31, ఆగస్టు 2020, సోమవారం

*నల్ల కోటు నారాయణ* కధ



***** ***** ***** ***** ***** ***** ***** *****

కోర్టులో తన కేసు విచారణ కోసం వేచి ఉన్న నారాయణ గారి ఫోను వైబ్రేషన్ మోడ్ లో మోగింది. జడ్జ్ గారికి నమస్కరించి బైటకొచ్చి చూసారు .... తన డ్రైవర్ రాజు నుంచి.

ఫోన్ చేసారు రాజుకి.

"రాజు .... ఏంటి ఫోన్ చేసావ్?" అనడిగారు నారాయణ గారు.

"సార్ అమ్మ గారు పూలు, పళ్ళు తెమ్మంటే మార్కెట్ కాడికొచ్చానండి. కారాపి పూలు తీసుకుంటూంటే పోలీసులు వచ్చి రాంగ్ పార్కింగ్ అని కారు తీసుకెళ్ళబోయారండి. ఇది లాయర్ నారాయణ గారిదని చెబితే 'ఐతే ఏంటంట?' అని 'టో' చేసుకుని తీసుకెళ్ళబోతుంటే ఆపబోయానండి. సిఐ గారు నన్ను కొట్టి 'పోలీసోడి దెబ్బ ఎలా ఉంటుందో మీ నారాయణకు చెప్పు' అంటూ కారు లాక్కుపోయారండి" అని చెప్పాడు డ్రైవర్ రాజు.

నారాయణ గారి మొహం ఒక్కసారిగా కంద గడ్డలా మారిపోయింది.

వెంటనే ఆయన మనసులో ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలయింది.

"నువ్వు వెంటనే కోర్టుకి వచ్చేయ్. అక్కడ ఉండొద్దు" అని చెప్పి కోర్టులోకి వెళ్ళారు నారాయణ గారు.

పది నిముషాలలో రాజు కోర్టు హాలు దగ్గరకొచ్చి నారాయణ గారికి ఫోన్ చేసాడు. అది చూసిన నారాయణ గారు బైటకొచ్చారు.

రాజు చెంప వాచిపోయి ఉంది. రాజుని వెంటబెట్టుకుని కోర్టులోకి వెళ్ళారు.

అప్పటికే ఒక కేసు అయిపోయి మరొక కేసు టేకప్ చేస్తున్నారు ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జ్.

నారాయణ గారు లేచి "Your Honour .... Here is an urgent matter to be placed before the Hon'ble Court" అన్నారు.

సీనియర్ అడ్వొకేట్ అయిన నారాయణ గారు అలా అనేసరికి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జ్ ఆయన వైపు చూసి "Can we take it up after the present matter?" అని అడిగారు.

"If the learned lawyer agrees the Hon'ble Court may take up the issue immediately" అనడంతో అప్పటి కేసు తాలూకు అడ్వొకేట్ కూడా సీనియర్ అయిన నారాయణ గారిని కాదనలేక "Its ok Your Honour. I will wait for some time. Let the Senior Advocate present his matter first, if Hon"ble Court agrres to it" అనడంతో PSJ కూడా "Please present the matter" అన్నారు.

"He is Mr. Raju, my car driver. My wife asked him to buy flowers and fruits in the market. When he stopped the car at a road side vendor to buy flowers and fruits the traffic police charged him with wrong parking. When Mr.Raju told the Police that this car belongs to Senior Advocate Narayana garu, the concerned CI slapped him on this right cheek and said 'పోలీసోడి దెబ్బ ఎలా ఉంటుందో మీ నారాయణకి కూడా చెప్పు" and towed the car. I request the Hon'ble Court to take cognizance of the matter and send the victim for medical examination and direct the concerned SHO to register a case agsinst the CI" అని వాదన వినిపించారు.

"Why this Court should direct the Police? The victim himself can go to the Police Station and lodge a complaint" అన్నారు జడ్జ్ గారు.

"The culprit himself is the Head of the Police Station, where cause of action arose. And more over Advocates are part of Judiciary. A Police can not slap any one for wrong parking and use derogatory remarks against the Judiciary" అంటూ కేసుని Police vs. Judiciary గా మార్చేసారు.

"Is an Advocate form part of Judiciary?" ప్రశ్నించారు PSJ.

"Yes Your Honour. In Re vs. Rameswhwar Prasad Goyal, Advocate case Hon'ble Supreme Court held that the Advocates are Officers of Judiciary. I will provide the citation also. In Re vs. Rameshwar Prasad Goyal Advocate AIR 2014 SC 850 it is clearly said that "As an Officer of Judiciary, Advocate has a duty to ensure smooth functioning of the Court. Since the concerned CI passed derogatory remarks against an Advocate, that too when the particular Advocate is ensuring the smooth functioning of the Court, it impleads the Judiciary also. Hence, I request Your Honour to direct the SHO, Law & Order to register a criminal case against the Traffic CI for contempt of court and also a criminal case against the said Traffic CI for taking Law into his hands by slapping a small, helpless, voiceless car driver. And also direct the Government hospital doctors to conduct medical examination of the victim" అనడంతో జడ్జ్ గారు initial order పాస్ చేసారు.

నారాయణ గారు కోర్టు జవానుకు ఆ ఆర్డర్ కాపీ ఇచ్చి పోలీస్ స్టేషన్ కు పంపించారు. మరొక ఆర్డర్ కాపీ కూడా రాజుకి ఇచ్చి గవర్న్ మెంట్ హాస్పిటల్ కు పంపించారు.

తనకు బాగా పరిచయం ఉన్న హాస్పిటల్ సూపరింటెండెంట్ తో ఫోన్లో మాట్లాడారు కూడా.

రెండు రోజులు గడిచాయి. కేసు నమోదు చేసిన దాఖలా కనపడలేదు నారాయణ గారికి. ఈ లోపల డాక్టర్ సర్టిఫికేట్ వచ్చేసింది.

మూడో రోజు కూడా కేసు రిజిస్టర్ చెయ్యలేదన్న విషయం PSJ ముందు ప్రస్థావన చేసారు నారాయణ గారు.

జడ్జ్ గారు అక్కడే ఉన్న పి.పి. గారిని అడిగారు "Is there any other way to register a case against a Police Officer?" అని.

"Your Honour is empowered to issue a warrant on the concerned Law & Order CI for not registering the cases against the Traffic CI and against the Traffic CI for not appearing before the Court and direct the SHO accodingly" అని సమాధానం ఇచ్చారు పి.పి. గారు.

జడ్జ్ గారు సిఐ మీద వారంట్ ఇష్యూ చేసారు. అది కోర్టు జవాను ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ కు పంపించారు.

"ఇంతకూ మీ కారు మీ చేతికి వచ్చిందా?" అని అడిగారు జడ్జ్ గారు.

"No Your Honour. Unless I pay the penalty, car will not be released".

"Then pay the penalty and get back your car. What prevents you from paying the penalty?".

 "I don't pay the penalty Your Honour. Car was stopped at a place where there is no visible sign board indicating that it is a No Parking Zone. More over, when street vendors are sitting on the road side and making their livelihood, how can a Police Officer say that it is a No Parking Zone? If it is a No Parking Zone, how the street vendors are allowed to sit and sell their products? If street vendors are allowed on roads, stopping of a vehicle in front of such street vendor for buying their products is also implicitly permitted. Police can not discriminate between street vendors and those who buy from them. So it is a clear case of overstepping of their duties in controlling the traffic. They can not act arbitrarily".

"Yes Mr.Narayana. What you said is reasonable. But the Court has no machinery to implement the order except through Police".

"The Hon'ble Court can write to the District Superintendent of Police for directing the concerned CI to appear before the court".

అదే రోజు జడ్జ్ గారు జిల్లా ఎస్పీకి D.O. లెటర్ రాయడం, ఆ మర్నాడే CI కోర్టుకు రావడం జరిగింది.

జడ్జ్ గారు సిఐ ని చూడగానే "మీరు కోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోరా? మీకోసం జిల్లా ఎస్పీకి లెటర్ రాయాలా? ఏమనుకుంటున్నారు మీరు మీ గురించి. I can send you to jail straight away from this court" అంటూ తీవ్రంగా మందలించారు.

"Sorry Your Honour ...." అంటూ ఏదో చెప్పబోయాడు సిఐ.

"మీ మీద క్రిమినల్ కేసులు రిజీస్టర్ చెయ్యమని SHO కు ఆర్డర్ పాస్ చేసాను. రిజిస్టర్ చేసారా?" అని సూటిగా అడిగారు జడ్జ్ గారు.

"లేదు యువరానర్ .... " అంటూ నసిగాడు సిఐ.

వెంటనే నారాయణ గారు లేచారు ...,

"Your Honour, this gentle man has appeared before this Hon'ble Court because of his boss' instructions. He has not obeyed this Hon'ble Court's lawful orders in letter and spirit. Your Honour is requested to take him into custody for wilful disobedience of Court Orders" అనడంతో సిఐకి చమటలు పట్టాయి.

పి.పి. గారు జోక్యం చేసుకున్నారు ఇంతలో .... ఎంతైనా ప్రాసిక్యూషన్ మనిషి కాబట్టి ....

"Your Honour, the concerned SHO will register the case immediately. Please don't take him into custody" అని సిఐకి మద్దతుగా మాట్లాడారు.

"When Court Orders are not implemented, Court is duty bound to take acton against him. The Court can rightfully take him into custody" అని వాదన జడ్జ్ ముందు ఉంచారు నారాయణ గారు.

"The delinquent Police Officer is hereby sent to Judicial custody" అన్నారు జడ్జ్ గారు.

పి.పి. గారు లేచి "Your Honour, I request you to grant bail to the Officer" అన్నారు సిఐని జుడిషియల్ కస్టడీకి పోనివ్వకుండా చూసే ఉద్దేశ్యంతో.

"Even before the Officer is sent to Judicial Custody, my learned friend is asking for bail. First let him go to Juducial Custody" అన్నారు నారాయణ గారు.

సిఐ పక్కన ఉన్న కానిస్టేబుల్ సిఐ ని జుడిషియల్ కస్టడీ కోసం జిల్లా కోర్టుని ఆనుకుని ఉండే రూమ్ లోకి తీసుకు వెళ్ళాడు. అక్కడ ఉన్న కోర్టు జవాను సిఐ దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసేసుకుని లోపలకు పంపించి బైట నుంచి తాళం వేసాడు.

కోర్టుకు వచ్చిన వారందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఒక పోలీస్ ఆఫీసర్ని కోర్టు జవాను లోపల వెయ్యడం అనేది ఎప్పుడూ చూడని వాళ్ళు.

ఈ లోపల పి.పి. గారు మరొక అడ్వొకేట్ ని అడిగి బెయిల్ పిటీషన్ వేయించారు. జడ్జ్ గారు నారాయణ గారి వైపు నవ్వుతూ చూసారు.

"If the Court feel that the SHO will register cases, the Hon'ble Court can grant bail" అన్నారు.

"ఏమండీ పి.పి. గారు .... SHO గారు కేసు రిజిస్టర్ చేస్తారా?" అనడిగారు జడ్జ్ గారు.

"I will personally see that a case is registered against him" అనడంతో జడ్జ్ గారు సిఐకి బెయిల్ మంజూరు చేసారు.

సిఐ కోర్టులోకి వచ్చి సెల్యూట్ కొట్టి అటెన్షన్లో నిలబడ్డాడు.

"కేసు విచారణ టూ టౌన్ ఎస్సై చేత లేదా డియస్పీ చేత కానీ చేయించండి యువరానర్" అని మరొక అభ్యర్ధన చేసారు నారాయణ గారు కోర్టు వారిని.

"O.K. Mr.Narayana. I direct DSP to conduct the investigation and submit his report to this Cort for further action" అంటూ ముగించారు జడ్జ్ గారు.

"యువరానర్ ఒక కేసు కాదు, నాలుగు కేసులు రిజిస్టర్ చెయ్యాలి" అన్నారు నారాయణ గారు.

"నాలుగా" ఆశ్చర్యంగా అడిగారు జడ్జ్ గారు.

"Yes Your Honour. First one against Law & Order CI for not registering the cases even after the Court's lawful orders. Second one against this particular Officer for criminal intimidation of a layman by slapng him on his face. Doctor certificate is already on the Court file. Third one for making derogatory remarks against Judicial Officer. Fourth one is for unlawful seizure of my vehicle" అంటూ ముగించారు నారాయణ గారు.

దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది సిఐకి.

జడ్జ్ గారు నవ్వారు.

"Deputy Superintendent of Police is directed to register four cases and report back" అంటూ లంచ్ వేళయిందంటూ లేచారు.

బైటకు వచ్చిన పి.పి. సిఐని నారాయణ గారి దగ్గరకు తీసుకుని వచ్చారు.

"నారాయణ గారు, ఏంట్సార్, పగ పట్టారు? ట్రాఫిక్ సిఐతో పాటు లా & ఆర్డర్ సిఐని కూడా ఇరికించారుగా?" అంటూ పలకరించారు పి.పి. గారు.

"ఐదో కేసు కూడా పడుతుంది"

"ఐదోదా?"

"కార్ టోయింగ్ చేసి తీసుకువెళ్ళే సమయంలో జరిగిన డామేజికి ఎవడు పెడతాడు?"

సిఐ మాత్రం నారాయణ గారి వైపు అలా చూస్తూ ఉండిపోయాడు.

"పోలీసోడి దెబ్బకు లాయరు నారాయణ సమాధానం ఎలా ఉంది సిఐ గారు?" అంటూ బైటకు నడిచారు నారాయణ గారు.

*************************

నీళ్లు.. నిజాలు

ఎందుకని మల్టీనేషనల్ కంపెనీల నీళ్ళకూ కూల్ డ్రింకులకూ అలా పురుగులు పట్టడం లేదు.?
.
ఎందుకని మనం ఇంట్లో తొట్టెల్లో పట్టిన నీళ్ళు రెండు రోజులకూ మనం తయారు చేసుకునే పళ్ళరసాలు మర్నాటికే పాడైపోతున్నాయి? అవి మన ఇంటిలోని వాటికన్నా మంచివి అవ్వడం వల్లనా నీళ్లు నిజాలు
.
కాదు కాదు కానే కాదు మరి నిజం ఏవిటి?
.
నేను ఈ ప్రయోగం చేసి అనేక బాటిల్స్ నీళ్ళనూ, కూల్ డ్రింకులనూ స్వయంగా పరిశీలించి వాటి Ph Values చూసిన తర్వాతే ఈ పోస్ట్ పెడ్తున్నాను.
Please read and save your own mother, father and your own family and save other's health.
.
సహజంగా మనం తాగే నీరు, Normal Pure Drinking Water Ph. Values కనీసం 7 వరకూ వుండాలి..మనం ప్రతి రోజూ 20/- రూపాయల నుంచి నుంచి 100/- వరకూ డబ్బు పెట్టి బస్టాండ్లలో/ రైల్వేస్టేషన్లలో/ ఎయిర్ పోర్ట్ ల్లో కొనుక్కుని తాగే కిన్లే, ఆక్వాఫినా బిస్ లరీ, బ్రయిలీ ఇలా అనేక వాటర్ బాటిల్స్ లోని Ph. Values Test చేసి చూస్తే అవి కనీసం 5.5 కూడా లేదు. అంటే మనం ఎంతో ఆరోగ్యకరమైన వని అనుకుంటూ ఎంత భయంకరమైన ఎసిడిక్ కంటెంట్ వున్న నీటిని తాగుతున్నామో మనం ఆలోచించాలి. తెలుసుకోవాలి.
న్యూస్ పేపర్లలో, టివి చానల్స్ లో ఆ మల్టీనేషనల్ కంపెనీల వాళ్ళు కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి ఎవరికి వారు ఈ వ్యాపారం లోకి దిగారు. మనకు వాళ్ళ కంపెనీల ముద్ర వున్న నీరు మాత్రమే ఎంతో మంచిదని భ్రమ కలిగిస్తూ మనకు ఎంతో ఇష్టమైన సినిమా వాళ్ళని క్రికెటర్లను అడ్డం పెట్టుకుని వాళ్ళకి కోట్లు ఇస్తూ ప్రకటనల్లో నటింపచేస్తున్నారు. వారు కోట్ల డబ్బు కోసం చేసే ప్రకటనలు చూసి మనం మోసపోతున్నాం. నిజానికి మనం తాగే నీరు ఆల్కలైన్ స్టేజ్ లో వుంటే రుచి తక్కువగా వుంటుందని పుల్లగా వుండడం కోసం ఆ నీటిలో ఎసిడిక్ కంటెంట్ వుండేట్టుగా మన కార్పొరేషన్ నీరుని మారుస్తున్నారు.
ఎసిడిక్ టేస్ట్ అంటే కొద్దిగా పుల్లని రుచితో మామూలు మంచి నీటికన్నా భిన్నమైన రుచితో వుంటుంది. మనం వారి అడ్వర్టైజ్ మెంట్లు చూసి ఆ నీరు కార్పొరేషన్ నీరు కన్నా శుద్దమైన నీరని వారి వాటర్ కన్నాఎంతెంతో మంచి నీరు అనే భ్రమలో అజ్ఞాన అంధకారంలో బతుకుతున్నాం.

వాళ్ళు మామిడి పండు రసాన్ని విమర్శిస్తూ మజాని తాగమంటారు. బత్తాయి కమలా పళ్ళరసాల్ని విమర్శిస్తూ ఆరెంజ్ డ్రింక్ తాగమంటారు. చదువుకున్న మనం తాగేది మంచి వనుకుంటూ చదువుకోని వారు కూడా తాగుతున్నారు.
ఏడ్స్ లో వారు చూపించేదంతా నిజమేనేమో అనుకుని అత్యంత భయంకరమైన ఏసిడ్ మీడియం ద్రావకాలను మనం తాగుతూ పసిపిల్లలకు కూడా తాగిస్తున్నాం. ఎసిడిక్ మీడియం లోని వస్తువులు తినడం వల్ల తాగడం వల్లా శరీరమంతా బలహీనమైనపోయి ఎక్కడలేని రోగాలతో సర్వనాశనమౌతున్నాం.
.
కాన్సర్ పుండ్లు కాన్సర్ కణాలు అన్నీ ఎసిడిక్ మీడియంలోనే పెరుగుతాయి.
ఆ కణాలు విపరీతంగా పెరగడానికి ఈ ఎసిడిక్ మీడియం నీళ్ళు కూల్ డ్రింకులూ కారణమౌతాయి. ఆస్తమా న్యుమోనియా వ్యాధుల తీవ్రతని ఎంతగానో పెంచుతాయి. అంతే కాదు రక్తంలో ఇంకా అనేక వ్యాధులు రావడానికీ, గాల్ బ్లాడర్, లివర్, కిడ్నీలు సర్వనాశనమవ్వడానికీ కారణమౌతుంది. అందుకనే ఆయుర్వేద వైద్యం వీలైనంత వరకూ మంచి నీటి బావినీరునే వాడుకోమని చెప్తుంది. లేదా మామూలుగా వచ్చే కుళాయిలోని నీటిని మామూలు ౩ కాండిల్స్ ఫిల్టర్స్ లో వేసుకుని త్రాగాలని సలహా ఇవ్వడం జరుగుతోంది. మనకు పుల్లని రుచితో వుండే ఈ ఎసిడిక్ నీళ్ళు కావాలో ఆరోగ్యం కావాలో మనమే ఇక నిర్ణయించుకోవాలి.
మనం రుచి కావాలనుకుంటే మంచి నీటిలో ఏలక్కాయల తొక్కులు వేసుకుని వాడుకోవచ్చు. మీకు ఇంకా పుల్లని నీరు తాగాలనిపిస్తే చక్కగా ఫ్రెష్ లెమన్ జ్యూస్ తీసుకుని తేనె వేసుకుని తాగచ్చు కదా ఈ కెమికల్ వాటర్ తాగి కుళ్ళి కుళ్ళి చావడం కన్నా.
..
మనం ఎవరో ఒక సినిమా స్టార్ చెప్తే మనం మళ్ళీ నమ్మి వాటిని మనం మన పిల్లలకి కూడ పట్టిస్తున్నాము. ఆ సినిమా హీరో కూల్ డ్రింక్ త్రాగుతుంటే చూసి వాళ్ళు తాగమని చెప్పే అత్యంత హానికరమైన కూల్ డ్రింకుల్నీ సోడాల్ని, బాటిల్డ్ వాటర్నీ ఎంత డబ్బుపోసి కొంటున్నాం. అవి నిజంగా అంతగా హానికరం కావు అని నమ్మి స్వయంగా కన్న తల్లి తండ్రులే తమ పసిబిడ్డలకు కూడా ఆ ద్రావకాలను తాగించేస్తున్నారు. అనేక వ్యాధులకు కారణమౌతున్నారు.
.
మనం చేసిన లెమన్ జ్యూస్ మర్నాటికి కంపు కొడుతుంది కదా..
మరి కూల్ డ్రింకుల్లో ఎందుకు పురుగులు రావు ??
.
ఎందుకు రావంటే పురుగుల మందుకలిపిన పదార్ధానికి పురుగులు పట్టవు కనక. ఆ కంపెనీల వారు తయారు చేసిన కూల్ డ్రింకులకు షెల్ఫ్ లైఫ్ పెరగడానికి వారు పురుగు మందులతో పాటు, అంత కన్నా ప్రమాదకరమైన కెమికల్స్ ని ప్రిసర్వేటివ్స్ పేరుతోనూ ఎసిటిక్ ఏసిడ్ కలిపి చేసిన ద్రవ పదార్థాల వల్లా, ఆహరపదార్థాల వల్లా ఎన్నో ఏసిడ్ మన ఒంట్లోకి ప్రవేశించి కేన్సర్ కి, Asthma కి, ఆర్థరైటిస్, జాండిస్, డయబిటిస్ వంటి అనేక రుగ్మతలు పెరగడానికి కారణమౌతున్నాయి.
మల్టీనేషనల్ కంపెనీలు వేసే భయంకరమై వేషాలు, చేసే అతి నీచమైన మోసాలూ ఈ ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యరు చెయ్యలేరూ. ఆస్థమా, ఆర్థైటిస్ డయబెటిల్, లో బిపి హైబిపిలు వచ్చేట్టు చేసేది వాళ్ళు తయారు చేసిన ఆహారాలే.
ఆ రోగాలుఎలా వస్తాయో తెలియదని చెప్పేది వారే.
ఒకసారి రోగం వస్తే తమమందులను జీవితమంతా వాడాల్సిందే అని చెప్పేదీ వారే. పిల్లి గుడ్డిదైతే ఎలక ఎదురునిలబడి ఎకసెక్కెం చేసిందనే సామెత నేడు భారత దేశంలో ఎంతో నిజం.
.
సింపుల్ గా అర్థమయ్యేట్టు చెప్పాలంటే మనం తాగే ఆక్వాఫినా కిన్లే బిస్ లరీ బాటిల్స్ లో సప్లై చేసే నీరు ఒక గ్లాసు తాగితే అది కనీసం ఒక 12 గ్లాసుల ఆల్కలైన్ వాటర్ తాగితే కానీ న్యూట్రల్ కాదు. ఇక కిన్లే బిస్ లరీ సోడాలూ కూల్ డ్రింకులు ఒక గ్లాస్ నీరు తాతితే కనీసం 24 గ్లాసుల ఆల్కలైన్ నీరు త్రాగితే కానీ మళ్ళీ ఆనీరులోని ఏసిడ్ నార్మల్ కాదు.
.
శాస్వత పరిష్కారం.
.
అ నీటికన్నా మన కార్పొరేషన్ వారు ప్రతి రోజూ మన ఇళ్ళకి సప్లై చేస్తున్న మంచి నీరు కనీసం 12 రెట్లు మంచి నీరు. దానిని హాయిగా మామూలు ఫిల్టర్ల లో పోసుకుని త్రాగడమ్ ఎంతో మంచిది.
ఇంకా కావాలంటే చక్కగా బిందెలో వీలైతే రాగిబిందెలో కాచుకున్న నీటిని మట్టి కుండలో పోసుకుని టెస్ట్ చేస్తే మాకు 9.6 Ph Values వున్న నీరుగా మారింది. అంటే ఎంతో ఆరోగ్యకరమైన నీరు అన్నమాట.
లేదా పాత ఫిల్టర్లు వుండేవి మూడు కాల్షియం కాండిల్స్ వుండే ఫిల్టర్లు అలాంటివి అయినా మంచివే. 
ఆ నీటిని కొద్దిగా వేడిగా ప్రతి రోజూ ఉదయం మూడు గ్లాసులు తాగితే దగ్గూ జలుబూ ఆస్థమా వ్యాధులు, వైరల్ జ్వరాలూ తగ్గుముఖం పడతాయి. కిడ్నీ వ్యాధులు జాండిస్ లూ రాకుండా వుంటాయి.
.
ఊరు వెళ్తుంటే బద్దకం వదిలెయ్యండి.

ఏదైనా ఊరు వెళితె చక్కగా మీ నీళ్లని, దానిలో వున్న మీ ఆరోగ్య్యాన్ని, మీ చేత్తో ఒక Bag లో తీసుకుని వెళ్ళండి.
అది వీలు కాలేదా..ఆ నీళ్ళు అయిపోతే ఎక్కడ ఏ మనుషులు సాధారణంగా ఏ నీరు త్రాగుతున్నారో ఆనీరును మీరు కూడా త్రాగండి.
ఎంత దూరప్రాంతాలకు వెళ్ళినా బాటిల్ వాటర్ త్రాగి కేన్సర్లు తెచ్చుకోవడం కన్నా ఆ ఊర్లలో ఏ తల్లిని ఏ ఇంట్లో నీరు అడిగినా తప్పకుండా ఇస్తారు.
మనం ఈ రోజుల్లో పైగా సంస్కారం పేరుతో తెచ్చిపెట్టుకున్న ఈ వింత ప్రవర్తనతో,మంచినీళ్ళు అడగడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నాం నిజం చెప్పాలంటే భయ్తపడిపోతున్నాం. తప్పుగా అనుకుంటారేమో అని.
ఇది చాలా చాలా విచారకరమైన విషయం.అలా అడిగినవాళ్ళని ఎగాదిగా చూస్తున్నాం.
మనజాతి అవలంభించిన అత్యుత్తమమైన విశ్వమానవ సంస్కృతిని అలవరచుకుందాం. ప్రపంచ మానవజాతికి దారిని చూపించే దేశం నుంచి వచ్చిన మనం చివరికి మనం తాగే మంచి నీళ్ళకోసం కూడా ఆ స్వార్ధ వ్యాపార దృష్టితో పనిచేస్తున్న మల్టీనేషనల్ కంపెనీలపై ఆధారపడాలా?
భారతీయులమైన మనం ముందుగా మన వాళ్ళని రక్షించుకుందాం
తరువాతి తరాలకు దారిచూపిద్దాం.
దార్శనికులమై నిలబడదాం.
.
సత్యమేవ జయతే. జైహింద్.
.
Dr Gautham Kashyap
+917989740833

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


*అష్టమ స్కంధము - ఇరువదియవ అధ్యాయము*

*వామనుడు విరాట్ రూపమున రెండడుగులతో పృథ్విని, స్వర్గమును ఆక్రమించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*

*20.1 (ప్రథమ శ్లోకము)*

*బలిరేవం గృహపతిః కులాచార్యేణ భాషితః|*

*తూష్ణీం భూత్వా క్షణం రాజన్నువాచావహితో గురుమ్॥7061॥*

*శ్రీశుకుడు నుడివెను* మహారాజా! తన కులగురువైన శుక్రాచార్యుడు ఇట్లు పలుకగా ఆదర్శగృహస్థుడైన బలి చక్రవర్తి ఒకక్షణము మౌనము వహించెను. పిమ్మట వినమ్రుడై సావధానముగా శుక్రాచార్యునితో ఇట్లనెను-

*బలిరువాచ*

*20.2 (రెండవ శ్లోకము)*

*సత్యం భగవతా ప్రోక్తం ధర్మోఽయం గృహమేధినామ్|*

*అర్థం కామం యశో వృత్తిం యో న బాధేత కర్హిచిత్॥7062॥*

*బలిచక్రవర్తి ఇట్లనెను* మహాత్మా! మీ వచనములు సత్యములే. గృహస్థాశ్రమములో నున్నవారికి అర్ధము, కామము, యశస్సు, జీవనోపాధి మున్నగువాటి యందు భంగము కలుగకుండ వ్యవహరించుటయే గృహస్థులకు ధర్మము.

*20.3 (మూడవ శ్లోకము)*

*స చాహం విత్తలోభేన ప్రత్యాచక్షే కథం ద్విజమ్|*

*ప్రతిశ్రుత్య దదామీతి ప్రాహ్లాదిః కితవో యథా॥7063॥*

కాని, గురుదేవా! నేను ప్రహ్లాదునకు పౌత్రుడను. ఒకసారి ఇచ్చుటకు ప్రతిజ్ఞచేసియున్నాను. కనుక, ఇప్పుడు ధనలోభముచే *నేను నీకు ఇయ్యను* అని మోసగానివలె ఈ బ్రాహ్మణునితో అబద్ధమును ఎట్లు పలుకగలను?

*20.4 (నాలుగవ శ్లోకము)*

*న హ్యసత్యాత్పరోఽధర్మ ఇతి హోవాచ భూరియమ్|*

*సర్వం సోఢుమలం మన్యే ఋతేఽలీకపరం నరమ్॥7064॥*

అట్లు మాట తప్పినచో ఈ భూమి నన్ను గూర్చి ఇట్లనును- "అసత్యమునకు మించిన అధర్మము మఱియొకటి లేదు. నేను అన్నింటిని సహింపగలను. కాని, అసత్యవాది యొక్క బరువును నేను మోయజాలను" అని యనును.

*20.5 (ఐదవ శ్లోకము)*

*నాహం బిభేమి నిరయాన్నాధన్యాదసుఖార్ణవాత్|*

*న స్థానచ్యవనాన్మృత్యోర్యథా విప్రప్రలంభనాత్॥7065॥*

మహాత్మా! వేదవేత్తలైన బ్రాహ్మణునకు ఇచ్చిన మాటను తప్ఫుటకు భయపడినంతగా, నరకమునకు, దారిద్ర్యమునకు, దుఃఖసముద్రమునకు, రాజ్య నాశనమునకు, కడకు మృత్యువునకు గూడానేను భయపడను.

*20.6 (ఆరవ శ్లోకము)*

*యద్యద్ధాస్యతి లోకేఽస్మిన్ సంపరేతం ధనాదికమ్|*

*తస్య త్యాగే నిమిత్తం కిం విప్రస్తుష్యేన్న తేన చేత్॥7066॥*

ఈ లోకమున మరణించిన పిదప ధనము మొదలగు వస్తువులు ఏవియును మనతో రావు. ఆ వస్తువును సద్బ్రాహ్మణులకు దానము చేసి, వారిని సంతృప్తి పరచినచో, అట్టి దానమునకంటె గొప్ప ప్రయోజనము ఏముండును?

*20.7 (ఏడవ శ్లోకము)*

*శ్రేయః కుర్వంతి భూతానాం సాధవో దుస్త్యజాసుభిః|*

*దధ్యఙ్ శిబిప్రభృతయః కో వికల్పో ధరాదిషు॥7067॥*

దధీచి, శిబిమొదలగు మహాపురుషులు తమకు అత్యంత ప్రియమైన ప్రాణములను గూడ దానము చేసి, ఇతర ప్రాణులకు మేలు చేసిరి. ఇంక పృథివి మున్నగు అశాశ్వత వస్తువులను దానము చేయుటకు వెనుకాడవలసిన పని యేమున్నది.

*బమ్మెర పోతనామాత్యులవారి పద్యము*

శార్దూల విక్రీడితము

కారే రాజులు? రాజ్యముల్
......గలుగవే? గర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరిమూటఁగట్టుకొని
......పోవం జాలిరే? భూమిపైఁ
బేరైనం గలదే? శిబిప్రముఖులుం
 ......బ్రీతిన్ యశః కాములై
యీరే కోర్కులు? వారలన్ మఱచిరే
......యిక్కాలమున్? భార్గవా!

*తాత్పర్యము*

భర్గుని కమారుడైన శుక్రాచార్యా! పూర్వం కూడ ఎందరో రాజులు ఉన్నారు కదా. వారికి రాజ్యాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎంతో అహంకారంతో ఎంతో ఔన్నత్యాన్ని సాధించునవారే కదా. కాని వా రెవరు సంపదలు మూటగట్టుకొని పోలేదు కదా. కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలి లేదు కదా. శిబి చక్రవర్తివంటి వారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోరికలు తీర్చారు కదా. వారిని ఈ నాటికీ లోకం మరువలేదు కదా.

*20.8 (ఎనిమిదవ శ్లోకము)*

*యైరియం బుభుజే బ్రహ్మన్ దైత్యేంద్రైరనివర్తిభిః|*

*తేషాం కాలోఽగ్రసీల్లోకాన్ న యశోఽధిగతం భువి॥7068॥*

గురువర్యా! పూర్వముగొప్ప దైత్యప్రభువులు ఈ భూమిని (రాజ్యమును) అనుభవించిరి. వారికి సాఠియైనవారు పృథ్వియందు నేటికినీ మరెవ్వరును లేరు. వారు ఇహలోకము నందును పరలోకమునందును, అనుభవించిన భోగములను అన్నింటిని కాలము కబళించినది. కాని, వారి కీర్తి మాత్రము ఈ భూతలమున నేటికినీ నిలిచియున్నదిగదా!

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ఇరువదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

పిత్రార్జితం


   😌😌😌😌

*‘‘అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది?’’*

వినోద్‌ తన అన్నయ్యను అడుగుతున్న ప్రశ్న విని ఉలిక్కిపడింది సావిత్రి. అటువంటి సన్నివేశం ఎన్నో కథల్లో చదివింది, ఎన్నో సినిమాల్లో చూసింది. కానీ తన జీవితంలో మాత్రం అటువంటి సన్నివేశం రాకూడదనీ, భర్తకంటే ముందే పునిస్త్రీగా వెళ్ళిపోవాలనీ అందరు దేవుళ్ళనూ కోరుకుంది. అయితే తన ప్రార్థన ఫలించలేదు. భర్త గుండెపోటుతో తనకంటే ముందుగా భగవంతుణ్ణి చేరుకున్నాడు.

‘‘అమ్మ మన ఇద్దరిదగ్గరా ఉంటుంది. అలా అని ఏడాదికి ఆరునెలలంటూ మనం పంచుకోవలసిన అవసరంలేదు. ఆమెకు ఇష్టమైనన్ని రోజులు ఎవరి ఇంట్లోనైనా ఉండొచ్చు’’ అన్నాడు విజయ్‌.

విజయ్‌ సమాధానం విన్నాక ఆమె మనసు కాస్త స్థిమితపడింది. ‘అయినా తనకెందుకు లేనిపోని భయాలు, అనుమానాలు? తన బిడ్డల గురించి తనకు తెలియదా?’ అనుకుంది.

విజయ్, తండ్రి బీరువా తెరిచి అందులోంచి బ్యాంకు పాస్‌బుక్‌ తీశాడు. తండ్రి పోయినరోజు నుంచి వైకుంఠ సమారాధన వరకూ అయిన ఖర్చులు ఇద్దరూ కలసి లెక్కలు వేశారు. బ్యాంకులో ఉన్న డబ్బు తాము ఖర్చుపెట్టిన మొత్తంకంటే ఎక్కువగానే ఉండటం చూసి సంతోషించారు.

భర్త అకౌంటులో ఉన్న డబ్బు గురించి తనతో సంప్రదించకుండానే కొడుకులు నిర్ణయాలు తీసుకోవడం సావిత్రిని బాధించింది. ‘అయినా తండ్రి అంతిమయాత్రకూ కార్యాలకూ అయ్యే ఖర్చులు ఆమాత్రం భరించలేరా... ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు’ అనుకుంది.

తర్వాత ఇంటి ప్రస్తావన వచ్చింది.
‘‘మేమిద్దరం ఇళ్ళు కట్టుకున్నాం. అందుకు బ్యాంకు లోనుతోపాటు బయట కూడా అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ ఇల్లు అమ్మితే పదిలక్షలదాకా వస్తుంది. మేము చెరో అయిదు లక్షలు తీసుకుంటాం. ఎటూ నువ్వు మాతోనే ఉంటావు కాబట్టి ఇక ఈ ఇంటి అవసరం ఉండదు’’ అన్నాడు విజయ్‌ తల్లితో.

‘‘మీ నాన్నగారు ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇల్లురా ఇది. కేవలం ఇటుకలు, సిమెంట్‌తో కట్టిన ఇల్లు కాదు. ఎంతో శ్రమతో, శ్రద్ధతో, ఆయన కష్టార్జితంతో కట్టిన ఇల్లు. ఈ ఇంట్లో ఎన్నో శుభకార్యాలు జరిగాయి. మీ చదువులూ ఆటలూ మీ భార్యల సీమంతాలూ మీ పిల్లల బారసాలలూ... అన్నీ ఈ ఇంట్లోనే జరిగాయి. ఎంతోమంది బంధువులూ స్నేహితులూ ఈ ఇంటికి వచ్చి, మన ఆతిథ్యాన్ని స్వీకరించి, మనసారా దీవించి వెశ్ళారు. మనకెన్నో తీయని అనుభూతుల్నీ మీ నాన్నగారికి తృప్తినీ ఆనందాన్నీ ఇచ్చిన ఈ ఇంటిని అమ్మడం నాకిష్టంలేదురా’’ అంది సావిత్రి.

‘‘మనిషే పోయాక ఇక ఇల్లెందుకమ్మా?

మా ఇళ్ళకీ బంధువులూ మిత్రులూ వస్తారు. అక్కడ కొత్త అనుభూతులకు స్వాగతం పలుకుదాం. పైగా ఆర్థికంగా మేము ఇబ్బందుల్లో ఉన్నాం. ఇల్లు అమ్మితే వచ్చే డబ్బుల్తో మా సమస్యలు తీరితే నాన్న ఆత్మ కూడా సంతోషిస్తుంది’’ అన్నాడు వినోద్‌.

‘‘లేదురా, ఆయనకు ఈ ఇల్లంటే ప్రాణం. కనీసం నేను ఉన్నంతవరకైనా ఇల్లు అమ్మకండి. కావాలంటే నా నగలన్నీ ఇస్తాను. అవి అమ్ముకుని మీ అప్పులు తీర్చుకోండి’’.

‘‘నీ నగలు ఎన్ని ఉన్నాయమ్మా? అన్నీ అమ్మినా యాభైవేలు రావు’’ అన్నాడు విజయ్‌ విసుగ్గా.

‘‘అమ్మా, ఇంటి డాక్యుమెంట్లు కనబడటంలేదు. బ్యాంకు లాకర్లో పెట్టారా నాన్న?’’ బీరువా వెతుకుతున్న వినోద్‌ అడిగాడు.

‘‘లాకర్లో కాదు. నాన్న ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టారు. నేనూ ఆ విషయం మరచిపోయాను. ఇప్పుడు నువ్వడిగితే గుర్తొచ్చింది’’.

‘‘తాకట్టు పెట్టారా? అంత అవసరం ఏం వచ్చింది?’’ కొడుకులిద్దరూ ఒకేసారి అడిగారు.

‘‘మీ చదువుల కోసం’’.

‘‘మా చదువుల కోసమా? మా చదువులు పూర్తయి అయిదేళ్ళు కావస్తూంది’’ అన్నాడు విజయ్‌ అసహనంగా. బ్యాంకులోను వల్ల ఇల్లు అమ్మితే వచ్చే మొత్తంలో తన వాటా మరింత తగ్గిపోతుందన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు అతను.

‘‘కావచ్చు. ఆయన రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసినా జీతం తప్ప మరో ఆదాయం ఆశించలేదు. మీకు ఎంట్రన్స్‌లో మంచి మార్కులు రాకపోతే లక్షలు ఖర్చుపెట్టి ప్రైవేటు కాలేజీల్లో మిమ్మల్ని ఇంజినీరింగ్‌ చదివించారు. మరి అంత డబ్బు ఆయనకు ఎక్కణ్ణుంచి వచ్చిందనుకున్నారు? మీకు ఉద్యోగాలొచ్చాక ఆయన అప్పుల గురించి మీరు అడుగుతారనీ మీ వంతు సాయం చేస్తారనీ అనుకున్నాం. కానీ మీకా ఆలోచన లేకపోయింది. మీముందు చేయిచాచడానికి ఆయన ఇష్టపడలేదు.

ఆ అప్పు అలాగే నిలిచిపోయింది.

అప్పటికీ తన పెన్షను నుంచి కొంత, పైపోర్షను బాడుగ నుంచి కొంత బ్యాంకు లోనుకు కడుతూనే ఉన్నారు’’.

‘‘ఇంకా ఎంత కట్టాలట?’’

విజయ్‌ అడిగాడు.

‘‘అయిదు లక్షలు కట్టాలి’’ బీరువా నుంచి తీసిన బ్యాంకు స్టేట్‌మెంట్‌ను టీపాయ్‌మీదకి గిరాటేసి అన్నాడు వినోద్‌.

‘‘హు, ఏడ్చినట్లే ఉంది. ఈమాత్రం దానికి ప్రపంచంలో తానొక్కడే ఇల్లు కట్టినట్లూ పిల్లల్ని చదివించినట్లూ ఫోజులు’’ అన్నాడు విజయ్‌.

పిల్లలు భర్తను తేలికచేసి మాట్లాడుతూంటే సావిత్రికి ఎంతో బాధేసింది.

‘‘లోను తీసుకున్న ఆయన ఇప్పుడు లేరు కదరా. అయినా ఆ అప్పు మీరు తీర్చాలా?’’ అని తన అనుమానం వ్యక్తంచేసింది.

‘‘ఆయన లేకపోతేనేం? మేం బతికున్నాం కదా. ఆయన ఇంటికి ఎలా వారసులమో ఆయన అప్పుకూ వారసులమే. అయినా అవన్నీ నీకు చెప్పినా అర్థంకాదు. ఇక మమ్మల్ని వదిలెయ్‌’’ రెండుచేతులూ జోడించి విసుగ్గా అన్నాడు వినోద్‌. సావిత్రి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ‘తను చదువుకోలేదు. ఉద్యోగం చెయ్యలేదు. కానీ చెబితే అర్థం చేసుకోలేనిదేంకాదు. భర్త ప్రతి విషయం ఎంతో ఓపికతో తనతో చెప్పేవాడు. అర్థంకాకపోతే వివరించేవాడు. వీళ్ళకు అంత ఓపిక లేదు. అందుకే ఇలా విసుక్కుంటున్నారు. వీళ్ళకోసం, వీళ్ళ ఆరోగ్యం కోసం తను ఎన్ని పూజలు చేసింది? ఎన్ని రోజులు ఉపవాసాలుంది? ఎంత ఓపికతో అన్నీ అమర్చిపెట్టింది? అవన్నీ వాళ్ళకు ఇప్పుడు గుర్తులేదు. గుర్తుచేసుకోరు కూడా’ అనుకుంది.

ముఖ్యంగా కోడళ్ళముందు కొడుకులు తనను అలా విసుక్కోవడం ఆమెను మరింత బాధించింది. ‘కోడళ్ళను కన్నకూతుళ్ళలా చూసుకున్నారు తనూ భర్తా. వాళ్ళు కల్పించుకుని భర్తల్ని వారించకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూంది. ఆర్థిక అవసరాలు అభిమానాల్ని ఇంతగా చంపేస్తాయా?’ అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది.

* * *

ఉదయం నిద్రలేచిన సావిత్రి గడియారం వంక చూసింది. ఏడు గంటలు చూపిస్తూంది. ‘అబ్బ, ఇంతసేపు ఎలా నిద్రపోయాను?’ అనుకుంటూ పిల్లల గదిలోకి నడవబోయింది. ఇంతలో కొడుకులు తమ కుటుంబాలతో ఉదయమే ఊరికి వెళ్ళిపోవడం గుర్తొచ్చింది ఆమెకు.

‘రాత్రంతా ఏడ్చీ ఏడ్చీ నిద్రపోయేసరికి పన్నెండు దాటింది. తెల్లవారుజామునే పిల్లల ప్రయాణం. నిద్రలేమి వల్ల తల పగిలిపోతూంది. కాఫీ గొంతులోపడితేగానీ అది తగ్గదు’ అనుకుంటూ గేటు దగ్గరకు వెళ్ళి పాలబ్యాగులో చెయ్యిపెట్టి చూసింది. అది ఖాళీగా ఉంది.

తల్లిని తనతో తీసుకెళుతున్నాననీ మరుసటిరోజు నుంచి పాలప్యాకెట్‌ అవసరంలేదనీ పాలవాడితో విజయ్‌ ముందురోజు చెప్పడం గుర్తుకొచ్చింది. ‘ఇంటిపై లోను ఉందని తెలిసి, ఆ నిరుత్సాహంతో నన్ను పిలుచుకుని వెళ్ళడం మరచిపోయారు ఇద్దరూ’ అనుకుని నవ్వుకుంది.

షాపు నుంచి పాలప్యాకెట్‌ తెచ్చుకోవడానికి చిల్లరకోసం ఇల్లంతా వెదికింది. ఎక్కడా చిల్లరగానీ కరెన్సీ నోట్లుగానీ కనిపించలేదు. తలనొప్పి క్షణక్షణానికి అధికం కాసాగింది. ఏంచేయాలో తెలియక నిస్సహాయంగా నిలబడిపోయిన ఆమెకు ఎదురుగా కొక్కేనికి తగిలించి ఉన్న భర్త చొక్కా కనిపించింది. ఆశగా వెళ్ళి జేబులో చెయ్యి పెట్టింది. కొన్ని పదిరూపాయల నోట్లు ఆమె చేతికి తగిలాయి. ఆమెకు ప్రాణం లేచివచ్చింది.

‘నీకు నేనున్నాను’ అని భర్త తనతో అన్న భావన కలిగింది ఆమెకు. ‘ఎప్పుడూ వందరూపాయలకు సరిపడా పదిరూపాయల నోట్లు జేబులో ఉంచుకోవడం ఆయనకు అలవాటు. ఆ అలవాటే ఇప్పుడు తన అక్కర తీర్చింది’ అనుకుంది. కాసేపు భర్త ప్రేమను తలచుకుని ఏడ్చింది. తర్వాత చెప్పులేసుకుని షాపుకు బయలుదేరబోతూంటే రామయ్య వచ్చాడు. అతను ఆమె భర్త పనిచేసిన ఆఫీసులో అటెండరు.

అతను చేతిలోని ఫ్లాస్కు ఆమె చేతికిస్తూ ‘‘పిల్లలు ఊళ్ళకు వెళ్ళిపోయారని విన్నాను. వాళ్ళ పనులు వాళ్ళకుంటాయిగా మరి. మరో నాలుగురోజులు మీరు వంట జోలికి పోకండి. కాఫీ, టిఫిన్, భోజనం అన్నీ నేను తెచ్చిస్తాను. మంచి శాకాహార హోటల్‌నుంచే తెస్తానులెండి. పదిరోజులుగా మనిషి పోయిన బాధతో, వచ్చేపోయే జనంతో బాగా అలసిపోయి ఉంటారు. నాలుగురోజులు విశ్రాంతి తీసుకోండి. మళ్ళీ ఎటూ మనుషుల్లో పడిపోవాలి. తప్పదు’’ అన్నాడు.

సావిత్రి కాఫీ రెండు కప్పుల్లో పోసి, అతనికొకటి ఇచ్చి తనొకటి తీసుకుంది.

‘‘అమ్మా, నా కూతురి పెళ్ళికి అయ్యగారిని పదివేలు అప్పడిగాను. ఆయన తన పి.ఎఫ్‌. నుంచి లోను తీసుకుని నాకిచ్చారు. ప్రతినెలా అయ్యగారి జీతంనుంచి ఆ లోన్‌కు అయ్యే కటింగ్‌ మొత్తం ఆయనకు నా జీతంనుంచి ఇచ్చేసేవాణ్ణి. ఆయన రిటైర్‌ అయ్యేలోపు ఆ అప్పు తీర్చేయాలనుకున్నానుగానీ సాధ్యంకాలేదు. ఆయన రిటైర్‌ అయినప్పుడు ఆ డబ్బుల్ని ఆయనకు ఇవ్వాల్సిన పి.ఎఫ్‌. నుంచి పట్టుకున్నారు. నేను ఈ నెల రిటైర్‌ అవుతున్నాను. నాకొచ్చే డబ్బుల్లోంచి మిగిలిన బాకీ మీకిచ్చేస్తాను. అటువంటి గొప్పవ్యక్తి అప్పు ఎగ్గొడ్తే నాకు మంచి జరగదమ్మా. ఆయన దేవుడమ్మా. అటువంటి మనుషుల్ని మళ్ళీ మనం చూడలేం’’ అంటూ రామయ్య ఏడవసాగాడు. సావిత్రి కళ్ళనిండా నీరు నిండింది.

‘‘అమ్మా, మీ పెన్షన్‌ పేపర్లన్నీ నేనే తెచ్చి మీ సంతకం తీసుకుంటాను. ఈ విషయంలో మీకు సహాయం చేయడానికి మా ఆఫీసులో అందరూ సిద్ధంగా ఉన్నారు’’ అని చెప్పి రామయ్య శెలవు తీసుకున్నాడు. ఆమెకు మళ్ళీ భర్త తనతో ‘నేనున్నాను’ అన్న భావన కలిగింది.

రామయ్య వెళ్ళిపోయాక ‘రామయ్య తీసుకున్న అప్పు గురించి ఆయన నాకు చెప్పారు. కానీ పదివేలు అప్పు తీసుకున్న రామయ్య అది తీర్చాలని తపనపడుతున్నాడే. మరి పాతికేళ్ళు పిల్లల్ని పెంచి, పెద్దచేసి చదివించామే. వాళ్ళకు తండ్రి బాధ్యత పంచుకోవాలనిగానీ తల్లి ఒంటరిగా ఉంటుందన్న ఆలోచనగానీ ఎందుకు రావడంలేదు? ఎందుకు పిల్లలు ఇలా మారిపోయారు? పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వారికీ తల్లిదండ్రులకీ మధ్య ఆర్థిక సంబంధాలు తప్ప ఇంకే బంధాలూ ఉండవా?

ఆయన పిల్లల్ని ఎంతో శ్రద్ధ తీసుకుని పెంచారు. మంచితనం, మానవత్వం, నిజాయతీ, క్రమశిక్షణ లాంటి సుగుణాలను నూరిపోశారు. ఆయన వాటిని పాటించి చూపించారు కూడా. తన తల్లిదండ్రుల్ని చివరి శ్వాస వదిలేవరకూ తనవద్దనే ఉంచుకుని చూసుకున్నారు. తన తల్లి చివరి మూడురోజులూ మంచంమీదే ఉండిపోతే విసుగూ అసహ్యం లేకుండా అన్నిరకాల సేవలూ చేశారు. అవన్నీ పిల్లలు గమనించారు కూడా. మరి ఈరోజు వాళ్ళు తమ తల్లిపట్ల ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’ అనుకుంది.

వెంటనే తన ప్రశ్నకు సమాధానం కూడా దొరికింది ఆమెకు.

‘ఆ కాలంలో టీవీలూ ఫ్రిజ్జులూ లేవు. సంపాదించిన డబ్బు కుటుంబంకోసం, పిల్లల చదువులకోసం ఖర్చుపెట్టేవారు. దుబారా ఖర్చులు చేసేవారు కారు. రాబడి, ఖర్చు దాదాపు సమానం కావడంతో పెద్దగా అప్పులుచేసే అవసరం ఉండేదికాదు. తృప్తిగా మనశ్శాంతితో బతికేవారు. కానీ ఈనాటి పరిస్థితి వేరు. పెళ్ళైన వెంటనే టీవీ, ఫ్రిజ్, ఏసీ, కంప్యూటర్, కారు అన్నీ కొనేయాలి. వీటిలో చాలా వస్తువులు స్టేటస్‌ సింబల్‌గా మారిపొయ్యాయి. అవసరాలకూ విలాసాలకూ తేడా తెలుసుకోలేకపోతున్నారు. ఇంటికి నిదానంగా ఒక్కొక్కటీ అమర్చుకుందామన్న ఆలోచన, ఓపిక లేదు. పైగా ఫ్లాట్ల రేట్లు పెరుగుతున్నాయనీ ఇన్‌కమ్‌టాక్స్‌ తగ్గుతుందనీ చేతిలో డబ్బులు లేకపోయినా ఇళ్ళు కూడా కొనేస్తున్నారు. కంపెనీలూ బ్యాంకులూ లోన్లు ధారాళంగా ఇస్తూండటంతో అన్ని లోన్లూ తీసుకోవడం, జీతంలో ఇన్‌స్టాల్‌మెంట్లకు పోగా మిగిలింది చాలకపోవడం, దీంతో ఇబ్బందులు, విసుగు, అసహనం మొదలు. వీటన్నిటితోపాటు ఉద్యోగంలో ఒత్తిడులు, అభద్రతాభావం పెరుగుతున్నాయి. ఇన్ని ఒత్తిడులమధ్య పాపం తల్లిప్రేమ, ఆమె సేవలు వీళ్ళకు గుర్తురావడంలేదు. ఉన్నంతలో తృప్తిగా బతకడం వీళ్ళకు ఎప్పుడు అలవాటవుతుందో’ అనుకుని బాధగా నిట్టూర్చింది.

* * *

వారంరోజులు గడచిపోయాయి. సావిత్రికి పిల్లల నుంచి ఫోన్‌కాల్స్‌ లేవు. ఫోన్‌ మోగితే ‘పిల్లలనుంచేమో’ అని ఆశగా ఫోను దగ్గరికి పరిగెడుతూంది.

ఓరోజు తన ఇంట్లోకి అడుగుపెట్టిన కొత్త వ్యక్తిని ఆశ్చర్యంగా చూసింది సావిత్రి.

‘‘నా పేరు శ్రావణ్‌. బ్యాంకులో ఫీల్డ్‌ ఆఫీసర్ని’’ అంటూ తన వివరాలు చెప్పాడతను.

‘‘రండి, కూర్చోండి’’ అంటూ కుర్చీ చూపించింది.

‘‘రామనాథంగారు నేను క్లర్క్‌గా ఉన్నప్పటినుంచీ నాకు తెలుసు. ఆయన ఇల్లు కట్టడంకోసం, పిల్లల చదువులకోసం, వాళ్ళ పెళ్ళిళ్ళకోసం, ఎన్నోసార్లు లోన్లు తీసుకున్నారు. అయితే ఆయన ఇన్‌స్టాల్‌మెంట్‌ కట్టకపోవడం అన్నది ఇంతవరకూ జరగలేదు. మొదటిసారిగా ఆయన మార్ట్‌గేజ్‌ లోన్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌ బాకీ పడింది. నాకు అనుమానమొచ్చి విచారిస్తే ఆయన చనిపోయారని తెలిసింది. మా బ్యాంకు క్రమశిక్షణ కలిగిన ఓ కస్టమర్‌ను కోల్పోయింది’’ అన్నాడు బాధగా.

‘‘నాకు ఫ్యామిలీ పెన్షన్‌ మొన్న శాంక్షన్‌ అయింది. ఈనెల పెన్షన్‌ తీసుకోగానే బ్యాంకుకు వచ్చి కట్టేస్తాను’’ అంది సావిత్రి నొచ్చుకుంటూ.

‘‘అవసరంలేదమ్మా. ఆయన ఇంటిపై తీసుకున్న లోనుపై దాదాపు ఏడులక్షలు బాకీ ఉంది. అయితే చాలా ఏళ్ళకిందటే మా బ్యాంకు ప్రవేశపెట్టిన ఇన్సూరెన్సు స్కీములో మీవారి లోను కూడా కవర్‌ అయ్యేందుకు ఆయనచేత సంతకాలు పెట్టించుకుని ప్రీమియం కట్టించుకున్నాం. రామనాథంగారు మరణించారు కనుక ఆ రుణం మొత్తం ఇన్సూరెన్స్‌ కంపెనీ చెల్లిస్తుంది. మీరు నయాపైసా కూడా కట్టక్కరలేదు. నేను అప్లికేషన్‌ మీకు పంపిస్తాను సంతకాలు చేసి పంపండి. ఉంటానండీ’’ అతను నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.

సావిత్రి భర్త ఫొటో వైపు చూసింది. రామనాథం నవ్వుతున్నట్లు కనిపించింది ఆమెకు.

* * *

సావిత్రి కొడుకులకు ఫోన్‌చేసి రుణం మాఫీ అయిన విషయం చెప్పి ‘ఇల్లు అమ్మకానికి పెట్టాననీ ఎవరైనా వస్తే కబురు చేస్తాననీ వచ్చి మాట్లాడుకొమ్మనీ’ చెప్పింది. కొడుకులు ఆమె ఊహించినదానికంటే ఎక్కువగానే సంతోషించారు. ఆ రోజు సాయంత్రం ఊళ్లోఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళి ఆశ్రమం మేనేజరుతో మాట్లాడింది. త్వరలోనే తను ఆశ్రమంలో చేరతానని చెప్పింది.

సావిత్రి వివరాలు తెలుసుకున్న మేనేజరు ‘‘రామనాథంగారు చనిపోయారా? నాకా విషయమే తెలియలేదే’’ అంటూ విచారం వెలిబుచ్చారు.

‘‘ఆయన మీకు తెలుసా?’’ ఆశ్చర్యంగా అడిగింది సావిత్రి.

‘‘తెలియకపోవడం ఏమిటమ్మా? ఈ ఆశ్రమం స్థలం కోసం గవర్నమెంటుకు అర్జీ పెట్టినప్పుడు కలెక్టరాఫీసులో ఆ సీట్లో ఉన్న మీవారిని కలిశాను. ఆయన సానుకూలంగా స్పందించారు. మంచి కార్యం తలపెట్టినందుకు మమ్మల్నెంతో అభినందించారు. కలెక్టరుగారికి చెప్పి ఈ స్థలం మాకిప్పించారు. డిపార్ట్‌మెంట్‌లో ఆయనకున్న మంచిపేరు వల్ల కలెక్టరుగారు వెంటనే ఒప్పుకున్నారు. ఇంతచేసిన ఆయన మా నుంచి ఒక్క పైసా కూడా ఆశించలేదు. అటువంటి వ్యక్తి భార్య అయిన మీరు ఓ అనాథలా మా ఆశ్రమంలో చేరడం నాకు బాధగా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళతాను. మాతోపాటు ఉండిపొండి. మిమ్మల్ని మా అమ్మలా చూసుకుంటాను’’.

సావిత్రికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ‘భర్త మంచితనం గురించి తెలుసుగానీ అది ఇంతమంది మనసుల్ని గెలుస్తుందని తను ఊహించలేదు’ అనుకుంది. ‘మరణించి కూడా బతికి ఉండటం’ అంటే ఏమిటో ఆమెకు అర్థమైంది.

‘‘వద్దండీ. నావల్ల ఎవరికీ ఇబ్బంది ఉండకూడదనే పిల్లల్ని కూడా కాదనుకుని ఇక్కడికి వస్తున్నాను. పైగా ఇక్కడ ఉంటే నాకు కాలక్షేపం కూడా అవుతుంది. మీరు ఆ మాట అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు పిల్లాపాపలతో కలకాలం చల్లగా ఉండాలి. నేను ఇల్లు అమ్మకం పనులు పూర్తయ్యాక వస్తాను’’ అంటూ అతని దగ్గర శెలవు తీసుకుంది.

* * *

ఒకరిద్దరు సావిత్రికి ఫోన్‌చేసి ఇల్లు కొనడానికి తమ ఆసక్తిని వెలిబుచ్చారు. ఓ ఆదివారం కొడుకుల్ని రమ్మంటాననీ ఆరోజు వచ్చి మాట్లాడమనీ వాళ్ళతో చెప్పింది సావిత్రి. మరుసటి ఆదివారమే కొడుకులు భార్యలతో వచ్చారు.

ఆ ఆదివారం ఉదయం ఇంటి గురించి మాట్లాడటానికి వచ్చిన వ్యక్తిని చూసి ‘‘మీరు మా ఎదురింటి మేడపైన ఉండేవారు కదా?’’ అని అడిగాడు వినోద్‌.

అతను ‘‘అవును. నా పేరు రామారావు’’ అంటూ తన వివరాలు చెప్పసాగాడు.

తర్వాత ‘‘మేము చాలా ఏళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నాం. ఏడాదిక్రితమే ఇల్లు చాలక వేరే ఇంట్లోకి మారాం. మీ ఇంటి మండువా మా గది కిటికీ నుంచి బాగా కనబడేది. మీ కుటుంబం మమతానురాగాలకూ తీపి అనుభవాలకూ ప్రతీకలా అనిపించేది నాకు.
ఉదయాన్నే మీ అమ్మగారు ఇంటిముందు ముగ్గులేస్తూంటే మీ తండ్రీకొడుకులు కబుర్లు చెబుతూ కంపెనీ ఇవ్వడం, భోగి పండుగరోజు ప్రాతఃకాలాన మీరు భోగిమంట వేస్తూంటే మీ అమ్మగారు కాఫీ తెస్తే అందరూ కలసి తాగడం, దీపావళిరోజు మీ నాన్నగారు మీతో టపాకాయలు జాగ్రత్తగా కాల్పించడం, ఉదయం నాలుగు గంటలకు లేచి మీరు చదువుకుంటూంటే మీకు తోడుగా మీ నాన్నగారు కూర్చోవడం, మీ ఇంటికి తరచుగా బంధువులు, మిత్రులు రావడం, రాత్రిపూట అందరూ మండువాలో కూర్చుని పాటలు పాడటం మాకు కనిపించేది.

ఓసారి విజయ్‌కి ఆటల్లో చేయి విరిగితే ప్రమోషన్‌ పరీక్ష రాయడానికి వెళ్ళిన మీ నాన్నగారు పరీక్ష రాయకుండానే తిరిగొచ్చి పుత్తూరు తీసుకెళ్ళి కట్టు కట్టించడం, నొప్పి తెలియకుండా రాత్రంతా కథలు చెబుతూ జాగారం చెయ్యడం, తన తల్లి వేసుకోవాల్సిన మాత్రల్ని ఏ పూటకాపూట గుర్తుగా ఆమెకివ్వడం, ఆవిడ మంచానపడితే సేవలు చేయడం నా మనసును కదిలించేది. ఆయన చేసిన ఉద్యోగానికి కావాలనుకుంటే ఈ ఊళ్లో పది ఇళ్ళు కట్టించి ఉండేవారు. కానీ ఆయన తీరే వేరు. ‘పైసంపాదన ఆశించని వ్యక్తి’ అని ఊళ్లో మంచిపేరు తెచ్చుకున్నారు. కళ్ళముందు నోట్లకట్టలు కనబడుతున్నా అవసరాలు ఇబ్బందిపెడుతున్నా చలించక నీతికి కట్టుబడి వాటికి దూరంగా ఉండటం చాలా గొప్ప విషయం.

ఇక మా ఇంట్లో ఎప్పుడూ గొడవలే. మా నాన్న గెజిటెడ్‌ ఆఫీసరు. లంచాలు బాగా తినేవాడు. ప్రతిరోజూ తాగొచ్చి ఇంట్లో గొడవలు చేసేవాడు. మాకు చదువు తలకెక్కేది కాదు. ఆయన చనిపోతే ఆ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు నా తమ్ముళ్ళతో నాకు మనస్పర్థలు పెరుగుతున్నాయి. వాళ్ళింకా జీవితంలో స్థిరపడలేదు. నాన్న ఉద్యోగం నాకొచ్చింది కాబట్టి వాళ్ళను నేను పోషించాలంటారు. ఈ విషయంలో నాకూ నా భార్యకూ మధ్య గొడవలు.

మనిషికి డబ్బు పుష్కలంగా లేకపోయినా ఉన్నంతలో జీవితాన్ని ఎంత ఆనందంగా అనుభవించవచ్చో మీ నాన్నగారిని చూశాక నాకు తెలిసింది. అందుకే మీ ఇల్లు కొని ఇందులో చేరితే ఆ అదృష్టం మాకూ తగిలి మా సమస్యలు తగ్గుతాయని మా ఆశ. చదువుకునే రోజుల్నించీ ఈ ఇల్లు నా ‘డ్రీమ్‌ హౌస్‌’. ‘ఇటువంటి మనుషుల మధ్య నేను లేనే’ అని బాధపడేవాణ్ణి. కనీసం ఈ ఇంట్లో నివసించే అవకాశం వస్తే అది నా అదృష్టంగా భావిస్తాను’’ అన్నాడు రామారావు.

* * *

రామారావు వెళ్ళిపోయాక విజయ్, వినోద్‌లు మౌనంగా కూర్చుండిపోయారు. రామారావు చెప్పిన విషయాలే పదేపదే గుర్తుకు రాసాగాయి. తమ గుండెలో ఎంతో అపురూపంగా దాచుకోవలసిన జ్ఞాపకాల్ని పరాయివ్యక్తి వచ్చి చెపితే తప్ప గుర్తుచేసుకోలేకపోయినందుకు సిగ్గుపడ్డారు. వాళ్ళ మనసులో తప్పుచేసిన భావన కలిగింది. పశ్చాత్తాపం మొదలైంది.

రాత్రి భోజనాల సమయంలో సావిత్రి - కొడుకు, కోడళ్ళతో వాళ్ళు ఊరు వదిలివెశ్ళాక జరిగిన విషయాలన్నీ చెప్పింది. రామయ్య, బ్యాంకు ఫీల్డ్‌ ఆఫీసరు, ఆశ్రమం మేనేజరు అన్న మాటల్ని చెప్పింది. అది విన్న కొడుకుల మనసుల్లో పశ్చాత్తాపం మరింత పెరిగింది.

వినోద్‌కు తండ్రి తమతో తరచుగా చెప్పే కొటేషన్‌ ‘గుడ్‌నెస్‌ ఈజ్‌ ద ఓన్లీ ఇన్‌వెస్ట్‌మెంట్‌ విచ్‌ నెవర్‌ ఫెయిల్స్‌ టు ఎర్న్‌ డివిడెండ్స్‌’ గుర్తొచ్చింది.

‘నిజం నాన్నా, మీ మంచితనం డివిడెండ్లను సంపాదించడమే కాదు, ఎంతోమంది హృదయాల్ని కూడా గెలుచుకుంది. మాలాంటి పాపాత్ముల హృదయాలు తప్ప’ అనుకుని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.

విజయ్‌ తల్లితో ‘‘అమ్మా, మమ్మల్ని క్షమించు. నాన్న మంచితనాన్ని ఇంతమంది గుర్తించినా మేము కొడుకులమై ఉండీ గుర్తించలేకపోయాం. గొప్పలకుపోయి ఆర్థిక ఇబ్బందుల్లోపడి, బయటి వ్యక్తులు వచ్చి మన ఇంట్లో జరిగిన మధురమైన దృశ్యాల్ని గుర్తుచేస్తే తప్ప గుర్తుకురాని పరిస్థితిలో ఉండిపోయాం. మనం ఇల్లు అమ్మవద్దు. కింది పోర్షను రామారావుగారికి అద్దెకిద్దాం. పై పోర్షను మాత్రం ఖాళీగా ఉంచుదాం. నువ్వు మాతో వచ్చేసెయ్‌. ప్రతి సంవత్సరం వేసవిలో ఇక్కడకు వచ్చి ఓ వారంరోజులు హాయిగా గడుపుదాం. పాత రోజుల్ని గుర్తుచేసుకుని ఆనందిద్దాం’’ అన్నాడు.

‘‘అవునమ్మా, నిన్ను ఇన్నాళ్ళూ నిర్లక్ష్యం చేసినందుకు సిగ్గుపడుతున్నాం. నువ్వు మాతో వచ్చెయ్‌. ఈ ఇంటి గురించీ నాన్నగారి మంచితనం, వ్యక్తిత్వం గురించీ మా పిల్లలకు కూడా చెబుదాం. ఈ ఇంటితోపాటు ఆయన పాటించిన విలువలు కూడా వాళ్ళకు వారసత్వంగా లభించనీ’’ అన్నాడు.

సావిత్రి భర్త ఫొటోవైపు చూసింది. ఆయన ఆనందంతో నవ్వుతున్నట్లు కనిపించింది ఆమెకు. ‘అవును మరి, మానవత్వపు విలువల్ని పిల్లలకు ఆస్తిగా ఇచ్చారు ఆయన. వాళ్ళు వాటిని నిలుపుకుంటే ఆయన ఆత్మ సంతోషిస్తుంది’ అనుకుంది తృప్తిగా.
    🙏🙏.....

*భక్తి ఉండాల్సింది దేవుని మీదే

*భక్తి ఉండాల్సింది దేవుని మీదేగాని "మతాల" మీద కాదని నిరూపించిన ఒక గొప్ప భక్తుని కథ ఇది.తప్పక చదవండి..*

1984 సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థాన స్వర్ణోత్సవాలు సందర్భముగా ఏదైనా కొత్త ఆర్జితసేవ ప్రవేశపెట్టాలని TTD బోర్డు సమావేశాలు జరగడం..ఏకాభిప్రాయం రాక ముగుసిపోవడం జరుగుతుంది. ఆ రోజుకూడా బోర్డు సభ్యులు కూర్చొని చర్చించుకుంటున్నారు..ఇంతలో అటెండర్ మెల్లగా తలుపుతీసుకుని అప్పటి EO పి.ఆర్ ,వి.యల్ ప్రసాద్ గారి దగ్గరకు వచ్చి భయంభయంగా "సార్ బయట ఎవరో ముస్లిమ్ భక్తుడు బయటవుండాడు..మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట"అంటూ మెల్లగా చెప్పేరు. అసలే విసుగ్గా వున్న ప్రసాద్ ఏదో అనబోయి ఆగి సరే లోపలికి రమ్మను అని చెప్పేరు..కాసేపటికి ఒక మధ్యవయస్కుడు లోనికి వచ్చి అందరికీ వినయంగా నమస్కారం చేసి, అయ్యా మాది గుంటూరుజిల్లా..మేము ముస్లిం మతస్థులమైనా శ్రీవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో చాలాకాలం నుండి పూజిస్తున్నాము.మాది చాలాపెద్ద ఉమ్మడి కుటుంబము..అయినా ప్రతిమంగళవారం స్వామి 108నామాల పేర శతనామ పూజ చేస్తాము.ఇందుకు మా ఇంట్లో పూసే రకరకాల పూలనే వాడుతాము.అయితే మా తాతగారూ 108 బంగారుపుష్పాలను తయారుచేసి స్వామివారికి సమర్పించాలని తలచి,కొన్ని పుష్పాలను తయారుచేసినాడు..కానీ ఆయన స్వామిలో ఐక్యం చెందగా మా నాన ఆ భాద్యత తీసుకున్నాడు.,ఆయన కూడా కష్టపడి కొన్ని పుష్పాలు తయారుచేయించాడు.కానీ అనుకోకుండా ఒకసారి నన్ను పిలిచి, అరే మస్తాన్ ,,నేను స్వామి పాదాల చెంత ఐక్యం కాబోతున్నాను. మిగతా పూలవిషయం నువ్వే చూసుకో అని ఆయన దైవం లో ఐక్యం చెందారు. పేదకుటుంబం,పెద్దకుటుంబమైనా కష్టపడి మా కుటుంబం 108 పుష్పాలను తయారుచేయించి,మా కుటుంబం మొత్తం 54 మందిమి కాలినడకన కొండకు చేరుకున్నాము..ఇవిగో ఆ పుష్పాలంటూ ఒక బరువువైన సంచిని టేబుల్ మీద పెడుతూ ఒక్కొక్క పుష్పం 23 గ్రాములుంటుంది.దయచేసి మా పెద్దల కోరిక మీద వాటిని స్వామి వారి కైంకర్యానికి ఉపయోగించండని చేతులు జోడించి వేడుకున్నాడు.
    అంతే బోర్డు సభ్యులెవరికీ నోటిమాట రాలేదు. ఏమి మాట్లాడో తెలియక నిశ్శబ్ధం ఏర్పడింది అక్కడ.. కాసేపటికి ప్రసాద్ గారు ముందుగా తేరుకొని కంటినిండా కన్నీళ్ళతో గబగబా మస్తాన్ దగ్గరకు వచ్చి మస్తాన్ గారూ మీ అంతటి గొప్పవ్యక్తిని ఇంతసేపు నిలబెట్టి మాట్లాడించినందుకు నన్ను క్షమించండి, రండి,రండి కుర్చొని మాట్లాడుదాం అంటూ తన చైర్ దగ్గర కుర్చొండబెట్టుకుని వివరాలన్నీ రాసుకున్నారు,.మిమ్మలిని ఆ స్వామే పంపారు..మా సమస్య తీర్చారు,,నేను చూసిన మొదటి గొప్ప భక్తులు మీరు అంటూ సాదరంగా అభినందించారు.
  అప్పుడు మొదలైందే తిరుమల దేవస్థానంలో ప్రతిమంగళవారం స్వామి వారికి చేసే అష్టోత్తర శతనామ పూజాసేవ..స్వామి వారి 108 నామాలను జపిస్తూ 108 బంగారుపుష్పాలను స్వామి పాదాల చెంత వుంచుతారు. ఆ బంగారు పుష్పాలే షేక్ మస్తాన్ కుటుంబం సమర్పించినవి. 1984 నుండి ఇప్పటి వరకు నిరాటకంగా ప్రతి మంగళవారం ఈ సేవ జరుగుతూనే వుంది..దీనిని బట్టి మనం నమ్మవలసింది "దేవుడి"నే గాని,మతాన్ని కాదని నిరూపించిన షేక్ మస్తాన్ కుటుంబానికి అభినందనలు తెలుపుతున్నాము.. మనదేశం లో మతసామరస్యానికి ఇదొక గొప్ప ఉదాహరణగా తెలియజెబుదాము!!!!!

(రవీంద్ర గారి వాల్ నుంచి)

పెళ్లిసందడి.. కాలయానం

*పెళ్లిసందడి. 1940 కి పూర్వం...👇*

కానివ్వండర్రా...
మగ పెళ్ళివాళ్ల బండ్లు అప్పుడే పెద్దినాయుడు గారి గరువుకు చేరాయట...ఇంకో ఘడియలో ఊరిపోలిమేరలోకి వచ్చేస్తాయి...
ఆ మేళగాళ్ళేక్కడ తగలడ్డారో... ఎదురు వెళ్ళితీసుకురావద్దూ...
అబ్బాయీ...కాస్త వంటపందిరిలోకి చూసి... వంటవాళ్లను తొందరపెట్టు...విడిదిలోకి పలహారాలు పంపేందుకు సిద్ధంగా ఉన్నారో..లేదో..
అమ్మా ఆ ముత్తైదువలసింగారం ఎంత వరకొచ్చిందో చూడు... ప్రతీవాళ్ళూ పెళ్లి తనకే నన్నట్టు తయారై.పోతున్నారేవిటీ...త్వరగాతేమలండీ..
ఊరి పెద్దలు నలుగురూ వచ్చి పంది రిలోకూర్చున్నారు... కామేశం...వాళ్ళసంగతి కాస్తచూసుకో నాయనా...
ఆరేఅబ్బాయి... ఒక్కగానొక్క పిల్లదాన్ని... 6 మైళ్ల దూరమిస్తావా... ఏమీ...మీఅగ్రహారంలో ఆపాటి పిల్లవాడు దొరక్కపోయాడా...

అయ్యోరూ...
కాగడాల వాళ్ళమండీ...
నాలుగు పాత గుడ్డలిప్పిస్తే మాపనిమీదుంటాం బాబూ...
బావా...పెట్రోమాక్సు లయిట్లు...పది తెచ్చాము...ఈ ఊర్లో అంతకు మించి లేవట...
పల్లకి వాళ్ళడుగుతున్నారు... పొలిమేరలోకి పోయి కరణం గారి తోటదగ్గర తయారుగా ఉంటారట...
పందిరిలో నాలుగు కుర్చీలు వేయాలి... ఈకుర్రాళ్లంతా ఏరిరా... సానిమేళం చుట్టూ మూగారూ... ఇక ఈముండలొస్తే... మనమాట ఓ లెక్కా...
బాబయ్యా... మునసబు గారి గుర్రాన్ని తెచ్చానండీ...ఎక్కడ కట్టమంటారూ...
అయ్యా పెదరాజు గారు... మగపేల్లొళ్ళకోసమట... అరిటిగేళ్ళు... పనసకాయలు పంపారండి... రెపటినుండి...5 రోజులూ దివాణం నుండే పాలు,పేరుగులు పంపిత్తామని సెప్పమన్నారు...
అయ్యా...పెద్ధిశెట్టిగారబ్బాయి నండీ... మానాయన ఈ రొక్కం మీకిమ్మన్నారండి... తర్వాత చూసుకుందామని సెప్పాడండి...!

*పెళ్లిసందడి...1940 నుండి 1990 వరకు...👇*

అయ్యా కట్నం ముఖ్యం గాదండీ...మాకు లాంఛనాలేమిస్తారూ... అడబడుచులు ఆరుగురు... వాళ్ళసంగతేవేటీ... పిల్లవాడికి బండి కావాలట... మీపిల్లకి బంగారం మీరేలాగూ పెట్టుకుంటారుకదా... పెళ్లి మీ ఇంటివద్దే... మేము తరలి రావటా నికి...ఎన్ని బస్సులు పెడతారో...
పెళ్లి కుమారుని బావలు కార్లో తప్పరారట... మీ ఇంటి దగ్గర పెళ్లంటే కాస్త ఇబ్బందే...
 ఓ కళ్యాణ మండపం చూద్దురూ... కాస్త ఘనంగా పెళ్లిచేస్తే నలుగురూ మెచ్చుకోరూ... ఈ రోజుల్లో అంతా టేబుల్ మీల్స్ అంటున్నారు... కొంపదీసి... చాపకూడనరుగదా... కాస్తబ్యాండు మేళం ఉంటేచూడండి... మా బంధువర్గానికి శెలవలు కష్టమట... అటుంచి ఆటే ట్రైన్సికి వెళ్తారుట... వివరాలిస్తాను... రిజర్వేషన్స్ దొరుకుతాయేమో చూద్దురూ...!

*పెళ్లిసందడి1990 నుండి 2020 వరకు...👇*

కట్నం మాకు పట్టింపు లేదండీ...పిల్లలిద్దరూ ఉద్యోగులే కదా... కాకపోతే... లాంఛనాలు ఘనంగా ఉండాలి... పెళ్లి మీరెలా చేశారని మేమడగం... రి సేపక్షను హైదరాబాదులోనే... మాకుసర్కిల్ ఎక్కువండీ...తప్పదు...ఏ ఫంక్షన్హాలో బుక్చేయాలి మరి... ఘనంగా మాహోదాకు తగ్గట్టు చేస్తారుకదా...!

*పెళ్లి సందడి మార్చి.2020 నుండి...👇*

మాఅబ్బాయి పెళ్లి... ఫలానా అమ్మాయితో... వాళ్ళింట్లోనే...మీరెవరూ పెళ్ళికి రావద్దు...50 మందికే పరిమితం. ఆడ పెళ్లి వాళ్ళకి 20 ఇవ్వగా మిగిలింది 30. అందులో మీపేరులేదు...కనుక మీరొస్తే పోలీసులు చర్య తీసుకొంటారు...అందుకు మాబాధ్యత లేదు...
ఇక... పెళ్లిలో...ఎవరి మాస్కులు వారివే... సానీటైజ్రు ఎవరికి వారే... మెసేజీలు పెట్టాం...లింక్ ఇచ్చాము... చూడాలనిపిస్తే... నీకొంపలోనుండే చూసుకోవచ్చు...
ఖంగారు పడకండి... పెళ్ళిభోజనాలు లేవు... కరోనా సమయంలో... క్యాటరింగ్ వాళ్ళు. హోం ఐసోలేషనులో ఉన్నారుట...ఇళ్ళు కదిలితే కాళ్లిరగ దీస్తామని... పోలీసువారు వారికి మనవి చేసుకొన్నారుట...ఇక పరిస్థితులు చక్కబడినతర్వాత... ఘనంగా రెసెప్సను... పెట్టుకోవాలని... ఉభయపార్టీల అంగీకారం. అప్పటికి పోయినవారు పోగా... మిగిలినవారితో... అప్పటి ప్రభత్వ నియమనిబంధనలనుసరించి... రిసెప్షన్ ఉంటుంది...!

దేహం.. దేహి

🧘🧘🧘🧘🧘
ఈ దేహం నేను అనే గట్టి భావన జన్మజన్మాంతరముల నుండి మనకు ఉన్నది. ఇలా ఉండటానికి కారణం అజ్ఞానం. ఈ అజ్ఞానమే ఆత్మయైన మనను జీవుడుగా భ్రమపడేట్లు చేసింది. శాస్త్రజ్ఞానం ఏమాత్రం లేకపోవటమే అజ్ఞానం. ఏ మానవ జన్మలోనైనా ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి ప్రయత్నం జరగాలి. అలాంటి ప్రయత్నం జరగాలంటే అంతకుముందు జన్మలలో పుణ్యకార్యాలు, దైవకార్యాలు, నిజమైన దైవభక్తితో చేసి ఉండాలి, మహాత్ములను దర్శించాలి, భగవంతుని కోసం తపించాలి. అలా తపించినప్పుడే ఎవరో ఒక మహాత్ముడు తటస్థపడటం జరుగుతుంది. ఆయన మాటలతో జన్మసార్థక్యత ఏమిటో తెలుస్తుంది. అప్పుడు ఆ తరువాతి జన్మలలో ఒక సద్గురువు లభించటం, ఆయన ద్వారా శాస్త్రాలను వినటం, తెలుసుకోవటం, సాధనలు చేయటం జరుగుతుంది. అప్పుడే అజ్ఞానం తొలగేది. అజ్ఞానం తొలగితేనే నేను ఆత్మననే జ్ఞానం కలిగేది. ఈ జ్ఞానాన్ని అపరోక్షంగా, అనుభవపూర్వకంగా పొందితే జీవన్ముక్తియే
మరి లోకంలో ఈ మార్గంలో ప్రవేశించేవారు. వెయ్యికి ఒక్కరు కూడా లేరు. "మనుష్యాణాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే" అని భగవద్గీతలో అన్నట్లుగా ఎక్కడో ఒకరు అరుదుగా ఈ మార్గంలోకి ప్రవేశిస్తారు. ఎందుకంటే పూర్వజన్మసుకృతం ఉండటాన. మిగిలినవారికి ఆ సుకృతంలేదు గనుక జన్మలకు జన్మలు కొనసాగించాల్సిందే.
🧘🧘🧘🧘🧘

సాహితీ సంచలనం ఆరుద్ర*

*

_(నేడు భాగవతుల సదాశివశంకరశాస్త్రి అలియాస్ ఆరుద్ర జయంతి - 31 ఆగస్టు 1925 – 4 జూన్ 1998)_

ఆరుద్ర ...లేదా, ఒకే ఒక్క వాక్యంతోనూ ఆయన్ని స్ఫురణకు తేవొచ్చు. _"నీవు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు"_

*ఆరుద్రకు ఒక ‘నేమ్‌ప్లేట్’ చేయించాలంటే, ఆయన పేరుముందు ఏం చెక్కించాలి? బహుముఖ ప్రజ్ఞాశాలి అనేయొచ్చు సింపుల్‌గా. కానీ ఆ ప్రజ్ఞ ఎన్నిరకాలు? కవి, కథకుడు, డిటెక్టివ్ నవలా రచయిత (నెలకొకటి చొప్పున రాస్తానని అలాగే రాయడం ఆయన చేసిన ఆరుద్రశపథం), గేయకర్త, గేయనాటకకర్త, వ్యాసకర్త, గడీనుడీకారుడు, మెజీషియన్, సంపాదకుడు, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, అభ్యుదయ రచయితల సంఘం- అరసం వ్యవస్థాపకుల్లో ఒకరు(సంఘాల గొడుగు ఎందుకు? అంటే, వానపడకుండా ఉండటానికంటాడు!), చివరగా సినిమా రచయిత.*

అనగా, పాటలూ మాటలూ అనువాదాలూ. రాయినైనా కాకపోతిని రామపాదం సోకగా (గోరంతదీపం); అమ్మకడుపు చల్లగా (సాక్షి); కొండగాలి తిరిగింది (ఉయ్యాల జంపాల); వేదంలా ఘోషించే గోదావరి (ఆంధ్రకేసరి); ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం (ఎంఎల్‌ఏ); ఎదగడానికెందుకురా తొందర (అందాల రాముడు); ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ (ముత్యాలముగ్గు); శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది... (పెళ్లిపుస్తకం)

ఆరుద్రను ఇలాంటి ఏ కొన్ని పాటలతోనైనా పరిచయం చేయొచ్చు; లేదా, ఒకే ఒక్క వాక్యంతోనూ స్ఫురణకు తేవొచ్చు. ‘నీవు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు’.
*భాగవతుల సదా శివశంకరశాస్త్రిగా జన్మించి, జన్మనక్షత్రం పేరిట తన కలంపేరును స్వీకరించిన ఆరుద్ర- కవిత కోసం నేను పుట్టాను, క్రాంతి కోసం కలం పట్టాను అని చాటుకున్నాడు.* ‘నాకోసం నేను రాసుకోను. అందరికోసం నేను రాస్తాను. అందరూ నావాళ్లే కాబట్టి, నాకోసం రాసింది అందరికోసం రాసిందే’ అంటాడు.

తెలంగాణ పోరాట ఇతివృత్తంతో ఆరుద్ర రాసిన ‘త్వమేవాహం’ చదివి, ఇక నేను పద్యాలు రాయకపోయినా ఫరవాలేదు, అని ఆనందపడ్డాడట ఆరుద్రకు మేనమామైన శ్రీశ్రీ. ఇందులో ఆరుద్ర - సమాజాన్ని గడియారంతోనూ, ధనికుల్ని గంటల ముల్లుతోనూ, మధ్యతరగతివాళ్లని నిమిషాలముల్లుతోనూ, పేదల్ని సెకన్లముల్లుతోనూ, ‘కీ’ని విప్లవగొంతుకగానూ ప్రతీకిస్తాడు.

అంత్యప్రాసల ముద్ర - ఆరుద్ర అనిపించుకున్న ఈ ‘సన్యాసి రూప’ కవి... ‘ఛందస్సులతో అడ్డమైన చాకిరీ అందంగా చేయించుకోగలడు’. శ్లేషలు, చమత్కారాలతో మురిపిస్తాడు. చెరిషించి, పెరిషించి లాంటి తెలుగు ఇంగ్లీషు పదాల కాక్‌టెయిల్ సృష్టిస్తాడు. ‘ఆ/ మెన్/ ఆమెన్/ చెరపట్టన్/ మ్రోగెన్/ నీగన్/ నా/ పెన్/ ఆపెన్’... లాంటి పదాల గారడీలో వస్తువుకు ఔచిత్యభంగం వాటిల్లుతోందా? అనే మీమాంస ఒకటి కలిగినప్పటికీ!

‘చిన్ని పాదములందు/చివరి ప్రాసల చిందు/ చేయు వీనులవిందు/ ఓ కూనలమ్మా’ అంటూ కూనలమ్మ పదాలు ప్రారంభించాడు ఆరుద్ర. ‘ఆలి కొన్నది కోక/ అంతరిక్షపు నౌక/ అంతకన్నను చౌక/ ఓ కూనలమ్మా’ అని నవ్విస్తూనే, ‘కోర్టుకెక్కినవాడు/ కొండకెక్కినవాడు/ వడివడిగ దిగిరాడు’ అన్న సత్యాన్నీ చెబుతాడు. ‘అంతుచూసేవరకు/ అకట ఆంధ్రుల చురుకు/ నిలువ ఉండని సరుకు’ అని తెలుగువారి ఆరంభశూరత్వాన్ని వెక్కిరిస్తాడు.

‘అణువు గుండెను చీల్చి/ అమితశక్తిని పేల్చి/ నరుడు తన్నును బాల్చి’... చిన్న పదాల్లో పెద్ద భావాన్ని ఇముడుస్తాడు. ‘పరుల మేలును కోరి/ పదములల్లెడు వారి/ పథము చక్కని దారి’ అనిపిస్తాడు. ప్రయోగశీలత ఆయన కథల్లోనూ కనిపిస్తుంది. ‘సుబ్బారావున్నరగంటలసేపు’ అంటాడొకచోట. తన పురుషుడిని తన పూర్తి ప్రపంచంగా మలచుకున్న స్త్రీ హృదయానికి ఈ కొలత సులభంగా అర్థమవుతుంది!

‘రాముడికి సీత ఏమౌతుంది?’ లాంటి ఆసక్తికర శీర్షికతో సకల రామాయణాల్ని తవ్విపోశాడాయన. శ్రీకృష్ణుడు అసలు సిసలు ఆంధ్రుడనీ, ఏకలవ్యుడు కుంతీదేవి అక్క కొడుకనీ, పుత్రికకూ కుమార్తెకూ భేదముందనీ, పుత్రిక అంటే సహోదరులు లేనిదనీ, కుమార్తె అంటే తోడబుట్టినవారిని కలిగినదనీ తేల్చిచెప్పాడు.

‘సినీవాలి’, ‘ఇంటింటి పజ్యాలు’, ‘గాయాలు-గేయాలు’, ‘పైలాపచ్చీసు’, ‘శుద్ధ మధ్యాక్కరలు’, ‘గుడిలో సెక్స్’, ‘వేమన్న వాదం’, ‘తిరుక్కురళ్’ అనువాదం, చదరంగ పుస్తకం, ‘సినీ మినీ కబుర్లు’... ఇక, రాయడం అటుండనీ, చదవడానికే జీవితకాలం చాలదనిపించే బృహత్తరమైన ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ ఆయన పరిశోధనాశక్తికి పరాకాష్ఠ! సంస్థలుగా మాత్రమే చేయగలిగిన పనిని ఒక్కడే పూనిక వహించి పూర్తిచేశాడు.

‘నాకు స్పష్టంగా తెలుసు అనుకున్నదాన్ని పాఠకులకు స్పష్టంగా’ చెప్పదలిచాడు. చాళుక్యుల నుండి ఆధునిక కాలం వరకు ‘ఆర్థికసంబంధాల ప్రాతిపదికన యుగవిభజన’ చేసిన ఈ పుస్తకం కోసం - ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నాడు. మధుమేహం పెరిగి మూత్రపిండాలు పనిచేయడం మానేశాయి. కంటిచూపు తగ్గిపోయింది. అయినా అన్ని కష్టాలనూ ఓర్చి వెయ్యేళ్ల చరిత్రను తెలుగువాళ్లకు అందించగలిగాడు. ‘సాహిత్యం అర్ణవమైతే, ఆరుద్ర మథించని లోతుల్లేవు. సాహిత్యం అంబరమైతే ఆరుద్ర విహరించని ఎత్తుల్లేవు. అతడు పట్టి బంగారం చేయని సాహిత్య శాఖ లేదు; ఆ శాఖపై అతడు పూయించని పువ్వుల్లేవు...... Film Music Brethren, Hyderabad.

శ్ంఖము


హిందువులు పరమేశ్వర్తర్తధనయందు ఒక ఉపచారముగా శ్ంఖధవని చేయు ఆచారము ప్రస్త్రదధము.
వైషణవ స్థంప్రదాయములో శ్ంఖముతో తీరాము స్టవకరింతురు. అందుకే “శ్ంఖమున పోస్త్రనదే తీరాము”
అని ఉనన ఒక నానుడి విననదేగదా! ”శ్ంఖములో పోస్తా తీరాము, ప్ంకులో పోస్తా నీళ్లళ” అని ఆంద్ర
లోకోకిా. సముద్రపు గులా జాతులలో నిది యొకటి. నతాగులాలు మొదలగు వాటిలో నిది యొక జాతి.
ఆయురేవద వైదయ విధ్యనములో శ్ంఖమును ఉపయోగించి శ్ంఖభసమమును చేస్త్ర తేనే, నిమమరసము,
త్రిఫల (తానికాయ, కరకా్య, ఉస్త్రరికాయ) కష్టయములతో అనుపానముగా అనేక ఉదర సంబంధ
రోగనిరూమలనలందు ఉపయోగించు చునానరు. ఉతామజాతి శ్ంఖము తెలాగనుండును. దీనిని
‘ధవళ్శ్ంఖ’ మందురు. స్థధ్యరణముగా శ్ంఖములనినయు ఉతార్తవరాములై యుండును. చాల
అరుదుగా దక్షిణ్యవరా శ్ంఖములు లభించును. ఇవి చాలా శ్రేషఠములు. శ్ంఖములు రూపముల
నాధ్యరముగా ముపపదిరండు జాతిభేదములుననటుా తెలిప్దరు. కానీ నవీనులు వందకుపైన శ్ంఖ
జాతులుననటుా గురిాంచినారు. పూరవకాలములో భారతదేశ్మునందు యుదధములందు
ఆరంభసననదధతకు, విజయ సంకేతమునకు భేర్తధవనులనేగాక వీరులు వారివారి శ్ంఖములను పూరించి
ఉతాసహమును ప్రకటించు చుండెడివారు. అటిటవాటిలో ప్రముఖమైనవి పుర్తణేతిహాసముల ననుసరించి
వాటి పేరాను పరిశీలిదాదము.
శ్రీకృష్ణణని శ్ంఖము పేరు పాంచజనయము; అరుునుడి శ్ంఖము దేవదతాము; భీముడి
శ్ంఖము పౌండ్రకం; యుధిషిటరుడి శ్ంఖము అనంతవిజయం; నకులుడి శ్ంఖము
సుఘోషము; సహదేవుడి శ్ంఖము మణి పుషపకం. ……జే.వి.స్త్ర

గోమాత సర్వ దేవతలనిలయం


బాపూరమణీయం

2014, August 31 న ఓ 80 ఏళ్ళ పెద్దాయన కాలంచేస్తే... *కుంచె కన్నీరు పెట్టుకుంది...ఎప్పుడూ అల్లరి చిల్లరగా తిరిగే బుడుగు బావురుమన్నాడు.... అచ్చ తెలుగు కొంటెకోణంగి, ఇక నాకెవరు దిక్కు అంటూ వాపోయింది...*

కాలభ్రమణంలో ఆరేళ్ళు గిర్రున తిరిగిపోయినా... *సత్తిరాజు లక్ష్మీనారాయణ...* బొమ్మల,సినిమా ప్రపంచానికి ఆమాటకొస్తే... తెలుగు భాషకు విలక్షణ రాతను నేర్పిన పరిచయం అక్కర్లేని పేరు *"బాపు"*

"ముత్యాల ముగ్గులేసి" జరిపించిన "సీతా కళ్యాణం" "సాక్షి" గా... "పెళ్ళిపుస్తకం" తో... "మంత్రిగారి వియ్యంకుడు" ను "తూర్పు వెళ్ళే రైలు" ఎక్కించి... " ఏది ధర్మం ఏది న్యాయం" అంటూ "బుల్లెట్" వర్షాన్ని కురిపించిన "రాజాధి రాజు"...

"సంపూర్ణ రామాయణాన్ని" "రామాంజనేయ యుధ్ధాన్ని" తెలుగు జాతి సొత్తు గా మలచిన "బుధ్ధిమంతుడు".....

" గోరంత దీపం" పెట్టి "బాలరాజు" కథలు చెప్పి, ఆ ముక్కంటినే ప్రసన్నం చేసుకొన్న "భక్త కన్నప్ప"...

"వంశవృక్షాన్ని" "పెళ్ళీడు పిల్లలకు" వివరించి, "పండంటి జీవితం"లో అరమరికలు లేని కాపురంతో..."ఇంటి గౌరవాన్ని" ఎలా కాపాడుకోవాలో... చెబుతూనే... స్త్రీ అంటే "బంగారు పిచ్చుక" మాత్రమే కాదు అవసరమైతే..."Mr.పెళ్ళాం" అంటూ వివరించిన విలక్షణ దర్శక మహర్షి....

"హమ్ పాంచ్"... "ప్యారీ బెహన్" "మొహబ్బత్" కోసం... "ఓ సాత్ దిన్" " ప్రేమ్ ప్రతిగ్య" చేయడం "మేరీ ధర్మ్" అంటూ... బాలీవుడ్ "బేజుబాన్".... ఈ "దిల్ జాలా"...

"కృష్ణావతారం" లో... రాధా గోపాలానికి" "సుందరకాండను" చెప్పిన అపర "శ్రీనాథ కవి సార్వభౌముడు"....

"సీతమ్మ పెళ్ళి" లో.... "అందాల రాముడు" కి... "శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్" లో విడిది ఏర్పాట్లు చేసి, "మన ఊరి పాండవులకు", "కలియుగ రావణాసురునికి", "కళ్యాణ తాంబూలాల"ను ఇచ్చిన "రాంబంటు"...


తన అంతరాత్మ రమణ అస్తమయం తర్వాత.... నా "జాకీ" లేని ఈ "శ్రీ రామ రాజ్యం" నాకొద్దు అంటూ... ఆ "స్నేహం" కోసం "పరమాత్మ" లో ఐక్యమైన *బాపూరమణీయం....*

తరాలు గడచినా... శతాబ్దాలు మారినా... బాపూ గీత, రమణ రాత నిత్యనూతనమే....


మధుమేహము. ఔషదం

మధుమేహము - షుగర్ సైడ్ ఎఫెక్ట్స్ నివారించే దివ్య ఔషదం
********************
పొడపత్రి ఆకు
నేలవేము సమూలం
తిప్పతీగ లావుది
మానుపసుపు బెరడు
నేరేడు గింజలు
మోదుగపువ్వు,
లోద్దుగ బెరడు,
వేగిస బెరడు
నేలతంగేడు,
మారేడు,
ఉసిరి
నల్లజిలకర
కటుకరోహిణి
మెంతి,
సప్తరంగి
ఒద్ది బెరడు
శిలాజితు
తిప్పసత్తు
వంగభస్మము

Dose: 5 gm చూర్ణం ను గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం పరగడుపున. సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవాలి.
సూచనలు: –గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు 5 gm చూర్ణం ను 3 పూటలు ఆహారానికి ముందు తీసుకోవాలి
ఉపయోగాలు: — మీ గ్లూకోజ్ ఎప్పుడు 80—100 లోపు ఉంచుతుంది.
—ఇన్సులిన్ వాడుతున్న వారు దీనిని 2 పూటలు 90 రోజులు వాడిన తరువాత మీ ఇన్సులిన్ పాయింట్స్ తగ్గించవచ్చు.
—దీనిని నిత్యం వాడుతుంటే నీరసము, ఆయాసం తగ్గి శరీరం లో బలం కలుగుతుంది.
—శరీరంలో మంటలు, తిమ్మిరులు తగ్గించును.
–షుగర్ సైడ్ ఎఫెక్ట్స్ నుమెల్లమెల్లగా మీ శరీరం నుండి దూరం చేస్తుంది.
—వంశపారంపర్యము గా షుగర్ వచ్చే అవకాశం గలవారు నిత్యం 5 gm చూర్ణం వాడుతుంటే జీవితం లో షుగర్ వ్యాధి రాదు.
—-నేలతంగేడు మూలిక వల్ల అతిగా వచ్చే మూత్రం ను కంట్రోల్ చేస్తుంది.
—-కొందరికి పుండ్లు మానకపోవడం,గ్యాంగ్రీన్ కు దారితీయడం జరుగుతుంది.అలాంటి వారికోసం దీనిలో వాడిన పంచనింబ మేలు చేస్తుంది.
—-కంటిచూపు మసకబారడం,దృష్టి బలహీనపడం ను నివారిస్తుంది.
—-మానసికఅలసట,చికాకు,లైంగికఅసమర్ధత ను తగ్గించును.
—టైప్—1 మధుమేహాన్నికూడా తగ్గిచును.
—చిన్న వయస్సులో వచ్చే షుగర్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది.
—LDL,ట్రైగ్లిసరైడ్ నుకంట్రోలో ఉంచును.
 “జిమ్నెమిక్ యాసిడ్ మాలిక్యూల్స్” చక్కర నిల్వలను నియంత్రణలో ఉంచును
ఈ చూర్ణంవాడుతుంటే షుగర్ వల్ల బాధలు ఉండవు

🏀

❤️❤️❤️❤️❤️🍀🍀❤️❤️❤️❤️❤️
 ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే నాకు "9949363498 కు కాల్ చేయండి ఆయుర్వేద పరిష్కారం ఉచితంగా తెలియజేస్తాను

అల్లం ఉపయోగాలు



ప్రవచనం




శ్రీమద్భాగవతము


1-1-శా. శార్దూల విక్రీడితము

శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.

శ్రీ = శుభకర మైన; కైవల్య = ముక్తి; పదంబున్ = స్థితిని; చేరుట = పొందుట; కున్ = కోసము; ఐ = ఐ; చింతించెదన్ = ప్రార్థించెదన్; లోక = లోకా లన్నిటిని; రక్ష = రక్షించుటనే; ఏక = ముఖ్యమైన; ఆరంభ = సంకల్ప మున్న వాడు; కున్ = కి; భక్త = భక్తులను; పాలన = పాలించే; కళా = కళ యందు; సంరంభ = వేగిరపాటు ఉన్న వాడు; కున్ = కిన్; దానవ = రాక్షసుల; ఉద్రేక = ఉద్రేకమును; స్తంభ = మ్రాన్పడేలా చేసే వాడు; కున్ = కి; కేళి = ఆట లందు; లోల = వినోదా లందు; విలసత్ = ప్రకాశించే; దృక్ = చూపుల; జాల = వల నుండి; సంభూత = పుట్టిన; నానా = వివిధ; = బ్రహ్మాండముల {కంజాత భవాండకం (నీటిలో) జాత (పుట్టినదాని, (పద్మం) లోపుట్టిన వాని (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము}; కుంభ = రాశి తనలో కలిగిన వాడు; కున్ = కి; మహా = గొప్ప; నంద = నందుని; అంగనా = భార్య యొక్క; డింభ = కొడుకు; కున్ = కున్.

సర్వలోకాలను సంరక్షించేవాడిని, భక్తజనులను కాపాడుటలో మహానేర్పరి తనం గలవాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని, విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండాలు సృజించే వాడిని, మహాత్ము డైన నందుని అంగన యొక్క కుమారుని (మహానందం దేహంగా గల ఆత్మీయుని) మోక్ష సంపదను అపేక్షించి సదా స్మరిస్తూ ఉంటాను.
ఇది తెలుగు చేయబడిన భాగవత గ్రంథారంభ ప్రార్థనా పద్యం. ఈ తెలుగసేతను బమ్మెర పోతనామాత్యుల వారు తన మోక్షానికే కాదు మనందరి మోక్షాన్ని అపేక్షించి చేసారు. ఇది భాగవతానికే కాదు, తెలుగు సాహితీ విశ్వానికే మకుటాయమాన మైంది. ఇష్టదేవతా స్తుతీ, వస్తు నిర్దేశమూ కల ఈ మనోజ్ఞవృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తాని కంతా అద్దం పడుతుంది. శార్దూలవిక్రీడిత వృత్తం ఎన్నుకోడంలో విషయ గాంభీర్యత సూచింపబడుతోంది. స్తుతి, నిర్దేశాలను పలికించే పద విన్యాసం బహుళార్థ సాధకత, దీర్ఘకాల రమ్యత సాధిస్తున్న సూచన కావచ్చు. (అ) శ్రీ కైవల్య పదఁబు జేరుటకునై చింతించెదన్ (ఆ) లోకరక్షైకారంభకున్ (ఇ) భక్తపాలన కళా సంరంభకున్ (ఈ) దానవోద్రేక స్తంభకున్ (ఉ) కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ (ఊ) మహానందాంగనా డింభకున్ అనే అద్భుత ప్రయుక్తాలు ఈ పద్యంలో ఆరు (6) ఉన్నాయి. భగవంతుని ప్రధాన గుణాలైన సర్వేశ్వరత్వ, ధర్మ సంస్థాపకత్వ, శిష్టరక్షణ పరాయణత్వ, దుష్ట శిక్షన చణత్వ, విశ్వకర్తృత్వ, ఆనందమయత్వాలు అనే ఆరింటికి ప్రతీకలు యివి. (అ) శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ అనటంలో మోక్షం కోసం ఉత్కంఠితుడైన పరీక్షిత్తు వృత్తాంతంతో పాటు మొత్తం భాగవతమే ధ్వనిస్తున్నది. అలాగే ప్రథమ స్కంధంలోని నారదుడు, భీష్ముడు, కుంతీదేవి మొదలైనవారి కథలూ, తృతీయ స్కంధంలోని దేవహూతి వృత్తాంతమూ, చతుర్థ స్కంధంలోని ధ్రువ చరిత్రా స్ఫురిస్తూ భగవంతుని సర్వేశ్వరత్వాన్ని నిరూపిస్తున్నాయి. ఎందుకంటే కైవల్యాన్ని అనుగ్రహించే అధికారం సర్వేశ్వరునికి మాత్రమే ఉంటుంది. (ఆ) లోకరక్షైకారంభకున్ అనటంలో హిరణ్యాక్ష హిరణ్యకశివు కంస కాలయవనాదులను (తృతీయ, సప్తమ, దశమ స్కంధాలు) సంహరించి వారి అత్యాచారాల వల్ల అస్తవ్యస్తమైన లోకాన్ని ఉద్ధరించిన భగవంతుని ధర్మ సంస్థాపకత్వం సంస్థాపించబడింది.(ఇ) భక్తపాలన కళా సంరభకున్ అనటంలో భక్తులను పాలించటం భగవంతుని కళ, ఎప్పుడెప్పుడు ఆర్తులను ఆదుకుందామా అని అనుక్షణం తహతహలాడుతుంటాడు స్వామి అనే సూచన. అలాగే గజేంద్రుణ్ణి కాపాడటానికి మహా విష్ణువు వైకుంఠం నుంచి పరుగెత్తుకు వచ్చిన వృత్తాంతం (అష్టమ స్కంధం) స్పురిస్తూ భగవంతుని శిష్ట రక్షణ పరాయణత్వాన్ని చాటుతున్నది. (ఈ) దానవోద్రేకస్తంభకున్ అనటంతో అష్టమ స్కంధంలోని వామనావతారం వ్యంజకమైంది. తరువాతి మన్వంతరంలో ఇంద్రుడు కావలసిన బలి, వరబలంతో ముందుగానే స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రపదం కాంక్షించాడు. దుష్టశిక్షణచణు డైన స్వామి వామనుడై, ఆ దానవేంద్రుని ఉద్రేకానికి పగ్గాలు పట్టి స్తంభింపజేయటం ధ్వనించింది. (ఉ) కేళిలోల... కుంభకున్ అనటం వల్ల భగవంతుని విశ్వకర్తృకత్వాన్ని వెల్లడించే సూర్యవంశ చంద్రవంశాల చరిత్ర (నవమస్కంధం) స్ఫురిస్తోంది. స్వామి విలాసంగా త్రిప్పే కళ్లలో నుంచే కదా బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి. సృష్టి జరుగుతుంది. నిజానికి స్వామికళ్లు సూర్యచంద్రులేగా. ఇంకా శ్రీహరే ప్రధానకర్తని ద్వితీయ స్కంధం నిరూపిస్తోంది. (ఊ) మహానందాంగనా డింభకున్ అనటం కృష్ణలీలా సర్వస్వమైన దశమ స్కంధానికి, ఆ నందాంగనకు ఆనందానికి, మహా ఆనందమే దేహంగా కల స్వరూపికి ప్రతీక.

దీపారాధన చేయడం

🍁🍁🍁🍁🍁🍁🍁🍁దీపారాధన చేయడం వల్ల కలిగే సత్ఫలితాలు ఏమిటి? అంటే దీపం వెలిగే చోట లక్ష్మీ నివాసం ఉంటుంది. 🍁దారిద్య్రములు తొలగి ఐశ్వర్యములు లభిస్తాయి. దేవతా శక్తులు స్ధిరనివాసం చేస్తాయి. 🍁దీపం వెలిగించి పూజాదికాలు చేస్తే విఘ్నకారకాలైన తామస శక్తులు, రాక్షస భూతప్రేత పిశాచాలు దరి చేరవు. 🍁దీపారాధన క్రమంగా మనలో ఙ్ఞానం ను వికసింప చేస్తుంది. 🍁దీప ప్రజ్వాలన వలన ఉత్తమ లోకాలూ లభిస్తాయి. 🍁దేవతా లోకాలుగ చెప్పే ఊర్ధ్వ లోకాలన్నీ కాంతి లోకాలు. అధోలోకాలన్నీ చీకటి మయాలు. జ్యోతిని వెలిగించడం వలన జీవునికి మంచి గతులు లభిస్తాయి. పుణ్య లోకాలు సిద్ధిస్తాయి. మరణించిన వ్యక్తులకు ఉత్తమ గతులు సిద్ధించాలన్నా దీపాలు వెలిగించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. దీపావళి నాడు దీపాలు వెలిగించడం, కొరివి రగిలించడం వలన మరణించిన పెద్దలకు ఉత్తమ గతులు కలగాలనే ఉద్ధేశ్యంతో చేస్తారు. సంధ్యా సమయాలలో దీపం వెలిగే ఇంట దైవీశక్తులు ఉంటాయి. అటువంటి ఇంట్లో రోగాలు, నిరుత్సాహం, కలహాలు, దారిద్ర్యము మొదలైన బాధలు ఉండవు.
🍁🍁🍁🍁🍁🍁🍁🍁

వివేకానంద స్వామి

🌻🌻నవ భానూదయం‌‌‌🌻🌻
*ఆత్మవిశ్వాసాన్ని పూనుకుని మీకు లౌకిక సంపద కావాలంటే దానికోసం పాటుపడండి.అది మీకు లభిస్తుంది.మీరు మహామేధావంతులు కాగోరితే బుద్ధి క్షేత్రంలో పని చేయండి. అప్పుడు మీరు మహామేధావంతులు కాగలరు. మీరు మోక్షాన్ని పొందగోరితే ఆధ్యాత్మికక్షేత్రంలో సాధన కొనసాగించండి.అపుడు మీరు ముక్తులై నిత్యానందాన్ని అనుభవిస్తారు.* ----------------+వివేకానంద స్వామి

రామ రసం


పూజగదిలో దేవతామూర్తులు - చిన్నకథ


అదో చిన్న పల్లెటూరు.  పట్టుమని పది బ్రాహ్మణ కొంపలు కూడా లేవు.  ఉన్నవాళ్లందరికీ వాళ్ళ పెద్దలు ఇచ్చిన ఆస్తులు ఉండడంతో వాటిని వదలలేక అక్కడే స్థిరపడి పోయారు.  శాస్త్రిగారు ఆ ఊరి పండితులు.  పరమ నిష్ఠాగరిష్టుడు.  వాళ్ళ తాతముత్తాతల నుంచి వస్తున్న శివపంచాయతనం వుండేది.  శాస్త్రిగారు రోజూ నమక చమకములతో శివునికి అభిషేకముచేసి శ్రద్దగా పూజచేస్తూ వుండేవారు.  ఆయన భార్య పేరు శ్రద్ధాదేవి. 


అమ్మగారికి వంటలు చేయడం బాగా వచ్చు.  ఆమె వండిన పదార్థం తినని వాడు ఆ ఊరిలోనే ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు.  వారికి అష్టైశ్వర్యాలూ ఉన్నాయి.  తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తులు చూసుకుంటూ అక్కడి ప్రజలలో తలలో నాలుక అయి పోయాడు.

పూజగదిలో సామాను సిద్ధం చేస్తోంది శ్రద్ధాదేవి.  ఆయన పక్కన కూర్చుని కబుర్లు చెప్తున్నాడు.  పూజా మందిరం లోని వస్తువులు, బొమ్మలు అన్నీ పాతబడి పోయాయి.  వాటిని ఎంత శుభ్రం చేసినా మెరుపు రావడం లేదు.  "ఈ సారి తీర్థం లో అన్నీ కొత్త బొమ్మలు, సామాన్లు కొనుక్కుందాము శ్రద్ధా!" అంటున్నాడు భార్యతో..

సరిగ్గా అదే సమయానికి ఆ ఇంటికి ఒక అనుకోని అతిథి వచ్చాడు.  ఆయన రూపురేఖలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి.  తొలుత ఆయనను చూసి భయపడింది శ్రద్ధాదేవి.  అంతలో ఆ వచ్చిన అతిథి 'అమ్మా!  నాకు కొంచెం అన్నం పెడతావా, ఆకలి అవుతోంది' అని గట్టిగా అడిగాడు. 

'అలాగే స్వామీ!  ఇదిగో సిద్ధం చేసేస్తున్నాను.  పిండి వంట (గారెలు) సిద్ధం చేస్తున్నాను.  కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి స్వామీ' అని సమాధాన పరచింది ఆ ఇల్లాలు.  శర్మగారు చదువుకుంటున్న భాగవతం పక్కన పెట్టి ఆయనను ఇంటిలోనికి రమ్మన్నాడు. 

రాలేను, ఇక్కడే ఈ అరుగుమీద కూర్చుంటాను.  ఇక్కడే నాకు భోజనం పెట్టండి' అన్నాడు ఆ స్వామి.  సరేనన్నాడు శర్మగారు.  వంట అవుతోంది.  ఆమె వీలయినంత తొందరగా చేసి పెట్టాలనే ఉద్దేశ్యంతో కంగారు పడుతోంది.  పిండివంట మొదలు పెట్టింది.  గారెలు వేసి పూర్తవగానే భోజనానికి సిద్ధం కమ్మంది. 

బయట అరుగుమీదే నేలంతా శుభ్రం చేసి పెద్ద అరటి ఆకు వేసి, వండిన పదార్థాలన్నీ అందులో వడ్డించింది.  భోజనం మొదలు పెట్టాడు స్వామి.  ఒక్కొక్క పదార్థామూ దగ్గర ఉండి అపర అన్నపూర్ణా దేవిలా వడ్డిస్తోంది ఆమె.  మీరు అక్కడ కూర్చోండి అమ్మా!  శర్మగారు వడ్డిస్తారులే' అన్నా వినకుండా ఆమే వడ్డిస్తోంది.

వండి వడ్డించిన పదార్థాలన్నీ సుష్టుగా తిని విశ్రాంతి తీసుకోకుండానే బయలుదేరడానికి సిద్ధమయ్యాడు స్వామి.  ఆయన ప్రవర్తనకు ఆశ్చర్యపోయారు శర్మ గారు.  వృద్ధాప్యంలో లేడు, కానీ వంటినిండా - జడలు కట్టిన పొడవైన జుట్టుతో - చూడడానికి వికృతంగా ఉన్నాడు, భాషలో కూడా మర్యాద లేదు, తినే పద్ధతికూడా సభ్యతగా లేదు, తిన్న తరువాత ఎవరూ కూడా విశ్రాంతి తీసుకోకుండా వెళ్లిపోరు.  ఈయన ఏమిటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకొన్నాడు. 

ఒక్క మాట స్వామీ!  మీరు ఎక్కడి వారు?  ఇక్కడికెందుకు వచ్చారు?  నా ఇంట భోజనానికి వచ్చి లోనికి రాకుండా బయట కూర్చుని ఎందుకు తింటానన్నారు?  తిన్న వెంటనే ఎందుకు వెళ్లిపోదామనుకుంటున్నారు? దయచేసి చెప్పండి" అన్నారు శర్మగారు.   

నేనెవరో నీకు చెప్పినా నీకు అర్థం కాదిప్పుడు.  ఈ వీధిలో వెళ్తుండగా మీ మాటలు వినిపించాయి.  పూజకు సామాను సిద్ధం చేసుకుంటూ మీ మాటలు వినపడుతున్నాయి.  ఇక్కడైతేనే నాకు మంచి భోజనం దొరుకుతుంది  అని అనిపించింది.  అందుకే ఇక్కడ ఆగి భోజనం చేశాను.  ఇంతకంటే నేనేమీ చెప్పలేను' అంటూ వడివడిగా అడుగులేసుకుంటూ వెళ్లిపోయాడు ఆ స్వామి. 

ఏమీ అర్థం కాలేదు ఆ దంపతులకు.  సరే భోజనం ముగించారు.  ఎందుకో ఓ సారి వారి పూజగదిలోని సామానును మళ్ళీ చూసుకున్నారు.  ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.  ఆ వస్తువులన్నీ మెరిసిపోతున్నాయి.  ఇంతక్రితమే కదా వాటిని ఎంత తోమినా మెరుపు రావడం లేదు అనుకున్నాము.  ఆ స్వామి 'మీ మాటలు విని భోజనానికి వచ్చాను' అన్నాడు.  అంటే ఆ స్వామికి ఆ పూజ గదిలోని సామగ్రిని తీయివెయ్యడం ఇష్టం లేదన్న మాట. 

అంటే నేను రోజూ కొలిచే ఆ పరమేశ్వరుడే నాకు జాగ్రత్తలు చెప్పడానికి వచ్చాడన్నమాట.  సామగ్రిని మార్చేస్తాననే మాట ఆయనకు ఇష్టం లేదన్నమాట.  అందుకే లోనికి రాలేదు" అనుకొని వెంటనే బయటకు వచ్చి ఆ చుట్టుపక్కల చూశాడు.  స్వామి కనపడలేదు.  ఆ వీధుల్లో ఉన్నవారిని అడిగాడు.  అందరూ కూడా ఆయనను చూడలేదనే చెప్పారు. 

శాస్త్రిగారి గుండె గుభేలుమన్నది.  అప్పుడు అర్ధమైనది.  ఇంట్లో పూజా మందిరములోని దేవతామూర్తులు ఎంత శక్తివంతమైనవో, వాటివలనే గదా ఇన్నాళ్లూ ఈ ఇంటిని దేవతలు కాపాడుతూ వచ్చారు!  ఇన్నాళ్ళు నాకు తెలియలేదు.  పెద్దలు ఇచ్చిన నిజమైన ఆస్తి ఇదే కదా అని అనుకోని తన పూజామందిరము లోనికి వెళ్లి ఆ పరమశివుని విగ్రహం ముందు ప్రణమిల్లి, కృతజ్ఞతతో

“ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ నమః”అని చెంపలువేసుకొన్నాడు.  భగవంతునిపై నమ్మకము శ్రద్ధఅవసరము.  పూజా మందిరములో వున్న విగ్రహాలు ఎంత పాతవైనా, అరిగిపోయినా వాటిని ముందు వెనుకా ఆలోచించకుండా తీసివేయ్యకూడదు.  మన తాత ముత్తాతలు పూజించినవి అవి. 

వాటిలో ఎంతో మంత్ర శక్తి దాగి వుంటుంది.  వాటిని పారేయకండి.  భక్తితో ఒక్క పుష్పం పెట్టండి, అవి చైతన్య వంతమౌతాయి.  మిమ్మల్ని మీకుటుంబాన్ని కాపాడుతాయి.  ఒకవేళ ఆ వస్తువులు మరింత జీర్ణమై (అరిగి) పోతే (బంగారు, వెండి విగ్రహాలు) వాటిని కరిగించి, లేదా మార్చి అవే విగ్రహాలు మళ్ళీ కొనుక్కోండి.

ఇది watsup లో వచ్చిన మెసేజ్
*******************

వామనాలయం


మనకొక వామనాలయం!
ఇంతింతై వటుడింతై.. ఆకాశమంతై.. మూడడుగులు కోరి.. ముజ్జగాలకూ మేలు చేసిన స్వామి వామనుడు. బలిని పాతాళానికి తొక్కిన త్రివిక్రమ రూపం మహోన్నతం. ఆ అపురూప మూర్తి కొలువుదీరిన ఆలయాలు మన దేశంలో చాలా అరుదుగా ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు!
 ప్రపంచంలోనే ఎక్కడా లేని అపురూప, అద్భుతమైన రీతిలో శ్రీ వామన మూర్తినే శ్రీ త్రివిక్రమ స్వామిగా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉందని తెలిస్తే.. ఆనందం కలగక తప్పదు!!
అసలు శ్రీ వామన మూర్తినే శ్రీ త్రివిక్రమ స్వామి అంటారు అటువంటి ఆ స్వామికి తమిళనాడులో రెండు చోట్ల
 కేరళలోని ఎర్నాకులంలో ఆలయాలు ఉండగా.
ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చెరుకూరులో త్రివిక్రమ స్వామి ఆలయం ఉంది. అపురూప శిల్పసంపదతో అలరారు స్వామి ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. తొమ్మిది అడుగుల ఎత్తుండే స్వామివిగ్రహం గోధుమ వర్ణంలో మెరిసిపోతూ దర్శనమిస్తుంది.
చోళరాజుల్లో పదోవాడైన విష్ణువర్ధన మహారాజు ఓ సారి ఈ ప్రాంతానికి విహారానికి వచ్చాడట. ఇక్కడి కోనేటిలో తివిక్రమ స్వామి విగ్రహం ఉండటం గమనించి.. చుట్టూ మంటపం నిర్మింపజేశాడట. తర్వాత రాజరాజనరేంద్రుడి కాలంలో ఆలయం, మంటపాలు నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తోంది.ఆలయంలో అడుగడుగునా ఆనాటి కళావైభవం దర్శనమిస్తుంది. మూలవిరాట్టుకు ఉత్తర దిశలో భూదేవి, దక్షిణాన శ్రీదేవి అమ్మవార్ల విగ్రహాలున్నాయి. ద్వారపాలకుల విగ్రహాలు గంభీరంగా దర్శనమిస్తాయి. గర్భాలయం వెలుపలి గోడలపై రామాయణ గాథ, భాగవత ఘట్టాలు, దశావతారాలతో పాటు ముఖ్యంగా శ్రీ వినాయకుడి విగ్రహం కూడా ప్రముఖంగా దర్శనమిస్తున్నాయి.
 ఇంకా అనేకానేక దేవతా విగ్రహాలు కూడా బహుముచ్చటగా కనిపిస్తాయి.

బలిని పాతాళానికి తొక్కిన తర్వాత.. దేవతలు వామనుడిని స్తుతించారు. త్రివిక్రమ రూపాన్ని ఎప్పటికీ దర్శించుకునే వరమివ్వమని కోరుకున్నారు. దానికి సమ్మతించిన వామనస్వామి ఇక్కడ వెలిశారని చెబుతారు. బలిని చరపట్టినందున ఈ ప్రాంతాన్ని చరయూరుగా కాలక్రమంలో చెరుకూరుగా పిలుస్తున్నారు.

 ఆలయ పరిసరాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు ప్రశాంతతనూ చేకూరుస్తాయి. శ్రీకృష్ణాష్టమి, వామన జయంతి, దీపావళి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి శనివారం విష్ణు సహస్రనామార్చన, ఏకాదశి సందర్భంగా అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

ఇక్కడకు ఎలా వెళ్లాలంటే?
ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి చెరుకూరు 19 కి.మీ. దూరంలో ఉంటుంది. గుంటూరు జిల్లా బాపట్ల నుంచీ అంతే దూరంలో ఉంటుంది.
గుంటూరు జిల్లా బాపట్ల నుంచీ అంతే దూరంలో ఉంటుంది. రెండు ప్రాంతాల నుంచి చెరుకూరుకు బస్సు సౌకర్యం ఉంది. చీరాల, బాపట్ల రైల్వేస్టేషన్లలో దిగి చెరుకూరు చేరుకోవచ్చు.

మనతెలుగు


౼౼౼౼౼౼౼౼
అవధానధారలే యందింపగాజాలు
     అందాలపదహంస లలరుచుండు
నాటక రసరాగ హాటకానందమై
      స్ఫురిత వనమయూర శోభదనరు
వాగ్గేయకార సద్భావనా భాగ్యమై
       భక్తి బంభరకేళి పదముకదుపు
బాలమురళి సినీబాలు సద్గాత్రమై
        శాస్త్ర పరవశతా సారమొలుకు

కళల యరువదినాల్గింట ఘనతసూపు
కలికి సొగసుల సుకుమార కల్పవల్లి
పదము పదము నందియల సవ్వడులమించు
దివ్య రసరాజ్యమౌభాష తెలుగుభాష.

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం

మంగళగిరి - కబుర్లు

*గుంటూరు జిల్లా, మంగళగిరి - కబుర్లు*

 గోంగూర, మిరప్పళ్ల సీజన్ మొదలైంది.

మా గుంటూరు జిల్లా ... గోంగురకి ఫేమస్ . పండు మిరపళ్లకి ఫేమస్ . గోంగూర ... పండుమిరపళ్ళు కాంబినేషన్ తో కలిపి చేసిన పచ్చడికి మా మంగళగిరి ఫేమస్ .

మా మంగళగిరి ఇంకా చాలా చాలా వాటికి ఫేమస్ .

వేడి వేడిగా అన్నం కంచంలో వడ్డించుకొని ... గోంగూర పండు మిరప్పళ్ళ కాంబినేషన్ పచ్చడి, నెయ్యితో దట్టంగా కలుపుకుని ... అనుపానంగా పక్కనే ఫ్రెష్గా అప్పుడే చిలికిన మజ్జిగ లోంచి తీసిన అంత వెన్నముద్ద ఆరారగ నాలిక్కి రాసుకుంటూ ... తింటూంటే ఉంటుంది చూడండి ... నాసామిరంగ ... స్వర్గలోకానికి బెత్తడంటే బెత్తెడు దూరంలో ఉంటాం .

ఆ తరువాత బేరుమని మంచవెక్కి ... ముసుగుదన్ని ఒక్క కునుకు గనక దీశావంటే ... ఆ బెత్తెడు దూరం కూడా కవర్ చేసేయొచ్చు .

ఆ కాంబినేషన్ తింటునప్పుడల్లా ... పొద్దున్న లేస్తూనే ఈ వురకలు పరుగులు జీవితమేంటి ... సంసారాలేంటి ... ఉద్యోగాలేంటి ... సంపాదన్లేంటి ... అంతా మిథ్య ... ఈ గోంగూర + పండు మిరపళ్ళ పచ్చడి + నెయ్యి+ వెన్న ముద్ద కాంబినేషన్ ఒక్కటే నిజం ... శాశ్వతం ... అని అనిపిస్తుంది నాకైతే .

మరి గోంగూర పచ్చడి ఎలా తినాలో అది కూడా చెబుతా వినండి .

నైసుగా ... లవ్లీగా ... చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయ కట్ చేసుకుని ... సన్నగా పొడుగ్గా ఉండే గ్రీన్ పచ్చి మిరపకాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ... వుడుకుడుకు అన్నంలో గోంగూరపచ్చడి కలుపుకుని ...నెయ్యిసుకొని.. ఒక్కొక్క ముద్దలో ఒక ఉల్లిపాయ ముక్క ... ఒక మిరపకాయ ముక్క పెట్టుకుని తృప్తిగా ఆరగించాలి ... మధ్య మధ్యలో కాస్త వెన్నముద్ద నాలిక్కి రాసుకోడం మర్చిపోకూడదు .

మళ్లీ మీకు ... పైన చెప్పానే ... ఆ స్వర్గలోకం బాపతు ఫీలింగ్ రాకపోతే నన్నడగండి .

ఈ తిళ్లు వర్కింగ్ డేస్లో కాదండీ ... ఎంజాయ్ చెయ్యలేరు ... ఆఫీసులకు పరుగులెత్తాలి కదా పొద్దున్నే పొట్ట చేత్తో పట్టుకుని ... అందుకని
చక్కగా ఏ ఆదివారం పూటో ... శలవు రోజునో ఈ కార్యక్రమం పెట్టుకోవాలి . అంతే!!!

ఇప్పుడు మా భద్రాచలం కూడా మంగళగిరి లానే గోంగూర మిరప్పళ్ళ పచ్చడి కి ఫేమస్!

sticker

Today I saw a sticker on a car, "Ex.Covid-19 Patient".

I was amused to see this sticker & out of curiosity, I enquired with him when it stopped at the signal.

He said, "Sir, seeing this sticker no Policeman now dares to do Alcohol Breath Analysing Test".

Indians convert adversity into opportunity....
🤔🤔🤔😊😊😊😅😅😜

సరదాగా

*సరదాగా... ఒకే వాక్యాన్ని రెండు అర్ధాలలో.....*

1. మీ సంగతి ఏమిటి?
   మీసం గతి ఏమిటి?
2. గురూజీ వనం బాగుందా?
  గురూ జీవనం బాగుందా?
3. ఆమే కమలమును తొక్కింది.
 ఆ మేక మలమును తొక్కింది.
4. మాట మాట పెరిగింది.
   మా టమాట పెరిగింది.
5. ఆహారం చూడ ఎంత బాగుందో!
 ఆ హారం చూడ ఎంత బాగుందో!
6. మాతా తమరు నిమిషంలో చేరారు.
    మా తాత మరునిమిషంలో చేరారు.
7. నావ లతలపై పడింది.
  నా వల తలపై పడింది.
8. రామారావుంటే నేను వస్తాను.
 రామా రా వుంటే నేను వస్తాను.
9. ఆమె కవితలతో జీవనం చేయును.
  ఆమె కవి తలతో జీవనం చేయును.
10. మాతా మరను పట్టుకో.
  మా తామరను పట్టుకో.....

 *ఇదే మన తెలుగు భాష ఔన్నత్యం... గొప్పతనం....*

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం



*అష్టమ స్కంధము - పందొమ్మిదవ అధ్యాయము*

*వామన భగవానుడు బలిచక్రవర్తితో మూడు అడుగుల నేలను యాచించుట - బలి ఆయనకు వాగ్దానమిచ్చుట - శుక్రాచార్యుడు అడ్డగించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*19.11 (పదకొండవ శ్లోకము)*

*స తన్నికేతం పరిమృశ్య శూన్యమపశ్యమానః కుపితో ననాద|*

*క్ష్మాం ద్యాం దిశః ఖం వివరాన్ సముద్రాన్ విష్ణుం విచిన్వన్ న దదర్శ వీరః॥7028॥*

హిరణ్యకశిపుడు వైకుంఠమున శ్రీహరికొరకు వెదకెను. కాని, శ్రీహరి జాడమాత్రము తెలియలేదు. అందులకు అతడు క్రుద్ధుడై సింహనాదమొనర్చెను. పిమ్మట ఆ వీరుడు పృథ్వి, స్వర్గము, దిక్కులు, ఆకాశము, పాతాళము, సముద్రములు మొదలగు అన్ని ప్రదేశములయందు విష్ణువు కొరకు గాలించెను. కాని, శ్రీహరి మాత్రము అతనికి ఎచ్చటను కనబడలేదు.

*19.12 (పండ్రెండవ శ్లోకము)*

*అపశ్యన్నితి హోవాచ మయాన్విష్టమిదం జగత్|*

*భ్రాతృహా మే గతో నూనం యతో నావర్తతే పుమాన్॥7029॥*

శ్రీహరి ఎక్కడను కనబడకపోవుటచే హిరణ్యకశిపుడు ఇట్లు అనుకొనెను- "నేను జగత్తంతయును గాలించితిని. నా సోదరుని చంపినవాడు మాత్రము కనబడుటలేదు. తప్పక అతడు ప్రాణులు తిరిగిరాని లోకమునకు వెళ్ళియుండవచ్చును"

*19.13 (పదమూడవ శ్లోకము)*

*వైరానుబంధ ఏతావానామృత్యోరిహ దేహినా|*

*అజ్ఞానప్రభవో మన్యురహంమానోపబృంహితః॥7030॥*

శ్రీహరిపై హిరణ్యకశిపునకు వైరభావము ఉండనవసరములేదు. ఏలయన, దేహధారులకు ఈ దేహము ఉండునంతవరకే వైరభావము చెల్లును. మృత్యువాత పడిన దేహముతో పాటుగా వైరభావము కూడ నశించిపోవును సుమా! క్రోధమునకు కారణము అజ్ఞానము. అది అహంకారముతో వృద్ధియగును.

*19.14 (పదునాలుగవ శ్లోకము)*

*పితా ప్రహ్లాదపుత్రస్తే తద్విద్వాన్ ద్విజవత్సలః|*

*స్వమాయుర్ద్విజలింగేభ్యో దేవేభ్యోఽదాత్స యాచితః॥7031॥*

మహారాజా! ప్రహ్లాదుని పుత్రుడు, నీకు తండ్రియు అగు విరోచనుడు గొప్ప బ్రాహ్మణ భక్తుడు. అతని శత్రువులైన దేవతలు బ్రాహ్మణుల వేషములను ధరించి, అతని ఆయువును దానముగ కోరిరి. వారు బ్రాహ్మణుల వేషములలో వచ్చిన దేవతలు అని తెలిసినప్పటికినీ, వారికి విరోచనుడు తన ఆయువును దానముగా ఇచ్చెను.

*19.15 (పదునైదవ శ్లోకము)*

*భవానాచరితాన్ ధర్మానాస్థితో గృహమేధిభిః|*

*బ్రాహ్మణైః పూర్వజైః శూరైరన్యైశ్చోద్దామకీర్తిభిః॥7032॥*

శుక్రాచార్యుడు మున్నగు గృహస్థబ్రాహ్మణులు, నీకీ పూర్వజులైన ప్రహ్లాదుడు మొదలగు వీరులు గూడ ధర్మమును పాలించి, యశోమూర్తులైరి. నీవును ఆ ధర్మములను పాటించుటలో ప్రముఖుడవు.

*19.16 (పదహారవ శ్లోకము)*

*తస్మాత్త్వత్తో మహీమీషద్వృణేఽహం వరదర్షభాత్|*

*పదాని త్రీణి దైత్యేంద్ర సమ్మితాని పదా మమ॥7033॥*

దైత్యేంద్రా! కోరిన వస్తువులను దానము చేయు వారిలో నీవు శ్రేష్ఠుడవు. కనుక, నేను కేవలము నా మూడడుగుల నేలను మాత్రమే నీ నుండి అర్థించుచున్నాను.

*బమ్మెర పోతనామాత్యుల పద్యము*

8-572 మత్తేభ విక్రీడితము

గొడుగో. జన్నిదమో, కమండలువొ.
......నాకున్ ముంజియో, దండమో,
వడుఁ గే నెక్కడ భూము లెక్కడ?
......కరుల్, వామాక్షు, లశ్వంబు లె
క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ?
......మదాకాంక్షామితంబైన మూఁ
డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది
......బ్రహ్మాండంబు నా పాలికిన్.

*తాత్పర్యము*

“అయ్యా! నేను బ్రహ్మచారిని. నాకు గొడుగు కాని, యజ్ఞోపవీతం కాని, కమండలం కాని, మొలతాడు కాని ఉపయోగిస్తాయి. అంతేకాని బ్రహ్మచారి నైన నా కెందుకు భూములు, ఏనుగులు, గుఱ్ఱాలు, స్త్రీలు. నా నిత్యకృత్యాలకి వాటితో పనిలేదు కదా. కాదని తోసేయకుండ నే కోరిన ఆ మూడు అడగుల చోటిస్తే అదే నాకు బ్రహ్మాండం.

*19.17 (పదునేడవ శ్లోకము)*

*నాన్యత్తే కామయే రాజన్ వదాన్యాజ్జగదీశ్వరాత్|*

*నైనః ప్రాప్నోతి వై విద్వాన్ యావదర్థప్రతిగ్రహః॥7034॥*

మహారాజా! నీవు సమస్త జగత్తునకు ప్రభుడవు. గొప్ప ఉదారుడవు. ఐనను నేను ఇంతకంటె ఎక్కువ నీ నుండి కోరను. విద్వాంసుడు కేవలము తన అవసరమైన మేరకే దానముగా స్వీకరింపవలెను. దానివలన అతనికి ప్రతిగ్రహదోషము అంటదు.

*బలిరువాచ*

*19.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*అహో బ్రాహ్మణదాయాద వాచస్తే వృద్ధసమ్మతాః|*

*త్వం బాలో బాలిశమతిః స్వార్థం ప్రత్యబుధో యథా॥7035॥*

*బలిచక్రవర్తి పలికెను* బ్రాహ్మణకుమారా! నీవు పెద్దలవలె మాట్లాడుచున్నావు. కాని, నీ బుద్ధి బాల్యమునే సూచించుచున్నది. నీవు బాలుడవే అగుటచే, నీకు ఏది లాభమో? ఏది నష్టమో? తెలియలేకున్నావు.

*19.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*మాం వచోభిః సమారాధ్య లోకానామేకమీశ్వరమ్|*

*పదత్రయం వృణీతే యోఽబుద్ధిమాన్ ద్వీపదాశుషమ్॥7036॥*

నేను ముల్లోకములను ఏకచ్ఛత్రాధిపతిని. ద్వీపసముదాయమును పూర్తిగా ఇయ్యగల సమర్థుడను. నీ మాటలతో నన్ను తృప్తిపరచి, కేవలము మూడు అడుగుల భూమిని మాత్రమే కోరుకొనుట బుద్ధిమంతుల లక్షణము అనిపించుకోదుగదా!

*19.20 (ఇరువదియవ శ్లోకము)*

*న పుమాన్ మాముపవ్రజ్య భూయో యాచితుమర్హతి|*

*తస్మాద్వృత్తికరీం భూమిం వటో కామం ప్రతీచ్ఛ మే॥7037॥*

బ్రహ్మచారీ! ఒకసారి నా యొద్దకు వచ్చి, దేనినైనను యాచించినవాడు, మరల ఇతరుల కడకు వెళ్ళి యాచింపనవసరమే ఉండదు. కనుక నీవు నీ జీవితమునకు కావలసినంత భూమిని కోరుకొనుము.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పందొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

32వ పద్యం


శా.
రోసీ రోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్,
బాసీ పాయదు పుత్రమిత్రజన సంపద్భ్రాంతి, వాంఛాలతల్
కోసీ కోయదు నామనం బకట! నీకుం బ్రీతిగా సత్క్రియల్
చేసీ చేయదు, దీని త్రు ళ్ళణపవే శ్రీకాళహస్తీశ్వరా!

నాస్తికుడు ఆస్తికుడైన వేళ



చిత్రనిర్మాత సాండొ చిన్నప్ప దేవార్ మరియు ప్రఖ్యాత తమిళ కవి కన్నదాసన్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఒక సినిమా షూటింగ్ నిమిత్తం కార్లో వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. దేవార్ చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నాడు కాని కన్నదాసన్ మాత్రం తీవ్రమైన గాయాలతో స్పృహ కోల్పోవడంతో మాద్రాసులోని ఆసుపత్రిలో చేర్పించారు.

దేవార్ కు పరమాచార్య స్వామి అంటే అమితమైన భక్తి. వెంటనే తేనంబాక్కం శివస్థానంలోని బ్రహ్మపురీశ్వర దేవస్థానంలో మకాం చేస్తున్న మహాస్వామి వారిని దర్సించుకోవడానికి వెళ్ళాడు.

“ఒక ప్రమాదం జరిగింది” అని స్వామితో చెప్పాడు దేవార్. వెంటనే స్వామివారు “కన్నదాసన్ ఎలా ఉన్నాడు?” అని అడిగారు.

తను ఏమి చెప్పకనే మహాస్వామివారు కన్నదాసన్ ఎలా ఉన్నాడు అని అడగటంతో దేవార్ ఆశ్చర్యపోయారు. ప్రమాదం నుండి తను ఎలా బయటపడ్డాడు, కన్నదాసన్ ఎలా తీవ్రంగా దెబ్బతిని అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరాడు అన్న విషయమంతా స్వామివారికి విన్నవించాడు.

దేవార్ ఆత్రుతని గమనించి మహాస్వామి వారు “దిగులు పడకు ఏమి పరవాలేదు” అని అతణ్ణి సముదాయించారు. ఆస్పత్రిలో ఉన్న కన్నదాసన్ నుదుటిపైన విభూతి పెట్టి, కొద్దిగా నోట్లో వేసి మిగిలిన దాన్ని దిండు కింద ఉంచమని స్వామివారే స్వయంగా విభూతిని పొట్లం కట్టి ఇచ్చారు. దేవార్ సంకోచిస్తూ విభూతిని అందుకున్నాడు.

ఎందుకంటే కన్నదాసన్ పరమ నాస్తికుడు. దైవాన్ని నమ్మేవాడు కాదు. అప్పటికే కన్నదాసన్ ద్రావిడ పార్టీల నాస్థిక కార్యకలాపాల్లో, వాటి వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. బ్రాహ్మణుల గురించి, సనాతన ధర్మం గురించి చాలా చెడుగా మాట్లాడేవాడు. నిజానికి ప్రమాదం జరగడాని వారం రోజులముందు కూడా కంచిలోని శంకర మఠం ఎదురుగుండా జరిగిన ఒక సభలో శంకరాచార్యుల (కంచి పీఠాధిపతుల) చిత్తరువును అవమానపరిచాడు. మరి ఇప్పుడు అటువంటి వ్యక్తికి ఈ విభూతి ఎలా ఇచ్చేది అని ఆలోచిస్తున్నాడు దేవార్.

ఆ త్రికాలజ్ఞాని దేవార్ పరిస్థితిని అర్థం చేసుకుని దేవార్ తో ఇలా అన్నారు.

”ఏమి అనుమానపడకుండా వెళ్ళి కన్నదాసన్ నుదుటన ఈ విభూతి పెట్టు. చిన్న మేఘం కాసేపు సూర్యుణ్ణి అడ్డుకున్నట్టు, ఈ నాస్తికత్వం అతణ్ణి అడ్డుకుంది. ఇప్పటి నుండి అతను సూర్యునివలె ప్రకాశిస్తాడు. వారి పూర్వీకులు ఎంతటి మహాత్ములో నీకు తెలుసా? వారి ముత్తాత కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని పునరుద్ధరించారు. వారి తాత కంచి ఏకాంమ్రేశ్వర దేవస్థానాన్ని పునరుద్ధరించారు. వారి తండ్రి కంచి కామాక్షి అమ్మవారి దేవస్తానాన్ని పునరుద్ధరించారు. అతను దేవాలయలాను సంరక్షించే మాహానుభావుల వంశంలో జన్మించాడు. ఇప్పుడు నీకు అర్థమైందా?”

దేవార్ ఆస్పత్రికి వెళ్ళి స్వామివారు చెప్పినట్టు చేసాడు. స్వామివారు ఇచ్చిన విభూతిని కన్నదాసన్ నుదుటన పెట్టి కొంచం నోట్లో వేసి, మిగిలినదాన్ని దిండు కింద పెట్టాడు. అప్పుడు సాయం సంధ్యా సమయం. తమిళ సాహిత్యానికి రాజైన కవి అరసు(కవి రాజు) కన్నదాసన్ ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. దేవార్ విశ్రాంతి కొరకై రాత్రికి ఇంటికి వెళ్ళి తన స్నేహితుణ్ణి చూడాలని ఉదయాన్నే మరలా వచ్చాడు. స్పృహలోకొచ్చిన కన్నదాసన్ కు ఏమి చెప్పాలా అని అలోచిస్తూ రాత్రి అంతా గడిపాడు.

మరుసటి రోజు ఆసుపత్రికి రాగానే కన్నదాసన్ స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి అలాగే మంచంపై పడుకుని ఉండడం చూసి ఆనందపడ్డాడు. “నేను ఎన్ని రోజులనుండి ఈ ఆసుపత్రిలో ఉన్నాను? నా మొహం చూసుకోవాలి అద్దాన్ని తీసుకుని రా” అని చెప్పాడు. దేవార్ ఆద్దం తెచ్చిచ్చాడు. అద్దంలో తన మొహాన్ని, నుదుటిపై ఉన్న విభూతిని చూసి అతను కోప్పడలేదు. బదులుగా ఎవరు పెట్టారు అని అడిగాడు. దేవార్ కొంచం ధైర్యం తెచ్చుకుని తను పరమాచార్య స్వామిని కలవడమూ, వారి అతణ్ణి అనిగ్రహించడమూ మొదలగు అన్ని విషయాలు కన్నదాసన్ కు చెప్పాడు.

అంతా వినగానే కన్నదాసన్ కన్నీళ్ళపర్యంతం అయ్యాడు. “నన్ను కరుణించారా? నా పైన ఇంతటి దయ చూపించారా? కేవలం వారం రోజుల ముందు నా చేష్టలతో, మాటలతో వారిని అవమానపరిచాను. ఎంతటి పాపిని నేను?” అని భోరున విలపించాడు. “పూర్తి స్వస్థత పొందిన తరువాత నేను మొదట నా ఇంటికి వెళ్ళను. ఇంతటి పాపిని అనుగ్రహించిన ఆ మహాత్ముని వద్దకు ముందు నన్ను తీసుకుని వెళ్ళు” అని దేవార్ ను అర్థించాడు.

అతని కోరిక ప్రకారం మహాస్వామివారిని దర్శించుకుని తనని క్షమించవలసిందిగా పలువిధాల ప్రార్థించాడు. అప్పటి నుండి నాస్తికత్వం నుండి ఆధ్యాత్మికత వైపు మళ్ళాడు. మనసులో భక్తిభావం పొంగగా మహాస్వామి వారిపై కవిత రాసాడు. మరలా స్వామిని దర్శించినప్పుడు దాన్ని వారికి సమర్పించాడు.

”ఎవరి కనుచూపుచేతనే అన్ని పాపాలు నశించిపోతాయో
ఎవరు తిరువాచకానికి సాకార స్వరూపమై నిలచినారో
ఎవరు తన మేధస్సు చేత సత్యా జ్ఞానానికి అర్థం చెప్పగలరో
ఎవరు ఈ విశ్వాన్ని రక్షించాడానికి వచ్చిన విశ్వనాథుడో
ఎవరు అన్ని మతాల చేత తమ దేవుడని ఒప్పబడినాడో
అటువంటివారి చరణారవిందములకు మనల్ని సమర్పించుకుందాము
రండి! అందరూ తరలిరండి!!”

మహాస్వామివారు పద్యాన్ని చదివి కన్నదాసన్ తో “నువ్వు చెప్పినది కేవలం శేషాద్రి స్వామివారికి మాత్రమే సరిపోతుంది. ఆయనే తురువణ్ణామలై అర్ధనారీశ్వరుడు. ఆయనే సత్పురుషుడు, మహామనీషి” అని అన్నారు.

”సనాత ధర్మ వైభవాన్ని గురించి మనస్పూర్తిగా రాయి” అని ఆశీర్వదించి పంపారు.

అప్పుడే కన్నదాసన్ మనసులో బీజం పడింది. అది చిగురించి, చిన్న మొక్కై, మహావృక్షమై మహత్తరమైన “అర్థముల్లా హిందు మతం; అర్థవంతమైన హిందూ మతం” అనే పుస్తకమై వర్ధిల్లింది.

[పూర్వీకులు చేసిన పుణ్యం మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. మరి వింతపోకడలతో స్వధర్మాన్ని ఆచార వ్యవహారాలని మంటగలిపి పాశ్చాత్య సంస్కృతికి బానిసలవుతున్న వారి వంశాలని, ముందు తరాలని కాపాడేది ఎవరు? ఏ పుణ్యం చూపించి భగవంతుడు నిన్ను కాపాడుతాడు. అందుకే ‘కురు పుణ్య మహోరాత్రం’ అన్నారు శంకరులు.]

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

విశ్వనాధల* *కవితాదృక్పధము!🌷

🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹
 🌷 *శ్రీ శ్రీ - విశ్వనాధల* 
   *కవితాదృక్పధము!🌷*
            🌷🌷🌷
ఇది, శ్రీ రమణ (మిధునం)గారి యనుభవం!
             
 శ్రీరమణ పాత్రికేయునిగా విజయవాడలో నున్నప్పుడు జరిగినది. రమణగారు విశ్వనాధగారి సన్మానమును
చీరాలలో నేర్పాటుచేసి, వారినితోడ్కొనిరావటానికి తామేపూనుకొన్నారు. టాక్సీలో ప్రయాణం 4గంటల వ్యవధి, గమ్యంచేరటానికి. మధ్యమధ్య నస్యం ముక్కుల్లో ధట్టిస్తూ విశ్వనాధ రమణతో యేవేవో ముచ్చట్లు చెపుతున్నారు. వారికినచ్చని విషయమేదైనా అడిగితే అమ్మో! వారికికోపం వస్తుందేమో? విషయం అసలుకే చెడుతుంది. అందుకే రమణగారు కంఠదఘ్నంగా ఉన్న తమ కోరికను బయటకు చెప్పలేక పోతున్నారు. అలాగని అడగటం మానాలనీలేదు. ప్రయాణమాపూర్తికావచ్చింది.కోరికా మిగిలిపోయింది.
ఇంతలో రైలుగేటు పడింది విశ్వనాధ కొంచెంతీరుబడిగా కన్పించారు. మెల్లగా శ్రీరమణ విషయం కదిపారట! బాబాయిగారూ! నాదో చిన్నకోరిక, "ఆఁ ఏవిటో అడుగవయ్యా!" -అన్నవెంటనే" శ్రీ శ్రీ-కవితాదృక్పధానికీ,
మీ కవితా దృక్పధానికి మధ్యతేడా ఏమిటో కకొంచెం సెలవీయండి", అనియడిగారట!
దానికాయన కోపందెచ్చుకోక, నశ్యం ఒకపట్టు గట్టిగాపీల్చి ముక్కులుతుడుచుకుంటూ"అబ్బో! ఆవిషయం చెప్పాలంటే చాలా ఉందయ్యా! చెపుతానులే, విను.

ఉదాహరణకు భాగవతంలో సముద్రమధన ఘట్టం ఉన్నది గదా. అగో దానినిద్దరం వింటున్నామే అనుకో, దానిని చదువుతున్నప్పుడు అక్కడ ఆదృశ్యాన్ని మేము చూసే తీరుల్లో తేడా చాలా ఉంటుందయ్యా, నేనయితే ఆదృశ్యాన్ని పోతన చిత్రించిన తీరునుజూచి అబ్బురపాటుతో ఆనందాన్ని పొందుతాను.
"ఆ ఘట్టంలోని అద్భుత రసపోషణను, అలంకార ప్రయోగచాతుర్యాన్ని, మెచ్చుకుంటాను". ఎందుచేత, నాదంతా ప్రాబంధికదృష్టి, అంటే సౌందర్యదృష్టి!"-

 "ఇదే శ్రీశ్రీయైతే, ఆమంధర పర్వతంక్రింద నలిగిపోతున్న నత్తలుా, కప్పలూ, మొదలైన జలచరాలమృత్యుఘోషను,వాటిబాధలను, అవిచేస్తున్న ఆక్రందనలనూ,
దేవదానవులు చేస్తున్న ప్రాణిహననమునూ, నిరసించేదృష్టితో చూస్తాడు. చూడటమేగాదు, ఆఅల్పప్రాణులయెడ తనకుగలసానుభూతిని కవితావిష్కారంచేయటానికి ప్రయత్నిస్తాడుకూడా.
     
నాది సౌందర్య శిల్పకళాదృష్టి!

అతనిది జీవ కారుణ్యదృష్టి !
 
ఇదీ మాకవితాదృక్పథము మధ్యగల భేదము"-
 
విశ్వనాధగారి వివరణపూర్తియైనది. టాక్సీ గమ్యమును చేరినది.
       🌷 స్వస్తి!🌷

లింగమ్

నమస్తే

ఓం శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహస్వామినే నమ:

లింగమ్

వ్యాఖ్యా :-

లింగమ్ ఇతి అధికార: అయమ్ । ఇత: ఊర్ధ్వమ్ అఖిలపాఠపరిసమాప్తే: యాన్ అనుక్రమిష్యామ: లింగమ్ ఇతి అధికార: వేదితవ్య:

అథ స్త్రీలింగ ప్రకరణమ్

పదచ్ఛేద: - ।। స్త్రీ ।।

 స్త్రీ ఇతి అధికార: అయమ్ । ఇత: ఉతత్తరమ్ ఆ శాలాకా స్త్రియాం నిత్యమ్ , (లింగానుశాసనమ్ 34) ఇతి ఏతస్మాత్ యాన్ అనుక్రమిష్యామ: తత్ర స్త్రీ ఇతి అధికారం వేదతవ్యం

(3) ఋకారాన్తా: మాతృ-దుహితృ-స్వసృ-పాతృ-ననాన్దార:

పదచ్ఛేద: - ఋకారాన్తా: 1.3 : మాతృ-దుహితృ-స్వసృ-పాతృ-ననాన్దార:

వ్యాఖ్యా : ఋకారాన్తే అస్య స: ఋకారాన్తా: , తే (బహువచనం) । మాతా చ దుహితా చ యాతా చ స్వసా చ ననాన్దా చ - మాతృ-దుహితృ-స్వసృ-పాతృ-ననాన్దార: । (ఇతరేతరయోగద్వంద్వ)

మాతృ-దుహితృ-స్వసృ-పాతృ-ననాన్దృ ఇతి ఏతే పంచ ఋకారాన్తా: శబ్దా: స్త్రీలింగా: భవంతి భవంతి ।

ఉదాహరణం :

ఇయం/ఏషా/ మాాతా = ఈమె అమ్మ

ఇయం/ఏషా/ దుహితా = కూతురు

ఇయం/ఏషా యాతా = ఈమె మరదలు

ఇయం/ఏషా/ స్వసా = ఈమె చెల్లలు

ఇయం/ఏషా/ ననాందా = ఈమె ఆదపడుచు

ఇయం/ఏషా/ పోతా = ఈమె పవిత్రముచేయునది

సంభాషణ సంస్కృతమ్ (మాసపత్రికా)

ధార్మికగీత - 6*

*
                                   
           *శ్లో:- వస్త్రేణ వపుషా వాచా* ౹
                  *విద్యయా వినయేన చ* ౹
                  *వకారై: పంచభి ర్హీనః* ౹
                  *వాసవో౽పి న పూజ్యతే* ౹౹


వినయము , వాక్కు , వస్త్ర , వపు ,
     విద్యను , పంచ 'వ' కారమెల్ల తా
ననయము గూడినన్ నరుడు
     నాణ్యతతోడ వసించు నెప్పుడున్, 
ఘనమగునట్టి యా యయిదు
       గల్గకనుండిన , యింద్రుడేనియున్
యనువగు గౌరవంబు తన
        కందక కుందును , నెల్ల వేళలన


ఆన్లైన్ మోసాలతో జాగ్రత్త




శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*

*657వ నామ మంత్రము* 31.8.2020

*ఓం యుగంధరాయై నమః*

కలియుగాది యుగములను ధరించు కాలస్వరూపిణియైన పరాశక్తికి నమస్కారము.

విశ్వమందు జంటలు జంటలుగా సయోధ్యతోను, పరస్పర వైరుధ్యంతోనూ ఉండే ఎన్నిటికో సమన్వయ స్వరూపిణియై విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *యుగంధరా* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం యుగంధరాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని అత్యంతభక్తి శ్రద్ధలతో ఉపాసించు సాధకునికి అంతులేని ఆత్మానందానుభూతి ప్రాప్తించును. నిత్యమైన, సత్యమైన ఆనందమును అనుభవించును. జగన్మాత సకలలోకాలను తనలో ఇముడ్చుకొని, జీవులను తన బిడ్డలవలె భావించి వారిని సర్వాభీష్టసిద్ధులను జేయును. జగన్మాత కాలస్వరూపిణి. నాలుగు యుగములను కలిపితే ఏర్పడే మహాయుగములను ధరించును.

యుగం అనే పదమునకు జంట అనే అర్థము గలదు. స్థూలం-సూక్ష్మం,దేహము-ఆత్మ, సుఖము-దుఃఖము, ఆనందం-విషాదం, వెలుగు-చీకటి, పగలు-రాత్రి, జడము-చైతన్యము ఇటువంటి జంటలతో ఏర్పడినదే సృష్టి. అమ్మవారు సృష్టి స్వరూపిణి గనుక ఈ జంటలను తనయందు ధరించి *యుగంధరా* అని నామము పొందినది.

జగన్మాత సమన్వయ స్వరూపిణి. యుగాలను తనయందు ఇముడ్చుకున్న కాలస్వరూపిణి. శివా-శివ సమన్వయ స్వరూపిణి.

జగన్మాతకు నమస్కరించునపుడు
*ఓం యుగంధరాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో, వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*

*80వ నామ మంత్రము*

*ఓం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః*

దైత్యులను ఉద్భవింపజేసే భండాసురుని సర్వాసురాస్త్రం నుండి వెడలి వచ్చిన హిరణ్యకశిప, రావణాది దైత్యులను తుదముట్టించడానికి తన చేతి పది వ్రేళ్ళ నఖములనుండి నారాయణుని దశావతారములుద్భవింపజేసిన అఖిలాండేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః* అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని ఉపాసించు సాధకుడు ఆ తల్లి కరుణచే అన్నవస్త్రములకు లోటులేక, ఆధ్యాత్మికచింతన యందు నిమగ్నుడై చతుర్విధ పురుషార్థములను సాధించి తరించును.

భండాసురుని దైత్యులను ఉద్భవింపజేసే *సర్వాసురాస్త్రం* ప్రయోగించగా హిరణ్యకశిఫ, రావణాది దైత్యులు ఆవిర్భవించి యుద్ధం చేయ నారంభించారు. అందుకు ప్రతిగా జగజ్జనని నారాయణుని దశావతారములు జనియింపజేసి ఆ రాక్షసుల సంహారం కావింపజేసింది..

*దశ* అంటే *అవస్థ* అని *కృతి* అంటే *కృత్యం* అనీ అర్థాలు చెప్పుకుంటే ఈ నామ మంత్రమునకు మరియొక అర్థము గలదు. దేవుడైన నారాయణుని అంశలే జీవులు. కాబట్టి అటు దేవుని పరంగా నారాయణునికి పంచకృత్యాలుంటాయి. వాటిని *సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహా* లంటారు. ఇక జీవుని పరంగా పంచ అవస్థలుంటాయి. వాటిని *జాగ్రత్, స్వప్న, సుషుప్తి, మూర్ఛ, మరణాలు* అంటారు.కాబట్టి నారాయణుని దైవలక్షణంగా ఐదుకృత్యాలు, జీవి లక్షణంగా ఐదు అవస్థలు ఉంటాయి. ఈ పదీ అమ్మవారి చేతి వ్రేళ్ళ పదిగోళ్ళనుండి రూపుదాల్చినట్లుగా భావించవచ్చును.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో, వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి 7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శివామృతలహరి శతకం

.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;

మ||
తలవంచన్ బనిలేదు నేనొకరికిన్ తథ్యమ్ముగా తత్కృపా
కలనన్ నీకును తల్లి శాంభవికి దక్కన్ ; దీటులేనట్టి మీ
చలువన్ జెప్పెద సాంప్రదాయికములై జానోందు శాస్త్రార్థముల్
జిలుగుందెల్గున ' జీవభాష యగుటన్ శ్రీ సిద్ధలింగేశ్వరా

*సంస్కృతము దేవభాష అయితే తెలుగు జీవభాష

భావం ; (నేను అర్థం చేసుకున్నది, పండితులు సవరించ గలరు.)

తండ్రీ శివా, నీ కృప వలన, అమ్మ శాంభవి కృప వలన నేను మీకు తప్ప వేరొక కి తలవంచి జీవించాల్సిన పనిలేదు.
అపారమైనటువంటి మీ మహత్యాలను వర్ణించే శాస్త్రా ర్థాలను, జీవ భాష అయిన చక్కటి తెలుగు లో అందరికీ అర్థమయ్యే రీతిలో నేను చెప్తానయ్యా శివా! శ్రీ సిద్ధ లింగేశ్వరా!

శ్రీకాళహస్తి దర్శనం

శ్రీకాళహస్తి దర్శనం తరువాత ఏ దేవాలయానికి వెళ్లకూడదంటారు.. ఎందుకు?💐💐

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తులు దర్శనం పూర్తికాగానే తిరుమల దగ్గరలో ఉన్న అన్ని దేవాలయాలు దర్శించుకొంటారు. అవి పాపనాశనం, కాణిపాకం.. చివరగా శ్రీకాళహస్తి.

శ్రీకాళహస్తి దర్శించుకున్న తరువాత మరే దేవాలయానికి వెళ్లకూడదంటారు. అలా వెళితే అరిష్టం అని హిందు సాంప్రదాయంలో చెప్పబడింది. శ్రీకాళహస్తి దేవాలయమే ఎందుకు చివరగా దర్శించుకోవాలి. మరే గుడికి ఎందుకు వెళ్లకూడదు. వెళ్తే ఏమవుతుంది?

శ్రీకాళహస్తి దర్శనం తరువాత నేరుగా ఇంటికే ఎందుకు వెళ్ళాలి?
పంచ భూతాల నిలయమైన ఈ విశ్వంలో (గాలి, నింగి, నేల, నీరు, నిప్పు) వాటికి ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు వెలిసాయి. అందులో ఒకటి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి లోని శ్రీకాళహస్తీశ్వరగా వెలసిన వాయులింగం.

అయితే ఇక్కడి గాలిని తగిలిన తరువాత మరే దేవాలయానికి వెళ్లకూడదు అనేది ఇక్కడి ఆచారం. అందులో నిజం లేకపోలేదు. సర్పదోషం, రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా తొలగుతాయని చెబుతారు. శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణేశ్వరుని దర్శనంతో కాలసర్పదోషం తొలుగుతుంది. ప్రత్యేక పూజలు చేసుకున్న వారు నేరుగా ఇంటికే వెళ్లాలని చెబుతారు ఇక్కడి పూజారులు. కారణం దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్లడమే. తిరిగి ఏ ఇతర దేవాలయాలకు వెళ్లినా దోష నివారణ జరగదని ఇక్కడి విశ్వాసం.

గ్రహణాలు, శని బాధలు పరమశివుడికి ఉండవని మిగతా అందరు దేవుళ్ళకు శని ప్రభావం, గ్రహణ ప్రభావం ఉంటుందని పురాణాలలో ఉంది. ఇందుకు నిదర్శనంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దేవాలయంతో సహా మిగిలిన అన్ని దేవాలయాలు దేశవ్యాప్తంగా గ్రహణ సమయంలో మూసివేస్తారు. గ్రహణ అనంతరం సంప్రోక్షణ జరిపిన తరువాతే పునఃదర్శనం ప్రారంభమవుతుంది.

కానీ మూసివేయని ఒకే ఒక్క దేవాలయం శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరునిది. ఇక్కడి దేవుడికి గ్రహణ ప్రభావం ఉండదని పురాణాల్లో చెప్పబడింది. గ్రహణ సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. గ్రహణ సమయంలో భక్తుల దోష నివారణ పూజలు ఎక్కువగా చేస్తారు. అందుకే ఇక్కడి దేవుడి దర్శనం చేసుకున్నాక ఇక ఏ దేవాలయానికి వెళ్లనవసరం లేదన్నమాట.

ధార్మికగీత - 6*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
                           *
                                     *****
           *శ్లో:- వస్త్రేణ  వపుషా  వాచా* ౹
                  *విద్యయా  వినయేన  చ* ౹
                  *వకారై:  పంచభి   ర్హీనః*  ౹
                  *వాసవో౽పి న పూజ్యతే*  ౹౹
                                      *****
*భా:- లోకంలో రాణించాలంటే ప్రతి మనిషికి 1.వస్త్రము 2. వపు:(మేను) 3. వాక్కు 4. విద్య 5. వినయము అనే 5 "వ"కారాలు కావాలి. 1."వస్త్రము":- వృత్తి ప్రవృత్తులకు అద్దం పట్టి, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రతిఫలింపజేసేవిగా దుస్తులు ధరించాలి. లాయర్లు, వైద్యులు, నర్సులు, గార్డులు, పోలీసులు నిర్ణీత ఆహార్యంలో కనిపిస్తుంటారు. సముచిత వేషం గౌరవం తెచ్చిపెడుతుంది.  2. "వపు:":- శుచి, శుభ్రత, ఆరోగ్యకరమైన అంగ సౌష్టవం ఉట్టిపడే దేశరక్షక దళాలు,వ్యాయామకారులు శ రీరపోషణలో జాగరూకులై ఉంటారు. చక్కని శరీరపోషణలో శ్రద్ధ వహించాలి.  3 "వాక్కు":- మృదుమధురమై,  సత్యము, ప్రేమ,  విశ్వాసము, ఆత్మీయత తొణికిసలాడే వాక్ నైపుణ్యము "హనుమ" నుండి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ప్రియంగా, మితంగా,హితంగా మాట్లాడాలి.4. "విద్య":-  ఇహమును, పరమును సాధింపగల, అర్థమును,పరమార్థమును   అందించగల  , జీవితాన్ని తరింపజేయగల విద్యా సంపత్తిని గడించాలి. 5. "వినయము":-   పూజ్యులు, వృద్ధులు, గురువుల పట్ల అపారమైన వినయము కలిగి, వారి నుండి జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించాలి. ఈ ఐదు లక్షణములు సలక్షణంగా ఉంటేనే సమాజం గౌరవిస్తుంది. ఆదరిస్తుంది. పైన చెప్పిన 5 "వ"కారాలు ఎవరికి లేవో, అతడు సాక్షాత్తు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడైనా సరే  పూజింపబడడు. గారవింప బడడు. ఇది ముమ్మాటికి నిత్యము. సత్యము. ప్రతి వారు వీటిని మెరుగుపరచుకొనడానికి నిరంతర సాధన చేయాలి*
                                 *****
                   *సమర్పణ :  పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

పద్యం

*మామకు మామైన యతని*
*భామ లిరువురును ఘనమగు వరము లొసగుతన్*
*కామనలు దీర ధనమును*
*క్షేమముగా నుండ క్షమయు క్షితి నందరకున్!*

(లక్ష్మివల్ల ధనము, భూదేవివల్ల ఓర్పు)
 శుభోదయం!💐🙏
*సింహశ్రీ*
 *_8331815011_*

తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్

హైదరాబాద్ లోని
ఈ సి ఐ ల్ లో
అత్యాదునిక సదుపాయలతో  300 పడకల  హాస్పటల్  ఉంది ...
కనుక  ఈ సి ఐ ల్
దిగీ ఎవరిని అడిగినా
తులసి హాస్పటల్ 
అడ్రస్ చెబుతారు
అలాగే పుట్టిన పిల్లలు 
నుండి 80 సంవత్ష రాల  వరకు cardio(గుండె ) & ortho(విరిగిన ఎముకలు ) &Urology(కిడ్నీ రాళ్లు )
వైద్యమైనా సరే అంటే 
10 లక్షలు అయ్యే హార్ట్ సంబంధిత వ్యాదులైనా  ఉచితమే
సదుపాయాలు కార్పోరేట్   తరహాలో ఉంటాయి
కనుక 
మనలో మన పక్కన 
ఎంతో మంది పేదవాళ్ళు  జీవితంలో సంపాదించిందంతా పిల్లలకు వైద్యానికే ఖర్చుచేసే మద్యతరగతి వారు ఉంటారు 
అలాంటి వారికి 
ఈ హాస్పటల్ గురించి దయచేసి చెప్పండి
మనమంతా కలసి
ఒక్క పసి ప్రాణాన్పి కాపాడినా చాలు   
ఎ ఒక్కరు
టెంక్షన్ పడకూడదనే
నేను నా పోన్లో ఉన్న 550 వాట్సప్ మెంబర్స్‌కి
ఈ మెసేజ్  పంపుతున్నాను
మీరు ఒక్కొక్కరు 200 మంది వాట్సప్ మెంబర్స్‌కు పంపితే  185000 మందికి
ఈ విషయం తెలుస్తుంది
కనీసం 50 మంది  ప్రాణాలు కాపాడుదాం

తీసుకుని రావలసింది ఆరోగ్య శ్రీ కార్డ్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్

Contact number
040-49336699
9505108108

Hospital name
Tulasi hospitals Ecil Hyderabad

Just forward please
this is forward message
for your friends

33వ పద్యం


శా.
ఎన్నేళ్ళుండుదు? నేమి గందు? నిక నే నెవ్వారి రక్షించెదన్?
నిన్నే నిష్ఠ భజించెదన్ నిరుపమోన్నిద్రాప్రమోదంబు  నా
కెన్నం డబ్బెడు?  నెంతకాల మిక నేనిట్లున్న నేమయ్యెడిన్?
జిన్నం బుచ్చక నన్ను నేలుకొనవే! శ్రీకాళహస్తీశ్వరా!