అజ్ఞాని. "నేను" అనేది తెలుసుకోగలిగేదే జ్ఞానము. మనం ఉన్నాము అనే ఎరుక కలిగివుండి, ఆ మనం ఏమిటో తెలియక పోవడమే అజ్ఞానం. తెలియడం జ్ఞానం.

🌷నిరంతరస్మరణ🌷*

 *

🌴🌴🌴🌹🌴🌴🌴

    *_🌴'అంత్యకాలంలో ఎవరైతే నన్ను స్మరిస్తారో వారు నిశ్శందేహంగా నన్నే చేరుకుంటారు, వారికి మరు జన్మ అంటూ ఏదీ ఉండదు.'అని కృష్ణపరమాత్మ సెలవిచ్చేరు. మనం ఒక పరీక్ష పాసు కావాలన్నా, కొంత కాలం పాటు అభ్యాసము, సాధన అవసరము . సంవత్సరం అంతా కష్టపడి చదివితే పరీక్షల సమయంలో అన్నీ చక్కగా గుర్తుకు వస్తాయి. తేలికగా ఉత్తీర్ణులం కాగలము. అంతే కానీ అప్పటికప్పుడు చదివితే ఉత్తీర్ణులం కాలేము కదా!. కొంత అభ్యాసం లేకుండా ఏపనీ చేయలేము కదా. అలాగే అంత్యకాలంలో భగవంతుడు గుర్తుకు రావాలంటే జీవిత కాలం అంతా కూడా భగవంతుని స్మరించడం ముఖ్యం. జీవితం అంతా దుష్ట ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు, కామ సంబంధమైన ఆలోచనలతో గడిపితే అంత్య కాలంలో కూడా అవే గుర్తుకు వస్తాయి కానీ పరమాత్మ గుర్తుకు రాడు. కాబట్టి అంత్యకాలంలో కూడా పరమాత్మ స్మరణకు రావాలంటే, నిరంతరము భగవంతుని ఆలోచన, చింతన, స్మరణ, ధ్యానము ముఖ్యము. వీటి పట్ల నిర్లక్ష్యము, సోమరితనం ఎట్టి పరిస్థితిలలోనూ రానీయకుండా చూసుకోవాలి. 🌴_*

తాటంకయుగళీభూతతపనోడుపమండలా

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 23 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


 ‘తాటంకయుగళీభూతతపనోడుపమండలా’  


ఇది చాలా పవిత్రమైన నామములలో ఒకటి. పవిత్రము కాని నామము ఉండదు. సౌభాగ్యము కటాక్షించడము చేత ఈ నామము శక్తి మిక్కుటముగా ఉంటుంది. అంక అనగా గుర్తు. తాటంక అనగా సౌభాగ్యసూచకముగా చెవిలో తాటాకు గుర్తుగా పెట్టబడినది. ఈమె సౌభాగ్యవతి అనగా ఐదవతనమును కలిగి ఉన్నది. రెండింటిని ఐదవతనమునకు చాలా పవిత్రముగా చెపుతారు. ఒకటి తాళి, రెండు తాటంకము. ఆడపిల్లలకీ, మగపిల్లవాడికీ చెవులు కుట్టిస్తారు. చెవులు ఓంకార సూచనతో ఉంటాయి. ఒక వయసు వచ్చేసరికి చెవి తమ్మెను సూర్యకిరణములకు అడ్డుపెట్టి చూస్తే వెనక నుంచి రంధ్రము కనపడుతుందని అంటారు. ఆ రంధ్రము దగ్గర రంధ్రము చెయ్యాలని సనాతన ధర్మము చెపుతున్నది. అందుకని చెవులు కుట్టిస్తారు అనగా దానికి ఒక కన్నము చేస్తే అందులోనుంచి గాలి బయటికి వెళ్ళాలి. అలా వెళితే ‘మ్’ అన్న పూర్ణత్వము వచ్చి ఓమ్ అవుతుంది. అకార, ఉకార, మకారములు పక్కన ఉన్న నాదము కలిస్తే అది ప్రణవము అవుతుంది. అలా ప్రణవము అయితే తప్ప దానికి ఉపదేశము పొందడానికి అర్హత ఉండదు. 

ఆడపిల్ల వివాహసమయములో గౌరీపూజ చేసి వెళ్ళి పెళ్లి పీటల మీదకి వెళ్ళి కూర్చుంటుంది. పెళ్ళికొడుకు ఆమె మెడలో తాళి కట్టాక ఆడపిల్ల చెవికి తాటాకును తగిలించాలి.  లేదా ఒక కొత్త తాటాకుముక్క ఆమె చెవి కన్నములోనికి దూర్చాలి అన్నారు. అమ్మవారి చెవులు కూడా  తాటాకు చేత గుర్తు పెట్టబడిన చెవులు. అనగా ఆమె చెవులు సౌభాగ్య సూచనలు. అమ్మవారిది తరగని సౌభాగ్యము. పరమశివుడు ఎప్పుడూ సంతోషముగా ఉండగలుగుతున్నాడు, ఆయనను కాలము గ్రసింపలేదు అంటే అమ్మవారు చెవికి పెట్టుకున్న ఆభరణము యొక్క గొప్పతనము. తాళ శబ్దము మీద స్త్రీ మెడలో తాళి, చెవిలో ఉండే తాటంకము ప్రధానమైనవి. తాటాకుకి ఇంత గొప్పతనము ఎందుకు అనగా తాటి ఆకు సౌభాగ్య చిహ్నము. మామూలు తాటాకుకే అంత శక్తి ఉంటే ఆ ఆభరణములు ధరించిన అమ్మవారి చెవులు ఎంతో శక్తివంతమైనవి కనకనే వాటిగురించి విన్నా, మానసికముగా చూసినా ఉత్తర క్షణములో సౌభాగ్యములు నిలబడతాయి. దశమి, శుక్రవారము సాయంత్రము వింటే మరింత పవిత్రము. ఆవిడ తాటంకములు పెట్టుకున్నప్పుడు తపన – ఉడుప – యుగళీభూత. ఒక చెవికి సూర్యుని, ఒక చెవికి చంద్రుని పెట్టుకున్నది. 


చెవిని అంత ప్రధానముగా తీసుకుని అక్కడ తాటాకు పెట్టి అంత సౌభాగ్యస్థానమని నిర్ణయించడానికి కారణము ఉన్నది. మామూలుగా చెవికి పెట్టుకునే ఆభరణములో సర్వమంగళా దేవిని ఉపాసన చేసిన స్త్రీ సౌభాగ్యములో ఏ విధమైన ప్రమాదము ఉండదని చెపుతున్నప్పుడు సూర్య చంద్రులే తాటంకములుగా ఉన్న తల్లి సౌభాగ్యమునకు హద్దు ఉండదు. కాలగతిలో లోకములు అన్నీ పడిపోతున్నాయి. సూర్య చంద్రులు ఆవిడకు ఆభరణములయి ఉన్నారు. ఆవిడ నిత్యసౌభాగ్యవతి. నిత్యమంగళ, సర్వమంగళ. 


దేవతలలో బ్రహ్మాదులు కూడా వృద్ధాప్యము రాకూడదు, రోగములు రాకూడదని కోరుకుని పాలసముద్రమును మధించారు. అమృతము వస్తుంది దానిని త్రాగాలని అనుకున్నారు. ఆ సమయములో ఏది వచ్చినా దేవతలో, రాక్షసులో ఎవరో ఒకరు పుచ్చుకున్నారు. అమృతం వచ్చిన తరవాత అందరూ పుచ్చుకున్నారు. ఎవరూ పుచ్చుకోకుండా వదలి వేసినది హాలాహలము. అది పుట్టినప్పుడు మహావిష్ణువు, బ్రహ్మగారు అక్కడే ఉన్నారు. అది పుట్టగానే అందరూ శివుని దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళారు. ‘ఈశ్వరా! అమృతము కోసము పాలసముద్రము మధించాము. హాలాహలము వచ్చింది లోకములను కాల్చేస్తున్నది. ప్రాణికోటి నాశనమయిపోతున్నది. దానిని మీరు పుచ్చుకుంటారేమో అని వచ్చామన్నారు. శివుడు ఆ హాలాహలమును తాను పుచ్చుకుంటానని పార్వతికి నచ్చ చెప్పాడు. నీ అన్నగారు శ్రీమహావిష్ణువు లోకములను కాపాడాలి. అవి పాడైపోతే ఆయన బెంగ పెట్టుకుంటాడు. నేను పుచ్చుకుని లోకములను కాపాడతానని అన్నాడు. పార్వతీదేవి అందుకు అంగీకరించింది. ఆయన హాలాహలమునకు ఎదురు వెళ్ళి పట్టుకుని చేతితో నలిపి చిన్న ముద్దగాచేసి చక్కగా నోట్లో పెట్టుకుని ఉదరములోని లోకములు నాశనము అవుతాయని కడుపులోకి వెళ్ళనియ్యకుండా కంఠములో పెట్టుకుని నీలకంఠుడు అయ్యాడు.


సౌందర్యలహరిలో శంకరులు – ‘అమ్మా! నూరు యజ్ఞములు చేసిన ఇంద్రుడు కాలగతిలో వెళ్ళిపోయాడు. అమృతము త్రాగిన బ్రహ్మగారు వెళ్ళిపోయారు. ఒక్కక్క యుగములో ఒక్కక్క బ్రహ్మ వెళ్ళిపోతున్నారు. అందరి పుర్రెలు దండలా కట్టి శివుడు మెడలో ధరించాడు. శివుడు మాత్రం అలాగే ఉన్నాడు జుట్టుకూడా తెల్లబడలేదు అంటే అది నీ చెవి తాటంకముల మహిమ’ అన్నారు. ఎంతో గొప్పదైన ఈ నామమును లలితాసహస్రనామ స్తోత్రములో ప్రతిరోజూ అనుసంధానము చేసినా సౌభాగ్యస్థానము రక్షింపబడుతుంది. 


https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage

త్రికరణశుద్ధి


చెట్టు మీద పిట్ట వాలుతుంది. ఓ కొమ్మపై గూడు అల్లుతుంది. అందులో గుడ్లు పెడుతుంది. అవీ పక్షులై పెరుగుతాయి. ఆహారం కోసం దూర తీరాలకు ఎగిరిపోతాయి. వెళ్లిన చోటే రాత్రి పూట గడపవచ్చు. కానీ, పక్షులు అలా చెయ్యవు. అవి తిరిగి సాయంకాలం గూళ్లకు చేరుతాయి. మనిషి జీవన స్థితీ అంతే. చైతన్యం సృష్టించిన గూడే శరీరం. అందులో పుట్టే భావాలు పక్షులు. అవి తొడుక్కునే రెక్కలే ఆలోచనలు. అవీ ఎగురుతాయి. జీవితం విస్తరించిన మేర సంచరిస్తాయి. విన్నవి, కన్నవి అనుభవాలవుతాయి. వీటన్నింటి సమాహారమే- మనసు. అది అత్యంత శక్తిమంతమైనది, చంచలమైనది. ఎంత దూరాన్నైనా క్షణాల్లో చేరగలదు. తలచుకుంటే నిశ్చలంగా ఉండగలదు. అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యగలదు.

పంచభూతాలతో శరీరం తయారవుతుంది. ఆ తరవాతే మనసు నిర్మాణం జరుగుతుంది. శరీరం లేకుండా మనసు మనగలదా? లేదు. మనిషంటే ఎవరు? అతడి ఉనికి తెలిపేది ప్రధానంగా అతడి- ఆకృతి(రూపం). అంటే, శరీరమే కదా. ‘మనసు’- అనుసంధాన కర్తగా పనిచేసే మధ్యవర్తి. ఒక వైపు చైతన్యం మరోవైపు శరీరం ఉంటేనే కదా ఆ రెండింటి మధ్య వంతెనలా మనసు ఉండగలిగేది.

శరీరం నిండా చైతన్యం పరచుకొని ఉంటుంది. మనసూ చైతన్యాంశమే. కానీ, దేహం నుంచి వీడిపోయిన మనసు తెగిన గాలిపటం లాంటిది. దాని పయనం అగమ్యగోచరం. వీధుల్లో అక్కడక్కడా అర్థం పర్థం లేకుండా తిరిగే పిచ్చివాళ్లను గమనించండి. వాళ్లు వర్తమానంతో తెగిపోయిన మానసిక బాధితులు. ప్రస్తుత క్షణంతో వారికి ఏ సంబంధమూ ఉండదు. వాళ్లు అస్తమానం గతంతో సంభాషిస్తారు. అంటే, జరిగిపోయిన(దూరమైన) పాత సంఘటనలతో మాట్లాడటం.

ఇంటి కాపలాదారు గృహం వద్దే ఉండాలి. కానీ, బాధ్యతలు మరచి జులాయిలా షికార్లు చేయడంలో అర్థం ఉందా? లేదు. మనసులేని మనిషి మర యంత్రంతో సమానం. మనిషి- ఆలోచనలతో ఉన్నప్పుడు మనసు బయట ఉంటుంది. గమనింపుతో, ఎరుకతో ఉన్నప్పుడు మనిషి లోపల ఉంటుంది. మనసున్న మనిషే మనీషిగా మారతాడు. అందుచేత ‘మనసు’ మనిషి దగ్గరే ఉండాలి. అందువల్లే కఠోపనిషత్తు- ‘శరీరం ఒక రథం లాంటిది, మనసు ఆ రథాన్ని నడిపే సాధనం’ అని చెబుతోంది.

మనిషి(మనసు) ప్రమేయం లేకున్నా శరీరం తన విధులు చక్కగా నిర్వర్తిస్తుంది. లయ తప్పకుండా గుండె కొట్టుకుంటుంది. ఊపిరితిత్తులు శ్వాసక్రియలు జరుపుతూ ఉంటాయి. ఔషధ కర్మాగారమైన కాలేయం- శారీరకంగా అవసరమైన రసాయనాలు అందిస్తుంది. వడపోత కార్యక్రమం చేపడుతూ మూత్రపిండాలు రక్తశుద్ధి చేస్తాయి. తరాల నాటి పూర్వీకుల పోలికలు గుర్తుంచుకుని శతాబ్దాల తరబడీ పుట్టే సంతానానికి అచ్చుగుద్దినట్లు చేర్చుతుంది. ఈ క్రియలన్నింటికీ చైతన్యం పునాదిగా పనిచేస్తుంది. ఆ రెండింటికీ మనసు తోడైతే మూడూ ఒక్కటవుతాయి. అప్పుడు, ‘త్రికరణ శుద్ధి’ నెలకొంటుంది. ‘ధ్యానం’ పురివిప్పుకొంటుంది. ఆ స్థితిలో చేపట్టే ప్రతీపని ఒక ‘ప్రార్థన’ అవుతుంది.

నిలువ ఉన్న నీరు చెడిపోతుంది. పారే నది ప్రయోజనకారి అవుతుంది. మనసు మంచిగా ఉండాలన్నా, ప్రజల శ్రేయం కోరే ఆలోచనలు కలగాలన్నా ముందు శరీరం బాగుండాలి. అందుచేత దానితో రోజూ వ్యాయామం చేయించాలి. యోగాసనాల వల్ల శరీరానికి క్రమత ఏర్పడి ఆరోగ్యం చేకూరుతుంది. మనసులో మలినశుద్ధీ జరుగుతుంది. పరిశుద్ధమైన మనసే ధ్యానానికి సిద్ధపడుతుంది.

**హిందూ ధర్మం** 62

 **దశిక రాము*

విశ్వామిత్రుడు తాను చెప్పాలనుకున్నది పరోక్షంగా చెప్పినప్పటికి, వశిష్టమహర్షి మళ్ళిమళ్ళీ బ్రతిమిలాగా, చివరకు విశ్వామిత్రుడు వశిష్టులవారితో 'మిమ్మల్ని అది సంతోషపెడుతుంది కనుక అలాగే కానివ్వండి' అని సమాధానం ఇచ్చారు. ఈ మాట విన్న మహర్షి ఆనందంతో తన దగ్గర ఆశ్రమంలో పోషింపబడుతున్న శబల అనే పేరుగల ఆవును పిలిచారు, అది కామధేనువు, కోరినవన్నీ వెంటనే ఇస్తుంది.


రా రా శబల! త్వరగా వచ్చి నేను చెప్పింది విను. నేను గొప్ప రాజర్షికి సమానమైన విశ్వామిత్రునకు, అతని సైన్యానికి భోజనం ఏర్పాటు చేసి సేవ చేయదల్చుకున్నాను, నా కోసం వారందరికి నువ్వు భోజనం సిద్ధం చేయాలంటూ "ఓ కామధేనువా! నీవు కోరినవన్నీ ఇట్టే ప్రసాదిస్తావు. ఇక్కడున్న అందరి మనసుల్లో ఎవరికి ఏ ఏ ఆహారం ఇష్టమో గ్రహించి, వారి వారి అభిరుచులకు అనుగుణంగా షడ్రసోపేతమైన ఆహారన్ని ప్రసాదించు. ఓ శబలా! అన్నరాశులను, పాణీయాలను, రసాలను, లేహ్యాలను, చోష్యాలను, సర్వ విధములైన ఆహారమను సృష్టించు' అని ప్రార్ధించారు.


వశిష్టమహర్షి మాటలు విన్న శబల రకరకాల ఆహారపదార్ధాలను సృష్టించింది. చెఱుకుగడలు, తేనే మొదలైన మధురపదార్ధాలను, మంచి పాత్రలతో కూడిన పానీయాలను, సైన్యానికి నచ్చిన పదార్ధాలను, వారికి రాజసానికి తగ్గట్టుగా ఇచ్చింది. ఆహారం స్వీకరించడానికి వెండి పాత్రలు కూడా ఇచ్చింది. రోజు మామూలు ఆహరంతో అలవాటుపడిన సైన్యం ఈ విందు భోజనంతో బాగా సంతృప్తి చెందింది. రాజమందిరంలో ఉండే స్త్రీలు, పురోహితులు, పండితులతో కూడి ఆహారం స్వీకరించే విశ్వామిత్రుడికి ఈ భోజనం కొత్త శక్తిని ఇచ్చింది. ఇంత గొప్ప సత్కారానికి ప్రీతి చెందిన విశ్వామిత్రుడు ఎంతో సంతృప్తి చెంది, మహదానందంతో వశిష్టమహర్షితో ఈ విధంగా చెప్తున్నారు.


"ఓ భగవాన్! మీరు నాకిచ్చిన గౌరవానికి ముగ్ధుడనయ్యాను. నా తరుపున నేను మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాను. సర్వాన్ని ప్రసాదించగల ఈ శబలను మీరు నాకు ఒక ఇవ్వండి. నేను దీనికి బదులుగా శత శహస్ర (లక్ష)ఆవులను ఇస్తాను. ఈ గోవు పెద్ద సంపద. రాజు వద్దనే సర్వ సంపదలు ఉండాలి కనుక దీనిని నాకు అప్పగించండి. నిజానికి ధర్మాన్ని అనుసరించి ఈ శబల నాకు చెందుతుంది".  


తరువాయి భాగం రేపు.....

🙏🙏🙏

సేకరణ

మూకపంచశతి

 దశిక రాము**


*జయ జయ జగదంబ శివే*

*జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే|*

*జయ జయ మహేశదయితే* 

*జయ జయ చిద్గగన కౌముదీధారే||*


🏵️శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏


మూకపంచశతి


ఆర్యాశతకము


🌹21.

శ్లోకం


పురతః కదా ను కరవై


పురవైరి విమర్ద పులకితాంఙ్గలతామ్


పునతీం కాఞ్చీదేశం


పుష్పాయుధ వీర్య సరస పరిపాటీమ్౹౹


🌺 భావం: 


కామేశ్వరుని గాఢాలింగనముచే పులకిత శరీరయైన కామాక్షీ దేవి కాంచీపట్టణమును పునీతముచేయుచున్నది.

మన్మధవీర్య సరస పరిపాటియైన

ఆ త్రిపురసుందరీదేవిని నా యెదుట ఎప్పటికి సాక్షాత్కరింపచేసుకోగలిగెదనో గదా !🙏



🌼ఉపాసనాక్రమమున మూలాధారమునుండు కుండలినీ శక్తి , ఊర్ధ్వ ముఖముగా పయనించుచూ షట్చక్రములను దాటి సహస్రారమున ఉండు పరమేశ్వరునితో ఐక్యమగుటయే సాధకుని ఉపాసనాలక్ష్యము.అదియే జీవునిలోని శివశక్తుల కలయిక. అదియే అద్వైతసిద్ధి ! అట్టి ముక్తిసాధనకు అనువయినది ఏడు మోక్షపట్టణాలలో ఒకటి అయిన పవిత్ర కాంచీభూమి.అచట కామాక్షీ దేవి సాక్షాత్కార ప్రత్యక్షానుభవం కోసమై మూకకవీంద్రులు అమ్మను ప్రార్ధించుచున్నారు.🙏



🔱 అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ. 🔱


   🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🌹


సశేషం....


🙏🙏🙏 

సేకరణ


ధర్మము-సంస్కృతి

🙏🙏🙏


హిందూ సాంప్రదాయాలను 

పాటిద్దాం

మన ధర్మాన్ని రక్షిద్దాం


ధర్మో రక్షతి రక్షితః

🙏🙏🙏 

హిందూ ధర్మం - 22

 దశిక రాము

3. దమము - అంటే మనో నిగ్రహము, మనసును నిగ్రహించుకోవడం, అదుపులో పెట్టుకోవడం అని అర్ధం.. మీరు మీ మనసుమాట వినడం కాదు, మీ మనసు మీరు చెప్పినమాట వినాలి. మీరు చెప్పినట్టు నడుచుకోవాలి. మీ ఆజ్ఞను శిరాసావహించాలి. అదే దమము.


ఆధ్యాత్మికత గురించి తెలియని వారికి ఉభవించే మొదటి సందేహం 'నా మనసు నా మాట వినడం ఏమిటి? మనసంటే నేనే కదా. నా ఆలోచనలనే నేను కదా. ఇది ఎలా సాధ్యం?'. ఇది చాలా సాధారణంగా తలెత్తె సందేహం. దీనికి భారతీయ తత్వజ్ఞానం చక్కటి సమాధానం ఇస్తుంది. నిజానికి నువ్వు నీ మనసు కాదు, నీ శరీరం కూడా కాదు. నువ్వు శరీరానికి, మనసుకు అతీతమైన వాడివి. నువ్వు మనసును, శరీరాన్ని నడిపిస్తున్న చైతన్యస్వరూడివి, నువ్వు ఆత్మవి అంటుంది. శరీరానికి, మనసుకు, ఆత్మకు మధ్య గల భేధాన్ని, దూరాన్ని స్పష్టంగా చూపిస్తుంది.


ఈ లోకంలో మనసే బంధానికి, మోక్షానికి కారణం అంటుంది గీత. మనకున్న సగం కష్టాలకు, భాధాలకు కారణం మన మనసు గురించి మనకు తెలియకపోవడమే. మనకున్నభాధలకు, కష్టాలకు కారణం మన మానసిక స్థితి. మనసును సక్రమంగా అర్ధం చేసుకుంటే, ఈ ప్రపంచంలో ఉన్న బాధలన్నీ ఈ క్షణంలోనే నశించిపోతాయి. ఇది ఏ సైకాలజీనో, లేక మరే ఇతర ఆధునిక సైన్సు చెప్పిన విషయం కాదు. మన ఋషులు, యోగులు చెప్పినమాట. ఇది యధార్ధం. ఇది అర్ధం కావాలంటే సాధన చేయాలి.


తరువాయి భాగం రేపు......

🙏🙏🙏

సేకరణ


*ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏

https://t.me/Dharmamu


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

https://t.me/SANAATANA

మంగళ_సూత్రం_ఎలా_ధరించాలి

 #?

#అందరికీ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి

#సంభవామి_యుగే_యుగే


భార్య మంగళసూత్రాన్ని ఎలా ధరిస్తే 

భర్త వందేళ్లు జీవిస్తాడు? అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివి. 


  పెళ్ళైన స్త్రీకి అందం ఐశ్వర్యం మెడలో తాళి బొట్టు భర్త భార్యకి కట్టినప్పుడు వేద మంత్రాలతో ఆ తంతు జరుగుతుంది. భార్య మెడలో మంగళసూత్రం, నుదిటిన సింధూరం భర్త ప్రాణాలను సంతోషాలను కాపాడుతుంది. మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతి భర్త ఎందుకు తెలుసుకుని భార్య అలా మంగళసూత్రం వేసుకునేలా చూసుకోవాలి. 


  వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమైంది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుంచి పుట్టింది. పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో తాళి బొట్టు మాత్రమే కడతాడు.


  సంసారం నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో సాగాలని ఆ తర్వాత ఆడవారు మంగళ సూత్రంలో పగడాలు, ముత్యాన్నీ, చిన్న చిన్న విగ్రహాల్ని ధరిస్తారు. అలా ధరించడం ఫ్యాషన్ అని చాలా మంది అనుకుంటారు. అది పొరపాటు. అలా చేయకూడదు. అలాగే మంగళసూత్రం భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక. 


మంగళ అంటే శుభప్రదం, శోభాయమానం, 

సూత్రం అంటే తాడు, ఆధారమని అని అర్థం.


 వివాహంలో భాగంగా వరుడు వధువు మెడలో మూడుముళ్ళను వేస్తాడు. భర్త ఆరోగ్యంగా ఉండాలని, తన సంసారం నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో సాగాలని వధువు మెడలో మూడు ముళ్ళను వేయిస్తారు వేదపండితులు. ఆ ముక్కోటి దేవతల సాక్షిగా ఈ పెళ్లి జరిగినట్లు, దేవ దేవతలందరూ నూతన వధూవరులను దీవిస్తారని నమ్మకం.


అయితే ప్రస్తుతం కొందరు మహిళలు మంగళసూత్రాలను పక్కనబెడుతున్నా, మంగళసూత్రం బదులుగా నల్లపూసల హారాన్ని, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కు తగ్గట్లుగా ఉన్న మంగళసూత్రాలను ఉపయోగిస్తున్నారు. దక్షిణాదిన మంగళసూత్రాన్ని తాళిగా పలుకుతున్నారు. నలుపు, బంగారువర్ణంలో ఉండే మంగళసూత్రంలో ఆ పార్వతి పరమేశ్వరులు కొలువై ఉంటారట.


  నలుపు రంగు వర్ణంలో శివుడు, బంగారు వర్ణంలో పార్వతిదేవి కొలువైఉంటుంది. ఎటువంటి కీడు జరగకుండా, వధువు సుమంగళిగా ఉండాలని పార్వతిపరమేశ్వరులు స్త్రీ హృదయానికి అంటుకొనే ఉంటారు. అందుకే మంగళసూత్రాన్ని స్త్రీ హృదయం వరకు ఉండేలా చేస్తారు. హృదయస్థానానికి మంగళసూత్రం తాకుతూ ఉండటం వలన, ఆ స్త్రీ సుమంగళిగా ఉంటుంది.


 మంగళసూత్రం ధరించడం వలన స్త్రీకి ఎక్కడలేని శక్తి, ఎక్కడైనా పోరాడగలను,నెగ్గగలను అనే ధైర్యసాహసాలు కలుగుతాయట. మంగళసూత్ర్రాలలో పసుపుతాడును వాడుతారు. వరుడు మూడు ముళ్ళు వేసిన తర్వాత ఒక్కో ముడికి కుంకుమను అద్దుతారు. మంగళసూత్రాలను బంగారువి చేయించుకున్నా, మధ్యలో తాడు మాత్రం పసుపుతాడునే వాడాలి. ఇతర ఏ లోహాలతో తయారుచేసినవి వాడకూడదు. పసుపు కుంకుమలలో సర్వమంగళాదేవి ఉంటుందట.


 అయితే కొందరు మంగళసూత్రంపైన బొమ్మలు గీయించడం, రంగులు దిద్దిచడం వంటివి చేస్తుంటారు. కొంతమంది లక్ష్మీబొమ్మ మంగళసూత్రంపై కనిపించే విధంగా తయారుచేసుకుంటారు. అసలు ఇలాంటివి చేయించవచ్చా లేదానని ఇప్పుడు తెలుసుకుందాం.


 మనకు ఆదర్శ దంపతులు అంటే గుర్తుకువచ్చేది సీతారాములు. సీతమ్మ అంటే రాముడికి ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సీతమ్మ తల్లే తన మంగళసూత్రంపై రాముల వారి బొమ్మగాని, రంగులు కానీ వేయించుకోలేదట. సీత ఎలాగైతే మంగళసూత్రాన్ని చేసి వేయించుకున్నారో అలా చేస్తే ఖచ్చితంగా సిరిసంపదలు కలుగుతాయట. 


  కొంతమందికి వేంకటేశ్వరస్వామి అంటే ఇష్టం. మరికొందరికి దుర్గాదేవి అంటే ఇష్టం. ఇంకొంతమందికి మిగిలిన దేవుళ్ళంటే ఇష్టం. ఎవరికి ఇష్టమొచ్చిన దేవుడిని మంగళసూత్రంపై తయారుచేసి వేయించుకుంటుంటారు. అలా దేవుడి ప్రతిమలను అస్సలు మంగళ సూత్రాలపై వేసుకోకూడదట. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమను ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదట. ఒకవేళ వేసుకుంటే సిరిసంపదలు పోయి కష్టాలు ప్రారంభమవడం మొదలవుతాయట. కాబట్టి మంగళసూత్రాన్ని మామూలుగా వేసుకోవడం మంచిది.


  వాస్తవానికి మంగళసూత్రాన్ని పత్తి నుంచి తీసిన దారంతో గానీ, పట్టునుంచి వచ్చిన దారంతో గాని చేయాల్సి ఉంది. దీనికి ఒక సంపూర్ణమైన శాస్త్రమే వుంది. దీనిని ఒక తాంత్రిక విధానంతో, ఒక నాడిని మీ వ్యవస్థ లోంచి, మరొకటి మీకు నిశ్చితార్థం అయినవారి దగ్గర నుంచి తీసి, ఈ సూత్రాన్ని తయారుచేసి కడతారు. ఈ విధంగా సూత్రాన్ని తయారు చేశాక, ఎప్పుడైతే భౌతిక సాన్నిహిత్యం కలుగుతుందో అప్పుడు శక్తిపరమైన సాన్నిహిత్యం కూడా కలుగుతుంది. ఈ దంపతులు ఎంతగా ఒక్కటైపోతారంటే, ఇంక ఆ బంధాన్ని విడదీయలేరు. ఒకరి నుంచి ఒకరిని విడదీయడమన్నది ఎంతో కష్టమైనది.


  అలాగే భార్య మెడలోని మంగళసూత్రం భర్తను వివిధ రకాల దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది. మంగళసూత్రాల విషయంలో స్త్రీలు కచ్చితంగా కొన్ని విషయాలు పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళి యోగం సిద్ధిస్తుంది.


 ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపుని మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఐదోతనాన్ని ఇచ్చే పార్వతి దేవి కటాక్షిస్తుంది. మంగళసూత్రాలకు పిన్నీసులు, ఏ ఇతర ఇనుముకి సంబంధించిన వస్తువులు పెట్టకూడదు.


మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందకి ఉండాలి.


మంగళసూత్రాలకి ఎప్పుడు ఎరుపు (పగడం) నలుపు పూసలు ఉండాలి. పొరపాటున మంగలసూత్రం పెరిగితే ( తెగిపోతే ) వెంటనే 5 వరసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకుని దానిని ఆడపడుచు చేత కాని భర్త చేత కాని వేయించుకోవాలి. ఇంకా ఎవరు లేకపోతే తమకు తామే వేసుకోవాలి. మంచి రోజు చూసి ఉదయం 9 గంటల లోపు మళ్లీ మంగళసూత్రాన్ని (బంగారు తాళిని) వేసుకోవాలి. ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుష్షు బలంగా ఉంటుంది. వందేళ్లు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలు చెప్తున్నాయి


#అందరికీ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి

#సంభవామి_యుగే_యుగే


అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " సంభవామి యుగే యుగే "ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం. https://www.facebook.com/sambhavami2498/


అందరం భక్తితో " శ్రీ మాత్రే నమః " అని వ్రాసి పరబ్రహ్మ వారి అనుగ్రహం పొందుదాం ... 

ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తుంది ఆ జగన్మాత


శ్రీ మాత్రే నమః

ప్రవచనములు


 

గ్రామ దేవతల పేర్లు

 

విజయవాడ దుర్గమ్మ తల్లి సాక్షిగా...!!!!


💐గ్రామదేవతలు 101 మంది అక్కాచెల్లెళ్ల పేర్లు :-💐


పార్వతి అమ్మోరు (అమ్మవారు )గా గ్రామాలలో గ్రామదేవతయై గ్రామాలను రోగాల బారినుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం .


ఈ అమ్మోరు మొత్తం 101 మంది అక్కాచెల్లెళ్లు అని వీరందరికి ఒకేఒక్క తమ్ముడు పోతురాజు అని అంటారు .వారిలో కొందరు .


1.పాగేలమ్మ

2.ముత్యాలమ్మ

3 .గంగమ్మ

4.గంగానమ్మ

5.బంగారమ్మ

6.గొంతెమ్మ

7.సత్తెమ్మ

8.తాళమ్మ

9.చింతాలమ్మ

10.చిత్తారమ్మ

11.పోలేరమ్మ

12.మావుళ్లమ్మ

13.మారెమ్మ

14.బంగారు బాపనమ్మ

15.పుట్టానమ్మ

16.దాక్షాయణమ్మ

17.పేరంటాలమ్మ

18.రావులమ్మ

19.గండిపోచమ్మ

20.మేగదారమ్మ

21.ఈరినమ్మ

22.దుర్గమ్మ

23.మొదుగులమ్మ

24.నూకాలమ్మ (అనకాపల్లి ,విశాఖజిల్లా )

25.మరిడమ్మ

26.నేరెళ్లమ్మ

27.పుంతలో ముసలమ్మ (మెయ్యెరు ,అత్తిలిదగ్గర ,పశ్చిమగోదావరిజిల్లా )

28.మాచరమ్మోరు

29.మద్ది ఆనాపా అమ్మోరు

30.సొమాలమ్మ

31.పెద్దయింట్లమ్మ

32.గుర్రాలక్క (అంతర్వేది ,తూర్పుగోదావరిజిల్లా గుర్రాలమ్మ )

33 .అంబికాలమ్మ

34.ధనమ్మ

35.మాలక్షమ్మ

36.ఇటకాలమ్మ

37.దానాలమ్మ

38.రాట్నాలమ్మ

39.తలుపులమ్మ

40.పెన్నేరమ్మ

41.వెంకాయమ్మ

42.గుణాళమ్మ

43.ఎల్లమ్మ (విశాఖపట్నం )

44.పెద్దమ్మ

45.మాంటాలమ్మ

46.గంటాలమ్మ

47.సుంకులమ్మ

48.జంబులమ్మ

49.పెరంటాలమ్మ

50.కంటికలమ్మ

51.వణువులమ్మ

52.సుబ్బాలమ్మ

53.అక్కమ్మ

54.గనిగమ్మ

55.ధారాలమ్మ

56.మహాలక్షమ్మ

57.లంకాలమ్మ

58.దోసాలమ్మ

59.పళ్ళాలమ్మ (వానపల్లి ,తూర్పుగోదావరిజిల్లా )

60.అంకాళమ్మ .

61.జోగులమ్మ

62.పైడితల్లమ్మ

63.చెంగాళమ్మ

64.రావులమ్మ

65.బూరుగులమ్మ

66.కనకమహాలక్ష్మి (విశాఖపట్నం )

67.పోలమ్మ

68.కొండాలమ్మ

69.వెర్నిమ్మ

70.దే శిమ్మ

71.గరవాలమ్మా

72.గరగలమ్మ

73.దానెమ్మ

74.మహాంకాళమ్మ

75.వేరులమ్మ

76.మరిడమ్మ

77.ముళ్ళ మాంబిక

78.యలారమ్మ

79.వల్లూరమ్మ

80.నాగులమ్మ

81.వేగులమ్మ

82.ముడియలమ్మ

83.రేణుకమ్మ

84.నంగాలమ్మ

85.చాగాలమ్మ

86.నాంచారమ్మ

87.సమ్మక్క

88.సారలమ్మ

89.మజ్జిగౌరమ్మ

90.కన్నమ్మ -పేరంటాలమ్మ

91.రంగమ్మ -పేరంటాలమ్మ

92.వెంగమ్మ -పేరంటాలమ్మ

93.తిరుపతమ్మ

94.రెడ్డమ్మ

95.పగడాలమ్మ

96.మురుగులమ్మ (బండారులంక ,తూర్పుగోదావరిజిల్లా )

97.కుంచమ్మ విశాఖపట్నంలో

98.ఎరకమ్మ

99.ఊర్లమ్మతల్లి

100.మరిడమ్మ

101.సుంకాలమ్మవ్వ ఉన్నారు .


💐నుసకపల్లి ,పామర్రమండలం తూర్పుదోదావరిజిల్లాలోని గ్రామదేవతలు .


1.నుసకపల్లమ్మ

2.వెలగలమ్మ

3 .ఊర్లమ్మతల్లి (గణపవరం ,కర్లపాలెం మండలం ,గుంటూరుజిల్లా )

4.పైళ్లమ్మతల్లి

5.బల్లమ్మతల్లి

6.లొల్లాలమ్మతల్లి

7.ఊడలమ్మ తల్లి

8.కట్వాలాంబిక

9.నాగాలమ్మ నాంచారమ్మతల్లి

10.సింగమ్మతల్లి

11.ఘట్టమ్మతల్లి

12.అంజారమ్మతల్లి .

13. మంత్రాలమ్మ తల్లి

14.పాతపాటేశ్వరి తల్లి

15.కుంకుళమ్మ ద్వారకా తిరుమల

16.చౌడమ్మ నందవరం కర్నూల్ జిల్లా


అలాగే ఖమ్మం ,నల్గొండ జిల్లాలలో ముత్యాలమ్మ తల్లి ఆరాధన ఎక్కువగా కానవస్తుంది .


💐అమ్మలగన్న అమ్మలు ఆదిపరాశక్తిలు గ్రామదేవతలకు వందనాలు,💐


💐💐మన గ్రామదేవతలు ఎలా వెలిశారు ?💐💐


మనం రకరకాల పేర్లతో పిలిచే గ్రామదేవతల నామ విశేషాలేమిటి?


💐గ్రామదేవతా వ్యవస్థ:💐


గ్రామాలలో వెలిసే దేవత...దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపాలను గ్రామదేవతలని అంటారు.


సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు.


ప్రాచీన కాలములో మానవుడు ఎంతో తెలివైనవాడు,

ఇంట్లోవున్న చిన్నా, పెద్దా, ఆడా, మగా - అందరూ దేవీనవరాత్రుల కాలములో ఎక్కడోవున్న మధుర మీనాక్షమ్మ వద్దకో,కంచి కామాక్షమ్మ దగ్గరికో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే

కుదరకపోవచ్చు.


ఒక్కోక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళే వీలుండక పోవచ్చు. వీలుచిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము

సాద్యపడకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో

అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేక పోయామే అని నిరాశ పొందకుండా వుండేందుకు

ఎక్కడో వున్న తల్లిని ఇక్కడే దర్శించు కొన్నామనే

తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేసారు పెద్దలు.


ఈ దేవతా ప్రతిష్ఠ గొప్ప విద్వాంసులైన వేద, స్మార్త,

ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది.


ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు

అర్చకునిగా వుండే తీరిక, ఓపిక వుంటాయో

అలాంటి వారిని వారి కోరిక మేరకు అర్చకులుగా

నియమించారు పూర్వీకులు.


అప్పటినుంచి ఆ అర్చకుని వంశము వాళ్ళే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు.


దేవతా విగ్రహప్రతిష్ఠ శాస్త్రీయంగా నిర్వహించబడింది

కాబట్టి, ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము

సరైన మూహూర్తములోనే జ్ వేయబడింది కాబట్టి

గ్రామదేవతలంతా శక్తివున్న దేవతలే అవుతారు-


భక్తుల కోర్కెలు తీర్చగలవారవుతారు.


అయితే ప్రతి సంవత్సరము ఆలయప్రతిష్ఠ జరిగిన

ఆ నెల, ఆ తిథినాడు ఖచ్చితముగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్చిందే. అలా చేయడమువలన అమ్మకి మన ద్వారాఏదైనా లోటు పాట్లు కలిగివుంటే తొలగుతుంది.


💐💐గ్రామదేవతల ఆవిర్భావము:💐💐


పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణముగానే ఈ ప్రపంచము ఏర్పడినది.


అందుకని ఈ పంచ భూతాలకి ప్రతీకలుగా ఐదుగురు

గ్రామదేవతలను ఏర్పాటు చేసారు

తొలి దశలో.


💐పృధ్వీ దేవత:💐

మొదటిది పృధ్వీ అంటే నేల,ఇది పంటకి ఆధారము,

కుంకుల్లు బాగా పండే ప్రాంతములో ప్రతిష్టించిన

పృధ్వినీ దేవతను కుంకుళ్ళమ్మ అన్నారు.


గోగులు బాగా పూచే ప్రాంతములో ఆ గోంగూర, గోగునార ఇవే వారి జీవన ఆధారము

కాబట్టి ఆపేరుతో గోగులమ్మని యేర్పాటు చేసారు.


జొన్నలు పండేచోట జొన్నాళమ్మ అని, నూకలు అంటే వరి పండే ప్రాంతాలలో నూకాళమ్మ అని పిలుచుకున్నారు.


మొదటిసారిగా పండిన పంటను ఆతల్లికే నివేదన చేయడము, అర్చకునిగా వున్నవానికి అందరూ ఆ పంటను యిస్తూ వుండడము, దాన్నే సొమ్ముగా

మార్చుకొని అతడు జీవించడము. ఇలా సాగుతూ వుండేదీ వ్యవస్థ.


పంట వేసేటప్పుడుకూడా ఈ తల్లిని ఆరాదిస్తేగాని

చేనుకి వెల్తూండేవారు కాదు. అన్నాన్ని పెట్టే తల్లి

కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత వుంది.


ఇక పంటలన్నీ చేతికందాక సుఖసంతోషాలతో

జాతర చేస్తూండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగూతూండడం జరుగుతూ ఉన్నది.


💐జల దేవత:💐

రెండవది జలానికి సంబంధించిన తల్లి గంగమ్మ–గంగానమ్మ. ఈ తల్లి భూమి మీద కాక భూమిలోపల ఎంతో లోతుగా వుంటుంది.గుడి ఎత్తుగా కట్టినా

తల్లిని చూడాలంటే మెట్లుదిగి కిందికి వెళ్ళ వలసి ఉంటుంది.


💐అగ్ని దేవత:💐

మూడవది తేజస్సు(అగ్ని). పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మనూ,రాత్రిపూట తేజస్సు నిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మ నీ దేవతలుగా చేసారు. ( చిత్తూరు పున్నమ్మ గుడిలో హారతి సమయంలో పంబల్లు వాయిస్తారు అది ఉంటూ హారతి చూస్తే అమ్మవారు ఆనందంతో వెలిగిపోతున్నట్టు కనిపిస్తోంది, ఎప్పుడూ అదే కొనసాగుతోందా తెలియదు).


సూరమ్మను ప్రతి అమావాస్యనాడు, పున్నమ్మను ప్రతి పౌర్ణమినాడు పూజించే విధముగా ఏర్పాటు చేసుకొని తమ కులవృత్తిని ఆరోజు మానేయడం చేసేవారు.


ఇక అమ్మకి కుడి కన్ను సూర్యుడుగానూ ఎడమ కన్ను చంద్రుడిగాను ఆతల్లికి పెట్టిన పేరు ఇరుకళలమ్మ (సూర్య,చంద్రుల కళ వున్న అమ్మ).


💐వాయు దేవత:💐

నాలుగవది వాయువు కరువలి అంటే పెద్ద గాలి.

కొండ ప్రాంతములో వుండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవము ఉండకుండా రక్షించేందుకు కరువలమ్మను యేర్పాటు చేసుకున్నారు.


💐ఆకాశ దేవత:💐

ఐదవది ఆకాశము ఎత్తులో వున్నందున కొండమ్మ ను

ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు,గాలివాన. ఇలాంటి వాటి నుండి

రక్షించేందుకు ఈ తల్లిని యేర్పాటు చేసుకున్నారు.


💐గ్రామదేవతా నామ విశేషాలు:💐


మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామదేవత

పేరు వెనుక ఒక పరమార్ధం ఉంది 


సొంతవూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల

రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో

వుండేతల్లి పొలిమేరమ్మ క్రమముగా పోలేరమ్మ అయింది.


ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము అందుకే 'ఎల్లమ్మ' కూడా ఈ పనిని చేసేదన్నమాట.


ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోసించే తల్లి

'పోచ+అమ్మ=పోచమ్మ' అన్నమాట.

ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు

రాకుండా నివారించేదైతే, పోచమ్మ పోషణ కలిగిస్తుంది.


ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే

ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల

(ఆ అవధినించి రక్షించగల) అమ్మే 'కట్టమేసే+అమ్మ=

కట్టమేసెయమ్మ కాలక్రమములో కట్టమైసమ్మ అయింది.


స్వచ్ఛమైన అమ్మ అనే అర్దములో (స్వచ్ఛమని)సు+అచ్చ= స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి అచ్చమ్మగా అయ్యింది.


సాధారణముగా 15 వూళ్ళకో దేవత వుంటుంది.

'మా వూళ్ళన్నింటికీ అమ్మ' అనే అర్దములో

ఆమెను మావూళ్ళమ్మ అని పిలుస్తూంటే

క్రమముగా అది మావుళ్ళమ్మ' అయింది.


ప్రజల మనసులో పుట్టే ఏ కోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరించి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ. తలపు అంటే ఆలోచన. వాటిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమముగా 'తలుపులమ్మ'గా మారింది.ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటపుడు తల్లికి

లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు.


శంకరునితో కలసి అర్దనారీశ్వర రూపముతో

అమ్మవారుండేది. ఆకారణముగా శంకరుని మెడమీద (గళము) మచ్చ (అంకం) కారణముగా

అంకగళమ్మ, అంకాళమ్మ గా మారిపోయింది.


పొలిమేరలో వుండే మరొక తల్లి శీతలాంబ.

ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి.

తన గ్రామములోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత

పిశాచ గణాలను గ్రామములోనికి రాకుండా

వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈ దేవతే.


పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి పుట్టమ్మ ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి.

అక్కడే సుబ్రహ్మణ్య షష్టికి అందరూ పుట్టలో

పాలు పోస్తారు. ఈ తల్లికే 'నాగేశ్వరమ్మ'

అని కూడా అంటారు. పాము+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి పాపమ్మ అని కూడా అంటారు.


సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరుమీదే 'సుబ్బ+అమ్మ=

సుబ్బమ్మ కూడా దైవముగా ఉంది. బతుకుకి కావలసిన వర్షాన్ని పంటనీ ఇచ్చే తల్లి బతుకమ్మ.


గ్రామప్రజల మంచిని చూసే (కనే) అమ్మ కన్నమ్మగా

ఎప్పుడూ సత్యాన్ని (నిదర్శనాలని) చూస్తూవుండే తల్లి సత్య+అమ్మ= సత్తెమ్మ. 


అలాగే పుల్ల (వికసించిన కళ్ళున్న) అమ్మ పుల్లమ్మ.

ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది

కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది.


ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే

చోటవున్న తల్లి అర్పణ+అమ్మ =అర్పణలమ్మ క్రమముగా అప్పలమ్మ అయినది.


బెల్లము బాగా వున్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు

బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల+అమ్మ=అప్పలమ్మ అన్నారు.


అమ్మవార్ల వూరేగింపులో అన్నిటికన్న చిన్నది

బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన వుజ్జీ

అయినది పెంటి (బాల)+అమ్మ=పెంటమ్మ.


భోజనాన్ని అందించగల తల్లి అనే అర్దములో

బోనముల (భోజనమనే పదానికి వికృతి)+అమ్మ=

బోనాలమ్మ.


అయ్య అయిన శంకరునికి అమ్మ (భార్య) కాబట్టి

ఈమెను 'అయ్యమ్మ' అని కూడా కొన్ని చోట్ల

పిలుస్తారు.


లలితాంబ, భండాసురుణ్ణి చంపేందుకు గుర్రాలమీద కూర్చొన్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది

కాబట్టి గుర్రాల+అమ్మ=గుర్రాలమ్మ అయినది.


ఊరు పేరుని బట్టి పీల్చుకొనే దేవతలు కొందరున్నారు. సోమప్రోల+అంబ='సోమపోలమాంబ'

అన్నారు.సోమప్రోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట..!!


పేర్లు ఏవైతేనేమి,

ఆ తల్లి ఎప్పుడూ

మనకు తోడుగా,

అండగా నిలిచి

మనందరినీ

కంటికి రెప్పలా

కాపాడుతుంది...


       *శుభం* 

*కష్టానికి భయపడకు* !

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

 

   *పరిష్కారం వెదకు* !

( *సేకరణ: సత్యనారాయణ గారు చొప్పకట్ల*)


ఒక పాము చాలా హుషారుగా పాకుతూ, దొర్లుతూ అటువైపుగా వెళ్తోంది. దాని హుషారుతనాన్ని చూసిన ఒక కోతి దాన్ని పట్టుకుంది. ఆ పాము కోతిని కాటు వేయబోయింది. భయంతో కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టుకుంది. గట్టిగా అరవసాగింది కోతి. చుట్టుకున్న మిగతా కోతులన్నీ ఇలా అనుకున్నాయి. ఇక ఈ కోతి బ్రతకడం కష్టం, కోతి పామును వొదిలితే కచ్చితంగా కాటు వేస్తుంది. మనం దగ్గరికెళితే మనం కూడా పాము కాటుకు బలి కావాల్సిందే, మనం దూరంగానే ఉండటం మంచిది అని వెళ్లిపోయాయి.


తనవాళ్ళంతా తనని రక్షిస్తారేమో అని ఎదురు చూసిన కోతికి నిరాశే ఎదురయ్యింది. అలాగే భయంతో కూర్చుంది. అటువైపుగా ఒక ముని వెళుతూ కోతి స్థితిని

అర్థం చేసుకుని కోతితో ఇలా అన్నాడు. 'నీ చేతిలోని పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిరి ఆడక చచ్చింది. వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందని భయపడి ఇబ్బంది పడుతున్నావు. దాన్ని వదిలేయి" అన్నారు ముని. కోతి ఆ పామును వదిలి ఒక్క గెంతుతో చెట్టు ఎక్కేసింది. ఇందులోని నీతి ఏంటంటే,

"నీకు కష్టం వచ్చినప్పుడు దాని గురించే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం నిన్ను వదిలి పోదు. కష్టాన్ని దూరంగా విసిరి కొట్టే పరిష్కారం వెతకాలి.

అలాగే నువ్వు ఇబ్బందిలో ఉంటే నీ బంధువులు, ఎవ్వరూ నిన్ను రక్షించడానికి నీ కష్టం తీర్చడానికి ముందుకు రారు.

ఆ కష్టం తమను అంటుకుంటాయని దూరంగా వెళ్ళిపోతారు. నువ్వు కష్టం వచ్చినప్పుడు ఎవరిసహాయం కోసం చూడకూడదు. కష్టాన్ని భూతద్దంలో చూడకూడదు. కష్టాన్ని మంచి పరిష్కారంలో తరిమికొట్టాలి అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు".

నా రుద్రో రుద్రమర్చయేత్


నా రుద్రో రుద్రమర్చయేత్ 

అని వేదం చెప్తుంది. 

శ్రీశ్రీశ్రీ మహాస్వామి వారు సాక్షాత్‌ రుద్ర స్వరూపమే...

హర‌హర మహాదేవ! 

🙏🙏🙏🙏🙏


( *ఏల్చూరి మురళీధర రావు గారి సమాధానం* )

      🌷🌷🌷

*తెలుగులో పద్యసరస్వతి అంతరించిపోతుందా?* 

*అన్న ప్రశ్నకు ఒకనాటి ఒకపాటి సమాధానం.* 

       🌷🌷🌷

ప్రాగ్జన్మార్జితపుణ్యము

దిగ్జేతృత్వాపదేశదీపితకవితా

భాగ్జయము లడర పూజా

స్రగ్జాతము లివియె నీకు సాహిత్యనిధీ!


జ్యోతిర్మయమగు శబ్ద

శ్వేతారణ్యమునఁ బద్యవీణామధుసం

గీతికలను వినుపింపుము!

చేతములను నింపు కలశసింధువు సుధలన్.


సుకవీ! వాఙ్మయదీపం

బిఁక దీధితు లంతరించి హీనాంధతమం

బెకదొట్ట రసజ్ఞమనోం

బకములు బొగులు నను దిగులు మాన్పు గరుణమై.


చచ్చునొ! చావదో! సుకవిసంహితమంగళకావ్యగీతసం

పచ్చయ మాంధ్రభావుకశుభంకరదివ్యకవిత్వరీతి యన్

మచ్చర మేల? మే లయిన మచ్చుగ నచ్చును; చచ్చు నొచ్చెముల్

చచ్చును; నిల్చి పొల్చు నఖిలంబుగ నుద్యతహృద్యపద్యముల్.

పద్యాలు


 

విజయదశమి నాడు పాలపిట్ట ను ఎందుకు చూస్తారు?

 

       పాలపిట్ట విజయానికి సంకేతం. శకున శాస్త్రాన్ని అనుసరించి మన వారు పాలపిట్ట ను చూస్తే అంతా విజయమే అని నమ్ముతారు. మహాభారతం లో గోగ్రహణం సంద బ్రుహన్నల యుద్ధం నకు వెళ్లిన సమయంలో విరాటుని రాజ్యం పొలిమేర దాటగానే అర్జునునికి పాలపిట్ట కనిపించిందని నమ్మకం. ఆ యుద్ధంలో అర్జునునికి అతి సులభంగా విజయం లభించింది. అందుకు గుర్తుగానే విజయదశమి నాడు సూర్యాస్తమయం లోపే పాలపిట్ట ను దర్శించుకుంటారు. విజయదశమి నాటి సూర్యాస్తమయానికి ముందున్న గంట కాలాన్ని అపరాజిత కాలం లేదా విజయముహుర్తం అంటారు.

జమ్మి పూజ ప్రాధాన్యత ఏమిటి

?

     విజయదశమి నాడు తప్పనిసరిగా జమ్మి చెట్టును అర్చించాలి. జమ్మిచెట్టు ఆవిర్భావం గురించి పురాణగాథలు ఉన్నాయి. బ్రహ్మ దేవుడు అగ్ని హోత్రాన్ని స్రుష్టించి నప్పుడు అగ్ని తన ధర్మాన్ని అనుసరించి స్రుష్టించిన బ్రహ్మనే దహించడం మొదలు పెట్టాడు. దాంతో అగ్ని తాకిడిని తట్టుకునేందుకు బ్రహ్మ ఒక చెట్టును స్రుష్టించాడు. అదే జమ్మి చెట్టు. అనంతమైన అగ్ని తత్వాన్ని తనలో ఇముడ్చుకున్న చెట్టు అది. అంతటి శక్తివంతమైన ది. కాబట్టే దసరారోజు తప్పనిసరిగా జమ్మి చెట్టును పూజించాలి. దసరా ముందు రోజు సీమోల్లంఘనం పేరిట గ్రామ పొలిమేరల్లోకి వెళ్లి అక్కడ ఉన్న జమ్మిచెట్టు ను ఆరాధిస్తారు. జమ్మి ఆకులను సేకరిస్తూ శమీశమీయతే పాపం శమీ శత్రు వినాశనీ అర్జునస్య ధరుర్ధారీ రామస్య ప్రియదర్శినీం అనే శ్లోకాన్ని పఠిస్తారు. పాండవులు అఙ్ఞాతవాసంలో వారి ఆయుధాలు ను ఉంచినది ఈ చెట్టు పైనే. శమీవ్రుక్చం రాముని చేతూ పూజలందుకుంది. ఆధునిక విజ్ఞానం కూడా జమ్మిచెట్టు లో ఎన్నో ప్రత్యేకతలు ను గుర్తించింది. జమ్మిచెట్టు పై పిడుగు పడదని, పిడుగులను త్రిప్పికొట్టే సామర్థ్యం ఉందని ఆధునికులు తేల్చారు. తెలంగాణ లో జమ్మి, ఆరె ఆకుల ను పెద్దలకు సమర్పించి, నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవడం ఆచారం. ఆంధ్రప్రదేశ్ లో జమ్మిపూజకు అత్యంత ప్రాధాన్యం ఉంది.

తాటంకయుగళీభూతతపనోడుపమండలా

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 23 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


 ‘’  


ఇది చాలా పవిత్రమైన నామములలో ఒకటి. పవిత్రము కాని నామము ఉండదు. సౌభాగ్యము కటాక్షించడము చేత ఈ నామము శక్తి మిక్కుటముగా ఉంటుంది. అంక అనగా గుర్తు. తాటంక అనగా సౌభాగ్యసూచకముగా చెవిలో తాటాకు గుర్తుగా పెట్టబడినది. ఈమె సౌభాగ్యవతి అనగా ఐదవతనమును కలిగి ఉన్నది. రెండింటిని ఐదవతనమునకు చాలా పవిత్రముగా చెపుతారు. ఒకటి తాళి, రెండు తాటంకము. ఆడపిల్లలకీ, మగపిల్లవాడికీ చెవులు కుట్టిస్తారు. చెవులు ఓంకార సూచనతో ఉంటాయి. ఒక వయసు వచ్చేసరికి చెవి తమ్మెను సూర్యకిరణములకు అడ్డుపెట్టి చూస్తే వెనక నుంచి రంధ్రము కనపడుతుందని అంటారు. ఆ రంధ్రము దగ్గర రంధ్రము చెయ్యాలని సనాతన ధర్మము చెపుతున్నది. అందుకని చెవులు కుట్టిస్తారు అనగా దానికి ఒక కన్నము చేస్తే అందులోనుంచి గాలి బయటికి వెళ్ళాలి. అలా వెళితే ‘మ్’ అన్న పూర్ణత్వము వచ్చి ఓమ్ అవుతుంది. అకార, ఉకార, మకారములు పక్కన ఉన్న నాదము కలిస్తే అది ప్రణవము అవుతుంది. అలా ప్రణవము అయితే తప్ప దానికి ఉపదేశము పొందడానికి అర్హత ఉండదు. 

ఆడపిల్ల వివాహసమయములో గౌరీపూజ చేసి వెళ్ళి పెళ్లి పీటల మీదకి వెళ్ళి కూర్చుంటుంది. పెళ్ళికొడుకు ఆమె మెడలో తాళి కట్టాక ఆడపిల్ల చెవికి తాటాకును తగిలించాలి. లేదా ఒక కొత్త తాటాకుముక్క ఆమె చెవి కన్నములోనికి దూర్చాలి అన్నారు. అమ్మవారి చెవులు కూడా తాటాకు చేత గుర్తు పెట్టబడిన చెవులు. అనగా ఆమె చెవులు సౌభాగ్య సూచనలు. అమ్మవారిది తరగని సౌభాగ్యము. పరమశివుడు ఎప్పుడూ సంతోషముగా ఉండగలుగుతున్నాడు, ఆయనను కాలము గ్రసింపలేదు అంటే అమ్మవారు చెవికి పెట్టుకున్న ఆభరణము యొక్క గొప్పతనము. తాళ శబ్దము మీద స్త్రీ మెడలో తాళి, చెవిలో ఉండే తాటంకము ప్రధానమైనవి. తాటాకుకి ఇంత గొప్పతనము ఎందుకు అనగా తాటి ఆకు సౌభాగ్య చిహ్నము. మామూలు తాటాకుకే అంత శక్తి ఉంటే ఆ ఆభరణములు ధరించిన అమ్మవారి చెవులు ఎంతో శక్తివంతమైనవి కనకనే వాటిగురించి విన్నా, మానసికముగా చూసినా ఉత్తర క్షణములో సౌభాగ్యములు నిలబడతాయి. దశమి, శుక్రవారము సాయంత్రము వింటే మరింత పవిత్రము. ఆవిడ తాటంకములు పెట్టుకున్నప్పుడు తపన – ఉడుప – యుగళీభూత. ఒక చెవికి సూర్యుని, ఒక చెవికి చంద్రుని పెట్టుకున్నది. 


చెవిని అంత ప్రధానముగా తీసుకుని అక్కడ తాటాకు పెట్టి అంత సౌభాగ్యస్థానమని నిర్ణయించడానికి కారణము ఉన్నది. మామూలుగా చెవికి పెట్టుకునే ఆభరణములో సర్వమంగళా దేవిని ఉపాసన చేసిన స్త్రీ సౌభాగ్యములో ఏ విధమైన ప్రమాదము ఉండదని చెపుతున్నప్పుడు సూర్య చంద్రులే తాటంకములుగా ఉన్న తల్లి సౌభాగ్యమునకు హద్దు ఉండదు. కాలగతిలో లోకములు అన్నీ పడిపోతున్నాయి. సూర్య చంద్రులు ఆవిడకు ఆభరణములయి ఉన్నారు. ఆవిడ నిత్యసౌభాగ్యవతి. నిత్యమంగళ, సర్వమంగళ. 


దేవతలలో బ్రహ్మాదులు కూడా వృద్ధాప్యము రాకూడదు, రోగములు రాకూడదని కోరుకుని పాలసముద్రమును మధించారు. అమృతము వస్తుంది దానిని త్రాగాలని అనుకున్నారు. ఆ సమయములో ఏది వచ్చినా దేవతలో, రాక్షసులో ఎవరో ఒకరు పుచ్చుకున్నారు. అమృతం వచ్చిన తరవాత అందరూ పుచ్చుకున్నారు. ఎవరూ పుచ్చుకోకుండా వదలి వేసినది హాలాహలము. అది పుట్టినప్పుడు మహావిష్ణువు, బ్రహ్మగారు అక్కడే ఉన్నారు. అది పుట్టగానే అందరూ శివుని దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళారు. ‘ఈశ్వరా! అమృతము కోసము పాలసముద్రము మధించాము. హాలాహలము వచ్చింది లోకములను కాల్చేస్తున్నది. ప్రాణికోటి నాశనమయిపోతున్నది. దానిని మీరు పుచ్చుకుంటారేమో అని వచ్చామన్నారు. శివుడు ఆ హాలాహలమును తాను పుచ్చుకుంటానని పార్వతికి నచ్చ చెప్పాడు. నీ అన్నగారు శ్రీమహావిష్ణువు లోకములను కాపాడాలి. అవి పాడైపోతే ఆయన బెంగ పెట్టుకుంటాడు. నేను పుచ్చుకుని లోకములను కాపాడతానని అన్నాడు. పార్వతీదేవి అందుకు అంగీకరించింది. ఆయన హాలాహలమునకు ఎదురు వెళ్ళి పట్టుకుని చేతితో నలిపి చిన్న ముద్దగాచేసి చక్కగా నోట్లో పెట్టుకుని ఉదరములోని లోకములు నాశనము అవుతాయని కడుపులోకి వెళ్ళనియ్యకుండా కంఠములో పెట్టుకుని నీలకంఠుడు అయ్యాడు.


సౌందర్యలహరిలో శంకరులు – ‘అమ్మా! నూరు యజ్ఞములు చేసిన ఇంద్రుడు కాలగతిలో వెళ్ళిపోయాడు. అమృతము త్రాగిన బ్రహ్మగారు వెళ్ళిపోయారు. ఒక్కక్క యుగములో ఒక్కక్క బ్రహ్మ వెళ్ళిపోతున్నారు. అందరి పుర్రెలు దండలా కట్టి శివుడు మెడలో ధరించాడు. శివుడు మాత్రం అలాగే ఉన్నాడు జుట్టుకూడా తెల్లబడలేదు అంటే అది నీ చెవి తాటంకముల మహిమ’ అన్నారు. ఎంతో గొప్పదైన ఈ నామమును లలితాసహస్రనామ స్తోత్రములో ప్రతిరోజూ అనుసంధానము చేసినా సౌభాగ్యస్థానము రక్షింపబడుతుంది. 


https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage

పుత్రుల్నేర్చిన నేరకున్న జనకుల్ పోషింతు రెల్లప్పుడున్

 🌺 *ఓం నమో నారాయణాయ* 🌺



*14. "పుత్రుల్నేర్చిన నేరకున్న జనకుల్ పోషింతు రెల్లప్పుడున్ మిత్రత్త్వంబున బుద్ధి చెప్పి దురితోన్మేషంబు వారింతు రే శత్రుత్వంబుఁ దలంప రెట్టియెడ నా సౌజన్యరత్నాకరుం బుత్రున్లోకపవిత్రుఁ దండ్రి నెగులుం బొందింప నెట్లోర్చెనో?*



భావము:- “నారదమహర్షీ! లోకంలో తల్లిదండ్రులు కొడుకులు తెలిసినవాళ్ళైనా తెలియనివాళ్ళైనా రక్షిస్తూ ఉంటారు. తెలియకపోతే బుద్ధిచెప్పి సరిదిద్దుతారు. ఎప్పుడు పిల్లలను ప్రేమతో పెంచుతారు. అంతేగాని శత్రుత్వము చూపించరు కదా. ఇలా ఎక్కడా జరగదు వినం కూడా. అలాంటిది బహు సౌమ్యుడు లోకాన్ని పావనం చేసేవాడు అయిన కొడుకును ఏ తండ్రి మాత్రం బాధిస్తాడు? అలాంటి వాడిని హింసించటానికి వాడికి మనసెలా ఒప్పింది.




*15. బాలుఁబ్రభావిశాలు హరిపాదపయోరుహ చింతనక్రియా లోలుఁగృపాళు సాధు గురు లోక పదానత ఫాలు నిర్మల శ్రీలుసమస్త సభ్య నుతశీలు విఖండిత మోహవల్లికా జాలున దేల? తండ్రి వడిఁ జంపఁగఁ బంపె మునీంద్ర! చెప్పవే.*



భావము:- నారదా! ప్రహ్లాదుడు చిన్నపిల్లాడూ, (కుఱ్ఱాడు తప్పు చేస్తే తెలియక చేసి ఉండవచ్చు, కనుక మన్నించటం న్యాయం అంతే తప్ప దండించడం తగదు) తేజోవంతుడూ, విష్ణుభక్తి గలవాడూ, సాధువుల గురువుల సేవ చేసేవాడూ, మంగళ స్వభావము కలవాడూ, సాధువులు పొగిడే ప్రవర్తన కల వాడూ, మోహపాశాలను త్రెంపుకున్న వాడూ. అలాంటి కొడుకును కరుణ లేకుండా తండ్రి చంపాలని ఎందుకు అనుకున్నాడు చెప్పండి.” అని ధర్మరాజు నారదుడిని అడిగాడు.



*16. అనిన నారదుం డిట్లనియె.*



భావము:- అలా అడిగిన ధర్మరాజుతో నారదుడు ఇలా అన్నాడు.

డయాబెటిస్‌కు శుభవార్త.*

 *చివరగా డయాబెటిస్‌కు శుభవార్త.*


ఈ సమాచారం అవసరమైన వారికి సహాయపడటానికి మీరు ఈ క్రింది సందేశాన్ని ఫార్వార్డ్ చేయగలరని ఆశిస్తున్నాము ...!


ఒక మహిళ (65) గత 20+ సంవత్సరాలుగా డయాబెటిస్ కలిగి ఉంది మరియు రోజుకు రెండుసార్లు ఇన్సులిన్ తీసుకుంటుంది. ఆమె పక్షం రోజులపాటు ఇంటిలో తయారు చేసిన (medicine) ఔషధాన్ని ఉపయోగించింది మరియు ఇప్పుడు ఆమె డయాబెటిస్ నుండి పూర్తిగా ఉచితం మరియు స్వీట్స్‌తో సహా ఆమె ఆహారాన్ని సాధారణమైనదిగా తీసుకుంటుంది.


ఇన్సులిన్ మరియు రక్తంలో చక్కెరను నియంత్రించే మందులను ఆపమని వైద్యులు ఆమెకు సూచించారు. దయచేసి మీ అందరికీ ఈ క్రింది మెసేజ్ ను మీకు వీలైనంత ఎక్కువ మందికి పంపించి, దాని నుండి అధిక ప్రయోజనం పొందమని నేను కోరుతున్నాను.


_*DR. టోనీ అల్మైడా*_

 (బొంబాయి కిడ్నీ స్పెషాలిటీ నిపుణుడు) పట్టుదల మరియు సహనంతో విస్తృతమైన ప్రయోగాలు చేసి మధుమేహానికి విజయవంతమైన చికిత్సను కనుగొన్నారు.

ఇప్పుడు డయాబెటిస్ కారణంగా చాలా మంది ప్రజలు, వృద్ధులు మరియు మహిళలు చాలా బాధపడుతున్నారు.


 *కావలసిన పదార్థాలు*

 1 - * గోధుమ 100 గ్రా

 2 - * బార్లీ 100 గ్రా 

 3 - *నల్లవిత్తనాలు (కొలుంజీ) 100 గ్రాములు *

 కొలుంజీ తమిళంలో * కరుంజీరాహం*

_*తయారీ విధానం:*_

 పైన పేర్కొన్న అన్ని పదార్థాలను 5 కప్పుల నీటిలో ఉంచండి.

దీన్ని 10 నిముషాలు మరిగించాలి 

స్వయంగా చల్లారాలి!

ఇది చల్లగా మారినప్పుడు, వడపోసి ఒక గాజు పాత్ర లేదా సీసాలో ఈ నీటిని నిలువ చేయండి!


 _*దీన్ని ఎలా వాడాలి?*_

ప్రతిరోజూ ఉదయాన్నే మీ కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఈ నీటిని ఒక చిన్న కప్పు తీసుకోండి.

దీన్ని 7 రోజులు కొనసాగించండి.

వచ్చే వారం అదే కానీ ప్రత్యామ్నాయ రోజులలో (రోజుమార్చి రోజు) పునరావృతం చేయండి. ఈ 2 వారాల చికిత్స తో మీ ఆరోగ్యం మామూలుగా మారిందని మీరు ఆశ్చర్యపోతారు. 

 సమస్య లేకుండా సాధారణ ఆహారం తీసుకోవచ్చును!


గమనిక:

దీన్ని వీలైనంత ఎక్కువ మందికి విస్తరించాలని ఒక అభ్యర్థన, తద్వారా ఇతరులు కూడా దాని నుండి ప్రయోజనం పొందవచ్చు.


 *ఇవి అన్ని సహజమైనవి, వాటిని తీసుకోవడం హానికరం కాదు. ఈ చికిత్స గురించి నైపుణ్యం ఉన్నవారు ఏ హాని లేకుండా ప్రయత్నించవచ్చు.*


మరోసారి ఈ సందేశం పంపినందుకు ధన్యవాదాలు ...

చాలా మందిని చక్కెర వ్యాధి నుండి కాపాడండి .... (డయాబెటిస్)

15-19-గీతా మకరందము


         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - ఆ ప్రకారముగ పురుషోత్తముడని పరమాత్మను ఎఱుగువా డాతనిని నిర్మల భక్తితో సేవించునని వచించుచున్నారు- 


యో మామేవమసమ్మూఢో  

జానాతి పురుషోత్తమమ్ | 

స సర్వవిద్భజతి మాం 

సర్వభావేన భారత || 


తాత్పర్యము:- ఓ అర్జునా! ఎవడు అజ్ఞానము లేనివాడై, ఈ ప్రకారముగ నన్ను పురుషోత్తమునిగా నెఱుగుచున్నాడో, అతడు సమస్తమును దెలిసినవాడగుచు పూర్తి మనస్సుతో (సర్వవిధముల) నన్ను భజించుచున్నాడు.


వ్యాఖ్య:- భగవంతునిపై భక్తి కుదరవలెననిన, వారెట్టివారో ముందుగ తెలిసి యుండవలెను. ఒక వస్తువుయొక్క మహిమాతిశయము తెలియనిదే దానిపై ఎవరికిని ప్రీతి జనించదు. ఒకవేళ జనించినను అపూర్ణమగు ప్రీతియే జనించును. కావున భగవానునిపై అకుంఠితభక్తి యేర్పడవలెననిన, "వారు శాశ్వతులని, ఆనందస్వరూపులని, క్షరాక్షరముల”కు అతీతులని బాగుగ గ్రహించియుండవలెను. ఆ విషయమే ఈ శ్లోకమందు చెప్పబడినది. "ఎవడు అజ్ఞానమును పారద్రోలి నన్ను పురుషోత్తమునిగ, క్షరాక్షరాతీతునిగ నెఱుగునో, ఆతడు పూర్ణభావముతో నన్ను భజించును" అని భగవాను డిచట తెలియజేసిరి.


"అసమ్మూఢు" డనగా, దృశ్యవస్తువులు శాశ్వతములను మూఢత్వము (అజ్ఞానము) లేనివాడని, ఆత్మయే శాశ్వతమను జ్ఞానము కలవాడని భావము.


'స సర్వవిత్’ - ప్రపంచములో ఎన్ని భౌతికవిద్యలను సంపాదించినను, ఎంతటి పాండిత్యమును బడసినను, ఎన్ని కళలను సముపార్జించినను మనుజుడు సర్వవేత్త, సర్వజ్ఞుడు కాలేడు.

"యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి'

అనునట్లు దేనిని తెలిసికొనినచో సమస్తము తెలిసికొనబడినదగునో అట్టి పరమాత్మ నెఱుగువాడే ప్రపంచమున సర్వవేత్త, సర్వజ్ఞుడు కాగల్గును. సమస్త బ్రహ్మాండములు, సమస్తవిద్యలు, శాస్త్రములు, కళలు , భగవానుని కుక్షియందే యుండుటవలన, వారి నెఱిగినచో వాని నన్నింటిని ఎఱిగినట్లేయగును. కనుకనే, "స సర్వవిత్" - అట్టివాడు ‘సర్వవేత్త', 'సర్వజ్ఞుడు' అని యిచట చెప్పబడెను.

"సర్వభావేన” -- ఆ ప్రకారము భగవానుని యథార్థస్వరూపము నెఱిగినవాడు వారిపై అచంచల భక్తిభావము గలవాడై, సర్వవిధముల వారినే భజించును, సేవించును, దృశ్యవస్తువులన్నియు నశ్వరములని తెలిసికొనినవాడు సహజముగనే శాశ్వతమగు దృగ్వస్తువైన ఆత్మనొక్కదానినే సేవించుచుండును.


 "సర్వభావేన” అని చెప్పుటచే అట్టివాడు పరిపూర్ణమనస్సుతో నాతనిని భజించునని భావము. అట్టి పరిపూర్ణ భావము 'దైవముయొక్క యథార్థతత్త్వము' నెఱుగనిదే కలుగదు. కావున మొట్టమొదట పరమాత్మయొక్క విభవము, వాస్తవస్వరూపము బాగుగ తెలిసికొని యుండవలెను. మరియు ఈ ‘సర్వభావేన' అను పదముచే లోకమున సాధకులు భగవానుని యేప్రకారముగభజించవలెనో ఆ పద్ధతి తెలుపబడినట్లైనది. పూర్ణభక్తితో, అచంచల విశ్వాసముతో సేవింపవలెను. భక్తిని, భావమును విభజించరాదు. ప్రపంచ వస్తువులపై కొంత, దేవునిపై కొంత భక్తిని పంచివేసిన అది "సర్వభావము” తోటి సేవనము కానేరదు. అయితే మొట్టమొదట అట్టి "సర్వభావము” తో గూడిన భజనము సాధ్యపడకపోయినను, అభ్యాసవశమున ఎప్పటికైనను అట్టి పూర్ణభక్తిని (100% భక్తిని), (భగవానుడు తెలిపిన) "సర్వభావము”ను అందఱును పొందియే తీరవలెను.


ప్రశ్న:- భగవానుని పూర్ణమనస్సుతో ఎవరు సేవించెదరు? 

ఉత్తరము:- ఎవడు అజ్ఞానరహితుడై (పైన తెలిపిన ప్రకారముగ) భగవానుని క్షరాక్షరపురుషులకంటె అతీతుడగు పురుషోత్తమునిగ నెఱుగునో అట్టివాడు పూర్ణమనస్సుతో నతనిని సేవించును, ధ్యానించును.

ప్రశ్న:- భగవంతుని యేప్రకారముగ భజించవలెను?

ఉత్తరము:- అచంచలభక్తితో, పరిపూర్ణమనస్సుతో భజించవలెను (సర్వభావేన).

"మనకెందుకు"?

 


రాఘవయ్య ఒంటరివాడు. సైకిల్ పై వెళ్ళి, చుట్టుప్రక్కల గ్రామాలలో నాటు వైద్యంచేస్తూ వారిచ్చిన వరకు తీసుకుని జీవనం సాగించేవాడు.


ఓరోజు అర్థరాత్రి వేళ బైటవున్న సైకిల్ ను ఓ దొంగ తీసుకోబోతున్నాడు.అది ప్రక్కింటి రాజు భార్య రేఖ చూసింది." ఏవండీ! పాపం ముసలాయన సైకిల్ ఎవడో దొంగ తీసుకుపోతున్నాడు. పోయి పట్టుకోండి"

"భలే!సంఘసేవకు రాలివి దొరికావు కదమ్మా! వాడు నాలుగు పీకితే బాగా గాలికొడితే ఎక్కడ పడతాడో తెలియని ఈముసలాయన మనల్నికాపాడుతాడా? ఎవరెలా పోతే మనకెందుకు మనం బాగుండామా లేదా అనేది చూసుకోవాలి నోరుమూసుకుని పడుకో"


తెల్లవారి చూసుకుంటే సైకిల్ లేకపోవడంతో గుండె చెరువైపోయింది. కొనే శక్తిలేక నడచిపోయి వైద్యం చేయసాగాడు.

కాలచక్రం తిరిగిపోతున్నది


ఓరోజు రాజు వ్యాపారానికి పోయాడు. భార్య అంగడికి పోయింది. పిల్లవాడు దూగాడుతూ వచ్చి నేల బావిలోపడిపోయాడు.దబామని శబ్దంరావడంతో ముసలాయన వచ్చి చూశాడు ఇంకేముంది బిడ్డ..... అమాంతం బావిలోకి దూకి పిల్లవాడిని బయటకుతీసి ప్రథమ చికిత్సచేశాడు.

అంతలో వాళ్ళమ్మ వచ్చింది

. జరిగింది తెలుసుకుని గుండెలు బాదుకుంది

భర్త రాగానే జరిగింది చెప్పి ఏడ్చింది


"ఆనాడు సైకిల్ దొంగ ఎత్తుకుపోతుంటే మనకెందుకని ఊరకున్నాను. నీవూ అలా అనుకుని వుంటే మా వంశాకురమైన నా కొడుకు ఏమయ్యేవాడు

ప్రతి ఒక్కరూ మనకెందుకు మనకెందుకు అని ఊరుకోబట్టే ఏ సమస్యా పరిష్కారం కావటంలేదు.

నా బిడ్డను బ్రతికించి మమ్ము పుత్రశోకం నుండి కాపాడావు " అంటూ కాళ్ళపైబడి క్షమించమని వేడుకున్నాడు

మరునాడు ముసలాయనకు క్రొత్త సైకిల్ కొనిచ్చాడు రాజు

రై మని నాలుగూళ్ళు తిరిగి ఎక్కువ మందికి సేవచేయ గలిగాడు ముసలాయన.

✍🏻జంజం కోదండ రామయ్య

*ధర్మజుని రాజసూయ యాగము*

 


రాజసూయ యాగం జరుగుతుంటే భూమండలం మీద ఉన్న రాజు లందరూ వచ్చారు. రాజసూయ యాగం అంటే మాటలు కాదు. బంగారు నాగలితో భూమిని దున్నారు. వచ్చిన వారందరికీ సక్రమమయిన మర్యాదలు జరగడం కోసం ఎవరెవరు ఏ పనులు చేయాలో ధర్మరాజు గారు నిర్ణయించారు. కర్ణుడికి ఒకరికి దానం యివ్వడం అంటే పరమ సంతోషం. ఒకరికి శ్రద్ధా భక్తులతో దానం యివ్వడానికి కర్ణుడే తగినవాడు. కర్ణుడికి, పాండవులకి పడదు. కానీ ఒక మంచి పని జరుగుతున్నప్పుడు ఆ మంచిపని సక్రమంగా జరగడం కోసం, రాజసూయ యాగంలో దానములు చేయడానికి ధర్మరాజు గారంతటి వాడు కర్ణుని నియమించాడు. పదవులు ఎంత నిష్పక్షపాతంగా ఇచ్చాడో చూడండి. వంటశాలలో ఉండి రుచికరమయిన పదార్థములను తయారుచేయించమని తమ్ముడయిన భీమసేనునికి పురమాయించి భీమసేనుడిని వంటశాలలో పెట్టాడు. వచ్చిన వాళ్ళలో పరమ పూజనీయులైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్షతలు వేయడానికి వస్తే యింటి యజమాని, వారు ఆశీర్వచనం చేసి వెళ్ళిపోయే వరకు వారి పక్కన ఉండి వారికి సపర్య చేసి వారికి ఏమి కావాలో చూడడానికి బాధ్యతా కలిగిన ఒక వ్యక్తిని పెట్టాలి. ఈ పనికి కృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుని పెట్టారు. యాగమునందు వైదిక క్రతువులో వాడబడే సమస్త పదార్థములను వాళ్ళు ఎక్కడ ఏది అడిగితే సిద్ధంగా అందించడానికి వీలుగా ఆ బాధ్యతను నకులుడికి అప్పగించాడు. వచ్చిన వాళ్ళలో నారదమహర్షి, అత్రిమహర్షి వంటి దేవగురువులు ఉంటారు. వారిని పూజించడానికి తమ్ముడయిన సహదేవుడిని వినియోగించాడు. భోజనపంక్తిలో రుచులూరించే పదార్థములను తెప్పించి చక్కగా వడ్డన జరిగేలా ద్రౌపదిని నియమించాడు. అంతా అందంగా రాజసూయ యాగ క్రతువు జరిగింది. అంత గొప్ప యాగం పూర్తయిన తర్వాత చివర అక్కడ ఉన్నవారిలో జ్ఞానము చేత వృద్దుడయిన వారిని ఎంచి ఆయనకు అగ్రపూజను చేస్తారు. ఇపుడు సభలో అగ్రపూజను ఎవరికి చెయ్యాలి అన్న ప్రశ్న వచ్చింది. అక్కడ ఎందరో ఋషులు, మహర్షులు, దేవగురువులు ఎందరో రాజులు ఉన్నారు. అంతమంది గొప్పవారు వున్న సభలో అగ్రపూజ ఎవరికి చెయ్యాలి? అని ధర్మరాజు గారు ఆలోచన చేస్తున్నారు. అపుడు వయస్సులో చిన్నవాడయినా బుద్ధిలో బృహస్పతి అయిన సహదేవుడు లేచి "అన్నయ్యా, అగ్రపూజ చేయడానికి ఎవరు తగినవాడు అని ఆలోచిస్తున్నావా? కృష్ణుడు అర్హుడు అని సూటిగా అనలేదు. కానీ సహదేవుడు కృష్ణుని ఉద్దేశించి అన్నయ్యా ఈయన ఈశ్వరుడు. ఇక్కడ నిలబడిన ఈయనే బయట వెళ్ళిపోతున్న కాలరూపము. ఒక ప్రదేశములా ఎక్కడికక్కడ కనపడుతున్న ఈ సమస్త భూమండలము ఆయనే. ఇప్పుడు నీవు చేసిన యాగము ఆయనే. ఆ యజ్ఞము ఆయనే. చేసినవాడు ఆయనే. ఇన్నిగా వెలుగుతున్న ఈశ్వరుడు యివాళ మన కళ్ళెదుట మన మాంస నేత్రముతో చూడడానికి ఎదురుగుండా వీలయిన రీతిలో రక్షకుడై, సర్వ కాలముల యందు పాండవులు బాగుపడాలని కోరుకున్న వాడయి యాగమునకు వచ్చి నిర్వహించి జరాసంధుని వధ చేయించిన మహాపురుషుడు ఎవడు ఉన్నాడో ఆయన యిక్కడ కూర్చుని అండగా ఉండగా ఇంకా ఎవరెవరని వెతుకుతారు. ఆయనకు అగ్రపూజ చెయ్యండి" అన్నాడు.

ఈమాట చెప్పేసరికి ధర్మరాజుగారు పొంగిపోయారు. మాట చెప్పడం కాదు. చెప్పేమాట ఎదిరించలేనిదై ఉండాలి. అదీ ఆవిష్కరణ అంటే. కృష్ణుడు ఎవరో చెప్పాడు. కృష్ణుని సరిగా అర్థం చేసుకున్నాడు. ఎంత జ్ఞానియో సహదేవుడు చూడండి. అలా చెప్పగానే ధర్మరాజుగారు ద్రౌపదీ దేవిని తీసుకొని బంగారు జలపాత్రను చేతిలో పట్టుకొని కృష్ణుని వద్దకు వెళ్ళారు. అయిదుగురు అన్నదమ్ములు ద్రౌపదీదేవి కుంతీదేవి అందరూ వెళ్లి కృష్ణ పరమాత్మ పాదముల దగ్గర కూర్చుని ఒక బంగారు పళ్ళెమును తీసుకువచ్చి ఆయన కాళ్ళకింద పెట్టారు. ద్రౌపదీదేవి బంగారు పాత్ర లోంచి నీరు పోస్తుంటే కృష్ణ పరమాత్మ కాళ్ళను కడిగారు. ధర్మరాజు గారు కాళ్ళు కడుగుతుంటే నలుగురు అన్నదమ్ములు పుష్పములు వేస్తూ నమస్కరిస్తూ కూర్చుంటే ద్రౌపదీదేవి నీళ్ళు పోస్తుంటే ఆ కృష్ణ పరమాత్మ కాళ్ళు కడిగి పళ్ళెం లోకి వచ్చినటువంటి ఆ పాద ప్రక్షాళన జలమును తీసుకుని ధర్మరాజుగారు తన శిరస్సు మీద చల్లుకుని, తదుపరి కుంతీదేవి శిరస్సు మీద ద్రౌపదీ దేవి శిరస్సు మీద తమ్ముళ్ళ శిరస్సుల మీద చల్లారు. బంగారు వన్నె గల వస్త్ర ద్వయమును తీసుకు వచ్చి కృష్ణ పరమాత్మకు బహూకరించి, అపర సూర్య భగవానుడా అన్నట్లుగా వెలిగిపోతున్న హారములు తెచ్చి ఆయన మెడలో వేసి కృష్ణ పరమాత్మకు నమస్కరించి ఆయనకు తాంబూలం ఇచ్చి తమతమ శిరస్సులు ఆయన పాదములకు తగిలేటట్లుగా పరమ వినయంతో అయిదుగురు అన్నదమ్ములు నమస్కరించి అగ్రపూజ చేసి చేతులు కట్టుకుని ఆయన పక్కన నిలబడ్డారు. సభలో ఉన్న వాళ్ళందరూ పొంగిపోయారు. కానీ మూడిన వాడు ఒకడు ఉంటాడు. వాడికి ఈశ్వర ధిక్కారం ప్రారంభం అవుతుంది. అపుడు శిశుపాలుడు లేచి

"ఈయన గోపాలుర కుటుంబంలో పుట్టాడు. యథార్థమునకు ఆయన ఎక్కడ పుట్టాడో ఎవరికీ తెలియదు. కొంతమంది యితడు దేవకీ వసుదేవులకు పుట్టాడని అంటారు. చాలామంది యితడు కళ్ళు తెరిచేసరికి యశోదానందుల దగ్గర ఉన్నాడని అంటారు. ఈయన కులం తెలియదు. ఈయన గోత్రం తెలియదు. వావి వరుసలు లేవు. ఎంతమంది గోపకాంతలతో రమించాడో. ఎంతమందితో తిరిగాడో. ఇది నడువడి అని చెప్పడం కుదరదు. అలా ప్రవర్తిస్తూ ఉంటాడు. మానమర్యాదలు ఎరుగని వాడు. ఇటువంటి వానికి అగ్రపూజ చేయడమా! సభలో వీనికన్నా తగినవారు లేరా! కృష్ణుడికి అగ్రపూజ ఏమిటి? కృష్ణుడు అగ్రపూజ అందుకున్నందుకు గాను యిప్పుడే కృష్ణుడిని శిక్షిస్తాను" అని తన గదాదండము తీసుకుని కృష్ణుని మీదకు వెళుతున్నాడు.

కృష్ణ పరమాత్మ వీనిని చూసి ఒక చిరునవ్వు నవ్వి వెంటనే సుదర్శన చక్రమును స్మరించి ఆ చక్రమును శిశుపాలుని మీదికి ప్రయోగించారు. అప్పటికి శిశుపాలుడు చేసిన నూరు తప్పులు పూర్తయిపోయాయి. నూరు తప్పుల వరకు కాపాడతానని మేనత్తకు మాట యిచ్చాడు. ఇప్పుడు శిశిపాలుడు చేసిన అధిక్షేపణతో నూరు తప్పులు పూర్తి అయిపోయాయి. సుదర్శన చక్రమును ప్రయోగించగానే అది శిశుపాలుని కుత్తుకను కత్తిరించి కింద పడేసింది. అతని తల కింద పడిపోగానే సభలో హాహాకారములు మిన్ను ముట్టాయి. అందరూ కూడా దుర్మార్గుడైన శిశుపాలుడు కృష్ణ పరమాత్మ జోలికి వెళ్ళి మరణించాడు అన్నారు. తదనంతరం పాండవులందరూ అవబృథ స్నానమును చేశారు. యాగము అంతా పూర్తయిపోయిన తర్వాత యాగకర్తలు అందరూ వెళ్లి స్నానం చేస్తారు. అలా చక్కగా వారంతా అవబృథ స్నానం చేసి తిరిగి వచ్చారు. ధర్మరాజుగారు పరమసంతోషంగా రాజ్యం ఏలుతున్నారు. కృష్ణ పరమాత్మ తిరిగి ద్వారకా నగరమునకు చేరుకుంటున్నారు.

శ్రీకృష్ణుడు సాళ్వుని, దంతవక్త్రుని చంపుట

ఈలోగా సాళ్వుడు అనబడే రాజు కృష్ణ పరమాత్మ మీద పెంచుకున్న ఆగ్రహం చేత పరమశివుని గురించి ఘోరమయిన తపస్సు చేశాడు. రోజుకు గుప్పెడు మట్టి మాత్రమే తినేవాడు. కడుపులో కార్పణ్యం పెంచుకున్నవాడు ఎంత తపస్సు చేస్తే మాత్రం ప్రయోజనం ఉంటుంది. పరమశివుడు ప్రత్యక్షమై వరమును కోరుకోమన్నాడు. అప్పుడు సాళ్వుడు తన యిష్టం వచ్చినట్లుగా తిరిగే విమానం కావాలని పరశివుని కోరాడు. అపుడు పరమశివుడు మయుడిని పిలిచి ఒక విమానమును నిర్మింపజేసి సాళ్వునికి యిచ్చాడు. ఆ విమానమునకు సౌభకము అని పేరు. ఆ విమానమును ఎక్కి ద్వారకా నగరం మీదకి వచ్చి ద్వారకా నగరంలో ఉండే అంతఃపుర కుడ్యములను, గోపురములను తన గదాదండంతో తొలగదోస్తూ నానా అల్లరి ప్రారంభించాడు. వెంటనే అక్కడ ఉండే ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలైన వారు యుద్దమును ప్రారంభం చేశారు. గొప్ప యుద్ధం జరుగుతోంది. ఈలోగా కృష్ణ పరమాత్మ చేరుకున్నారు. దుర్నిమిత్తములు కనపడ్డాయి. రావణాసురుడు మాయాసీతను సృష్టించినట్లు సాళ్వుడు కూడా మాయా వసుదేవుడిని సృష్టించి కృష్ణ పరమాత్మ కళ్ళ ఎదుటే ఆ మాయా వసుదేవుడిని సంహరించాడు. కృష్ణ పరమాత్మ అంతటివారు తండ్రి మరణిస్తే ఎలా ఖిన్నుడవుతారో అలా ఖిన్నులయారు. కానీ మిగలిన వాళ్ళు "ఇది జరిగేది కాదు - వసుదేవుడు లోపలే ఉన్నాడు" అని చెప్పారు. అప్పుడు ఆయన సుదర్శన చక్రమును ప్రయోగిస్తే సాళ్వుడు కూడా మరణించాడు. అతని విమానం తుత్తునియలు అయిపొయింది.

తదనంతరం దంతవక్త్రుడు వచ్చాడు. వీడిని కూడా కృష్ణ పరమాత్మ సంహరించాడు. శిశుపాల దంతవక్తృలిద్దరూ మరణించిన తరువాత వారిలో వున్న తేజస్సు పైకి లేచి కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది. గతంలో శ్రీమహావిష్ణువు ద్వారపాలకు లయిన జయవిజయులకు ఇవ్వబడిన శాపం చేత మూడు జన్మలలో రాక్షసులుగా జన్మించాలి కాబట్టి ఈ జన్మలో వారు శిశిపాల దంతవక్త్రులుగా జన్మించి వారిరువురూ శ్రీకృష్ణ పరమాత్మచే సంహరింపబడి ఆయనలో లీనమయిపోయారు.⁠⁠⁠⁠

ఆదిపర్వము – 45

 

సుందోపసుందుల వృత్తాంతం


ఒక రోజు ఇంద్ర ప్రస్థానానికి నారదమహర్షి వచ్చాడు. ధర్మరాజు ఆయనను సాదరంగా ఆహ్వానించి ” మహర్షీ ! మాపూర్వ జన్మ సుకృతంగా మీ దర్శనభాగ్యం లభించింది ” అన్నాడు. నారదుడు పాండవులను ఏకాంతానికి పిలిచి ” మీకు అన్ని ధర్మాలు తెలుసు. మీకు తెలియని ధర్మం లేదు. ద్రౌపది మీ ఐదుగురి భార్య. ఇది లోక విరుద్ధం, శాస్త్ర విరుద్ధం. కనుక ఈమె వలన మీలో మీకు విరోధం రాకూడదు. స్త్రీ వలన విరోధం రావడం సహజం.


సుందోప సుందులనే రాక్షసులకు ఒక స్త్రీ వలన వివాదం వచ్చి వారిలో వారు కొట్టుకుని మృతి చెందారు. నికుంభుడు అనే రాక్షసునికి సుందుడు, ఉపసుందుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిరువురు బ్రహ్మను గురించి ఘోరమైన తపమాచరించారు. బ్రహ్మ దేవుని వద్ద వారు కామ గమనం, కామ రూపం, మరణమే రాకుడదని వరాలు కోరారు. బ్రహ్మదేవుడు మిగిలిన వరాలు ఇచ్చి మరణమే రాకుండా వరమివ్వడం మాత్రం సాధ్యం కాదని చెప్పాడు. అప్పుడు వారు వేరే వారి చేతిలో చావు రాకూడదని అడిగారు. బ్రహ్మదేవుడు అందుకు సరేనని అంగీకరించాడు.


వర బలంతో వారు తాపసికులను, రాజులను వేధించ సాగారు. వారంతా బ్రహ్మదేవునికి మొర పెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు వారికి వేరే వారి చేతిలో మరణం లేదు, కానీ ఒకరి చేతిలో ఒకరు మరణించ వచ్చు కదా అనుకుని విశ్వకర్మని పిలిచి లోకోత్తర సుందరిని సృష్టించమని అడిగాడు. విశకర్మ అంగీకరించి తిలోత్తమ అనే సుందరిని సృష్టించాడు. తిలోత్తమ బ్రహ్మదేవునితో తనను సృష్టించిన కారణమేమిటి? అని అడిగింది. బ్రహ్మదేవుడు ఆమెతో సుందోపసుందుల వృత్తాంతం చెప్పి వారిరువురికి ఒకరిలో ఒకరు కలహించుకుని మరణించేలా చేయమని చెప్పాడు.


తిలోత్తమ అలాగేనని బ్రహ్మదేవునికి భక్తితో ప్రదక్షిణ చేసింది. బ్రహ్మదేవుడు ఆమె అందానికి ముగ్ధుడై నలుపక్కల ముఖం తిప్పటంతో అతడు అప్పటి నుండి చతుర్ముఖుడైనాడు. తిలోత్తమ అందానికి దేవేంద్రునికి రెండు కళ్ళు చాలక వళ్ళంతా కళ్ళు పెట్టుకుని చూడటంతో అప్పటి నుండి అతడు సహస్రాక్షుడైనాడు. తిలోత్తమ సుందోపసుందుల కంట పడగానే వారు కామ మోహితులై తిలోత్తమ నాది నాది అని చెరి ఒక చేయి పట్టుకుని లాగుతూ నీకు ఎవరు కావాలి అని అడిగారు. తిలోత్తమ వారితో మీలో ఎవరు బలవంతులో వారిని ప్రేమిస్తాను అని చెప్పింది. విచక్షణ కోల్పోయి వారిద్దరూ పరస్పంరం యుద్ధం చేసికొని ఇద్దరూ మరణించారు. కనుక ఎంతటి బలవంతులకూ, ధైర్యవంతులకూ స్త్రీ కారణంగా విరోధం రావచ్చు” అన్నాడు.


నారదుడు మాటలో అంతరార్ధం గ్రహించిన పాండవులు ద్రౌపది విషయంలో ఒక నియమం ఏర్పచుకున్నారు. ద్రౌపది ఒక్కొకరి ఇంట్లో ఒక సంవత్సరం ఉండాలని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంవత్సర కాలం మిగిలిన వారు ఆ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదని పొరపాటున అలా చేస్తే పన్నెండు నెలల తీర్ధ యాత్ర చేయాలని ఒప్పందం చేసుకున్నారు. నారదుని ఎదుట ఒప్పంద చేసుకున్నట్లు నడచుకుంటామని పాండవులు ప్రతిజ్ఞ చేసారు. ప్రతిజ్ఞ చేసినట్లు నడుచు కోసాగారు.


ఒక రోజు ఒక బ్రాహ్మణుని ఆవును కొందరు దొంగిలించారు. ఆ బ్రాహ్మణుడు అర్జునిని వద్దకు వచ్చి దొంగలను శిక్షించి గోవును తెచ్చి ఇవ్వమని అడిగాడు. ఆయుధగారంలో ఉన్న తన ధనస్సు తీసుకోవాలంటే అక్కడ ధర్మరాజు ద్రౌపదితో ఆయుధగారంలో ఉన్నాడు. అక్కడకు వెళితే నియమ భంగం ఔతుంది కానీ బ్రాహ్మణుని బాధను నివారించడం తన ధర్మమని భావించి ఆయుధగారానికి వెళ్ళి ధనస్సు తెచ్చి దొంగలను చంపి గోవును తెచ్చి ఇచ్చాడు. నియమభంగం జరిగినందుకు అర్జునుడు తీర్ధయాత్ర చేయాలని నిశ్చయించికున్నాడు. ధర్మరాజు మాత్రం వచ్చింది సత్కార్యం నిమిత్తం కనుక నియమ భంగం జరుగలేదని చెప్పాడు. అర్జునుడు ” అన్నయ్యా !ఏదో సాకుతో ధర్మం తప్పడం భావ్యం కాదు కనుక తీర్ధయాత్ర చేయడానికి నాకు అనుమతి ఇవ్వండి.


బ్రాహ్మణులతో పౌరాణికులతో అర్జునుడు తీర్ధయాత్రకు బయలుదేరి ముందుగా గంగా తీరం చేరాడు. ఒకరోజు ఉలూచి అనే నాగకన్య అర్జునుని చూసి మోహించింది. అర్జునుడు తాను బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నానని అన్నగారి ఆదేశంతో తీర్ధయాత్ర చేస్తున్న నన్ను ఇలా కోరడం భావ్యం కాదని వారించాడు. ఉలూచి అర్జునినితో ” మీ గురించి అంతా నాకు తెలుసు. ఇందు వలన వ్రత భంగం కాదు. నా కోరిక తీర్చకుంటే ఆత్మహత్య చేసుకుంటాను. అలా జరిగితే ఎన్ని దానధర్మాలు చేసినా ఆ పాపం పోదు ” అన్నది చేసేది లేక అర్జునుడు ఆమె కోరిక తీర్చాడు. ఉలూచి గర్భవతి అయి ఐరావణుడు అనే కుమారుని కన్నది.


తతవాత అర్జునుడు గయ, గంగా సాగర సంగమం మొదలైన క్షేత్రాలు సందర్శిస్తూ మణిపురం నగరానికి వెళ్ళాడు. ఆ దేశపురాజు చిత్రాంగదుడు. చిత్రాంగదుని కుమార్తె చిత్రాంగదను అర్జునుడు ప్రేమించాడు. చిత్రాంగదుడు అర్జునినితో ” అర్జునా నా కుమార్తెను నీకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు. కానీ మా వంశస్తులకు ఒక వారసుడు మాత్రం జనిస్తాడు. నాకు మాత్రం కుమార్తె జనించింది కనుక రాజ్యానికి వారసుడు లేడు. చిత్రాంగదకు పుట్టబోయే కుమారుడు నాకు వారసుడుగా కావాలి. అందుకు అంగీకరిస్తే ఈ వివాహానికి అంగీకరిస్తాను ” అన్నాడు. అర్జునుడు అందుకు అంగీకరించి చిత్రంగదను వివాహం చేసుకున్నాడు. వారికి బబ్రువాహనుడు పుట్టాడు. అర్జునుడు అక్కడి నుండి ద్వారకకు బయలుదేరాడు.

రామాయణమ్.128

 

..

పంచవటీ తట సుస్థిత రాముడు ఆనందముగా కాలము వెళ్ళ దీస్తున్నాడు.

రోజులు,వారాలు గడుస్తున్నాయి, ,

నెలలు మారుతున్నాయి, 

ఋతువులు దొర్లుతున్నాయి.

రాముడికి ఇష్టమైన హేమంతం రానే వచ్చింది .

ప్రకృతి రామణీయకత మనసుకు ఆహ్లాదకరంగా ఉన్నది.

..

ఒకనాటి రాత్రి గడిచి తెల్లవారింది స్నానానికి గోదావరీ తీరానికి వెళ్ళాడు రాముడు ఆయన వెంట సీత ,చేతిలో కలశముతో లక్ష్మణుడు కూడా వెళ్ళారు.

.

మంచు పడుతూ ఉన్నది శరీరాలు బిరుసేక్కిపోయి వేడి

పుట్టించే అగ్నికోసం వెతుక్కునేకాలమది.నీళ్ళు ముట్టుకుంటే చేతులు జిల్లుమంటున్నాయి.

.

సూర్యుడు ఎక్కువగా దక్షిణ దిక్కునే ఉంటున్నాడు ,ఉత్తరదిక్కు తిలకము లేని స్త్రీ వలె ప్రకాశించటం లేదు.

.

 జనమంతా సూర్యోదయముకోసము ఆయన కిరణ స్పర్స కోసము ఎదురు చూస్తున్నారు.,నీడలు,నీళ్ళు భరించ లేక పోతున్నారు.

.

పడమర దిక్కునుండి చల్లటి గాలులు వీస్తున్నాయి. వరిచేలు బంగారు రంగును సంతరించుకొన్నాయి.

.

ఎండా కాస్త ఎర్రగా కాస్త తెల్లగా ఉన్నది ,పచ్చిక బయళ్ళమీద మంచు బిందువులు పడి సూర్యకాంతికి ప్రతిఫలించి వజ్రాల రాసుల లాగా మెరుస్తున్నాయి.

.

ఏనుగులకు దాహం వేసి నీటి దగ్గరకు వెళ్లి తొండము నీటికి ఆనించి మరల వెనుకకు లాగుకుంటున్నాయి.

పిరికివాడు ఏవిధంగా యుద్ధరంగానికి దూరంగా ఉంటాడో ఆవిధంగా నీటిపక్షులు నదిలోకి వెళ్ళకుండా దూరంగా ఒడ్డునే కాలక్షేపం చేస్తున్నాయి.

.

ప్రకృతి సొగసులు చూస్తూ అడుగులు వేస్తున్నాడు రాముడు.

.

 ఆ సమయములోలక్ష్మణుడికి భరతుడు గుర్తుకు వచ్చాడు.ఇంత తెల్లవారు ఝామున ఈ చలిలో భరతుడు స్నానమెలా చేస్తున్నాడో గదా ! 

అతడు సుకుమారుడు ,సుఖాలకు అలవాటు పడ్డవాడు ,నీవు అడవులకు వచ్చావు నిన్ను అనుసరిస్తూ ఆయన అక్కడ నియమ నిష్టలతో తాపస జీవనం గడుపుతున్నాడు ,

.

మానవులు తండ్రి స్వభావాన్ని అనుకరించరు తల్లి స్వభావాన్ని అనుసరిస్తారు కానీ భరతుని విషయములో అలా జరుగలేదు ,తల్లి స్వభావాన్ని అనుకరించలేదు.

.

అక్కడ భరతుడు ఇక్కడ మనము, ఇందరి కష్టాలకు కారణమైన స్వభావము కైకమ్మకు ఎక్కడనుండి వచ్చినది? ధర్మాత్ముడైన భర్త ,ఋజువర్తనుడు అయిన కొడుకు కలిగిన స్త్రీ అలా ఎందుకు ప్రవర్తించిందో గదా !

.

వింటూ నడుస్తున్న రాముడు తల్లి నింద చెవుల పడేసరికి సహించ లేక పోయాడు, నాయనా లక్ష్మణా! ఎట్టిపరిస్థితిలోను మన మధ్యమాంబను నిందిస్తూ నీవు ఒక్క మాట కూడా మాట్లాడ వద్దు ,భరతుడిగురించి చెప్పు చాలా ఆనందముగా ఉన్నది నాకు అని అన్నాడు.మన నలుగురమూ కలిసి హాయిగా మళ్ళా ఎప్పుడోకదా ఉండేది అని అంటూ నదిని సమీపించాడు.

.

 NB

.

భద్రాచలము వద్ద గోదావరి చాలా అందముగా ఉంటుంది ఒడ్డుమీద రామయ్య గుడి ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది ఒకప్పుడు. చల్లని గాలులు వీస్తూ ఉంటే రామయ్య దర్శనము చేసుకొని గోదావరి ఒడ్డున కూర్చుంటే ఎంత ప్రశాంతతో ! 

కానీ ఇప్పుడేమయ్యింది ! పేపరుమిల్లు మీదనుండి వచ్చే దుర్గంధాన్ని గాలి మోసుకు వచ్చి ముక్కు పుటాలు బద్దలు చేస్తుంది.గోదావరి నీళ్ళు ఆ ఫ్యాక్టరీ వ్యర్ధాలతో కలుషితమయ్యాయి.

.

ఫ్యాక్టరీ కాస్త దూరంగా కట్టి ఉంటే బాగుండేది

.


రామాయణమ్ 129

..............

గోదావరిలో స్నానము చేసి సకల దేవతార్చనము పూర్తి చేసి తిరిగి పర్ణశాల చేరుకొని సుఖంగా ముగ్గురూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు .

.

అప్పుడు.

ఒక ముసలి రాక్షస స్త్రీ ,అక్కడకు వచ్చి దగ్గరగా రాముడిని చూసింది .

.

నయనమనోహరంగా కనబడ్డాడు రాముడు దానికి ,విశాలమైన వక్షస్థలం,బలిష్ఠమైన బాహువులు,విచ్చిన తామరపూవుల వంటి కన్నులు ,నల్లకలువ వంటి శరీర ఛాయ ,మన్మధునివంటి సౌందర్యముతో మహేన్ద్రుడిలాగా ఠీవిగా ఉన్నాడు రాముడు.

.

రాముడిని చూడగానే దాని మనస్సును మన్మధబాణాలు సూటిగా వేగంగా వచ్చి తాకాయి.

.

రాముడి ముఖము చాలా అందముగా ఉన్నది,

దాని ముఖము వికృతము!

.

రాముడి నడుము సింహపు నడుములాగా సన్నగా ఉన్నది దానిది బాన పొట్ట .

.

ఆయన నేత్రాలు విశాలము ,

దాని నేత్రాలు వికారము!

.

ఆయనది నల్లని జుట్టు

,దానిది రాగి జుట్టు

.

చూసేవారి కన్నులకు ఆనందము కలిగించే రూపము ఆయనది,

దానిది భయంకరమైన రూపము.

.

ఆయన కంఠ ధ్వని మధురము ,

దాని పలుకులు కర్ణ కఠోరమైనవి.

.

ఆయన నవయవ్వనుడు

 ఆవిడ వృద్ధురాలు

.

ఆవిడ పేరు శూర్పణఖ ఆవిడ రావణుడి చెల్లెలు! . 

.

రాముడిని సమీపించి రాముడితో ఎవరు నీవు? భార్యా సమేతుడవై,ధనుర్బాణాలు ధరించి ముని వేషముతో ,రాక్షస నివాస ప్రాంతమునకు ఎందుకు వచ్చావు,నీకు ఏమి పని ఇక్కడ అని పలికింది.

పురాణ సంబంధ 49 పుస్తకాలు(

 *పురాణ సంబంధ 49 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

49 పుస్తకాలు ఒకేచోట https://www.freegurukul.org/blog/puranamulu-pdf


               (OR)


గరుడ పురాణం www.freegurukul.org/g/Puranamulu-1


దేవీ భాగవతం www.freegurukul.org/g/Puranamulu-2


విష్ణు పురాణం www.freegurukul.org/g/Puranamulu-3


సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం www.freegurukul.org/g/Puranamulu-4


శివ పురాణము www.freegurukul.org/g/Puranamulu-5


భవిష్య మహా పురాణము www.freegurukul.org/g/Puranamulu-6


దేవీ భాగవతం www.freegurukul.org/g/Puranamulu-7


సంపూర్ణ కార్తీక మహాపురాణం www.freegurukul.org/g/Puranamulu-8


శివ పురాణం www.freegurukul.org/g/Puranamulu-9


పురాణ పరిచయము www.freegurukul.org/g/Puranamulu-10


బ్రహ్మ పురాణము-1,2,3 www.freegurukul.org/g/Puranamulu-11


మార్కండేయ పురాణం www.freegurukul.org/g/Puranamulu-12


శ్రీ దత్త పురాణం www.freegurukul.org/g/Puranamulu-13


హరి వంశ పురాణం www.freegurukul.org/g/Puranamulu-14


లక్ష్మీ నరసింహ పురాణం www.freegurukul.org/g/Puranamulu-15


సంపూర్ణ దేవీ భాగవతము www.freegurukul.org/g/Puranamulu-16


కల్కి పురాణము-1,2 www.freegurukul.org/g/Puranamulu-17


బసవ పురాణం www.freegurukul.org/g/Puranamulu-18


అష్టాదశ పురాణ కథా విజ్ఞాన సర్వస్వము www.freegurukul.org/g/Puranamulu-19


శివ పురాణము - ధర్మ సంహిత www.freegurukul.org/g/Puranamulu-20


కన్యకా పురాణం www.freegurukul.org/g/Puranamulu-21


శివ రహస్య ఖండము-1,2 www.freegurukul.org/g/Puranamulu-22


మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణ సార సంగ్రహము www.freegurukul.org/g/Puranamulu-23


భాగవత,వామన, మార్కండేయ మహాపురాణాలు www.freegurukul.org/g/Puranamulu-24


మార్కండేయ పురాణము www.freegurukul.org/g/Puranamulu-25


శ్రీ పరమేశ్వరి-దేవీ భాగవత వచనము www.freegurukul.org/g/Puranamulu-26


సూత సంహిత -స్కాంద పురాణాంతర్గతము www.freegurukul.org/g/Puranamulu-27


ఆంధ్ర స్కాందము-1 www.freegurukul.org/g/Puranamulu-28


మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణము-బ్రహ్మఖండము www.freegurukul.org/g/Puranamulu-29


స్కాందపురాణ సారామృతము www.freegurukul.org/g/Puranamulu-30


దేవాంగ పురాణం www.freegurukul.org/g/Puranamulu-31


అగ్ని పురాణం www.freegurukul.org/g/Puranamulu-32


మత్స్య మహాపురాణము www.freegurukul.org/g/Puranamulu-33


మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణము-ప్రకృతి ఖండము www.freegurukul.org/g/Puranamulu-34


వైశాఖ పురాణము www.freegurukul.org/g/Puranamulu-35


పురాణ వాంగ్మయం www.freegurukul.org/g/Puranamulu-36


విష్ణు ధర్మోత్తర మహాపురాణము -1 www.freegurukul.org/g/Puranamulu-37


స్కాంద పురాణంతర్గత కార్తీక పురాణం www.freegurukul.org/g/Puranamulu-38


నారదీయ పురాణము www.freegurukul.org/g/Puranamulu-39


పద్మ పురాణము-భూమి ఖండము www.freegurukul.org/g/Puranamulu-40


మత్స్య మహా పురాణము-1 www.freegurukul.org/g/Puranamulu-41


స్కాంద పురాణతర్గత బ్రహ్మోత్తరఖండం www.freegurukul.org/g/Puranamulu-42


మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణము-శ్రీకృష్ణజన్మ ఖండము-ఉత్తరార్ధము www.freegurukul.org/g/Puranamulu-43


మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణము-శ్రీకృష్ణజన్మ ఖండము-పూర్వార్ధము www.freegurukul.org/g/Puranamulu-44


సూత పురాణము www.freegurukul.org/g/Puranamulu-45


కైశిక మహత్యము www.freegurukul.org/g/Puranamulu-46


శివ తాండవము www.freegurukul.org/g/Puranamulu-47


దేవల మహర్షి చరిత్ర -వచన దేవాంగ పురాణం www.freegurukul.org/g/Puranamulu-48


ప్రధమాంధ్ర మహాపురాణము www.freegurukul.org/g/Puranamulu-49


పురాణముల పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


మరింత సమాచారం కోసం:

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్

Website: www.freegurukul.org

Android App: FreeGurukul 

iOS App: Gurukul Education  

Helpline: 9042020123

*To Join In WhatsApp Group*: To get this type of Spiritual, Inspirational, Personality Development messages daily, join in group by this link www.freegurukul.org/join